పాకిస్తాన్పై భారత్ గెలుస్తుంది: అజహర్ | India Won't Face a Big Threat From Pakistan in World Cup: Mohammad Azharuddin | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్పై భారత్ గెలుస్తుంది: అజహర్

Published Sat, Feb 7 2015 11:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

పాకిస్తాన్పై భారత్ గెలుస్తుంది: అజహర్

పాకిస్తాన్పై భారత్ గెలుస్తుంది: అజహర్

న్యూఢిల్లీ :  వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటిదాకా భారత జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడింది లేదు. ఈసారి తమ ప్రారంభ మ్యాచ్లోనే ఈ రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నా పాకిస్తాన్ నుంచి ధోని సేనకు ప్రమాదమేమీ ఉండదని మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు. 'భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అది ఎప్పటికీ పెద్ద మ్యాచే. ఇక ప్రపంచ కప్లో మనం ఒక్కసారి కూడా పాక్ చేతిలో ఓడలేదు. ఇప్పుడు అందరి మనస్సులోనూ ఇదే విషయం కదలాడుతోంది. పాక్ కన్నా భారత్ జట్టు సమతూకంతో ఉంది. అంచనాలకు తగ్గట్టు రాణిస్తే పాక్ నుంచి మనకు పోటీ ఉంటుందని అనుకోవడం లేదు' అని అజహర్ అన్నారు.

అయితే ఆసీస్ పర్యటనలో భారత జట్టు ఇప్పటిదాకా ఒక్క విజయం కూడా నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఈ టోర్నీలో తమ టైటిల్ను నిలబెట్టుకోవాలంటే మాత్రం నిలకడగా ఆడాల్సిన అవసరం ఉందన్నారు. మ్యాచ్లను గెలుస్తూ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఒకవేళ పరాజయాలు కొనసాగితే తిరిగి పుంజుకోవడం కష్టమేనని తేల్చారు. ఆటగాళ్లందరూ పూర్తిస్థాయిలో మ్యాచ్ ఫిట్గా ఉండటం అన్నింటికన్నా ముఖ్యమని అన్నారు. జట్టులో చాలామంది ఆటగాళ్లు తమతో పాటు గాయాలను కూడా మోస్తున్నారని ఆందోళన చెందారు. నెలరోజుల నుంచి పేసర్ ఇషాంత్ శర్మ గాయంతోనే ఉంటున్నాడని, అసలు అతడేం చేస్తున్నాడో అర్థం కావడం లేదని అజహర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement