'నటరత్నలు’.. ‘జాతి రత్నాలు’ అంత హిట్‌ అవ్వాలి | Nata Ratnalu Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

'నటరత్నలు’.. ‘జాతి రత్నాలు’ అంత హిట్‌ అవ్వాలి

Published Sun, Jan 21 2024 2:12 PM | Last Updated on Sun, Jan 21 2024 2:12 PM

Nata Ratnalu Movie Trailer Launch Event - Sakshi

ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, దర్శకుడు కె ఎస్ రవికుమార్ చౌదరి, దర్శకుడు సముద్ర, డీ. ఎస్. రావు మరియు రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ప్రతి ఇండస్ట్రీలో కష్టసుఖాలు ఉంటాయి, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మన కష్టాలు ఎక్కువ కనబడతాయి అవన్నీ అధిగమించి నిలబడ్డమే కళ, ఇక్కడ ఉన్న వాళ్ళే దానికి నిదర్శనం. 'నటరత్నలు' జాతి రత్నాలు లా ఉంది పేరు అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ..  సినిమా అనేది ఒక మెడిసిన్ లాంటిది అది ఎంత తీసుకుంటే అంత మంచిది. నటరత్నాలు టైటిల్ చాలా బాగుంది. నటరత్న అంటే నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశీస్సులతో నటరత్నాలు అనే టైటిల్ చాలా బాగా పెట్టారు.డైరెక్టర్ శివ నాగు ది కష్టపడే వ్యక్తిత్వం, 24 గ్రాఫ్స్ ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి మంచి సినిమా అవ్వాలి మంచి సక్సెస్ తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు శివనాగు మాట్లాడుతూ .. సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను’ అన్నారు.

నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ.. ‘ఈ కథ సినిమాలో సినిమా లాంటిది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వాలని కలగని యువత చాలామంది ఉన్నారు. డైరెక్టర్ శివ నాగు గారు డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఎంత బడ్జెట్ చెప్పారు అంతే బడ్జెట్లో సినిమా తీయగల దర్శకుడు శివ నాగు గారు. అతి త్వరలో సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమా ని చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement