అసెంబ్లీలో... | Thalaivi movie shootings resume | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో...

Published Mon, Sep 14 2020 7:01 AM | Last Updated on Mon, Sep 14 2020 7:01 AM

Thalaivi movie shootings resume - Sakshi

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ (నాయకి). ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. కరోనా వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. తాజాగా చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. దీనికోసం అసెంబ్లీ సెట్‌ను నిర్మించారని సమాచారం. ఈ సెట్‌లో పలు కీలక సన్నివేశాలను షూట్‌ చేయనున్నారట. ఈ షెడ్యూల్‌లో కంగనా, ఇతర చిత్రబృందం పాల్గొంటారట. వచ్చే నెల 11 నుంచి షూటింగ్‌ జరగనుంది. ఈ సినిమాలో కరుణానిధిగా ప్రకాశ్‌ రాజ్, యంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement