క్రైమ్‌ కామెడీ  | Natarathnalu Preparations for February Release | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ కామెడీ 

Published Mon, Jan 22 2024 3:07 AM | Last Updated on Mon, Jan 22 2024 3:09 AM

Natarathnalu Preparations for February Release - Sakshi

‘నటరత్నాలు’ పోస్టర్‌

ఇనయా సుల్తానా, సుదర్శన్‌ రెడ్డి, ‘రంగస్థలం’ మహేశ్, ‘తాగుబోతు’ రమేశ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘నటరత్నాలు’. శివ నాగు దర్శకత్వంలో చంటి యలమాటి, డా. దివ్య నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్‌ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చి, సినిమా తీయాలనుకునేవాళ్లు ఎలా సఫలమవుతున్నారు? ఎలా విఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘2002లో ఓ సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చి, లాస్‌ అయ్యాను. ‘నటరత్నాలు’ కథ సినిమాలో సినిమాలాంటిది. ప్లాన్‌ చేసిన బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం’’ అన్నారు చంటి యలమాటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement