
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC)తో తలపడనుంది. సొంత మైదానం ఉప్పల్‌లో అక్షర్ సేనను కమిన్స్ బృందం ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సాంకేతికంగా రైజర్స్‌కు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ఒకవేళ సోమవారం నాటి మ్యాచ్‌లో గనుక ఢిల్లీ చేతిలో ఓడితే.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తర్వాత ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన మూడో జట్టుగా సన్‌రైజర్స్ నిలుస్తుంది. ఈ క్రమంలో కీలక పోరు కోసం కమిన్స్ బృందం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
కేఎల్ రాహుల్‌ను కలిసిన బీఆఎర్‌ఎస్ ఎమ్మెల్యే
మరోవైపు.. ఢిల్లీ జట్టు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు అన్ని విధాలా సన్నద్ధమైంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను కలిశారు.
ఈ సందర్భంగా తన కుమార్తె శ్రీనికను కూడా కౌశిక్ రెడ్డి వెంట తీసుకువెళ్లారు. ఇక రాహుల్ కూడా ప్రేమ పూర్వకంగా నవ్వుతూ వీరిని పలకరించాడు. అదే విధంగా.. శ్రీనిక తీసుకువచ్చిన టీ-షర్టుపై తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫొటోలు కూడా దిగారు.
ఇందుకు సంబంధించిన వీడియోను పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఇంతకు ముందు.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. అదే జట్టుకు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా కౌశిక్ రెడ్డి కలిశారు.
కాగా కౌశిక్ రెడ్డి కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. దేశీ క్రికెట్‌లో ఆయన హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు.
అదరగొడుతున్న రాహుల్
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 సీజన్‌లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 371 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 93 నాటౌట్. ఇక ఢిల్లీ జట్టు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా తన భార్య అతియా శెట్టి తమ తొలి సంతానం ఇవారాకు జన్మనిచ్చిన నేపథ్యంలో రాహుల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
చదవండి: IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..!
Had a great time with KL Rahul. I absolutely loved his outfit colour...
PINK PERFECT 🩷@KLRAHUL@Kaushik @Shrinika@Cricket@PinkVibes pic.twitter.com/NI6Faiq5dD— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 5, 2025