సాక్షి, హైదరాబాద్: దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని కూడా నీరుగార్చొద్దని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కోరారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షపార్టీ నేతలను గొర్రెలతో పోల్చడా న్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఆయనలాగా కాంగ్రెస్ నేతలు తోడేళ్లు కాదన్నారు.
గొర్రెల పంపిణీ పథకాన్ని ఆహ్వానించామని, కానీ పథకం ఆచరణలో లోపభూయిష్టంగా ఉందన్నారు. పంపిణీకి ఎంపిక చేసిన గొర్రె, పొట్టేలుతో సహా ఏవీ 6నెలల వయసుకు మించ లేదన్నారు. 3.59 లక్షల యూనిట్లకు అర్హత ఉంటే 4వేల యూనిట్లు మాత్రమే మొదటివిడతలో గొర్రెలను పొందా రన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పటివేనన్నారు. ఉచిత విద్యుత్, ఒకేసారి పంట రుణాల మాఫీ,ఫీజీరీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ పథకాలన్నీ వైఎస్ అమలుచేశారని చెప్పారు.