devotees
-
తిరుపతిలో కార్తీక పౌర్ణమి సందడి.. భక్తుల కోలాహాలం (ఫొటోలు)
-
కార్తీకాన శివరూపం.. కమనీయం ఆ దర్శనం! (ఫోటోలు)
-
ప్రముఖ దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీళ్లు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు
ప్రజల్లో దైవ భక్తి రోజురోజుకి శృతి మించుతోంది. ప్రముఖ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏసీల నుంచి కారే నీటిని తాగుతున్నారు. ఒంటిపై చల్లుకుని పునీతులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వ్రిందావన్ నగరంలో ప్రముఖ ప్రసిద్ధ ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. అయితే ఆ దేవాలయంలో దైవ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. వస్తూ.. వస్తూ తమ వెంట టీ తాగే కప్పులను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడికి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు.Serious education is needed 100%People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK— ZORO (@BroominsKaBaap) November 3, 2024ఆ నీటిని టీ కప్పుల్లో నింపుకున్న భక్తులు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది భక్తులు నీటిని సేకరించడానికి కప్పులను ఉపయోగిస్తుండగా.. మరికొందరు చేతిలో తీర్ధం తీసుకున్నట్లుగా ఏసీ నుంచి కారే నీటిని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆలయ నిర్మాణ సమయంలో ఏసీలను ఏర్పాటు చేశారు. ఆ ఏసీల నుంచి కారే నీటిని బయట విడుదలయ్యేలా ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాలను అమర్చారు. ఇప్పుడు ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాల ద్వారా విడుదలవుతున్న నీటినే భక్తులు తాగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో.. వీడియోలు తీసిన వారు.. ఏనుగు శిల్పం నుంచి ఏసీ విడుదల చేసే నీరు కారుతుందని చెబుతున్న మాటలు వినబడుతున్నాయి. అయినప్పటికీ అనేక మంది ఆలయానికి వెళ్లేవారు నీటిని తాగడం లేదంటే తమపై చల్లుకోవడం చేస్తున్నారు. మరికొందరు ఏనుగు శిల్పం నోటి నుండి కారుతున్న 'చరణ్ అమృతం’ (దేవుడు తమని ఆశీర్వదిస్తున్నారనే సూచికగా) భావిస్తున్నారు. శ్రీకృష్ణుడి పాదాల నుండి వస్తున్న పవిత్ర జలం అంటూ భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.PLEASE DO NOT DRINK AIR CONDITIONING WATER!Cooling and air conditioning systems are breeding grounds for many types of infections including fungus, some really hellish. Exposure to air conditioning condensed water can lead to a terrifying disease known as Legionnaires'… https://t.co/FhOly0P7Dj— TheLiverDoc (@theliverdr) November 3, 2024వైరల్ అవుతున్న వీడియోలపై డాక్టర్లు సైతం స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల్లో.. దేవాలయంలో అమర్చిన ఏసీల నుంచి వచ్చే నీరని తాగొద్దని కోరుతున్నారు. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. -
వేడి వేడి కిచిడీ పడి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలు..
ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురలోని ఆశ్రమం వద్ద ప్రసాదం కోసం క్యూలో వేచి ఉన్నఇద్దరు మహిళా భక్తులపై 'కిచిడీ' వడ్డించే వ్యక్తి జారిపడి వేడి ఆహారం వారిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్యూలో నిలబడిన మరో ఎనిమిది మంది మహిళలకు కూడా పాత్రలోని వేడి వేడి కిచిడీ పడటంతో స్వల్ప గాయపడ్డారు. గాయపడిన భక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాగా ఇద్దరు భక్తులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు.మధురలోని బృందావన్ ప్రాంతంలోని గౌరీ గోపాల్ ఆశ్రమంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం భక్తులందరూ పరిక్రమ మార్గ్ సంత్ కాలనీలో ఉన్న గౌరీ గోపాల్ ఆశ్రమానికి చేరుకోగా.. బయట ప్రసాదం పంపిణీ చేస్తుండటాన్ని గమనించారు. బియ్యం, పప్పుతో చేసిన కిచిడీని తీసుకునేందుకు భక్తులు క్యూలో నిల్చున్నారు. ఈక్రమంలో కిచిడీని పాత్రను తీసుకొస్తున్న వ్యక్తి జారిపడిపోయాడు. అతని చేతిలోని వేడి ఆహారం పక్కన నిలబడి ఉన్న మహిళలపై పడినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వందనా అగర్వాల్ చెప్పారు. ఈ సంఘటన భక్తులను భయాందోళనకు గురిచేసిందని, గాయపడిన 10 మంది మహిళలను ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. -
ఇంట్లో కూర్చుని.. అయోధ్యలో దీపం వెలిగించండిలా..
అయోధ్య: యూపీలోని అయోధ్యలో ఈ నెల 30 భారీ ఎత్తున దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో లక్షల దీపాలు వెలిగించనున్నారు. అయితే అందరికీ ఈ వేడుకలను వెళ్లే అవకాశం ఉండదు. అటువంటివారికి అయోధ్య డెవలప్మెంట్ అధారిటీ శుభవార్త చెప్పింది.ఏ ప్రాంతంలోని వారైనా వారి ఇంటిలోనూ కూర్చొని అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవంలో పాల్గొనవచ్చు. ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరాముని పేరిట ఒక దీపం’ పేరుతో శ్రీరాముని భక్తులు తమ ఇంట్లో కూర్చొని దీపోత్సవంలో భాగస్వాములు కావచ్చు.ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ దివ్య అయోధ్య యాప్ ద్వారా భక్తులకు ఆన్లైన్ బుకింగ్ ఎంపికను ఇచ్చింది. ఈ యాప్ ద్వారా భక్తులు దీపాలు వెలిగించవచ్చు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దీపోత్సవ్‌కు హాజరుకాలేని భక్తులు ఇంట్లో కూర్చొనే దీపాలు వెలిగించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ‘దివ్య అయోధ్య యాప్’ సాయంతో ఆన్లైన్ బుకింగ్ ద్వారా దీపం వెలిగించినవారికి డిజిటల్ ఫోటోతో పాటు అయోధ్య ప్రసాదం పంపిస్తామన్నారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
అయోధ్య: దీపోత్సవానికి ముస్తాబు.. పుష్ఫ వర్షానికి ఏర్పాట్లు
అయోధ్య: యూపీలోని రామనగరి అయోధ్య దీపోత్సవానికి ముస్తాబవుతోంది. తాజాగా అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన బృందంతో కలిసి రామ్ కీ పైడీ, దీపోత్సవ్ సైట్లను పరిశీలించారు. అక్టోబరు 22న అయోధ్యలో దీపోత్సవం జరగనుంది. దీనికిముందు అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతిభా గోయల్, ఆమె బృందం రామ్ కీ పైడీ వద్ద వేద పండితుల సమక్షంలో భూమి పూజ చేయనున్నారు. నూతన రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత జరిగే మొదటి దీపాల పండుగ ఇదే కావడంతో, దీనిని అద్భుతంగా నిర్వహించాలని రామాలయ ట్రస్టు భావిస్తోంది.ఈసారి అయోధ్యలో 25 లక్షల దీపాలు వెలిగించి, నూతన రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 40 స్వచ్ఛంద సంస్థలతో పాటు అవధ్ యూనివర్సిటీ, కాలేజీ, 36 ఇంటర్ కాలేజీలకు చెందిన 30 వేల మందికి పైగా విద్యార్థులు దీపాలు వెలిగించనున్నారు. రామ్ కీ పైడీ సహా 55 ఘాట్లపై 28 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఇందుకోసం దాదాపు 90 వేల లీటర్ల నూనెను వినియోగించనున్నారు. అక్టోబర్ 28 నాటికి ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దీపోత్సవం నిర్వహిస్తున్న సమయాన హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించనున్నారు. అలాగే అయోధ్య నగరాన్ని పూలతో అందంగా అలంకరించనున్నారు.ఇది కూడా చదవండి: ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది? -
విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం జరిగింది. భవానీ భక్తులను దేవాదాయ శాఖ దారుణంగా మోసం చేసింది. ఆగమ శాస్త్రానికి తూట్లు పొడిచిన దుర్గ గుడి అధికారులు.. భక్తులకు ఇతర ఆలయాల్లో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇతర ఆలయాల ప్రసాదాలు దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధం. దుర్గగుడికి పెదకాకాని, మోపిదేవి, పెనుగంచిప్రోలు ఆలయాల నుంచి తెచ్చిన 37 వేల లడ్డూలు భవానీ భక్తులతో పాటు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు.ఇతర ఆలయాల నుంచి లడ్డూ ప్రసాదం తెచ్చి దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖ, దుర్గగుడి అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. బెజవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదం భవానీ భక్తులకు అత్యంత పవిత్రం, ప్రీతికరం. అయితే, లడ్డు ప్రసాదం కొరత రాకుండా ఉండేందుకేనంటూ చేసిన అపచారాన్ని దుర్గగుడి అధికారులు సమర్థించుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు భవానీ భక్తుల మనోభావాలను దేవాదాయ శాఖ అధికారులు దారుణంగా దెబ్బతీశారు. -
కర్రల సమరం.. జన సంద్రంగా దేవరగట్టు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు జనసంద్రంగా మారింది. బన్ని ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం ఊరేగింపుతో బన్నీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా కర్రల సమరం సాగనుంది. కర్ణాటక, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
ఇంద్రకీలాద్రి.. సింధూర శోభితం (ఫోటోలు)
-
దుర్గమ్మ సన్నిధిలో పోలీసుల క్రౌర్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): మూలా నక్షత్రం రోజు బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సామాన్య భక్తులపై పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. మహిళలు, వృద్ధులు, బాలలని కూడా చూడకుండా లాగిపడేశారు. పోలీసుల క్రౌర్యానికి ఓ బాలుడు, మహిళ గాయపడ్డారు. రౌడీలు, నేరస్తులతో కూడా పోలీసులు ఈ విధంగా వ్యవహరించరని పలువురు భక్తులు మండిపడ్డారు. ఎన్నో ప్రయాసలకోర్చి దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసుల చేష్టలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ దర్శనాల రద్దు ఉత్తి మాటే! మూలా నక్షత్రం కావడంతో వీఐపీల దర్శనాలు రద్దు చేశామని, సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని అధికారులు, నేతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో కూడా మూడు క్యూలైన్లలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. అయితే అచరణతో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. చంద్రబాబు పట్టు వ్రస్తాల సమర్పణ సమయంలోనే 35 నిమిషాలకు పైగా భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలోనూ క్యూలైన్లు ఆపారు. మిగతా వీఐపీలూ పెద్ద సంఖ్యలో రావడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మాటిమాటికీ క్యూలను ఆపడంతో వినాయకుడి గుడి, కుమ్మరిపాలెం సెంటర్ల నుంచి క్యూలైన్లలో చంటి బిడ్డలను తీసుకొని వచ్చే భక్తులకు దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. వీఐపీలకు తోడు ఉత్సవ కమిటీ సభ్యులు, అధికార పార్టీ నేతల సంబందీకులు అనేక మంది కింద ఉన్న క్యూలైన్లలో కాకుండా నేరుగా కొండ పైకి చేరుకున్నారు. దీంతో ఓం టర్నింగ్ వద్ద తీవ్ర తోపులాటలు జరిగాయి. మగ పోలీసులే మహిళలను తోసుకుంటూ వెళ్లటం, కొంతమంది కింద పడిపోవటం వంటి ఘటనలు జరిగాయి. ఆ తోపులాటకు కొందరు విలపించారు. ఏటా మూలా నక్షత్రం రోజున భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారని తెలిసినప్పటికీ, పోలీసుల వద్ద నిరి్ధష్టమైన ప్రణాళిక లేకపోవటమే ఈ విధమైన తోపులాటలు, గందరగోళ పరిస్థితులకు కారణమని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం కాక పోలీసు స్టేషన్లో ఉండే పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆలయంలోని సిబ్బంది సైతం వ్యాఖ్యానిస్తున్నారు.బాలుడికి, తల్లికి గాయాలు బుధవారం మూలా నక్షత్రం, సరస్వతి దేవి అలంకారం కావడంతో బెజవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచే వేలాదిగా భక్తులు వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తులకు అడుగడుగునా పోలీసుల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను సౌకర్యవంతంగా క్యూలో పంపించాల్సిన పోలీసులే వారి పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన ఒక మహిళ, ఆమె కుమారుడు గాయపడ్డారు. కొండ కింద నుంచి ఐదు గంటలపాటు క్యూలో నడుచుకుంటూ ఆ మహిళ కుటుంబం అమ్మవారి చెంతకు చేరింది. అదే సమయంలో మహిళా పోలీసులు ఆమెను, ఆమె కుమారుడిని తోసేయడంతో వారిద్దరూ ముందు ఉన్న బారికేడ్‌పై పడిపోయారు. బాలుడి తలకు బారికేడ్ బలంగా తగిలింది. చెవికి తీవ్రమైన గాయమైంది. చెంప వాచింది. ఆ బాలుడు నొప్పితో విలవిల్లాడాడు. మహిళ చేతికి గాయమైంది. ఇదేమిటని ప్రశ్నించిన మహిళపై మహిళా పోలీసులు బూతులతో విరుచుకుపడ్డారు. ఆమె చెయ్యిని గిచ్చినట్లుగా ఆ మహిళ మీడియా వద్ద వాపోయారు. కొండపైన ఉన్న హెల్త్ సెంటర్లో సిబ్బంది బాలుడిని పరిశీలించి ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. -
ఇంద్రకీలాద్రిలో ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
-
ఇంద్రకీలాద్రి: వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తుల అగచాట్లు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తాయి. ప్రోటోకాల్ దర్శనాలు.. సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలుకావడం లేదు. సిఫార్సు లెటర్స్ ఉంటే చాలు అంతా వీఐపీలే అన్నట్టుగా, ఉదయం నుంచి సిఫార్సు లెటర్లతో భారీగా క్యూకట్టారు. క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్లలోనే పడిగాపులు పడుతున్నారు. ప్రోటోకాల్ దర్శనాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులతో 500 రూపాయల క్యూలైన్లలోని భక్తులు వాగ్వాదానికి దిగారు. ఐదు రూపాయల ఎందుకు పెట్టారంటూ మండిపడ్డారు.మరోవైపు ఇంద్రకీలాద్రిపై లడ్డూలు అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేదు ఇవ్వటం కుదరదంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఘాట్ రోడ్డులో ఒకే ఒక్క లడ్డూ సేల్ పాయింట్‌ను అధికారులు ఏర్పాటు చేయడంతో దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: గోల్మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా! -
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
బుర్హాన్పూర్: మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు.శరన్నవరాత్రులలో రేణుకా మాత ఆలయ సమీపంలో ప్రతీయేటా జాతర నిర్వహిస్తారు. ఈ జాతర 9 రోజుల పాటు ప్రతీరోజూ ఉదయం 5:00 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఆలయంలో అమ్మవారికి మూడుసార్లు హారతి నిర్వహిస్తారు. నవరాత్రులలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలువుతుంది. రేణుకా మాత ఆలయ పూజారి జై శుక్లా మాట్లాడుతూ తమ కుటుంబం ఏడు తరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నదన్నారు. ఈ ఆలయం సుమారు వెయ్యేళ్లనాటిదని, పెళ్లికానివారు రేణుకామాతను దర్శించుకుంటే వారికి త్వరగా వివాహమవుతుందనే నమ్మకం స్థానికుల్లో ఉన్నదన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని పలు జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ! -
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
అయోధ్య: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.నవరాత్రులలో మొదటి రోజున నవదుర్గలలో ఒకరైన శైలపుత్రిని పూజిస్తారు. అయోధ్యలో అన్ని దేవాలయాలు అమ్మవారి పూజలతో కళకళలాడుతున్నాయి. ఇక్కడి ఛోటీ దేవ్‌కాళి ఆలయంలో భక్తులు క్యూ కట్టి, అక్కడ కొలువైన సీతామాతను ఆరాధిస్తున్నారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పలువురు నమ్ముతుంటారు.అయోధ్యకు చెందిన పండితులు సత్యేంద్ర దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నవరాత్రులలో మొదటి రోజు. ఈ రోజున చాలామంది తమ ఇళ్లలో కలశాన్ని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అయోధ్యకు వచ్చిన భక్తురాలు మీరా మాట్లాడుతూ, ఆలయంలో అమ్మవారి దర్శనం చక్కగా అయ్యిందని, అధికారులు భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేశారని అన్నారు. మరో భక్తుడు శైలేంద్ర మాట్లాడుతూ ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అన్నారు. ఇది కూడా చదవండి: 4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్ -
తిరుమల లడ్డూ ప్రసాదంపై బాబు అసత్య ఆరోపణలు
-
ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు.. వెయ్యిమంది కీచకుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీచకులు రెచ్చిపోయారు. గణేష్ నవరాత్రల్లో మహిళలను తాకుతూ కీచకులు వేధించారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద 11 రోజుల్లో సుమారు వెయ్యిమందిని కీచకుల్ని షీటీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీచకులను పట్టుకునేందుకు పోలీసులు స్పై ఆపరేషన్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డారని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తగిన శిక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. -
దయచేసి శ్రీవారిపై రాజకియాలు చెయ్యొద్దు..
-
నిమజ్జనం.. గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందుల్లో జనం
దాదర్: నిమజ్జనోత్సవాలు ముగియడంతో స్వగ్రామాలకు తరలిపోయిన వేలాది మంది భక్తులు ముంబై దిశగా తిరగు పయన మయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు బయటపడటంతో ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటికే అనేక మంది గౌరీ గణపతులను గురువారం నిమజ్జనం చేసి శుక్రవారం నుంచి తిరుగు పయనమయ్యారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ఇదిలా ఉండగా బుధవారం మళ్లీ ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు బయటపడటం ఒక కారణమైతే, రోడ్లపై ఏర్పడిన గుంతలు మరో కారణమని తెలుస్తోంది. సాధారణంగా ముంబై–గోవా జాతీయ రహదారి నిత్యం తేలికపాటి, ట్రక్కులు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రాలీలు తదితర సరుకులు చేరేవేసే భారీ వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. గణేశోత్సవాల సమయంలో ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే భక్తుల వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరంతా ముంబై–గోవా జాతీయ రహదారినే ఆశ్రయిస్తారు. దీంతో గణేశోత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై (నిత్యావసర సరుకులు చేరేవేసే వాహనాలు మినహా) భారీ వాహనాలకు నిషేధం ఉండింది. ఉత్సవాలు ముగిసిన రెండు రోజుల వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి. దీన్ని బట్టి ముంబై–గోవా జాతీయ రహ దారి ఏ స్థాయిలో బిజీగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. సాధారణంగా నిమజ్జనోత్సవాలు సాయంత్రం ముగియగానే అదే రోజు అర్ధరాత్రి దాటగానే అనేక మంది తిరుగుపయనమవుతా రు. కానీ ఈ సారి మంగళవారం సాయంత్రం ని మజ్జనోత్సవాలు ముగిసినప్పటికీ అనేక మంది బుధవారం మధ్యాహ్నం తరువాత బయలుదేరారు. బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో గురువారం ఉదయమే విధుల్లో చేరే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కారి్మకులు, కూలీలు, వ్యాపారులు బుధవారం మధ్యాహ్నం తరువాత కుటుంబ సభ్యులతో ముంబై దిశగా తిరుగు పయనమయ్యారు. ఇటీవల కరిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ పాడైపోయా యి. ఎక్కడ చూసిన గుంతలు దర్శనమిచ్చాయి. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్ పడింది. (వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య! 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర )15–17 గంటల ప్రయాణం భక్తుల వాహనాలకు (అప్, డౌన్లో) ప్రభుత్వం టోల్ నుంచి మినహాయింపు నిచ్చినప్పటికీ గుంతల కారణంగా వేగానికి కళ్లెం పడింది. దీంతో పది గంటల్లో పూర్తికావల్సిన ప్రయాణం 15–17 గంటలు పడుతుంది. ముంబై–గోవా జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా పికప్ వాహనాలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలే దర్శనమిచ్చాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి సీట్లో కూర్చుండలేక అనేక మంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డుపక్కనున్న డాబాలను ఆశ్రయించారు. దీంతో డాబా వాలాల బేరాలు జోరందుకున్నాయి. శీతలపానీయాలు, వాటర్ బాటిళ్లు, చీప్స్, తదితర చిరుతిళ్ల ప్యాకెట్లు దొరక్కుండా పోయాయి. కొన్ని చోట్ల మందకొడిగా, మరికొన్ని చోట్ల నిలిచిపోయిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్రమబదీ్ధకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకపక్క గుంతలు, పాడైపోయిన రోడ్లతో వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో వాహనాలు ఇటు ముందుకు వెళ్లలేక అటు తిరిగి వెనక్కి వెళ్లి మరో మార్గం మీదుగా వెళ్లలేక నరకయాతన అనభవించారు. -
సామాన్య భక్తులను పట్టించుకోరా?
తిరుమల: తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదని.. ఆదివారం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నా శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదంటూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై తమిళనాడుకు చెందిన బుల్లితెర నటుడు మహేశ్‌తో పాటు పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయన్ని ఆలయ అధికారి అని భావించిన తమిళనాడు భక్తులు చుట్టుముట్టేశారు. వీరిలో తమిళ నటుడు మహేశ్‌బాబు కూడా ఉన్నారు.ఆయన మాట్లాడుతూ.. 10 మంది కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం తిరుమలకు చేరుకున్నట్లు చెప్పారు. ఆదివారం క్యూ లైన్లోకి వెళ్లినా స్వామివారి దర్శన భాగ్యం మాత్రం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయట్లేదని మరికొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నప్రసాదం, పాలు, మజ్జిగ ఇవ్వకపోవడంతో.. చిన్న పిల్లలతో క్యూ లైన్లలో ఉండలేక బయటకు వచ్చేశామంటూ వాపోయారు. తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదంటూ మరో భక్తుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆనం స్పందిస్తూ.. అధికారుల ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తానంటూ సర్దిచెప్పి.. అక్కడి నుంచి జారుకున్నారు. -
వీఐపీ ఏంటి..? జనరల్ ఏంటి..?
-
తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు
తిరుమల, సాక్షి: తిరుమలలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తుడు మూడు రోజులుగా శ్రీవారి దర్శనం కాలేదని, వీఐపీలు మాత్రమే భక్తులా అంటూ శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రిని నిలదీశాడు. తిరుమలలో సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారని అన్నారు.గంటల తరబడి క్యూలైన్లో ఉన్నా ఆహారం అందలేదని, శ్రీవారి దర్శనం చేసుకోలేక పోతున్నామని భక్తులు ప్రశ్నించారు. ఆలయం ముందు భక్తులు ప్రశ్నించడంతో మళ్లీ మాట్లాడుతానంటూ మంత్రి రామనారాయణరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రపంచ వచనాలు
‘పాప పుణ్యాలనేటటువంటివి/ మీ చేతుల్లో ఉన్నవి/ అయ్యా అంటే స్వర్గం/ ఒరే అంటే నరకం/ కూడల సంగమదేవా!’ ఇది బసవన్న చెప్పిన ఎన్నో వచనాల్లో ఒకటి. కన్నడిగుల విశిష్ట సారస్వతం వారి ‘వచనాలు’. కన్నడ ఉపనిషత్తులుగా ఇవి కీర్తినొందాయి. వీరశైవ భావధార ఉద్ధృతంగా ప్రవ హించిన పన్నెండో శతాబ్దంలో ఇవి వెలువడ్డాయి. ఈ వచనకారులు ఒక్కరు కాదు, లెక్కకు మిక్కిలి. ‘పారేనదికి/ ఒళ్లంతా కాళ్లు/ మండే నిప్పుకి/ ఒళ్లంతా నోళ్లు/ వీచే గాలికి/ ఒళ్లంతా చేతులు/ గుహేశ్వరా/ నీ వాళ్లకి/ ప్రతి అంగం లింగమే’ అన్నాడు అల్లమ ప్రభు. ఛందస్సును అనుసరించకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా, సరళంగా, భావ ప్రధానంగా రాసిన ఈ వచనాలు అందులోని పదాల తూగు వల్ల ఒక లయను కలిగివుంటాయి. కొంతమంది శాస్త్రీయ సంగీత గాయకులు వీటిని ఆలపించడం కద్దు. మానవత్వాన్నీ, కాయక ధర్మాన్నీ ఈ వచనాలు చాటిచెప్పాయి. కులాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య తేడాలను నిరసించాయి. జంగముడు ఏ కులానికి, ఏ వృత్తికి చెందినవాడైనప్పటికీ శివునిలా పూజనీయుడే; సహపంక్తి భోజనాదులకు అర్హుడే. ఈ విశాల దృక్పథంతో చెప్పి నందువల్లే వచనాలు భక్తేతరుల ఆదరణనూ చూరగొన్నాయి. వీరశైవ భక్తులను ‘శరణులు’ అన్నారు కాబట్టి, వాళ్లు రాసింది ‘శరణ సాహిత్యం’ అయ్యింది. ఈ సాహిత్యాన్ని మరింతగా ప్రపంచానికి చేరువ చేసే ప్రయత్నాలను బెంగళూరులోని ‘బసవ సమితి’ చేస్తోంది. 173 మంది వచనకారుల ఎంపిక చేసిన 2,500 వచనాలను వివిధ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో భిన్న భాషల్లోకి అనువదింప జేస్తోంది. ఇప్పటికే అరబ్బీ, పర్షియన్ లాంటి సుమారు 30 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైన వీటిని 2025 జనవరి కల్లా స్పానిష్, జర్మన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, నేపాలీల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. పన్నెండో శతాబ్దంలో కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువులో బసవేశ్వరుడు మంత్రిగా పనిచేశాడు. వీరశైవ మతానికి ఎనలేని ప్రాబల్యాన్ని కల్పించాడు. బసవడు ఎంతటి కవియో అంతటి తాత్వికుడు. ‘ఉన్నవాళ్లు/ గుళ్లు గోపురాలు కట్టిస్తారు/ లేనివాణ్ణి/ నేనేమి చెయ్యాలి?/ నా కాళ్ళే స్తంభాలు/ కాయమే కోవెల/ శిరసే బంగారు శిఖరం/ కూడల సంగమదేవా! విను/ చెడితే స్థావరం చెడుతుంది గాని/ జంగమం చెక్కుచెదరదు’ అన్నాడు. బసవన్న స్థాపించిన ఆధ్యాత్మిక సంఘం ‘అనుభవ మంటపం’. దానికి వేదిక ఆయన ఇల్లే. దీనికి అధ్యక్షుడు అల్లమ ప్రభు. అధ్యక్ష సింహాసనం పేరు శూన్య సింహాసనం. అనుభవ మంటపం అనే ఆలోచనే మేధా మథనానికీ, ప్రజాస్వామిక భావమార్పిడికీ ఉత్తేజాన్ని ఇచ్చేది. ఇందులో సుమారు 300 మంది శరణులు పాల్గొనేవారు. వాళ్లలో ‘వీరరాగిణి’ అక్క మహాదేవి సహా 36 మంది స్త్రీలు ఉండటం విశేషం. వీరిలో రకరకాల వృత్తులవాళ్లు ఉన్నారు. ‘కట్టెలమ్ముకొనే మోళిగెయ మారయ్య, చెప్పులు కుట్టే మాదార చెన్నయ్య, తోళ్లు పదునుపెట్టే దోహర కక్కయ్య, బట్టలుతికే మడివాల మాచయ్య, వెదురు బుట్టలల్లే మేదర కేతయ్య, పడవ నడిపే అంబిగర చౌడయ్య...’ వీళ్లు ‘రామనాథా’, ‘సకలేశ్వరదేవా’, ‘అమరగుండ మల్లికార్జునా’, ‘సిద్ధ మల్లికార్జునా’ అంటూ తమ ఇష్టదైవాలను మకుటంగా చేర్చుకొని తమ వచనాలను చెప్పారు. ‘పిడకలు ఏరటంలోనే/ అయిపోతోంది బ్రతుకంతా/ ఇక నేను/ అన్నం వండేదెప్పుడు,/ తినేదెప్పుడు? కూడల సంగమదేవా’ అన్నాడు బసవన్న. ‘సువిశాలమైన కన్నడ సాహిత్య క్షేత్రంలో విహరిస్తుంటే వచనాల దగ్గరకు వచ్చేసరికి మనం ఒక తపోవనంలో అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది. అక్కడ మనకు తారసపడేవారందరూ రుషులూ, సాధువులే! కల్మషంతో నిండిన మనుషుల అంతరంగాలు శుభ్రపడటానికి వారి బోధలు చాలు అనిపిస్తుంది’ అంటారు ఈ వచనాల్లో కొన్నింటిని ‘మాటన్నది జ్యోతిర్లింగం’గా పాతికేళ్ల క్రితమే తెలుగులోకి అనువదించిన దీవి సుబ్బారావు.తెలుగులో మొట్టమొదట మల్లికార్జున పండితుడు ‘శివతత్వ సారం’లో బసవన్నను స్తుతించాడు. పాల్కురికి సోమనాథుడు ద్విపదల్లో బసవ పురాణము రచించి వీరశైవాన్ని ప్రచారం చేశాడు. ఒక తెలుగు కవి తొలిసారిగా రాసిన స్వతంత్ర పురాణం ఇది. శివభక్తులకు శ్రీశైలం మహోజ్జ్జ్వల సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. బసవన్నకు ముందువాడని చెప్పే దేవర దాసిమయ్య శ్రీశైలం వచ్చి ఆగమాలు, పురాణాలు చదువుకొన్నాడు. అల్లమ ప్రభు శ్రీశైలంలో సమాధి నొందాడు. అక్క మహాదేవి శ్రీశైల కదళీవనంలో కాలం గడిపింది. ‘కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి? /కొలనుల్లో కాక కాలువల్లో ఈదుతుందా హంస/ ...చెన్నమల్లికార్జునుడు కాక అన్యుల్ని తలుస్తుందా నా మనస్సు?’ అంటూ తన జీవితాన్ని ఆ చెన్నమల్లికార్జునుడికే అర్పించుకుంది. ‘మిణుగురులు ఎగిరితే/ నా ఆకలిదప్పులు అణగారినాయనుకొంటా/ మబ్బులు కరిగితే/ నా స్నానం కొరకు పంపిన జలమనుకొంటా/ కొండరాయి జారిపడితే/ నా తల్లో తురిమిన పూవనుకొంటా/ నా కంఠం తెగితే/ చెన్నమల్లికార్జునా!/ అది నీకర్పితమనుకొంటా’ అని పాడుకుంది. ఆమె తపస్సు చేసిందని చెప్పే ‘అక్క మహాదేవి గుహలు’ ఏ శ్రీశైల యాత్రికుడికైనా దర్శనీయ స్థలం.‘ఆవగింజంత సుఖానికి/ సాగరమంత సంకటం/ తన్నే కోల్పోయి/ నిధిని సాధించానంటే/ అందమేముంది?/ గుహేశ్వరా’ అన్నాడు అల్లమ ప్రభు. భక్తి పరవశంలో రాసినవైనప్పటికీ, అంతకుమించిన తాత్విక చింతననూ, మానవ స్వభావాన్నీ ఈ వచనాలు ఆవిష్కరించాయి. అంతేనా? ప్రతి భాషా మేలిమి సాహిత్యాన్నీ అలా పూనిక వహించి ఎల్లలు దాటించాలన్న ప్రేరణను కూడా ఇస్తున్నాయి. -
ఖైరతాబాద్ గణనాథుడి చివరి పూజలు
-
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ముంబై లాల్బాగ్చా రాజా గణపతి ఐకానిక్ ఫస్ట్ లుక్ (ఫోటోలు)