jayalalitha
-
జయలలిత ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?
-
ప్రభుత్వ స్వాధీనమైన జయలలిత ఆస్తులు.. ఎన్ని వేల కోట్లో తెలుసా?
-
జయలలిత ఆభరణాల్లో.. అద్భుతమైనవివే..!
చెన్నై:తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను బెంగళూరు కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేసింది.మొత్తం రూ.4 వేల కోట్ల ఆస్తుల్లో ఇళ్లు,1525ఎకరాల భూమి డాక్యుమెంట్లతో పాటు 1100 కేజీల వెండి,వెయ్యి కిలోలకుపైగా బంగారం,వజ్రాలు ఉన్నాయి.అక్రమాస్తుల కేసులో జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను చివరిగా తమిళనాడు ప్రభుత్వానికి అందించారు.అక్రమాస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికల దోషిగా తేలిన విషయం తెలిసిందే. అయితే శిక్ష పడేలోపే జయలలిత మరణించారు.శశికల మాత్రం ఈ కేసులో శిక్ష అనుభవించారు.తమిళనాడు ప్రభుత్వానికి అందిన వాటిలో జయలలితకు చెందిన బంగారు కిరీటమిది..జయలలిత బంగారు ఒడ్డానం..దీనిలో వజ్రాలను నెమలి ఆకారంలో పొదగడం విశేషం.ఇది జయలలితకు బహుకరించిన బంగారు కత్తి..ఇది జయలలిత రూపంతో ఉన్న బంగారు బొమ్మ.. -
జయలలితపై అన్నామలై వ్యాఖ్యలు... ఖండించిన శశికళ
చెన్నై: దివంగత అన్నాడీఎంకే అధినేత జయలలిత గొప్ప హిందుత్వ నాయకురాలని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై జయలలితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్యలో రామజన్మభూమిని నిర్మించాలని కోరుకున్న తొలి బీజేపీయేతర నేత జయలలిత అని అన్నామలై చెప్పారు. 2014కు ముందు తమిళనాడులో హిందూ ఓటర్లంతా జయలలితవైపే మొగ్గు చూపేవారని గుర్తు చేశారు. అయితే జయలలితపై అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలను ఆమె నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ కీలక నేత శశికళ ఖండించారు. జయలలితను ఏ ఒక్కవర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు.ఎంజీఆర్, అన్నాదురై బాటలో అన్ని వర్గాల కోసం జయలలిత కృషి చేశారని కొనియాడారు. అన్నామలై వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని శశికళ కొట్టిపారేశారు. -
TN: జయలలితపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని అన్నారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని అన్నారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీతొ జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్ల సహజంగానే జయలలితను తమ ఛాయిస్‌గా ఎన్నుకుంటారు. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’ అని అన్నామలై పేర్కొన్నారు. బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని తెలిపారు. 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు., అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. జయలలిత లాంటి ప్రజానాయకురానికి ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు.జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. -
శరత్‌బాబుతో బిడ్డను కనాలనుకున్నా..: జయలలిత
సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఐటం సాంగ్స్, గ్లామర్ పాత్రలు పోషించింది జయలలిత. అప్పుడు ఫుల్ క్రేజ్ తెచ్చుకుని చేతినిండా సంపాదించింది. కానీ ఆ గ్లామర్ పాత్రల వల్ల ఇప్పటికీ తనకు మంచి పాత్రలు రావడం లేదు. అప్పటి సీనియర్ హీరోయిన్లంతా అమ్మ, వదిన పాత్రలు చేస్తుంటే తనకు మాత్రం అలాంటి చెప్పుకోదగ్గ పాత్రలే రావట్లేదు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమెకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఓ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె అతడి టార్చర్ భరించలేక మూడు నెలలకే విడిపోయింది. అప్పటినుంచి సింగిల్‌గానే ఉండిపోయింది. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకున్నా తాజాగా ఆమె ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. దివంగత నటుడు శరత్‌కుమార్‌ను మనసారా ప్రేమించానని చెప్పింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ.. 'చాలామంది నన్ను రెండో పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ నేను ఆసక్తి చూపలేదు. ఒక్క పెళ్లితోనే నరకం చూశాను. ఇక దానికి జోలికి వెళ్లొద్దనుకున్నాను. అమ్మానాన్న చనిపోయాక హైదరాబాద్‌కు షిఫ్టయ్యాను. ఆఫర్ల సంగతి ఏమో కానీ సినీ ఆత్మీయులు ఉంటారని ఇక్కడ సెటిలయ్యాను. బిడ్డను కనాలనుకున్నాం నేను శరత్‌బాబును ప్రేమించాను. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు! ఆయనతో కలిసుండాలని ఎంతో అనుకున్నాను. కానీ ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడాయన లేరు కాబట్టి అన్ని వివరాలు చెప్తాను. ఆయనతో కలిసే యాత్రలన్నీ చేశాను. దేవుడు నాకంటూ ఓ గైడ్ పంపించాడనుకున్నాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపారు. మేమిద్దరం కలిసి ఓ బిడ్డను కనాలని కూడా ప్లానింగ్ చేసుకున్నాం. కానీ ఆయన దేని గురించైనా సంవత్సరాలతరబడి ఆలోచిస్తారు. అభ్యంతరం లేకపోతే.. మనిద్దరం బిడ్డను కని చనిపోయాక ఆస్తి గురించి ఆమెను ఏమైనా హింసిస్తారేమోనని భయపడేవారు. మా మధ్య ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. శరత్‌బాబు భార్య రమాదేవి నాకు చాలా క్లోజ్. ఆమెను అక్కా అని, ఆయన్ను బావ అని పిలిచేదాన్ని. బావ.. బావ అంటూ నేను తనకు క్లోజ్ అయ్యాను. తన దగ్గర కూర్చుంటే సమయమే తెలిసేది కాదు. నేను ఆడదాన్ని అన్న అభ్యంతరం లేకపోతే మీరు యాత్రలకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లండి అని చెప్పాను. అలా తనతో నా జర్నీ మొదలైంది. ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలనుకున్నాను. కానీ దేవుడు పట్టుకెళ్లిపోయాడు' అని చెప్పుకొచ్చింది జయలలిత. తప్పించుకోలేకపోయా.. ఇంకా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు ఎక్కువ వేయడంతో కొందరు ఆర్టిస్టులు వెంటపడేవారు.. కానీ ప్రతిసారి తప్పించుకోలేకపోయేదాన్ని. కొన్ని తప్పించుకున్నాను. మరికొన్నిసార్లు తప్పించుకోలేక, తప్పనిసరై లొంగిపోయాను. నేను చెడిపోయినా పర్వాలేదు, నా ఇంట్లో వాళ్లు బాగుండాలి అనుకున్నాను. అందుకే అలా చేశాను. అలా అని ఎవరూ ప్రేమ చూపించేవారు కాదు. పైశాచికత్వంగా ప్రవర్తించేవారూ కాదు. వాళ్ల అవసరం తీర్చుకునేవారు' అని తెలిపింది జయలలిత. చదవండి: కల నెరవేర్చుకున్న మెగా హీరో.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవేనట! -
జయలలిత ఆస్తుల వేలం.. కోర్టుకు చెల్లించాల్సిన డబ్బు ఎంత..?
దివంగత సీఎం జయలలిత జీవితం సినిమా రంగం నుంచే ప్రారంభమైంది. ఇష్టం లేకపోయిన డబ్బు కోసమే ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆమె చెప్పేవారు. అలా సినిమాల్లో స్టార్‌గా ఉన్నప్పుడే 1982లో రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత అక్కడ కూడా తన సత్తా చాటారు. సినిమా రంగంలో ఉన్నప్పుడే భారీగా ఆస్తులు కూడబెట్టిన ఆమె రాజకీయాల్లో తన ఆస్తులపై పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు చెందిన ఆభరణాలు, ఆస్తులను వేలం వేసి కోర్టుకు ఆమె చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వివరాలు.. అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, చిన్నమ్మ బంధువులు ఇలవరసి, సుధాకరన్‌కు 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇందులో అమ్మ జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 100 కోట్లు జరిమానా విధించారు. మిగిలిన వారికి తలా రూ. పది కోట్లు జరిమానా, జైలు శిక్ష విధించారు. దీనిని వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లగా నిర్దోషులుగా బయటపడ్డారు. అయితే ఈ తీర్పుపై దాఖలైన పునర్ సమీక్ష పిటిషన్‌పై విచారణ ముగియక ముందే జయలలిత మరణించారు. 2017లో వెలువడ్డ ఈ తీర్పులో జయలలితను దోషిగానే పరిగణించారు. ఆమె జీవించి లేకపోవడంతో శిక్ష నుంచి తప్పించారు. అయితే జరిమానాలో మార్పు చేయలేదు. జయలలిత మరణించి 6 సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు జరిమానా చెల్లింపు జరగలేదు. ఈ జరిమానా వసూలుపై కోర్టు దృష్టి పెట్టింది. అదే సమయంలో జయలలిత వద్ద సీజ్ చేసిన బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 28 కేజీల నగలు, 800 కేజీల వెండితో పాటు ఇతర వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి మార్చి 6,7 తేదీలలో అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. దీనిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించినానంతరం జరిమానా చెల్లింపునకు సంబంధించిన ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. జయలలితకు చెందిన ఆభరణాలను ట్రెజరీకి పంపించి విలువ లెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపడుతుండడం గమనార్హం. దీని ఆధారంగా రూ. 40 కోట్లు వచ్చేందుకు వీలుందని, మరో 60 కోట్లు ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి అందించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 5 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి అందజేయాల్సి ఉండడంతో ముందస్తు లెక్కలతో జయలలిత ఆస్తుల వేలానికి కార్యాచారణ ప్రారంభించినట్లు తెలిసింది. -
పెద్ద హీరోయిన్ గా కావాలనుకున్నాను కానీ అవ్వలేకపోయాను
-
యాక్టర్ తో చనువుగా ఉన్న అన్ని అక్రమ సంబంధం అంటగట్టారు
-
నా భర్త నాకు చాలా నరకం చూపించాడు..!
-
భర్త లేని ఒంటరి ఆడదాని జీవితం..!
-
గుక్కపెట్టి ఏడ్చిన జయలలిత..!
-
40 ఏళ్లలో సంపాదించిన ఆస్తి, నగలు.. అన్నీ పోగొట్టుకున్నా: నటి
సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కెరీర్ ఇరకాటంలో పడటం ఖాయం. ఆచితూచి అవకాశాలను ఎంచుకుంటూ పోతుండాలి. కానీ ఆ వయసులో ఏది సెలక్ట్ చేయాలో, ఏది రిజెక్ట్ చేయాలో అర్థం కాక కొందరు నటీమణులు తప్పటడుగులు వేసి కెరీర్‌నే ఇబ్బందుల్లో పడేసుకున్నారు. అలాంటివారిలోనే జయలలిత ఒకరు. తను ఐటం సాంగ్స్, గ్లామర్ పాత్రలు చేస్తూ పోవడంతో హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రాలేదు. పైగా అప్పుడు పొట్టి దుస్తుల్లో కనిపించినందుకు ఇప్పటికీ సరైన ఛాన్సులు లభించడం లేదు. సీనియర్ హీరోయిన్లు అమ్మ, వదిన పాత్రలు చేస్తుంటే తనకు మాత్రం అటువంటి చెప్పుకోదగ్గ పాత్రలు రావడం లేదు. అప్పట్లో ఐటం సాంగ్స్ చేయడం వల్లే తనకు సరైన పాత్రలు దక్కడం లేదంది. ఇకపోతే గతంలో ఓ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె అతడి టార్చర్ భరించలేక మూడు నెలలకే విడిపోయింది. అప్పటినుంచి ఒంటరిగానే జీవిస్తోంది. ఆ మధ్య డ్రైవర్‌ను నమ్మి సంపాదించిన ఆస్తినంతా పోగొట్టుకుంది. తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. స్వయంకృతపరాధం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చివరికి 40 సంవత్సరాలుగా సంపాదించింది ఒక్కసారిగా పోగొట్టుకున్నాను. కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేసిన మొత్తం, నగలు.. ఆస్తి అంతా పోగొట్టుకున్నాను. ఇప్పుడు కేవలం నాకంటూ ఒక ఫ్లాట్ మాత్రమే మిగిలి ఉంది అని చెప్పుకొచ్చింది. చదవండి: ఇదేందిది.. ఇది ప్రభాస్ విగ్రహమా? నెట్టింట ట్రోలింగ్.. బాహుబలి నిర్మాత సీరియస్ -
సీరియల్స్‌కు సినిమాకు తేడా అదే : దర్శకుడు
సీరియల్స్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వారు దర్శకుడు, టెక్నీషియన్లు ఎవరనేది పట్టించుకోరు. కానీ ప్రతి రోజు మా సీరియల్ చూస్తారు. సినిమా అలా కాదు. ఒక్క హిట్ పడిందంటే చాలు మంచి ఫాలోయింగ్, పేరు వస్తుంది. సీరియల్‌కు ఉన్నన్ని కష్టాలు సినిమాకు ఉండవు’అని దర్శకుడు రాము కోన అన్నారు. పలు సీరియళ్లకు దర్శకత్వం వహించిన రాము.. `రుద్రంకోట`అనే సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడిగా ఇది అతనికి తొలి సినిమా. సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో పోషిస్తున్నారు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రాము తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నేను 2001లో నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. చాలా ప్రయత్నాలు చేశాను కానీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరుణంలో ఒక మేకప్ మ్యాన్ ద్వారా `పద్మవ్యూహం`సీరియల్ కు కొన్ని రోజులు పని చేశాను. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ కూడా మానేశాను. ఇలా కాదని మద్రాసు వెళ్లాను. అక్కడ మిత్రుడి ద్వారా డైరక్టర్ సురేష్ గారి వద్ద ఒక సీరియల్ కు అసిస్టెంట్ డైరక్టర్ చేరాను. అలా ఆయన దగ్గర చాలా వర్క్ నేర్చుకున్నా. ఆ తర్వాత ప్రామ్టర్ గా కొన్ని సీరియల్స్ కు పని చేశాను. అలా నా కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అన్ని మేజర్ టీవీ ఛానల్స్ లో హిట్ సీరియల్స్ డైరక్ట్ చేశాను. ఇప్పటి వరకు దాదాపు ఐదు వేలకు పైగా ఎపిసోడ్స్ డైరక్ట్ చేశాను. ఆ సమయంలోనే `రుద్రంకోట` సినిమా డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది. ► రుద్రంకోట దగ్గర జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశాము. శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రం. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. లవ్ అండ్ లస్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అండర్ కరెంట్ గా మంచి సందేశం కూడా అందిస్తున్నాం. అదేంటో సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ► ఇందులో లీడ్ రోల్ లో సీనియర్ నటి జయలలిత గారు నటించారు. కోటమ్మ పాత్రలో తను నటించిన తీరు అద్భుతం. అలాగే హీరోగా రుద్ర నటించాడు. తనకు ఇది తొలి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా నటించాడు. అమ్మాయిలంటే గిట్టని పాత్రలో తను ఒదిగిపోయాడు. అలాగే హీరోయన్స్ శక్తి, విభీష ఇద్దరూ పోటీ పడి నటించారు. ప్రతి పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. ► జయ లలిత గారు చేసిన కోటమ్మ పాత్ర సినిమాకు హైటెట్. అలాగే మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు జయలలిత గారితో నేను చాలా సీరియల్స్ కు పని చేశాను. ఆ అభిమానంతో నేను తన పేరు సమర్పకురాలిగా వేసుకున్నాను. జయలలిత గారు మా సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. ► దర్శకుడు గా నాకు ఆదర్శం రాజమౌళి గారు. ఆయన కూడా మొదట `శాంతి నివాసం` అనే సీరియల్ చేసారు. ఆ తర్వాత సినిమాలు డైరక్ట్ చేసి...తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెల్లారు. ఆయన ఆదర్శంతోనే సీరియల్ నుంచి నేను కూడా సినిమాల వైపు వచ్చాను. -
రూమ్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి
సీనియర్ నటి జయలలిత గురించి తెలియనివారి ఉండరు. అప్పట్లోనే తెలుగులో అనేక సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. వెండితెరపై నెగిటివ్, కమెడియన్, గ్లామర్ రోల్స్‌తో మెప్పించారు. మలయాళ చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయలలిత.. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలు చేసింది. ఆమె కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత మామ అల్లుడు, లారీ డ్రైవర్, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, జంబలకిడి పంబా, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి, హంగామా, గోపీ గోపిక గోదావరి, గ్రహణం, భరత్ అనే నేను లాంటి సహాయక పాత్రల్లో నటించారు. అలాగే వ్యాంప్ పాత్రలతో ఆమె ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నారు. బుల్లితెరపైనే కాన్సంట్రేట్ చేసిన ఆమె బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు. సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేసిన జయలలిత స్టార్ నటిగా ఎదిగారు. ఇక ఆర్థికంగానూ సెటిలైన ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడితో ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆమె ఇంట్లో వాళ్లని ఎదిరించి ఆయనతో ఏడడుగులు వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయలలిత తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం!) జయలలిత మాట్లాడుతూ.. 'నేను అత్యధికంగా లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా. ఇంద్రుడు చంద్రుడు సినిమాకు రామానాయుడు ఇచ్చారు. అంత మంచి క్యారెక్టర్ ఏ సినిమాలోనూ రాలేదు. నా రెమ్యునరేషన్ గురించి అంతా మా నాన్నే. డేట్స్ కూడా చూసుకునేవారు. బాలయ్య, చిరంజీవితో సినిమాలు చేశా. బాలయ్య చాలా సరదాగా మాట్లాడేవారు. చిరంజీవి కూడా ఎప్పుడు కనిపించినా అప్యాయంగా పలకరించేవారు. సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉంటాయి. నాకు సెట్లో టైంకు భోజనం పెట్టకపోతే నిర్మాతకు శాపం పెడతా.' అంటూ చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ అసభ్యంగా.. అసిస్టెంట్ డైరెక్టర్ తీరు గురించి మాట్లాడుతూ..' ఓ మలయాళం మూవీ చేసేటప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు మలయాళం భాష రాదు. అప్పుడు మలయాళంలో సినిమా చేసేందుకు ఫస్ట్ టైమ్ వెళ్లా. అందులో రేప్ సీన్ గురించి చెప్పాలని గదిలోకి రమ్మన్నారు. లోపలికి వెళ్లాకా అసిస్టెంట్ డైరెక్టర్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కానీ ఆ తర్వాత అతను ఆరు నెలల్లోనే చనిపోయాడు. అతనెలా చచ్చాడో కూడా నాకు తెలియదు.' నటి జయలలిత చెప్పుకొచ్చారు. అంతే కాకుండా చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నట్లు జయలలిత తెలిపారు. వ్యాంప్ పాత్రల వల్లే కారణంగానే ఆ ఛాన్స్ పోయిందన్నారు. అంతేకాకుండా కళాతపస్వి కే. విశ్వనాథ్ బంధువుతో పెళ్లి సంబంధం కూడా పోయిందని.. కుటుంబం కోసమే వద్దకు వచ్చిన పాత్రలన్నీ చేసినట్లుగా జయలలిత వెల్లడించారు. (ఇది చదవండి: అపాయింట్మెంట్ అడిగితే షాకయ్యారు.. విశాల్ కామెంట్స్ వైరల్!) -
కారు డ్రైవర్‌ను నమ్మి ఆస్తినంతా పోగొట్టుకున్నా: ఏడ్చేసిన జయలలిత
రంగుల ప్రపంచంలో నటిగా రాణించిన జయలలిత నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ మనసిచ్చినవాడితో ఏడడుగులు వేసింది. కానీ పెళ్లి తర్వాత ప్రియుడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తి కోసమే ప్రేమను నటించాడని అర్థం అయింది. గృహ హింస తట్టుకోలేక విడాకులు తీసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. కుటుంబమంతా నాపై ఆధారపడటంతో.. 'నేను క్లాసికల్ డ్యాన్సర్‌ను. నేను పదో తరగతి రెండుసార్లు ఫెయిలయ్యాను. మయూరి, సప్తపది సినిమా ఛాన్సులు చేతిదాకా వచ్చినట్లే వచ్చి వెనక్కు వెళ్లిపోయాయి. తర్వాత ఎందుకోగానీ అన్నీ వ్యాంప్ క్యారెక్టర్లే వచ్చాయి. అలా ఐటం సాంగ్స్ చేశాను, పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని నటించాను. నా కుటుంబం నా మీద ఆధారపడి ఉండటంతో వచ్చిన ఆఫర్నల్లా ఒప్పుకుంటూ పోయాను. కానీ ఇలా ఐటం సాంగ్స్ చేయడం వల్ల క్లాసికల్ డ్యాన్స్‌కు దూరమయ్యాను. ఇంటిపై దాడి అయితే జయలలిత అనే పేరు నాకు తమిళనాడులో మైనస్ అయింది. జయలలిత అమ్మ పేరు పెట్టుకుని కమెడియన్‌గా చేస్తున్నావ్, ఐటం సాంగ్స్ చేస్తున్నావ్.. పేరు మార్చుకో అని ఆ పార్టీవాళ్లు మా ఇంటి మీద రాళ్లు రువ్వి దాడి చేశారు. నేను పేరు మార్చుకోననేసరికి అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమ ఎలా మొదలైందంటే.. డేట్స్ విషయంలో పెద్ద గొడవ జరిగితే అతడు ముందుండి సమస్యను పరిష్కరించాడు. పెళ్లయిన తెల్లారినుంచే ఆస్తి కోసం గొడవ ఆ చిన్నదానికే లవ్‌లో పడిపోయాను. అతడి కోసం ఎన్ని సినిమాలు మానుకున్నానో! పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు.. తొందరపడుతున్నావని హెచ్చరించడంతో ఆలోచనలో పడ్డాను. కానీ అప్పటికే అతడు రక్తంతో లెటర్స్ రాయడం, విషం తాగి చస్తానని బెదిరించడంతో భయంతో గుడిలో పెళ్లి చేసుకున్నాను.పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఆస్తి కోసం పోరు మొదలుపెట్టాడు. లేదంటే పిల్లల్ని కనమని వేధించాడు. పక్షవాతం.. నేనే డబ్బులు పంపించా ఇంట్లో తెలియకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి పిల్లలు పుట్టకుండా మూడు నెలలపాటు టాబ్లెట్స్ వేసుకున్నాను. డబ్బు తీసుకురా లేదంటే యాసిడ్ పోస్తానని అత్తింటివారు బెదిరించారు. రూ.50 లక్షలు, నా బంగారు నగలు సహా ఉన్నదంతా ఊడ్చేశారు. 6 నెలలకే మేము విడిపోయాం. ఇటీవలే రోడ్డుప్రమాదంలో గాయపడగా కాలికి పక్షవాతం వచ్చింది. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అతబి భార్య సరిగా చూసుకోకపోవడంతో మందుల కోసం నెలకు రూ.5 వేలు పంపించాను. అమ్మా అమ్మా అంటూ రూ.4 కోట్లు కాజేశాడు ఈ మధ్య నేను సంపాదించిన రూ.4 కోట్లు పోగొట్టుకున్నాను. అనిల్ గణపతి రాజు.. రాఘవేంద్రరావు దగ్గర డ్రైవర్‌గా పనిచేసేవాడు. రాఘవేంద్రరావుకు సంబంధించిన సీరియల్ చేసేటప్పుడు అనిలే ఇంటికి వచ్చి కారులో పిక్ చేసుకుని వెళ్లేవాడు. తర్వాత అతడు కుందనపు బొమ్మ అని సినిమా కూడా చేశాడు. అయితే సినిమా ఫ్లాప్ అవడంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే తన సీరియల్ కోసం కూడా నా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. అమ్మా అమ్మా.. అని అడుక్కోవడంతో ఉన్నదంతా ఇచ్చేశాను. అయితే డబ్బులు బాగున్నాయని విసిరేస్తోందని నా వెనకాల తిట్టేవాడు. ఇలా ఉన్నదంతా పోయి ఇబ్బందులు పడ్డప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ సపోర్ట్ చేయలేదు' అని చెప్తూ ఎమోషనలైంది జయలలిత. చదవండి: పెద్ద పెద్ద స్టార్స్‌తో నటించింది.. 35 ఏళ్లకే కెరీర్ ముగించింది! -
తన స్నేహితుడు నాగేంద్ర గురించి నటి జయలలిత గొప్ప మాట
-
జయలలిత - వ్యాంప్ క్యారెక్టర్ల కు వాడుకున్నారు..!
-
బాలకృష్ణతో ఫన్నీ సంఘటనలు షేర్ చేసుకున్న నటి జయలలిత
-
నటి పరువు తీసిన బాలయ్య..!
-
శ్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథగా ‘రుద్రంకోట’
సీనియర్ నటి జయలలిత సమర్పించి, ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మించిన ఈ చిత్రంలో అనిల్ ఆర్కా, విభీష, రియా హీరో హీరోయిన్లు. ఈ చిత్రం ఆగస్ట్‌లో స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ.. ‘శ్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాం. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మాక్స్ వారు గ్రాండ్ గా విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఆగస్ట్ లో సినిమాను విడుదల చేయనున్నాం’అన్నారు. -
గుళ్లలో ప్రసాదాలు తింటూ మిగిలిన ఈ చివరి జీవితం గడుపుతా..
-
రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తిగా ఉంటాయి. అక్కడలో సినిమా, రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది.. సినిమా హీరోలు సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వరకూ అందరూ సినీరంగం నుంచి వచ్చిన వారే.. ఎంజీఆర్ మొదలు విజయ్ కాంత్, కమల్ హాసన్ వరకూ సొంత పార్టీలు స్థాపించిన వారే.. దక్షిణ భారత్‌లో ఏపీ రాజకీయల తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ రాజకీయాలు తమిళనాడువి మాత్రమే.. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల ఆధిపత్యం ఉంటుంది.. డీఎంకే లేదా ఏఐడీఎంకే ఈ రెండు పార్టీలే తమిళ రాజకీయాలను శాసిస్తాయి.. అప్పట్లో కరుణానిధి, జయలలిత మధ్య రాజకీయ యుద్ధం జరుగుతూనే ఉండేది. చరిత్ర సృష్టించిన సినీ నటుల రాజకీయ ప్రస్థానం తమిళనాడు రాజకీయాలలో సినీరంగ ప్రముఖుల ప్రవేశం మొదట కరుణానిధితో మొదలైంది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీకి ఆ పార్టీ పత్రికకి ఆయన మరణించే వరకు అధ్యక్షుడిగా, పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. ఇక ఎంజీ రామచంద్రన్ 1972 అక్టోబర్ 17న ఆల్ ఇండియా అన్నాడీఎంకే (ఏఐఎడిఎంకె) పార్టీని స్థాపించారు. మొదట 11 మంది ఎమ్మెల్యేలతో మొదలైన ఆయన ప్రస్థానం 1977లో ప్రభుత్వాన్ని ఏర్పరిచి పదేళ్ల సుదీర్ఘ కాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక జయలలిత విషయానికి వస్తే ఎం.జి.రామచంద్రన్ మరణానంతరం ఆయన వారసురాలిగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు. 1991 తమిళనాడు ఎన్నికల్లతో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 225 గెలిచి మొదటిసారి ముఖ్యమంత్రిగా రాజకీయాలలో తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత 2001లో రెండవసారి 2011లో మూడవసారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మరణానంతరం వెనువెంటనే మరో రాజకీయ దిగ్గజం కరుణానిధి కూడా మరణించడంతో తమిళనాడులో ఒక్కసారిగా రాజకీయ శూన్యత ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయంలోనే కమలహాసన్ 'మక్కల్ నీది మయ్యం' (ప్రజా న్యాయ కేంద్రం) అనే పార్టీని స్థాపించారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తన కొత్త పార్టీ ప్రారంభం అవుతుందని అదే సమయంలోనే ప్రకటించారు. 1970లో విప్లవాత్మక మార్పు.. 1970 చివర్లో తమిళ సినీ రంగంలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ఎంజీఆర్-శివాజీ గణేషన్ల శకం ముగిసింది. అప్పుడే రజనీ-కమల్ ద్వయం హవా మొదలైంది. వీరిద్దరూ 1970 చివరి నుంచి 1990ల చివరి వరకు తమిళ సినిమా పరిశ్రమను దున్నేశారనే చెప్పాలి. తమిళంలో హిట్ సినిమా అంటే.. అయితే రజనీ లేదా కమల్ పేరు దానిలో కచ్చితంగా ఉండేది. ఎంజీఆర్-శివాజీల స్థానాన్ని రజనీ-కమల్ భర్తీ చేసినప్పుడు ప్రజలు ఎర్రతివాచీ పరిచారు. రజనీని ఎంజీఆర్‌తో, కమల్‌ను శివాజీతో అభిమానులు పోల్చారు. కానీ ఈ పోలికలన్నీ సినిమాల వరకే. ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే.. రజనీ ఎంజీఆర్‌లా మారలేకపోయారని ఎప్పుడో తేలిపోయింది.. ఇక మిగిలింది కమల్ హాసన్, శివాజీ అవుతారో? లేదో తేలాల్సి ఉంది. రాజకీయాల నుంచి రజనీ ఎందుకు తప్పుకున్నారు? రజనీకాంత్ పార్టీ రద్దు చేయడానికి ప్రధాన కారణం.. ఆయన ఆరోగ్యమేనని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన గడువు దాటిపోయిందని ఆయన భావిస్తున్నట్లు సంబంధికులు తెలిపారు. రాజకీయాల్లో ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని, ఇందుకు తన ఆరోగ్యం సహకరించకపోవచ్చని రజినీకాంత్ అభిప్రాయపడ్డారు. దీంతో రజినీ మక్కల్ మండ్రం పార్టీని రద్దు చేసుకున్నట్లే అయింది. కమల్ హాసన్ ఎటువైపు? మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ పార్టీకి వచ్చిన ఓట్లు 3.6 శాతం మాత్రమే. దాంతో రాజకీయ నాయకుడిగా కమల్ కొంత గందరగోళంలో పడ్డారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ద్రావిడ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండకపోతే తమిళనాడులో రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని తేల్చిచెప్తున్నారు. అదే సమయంలో సినిమాలు, రాజకీయాల మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదని కూడా హెచ్చరిస్తున్నారు. పాలిటిక్స్‌ను పార్ట్ టైమ్ హాబీగా తీసుకుంటే తమిళ ఓటర్లు ఆదరించరని అంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూ.. సీరియస్ పొలిటిషియన్ అని చెప్తే నమ్మేందుకు ప్రస్తుత ఓటర్లు సిద్ధంగా లేరని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా కమల్ హాసన్ ముందున్నవి రెండే ఆప్షన్లు తమిళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకటి పార్టీకి ప్యాకప్ చెప్పడం, రెండు పొత్తు కుదుర్చుకొని పార్లమెంట్ సభ్యుడిగా అడుగుపెట్టడం. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే పొత్తుకు సిద్ధమనే సంకేతాలు కమల్ నుంచి కనిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ఈరోడ్ ఉపఎన్నికలో డీఎంకే అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అంతే కాదు విక్రమ్ సినిమా విజయోత్సవాల్లో డీఎంకే అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. అన్నట్టు తమిళనాడులో విక్రమ్ సినిమా హక్కులను ఉదయనిధి స్టాలిన్ కొనుగోలు చేశారు. మరి ఈ పరిణామాలు కమల్‌కు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే వైపు టర్న్ తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. దళపతి విజయ్ రానిస్తాడా? సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశ చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో తన చిత్రాల్లో రాజకీయంగా చర్చకు తావిచ్చే డైలాగులతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇది వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి. అలాగే విజయ్ ఇటీవల కాలంగా వేస్తున్న అడుగులు 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పయనం సాగిస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. అభిమానులతో జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలతో విజయ్ అప్పుడప్పుడూ బీజీగానే ఉన్నారు. అలాగే, ఒకే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్నారు. ఇకపోతే ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే లియో షూటింగ్ పనులు జరుగుతున్నాయి. మరోకటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఇవి పూర్తి అయ్యేందుకే మరో రెండేళ్లు సమయం పడుతుంది. ఈ లోపు ఎన్నికలు మొదలవుతాయి. దీంతో తమిళ రాజకీయాల్లో ఆయన ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కానీ విజయ్ పార్టీని ప్రారంభిస్తే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకే లాభంగా మారొచ్చని చర్చ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అధికార పార్టీకే ఎక్కువ లాభం చేకూరుతుందని పొలిటికల్ టాక్. రాజకీయాల్లో సినిమా గ్లామర్ కష్టమేనా? తమిళనాడు సినీ రాజకీయాల చరిత్ర చూస్తే.. పాత తరం వారు మాత్రమే రాజకీయాల్లో రానించారని తెలుస్తోంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత మాత్రమే అక్కడి పొలిటికల్ డ్రామాలో సూపర్‌హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన విజయ్ కాంత్, శరత్ కుమార్, కుష్బూ, రజనీకాంత్, కమల్ హాసన్ వీరిలో ఎవరూ రాజకీయాల్లో మెప్పించలేదనే చెప్పవచ్చు. మరి తాజాగా పొలిటికల్ గేమ్‌లో అడుగుపెట్టాలనుకుంటన్న విజయ్ ఏ మేరకు రానిస్తాడో తెలియాలంటే 2026 ఎన్నికల వరకు ఆగాల్సిందే. -
ఆ వైభవం తిరిగొస్తుందా?
గత అక్టోబర్‌లో యాభై ఏళ్ళు నిండినప్పుడు అందరూ ఆగిచూసిన దక్షిణాది ప్రాంతీయ పార్టీ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకె)కు మంచి రోజులు రానున్నాయా? అప్పట్లో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకె)తో సరిపడక హీరో ఎమ్జీఆర్ బయటకొచ్చి స్థాపించిన ఈ పార్టీపై పట్టు కోసం కోర్టులో పోరు కొలిక్కి వచ్చినట్టేనా? పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్నీ, తన ప్రత్యర్థి – మాజీ సీఎం ఈడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్నీ సవాలు చేస్తూ మాజీ సమన్వయకర్త ఓ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్ట్ మంగళవారం తోసిపుచ్చింది. కోర్టులో ఓపీఎస్‌కు ఎదురుదెబ్బ ఇది వరుసగా మూడోసారి. తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉన్నా, ఆయన రాజకీయ పునరాగమనానికి దారులు మూసుకుపోతున్నట్టే అనిపిస్తోంది. కేడర్‌పై విస్తరించిన పట్టు, కీలక స్థానాల్లో నమ్మినబంట్ల నియామకం, సమర్థ పరిపాల కుడిగా సాధించిన పేరు, తాజా కోర్టు తీర్పుతో... పార్టీ పగ్గాలు ఈపీఎస్ చేతికి దాదాపు వచ్చినట్టే. ఇది పార్టీ పునర్వైభవానికి దోహదమవుతుందా అన్నదే ఇక మిగిలిన ప్రశ్న. అధినేత్రి జయలలిత మరణానంతరం క్రమంగా కష్టాల్లో పడ్డ అన్నాడీఎంకె గత రెండేళ్ళలో తేవర్లు, గౌండర్లు, వగైరా కులాల కుంపట్లతో ఒకటికి నాలుగు (ఈపీఎస్, ఓపీఎస్, పదవీచ్యుత ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె మేనల్లుడు – ఏఎంఎంకె అధినేత టీటీవీ దినకరన్) వర్గాలైంది. సాంప్రదాయికంగా అన్నాడీఎంకెకు పట్టున్న రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో నిరుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకె పాగా వేసింది. మహిళలు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ క్రమంగా చెదిరిపోతోంది. ఈపీఎస్, ఓపీఎస్ శిబిరాల మధ్య పోరుతో పార్టీ దశ, దిశ కోల్పోయి బలహీనపడ్డ సమయంలో కోర్ట్ తీర్పు అయాచిత వరమే. పేరుకు ప్రధాన ప్రతిపక్షమైనా వర్గ విభేదాలు, పార్టీకి సారథి ఎవరో తెలియని అయోమయం, ఎన్నికల చిహ్నం రెండాకులపై పోరాటం సాగుతున్న వేళ ఈ తీర్పు పార్టీ ప్రస్థానానికి దిశానిర్దేశమే. కోర్టు ఆదేశాలు ఈపీఎస్ వర్గానికి నైతికంగా పెద్ద అండ. నిజానికి, దివంగత జయలలితనే పార్టీ శాశ్వత అధినేత్రిగా ప్రకటించాలన్నది ఓపీఎస్ వర్గం దీర్ఘకాలిక డిమాండ్. ఇప్పుడీ తీర్పుతో వారి డిమాండ్‌కు గండిపడింది. ఈపీఎస్ మద్దతుదారులు తమ నేతను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని, పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్ సానుకూలంగా ఇచ్చిన తీర్పూ వారికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పార్టీ జనరల్ కౌన్సిల్లో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యుల మద్దతు ఈపీఎస్‌కే ఉంది గనక ఈపీఎస్ యథేచ్ఛగా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. సదరు సమావేశాల్లో పార్టీలో ఓపీఎస్ లాంటి ప్రత్యర్థుల్ని ఇంటికి సాగనంపుతూ తీర్మానాలు చేసే వీలు చిక్కుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ రాజ్యాంగాన్నీ సవరించుకోవచ్చు. ఇవన్నీ ఈపీఎస్‌కు కలిసొచ్చే అంశాలు. ఇల్లలకగానే పండగ కాదనట్టు ఈపీఎస్‌కు అనేక సవాళ్ళు ముందున్నాయి. దాదాపు 1.5 కోట్ల మంది కార్యకర్తలున్న పార్టీని ఒంటరి దళపతిగా ఆయన ముందుకు నడపాలి. పార్టీకి మునుపు సారథ్యం వహించిన ఎమ్జీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలకున్న ఇమేజ్, ప్రాచుర్యం ఈపీఎస్‌కు లేవు. వారిలా జనాకర్షణ, మాటే శాసనంగా పార్టీని నడిపే పట్టు ఆయన నుంచి ఆశించలేం. సొంత గూటి సంగతి పక్కన పెడితే, ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకెతో ఢీ అంటే ఢీ అనాలంటే ముందుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జనంలో పార్టీపై నమ్మకం పెంపొందించాలి. మరోపక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో విజయాలతో డీఎంకెను ముందుకు నడిపిన ఘనత స్టాలిన్‌ది. బలమైన ఈ ప్రత్యర్థితో తలపడడం ఈపీఎస్‌కు ఈజీ కాదు. తమిళ రాజకీయాలెప్పుడూ డీఎంకె, అన్నాడీఎంకెల మధ్య... కరుణానిధి, జయలలితల మధ్య ఊగడం రివాజు. ఆ రాజకీయ దృశ్యం ఇప్పుడు గణనీయంగా మారింది. చిరకాలంగా తమిళ రాజకీయాలకు దిక్సూచైన ద్రావిడ సిద్ధాంతం క్రమంగా కుంచించుకుపోతోంది. ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను (గవర్నర్ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై) 2021లో బరిలోకి దింపి, డీఎంకె వ్యతిరేక, హిందూత్వ జాతీయవాద వైఖరితో బీజేపీ కాలు దువ్వుతోంది. అలాగే, జయ మరణానంతరం అన్నాడీఎంకెకు పెద్దన్నగా వ్యవహరించిన బీజేపీ... ఆ పార్టీ బలహీనతల్ని వాటంగా చేసుకొని, జయ వదిలివెళ్ళిన స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా తాను కూర్చోవాలని శతధా ప్రయత్నిస్తోంది. పక్కనే పొంచివున్న ఈ ముప్పు పట్ల ఈపీఎస్ జాగరూకత వహించి, సమర్థంగా ఎదుర్కోవాలి. ఒక్కమాటలో– 39 పార్లమెంటరీ స్థానాలున్న తమిళనాట రానున్న 2024 లోక్‌సభ ఎన్నికలు ఈపీఎస్‌కు తొలి పెద్ద పరీక్ష. దానిలో పార్టీని బలంగా నిలబెట్టి, తర్వాత మరో రెండేళ్ళకు వచ్చే 234 స్థానాల శాసనసభా సమరంలో అధికారం చేజిక్కించుకునేలా పోరాడాలి. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె కూటమి 159 స్థానాలు సాధిస్తే, 75 సీట్లకే పరిమితమైన అన్నాడీఎంకె కూటమి ఆ లెక్కను తిరగరాయాలి. అదే జరిగితే అధినేతగా ఈపీఎస్‌కు తిరుగుండదు. లేదంటే, అన్నాడీఎంకెలో మరోసారి అసమ్మతి స్వరాలు పైకొస్తాయి. రిటైరయ్యానని ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళను మళ్ళీ తెర పైకి తేవాలనే మాటలు వినిపిస్తాయి. అందుకే, రాగల మూడేళ్ళ కాలం ఈపీఎస్‌కు పరీక్షా సమయం. మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఆయనకైనా, అన్నాడీఎంకెకైనా భవిష్యత్తు! -
జయలలితకు సరైన చికిత్స అందలేదు.. ఆర్ముగ స్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు సరైన చికిత్స అందలేదని రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత మృతి కేసును ఆర్ముగస్వామి కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఆయన ఇటీవల సమర్పించిన విషయం తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం తిరుప్పూర్‌లోని ఓ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవానికి హాజరైన ఆయన్ని మీడియా ప్రతినిధులు కదిలించారు. జయలలిత మృతి కేసు విచారణ గురించి ప్రశ్నలు సంధించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ, ఆమెకు సరైన చికిత్స అందలేదనే విషయం తన విచారణలో స్పష్టమైందన్నారు. హృదయ సంబంధిత సమస్య తలెత్తిన నేపథ్యంలో అందుకు సంబంధించిన చికిత్సను ఆమెకు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు తేలిందన్నారు. యాంజీయో చేయాల్సి ఉందని, అయితేఆ దిశగా కనీస ప్రయత్నాలు జరగక పోవడం శోచనీయమని పేర్కొన్నారు. తాను న్యాయ శాస్త్రాన్ని చదివానని, అనేక కేసుల్లో ఎందరో సూచనలు, సలహాలు గతంలో తీసుకుని ఉన్నానని తెలిపారు. ఇక వైద్య రంగం మీద కూడా కాస్త అనుభవం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
జయ, నేను స్నేహానికి ప్రతిరూపాలం!: శశికళ
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తాలూకు అనుమానాల నివృత్తి కోసం ఆమె నెచ్చెలి శశికళపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశముంది. మాజీ ఆరోగ్య మంత్రి సి.విజయభాస్కర్, శశికళ బంధువు, వైద్యుడు కేఎస్ శివకుమార్, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌లపై కూడా దర్యాప్తు చేయాలని జస్టిస్(రిటైర్డ్) ఎ.ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ ప్రభుత్వానికి ఇంతకు ముందే సమర్పించిన ఈ నివేదికను.. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ద్వారా బహిర్గతం చేసింది డీఎంకే ప్రభుత్వం. అయితే.. దర్యాప్తు కమిషన్ తమ నివేదికలో పొందుపర్చిన ఆరోపణలను వీకే శశికళ తోసిపుచ్చారు. జయలలితకు యాంజియోగ్రామ్ అవసరం ఎప్పుడూ తలెత్తలేదని, చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి తాను ఎలాంటి అడ్డుపడలేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న శశికళ.. ‘‘జయ, నేను స్నేహానికి ప్రతీరూపాలం. మమ్మల్ని విడదీయడానికి చేసిన కుట్ర వాస్తవికతను అర్థం చేసుకోవడానికే మేము ఉద్దేశపూర్వకంగా విడిపోయాం. ఆ కుట్ర వెనుక ఉన్న పరిణామాలను అర్థం చేసుకున్నాకే నేను మళ్లీ జయ దగ్గరికి చేరాను’’ అని శశికళ పేర్కొన్నారు. ఇక జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదికపై శశికళ తరఫు న్యాయవాది రాజా సెంథుర పాండియన్ స్పందిస్తూ.. జయలలితకు అందిన చికిత్సతో శశికళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పూర్తిగా డాక్టర్ల సమక్షంలోనే వైద్యం జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. కేంద్రం ప్రభుత్వం ద్వారా వచ్చిన ఎయిమ్స్ వైద్యులు జయలలిత ఆరోగ్యాన్ని చూసుకున్నారు. యాంజియోగ్రామ్ విషయంలోనూ ఆమె ప్రమేయం లేదు అని వెల్లడించారు. జస్టిస్ ఆర్ముగస్వామి సమర్పించిన నివేదికలో.. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామమోహనరావు, ఇద్దరు వైద్యులపైనా విచారణ జరిపించాలని సూచించింది. జయలలితకు చికిత్స జరిగిన అపోలో ఆస్పత్రి చైర్మన్‌ను విచారించాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమని కమిషన్ అభిప్రాయపడింది. ఆరోగ్యంగా ఉన్న జయలలిత హఠాత్తుగా 2016 సెప్టెంబర్ 22న ఎందుకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీనిపై, ఆమెకు చేసిన చికిత్సలపై, మరణంపై నిజానిజాలను నిర్ధారించేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటవడం తెల్సిందే. శశికళతో సత్సంబంధాలు నెరిపిన జయలలిత 2011 నుంచి ఏడాది పాటు ఆమెను తన నివాసం నుంచి గెంటేసిన అంశాన్ని కమిషన్ ప్రత్యేకంగా పేర్కొంది. ‘‘రాజకీయాల్లో కలగజేసుకోనని శశికళ లిఖితపూర్వక హామీ ఇచ్చాకే ఆమెను జయ మళ్లీ చేరదీశారు. జయ హృదయంలో సమస్య ఉందని, ఆమెకు శస్త్రచికిత్స అత్యావశ్యకమని అమెరికాకు చెందిన కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ శమీన్ శర్మ జయను ఆస్పత్రిలో 2016 నవంబర్ 25న హెచ్చరించారు. కానీ, అంత ఇబ్బందేమీ లేదని బ్రిటన్‌కు చెందిన మరో డాక్టర్ వారించారు. ఆమెకు యాంజియోగ్రఫీ కూడా చేయకుండా ‘ఇంకెవరో’ అడ్డుకున్నారు. ఈ అంశంలో అపోలో ఆస్పత్రి డాక్టర్ హస్తముంది. ఈ మొత్తం వ్యవహారంలో అందరు డాక్టర్లతో నేరుగా సంప్రదింపులు జరిపిన ఒకే ఒక వ్యక్తి శశికళ’ అని నివేదిక బహిర్గతంచేసింది. ఆగస్ట్ 27న ప్యానెల్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం విదితమే. ఇదీ చదవండి: ఉగ్ర స్థావరాలను పెకిలించాల్సిందే! -
జయలలిత మృతి కేసులో కీలక ట్విస్ట్
-
భర్తతో గొడవ.. ఆస్పత్రిలో చేరిన జయలలిత మేనకోడలు దీప
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప ఆస్పత్రిలో చేరారు. భర్త మాధవన్‌తో గొడవ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఇంటికే ఆమె పరిమితం అయ్యారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ కావడంతో చర్చ బయలుదేరింది. భర్త మాధవన్ – దీపల మధ్య ఇప్పటికే పలు మార్లు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో భర్తతో గొడవ కారణంగానే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. అయితే, ఆమె భర్త మాధవన్ దీనిని ఖండించారు. తానే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొనడం గమనార్హం. చదవండి: (అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం) -
Tamil Nadu: జయలలిత మరణించిన ఐదేళ్లకు.. కమిషన్ విచారణ పూర్తి
ఎడతెగని ఊహాగానాలు, నిత్యకృత్యంగా మారిన వాయిదాలు, విమర్శలు, నిట్టూర్పులు వెరసి ఐదేళ్ల తరువాత అమ్మ మరణంపై ఎట్టకేలకూ నివేదిక సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విచారణ కమిషన్ సమగ్ర వివరాలను సమర్పించింది. ఆ నివేదికలో ఏం ఉందోననే ఉత్కంఠ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. జయలలిత మృతి కేసులో ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని గతంలోనే సీఎం స్టాలిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జె.జయలలిత మృతి కేసులో విచారణ ముగిసింది. వాయిదాల పర్వంతో ఐదేళ్ల పాటూ సాగిన విచారణలో వెలుగు చూసిన అంశాలతో ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదిక సిద్ధం చేసింది. దీనిని శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి సమర్పించారు. 600 పేజీలతో ఈ నివేదిక రూపొందింది. నేపథ్యం ఇదీ.. 2016 డిసెంబర్ 5న అప్పటి సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్ 24న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్‌ను ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీ నుంచి∙విచారణను ఆర్ముగ స్వామి కమిషన్ ప్రారంభించింది. ఐదేళ్ల పాటుగా సాగిన విచారణకు అనేక అడ్డంకులు తప్పలేదు. అపోలో రూపంలో.. రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణలో తమ వైద్యులు తెలియజేస్తున్న అంశాలు, వివరాలు బయటకు రావడం, అవన్నీ కొత్త వాదనలకు దారి తీయడంతో అపోలో యాజమాన్యం కోర్టు తలుపు తట్టింది. తమను ప్రత్యేకంగా విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అపోలో యాజమాన్యం సవాలు చేసింది. ఈ పరిణామాలతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించాల్సి వచ్చింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగియడం, ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులు రంగంలోకి దిగడంతో మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా ఎయిమ్స్ వైద్య బృందం సహకారంతో ఆర్ముగ స్వామి కమిషన్ వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకుంది. విచారణను వేగవంతం చేసింది. తొలి విచారణ నాటి నుంచి చివరి వరకు ఈ కమిషన్ పదవీ కాలాన్ని 14 సార్లు పొడిగించాల్సిన పరిస్థితి పాలకులకు ఏర్పడింది. ఈ కేసులో 159 మందిని విచారించారు. 8 మంది వద్ద లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ కేసులో తొలి విచారణ డాక్టర్ శరవణన్‌తో మొదలు కాగా, చివరగా అన్నాడీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో ముగించారు. చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు! నివేదికలో మిస్టరీ... విచారణను ముగించిన ఆర్ముగ స్వామి కమిషన్ తన నివేదికను శనివారం ఉదయం సీఎం ఎంకే స్టాలిన్‌కు సమర్పించింది. సచివాలయంలో ఈ నివేదికను స్వయంగా స్టాలిన్‌కు ఆర్ముగ స్వామి అందజేశారు. 608 పేజీలతో నివేదికను సిద్ధం చేసినా, 600 పేజీలలో మరణం కేసు విచారణ సమగ్ర వివరాలను పొందుపరిచారు. తొలుత 550 పేజీల్లో వివరాలను ముగించేందుకు నిర్ణయించినా, ఎయిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాలతో అదనంగా మరో 50 పేజీలు చేర్చారు. తమిళం, ఆంగ్ల భాషల్లో రెండు రకాల నివేదికను సమర్పించారు. ఇందులో జయలలితను పోయెస్ గార్డెన్ నుంచి అపోలో ఆస్పత్రికి తరలించడం, అక్కడ అందించిన వైద్య చికిత్సల వివరాలను పేర్కొన్నారు. అపోలో వైద్యుల చికిత్స సరైన మార్గంలోనే జరిగినట్లుగా పొందు పరిచినట్లు భావిస్తున్నారు. అలాగే, అదనంగా మరో 200 పేజీల నివేదికలో ముఖ్యాంశాలను సీఎంకు సమర్పించారు. ప్రధాన నివేదికలోని కొన్ని కీలక వివరాలను ముఖ్యాంశాలుగా ఇందులో పేర్కొని ఉండటం గమనార్హం. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అలాగే, ఈనెల 29వ తేదీన మంత్రి వర్గం భేటీ కావాలని నిర్ణయించారు. అందులో ప్రత్యేక అంశంగా ఈ నివేదిక గురించి చర్చించి మిస్టరీని నిగ్గు తేల్చబోతున్నారు. ఆపై తదుపరి చర్యలకు సిద్ధం కాబోతున్నారు. కాగా జయలలిత మరణం వెనుక ఎవరైనా ఉండివుంటే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే స్టాలిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయో అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే శ్రేణులతో పాటూ రాష్ట్ర ప్రజల్లోనూ నెలకొంది. శశికళ లిఖిత పూర్వకంగా.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ స్వయంగా కాకుండా లిఖిత పూర్వకంగా ఈ కమిషన్‌కు వివరాలను సమర్పించారు. ఆమె తరపున న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ మాత్రం విచారణకు హాజరయ్యారు. అలాగే, చిన్నమ్మ వదిన ఇలవరసి మాత్రం స్వయంగా విచారణకు వచ్చారు. నివేదిక సమర్పించిన అనంతరం మీడియాతో ఆర్ముగ స్వామి మాట్లాడుతూ, శశికళ నేరుగా విచారణకు రాలేదని, లఖిత పూర్వకంగా వివరణ ఇచ్చినట్టు వెల్లడించారు. పోయెస్ గార్డెన్ ఇంట్లో నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఎలాంటి అనుమానాలు లేవు అని పేర్కొంటూ, పోయెస్ గార్డెన్లో విచారణ జరపలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విచారణలో ఎలాంటి జాప్యం జరగలేదని, తన విచారణలో వెలుగు చూసిన అంశాలు, సాక్షాలు, ఆధారాలు, రికార్డులు అన్నీ సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేశానని తెలిపారు. అన్ని వివరాలను ఓ నివేదిక రూపంలో, ముఖ్యమైన అంశాలను మరో నివేదిక రూపంలో తెలియజేసినట్లు వివరించారు. ఎయిమ్స్ వైద్యుల సహకారం, రెండు ప్రభుత్వాల సహకారంతో (గత అన్నాడీఎంకే, ప్రస్తుత డీఎంకే) ఈ కేసు విచారణను ముగించినట్టు చెప్పారు. తన కమిషన్ విచారణకు అధికంగా నిధులు వెచ్చించినట్టు కొందరు పేర్కొనడం శోచనీయమన్నారు. ఇది వరకు ఎన్నో కమిషన్లు మరెన్నో అంశాలపై విచారణలు చేశాయని, అప్పుడు రాని నిధుల ప్రస్తావన ఇప్పుడు ఎందుకోచ్చినట్లు? అని ఓ ప్రశ్నకు సమాధానంగా అభిప్రాయపడ్డారు. -
రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో..
మౌనం పేసియదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన త్రిష ఆ తర్వాత తమిళం, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో అగ్ర కథానాయికగా రాణిస్తోంది. 39 ఏళ్ల వయసులోనూ కథానాయకిగా నటిస్తున్న త్రిష సినీ పయనం రెండు దశాబ్దాలు. జయాపజయాలకు అతీతంగా ఈమెకు అవకాశాలు వరిస్తునే ఉన్నాయి. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వం చిత్రంలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రపొందుతున్న ఈ చిత్ర తొలిభాగం సెప్టెంబర్ 30వ తేదీ తెరపై రావడానికి ముస్తాబవుతోంది. కాగా త్వరలో విజయ్‌కు జంటగా నటించే భారీ చిత్ర అవకాశం ఈమెను వరించింది. అయితే ఈ అయితే ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి పలు సంచలన విషయాలు వెలుగు చూసినా ఆమె ఇప్పటికీ సింగిలే. అసలు విషయం ఏమిటంటే త్రిష ప్రస్తుత రాజకీయాలకు మొగ్గుచూపుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత మాదిరి రాణించాలని ఈమె కలలు కంటున్నట్లు సమాచారం. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయపరంగా ఎదగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భావాల వెనుక నటుడు విజయ్ ఉన్నట్లు, ఆయనే త్రిషను రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య మంచి ప్రెండ్షిఫ్ ఉంది. ఇప్పటికే నాలుగుచిత్రాల్లో కలిసి నటించారు. తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. అదే విధంగా నటుడు విజయ్‌కి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే త్రిష ఎంజీఆర్, జయలలితల మాదిరి రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నారని భావించాల్సి వుంటుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? అవాస్తవం ఎంత? అసలు త్రిష రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందా? ఈ ప్రశ్నలకు భవిష్యత్తే సమాధానం చెప్పాలి. -
సంచలన కేసు.. శశికళను ప్రశ్నించిన పోలీసులు
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను తమిళనాట సంచలనం సృష్టించిన కొడనాడు కేసులో పోలీసులు ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం గురువారం టీ నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లింది. సుమారు గంటకు పైగా ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2017లో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ బంగ్లా వద్ద దొపిడీ, ఆపై వరుస మరణాల ఉదంతాలు కలకలం రేపాయి. ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ఎస్టేట్‌లో ఉన్న పలటియల్ బంగ్లాలోకి ప్రవేశించిన దుండగలు.. ఓ వాచ్, ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. ఈ దొపిడీ కేసుగానే భావించినా.. ఆ తర్వాత చోటు చేసుకున్న నాలుగు మరణాలు.. పలు అనుమానాలకు తావిచ్చాయి. ఈ దోపిడీలో కీలక అనుమానితుడిగా భావించిన జయలలిత మాజీ డ్రైవర్ కనగరాజ్ ఎడపాడి వద్ద ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అది మాజీ సీఎం పళనిస్వామి సొంతవూరు. అదే రోజు రెండో నిందితుడు సయన్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తూ అతను బతికినా.. అతని భార్య, కూతురు చనిపోయారు. ఆ తర్వాత ఎస్టేట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణాలకు.. జయలలిత మరణానికి ముడిపెడుతూ రాజకీయంగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే సెక్యూరిటీ గార్డు హత్య జరిగిన టైంలో.. శశికళ అవినీతి కేసులో బెంగళూరు జైల్లో ఉన్నారు. అయినప్పటికీ మిగతా హత్యలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక టీంతో కొడనాడు మిస్టరీ కేసుల్ని దర్యాప్తు చేయిస్తామని ఎన్నికల హామీలో స్టాలిన్ చెప్పారు. అయితే ఇది తనను ఇరికించే ప్రయత్నమని పళనిస్వామి ఆరోపిస్తుండగా.. కోర్టు అనుమతులతోనే తాము ముందుకెళ్తున్నామని, ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జయలలిత అంతరంగికురాలు అయిన శశికళకు ఈ ఎస్టేట్‌లో భాగం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: శశికళకు చెన్నై కోర్టులో ఎదురు దెబ్బ -
‘అమ్మకు ఆ సలహా ఇచ్చింది నేనే.. కానీ’
సాక్షి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో ఉన్న జయలలితను విదేశాలకు తీసుకెళ్లి వైద్యం అందించాలన్న సలహాను తొలుత ఇచ్చింది తానేనని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. దివంగత సీఎం జయలలిత మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ఆర్ముగ స్వామి కమిషన్ ముందు సోమవారం ఆయన హాజరయ్యారు. విచారణ వేగవంతం జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. నాలుగున్నరేళ్లుగా ఈ విచారణకు డుమ్మా కొడుతూ వచ్చిన పన్నీరు సెల్వం ఎట్టకేలకు సోమవారం జరిగిన విచారణకు వచ్చారు. కాగా మంగళవారం కూడా రావాలని కమిషన్ వర్గాలు ఆయన్ని ఆదేశించాయి. అలాగే, జయలలిత నెచ్చెలి శశికళతో పాటుగా సుదీర్ఘ కాలం పోయేస్ గార్డెన్లో ఉన్న ఆమె వదినమ్మ ఇలవరసి సైతం విచారణకు వచ్చారు. (చదవండి: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోండి.. నగదు రివార్డు పొందండి: స్టాలిన్ ) సీసీ కెమెరాల్ని తొలగించమని ఆదేశించ లేదు పన్నీరు సెల్వం కమిషన్ ముందు ఉంచిన వాదనలు, వాంగ్ములం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అపోలో ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు తొలగించాలని తాను ఆదేశించ లేదని ఆయన స్పష్టం చేశారు. జయలలిత మధుమేహంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునని, అయితే, ఆమెకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల గురించి తనకు తెలియదని వెల్లడించారు. దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్‌ను ఏవిధంగా విదేశాలకు తీసుకెళ్లి వైద్య చికిత్స అందించడం జరిగిందో, అదే తరహాలో అమ్మను కూడా విదేశాలకు తీసుకెళ్దామని అప్పటి ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, మరో మంత్రి తంగమణితో పాటుగా పలువురి దృష్టికి తీసుకెళ్లానని, అయితే, ఎవరూ స్పందించ లేదని పేర్కొన్నారు. అయితే, అపోలో వర్గాలు మాత్రం అమ్మ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంటూ వచ్చారని వివరించారు. అలాగే, విదేశాలకు తరలింపు విషయంలో తాను నిర్లక్ష్యం వహించినట్టుగా మాజీ సీఎస్ రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక, పలు ప్రశ్నలకు తెలియదు అని, తన దృష్టికి రాలేదని, తనతో ఎవరూ చర్చించలేదని, సలహా కూడా తీసుకోలేదని పన్నీరు సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఇలవరసి ఒకటి రెండు సార్లు తాను.. అపోలో ఆస్పత్రిలో అద్దాల నుంచి జయలలితను చూశానని వాంగ్ములం ఇచ్చినట్లు సమాచారం. -
రెండాకుల ముసలం.. వేరుపడిన కమలం
పంతం పట్టు వీడనంది.. బంధం బీటలు వారింది..ఫలితం రెండాకుల కూటమి నుంచి కమలం వేరుపడింది. పురిట్చితలైవి జయలలిత మరణానంతరం జోడీ కట్టిన అన్నాడీఎంకే, బీజేపీ నగరపాలక ఎన్నికల్లో తమదారులు వేరంటూ విడిపోయాయి. అయితే రాష్ట్రంలో వేరుపడినా.. కేంద్రంలో దోస్తీలమే అంటూ తమ కటీఫ్ కహానీకి కొత్తఅర్థం చెప్పాయి. సాక్షి, చెన్నై(తమిళనాడు): అన్నాడీఎంకేతో అనుబంధాన్ని బీజేపీ తాత్కాలికంగా తెంచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆ పార్టీతో కటీఫ్ చెబుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సోమవారం అధికారికంగా ప్రకటించేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ముగించారు. గత కొద్దిరోజులుగా.. తమిళనాడులో ఈనెల 19న నగర పాలక ఎన్నికలు జరగనున్నాయి. యథాప్రకారం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఆ రెండు కూటములు తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై గత కొన్నిరోజుల్లో చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా అన్నాడీఎంకే–బీజేపీ సైతం సీట్ల పంపకంపై ఎడతెగని చర్చలు జరిపాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి అన్నాడీఎంకే–బీజేపీ మధ్య చాపకింది నీరులా పెరిగిపోతున్న అగాధం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బట్టబయలైంది. గతంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న డీఎండీకే, పీఎంకే వైదొలగడంతో తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ మాత్రమే పెద్ద పార్టీలుగా ఉన్నాయి. డీఎంకే కూటమిలో ఎడతెగని పంచాయితీ ఇదిలా ఉండగా, డీఎంకే కూటమిలో సైతం సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. అన్నాడీఎంకే కూటమిలో గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని డీఎంకే కూటమి భావిస్తూ జాబితా విడుదలలో జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ తదితర మిత్రపక్షాలతో చర్చలు జరుపుతూనే అభ్యర్థల ఖరారులో ఆచితూచి అడుగులు వేస్తోంది. జిల్లా స్థాయిలో సిద్ధం చేసిన జాబితాను డీఎంకే కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఈ జాబితాను పరిశీలించి మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా తమ కూటమి నుంచి బీజేపీ దూరం జరగడంతో అన్నాడీఎంకే సోమవారం రెండో, మూడో జాబితాలను విడుదల చేసింది. కాగా సీట్ల సర్దుబాటుపై డీఎంకేతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నియమించిన ఆ పార్టీ అగ్రనేత రమేష్ చెన్నితాల సోమవారం ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న డీఎండీకే 100మంది అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. చర్చలు విఫలం.. కాగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై గతనెల 29వ తేదీన సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమిళనాడులో బలమైన పార్టీగా ఎదిగినందున 30శాతం సీట్లను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబట్టగా అన్నాడీఎంకే ఐదు శాతం మాత్రమే ఇస్తామని చెప్పింది. బీజేపీ క్రమేణా 18 శాతానికి దిగిరాగా అన్నాడీఎంకే మాత్రం 8 శాతానికి మించి ఇచ్చేది లేదని తెలిపింది. తుది ఆఫర్‌గా 11 శాతం అంటూ ద్వితీయశ్రేణి నేతలతో బీజేపీకి అన్నాడీఎంకే ఆదివారం కబురుపంపింది. అయితే 18 శాతం కంటే తగ్గేదిలేదని కమలనాథులు ఖరాఖండీగా బదులిచ్చారు. చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే అన్నాడీఎంకే తమ తొలి జాబితాను ఆదివారం విడుదల చేయడంతో కమలనాథులు ఖంగుతిన్నారు. బీజేపీతో మళ్లీ చర్చలకు తావులేకుండా ఎడపాడి పళనిస్వామి సేలంకు వెళ్లిపోయారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా బీజేపీకి సోమవారం ఎలాంటి పిలుపురాలేదు. తాజా పరిణామంపై అన్నామలై సోమవారం హడావిడిగా చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అగ్రనేతలతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నామలై మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరుకు దిగుతోందని ప్రకటించారు. తాము కోరినన్ని స్థానాలు ఇచ్చేందుకు నిరాకరించిన అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలిపారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో 2024 పార్లమెంటు ఎన్నికల వరకు అన్నాడీఎంకే కొనసాగుతుందని పేర్కొన్నారు. -
జయలలిత నివాసం.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి సంబంధించి మద్రాసు హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తెలిపింది. దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసిన కోర్టు.. మూడు వారాల్లో పోయెస్ గార్డెన్‌ని జయలలిత మేన కోడలి దీపకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..) జయలలిత 2016లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాదే ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. (చదవండి: CJ Sanjib Banerjee: బరువెక్కిన హృదయంతో లేఖ.. నన్ను క్షమించండి..!) తమని జయలలిత వారసులుగా కోర్టు గుర్తించిందని.. అలాంటిది ఆమె నివాసాన్ని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందంటూ దీప, దీపక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ విషయంపై చాలా రోజుల నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తాజాగా పోయెస్ గార్డెన్ ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. చదవండి: ద్విసభ్య కమిషన్.. జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేనా? -
ద్విసభ్య కమిషన్.. జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేనా?
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీ కేసు విచారణకు అవసరమైతే ద్విసభ్య కమిషన్‌కు సిద్ధమేనని సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వాదనలు వినిపించింది. ఈ కేసు మిస్టరి నిగ్గుతేల్చేందుకు గత అన్నాడీఎంకే ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ సాగుతోంది. అదే సమయంలో విచారణ వలయంలో తమను ఈ కమిషన్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. తాజాగా అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు సైతం విచారణను త్వరితగతిన ముగించాలని ఆ కమిషన్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో అపోలో యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నెలన్నర రోజులుగా విచారణ సాగుతోంది. మంగళవారం మళ్లీ పిటిషన్ విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కమిషన్‌కు అండగా బలమైన వాదనలు వినిపించారు. నిపుణుల బృందం కాదు జయలలిత మరణం కేసు మిస్టరీలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకే కమిషన్ ఏర్పాటైందని, ఇది నిపుణుల కమిటీ కాదని కోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాదులు తీసుకెళ్లారు. 50 మంది అపోలో వైద్యులను విచారించామని, వాళ్లు చెప్పిన విషయాలతో నివేదికను ప్రభుత్వానికి కమిటీ సమర్పించబోతున్నట్టు పేర్కొన్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వాదించారు. జయలలిత మరణంలోని వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ఆర్ముగ స్వామి కమిషన్‌ను విస్తరించేందుకు లేదా, ద్విసభ్య కమిషన్‌గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, విచారణ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కొనసాగించాల్సి ఉంటుందని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు సాగాయి. చదవండి: ‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం.. -
ఎయిర్ అంబులెన్స్‌గా జయలలిత హెలికాప్టర్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత హయాంలో 2006లో కొనుగోలు చేసిన ప్రభుత్వ హెలికాప్టర్‌ను ఎయిర్ అంబులెన్స్‌గా మార్చేందుకు డీఎంకే ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పట్లో సీఎం పర్యటనల కోసం దీన్ని సిద్ధం చేశారు. సీఎంతో పాటుగా 14 మంది పయనించేందుకు అవసరమైన వసతులు ఇందులో ఉన్నాయి. అయితే తర్వాత వచ్చిన డీఎంకే సర్కారు ఈ హెలికాప్టర్‌ను పెద్దగా వాడుకోలేదు. 2011లో మళ్లీ అధికారంలోకి వచ్చిన జయలలిత దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. దీంతో అమ్మ హెలికాప్టర్‌గా ఇది ముద్ర పడింది. అమ్మ మరణం తర్వాత సీఎంగా పళనిస్వామి కొన్ని సందర్భాల్లో ఉపయోగించినా, చివరకు 2019 నుంచి ఇది మీనంబాక్కం విమానాశ్రయానికే పరిమితమైంది. ఇక ప్రస్తుత సీఎం స్టాలిన్ హెలికాప్టర్ పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా, రైలు, విమానం లేదా రోడ్డు మార్గంలోనే పయనిస్తున్నారు. చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి) అత్యవసర వైద్య సేవలకు వృథాగా పడి ఉన్న ప్రభుత్వ హెలికాప్టర్ సేవను ఎయిర్ అంబులెన్స్‌గా ఉపయోగించాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు తగ్గ కసరత్తులు ఆరోగ్య శాఖ చేపట్టడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్ 2,449 గంటలు మాత్రమే ప్రయాణించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల ఆవరణల్లో హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్‌కు తగ్గ వసతులు ఉన్న దృష్ట్యా, అత్యవసర వైద్య సేవలకు ఎయిర్ అంబులెన్స్‌గా సర్కారీ హెలికాప్టర్‌ను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. అమ్మ హెలికాప్టర్‌ను రంగంలోకి దిగిన పక్షంలో రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. చదవండి: (అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!) -
రియల్ తలైవికి.. రీల్ తలైవి నివాళి
చెన్నై: రియల్ తలైవికి రీల్ తలైవి నివాళుల ర్పించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందుతున్న తలైవిలో టైటిల్ రోల్‌ను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా శనివారం చెన్నైకు చేరుకున్న నటి కంగనా రనౌత్ స్థానిక మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అనంతరం ఎంజీఆర్, కరుణానిధి సమాధులను దర్శించుకున్నారు. -
జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన కంగనా రనౌత్
సాక్షి, చెన్నై : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తలైవి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ మూవీ సెప్టెంబర్10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కంగనా తమిళనాడు మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఎంజీఆర్ స్మారకం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ..జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రం అందరికీ చేరువ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కంగనా టైటిల్ రోల్ పోషించగా, అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నారు. విద్యార్థి దశ నుంచి హీరోయిన్గా, ఆ తర్వాత రాజకీయ నేతగా ఎదిగే క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎంజీఆర్‌తో పరిచయం..ఇలా పలు ఆసక్తికర అంశాలతో తలైవి సినిమాను రూపొందించారు. ‘తలైవి’ థియేటర్లో విడుదలైన నెల రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్, బ్రిందా ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి : సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో వివాదం..వీడియో వైరల్ సిద్ధార్థ్‌కు నివాళి తెలుపను, ఎందుకంటే: షెహనాజ్ సోదరుడు -
తలైవికి కంగనా నివాళి
-
కొడనాడు కేసు: అసలేం జరిగింది.. వీఐపీల పేర్లు కూడా ఉన్నాయా?!
సాక్షి, చెన్నై: కొడనాడు హత్య, దోపిడీ కేసు విచారణ వేగం పుంజుకుంది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఆమెకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017 ఏప్రిల్‌లో జరిగిన వాచ్‌మన్ హత్య, దోపిడీ ఘటన తెలిసిందే. విచారణ సమయంలో ఈ కేసుతో ముడిపడేలా అనేక అనుమానాస్పద మరణాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. అవన్నీ నీరుగారినా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా సయన్, మనోజ్‌ను గుర్తిస్తూ విచారణకు తెర దించేశారు. ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు కొడనాడు మిస్టరీ రట్టు చేసే దిశగా మళ్లీ దర్యాప్తు చేయడం, అసెంబ్లీలో రగడ వరకు పరిస్థితులు దారి తీశాయి. ఊటీ సెషన్స్ కోర్టులో.. విచారణ ప్రధాన నిందితులైన సయన్, మనోజ్‌ను నీలగిరి ఎస్పీ ఆశీష్ రావత్ నేతృత్వంలోని బృందం ప్రశ్నించడం వంటి పరిణామాలు ఈ కేసులో ఉత్కంఠ రేపాయి. మాజీ సీఎం పళనిస్వామిని టార్గెట్ చేసి ఈ విచారణ సాగుతున్నట్లు అన్నాడీఎంకే తీవ్ర ఆరోపణ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ఊటీ సెషన్స్ కోర్టుకు విచారణ నిమిత్తం నిందితులిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు భద్రత కల్పించాలని సయన్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు పరిగణించింది. ఇద్దరు పోలీసుల్ని నియమించారు. కాగా కోర్టుకు పోలీసులు ఓ నివేదికను అందజేశారు. ఈ కేసు విచారణ ముగియలేదని, పలువురికి సంబంధాలు ఉన్నట్టుగా పేర్కొంటూ, విచారణ మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కోర్టుకు తెలియజేశారు. కాగా అక్టోబరు 1వ తేదీకి న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. పోలీసులిచ్చిన నివేదికలో పలువురు వీఐపీల పేర్లు సైతం ఉన్నట్లు సమాచారం. దీంతో వీరందర్నీ విచారణ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉ న్నాయి. అలాగే, కొడనాడు ఎస్టేట్ మేనేజర్ నటరాజన్‌తో పాటుగా మరో ఇద్దరు విచారణకు హాజరుకావాలని కోర్టు గత వాయిదాలో సమన్లు జారీ చేసింది.అయితే, ఆ ముగ్గురు ప్రస్తుతం విచారణకు డుమ్మా కొట్టారు. కాగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించేందుకు గాను.. డీఎస్పీ చంద్రశేఖర్, ఏడీఎస్పీ కృష్ణమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: MK Stalin: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం! -
కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ.. కీలక విషయాలు వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే ప్రభుత్వం ప్రజాపాలనను విస్మరించి.. ప్రతిపక్షంపై కుట్రలకు పాల్పడుతోందని అన్నాడీఎంకే ఆరోపించింది. ఈమేరకు ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవాలని గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌ను గురువారం చెన్నైలో కలిసి వినతిపత్రం సమర్పించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అప్పుడప్పుడూ నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లో విశ్రాంతి కోసం వెళ్లేవారు. ఆమె మరణించిన తరువాత కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అంశాలకు సంబంధించి సయాన్ ముఠాకు చెందిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. బెయిల్‌పై బయట ఉన్న సయాన్‌ను పోలీసులు మంగళవారం ప్రశ్నించారు. ఒక ముఖ్యనేత ఆదేశాల మేరకే కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో దాచి ఉంచిన ఆస్తి పత్రాలు ఎత్తుకెళ్లేందుకు వెళ్లినప్పుడు.. సెక్యూరిటీ గార్డును హత్యచేసినట్లు ఆ కేసులో ప్రధాన నిందితుడైన సయాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆస్తి పత్రాలను ఎడపాడికి అందజేసినట్లు కూడా అతను వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ అంశాన్ని బుధవా రం నాటి అసెంబ్లీ సమావేశంలో ఎడపాడి లేవనెత్తగా స్పీకర్ అడ్డుకోవడంతో అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి, ఉప నేత ఓ పన్నీర్‌సెల్వం సహా పలువురు అన్నాడీఎంకే సీనియర్ నేతలు చెన్నైలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌ను గురువారం కలుసుకున్నారు. మా నేతలపై తప్పుడు కేసులు– ఎడపాడి అన్నాడీఎంకే నేతలపై డీఎంకే ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి, కుట్రపూరిత చర్యలకు పాల్పడు తోందని గవర్నర్‌ను కలిసిన అనంతరం ఎడపాడి పళనిస్వామి మీడియా వద్ద ఆరోపించారు. తమ పారీ్టకి చెందిన మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, ఎస్పీ వేలుమణి ఇళ్లలో డీఎంకే ప్రభుత్వం తనిఖీలు చేయించి అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం ఇంకా కొనసాగుతోందని అన్నారు. కొడనాడు కేసు కోర్టులో విచారణ తుదిదశకు చేరుకోగా, ప్రభుత్వం కొత్తగా విచారణ ప్రారంభించిందని విమర్శించారు. ఈ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొన్నామని సీఎం స్టాలిన్ సమర్థించుకుంటున్నారు. కాగా నిందితులంతా కేరళకు చెందిన పాత నేరస్తులని, వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎడపాడి దుయ్యబట్టారు. ఈ కేసులో తనతోపాటూ కొందరు అన్నాడీఎంకే నేతలను సైతం ఇరికించే ప్రయత్నాలు సాగుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. డీఎంకే ప్రభుత్వ కక్షసాధింపు ధోరణిని అడ్డుకోవాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం సమరి్పంచామని ఎడపాడి వెల్లడించారు. -
అమ్మపార్టీలో.. చిన్నమ్మ భయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వం చేజారిపోయింది. ఇప్పుడు పార్టీ కూడా పరాధీనమైతే.. ఇక రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని అన్నాడీఎంకే అగ్రనాయకత్వం ఆందోళన చెందుతోంది. సంస్థాగత ఎన్నికల నిర్వహణకు మరో ఆరునెలలు గడువు కోరుతూ అన్నాడీఎంకే అధిష్టానం ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి ఉత్తరం రాసినట్లు తెలుస్తోంది. పార్టీ చిన్నమ్మ చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే.. ఆరునెలల గడువు కోరడం వెనుక అంతరార్థంగా చెబుతున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళ మరలా తెరపైకి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించలేక పోవడాన్ని అవకాశంగా తీసుకుంటున్న అన్నాడీఎంకేపై వల విసరడం ప్రారంభించారు. పారీ్టలోని తన అనుచరులతో సెల్‌ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ ప్రగతి కోసం తాను ఎంతో శ్రమించాను, ఈరోజు పార్టీ పతనం దిశగా పయనిస్తుంటూ చూస్తూ ఊరుకోనని ఇటీవల స్పష్టం చేశారు. సీఈసీ వద్ద గుర్తింపు పొందిన పారీ్టలన్నీ ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలనే నియమావళి ఉంది. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కొత్త సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ, జిల్లాస్థాయి నుంచి పార్టీ ప్రధాన కార్యాలయ ఆఫీస్ బేరర్స్ ఎంపికను 2014 ఆగస్టు నుంచి 2015 ఏప్రిల్ వరకు నిర్వహించారు. 2014 ఆగష్టు 29వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏడోసారి ఎన్నికైనారు. మిగతా కార్యవర్గం కూడా సంప్రదాయం ప్రకారం ఎన్నుకున్నారు. అయితే ఆ తరువాత అనేక కారణాల వల్ల సంస్థాగత ఎన్నికలు జరగలేదు. 2017 సెపె్టంబరులో జనరల్‌బాడీ సమావేశాన్ని మాత్రమే నిర్వహించి ప్రధాన కార్యదర్శికి బదులుగా సమన్వయకర్త (పన్నీర్‌సెల్వం) ఉప సమన్వయకర్త (ఎడపాడి పళనిస్వామి)ను ఎన్నుకున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ వ్యవహారాల్లో సవరణలు తీసుకురాగా జనరల్‌బాడీ సమావేశం ఆమోదించింది. త్వరలో రాష్ట్ర, జిల్లా, గ్రామస్థాయి పార్టీ నిర్వాహకుల ఎన్నికలు నిర్వహిస్తామని అధిష్టానం ఇటీవల ప్రకటించింది. ఆ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లోగా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉండగా అనేక కారణాల వల్ల అది జరగలేదు. జూలై రెండోవారంలో ఎన్నికలు జరపాల్సిందిగా ఈసీ సూచించగా మరో ఆరునెలలు గడువు ఇవ్వాలని అన్నాడీఎంకే అధిష్టానం కోరినట్లు సమాచారం. ఈ మేరకు పదిరోజుల క్రితం ఈసీకి ఉత్తరం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశాన్ని ఈ ఏడాది జనవరి 9వ తేదీన నిర్వహించారు. ఇక ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ పరాజయం, కరోనా సెకెండ్ వేవ్ వల్ల సంస్థాగత ఎన్నికలు జరపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని కోల్పోవడంతో పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో జయలలిత నెచ్చెలి శశికళ పార్టీని తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శశికళతో నష్టం లేదు: ఎడపాడి అన్నాడీఎంకేలోని 10 మందితోనే కాదు వెయ్యిమంది నేతలతో మాట్లాడినా తమకు ఎలాంటి ఆందో ళన, నష్టం లేదని ఆ పార్టీ ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. సేలం జిల్లా ఓమలూరులో పార్టీ నిర్వాహకులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, శశికళ పా రీ్టలో లేరు, కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేనందున ఆమెకు అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
జయలలిత బయోపిక్స్‌పై కోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపకు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. జయలలిత జీవిత ఇతివృత్తాంత చిత్రాలు, వెబ్ సీరియల్‌కు వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసి పుచ్చింది. దివంగత సీఎం జయలలితకు వారసులు తామే అని ఆమె మేన కోడలు దీప, మేనళ్లుడు దీపక్ సాగిస్తున్న న్యాయపోరాటం గురించి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జయలలిత జీవిత ఇతివృత్తాంతతో క్వీన్ పేరిట వెబ్ సిరీస్, తలైవి, జయ పేరిట చిత్రాలు తెరకెక్కించే పనిలో ప్రముఖ దర్శకులు నిమగ్నమయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ దీప కోర్టును ఆశ్రయించారు. తన మేనత్త జీవిత ఇతివృత్తాంతంతో తెరకెక్కుతున్న వెబ్ సీరిస్, చిత్రాల్లో తమ కుటుంబానికి వ్యతిరేకంగా అంశాలు ఉన్నట్టు, ఈ చిత్రాలు, వెబ్ సీరియల్స్‌పై స్టే విధించాలని కోరారు. తొలుత ఈ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ విచారించింది. అయితే, ఈ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ తోసి పుచ్చడంతో అప్పీలుకు దీప వెళ్లారు. హైకోర్టు బెంచ్ ముందు శుక్రవారం పిటిషన్ విచారణకు వచ్చింది. తలైవి అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఇందులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి అంశాలు లేవని, ఆమె అనుమతి పొందాల్సిన అవసరం లేదని చిత్ర దర్శకుల తరఫున వాదనలు కోర్టుకు చేరాయి. వాదనల అనంతరం దీపకు మళ్లీ చుక్కెదురైంది. ఆమె వాదనను కోర్టు తోసి పుచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను ధ్రువీకరిస్తూ, ఆ చిత్రాలకు లైన్ క్లియర్ చేస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు ఇచ్చారు. చదవండి: 16 గంటలు వర్షంలో కంగనా.. జ్వరంతోనే వాన పాట! ‘రాధేశ్యామ్’లో పూజా హేగ్డే పాత్ర ఇలా ఉంటుందట -
అమ్మ ఆత్మ క్షమించదు: ఎమ్మెల్యే శాపనార్థాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నుంచి తమను సాగనంపడంలో కీలకపాత్ర పోషించారని పరిశ్రమలశాఖ మంత్రి సంపత్‌పై మహిళా ఎమ్మెల్యే సత్య విరుచుకుపడ్డారు. శాపనార్థాలు పెడుతూ, అమ్మ జయలలిత ఆత్మ సంపత్‌ను క్షమించదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్‌లకు మళ్లీ సీటు దక్కలేదన్న విషయం తెలిసిందే. ఇందులో కొందరు అయితే, అన్నాడీఎంకే అధిష్టానాన్ని ఢీకొట్టే రీతిలో రెబల్స్‌గా పోటీ చేయగా, మరి కొందరు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరఫున తమ సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేశారు. ఇంకొందరు అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి పార్టీ అభ్యర్థుల కోసం శ్రమించారు. రెబల్స్‌గా పోటీచేసిన వారిని, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తరఫున పోటీ చేసిన వారిని ఇప్పటికే పార్టీ నుంచి అన్నాడీఎంకే తొలగించింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల అనంతరం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా గెలుపు అవకాశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళని స్వామి సుదీర్ఘంగా సమీక్షల్లో ఉన్నారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు ఈ సమీక్షల్లో హోరెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల మంత్రి ఎంసీ సంపత్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం రాత్రి కడలూరు జిల్లా బన్రూట్టి ఎమ్మెల్యే సత్య, ఆమె భర్త, పార్టీ నేత పన్నీరుసెల్వంతో పాటు ఆరుగుర్ని అన్నాడీఎంకే నుంచి శాశ్వతంగా సాగనంపుతూ ప్రకటన వెలువడింది. అలాగే, మరికొన్ని జిల్లాల నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో ఈరోడ్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉండడం గమనార్హం. ఈరోడ్ జిల్లాల్లో ఇదివరకు సెంగోట్టయన్, కరుప్పన్నన్, తోపు వెంకటాచలం కీలక నేతలుగా ఉండే వారు. వీరి ఆధిపత్యంతో ఈ సారి వెంకటాచలంకు సీటు ఇవ్వలేదు. దీంతో రెబల్‌గా రంగంలోకి దిగిన ఆయన గెలుపు ధీమాతో ఉన్నారు. ఆ జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో తోపు వెంకటాచలం రాజకీయం సాగడంతో అన్నాడీఎంకే అభ్యర్థులు తీవ్ర కలవరంలో ఉన్నారు. దీంతో ఆ జిల్లాలో పరిస్థితిపై మంత్రులు సెంగోట్టయన్, కరుప్పన్నన్‌లకు అధిష్టానం నోటీసులు ఇవ్వడం గమనార్హం. సంపత్‌కు శాపనార్థాలు.. అకారణంగా తమను పార్టీ నుంచి తొలగించడంలో కీలక పాత్ర పోషించారంటూ మంత్రి సంపత్‌కు ఎమెల్యే సత్య, ఆమె భర్త పన్నీరు సెల్వం శాపనర్థాలు పెట్టే పనిలో పడ్డారు. ఆదివారం మీడియాతో ఎమ్మెల్యే సత్య మాట్లాడుతూ తనకు సీటు నిరాకరించడంతో రాజకీయ, ప్రజాసేవ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం జరిగిందన్నారు. ఆ తర్వాత తాను నియోజకవర్గంలోనే లేదని, మనశ్శాంతి కోసం ఆలయ దర్శనాలు, ఆధ్యాత్మిక పర్యటనల్లో నిమగ్నమయ్యానని వివరించారు. భర్త, తాను, మద్దతు నేతలు నియోజకవర్గంలోనే లేనప్పుడు, ఎలా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, ప్రత్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో పనిచేసి ఉంటామని ప్రశ్నించారు. తమను ఎలాగైనా అన్నాడీఎంకే నుంచి సాగనంపాలన్న లక్ష్యంతో సంపత్ కుట్ర చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అమ్మ జయలలిత ఆత్మకూడా క్షమించదంటూ శాపనార్థలు పెట్టే పనిలో పడ్డారు. హోం శాఖను, ఇంటెలిజెన్స్‌ను తన గుప్పెట్లో పెట్టుకున్న సీఎం పళనిస్వామి, వారి ద్వారా విచారించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుంటుందని, తనకు జరిగినట్టుగా అన్యాయం మరెందరికో జరిగిన పక్షంలో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చదవండి: ఫలితాలకు ముందే ఆగిన శ్వాస తమిళనాడు ఎన్నికలు: గెలుపెవరిదో తేల్చేది వాళ్లే! -
16 గంటలు వర్షంలో కంగనా.. జ్వరంతోనే వాన పాట!
‘ఇలా... ఇలా..’ అంటూ పాడుతూ, కంగనా రనౌత్ అలవోకగా డ్యాన్స్ చేశారు. కానీ, ఆ పాట చిత్రీకరణ వెనక పెద్ద కష్టం ఉంది. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’లోని పాట ఇది. జయలలిత పాత్రను కంగనా చేశారు. ఈ చిత్రంలోని ‘ఇలా.. ఇలా..’ పాటను ఇటీవల విడుదల చేశారు. జయలలిత డ్యాన్స్‌ని తలపించేలా ఈ పాటలో కంగనా కనబడుతున్నారు. మొత్తం మూడు రోజులు ఈ పాట చిత్రీకరణకు పట్టింది. గత ఏడాది అక్టోబర్‌లో చిత్రీకరించారు. ఇది వాన పాట. మూడు రోజుల్లో దాదాపు 16 గంటలు ఈ పాట కోసం కంగనా తడవాల్సి వచ్చింది. సరిగ్గా పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు జ్వరం అట. అయినప్పటికీ లెక్క చేయకుండా, షూట్లో పాల్గొన్నారు. విశ్రాంతి తీసుకుని, కోలుకున్నాక చిత్రీకరించవచ్చని చిత్రబృందం అన్నప్పటికీ కంగనా మాత్రం తన కారణంగా షూటింగ్ ఆగకూడదనుకున్నారట. ఆమె కమిట్మెంట్ని చిత్రబృందం అభినందిస్తోంది. ఈ పాట కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వాటర్ ఫాల్ సెట్ వేశారు. డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 23న ‘తలైవి’ విడుదల కానుంది. -
అసెంబ్లీ ఎన్నికలు: చరిత్ర పునరావృతమే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. అది అసాధ్యమని తేలితే కనీసం ప్రత్యర్థి గెలుపు అవకాశాలు దెబ్బతీయాలని అభ్యర్థులు ఆశించడం రాజకీయాల్లో సహజం. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటముల విజయావకాశాలను దెబ్బతీయడం కోసమే అన్నట్లుగా కొన్ని పార్టీలు రంగంలో ఉన్నాయి. ఈ పార్టీలు ఏ కూటమికి కంటకంగా మారాయి, ఏ అభ్యర్థి గెలుపును ఎంత వరకు దెబ్బతీస్తాయని విశ్లేషించుకోక తప్పదు. అప్పుడు కాంగ్రెస్ హవా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (తమిళనాడు)లో 1952, 1957, 1962 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించినా ఆ దూకుడుకు డీఎంకే అడ్డుకట్టవేసింది. 1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్‌ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా తల ఎత్తుకు తిరిగే పరిస్థితినే కోల్పోయేలా చేసిన ఘనత డీఎంకేకు మాత్రమే దక్కుతుంది. 1967 నాటి డీఎంకే చారిత్రాత్మక గెలుపుతో అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి- ఎంజీ రామచంద్రన్ మధ్య విభేదాలు అన్నాదురై మరణం తరువాత 1971లో వచ్చిన ఎన్నికల్లో సైతం డీఎంకే ఘనవిజయం సాధించగా ఆపార్టీ అధ్యక్షులు కరుణానిధి సీఎం పీఠం అధిరోహించారు. కరుణానిధితో అభిప్రాయబేధాలు వచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎంజీ రామచంద్రన్ 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకేను స్థాపించారు. 1977లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఎంజీఆర్ విజయపరంపర 1980, 1984 ఎన్నికల్లో సైతం కొనసాగింది. తన 70 ఏళ్ల వయసులో 1987 డిసెంబర్ 24వ తేదీన ఎంజీఆర్ కన్నుమూసిన తరువాత పార్టీ చీలిపోగా, 1989 ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎంజీఆర్ కన్నుమూసిన తరువాత జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టి కరుణానిధిని గట్టిగా ఢీకొట్టడం ప్రారంభించారు. 1991- 2016 వరకు వారిద్దరే 1991లో జయలలిత, 1996లో కరుణానిధి, 2001లో జయలలిత, 2006లో కరుణానిధి, 2011లో జయలలిత ఒకరు సీఎం అవుతూ వచ్చారు. అయితే 2016లో వచ్చిన ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి గెలుపొంది అనాధిగా వస్తున్న ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. ఎంజీఆర్ జీవించి ఉన్నత వరకు అధికారానికి దూరంగా ఉండక తప్పనిపరిస్థితిని ఎదుర్కొన్న డీఎంకే ఆ తర్వాత మాత్రమే గెలుపు బాటలోకి ప్రయాణించడం ప్రారంభించింది. ఎంజీఆర్‌తో సమానంగా జయలలిత కూడా కరుణకు పోటీగా నిలిచారు. ఇక రాజకీయాల్లో బలశాలులైన జయ, కరుణ ఇద్దరూ కన్నుమూసిన తర్వాత ఆ రెండు పార్టీలు తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. తమిళనాడులో 1952 నుంచి ఇప్పటి వరకు 15 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలన్నీ అనేక ప్రత్యేక ప్రాతిపధికలతో పోటీకి దిగి విజయం సాధించాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మూడో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఎంజీఆర్ మరణం తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి వర్గంగా విడిపోయింది. ఈ సమయంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉండిన జీకే మూపనార్ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. అయినా, ఆనాటి ఎన్నికల్లో డీఎంకేనే విజయం సాధించింది. 1996లో డీఎంకే నుంచి విడిపోయిన వైగో ఎండీఎంకేను స్థాపించి మూడో అతిపెద్ద పార్టీగా మార్చే ప్రయత్నం చేశారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జీకే మూపనార్ తమిళ మానిల కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి డీఎంకేతో కూటమిగా ఏర్పడ్డారు. రజనీకాంత్ పరోక్ష మద్దతుతో ఈ కూటమి అప్పటి ఎన్నికల్లో విజయం సాధించింది. మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో అన్నాడీఎంకే, డీఎంకే తరువాత మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడాలనే లక్ష్యంతో నటుడు విజయకాంత్ డీఎండీకేను స్థాపించి తొలి ఎన్నికల్లో తాను మాత్రమే గెలుపొందారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారు. అయితే ఆ తరువాత అమ్మతో విభేదించగా, 2016 ఎన్నికల్లో విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టి వైగో నాయకత్వంలో ఏర్పడిన ప్రజాసంక్షేమ కూటమి ఘోర ఓటమి చవిచూసింది. ఇలా రాష్ట్ర రాజకీయల చరిత్రలో అన్నాడీఎంకే, డీఎంకే ఢీకొనే ఏ కూటమి మనుగడ సాగించలేదు. అధికారంలో ఆ రెండింటిలో ఒకటే.. ఇదిలా ఉండగా, 1967 నుంచి 2016 వరకు వచ్చిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ ఉంటోంది. తాజా ఎన్నికలోల్ సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే రెండు కూటములకు పోటీగా మరో మూడు కూటములు ఏర్పడ్డాయి. ఐజేకే నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సైతం ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ మరో కూటమి ఏర్పాటు చేసుకున్నారు. కాగా, కమల్ కూటమి ఒంటరిగా ఎదుర్కొంటున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సీమాన్‌కు రెండో అనుభవం. ఈ మూడు కూటములు అన్నాడీఎంకే, డీఎంకే కూటముల ఓట్లను చీల్చడం ద్వారానే గెలుపు బాటలో ప్రయాణిస్తామని విశ్వసిస్తున్నాయి. అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై దినకరన్ గురిపెట్టారు. అన్నాడీఎంకే, డీఎంకేకు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసే ఓటర్లను కమల్, సీమాన్ నమ్ముకున్నారు. కొత్తగా బరిలో ఉన్న కూటముల అభ్యర్థుల గెలుపు సంగతి అటుంచితే ప్రత్యర్థుల ఓట్లను చీల్చి మెజార్టీ లేదా గెలుపు అవకాశాలకు గండికొట్టడం ఖాయమని భావించవచ్చు. చదవండి: సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు -
శ్రీమతి ఎంజీఆర్
మధుబాల మంచి నటి. ‘రోజా’, ‘జెంటిల్‌మేన్’ వంటి సినిమాలు చాలు.. ఆమె ఎంత మంచి నటో చెప్పడానికి. కథానాయికగా మంచి పాత్రలు చేసిన మధు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలాంటి పాత్రలే చేస్తున్నారు. వచ్చే నెల 23న విడుదల కానున్న ‘తలైవి’లో ఆమె ఓ నిజజీవిత పాత్ర చేశారు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కంగనా టైటిల్ రోల్ చేశారు. ఇందులో ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ పాత్రను మధుబాల చేశారు. శుక్రవారం (మార్చి 26) మధుబాల బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్ విడుదలైంది. ఆస్పత్రిలో ఎంజీఆర్ పక్కన కూర్చుని, ఆయన్ను చూస్తున్న జానకీ రామచంద్రన్ లుక్‌కి మంచి స్పందన లభించింది. -
‘అమ్మ’ ఆలయంలో మోదీ, నడ్డా ఫొటోలు!
కొరుక్కుపేట: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకంగా నిర్మించిన అమ్మ ఆలయంలో బీజేపీ నేతల ఫొటోలు దర్శనమిచ్చాయి. మదురై, తిరుమంగలంలోని టి.కునత్తుర్లో అమ్మ పెరవై ఆధ్వర్యంలో నిర్మించిన అమ్మ జయలలిత ఆలయాన్ని జనవరి 30న ముఖ్యమంత్రి ఎడపాడి ప్రారంభించారు. ఈ ఆలయంలో గోడలపై అన్నాడీఎం కే ప్రముఖుల ఫొటోలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మురుగన్ ఫొటోలు దర్శనమివ్వడంతో అందరూ అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అన్నాడీఎంకే, బీజేపీ కూటమితో పోటీ చేస్తోందని అందువల్ల ఏర్పాటు చేసినట్టు పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. చదవండి: ‘అమ్మ’కు వారసులు లేరా? -
రాజకీయాలకు రాంరాం: దీప
సాక్షి, చెన్నై: రాజకీయాల నుంచి తప్పు కుంటున్నట్లు తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మేనకోడలు, ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’వ్యవస్థాపక అధ్యక్షురాలు దీప ప్రకటించారు. జయలలిత కన్నుమూసిన తర్వాత జయ అన్న కుమార్తెగా రాజకీయాలకు, ఆస్తికి తానే వారసురాలి నంటూ దీప గతంలో తెరపైకి వచ్చారు. అన్నా డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ను స్థాపించి రాజకీయ అరం గేట్రం చేశారు. జయ మరణంతో ఖాళీగా మారిన చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమై మధ్యలో విరమించుకున్నారు. పేరవైలో కీలక బాధ్యతలను తన కారు డ్రైవర్‌కు అప్పగించడంతో ఆగ్రహించిన దీప భర్త మాధవన్ ఎంజేడీఎంకే అనే కొత్త పార్టీని స్థాపించారు. దీపను వీడి దూరంగా వేరే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీప పేరవైకి ఆశించి నంతగా ప్రజల నుంచి ఆదరణ దక్కలేదు. ఈ తరుణంలో దీప మాట్లాడుతూ‘రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను. భవిష్యత్‌లో మళ్లీ రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదు’ అన్నారు. -
బర్త్ డే నాడే కన్నీళ్లు పెట్టుకున్న కంగనా
బాలీవుడ్ ఐరన్ లేడీగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్ తన పుట్టిన రోజునే కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఎప్పుడు ఏడవను.. నన్ను ఎవరూ ఏడిపించలేరు అనుకుంటూనే ఏడ్చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా రూపొందించిన ‘తలైవి’ ట్రైలర్ మంగళవారం (మార్చి 23) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కంగనా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యింది. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తలైవి’ విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో కంగనా మాట్లాడుతూ.. నేను ఎప్పుడు ఏడవను. నన్ను ఏడిపించే హక్కు ఎవరికీ ఇవ్వను. నేను చివరిగా ఏడ్చిందెప్పుడో కూడా గుర్తులేదు. కానీ ఈ రోజు నేను ఏడ్చాను. ఇప్పుడు మనసు తేలికగా ఉంది’ అని చెప్పి ప్రసంగం ముగించేసి వెళ్లిపోయింది. అంతకుముందు దర్శకుడు విజయ్ గురించి కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ‘నేను ఒకరికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నా. అతడు నాపై నాకు నమ్మకం కలిగేలా చేశారు. సినిమా సెట్లో ఒక హీరోతో ఉన్నంత చనువుగా ఒక నటితో ఎవరూ ఉండరు. కానీ అతడిని చూసి నటీనటులతో ఎలా వ్యవహరించాలనే విషయం తెలుసుకున్నా’ అని తెలిపింది. కాగా సోమవారమే కంగనా బర్త్ డే గిఫ్ట్ అందుకుంది. జాతీయ సినిమా అవార్డుల్లో కంగనా ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: ఫుల్ ఖుషీలో బాలీవుడ్ ఐరన్ లేడీ చదవండి: దుమ్మురేపిన మహేశ్‌బాబు, నాని “Never in my life have a met a man who has not made be feel apologetic about my talent” - Kangana gets very emotional talking about her director Vijay of Thalaivi. #ThalaiviTrailer pic.twitter.com/i2yJVtaLGK — Sia (@AnytimeGorgeous) March 23, 2021 -
తలైవి వచ్చేది అప్పుడే!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘తలైవి’. కాగా, ఈ సినిమాను ఏఎల్ విజయ్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించారు. యంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. బుధవారం జయలలిత జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న ‘తలైవి’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్నిఇప్పుడు మూడు భాషలలో విడుదల చేయనున్నారు. దీన్ని మొదటగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘తలైవి’ చిత్రానికి హిందీలో ‘జయ’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనిలో జయలలితా రాజకీయ జీవితంలో ఎదురుకున్న సవాళ్ళను చూపేడుతున్నట్లు సినిమావర్గాలు తెలిపాయి. ప్రేక్షకులు, తమ అభిమాన నాయకురాలిని రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి సినిమాతెరపై చూడటానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. -
వెనక్కి తగ్గని శశికళ: ఆమె ఇంటికి సినీ ప్రముఖుల క్యూ
చెన్నె: జైలు శిక్ష అనుభవించి వచ్చిన శశికళ అన్నాడీఎంకే పార్టీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ తనదేనని.. పార్టీ గుర్తుపై ఇప్పటికే కేసు వేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అన్నాడీఎంకే గుర్తు రెండాకులు వినియోగిస్తోంది. తాజాగా బుధవారం జయలలిత జయంతి సందర్భంగా శశికళ తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకుంది. ఈ మేరకు అదే హోదాతో ప్రకటన విడుదల కావడం విశేషం. కాగా తమిళనాడులో బుధవారం జయలలిత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరి అమ్మగా పేరుపొందిన జయలలితను అన్ని పార్టీల నాయకులు స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా జయలలితకు ఘన నివాళులర్పించారు. అయితే పోయెస్ గార్డెన్లో శశికళ తన స్నేహితురాలు జయలలితకు ఘన నివాళులర్పించింది. టీటీవీ దినకరన్‌తో పాటు తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ తనదేనని శశికళ మరోసారి పునరుద్ఘాటించారు. అమ్మ అభిమానులంతా ఏకం కావాలని శశికళ పిలుపునిచ్చారు. త్వరలోనే అందరినీ కలుసుకుంటానని ప్రకటించారు. తమకు ప్రధాన శత్రువు డీఎంకే అని తెలిపారు. ఈ క్రమంలోనే శశికళ నివాసానికి సినీ ప్రముఖులు వరుస కట్టారు. దర్శకుడు భారతీరాజా, నటులు రాధికా శరత్‌కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా శశికళను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వారు శశికళను కలవడం తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. అయితే సమావేశంలో రాజకీయంగా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నా.. దీనిపై వారు స్పష్టత ఇచ్చారు. శశికళ అనారోగ్యానికి గురవడం.. జైలు నుంచి రావడంతో ఆమెను పరామర్శించేందుకే వచ్చామని రాధికా శరత్‌కుమార్ తెలిపారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చినట్లు వివరణ ఇచ్చారు. అయితే రాధికా శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. -
జయలలిత జయంతి: విజయశాంతి భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: ‘‘అమ్మా... మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా... తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి. మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను టార్గెట్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మీరు నా భద్రత కోసం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ... ఇంకా... పురట్చి తలైవియిన్ అన్బు తంగై (విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు).... ప్రచార బీరంగి (ప్రచారంలో ఫిరంగి) అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి. ఎప్పటికీ...’’ అంటూ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఉద్వేగానికి లోనయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత 73వ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. అమ్మగా చెరగని ముద్ర వేసిన తలైవి మైసూరు రాష్ట్రంలో 24 ఫిబ్రవరి 1948లో జయరాం- వేదవల్లి(సంధ్య) దంపతులకు జన్మించిన జయలలిత, చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు. నటిగా శిఖరాగ్రాలకు చేరుకున్న ఆమె, ఎంజీ రామచంద్రన్ ఆహ్వానం మేరకు 1982లో రాజకీయాల్లో ప్రవేశించారు. విద్యావంతురాలిగా, న్యత్యకారిణిగా, గొప్ప వక్తగా తనదైన ముద్ర వేసిన జయలలిత.. ఏఐఏడీఎంకేలో ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, రాజ్యసభలో అడుగుపెట్టారు. ఎంజీఆర్ మరణానంతరం ఎన్నో అవమానాలకు గురైన ఆమె ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ.. ధీటుగా ముందుకు సాగారు. 38 ఏళ్ల వయసులో రాష్ట్ర శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్రకెక్కారు. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పురుషాధిక్య రంగంలో నెగ్గుకువచ్చి ఆరు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా చెరగని ముద్ర వేసుకున్నారు. పురుచ్చి తలైవిగా నీరాజనాలు అందుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు జీవితం అనుభవించిన ఆమె, 2016 డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌తో అనుబంధం తమిళనాడు దివంగత సీఎం జయలలితకు భాగ్యనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. నటీమణిగా వెలుగొందుతున్న సమయంలో తరచుగా ఇక్కడకు వచ్చేవారట. షూటింగ్ నిమిత్తం ఇక్కడే బస చేసేవారట. ఈక్రమంలో శ్రీనగర్ కాలనీలో జయలలిత రెండు ఇళ్లు కొనుగోలు చేశారు. ఇక తెలుగు నటీనటులతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండేదట. -
జయలలిత బాటలో దీదీ: విజయం వరిస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత దేశ రాజకీయాల్లో సెంటిమెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కొందరు ప్రజాబలాన్ని నమ్మితే.. మరికొందరు సెంటిమెంట్‌నే నమ్ముతున్నారు. తొలిసారి విజయానికి దోహదం చేసిన అంశాలను గుర్తుపెట్టుకుని ప్రతిసారి అదే పంథాను ఎంచుకుంటారు. విజయం కోసం ఒక్కోసారి ఇతర నేతలు పాటించిన వ్యూహాలు, ఎత్తుగడలను సైతం అనురిస్తున్నారు. ఓటర్లు కరుణించినా.. అదృష్టం కలిసిరాకపోతే అధికారం అందదని భావించే నేతలు కూడా చాలామందే ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్నాయి అంటే చాలు ప్రచారానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. తమకు కలిసివచ్చే అంశాలకు సైతం అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సెంటిమెంటే ప్రధానంగా వినిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి బెంగాల్ కోటపై జెండా పాతాలని భావిస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఏ ఒక్క అవకాశాన్నీ వదలడంలేదు. విపక్షాల ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు ప్రశాంత్ కిషోర్ రూపంలో వ్యూహకర్త ఉన్నప్పటికీ తన సొంత ఆలోచనలకు సైతం పదునుపెడుతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు ఎన్నికల్లో గెలిచిన నేతల వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అమ్మా క్యాంటిన్స్‌ను బెంగాల్లోనూ ప్రారంభించారు. మా క్యాంటిన్ పేరుతో కేవలం రూ.5కే భోజన సదుపాయాన్ని బెంగాలీలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని కోసం 100 కోట్ల రూపాయాలను కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్న సయమంలో 2013లో అమ్మా క్యాంటిన్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే అమ్మా క్యాంటిన్ ఏర్పాటు అనంతరం జరిగిన 2016 ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి విజయం సాధించి చరిత్రను తిరగరాశారు. 1980 తరువాత ఒకేపార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో అదే తొలిసారి. అయితే జయలలిత ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మా క్యాంటిన్ అత్యంత ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో జయ వ్యూహాన్నే తానూ అమలు చేసి రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని దీదీ కలలు కంటున్నారు. దీనిలో భాగంగానే ఎన్నికలకు రెండు నెలల ముందు మా క్యాంటిన్‌ను లాంఛ్ చేశారు. దీని ద్వారా నగరాల్లో ఉపాధి పొందుతున్న పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి లబ్ధి పొందనున్నారు. కాగా జయలలిత అనంతరం దేశ వ్యాప్తంగా అనేక మంది ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే కర్ణాటలోలో సిద్ధరామయ్య ఇందిర క్యాంటిన్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటిన్ ప్రవేశపెట్టినప్పటికీ ఓటమిని చవిచూశారు. 2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రూ.5కే భోజనం హామీ ఇచ్చినప్పటికీ దారుణంగా ఓటమి పాలయ్యారు. అయితే తెలంగాణలో మాత్రం ఈ ఫార్మాలాతో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తాజాగా మమత కూడా జయ దారినే ఎంచుకున్నారు. తమిళనాడులో మాదిరీగా విజయం సాధిస్తారా లేక ఇతర నేతల్లా ఒటమిని చవిచూస్తారా అనేది చూడాలి. బీజేపీ సవాల్: వ్యూహాలకు ప్రశాంత్ పదును -
అమ్మకు ఆలయం, ప్రారంభించనున్న సీఎం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే శ్రేణుల గుండెల్లో కొలువైన దేవతగా భావించే ‘అమ్మ’కు ఏకంగా ఆలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని శనివారం తమిళనాడు ప్రజలకు అంకింతం చేయనున్నారు. తమిళనా డు ప్రజల దృష్టిలో అమ్మ అంటే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. పార్టీ శ్రేణులు సైతం అమ్మ అనే పిలుస్తారు, గౌరవిస్తారు. జయ కన్నుమూసి ఐదేళ్లవుతున్నా అమ్మపై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. తన లోని భక్తి ప్రపత్తులను పదికాలాల పాటు పదిలం చేసుకునేలా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆలయం నిర్మించారు. మదురై జిల్లా తిరుమంగళం సమీపం టీకున్రత్తూరులో రూపుదిద్దుకు న్న ఈ ఆలయాన్ని ముఖ్య మంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సె ల్వం నేడు శనివారం ప్రారంభించనున్నారు. ఇందు కోసం మంత్రి ఉదయకుమార్ కొన్నిరోజుల క్రితమే కాషాయవస్త్రాలు ధరించి దీక్షబూనారు. ప్రజలు సందర్శించుకునేందుకు వీలుగా 12 ఎకరాల విస్తీర్ణంలో ని ర్మించిన ఈ ఆలయంలో మూలవిరాట్టులుగా అన్నాడీ ఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్, జయలలితల ఏడు అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలను ప్రతిష్టించారు. ఒక్కో విగ్రహం 40 కిలోల బరువుతో రూపొందించారు. ఆలయ ప్రాంగణంలో పలు కళారూపాలను చెక్కించారు. ప్రధాన గాలిగోపురంపై కలశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం కోసం యాగశాలను, 11 హోమగుండాలను సిద్ధం చేశారు. ఆలయాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు కాలినడకన బయలుదేరారు. -
‘అమ్మ’కు వారసులు లేరా?
సాక్షి, చెన్నై: దివంగత అమ్మ జయలలితకు కుటుంబ వారసులు లేరని స్వయంగా సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె మేన కోడలు దీప పేర్కొన్నారు. ఆదివారం వీడియో రూపంలో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జయలలితకు ఆమె అన్న కుమార్తె గా తాను, కుమారుడిగా తన సోదరుడు దీపక్ వారసులుగా ఉన్నామని గుర్తు చేశారు. మేనత్త జీవించి ఉన్న కాలంలో తమకు చేయాల్సిన వన్నీ చేస్తూ వచ్చారని, అయితే, దురదృవష్టవశాత్తు అందర్నీ వీడి ఆమె అనంత లోకాలకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం తర్వాత సీఎం కుర్చీలో పళనిస్వామిని కొందరు కూర్చోబెట్టి వేడుక చూశా రని ఎద్దేవా చేశారు. అయితే, ప్రస్తుతం సీఎం పళనిస్వామి అమ్మకు కుటుంబ వారసులు లేరని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. వారసులం తాము ఉన్నామని, ఇకపై వారసుల గురించి మాట్లాడే అధికారం సీఎంకు లేదన్నారు. దివంగత నేత ఎంజీఆర్ వారసుల విషయంగా మరికొన్ని పార్టీ లు నినాదాన్ని అందుకున్నాయని గుర్తు చేస్తూ, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. -
తలైవర్‌ని గుర్తు చేసుకుంటూ..
ప్రముఖ నటుడు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి యంజీ రామచంద్రన్ (యంజీఆర్) వర్ధంతి గురువారం. ఈ సందర్భంగా ‘తలైవి’ సినిమా నుంచి అరవింద్ స్వామి చేసిన యంజీఆర్ పాత్ర లుక్‌ను విడుదల చేశారు. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో యంజీఆర్‌గా చేయడం గురించి అరవింద్ స్వామి మాట్లాడుతూ – ‘‘పురట్చి తలైవర్ (విప్లవ నాయకుడు) యంజీఆర్ పాత్రను చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంలా భావిస్తున్నాను. అలానే పెద్ద బాధ్యతలా భావించాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. తలైవర్‌ను గుర్తు చేసుకుంటూ ఈ ఫొటోలను షేర్ చేస్తున్నాను’’ అన్నారు. -
విప్లవ నాయకురాలికి నివాళి
డిసెంబర్ 4 నటి, రాజకీయ నాయకురాలు జయలలిత వర్ధంతి. ఆమె జీవితం ఆధారంగా తమిళంలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘తలైవి’ ఒకటి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు కంగనా. అలానే ‘తలైవి’ సినిమాలోని పలు వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ప్రపంచం నటీమణులను చూసే దృష్టి కోణాన్నే మార్చేసిన నటి జయమ్మ. అలాంటి గొప్ప నటికి, విప్లవ నాయకురాలికి నివాళి అర్పించడం చాలా సంతోషంగాను, గర్వంగానూ ఉంది. ఫెమినిటీని (స్త్రీత్వం) గౌరవిద్దాం’’ అంటూ నివాళి అర్పించే ఫోటోను షేర్ చేశారు కంగనా రనౌత్. అలానే సినిమా గురించి మాట్లాడుతూ– ‘‘తలైవి’ సినిమా అనుకున్నట్టే వస్తోంది. దీనికి కారణం మా టీమ్. మా టీమ్ లీడర్ ఏఎల్ విజయ్‌కి చాలా థ్యాంక్స్. ఈ సినిమాను అద్భుతంగా మలచడం కోసం నిరంతరం సూపర్‌మేన్‌లా పని చేస్తున్నారు. ఇంకో వారం రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు కంగనా. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
అన్నీ మారాయి... అవి తప్ప!
‘కరోనా తర్వాత చాలా విషయాలు మారాయి. కానీ దర్శకుడు యాక్షన్ అని చెప్పి, మళ్లీ కట్ చెప్పడం, షూటింగ్... ఇవి మాత్రం ఏమీ మారలేదు’ అంటున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘తలైవి’. దివంగత నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే చెన్నైలో ప్రారంభించారు. అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ ముగిసింది. షూటింగ్‌కి సంబంధించి కొన్ని స్టిల్స్ షేర్ చేసి, ‘జయ అమ్మ ఆశీర్వాదాలతో మరో షెడ్యూల్‌ను పూర్తి చేశాం’ అని ట్వీట్ చేశారు కంగనా రనౌత్. -
తలైవి చిత్రం ప్రతిష్టాత్మకం: కంగనా
ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ నివారణకు ప్రభుత్వాలు లాక్డౌన్లు విధించాయి. అయితే ప్రభుత్వం క్రమక్రమంగా లాక్డౌన్ ఎత్తేయడంతో అన్ని రంగాలు కార్యకలాపాలు ప్రారంభించాయి. కాగా సినీ పరిశ్రమ కూడా షూటింగ్‌ల ప్రారంభానికి సిద్దమవుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్(తలైవి)లో బాలీవుడ్ అగ్రనటి కంగనా రనౌత్ నటిస్తున్నారు. జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన తలైవి పోస్టర్లను ఉత్కంఠ కలిగిస్తున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డ తలైవి సినిమా షూటింగ్ నేడు ప్రారంభించినట్లు కంగనా తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తుండగా, విష్ణువర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తలైవి షూటింగ్ ప్రారంభం అవ్వడం తనకెంతో సంతోషమని, తన సినీ కెరీర్లోనే తలైవి ప్రతిష్టాత్మక చిత్రమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే తలైవి పోస్టర్ గత నవంబర్‌లో విడుదలైన విషయం తెలిసిందే. (చదవండి: క్షమాపణ చెప్పి శాశ్వతంగా వెళ్లిపోతా : కంగనా) -
అసెంబ్లీలో...
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ (నాయకి). ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. కరోనా వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. తాజాగా చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. దీనికోసం అసెంబ్లీ సెట్‌ను నిర్మించారని సమాచారం. ఈ సెట్లో పలు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్లో కంగనా, ఇతర చిత్రబృందం పాల్గొంటారట. వచ్చే నెల 11 నుంచి షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో కరుణానిధిగా ప్రకాశ్ రాజ్, యంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. -
అమ్మ స్మారకం జాప్యం.. సీఎం అసంతృప్తి
సాక్షి, చెన్నై: మెరీనా తీరంలో చేపట్టిన దివంగత సీఎం జయలలిత స్మారక మందిరం నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంపై సీఎం పళనిస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబరులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నై మెరీనా తీరంలో ఎంజియార్ సమాధికి కూతవేటు దూరంలో అమ్మ జయలలిత సమాధి ఉంది. ఇక్కడికి ప్రతి రోజూ సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మ సమాధిని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతాన్ని అత్యాధునిక హంగులతో స్మారక మందిరంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతోపాటు కోస్టల్ అనుమతులు అంటూ వివాదం రేగింది. దీంతో పనులకు ఆటంకాలు తప్పలేదు. రాష్ట్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే కావడంతో పనుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు అన్నాడీఎంకే నాయకులు సిద్ధం అయ్యారు. ఆ మేరకు 2018 మేలో పనులకు శ్రీకారం చుట్టారు. 2019 ఫిబ్రవరిలో జయలలిత తొలి జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించాలని తొలుత సంకల్పించినా, ఆటంకాల రూపంలో పనుల్లో జాప్యం తప్పడం లేదు. (రాజుకుంటున్న ఎన్నికల వేడి) సెప్టెంబరు వరకు గడువు.... గత ఏడాది చివర్లో ముగించి, ఈ ఏడాది రెండో జయంతి సందర్భంగా ప్రారంభిద్దామనుకున్నా ఆటంకాలు తప్పలేదు. సమాధి పరిసరాలను సుందరంగా, అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడం, జయలలిత జీవితం, సినిమా, రాజకీయ ఘనతను చాటేలా ఫొటో, వీడియో ప్రదర్శనను ఆ స్మారక మందిరంలో ఏర్పాటు చేస్తూ నిర్మాణాలు చేపట్టారు. ఆ పరిసరాల్ని ముస్తాబు చేసి నిర్మాణాలకు మెరుగులు దిద్దాల్సి ఉంది. ఫినిక్స్ పక్షి ఆకారంతో సమాధి స్మారకం నిర్మాణంతో అస్సలు సమస్య నెలకొని ఉంది. 15 మీటర్ల ఎత్తుతో, రెండు వైపులా ఆ పక్షి రెక్కలు 21 మీటర్ల ఉండేలా నిర్మాణం సాగుతోంది. ఐఐటీ మద్రాసు, అన్నా వర్సిటీ సాంకేతిక విభాగం సహకారంతో దుబాయ్ నుంచి తీసుకొచ్చిన పరికరాలతో ఈ ఫినిక్స్ పక్షి నిర్మాణాన్ని రూపొందిస్తున్నారు. పలు కారణాల వల్ల ఆగస్టు మొదటి వారానికి దీన్ని ప్రభుత్వానికి అప్పగించలేని పరిస్థితి. సెప్టెంబరు చివరి వరకు గడువు ఇవ్వాలని అధికారులు సీఎం పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జాప్యం, కరోనా తదితర సమస్యల వల్ల నిర్మాణ పనుల వ్యయం మరో పది కోట్లకు పెరిగినట్టు సమాచారం. వీటిని పరిశీలించిన సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబరులో జయలలిత వర్ధంతి సందర్భంగా ఈ స్మారకం ప్రారంభం లక్ష్యంగా ప్రభుత్వం ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆగమేఘాల మీద పనులు సాగించేందుకు ప్రజా పనుల శాఖ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు రానున్న నేపథ్యంలో అమ్మ స్మారకం అన్నాడీఎంకే వర్గాలకే కాకుండా ప్రజలందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్న కాంక్షతో సీఎం ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పోయెస్ గార్డెన్ వేదా నిలయంకు కొత్త మెరుగులకు తగ్గ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. -
మాజీ సీఎం జయలలిత నివాసంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
సీఎం నివాసంగా వేద నిలయం..
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా మార్చేందకు పరిశీలిస్తున్నట్లు బుధవారం తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మారుస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై నివాసితుల సంఘం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ వేద నిలయాన్ని సీఎం నివాసంగా మార్చనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్‌కు తెలిపారు. వేదనిలయంలో ఎక్కువ భాగం స్మారకంగా కాకుండా రాష్ట్ర సీఎం అధికారిక నివాసంగా మార్చాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన సూచనను పరిశీలిస్తున్నట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. (వేదనిలయంలోకి దీపక్) అదే విధంగా సోయెస్ గార్డెన్, కస్తూరి ఎస్టేట్ హౌజ్ ఓనర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏజీ వ్యతిరేకించారు. వేద నిలయాన్ని స్మారకంగా మార్చడనికి అనుమతిస్తే వేల మంది సందర్శన వల్ల చుట్టూ ఉన్న ప్రజల ప్రశాంతతపై ప్రభావం పడుతుందని నివాసితుల సంఘం పేర్కొంది. పోయస్ గార్డెన్‌ను తాత్కలికంగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం మేలో ఆర్డినెన్స్‌ని జారీ చేసిన విషయం తెలిసిందే. (జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే: మద్రాసు హైకోర్టు) -
వేదనిలయంలోకి దీపక్
సాక్షి, చెన్నై: పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయంలోకి వెళ్లేందుకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ మంగళవారం ప్రయత్నించారు. ఆయన్ను అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. చివరకు పక్కనే ఉన్న మరో భవనంలోకి వెళ్లి కాసేపు కూర్చుని బయటకు వచ్చేశారు. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసం వేదనిలయంను స్మారకమందిరంగా మార్నేందుకు ప్రభుత్వం కసరత్తుల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఇందు కోసం సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ సైతం ఏర్పడింది. అదే సమయంలో జయలలిత ఆస్తులకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప వారసులుగా కోర్టు ప్రకటించింది. దీంతో వేదనిలయంపై తమకు హక్కులు ఉన్నట్టు దీప, దీపక్ పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం దీపక్ హఠాత్తుగా పోయెస్గార్డెన్లోకి వచ్చారు. అక్కడి వేదనిలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, పోలీసులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. చివరకు తన వద్ద కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, లోనికి అనుమతించాలని పట్టుబట్టారు. అయితే, పోలీసులు ఏ మాత్రం తగ్గలేదు. ఆ ఉత్తర్వుల కాపీని పరిశీలించి మౌనంగానే ఉండిపోయారు. లోనికి ఎవర్నీ అనుమతించే అధికారం తమకు లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. అర్థం చేసుకోవాలని దీపక్‌కు సూచించారు. చివరకు వేదనిలయం పక్కనే ఉన్న పాత కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు పోలీసులు అంగీకరించడంతో కాసేపులోపల కూర్చుని బయటకు దీపక్ వచ్చేశారు. అనంతరం కారులో ఆయన వెళ్లిపోయారు. జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే చరిత్రలో నిలిచిపోయేలా 'అమ్మ' స్మారకం -
అందుకే ఐరన్ లేడీ చేస్తున్నా!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్ నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ఒకటి. జయలలిత జీవితంతో మూడు నాలుగు సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో మీరు నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ప్రత్యేకత ఏంటి? ఒకే వ్యక్తి గురించి ఇన్ని సినిమాలు వస్తున్నా మీరు నటించడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలు నిత్యా మీనన్ ముందుంచితే – ‘‘నిజమే... జయలలితగారి జీవితంపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయని నాకు లె లుసు. అందుకే మనం ఎందుకు చేయాలి? అనే అనుమానం నాకూ వచ్చింది. నా సందేహాన్ని ‘ఐరన్ లేడీ’ దర్శకురాలు ప్రియదర్శిని ముందుంచాను. దానికి ఆమె చెప్పిన సమాధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ‘జయలలితగారిపై ఎవరెన్ని సినిమాలు తీసినా తీయనివ్వండి. కానీ, మనం తీసే సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేదే పాయింట్. నేను జయలలితగారిని వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను. ఆమెను దగ్గరినుంచి గమనించాను, చాలా విషయాలు మాట్లాడాను’ అన్నారు ప్రియదర్శిని. ఆమె మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. మనం మంచి సినిమా చేస్తున్నాం అనే నమ్మకం కలిగింది. అందుకే ధైర్యంగా ‘ఐరన్ లేడీ’లో నటిస్తున్నాను’’ అన్నారు. -
చరిత్రలో నిలిచిపోయేలా 'అమ్మ' స్మారకం
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకమండప నిర్మాణ పనులను ఈ ఏడాది జూలై నెలాఖరులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆదేశించారు. ఈ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించిన చెన్నై మెరీనాబీచ్ ఒడ్డున అందమైన సమాధి నిర్మాణం జరిగింది. ఆ తరువాత ఎంజీఆర్ సమాధి పేరొందిన పర్యాటక క్షేత్రంగా మారింది. ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత అన్నాడీఎంకేకు విజయవంతంగా సారధ్యం వహించిన జయలలిత పార్దివదేహాన్ని సైతం చెన్నై మెరీనాబీచ్ ఒడ్డున ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేశారు. ఆ ప్రదేశంలో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ఎడపాడి ప్రభుత్వం నాడే ప్రకటించింది. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే నిర్మాణంలో అమ్మ స్మారక మండపం సముద్ర తీరాల్లో సమాధుల నిర్మాణంపై పర్యావరణ నిషేధం ఉన్నట్లు కొందరు వివాదాలు లేవనెత్తినా వాటిని అధగమించి రూ.5.08 కోట్ల అంచనాతో పనులు కొనసాగుతున్నాయి. జయ సమాధి డిజైన్‌ను చెన్నై ఐఐటీ రూపకల్పన చేయగా మధ్యప్రదేశాన్ని కాంక్రీట్‌తో పినిక్స్ పక్షి ఆకారంలో తీర్చిదిద్దుతున్నారు. అత్యంత క్లిష్టమైన నిర్మాణం కావడంతో ప్రజాపనులశాఖ అధికారులు పదేపదే పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్మాణంలో కొంత జాప్యం కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణానికి అవసరమైన వస్తువులను దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. లాక్డౌన్ రోజుల్లో సైతం ప్రత్యేక అనుమతి పొంది నిరవధికంగా పనులను సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా స్మారకమండప నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను ముఖ్యమంత్రి ఎడపాడి రెండు రోజుల క్రితం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. పనులు ఎంతవరకు వచ్చాయో వాకబు చేశారు. పనుల ప్రగతిని ఫొటోల ద్వారా సీఎంకు చూపించారు. చారిత్రాత్మక నిర్మాణంగా చరిత్రలో నిలవబోతున్న జయ స్మారక మండపం విషయంలో అత్యంత శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. హడావిడికి తావివ్వకుండా నాణ్యత పాటించాలని సూచించారు. ఈ ఏడాది జూలై మాసాంతానికి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. చదవండి: టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అనుమతి -
జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తికి వారిద్దరూ రెండో తరం వారసులని గురువారం ప్రకటించిన కోర్టు శుక్రవారం తీర్పును సవరిస్తున్నట్లుగా ప్రత్యక్ష వారసులని స్పష్టం చేసింది. అనారోగ్యకారణాలతో జయలలిత అకస్మాత్తుగా కన్నుమూసిన నాటి నుంచి రెండు అంశాలపై రసవత్తరమైన చర్చకు తెరలేచింది. ఒకటి రాజకీయ వారసులు ఎవరు, రెండు అపారమైన ఆమె ఆస్తికి వారసులు ఎవరు..? అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీలో ఎవ్వరినీ నెంబరు టూ స్థాయిలో కూర్చో బెట్టలేదు. ఒకటి నుంచి వంద వరకూ అన్నీ తానై వ్యవహరించారు. ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపినపుడు పన్నీర్‌సెల్వంకు సీఎం బాధ్యతలు అప్పగించినా అది అంతవరకే. పార్టీలో, ప్రభుత్వంలో పన్నీర్‌సెల్వం సహా అందరూ కిందిస్థాయి నేతలుగానే కొనసాగారు. ఆ రెండింటిలో మొదటిదాన్ని కైవసం చేసుకునే యత్నంలో శశికళ బొక్కబోర్లాపడి జైలు జీవి తం గడుపుతోంది. జయ స్థాయిలో శశికళ పార్టీలో చక్రం తిప్పినా అదంతా అనధికారమే. కొంత జయకు తెలియకుండా సాగిపోయినదే. ఇక ఆస్తిని దక్కించుకునేందుకు సైతం శశికళ, టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేసి విఫలమైనారు. జయ అవివాహిత కావడంతో ప్రత్యక్ష వారసులు లేరు. తాను నటుడు శోభన్‌బాబు, జయలలితకు జన్మించిన కుమార్తెను, ఆమె ఆస్తికి తానే వారసురాలినంటూ వేర్వేరుగా ఇద్దరు యువతులు కొన్నాళ్లపాటు హడావిడి చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన యువతి కోర్టులో కేసు కూడా వేసింది. ఆమె వాదనకు బలం లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే కనుమరుగైంది. ఇక జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ సైతం వారసత్వపోరును ప్రారంభించారు. పారీ్టకి, ప్రాపరీ్టకి సైతం తామే వారసులమని దీప మీడియా ముందుకొచ్చారు. చెన్నై పోయస్ గార్డెన్‌లోని నివాసాన్ని జయ స్మారకమందిరంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారు. చదవండి: పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే జయకు రక్తసంబందీకులుగా దీప, దీపక్ మాత్రమే చలామణిలో ఉండడంతో న్యాయస్థానం తీర్పు కూడా వారిద్దరికీ అనుకూలంగా వచ్చింది. పోయస్‌గార్డెన్ ఇంటిని స్మారకమందిరం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. జయ ఆస్తులకు దీప, దీపక్ రెండోతరం వారసులని పేర్కొంది. ముందురోజు చెప్పిన తీర్పులో సవరణలు చేస్తూ జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. ఇతర ఆస్తుల మాటెలా ఉన్నా చెన్నై పోయస్గార్డెన్పై అటు ప్రభుత్వం ఇటు దీప, దీపక్ పట్టుబటి ఉన్నారు. పోయస్‌గార్డెన్ ఇంటిని స్మారక మందిరం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానమే చెప్పిందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తీర్పు వెలువడగానే మీడియా ముందు ధీమా వెలిబుచ్చారు. తాజా తీర్పుతో పోయస్‌గార్డెన్ ఇంటిపై దీప, దీపక్‌కు పూర్తిస్థాయి అధికారం వచ్చినట్లు భావించవచ్చు. జయ ఆస్తుల వ్యవహారంలో ఇంతవరకు శశికళ ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. త్వరలో అదే జరిగితే ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి. చదవండి: వారిద్దరూ అమ్మ వారసులే ఈ తీర్పును ఊహించలేదు: దీప మద్రాసు హైకోర్టు శుక్రవారం తాజా తీర్పును వెలువరించిన అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. ఇలాంటి తీర్పును నేను ఊహించలేదు. అన్నాడీఎంకే సైతం ఈ తీర్పును స్వాగతించాలి. పోయెస్‌గార్డెన్ రోడ్డులోకి ప్రవేశించకుండా నిరోధించారు. వారు ఎవరో మీకు తెలుసు. అత్త (జయలలిత) కడసారి చూపులకు కూడా నోచుకోకుండా చేసింది అన్నాడీఎంకే ప్రభుత్వమే. పోయెస్‌గార్డెన్ ఇంట్లోనే పుట్టాను. అయితే ఆ ఇంటిలోకి నేను వెళ్లకుండా అడ్డుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తమపై అనవసరమైన నిందలు మోపింది. అయితే చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మద్రాసు హైకోర్టుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జయ ఆస్తులపై మాకు కోర్టు సర్వాధికారం ఇచ్చింది. ప్రత్యక్ష వారసులమని ప్రకటించిన తరువాత ఏఏ హక్కులు వస్తాయో పరిశీలించాలి. అన్ని ఆస్తులు మాకు అప్పగించాలి. వేదనిలయాన్ని జయ స్మారకమందరంగా మార్చాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై, ఆ ఇంటిపై హక్కు కల్పించాలని కోరుతూ గవర్నర్‌ను కలుస్తాను. అన్నాడీఎంకే నుంచి ఇకపై వచ్చే సమస్యలను న్యాయస్తానంలోనే ఎదుర్కొంటాను. జయ ఆస్తుల విషయంలో అన్నాడీఎంకేకు అడ్డంకులు ఎదురవడంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. మాలో కొన్ని భయాలు నెలకొన్నందున సాయుధ పోలీసు బందోబస్తు కల్పించాలి. చదవండి: రక్త సంబంధీకులు వారసులు కారా? జయ ఆస్తుల చిట్టా జయలలిత ఆస్తులను అధికారికంగా లెక్కకట్టేందుకు ఉన్న ఆధారాలు ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో ఆమె చూపిన వివరాలు మాత్రమే. తన వార్షిక ఆదాయం రూ.9.34 కోట్లని 1996లో ఆదాయపు పన్నుశాఖకు లెక్కచూపారు. అధికశాతం వ్యవసాయంపై వచ్చే ఆదాయమని పేర్కొన్నారు. నెలకు ఒక్కరూపాయి జీతం పొందుతున్నట్లు ఆ లెక్కల్లో తెలిపారు. 2011 ఎన్నికల్లో పోటీచేసినపుడు రూ.51.4 కోట్ల ఆస్తి చూపారు. 2016లో రూ.113.73 కోట్ల ఆస్తిని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. చరాస్థి కింది రూ.42 కోట్ల విలువైన బంగారు నగలను చూపారు. స్థలాలు, నిర్మాణాల కింద మరో రూ.72 కోట్ల ఆస్తులను ఆమె చూపారు. బ్యాంకుల్లో రూ.10.63 కోట్ల డిపాజిట్టు చూపగా ఇందులో రెండుకోట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీజ్‌కు గురయ్యాయి. వివిధ కంపెనీల్లో రూ.27.44 కోట్లు పెట్టుబడులున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21289.30 గ్రాముల బంగారం, 1250 కిలోల వెండిని సీజ్ చేశారు. రూ.2.4 కోట్ల అప్పుకూడా ఉందని ఆమె పేర్కొన్నారు. 1992లో కొడనాడులో 900 ఎకరాల టీ ఎస్టేట్‌ను కొనుగోలు చేసి క్రమేణా 1,800 ఎకరాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎకరా రూ.1 కోటికి పలుకుతుంది. ఇక లగ్జరీ వసతులతో కొడనాడు బంగ్లా కూడా ఉంది. కొడనాడు ఎస్టేట్ తనకు సొంతమని శశికళ చెబుతున్నారు. జయలలిత పేరున మొత్తం 173 ఆస్తులున్నట్లు సమాచారం. వీటిల్లో కనీసం వంద ఆస్తుల్లోనైనా జయలలితకు పెద్దవాటా ఉండే అవకాశం ఉంది. జయ ఆస్తులపై న్యాయస్థానంలో వాదోపవాదాల్లో రూ.913 కోట్ల ఆస్తులుగా చూపారు. -
వారిద్దరూ అమ్మ వారసులే
సాక్షి చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివాదం కోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది. కొంత ప్రభుత్వానికి మిగిలినది జయ అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్‌కు చెందేలా బుధవారం తీర్పు చెప్పింది. ఈ పంపకాలపై 8 వారాల్లోగా బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. పలుసార్లు అన్నాడీఎంకేను అధికారపీఠంలో కూర్చొనబెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అదే స్థాయిలో భారీ ఎత్తున ఆస్తులను సైతం కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనధికారికంగా వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జయలలితకు చెన్నై పోయెస్‌గార్డెన్‌లో బంగ్లా, కొడైకెనాల్లో ఎస్టేట్, హైదరాబాద్‌లో ద్రాక్షతోట రూ.913 కోట్ల విలువైన ఆస్తులున్నాయని అధికారిక సమాచారం. (రక్త సంబంధీకులు వారసులు కారా? ) 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నెలల్లోనే ఆమె అస్వస్థకు గురై అనూహ్యమైన రీతిలో అదే ఏడాది డిసెంబర్ 5నఅకస్మాత్తుగా కన్నుమూశారు. వివాహం చేసుకోకుండా ఆధ్యంతం కుమారిగానే జీవించినందున ఆమె కూడబెట్టిన కోట్లాది రూపాయల ఆస్తులకు వారసులు ఎవరనే అంశంపై పెద్ద చర్చనీయాంశమైంది. జయ మరణించిన తరువాత ఆదాయపు పన్నుశాఖాధికారులు జయ నివాసం పోయెగార్డెన్‌లో తనిఖీలు చేసినపుడు ఆస్తి పంపకాలు చేసినట్లు ఎలాంటి పత్రాలు దొరకలేదు. జయ రక్త సంబం«దీకులుగా ఆమె అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ మాత్రమే ఉన్నారు. అయితే జయతో వారికి సత్సంబంధాలు, పోయెస్‌గార్డెన్ ఇంటికి రాకపోకలు లేనందున ఆస్తులు వివాదంలో చిక్కుకున్నాయి. జయ ఆస్తికి, రాజకీయాలకు సైతం తామే వారసులమని దీప గళమెత్తినా చట్టబద్ధత లేకుండా పోయింది. పోయెగార్డెన్‌లో ఇంటిని జయస్మారక మందిరంగా మార్చాలని అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (స్మారక మందిరంగా జయలలిత నివాసం) అత్త (జయలలిత) ఆస్తులపై ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం అన్నాడీఎంకే ప్రభుత్వానికి లేదని దీప అభ్యంతరం పలికింది. జయ ఆస్తులపై తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని గట్టిగా అడ్డుతగిలింది. ఈ పరిస్థితిలో జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రయివేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే నేత పుహళేంది, జానకిరామన్ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. జయలలిత అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీపను ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. జయ చట్టపూర్వక వారసులమైన తమను నిర్వాహకులుగా నియమించాలని వారిద్దరూ కోర్టుకు విన్నవించుకున్నారు. జయ ఆస్తిపన్ను బకాయి ఉన్నారంటూ ఆదాయపు పన్నుశాఖ కొంత ఆస్తిని గతంలోనే జప్తుచేసి ఉంది. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం ‘వేద నిలయం’ను జయ స్మారకమందిరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అత్యవసర చట్టం తీసుకొచ్చింది. జయ ఆస్తులపై దాఖలైన పిటిషన్లపై వాదోపవాదాలు ముగియగా తీర్పు తేదీని ప్రకటించకుండా న్యాయమూర్తులు ఈ కేసును వాయిదావేశారు. జయ ఆస్తులపై సిఫార్సులతో తీర్పు: ఇదిలా ఉండగా, జయలలిత ఆస్తుల వివాదానికి సంబంధించి కొన్ని సిఫార్సులతో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ ఖుద్దూస్ బుధవారం తీర్పును ప్రకటించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఇంటినంతా స్మారకమండపంగా మార్చాల్సిన అవసరం లేదు, కొంతభాగాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్‌గా చేయవచ్చు. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించి స్మారక మండపంపై నిర్ణయం తీసుకోవాలి. ప్రయివేటు ఆస్తుల కొనుగోలుపై ప్రజల హృదయాల్లో అనేక సందేహాలుంటాయి. అందుకే జయ ఆస్తుల నిర్వహణకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్‌లో దీప, దీపక్‌లను సభ్యులుగా చేర్చాలి. వీరిద్దరికీ ప్రభుత్వం 24 గంటలపాటూ సాయుధ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి. జయ ఆస్తుల్లోని కొంత భాగాన్ని అమ్మివేసి ఆ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌పై వచ్చే ఆదాయం నుంచి దీప, దీపక్లకయ్యే పోలీసు బందోబస్తు ఖర్చుకు వినియోగించాలి. రెండో తరం వారసులుగా జయ అన్న కుమార్తె, కుమారునికి జయ ఆస్తిపై హక్కు ఉంటుంది. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని 8 వారాల్లోగా కోర్టులో బదులు పిటిషన్ దాఖలు చేయాల’ని వారు తీర్పులో పేర్కొన్నారు. జయ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తూ నిర్వాహక అధికారిని నియమించుకునే అవకాశాన్ని కలి్పంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు కొట్టివేశారు. అన్నింటికి వారసులం: దీప దివంగత సీఎం, తన మేనత్త ఆస్తులకే కాదు ఆమె ఆశయాలు, లక్ష్యాలకు వారసులం తాను, తన సోదరుడు దీపక్ అని దీప వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మీడియా ముందుకు బుధవారం సాయంత్రం దీప వచ్చారు. కోర్టు ఇచ్చిన సూచనల్లో తమను వారసులుగా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు. తాను, తన సోదరుడు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని తెలిపారు. పారంపర్య ఆస్తులే కాదు, మేనత్త ఆస్తులకు తామిద్దరం వారసులమని, ఆమె ఆశయ సాధన, లక్ష్యాల్లోను వారసులంగా ఉంటామన్నారు. -
సీఎం కార్యాలయంగా పోయస్ గార్డెన్
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత నేత జయలలిత నివాసాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చాలని మద్రాస్ హైకోర్టు అక్కడి ప్రభుత్వానికి సూచించింది. అయితే పోయస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం వేదనిలయాన్ని మెమొరియల్‌గా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. పోయస్ గార్డెన్‌ను తాత్కలికంగా తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ని జారీ చేసింది. అయితే తమ అత్తకు చెందిన ఆస్తిపై తమకు హక్కు ఉందంటూ జయలలిత మేనల్లుడు, మేనకోడలు దీపక్, దీపా కోర్టును ఆశ్రయించారు. దీనిపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ ఇటువంటి ప్రైవేట్ ఆస్తులను మెమొరియల్స్‌గా మార్చడం, వాటిని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని కోర్టు పేర్కొంది. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) అందుకే జయలలిత నివాసం వేద నిలయాన్ని ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయంగా మార్చాలని సూచించింది. ఇటువంటి వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడంతో ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించి జయలలిత వారసులకు సమాచారం అందించి అవసరమైతే వారికి డబ్బులు చెల్లించి భవానాన్ని సొంతం చేసుకోవాలని కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. జయలలితకు మేనకోడలు, మేనల్లుడు అయిన దీప, దీపక్‌లు జయలలితకు వారసులు అవుతారు. వారితో మాట్లాడిన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ఇక దీనికి సంబంధించిన విచారణను కోర్టు 8 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిపై నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. (లాక్డౌన్ 5.0 : ఆ 11 నగరాలపై ఫోకస్) -
రక్త సంబంధీకులు వారసులు కారా?
సాక్షి, చెన్నై : వేద నిలయాన్ని స్మారక మందిరంగా మారుస్తూ తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఇంటిని కబ్జాచేయడమే కాదు, అందులో ఉన్న వస్తువుల్ని కొల్లగొట్టేందుకు అన్నాడీఎంకే పాలకులు సిద్ధమయ్యారని ఆరోపించారు. పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం జయలలితకు చెందిన వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పనులకు గాను సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆమోదంతో ఈ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆగమేఘాలపై చట్టం ఏంటి? ఈ పరిస్థితుల్లో జయలలిత మేన కోడలు దీప ఆదివారం ఆడియో రూపంలో స్పందించారు. జయలలితతో తనది రక్త సంబంధం అన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆమెకు తాను మేన కోడలు అని, మేనత్త మరణంతో తాను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, రాజకీయ కుట్రలు, వెన్నంటి ఉన్న వారి రూపంలో అందులో నుంచి బయటకు రాక తప్పలేదన్నారు. ప్రస్తుతం కరోనా తాండవం రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఉందని గుర్తు చేస్తూ, ఈ సమయంలో ఆగమేఘాల మీద తన మేనత్త ఇంటిని కబ్జా చేయడానికి చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఈ పాలకులకు ఎందుకు వచ్చినట్టు అని ప్రశ్నించారు. కేవలం వేద నిలయాన్ని కబ్జా చేయడం, అక్కడున్న అన్ని రకాల వస్తువుల్ని అపహరించడం, కొల్లగొట్టడం లక్ష్యంగా ఈ పాలకుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. జయలలిత ఆస్తులకు ఎవరైనా వారసులు అని నిరూపించుకుని రానివ్వండి తదుపరి చూసుకుందామని న్యాయ మంత్రి సీవీ షణ్ముగం ఓ వ్యాఖ్య చేశారని గుర్తు చేశారు. రక్త సంబంధీకులు వారసులు కాలేరా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మేనత్త మరణం గురించిన వివరాల్ని నిగ్గు తేల్చలేని పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన తన మేనత్తను మళ్లీ తీసుకు రాగలరా అని ప్రశ్నిస్తూ, వేదనిలయం తమ పూర్వీకుల సొత్తు అని దాని జోలికి వెళ్లడం మంచిది కాదని హెచ్చరించారు. -
దీపకు ఆ హక్కు లేదు: గౌతమ్ మీనన్
పెరంబూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను నిషేధించాలని కోరే హక్కు ఆమె సోదరుడి కూతురు దీపకు లేదని దర్శకుడు గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. ‘క్వీన్’ పేరుతో గౌతమ్ మీనన్ జయలలిత బయోపిక్‌ను వెబ్ సిరీస్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్‌ను ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నటి కంగనారనౌత్ జయలలితగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా జయలలిత బయోపిక్‌ను తన అనుమతి లేకుండా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ జయలలిత సోదరుడి కూతురు జే.దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జయలలిత బయోపిక్‌లపై నిషేధం విధించలేమని పేర్కొంటూ దీప పిటిషన్‌ను కొట్టి వేశారు.(క్వీన్ రివ్యూ: ‘అమ్మ’గా అదరగొట్టిన రమ్యకృష్ణ) ఈ క్రమంలో ఆమె మరో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి దర్శకుడు గౌతమ్‌మీనన్, దర్శకుడు విజయ్‌లకు బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా జయలలిత బయోపిక్ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. దీంతో దర్శకుడు గౌతమ్ మీనన్ తరఫు న్యాయవాది కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అందులో దీపకు జయలలిత బయోపిక్ చిత్రాలను నిషేధించాలనే అర్హతగానీ, హక్కుగానీ లేవన్నారు. జయలలిత సొంత బంధువునని చెప్పుకొనే దీప పలుమార్లు తాను జయలలితను కలుసుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యానని చెప్పారన్నారు. అయినా తాను రూపొందించిన ‘క్వీన్’ సిరిస్ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినదని, అనితా శివకుమార్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించిన సిరీస్ అని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు. -
జానకి.. శశికళ
ఏ సినిమాకైనా సరైన ఆర్టిస్టులను ఎంపిక చేయడం ముఖ్యం. బయోపిక్ అయితే అది మరింత ముఖ్యం. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లోనూ ఆర్టిస్ట్‌ల ఎంపికలో రాజీ పడటం లేదు చిత్రబృందం. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’ (నాయకురాలు అని అర్థం). కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దివంగత నటుడు యంజీ రామచంద్రన్ (యంజీఆర్)గా అరవింద స్వామి, నటుడు శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూ సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజాగా జయ జీవితంలో కీలకమైన ఆప్తురాలు శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నారు. యంజీఆర్ భార్య జానకి పాత్రలో ‘రోజా’ ఫేమ్ మధుబాల నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ‘‘శశికళ పాత్రకి ప్రియమణిని అనుకున్నాం. కానీ డేట్స్ సమస్య వచ్చింది. పూర్ణ అయితే ఈ పాత్రకు బావుంటారని తీసుకున్నాం. మధుబాలగారిని జయలలిత తల్లి సంధ్య పాత్రలో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆమెను కలిశాక యంజీఆర్ భార్య జానకి పాత్రకు కరెక్ట్‌గా సరిపోతారని తీసుకున్నాం. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. మార్చి మొదటివారం వరకూ ఈ షెడ్యూల్ సాగుతుంది’’ అన్నారు. శైలేష్ ఆర్, విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
ఆమె ఆదర్శమైన ముఖ్యమంత్రి : కేతిరెడ్డి
చెన్నై : జయలలిత మరణం వెనుక చాలా అనుమానాలున్నాయని గతంలో చెప్పిన నేతలు ఇప్పుడు అధికారంలోఉండి కూడా దానిపై ఎందుకు మౌనంగా ఉన్నారో ఎన్నికలకు పోయే ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదేశ్వరెడ్డి ఏఐఏడిఎంకే నేతలను డిమాండ్ చేసారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతిని పురష్కరించుకుని తమిళనాడు తెలుగు యువశక్తి జరపుతున్న 5 రోజుల జయంతి వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదేశ్వరెడ్డి పేద మహిళలకు చీరలు పంపిణి చేశారు. 27తేదీ వరకు పలు కార్యక్రమాల ద్వారా జయలలిత జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ.. “జయలలిత జయంతి వేడుకులు ఇలా పేదల మధ్య జరపటానికి వారే స్పూర్తి దాయకం. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ప్రస్తుతం తమిళనాడు రాష్టంలోని జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆచరిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలను ఆచరిస్తామని చెప్పి, ఆప్ విజయం సాధించటమే ఇందుకు ఉదాహరణ. జయలలిత దేశంలోనే ఒక ఆదర్శమయిన ముఖ్యమంత్రి, వారి అకాల మరణం తమిళనాడు ప్రజలను కృంగ దీసింద’ని అన్నారు. -
ఎందరికో స్ఫూర్తి
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. సోమవారం (ఫిబ్రవరి 24) జయలలిత 72వ జయంతి. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కంగన కొత్త లుక్‌ను విడుదల చేశారు. ‘‘జయ లలితగారు ఎందరికో స్ఫూర్తి. వెండితెరపై ఆమె పాత్రను ఎంతో అంకితభావంతో పోషిస్తూ, ఆ పాత్రకు జీవాన్నిస్తున్నారు కంగనా. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె భాగం కావడం ఈ సినిమా క్వాలీటిని ఎన్నో రెట్లు పెంచింది’’ అన్నారు విజయ్. ‘‘ఎన్నో అడ్డంకులతో పోరాడి, వాటిని అధిగమించి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఓ స్త్రీ గాథ ఈ చిత్రం’’ అన్నారు విష్ణువర్ధన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. -
బెంగాలీ బాబు శోభన్‌బాబు
దివంగత నటి, ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లోని స్టార్ క్యాస్ట్ రోజురోజుకీ పెద్దదవుతోంది. జయలలితగా కంగనా రనౌత్, యంజీఆర్‌గా అరవింద స్వామి, శశికళ పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. కరుణానిధిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారట. తాజాగా శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూసేన్ గుప్తా నటిస్తారని తెలిసింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. శోభన్‌బాబు, జయలలిత కొంతకాలం ప్రేమలో ఉన్నారని అప్పట్లో టాక్. శోభన్‌బాబు పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉండబోతోందట. ఈ పాత్రను పోషించడానికి శోభన్‌బాబు పాత చిత్రాలను చూస్తున్నారట జిష్షూ సేన్. యన్టీఆర్ బయోపిక్‌లో ఎల్వీ ప్రసాద్ పాత్రలో, ‘అశ్వథ్థామ’ లో విలన్ పాత్రలో నటించారు జిష్షూ. -
వెండితెర ఎంజీఆర్
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెర కెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. (హిందీలో ‘జయ’). ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత నేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్, దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. ఇవాళ ఎం.జి రామచంద్రన్ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని అరవింద స్వామి లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన కంగనా రనౌత్ ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎంజీఆర్ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటిస్తున్నారు అరవిందస్వామి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘తలైవి’ చిత్రం ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
తెలుగు రాష్ట్రంలో తలైవి
ప్రముఖనటి, తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’ (హిందీలో ‘జయ’ అనే టైటిల్ అనుకుంటున్నారు). ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీ¯Œ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, అరవిందస్వామి కీలకపాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల మైసూర్లో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ భాగ్యనగరంలో(హైదరాబాద్) ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్లు రెడీ చేశారు. ఇక్కడి షెడ్యూల్ దాదాపు 25 రోజులు సాగుతుందని సమాచారం. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 26న విడుదల చేయాలనుకుంటున్నారు. -
14 నుంచి క్వీన్ పయనం
చెన్నై : ఈనెల 14వ తేదీ నుంచి క్వీన్ పయనం ప్రారంభంకానుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్కు ఉన్న డిమాండ్ ఏమిటన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ టైటిల్ పాత్రలో తలైవి పేరుతో దర్శకుడు విజయ్ ఒక చిత్రాన్ని, నటి నిత్యామీనన్ టైటిల్ పాత్రలో ది ఐరన్ లేడీ పేరుతో నవ దర్శకురాలు ప్రియదర్శిని చిత్రాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో తలైవి చిత్రం ఇప్పటికే సెట్ పైకి వచ్చేసింది. కాగా వాటితో పాటు ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్, ప్రసాద్ మురుగేశన్‌లు కలిసి క్వీన్ పేరుతో వెబ్ సీరీస్‌ను రూపొందిస్తున్నారు. జయలలితగా రమ్యకృష్ణ నటించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. జయలలిత గెటప్‌లో రమ్యకృష్ణ బాగా నప్పిందనే ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ క్వీన్ సిరీస్ ప్రసారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి ప్రసారం కానున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా తెగింపు గల నటి, రాజకీయవాది, కాంప్రమైజ్ అనే పదానికి చోటు లేకుండా జీవించిన మనిషిగా రూపొందుతున్న వెబ్ సిరీస్ క్వీన్. బూడిద నుంచి ఉన్నత శిఖరాలకు చేరిన పీనిక్స్ పక్షిలా అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అన్న ఘనతకెక్కి తమిళనాడును ఏలిన వ్యక్తి జయలలిత. ఆమె యదార్థ సంఘటనలతో రూపొందుతున్న సిరీస్ క్వీన్. ఎంఎక్స్ ప్లేయర్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఎంఎక్స్ యాప్‌లో ప్రసారం చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ వెబ్ సిరీస్‌తో పాటు జయలలిత బయోపిక్‌తో తెరకెక్కనున్న చిత్రాలకు జయలలిత సోదరుడి కూతురు దీప అనుమతి ఇవ్వలేదు. అంతే కాదు ఈ వ్యవహారంపై ఆమె కోర్టుకెక్కారు. అయినా క్వీన్ వెబ్ సిరీస్‌ను ప్రసారానికి సిద్ధం అవుతున్నారు. దీంతో సమస్యలు తలెత్తకుండా ఈ సిరీస్‌లో ఎక్కడా జయలలిత పేరును ప్రస్థావం లేకుండా జాగ్రత్త పడ్డారు దర్శక నిర్మాతలు. ఇందులో జయలలిత పాత్ర పేరును శక్తి శేషాద్రి అనే పెట్టారు. అలా చట్ట పరమైన సమస్యలు నుంచి క్వీన్ వెబ్ సిరీస్ బయట పడుతుందా? లేదా?అన్నది చూడాలి. -
దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్
నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’.గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇప్పటికే విడుదలైన క్వీన్ ఫస్ట్ లుక్, టీజర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ‘క్వీన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల 44 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ అద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ పేరు శక్తి శేషాద్రి. జయలలిత స్కూల్ డేస్ నుంచి మొదలు సినీ, రాజకీయ విషయాలను ఈ ట్రైలర్లో జోడించారు. ఇక జయలలిత చిన్న నాటి పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ ఆకట్టుకుంది. డిసెంబర్ 14న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. ఇక ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా.. దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా తలైవి ఫస్ట్ లుక్‌పై జయలలిత అభిమానులతో పాటు సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. (తలైవి ఫస్ట్ లుక్ రిలీజ్)