నాయకురాలు | Jayalalithaa Biopic Thalaivi First Look Poster release | Sakshi
Sakshi News home page

నాయకురాలు

Published Sun, Nov 24 2019 5:54 AM | Last Updated on Sun, Nov 24 2019 5:54 AM

Jayalalithaa Biopic Thalaivi First Look Poster release - Sakshi

‘తలైవి’లో కంగనా రనౌత్‌

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేకౖమైన గుర్తింపు తెచ్చుకున్నారు జయలలిత. ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసి అందరి గుండెల్లో ‘పురట్చి తలైవి’ (విప్లవ నాయకి)గా మిగిలారు. ఆమె జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘తలైవి’ (నాయకురాలు) చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు కంగనా రనౌత్‌. శనివారం ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను, టీజర్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసింది చిత్రబృందం.

విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌. సింగ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత ఓల్డ్‌ గెటప్‌తో పాటు, టీజర్‌లో ఆమెకు సంబంధించిన రెండు గెటప్‌లను విడుదల చేశారు. ‘బ్లేడ్‌ రన్నర్‌’, ‘కెప్టెన్‌ మార్వెల్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పని చేసిన మేకప్‌ నిపుణులు కంగనాను జయలలితలా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో యంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement