Assembly set
-
అన్నీ మారాయి... అవి తప్ప!
‘కరోనా తర్వాత చాలా విషయాలు మారాయి. కానీ దర్శకుడు యాక్షన్ అని చెప్పి, మళ్లీ కట్ చెప్పడం, షూటింగ్... ఇవి మాత్రం ఏమీ మారలేదు’ అంటున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘తలైవి’. దివంగత నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే చెన్నైలో ప్రారంభించారు. అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ ముగిసింది. షూటింగ్‌కి సంబంధించి కొన్ని స్టిల్స్ షేర్ చేసి, ‘జయ అమ్మ ఆశీర్వాదాలతో మరో షెడ్యూల్‌ను పూర్తి చేశాం’ అని ట్వీట్ చేశారు కంగనా రనౌత్. -
అసెంబ్లీలో...
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ (నాయకి). ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. కరోనా వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. తాజాగా చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు. దీనికోసం అసెంబ్లీ సెట్‌ను నిర్మించారని సమాచారం. ఈ సెట్లో పలు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్లో కంగనా, ఇతర చిత్రబృందం పాల్గొంటారట. వచ్చే నెల 11 నుంచి షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో కరుణానిధిగా ప్రకాశ్ రాజ్, యంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. -
మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!
ప్రస్తుతం రుమేనియాలో సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ షూటింగ్ పూర్తి అయిన తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టనున్నాడు. స్పైడర్ సినిమా పనులను దాదాపుగా పూర్తి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో 2 కోట్లతో భారీ అసెంబ్లీ సెట్ ను రెడీ చేశారు. స్పైడర్ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే మహేష్ అసెంబ్లీ సెట్ లో జరిగే షూటింగ్ లో పాల్గొననున్నాడు. మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఘనవిజయం సాధించటంతో భరత్ అనే నేను పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
త్వరలో అసెంబ్లీకి మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు. అవును.. తన నెక్ట్స్ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ అసెంబ్లీ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు మహేష్. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్, ఆ తరువాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మహేష్ లేకుండానే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న సెకండ్ షెడ్యూల్లో మహేష్ కూడా పాల్గొననున్నాడట. పొలికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు యువ రాజకీయనాయుడిగా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కూడా అలరించనున్నాడట. ఈ సినిమాకు భరత్ అను నేను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఏదీ నిజం ఏదీ రూమర్ అన్న విషయం తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.