azharuddin
-
ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్
-
అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన అజహరుద్దీన్ (ఫొటోలు)
-
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను కలిసిన అజారుద్దీన్ (ఫొటోలు)
-
మహ్మద్ అజారుద్దీన్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్‌పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఫిల్మ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఇన్నిరోజుల నుంచి రాజకీయ పార్టీలు ముమ్మరంగా సాగించిన ఎన్నికల ప్రచారానికి మంగళవారమే తెరపడింది. ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలను ఈసీ తీసుకుంటుంది. -
ఇండియా వరల్డ్ కప్.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వరల్డ్ కప్‌లో ఇండియా గెలవడం పక్కా, తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అజారుద్దీన్ వస్తే క్రికెట్ ఆడండి. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు వేయండి. అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ గల్లీ తెలియదు. ఏ మనిషి తెలియడు. అజారుద్దీన్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి తన్ని తరిమేశారు. యూపీలో చెల్లని అజారుద్దీన్ హైదరాబాద్‌లో ఎలా చెల్లుతారు. కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న మోజు తెలంగాణ ప్రజల మీద లేదు. కాంగ్రెస్ పార్టీలో 11 మంది సీఎం క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం. కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు ఎందుకు పూర్తి చేయలేక పోయింది. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి చూడలేక పోతున్నారు. అధికారంలోకి రాగానే 18 యేళ్లు నిండిన ఆడబిడ్డలకు 3 వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ దివంగత నేత పి.జనార్ధన్‌రెడ్డి కొడుకు విష్ణు బీఆర్ఎస్లో చేరి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. ఇదీచదవండి.. బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్ గాంధీ -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై వీడని ఉత్కంఠ!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటి జాబితాలో అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ సారథి మొహమ్మద్ అజహరుద్దీన్ ఉన్నారు. తమకే టికెట్ లభిస్తుందనే ధీమాతో ఇదివరకే వారు నియోజకవర్గంలో తమ ప్రచారాలను చేసేసుకుంటున్నారు. ఎవరికివారే తమకే టికెట్ ఖారారు అయిందని, డివిజన్ల నేతలతో మీటింగ్‌లు, బస్తీలు, కాలనీల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొదటి జాబితాలో తన పేరు వస్తుందని ఆశించిన ఇద్దరికీ నిరాశే ఎదురైంది. మరో రెండు రోజుల్లో తమకే టికెట్ అని నేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే గురువారం కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ ఎంపీ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అధిష్టానం అజహరుద్దీన్ సీటు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అవినీతి మరకతో ఎన్నికల బరిలోకి దిగితే ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తాయనే ఆందోళన.. ఆలోచనలో పడింది. దాదాపు లక్షకుపైగా మైనార్టీ ఓట్లు ఉన్న నియోజకవర్గంలో అజహరుద్దీన్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ కలిసివస్తుందని, సెటిలర్లు సైతం తమకే మొగ్గు అనే సంబరాల్లో ఉన్న అజహరుద్దీన్ టీం ఇప్పుడు ఇరకాటంలో పడిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికే టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం మరో ట్విస్ట్‌కు తెరలేపింది. ఎంఐఎం నుంచి ఒకసారి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవీన్‌యాదవ్‌కు ఢిల్లీకి పిలిపించింది. యువనేతగా బలమైన పోటీనిచ్చే వ్యక్తిగా బలాన్ని తెలుసుకొని పిలిపించారని సమాచారం. అయితే టికెట్ ఇస్తేనే కాంగ్రెస్‌లో ఉంటానని, లేకుండా ఎంఐఎం లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ధీమాగా వారికి చెప్పారని రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సారి తమకు మద్దతు ఇవ్వాలని, ఎంపీ అవకాశం ఇస్తామని చెప్పారట. ఎమ్మెల్యేగానే అవకాశం ఇవ్వాలని కోరారట. కాంగ్రెస్ అధిష్టానం విష్ణు వైపు మొగ్గు చూపుతుందా... మైనార్టీల బలంతో అజహరుద్దీన్‌కే టికెట్ ఇస్తారా.. లేక.. పోటీలో ఉన్న ఇద్దరినీ కాదని.. కొత్త వ్యక్తి ప్రత్యర్థితో బలంగా నిలబడే నవీన్‌యాదవ్ లాంటి వ్యక్తికి చాన్స్ ఇస్తుందా అనే విషయంలో త్వరలో తేలిపోతుంది. -
అధిష్టానం అవకాశమిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేస్తా: అజారుద్దీన్
సాక్షి, కామారెడ్డి జిల్లా: అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని లింగంపేట్‌లో అజారుద్దీన్ శుక్రవారం పర్యటించారు. ఆయన సమక్షంలో పలువురు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. అధిష్ఠానం అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే ఇప్పటికే కామారెడ్డి నుంచి బరిలో దిగేందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అజార్ వ్యాఖ్యలతో మరోసారి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. కాగా గతంలోనూ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమంటూ అజారుద్దీన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
నిన్న జరిగినా ఘటనకు మేం బాధ్యులం కాదు
-
కాసేపట్లో HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రెస్ మీట్
-
మన జట్టు బ్యాలెన్సింగ్ గా ఉంది: అజారుద్దీన్
-
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్‌ను ఆవిష్కరించిన అజారుద్దీన్,జయేశ్ రంజన్
-
అజార్ వేసిన పరువునష్టం కేసులో టి సి ఏ కార్యదర్శి కోర్టుకు హాజరు
-
హెచ్‌సీఏ వివాదం: జింఖానా వద్ద హెటెన్షన్
-
అపెక్స్ కౌన్సిల్ తీరుపై అజారుద్దీన్ ఫైర్
-
అజారుద్దీన్ వ్యాఖ్యలపై అపెక్స్ కౌన్సిల్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ మధ్య హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఎ) వ్యవహారాలలో గొడవలు తార స్థాయికి చేరాయి. తాజాగా అజారుద్దీన్ వ్యాఖ్యలపై అపెక్స్ కౌన్సిల్ కౌంటర్ ఇచ్చింది. లోధా సిఫార్సుల నిబంధనల మేరకే అజారుద్దీన్‌కు నోటీసులు జారీ చేసినట్లు కౌన్సిల్ పేర్కొంది. అపెక్స్ కౌన్సిల్‌లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులకు నోటీసు పంపినట్లు తెలిపారు. ఈరోజు(గురువారం) నుంచి అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు కాదని అపెక్స్ కౌన్సిల్ పేర్కొంది. హెచ్‌సీఏ వ్యవహారాల్లో బీసీసీఐ జోక్యం ఉండదని అపెక్స్ కౌన్సిల్ వివరించింది. కాగా నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అజహర్‌పై హెచ్‌సీఏ చర్య తీసుకుంది. సభ్యత్వం రద్దు చేసే హక్కు లేదు! అపెక్స్ కౌన్సిల్లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారని అజారుద్దీన్ ఆరోపించారు. తన సభ్యత్వం రద్దు చేసే హక్కు వారికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే తనపై ఆరోపణలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రెసిడెంట్ లేకుండా మీటింగ్‌లు ఎలా పెడతారు? అని అపెక్స్ కౌన్సిల్‌ను అజారుద్దీన్ ప్రశ్నించారు. అంబుడ్స్‌మన్ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు హెచ్‌సీఎలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఎవరినీ రానివ్వరు.. వచ్చినా ఉండనివ్వరు.. బ్లాక్మెయిల్ చేస్తారు.. అంటూ నిరసన వ్యక్తం చేశారు. చదవండి: వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు: అజారుద్దీన్ -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ట్విస్ట్
-
HCA: అజారుద్దీన్ సభ్యత్వం రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పు పట్టింది. కాగా అజార్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండడంతో హెచ్‌సీఏ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చదవండి: క్రౌడ్ ఫండింగ్... సేవా ట్రెండింగ్ -
అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం!
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడాది క్రితం వారంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, ఘన విజయం సాధించారు. కానీ ఇప్పుడు మాత్రం అంతర్గత విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో తాజా పరిస్థితి ఇది. అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్‌కు, ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా సాగుతున్న వివాదం చివరకు పోలీస్ స్టేషన్ దాకా చేరింది. హెచ్‌సీఏ సభ్యులు తనను బహిరంగంగా తిట్టారంటూ అజహర్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోశాధికారి సురేందర్ అగర్వాల్, మరో సభ్యుడు మొయిజుద్దీన్‌లపై పోలీసులు సెక్షన్ 504, 506ల కింద కేసులు నమోదు చేశారు. అసోసియేషన్ పనికి సంబంధించి ఒక హెచ్‌సీఏ ఉద్యోగి సురేందర్ అగర్వాల్ వద్దకు వెళ్లగా... ఆయనతో పాటు మరి కొందరు కలిసి సదరు ఉద్యోగితో పాటు అజహర్‌ను కూడా బూతులు తిట్టడంతో వివాదం ముదిరినట్లు తెలిసింది. దాంతో తనను దూషించారంటూ అజహర్ వర్గం పోలీసులను ఆశ్రయించింది. దీనికి సంబంధించి సోమవారం పోలీసులు విచారణ జరిపే క్రమంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా కొంత గొడవ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు అక్కడి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు సురేందర్ అగర్వాల్‌పై ఇంకో కేసు కూడా నమోదైంది. హెచ్‌సీఏ క్లబ్‌లకు రూ. 50 వేలు ఇస్తున్నామంటూ తమకు మాత్రం ఇవ్వలేదని, నిధులను కోశాధికారి సురేందర్ దుర్వినియోగం చేశారంటూ షాలీమార్ క్రికెట్ క్లబ్ యజమాని ఎజాజ్ అలీ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే కారణమా... సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో అజహర్‌కు, ఇతర సభ్యులకు మధ్య విభేదాలు మొదలైనట్లు సమాచారం. హెచ్‌సీఏలో వివాదాల పరిష్కారం కోసం జస్టిస్ దీపక్ వర్మను అజహర్ అంబుడ్స్‌మన్ నియమించారు. ఇది కమిటీలో ఇతర సభ్యులకు నచ్చలేదు. తమతో ఏమాత్రం సంప్రదించలేదని, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు చెబుతున్నారు. అయితే గత ఏడాది కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే ఇందుకు అంగీకారం తెలిపారని, నాటి సమావేశం మినిట్స్‌లో కూడా ఇది ఉందనేది అజహర్ వాదన. రాబోయే ఏజీఎంలో ఆమోద ముద్ర వేసిన తర్వాతే అంబుడ్స్‌మన్ నియామకాన్ని అమల్లోకి తేవాలని అజహర్ వ్యతిరేక బృందం చెబుతోంది. అయితే కరోనా నేపథ్యంలో 200కు పైగా సభ్యులు హాజరయ్యే అవకాశం ఇప్పట్లో లేని నేపథ్యంలో ఏజీఎం సాధ్యం కాదంటున్న అజహర్... ఏడాది కాలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో అసోసియేషన్ ఎలా పని చేస్తుందనేది మరో వర్గం వాదన. ఇటీవల క్లబ్‌ల పూర్తి వివరాలు, యజమానుల వివరాలు తనకు ఇవ్వాలంటూ అజహర్ లేఖ రాయడం కూడా వివాదానికి కారణమైంది. అంబుడ్స్‌మన్ వస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కింద తమకు ఇబ్బందురు ఎదురు కావచ్చనే కారణంతోనే హెచ్‌సీఏలో పలువురు సభ్యులు అజహర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని సమాచారం. చదవండి: ‘టీ20ల్లో ఆ మార్పు చేసి చూడండి.. ’ -
అజహర్... తీన్మార్
ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడుతూ సెంచరీ సాధించడం అంటే గొప్ప ప్రదర్శనగా గుర్తించవచ్చు. ఎందుకంటే 143 ఏళ్ల టెస్టు చరిత్రలో 2,384 మ్యాచ్‌లు జరిగితే 108 మందికే ఇది సాధ్యమైంది. అదే జోరు కొనసాగించి రెండో టెస్టులోనూ శతకం బాదితే అద్భుతమని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 9 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇక అంతటితో ఆగకుండా మూడో టెస్టు మ్యాచ్‌లోనూ వందతో చెలరేగిపోతే ఆ సంచలనాన్ని మొహమ్మద్ అజహరుద్దీన్ అనవచ్చు. ఎందుకంటే తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన ఈ మాజీ కెప్టెన్ రికార్డును ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికీ అజహర్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 1984–85 సీజన్లో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. భారత జట్టుకు సునీల్ గావస్కర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌కు అజహర్ ఎంపికయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే మూడో టెస్టులో సందీప్ పాటిల్ స్థానంలో అజ్జూను తీసుకున్నారు. 1984 డిసెంబర్ 31న మొదలైన ఈ టెస్టుతో అజ్జూ చరిత్ర సృష్టించాడు. తొలి సెంచరీ (కోల్‌కతా) ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ టెస్టులో అజహర్ ఐదో స్థానంలో వచ్చాడు. 322 బంతుల్లో 10 ఫోర్లతో 110 పరుగులు చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. అద్భుతంగా కెరీర్‌ను ఆరంభించిన అజహర్‌పై అందరి దృష్టీ పడింది. అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 437 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 276 పరుగులకే ఆలౌటైంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కు ఇబ్బంది కలగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అజహర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తుదకు ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. రెండో సెంచరీ (మద్రాస్) చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. అజహరుద్దీన్ 90 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. అనంతరం మైక్ గ్యాటింగ్ (207; 20 ఫోర్లు; 3 సిక్స్‌లు), గ్రేమ్ ఫ్లవర్ (201; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఇంగ్లండ్ 7 వికెట్లకు 652 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 380 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరకు 412 పరుగులు చేసి ఆలౌటై ఇంగ్లండ్ ముందు 33 పరుగుల విజయలక్ష్యాన్ని పెట్టింది. తీవ్ర ఒత్తిడిలో పోరాడుతూ ఇక్కడ సాధించిన మరో శతకం అజహర్ అసలు సత్తాను చూపించింది. 218 బంతుల్లో అజహర్ 18 ఫోర్లతో 105 పరుగులు సాధించాడు. భారత్ 9 వికెట్లతో ఈ మ్యాచ్ ఓడినా... మన హైదరాబాదీ ప్రదర్శించిన బ్యాటింగ్ సొగసు, అతని మణికట్టు మాయాజాలం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది. వరుసగా రెండో సెంచరీతో అజ్జూ తళుక్కుమన్నాడు. మూడో సెంచరీ ( కాన్పూర్) అజహర్‌కు ముందు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కు మాత్రమే తమ అరంగేట్రం తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన గుర్తింపు ఉంది. తాజా ప్రదర్శనతో భారత అభిమానుల దృష్టి అజహర్‌పై నిలిచింది. అతను మూడో మ్యాచ్‌లోనూ శతకాన్ని అందుకోగలడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అజహర్ అభిమానుల అంచనాలు వమ్ము చేయలేదు. చురుకైన బ్యాటింగ్‌తో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అజ్జూ 270 బంతుల్లో 16 ఫోర్లతో 122 పరుగులు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. భారత్ 8 వికెట్లకు 553 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 417 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఫలితం ‘డ్రా’గా ఖాయమైన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన అజహర్ 43 బంతుల్లోనే 5 ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలా అతని వరుసగా మూడు సెంచరీల ప్రదర్శన క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. మొత్తంగా 3 టెస్టుల్లో కలిపి అజహర్ 439 పరుగులు సాధించాడు. మూడో టెస్టులో వేటుపడ్డాక సందీప్ పాటిల్ మళ్లీ టెస్టు జట్టులోకి రాలేకపోయాడు. తన స్థానంలో వచ్చిన అజహర్ పాతుకుపోవడంతో పాటిల్ కెరీర్ అక్కడే ముగిసిపోయింది. భారత్ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్‌తో పాటు గంగూలీ, రోహిత్ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం -
ఐ యామ్ పాజిబుల్ పుస్తకావిష్కరణ
-
కేసీఆర్‌ను కలిసిన అజారుద్ధీన్ సానీయా మీర్జా
-
డేనైట్ టెస్టులకు కోహ్లి ఓకే అన్నాడు
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియాతో డేనైట్ టెస్టులను ఆడించే పనిలో పడ్డాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ డేనైట్ టెస్టులు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని దాదా చెప్పాడు. గురువారం తమ భేటీలో ఈ అంశం చర్చకు వచి్చందని అన్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం గంగూలీని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ డేనైట్ టెస్టులతో ప్రేక్షకాదరణ పెరుగుతుందని అన్నాడు. భారత క్రికెట్‌ను మరో దశకు తీసుకెళ్లేందుకు లక్ష్మణ్, అజహరుద్దీన్, సచిన్, ద్రవిడ్, కపిల్‌దేవ్, గావస్కర్‌ల సేవలి్న, సూచనల్ని స్వీకరిస్తామని చెప్పాడు. ‘డేనైట్ టెస్టులు ప్రాచుర్యం పొందుతాయని నేను బలంగా విశ్వసిస్తున్నా. ఎప్పుడు జరుగుతాయో చెప్పలేను కానీ... నా ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు జరిగేందుకు కృషిచేస్తా’నని అన్నాడు. ఏదేమైనా సౌరవ్ వచ్చే జూలైలో ని్రష్కమించే సమయానికి భారత్‌లో డేనైట్ టెస్టులు జరిగే అవకాశం లేదు. ఈ సీజన్లో స్వదేశంలో బంగ్లాతో జరిగే టెస్టు సిరీసే ఆఖరి సిరీస్. టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడే గంగూలీ దులీప్ ట్రోఫీని డేనైట్ మ్యాచ్‌లుగా పింక్ బాల్‌తో నిర్వహించాలని సిఫార్సు చేశాడు. కానీ దేశవాళీ బౌలర్ల అభ్యంతరంతో అది కార్యరూపం దాల్చలేదు. గత మూడేళ్లుగా భారత జట్టు అద్భుతంగా రాణిస్తోందని ‘దాదా’ అన్నాడు. ప్రపంచంలోనే ఐపీఎల్ ప్రముఖ లీగ్‌గా ఘనతకెక్కిందని పేర్కొన్నాడు. ఎన్సీఏకు ప్రాధాన్యత ఇవ్వాలని... క్యాబ్ ప్రాజెక్ట్ ‘విజన్ 2020’ సలహాదారుడైన వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ‘భారత్ ఇంతలా రాణించేందుకు ప్రధాన కారణం రిజర్వ్ బెంచే. ఈ నేపథ్యంలో ‘దాదా’ ఇప్పుడు ఎన్సీఏకు మరింత ప్రాధాన్యమిస్తాడని ఆశిస్తున్నా. 1999–2000 సీజన్లో భారత్... ఆసీస్, దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో గంగూలీ జట్టులో ఆశావహ దృక్పథాన్ని పెంచాడు. కుర్రాళ్లు రాణించేందుకు ప్రేరణగా నిలిచాడు. ఇప్పుడు బోర్డు పరిపాలకుడిగా కూడా అతను విజయవంతం అవుతాడు’ అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో వీవీఎస్‌తో పాటు మాజీ కెపె్టన్, ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ హాజరయ్యాడు. అజ్జూ మాట్లాడుతూ ‘గంగూలీ బోర్డు అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉంది. అతని సారథ్యంలో భారత్ ఎన్నో టోరీ్నలు గెలిచింది. అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి బోర్డును కూడా సమర్థంగా నడిపిస్తాడు’ అని అన్నాడు. -
కెప్టెన్లా నడిపిస్తా!
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు కనిపించిన ఆత్మవిశ్వాసం... తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టగలననే గుండె ధైర్యం... భవిష్యత్తుపై భరోసా కల్పించే ప్రయత్నం... దారి తప్పిన వ్యవస్థను చక్కబెట్టగలననే నమ్మకం... సరిగ్గా ఇవే లక్షణాలు బీసీసీఐకి 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో 47 ఏళ్ల సౌరవ్ చండీదాస్ గంగూలీలో మళ్లీ కనిపించాయి. టీమ్ కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు తనకు లభించిన బ్లేజర్‌ను ధరించి బోర్డు కార్యాలయానికి వచ్చిన ‘దాదా’ హుందాగా మాట్లాడాడు. రాబోయే రోజుల్లో తన ప్రాధాన్యతలు, ప్రణాళికలకు సంబంధించి ఎలాంటి గందరగోళానికి అవకాశం లేకుండా తొలి మీడియా సమావేశంలో గంగూలీ వాటిపై మరింత స్పష్టతనిచ్చాడు. ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ శైలి అందరికీ చిరపరిచితం. దూకుడైన నాయకుడిగా, ప్రత్యర్థి ఎంతటివాడైనా ఢీ అంటే ఢీ అంటూ తలపడేందుకు వెరవని తత్వంతో టీమిండియాకు కొత్త దిశను అతను చూపించాడు. ఇప్పుడు అదే తరహాలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేస్తానని అతను చెప్పాడు. తనకు తెలిసిన విధానంలోనే ఫలితాలు రాబడతానని వ్యాఖ్యానించాడు. విభిన్న అంశాలపై గంగూలీ చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే... బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపిక కావడంపై... బోర్డు సభ్యులు నాకు ఈ బాధ్యత తీసుకునే అవకాశం ఇవ్వడం గర్వకారణంగా భావిస్తున్నా. బీసీసీఐకి ఇది కొత్త ఆరంభంగా భావిస్తున్నా. నేను కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. సంస్కరణలు తీసుకురావాలి. రాష్ట్ర సంఘాలకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది పెద్ద సవాలే అయినా మార్పు తీసుకు రాగలనని నమ్ముతున్నా. నాకు తెలిసిన పద్ధతిలో, భారత జట్టును కెపె్టన్‌గా ఎలా నడిపించానో ఇక్కడా అలాగే పని చేస్తా. విశ్వసనీయత దెబ్బ తినకుండా, అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తా. గత మూడేళ్లుగా కమిటీ లేదు, సమావేశాలు లేవు కాబట్టి సరిగ్గా ఏం జరిగిందో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఏం చేసినా భారత బాగు కోసమే. ధోని భవిష్యత్తుపై... ధోనిలాంటి క్రికెటర్ ఉండటాన్ని మనం గరి్వంచాలి. అతను సాధించిన ఘనతలు చూస్తే వహ్వా అనిపిస్తాయి. చాంపియన్ ఆటగాళ్లు అంత త్వరగా తప్పుకోరు. నన్ను కూడా జట్టులోంచి తొలగించిన తర్వాత మళ్లీ రాలేనన్నారు. కానీ పునరాగమనం చేసి మరో నాలుగేళ్లు ఆడగలిగాను. ధోని మనసులో ఏముందో తెలీదు. నేను ఇంకా మాట్లాడలేదు. అయితే నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరి గౌరవానికి భంగం కలగదు. ఐసీసీ నుంచి రావాల్సిన సొమ్ముపై... చాలా మంది దీనిపై అవగాహన లేక తప్పుగా మాట్లాడుతున్నారు. కాబట్టి దీనిపై స్పష్టతనిస్తున్నాను. ఐసీసీ నుంచి భారత్‌కు ఐదేళ్ల కాలంలో 372 మిలియన్ డాలర్లు రావాల్సి ఉంది. అయితే అందులో రాబోయే రెండు టి20 ప్రపంచకప్‌లు, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ నిర్వహణ తదితర అంశాలు కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు మనకు రావాల్సిన మొత్తం దాదాపుగా వచ్చేసింది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే తీసుకోవచ్చు. దీనిపై ఐసీసీతో చర్చిస్తాం. భారత ఆటగాళ్లు, బోర్డు మధ్య సంబంధాల గురించి... బోర్డులో ఆటగాళ్ల సఖ్యత విషయంలో నాకు తెలిసి ఎప్పుడూ సమస్య రాలేదు. నేను కెపె్టన్‌గా ఉన్నప్పుడు దాలి్మయా అధ్యక్షుడిగా ఉన్నారు. మేమేదైనా అడగడం, ఆయన ఇవ్వకపోవడం ఎప్పుడూ జరగలేదు. శ్రీనివాసన్, ధోని మధ్య ఎంత సత్సంబంధాలు కొనసాగాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు విరాట్ కోహ్లి కెపె్టన్‌గా ఉన్నాడు. భారత జట్టు బాగా ఆడేందుకు అతను ఏం కోరినా ఇవ్వగలిగే స్థాయి సంబంధాలు నేను కొనసాగిస్తాను. కోహ్లి అద్భుతమైన ఆటగాడు. గత కొన్నేళ్లలో అతను జట్టును గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. అతనికి మేం అండగా నిలుస్తాం. దేశవాళీ క్రికెట్ పరిస్థితి దిగజారుతుండటంపై... నా మొదటి ప్రాధాన్యత దీనికే. రంజీ ట్రోఫీ ప్రారంభానికి ముందే తగిన చర్యలు తీసుకుంటాం. గత మూడేళ్లలో దేశవాళీలో అన్ని ఫార్మాట్లలో కలిపి మ్యాచ్‌ల సంఖ్య వేయి నుంచి దాదాపు 2 వేలకు పెరిగింది. రంజీ ట్రోఫీని పటిష్టంగా మార్చేందుకు, పోటీ పెరిగేందుకు సమగ్రంగా మార్పులు తీసుకొస్తాం. అప్పుడే మనకు గొప్ప క్రికెటర్లు వస్తారు. ఆటగాళ్లకు ఆర్థికపరమైన భరోసా కలి్పంచడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రేక్షకులు స్టేడియానికి రాకపోవడంపై... అది వాస్తవం కాదు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు తక్కువగా జనాలు వచ్చినా అదే స్టేడియాలకు ఐపీఎల్ సమయంలో ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. ఊరికి దూరంగా ఉండటం, సరైన సౌకర్యాలు లేకపోవడంవంటి సమస్యలు ఉన్నా ఆటకు ఆదరణ తగ్గడం లేదు. కాబట్టి లోపం మరో చోట ఉందని అనిపిస్తోంది. దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. ముందే నిర్ణయించుకున్నా... భారత కెపె్టన్‌గా ఎంపికైనప్పుడు నాకు ఈ బ్లేజర్ లభించింది. దానినే ఈ రోజు తొడుక్కోవాలని కూడా నిర్ణయించుకున్నాను. అయితే ఇది ఇంత వదులుగా ఉంటుందని ఊహించలేదు. అయినా సరే ఇక్కడికి వేసుకొచ్చాను. ఇది మంచి ఆలోచనే అనుకుంటున్నా. తొలి కెప్టెన్‌తో... బీసీసీఐ సమావేశానికి హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో అజహరుద్దీన్ హాజరయ్యాడు. బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీని అభినందిస్తూ అజహర్ ఆనందం వ్యక్తం చేశాడు. అజహర్ సారథ్యంలోనే గంగూలీ తన తొలి వన్డే (1992–బ్రిస్బేన్), తొలి టెస్టు మ్యాచ్ (1996–లార్డ్స్) బరిలోకి దిగాడు. సౌరవ్ కెపె్టన్సీలో అజ్జూ 11 వన్డేలు ఆడాడు. ఫిక్సింగ్, నిషేధం వివాదాలు ఉన్నా అజహర్‌తో గంగూలీ మంచి సంబంధాలు కొనసాగించాడు. ఏడాది క్రితం విండీస్‌తో మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో అజహర్ గంట మోగించేందుకు ‘క్యాబ్’ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీతో సాన్నిహిత్యమే కారణం. -
షీ ఈజ్ హైపర్
-
ఫుట్‌బాల్ రాత మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) సహ యజమాని విజయ్ మద్దూరి తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడినుంచి సాకర్ స్టార్లను తయారు చేస్తామని చెప్పారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కొత్తగా ఈ ఏడాది హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రవేశించింది. వచ్చే నెల 20న మొదలయ్యే ఈ సీజన్లో హైదరాబాద్ ఎఫ్‌సీ తలపడనుంది. ఈ సందర్భంగా ఆదివారం టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి ప్రముఖ తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేశ్, భారత క్రికెట్ మాజీ కెపె్టన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడు అజహరుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జట్టు యజమాని విజయ్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా నగరంలో ఫుట్‌బాల్‌ను విస్తరిస్తామని అన్నారు. నగరానికి ఫుట్‌బాల్‌లో చక్కని చరిత్ర ఉందని, తమ జట్టు దాన్ని మరింత బలబరిచేందుకు కృషి చేస్తుందని సహ యజమాని వరుణ్ త్రిపురనేని చెప్పారు. వెంకటేశ్ మాట్లాడుతూ ‘ఓ క్రీడాభిమానిగా హైదరాబాద్ ఎఫ్‌సీ ఫ్రాంచైజీకి స్వాగతం పలుకుతున్నా. ఐఎస్ఎల్లో తలపడేందుకు ఇప్పుడు మనకంటూ ఓ జట్టు ఉందని సంతోషం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి పలువురు అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. 1956 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో ఎనిమిది మంది హైదరాబాదీలే. ఈ క్లబ్‌తో మళ్లీ నగరానికి సాకర్ వైభవం రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. అజహర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఎఫ్‌సీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తొమ్మిదేళ్ల క్రితమే తాను ఫుట్‌బాల్ అభివృద్ధికి తపించానని... అయితే అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. -
టీఆర్ఎస్లోకి అజహరుద్దీన్?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ టీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజహరుద్దీన్ అధ్యక్షుడిగా గెలిచారు. ఈ నేపథ్యం లో సీఎం కేసీఆర్‌తోపాటు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీకి అజహరుద్దీన్ అపాయింట్మెంట్ కోరారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నిౖకైన అనంతరం అజహర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను రాష్ట్రానికి బాస్‌గా అభివర్ణించారు. టీఆర్ఎస్లో చేరికపై ప్రశ్నించగా.. రాజకీయాలకు ఇది సందర్భం కాదని వ్యాఖ్యా నించారు. అయితే శనివారం సీఎంతో భేటీ అనంతరం అజహర్ చేరికపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇన్నా ళ్లూ హెచ్‌సీఏ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ జి.వివేక్‌కు చెక్ పెట్టేందుకు అజహర్‌కు టీఆర్ఎస్ పరోక్ష సహకారమందించింది. అజహర్‌కు మద్దతు కూడగట్టడంలో ఓ మహిళా మంత్రి, ఆమె కుమారుడు కీలక పాత్ర పోషించినట్లు హెచ్‌సీఏ వర్గాల సమాచారం. హుజూర్నగర్ ఉపఎన్నిక నేపథ్యంలోనే..? హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇక్కడ టీఆర్ఎస్ గెలవకపోవడంతో ఉపఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అజహర్‌తోపాటు మరికొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ఆత్మస్థైర్యం దెబ్బ తీయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
హెచ్‌సీఏలో అజర్ హవా
-
నామినేషన్ తిరస్కరణ.. వివేక్ ఆగ్రహం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవి కోసం తాను దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడం అన్యాయమని మాజీ అధ్యక్షుడు జి.వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ ళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిక్సింగ్‌కు పాల్పడిన అజహరుద్దీన్‌ను వెనుకేసుకొస్తూ, క్రికెట్ అభివృద్ధికి కృషి చేసిన తన నామినేషన్‌ను తిరస్కరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ‘క్రమశిక్షణా కమిటీ విచారణలో తాను ఫిక్సింగ్ చేసినట్లు స్వయంగా అజహరుద్దీన్ ఒప్పుకున్నారు. అయినా అతని నామినేషన్ స్వీకరించారు. ఇప్పటికీ బీసీసీఐ అతనిపై నిషేధాన్ని ఎత్తివేయలేదు. నిషేధాన్ని ఎత్తివేస్తే అందుకు సంబంధించిన పత్రాల్ని బయట పెట్టమనండి. బీసీసీఐ నుంచి నిధులు రాకున్నా సొంత ఖర్చుతో టి20 లీగ్ నిర్వహించా. నాపై తప్పుడు రిపోర్టులు సృష్టించి హెచ్‌సీఏకు దూరం చేశారు’ అని ధ్వజమెత్తారు. తమ ప్యానెల్‌నుంచి అధ్యక్షుడిగా ప్రకాశ్ చంద్ జైన్, ఉపాధ్యక్షునిగా దల్జీత్ సింగ్, కార్యదర్శిగా వెంకటేశ్వరన్, సంయుక్త కార్యదర్శిగా శివాజీ యాదవ్‌లను గెలిపించాలని కోరారు. క్రీడల్లోనూ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే చక్రం తిప్పుతోన్న కల్వకుంట్ల కుటుంబం... క్రీడల్లోనూ తన వర్గాన్ని తయారుచేసే దిశగా పావులు కదుపుతోందని ఆరోపించారు. ఆ ప్రయత్నంలోనే అజహరుద్దీన్‌తో చేతులు కలిపిన కేటీఆర్ తాజా హెచ్‌సీఏ ఎన్నికల్లో అజహర్‌కే ఓటువేయాలంటూ ఓటర్లని ప్రభావితం చేస్తున్నారన్నారు. అజహరుద్దీన్ తర్వాత కవితకు అవకాశం ఇవ్వాలనే ప్రణాళికతోనే ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
‘మోదీ వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో మోదీ చేసిన అభివృద్ది చెప్పడం కంటే.. రాహుల్ గాంధీ ఫ్యామిలీపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీల గూర్చి ప్రస్తావించడం లేదని పేర్కొన్నారు. యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమైతే అధిష్టానం చూసుకుంటుందన్నారు. అంబర్‌పేట్‌లో జరిగిన ఘర్షణలపై మాట్లాడుతూ.. మజీద్ స్థలం పురాతనమైనదని అన్నారు. జీహెచ్ఎంసీ అక్రమంగా కూల్చివేసిందని తెలిపారు. పురాతన మజీద్‌కు కనీసం గౌరవం ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనికి కారణమైన అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపరిహారం ఎవరికి చెల్లించారని నిలదీశారు. ఏ ప్రాతిపదికగా చెల్లించారని, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న మజీద్‌కు ఇతరులకు ఎలా పరిహారం చెల్లిస్తారని ప్రశ్నించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
పురాతన మజీద్‌కు కనీసం గౌరవం ఇవ్వలేదు
-
మజ్లిస్‌తో ఢీ
సాక్షి, సిటీబ్యూరో: మజ్లిస్ పార్టీ కంచుకోట హైదరాబాద్ లోకసభ స్థానాన్ని బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌తో బద్ధ శత్రువైఖరి అవలంబిస్తున్న మజ్లిస్‌ను సొంత గడ్డపైనే ఓడించాలని పకడ్బందీ వ్యూహం పన్నుతోంది. ఇందుకోసం ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని గట్టిగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలున్న బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్టీలోని సుమారు 39 మంది పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ ఇప్పటికే దరఖాస్తులను వడపోసి ముగ్గురు పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అందులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్, టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం విస్తరించి ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మినహా ఆరు నియోజకవర్గాలకు మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. గట్టిపట్టు కూడా ఉంది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ పోటీ చేయనున్నారు. దీంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అసద్‌ను ఢీ కొట్టేదెవరు..? మజ్లిస్ అధినేత అసదుద్దీన్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే...ఈ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక ఓటర్లు అధికంగా ఉన్న కారణంగా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ బరిలోకి దింపితేనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. గతేడాది నవంబర్‌లో ముందస్తు ఎన్నికల సమయంలో అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. 2009లో ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అజహరుద్దీన్ గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టోంక్ సవాయి మదోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అధిష్టానం హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపాలని భావిస్తుండగా, ఆయన మాత్రం సికింద్రాబాద్‌లోక్ సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి కనబర్చుతున్నారు. మరోవైపు ముంబయి సెంట్రల్ నుంచి బరిలో దిగుతారని అక్కడి పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్ అభ్యర్థిత్వం కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. ఇప్పటికే నాంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ముచ్చటగా మూడు పర్యాయాలు బరిలో దిగి స్వల్ప ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలోకి నాంపల్లి నియోజకవర్గం రానప్పటికీ పోటీకి ఆసక్తి కనబర్చుతున్నారు. తాజాగా టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ పేరు కూడా వినవస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి అసదుద్దీన్‌పై సోహెల్ బరిలో దిగుతారని సోషల్ మీడియా పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. సోహెల్ అభ్యర్థిత్వం ఖాయమని, అధికారిక ప్రకటనే తరువాయి అని ప్రచారం కొనసాగుతోంది. అయితే అధిష్టానవర్గం బరిలో ఎవరిని దింపనుందో వేచిచూడాల్సిందే. -
‘కారు’ ఎక్కనున్న అజారుద్దీన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇటీవల ఓ ఎంపీ కూతురు వివాహంలో టీఆర్ఎస్ కీలక నేతలతో ఆయన చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆ ఎంపీ సైతం అజారుద్దీన్‌ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్లో అజారుద్దీన్ అధికారికంగా చేరుతున్నట్టు ఆయన సన్నిహితులు, అభిమానులు వెల్లడించారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా.. క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన అజారుద్దీన్ 2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఏడాదే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరా దాబాద్ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు. అసెం బ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయన్ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ నియమించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడటంతో అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారాలని నిర్ణ యం తీసుకున్నట్టు సన్నిహితులు పేర్కొన్నారు. అందుబాటులోకి రాని అజారుద్దీన్.. టీఆర్ఎస్లో చేరే విషయంపై ‘సాక్షి’ అజారుద్దీన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. తనకు సన్నిహితులుగా పేరున్న ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని, సికింద్రాబాద్ ఎంపీ స్థానా న్ని టీఆర్ఎస్ ఆయనకు కేటాయించే అవకాశాలున్నాయని తెలిపారు. కాగా, సోమవారం గోల్కొండ హోటల్లో జరిగిన కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి కూడా అజార్ హాజరయ్యారు. -
‘టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే’
హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య స్నేహపూర్వకమైన పోటీ ఉందని, టీఆర్ఎస్, ఎంఐఎంలలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ కుమార్ తివారీ వ్యాఖ్యానాంచారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దారుణమన్నారు. తెలంగాణాలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. తెలంగాణాలో ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరగడం లేదన్నారు. గతంలో కూడా కోదండరాంను కూడా ఇలానే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బహిరంగంగానే మద్ధతు తెలిపిందని చెప్పారు. లోక్‌సభకు ఎన్నికలు జరిగే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం: అజారుద్దీన్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు అజారుద్దీన్ అన్నారు. పోలీసులు చట్టపరిధి దాటి శ్రుతి మించి పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలని కోరారు. కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతోనే టీఆర్ఎస్ ఇలాంటి పనులు చేస్తున్నదని ధ్వజమెత్తారు. -
కేసీఆర్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలి: అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని మభ్యపెట్టి మోసం చేసినందుకు ముస్లింలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజహరుద్దీన్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు సాధ్యం కానప్పుడు ఎందుకు మభ్యపెట్టారని ప్రశ్నించారు. ఎన్నికల సభలో ముస్లిం యువకుడు రిజర్వేషన్‌పై ప్రశ్నిస్తే కేసీఆర్ స్పందించిన తీరు బాగాలేదని, స్థాయిని దిగజార్చుకునే విధంగా మాట్లాడారని దుయ్యబట్టారు. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు నదీమ్, జావిద్, రాష్ట్ర అధ్యక్షుడు సొహైల్, రాష్ట్ర ఇంచార్జి సలీం అహ్మద్, పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉందని, కేసీఆర్ సమాధానం చెప్పిన విధానాన్ని బట్టే ముస్లిం మైనారిటీల పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుందన్నారు. తనకు సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేయాలని ఉందని అజహరుద్దీన్ తెలిపారు. అయితే ఎక్కడి నుండి పోటీచేయాలన్నది పార్టీ హైకమాండ్æ నిర్ణయిస్తుందన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అజహర్ సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్ నియమితులయ్యారు. మరో 14 మంది నేతలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చోటు దక్కగా, ఇందులో పలువురు ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేతలు కూడా ఉన్నారు. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా తాజా నియామకంపై అజహరుద్దీన్ యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ ఉపాధ్యక్షులుగా బి.ఎం.వినోద్‌కుమార్, జాఫర్ జావెద్‌లు నియమితులయ్యారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఎస్.జగదీశ్వరరావు, నగేశ్ ముదిరాజ్, టి.నర్సారెడ్డి, మానవతారాయ్, ఫహీం, కైలాశ్, లక్ష్మారెడ్డి, క్రిశాంక్ నియమితులు కాగా, పీసీసీ కార్యదర్శులుగా దుర్గం భాస్కర్, దరువు ఎల్లన్న, విజయ్‌కుమార్, బాలలక్ష్మి నియమితులయ్యారు. -
‘బీసీసీఐ నన్ను బ్యాన్ చేయలేదు’
సాక్షి, హైదరాబాద్ : తనపై బీసీసీఐ నిషేధం విధించలేదని, తాను హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రకటించారు. శనివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ ప్రజల మద్దతు తనకుందని తెలిపారు. అజారుద్దీన్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. హైకమాండ్ ఆదేశిస్తే తాను సిద్దంగా ఉన్నానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇదే విషయంపై గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. -
రిషభ్ బ్యాటింగ్ ఘనం
న్యూఢిల్లీ: పరిస్థితులకు తగినట్లుగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం, పట్టుదల రిషభ్ పంత్‌లో బలంగా ఉన్నాయని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ‘సాధారణంగా పంత్ దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతాడు. అదే అతని శైలి. అయితే ఎర్ర బంతితో ఆడినప్పుడు కూడా జట్టు అవసరానికి తగినట్లు తనను తాను మలచుకోగలడు. అతను జాతీయ జట్టులోకి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇప్పటినుంచి అతను తన కెరీర్ మరింత బాగా మలచుకోగలడని నమ్ముతున్నా’ అని ద్రవిడ్ అన్నాడు. ‘ప్రస్తుత ఇంగ్లండ్ ‘ఎ’ పర్యటనలో వివిధ సవాళ్లకు తగినట్లుగా ఆడే విధంగా రిషభ్‌కు అవకాశం కల్పించాం. వన్డే టోర్నీ ఫైనల్లో అర్ధ సెంచరీ, విండీస్ ‘ఎ’తో నాలుగు రోజుల మ్యాచ్‌లో జయంత్‌తో వందకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం మనం చూశాం’ అని ద్రవిడ్ వివరించాడు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ మాట్లాడుతూ ఇంగ్లండ్‌పై గెలవాలంటే కోహ్లి సేన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని సూచించాడు. -
ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న నేతలు వీరే!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో కొత్త కిరికిరి మొదలైంది! మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో రచ్చకు దారి తీశాయి. తాను ఈసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉంటానని ఆయన బహిరంగంగా ప్రకటించడంతో ఇక్కడ్నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంజన్‌కుమార్ యాదవ్ భగ్గుమన్నారు. ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఆవేశంతో ఊగిపోయారు. తనపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని, వీటిని కొంద రు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన నగర కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎంపీ అజహరుద్దీన్‌పై విరుచుకుపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, తాను సికింద్రాబాద్ నుంచే బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అజహరుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయవచ్చని సవాల్ విసి రారు. అంజన్‌కుమార్ మాట్లాడుతుండగానే మాజీ ఎంపీ వీహెచ్ సమావేశం నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ లోక్‌సభ విషయంలో జరుగుతున్న వివాదమే పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో నెలకొనడం గమనార్హం. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు పోటీ పడుతుండటం చూస్తుంటే టికెట్ల సమయంలో తల నొప్పులు తప్పేలా లేవన్న చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల పార్టీ బరిలోకి దింపాలని భావిస్తున్న అభ్యర్థులు పోటీకి సుముఖంగా లేకపోవడం గమనార్హం. టికెట్లు ఆశిస్తున్న వారి వివరాలివీ.. ♦ మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని అంటున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ తన కుమా ర్తె శ్రుతిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ్నుంచి బీసీలకు సీటు ఇవ్వాల్సి వస్తే రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశముంది. ♦ నాగర్‌కర్నూల్ నుంచి నంది ఎల్లయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వయసు, ఆరోగ్యం రీత్యా ఈసారి పోటీ చేయకుంటే మాజీ ఎంపీ మల్లు రవి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన గతంలో పోటీచేసిన జడ్చర్ల స్థానంలో జనరల్ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలున్నాయి. ♦నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సీఎం కేసీఆర్ నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే తాను కాంగ్రెస్ నుంచి బరి లో ఉండి ఓడిస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈయనతో పాటు సీఎల్పీ నేత జానారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే జానా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ కూడా నల్లగొండ లోక్‌సభ సీటును ఆశిస్తున్నారు. ♦ భువనగిరి పార్లమెంటు సీటు నుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయ న సోదరుడు వెంకటరెడ్డి నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీచేస్తే రాజగోపాల్ అసెంబ్లీ బరిలో ఉంటారు. అప్పుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలకు అవకాశం ఉంటుంది. దాసోజు శ్రవణ్ కూడా భువనగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ♦ చేవెళ్ల పార్లమెంటు సీటు నుంచి గత ఎన్నికల్లో పటోళ్ల కార్తీక్‌రెడ్డి పోటీ చేశారు. ఆయన ఈసారి రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం బరిలో నిలవాలనే ఆలోచనలో ఉన్నందున ఆయన తల్లి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల నుంచి పోటీకి దింపాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. ♦ మల్కాజ్గిరి బరిలో రేణుకా చౌదరి ఉంటారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు ఈసారి జనరల్ సీటు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దనరెడ్డి కూడా ఆసక్తి చూపుతున్నారు. ♦ ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదం నేపథ్యంలో గతంలో పోటీచేసిన నరేశ్‌జాదవ్‌కు టికెట్ ఇవ్వడంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆదివాసీల ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న సోయం బాపూరావు ఇక్కడ్నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయి. ♦ పెద్దపల్లి లోక్‌సభకు గతంలో పోటీచేసిన వివేక్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. ఇక్కడ్నుంచి ప్రస్తు తం తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ సుగుణకుమారి పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ లేదా ఉమ్మడి ప్రతిపక్షా ల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్‌ను బరిలోకి దిం పాలనే ఆలోచన కూడా టీపీసీసీ పెద్దల్లో ఉంది. జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, స్థానిక నేతలు గజ్జెల కాంతం, గోమాస శ్రీనివాస్, గుమ్మడి కుమారస్వామిల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ♦ కరీంనగర్‌కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్‌కు మధుయాష్కీగౌడ్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ♦ వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రాజయ్య మళ్లీ బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ఎస్సీ కోటాలో ఈ సీటును ఆశిస్తున్నారు. మాజీ మంత్రి విజయరామారావు పేరు కూడా వినిపిస్తోంది. ♦ మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఎల్‌హెచ్‌పీఎస్ నేత బెల్లయ్య నాయక్ కూడా పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ♦ జహీరాబాద్ లోక్‌సభ సీటుకు గతంలో పోటీచేసిన సురేశ్ షెట్కార్ ఈసారి పోటీకి ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఇక్కడ ఇటీవలే పార్టీలో చేరిన మదన్మోహన్రావును బరిలో దింపే అవకాశాలున్నాయి. ♦ మెదక్ నుంచి గతంలో పోటీ చేసిన శ్రవణ్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మావతి పేర్లు వినిపిస్తున్నాయి. ♦ హైదరాబాద్ లోక్‌సభ సీటుకు మాజీ క్రికెటర్ అజహరుద్దీనే సరైన అభ్యర్థి అని హైకమాండ్ భావిస్తోంది. ఆయన ఇక్కడి నుంచి పోటీచేసేందుకు ఇష్టపడకపోతే గతంలో అసదుద్దీన్‌పై పోటీచేసిన జాహెద్ అలీ ఖాన్‌కు మద్దతివ్వడం లేదంటే మరో మైనార్టీ అభ్యర్థి ని బరిలో నిలిపే అంశాలను టీపీసీసీ పరిశీలిస్తోంది. n ఖమ్మం లోక్‌సభ విషయంలో ఇంకా స్పష్టత రా లేదు. సీపీఐతో పొత్తు కుదిరితే ఆ స్థానాన్ని వారికి వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ చేయాల్సి వస్తే రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి లేదా టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు (కాంగ్రెస్‌లోకి వస్తే)లో ఒకరు బరిలో ఉండొచ్చు. -
కాంగ్రెస్ పార్టీలో ‘గ్రేటర్’ చిచ్చు
-
అంజన్ వర్సెస్ అజార్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ‘గ్రేటర్’ చిచ్చు రాజుకుంది. ఈ చిచ్చు కారణం మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అజహరుద్దీన్ ఇటీవల చేసిన ప్రకటన.. గ్రేటర్ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. అజార్ ప్రకటనపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ భగ్గుమన్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి ఈ సారి తానే పోటీ చేయబోతున్నట్లు ఆయన సమావేశంలో స్పష్టం చేశారు. అజహరుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంజన్ కుమార్ మాట్లాడుతుండగా మాజీ ఎంపీ వీ హనుమంతరావు విసురుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అంజన్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా, అజహరుద్దీన్‌కు వ్యతిరేకంగా కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. మధ్యలో కల్పించుకున్న మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ.. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ అంజన్‌దేనని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని నచ్చజెప్పారు. మరోవైపు ఈ సమావేశానికి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్, ఆయన తనయుడు విక్రమ్‌గౌడ్‌లు హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. -
‘రాజ్యసభ’ బరిలో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీలోకి దించాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 12వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిపైనా సమావేశంలో చర్చ జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టడంపై చర్చించారు. అయితే పోటీ పెట్టడం వల్ల గెలిచే పరిస్థితి లేదని, పోటీలోకి దిగడం అనవసరమని కొందరు వాదించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్టుగా ఉంటుందని, టీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాలను ఎండగట్టడానికి ఉపయోగపడుతుందనే నిర్ణయానికి సీఎల్పీ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థిని పోటీలోకి దించాలని నిర్ణయించింది. వ్యతిరేకతను తప్పుదారి పట్టించేందుకే.. సీఎం కేసీఆర్ వైఫల్యాలను, టీఆర్ఎస్ అసమర్థతను, ప్రజల్లో వ్యతిరేకతను తప్పుదారి పట్టించడానికే మూడో కూటమి పేరుతో నాటకం ఆడుతున్నారని సంపత్ విమర్శించారు. దళితులపై జరిగే దాడులు, రైతు సమస్యలు, శాంతి భద్రతల సమస్యలు, రాజకీయ హత్యలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా వెల్లడించారు. మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వడం లేదని, దీనిపై పోరాడతామన్నారు. రవీంద్రనాయక్ లేదా అజహరుద్దీన్ రాజ్యసభకు అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించిన కాంగ్రెస్ దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఉత్తమ్, జానారెడ్డి, కుంతియాకు సీఎల్పీ అప్పగించింది. అభ్యర్థి ఎవరనేది తేలిన తర్వాత, నామినేషన్ తేదీని ప్రకటిస్తారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మిగిలిన పార్టీల మద్దతు కోరాలని నిర్ణయించారు. ఎస్సీ లేదా ఎస్టీలకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు అభ్యర్థిగా ఉంటే ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం పార్టీలో ఉంది. మాజీ ఎంపీ రవీంద్రనాయక్ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎంపీ, క్రికెటర్ అజహరుద్దీన్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. 25 అంశాలపై పోరాటం.. సీఎల్పీ సమావేశం వివరాలను కాంగ్రెస్ విప్ ఎస్ఏ సంపత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇది టీఆర్ఎస్కు ఆఖరి బడ్జెట్ అని, ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో తేల్చుకుంటామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్కు అనుంబంధ సంస్థగా మారిందన్నారు. అధికార పార్టీ హత్యా రాజకీయాలపై చర్చించామన్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు, హామీల అమలులో వైఫల్యంపై శాసనసభలో నిలదీస్తామన్నారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు అమలుపై పోరాడతామన్నారు. నిరుద్యోగ సమస్యలు, ఉపాధి కల్పనపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మాదిగ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా సంపత్ వెల్లడించారు. -
విరాట్ కోహ్లి అరుదైన ఘనత
జొహన్నెస్‌బర్గ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో ఐదో స్థానం (టాప్ 5 క్లబ్)లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం ఇక్కడ జరుగుతున్న నాలుగో వన్డేలో కోహ్లి (75: 83 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (9378) పరుగులను కోహ్లి అధిగమించాడు. ఈ వన్డేకు ముందు 9348 పరుగులతో ఉన్న కోహ్లి వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన భారత క్రికెటర్లలో అజహరుద్దీన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. నాలుగో వన్డేలో వ్యక్తిగత స్కోరు 31 పరుగుల వద్ద అజహర్ వన్డే పరుగులను కోహ్లి అధిగమించాడు. దీంతో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత టాప్ 5 క్రికెటర్ల క్లబ్లో కోహ్లి చేరిపోయాడు. అజహర్ 334 వన్డేల్లో 308 ఇన్నింగ్స్‌లు ఆడి 7 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీల సాయంతో 9378 పరుగులు చేశాడు. 206 వన్డేలాడిన కోహ్లి కేవలం 198వ ఇన్నింగ్స్‌లోనే అజహరుద్దీన్ పరుగులను దాటిపోయాడు. కోహ్లి 34 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీల సాయంతో 9423 పరుగులు చేశాడు. రెండు, మూడు వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లి నాలుగో వన్డేలో 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. అగ్రస్థానంలో సచిన్ టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్ 18,426 అత్యధిక వన్డే పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. కాగా భారత్ నుంచి సౌరవ్ గంగూలీ (11,221), రాహుల్ ద్రవిడ్ (10,768), ఎంఎస్ ధోని (9738) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనికి పదివేల క్లబ్లో చేరే అవకాశం ఉంది. నాలుగో వన్డే ఇన్నింగ్స్ తర్వాత కోహ్లి 9,423 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. -
హెచ్‌సీఏపై నిప్పులు చెరిగిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోథా సిఫార్సులను హెచ్‌సీఏ అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్ విమర్శించారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంతో మాట్లాడుతూ...‘ నేను రాజకీయంగా ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశానని క్రికెటర్‌గా యూపీ నుంచి రిజిస్ట్రర్ ఎలా చేసుకుంటాను. హెచ్‌సీఏ అందరిని పక్కదారి పట్టిస్తోంది. గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు. జిల్లా, రూరల్ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. హెచ్‌సీఏ నిర్వహించే టీ20 లీగ్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్‌కు వివేక్ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్‌సీఏ లోగోతో వివేక్ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే. ఇక బీసీసీఐ నుంచి నాకు క్లియరెన్స్ రాలేదని ఆరోపించారు. కానీ నాకు హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీనిపై నేను బీసీపీఐకి నివేదిక పంపాను. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తప్పు చేశారు. చదువుకున్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. దీనిపై నేను చట్టపరంగా ముందుకు వెళతా. నాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయితే నన్ను ఓ సెలబ్రెటీగా అందరూ ఆహ్వానిస్తారు’ అని తెలిపారు. -
అజారుద్దీన్ మనవాడా, కాదా? : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి నిప్పులు చెరిగారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అజారుద్దీన్ కి జరిగిన అవమానం పై పాకిస్తాన్ కోడై కూస్తుందన్నారు. అవసరం ఉంటే అజార్ భాయ్ అంటారు.. అవసరం తీరాక హట్ ఛలో అంటారా..? అని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ మనవాడా కాదా?.. అనేది సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ మెంబర్ కాదని మొన్నటి వరకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ అన్నారు. కోర్టు అజారుద్దీన్ కి క్లీన్ చీట్ ఇచ్చినా హెచ్‌సీఏ అనుమతి ఇవ్వడం లేదన్నారు. అజారుద్దీన్ పై కుట్రతో వివేక్ ఇలా చేస్తున్నారని హనుమంతరావు నిప్పులు చెరిగారు. తాను రాజకీయ కుట్రలతో హెచ్‌సీఏ మీటింగ్ కి వస్తున్నానని వివేక్ కరీంనగర్ లో మాట్లాడారని హనుమంతరావు అన్నారు. 8నెలల కింద నెలకొల్పిన ప్యానల్ కి శేష నారాయణ సెక్రెటరీ, వివేక్ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. ప్రస్తుత ప్యానల్ కి ఎన్నో సంవత్సరాలు హెచ్‌సీఏని పాలించిన వినోద్ కి పెద్ద పోస్ట్ కట్టపెట్టాలని వివేక్ అంటే దానికి శేష నారాయణ ఒప్పుకోనందుకే ఆయన పై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. ఉప్పల్ స్టేడియంకి వివేక్ తండ్రి వెంకటస్వామి పేరు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. స్టేడియంలో ఇచ్చే టికెట్ల మీద విశాఖ సంస్థ పెరుపెట్టుకొని విక్రయాలు చేస్తున్నారన్నారు. ఆ తరువాత ఐపీఎల్ వాళ్లను బెదిరించి రూ. లక్షలు వసూళ్లు చేశారని ఆరోపించారు. వివేక్, వినోద్‌లు కలిసి హెచ్‌సీఏని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వెంకట స్వామి పేరుతో జరుగుతున్న టోర్నమెంట్లపై రూ.12లక్షలు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తన ఎంపీ నిధులు రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ ఫూల్, ఫుట్ బాల్ గ్రౌండ్, రాజీవ్ గాంధీ పేరుమీద పిల్లలకు స్టైఫండ్ ఇస్తున్నా, ఇది తన రికార్డ్ అని హనుమంతరావు అన్నారు. తెలంగాణ క్రికెట్ అని క్లబ్ ఉంటే నష్టం ఏంటని కేసీఆర్ ని ప్రశ్నించారు. అజారుద్దీన్ అంతర్జాతీయ క్రీడాకారుడు ఆయన సేవలు వినియోగించుకుంటే తప్పేముందని సూచించారు. హెచ్‌సీఏ జరిపే టోర్నమెంట్ లలో ఓపెన్ ఆక్షన్ ఎందుకు పెట్టరో సమాధానం చెప్పాలన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వివేక్ తప్పుపడుతున్నారని హనుమంతరావు అన్నారు. సానియా మీర్జా, పీవీ సింధు గెలుస్తే డబ్బులు, భూములు సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. హెచ్‌సీఏ మీ అయ్య జాగిరా..? అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. పక్క రాష్టంలో క్రీడలు ఎలా ఉన్నాయి.. తెలంగాణలో ఎలా ఉన్నాయి. వివేక్ రాజకీయంగా ఏమైనా చేసుకో కానీ, క్రీడలను నిర్లక్ష్యం చెయ్యకు అంటూ వీహెచ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఇటు ప్రభుత్వంలో జీతం తీసుకుంటూ హెచ్‌సీఏలో ప్రెసిడెంట్ గా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. -
బీసీసీఐ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..!
సాక్షి, హైదరాబాద్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని, కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలతోనే సంస్థను నడిపిస్తున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్ చెప్పుకొచ్చారు. మంగళవారం హెచ్‌సీఏ కార్యాలయంలో అంబుడ్స్‌మన్ సమావేశం జరిగింది. సమావేశం అజెండాలో ప్రధానాంశమైన సెక్రటరీ శేష్ నారాయణపై వేటు, భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు అవమానం తదితర విషయాలపై వివేక్ మీడియాతో మాట్లాడారు. రోజూ రాత్రి ఫోన్ చేస్తాడు : అవినీతి ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ కార్యదర్శి పోస్టు నుంచి సస్పెన్షన్‌కు గురైన శేష్ నారాయణ భవితవ్యంపై అంబుడ్స్‌మన్ కమిటీ చర్చించింది. అతనిపై హెచ్‌సీఏ పాలకమండలి విధించిన సస్పెన్షన్ సమర్థనీయమా, కాదా అనే విషయాన్ని అంబుడ్స్‌మన్ జస్టిస్ నర్సింహారెడ్డి నిర్ధారిస్తారు. కాగా, మంగళవారం నాటి భేటీ తుది నిర్ణయం ప్రకటించకుండానే ముగిసింది. శేష్ నారాయణ సస్పెన్షన్‌పై తీర్పు జనవరి 20కి వాయిదా పడింది. ఇదిలాఉంటే సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న శేష్ నారాయణ మంచి మిత్రుడని హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ అన్నారు. ‘రోజూ రాత్రి 11 గంటలకు శేష్ నాకు ఫోన్ చేస్తాడ’ని తెలిపారు. అందుకే అజార్‌ను రానివ్వలేదు : భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ ఆఫీసులోకి రానీయకుండా అడ్డుకున్న వ్యవహారం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై వివేక్ వివరణ ఇచ్చారు. ‘‘నేషనల్ క్రికెట్ క్లబ్ కార్డు చూపించమని అడిగితే అజార్ చూపించలేదు. ఆయన వైస్ ప్రెసిడెంట్లుగా కనీసం రికార్డుల్లోకూడా లేదు. అందుకే అతన్ని హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించలేదు. అయితే అజార్ సేవలను వినియోగించుకునేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. క్రికెట్లో సమస్యలు చెప్పాలని ఆయనను కోరాం’’ అని వివేక్ వివరించారు. ‘‘క్రికెట్లో ఎ, బి, సి, డిలు కూడా తెలియని వ్యక్తులు హెచ్‌సీఏకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు’ అని వివేక్‌పై అజారుద్దీన్ మండిపడిన సంగతి తెలిసిందే. క్రికెట్‌ను ఎవరైనా నడిపించొచ్చు : క్రికెట్ కమిటీల విషయంలో జస్టిస్ లోథా కమిటీ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కాగా అమలుచేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్ చెప్పారు. బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు నిధులు రాలేదని, ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలతోనే బండిని నడిపిస్తున్నామన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)తో హెచ్‌సీఏకి ఎలాంటి విబేధాలు లేవని, క్రికెట్‌ను ఎవరైనా నడిపించుకోవచ్చని, అయితే హెచ్‌సీఏకు పోటీ సంఘాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని బీసీసీఐ స్పష్టం చేసిందని వివేక్ తెలిపారు. -
అజారుద్దీన్‌కు బ్రేక్.. మైక్‌ను నేలకు కొట్టిన వీహెచ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సహనం కోల్పోయారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ సమావేశానికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన వీహెచ్.. సమావేశంలో మైక్‌ను నేలకేసి కొట్టారు. హెచ్‌సీఏ కార్యాలయంలో ఆదివారం హెచ్‌సీఏ ప్రత్యేక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అజారుద్దీన్‌ను సిబ్బంది అడ్డుకోవడంతో వీహెచ్ ఆగ్రహంగా స్పందించారు. ఇదేమైనా టీఆర్ఎస్ మీటింగ్ అనుకుంటున్నావా.. అని టీఆర్ఎస్ నేత, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ వివేక్‌పై మండిపడ్డారు. ఈ సందర్భంగా వివేక్ స్పందిస్తూ..లోథా కమిటీ ఆదేశాల అమలు కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మీటింగ్‌లో ఇంతకుముందు అమలైన 16 అంశాలపై చర్చ జరిగిందన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు అజారుద్దీన్ మద్దతిస్తున్నారని తెలిసిందని, అందుకే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అజారుద్దీన్ పై తమకు చాలా గౌరవం ఉందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నిధులు లేవని, అండర్-14 నిర్వహించడానికి కూడా నిధులు లేకపోతే ఇతరుల దగ్గర నుంచి నిధులు తెచ్చి నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెచ్‌సీఏ లోథా సిఫార్సులన్నింటినీ అమలు చేస్తుందని వివేక్ చెప్పారు. హనుమంత రావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. టీసీఏ వాళ్ల పని వాళ్లు చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. అజారుద్దీన్ తెలంగాణ క్రికెట్ అసోషియేషన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారని వార్తలు వచ్చినందుకు ఆయన్ని మీటింగ్‌కు రానివ్వలేదని వివేక్ స్పష్టం చేశారు. -
బాలీవుడ్.. బాష్
-
వివేకానంద్‌కు అర్హత ఉంది
హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని... కానీ పోటీ చేసేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని వాటి ప్రకారం పోటీ చేయవచ్చు అని హెచ్సీఎ కార్యదర్శి బరిలో ఉన్న శేష్‌నారాయణ్ అన్నారు. ఆయన హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీపడే ముందు ఓటర్‌గా నమోదు చేసుకోలేదని గుర్తు చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ మసూద్ ఖాన్‌తో కలిసి మాట్లాడుతూ... వివేకానంద్‌కు కేబినెట్ ర్యాంక్ ఉంది కాని ఆయన కేబినెట్ మంత్రి కాదని, అందుకు ఆయనకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందని తెలిపారు. మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ హెచ్సీఎను పూర్తిగా భ్రష్టుపట్టించారని... తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పూర్తి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎలాంటి అవినీతికి, పైరవీలకు వీలు లేకుండా నడుస్తామని హామీ ఇచ్చారు. లోధా కమిటీ సిఫార్సులు, కోర్టు పరిధిలోనే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు హన్మంత్‌రెడ్డి, అనిల్ కుమార్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మధు కుమార్, అజారుద్దీన్‌ల వీరవిహారం
సాక్షి, హైదరాబాద్: జిందా తిలిస్మాత్ బ్యాట్స్‌మెన్ మధు కుమార్ (161 బంతుల్లో 124; 17 ఫోర్లు, 1 సిక్స్), అజారుద్దీన్ (69 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో జిందా తిలిస్మాత్ జట్టు ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో క్రౌన్ సీసీపై జయభేరి మోగించింది. మొదటి రోజు ఆటలో క్రౌన్ సీసీ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే కుప్పకూలింది. తర్వాత జిందా తిలిస్మాత్ 69 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముఖ్యంగా అజారుద్దీన్ భారీ సిక్సర్లతో చెలరేగి మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో 329 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన క్రౌన్ సీసీ 36.1 ఓవర్లలో 158 పరుగుల వద్ద ఆలౌటైంది. అమర్ అయూబ్ 5, విష్ణు చైతన్య 3 వికెట్లు పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు : సలీంనగర్ తొలి ఇన్నింగ్స్: 279 (జమీరుద్దీన్ 92, ఖాలిద్ 60, గౌస్ జునైద్ 70; నొమన్ అఫ్సర్ 3/51), బ్రదర్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 42/0. డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 210 (ఖాసిమ్ వాలి 38, సునీల్ 38; శ్రీనివాస్ 6/76, దినేశ్ 4/63), రాజు సీసీ తొలి ఇన్నింగ్స్: 178 (దినేశ్ 89; మెహ్తాబ్ అలమ్ 3/44), డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 107/9 (శ్రీనివాస్ 5/44, దినేశ్ 4/47), రాజు సీసీ రెండో ఇన్నింగ్స్: 78 (దినేశ్ 35; ఖాసిమ్ వాలి 3/28). -
హీరోగా స్టార్ క్రికెటర్ తనయుడు
ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీ కావటంతో ఈ రంగంలోని వారందరూ తమ వారసులను సినిమాల్లోనే నటించేలా ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇతర రంగాల వారు కూడా సినీ రంగం మీద దృష్టి పెడుతున్నారు. రాజకీయ, వ్యాపార రంగాల నుంచి చాలా మంది సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అదే బాటలో ఓ స్టార్ క్రికెటర్ కొడుకు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రముఖ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అబ్బాస్(అసదుద్దీన్) త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో 'నాకు ఓ లవ్వరుంది', 'దక్షిణ మధ్య భారత జట్టు' సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కె సురేష్ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి.. పసి ప్రాణం బలి
రెడీమిక్స్ ప్లాంట్ కోసం తవ్విన 40 అడుగుల గోతిలో పడి మృతి కన్నవారికి కడుపుకోత విజయవాడ (పటమట) : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ పసివాడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లికి కడుపుకోత మిగిల్చింది. ఏపీఐఐసీ కాలనీలో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంట్రాక్టర్ రెడీమిక్స్ తయారీ కోసం ప్లాంట్‌ను ప్రాజెక్టుకు పక్కనే ఉన్న మరో స్థలంలో ఏర్పాటు చేశారు. రెడీమిక్స్ తయారీలో వచ్చే నీటిని పంపేందుకు 40 అడుగుల మేర భారీ గొయ్యి తీశారు. దాని చుట్టూ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు. ఈ నేపథ్యంలో కాలనీ వాసి ఆఫ్రిన్ ఏకైక కుమారుడు అజారుద్దీన్ (8) సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆడుకుంటూ ఆ గొయ్యిలో పడిపోయాడు. బాలుడితో ఉన్న పిల్లలు వెంటనే అతని తల్లికి సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో గొయ్యిలో పడిన బాలుడిని వెలికి తీయగా అప్పటికే మృతి చెందాడు. బాలుడి తండ్రి సిజారుద్దీన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. తల్లి ఆఫ్రిన్ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. బాలుడు స్థానిక ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. స్థానికుల ఆందోళన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. కాలనీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు. విష యం తెలుసుకున్న మేయర్ కోనేరు శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
అజార్ కు ఇమ్రాన్ హష్మి స్పెషల్ గిఫ్ట్
బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి.. భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మరపురాని పుట్టినరోజు కానుకను అందించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తున్న ఇమ్రాన్.. సోమవారం 53వ పడిలో అడుగుపెట్టిన అజారుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ఓ స్పెషల్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో తెలుపు రంగు టెస్ట్ టీమ్ జెర్సీని ధరించి కనబడుతున్న ఇమ్రాన్.. వయస్సులో ఉన్నప్పటి అజహర్‌ను ప్రతిబింబిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇమ్రాన్ క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా అజారుద్దీన్ బ్యాటింగ్ శైలి బాగా ప్రాక్టీస్ చేశాడు. ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ మాట్లాడుతూ.. ఈ సినిమా నటుడిగా ఇమ్రాన్‌ను మరోసారి తనను తాను కనుగొనేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేసవిలో విడుదల కానుంది. Happy 53rd Birthday @mpazhar. Here is my birthday present.Me as You in #Azhar! #HappyBirthdayAzhar @AzharTheFilm pic.twitter.com/0LWBie2GmT — emraan hashmi (@emraanhashmi) February 8, 2016 -
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా అజారుద్దీన్?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే అజార్‌ను ఇందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. సెలబ్రిటీ హోదాతో పాటు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కావడంతో అజార్‌కు నగర యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ నుంచి ఎంఐఎం దూరం కావటం, అధికార టీఆర్ఎస్ పలు కార్యక్రమాలతో దూకుడు పెంచటంతో కాంగ్రెస్ పార్టీ సైతం తన వ్యూహాలకు పదును పెట్టింది. ఒక వైపు ఎంఐఎంకు చెక్పెట్టటంతో పాటు, టీఆర్ఎస్ దూకుడును తగ్గించవచ్చన్న ఆలోచనతో మేయర్ అభ్యర్థి ప్రతిపాదనను పీసీసీ అజారుద్దీన్ ముందుంచినట్లు సమాచారం. అయితే, తన నిర్ణయాన్ని ఇప్పుడే వెల్లడించలేనని, సమయం కావాలని ఆయన కోరినట్లు తెలిసింది. ఒకవేళ అజార్ ముందుకురాకపోతే మాజీ మంత్రి ముఖేష్ తనయుడు విక్రంగౌడ్తోపాటు మరికొందరు పేర్లను పరిశీలించాలని పీసీసీ నేతలు భావిస్తున్నారు. -
నాకంటే బెస్ట్ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్!
అజహరుద్దీన్ ప్రశంస సాక్షి, హైదరాబాద్ : మణికట్టు మాయాజాలంతో మంత్రముగ్ధులను చేస్తూ పరుగుల వరదను పారించే బ్యాట్స్‌మెన్ అంటే హైదరాబాదీల తర్వాతే ఎవరైనా అనేది క్రికెట్ ప్రపంచం చెప్పే మాట. అజహరుద్దీన్, ఆ తర్వాత అదే శైలిలో వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్లో తమదైన ముద్ర వేశారు. తమ ఇద్దరి ఆటకు సంబంధించి మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘లక్ష్మణ్ నాలాగే ఆడుతున్నాడని చాలా మంది నాతో చెప్పేవారు. సరిగ్గా చెప్పాలంటే మా ఇద్దరి స్టయిల్ ఒకటే. నేనే కొన్నిసార్లు అతడిని అనుకరించానేమో! ఎందుకంటే హైదరాబాద్ అం దించిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్ వీవీఎస్. అందులో సందేహం లేదు’ అని అజహర్ ప్రశంసించారు. ఆదివారం హైదరాబాద్ వెటరన్ క్రికెటర్స్ సంఘం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. వెంకటపతి రాజు, అర్షద్ అయూబ్ తదితరులతో పాటు పలువురు రంజీ ఆటగాళ్లు పాల్గొన్నారు. -
ఇన్షా అల్లా
తన మీద వచ్చిన అపవాదులకు అజహరుద్దీన్ నిజ జీవితంలో ఎప్పుడూ జవాబు చెప్పలేదు. వెండితెర మీద సమాధానాలు వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇన్షా అల్లా (వారి కొరిక నెరవేరుగాక). గత ఆదివారం సాయంత్రం... కోల్‌కతాలో ఐపీఎల్ ఫైనల్ జరుగుతోంది. ముంబైలోని సోనీ స్టూడియోలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీతో కలిసి అజహరుద్దీన్ కూర్చున్నాడు. ఈ మాజీ కెప్టెన్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా గురించిన ప్రమోషన్ కోసం ఈ ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. సరిగ్గా పదంటే పదే నిమిషాల్లో ముంబైలో మీడియా ఒళ్లు విరిచింది. టాట్... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న వ్యక్తి ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా స్టూడియోలో ఎలా కూర్చుంటాడు? అంటూ ప్రశ్నల బాణాలను వదిలింది. ఎక్కడో కోల్‌కతాలో మ్యాచ్ జరుగుతుంటే... ఇక్కడ ఓ ప్రైవేట్ చానెల్ స్ట్టూడియోలో అజహర్ కూర్చోవడం తప్పా..? ఈ సంఘటన చెప్పడానికి కారణం ఉంది. అజహరుద్దీన్ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) విషయంలో చాలా వీక్. నలుగురితో మాట్లాడటం, మీడియాతో సన్నిహితంగా మెలగడం తెలియదు. ఇప్పుడే కాదు... తాను క్రికెటర్‌గా, కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో కూడా అంతే. మాజీ క్రికెటర్లంతా కామెంటేటర్లుగా, కోచ్‌లుగా రకరకాలుగా క్రికెట్‌తో సంపాదించుకుంటుంటే అజహర్ వెనకబడిపోవడానికి కారణం కూడా ఇదే. తనని తాను మార్కెటింగ్ చేసుకోవడం అజహర్‌కు చేతకాలేదు. నిజంగా చేతనై ఉండుంటే ఇంకా బీసీసీఐ నిషేధం అతనిపై ఉండేది కాదు. భారత క్రికెట్‌కు అత్యుత్తమ కెప్టెన్ అజహరుద్దీన్. ఇవ్వాళ ధోని సూపర్ స్టార్ కావచ్చు. కానీ నేడు ధోని కెప్టెన్‌గా సాధించిన విజయాలను అజహర్ ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే సాధించాడు. యువతలో స్ఫూర్తి నింపడానికి విజయాలు అవసరమైతే... అజహర్‌ను మించి స్ఫూర్తి నింపే క్రికెటర్ లేడు. అందుకే హైదరాబాద్‌లో అతనంటే ఆరాధన. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయంకృషితో ఎదిగి, ఎవరి మద్దతు లేకుండా భారత కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అందుకే తనంటే అప్పట్లో యువతలో పిచ్చి క్రేజ్. మణికట్టు మాయాజాలంతో పరుగులు చేయొచ్చని క్రికెట్ ప్రపంచానికి చూపించిన మొదటి ఆటగాడు అజహర్. క్రికెటర్‌గా అజహర్ ప్రస్థానం ఓ సాధారణ ఆటగాడి కలలా సాగింది. 1984లో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చిన అజహర్... వరుసగా ఆడిన మూడు టెస్టుల్లోనూ సెంచరీలు చేశాడు. కెరీర్లో తొలి మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 2000లో బెంగళూరులో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచే అజహర్ ఆఖరి టెస్టు. ఆ తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసు కారణంగా అజహర్ చాలా నష్టపోయాడు. 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెట్ దిగ్గజం వంద మ్యాచ్‌ల మార్కును చేరుకోలేకపోయాడు. ఘనంగా ఆటకు వీడ్కోలు పలకాల్సిన క్రికెటర్ మౌనంగా తెరచాటుకు వెళ్లిపోయాడు. బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో 2012లో హైకోర్టు నుంచి అజహర్‌కు క్లీన్చిట్ వచ్చింది. కానీ బీసీసీఐ నిషేధం మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఈ క్రమంలో అజహర్ కొత్త కెరీర్ చూసుకున్నాడు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి గెలిచాడు. ఎక్కడ హైదరాబాద్... ఎక్కడ మొరాదాబాద్. అజహర్‌కు దేశం మొత్తం క్రేజ్ ఉందనడానికి లోక్‌సభ ఎన్నిక నిదర్శనం. బాధ్యత గల కుటుంబ పెద్ద ఒక్కసారి భారత క్రికెట్ జట్టులోకి వస్తే రకరకాల బిజినెస్‌లు ప్రారంభించి సంపాదించుకునే అవకాశం ఉంది. దాదాపుగా ప్రతి భారత క్రికెటర్ దీనిని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. కానీ అజహర్ మాత్రం కమర్షియల్ కోణాన్ని పట్టించుకోలేదు. ఆట, కుటుంబం తప్ప మరో ధ్యాస లేకుండా గడిపాడు. అందుకే వ్యాపారాలేమీ చేయలేదు. అయితే స్నేహితుల సలహాలతో పుణే సమీపంలో భారీగా పొలాలు కొన్నాడు. ఇప్పుడు అవే అజహర్‌ను స్థితిమంతుడిగా నిలబెట్టాయి. నిజానికి అజహర్ చాలా సాధారణ జీవితం గడిపాడు. ఓ మధ్యతరగతి కుటుంబంలో పెద్దవాడు తీసుకోవాల్సిన బాధ్యతలన్నీ తీసుకున్నాడు. తన ఇద్దరు తమ్ముళ్లకు డబ్బులు ఇచ్చి వ్యాపారాల్లో స్థిరపడేలా చూశాడు. 1996 వరకు అజహర్ సాధారణ మనిషి. కానీ ఒక్కసారి సినీ నటి, మోడల్ సంగీతా బిజ్లానీ ప్రేమలో పడ్డాక మొత్తం పరిస్థితి మారింది. హై ప్రొఫైల్ జీవితం అలవాటయింది. పార్టీలు, పరిచయాలు పెరిగాయి. తన క్రేజ్ తగ్గడం మొదలయ్యింది కూడా అప్పటి నుంచే. ఇప్పటికీ అజహర్ సూపర్ స్టార్. కానీ మొదటి భార్య నౌరీన్‌కు విడాకులు ఇవ్వకుండా ఉంటే ఆకాశాన్నంటిన క్రేజ్ అలాగే ఉండేది. దీనివల్ల కొంతమంది అభిమానాన్ని పోగొట్టుకున్నాడు. అయితే బాధ్యత మాత్రం ఇప్పటికీ మరచిపోలేదు. 2011లో 19 ఏళ్ల వయసున్న చిన్న కుమారుడు అయాజుద్దీన్ మోటార్ బైక్ ప్రమాదంలో మరణించడాన్ని అజహర్ చాలాకాలం జీర్ణించుకోలేకపోయాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు అసదుద్దీన్‌ను క్రికెటర్‌ను చేసే ప్రయత్నంలో ఉన్నాడు. - జయప్రకాష్ బత్తినేని అజహర్‌పై సినిమా అజహర్ కథతో సినిమా వస్తోంది. ఇమ్రాన్ హష్మీ ఇప్పటికే అజహర్‌ను తలపిస్తూ బయట కూడా నడుస్తున్నాడు. ఇమ్రాన్ క్రికెట్ దుస్తులతో నడుస్తుంటే అజహర్ గుర్తొస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా మొత్తం అజహర్‌కు అనుకూలంగానే ఉంటుంది. (మరి వ్యతిరేకంగా సినిమా తీస్తానంటే ఎవరూ ఒప్పుకోరు కదా). ఈ సినిమా కోసం క్రికెట్ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అజహర్‌ను ఫిక్సింగ్‌లో ఇరికించారనేది అతడి సన్నిహితులు చెబుతున్న మాట. అదే నిజమైతే అసలేం జరిగింది. భారత క్రికెట్లో అతి పెద్ద మ్యాచ్ ఫిక్సర్ అనే నింద అజహర్ మీద ఎలా పడింది? అతనేం అనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ సినిమాలో దొరుకుతుందేమో చూడాలి.! -
క్రీడా‘తారలు’
నగరానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం... వీరిలో కొందరి జీవిత విశేషాలు ఒక పూర్తి స్థాయి సినిమాను తలపించే రీతిలో ఉండడం మనకు తెలిసిందే. రన్నింగ్‌లో నేషనల్ ఛాంపియన్ మిల్కాసింగ్ కథతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’తో పాటు బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం కూడా విజయవంతమయ్యాయి. దీంతో నగరం వేదికగా ఎదిగిన క్రీడాకారులు కూడా తమ ‘జీవితం’తెరకెక్కాలని కోరుకుంటున్నారు. వీరిలో కొందరిని సినిమా రూపకర్తలే సంప్రదిస్తుండగా... కొంతమంది తామే చొరవ తీసుకుని లైఫ్‘షో’కి సై అంటున్నారు. దీంతో స్పోర్ట్స్స్టార్స్ బయోపిక్స్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. - బయోపిక్స్‌పై స్పోర్ట్స్స్టార్ల ఆసక్తి - ‘అజహర్’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల - తెరపైకి మరికొందరి జీవితాలు? వెండితెర ఇప్పుడు క్రీడాకారుల జీవిత విశేషాలకు వేదికవుతోంది. క్రీడాతారల జీవిత విశేషాలతో రూపొందిన కథలకు ఆదరణ లభిస్తుండడంతో... మరికొన్ని చిత్రాలు వరుసలోకి వస్తున్నాయి. దీనికి స్టార్ ఆటగాళ్లు సైతం పచ్చజెండా ఊపుతున్నారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ పాత్రలలో ఏ హీరో, హీరోయిన్లు తెరపై కనిపిస్తే బాగుంటుందో సూచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడు అజహరుద్దీన్ జీవితం తెరపైకి వస్తున్న నేపథ్యంలో...మిగిలిన కథలూ ‘క్యూ’లో ఉన్నాయి. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ క్రీడాతారల జీవితంలోని ఘట్టాల గురించి తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు దక్కుతోంది. సానియా... ఎవరయా? నగరంలో పుట్టి నాజర్ స్కూల్లో చదివి... తెలుగు రాష్ట్రాల్లో టెన్నిస్ క్రీడకు వెలుగు తెచ్చిన అసమాన క్రీడాకారిణి సానియా మీర్జా. ఆటలో అంతర్జాతీయ కీర్తి గడించిన ఈ సిటీ స్టార్... అందం... ఫ్యాషన్ స్టైల్స్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్మాలిక్తో ప్రేమ పెళ్లి ద్వారా మీడియాకు కావాల్సినంత మసాలా అందించిన సానియా జీవితం కూడా విశేషాల మయమే. ఎంతో మంది సినిమాల్లో నటించాలనిఅడిగినా ‘నో’ చెప్పిన సానియా... తన జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి మాత్రం ఇటీవలే ఓకే చెప్పారు. మరుక్షణం నుంచి తన బయోపిక్ రూపొందించేందుకు టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని వినికిడి. సానియా కథతో తీసే సినిమాలో హీరోయిన్గా నటించేందుకు పలువురి పేర్లు ప్రస్తావనకు వస్తుంటే... తన పాత్ర పోషించాలంటే ప్రస్తుత నటీమణుల్లో దీపికా పదుకొనెమాత్రమే సరైన ఎంపిక అని... తన భర్త షోయబ్ పాత్రకు సల్మాన్‌ఖాన్‌ను సూచించడం ద్వారా సానియా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఇక ఈ బయోపిక్ తెరకెక్కడమే తరువాయి. వెండితెర ‘చంద్’మామ అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన బయోపిక్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ది. నగర వాసిగా బ్యాడ్మింటన్ రంగంలో రాణించడం మాత్రమే కాకుండా సైనా నెహ్వాల్ లాంటి నెంబర్‌వన్ క్రీడాకారిణిని తీర్చిదిద్ది... నగరానికి మరిన్ని క్రీడారంగ విజయాలు దక్కేలా చేసిన గోపీచంద్ బయోపిక్ ఇప్పుడు వార్తల్లో అంశం. సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు, హీరో సుధీర్‌బాబు (ప్రేమ కథా చిత్రం ఫేం) ఈ సినిమాలో గోపీచంద్ పాత్రలో నటి స్తున్నారు. వ్యక్తిగతంగా గోపీచంద్‌కి స్నేహితుడైన సుధీర్‌బాబు... ఈ సినిమా పట్ల అత్యంత ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం త్వరలోనే పట్టాలకెక్కనుంది. సై... అంటూ.. బ్యాడ్మింటన్ స్టార్‌గానూ, గ్లామర్, స్టైల్స్నూ పండిస్తూ... మన సిటీ వేదికగా రాణిస్తున్న నగర క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సైతం తన బయోపిక్ రూపకల్పనపై ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్‌గా వెలుగొందుతున్న ఈ సిటీ స్టార్... గతంలో బ్యాడ్మింటన్ ఆడిన అనుభవమున్న దీపికా పదుకొనె తన పాత్ర పోషిస్తే బాగుంటుందని... హీరోగా షారూఖ్ తన ఛాయిస్ అంటున్నారు. వ్యక్తిగతంగా తనను కాక బ్యాడ్మింటన్‌ను ప్రమోట్ చేసేలా ఆ సినిమా ఉండాలంటున్న సైనా.. మిగలిన క్రీడా నేపథ్యాల నుంచి వచ్చిన సినిమాల్లా కాక... తన సినిమా తీసేవారికి ఆటలో సాంకేతిక అంశాలపై కూడా పట్టుంటేనే... అది లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. అజహర్గా ఇమ్రాన్ మహ్మద్ అజహరుద్దీన్. క్రికెట్ ప్రేమికులు ముద్దుగా అజ్జూ అని పిలుచుకునే మన నగరవాసి. క్రికెట్ క్రీడాకారుడిగా, భార త టీమ్ కెప్టెన్‌గా సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. ఇక్కడే పుట్టి... ఇక్కడే చదువుకుని... ఇక్కడే ఎదిగిన ఈ హైదరాబాదీ...ప్రస్తుతం పొలిటీషియన్‌గానూ రాణిస్తున్నారు. టాప్ ఫీల్డర్‌గా ప్రశంసలు... మ్యాచ్ ఫిక్స్‌ర్‌గా ఆరోపణలతో అటు క్రీడా జీవితంలో... పెళ్లి... విడాకులు... సినీ నటితో ప్రేమ... పెళ్లి... మళ్లీ.. విడాకులు... ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం... ఇలా వ్యక్తిగత జీవితంలోనూ రకరకాల సవాళ్లను ఎదుర్కొన్న అజహర్ కథ... ఒక కలర్‌ఫుల్ సినిమాకు అవసరమైన అద్భుత ముడిసరుకు. ప్రస్తుతం ఏక్తాకపూర్ నిర్మాతగా ‘అజహర్’ పేరుతో రూపొందుతున్న బయోపిక్‌లో హిందీ హీరో ఇమ్రాన్హీష్మి నటిస్తున్నాడు. సంగీతా బిజిలానీతో ప్రేమ వ్యవహారానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఇటీవలే దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. -
తెర నిండా... నిజజీవిత చిత్రాలు
బాలీవుడ్ సినిమా కన్నా జీవితం విచిత్రంగా ఉంటుంది. బహుశా, అందుకే, ఈ మధ్య కథల కోసం మన సినిమావాళ్ల కళ్లన్నీ జీవితాల మీద పడ్డాయి.ప్రముఖుల నిజజీవితాలనూ, అందులోని ఆసక్తికరమైన కోణాలనూ తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే ‘పాన్‌సింగ్ తోమర్’, ‘భాగ్ మిల్ఖా భాగ్’, ‘ది డర్టీ పిక్చర్’, ‘మేరీ కోమ్ లాంటి జీవితకథాచిత్రాలు అలరించాయి. హిందీలో ఈ ఏడాది ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. వాటిలో కొన్నింటి గురించి... ధోనీ - క్రికెట్ కెప్టెనైన టికెట్ ఎగ్జామినర్! భారత క్రికెట్ జట్టు సారథి మహేందర్ సింగ్ ధోనీ ఒకప్పుడు టీటీఈ (ట్రైన్ టికెట్ ఎగ్జామినర్)గా పనిచేశారు తెలుసా? క్రికెటర్ కాకముందు బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఆటగాడిగా జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు. ఇలా చెప్పాలంటే ధోనీ గురించి బోల్డన్ని విశేషాలున్నాయి. ఇలా ధోనీ గురించి చాలామందికి తెలియని విశేషాలతో నీరజ్ పాండే దర్శకత్వం వహించనున్న చిత్రం - ‘ఎం.ఎస్. ధోనీ’. ఇందులో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించనున్నారు. క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లతో అతిథి పాత్రలు చేయించాలని అనుకుంటున్నారు. ఇంకా షూటింగ్ ఆరంభం కాలేదు. అజహరుద్దీన్ - హైదరాబాద్ గల్లీ బుల్లోడు హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన క్రికెటర్ అజహరుద్దీన్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. అలాగే రాజకీయాల్లోకి అడుగుపెడతారని కూడా అనుకుని ఉండరు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న అజహర్ వృత్తి జీవితం సంచలనం... వ్యక్తిగత జీవితమూ సంచలనమే. భార్యకు విడాకులివ్వడం, సంగీతా బిజ్లానీతో ప్రేమాయణం సాగించి, పెళ్లి చేసుకోవడం - లాంటివన్నీ వార్తలకెక్కినవే. ఇప్పుడవన్నీ తెరపై చూడనున్నాం. ఆంటోనీ డిసౌజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అజహర్గా ఇమ్రాన్ హష్మీ నటించనున్నారు. పాత్రలో ఒదిగిపోవడానికి హష్మీ రోజూ క్రికెట్ ఆడుతున్నారు. మహావీర్‌సింగ్ - ఆదర్శప్రాయుడైన మల్లయోధుడు మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఎంతో ఆదర్శవంతం. ఇద్దరు కుమార్తెలనూ (గీత, బబిత) మల్లయోధులుగా తయారు చేశారాయన. ఆ విషయంలో సొంత గ్రామస్థుల నుంచీ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. మహిళలు ఎందులోనూ తీసిపోరన్నది మహావీర్ అభిప్రాయం. అలాంటి ఆదర్శమూర్తి జీవితం ఆధారంగా రూపొందనున్న ‘దంగల్’లో మహావీర్ సింగ్‌గా ఆమిర్ ఖాన్ నటించనున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆమిర్ పంథొమ్మిదేళ్ల కుర్రాడిగా, ఇరవైతొమ్మిదేళ్ల యువకుడిగా, యాభై ఐదేళ్ల వ్యక్తిగా మూడు అవతారాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం మహావీర్‌గా ఒదిగిపోవడానికి ఆమిర్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చార్లెస్ శోభరాజ్ - ఓ సీరియల్ కిల్లర్ సీరియస్ కథ! సీరియల్ కిల్లర్, బికినీ కిల్లర్‌గా పేరొందిన చార్లెస్ శోభరాజ్ జీవితం వివాదాలమయం. తాలిబన్లకు ఆయుధాలు సరఫరా చేశానని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. జైలర్లకు మిఠాయిల్లో మత్తుమందు కలిపి ఇచ్చి, తీహార్ జైలు నుంచి తప్పించుకున్న ఘనుడు. ఇప్పటికీ పేరు చెప్పగానే ప్రపంచం ఉలిక్కిపడే ఇతగాడి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మై ఔర్ చార్లెస్’. చార్లెస్ పాత్రలో రణదీప్ హుడా నటించగా, ప్రవాళ్ రామన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. చార్లెస్ చేసిన హత్యలు, తీహార్ జైలు నుంచి ఆయన తప్పించుకున్న వైనం ప్రధానాంశాలుగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 13న రిలీజ్. ఈ ఏటి తొలి బయోపిక్ ఇదే. సంజయ్ దత్ - కటకటాల్లో ఓ కథానాయకుడు ప్రముఖ నటీనటులు సునీల్ దత్, నర్గీస్ దత్ల తనయుడు సంజయ్ దత్ నటుడిగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... మొదటి భార్య రిచా శర్మ మరణించిన తర్వాత ఆయన రియా పిళ్ళైని పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం తన గర్ల్‌ఫ్రెండ్ మాన్యతను పెళ్లి చేసుకున్నారాయన. 1993 నాటి ముంబయ్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సుప్రీం కోర్టు ఆయనకు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుణెలోని ఎరవాడ జైలులో సంజయ్ దత్ ఖైదీ. ఆయన జీవితం ఆధారంగా రాజ్‌కుమార్ హిరానీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సంజయ్ దత్ పాత్రను రణ్‌బీర్ కపూర్ చేయనున్నారు. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు అమితాబ్ బచ్చన్‌ను ఎంపిక చేశారు. సంజయ్ దత్ విడుదలయ్యాక ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. షిబ్దాస్ భాదురి - మైదానంలో బెంగాలీ టైగర్ ఫుట్‌బాల్ ఆటగాడు షిబ్దాస్ భాదురి 1887లో పుట్టారు. ఈ బెంగాలీ టైగర్ 44 ఏళ్లకే మరణించారు. ప్రతి ఆటగాడికీ ఆయన జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే, ఆయన జీవితం ఆధారంగా ‘1911’ పేరుతో దర్శకుడు శూజిత్ సర్కార్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో షిబ్దాస్ పాత్రను జాన్ అబ్రహామ్ చేయనున్నారు. ఫుట్‌బాల్ ఆటగాడి బలం అతని కాళ్లల్లో ఉంటుందంటారు. జాన్ అబ్రహామ్‌కి ఆ విషయం తెలుసు కాబట్టే, కొన్ని నెలలుగా ఆయన తన పాదాల మీద దృష్టి పెట్టారు. అసలే కండలు తిరిగిన దేహం.. కానీ, ఆటగాడి పాత్రకు అంతకుమించిన దేహం కావాలనే పట్టుదలతో జాన్ అబ్రహామ్ వర్కవుట్లు చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అమృతా ప్రీతమ్ - పంజాబీ సరస్వతి పంజాబీ భాషలో రచనలు చేసిన తొలి మహిళగా పేరుపొందారు సుప్రసిద్ధ రచయిత్రి అమృతా ప్రీతమ్. దేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్న మొదటి మహిళ కూడా ఆమే. రచనల రూపంలో బతికి ఉన్న అమృతా ప్రీతమ్ జీవితం ఆధారంగా నూతన దర్శకుడు జస్మీత్ రీన్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రచయిత్రి పాత్రను సోనాక్షీ సిన్హాతో చేయించాలనుకున్నారట. అమృతా గురించి దర్శకుడు చెప్పిన విశేషాలు విని, ఇందులో నటించే తీరాలని సోనాక్షీ ఫిక్స్ అయ్యారట. నీర్జా భానోత్- తీవ్రవాదుల చేతిలో బలైన త్యాగమయి ధైర్యసాహసాలకు చిరునామా అనిపించుకున్నారు నీర్జా భానోత్. 22 ఏళ్లకే పెళ్లి కావడం, తనువు చాలించడం రెండూ జరిగిపోయాయి. అదనపు కట్నం వేధింపులకు గురై, భర్త నుండి విడిపోయిన నీర్జా విమానంలో సేవలు అందించే యువతిగా చేరారు. ఆమె ప్రయాణిస్తున్న విమానం హైజాక్‌కి గురి కావడంతో, ప్రయాణికులను కాపాడడం తన బాధ్యతగా భావించారు నీర్జా. ఈ క్రమంలో తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 22 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఈ త్యాగమయి జీవితం ఆధారంగా రామ్ మధ్వానీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నీర్జా పాత్రకు సోనమ్ కపూర్ మినహా ఎవరూ నప్పరని దర్శకుడు అనుకున్నారట. సోనమ్ కూడా ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం. ఇవే కాకుండా, హిందీలో ఇంకా అనేక ‘బయోపిక్’లకు రంగం సిద్ధమవుతోంది. చిరస్మరణీయ సినీ గాయకుడు కిశోర్‌కుమార్ జీవితం ఆధారంగా అనురాగ్ బసు ఓ చిత్రం చేయాలనుకుంటున్నారు. ఇందులో కిశోర్ కుమార్ పాత్రకు రణ్‌బీర్ కపూర్‌ను తీసుకోవాలనుకుంటున్నారు. అలాగే, అందాల అభినేత్రి మీనాకుమారి జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందనుంది. సల్మాన్ ఖాన్ జీవిత చరిత్ర కూడా తెరకు రానుందని సమాచారం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ బేనజీర్ భుట్టో జీవితం ఆధారంగా ఓ చిత్రం రానుందనీ, ఇందులో నటించ డంతో పాటు నిర్మించాలని రవీనా టాండన్ అనుకుంటు న్నారని సమాచారం. ప్రముఖుల కథాకమామిషు తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది కాబట్టి, ఈ జీవిత కథా చిత్రాలకు బోల్డంత క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. - డి.జి. భవాని సోనాక్షీ సిన్హా -
పాకిస్తాన్‌పై భారత్ గెలుస్తుంది: అజహర్
న్యూఢిల్లీ : వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటిదాకా భారత జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడింది లేదు. ఈసారి తమ ప్రారంభ మ్యాచ్‌లోనే ఈ రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నా పాకిస్తాన్ నుంచి ధోని సేనకు ప్రమాదమేమీ ఉండదని మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు. 'భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అది ఎప్పటికీ పెద్ద మ్యాచే. ఇక ప్రపంచ కప్‌లో మనం ఒక్కసారి కూడా పాక్ చేతిలో ఓడలేదు. ఇప్పుడు అందరి మనస్సులోనూ ఇదే విషయం కదలాడుతోంది. పాక్ కన్నా భారత్ జట్టు సమతూకంతో ఉంది. అంచనాలకు తగ్గట్టు రాణిస్తే పాక్ నుంచి మనకు పోటీ ఉంటుందని అనుకోవడం లేదు' అని అజహర్ అన్నారు. అయితే ఆసీస్ పర్యటనలో భారత జట్టు ఇప్పటిదాకా ఒక్క విజయం కూడా నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఈ టోర్నీలో తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే మాత్రం నిలకడగా ఆడాల్సిన అవసరం ఉందన్నారు. మ్యాచ్‌లను గెలుస్తూ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఒకవేళ పరాజయాలు కొనసాగితే తిరిగి పుంజుకోవడం కష్టమేనని తేల్చారు. ఆటగాళ్లందరూ పూర్తిస్థాయిలో మ్యాచ్ ఫిట్‌గా ఉండటం అన్నింటికన్నా ముఖ్యమని అన్నారు. జట్టులో చాలామంది ఆటగాళ్లు తమతో పాటు గాయాలను కూడా మోస్తున్నారని ఆందోళన చెందారు. నెలరోజుల నుంచి పేసర్ ఇషాంత్ శర్మ గాయంతోనే ఉంటున్నాడని, అసలు అతడేం చేస్తున్నాడో అర్థం కావడం లేదని అజహర్ వ్యాఖ్యానించారు. -
అజరుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవితం ఆధారంగాత్వరలోనే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ ఆ చిత్రంలో అజరుద్దీన్ పాత్ర పోషించనున్నాడు. అజర్ది చాలా ఉద్విగ్నభరితమైన జీవితమని, రెండున్నర గంటల సినిమాలో అతని జీవితాన్ని ప్రతిబింబించడం చాలా కష్టమని హష్మీ అంటున్నాడు. ఈ చిత్రం క్రికెట్ కంటే ఎక్కువగా జీవితాన్ని ప్రతిబింబించేదిగానే ఉంటుందని చెబుతున్నాడు. -
ముగ్గురే గెలిచారు
ఐదుగురు మాజీ క్రీడాకారులకు నిరాశ అజహర్, కైఫ్లకూ తప్పని ఓటమి న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో క్రీడా ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఏథెన్స్ ఒలింపిక్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించగా... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన రాథోడ్ జైపూర్(రూరల్) నుంచి 3.32 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ కురువృద్ఢుడు సీపీ జోషిపై విజయ దుందుభి మోగించారు. అర్మీలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రాథోడ్ గత సెప్టెంబర్‌లో బీజేపీలో చేరి తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వంలో రాజ్యవర్ధన్‌కు క్రీడల మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘జైపూర్(రూరల్) నియోజకవర్గానికి సేవలందించడమే నా తొలి ప్రాధాన్యం. మా కెప్టెన్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏ బాధ్యతనైనా స్వీకరించేందుకు నేను సిద్ధం’ అని రాథోడ్ ప్రకటించారు. ఇక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫూల్పూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యాడు. -
కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి
బోధన్ టౌన్/ఎడపల్లి, న్యూస్‌లైన్ : దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మాజీ భారత క్రికెట్ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బోధన్ పట్టణం, ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్, జాన్కంపేట్‌లలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం లభించినప్ప టి నుంచి కాంగ్రెస్ దేశ ప్రజలకు సేవ చేస్తోందన్నారు. రైతులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బోధన్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. రైతన్నలకు సాగునీరు అందించి వారి పంటలను కాపాడారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌ను చీటర్ అని విమర్శించారు. ఎన్నికలు కూడా క్రికె ట్ ఆటలాంటివే అని, జట్టులో సభ్యులందరూ కలిసి ఆడితేనె విజయం సాధ్యం అవుతుందని అన్నారు. బోధన్‌లో అజారుద్దీన్‌ను చూసేందుకు యువకులు అధిక సంఖ్యలో వచ్చారు. బ్యాట్లు తెచ్చి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అజారుద్దీన్ సమక్షంలో టీడీపీ నాయకులు బిల్ల గంగాధర్ తన అనుచరులతో కాం గ్రెస్‌లో చేరారు. అజారుద్దీన్‌కు కాంగ్రెస్ నాయకులు పట్టణ స్వాగత తోరణం వద్ద గజమాల వేసి స్వాగతం పలికారు. ఆచణ పల్లి బైపాస్ నుంచి ఆచన్ పల్లి, శక్కర్‌నగర్, శక్కర్‌నగర్ చౌరస్తా, కొత్తబస్టాండ్, అం బేద్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, రాకాసీపేట్, పాత బోధన్‌లో రోడ్‌షో సాగింది. సుదర్శన్‌రెడ్డిని గెలిపిస్తే వందో టెస్టు పూర్తిచేసినట్లే రెంజల్ : మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తాను వందో టెస్టు పూర్తి చేసినట్లేనని అజారుద్దిన్ పేర్కోన్నారు. చాలాకాలం భారత క్రికెట్‌కు పనిచేసి అలసిపోయానని తాను కెరిర్ ముగించే సమయానికి 99 టెస్టులు మాత్రమే ఆడానని అన్నారు. మిగిలిన టెస్టు మ్యాచ్ ఈ నెల 30న జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు సిక్సర్లు కోడుతూ బ్యాలెట్ బాక్సులు నింపాలని సూచించారు. సుదర్శన్‌రెడ్డి ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ఎవరూ చేయలేదని కొనియాడారు. టీఆర్ఎస్, టీడీపీ, బిజేపీలు డబ్బున్న పార్టీలని ఆ పార్టీల నేతలకు ప్రజా సమస్యలు తెలియవన్నారు. -
‘రెడ్‌జోన్’ ఊసేదీ?
ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీకి చెందిన నాయకుడు కూడా రెడ్‌జోన్ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. దీని పరిధిలో అనేకమంది తెలుగువారు కూడా నివసిస్తున్నారు. ఇళ్లను నిర్మించి 12 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఖాళీ చేయాలంటూ రక్షణ విభాగం నోటీసులు ఇచ్చిందని, ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. పింప్రి, న్యూస్‌లైన్: మావల్ లోక్‌సభ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్క నాయకుడూ రెడ్‌జోన్ అంశాన్ని ప్రస్తావించడం లేదు. ఈ నియోజకవర్గం పరిధిలో సుమా రు ఐదు లక్షలమందికిపైగా రెడ్‌జోన్ బాధితులున్నారు. అయినప్పటికీ ఏ ఒక్క రాజకీయ నాయకు డు తమకు భరోసా ఇవ్వడం లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. ఈ జోన్ పరిధిలో వేలాదిమంది తెలుగు కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. డిసెంబర్ 2002లో కేంద్ర ప్రభుత్వం దేహూరోడ్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటిం చింది. అయితే రెడ్‌జోన్ పరిధి ఎంత అనే విషయం తెలియకపోవడం తో అప్పట్లో అనేకమంది ఆ పరిసరాల్లో గృహనిర్మాణాలను చేపట్టారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత రక్షణ విభాగం ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఆయా కుటుం బాలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫ్యాక్టరీకి 2,000 గజాల పరిధిని సంబంధిత అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఇందులో మామ డి, వికాస్‌నగర్, దేహూరోడ్ బజార్, చించోలి, కిన్హాయి, తలవడే, దేహూ, జెండా మలా, రావత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు, నిగిడి ప్రాధికరణ్, రూపీ నగర్లు కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వేలాదిమంది తెలుగు ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యం లో రెడ్‌జోన్‌ను రద్దు చేయాలని లేదా దాని హద్దును తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం స్థానికులంతా ఏకతాటిపైకి వచ్చి ఇటీవల రెడ్‌జోన్ సంఘర్షణ సమితిని ఏర్పా టు చేసుకున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీని కలసి చర్చలు జరిపారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజన మూ కలగలేదు. మావల్ నియోజక వర్గంలోని ఆరు శాసనసభ నియోజక వర్గాల్లో వేలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో భాగమైన చించ్వాడ్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ఉంటున్న తెలుగువారు ఎన్నికలపై తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. -
ఆట నుంచి ఓటు దాకా...
బ్యాట్ పట్టినవారు, బాక్సింగ్ చేసిన వారు, ఈత కొట్టిన వారు, షూటింగ్ చేసిన వారు.... ఇలా ఆటగాళ్లెందరో ఓటు వేటగాళ్లుగా మారారు. ఆట మైదానంలో చూపిన నేర్పునే ఓటు మైదానంలోనూ చూపిస్తామంటూ ముందుకొచ్చారు. సినీ స్టార్ల తరువాత అంతటి క్రేజున్న ఆటగాళ్లు ఈ సారి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఫుట్ బాల్ కింగ్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ తరఫున గోల్ కొడతానంటున్నారు. చిరునవ్వుల క్రికెటర్ మహ్మద్ కైఫ్ కాంగ్రెస్ తరఫున ఫీల్డింగ్ చేస్తున్నారు. ఇక షూటర్ రాజ్యవర్ధన్ రాథోర్ బిజెపి తరఫున గురి తప్పనంటున్నారు. ఇప్పటి వరకూ స్టేడియం నుంచి చట్టసభకు పోటీపడ్డ ఆటగాళ్లెవరో చూద్దాం. మన్సూర్ అలీఖాన్ పటౌడీ - మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి రంగంలోకి దిగిన ఈ స్టైలిష్ నవాబు ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయారు. అంతకు ముందు ఆయన 1971 లో హర్యానా నుంచి పోరాడారు. కానీ గెలవలేకపోయారు. దేశానికి క్రికెట్ పిచ్చి అంటని రోజుల్లో ఆయన పోరాడి ఓడారు. చేతన్ చౌహాన్ - ఇండియన్ క్రికెట్ లో అద్భుతమైన ఓపెనర్లలో ఒకరుగా పేరొందిన చేతన్ రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బిజెపి నేతగా నిలిచారు.ఆయన అమ్రోహా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అస్లాం షేర్ ఖాన్ - ఈ హాకీ షేర్ మధ్య ప్రదేశ్ లోని సాగర్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి, మన హాకీ టీమ్ పరిస్థితి ఒకటేలా ఉంది. జ్యోతిర్మయ్ సిక్దర్ - ఈ స్విమ్మింగ్ ఛాంపియన్ సీపీఎం తరఫున కృష్ణనగర్ (పశ్చిమ బెంగాల్) నుంచి 2004 లో గెలిచింది. 2009 లో మాత్రం ఆమెకన్నా గజ ఈతగత్తె అయిన మమతా బెనర్జీ వేగానికి తలవంచక తప్పలేదు. జస్పాల్ రాణా - ఈ ఏస్ షూటర్ 2009 లో తెహ్రీ గఢ్ వాల్ (ఉత్తరాఖండ్) నుంచి బిజెపి తరఫున పోటీ చేశారు. కానీ గురి తప్పింది. ఆ తరువాత 2012 లో ఆయన బిజెపి వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఈ సారి అంచనా తప్పింది. కీర్తి ఆజాద్ - బ్యాట్ తోనూ, నోటి తోనూ సమానంగా ఆడగల కీర్తి ఆజాద్ తండ్రి భగవత్ ఝా ఆజాద్ ఒకప్పటి బీహార్ ముఖ్యమంత్రి. తండ్రి సహా కాంగ్రెస్ నుంచి బిజెపి టీమ్ లో చేరాడు. దర్భంగా ఎంపీ అయ్యాడు. ఈ సారి మళ్లీ రెండో ఇన్నింగ్స్ ఆడతానంటున్నాడు. నవజ్యోత్ సింగ్ సిద్ధు - అద్భుతమైన వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ఉన్న సిద్ధు రెండుసార్లు అమృతసర్ ఎంపీగా గెలిచారు. మోడీ వీరాభిమాని అయినా 2014 బిజెపీ టీమ్ లో ఈయనకు చోటు దక్కలేదు. మహ్మద్ అజారుద్దీన్ - క్రికెట్ లో ఈయన బ్యాట్ మాత్రమే మాట్లాడింది. ఎంపీగా నోరు మాట్లాడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన అయిదేళ్లలో రెండే రెండు సార్లు నోరు విప్పి మాట్లాడారు. అయిదంటే అయిదు ప్రశ్నలు వేశారు. ఈ సారి రాజస్తాన్ నుంచి లక్ ట్రై చేసుకుంటున్నారు. మనోహర్ ఐచ్ - నాలుగున్నర అడుగుల ఐచ్ ఒకప్పటి మిస్టర్ యూనివర్స్. ఎనభై ఏళ్లు వచ్చినా కండల వీరుడిగానే నిలిచాడు. ఈయన బిజెపి తరఫున బెంగాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ మధ్యే ఐచ్ చనిపోయారు. -
నేను బలి పశువును కాదు: అజహర్
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్ లోక్‌సభ స్థానంలో అభ్యర్థిగా బరిలోకి దింపినందున తానేమీ బలి పశువును కాలేదని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ అయిన అజహర్ అక్కడి నుంచి పోటీకి విముఖంగా ఉండటంతో ఆయనను రాజస్థాన్ నుంచి పోటీకి దింపి బలి పశువును చేశారంటూ ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు ‘ఐఏఎన్ఎస్’ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. మొరాదాబాద్ నుంచి వేరే స్థానానికి ఎందుకు మారారన్న ప్రశ్నకు అజహర్ కొంత అసంతృప్తికి గురయ్యారు. తాను వేరే సీటు కావాలని కోరలేదని, అది పార్టీ నిర్ణయమని తెలిపారు. అయినా తాను బలి పశువును కాలేదన్నారు. ఇంటర్వ్యూలో అజహర్ ఇంకా ఏమన్నారంటే... మొరాదాబాద్‌ను విడిచిపెట్టేందుకు నాకు ఏ కారణ మూ లేదు. ఐదేళ్లుగా నేనక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశాను. ఒక క్రికెటర్‌గా ఎలాంటి పిచ్‌పై అయినా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అన్నిసార్లూ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్లే కావాలని నేను అడగలేను. పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని గౌరవిస్తూ.. పార్టీకి గెలుపు దక్కేలా శాయశక్తులా కృషి చే స్తాను. కాగా, టోంక్-సవాయి నుంచి ఢిల్లీకి వచ్చిన స్థానిక కాంగ్రెస్ నేతలు అజహర్‌కు మద్దతు ప్రకటించారు. -
రాజస్థాన్ బరిలో అజహర్
58 మందితో కాంగ్రెస్ మూడో జాబితా ఢిల్లీ నుంచి సిబల్, కృష్ణతీరథ్ సురేశ్ కల్మాడీకి దక్కని చాన్స్ న్యూఢిల్లీ: మొత్తం 58 మందితో లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్‌కు రాజస్థాన్‌లోని సవాయ్‌మదోపూర్ సీటును కేటాయించగా, కేంద్ర మంత్రులు కపిల్‌సిబల్‌ను ఢిల్లీలోని చాందినీచౌక్ స్థానం నుంచి, కృష్ణతీరథ్‌ను వాయువ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్‌జోగికి మహాసముంద్ స్థానాన్ని కేటాయించారు. మూడో జాబితాలో వెల్లడించిన వివరాల మేరకు అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఇద్దరు, చత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, ఢిల్లీ నుంచి ఐదుగురు, గోవా నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి ఎనిమిది మంది, హర్యానా నుంచి ముగ్గురు, జార్ఖండ్ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి నలుగురు, ఒడిశా నుంచి ఇద్దరు, రాజస్థాన్ నుంచి 15 మంది, ఉత్తరప్రదేశ్, అస్సాం, బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, డయ్యూడామన్ నుంచి ఒక్కొరు చొప్పున అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ సిట్టింగ్ ఎంపీ అయిన అజహరుద్దీన్ స్థానికంగా ఉన్న వ్యతిరేకతతోనే రాజస్థాన్‌కి మార్చుకున్నట్టు సమాచారం. ఇక ప్రముఖుల విషయానికి వచ్చే సరికి.. అజయ్‌మాకెన్‌కు న్యూఢిల్లీ స్థానం, ఢిల్లీ మాజీ సీఎం, కేరళ గవర్నర్ షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌కు ఈస్ట్ ఢిల్లీ స్థానం కేటాయించారు. రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్‌కు అజ్మీర్, చంద్రేశ్‌కుమారికి జోద్‌పురి సీట్లు దక్కాయి. గుజరాత్‌లోని పంచమహల్ లోక్‌సభ సీటును కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అల్లుడు పరంజయాదిత్య పర్మార్‌కు కేటాయించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీకి ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. కల్మాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని విశ్వజిత్‌కదమ్‌కి కేటాయించారు. కాగా, ఈ జాబితాలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థులను ఎవరినీ ప్రకటించలేదు. వారణాసిపై కొనసాగుతున్న సస్పెన్స్ వారణాసి నుంచి నరేంద్రమోడీ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి హస్తం తరఫున ఎవరు బరిలో దిగుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో మంగళవారం విడుదల చేసిన మూడో జాబితాలో వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ జాబితాలోనూ వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేయలేదు. ఇదిలావుంటే, వారణాసి నుంచి ప్రముఖ వ్యక్తినే రంగంలోకి దింపనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. -
లోక్‌సభ బరిలో నటి నగ్మా
ఆమెకు యూపీలోని మీరట్ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ మాజీ క్రికెటర్ అజహర్ సీటు మరొకరికి మాజీ మంత్రి బన్సల్‌కు మళ్లీ టికెట్ 71 మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాది సినిమాల్లో హీరోయిన్గా గతంలో ఓ వెలుగు వెలిగిన నటి నగ్మాకు ఈ సారి కాంగ్రెస్ లోక్‌సభ టికెట్ దక్కింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. లోక్‌సభ ఎన్నికలకు 71 మందితో కాంగ్రెస్ తన రెండో జాబితాను గురువారం ఢిల్లీలో విడుదల చేసింది. తొలి జాబితాలోంచి నలుగురి పేర్లను మారుస్తూ రెండో జాబితాలో కొత్త పేర్లు ప్రకటించింది. ముందుగా మీరట్ స్థానానికి దయానంద్ గుప్తా పేరును ప్రకటించినా ఇప్పుడాస్థానంలో నగ్మాకు చోటు కల్పించారు. అలాగే రాయ్‌గఢ్ స్థానాన్ని మేనకాసింగ్కు బదులుగా ఆర్తీసింగ్కు, రాయ్‌పూర్ సీటును ఛాయా వర్మకు బదు లు సత్యనారాయణ్ శర్మకు, మేఘాలయలోని తురా స్థానాన్ని డి.జెన్నిత్ ఎం.సంగ్మాకు బదులు డారిల్ విలియం చైకు కేటాయించారు. రెండో జాబితాలో మొత్తం 11 మంది మహిళలకు చోటు కల్పించారు. మరోవైపు మాజీ క్రికెటర్, మొరాదాబాద్ ఎంపీ అజారుద్దీన్‌కు రెండో జాబితాలో టికెట్ దక్కలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని మొరాదాబాద్ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకురాలు బేగం నూర్ బానోకు కాంగ్రెస్ కేటాయించింది. నిన్నటితరం బాలీ వుడ్ నటుడు రాజ్ బబ్బర్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ స్థానం లభించింది. రైల్వేశాఖలో వెలుగుచూసిన ‘ముడుపులకు ఉద్యోగం’ కుంభకోణంలో ప్రమేయం ఆరోపణల తో ఆ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన పవన్‌కుమార్ బన్సల్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన్ను తిరిగి చండీగఢ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపింది. రెండో జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులెవరూ లేరు. కాగా, ఈసారి తిరిగి టికెట్ దక్కించుకున్న కేంద్ర మంత్రుల్లో వీరప్ప మొయిలీ (చిక్‌బళ్లాపూర్), శశిథరూర్ (తిరువనంతపురం), నారాయణ సామి (పుదుచ్చేరి) ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే స్థానంతోపాటు ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో ఆరోపణలతో సీఎం పదవికి రాజీనామా చేసిన అశోక్ చవాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాందేడ్‌కు అభ్యర్థిని ప్రకటించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. -
ఇక కోచ్‌గా అజహర్
న్యూఢిల్లీ: సుదీర్ఘ చర్చల తర్వాత జమ్మూ కాశ్మీర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు భారత మాజీ కెప్టెన్, లోక్‌సభ సభ్యుడు అజహరుద్దీన్ అంగీకరించారు. ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు ఫరూఖ్ అబ్దుల్లా చాలాకాలం నుంచి అజహర్‌తో చర్చలు జరుపుతున్నారు. ఎట్టకేలకు శుక్రవారం ఈ హైదరాబాదీ స్టార్ తన అంగీకారం తెలిపారు. ‘మా రాష్ట్ర క్రికెట్ జట్టుకు శిక్షణ ఇచ్చేందుకు ఎట్టకేలకు అజహర్ అంగీకరించారు. మా యువ క్రికెటర్లకు ఆయన అనుభవం ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం’ అని అబ్దుల్లా తెలిపారు. అయితే దీనికి ఇంకా బీసీసీఐ నుంచి మాత్రం గ్రీన్‌సిగ్నల్ రాలేదు.