బోధన్ టౌన్/ఎడపల్లి, న్యూస్‌లైన్ : దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మాజీ భారత క్రికెట్ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బోధన్ పట్టణం, ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్, జాన్కంపేట్‌లలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం లభించినప్ప టి నుంచి కాంగ్రెస్ దేశ ప్రజలకు సేవ చేస్తోందన్నారు. రైతులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
బోధన్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. రైతన్నలకు సాగునీరు అందించి వారి పంటలను కాపాడారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్‌ను చీటర్ అని విమర్శించారు. ఎన్నికలు కూడా క్రికె ట్ ఆటలాంటివే అని, జట్టులో సభ్యులందరూ కలిసి ఆడితేనె విజయం సాధ్యం అవుతుందని అన్నారు. బోధన్‌లో అజారుద్దీన్‌ను చూసేందుకు యువకులు అధిక సంఖ్యలో వచ్చారు. బ్యాట్‌లు తెచ్చి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అజారుద్దీన్ సమక్షంలో టీడీపీ నాయకులు బిల్ల గంగాధర్ తన అనుచరులతో కాం గ్రెస్‌లో చేరారు. అజారుద్దీన్‌కు కాంగ్రెస్ నాయకులు పట్టణ స్వాగత తోరణం వద్ద గజమాల వేసి స్వాగతం పలికారు. ఆచణ పల్లి బైపాస్ నుంచి ఆచన్ పల్లి, శక్కర్‌నగర్, శక్కర్‌నగర్ చౌరస్తా, కొత్తబస్టాండ్, అం బేద్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, రాకాసీపేట్, పాత బోధన్‌లో రోడ్‌షో సాగింది.
సుదర్శన్‌రెడ్డిని గెలిపిస్తే వందో టెస్టు పూర్తిచేసినట్లే
రెంజల్ : మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తాను వందో టెస్టు పూర్తి చేసినట్లేనని అజారుద్దిన్ పేర్కోన్నారు. చాలాకాలం భారత క్రికెట్‌కు పనిచేసి అలసిపోయానని తాను కెరిర్ ముగించే సమయానికి 99 టెస్టులు మాత్రమే ఆడానని అన్నారు. మిగిలిన టెస్టు మ్యాచ్ ఈ నెల 30న జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు సిక్సర్లు కోడుతూ బ్యాలెట్ బాక్సులు నింపాలని సూచించారు. సుదర్శన్‌రెడ్డి ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ఎవరూ చేయలేదని కొనియాడారు. టీఆర్‌ఎస్, టీడీపీ, బిజేపీలు డబ్బున్న పార్టీలని ఆ పార్టీల నేతలకు ప్రజా సమస్యలు తెలియవన్నారు.
కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి
Published Mon, Apr 28 2014 2:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement