government
-
తిరుపతి తొక్కిసలాటపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాం
సాక్షి, అమరావతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మృతి, 40 మందికి పైగా గాయపడిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు స్పష్టం చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.తొక్కిసలాటపై సిట్టింగ్ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని, 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు గుదిబండ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విచారణ కమిషన్ నివేదికను గర్నవర్‌కు సమర్పించకపోతే ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందని చెప్పారు. కమిషన్ గడువును ప్రభుత్వం నిరవధికంగా పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్థకమవుతుందని తెలిపింది. తాను కమిషన్ ఏర్పాటును మాత్రమే అడగటంలేదని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఏం చేయాలో 30 రోజుల్లో శాస్త్రీయ ఆడిట్ చేసేలా ఆదేశాలివ్వాలని కూడా కోరానని శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. -
డిజిటల్ మీడియాకూ ప్రభుత్వ ప్రకటనలు
హైదరాబాద్: ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్లైన్ న్యూస్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలంటూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్‌కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA) నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్. ఈ మేరకు ఆన్లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ లేఖ అందించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్.. త్వరలోనే ఆన్లైన్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియ షురూ చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు స్వామి ముద్దం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుందన్నారు.ఈ కొత్త మాధ్యమంలో అనేక మంది జర్నలిస్టులు పని చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సహకరించాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించి, ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం సంతోషకరమని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు తెలంగాణ మీడియా అకాడమీ ఆక్రిడిటేషన్లు ఇచ్చేందుకు గైడ్‌లైన్స్ రూపొందించడం కొత్త మీడియా జర్నలిస్టులకు శుభపరిణామమని చెప్పారు. -
అనర్హులకు పథకాలు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
సాక్షి,సూర్యాపేట జిల్లా: ప్రజలు ఆశించిన మేరకు ఇందిరమ్మ పాలన సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం(జనవరి26) సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన- పథకాల ప్రారంభోత్సవంలో తుమ్మల మాట్లాడారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. అర్హులైన చివరి లబ్ధిదారులకు ప్రజాపాలన పథకాలు అందిస్తాం. రేషన్ కార్డులతో సమానంగా హెల్త్ కార్డులు ఇస్తాం. అనర్హులు ఎవరైనా లబ్ధిపొందితే స్వచ్ఛందంగా వాటిని తిరిగి ఇచ్చేయాలి. అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలి’అని తుమ్మల కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జనవరి 26 నుంచి రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు వంటి పథకాలను ప్రారంభించింది. జిల్లాల్లో మంత్రులు ఈ పథకాలను ప్రారంభించగా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాలను ప్రారంభించారు. -
రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు హామీలు
-
‘సైఫ్’పై దాడి ఘటన..మంత్రి కీలక ప్రకటన
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) మీద దుండగుడి దాడి ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్(Yogesh Kadam) పుణెలో శుక్రవారం(జనవరి17) మీడియాతో మాట్లాడారు. సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని కదమ్ పేర్కొన్నారు. ఈ దాడి అండర్‌వరల్డ్ గ్యాంగ్‌ల ప్రమేయం ఏమీ లేదన్నారు. సైఫ్‌పై దాడి చేసినట్లుగా భావించి ఓ అనుమానితుడి ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి దగ్గర పోలికలు ఉన్న ఈ యువకుడికి నేర చరిత్ర ఉందన్నారు.అయితే, సైఫ్‌పై దాడి ఘటనతో అతడికి సంబంధం లేదని గుర్తించినట్లు చెప్పారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో మరో వ్యక్తిపై కూడా పోలీసులు నిఘా ఉంచారని చెప్పారు. దుండగుల నుంచి బెదిరింపు వచ్చినట్లు సైఫ్ నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని,సెక్యూరిటీ కూడా అడగలేదని చెప్పారు.ఒకవేళ భద్రత కోరితే నిబంధనల ప్రకారం కల్పిస్తామన్నారు. మరోవైపు సైఫ్ శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీసినట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన వెన్నెముకకు తృటిలో ప్రమాదం తప్పిందన్నారు. ఆయన మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముంబై బాంద్రా ప్రాంతంలోని సైఫ్ ఇంట్లోనే అతడిపై దాడి జరిగింది. అర్ధరాత్రి చోరీకి యత్నించిన దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా సైఫ్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అనంతరం తీవ్ర గాయాలతో సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరారు.ఇదీ చదండి: ఫస్ట్ టార్గెట్ సైఫ్ కాదట.. -
కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి వేధిస్తున్నారు: పాడి కౌశిక్ రెడ్డి
-
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్‌పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్‌బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్‌గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్ట్ పై పవన్ ప్రశంసలు
-
టంగ్ స్లిప్పైన కాంగ్రెస్ కార్యకర్తలు
-
మార్గదర్శి కేసులో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
-
అన్నదాతల ప్రాణాలపై కూటమి నిర్లక్ష్యం
-
తీర్థయాత్రా స్థలంగా సంభాల్.. యూపీ సర్కార్ ప్లాన్
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పురాతన శివాలయంతో పాటు మెట్లబావి మొదలైనవి బయటపడిన దరిమిలా యూపీలోని యోగీ సర్కారు సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది.పాలరాతి నిర్మాణాలుసంభాల్లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన హింసాకాండ తర్వాత పాలనా యంత్రాంగం ఇక్కడ ఒక పురాతన శివాలయాన్ని కనుగొంది. దానిని 1978లో మూసివేశారని తేలింది. తాజాగా చందౌసీలో రెవెన్యూశాఖ తవ్వకాలు జరిపినప్పుడు ఒక భారీ మెట్ల బావి బయటపడింది. ఈ సందర్భంగా సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా మాట్లాడుతూ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఈ సైట్లో తిరిగి సర్వే నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సైట్ గతంలో చెరువుగా రిజిస్టర్ అయ్యిందన్నారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక సొరంగంతో పాటు మెట్ల బావి బయటపడిందని, ఒక అంతస్తు ఇటుకలతో, రెండవ, మూడవ అంతస్తులు పాలరాతితో నిర్మించినట్లు స్పష్టమయ్యిందన్నారు.అత్యంత జాగ్రత్తగా తవ్వకాలుబిలారి రాజుల పూర్వీకుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మితమయ్యిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న అధికారులు పురాతన నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగకుండా మట్టిని నెమ్మదిగా తొలగిస్తున్నారు. మరోవైపు ఈమెట్ల బావిని 1857లో నిర్మించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు జేసీబీల సాయంతో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలతో తవ్వకాలు చేపడుతున్నారు.మెట్ల బావి అంటే ఏమిటి?మెట్ల బావి అనేది పురాతన భారతదేశంలో నీటిని సంరక్షించడానికి, నిల్వ చేయడానికి నిర్మించిన సాంప్రదాయ నీటి నిర్మాణం. మెట్ల ద్వారా బావిలోకి చేరుకుని నీటిని తోడుకోవచ్చు. భారతీయ వాస్తుశిల్పం, నీటి నిర్వహణ వ్యవస్థకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటిని ఆదా చేయడానికి మెట్లబావులను నిర్మించేవారు. ఇది నీటి నిల్వ స్థలం మాత్రమే కాకుండా సామాజిక మతపరమైన కేంద్రంగా కూడా ఉండేది. మెట్ల బావి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. కాలక్రమేణా మెట్లబావుల వాడకం తగ్గింది. అయితే నేడు ఇది చారిత్రక వారసత్వ సంపదగా, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. #WATCH | Uttar Pradesh | Visuals from the Chandausi area of Sambhal where excavation work was carried out yesterday at an age-old Baori by the Sambhal administration pic.twitter.com/ILqA8t3WPW— ANI (@ANI) December 23, 2024తీర్థయాత్రా స్థలంగా సంభాల్సంభాల్కు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించనున్నారు. గెజిటీర్ ప్రకారం సంభాల్‌లో గతంలో 19 బావులు ఉండేవి. పూర్వకాలంలో చెరువు లేదా సరస్సును పుణ్యక్షేత్రంగా పరిగణించే వారు. సంభాల్‌లో అంత్యక్రియలు నిర్వహించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతుంటారు.పాత ఫైళ్ల వెలికితీతసంభాల్కు నలుమూలల్లో ఉన్న స్మశాన వాటికలు కూడా ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదేవిధంగా సంభాల్‌లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి యూపీ సర్కారు ముందుకొచ్చింది. ఒకప్పుడు సంభాల్‌లో హిందూ ఖేడా అనే హిందువుల కాలనీ ఉండేది. ఇప్పుడు దానిపై మరో వర్గంవారి ఆధిపత్యం కొసనాగుతున్నదని స్థానికులు అంటున్నారు. దీప సరాయ్ కాలనీ పరిస్థితి కూడా ఇదేనని తెలుస్తోంది. ఈ నేధ్యంలో యూపీ సర్కారు ప్రభుత్వ న్యాయవాదుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. 1978 నాటి అల్లర్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లను సేకరించాలని ప్రభుత్వం వారికి సూచించింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు -
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ, బీఆర్ఎస్ చార్జిషీట్
-
సీఎం పీఠం కోసం ఏక్నాథ్ షిండే పట్టు
-
EPFO: కొత్త రూల్.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ్యులైన ఉద్యోగులందరూ ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)లను యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ఈ మేరకు యాజమాన్యాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయాలని ప్రభుత్వం సూచించినట్లు ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. సమర్థవంతమైన అమలు కోసం ఈపీఎఫ్‌వో జోనల్, ప్రాంతీయ కార్యాలయాలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. 2024-25 యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం అమలులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే క్రమంలో 100 శాతం బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.ఆధార్‌ను గుర్తింపు పత్రంగా ఉపయోగించడం డెలివరీ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!మొదటి దశలో యజమాన్యాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన తమ ఉద్యోగులందరికీ నవంబర్ 30 నాటికి ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల భారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు... దద్దరిల్లిన శాసన మండలి
-
Uttar Pradesh: విద్యార్థి ఆందోళనలు ఉధృతం.. బారికేడ్లను దాటుకుని..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు(గురువారం) కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చెలరేగింది.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనను తొలగించుకుంటూ విద్యార్థులు కమిషనర్ కార్యాలయం వైపు కదిలారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీసీఎస్ ప్రిలిమ్స్ 2024, ఆర్/ఏఆర్ఓ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను రెండు రోజుల్లో రెండు షిఫ్టులలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్‌లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట సోమవారం నుంచి వేలాది మంది విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని కమిషన్ కార్యాలయం వద్దనున్న మూడు రోడ్ల కూడలిలో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బారికేడ్లతో మూడు రహదారులను మూసివేసి భద్రతను పెంచారు. కాగా కొందరు పోలీసులు రాత్రిపూట సాధారణ దుస్తులలో వచ్చి కొంతమంది విద్యార్థులను తీసుకెళ్లారనే ఆరోపణలు వినివస్తున్నాయి. ఈరోజు(గురువారం) నిరసన స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కూడలి వద్ద వేలాది మంది విద్యార్థులు గుమిగూడారు. వీరిలో కొందరు కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.కాగా బుధవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేట్ నంబర్ టూ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులతో మాట్లాడేందుకు జిల్లా డీఎం రవీంద్ర కుమార్, పోలీస్ కమిషనర్ తరుణ్ గబా, కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వచ్చారు. డిఎం రవీంద్రకుమార్ గంటపాటు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమించేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ నిరసన కొనసాగిస్తామని చెప్పారు.ఇది కూడా చదవండి: Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
ప్రైవేటు ఆస్తుల స్వాధీనంపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు
న్యూఢిల్లీ: ప్రైవేటు ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు సహజ వనరులు కావని తేల్చి చెప్పింది. వీటిని ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలులేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో వివాదాస్పద అంశంపై మంగళవారం తీర్పు వెల్లడించింది.ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే.. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు వీటిపై ప్రస్తుత ప్రైవేటీకరణ, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉంది 1950ల్లో భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వ్యాఖ్యానం చేయకూడదు. అప్పుడు జాతీయీకరణ జరుగుతోంది. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం కొత్తగా ఉండాలి. ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి.. అని తీర్పును తెలియజేసింది ధర్మాసనం. ప్రైవేటు ఆస్తులను సమాజవనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా, లేదా అనే అంశంపైర్పు వెలువడింది. మొత్తం మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, బీవీ నాగరత్న, సుధాన్షు ధులియా, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, సతీష్ చంద్ర శర్మ, అగస్టిన్ జార్జ్ మసీ ఉన్నారు. వీరిలో జస్టిస్ బీసీనాగరత్న పాక్షికంగా ఏకీభవించగా..జస్టిస్ సుధాన్షు ధులియా విభేదించారు. -
స్పెయిన్‌ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు
మాడ్రిడ్ : భారీ వర్షానికి ఆకస్మికంగా సంభవించిన వరదలు స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా భారీ సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.ఓ వైపు వర్షం.. మరోవైపు వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారి జాడ కోసం బాధిత కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. బురద నీరు ముంచెత్తడంతో రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.దీంతో స్పెయిన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా, పదుల సంఖ్యలో మృతదేహాల్ని గుర్తించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా ఇతర అన్నీ రంగాలకు చెందిన కార్యకలాపాల్ని గురువారం వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావాన్ని అంచనా వేసేలా కేంద్ర క్రైసిస్ కమిటీ ఉన్నతాధికారులకు ప్రధాని అప్రమత్తం చేశారు. -
గుంటూరు జీజీహెచ్ సూపరిటెండెంట్ ఓవరాక్షన్.. సీనియర్ డాక్టర్ల ఆగ్రహం
సాక్షి,గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ ఓవరాక్షన్ చేశారు. కొత్త సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించకపోయినా తానే సూపరింటెండెంట్ అంటూ ఎస్ఎస్వీ రమణ హడావిడి చేశారు. అయితే ఎస్ఎస్వీ రమణ వ్యవహారంపై సీనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ రౌడీ షీటర్ నవీన్ చేతిలో హ త్యకు గురైన మృదుల సహానా కేసు విషయంలో ప్రభుత్వం చెప్పింది చేయలేదని కక్షగట్టి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ కిరణ్ కుమార్‌ను ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించింది. కిరణ్ కుమార్ స్థానంలో ఎస్ఎస్వీ రమణను జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ సోమవారం రాత్రి జీవో జారీ చేసింది. కొత్త సూపరింటెండెంట్ నియామకంపై డీఎంఈ.. జీజీహెచ్కీ సమాచారం ఇవ్వలేదు.రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు.ఆమెకు మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్మోహన్రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. -
కూటమి ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దారుణలపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్కు ఫిర్యాదు చేయనున్నారు.మంగళవారం మద్యాహ్నం 2గంటలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవిలు.. ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్తో భేటీ కానున్నారు.ఈ భేటీలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వ పాలనలో రోజూ మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయని ఫిర్యాదు చేయనున్నారు. మహిళలపై 100కు పైగా జరిగిన దురాగతాల నివేదికను అందించనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యంపై వైఎస్సార్సీసీ మహిళ నేతలు జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు. -
మూడేళ్ల తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం అనడం దుర్మార్గం : హరీష్ రావు
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన్మోహన్ వీడ్కోలు కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ అయిన 6 వేల మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 సంవత్సరాల తర్వాత చెల్లిస్తాం అనడం దుర్మార్గం.4 డీఏలకు ఒక డీఏ మాత్రమే ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు సూచించారు. -
పాక్‌లో హిందూ గుడికి మోక్షం.. 64 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం
ఇస్లామాబాద్: ఇస్లామిక్ దేశం పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్కడి హిందూ ఆలయాలు ఎన్ని దాడులకు గురయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది 64 ఏళ్ల తర్వాత పాక్‌లోని నరోవల్ జిల్లాలోని బావోలీ సాహిబ్ గుడిని అక్కడి ప్రభుత్వం పునర్నిర్మిస్తుండడం విశేషం.1960లోనే ఈ గుడి మూతపడింది. అయితే నరోవల్ జిల్లాలోని హిందువులు గుడికి వెళ్లాలంటే లాహోర్ లేదా సియాల్కోట్కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ గుడిని పునర్నిర్మించాలని పాక్ ధర్మస్థాన్ కమిటీ 20 ఏళ్ల క్రితమే సిఫారసు చేసింది. గుడి నిర్మాణానికి పాక్ ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించిందని డాన్ పత్రిక వెల్లడించింది.ద ఎవాక్యూ ట్రస్ట్‌ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) గుడి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. గుడి పూర్తయిన తర్వాత దానికి ధర్మస్థాన్ బోర్డుకు అప్పగిస్తారు. పాక్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన షోయబ్ సిద్దాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీ చైర్మన్ షోయబ్ సిద్దాల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు మంజూర్ మసీ గుడి పునర్నిర్మించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. బావోలీ సాహిబ్ గుడిని మళ్లీ నిర్మిస్తున్నందుకు పాక్ ధర్మస్థాన్ కమిటీ అధ్యక్షుడు సావన్ చంద్ అక్కడి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు -
J&K cabinet: మంత్రి పదవి ఆఫర్.. తిరస్కరించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీనగర్‌లో ఉన్న షేర్ యే కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓ మినిస్టర్ బర్త్ ఇచ్చేందుకు ఎన్సీ ఆఫర్ చేసింది. కానీ జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి అయిష్టత చూపుతున్న హస్తం పార్టీ.. ఎన్సీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ప్రభుత్వానికి బయట నుంచే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి.కాగా 2014 తర్వాత పదేళ్లకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 90 సీట్లకుగానూ 42 చోట్ల విజయం దక్కించుకుంది. ఎన్సీతో పొత్తుతో వెళ్లిన కాంగ్రెస్ కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది.ఇక నేడు ఒమర్ అబ్ధుల్లాతోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలకు ఆహ్వానాలు అందాయి.ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత కనిమొళితో పాటు ఇతర నేతలు శ్రీనగర్ చేరుకున్నారు. ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతో కలిసి ఆ నేతలు ఫోటోలు దిగారు. చెన్నైలో వర్షాల వల్ల ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకాలేకపోతున్నారు.