
ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి(Mahashiratri) వేడుకలు నిర్వహించనున్నారు. ఆరోజున హృదయపూర్వకంగా శివపార్వతులను అర్చిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా దేశంలోని వివిధ ఆలయాలను ముస్తాబు చేస్తుండగా, మరికొన్ని శివాలయాల్లో ఇప్పుటికే శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి.
ప్రతీనెలలోనూ మాస శివరాత్రి వస్తుంది. అయితే ఏడాదికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినం చేసుకోవడం వెనుక పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిలో ఒక కథ ఎంతో ప్రాచుర్యం పొందింది. దాని ప్రకారం ప్రకారం ఫాల్గుణమాసం, కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథిరోజున తొలిసారి మహాశివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చాడని చెబుతారు. ఆనాటి నుంచి ఇదే తిథి నాడు శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే రోజున శివుడు నిరాకారం నుంచి సాకార రూపం(Physical form)లో కనిపించాడని చెబుతారు.
పురాణాల ప్రకారం పాల్గుణం, కృష్ణపక్షంలోని చతుర్ధశి తిథి రోజునే పార్వతీమాత మహాశివుణ్ణి వివాహమాడిందని చెబుతారు. అందుకే మహాశివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారు. శివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో విశేష రీతిలో పూజలు నిర్వహిస్తారు. ఆరోజున మహేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల వెలుపల బారులుతీరి ఉంటారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు
Comments
Please login to add a commentAdd a comment