starting
-
దాతల భాగస్వామ్యం కావాలి
సాక్షి, మచిలీపట్నం/సాక్షి, అమరావతి: పేదోడి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రారంభించారు. ప్రజలతో కలిసి క్యాంటీన్లోనే భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో తాము ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆటో కార్మికులు, హమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, చిరు వ్యాపారులు ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారని, వారి భోజన ఖర్చు చాలా మిగిలిందని అన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణ కోసం తన సతీమణి భువనేశ్వరి రూ. కోటి ఇచ్చారని, పలువురు దాతలు కూడా విరాళాలు ఇచ్చారని, మిగతా వారు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. పెళ్లిళ్ల ఖర్చు తగ్గించుకొని అన్న క్యాంటీన్లకు విరాళాలివ్వాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరిచామని, నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ ఖాతాకు విరాళాలివ్వొచ్చని తెలిపారు. జనవరిలో జన్మభూమి 2.ను ప్రారంభించి, గ్రామాల అభివృద్ధిలో మళ్లీ ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని, పిల్లల పుట్టుక తగ్గడంతో యువత శాతం తగ్గిందని చెప్పారు. సంపద సృష్టించే యువకులు తగ్గడం ప్రమాదకరమని అన్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా.. ఎక్కువ మంది పిల్లలున్న వారికే సంపద ఉంటుందని చెప్పారు. 2004 కంటే ముందు హైదరాబాదుతో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేశానని, అయితే తనకంటే మెరుగ్గా పాలిస్తారని వేరే పారీ్టకి ఓట్లు వేయడంతో రాష్ట్ర విభజనకు దారితీసే పరిస్థితి తెచ్చారని అన్నారు. 2019లోనూ తననే గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లే వాడినని చెప్పారు. మరో 23 ఏళ్లకు 100వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకుంటామని, అప్పటివరకు తమ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మంచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్‌రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేడు 99 చోట్ల అన్న క్యాంటీన్ల ప్రారంభంవచ్చే నెలాఖరుకి రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు మున్సిపల్ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 99 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని మున్సిపల్ మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. -
రేపటి నుంచి సిద్దిపేటలో రైలుకూత
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో రెండు ప్యాసింజర్ రైళ్లు మంగళవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటతో పాటు గజ్వేల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాచగిరి (నాచారం), కొమురవెల్లి తదితర ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. తొలుత కాచిగూడ–సిద్దిపేట మధ్య రైళ్లు తిప్పాలని భావించినా, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది సికింద్రాబాద్‌కు వస్తున్నందున, సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్–సిద్దిపేట (నిడివి 116 కిలోమీటర్లు) డెమూ రైలుచార్జీ :రూ.60 హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట ట్రిప్పులు ఇలా... సిద్దిపేటలో రైలు(నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు రాత్రి 8.40 గంటలకు చేరుకుంటుంది. అయితే ఉదయం సిద్దిపేట బదులు సికింద్రాబాద్ నుంచే రైలు బయలుదేరేలా చూడాలని స్థానిక నేతలు రైల్వేకు లేఖ రాశారు. దీనికి రైల్వే సమ్మతిస్తే ఈ వేళలు అటూ ఇటుగా మారుతాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సుచార్జీ రూ.140. ప్రయాణ సమయం రెండున్నర గంటలు. రైలులో ప్రయాణ సమయం కాస్త ఎక్కువగా ఉన్నా, చార్జీ మాత్రం బస్సుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉంది. రైలులో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రానుపోను రూ.120 అవుతుండగా, పాస్ తీసుకుంటే రూ.90 ఉండొచ్చు. కృష్ణా టు రాయచూర్ రైలు రాకపోకలు షురూ మహబూబ్‌నగర్–మునీరాబాద్ (కర్ణాటక) మధ్య 234 కి.మీ. నిడివితో నిర్మించే రైల్వే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా వరకు పనులు పూర్తి కావటంతో కొత్త రైలు సర్విసు ప్రారంభమైంది. కాచిగూడ–బెంగుళూరు మార్గంలో ఉన్న దేవరకద్ర నుంచి కొత్తలైన్ మొదలు, అటు సికింద్రాబాద్–వాడీ మార్గంలో ఉన్న కర్నాటక సరిహద్దు స్టేషన్ అయిన కృష్ణాకు ఇది అనుసంధానమైంది. దీంతో కాచిగూడ నుంచి కృష్ణా స్టేషన్ మీదుగా కర్ణాటకలోని రాయచూరు వరకు ప్యాసింజర్ డెమూ రైలు సర్విసును ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కృష్ణా నుంచి కొత్త రైలు బయలుదేరి కాచిగూడకు చేరుకుంది. సోమవారం నుంచి కాచిగూడ–రాయచూరు మధ్య ప్రారంభమవుతుంది. రైలుచార్జీ: 85.. రోజుకు ఒకటే ట్రిప్పు కాచిగూడ–రాయచూరు (నిడివి 221 కిలోమీటర్లు) ప్రస్తుతం స్పెషల్ సర్వీసుగా ఉన్నందున ఎక్స్‌ప్రెస్ చార్జీలున్నాయి. రెగ్యులర్ సర్విసుగా మారిన తర్వాత ఆర్డినరీ చార్జీలు అమలులోకి వస్తాయి. అప్పుడు చార్జీ రూ.50 ఉంటుంది.హాల్ట్‌స్టేషన్లు: కాచిగూడ, మలక్‌పేట, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్, తిమ్మాపూర్, కొత్తూరు, షాద్‌నగర్, బూర్గుల, బాలానగర్, రాజాపురా, గొల్లపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి, యెనుగొండ, మహబూబ్‌నగర్, మన్యంకొండ, దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా, చిక్సుగుర్, రాయచూరు రైలు (నంబరు:07477) వేళలు ఇలా కాచిగూడలో ఉదయం 9.40కి బయలు దేరి 11.50గంటలకు మహబూబ్‌నగర్, 12.14కు దేవరకద్ర, మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా, 3 గం.కు రాయచూరు చేరుకుంటుంది. తిరిగి రాయచూరులో మధ్యాహ్నం.3.30 గంటలకు రైలు(నంబరు:07478)బయలుదేరి 3.49కి కృష్ణా, 5.29కి దేవరకద్ర, 6.05కు మహబూబ్‌నగర్ రాత్రి 9.10గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
కార్తిక మాసం ప్రారంభం ఫొటోలు
-
రేపే తెలంగాణ ఎంసెట్ పరీక్ష
-
ఎన్నికల ప్రచారం.. షురూ..!
సాక్షి, మంచిర్యాల: ‘‘ఇతనే మన పార్టీ అభ్యర్థి... పార్టీ అధిష్టానం అన్నీ ఆలోచించే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మనం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.. పార్టీ మన మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి..’’ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న సరికొత్త ‘పరిచయ ప్రచారం’ ఇది. పెద్దపల్లి లోకసభకు టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి నియోజకవర్గానికి పూర్తి కొత్త కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఆ పార్టీకి కొత్త. దీంతో రెండు పార్టీలు శనివారం శ్రీకారం చుట్టిన ప్రచారపర్వంలో పరిచయ కార్యక్రమమే ఎక్కువగా కనిపించింది. కార్యకర్తలతో మొదలు వచ్చే నెల 11న లోకసభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారానికి సమాయత్తమయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. రెండు పార్టీలు కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో ఆయా పార్టీల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్‌కు చెందిన ఎ.చంద్రశేఖర్‌ను ప్రకటించడం తెలిసిందే. చంద్రశేఖర్‌కు పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంతో సంబంధం లేకపోవడంతో, ఇతర ఆశావాహులు ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ ఏకంగా పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. యువజన కాంగ్రెస్ నాయకుడు ఊట్ల వరప్రసాద్ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ క్రమంలో శనివారం మంచిర్యాల జిల్లాకు వచ్చిన చంద్రశేఖర్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసార్‌రావు పార్టీ శ్రేణులు, నియోజకవర్గానికి చంద్రశేఖర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా పరిచయం చేశారు. అనంతరం బెల్లంపల్లికి వెళ్లిన చంద్రశేఖర్ అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన గంటల్లోనే పార్టీ టికెట్ అందుకున్న బొర్లకుంట వెంకటేశ్‌ది కూడా అదే పరిస్థితి. అవడానికి జిల్లా వాసి అయినా, రాజకీయాల్లో ఆయనది నాలుగు నెలల సీనియార్టీ మాత్రమే. అందునా టీఆర్ఎస్కు పూర్తిగా కొత్త. ఒకప్పటి ప్రత్యర్థి. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి. దీంతో వెంకటేశ్‌ను టీఆర్ఎస్ శ్రేణులతో సమన్వయం చేసే బాధ్యతను చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీసుకున్నారు. శనివారం మంచిర్యాలలోని పద్మనాయక కల్యాణ మండలంలో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ ఇన్చార్జీ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతోపాటు ఎంపీ అభ్యర్థి వెంకటేశ్ పాల్గొన్నారు. వెంకటేశ్‌ను పార్టీ శ్రేణులకు పరిచయం చేసేందుకు వక్తలు అధిక సమయం తీసుకున్నారు. బాధ్యత పెద్దలదే.. లోకసభ అభ్యర్థులు ఆయా పార్టీలకు కొత్త కావడంతో, ప్రచార, గెలుపు బాధ్యతలను పార్టీల పెద్దలు తలకెత్తుకొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ తరఫున పార్టీని సమన్వయం చేయడం, ప్రచారం నిర్వహించడం, అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాధ్యతలను జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చేపట్టారు. పార్టీ నాయకులు, ప్రచార కార్యక్రమాలను ఆయన సమన్వయ పరుస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ముందు, పార్టీకి అభ్యర్థులను సమన్వయం చేసే సరికొత్త కార్యక్రమాన్ని రెండు ప్రధాన పార్టీలు ఒకే రోజు శ్రీకారం చుట్టడం ఆసక్తిగా మారింది -
అలరించిన లక్ష్మీశృతి అరంగేట్రం
రాజమహేంద్రవరం కల్చరల్ : ఎనిమిది వసంతాల శ్రీసాయి ముత్య లక్షీ్మశృతి కూచిపూడి అరంగేట్రం ఘనంగా జరిగింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత, నృత్య కళాక్షేత్ర ఆధ్వర్యంలో ఆదివారం రివర్‌బే ఆహ్వానం ఫంక్ష¯ŒS హాల్లో అతిరథ మహారథుల సమక్షంలో ఆ చిన్నారి ప్రదర్శించిన హావభావాలు ప్రేక్షకులను అలరించాయి. ముందుగా లక్షీ్మశృతి తనగురువు, అంతర్జాతీయ ఉత్తమ నృత్య దర్శక అవార్డు గ్రహీత గోరుగంతు ఉమాజయశ్రీకి గురుపూజ చేసింది. వినాయక కౌతం, వలచివచ్చి అనే నవరాగమాలికావర్ణం, రామాయణ శబ్దం, తరంగం, అష్టలక్షీ్మస్తోత్రం, ఇతర కూచిపూడి అంశాలను ప్రదర్శించి ప్రముఖుల మెప్పును అందుకుంది. కళాక్షేత్ర వ్యవస్థాపకుడు జి.నారాయణ మాట్లాడుతూ చిన్నారులకు నాట్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా, సనాతన ధర్మాన్ని చాటిచెప్పడం తమ లక్ష్యమని వివరించారు. ‘యక్షగాన కంఠీరవ’ పసుమర్తి శేషుబాబు, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పెద్ద సంఖ్యలో కళాభిమానులు హాజరయ్యారు. -
తైక్వాండో పోటీలు ప్రారంభం
భానుగుడి (కాకినాడ) : రాష్ట్ర స్థాయి 34వ సబ్ జూనియర్, 35వ సీనియర్ తైక్వాండో టోర్నమెంట్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఈ పోటీలను ప్రారంభించారు. కాకినాడలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తొలిరోజు పోటీల్లో సబ్‌జూనియర్ విభాగంలో 13 జిల్లాల నుంచి వచ్చిన 150 మందికిపైగా క్రీడాకారులు తలపడ్డారు.ఆటలో చిన్నారులు చూపించిన పోరాట పటిమ అబ్బురపరిచింది. తొలిరోజు విజేతలు వీరే 18 నుంచి 50 కేజీల వరకు ఉన్న సబ్ జూనియర్ విభాగంలో పోటీలు నిర్వహించారు. 18 కేజీల విభాగంలో ఎల్.గౌతమ్కృష్ణారెడ్డి, అనంతరపురం)(గోల్డ్), వి.లిఖిత్ , చిత్తూరు (సిల్వర్), 21కేజీల విభాగంలో ఎ¯ŒS.చైతన్య దుర్గాప్రసాద్, విశాఖపట్నం( గోల్డ్), బి.జశ్వంత్ చిత్తూరు, í(Üసిల్వర్), 23 కేజీల విభాగంలో సిహెచ్ లోహి™Œ, కర్నూలు (గోల్డ్), కె.అవినాష్, విజయనగరం(సిల్వర్), 25 కేజీల విభాగంలో జి.దినేష్ అదిత్య, తూర్పుగోదావరి(గోల్డ్), ఎస్.సాయిగణేష్, చిత్తూరు(సిల్వర్), 27 కేజీల విభాగంలో దేవ్ భరత్ సాçహు, శ్రీకాకుళం(గోల్డ్), జి.తేజ, తూర్పుగోదావరి(సిల్వర్), 29 కేజీల విభాగంలో ఎ¯ŒSఎం దిలీప్, వైఎస్సార్ కడప (గోల్డ్), రెడ్డి లోవరాజు, విశాఖపట్నం( సిల్వర్), 32 కేజీల విభాగంలో బి.కాశీబాబా, వైఎస్సార్ కడప, (గోల్డ్), ఎస్.దేవీ శ్రీ«కర్, గుంటూరు(సిల్వర్), 35 కేజీల విభాగంలో ఎం.వెంకట కార్తీక్ , విశాఖపట్నం (గోల్డ్), సీఎస్ సమరత్, చిత్తూరు(సిల్వర్), 38 కేజీల విభాగంలో కృష్ణబాబు (వైఎస్సార్ స్పోరŠట్స్ స్కూల్) గోల్డ్, జి.వేద కార్తీక్, కర్నూల్(సిల్వర్), 41 కేజీల విభాగంలో ఎం.రిషీ చోహాన్, అనంతపూర్(గోల్డ్), కె.పరశురామ్( వైఎస్సార్ స్పోరŠట్స్ స్కూల్), (సిల్వర్), 44 కేజీల విభాగంలో రిషప్ సింగ్, విశాఖపట్నం (గోల్డ్), బద్రీనాధ్, వైఎస్సార్ కడప, í(Üసిల్వర్), 50 కేజీల విభాగంలో ఆర్.యశ్వంత్, విశాఖ పట్నం, (గోల్డ్), బి.యశ్వంత్ రెడ్డి, తూర్పుగోదావరి(సిల్వర్) పతకాలను గెలుచుకున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.అర్జున రావు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో సంఘ అధ్యక్షుడు ఆకుల మధుసూధనరావు, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై.భాస్కరరావు, ప్రొహిబిష¯ŒS అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ, కె.పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. -
కార్తిక సందడి
-
మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యానాం టౌన్ : మీసాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన యానాం భూసమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారి చతుర్ధశి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యానాం వేంకటేశ్వర దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వరకు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను ప్రాంతీయ పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎïస్పీ నితిన్ గోహల్ ఆలయ ప్రాంగణంలో స్వామివారి జయపతాకాన్ని ఎగురవేసి ప్రారంభించారు. ప్రముఖ వైఖానస వేదపండితులు వాడపల్లి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఆలయంలో సంకల్పం, దీక్షాధారణ, దిగ్దేవతా ప్రార్థన వంటి పూజలను వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే తిరుమల తరహాలో ఆరాధనోత్సవాలు, ప్రత్యేకఉత్సవాలలో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలను ప్రత్యేకగంగా ఏర్పాటు చేసిన యాగశాలలో 10 మంది రుత్వికులు, ఆలయఅర్చకులు జరిపించారు. పరిపాలనాధికారి, ఎస్పీతో పాటు దేవస్థాన కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్, కమిటీ ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వందలాది మంది భక్తులు తరలివచ్చి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను తిలకించారు. -
క్లస్టర్ ఖోఖో పోటీలు ప్రారంభం
తునిరూరల్ : ఆంధ్ర, తెలంగాణ మధ్య క్లస్టర్ అంతర్ రాష్ట్ర ఖోఖో పోటీలను స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల క్రీడా మైదానంలో సోమవారం స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ పరేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ క్రీడలను ఒలింపిక్ ప్రమాణాలతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పోటీలకు మూడు కోర్టులు ఏర్పాటు చేశామని, రాత్రి కూడా పోటీల నిర్వహణకు ఫ్లడ్‌లైట్లు, ఇతర సదుపాయలు కల్పించామన్నారు. స్టోర్స్ అధారిటీ నియమించిన అంపైర్లు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల్లో స్ఫూర్తిదాయకంగా ఉండాలని సూచించారు. నల్గొండ పబ్లిక్ స్కూల్, టీంపని స్టీల్ సిటీ స్కూల్ మధ్య పోటీతో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విజేతలు : టీంపని స్టీల్ సిటీ స్కూల్ (విశాఖ) జట్టుపై నల్గొండ పబ్లిక్ స్కూల్ జట్టు విజయం సాధించింది. చైతన్య సెంట్రల్ స్కూల్ (మహబూబ్‌నగర్)పై బ్లూమింగ్ మైండ్స్ సెంట్రల్ స్కూల్ (ఖమ్మం), చైతన్య సెంట్రల్ స్కూల్ (చిత్తూరు)పై వివేకనంద రెసిడెన్సియల్ స్కూల్ (కరీం నగర్), హైదరాబాద్‌కు చెందిన శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుపై విజ్ఞాన్ స్కూల్ జట్టు విజయం సాధించింది. విద్యా సంస్థల సహాయ కార్యదర్శి విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి పాల్గొన్నారు. -
కృష్ణమ్మకు పుష్కర శోభ
► రేపటి నుంచి పుష్కరాలు... సర్వం సిద్ధం ► ఉదయం గం.5.58కు ముహూర్తం ఖరారు ► 23వ తేదీ దాకా కొనసాగనున్న వేడుక ► భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ► పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో 81 ఘాట్లు ► మూడున్నర కోట్ల మంది స్నానం చేస్తారని అంచనా ► భారీగా ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సులు సిద్ధం ► గొందిమళ్ల ఘాట్‌లో రేపు ఉదయం 5.58 గంటలకు సీఎం దంపతుల పుష్కర స్నానం ► గవర్నర్ కూడా అక్కడే స్నానమాచరించే అవకాశం సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మకు పుష్కర శోభ వచ్చింది. కృష్ణా పుష్కరాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 5.58 గంటల నుంచి పుష్కరాలు మొదలవుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 23వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాల్లో దాదాపు మూడున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. పుష్కర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది. సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ ఆలయ సమీపంలో గొందిమల్ల ఘాట్‌లో శుక్రవారం ప్రాతఃకాలంలో సతీసమేతంగా పుణ్య స్నానమాచరిస్తారు. సీఎం దంపతులు గురువారం సాయంత్రం ఆలంపూర్ చేరుకుని హరిత గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఉదయం 5.58 గంటలకు పుష్కర స్నానానంతరం జోగులాంబను దర్శించుకుంటారు. సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్ కూడా వస్తారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్లగొండలో 29 చొప్పున రూ.212 కోట్లతో 81 ఘాట్లు ఏర్పాటు చేశారు. పాలమూరులో బీచుపల్లి, ఆలంపూర్, రంగాపూర్, కృష్ణా, గొందిమల్ల; నల్లగొండ జిల్లాలో మఠంపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్, చాయసముద్రం తదితర ఘాట్లకు భక్తులు పోటెత్తేలా ఉండటంతో గజ ఈతగాళ్లను, మరబోట్లను సిద్ధం చేశారు. మొసళ్లు కొట్టుకొచ్చే ప్రమాదమున్నందున ఘాట్ల వద్ద నదిలో కంచెలు ఏర్పాటు చేశారు 15 వేల మంది బందోబస్తు 15 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూములు, కాల్ సెంటర్లు పెట్టి సీసీ కెమెరాలు అమర్చారు దేవాదాయ శాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. పుష్కర సమాచారంతో పాటు హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-24750102, 24750020, 24752825, 2475 3850, 24757325; సెల్ నంబర్లు: 7995232 762, 7995231953, 7995232903, 7995 231963, 7995232781. వృద్ధులు, వికలాంగులు, పిల్లల కోసం ఘాట్ల వద్ద షవర్లు ఏర్పాటు చేశారు పూర్తి కాని పనులు శుక్రవారం పుష్కరాలు మొదలవుతున్నా చాలాప్రాంతాల్లో బుధవారం నాటికి కూడా పనులు పూర్తవలేదు రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల వల్ల నెల రోజులుగా పనులు సాగక పలుచోట్ల పనులు సగం కూడా పూర్తవలేదు సీఎం సమీక్ష పుష్కర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఎగువన భారీ వర్షాలతో వరద ఉధృతంగానే ఉన్నందున పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. -
చలి చంపేస్తోంది..
చలి పులి పంజా విసురుతోంది. పల్లెలు శీతగాలులకు వణుకుతున్నాయి. తెల్లవారి 9 గంటలైనా మంచుదుప్పటి తొలగిపోవడం లేదు. దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచుతో ఉదయం వేళల్లో రాకపోకలకు విఘాతం కలుగుతోంది. ఇక, గ్రామాల్లో జనం మంటలు కాచుకుని చలి బారి నుంచి కాపాడుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి బయటకు వెళ్లాలంటే స్వెట్టర్లు, మంకీక్యాప్‌లు ధరించి బయటకు వెళ్తున్నారు. పిల్లలు, వృద్ధులు చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. - నారాయణఖేడ్/న్యాల్కల్ -
కొడుకు పేరు సోమలింగం!
విజయం అనేది కల నుంచే పుడుతుంది. కల కన్నప్పుడే ఆ కలను నిజం చేసుకో వాలనే తపన పెరుగుతుంది. అయితే కలకు, పగటి కలకు మధ్య రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖ దాటితే కల కాస్తా పగటి కలై అపహాస్యం పాలవుతుంది. ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ కొందరు పగటి కలలు కంటుంటారు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఆ పని తాలూకు విజయాన్ని కలలోనే సొంతం చేసుకుని ఆనందిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయమే - ‘ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’. వెనకటికి ఒక సోమరి, సమయం దొరికితే చాలు పగటి కలలు కనేవాడట. ఒకరోజు చెట్టుకింద నిద్రపోతున్న ఆ సోమరికి మెలవకువ వచ్చింది. ఏం చేయాలో తోచక పగటి కలకు ప్రారంభోత్సవం చేశాడు. రేపో మాపో ఒక అందమైన అమ్మాయితో నాకు ఘనంగా పెళ్లవుతుంది, మాకో అందమైన అబ్బాయి పుడతాడు, వాడికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించడం మొదలెట్టాడు. రకరకాల పేర్లు ఆలోచించి చివరికి ‘సోమ లింగం’ అని ఫైనల్ చేశాడు. ఆపైన... ‘నా కొడుకు పేరు సోమలింగం’ అంటూ మురిసి పోయాడట. అందుకే ఈ జాతీయం పుట్టింది.