Sudarshan reddy
-
ఈ నెల 28 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2025లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, ముసాయిదా ఓటర్ల జాబి తాపై అభ్యంతరాలు, ఇతర మార్పులు, చేర్పుల ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్ల డించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారంతా ఓటరు నమోదు కోసం దర ఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దర ఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 6న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తా మని వెల్లడించారు. శనివారం సి.సుదర్శన్‌రెడ్డి బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు కూడా ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చని.. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటు హక్కు కల్పిస్తామని సీఈఓ తెలి పారు. ఓటర్ల సౌకర్యం కోసం వచ్చే శని, ఆది వారాల్లో (9, 10 తేదీల్లో) ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని చెప్పారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ (eci.gov.in), ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.8 లక్షలకుపైగా కొత్త ఓటర్లుఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా గత నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 3,34,26,323 మంది ఓటర్లుండగా.. అందులో 1,66,16,446 మంది పురుషులు, 1,68,07,100 మంది మహిళలు, 2,777 మంది మూడో జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. 15,948 మంది సర్వీస్ ఓటర్లు, 3,578 మంది ప్రవాసీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి అక్టోబర్ 20 మధ్యలో 8,02,805 మంది కొత్త ఓటర్లు నమోదుకాగా.. 4,14,165 మంది అనర్హులైన ఓటర్లను తొలగించామని, మరో 5,93,956 మంది ఓటర్ల వివరాలను సరిదిద్దామని వెల్లడించారు. రాష్ట్రంలో 18–19 ఏళ్ల యువ ఓటర్ల సంఖ్య 8.51 లక్షల నుంచి 10.03 లక్షలకు పెరిగిందని తెలిపారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 2,25,462 మంది, వికలాంగ ఓటర్లు 5,28,085 మంది ఉన్నారని వివరించారు. -
4,85,729 మంది డూప్లికేట్ ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఎస్ఆర్) 2025లో భాగంగా రాష్ట్రంలో 4,85,729 మంది ఓటర్ల పేర్లు, ఇతర సమాచారం ఒకే రీతి(సిమిలర్ ఎంట్రీ)లో ఉన్నట్టు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఒకే నియోజకవర్గం ఒకే పార్ట్ పరిధిలో 52,586 మంది, ఒకే నియోజకవర్గం వేర్వేరు పార్ట్‌ల పరిధిలో 1,10,994 మంది, వేర్వేరు నియోజకవర్గాల పరిధిలో 3,22,149 మంది ఇలాంటి ఓటర్లున్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 21,432 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితాల నుంచి తొలగించామని చెప్పారు. బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల పరిశీలన నిర్వహిస్తున్నారని, గత నెల 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 3,33,11,347 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 70,60,288 (21.19 శాతం) మంది ఓటర్లను గుర్తించి నిర్ధారించినట్టు తెలిపారు. 10,224 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదని, 23,220 మంది వలస వెళ్లారని, 21,465 మంది చనిపోయారని, 12,763 మంది ఫొటోలు సరిగ్గా లేవని, 5,677 మందికి రెండు ఓట్లున్నట్టు గుర్తించినట్టు సీఈఓ తెలిపారు. జనవరి 6న తుది ఓటర్ల జాబితా: అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నాటి నుంచి నవంబర్ 28 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖా స్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. 2025 జనవరి 1కి కనీసం 18 ఏళ్లు కలిగి ఉండేవారు ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. డిసెంబర్ 24లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న తుది జాబితాను ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సైతం ఒక పర్యాయంలో 10 దరఖాస్తులు, అభ్యంతరాలు చొప్పున 3 పర్యాయాల్లో 30 దరఖాస్తులు, అభ్యంతరాలను స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు సమరి్పంచవచ్చునని చెప్పారు. -
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. నూతన సీఈవోగా నియమితులైన సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.కాగా, తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వికాస్ రాజ్ నిర్వహించగా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వికాస్ రాజ్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా ఈసీ నియమించింది. -
‘కాళేశ్వరం’ బాధ్యులపై చర్యలు షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ప్రారంభించామని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. పిల్‌పై విచారణ: మేడిగడ్డ ఘటనకు కారకులెవరో తేల్చేందుకు గాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కాంగ్రెస్ నేత జి.నిరంజన్ గత నవంబర్‌లో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా ఫైలింగ్ నంబర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది టి.నరేందర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, కేంద్రం తరఫున న్యాయవాది ఎల్.ప్రణతిరెడ్డి, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ టి.సృజన్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకతవకలు గుర్తించింది మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుపై ప్రభుత్వ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఏం చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలతో నివేదిక అందజేయాలని గత నెల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ధర్మాసనానికి ఏజీ అందజేశారు. అనంతరం వాదనలు వినిపించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్డీఎస్ఏ అధికారులు గత ఏడాది అక్టోబర్ 24, 25 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించి ప్రాథమిక విచారణ జరిపారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలను ఎన్డీఎస్ఏ సమర్పించింది. ‘ప్రణాళిక, రూపకల్పన, నాణ్యత, నియంత్రణ, ఆపరేషన్–నిర్వహణకు సంబంధించిన సమస్యలతో పాటు పియర్లు ఏకశిలగా ఉండటంతో కదిలి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కచ్చితమైన కారణాలను గుర్తించడానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి..’అని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ విభాగం ప్రాథమిక విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ఈఎన్సీ వెంకటేశ్వర్లును తొలగించాం. ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అయితే ‘కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952లోని సెక్షన్ 3(1) ప్రకారం హైకోర్టు/సుప్రీంకోర్టు మాజీ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది’అని వివరించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం 4 నెలలకు వాయిదా వేసింది. -
క్రైమ్ కామెడీ
ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, ‘రంగస్థలం’ మహేశ్, ‘తాగుబోతు’ రమేశ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘నటరత్నాలు’. శివ నాగు దర్శకత్వంలో చంటి యలమాటి, డా. దివ్య నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చి, సినిమా తీయాలనుకునేవాళ్లు ఎలా సఫలమవుతున్నారు? ఎలా విఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘2002లో ఓ సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చి, లాస్ అయ్యాను. ‘నటరత్నాలు’ కథ సినిమాలో సినిమాలాంటిది. ప్లాన్ చేసిన బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేశాం’’ అన్నారు చంటి యలమాటి. -
కస్టం మిల్లింగ్ కహానీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా నుంచి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్‌ను మిల్లర్లు ఇప్పటివరకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. జిల్లాలోని మొత్తం 62 పారాబాయిల్డ్, 218 ముడిరైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ద్వారా కేటాయించిన ధాన్యానికి సంబంధించి కస్టం మి ల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే.. 2022–23 వానాకాలం సీజన్లో జిల్లాలోని మిల్లర్లకు 6,03,872 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. ఈ ధాన్యానికి గాను మిల్లర్లు 4,09,535 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే 3,87,529 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 22,005 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన సీఎంఆర్ పెండింగ్ ఉంది. ► 2022–23 యాసంగి సీజన్ విషయానికి వస్తే 6,35,190 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు. ఇందుకు సంబంధించి 4,32,264 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1,22,980 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. ఇంకా 3,09,284 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ ఇవ్వాల్సింది పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఇష్టం మిల్లర్లు కొందరు ఇష్టం వచ్చినట్లు మొండికేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,31,289 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. కొత్త ప్ర భుత్వం ఈ నెలాఖరులోగా మొత్తం సీఎంఆర్ ఇవ్వాలని గడువు పొడిగించింది. అయితే మిల్ల ర్లు మాత్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ధాన్యం మాఫియా.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన భారీ అక్రమం ఇటీవల బయటకొచ్చింది. బోధన్‌లోని మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే నాలుగు రైస్‌మిల్లులకు 2021–22 యాసంగి, 2022–23 వా నాకాలం సీజన్లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్) కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. మిల్లింగ్ చేసి మిగిలిన సీఎంఆర్ బియ్యం ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పాడు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్(ఎడపల్లి), ఆర్‌కామ్ ఇండస్ట్రీస్(వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్(వర్ని), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) అనే మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఇందులో ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, ఆర్‌కామ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్ ఐ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం (సీఎంఎఆర్) మాత్రమే పౌరసరఫరాల శాఖకు ఇచ్చారు. ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26వేల మెట్రిక్ ట న్నుల సీఎంఆర్ బి య్యాన్ని ఇవ్వాలని పౌ రసరఫరాల శాఖ అధికారులు అడుగగా, షకీల్ మిల్లుల నుంచి తమకు బియ్యం రాలేదని చెబుతుండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చినట్లు నలుగురు మిల్లర్లు చెబుతుండడం విశేషం. ఈ విషయమై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రైస్‌మిల్లుల్లో జరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలు, అవినీతి అక్రమాలు బహిర్గతం చేయడానికి ఏకకాలంలో కేంద్ర విజిలెన్స్ విచారణ చేప ట్టాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీఎంఆర్ ఇవ్వకపోతే కఠిన చర్యలు ప్రభుత్వానికి తిరిగివ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్‌ను మిల్లర్లు తక్షణమే ఇవ్వకపోతే కఠినచర్యలు తీసుకుంటాం. కొందరు మిల్లర్ల వైఖరి కారణంగా ప్రభుత్వానికి, రైతుల కు, ఇతర మిల్లర్లకు చెడ్డపేరు వస్తోంది. కొందరు మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా బయట ప్రాంతాల్లో అమ్ముకున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయి. – సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే -
మెదక్‌కు దామోదర.. జహీరాబాద్‌కు సుదర్శన్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నియమించింది. అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు మెదక్ బాధ్యతలు అప్పగించింది. అలాగే జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్(ఎస్సీ), జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట్, సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండడంతో కాంగ్రెస్ ఇన్చార్జిలను నియమించింది. ఇవి చదవండి: 'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్ శంకర్ -
ఈడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను కొనసాగిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఐదు గంటలపాటు నేషనల్ హెరాల్డ్ కేసులో సుదర్శన్‌రెడ్డి విచారణ సాగింది. కాగా ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సెప్టెంబర్ 23 న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పార్టీ నేత గాలి అనిల్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం ఇప్పటికే ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఈనెల 6న మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్‌లను ఈడీ అధికారులు విచారించారు. -
కాంగ్రెస్‌కు మాజీ మంత్రి ఝలక్!
పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం ఇన్చార్జులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డితో అభ్యర్థి మధుయాష్కి, అసెంబ్లీ ఇన్చార్జులు గత అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. అయితే శనివారం తెల్లవారుజామునే సుదర్శన్ రెడ్డి ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా, తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ పంపినట్లు శనివారం ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే బాధ్యతను అధిష్టానం ఈ ఇన్చార్జులకు అప్పగించింది. పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రచార బాధ్యతలను ఇన్చార్జి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే అగ్రనేత ప్రచార సభల నిర్వహణ వంటి బాధ్యతలనూ ఇన్చార్జికి పార్టీ అప్పగించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో సీనియర్ నేతను ని యమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఈ ఇన్చార్జులను ప్రకటించింది. అయితే ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, పార్టీలో చేరికలు ఇలా ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికాబద్ధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన్ని చుట్టి వచ్చేలా చేస్తున్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ప్రచారం కూడా ఊపందుకుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూనే రోడ్‌షోలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. ఇటు కాంగ్రెస్‌లో మాత్రం ఈ స్థాయి ఊపు కనిపించడం లే దు. పార్టీ నాయకులను, శ్రేణులను సమన్వయం చేయడంలో కీలకమైన పార్టీ ఇన్చార్జి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే బోధన్‌కు చెందిన కాంగ్రెస్ కేడర్ దాదాపు అంతా టీ ఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇటీవల గెలిచిన సర్పంచ్‌లు, ద్వితీయ శ్రేణి నాయకులు కూ డా ఈ ఎన్నికల సందర్భంగా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సు దర్శన్‌రెడ్డి పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అర్ధరాత్రి వరకు సమాలోచనలు.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం అర్ధరాత్రి వరకూ సమాలోచనలు జరిపారు. పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ రాత్రి 11 గంటల ప్రాంతంలో నగరంలోని కంఠేశ్వర్‌లోని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు తాహెర్‌బిన్ హందాన్, ఈరవత్రి అనీల్, ఆర్మూర్‌కు చెందిన ఒకరిద్దరు నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే మధుయాష్కి హైదరాబాద్‌లో సుదర్శన్‌రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా గత అర్ధరాత్రి మరోసారి సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున తాను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సుదర్శన్‌రెడ్డి ప్రకటించడం ఎన్నికల వేళ ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
నిజామాబాద్‌లో కాంగ్రెస్ 9 స్థానాలు గెలుస్తుంది
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం పలు జాతీయ న్యూస్ చానెళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ అంచనాలను కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. జాతీయ సర్వేలు ఎలా ఉన్నా.. ప్రజలు సర్వేలు చూసి ఓట్లు వేయరని తెలిపారు. మహాకూటమిదే అధికారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ స్పందిస్తూ.. మహాకూటమికి 70 నుంచి 80 స్థానాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేను మించి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఓట్లు భారీగా గల్లంతు అయ్యాయని, ఈ విషయమై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. -
హామీల అమలులో టీఆర్ఎస్ విఫలం: పి. సుదర్శన్ రెడ్డి
సాక్షి, బోధన్‌రూరల్: గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలో రాగానే వాటిని అమలు చేయడంతో విఫలమైందని మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండంలోని చెక్కి క్యాంప్, పెంటాకుర్దూ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ అధికారంలోకి మేనిఫేస్టోలో ఉన్నవిఅన్ని అమలు చేస్తామన్నారు. టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగాశంకర్, మండలాధ్యక్షులు నాగేశ్వర్రావ్, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తాం బోధన్‌టౌన్ : విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కాంగ్రెస్ ఎల్లవేళల కృషి చేస్తుందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. పట్టణ శివారులోని ఏఆర్ గార్డెన్లో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం టీఆర్ఎస్ పిరికి పందచర్య అన్నారు. ఈ సమ్మేళనంలో విశ్వబ్రాహ్మణుల సంఘం జిల్లా అధ్యక్షులు రమణాచారీ, సభా«ధ్యక్షులు హరికాంత్ చారీ, ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ దోసపల్లి నరహారి నాయకులు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు, గోపాల్‌రెడ్డి, హన్మంత్‌రావ్, మహమూద్, విశ్వబ్రాహ్మణ సంఘం వివిధ మండలాల అధ్యక్షులు భూమాచారీ, ప్రసాద్, మల్లెపూల రవి, గంగాధర్‌చారీ, చంద్రశేఖర్ చారీ, సత్యం చారీ, మురారి, జనార్ధన్‌చారీ ఉన్నారు. ఎడపల్లి : కుర్నాపల్లి, మండల కేంద్రంలో పి.సుదర్శన్‌రెడ్డి ప్రధాన వీదుల గుండా రోడ్‌షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాకాయలు పేల్చి సుదర్శన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. రెంజల్ : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేస్తుందని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బాగేపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ మేనిఫెస్టోలోని çహామీలను నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. -
దోస్త్ మేరా దోస్త్...
బోధన్(నిజామాబాద్ ): నిన్న మొన్న అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎమ్మెల్యే స్థానానికి వేర్వేరు పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీ చేసిన ఆ ముగ్గురు ఉద్దండ నేతలు రాజకీయ ప్రత్యర్థులు. తాజా రాజకీయాల నేపథ్యంలో చేయి చేయి కలిపారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఓకే గూటికి చేరుకున్నారు.గత ఎన్నికల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ తాజా రాజకీయ పరిధుతులు ఆ ముగ్గురు నేతలను ఏకం చేశాయి. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నామినేషన్ల గడియలు సమీపిస్తున్న నేపథ్యంలో బోధన్ నియోజక వర్గంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా, రసవత్తరంగా మారాయి. ఆ ముగ్గురు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సిత్రాలను ఓటర్లు ఆసక్తిగా గమనిస్తూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు గతాన్ని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు స్పష్టమవుతాయి. నవీపేట మండలంలోని సిరాన్‌పల్లి గ్రామానికి చెందిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 1986–07లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి అప్పట్లో టీడీపీ అభ్యర్థి స్వర్గీయ కొత్త రమాకాంత్ చేతిలో ఓటమి చెందారు.1999,2004,2009 వరకు మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికలబరిలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం పొంది హ్యాట్రిక్ రికార్డు సాధించారు.ఉమ్మడిరాష్ట్రంలో పలు కీలకమైన శాఖలకు మంత్రి గా పని చేశారు. 2004. 2009లో తెలంగాణజనతా పార్టీ, ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, 2014ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మేడపాటి ప్రకాష్ రెడ్డిలు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పై పోటీ చేసి ఓడిపోయారు. కాని 25 వేలపైగా ఓట్లు సాధించి సత్తాచాటుకున్నారు.ఈ ఇరువురు నేతలు గత ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ప్రత్యర్థి అభ్యర్థులే. అయితే ఇందులో మేడపాటి ప్రకాష్ రెడ్డి ఈ ఏడాది అక్టోబర్ 20న కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఏఐసీసీ అధినేత రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మరో నేత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి విద్యార్ధి దశ నుంచి రాజకీయ ప్రస్తానం కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. కాని కాల క్రమంలో ఆయన పలు పార్టీల్లోకి వెళ్లారు.తాజాగా బిజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం వెల్లడించారు. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సాక్షితో తెలిపారు. కెప్టెన్ కరుణాకర్ రెడ్డి 2004,2009 ఎన్నికల్లో వేర్వేరు పార్టీల అభ్యర్థిగామాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పై పోటీపడ్డారు. 2009 ఎన్నికల్లో కెప్టెన్ కరుణాకర్ రెడ్డి 35 వేలపైగా ఓట్లు సాధించి సత్తా చాటుకున్నారు. ఈ ముగ్గురు ప్రత్యర్థి నేతలను ఈ సారి ఎన్నికల్లో ఒకే పార్టీ వేదిక పై చూడబోతున్నాం. ఈ రాజకీయ పరిణామాలు ఆసక్తి రేక్కెత్తిసున్నాయి. -
తాటికల్లు మంచిగున్నది..
సాక్షి,చెన్నారావుపేట: ఎన్నికల ప్రచారాలు జోరుగా ,చాలా వింతగా చేస్తున్నారు అభ్యర్థులు . గెలవాలనే తపనతో ప్రజలను ఆకర్షించాలని వివిధ రూపాలలో దర్శనమిస్తున్నారు. ఇదే విధంగా తాటికల్లు తాగుతున్నట్లు టీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి వరంగల్ జిల్లా చెన్నారావు పేటోలో ప్రచారాలు చేశారు. -
పగే ఊపిరైతే...!
ఆశ, శ్వాసే కాదు.. పగ కూడా కొందర్ని బతికేలా చేస్తుంది. అందుకు శత్రువు పై ప్రతీకారం తీర్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉంటే చాలు. ఆ పగే ఊపిరై బతికిస్తుందనే కథతో రూపొందుతోన్న రివెంజ్ థ్రిల్లర్ ‘శత్రు’. సుదర్శన్‌రెడ్డి దర్శకత్వంలో హరినాథ్‌రెడ్డి, తపస్, తమన్నా వ్యాస్, శ్రేయా వ్యాస్ ముఖ్య తారలుగా టి.హరినాథ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి బేబీ కుసుమ క్లాప్ ఇవ్వగా, శ్రీమతి స్వప్న కెమెరా స్విచ్చాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, సెప్టెంబర్‌లో మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. -
నియోజకవర్గానికి 2,360 ‘డబుల్’ గృహాలు
రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 2,360 డబుల్ బెడ్రూం గృహాలు మంజూరయ్యాయని రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించనుందని పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్.రవి ఆధ్వర్యాన శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1400 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా నగర పంచాయతీకి అదనంగా 960 మంజూరయ్యాయని తెలిపారు. రాజకీయాలకతీతంగా అర్హులకు గృహాలు మంజూరు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత పట్టణంలో ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలపై ఆయన ఆరా తీశారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్, తహసీల్దార్ శంకర్లింగం, పాల్గొన్నారు. -
అత్యున్నత కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతా
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థను రాష్ట్రంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతానని చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. అందరూ గర్వపడేలా అవినీతిరహిత కార్పొరేషన్‌గా పేరొచ్చే లా పనిచేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారి ఆయన సంస్థ కార్యాలయానికి వచ్చారు. ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలసి ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలన వారసత్వాలను విడిచి రాష్ట్ర ప్రభుత్వ అంచనా లకు తగినట్లుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులకు సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ప్రజలు ప్రశంసించేలా కార్పొరేషన్ పనితీరు ఉండాలని, ఇందుకోసం ఉద్యోగులంతా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలన్నారు. కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ.. రూ.వేల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేషన్లో సరైన సిబ్బంది, విభాగాలు లేవని, ఫైనాన్స, ఐటీ, టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
కాలయాపన వద్దు
• ఎన్డీఎస్ఎల్ను తక్షణమే పునరుద్ధరించాలి • చెరుకు సాగుకు ప్రభుత్వం భరోసానివ్వాలి • మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డిమాండ్ • రేపటి నుంచి కాంగ్రెస్ రైతు పాదయాత్ర బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ భవితను తేల్చడంలో ఇంకా కాలయాపన వద్దని, నెలలోపు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న టీఆర్ఎస్.. రెండున్నరేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. మంగళవారం బోధన్‌లోని నీటిపారుదల శాఖ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లేఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేయడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారికి ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోధన్ ప్రాంతం చెరుకు పంట సాగుకు అనుకూలమని, చెరుకుకు బదులు ఇతర పంటలు సాగు చేసిన రైతులు వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఫ్యాక్టరీ భవితతో పాటు చెరుకు పంట సాగుపై రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. గతేడాది ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు రావాల్సిన రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని కోరారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర ఫ్యాక్టరీని పునరుద్ధరణ, చెరుకు సాగుపై రైతులకు భరోసా, కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయి వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రైతు పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి చెప్పారు. కోటగిరి మండలంలోని కొల్లూరులో ప్రారంభమయ్యే పాదయాత్ర బోధన్, రెంజల్, ఎడపల్లి మండలాల మీదుగా బోధన్‌కు చేరుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారన్నారు. ఎంపీపీలు గంగాశంకర్, మోబిన్‌ఖాన్, రెంజల్ జెడ్పీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి, నేతలు రాంమోహన్, రమేశ్, గుణప్రసాద్, ఎల్లయ్య యాదవ్, అశోక్, ఎంపీటీసీలు శంకర్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం పుస్తకావిష్కరణ
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ రచించిన పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. 'గడచిన చరిత్ర- తెరచిన అధ్యాయం' పేరుతో రచించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టీస్ సుదర్శన్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రొఫెసర్ కోదండరామ్, 'సాక్షి' ఈడీ కే రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే విభజనకు అర్థముంటుందన్నారు. హైకోర్టు విభజన బాధ్యత కేంద్రానిదే అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌కు ఆత్మహత్యాసదృశమే అని జైరాం రమేష్ పేర్కొన్నారు. అయితే.. డిసెంబర్ 9 ప్రకటన తరువాత తెలంగాణపై కాంగ్రెస్ ఎందుకు వెనక్కిపోయిందో జైరాం రమేష్ రాయలేదని కే రామచంద్రమూర్తి అన్నారు. ఇకపోతే.. అదిష్టానాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినప్పటికీ అతణ్ని సీఎం పదవి నుంచి ఎందుకు తొలగించలేదో కూడా జైరాం రమేష్ చెప్పలేదన్నారు. -
గొప్పలొద్దు.. నీరు కావాలి : సుదర్శన్‌రెడ్డి
► నీటి ఎద్దడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ► తక్షణమే సర్కారు పరిష్కరించాలి ► కలెక్టర్ సీరియస్‌గా స్పందించాలి ---మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి బోధన్: తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని.. ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతుంటే.. తెలంగాణ సర్కారు అభివృద్ధి పేరిట గొప్పలతో కాలం వెళ్లదీస్తుందని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 19వ వార్డులో బోరు మోటారు ప్రారంభించారు. అనంతరం నీటి పారుదలశాఖ విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. రూ.వేల కోట్లతో ప్రారంభించిన వాటర్‌గ్రిడ్ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు, పశువులు తాగు నీటికి ఇబ్బందులు పడుతుంటే.. అధికార యంత్రాంగంలో ముందస్తు ప్రణాళిక, అప్రమత్తత లేకపోవడం ప్రభుత్వ పాలన తీరు, నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షకు పైగా జనాభా ఉన్న బోధన్ పట్టణంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, నీటి ఎద్దడికి బాధ్యులైన మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ యోగతారాణా సీరియస్‌గా స్పందించాలన్నారు. వార్డుల్లో నీటి ఎద్దడి నివారణకు 30 మోటర్ల వితరణ పట్టణంలోని నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను తమ పార్టీతోపాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు తన దృష్టికి తెచ్చారని మాజీ మంత్రి వెల్లడించారు. ప్రజల నీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్య తీవ్ర ఉన్న వార్డుల్లో కొత్తగా వేసిన బోర్లకు సొంత డబ్బులతో 30 మోటర్లను అందించానని, తమ పార్టీ కౌన్సిలర్లు, ఆయా వార్డుల్లో నాయకులు బోర్లు వేయించి మరో 10 మోటార్లను బిగించారన్నారు. అనంతరం పట్టణంలోని గోశాల రోడ్డులో గల మున్సిపల్ 19వ వార్డులో బోరు మోటారును ప్రారంభించా రు. పలువార్డుల్లో పర్యటించిన ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గుణప్రసాద్, అబ్బగోని గంగాధర్‌గౌడ్, కౌన్సిలర్లు దాము, పౌల్, మాజీ కౌన్సిలర్ నక్క లింగారెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతలు నరేంధర్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఫసియోద్దీన్, రమేశ్ పాల్గొన్నారు. -
బిడ్డను చంపేశారయ్యా...
గుంటూరు రూరల్ / ముప్పాళ్ల: ‘‘ఉన్నత విద్య చదివి ప్రయోజకుడై ఉద్దరిస్తాడనుకున్న బిడ్డను ఇలా చంపేశారయ్యా...అన్నింట్లో ముందే వాడు చివరకు చావులోను ముందుంటాడనుకో లేదయ్యా... చదువుల పేరుతో తన బిడ్డను తమకు కాకుండా చేశారంటూ విద్యార్థి సుదర్శన్‌రెడ్డి తల్లి పద్మావతి హృదయ విదారకంగా విలపించింది. పండుగ పూట కూడా ఇంటిదగ్గర ఉండనీయకుండా చేసి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారయ్యా అంటూ ఆమె రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. మండల కేంద్రం ముప్పాళ్లకు చెందిన లోకసాని గోవిందరెడ్డి, పద్మావతిల చిన్న కుమారుడు సుదర్శన్‌రెడ్డి(18) గుంటూరు రూరల్ మండలం తురకపాలెం రోడ్డులోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. అనంతరం కళాశాలలోనే ఉంటూ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల కిందట జేఈఈ మెయిన్స్ పరీక్షలు అనంతరం ఇంటికి వెళ్లి వచ్చాడు. శుక్రవారం కళాశాల 4వ ఫ్లోర్‌లోని 429 రూంలో ఫ్యానుకు పక్కనే ఉన్న ఇనుప కొక్కానికి నవ్వారును తాడులాగా పేనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కళాశాల సిబ్బంది చెప్పారు. సమాచారం తెలుసుకుని వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కబురు చేయకపోవడం వెనుక కారణమేంటి..? ఎంసెట్ విద్యార్థులకు ఒక్క రోజు ఔటింగ్ ఇవ్వడంతో శుక్రవారం విద్యార్థులంతా ఇళ్లకు వెళ్ళారు. దూరప్రాంతాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్ళకుండా ఉండిపోయారు. మధ్యాహ్నం కళాశాలలో ఉన్న ఏడుగురు విద్యార్థులు భోజనం చేసి వారికి కేటాయించిన గదుల్లో విశ్రమించారని, సుదర్శన్ రెడ్డి మాత్రం 4వ ఫ్లోర్‌లోని 429 రూంలో ఫ్యానుకు పక్కనే ఉన్న ఇనుప కొక్కానికి నవ్వారును తాడులాగా పేనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కళాశాల సిబ్బంది చెప్పారు. తమ కుమారుడు మృతి చెందిన సంఘటన మధ్యాహ్నం 3 గంటలకు కళాశాల నుంచి ఎవరో ఫోన్ చేసి చెబితే కానీ తమకు తెలియలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కనీసం కళాశాల యాజమాన్యం కబురు చేయకపోవటం అనుమానంగా ఉందని తెలిపారు. బంధువుల అనుమానాలు... తమ కుమారుడు ఎవ్వరికీ హాని చేసేవాడు కాదని కేవలం కళాశాల యాజమాన్యం అశ్రద్ధ, తోటి విద్యార్థుల వల్లే తమ బిడ్డ మృతి చెందాడని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు వాపోయారు. సంఘటనా స్థలిలో పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. తమ కుమారుడు ఉండే రూంలో కాకుండా వేరే గదిలోకి వెళ్లి ఉరి వేసుకోవటం, ఉరి వేసుకున్న చోట కాకుండా మరో చోట పడి ఉండడం, తల్లిదండ్రులు వచ్చి చూసే లోగా కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని పక్కన పడుకోబెట్టటం వంటివి చూస్తుంటే తమకు అనుమానాలు వ్యక్త మవుతున్నాయని బంధువులు ఆరోపించారు. గ్రామంలోను విషాదఛాయలు... సుదర్శనరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదువుల్లో చురుగ్గా ఉండే సుదర్శనరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలియగానే మిత్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు వారాల క్రితం గ్రామానికి చెందిన ఎంసీఎ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. -
చికిత్స పొందుతూ ఏఎస్సై మృతి
మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న జి.సుదర్శన్‌రెడ్డి(50) మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈనెల 19వ తేదీన సుదర్శన్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్రంగా గాయాలు కావటంతో ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున చనిపోయారు. ఆయన స్వస్థలం రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి. సుదర్శన్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన కుటుంబానికి పోలీసు అధికారుల సంఘం రూ.35,000 సాయంగా ప్రకటించింది. -
బోధన్‌లో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర ఆలయంలో ఈ నెల 3 నుంచి 8వ తేది వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు పూజాకార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. నిజాం చెక్కర ఫ్యాక్టరీని తెరిపించాలని ఈ సందర్భంగా దేవునికి ప్రార్థనలు చేసినట్లు మంత్రి తెలిపారు. -
రేపటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం, కొత్తగూడెంలో కేంద్రాలు ఖమ్మం: బీఎడ్‌లో చేరే విద్యార్థుల కోసం ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని క్యాంప్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుధాకర్, కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్‌ల్లోని నిర్దేశిత కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. కొత్తగూడెం, ఖమ్మం కేంద్రాల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్‌లను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. ఎడ్‌సెట్ హాల్‌టికెట్, ర్యాంక్‌కార్డు, డిగ్రీ, ఇంటర్మీడియెట్, టెన్త్ క్లాస్ మెమోలు, స్టడీ సర్టిఫికెట్లు, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డిగ్రీ టీసీ వెంట తీసుకురావాల్సిందిగా వివరించారు. -
నిధుల ‘పంచాయితీ’
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో గ్రామపంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. వీటిని ఆర్‌డబ్ల్యుఎస్‌కు మళ్లించాలని గత కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం వివాదస్పదమైంది. ఇది పంచాయతీలకు ఉన్న హక్కులను కాలరాయడమేనని సర్పంచులు విమర్శిస్తున్నారు. జిల్లాలోని 889 గ్రామపంచాయతీలకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 13వ ఆర్థిక కమిషన్ నిధులు రూ.25కోట్లకు పైగా విడుదలయ్యాయి. వీటితో గ్రామంలోని తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధిలైట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామపంచాయతీ భవనాల నిర్వహణ, ఈ-పంచాయతీ, అంగన్వాడీ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలల నిర్వహణకు వినియోగించాల్సి ఉంది. ఇదే క్రమంలో జిల్లా పరిషత్‌కు వచ్చే 13వ ఆర్థిక కమిషన్ నిధుల ద్వారా సమగ్ర రక్షిత మంచినీటి పథకం(సీపీడబ్ల్యు)ను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సీపీడబ్ల్యు స్కీమ్ నిర్వహణకు గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను ఇవ్వాలని గత జూన్ 4వ తేదీన అప్పటి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీపీడబ్ల్యు స్కీమ్‌లు ఉన్న 405 గ్రామ పంచాయతీల నుంచి కర్నూలు డివిజన్లో 122 గ్రామపంచాయతీల నుంచి రూ.1,33,33,632లు, నంద్యాల డివిజన్లో 111 గ్రామపంచాయతీల నుంచి రూ.96,82,937లు, ఆదోని డివిజన్లో 172 గ్రామపంచాయతీల నుంచి రూ.1,74,68,598లు కలిపి మొత్తం రూ.4,48,51,167లను ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇకి డీడీ ద్వారా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీపీడబ్ల్యు నిధులేమయ్యాయి...! సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా పరిషత్లదే. ఈ మేరకు 13వ ఆర్థిక కమిషన్ నిధులను గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులతో సీపీడబ్ల్యు స్కీమ్ కింద ఆయా గ్రామాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే జిల్లా పరిషత్ అధికారులు మాత్రం సీపీడబ్ల్యు స్కీమ్ నిధులను గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తాగునీటి అవసరాలకు గాకుండా రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, జిల్లాలో ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీలకు వచ్చిన నిధులను ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈకి డీడీ ద్వారా చెల్లించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం తీవ్రస్థాయి విమర్శలకు తావిస్తోంది. 40 శాతం గ్రామపంచాయతీ నిధులు ఆర్‌డబ్ల్యుఎస్‌కు మళ్లించడం వల్ల గ్రామాల్లో ఇతర కార్యక్రమాల నిర్వహణ కష్టమవుతుందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు, హక్కులను సంరక్షించుకునేందుకు వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
సరదా సరదాగా..
యూకేలో చదవడానికి కోర్స్ కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ పంపిస్తే ఈ బుల్లోడు యూక్షన్, కెమెరా అని షార్ట్ కట్‌గా హిట్ కొట్టేవాడు. సినివూల మీద ప్రేమతో స్నేహితులతో కలసి షార్ట్ ఫిల్మ్స్ ట్రాక్ ఎక్కేశాడు. రాయులసీవు యూస పండించి యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాడు. ఇతగాడు నటించిన ఐదు లఘు చిత్రాలు యూట్యూబ్‌లో ఐదు లక్షలకు పైగా హిట్స్ సాధించాయి. ప్రస్తుతం ప్రముఖ హీరోల సినివూల్లో నటిస్తూ సెల్యులారుడ్ స్క్రీన్‌పై బిజీ అయిపోయూడు సుదర్శన్‌రెడ్డి. నెల్లూరుకు చెందిన సుదర్శన్‌రెడ్డి తిరుపతిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లోనే ఫ్రెండ్స్‌తో సరదాగా నాటకాలు వేస్తూ టాక్ ఆఫ్ ది కాలేజ్‌గా ఓ వెలుగు వెలిగాడు. స్పాంటేనిటీతో అందర్ని నవ్వుల్లో వుుంచెత్తేవాడు. తల్లిదండ్రులకేమో సుదర్శన్‌ను యూకేలో చదివించాలని ఆశ. సుదర్శన్ స్నేహితుడు శ్రీకాంత్ హైదరాబాద్‌లో డెరైక్షన్ కోర్స్ చేస్తూ షార్ట్‌ఫిల్మ్స్ తీసేవాడు. అలా స్నేహితులు రూపొందించిన ‘నాకు కోపం వచ్చింది’ అనే షార్ట్‌ఫిల్మ్ సుదర్శన్‌కు కమెడియున్గా వుంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత ‘అమెరికాకు దారేది’, ‘ఇదిగో ప్రియాంక’, ‘ఓఎల్ఎక్స్’ లాంటి షార్ట్‌ఫిల్మ్స్ యుూట్యూబ్‌లో లక్షల హిట్స్ సాధించారు. సుదర్శన్ పలికించే సీవు యూస నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అలా బుల్లి చిత్రాలతో కెరీర్ ఆరంభించిన సుదర్శన్.. ఇటీవల రన్ రాజా రన్ చిత్రంలో నటించాడు. నాగచైతన్య చేస్తున్న వురో చిత్రం, తమిళ్ హీరో మహత్ నటిస్తున్న ద్విభాషా చిత్రంతో పాటు పలు ప్రముఖ హీరోల సినివూల్లోనూ చాన్స్ కొట్టేశాడు. సుదర్శన్ వుంచి నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆశిద్దాం.