నేడు గొర్రెల పంపిణీ | Sheep distribution is Today | Sakshi
Sakshi News home page

నేడు గొర్రెల పంపిణీ

Published Tue, Jun 20 2017 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

నేడు గొర్రెల పంపిణీ - Sakshi

నేడు గొర్రెల పంపిణీ

గజ్వేల్‌లోని కొండపాకలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గొల్ల, కుర్మలను లక్షాధికారులను చేసే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలకెత్తుకున్న సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకం మంగళవారం ప్రారంభంకానుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోని కొండపాక గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. లబ్ధిదారులకు ఆయన స్వయంగా గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 62 వేల గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు సహా ప్రజాప్రతినిధులంతా భాగస్వాము లు కావాలని కోరారు. ఈ మేరకు వారందరికీ ఇప్పటికే లేఖలు పంపామన్నారు. 45 లక్షల ఎకరాల అటవీశాఖ భూములు, పండ్ల తోట ల్లో గొర్రెలకు గడ్డి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ సందర్భంగా గొర్రెల అభివృద్ధి పథకం పోస్టర్‌ను తలసాని ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌ చందా, డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్‌ ఎండీ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

7,846 సొసైటీలు...
రాష్ట్రంలోని 8,710 గ్రామ పంచాయతీల్లో 7,846 గొర్రెల పెంపకందారుల సొసైటీలు నమోదయ్యాయి. వీటిల్లో 7,18,069 మంది సభ్యులుగా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి విడత లబ్ధిదారులందరికీ గొర్రెలను అందజేస్తారు. ఎవరికి, ఎప్పుడు గొర్రెలను పంపిణీ చేయాలన్న దానిపై లాటరీ పద్ధతిలోనే నిర్ణయం తీసుకున్నారు. 21+1 గొర్రెల యూనిట్‌కు రూ. 1.25 లక్షలు ఖర్చు కానుంది. అందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా మిగిలిన సొమ్మును లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. గొర్రెలను తెలంగాణలో కొనుగోలు చేయకూడదన్న నిబంధన విధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు, కర్ణాటకలో 21, తమిళనాడులో 5, మహారాష్ట్రలో 23 జిల్లాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తారు. వచ్చే ఆరు నెలలపాటు ఆయా రాష్ట్రాల్లో జిల్లా సెంట్రల్‌ టీంలు నిత్యం అక్కడే ఉండి గొర్రెల సేకరణ చేపట్టనున్నాయి. రెండేళ్లలో సరఫరా చేసే మొత్తం కోటిన్నర గొర్రెల కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు కానుంది. అందులో ప్రభుత్వం రూ. 7,500 కోట్లు సబ్సిడీ రూపంలో భరించనుండగా, లబ్ధిదారులు రూ. 2,500 కోట్లు ఖర్చు చేయనున్నారు.

సోషల్‌ ఆడిట్‌
సబ్సిడీపై అందించే గొర్రెలను పరిరక్షిం చేందుకు ఆరు నెలల్లో రెండుసార్లు సోషల్‌ ఆడిట్‌ జరపాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. గొర్రెలను కొనిచ్చాక ఏడాదిపాటు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకుండా చూసేం దుకు వాటిని కొనిచ్చిన నెలలో ఒకసారి, ఆ తర్వాత ఆరు నెలలకు మరోసారి సామాజిక తనిఖీ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లలో 7.18లక్షల లబ్ధిదా రులకు (ఈ ఏడాది 3.6 లక్షల మందికి 75.60 లక్షల గొర్రెలు, వచ్చే ఏడాది 3.58 లక్షల మందికి 75.18 లక్షలు) మొత్తం కోటిన్నర గొర్రెలు, పోతులను ప్రభుత్వం సబ్సిడీపై అందించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement