జీవన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ గొప్పగా చెప్పుకున్న గ్రామజ్యోతి వెలుగక ముందే ఆరిపోయిందని కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా రాకపోవడం దురదృష్టకరమైని అన్నారు. శనివారం మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుట్రపూరితంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదని ఆరోపించారు. తెలంగాణలో స్థానిక సంస్థలను నిర్విర్యం చేసే కుట్ర జరుగుతోందని, మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం పట్టాలెక్కలేదని విమర్శించారు.
పంచాయతీలకు ఇప్పటికీ ఉపాధి హామీ, 14వ ఆర్థిక సంఘం నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు తొలగించి వెంటనే బీసీ జన గణన చేయాలని 2016లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. కేసీఆర్‌కి బీసీలపై ప్రేమ ఉంటే తీర్పురాగానే బీసీ గణన చేసినట్లుయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగేవని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికులకు 5000 కనీస వేతనం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చి.. అమలు చేయకపోవడం దారుణమన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వివరాలు ఉన్నాయన్న కేసీఆర్.. బీసీల వివరాలు ఆ సర్వేలో ఎందుకు లేదని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ లేని రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment