రాజకీయ కక్షతోనే నా పేరు తొలగించారు | Mohammad Azharuddin’s Name Removed From Hyderabad Uppal Stadium, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్షతోనే నా పేరు తొలగించారు

Published Mon, Apr 21 2025 8:37 AM | Last Updated on Mon, Apr 21 2025 9:46 AM

 Azharuddin’s Name Removed From Uppal Stadium

మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ వ్యాఖ్య   

బంజారాహిల్స్‌(హైదరాబాద్): ఉప్పల్‌ స్టేడియంలోని నార్త్‌ స్టాండ్‌కున్న తన పేరును తొలగించడంపై భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ విచారం వ్యక్తం చేశారు. నార్త్‌ స్టాండ్‌ నుంచి అజహరుద్దీన్‌ పేరును తొలగించాలంటూ అంబుడ్స్‌మెన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య ఆదేశించిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

పదేళ్లపాటు ఇండియన్‌ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్ గా, 19 ఏళ్లు క్రికెటర్‌గా సేవలందించానని పేర్కొన్నారు. కొంత మంది కావాలని రాజకీయం చేసి లార్డ్స్‌ క్రికెట్‌ క్లబ్‌తో కోర్టుల్లో పిటిషన్‌¯ వేయించారని ఆరోపించారు. తనపై వచి్చన పలు ఆరోపణలను గతంలోనే కోర్టు కొట్టేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 ఒక హైదరాబాదీగా దేశం గర్వించే స్థాయికి ఎదిగానని, కుట్రలకు న్యాయపరంగా సమాధానం చెప్తానని అన్నారు. ఉదయం నుంచి తనకు వేలాదిగా తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని, నార్త్‌ స్టాండ్స్‌కు తన పేరును తొలగించడాన్ని వారు ఖండిస్తున్నారని అన్నారు. ఆనాడు క్రికెట్‌ అభిమానుల కోరిక మేరకే తన పేరును స్టాండ్స్‌కు పెట్టారని గుర్తు చేశారు.  

అజారుద్దీన్‌ పేరు తొలగింపుపై అభిమానుల ఆందోళన.. క్రికెటర్‌ అజారుద్దీన్‌ పేరును ఉప్పల్‌ స్టేడియంలో నార్త్‌స్టాండ్‌ నుంచి తొలగించాలంటూ అంబుడ్స్‌మెన్‌ కోర్టు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అజారుద్దీన్‌ అభిమానులు బంజారాహిల్స్‌లో ధర్నా చేశారు. అజారుద్దీన్‌ను కావాలంనే కొంత మంది రాజకీయ కక్షలతో వేధిస్తున్నారని ఇలాగే కొనసాగితే హెచ్‌సీఏ ముందు తాము ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement