
చెన్నై:తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను బెంగళూరు కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేసింది.మొత్తం రూ.4 వేల కోట్ల ఆస్తుల్లో ఇళ్లు,1525ఎకరాల భూమి డాక్యుమెంట్లతో పాటు 1100 కేజీల వెండి,వెయ్యి కిలోలకుపైగా బంగారం,వజ్రాలు ఉన్నాయి.
అక్రమాస్తుల కేసులో జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను చివరిగా తమిళనాడు ప్రభుత్వానికి అందించారు.అక్రమాస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికల దోషిగా తేలిన విషయం తెలిసిందే. అయితే శిక్ష పడేలోపే జయలలిత మరణించారు.శశికల మాత్రం ఈ కేసులో శిక్ష అనుభవించారు.
తమిళనాడు ప్రభుత్వానికి అందిన వాటిలో జయలలితకు చెందిన బంగారు కిరీటమిది..
జయలలిత బంగారు ఒడ్డానం..దీనిలో వజ్రాలను నెమలి ఆకారంలో పొదగడం విశేషం.
ఇది జయలలితకు బహుకరించిన బంగారు కత్తి..
ఇది జయలలిత రూపంతో ఉన్న బంగారు బొమ్మ..
