కృష్ణమ్మకు పుష్కర శోభ | government arrangements to krishna pushkaralu | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మకు పుష్కర శోభ

Published Thu, Aug 11 2016 1:45 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

కృష్ణమ్మకు పుష్కర శోభ - Sakshi

కృష్ణమ్మకు పుష్కర శోభ

రేపటి నుంచి పుష్కరాలు... సర్వం సిద్ధం
► ఉదయం గం.5.58కు ముహూర్తం ఖరారు
23వ తేదీ దాకా కొనసాగనున్న వేడుక
భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో 81 ఘాట్లు
మూడున్నర కోట్ల మంది స్నానం చేస్తారని అంచనా
భారీగా ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సులు సిద్ధం
గొందిమళ్ల ఘాట్‌లో రేపు ఉదయం 5.58 గంటలకు సీఎం దంపతుల పుష్కర స్నానం
గవర్నర్ కూడా అక్కడే స్నానమాచరించే అవకాశం

 
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మకు పుష్కర శోభ వచ్చింది. కృష్ణా పుష్కరాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 5.58 గంటల నుంచి పుష్కరాలు మొదలవుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 23వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాల్లో దాదాపు మూడున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది.  పుష్కర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది.

సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ ఆలయ సమీపంలో గొందిమల్ల ఘాట్‌లో శుక్రవారం ప్రాతఃకాలంలో సతీసమేతంగా పుణ్య స్నానమాచరిస్తారు. సీఎం దంపతులు గురువారం సాయంత్రం ఆలంపూర్ చేరుకుని హరిత గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఉదయం 5.58 గంటలకు పుష్కర స్నానానంతరం జోగులాంబను దర్శించుకుంటారు. సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్ కూడా వస్తారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్లగొండలో 29 చొప్పున రూ.212 కోట్లతో 81 ఘాట్లు ఏర్పాటు చేశారు. పాలమూరులో బీచుపల్లి, ఆలంపూర్, రంగాపూర్, కృష్ణా, గొందిమల్ల; నల్లగొండ జిల్లాలో మఠంపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్, చాయసముద్రం తదితర ఘాట్లకు భక్తులు పోటెత్తేలా ఉండటంతో గజ ఈతగాళ్లను, మరబోట్లను సిద్ధం చేశారు. మొసళ్లు కొట్టుకొచ్చే ప్రమాదమున్నందున ఘాట్ల వద్ద నదిలో కంచెలు ఏర్పాటు చేశారు
 
15 వేల మంది బందోబస్తు
15 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూములు, కాల్ సెంటర్లు పెట్టి సీసీ కెమెరాలు అమర్చారు
దేవాదాయ శాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. పుష్కర సమాచారంతో పాటు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-24750102, 24750020, 24752825, 2475 3850, 24757325; సెల్ నంబర్లు: 7995232 762, 7995231953,  7995232903, 7995 231963, 7995232781. వృద్ధులు, వికలాంగులు, పిల్లల కోసం ఘాట్ల వద్ద షవర్లు ఏర్పాటు చేశారు
 
పూర్తి కాని పనులు
శుక్రవారం పుష్కరాలు మొదలవుతున్నా చాలాప్రాంతాల్లో బుధవారం నాటికి కూడా పనులు పూర్తవలేదు
రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల వల్ల నెల రోజులుగా పనులు సాగక పలుచోట్ల పనులు సగం కూడా పూర్తవలేదు
 
సీఎం సమీక్ష
పుష్కర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఎగువన భారీ వర్షాలతో వరద ఉధృతంగానే ఉన్నందున పుష్కర స్నానాలకు ఇబ్బంది లేకుండా దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement