Temple Staff And Devotees Fighting In Kashi Vishwanath Temple - Sakshi
Sakshi News home page

Kashi Vishwanath Temple:: శివుడి గర్భగుడిలో కొట్టుకున్న భక్తులు, సిబ్బంది

Published Sun, Jul 24 2022 1:45 PM | Last Updated on Sun, Jul 24 2022 3:07 PM

Temple staff And Devotees fighting In Kashi Vishwanath Temple - Sakshi

Kashi Vishwanath temple.. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. కాగా, తాజాగా ఆలయ గర్భగుడిలో దర్శనం విషయంలో వాగ్వాదం చోటుచేసుకొని.. కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గర్భగుడిలో శివుడికి హారతి ఇస్తున్నారు. ఈ క్రమంలో తలుపులు మూసివేస్తుండగా ఇద్దరు భక్తులు దర్శనం చేసుకుంటామని పట్టుబట్టారు. దీంతో, ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సిబ్బంది ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా.. వారితో దురుసుగా ప్రవర్తించారు. 

ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి ఆలయ సిబ్బంది, ఇద్దరు భక్తులు గర్భగుడిలోనే ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన అనంతరం.. ఆలయ సిబ్బంది నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ లేఖలో తమకు పోలీసులు సహకరించలేదని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే కాశీలో దర్శనం విషయంలో పోలీసులు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగిన ఘటన మరువక ముందే తాజాగా ఇలా జరిగింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చదవండి: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్‌ గేట్ల వద్ద బతుకు పోరాటం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement