
PC: BCCI/IPL.com
IPL 2025 SRH vs DC Live Updates:
వర్షం కారణంగా ఎస్ఆర్‌హెచ్- ఢిల్లీ మ్యాచ్ రద్దు
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు అద్బుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ రైజర్స్ బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది.
దీంతో ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ విజయం ఖాయమని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ బ్యాటింగ్ అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి మైదానం సిద్దం చేసేందుకు దాదాపు గంటకుపైగా సమయం పట్టే సూచనలు కన్పించాయి. దీంతో అంపైర్‌లు మ్యాచ్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 13 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్దానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలన్న హైదరాబాద్ ఆశలు మాత్రం ఆడియాశలు అయ్యాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి ఇంటిముఖం పట్టింది.
వర్షం ఆటంకం..
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అనంతరం వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఇంకా మొదలు కాలేదు.
ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 7 వికెట్ల నష్టానికి ఢిల్లీ 133 పరుగులు చేసింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని స్టబ్స్(41 నాటౌట్), ఆశుతోష్ శర్మ(41) ఆదుకున్నారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు, ఉనద్కట్, హర్షల్ పటేల్, మలింగ తలా వికెట్ సాధించారు.
17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 105/6
17 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజులో అశుతోష్ శర్మ(30), స్టబ్స్(26) ఉన్నారు.
ఢిల్లీ ఆరో వికెట్ డౌన్..
62 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన విప్రజ్ నిగమ్.. రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో స్టబ్స్(15), ఆశుతోష్(0) ఉన్నారు.
పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్ప్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌గా అక్షర్, ఐదో వికెట్‌గా కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. కమ్మిన్స్ మూడు, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.
కమ్మిన్స్ ఆన్ ఫైర్.. కష్టాల్లో ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. అతడి బౌలింగ్ దాటికి ఢిల్లీ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో వికెట్‌గా అభిషేక్ పోరెల్ ఔటయ్యాడు.
ఢిల్లీ రెండో వికెట్ డౌన్..
ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన డుప్లెసిస్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(8), రాహుల్(3) ఉన్నారు.
ఢిల్లీ తొలి వికెట్ డౌన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అదిలోనే భారీ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో తొలి బంతికే ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది.
ఐపీఎల్-2025లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్‌హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సన్‌రైజర్స్ తుది జట్టులోకి అభినవ్ మనోహర్, సచిన్ బేబి వచ్చారు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి నటరాజన్ ఎంట్రీ ఇచ్చాడు.
తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్