Inaya Sultana
-
‘మదం’ లాంటి సినిమా చూడాలంటే గుండె ధైర్యం కావాలి
‘‘మదం’ సినిమాకు కథే హీరో. ఇందులో భావోద్వేగాలు బాగుంటాయి. మా రమేష్‌గారి కథ, వంశీగారి మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని హర్ష గంగవరపు తెలిపారు. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయ సుల్తాన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మదం’(Madham Movie). ఏకైవ హోమ్స్ బ్యానర్‌పై సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన బాబు), రమేష్ బాబు కోయ నిర్మించిన ఈ సినిమా మార్చి 14న రిలీజ్ అవుతోంది. ‘తండేల్’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ‘మదం’ మూవీ టీజర్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో వంశీ కృష్ణ మల్లా మాట్లాడుతూ– ‘‘మదం’ వంటి రా, రస్టిక్ సినిమా తెలుగులో రావడం అరుదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి’’ అన్నారు. రైటర్ రమేష్ బాబు కోయ మాట్లాడుతూ.. ‘నా కథను ఇంత అద్భుతంగా తీసిన వంశీకృష్ణకు థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీజర్‌ను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు ధన్యవాదాలు’ అని అన్నారు.ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. ‘నాకు నెగెటివ్ పాత్రలు చేయడమంటే ఇష్టం. మదం చిత్రంలో నేను చాలా ఇంపార్టెంట్ కారెక్టర్‌ను చేశాను. మా డైరెక్టర్ వంశీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. నా క్లిష్ట పరిస్థితుల్లో వంశీ గారు సపోర్ట్‌గా నిలిచారు. నేను బాగా నటించడానికి ఆయనే కారణం. లత నాకు మంచి స్నేహితురాలు. హర్ష చాలా రియలిస్టిక్‌గా నటించాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. మార్చి 14న సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. -
పులిబిడ్డతో ఇనయ సుల్తానా ఆటలు (ఫోటోలు)
-
బీచ్‌లో ప్రియుడు గౌతమ్‌తో రచ్చచేస్తున్న బిగ్ బాస్ 'ఇనయా సుల్తానా' (ఫోటోలు)
-
Inaya Sultana : సొగసులు ఒలకబోస్తున్న ఇనయా సుల్తానా..(ఫొటోలు)
-
ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా
బిగ్‌బాస్ షోతో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి కాగా త్వరలో 8వ సీజన్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే పలువురు పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ప్రియుడిని కూడా పరిచయం చేసేసింది. ఇంతకీ ఎవరతడు?రామ్ గోపాల్ వర్మతో ఓ వీడియోలో కనిపించిన ఇనయా అప్పట్లో వైరల్ అయింది. అలా బిగ్ బాస్ 6వ సీజన్లో అడుగు పెట్టింది. ఉన్నంతలో పర్వాలేదనిపించే ఫెర్ఫార్మెన్స్ చేసింది. షో అయిపోయిన తర్వాత ఈమెకు పెద్దగా సినిమా ఛాన్సులు రాలేదు. దీంతో హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఎంటర్టైన్ చేస్తూ బిజీగా ఉంది.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?)ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఇనయా.. ఓ వ్యక్తితో కలిసి క్లోజ్‌గా కనిపించింది. తాజాగా అతడితోనే బాత్రూంలో టవల్ కట్టుకుని మరీ సెల్ఫీలకు పోజులిచ్చింది. దీని కింద బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న యాంకర్ శివ కామెంట్ చేయగా.. ఇనయా తన ప్రేమ నిజమేనని క్లారిటీ ఇచ్చేసింది.ఇనయా బాయ్ ఫ్రెండ్ విషయానికొస్తే ఇతడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి. యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని ఇన్ స్టాలోని బయో బట్టి తెలుస్తోంది. గతంలో జిమ్‌లో వీళ్ల ప్రేమ వ్యవహారం మొదలై, రిలేషన్షిప్ వరకు వచ్చిందని తెలుస్తోంది. రొమాంటిక్ పోజులు చూస్తుంటే త్వరలో పెళ్లి చేసేసుకుంటారేమో అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ సినిమా.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
గాల్లో ఎగిరి ఫీట్లు చేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఏం ఫిట్నెస్ గురు!(ఫోటోలు)
-
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ..'సినిమా అంటే నాకు ప్రాణం. ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్లు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు ఎంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ..' మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్లను యాక్టర్లుగా మార్చిన సినిమానే నటరత్నాలు. డైరెక్టర్ శివ నాగు ఈ కథ చెప్పడం జరిగింది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అవ్వాలని కలలు గనే యువత చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది' అని అన్నారు. ఈ చిత్రంలో అర్జున్ తేజ్, అర్చన, సుమన్ శెట్టి, సూర్యకిరణ్, ఏ. ఎస్ రవికుమార్ చౌదరి, టైగర్ శేషాద్రి కీలక పాత్రలు పోషించారు. -
క్రైమ్ కామెడీ
ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, ‘రంగస్థలం’ మహేశ్, ‘తాగుబోతు’ రమేశ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘నటరత్నాలు’. శివ నాగు దర్శకత్వంలో చంటి యలమాటి, డా. దివ్య నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చి, సినిమా తీయాలనుకునేవాళ్లు ఎలా సఫలమవుతున్నారు? ఎలా విఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘2002లో ఓ సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చి, లాస్ అయ్యాను. ‘నటరత్నాలు’ కథ సినిమాలో సినిమాలాంటిది. ప్లాన్ చేసిన బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేశాం’’ అన్నారు చంటి యలమాటి. -
'నటరత్నలు’.. ‘జాతి రత్నాలు’ అంత హిట్ అవ్వాలి
ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, దర్శకుడు కె ఎస్ రవికుమార్ చౌదరి, దర్శకుడు సముద్ర, డీ. ఎస్. రావు మరియు రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ప్రతి ఇండస్ట్రీలో కష్టసుఖాలు ఉంటాయి, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మన కష్టాలు ఎక్కువ కనబడతాయి అవన్నీ అధిగమించి నిలబడ్డమే కళ, ఇక్కడ ఉన్న వాళ్ళే దానికి నిదర్శనం. 'నటరత్నలు' జాతి రత్నాలు లా ఉంది పేరు అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ.. సినిమా అనేది ఒక మెడిసిన్ లాంటిది అది ఎంత తీసుకుంటే అంత మంచిది. నటరత్నాలు టైటిల్ చాలా బాగుంది. నటరత్న అంటే నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశీస్సులతో నటరత్నాలు అనే టైటిల్ చాలా బాగా పెట్టారు.డైరెక్టర్ శివ నాగు ది కష్టపడే వ్యక్తిత్వం, 24 గ్రాఫ్స్ ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి మంచి సినిమా అవ్వాలి మంచి సక్సెస్ తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ .. సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను’ అన్నారు. నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ.. ‘ఈ కథ సినిమాలో సినిమా లాంటిది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వాలని కలగని యువత చాలామంది ఉన్నారు. డైరెక్టర్ శివ నాగు గారు డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఎంత బడ్జెట్ చెప్పారు అంతే బడ్జెట్లో సినిమా తీయగల దర్శకుడు శివ నాగు గారు. అతి త్వరలో సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమా ని చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. -
ఇనయ కోసం వేణుస్వామి ప్రత్యేక పూజలు.. ఇదెప్పటినుంచో?
ఎంత కష్టపడినా కొందరికి అంత ఈజీగా విజయాలు వరించవు. కష్టానికి తోడు ఆవగింజంత అదృష్టం కూడా ఉండి తీరాలి. అది ఉన్నప్పుడే సక్సెస్ సాధ్యమవుతుంది. అయితే వచ్చిన సక్సెస్‌ను, క్రేజ్‌ను కాపాడుకోవడం కూడా ఇప్పటి పరిస్థితుల్లో చాలా కష్టంగా మారింది. కొందరు అలా మెరిసి ఇలా మాయమవుతున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా కూడా ఇదే కోవలోకి వస్తుంది. సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి ఫిలింనగర్‌కు పారిపోయి వచ్చేసింది. బిగ్‌బాస్ తర్వాత మారని రాత సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్‌బాస్ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఈ రియాలిటీ షో తర్వాత ఎన్నో ఆఫర్లు వస్తాయనుకుంది. అనుకున్నదొక్కటైతే అయినది మరొక్కటి.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎలాగైతే అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిందో ఇప్పుడు కూడా అలాగే ఛాన్సులు ఇవ్వమని అడుగుతోంది. కానీ ఆమె మొర ఆలకించేవారే లేదు. ఇలాగైతే పని కాదనుకుందో ఏమో కానీ పూజారి వేణుస్వామిని కలిసి ప్రత్యేక పూజలు చేయించుకుంది. నువ్వు గుడిలో పూజలు చేస్తున్నావా? ఈ క్రమంలో మెడలో పూల మాల వేసుకుని భక్తితో మునిగిపోయిన ఆమెపై వేణుస్వామి కలశంతో నీళ్లు చల్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇనయ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన జనాలు 'ఏంటి? పూజ చేయగానే ఫేమస్ అయిపోతాననుకుంటున్నావా?', 'వెంటనే హీరోయిన్గా పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇస్తారనుకుంటున్నావా?', 'ఇలాంటివన్నీ ఎలా నమ్ముతారసలు?' అని సెటైర్లు వేస్తున్నారు. ఒకరైతే 'నువ్వు ముస్లిం కదా.. పూజలు చేస్తున్నావేంటి?' అని అడగ్గా.. 'నేను భారతదేశంలో ఉన్నాను. ఇక్కడ నాకు నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ ఉంది. మధ్యలో నీకేంటి సమస్య?' అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
Inaya Sultana: బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా జోరు చూసారా.. నెటిజన్లకి ఐ ఫీస్ట్ ఇస్తున్న (ఫోటోలు )
-
'బిగ్‌బాస్' బ్యూటీ హాట్ అవతార్.. అనసూయ ఫన్నీ వీడియో
ఉల్లిపొర లాంటి షర్ట్‌లో అందాలు చూపిస్తున్న శ్రద్ధా కపూర్ క్లాస్ విత్ మోడ్రన్ ఔట్ఫిట్లో క్రేజీగా కనిపిస్తున్న ఫరియా 2023కి వీడ్కోలు చెబుతూ నియా శర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్ బీచ్ మధ్యలో పడవలో చిల్ అవుతున్న ఆండ్రియా 2023 జ్ఞాపకాల్ని వీడియోగా షేర్ చేసిన మృణాల్ ఠాకుర్ హాట్ పోజుల్లో ఆర్జీవీ బ్యూటీ ఇనయా సుల్తానా.. చూస్తే అంతే డిఫరెంట్ గెటప్‌లో షాకిచ్చిన నటి తేజస్వి మదివాడ 2023పై ఫన్నీ వీడియో చేసి పోస్ట్ చేసిన అనసూయ క్లాసికల్ డ్యాన్సర్ లుక్‌లో మెగా డాటర్ నిహారిక View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
Inaya Sultana: బంజారాహిల్స్ :‘ది డెక్కన్ ఫ్లీ ఎక్సిబిషన్’ ను ప్రారంభించిన బిగ్ బాస్ ఫేమ్ ఇనాయ సుల్తానా (ఫొటోలు)
-
'కృతిశెట్టి, శ్రీలీల మాదిరి నేనూ చేసుంటే ఛాన్సులు వచ్చేవి'
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వర్మతో ఒక పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించి భారీగా వైరల్ అయింది. ఆ ఒక్క వీడియో వల్ల ఆమెకు బిగ్ బాస్ సీజన్ 6లో ఛాన్స్ వచ్చింది. అక్కడ తన టాలెంట్‌తో ఎలాంటి నెగటివిటీ లేకుండానే ఆటలో కొనసాగింది. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక అవకాశాలు వరుస కడతాయని ఆశించినా ఫలితం దక్కలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇనయా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో కొంత మంది అమ్మాయిలు టీనేజ్లోనే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. 16, 17 ఏళ్ల వయసులోనే వారు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కృతిశెట్టి, శ్రీలీల వంటి వారు కూడా ఆ వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ నేను 22 ఏళ్లకు సినీ పరిశ్రమలోకి వచ్చాను. వాళ్లతో కంపేర్ చేస్తే నేను 7 ఏళ్లు వృధా చేసుకున్నాను. వాళ్ల మాదిరి నేను కూడా ముందే ఇండస్ట్రీలోకి వచ్చుంటే నా లైఫ్ మరోలా ఉండేదని అనుకుంటున్నా.. కానీ ప్రస్తుతం వాటి గురించి పట్టించుకోను.' అని ఇనయా తెలిపింది. ఈ ఫోటోలు శాంపిల్స్ మాత్రమే.. అన్నీ పోస్ట్ చేస్తే అంటూ.. 'ప్రస్తుతం మనం 60 ఏళ్లకు మించి బతకడం కష్టం. ఎప్పుడు ఉంటామో.. పోతామో..? ఎవరికీ తెలియదు. ప్రస్తుతం నా వయసు 25. దేవుడు దయ వల్ల మహా అయితే మరో 25 ఏళ్లు బతుకుతానేమో. ఈ జీవితంలో నేను ఎంజాయ్ చేసేది మాగ్జిమమ్ 10 - 15 ఏళ్లు మాత్రమే! ఆ తర్వాత ఎంజాయ్ చేద్దామని ఉన్నా మనకు బాడీ కూడా సహకరించదు. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న టైమ్‌లోనే ఆనందంగా గడుపుతున్నాను. షోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసే ఫోటోలు శాంపిల్స్ మాత్రమే... ఇంకా నా దగ్గర మస్త్ షేడ్స్ ఉన్నాయి. అవన్నీ పోస్ట్ చేస్తే ఏమైపోతారో..?' అంటూ చివరగా హాట్ కామెంట్ చేసింది. ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసులు తిరిగాను బిగ్‌బాస్ నుంచి వచ్చాక మంచి అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ ఎలాంటి ఛాన్స్‌లు దొరకలేదని ఇనయా తెలిపింది. సినిమా ఛాన్స్‌ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్క ఆఫర్ కూడా రాలేదు. కానీ అలాంటి సమయంలో కూడా తాను ఎలాంటి డిప్రెషన్ లోకి వెళ్లలేదని ఇలా తెలిపింది. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. సినిమాల్లో స్థిరపడాలనే కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అడుక్కున్నట్లుగానే అవకాశాల కోసం అడుక్కున్నప్పటికి ఫలితం లేకుండా పోయిందని ఇనయా సుల్తానా తెలిపింది. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
Inaya Sultana Pics: ఆర్జీవీ చేతిలో పడి ఓవర్‌నైట్ సెలిబ్రిటీగా మారిన భామ (ఫోటోలు)
-
నటరత్నాలు సినిమాలో రెండో పాట విన్నారా?
బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నటరత్నాలు. నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ‘నట నట నట నటరత్నాలు.. ఛాన్స్ ఇస్తే పండిస్తా నవరసాలు’’ అంటూ సాగే సెకండ్ లిరికల్ సాంగ్‌ను డా. సుప్రీం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర పాల్గొన్నారు. శంకర్ మహాదేవ్ స్వరకల్పనలో వినాయక్ ఈ పాటను ఆలపించారు. సీతారామ చౌదరి సాహిత్యం అందించారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ ‘‘కొద్దిరోజుల ముందు తాగుబోతు రమేశ్‌పై తెరకెక్కించిన పాటను విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తాన, సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేష్, అర్జున్ తేజ్‌లపై తెరకెక్కించాం. ఈ పాటకు కూడా స్పందన బాగుంది. సినిమా అవుట్‌పుట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం. ఆగస్ట్‌లో మంచి డేట్ చూసి సినిమా విడుదల చేస్తాం. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు. వి.సముద్ర మాట్లాడుతూ ‘‘ఈ టైటిల్ వింటుంటే సూపర్‌హిట్టయిన జాతిరత్నాలు సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా ప్రారంభం నుంచి నాకు తెలుసు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. చక్కని ఆర్టిస్ట్‌లు నటించారు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు. డా.సుప్రీమ్ బాబు మాట్లాడుతూ ‘‘సినిమా, పాటలు చూశా. చాలా బాగా వచ్చింది. నాన్న తన చిత్రాలతో ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటారు. ఈ సినిమా కూడా ఆ తరహాలోనే చేశారు’ అన్నారు. చదవండి: ఆ హీరోయిన్ వల్లే విడాకులు... తనను క్షమించేది లేదు: నటి -
హీటెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఇనయా సుల్తానా లేటెస్ట్ (ఫొటోలు)
-
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఇనయా సుల్తానా
బిగ్‌బాస్ సీజన్-6తో క్రేజ్ సంపాదించుకున్న ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆర్జీవీతో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదే గుర్తింపుతో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఇనయా లేడీ లైగర్‌గా పేరు సంపాదించుకుంది. మొదట ఆర్జీవీ భామ అని నెగిటివ్‌గా వార్తలొచ్చినా తన ఆటతీరు, మాటతీరుతో మెప్పించింది. అంతకుముందు అడపాదడపా చిత్రాల్లో మెరిసిన ఇనయా ఇప్పుడు హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. శివనాగు దర్శకత్వం వహిస్తున్న ‘నటరత్నాలు’ చిత్రంలో ఇనయా హీరోయిన్గా నటించనుంది. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో చందన ప్రొడక్షన్స్ పతాకంపై డా. దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు. -
పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ఇనయా సుల్తానా.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు (ఫోటోలు)
-
టిల్లుతో అనుపమ ఆటలు, మనోభావాలు దెబ్బతిన్నాయన్న మంచు లక్ష్మి
► మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ స్టెప్పులేసిన మంచు లక్ష్మి ► బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన ఇనయ ► నేపాల్ పర్యటనలో మలైకా అరోరా ► డీజే టిల్లు జుట్టుతో ఆడుకున్న అనుపమ View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Inaya Sultan (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Khanna Jewellers (@khannajewellerskj) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) -
మోకాళ్లపై కూర్చొని సోహైల్‌కు ప్రపోజ్ చేసిన ఇనయా
బిగ్‌బాస్ షోలో లేడీ టైగర్‌గా పాపులర్ అయిన కంటెస్టెంట్ ఇనాయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయిన ఇనయా సివంగిలా బయటకు వచ్చింది. బిగ్‌బాస్‌తో బోలెడం పాపులారిటీని దక్కించుకుంది. ఇక తాజాగా మరోసారి ఇనాయా పేరు నెట్టింట చక్కర్లు కొడుతుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోహైల్ తన క్రష్ అని ఎన్నోసార్లు చెప్పిన ఇనాయా ఇప్పుడు ఏకంగా అతడికి ప్రపోజ్ చేసేసింది. రెడ్ డ్రెస్‌లో గులాబీ చేతిలో పట్టుకొని మోకాళ్లపై కూర్చొని మరీ సోహైల్‌కు తన ప్రేమను వ్యక్తపరిచింది. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా అంటూ రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసింది. బిగ్‌బాస్ హౌస్‌లోనే చెబుదాం అనుకున్నా నువ్వు అంటే నాకు పిచ్చి. ఇప్పుడు చెబుతున్నా ఐ లవ్యూ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు మరి హౌస్‌లో ఆర్జే సూర్య అంటే ఇష్టమన్నావ్ కదా మరి ఇప్పుడేంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Inaya Sultan (@inayasulthanaofficial) -
RGV పేరు ఎత్తగానే ఇనయ రియాక్షన్ చూడండి
-
బిగ్‌బాస్ లేడీ టైగర్ ఇనయాకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్ అవుతున్న ఫోటో
బిగ్‌బాస్ సీజన్-6కి లేడీ టైగర్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఇనయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయిన ఇనయా నెగిటివ్ ఇమేజ్‌తోనే వెళ్లింది. ప్రేక్షకులు సహా ఇంటిసభ్యులు కూడా ఇనయా గురించి తక్కువ అంచనా వేశారు. మహాఅయితే రెండు, మూడు వారాల్లో ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. హౌస్ మొత్తం టార్గెట్ చేసినా, ప్రతిసారి ఎలిమినేషన్స్‌కి పంపినా అంతకు రెట్టింపు ధైర్యంతో ఆటతీరు ప్రదర్శించింది. ఇదేతీరు ఆడియెన్స్‌ను కూడా బాగా అట్రాక్ట్ చేసింది. ఫినాలేలో టాప్-2 కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్న ఇనయా అనూహ్యంగా గతవారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కావాలనే ఇనయాను బయటకు పంపించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇనయాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పెళ్లికూతురిగా ముస్తాబైన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇనయా తల్లి కూడా పక్కనే ఉంది. దీంతో ఇనయాకు ముందే పెళ్లయిందా? అనే సందేహం వ్యక్తమవుతుంది. మరోవైపు కావాలనే ఇనయా క్రేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ఇలా చేస్తున్నారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే స్వయంగా ఇనయానే ఈ ఫోటోపై స్పందించాల్సి ఉంటుంది. -
బిగ్‌బాస్ 6: బయటకు రాగానే సూర్యను కలిసిన ఇనయా, ఫొటో వైరల్
గతవారం బిగ్‌బాస్ షో నుంచి ఇనయ సుల్తాన ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఫినాలేలో ఉండాల్సిన ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేయడాన్ని ఇప్పటికీ ఆమె ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందనుకున్న ఈ అమ్మడు అనూహ్యంగా 14 వారాలు హౌస్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఆరోహి ఎలిమినేట్ అయిన అనంతరం ఆమె సూర్యకు క్లోజ్ అయ్యింది. వీరిద్దరి సాన్నిహిత్యం చూసింది అంతా సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనుకున్నారు. చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు సూర్య తనకు మంచి స్నేహితుడు అంటూనే అతడిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది ఇనయ. అలాగే సూర్య కూడా. ఇక ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని, ఇక హౌజ్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటుండగా అనూహ్యంగా సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక సూర్య హౌజ్ వీడటంతో ఇనయ పడిన బాధ ఇంతఅంత కాదు. ఇక హౌజ్‌లో అతడి కప్పును వాడటం, సూర్య సూర్య అంటూ కలవరించడం చేసింది. ఆ తర్వాత హోస్ట్ నాగార్జున కాస్తా వారించడం ఇక ఆటపై దృష్టి పెట్టింది. అలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకున్న ఆమె 14వ వారం బిగ్‌బాస్ హౌజ్‌ను వీడింది. ఇక బయటక వచ్చిరాగానే ఇనయ, సూర్యను కలుసుకుంది. ఇనయతో కలిసి క్లోజ్‌గా దిగిన ఫొటోను సూర్య తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు. ఇందులో సూర్య, ఇనయను హగ్ చేసుకుని కనిపించాడు. దీంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ‘హౌజ్‌లో బాగా కనెక్ట్ అయిన వీరిద్దరు బయట కూడా అలాగే ఉంటారో లేదో చూడాలి’, ‘ఈ రిలేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూస్తాం’ కొందరూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ‘లేడీ టైగర్ ఇనయా’, ‘ఇనయది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్, రియల్ బిగ్‌బాస్ విన్నర్’ అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్ View this post on Instagram A post shared by RJ Surya (Konda Babu) (@rjsurya_official) -
యాంకర్‌కు ఇచ్చిపడేసిన ఇనయ, దెబ్బకు సైలెంటైన శివ
బిగ్‌బాస్ షోలో ఇనయ సుల్తాన ఎలిమినేట్ అయింది. ఫినాలేలో ఉండాల్సిన ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇకపోతే షో నుంచి ఎగ్జిట్ అయిన ఇనయ బిగ్‌బాస్ కెఫెలో యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అతడు అడిగే ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానాలిచ్చింది. ప్రతిసారి టైటిల్ విన్నర్ నేనే అని ఎందుకు అరిచేదాని? అని శివ ప్రశ్నించగా నా మీద నాకున్న నమ్మకంతోనే అలా అన్నానని చెప్పింది. సూర్యతో లవ్ ట్రాక్ వల్ల నీ గ్రాఫ్ తగ్గింది అని శివ చెప్పగా అతడిని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అని తిరిగి ప్రశ్నించింది. ఊహించని ప్రశ్నతో అవాక్కయ్యాడు శివ. సూర్య గురించి రేవంత్ దగ్గర ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేశావని అడగ్గా.. అది బ్యాక్ బిచ్చింగ్ కాదు, అప్పుడు కోపంలో అలా చెప్పానని ఆన్సరిచ్చింది. అంటే నీకు నచ్చినప్పుడు బాగా మాట్లాడతావు, నచ్చకపోతే ఎన్ని స్టేట్మెంట్లైనా వదులుతావు, అంతేనా? అని శివ సెటైర్ వేయగా.. ఎన్ని స్టేట్మెంట్లు కాదు, అప్పుడనిపించింది మాత్రమే చెప్తాను అంటూ కౌంటరిచ్చింది. రేవంత్ గురించి చెప్పమని శివ అడగడంతో అతడు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాడంది ఇనయ. అచ్చం నీలాగే కదా అని యాంకర్ సెటైర్ వేయగా తన గురించి అడిగినప్పుడు మధ్యలో నన్నెందుకు తీసుకొస్తున్నావు అని మండిపడింది. నేనూ, తను ఒకేలా ప్రవర్తిస్తామా? అని ప్రశ్నించగా నాకు తెలీదని బదులిచ్చాడు శివ. మరి తెలియనప్పుడు నా గురించి ఎందుకు చెప్పావని ఎదురు తిరిగింది. ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలు 'ఇనయ రాక్స్, యాంకర్ శివ షాక్స్', 'శివకు ఇనయ మాత్రమే కౌంటర్ ఇవ్వగలదు', 'లాస్ట్ కౌంటర్ అదిరిపోయింది', 'ప్రతి ఒక్కరినీ చులకన చేసి మాట్లాడుతున్న శివకు ఇనయ సరిగ్గా జవాబిచ్చింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: జర్నీ చూసి భావోద్వేగానికి లోనైన రేవంత్, శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్, అతడే టైటిల్ గెలవాలన్న ఇనయ -
బిగ్‌బాస్: ఇనయ సుల్తాన పారితోషికం ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో లేడీ టైగర్‌గా పేరు తెచ్చుకుంది ఇనయ సుల్తాన. టాస్కుల్లో టఫ్ ఫైట్ ఇచ్చే ఇనయ నామినేషన్స్‌లో కూడా అందరితో వాదించేది. మొదట్లో తన ప్రవర్తనతో చిరాకు పుట్టించినప్పటికీ రానురాను మాటతీరు, ఆటతీరు మెరుగుపరుచుకుని తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తనలో ఉన్న ఫైర్‌ను చూసి రేవంత్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉందే అనుకున్నారంతా! కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫినాలేకు ఒక వారం ముందే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ను అలా ఎలా పంపించేస్తారని అభిమానులు బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ద్వారా పాపులారిటీ, స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఇనయ ఈ షో ద్వారా ఎంత వెనకేసిందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఇనయ సుల్తానా వారానికి లక్ష రూపాయల పైనే రెమ్యునరేషన్ అందుకుందట. ఈ లెక్కన పద్నాలుగు వారాలకు గానూ సుమారు రూ.15 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: మిడ్ వీక్ ఎలిమినేషన్, శ్రీహాన్‌కు ఇనయ ఫుల్ సపోర్ట్ -
మిడ్ వీక్ ఎలిమినేషన్! శ్రీహాన్ టైటిల్ కొట్టి రావాలన్న ఇనయ
Bigg Boss 6 Telugu, Episode 99: ఊహించిందే జరిగింది.. ఈ వారం ఇనయ ఎలిమినేట్ అయింది. ఫినాలేకు ఒక అడుగు దూరంలోనే తన ప్రయాణం ముగిసింది. తన జర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఇనయ. చివరి నిమిషంలో కెప్టెన్ అవడమే కాకుండా బెస్ట్ కెప్టెన్‌గా అందరిచేత శెభాష్ అనిపించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. మరి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్‌లో ఏమేం జరిగాయో చదివేయండి.. బిగ్‌బాస్ హౌస్ గురించి కంటెస్టెంట్లకు ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడానికి 'నీకెంత తెలుసు' అనే టాస్క్ ఇచ్చాడు నాగ్. హౌస్‌లో నిత్యం చూసే పరిసరాల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇందులో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రేవంత్ గిఫ్ట్ హ్యాంపర్ సొంతం చేసుకున్నాడు. తర్వాత పాటలు, డ్యాన్సులతో ఎంటర్టైన్ చేశారు హౌస్మేట్స్. నాగ్ అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో ఆదిరెడ్డి, ఇనయ మాత్రమే మిగిలారు. కంటెస్టెంట్లు ఊపిరి బిగపట్టుకుని చూస్తున్న సమయంలో ఇనయ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. ఎలాగైనా కప్పు కొట్టాలన్న తన కల నెరవేరకుండానే హౌస్ నుంచి బయటకు వచ్చేయడంతో భావోద్వేగానికి లోనైంది. ఒక్క అడుగు దూరంలో ఆగిపోయానని ఫీలైంది. స్టేజీమీదకు వచ్చిన ఇనయతో ఓ గేమ్ ఆడించాడు నాగ్. టాప్ 6 కంటెస్టెంట్లలో ఉన్న మంచి, చెడు లక్షణాలను చెప్పమన్నాడు. ఇనయ మాట్లాడుతూ.. శ్రీహాన్‌తో స్టార్ట్ చేస్తాను. అతడు మంచివాడని తర్వాత అర్థమైంది. అతడే టైటిల్ కొట్టి రావాలి. అవతలి వాళ్లను అర్థం చేసుకుంటే బాగుండు, బ్యాక్ బిచింగ్ తగ్గించుకోవాలి. ఆదిరెడ్డి.. నిజాయితీపరుడు. శ్రీసత్య తనకు నచ్చినవాళ్ల కోసం ఏదైనా చేస్తుంది. నచ్చనివాళ్లను విపరీతంగా రెచ్చగొడుతుంది. కీర్తి ఎలాంటి బాధనుంచైనా బయటపడగలదు, కానీ దానికి సమయం పడుతుంది. రోహిత్ డీసెంట్ గుడ్ బాయ్. కానీ తనలోని సామర్థ్యాన్ని పూర్తిగా బయటపెట్టలేదు. రేవంత్.. అందరితో బాగుంటాడు, అందరికీ ఫుడ్ షేర్ చేస్తాడు. కానీ అందరికీ మంచి చెప్పాలనుకుంటాడు, అది అవతలవాళ్లకు నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇనయను పంపించేసిన నాగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. బుధవారం ఒకరిని హౌస్ నుంచి పంపించేస్తామని తెలిపాడు. కాబట్టి హౌస్‌లో ఎవరిని హౌస్‌లో ఉంచాలనుకుంటున్నారో? ఎవరిని ఫినాలేకు పంపించాలనుకుంటున్నారో.. వారికి ఆలస్యం చేయకుండా ఓట్లు గుద్దేయండి.. చదవండి: లేడీ టైగర్‌ను పంపించేస్తారా.. చెత్త సీజన్ అంటూ ట్రోలింగ్ సినిమాలు వర్కవుట్ కాలేదు, చనిపోదామనుకున్నా -
చివరి రౌండ్లో ఆదిరెడ్డి, ఇనయ... ఇంకా సస్పెన్స్ ఏముంది?
బిగ్‌బాస్ షోలో ఈ వారం ఇనయ ఎలిమినేట్ కానుంది అన్న విషయాన్ని ఆమె అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. లేడీ సింగాన్ని బయటకు పంపించేయడమేంటని బిగ్‌బాస్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ ప్రోమో రిలీజైంది. ఇందులో నాగ్ హౌస్‌మేట్స్‌తో ఓ ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరు డ్యాన్స్ స్టెప్ వేస్తే అది ఏ పాటో మిగతావాళ్లు గెస్ చేయాల్సి ఉంటుంది. అలా పాటలు, డ్యాన్సులతో హౌస్మేట్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. ఆదిరెడ్డి అయితే నేను డ్యాన్సర్ అంటూ అందరికంటే ఓ స్టెప్పు ఎక్కువే వేశాడు. తర్వాత అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి ఆదిరెడ్డి, ఇనయ మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది బోర్డుపై చూపిస్తానడంతో ప్రోమో ముగిసింది. ఎలాగో ఆది సేవ్ అవగా ఇనయ ఎలిమినేట్ అయిందని అందరికీ తెలిసిపోవడంతో ఈ ఎలిమినేషన్ ఎలాంటి సస్పెన్స్ లేకుండా జరిగిపోయింది. చదవండి: అది రేవంత్‌ను చూసే నేర్చుకున్నా: నాగార్జున -
ఎలిమినేషన్‌ను ముందే ఊహించిన ఇనయ? నాగార్జున హింట్
Bigg Boss 6 Telugu, Episode 98: ఫినాలే దగ్గరపడుతుండటంతో నాగార్జున ఫన్నీ టాస్కులు మానేసి సీరియస్ టాస్కులు ఆడించాడు. మొదటగా బిగ్‌బాస్ హౌస్‌లో ఓట్ల క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శ్రీహాన్ మాట్లాడుతూ.. రేవంత్ తప్పులను అంగీకరించడు. అతడికి కోపం ఎక్కువ. కానీ నేను తప్పులను ఒప్పుకోవడమే కాకుండా వాటిని సరిదిద్దుకుంటాను. తనకంటే బాగా ఎంటర్టైన్ చేస్తాను. అందుకోసం నాకు ఓటేసి గెలిపించాలి అని చెప్పాడు. ఇక రేవంత్ మాట్లాడుతూ.. నేను ఏ టాస్కునూ వదల్లేదు. విన్నర్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు నాకున్నాయి. శ్రీహానే కాదు, ఇక్కడ ఎవరినీ నాకు కాంపిటీటర్‌గా అనుకోలేదు అని చెప్పాడు. దీంతో శ్రీహాన్ మధ్యలో కలగజేసుకుంటూ ఒకటి చెప్పాలి సర్ అని అడిగాడు. దీనికి నాగ్.. రేవంత్ ఫ్లిప్పర్ అని చెప్పాలనుకున్నావు, అంతేనా? అన్నాడు. దీంతో అందుకున్న రేవంత్.. శ్రీహాన్ వెనకాల మాట్లాడతాడని తెలుసు, ఇంతకుముందు కూడా విన్నాను, కానీ ఎప్పుడూ తనను అడగలేదని చెప్పాడు. అతడి మాట విని షాకైన శ్రీహాన్.. నీకు చెప్పిన విషయాలే మాట్లాడానే తప్ప వెనకాల కొత్తగా ఏమీ మాట్లాడలేదు అని బదులిచ్చాడు. తర్వాత మిగతా ఐదుగురు కూడా తమలో ఉన్న పాజిటివ్ అంశాలను చెప్తూ దానికోసం ఓట్లేయాలన్నారు. అనంతరం హౌస్మేట్స్ దెయ్యం టాస్కులో ఎంత భయపడ్డారో వారికే వీడియో వేసి చూపించాడు నాగ్. చీకటి గదిలో తాము చేసిన విన్యాసాలు చూసి కంటెస్టెంట్లు పడీపడీ నవ్వుకున్నారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో మరో గేమ్ ఆడించాడు నాగ్. బెస్ట్ అనుకున్న ముగ్గురికి స్టార్ రేటింగ్స్ ఇచ్చి, వేస్ట్ అనుకున్న ముగ్గురికి క్రాస్ సింబల్ ఫేస్‌పైన ముద్రించాలన్నాడు. అలా ఈ గేమ్‌లో ఎవరెవరు ఎవరికి స్టార్స్, ఎవరికి క్రాస్ గుర్తులు ఇచ్చుకుంటూ వెళ్లారంటే.. కంటెస్టెంట్ 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్ సింగిల్ క్రాస్ డబల్ క్రాస్ (బ్యాడ్) ట్రిపుల్ క్రాస్ (వెరీ బ్యాడ్) ఆదిరెడ్డి. శ్రీహాన్ రేవంత్ రోహిత్ శ్రీసత్య ఇనయ కీర్తి కీర్తి రోహిత్ ఇనయ రేవంత్ శ్రీహాన్ కీర్తి ఆదిరెడ్డి శ్రీసత్య శ్రీహాన్ రేవంత్ ఆదిరెడ్డి రోహిత్ ఇనయ కీర్తి ఇనయ కీర్తి శ్రీసత్య రేవంత్ శ్రీహాన్ రోహిత్ ఆదిరెడ్డి రేవంత్ శ్రీసత్య శ్రీహాన్ కీర్తి ఆదిరెడ్డి రోహిత్ ఇనయ శ్రీహాన్ రేవంత్ ఆదిరెడ్డి శ్రీసత్య ఇనయ కీర్తి రోహిత్ రోహిత్ ఆదిరెడ్డి రేవంత్ కీర్తి శ్రీహాన్ శ్రీసత్య ఇనయ తర్వాత కీర్తి, రేవంత్ సేవ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో టికెట్ టు ఫినాలే సాధించిన శ్రీహాన్‌తో పాటు రేవంత్, కీర్తి ఫైనల్ వీక్‌కు వెళ్లారని ప్రకటించాడు నాగ్. మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో హౌస్మేట్స్ గెస్ చేయాలన్నాడు. ముందుగా శ్రీహాన్.. రోహిత్ వెళ్లిపోతాడని అభిప్రాయపడగా కీర్తి.. ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోతాడేమోనని చెప్పుకొచ్చింది. రేవంత్ వంతు రాగా.. ఎన్నడూ ఎవిక్షన్‌కు భయపడని ఇనయ మొట్టమొదటిసారి నిన్న భయపడింది. దాన్నిబట్టి ఆమె ఎలిమినేట్ కావచ్చేమోననుకున్నాడు. దీంతో ఇనయ అందుకుంటూ.. నిన్ననే కదా నేను టాప్ 5 కంటెస్టెంట్ అన్నావు, అంతలోనే మాట మార్చి ఈ వారం వెళ్లిపోతానని చెప్తున్నావేంటి అంటూ నిలదీసింది. రేవంత్ ఇప్పుడు తన మనసులో ఉన్నది మాట్లాడాడంటూ జరగబోయేది ఇదేనని చెప్పకనే చెప్పాడు నాగ్. ఇకపోతే మొన్నటిదాకా ప్రైజ్‌మనీని బిగ్‌బాస్ పెంచగా ఈసారి నాగార్జున ఇంటిసభ్యులకు మర ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన ముందున్న మూడు సూట్‌కేసుల్లో డబ్బులున్నాయని, ఎక్కువ అమౌంట్ ఉన్న కరెక్ట్ సూట్‌కేస్ సెలక్ట్ చేసుకోమన్నాడు. హౌస్మేట్స్ అత్యధికంగా రూ.3 లక్షలున్న సూట్‌కేసు సెలక్ట్ చేసుకున్నారు. దీంతో ఈ మూడు లక్షలు కలపగా ఫైనల్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలకు చేరింది. ఈ అరకోటి రూపాయలతో పాటు విన్నర్ రూ.25 లక్షల విలువైన 605 గజాల స్థలాన్ని గెలుచుకోనున్న విషయం తెలిసిందే! దీనికి తోడు మారుతి సుజుకి బ్రెజ్జా కారు సైతం సొంతం చేసుకోనున్నట్లు ప్రకటించడంతో హౌస్మేట్స్ ఎగిరి గంతేశారు. చదవండి: లేడీ టైగర్‌ను పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా? టాప్ 3లో ఉంటుందనుకున్న ఇనయ ఎలిమినేట్? -
ఇనయ ఎలిమినేషన్‌ను బయటపెట్టిన రేవంత్
వచ్చే వారమే బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉన్నా సింగిల్ ఎలిమినేషన్‌తో ఒక్కరినే ఎలిమినేట్ చేశారట. మరి ఆ బయటకు వచ్చేసింది ఎవరా? అని ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూశారంటే మీకే అర్థం అయిపోతుంది. ఆమె మరెవరో కాదు ఇనయ సుల్తాన. ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండే ఇనయ ఎలిమినేట్ కావడమేంటని అందరూ షాకవుతున్నారు. అయితే నాగార్జున మాత్రం ఇంటిసభ్యుల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈవారం ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారు? అని ప్రశ్నించాడు. ఇందుకు శ్రీహాన్.. రోహిత్ వెళ్లిపోతాడని అభిప్రాయపడ్డాడు. కీర్తి.. ఆదిరెడ్డి పేరు సూచించింది. రేవంత్‌ను ఇదే ప్రశ్న అడగ్గా.. ఎప్పుడూ నామినేషన్స్‌కు భయపడని ఇనయ నిన్న కొంత భయపడుతున్నట్లు చెప్పిందంటూ ఆమె పేరు చెప్పాడు. దీంతో మధ్యలో అందుకున్న ఇనయ.. నిన్ననే కదా, నేను టాప్ 5లో ఉంటానన్నావు, బయటకు వెళ్లనన్నావు అని నిలదీసింది. దీనిపై నాగ్ మాట్లాడుతూ.. నీకలా చెప్పాడేమో కానీ, తన మనసులో ఉన్న మాట ఇదే అని స్పష్టం చేశాడు. చదవండి: షాకింగ్ ట్విస్ట్.. ఇనయ ఎలిమినేటెడ్ వరస్ట్ సీజన్.. లేడీ సింగాన్ని పంపించేస్తారా? నెట్టింట ట్రోలింగ్ -
లేడీ టైగర్‌ను పంపించేస్తారా? చెత్త సీజన్ అంటూ ట్రోలింగ్
సాధారణంగా ఎలిమినేషన్ సండే జరుగుతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు మాత్రమే శనివారం కూడా ఒకర్ని బయటకు పంపించేస్తుంటారు. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనుకుంటే సింగిల్ ఎలిమినేషన్ చాలనుకున్నట్లున్నాడు బిగ్‌బాస్. ఇకపోతే ఇదివరకే షూటింగ్ ముగిసిందని, టాప్ 3 కంటెస్టెంట్ అయిన ఇనయను ఎలిమినేట్ చేశారంటూ ఓవార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ ఇనయ ఫ్యాన్స్ ఘోరంగా హర్ట్ అయ్యారు. ఒక్క ఇనయ ఫ్యాన్స్ మాత్రమే కాదు బిగ్‌బాస్ వీక్షించే ఎంతోమంది ఫినాలేలో ఉండాల్సిన వ్యక్తిని సడన్‌గా పంపించడమేంటని షాకవుతున్నారు. వేరేవాళ్లను సేవ్ చేయడం కోసం ఇనయను బలి చేశారని ఆగ్రహానికి లోనవుతున్నారు. ఫలితంగా ట్విటర్లో ఇనయ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్("INAYA UNFAIR ELIMINATION") ట్రెండ్ అవుతోంది. 33 వేలకుపైగా ట్వీట్లతో ట్విటర్ హోరెత్తిపోతోంది. 'ప్రేక్షకుల ఓట్లంటే లెక్క లేదా? ఇప్పటికే షో ఫ్లాపైంది, ఇంకా ఇనయను పంపించేసి మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు', 'చెత్త సీజన్‌కు చెత్త విన్నర్‌ను మీరే సెలక్ట్ చేసుకోండి, మగవాళ్లకు గట్టిపోటీనిచ్చిన లేడీ టైగర్ ఇనయ, అలాంటిది ఆమెను కనీసం ఫినాలేలో కూడా అడుగుపెట్టనీయకుండా ప్లాన్ చేసి పంపించేస్తారా?', రియాలిటీ షోలో కూడా పాలిటిక్సా?' అంటూ నెట్టింట నెటిజన్లు బిగ్‌బాస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఆమె లేకపోతే ఫినాలేకు టీఆర్పీయే రాదంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్ని వరస్ట్ సీజన్లు వచ్చినా అన్నింటికంటే పరమ వరస్ట్ ఈ సీజనే అని తిట్టిపోస్తున్నారు. Enni worst seasons vachina, S6 ni beat cheylev!! History lo nilichipothundhi, UNBEATABLE WORST SEASON! 1st nundi kastapadi game adinollantha vellipoyaru, theerigga vacation ki vachinollu migilipoyaru!! INAYA UNFAIR ELIMINATION — Nivvi☃️ (@Nivvi011) December 10, 2022 Fighter #inaya got robbed of her winning chance #BiggBossTelugu6 👎 INAYA UNFAIR ELIMINATION https://t.co/eiZFbmagir — Nish (@bb3telugublr) December 10, 2022 There is no value for audience votes in Telugu Bigboss INAYA UNFAIR ELIMINATION pic.twitter.com/BPERApPEBy — vikyath kumar (@vikyath_kumar) December 10, 2022 చదవండి: ఇనయ ఎలిమినేట్ -
ఏమిటేమిటి? ఇనయ ఎలిమినేట్ అయిందా?
'ఇనయ.. యూ ఆర్ ఎలిమినేటెడ్..' నాగార్జున ఈ మాట అనడాన్ని కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారా? కానీ జరిగేది ఇదేనని తెలుస్తోంది. టాప్ 2లో ఉంటుందనుకున్న ఇనయను అర్ధాంతరంగా ఎలిమినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనక జరిగితే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. బిగ్‌బాస్‌కు వచ్చాక అభిమానులను సంపాదించుకున్నవారిలో ఇనయ ఒకరు. 'మై లైఫ్ మై రూల్స్' అనే ఆమె 'మై గేమ్ మై స్ట్రాటజీస్' అన్నట్లుగా ఆడింది. తన ఆటతీరుకు, ఎవరినైనా ఎదురించే ధైర్యానికి ఎంతోమంది ఫిదా అయ్యారు. తనలో ఉన్న ఫైర్‌ను అలాగే కంటిన్యూ చేస్తే టాప్ 3లో చోటు దక్కించుకోవడం ఖాయం అనుకున్నారంతా. అన్నట్లుగానే నామినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి ఆమెను సేవ్ చేస్తూ వచ్చారు. ఈ వారం కూడా ఆమె నామినేషన్లోకి వచ్చింది. ఎప్పటిలాగే అనధికారిక పోల్స్‌లో మంచి ఓట్ల శాతంతో రెండు, మూడు స్థానాల్లో తచ్చాడుతోంది. శ్రీసత్య, కీర్తి చివరి ప్లేస్ నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ ఈ ఇద్దరిలో ఒకరిని పంపిచేస్తాడనుకుంటే ఎవరూ ఊహించని కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశాడట. అమ్మాయిల్లో ఫిజికల్ టాస్క్‌లలో తోపు పర్ఫామెన్స్ ఇచ్చిన ఇనయను ఎలిమినేట్ చేసినట్లు ఓ వార్త లీకైంది. రేవంత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఇనయను సడన్‌గా ఎలిమినేట్ చేయడమేంటని అప్పుడే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకవేళ బిగ్‌బాస్ కావాలని తప్పుడు సమాచారాన్ని లీక్ చేశాడా? అసలు ఈవారం శ్రీసత్య, కీర్తి, ఇనయలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: లెక్క తేలింది, విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే? -
శ్రీసత్యను నమ్మని శ్రీహాన్, ఇనయ పరువు మొత్తం పాయే!
Bigg Boss 6 Telugu, Episode 96: టాస్కుల్లో, నామినేషన్స్‌లో కయ్యానికి కాలు దువ్వే కంటెస్టెంట్లు దెయ్యం పేరెత్తితే చాలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి, శ్రీహాన్ ఎంత ఘోరంగా వణికిపోయారో నిన్ననే చూశాం. నేడు మిగతా ఇంటిసభ్యుల వంతు వచ్చింది. మరి వారు భయపడ్డారా? భయపడినా సరే గెలిచారా? అనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని శ్రీసత్యకు పిలుపు వచ్చింది. అప్పటిదాకా మిగతావాళ్ల భయాన్ని చూసిన నవ్విన ఆమె తన వంతురాగానే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తలుపు దాటి లోపలకు వెళ్లడానికి తెగ భయపడిపోయింది. కన్ఫెషన్ రూమ్‌లోకి రాకపోతే డబ్బులు కట్ అవుతాయని బిగ్‌బాస్ హెచ్చరించినా ఆమెకు ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఎంతసేపటికీ అలా డోర్ దగ్గరే తచ్చాడుతూ ఉండటంతో లక్ష రూపాయలు కోల్పోయారని చెప్పాడు బిగ్‌బాస్. అనవసరంగా డబ్బులు పోయాయని తెగ ఫీలైన రేవంత్ శ్రీసత్యపై అరిచాడు. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బిగ్ బాంబ్ అనే మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో కీర్తి, శ్రీసత్య, రేవంత్ పోటీపడ్డారు. మిగతా హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో ఇనయ గెలుస్తుందని భావించారు, కానీ అక్కడ శ్రీసత్య విజయం సాధించింది. ఇంటిసభ్యుల అంచనా బోల్తా కొట్టడంతో రూ.64,900 గెలుచుకునే ఛాన్స్ కోల్పోయారని ప్రకటించాడు బిగ్‌బాస్. నేను గెలుస్తానని నా ఫ్రెండ్వైన నువ్వెందుకు నమ్మలేదంటూ శ్రీహాన్‌ను నిలదీసింది శ్రీసత్య. మూడు ఛాలెంజ్‌లు నేనే గెలిచినా కూడా నన్ను నమ్మాలనిపించలేదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలాడు శ్రీహాన్. తర్వాత ఇంటిసభ్యులందరికీ మనీ టవర్ ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రూ.41,500 గెలుచుకున్నారు. అనంతరం వెలిగించు - విజయం సాధించు గేమ్‌లో శ్రీహాన్, శ్రీసత్య పోటీపడ్డారు. హౌస్మేట్స్ ఊహించినట్లుగా శ్రీహాన్ గెలవడంతో రూ.1,23,400 కైవసం చేసుకున్నారు. ఇప్పటిదాకా గెలిచిన ఛాలెంజ్‌ల మొత్తాన్ని కలపగా ప్రైజ్‌మనీ రూ.46,00,000కి చేరింది. దీంతో హౌస్మేట్స్ మరీ ముఖ్యంగా రేవంత్ పండగ చేసుకున్నాడు. తర్వాత దెయ్యం టాస్కులో ఎంతో ధైర్యంగా చీకటి గదిలో అడుగు పెట్టిన ఇనయ అరుపులు, కేకలతో కన్ఫెషన్ రూమ్‌ను దద్దరిల్లేలా చేసింది. అంత భయంలోనూ ఎలాగోలా బిగ్‌బాస్ చెప్పిన షూ తీసుకుని బయటకు రావడం విశేషం. ఈ టాస్క్ గెలవడంతో రూ.12,000 లభించాయి. నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్‌లో అడుగుపెట్టిన రేవంత్ భయపడ్డాడో, భయపడ్డట్లు నటించాడో తెలీదు కానీ దెయ్యం గొంతునే ఇమిటేట్ చేసి అవలీలగా సూర్య కప్పు తీసుకుని వచ్చేశాడు. ఈసారి రూ.10,000 లభించాయి. ఇక దెయ్యం టాస్కులో కీర్తి మాత్రమే మిగిలింది. మరి తనకేమైనా మినహాయింపు ఉందా? లేదంటే రేపటి ఎపిసోడ్లో తనకు కూడా టాస్క్‌లో వెల్కమ్ చెప్తారా? చూడాలి! చదవండి: నాన్న చనిపోయాక ఆఫీస్ బాయ్‌గా మారాను: రాజశేఖర్ నా ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌కు టికెట్లు కావాలి.. హీరో ఆన్సరేంటో తెలుసా? -
ఇనయకు దెయ్యం పట్టింది! భయంతో వణికిపోయిన ఆదిరెడ్డి, శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 94: మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు హౌస్‌మేట్స్‌కు వరుస ఛాలెంజ్‌లు విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్‌లలో ఎవరు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో చెప్పాలన్నాడు. అందులో ఎవరు గెలుస్తారో కూడా ముందే ఊహించాలన్నాడు. కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగిస్తానని మెలిక పెట్టాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నేడు రెండో ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రేవంత్, ఇనయ పోటీపడ్డారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.1,10,000 ప్రైజ్‌మనీకి తిరిగి యాడ్ అవుతాయన్నాడు. అందరూ అనుకున్నట్లుగా పిరమిడ్ పడొద్దు అనే ఛాలెంజ్‌లో రేవంత్ విజయం సాధించడంతో రూ.1,10,000 గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత మూడో ఛాలెంజ్ కోసం ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంచుకోమన్నాడు. దీంతో ఆదిరెడ్డి- కీర్తి, శ్రీహాన్- శ్రీసత్య మనీ ట్రాన్స్ఫర్ గేమ్‌లో పోటీపడ్డారు. ఇనయ, రేవంత్, రోహిత్.. ఆదిరెడ్డి టీమ్ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీహాన్- శ్రీసత్య గెలవడంతో వారు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత రేవంత్ ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ పాట పాడగా ఆదిరెడ్డి అందుకనుగుణంగా స్టెప్పులేశాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో ఛాలెంజ్ ప్రవేశపెట్టాడు. పవర్ పంచ్ టాస్క్‌లో రేవంత్, ఇనయ పాల్గొనగా అందరూ ఊహించినట్లు రేవంత్ గెలవడంతో ప్రైజ్‌మనీకి మరో రూ.2 లక్షలు జమయ్యాయి. దీంతో మొత్తం ప్రైజ్‌మనీ రూ.41,10,100కి చేరింది. రాత్రి శ్రీసత్య ఓ దెయ్యం కథ చెప్పింది. ఓ ఫంక్షన్లో ఓ అబ్బాయి వింతగా ప్రవర్తించాడని చెప్పింది. అందరూ ఆ అబ్బాయిని కొడుతున్నా అతడికి చలనం లేకుండా అలాగే నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడని చెప్పింది. ఇంతలో సడన్‌గా దెయ్యం సౌండ్ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్ బెడ్ మీదకు చేరింది. ఇక శ్రీహాన్ అయితే బాత్రూమ్కి వెళ్లడానికి కూడా భయపడ్డాడు. అది గమనించిన శ్రీసత్య కావాలని దెయ్యంలా నవ్వుతూ అతడిని మరింత భయపెట్టింది. ఇక ఇనయ అయితే ఏకంగా దెయ్యం పట్టినదానిలా ప్రవర్తించి ఆదిరెడ్డిని వణికిపోయేలా చేసింది. దెయ్యం భయంతో అందరూ జడుసుకుంటూ, నవ్వుకుంటూ ఏ అర్ధరాత్రికో పడుకున్నారు. చదవండి: స్టేజీపై భార్యను పరిచయం చేసిన హీరో సత్యదేవ్ నేను టాప్5లో ఉండనని తెలుసు, రేవంత్ ఎలిమినేట్ అవ్వాలి: ఫైమా -
పైసా వసూల్ కోసం పోటీపడ్డ రేవంత్, ఇనయ
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లకో గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇప్పటివరకు కట్ అయిన డబ్బులను ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తానన్నాడు. కాకపోతే అందుకోసం కొన్ని టాస్కులు గెలవాల్సి ఉంటుందని, ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్ చేయాలని మెలిక పెట్టాడు. అందుకు సరేనంటూ ఎగిరి గంతేశారు హౌస్మేట్స్. అందులో భాగంగా కంటెస్టెంట్లకు నేడు రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అందులో ఇనయ, రేవంత్ పోటీపడ్డారు. మెజారిటీ హౌస్మేట్స్ రేవంత్ గెలుస్తాడని భావించగా అదే నిజమైంది. దీంతో రూ.1,10,000 విన్నర్ ప్రైజ్‌మనీలో తిరిగి యాడ్ అయినట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్ ఇంకా ఏమేం ఛాలెంజ్లిచ్చాడు? ఎంత అమౌంట్ తిరిగి యాడ్ అయిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా? -
ఈ వారం ఆమె ఎలిమినేట్, సీజన్లోనే బెస్ట్ కెప్టెన్‌గా ఇనయ!
Bigg Boss Telugu 6, Episode 91: రేవంత్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడు తండ్రైన శుభవార్తను చెప్పాడు. డిసెంబర్ 1న రాత్రి 11 గంటలకు నాకు లక్ష్మీదేవి పుట్టిందంటూ అతడు ఇంటిసభ్యులతో ఈ గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. తర్వాత శ్రీహాన్, రేవంత్ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడగా శ్రీహాన్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్టుగా అవతరించాడు. ఇక నాగార్జున వచ్చీరాగానే ఈ 13 వారాల్లో మీరు రిగ్రెట్ అయిన వారం ఏంటి? దేనికోసం ఫీలయ్యారో చెప్పాలన్నాడు. దీనికి ఫైమా ఆరోవారం సుదీపతో మాట్లాడిన విధానం వల్లే నాకు వెటకారం అన్న ట్యాగ్ వచ్చిందని బాధపడింది. తర్వాత ఇనయ మాట్లాడుతూ.. తొమ్మిదోవారంలో నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి నానామాటలు అన్నాను, అలా అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. శ్రీహాన్ వంతు రాగా.. ఫ్యామిలీ వీక్ (12వ వారం)లో సిరి చెప్పడం వల్ల నా వెటకారంతో కీర్తి బాధపడుతుందని తెలిసింది. అలా చేయకుండా ఉండాల్సిందన్నాడు. కీర్తి మాట్లాడుతూ.. 13వ వారంలో టికెట్ టు ఫినాలే రేసులో టవర్ టాస్కును తన్నకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చింది. ఫస్ట్ వీక్ నుంచి ఆరో వారం వరకు నేను కోపతో ఏది పడితే అది అనేశాను. ఎనిమిదోవారం చేపల టాస్కులో ఫిజికల్‌గా ఆది, గీతూ, ఇనయలను బాధపెట్టాను. 13వ వారం ఆదిరెడ్డి రెచ్చగొట్టేసరికి ఓవర్‌గా రియాక్ట్ అయ్యాను, ఇవన్నీ నా పొరపాట్లేనని అంగీకరించాడు రేవంత్. 12వ వారం కెప్టెన్సీ టాస్కులో ఇనయను నమ్మి పెద్ద తప్పు చేశానన్నాడు రోహిత్. 2వ వారంలో నాకు దెబ్బలు తగులుతాయన్న భయంతో గేమ్ ఆడకుండా కూర్చున్నా, 11వ వారంలో కీర్తిని ఇమిటేట్ చేశా.. అదే నా రిగ్రెట్ అని చెప్పింది శ్రీసత్య. 2వ వారంలో నేను కూడా దెబ్బలు తగులుతాయేమోనని పెద్దగా ఆడలేదు, 9వ వారంలో మైక్ విసిరికొట్టాను, 11వ వారంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల యూజ్ ఉండదు అని అందరిముందు చెప్పడం తప్పనిపించింది. అమ్మాయిల విషయంలో ఓవర్ సెన్సిటివ్‌గా ఆడటం కూడా తప్పేనన్నాడు ఆదిరెడ్డి. తర్వాత నాగార్జున ఎవరు బెస్ట్ కెప్టెన్? ఎవరు వరస్ట్ కెప్టెన్? చెప్పాలంటూ గేమ్ ఆడించాడు. కంటెస్టెంట్ ఉత్తమ కెప్టెన్ చెత్త కెప్టెన్ రోహిత్ కీర్తి ఆదిరెడ్డి ఆదిరెడ్డి ఇనయ శ్రీసత్య శ్రీసత్య ఇనయ ఆదిరెడ్డి ఇనయ శ్రీసత్య శ్రీహాన్ శ్రీహాన్ ఇనయ ఆదిరెడ్డి కీర్తి ఫైమా శ్రీహాన్ ఫైమా ఇనయ రేవంత్ రేవంత్ ఆది రెడ్డి ఇనయ ఫైనల్‌గా హౌస్ మొత్తం ఇనయను బెస్ట్ కెప్టెన్‌గా, ఆదిరెడ్డిని వరస్ట్ కెప్టెన్‌గా నిలబెట్టింది. ఇకపోతే రేవంత్ అమ్మాయిలే వీక్ అని మాట్లాడాడని ఆదిరెడ్డి ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నాడు. గతవారం ఈ విషయమై రేవంత్ అలా అనలేదని నాగార్జున క్లారిటీ ఇస్తూ వీడియో కూడా చూపించాడు. అయినప్పటికీ ఆది మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా పూర్తి వీడియోలో రేవంత్ ఆ మాట అన్నాడంటూ మొండిగా వ్యవహరించాడు. దీంతో నాగ్ ఈసారి పూర్తి వీడియో చూపించాడు. మొత్తం వీడియో చూపించాక రేవంత్ ఆడపిల్లలు వీక్, వాళ్లు వస్తే ఈజీగా ఆడేయొచ్చు అని అన్నాడా? లేదా? అని ఇనయ, కీర్తి, ఫైమాలను అడగ్గా వారు ముక్తకంఠంతో లేదని చెప్పారు. దీంతో నాగార్జున.. ఆది నాన్సెన్స్ మాట్లాడుతున్నావు, ఇకమీదట దీన్ని సాగదీయకుండా ఇక్కడితో ఆ ప్రస్తావనే ఆపేసేయ్ అని వేడుకున్నాడు. అనంతరం నాగ్.. రేవంత్‌ను సర్ప్రైజ్లో ముంచెత్తాడు. అతడికి తన భార్యాబిడ్డలతో మాట్లాడే అదృష్టాన్ని కల్పించాడు. వీడియో కాల్ ద్వారా స్క్రీన్‌పై భార్యాబిడ్డను చూసుకుని రేవంత్ మురిసిపోయాడు. ఈ సమయంలో నేను నీకు తోడుగా లేనందుకు సారీ అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత.. పెదవే పలికిన మాటల్లోన సాంగ్ పాడి దాన్ని అందరు తల్లులకు డెడికేట్ చేశాడు. ఇకపోతే ఈ వారం ఫైమా ఎలిమినేషన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. చదవండి: వంద కోట్ల దాకా పోగొట్టుకున్నాను, జయసుధ కూడా అంతే: చంద్రమోహన్ మహేశ్‌బాబు అలా అనగానే కన్నీళ్లు ఆగలేదు: అడివి శేష్ -
ముగ్గురమ్మాయిలపై రెచ్చిపోయిన కంటెస్టెంట్లు, తగ్గేదేలేదన్న రోహిత్
Bigg Boss 6 Telugu, Episode 90: 'టికెట్ టు ఫినాలే' ఛాలెంజ్ రేసులో రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్ ఐదుగురు మిగిలారు. అయితే తదుపరి ఛాలెంజ్‌లో వీరిలో నుంచి ముగ్గురు మాత్రమే పోటీపడాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఎవరికి వారు నేను తప్పుకోనంటే నేను తప్పుకోనంటూ వాదులాటకు దిగారు. దీంతో ఆ ముగ్గురు ఎవరో డిసైడ్ చేయండంటూ సంచాలకులైన ఇనయ, కీర్తి, శ్రీసత్యలపై భారం వేశాడు బిగ్‌బాస్. ఈ ముగ్గురు.. స్కోర్ బోర్డులో చివర్లో ఉన్న ఫైమా, రోహిత్, రేవంత్‌లను సెలక్ట్ చేశారు. టాప్‌లో ఉన్నవాళ్లను తీసేసి వేరేవాళ్లకు ఛాన్స్ ఇవ్వడమేంటి? ఈ సీజన్లో ఇదే వరస్ట్ డెసిషన్ అని చిరాకుపడ్డాడు ఆది. ఆలోచనలో పడ్డ రోహిత్.. టాప్ పొజిషన్లో ఉన్న వాళ్లను తీసేసి చివర్లో ఉన్న తనను ఆడేందుకు సెలక్ట్ చేయడం కరెక్ట్ కాదని భావించి గేమ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించాడు. అంటే గేమ్ ఆడనని చెప్తున్నావా? అని ఇనయ అడగడంతో శ్రీహాన్ ఫైరయ్యాడు. ఆటలో నుంచి తప్పుకుంటున్నవాళ్లను ఎందుకు బతిమాలుతున్నావు? అందరికీ ఛాన్స్ ఇవ్వడానికి ఇది ఫన్డే గేమ్ కాదని చురకలంటించాడు. దీంతో వెనక్కు తగ్గిన సంచాలకులు తమ నిర్ణయం మార్చుకుని రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఆడుతున్నారని చెప్పారు. చివర్లో ఉన్న రోహిత్ ఆడను అన్నందున చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఫైమాను కూడా తొలగించామని ఇనయ స్పష్టతనిచ్చింది. ఈ ఒక్కమాటతో గేమ్‌లో ఉన్నవాళ్లంతా నిప్పులు చెరిగారు. ఇంతకుముందు ఓమాట ఇప్పుడో మాట అంటూ సంచాలకులను తిట్టిపోశారు. రోహిత్ అయితే నా వల్ల ఫైమాను తొలగించామంటారేంటి? అంటూ ఇనయ మీద మండిపడ్డాడు. అయితే టాప్ 3 లేదంటే లాస్ట్‌లో ఉన్న 3 మెంబర్స్‌నే ఆడించాలనుకున్నాం అని సంచాలకులుగా చెప్తున్నా.. అది మీరెలా డిసైడ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. అసలేం సంచాలకులు వీరు, ముగ్గురూ వేస్టే.. అంత భయమున్నప్పుడు బిగ్‌బాస్‌కు రాకూడదు అంటూ రేవంత్ మరోసారి తన నోటిదురుసు ప్రదర్శించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లో రేవంత్ గెలవగా శ్రీహాన్, ఆది తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. సెకండ్ లెవల్ ముగిసే సమయానికి రేవంత్ 15, శ్రీహాన్, ఆది 14, ఫైమా 7, రోహిత్ 6 పాయింట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. సమాన పాయింట్లు వచ్చిన ఆది, శ్రీహాన్‌లకు ఓ గేమ్ ఇవ్వగా అందులో శ్రీహాన్ గెలిచాడు. దీంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రేవంత్, శ్రీహాన్ టికెట్ టు ఫినాలే రేస్ కోసం పోటీపడ్డారు. ఇకపోతే శ్రీహాన్ టికెట్ టు ఫినాలే సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్టుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్ ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆది -
ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆదిరెడ్డి
ఏకాభిప్రాయం అనే ఒకే ఒక్క మాటతో హౌస్‌మేట్స్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు బిగ్‌బాస్. ఇంత దూరం వచ్చాక కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా మీలో మీరు కొట్టుకు చావండి, కానీ మీలో కొందరినే గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేసుకోమనడంతో కంటెస్టెంట్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసులో ఇనయ, శ్రీసత్య, కీర్తి గేమ్ నుంచి అవుట్ అయ్యారు. మిగిలిన ఐదుగురిలో ఏ ముగ్గురు నెక్స్ట్ ఛాలెంజ్ ఆడతారో ఏకాభిప్రాయానికి వచ్చి వారి పేర్లు చెప్పమన్నాడు బిగ్‌బాస్. ఎవరికి వారు నేను ఆడతానంటే నేను ఆడతాననడంతో సంచాలకులైన మిగతా ముగ్గురికి ఆ బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఇనయ.. స్కోర్ బోర్డులో టాప్‌లో ఉన్న ఆదిరెడ్డి, శ్రీహాన్‌ను తొలగించి రేవంత్, ఫైమా, రోహిత్ ఆడతారని వెల్లడించింది. ఇది విన్న ఆదిరెడ్డి ఈ సీజన్లో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదేనని ఫైరయ్యాడు. ఈ గొడవంతా ఎందుకనుకున్న రోహిత్ తాను ఆట నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటానన్నాడు. గేమ్ ఆడాలి కానీ ఫెయిర్‌గా కూడా ఆడాలి అంటూ రోహిత్ మిగతావారికి ఛాన్స్ ఇస్తూ సైడ్ అయిపోయాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రోహిత్ ఆటలో గాని మాటలోగాని మచ్చలేని మనిషి అని మెచ్చుకుంటున్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: విర్రవీగుతున్న రేవంత్, తప్పు చేసి అవతల వాళ్లను నిందించటమే పని! తండ్రయిన సింగర్ రేవంత్ -
'టికెట్ టు ఫినాలే' మళ్లీ బరిలో నిలబడ్డ కంటెస్టెంట్
బిగ్‌బాస్ షోకి ముగింపు దగ్గరపడింది. మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. నేరుగా ఫైనల్స్‌కు వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్. ఇప్పటికే ఈ గేమ్ నుంచి శ్రీసత్య, కీర్తి, ఇనయ అవుట్ అయ్యారు. కానీ వారికి మరో అవకాశం కల్పించి తిరిగి గేమ్‌లోకి రావడానికి ఓ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ముగ్గురమ్మాయిలకు రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఇనయ, కీర్తి.. సత్యను టార్గెట్ చేయడంతో ఆమె అవుట్ అయింది. తర్వాత మిగిలిన ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. రసవత్తరంగా జరిగిన ఈ పోటీలో కీర్తి గెలిచి తిరిగి టికెట్ టు ఫినాలే గేమ్‌లో అడుగుపెట్టింది. చదవండి: మీరిద్దరూ ఏం చేస్తున్నారసలు.. దొరికిపోయిన శ్రీహాన్ రష్యాలోనో తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ -
Bigg BOss 6 :మీరిద్దరు చేస్తుందేంటి? అది ఎటాక్‌లా లేదు.. టెలికాస్ట్‌లో చూసుకోండి!
Bigg Boss Telugu 6 Episode 87: బిగ్‌బాస్ ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ని పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి ‘స్నో మెన్’ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించేందుకు అవసరమైన ముక్కలు పై నుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి. ఎవరైతే ముందుగా స్నోమెన్‌ని రెడీ చేస్తారు వారు విజేతగా నిలుస్తారు. ఈ టాస్క్‌కి సంచాలక్‌గా ఇనాయాను నియమించాడు బిగ్‌బాస్. మొదటి దశలో రేవంత్, ఆదిరెడ్డి ఎక్కువ ముక్కలను సేకరించి స్నోమెన్‌ని నిర్మించారు. రోహిత్, ఫైమా, కీర్తి మాత్రం గేమ్ నియమాలకు విరుద్దంగా సేకరించిన వస్తువులను తమ దగ్గరే పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సంచాలక్‌గా ఉన్న ఇనయా గమనించలేదు. దీంతో బిగ్‌బాస్ ఇనయాను తొలగించి రేవంత్‌ని సంచాలక్‌గా నియమించాడు. రేవంత్ సంచాలక్‌గా వచ్చి రావడంతోనే కఠిన నియమాలు పెట్టాడు. సత్య తీసుకున్న స్నో మెన్ పార్ట్ విరిగిపోవడంతో దాన్ని అతికించి పెట్టింది. అలా చేస్తే కౌంట్ రాదని రేవంత్ చెప్పినా కూడా వినకుండా ‘అతికించినట్టు ఏమైనా తెలుస్తుందా ఏంటి కౌంట్ చేయకపోతే అది నీ ఇష్టం’ అని సత్య అసహనం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ ఆదేశంతో అందరికంటే తక్కువ వస్తువులున్న శ్రీసత్యను టాస్క్ నుంచి ఎలిమినేట్ చేశాడు రేవంత్. ఆ తర్వాత రెండో లెవల్ మొదలవుతుంది. ఇందులో భాగంగా స్టార్ట్-ఎండ్ బజర్ల మధ్య ఉన్న సమయంలో ఇతరుల బొమ్మలపై దాడి చేసి వీలైనన్ని వస్తువులను దొంగిలించవచ్చని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే పోటీదారులు మాత్రం పెద్దగా గొడవకు దిగలేదు. దొంగిలించడం పక్కకి పెట్టి తమ బొమ్మలను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రయత్నించారు. ఇనయా మాత్రం శ్రీహాన్ బొమ్మపై దాడి చేసేందుకు ట్రై చేసింది. ఈ క్రమంలో శ్రీహాన్ ఇనయాని గట్టిగా హత్తుకొని తన బొమ్మ దగ్గరకు వెళ్లకుండా చేశాడు. ఇనయా కూడా గతంలో మాదిరి గట్టిగా దాడికి దిగలేదు. ఒకర్నొకరు లాక్కోవడం, పట్టుకోవడం లాంటివి రొమాంటిక్‌గా చేశారు. శ్రీసత్య ఈ విషయాన్ని గమనించి ‘అసలు మీరిద్దరు ఏం చేశారు?’ అని అడగ్గా.. ఇనయా సిగ్గు పడుతూ.. ఎటాక్ చేశామని చెప్పింది. ‘అది ఎటాక్‌లా లేదు.. కావాలంటే టెలికాస్ట్‌లో చూసుకోండి’ అని శ్రీసత్య చెప్పింది. ఇంతటితో ఆగకుండా.. ఇనయాతో బాగానే చేశావే.. దొరికిపోయావ్ శ్రీహాన్ అంటూ ఆటపట్టించింది. రేవంత్, ఫైమా అయితే ఏకంగా వీరిద్దరు ఎలా చేశారో ఇమిటేట్ చేసి చూపించారు. శ్రీహాన్, ఇనయాలు ఈ విషయాన్ని కామెడీగానే తీసుకున్నారు. శ్రీహాన్ అయితే ఈ సంఘటనను మగధీర సినిమాతో పోలుస్తూ.. సత్య మిత్రవింద అని, ఇనయా ఐటమ్ గర్ల్ అని చెప్పాడు. దీంతో ఇనయా అలుగుతుంది. ఆమెను కూల్ చేసేందుకు నాయానే మిత్రవింద.. సత్య ఐటెమ్ గర్ల్ అని శ్రీహాన్ అన్నాడు. ఆ తర్వాత స్నోమెన్ టాస్క్‌లు తక్కువ వస్తువులు సేకరించిన కారణంగా ఇనయా, కీర్తిలను తొలగిస్తున్నట్లు సంచాలక్ శ్రీసత్య ప్రకటిస్తుంది. -
బిగ్‌బాస్ 6: ఆర్జీవీతో డాన్స్ వీడియోపై ఇనయా సుల్తానా ఏమందంటే..
ఇనయ సుల్తానా.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో తనదైన ఆట తీరు, ముక్కుసూటి తనంతో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఇనయ టాప్ కంటెస్టెంట్లో ఒకరిగా దూసుకుపోతోంది. బిగ్‌బాస్‌కు ముందు ఇనయ ఓ వైరల్ వీడియోతో సోషల్ మీడియాకు పరిచయమైన సంగతి తెలిసిందే. తన బర్త్‌డే పార్టీలో వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో కలిసి డాన్స్ చేసి ఆమె ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అలా ఆర్జీవీ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ అందుకుంది. బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టడానికి ముందు ఇనయ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ డాన్స్ వీడియోపై ఆమె స్పందించింది. ‘‘సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఆర్జీవీ సార్‌తో పరిచయం ఏర్పడింది. అదే సమయంలో నా పుట్టిన రోజు కూడా ఉండటంతో ఆయనను పార్టీకి పిలిచాను. అదే సమయంలో ఇద్దరం కలిసి డాన్స్ చేశాం. ఆ వీడియో నా బర్త్ డే జరిగిన నాలుగు రోజుల తర్వాత బాగా వైరల్ అయ్యింది. ఆ సమయంలో అమ్మ ఫోన్ చేసి బాగా ఏడ్చింది. ‘పరువు మొత్తం తీస్తున్నావ్’ అంటూ కుటుంబ సభ్యులు తిట్టారు. అది నన్ను చాలా బాధించింది. ఆ వీడియో చూసి మా బంధువులంత నన్ను ద్వేషించడం స్టార్ట్ చేశారు. నా గురించి మాట్లాడటం కూడా మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అందుకే నేను వాళ్ళ గురించి కూడా ఎక్కడా చెప్పాలనుకోవడం లేదు’’ అంటూ ఇనయ ఎమోషనల్ అయ్యింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తను సినిమాల్లోకి రావడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, అదే సమయంలో ఆ వీడియో వైరల్ కావడం వాళ్లు చాలా బాధపడ్డారని చెప్పింది. అంతేకాదు అప్పటి నుంచి తనని తప్పుగా చూస్తున్నారని, పరువు తీస్తున్నావంటూ తనని ద్వేషిస్తున్నారని ఇనయ ఆవేదన వ్యక్తం చేసింది. I once again want to clarify that the guy in this video is not me and the Girl in Red is not @inaya_sultana and I swear this on American President JOE BIDEN pic.twitter.com/K8nNera7Rc — Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2021 చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ డీజే టిల్లుకు హీరోయిన్ల తిప్పలు.. అనుపమ కూడా అవుట్! -
ఆ కంటెస్టెంట్ పరువు తీసిన రాజ్, అతడే విన్నర్ అని వెల్లడి
Bigg Boss Telugu 6, Episode 85: ఎవరు తప్పు చేశారో నిలబెట్టి క్లాసు పీకే నాగార్జున ఈసారి మాత్రం డిఫరెంట్‌గా వారి తప్పొప్పులను వారితోనే చెప్పించాడు. హౌస్‌మేట్స్‌లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో చెప్పమని ఆదేశించాడు నాగ్. ముందుగా రోహిత్ మాట్లాడుతూ.. 'కీర్తి ఎక్కువ బాధపడుతుంది, ఫైమా, శ్రీసత్యలో వెటకారం ఎక్కువ. ఇనయ ఎవరికీ అవకాశమివ్వకుండా మాట్లాడుతుంది, రాజ్ పాయింట్ లేకున్నా అరుస్తాడు, రేవంత్‌కు కోపమెక్కు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు' అంటూ వారిలోని లోపాలను ఏకరువు పెట్టాడు. ఇలా అందరి గురించి చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ సాగదీయాల్సి వస్తుందనుకున్నాడో ఏమోకానీ నలుగురి కంటెస్టెంట్లలోని చెడు లక్షణాలు చెప్తే సరిపోతుందన్నాడు నాగ్. దీంతో ఇనయ మాట్లాడుతూ.. 'శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది. రేవంత్ ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతున్నాడు. రాజ్ నేనున్నానని చూపించుకోవడానికి అరుస్తాడు. ఆదిరెడ్డి ఆడకుండా కూర్చోవడం కరెక్ట్ కాదు' అని చెప్పింది. కీర్తి వంతు రాగా రేవంత్ అన్న ఓవర్ అగ్రెసివ్, శ్రీసత్య, శ్రీహాన్ వెటకారం, రోహిత్ ఎక్కువ కలవకపోవడం మైనస్ అని చెప్పింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'రేవంత్ బాగా ఆడతాడు, కానీ తాను బాగా ఆడతానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇనయ చాలా మాటలు వదిలేస్తుంది. శ్రీసత్యకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. రోహిత్ గట్టిగా స్పందించరు' అని చెప్పాడు. ఫైమా.. సరేవంత్ కోపం నచ్చదు. ఇనయ మాటతీరు మార్చుకోవాలి. రోహిత్ గేమ్‌లో పెద్దగా పర్ఫామెన్స్ కనిపించట్లేదు. కీర్తి ఎక్కువ ఎమోషనల్ అవుతుందిస అని చెప్పింది. శ్రీసత్య.. రోహిత్ సరైన టైమ్‌కు రియాక్ట్ అవడు. కీర్తి ఏం చెప్పినా వినిపించుకోదు. ఇనయ ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పింది. రాజ్ మాట్లాడుతూ.. రోహిత్ గట్టిగా మాట్లాడడు. ఇనయ ప్రతిదానిలో దూరుతుంది. శ్రీహాన్ గేమ్ కన్నా స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. శ్రీసత్య నామినేషన్లో తను చెప్పాలనుకుంది చెప్పి వెళ్లిపోతుందన్నాడు. ఇక శ్రీహాన్ వంతురాగా రాజ్‌కు కాన్ఫిడెన్స్ తక్కువ. రోహిత్ మంచితనం కొన్నిసార్లు సేఫ్‌గా కనిపిస్తుంది. రేవంత్ కొన్ని స్టేట్మెంట్లు వదిలేస్తాడు. సరదాగా అయినా సరే వద్దని వారించినా అర్థం చేసుకోడు. శ్రీసత్య వేరేవాళ్ల మాట నమ్మి ఫ్రెండ్‌ను దూరం పెట్టొద్దు అని సూచనలిచ్చాడు. రేవంత్.. ఫైమా వెటకారం తగ్గించుకోలేదని, ఆదిరెడ్డి మానిప్యులేటర్ అని, ఇనయ, కీర్తి కావాలని రెచ్చగొడుతారని మనసులో ఉన్న కోపాన్నంతా కక్కేశాడు. అందరూ మాట్లాడింది విన్న నాగ్.. మీలోని చెడు లక్షణాలను సరిచేసుకున్నవారు గెలుపుకు దగ్గరవుతారని సూచించాడు. తర్వాత వంట రాదన్న కీర్తితో ఆలూ ఫ్రై చేయించుకుని మరీ తిన్నాడు నాగ్. అనంతరం ఇంటిసభ్యులతో ఫన్ గేమ్స్ ఆడించాడు. ఇకపోతే నామినేషన్స్‌లో అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరకు ఫైమా, రాజ్ ఇద్దరే మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాజ్ కోసం వాడతానంది ఫైమా. అయితే రాజ్ మాత్రం నువ్వు ఆడి సంపాదించింది నీ కోసమే వాడుకో అని చెప్పాడు. దీంతో ఫైమా దాన్ని వాడకుండా వదిలేద్దామనకుంది. కానీ నాగార్జున మాత్రం.. ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో మీ ఇద్దరే ఉన్నారని, మీలో ఒకరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడితే మిగతా ఒకరు ఎలిమినేట్ అవుతారని స్పష్టం చేశాడు. అంటే ఓటింగ్‌తో సంబంధం లేకుండా పాస్‌తో గండం గట్టెక్కొచ్చని నొక్కి చెప్పాడు. దీంతో ఫైమా మనసు మార్చుకుని తనకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడింది. ఫలితంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. అయితే ఆడియన్స్ ఓట్ల ప్రకారం చివరి స్థానంలో ఉన్న ఫైమా ఎలిమినేట్ అవ్వాలని, కానీ పాస్ సాయంతో ఆమె సేవ్ అయి రాజ్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు నాగ్. దీంతో ఫైమా, ఇనయ ఎమోషనలయ్యారు. స్టేజీ మీదకు వచ్చిన రాజ్‌తో పంచ్, హగ్స్ గేమ్ ఆడించాడు నాగ్. ఫైమా, ఆది, రోహిత్, రేవంత్‌కు హగ్స్ ఇస్తానని, మిగతా నలుగురికి పంచ్ ఇచ్చాడు. వెళ్లేముందు కంటెస్టెంట్లకు విలువైన సూచనలిచ్చాడు రాజ్. ఫైమా దగ్గర కొంత ఫన్ తక్కువైందని, ఆదిరెడ్డి తను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటాడని, రోహిత్ కొన్ని సందర్భాల్లో మాట్లాడితే బాగుండన్నాడు. రేవంత్‌ది చిన్నపిల్లాడి మెంటాలిటీ అని, అతడు కచ్చితంగా టైటిల్ కొడతాడని ఫిక్సైపోమన్నాడు. శ్రీహాన్ అందరితో గట్టిగా మాట్లాడతాడు, కానీ ఫ్రెండ్స్ తప్పులను గట్టిగా చెప్తే బాగుండన్నాడు. శ్రీసత్యను నామినేషన్లో సరైన పాయింట్లు చెప్పమన్నాడు. ఇనయను టాప్ 5లో చూడాలనుకుంటున్నానని, ఆలోచించి మాట్లాడమని సూచించాడు. హౌస్‌లో కీర్తి తనకెప్పుడూ కనిపించలేదంటూ ఆమె పరువు తీశాడు. ఫైనల్‌గా రాజు ఎక్కడైనా రాజే అంటూ అతడిని పంపించేశాడు నాగ్. చదవండి: రాజశేఖర్ ఎలిమినేషన్‌కు కారణాలివే! నిజానికైతే ఫైమా ఎలిమినేట్ కావాల్సింది! -
ఫైమాకు మట్టి తినే అలవాటు, ఇనయ కొత్త రూల్ ఏంటంటే?
Bigg Boss 6 Telugu, Episode 83: ఫైమాకు ఆకలైందో మరేంటో కానీ పొద్దుపొద్దునే గార్డెన్ ఏరియాలో ఉన్న మట్టి ఏరుకుంటూ తింది. అది చూసిన బిగ్‌బాస్ ఆమెను ఓ ఆటాడుకున్నాడు. మీ రేషన్ మీరు వెతుక్కున్నారు కాబట్టి ఇంట్లో రేషన్ అవసరం లేదని సెటైర్లు వేశాడు. తనకు ఫుడ్ కట్ చేయమంటున్నాడేమోనని అనుకున్న ఫైమా ఇకమీదట మట్టి తిననని చెంపలేసుకుని సారీ చెప్పింది. తను వేసింది జోక్ అని అర్థం చేసుకోలేకపోయిన ఫైమాకు నాలుగు ఎక్స్ట్రా గుడ్లు పంపించాడు బిగ్‌బాస్. తర్వాత రేవంత్‌కు బిగ్‌బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అతడి భార్య అన్వితతో వీడియోకాల్ మాట్లాడించాడు. ఈ సందర్భంగా ఆమె డెలివరీ డేట్ కూడా ఇచ్చారని శుభవార్త చెప్పింది. నిన్ను చాలా మిస్ అవుతున్నానని చెప్పింది. ఇంతలో సడన్‌గా వీడియోకాల్ కట్ అవ్వడంతో రేవంత్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఇంకా మాట్లాడాలి బిగ్‌బాస్, ప్లీజ్ అని దీనంగా వేడుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతడి తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమెను చూడగానే రేవంత్ దుఃఖం పటాపంచలైంది. తల్లిని మనసారా హత్తుకుని ఆమెతో తనివితీరా మాట్లాడాడు. గడ్డం వద్దని అమ్మ చెప్పగానే వెంటనే దాన్ని తీసేసుకుని కొత్త లుక్‌తో కనిపించాడు. ఎక్కువ కోప్పడుతున్నావు, ఊరికే ఏడుస్తున్నావు, నెట్లో పెట్టేస్తున్నారు, కాస్త చూసుకోరా అని కొడుక్కి సలహాలు ఇచ్చింది. అలాగే వంటగదిలో రేషన్ దగ్గర కక్కుర్తి పడి అందరికీ అది ఇవ్వను, ఇది ఇవ్వను అనడం బాలేదంది. ఆ తర్వాత అందరితో కలిసి స్టెప్పేసి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది పెద్దావిడ. ఏదేమైనా రేవంత్‌కు డబుల్ ధమాకా అందిందని హౌస్మేట్స్ సంతోషించారు. కానీ రేవంత్ మాత్రం భార్యతో ఇంకాసేపు మాట్లాడాలని ఉందని మనసులో పదేపదే బాధపడ్డాడు. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన చివరి కెప్టెన్సీ టాస్క్‌లో ఇనయ గెలిచి కెప్టెన్‌గా అవతరించింది. ఎట్టకేలకు తను కెప్టెన్ కావడంతో భావోద్వేగానికి లోనైంది. చివరి కెప్టెన్ అయిన ఇనయ నేరుగా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. కెప్టెన్‌గా కొత్త నిబంధనలేమీ పెట్టడం లేదని ఎంజాయ్ చేద్దామంది. అలాగే ఎవరికి ఎంత ఫుడ్ కావాలంటే అంత తినండి అని చెప్పింది. దీంతో హౌస్మేట్స్ తెగ సంబరపడిపోయారు. చదవండి: శ్రీసత్య ఎప్పుడు వెళ్లిపోతుందా? అని ఎదురుచూసిన హమీదా కష్టాల్లో ఉన్న పనిమనిషికి సాయం చేసిన నయనతార -
Bigg Boss: చివరి కెప్టెన్‌గా ఇనయ, నేరుగా సెమీ ఫైనల్స్‌లోకి!
ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో హౌస్మేట్స్ గాల్లో తేలిపోతున్నారు. కళ్లనిండా వారిని చూసుకుని మనసు నిండా వారి జ్ఞాపకాలు పదిలంగా దాచుకుని అయినవాళ్లకు భారంగా వీడ్కోలు పలుకుతున్నారు ఇంటిసభ్యులు. మరో మూడు, నాలుగు వారాల్లో తిరిగి ఇంటికి వచ్చేస్తామంటూ కళ్లతోనే సంభాషిస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్లో చివరగా రేవంత్ తల్లి వచ్చి వెళ్లిపోవడంతో ఫ్యామిలీ వీక్ ముగియనుంది. ఇక హౌస్‌లో చివరి కెప్టెన్సీ పోటీ జరగనుంది. ఇందులో భాగంగా ఒక రౌండ్ చుట్టూరా ఇంటిసభ్యులు నిలబడి బజర్ మోగినప్పుడు మధ్యలో ఉన్న బంతిని అందుకోవాలి. మళ్లీ బజర్ మోగే సమయానికి ఎవరి చేతిలో అయితే బంతి ఉంటుందో వారు ఇద్దరిని ఆటలో నుంచి తొలగించవచ్చు. ఈ గేమ్‌లో ఇనయ పోటాపోటీగా ఆడి చివరి కెప్టెన్ అయినట్లు సోషల్ మీడియాలో లీకైంది. ఈ విషయం తెలిసి ఇనయ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎట్టకేలకు కెప్టెన్ అవ్వాలన్న ఆమె కల నెరవేరిందని సంతోషపడుతున్నారు. ఈ దెబ్బతో ఇనయ ఏకంగా సెమీ ఫైనల్స్‌లో స్థానం సంపాదించుకుంది. చదవండి: శ్రీసత్య ఎలిమినేషన్ కోసం ఎదురుచూస్తున్న హమీదా న్యూజిలాండ్ షూటింగ్లో రామ్‌చరణ్ -
ఇనయ కల నెరవేర్చిన బిగ్‌బాస్, శ్రీహాన్ కాళ్లు మొక్కిన సిరి
Bigg Boss Telugu 6, Episode 82: పన్నెండు వారాల ఎడబాటుకు తెర దించుతూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపుతున్నాడు బిగ్‌బాస్. వారిని చూసి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు హౌస్మేట్స్. తమ వాళ్లను చూడగానే తెలియకుండానే కన్నీళ్లు కార్చుతున్నారు. వారితో కలిసి చిందులేస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చాయో చూద్దాం.. పన్నెండు వారాల తర్వాత ప్రేయసి కళ్లముందుకు రావడంతో భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీహాన్. హౌస్‌లోకి వెళ్లగానే శ్రీహాన్‌ను గట్టిగా పట్టుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించింది సిరి. ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని మెడపై ఉన్న టాటూ చూపించింది. తర్వాత సిరి కొడుకు చైతూ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. వచ్చీరాగానే ఈ చిచ్చరపిడుగు తన బుల్లిబుల్లి మాటలతో అందరినీ నవ్వించాడు. ఎవరెలా మాట్లాడతారో వారి డైలాగులను సరిగ్గా దింపేశాడు. తర్వాత.. ఇంతందం దారి మళ్లిందా.. పాటకు సిరి, శ్రీహాన్ స్టెప్పులేశారు. వారిద్దరి మధ్యలో చైతూ వచ్చేందుకు ప్రయత్నించడంతో పానకంలో పుడకలా వస్తావేంట్రా అని తిట్టలేక నవ్వుకున్నాడు శ్రీహాన్. చివరగా వెళ్లిపోయేముందు శ్రీహాన్ పాదాలు తాకి వీడ్కోలు తీసుకుంది సిరి. ఇక రాత్రిపూట కడుపులో మండుతుందని పాలు అడిగాడు రాజ్.. ఎప్పటిలాగే స్ట్రిక్ట్ మాస్టర్ రేవంత్ కుదరదని తెగేసి చెప్పాడు. అడిగినప్పుడు ఇవ్వడానికి ఏం ప్రాబ్లమ్ అని లోలోనే గునుక్కున్నాడు రాజ్. తర్వాతి రోజు కీర్తి కోసం ఆమె స్నేహితుడు, బుల్లితెర నటుడు మహేశ్ వచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ చేసి గోరుముద్దలు తినిపించాడు. ఎవ్వరూ కోల్పోలేనిది నువ్వు కోల్పోయావు. కానీ ఆ దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్ బిగ్‌బాస్. ఇక్కడ నీతో నీకే పోటీ.. లక్షల మంది సైన్యం నీ వెంట ఉన్నారు.. అదే నీ బలం.. అంటూ ఆమెలో పాజిటివిటీ నింపాడు. తను దత్తత తీసుకున్న పాప ఫొటోను బహుమతిగా అందించాడు. అయితే ఆమెను కాపాడుకోలేకపోయానని బోరున ఏడ్చింది కీర్తి. అనంతరం మహేశ్.. ఇనయను ముద్దుపెట్టమని అడగడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. అతడికి నో చెప్పడం ఇష్టం లేని ఇనయ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అనంతరం ఇనయ సుల్తాన తల్లి నజ్బూర్ హౌస్‌లోకి వచ్చింది. ఆమెను చూడగానే ఎమోషనలైంది ఇనయ. 'నాకోసం నువ్వు మనసులో ఇంత బాధపడుతున్నావని తెలీదు, అందుకే వచ్చాను. నీ జీవితం నువ్వు చూసుకున్నావు, ఇంత కష్టపడ్డావు. బిగ్‌బాస్‌కు వచ్చావు. గెలిచి రావాలి. నువ్వు బాగుండాలనేదే నా కోరిక' అని చెప్పింది. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోదాం అని ఇనయ అడిగితే అది తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే బాగా ఆడి గెలిచి రా అని బదులిచ్చింది. కేజీఎఫ్‌లోని అమ్మ సాంగ్ వేయడంతో తల్లి కాళ్ల మీద పడి ఏడ్చింది ఇనయ. అనంతరం ఆమె అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తల్లిని బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలన్న తన కల నెరవేరడంతో ఇనయ తెగ సంతోషపడిపోయింది. చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్ భారత ఆర్మీని అవమానించిందంటూ నటిపై ట్రోలింగ్ -
ఇనయను ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్, కీర్తి కోసం వచ్చింది ఎవరంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో ఓపక్క టీచింగ్ క్లాసులు మరోపక్క ఫ్యామిలీస్ ఎంట్రీతో నవ్వులు వెదజల్లుతున్నాయి. ఈ క్రమంలో శ్రీహాన్ ఫ్లర్టింగ్ ఎలా చేయాలనేది కంటెస్టెంట్లకు నేర్పిస్తున్నాడు. అమ్మాయిలను ఎలా పడగొట్టాలని టిప్స్ ఇస్తున్నాడు. తర్వాత కీర్తి కోసం ఆమె స్నేహితుడు, నటుడు మహేశ్ హౌస్‌లో అడుగుపెట్టాడు. అతడిని చూడగానే కీర్తి కళ్లల్లో ఆనందం కట్టలు తెచ్చుకుంది. వీరిద్దరూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతూ స్టెప్పులేశారు. కీర్తికి తన చిన్ననాటి ఫొటో గిఫ్ట్ ఇవ్వడంతో కంట్లో నుంచి నీళ్లు జలజలా రాలాయి. 'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో అవకాశం ఇచ్చాడు, అదే బిగ్‌బాస్ అని కీర్తిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించాడు. సినిమాల్లో రాణించేందుకు ఇల్లు వదిలేసి వచ్చిన ఇనయ తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఎన్నోసార్లు బాధపడింది. అలాంటిది.. ఆమెను తిరిగి తల్లితో కలిపాడు బిగ్‌బాస్. ఇనయ తల్లిని హౌస్‌లోకి పంపించాడు. ఆమెను చూడగానే కాళ్లమీద పడిపోయింది ఇనయ. గుండెల్ని పిండేసే ఈ ఎమోషనల్ ఎపిసోడ్ చూడాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: కొడుకుతో హౌస్‌లో అడుగుపెట్టిన సిరి యశోద ఓటీటీ విడుదల ఆపాలంటూ ఆదేశం -
శ్రీసత్య వెన్నుపోటు పొడుస్తోంది.. రేవంత్‌కు హింటిచ్చిన ఆడియన్స్!
Bigg Boss 6 Telugu, Episode 79: రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లు కడుపు మాడ్చుకునే పరిస్థితి వచ్చింది. అతడు రేషన్ మేనేజర్ అవడమేంటో కానీ పాలు, అన్నం.. ఇలా అన్నింటికీ కొలతలు పెడుతూ ఇంటిసభ్యులకు సరిగా తిండి పెట్టడం లేదు. గత వారం కెప్టెన్‌గా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనానికి ఎన్ని కప్పుల బియ్యం వండేదానివని ఫైమాను అడిగాడు ఆదిరెడ్డి. అందుకామె ఐదు కప్పులని చెప్పింది. కానీ రేవంత్ నాలుగు కప్పులు మాత్రమే చాలంటున్నాడు. అరకప్పు బియ్యం ఎక్కువ వేయమని శ్రీహాన్ చెప్పినా వినట్లేదని చికాకు పడ్డాడు ఆది. బియ్యం అయిపోయినప్పుడు అడిగితే ఇస్తున్నారని చెప్పింది ఫైమా. ఇదే విషయంపై రేవంత్‌ను నిలదీసింది. అతడు మాత్రం సరిపోతుందా? సరిపోదా? అనవసరం అని, రేషన్ ఎంతుందో దాన్ని బట్టే వండుతానని వితండవాదం చేశాడు. అలాగైతే ఎవరికీ ఆకలి తీరదన్నాడు శ్రీహాన్. నీ కెప్టెన్సీలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కానీ అందరి కడుపు నింపడానికి ఆలోచించట్లేదన్నాడు. మరోపక్క సమయానికి వచ్చి పాలు తాగకపోతే ఆ పూట పాలు మళ్లీ ఇచ్చేదే లేదని రూల్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేసింది ఇనయ. ఇలా ఎప్పటిలాగే రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఫుడ్ గొడవలు జరిగాయి. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి ఇద్దరు సభ్యుల ఫొటోలను షెడ్డర్లో వేయాల్సి ఉంటుంది. ► రోహిత్.. శ్రీహాన్, ఫైమా ► శ్రీసత్య.. రాజ్, రోహిత్ ► రాజ్.. శ్రీహాన్, శ్రీసత్య ► కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్య ► ఫైమా.. రోహిత్, ఇనయ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► ఇనయ.. ఫైమా, రాజ్ ► ఆదిరెడ్డి.. ఇనయ, శ్రీహాన్ ► రేవంత్.. ఫైమా, ఆది రెడ్డి రాజ్ మూడు వారాలుగా సేవ్ అవుతున్నందున అతడిని నామినేట్ చేస్తున్నానంది శ్రీసత్య. ఇందుకు ఒప్పుకోని బిగ్‌బాస్ సరైన కారణం చెప్పమని గద్దించాడు. దీంతో శ్రీసత్య అతడి గేమ్ కనిపించలేదని జవాబు చెప్పి జారుకుంది. ఇక ఇనయ.. తనను గేమ్‌లో పర్సనల్‌గా అటాక్ చేసి తన గేమ్ కనిపించకుండా చేసిన ఫైమాను నామినేట్ చేస్తున్నాననంది. రాజ్ నామీద పగ పెంచుకుని నన్ను నామినేట్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. వీరిద్దరూ తన ఫ్రెండ్స్ అని, వీళ్లను నామినేట్ చేయాల్సి వచ్చేంత దూరం పెరుగుతుందని ఊహించలేదంటూ ఏడ్చింది. వాళ్లు తనను ఫ్రెండ్ అనుకోలేదంటూ బాధపడింది. ఫైనల్‌గా ఈ వారం శ్రీహాన్, ఫైమా,రోహిత్, రాజ్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఇనయ నామినేషన్లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం కిచెన్‌లో మళ్లీ ఫైట్ జరిగింది. రేవంత్‌ను ఆలూ, ఉల్లిగడ్డ ఇవ్వమని కొందరు అడగ్గా కుదరదని తేల్చి చెప్పేశాడు కెప్టెన్. మీరేమనుకున్నా నేనేం చేయలేనని చేతులెత్తేశాడు. తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టైం వచ్చింది. హౌస్ అంతా నీకు సపోర్ట్ చేసి కెప్టెన్‌గా గెలిపించినప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక్కోసారి సపోర్ట్ చేయకపోతే సోలో ప్లేయర్, ఫేవరిటిజం అని పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. మీరు ఆడియన్స్ నుంచి సింపతీ కోరుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకటీరెండు రోజుల వరకే సింపతీ ఉంటుంది. కానీ జీవితాంతం ఉండదు. కళ్ల ముందే ఫేవరిటిజం కనిపించినప్పుడు కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడరని ఎవరిని నమ్ముతున్నారు? రాజ్.. నాగురించి చెడుగా ఎవరూ మాట్లాడరు. మొదట్లో నా రియల్ ఫ్రెండ్స్ సూర్య, ఫైమా, ఇనయ. కానీ ఇనయ నా వెనక గోతులు తవ్వుతుందేమోనని అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. స్నేహితుడిగా ఫీలైన రాజ్ అలా అనడంతో ఇనయ ఏడ్చేసింది. సూర్య వెళ్లిపోయాక వాళ్లిద్దరే మాట్లాడకుండా దూరం పెట్టి నన్ను శత్రువులా చూస్తున్నారు అని కంటతడి పెట్టుకుంది. ప్రశ్న: మీరు ఎప్పుడు ఏం చేస్తారనేది తోటి ఇంటిసభ్యులకే అర్థం కావట్లేదు. దీనికి మీ స్పందన ఏంటి? ఇనయ: మై లైఫ్, మై రూల్స్.. నాకు నచ్చినట్లే ఉంటా, అందుకే అన్‌ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తాను. ప్రశ్న: మీ క్లోజ్ ఫ్రెండ్ మీ గురించి బ్యాక్‌స్టాబింగ్, బిచింగ్ చేస్తుంది. మీకు తెలిస్తే ఏం చేస్తారు? శ్రీసత్య: ముందు బాధపడతాను. నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ను నమ్మి అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అయితే నేను వాళ్లను క్లోజ్ అనుకునే కన్నా వాళ్లు నన్నెంత క్లోజ్ అనుకుంటున్నారనేది ముఖ్యం. బహుశా వాళ్లకు నేనంత క్లోజ్ కాదేమో! నమ్మినవాళ్లు నా వెనకాల మాట్లాడితే నెక్స్ట్ టైం నా దగ్గరకు రానివ్వను. ఇక నాగార్జున చెప్పిన టాస్క్‌ను అమలు చేసే పనిలో పడ్డారు శ్రీసత్య, ఫైమా. అర్ధరాత్రి మేకప్ వేసుకుని రాజ్, శ్రీహాన్‌ను భయపెట్టి మిషన్ కంప్లీట్ చేశారు. చదవండి: మెరీనా పారితోషికం ఎంతో తెలుసా? నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది: యాంకర్ -
ఆ ఒక్క ప్రశ్నతో దొరికిపోయిన కీర్తి, రాజ్ నిందతో ఏడ్చిన ఇనయ
జనాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు.. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతీ కంటెస్టెంటూ చెప్పే మాట ఇది. అలా అని ఇక్కడ ఇలా మాట్లాడకూడదు, అక్కడ అలా ప్రవర్తించకూడదు అని ఎవరూ నోరూ, కాళ్లు చేతులు కట్టేసుకుని కూర్చోలేదు. పైగా తామేం చేసినా రైటే అని, అది జనాలు అంగీకరిస్తారని ఎవరికి వారు ఊహల్లో తేలిపోమారు. ఇప్పుడిప్పుడే వారి కళ్ల ముందు ఏర్పడుకున్న మబ్బులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఆడియన్స్ అడిగే ప్రశ్నలతో ఉలిక్కిపడుతున్నారు హౌస్మేట్స్. ఈ మధ్యే శ్రీసత్య, శ్రీహాన్‌లను వాయించిన ప్రేక్షకులు నేడు రాజ్, కీర్తి, ఇనయల గురించి అడిగేశారు. ఈ క్రమంలో కీర్తికి.. 'ఇతర కంటెస్టెంట్ల సపోర్ట్‌తోనే మీరు కెప్టెన్ అయ్యారు కదా, మరి నాకెవరూ సపోర్ట్ చేయలేదు, సోలో ప్లేయర్ అని ఎందుకంటారు? సింపతీ ట్రై చేస్తున్నారా?' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి కీర్తి.. సింపతీ ఒకటీరెండు రోజులు ఉంటుందే తప్ప జీవితాంతం ఉండదని చెప్పింది. తర్వాత హౌస్‌లో మీ నిజమైన ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనకాల ఎవరు మాట్లాడరని అనుకుంటున్నారని రాజ్‌ను అడిగాడో ఆడియన్. దీనికతడు ఇనయ నా వెనకాల మాట్లాడుతుందనిపిస్తుందన్నాడు. ఒకప్పుడు స్నేహితుడుగా ఉన్న రాజ్ ప్రతిదానికీ తననే తప్పుపడుతుండటంతో తట్టుకోలేక ఏడ్చేసింది ఇనయ. చదవండి: 12వ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
టాప్ 10 కంటెస్టెంట్లలో అట్టడుగు స్థానంలో ఇనయ..
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం టాప్ 10 కంటెస్టెంట్లు మిగిలారు. వీరిలో ఒకరైన మెరీనా నేడు ఎలిమినేట్ కానుంది. దీంతో మిగిలిన తొమ్మిది మందైన రోహిత్, రాజ్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయ, కీర్తి, రేవంత్, ఆదిరెడ్డి,ఫైమా టైటిల్ కోసం పోటీపడనున్నారు. మరి వీరిలో ఎవరు బాటమ్ 5లో ఉంటారో హౌస్మేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు నాగ్. ఈమేరకు రిలీజైన ప్రోమోలో ఒక్కొక్కరు ఒక్కో కంటస్టెంట్ పేరు చెప్పారు. ► ఆదిరెడ్డి.. మెరీనా ► ఇనయ, శ్రీసత్య.. రాజ్ ► రాజ్, ఫైమా.. ఇనయ ► కీర్తి.. ఆదిరెడ్డి ► మెరీనా.. శ్రీహాన్ ► శ్రీహాన్, రోహిత్.. కీర్తి ► రేవంత్.. రోహిత్‌ల పేర్లు చెప్పారు. మెజారిటీ ఇంటిసభ్యులు ఇనయ, రాజ్‌లు ఫినాలే చేరుకోలేరని తేల్చి చెప్పారట. కానీ అనధికారిక పోలింగ్స్ చూస్తే మాత్రం ఇనయ టాప్ 3లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయం తెలిస్తే శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి ఏమైపోతారో చూడాలి! చదవండి: పూర్తిగా గీతూలా మారిన ఆదిరెడ్డి యంగ్ హీరో చెంప పగలగొట్టిన తేజ -
తగ్గేదే లేదంటున్న బిగ్‌బాస్, విన్నర్‌కు మిగిలేది ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 74: వీలైనంత ప్రైజ్‌మనీని తగ్గించాలని బిగ్‌బాస్ కంకణం కట్టుకున్నట్లున్నాడు. కంటెస్టెంట్లు నో చెప్పడానికి వీలు లేని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌కు ఓ రేటు ఫిక్స్ చేశాడు. అలా ప్రైజ్‌మనీలో నుంచి కావాల్సినంత దండుకుంటున్నాడు. ఇంతకీ ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలు తగ్గింది? నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. రివ్యూలు వద్దని స్వయంగా నాగార్జునే చెప్పినా పట్టించుకోని ఆదిరెడ్డి ఈవారం ఎవరు వెళ్తారని సత్యతో డిస్కషన్ పెట్టాడు. దీనికామె క్షణం ఆలోచించకుండా కీర్తి అని చెప్పింది. అటు ఆదిరెడ్డి కూడా నాకూ అలాగే అనిపిస్తోందని వంత పాడాడు. అనంతరం బిగ్‌బాస్.. బీబీ ట్రాన్స్పోర్ట్ అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బీబీ ట్రక్కు సమయానుసారం ఒక్కో స్టాప్ దగ్గర ఆగిపోతుంది. అలా ఆగిన ప్రతిసారి ఎవరైతే ముందు వచ్చి ఎక్కుతారో వారే కెప్టెన్సీ పోటీదారులవుతారు. అయితే ప్రతి స్టాప్‌లో ఆ వాహనం ఎక్కేందుకు ఓ ధర ఉంటుందని, దాన్ని విన్నింగ్ ప్రైజ్‌మనీలో నుంచి తీసేస్తామని చెప్పాడు. దీనితోపాటు ఆ ట్రక్కు ఎక్కలేకపోయిన మిగతా ఇంటి సభ్యులు తమలో కెప్టెన్సీకి అనర్హులుగా భావించే ఇద్దరి పేర్లను చెప్తే వారిలో ఎవరు పోటీలో పాల్గొంటారు? ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారనేది పోటీదారులు నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో ఆదిరెడ్డి గెలవగా అతడు తన కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం లక్ష రూపాయలు వాడతానన్నాడు. ఇక ఇంటిసభ్యులు పోటీలో నుంచి ఎవరిని తప్పిద్దామని చర్చలు మొదలుపెట్టారు. శ్రీహాన్.. రోహిత్ కెప్టెన్‌గా ఇంటిని చూసుకోగలడన్న నమ్మకం లేదన్నాడు. దీనికి రోహిత్ ఆన్సరిస్తూ.. నువ్వు నన్ను కాంపిటీషన్‌గా చూస్తున్నావేమో, అందుకే పక్కన పెడుతున్నావని కౌంటరిచ్చాడు. దీనికి శ్రీహాన్.. అసలు నువ్వు నాకు కాంపిటీషనే కాదని బిల్డప్ ఇవ్వడం గమనార్హం. ఇక కీర్తి.. శ్రీసత్య, శ్రీహాన్ పేరు చెప్పడంతో శ్రీహాన్ వెటకారం మొదలుపెట్టాడు. అలా వీళ్లిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. చివరగా రోహిత్, ఫైమాలను నిల్చోబెట్టగా వీళ్లలో రోహిత్‌కు ఛాన్స్ ఇచ్చి ఫైమాను తొలగించాడు ఆదిరెడ్డి. రెండోసారి రేవంత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఈ రౌండ్లో ప్రైజ్‌మనీలో నుంచి రూ.25 వేలు తగ్గించాడు బిగ్‌బాస్. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, రాజ్‌లను ఎన్నుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్లయిన రేవంత్, ఆది.. శ్రీహాన్‌ను గేమ్‌లో ఉంచాలనుకుని రాజ్‌ను సైడ్ చేశారు. మూడో రౌండ్లో రోహిత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఇందుకుగానూ రూ.45,000 కట్ చేశాడు. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, శ్రీసత్యలను నిలబెట్టగా కెప్టెన్సీ కంటెండర్లు శ్రీహాన్‌ను గేమ్‌లో కంటిన్యూ చేయనున్నట్లు ప్రకటించారు. నాలుగో రౌండ్లో శ్రీహాన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలవగా ఇందుకోసం రూ.30,000 కోత పెట్టాడు బిగ్‌బాస్. కంటెండర్లు మెరీనాను ఆటలో కంటిన్యూ చేసి కీర్తిని సైడ్ చేశారు. ఐదో రౌండ్లో కంటెండర్‌షిప్ కోసం పోటీపడేందుకు రూ.70 వేలు పెట్టాడు బిగ్‌బాస్. ఈసారి ఇనయ ముందుగా ట్రక్ ఎక్కి కంటెండర్‌గా నిలిచింది. మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ద్వారా రూ.3 లక్షలు కోత పెట్టడంతో ప్రైజ్‌మనీ రూ. 41,00,300 చేరింది. తర్వాత శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీహాన్, శ్రీసత్య మాట్లాడుకున్నప్పుడు నేను ఆటలో అరటిపండు అయ్యాననే టైంలో రాజ్ క్లోజ్ అయ్యాడన్నాడు రేవంత్. ఆ మాటతో మండిపడ్డ శ్రీహాన్.. మేము మాట్లాడుకునేటప్పుడు నిన్ను రావద్దని అనలేదు కదా? అని ప్రశ్నించాడు. నేనేదో చాలా సాధారణంగా అన్నానని రేవంత్ అన్నా సరే శ్రీహాన్ వినిపించుకోలేదు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తున్నామన్నట్లుగా చెప్తున్నావని సీరియస్ అయ్యాడు. అటు శ్రీసత్య కూడా మధ్యలో అందుకుంటూ.. ఇప్పుడేంటి, నేను శ్రీహాన్‌తో ఎక్కువగా మాట్లాడొద్దు, అంతే కదా అని సూటిగా అడిగేసింది. చిన్నమాటను ఎక్కడికో తీసుకువెళ్తున్నారని భావించిన రేవంత్ గొడవ చేయడం ఎందుకని సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఇనయ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో రేవంత్ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది! చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఓటీటీలో ప్రిన్స్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
ప్రైజ్‌మనీలో మళ్లీ కోత! వాళ్లే కెప్టెన్సీ కంటెండర్స్!
ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అని ఫీలైనట్లున్నాడు బిగ్‌బాస్. మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, మీలో ది బెస్ట్ కంటెస్టెంట్‌కు అర కోటి ప్రైజ్‌మనీ ఇస్తానన్నాడు. కానీ ఎక్కడా? ఆదిరెడ్డి అన్నట్లు ఈ సీజన్లో ఎక్కువగా తుప్పాస్ కంటెస్టెంట్లే ఉన్నారు. బాగా ఆడి టీఆర్పీలు పెంచమంటే ఎవరికి వారు పిక్నిక్కు వచ్చినట్లు రిలాక్స్ అయ్యారు. దీంతో సీజన్‌కు చెడ్డపేరు వచ్చింది. ఫలితంగా బిగ్‌బాస్‌కు కోపం వచ్చింది. ఇంకేముంది.. ప్రైజ్‌మనీకి కత్తెర పెట్టే పనులు చేస్తున్నాడు. ఇప్పటికే నామినేషన్స్‌లో ఒకరిని సేవ్ చేయడం, బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ఓడిపోవడంతో ప్రైజ్‌మనీ రూ.50 లక్షల నుంచి రూ.44,00,300కి చేరింది. తాజాగా బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ కూడా డబ్బులతో ముడిపెడుతూ మీ అర్హతను కొనుక్కోమన్నాడు. ఐదో సీజన్లో పెట్టిన ట్రక్కు టాస్క్‌ను కొద్దిగా అటూఇటూ మార్చి మళ్లీ అదే టాస్క్ ప్రవేశపెట్టాడు. ఈ గేమ్‌లో ఇనయ, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో ఇనయ, రోహిత్ ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవనేలేదు. మరి ఈసారైనా వీరికి ఛాన్స్ వస్తుందేమో చూడాలి! ఇకపోతే ఈ టాస్క్ విలువ రెండు లక్షలని తెలుస్తోంది. మరి ఈ టాస్క్ గెలిచి ప్రైజ్‌మనీని కాపాడుకున్నారా.. మరో రెండు లక్షలు పోగొట్టుకున్నారా? తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఇంటి అద్దె కట్టలేక కష్టాలు, ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు: ఫైమా బిగ్‌బాస్ 6 విన్నర్ తానే అని గాల్లో తేలిపోతున్న ఆదిరెడ్డి -
చెత్త రీజన్స్, చెత్త నామినేషన్స్.. కాకపోతే ఓ ట్విస్ట్!
Bigg Boss 6 Telugu, Episode 72: బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 10 కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మీదట గేమ్ మరింత రంజుగా మారనుంది. అసలైన నామినేషన్స్ హీట్ ఇప్పుడు మొదలు కానుంది అనుకుంటే అంతా తలకిందులైంది. ఈరోజు నామినేషన్స్ అసలు నామినేషన్స్లానే లేవు. ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్లుగా నువ్వు నాకు వేశావు, నేను నీకు వేస్తున్నా అన్నట్లుగా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే ఇది చదివేయండి.. నాకు బాగా క్లోజ్ అయినవారందరూ వెళ్లిపోతున్నారు. గీతూ, బాలాదిత్య ఇద్దరూ వెళ్లిపోయారు, అంటే నేను కూడా వెళ్లిపోతానని హింటిస్తున్నావా బిగ్‌బాస్? అని తనలో తనే మదనపడ్డాడు ఆది రెడ్డి. అనంతరం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంట్లో ఉండి వ్యర్థం అనుకున్న ఇద్దరు ఇంటిసభ్యులపై చెత్త బుట్ట గుమ్మరించాలన్నాడు బిగ్‌బాస్. ముందుగా ఫైమా.. బూతు మాట్లాడావంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. రోజులు గడిచేకొద్దీ నీ కసి కోపంగా మారుతోంది. గేమ్‌ను పర్సనల్‌గా తీసుకుని కావాలని ఫిజికల్ అవుతున్నావంటూ ఇనయపై చెత్త గుమ్మరించింది. ► ఆదిరెడ్డి.. శ్రీహాన్, రోహిత్ ► ఇనయ.. ఆదిరెడ్డి, రాజ్ ► శ్రీహాన్.. రోహిత్, కీర్తి ► మెరీనా.. రేవంత్, ఇనయ ► రాజ్.. మెరీనా, ఇనయ ► శ్రీసత్య.. ఇనయ, కీర్తి ► రోహిత్.. రేవంత్, ఆదిరెడ్డి ► కీర్తి.. శ్రీసత్య, మెరీనా ► రేవంత్.. రోహిత్, మెరీనాలను నామినేట్ చేశారు. ఈ నామినేషన్స్‌లో కీర్తి- శ్రీసత్యల మధ్య ఇగో ఫైట్ నడిచింది. గేమ్ ఓడిపోయిన కోపంలో బూతులు మాట్లాడాడన్న కారణంతోనే రోహిత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అటు ఇనయది కూడా అదే పరిస్థితి. ఆవేశంలో నోటి నుంచి బూతులు వచ్చేస్తున్నాయి, కాస్త చూసుకోమని హెచ్చరించారు ఇంటిసభ్యులు. అంతకు మించి పెద్దగా వాదనలేమీ జరగలేదు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్ ఫైమా మినహా ఇనయ, రోహిత్, మెరీనా, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, రాజ్‌లు నామినేషన్లో ఉన్నారు. కాకపోతే ఓటింగ్ లైన్లు రేపు రాత్రి ఓపెన్ కానున్నాయి. అంటే నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ సువర్ణావకాశం ఇవ్వనున్నాడు బిగ్‌బాస్. మరి ఈ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి! చదవండి: బాలాదిత్య, వాసంతిల పారితోషికం ఎంతో తెలుసా? సినిమాలకు బ్రేక్, హీరో షాకింగ్ నిర్ణయం -
ప్రతిసారి నేనే బాధితుడిగా మారాల్సి వస్తోంది: రేవంత్
నామినేషన్స్ వచ్చాయంటే చాలు ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ప్రవర్తిస్తారు హౌస్మేట్స్. ఎక్కడెక్కడినుంచో ఏవేవో కారణాలు వెతికి పట్టుకుని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో మాటల యుద్ధాలు కూడా జరుగుతాయి. కానీ నామినేషన్ ప్రక్రియ ముగియగానే అందరూ తిరిగి మామూలవడమే ఒక మ్యాజిక్‌గా అనిపిస్తుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా నామినేషన్స్‌కు సంబంధించి మరో ప్రోమో రిలీజైంది. ఇందులో రాజ్.. వాసంతి నా గురించి మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు, నీకెందుకు? అని ఇనయను నిలదీశాడు. దీనికామె.. తనకేదనిపిస్తే అది చెప్పేస్తానంది. అంటే నువ్వు ఏం సోది చెప్పినా మేమందరం కూర్చుని వినాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆవేశంలో బూతు మాటలు అనేస్తున్నావని ఇనయను నామినేట్ చేసింది శ్రీసత్య. ఎవరి వల్ల కెప్టెన్సీ గేమ్ ఓడిపోయాడో ఆ ఇద్దరినే(రేవంత్, ఆది రెడ్డిని) నామినేట్ చేశాడు రోహిత్. సంచాలక్‌గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నావంటూ రేవంత్‌ను నామినేట్ చేసింది మెరీనా. ఇక రేవంత్ వంతు రాగా.. ఈ హౌస్‌లో ప్రతి చిన్న పాయింట్ పట్టుకుని నామినేట్ చేస్తున్నారు. అలా చిన్నపాటి విషయాలకు కూడా నామినేట్ చేసిన సందర్భాల్లో 70% నేనే బాధితుడిని అవుతున్నా అని చెప్పుకొచ్చాడు. చదవండి: అందంలో బుట్టబొమ్మ ఆటలో ఉత్త బొమ్మ.. పరువు తీసిన యాంకర్ -
వాసంతి ఎలిమినేట్, ఆ ముగ్గురే తన ఫేక్ ఫ్రెండ్స్!
Bigg Boss 6 Telugu, Episode 71: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 21 మందితో మొదలైంది. పది వారాలు గడిచేసరికి 11 మంది ఎలిమినేట్ అవగా హౌస్‌లో ప్రస్తుతం పది మంది మాత్రమే మిగిలారు. దీంతో బిగ్‌బాస్ షో మరింత రసవత్తరంగా మారనుంది. ఇకపోతే ఈరోజు గ్లామర్ ఆఫ్ ది హౌస్ వాసంతి ఎలిమినేషన్ ఎలా జరిగింది? ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చాక ఏం మాట్లాడింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! ఎప్పటిలాగే సండే ఫండే అనేమాటకు కట్టుబడి నాగ్ హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించాడు. ఇందుకోసం రేవంత్, ఇనయ, మెరీనా, రాజ్, ఫైమాలను A టీమ్‌గా.. కీర్తి, శ్రీహాన్, రోహిత్, వాసంతి, శ్రీసత్యలను B టీమ్‌గా విడగొట్టాడు నాగ్. మొదట ఆడించిన ఫన్ గేమ్‌లో టీమ్ A (రేవంత్) గెలిచింది. తర్వాత కనుక్కోండి చూద్దాం అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్‌మేట్స్‌తో పాటు సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటో చూపించి అదెవరో కనుక్కోవాలన్నాడు. తప్పు సమాధానం చెప్పినవారికి చిత్రవిచిత్ర పనిష్మెంట్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో రాంగ్ ఆన్సర్లిచ్చిన ఫైమా.. ముగ్గురు కంటెస్టెంట్లు అయిన బాలాదిత్య, రేవంత్, రాజ్‌లను ఇమిటేట్ చేసి నవ్వించింది. తర్వాత వాసంతి గోడకుర్చీ వేసి ఎనిమిదవ ఎక్కం చదివింది. కానీ ఇక్కడ కూడా తప్పు చదివి నవ్వులపాలైంది. ఆ తర్వాత తప్పు జవాబు చెప్పిన ఇనయ, కీర్తి కోడిలా గెంతుతూ పాట పాడారు. రెండో గేమ్‌లో కూడా B టీమ్‌పై A టీమ్ విజయం సాధించింది. దీంతో A టీమ్‌కు గిఫ్ట్ హ్యాంపర్ అందించారు. నాగార్జున నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి వాసంతి, మెరీనా ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరిలో వాసంతి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. హౌస్‌ను వీడేందుకు మనసొప్పని వాసంతి కన్నీళ్లతో బయటకు వచ్చేసింది. స్టేజీపైకి వచ్చిన వాసంతితో.. 5 ఫేక్ ఫ్రెండ్స్, 5 బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని గేమ్ ఆడించాడు. దీనికి ఆమె ఐదుగురు పేర్లు చెప్పలేనంటూ మెరీనా, ఇనయ, రేవంత్, కీర్తి తన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. ఫైమా, ఆదిరెడ్డి, రాజ్ ఫేక్ ఫ్రెండ్స్ అని పేర్కొంది. వాసంతి ఎలిమినేషన్‌తో హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. మీ పది మందిలో ఒకరే విజేత అని, వారికి రూ.50 లక్షల బహుమతి ఉంటుందని ప్రకటించాడు నాగ్. మరి ఈ టాప్ 10 కంటెస్టెంట్ల నెక్స్ట్ గేమ్ ఎలా ఉండనుంది? ఎవరు టాప్ 5కి చేరువవుతారు? ఎవరు విన్నర్‌గా నిలిచి అర కోటి రూపాయలు అందుకుంటారో చూడాలి! చదవండి: పేరెంట్స్ గుండెల మీద తన్నాను, తప్పు తెలిసి అమ్మ కాళ్ల మీద పడ్డా: సూర్య ఎవరు చేసిన పనికి వాళ్లే బాధ్యులు.. గీతూ ఎలిమినేషన్‌పై బాలాదిత్య కామెంట్స్ -
ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావు, మరి నిన్నేమనాలి?: నాగ్
తమ్ముడు తమ్ముడే పేకాట పకాటే అనే సూత్రాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు బిగ్‌బాస్ హౌస్మేట్స్. గేమ్ కోసం రిలేషన్స్‌ను పక్కనపెట్టడం ఓకే కానీ తోటి కంటెస్టెంట్లను శత్రువులా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కోపంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఈ ధోరణి ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లోనే అధికంగా ఉంది. తాజాగా ఈ వైఖరిని తప్పుపట్టాడు నాగార్జున. నామినేషన్స్‌లో ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అనడం చాలా పెద్ద తప్పని ఇనయను హెచ్చరించాడు. కోపంలో ఏదైనా అనేస్తావా? అని ఆమె తీరును ఎండగట్టాడు. ఆటలో ఓడిపోతే బూతులు మాట్లాడతావా? ఫైమా ప్రొఫెషన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన నిన్ను ఏమని పిలవాలని నిలదీయడంతో ఆమె సమాధానం చెప్పలేక తల దించుకుంది. ఇక రేవంత్ సంచాలక్‌గా చాలా కన్ఫ్యూజ్ అయ్యాడని స్వయంగా నాగార్జునే చెప్పుకొచ్చాడు. సంచాలక్‌గా రేవంత్ సరిగానే వ్యవహరించాడా? అని నాగ్ అడగ్గా ఆదిరెడ్డి ఒక్కడే కరెక్ట్‌గానే ఉన్నాడని ఆన్సరిచ్చాడు. దీంతో హోస్ట్.. నీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి అతడు కరెక్టా? అని అడగడంతో ఆది అయోమయం ఫేస్ పెట్టాడు. ఇంతలోనే రేవంత్‌ను ఉద్దేశించి.. బిగ్‌బాస్ పెట్టిన రూల్స్‌కు వ్యతిరేకంగా వెళ్లొద్దు. సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయ్యావు అని అతడికి అర్థమయ్యేలా చెప్పాడు. చదవండి: వాళ్లది తొండి గేమ్, ఫైమాకు వెటకారం ఎక్కువ: కమెడియన్ షాకింగ్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్, వెళ్లిపోయేదెవరంటే? -
జైల్లో ఇనయ, వదిలేస్తే టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారే!
Bigg Boss 6 Telugu, Episode 69: గీతూ వెళ్లిపోయాక ఆదిరెడ్డి మరీ విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి అతడి మాటలు, ఆట చూస్తుంటే గీతూ పూనినట్లే అనిపిస్తోంది. ఇనయ మీద నోరేసుకుని పడిపోయి అనవసరంగా ఆమెకు హైప్ ఇస్తున్నాడు ఆది. హౌస్‌లో అందరూ ఇనయ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నా బయట తనకది పాజిటివ్ అవుతుండటం గమనార్హం. నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. కెప్టెన్సీ టాస్క్‌లో ఆదిరెడ్డి, ఫైమా కలిసి ఆడారని ఇనయ ఆరోపించింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆది.. 'అసలు నీకు బ్రెయిన్ ఉందా? నేను ఫైమాతో ప్లాన్ చేశానని తేలితే బిగ్‌బాస్ వదిలి వెళ్లిపోతా' అని సవాలు విసిరాడు. అటు ఫైమా కూడా.. నువ్వు ఎంత ఒర్రినా ఎక్కువ రోజులుండవులే అని శివాలెత్తింది. సంచాలక్ కన్ఫ్యూజన్కు శ్రీసత్యకు చిర్రెత్తిపోయింది. కళ్ల ముందు తనను లాగుతున్నా ఏమీ అనకుండా నిల్చుండిపోయాడని రేవంత్‌పై అసహనం వ్యక్తం చేసింది. చివరగా ఈ పోటీలో ఫైమా గెలిచి కొత్త కెప్టెన్‌గా అవతరించింది. గెలవగానే ఫైమా ఇనయను పట్టుకుని ఏడ్చేసింది. ఇది చూసి షాకైన హౌస్మేట్స్ ఇప్పుడే గొడవ పెట్టుకున్నారు, అప్పుడే కలిసిపోయారా? అని ఆశ్చర్యపోయారు. రాత్రి రేవంత్, రాజ్ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో శ్రీహాన్‌ను మధ్యలోకి లాగుతూ.. నేను గెలిస్తే రావు, కానీ సత్య గెలిస్తే దుప్పటి పట్టుకుని మరీ తన దగ్గరకు వెళ్లిపోతావు అని కామెంట్ చేశాడు. ఇది శ్రీహాన్ సరదాగా తీసుకోలేకపోయాడు. కామెడీగా అయినా సరే, ఏది పడితే అది అనేయకు అని హెచ్చరించాడు. అలా నోటికొచ్చింది మాట్లాడితే నీకు, ఇనయకు తేడా ఏంటని ప్రశ్నించాడు. దీనికి రేవంత్.. తానసలు ఆ మాటే అనలేదని బుకాయించాడు. అనంతరం బిగ్‌బాస్ ఈవారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమన్నాడు. ముందుగా ఫైమా.. వాసంతికి; ఇనయ, కీర్తి.. రోహిత్‌కు; వాసంతి, మెరీనా.. కీర్తికి; రాజ్.. శ్రీసత్యకు స్టాంప్ వేశారు. సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయ్యావంటూ రేవంత్‌కు స్టాంప్ వేశాడు బాలాదిత్య. సంచాలక్‌గా నువ్వు గేమ్ మధ్యలో రూల్స్ మార్చావు, ముందు వారాల్లో కంటే ఇప్పుడు నీలో చాలా మార్పు కనిపించింది. ఈ వారం నీలో ఏదీ నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్ వేసింది శ్రీసత్య. అటు ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్.. ఇనయకు స్టాంపేశారు. తర్వాత రేవంత్ వంతు రాగా.. అరవడం గురించి మీరు నాతో పోల్చుకున్నారు. అది నచ్చలేదు. రాత్రి నీ గురించి మాట్లాడుకున్నాం అన్నావు, అది నీ భ్రమ అంటూ తిరిగి శ్రీసత్యకు స్టాంప్ గుద్దాడు. ఎక్కువగా ఇనయకు ఓట్లు పడటంతో ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేసి జైలుకు పంపించారు. అయితే హౌస్మేట్స్ ఆమెతో ఎంత గొడవపడితే బయట ఆమెకు అంత మద్దతు పెరుగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో ఆమెను ఏకంగా జైలుకే పంపించి ఇనయకు మరింత హైపిచ్చారు. చూస్తుంటే అందరూ కలిసి ఇనయకు టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారు. చదవండి: బిగ్‌బాస్, నాగార్జున నేనే తోపు అన్నట్లు పొగిడారు: గీతూ డ్రైవర్‌కు రూ.15 లక్షల సాయం చేసిన బన్నీ, ఎందుకో తెలుసా? -
శ్రీసత్యకు ఇచ్చిపడేసిన రేవంత్, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీ దాదాపు ముగిసినట్లే! లైవ్ టెలికాస్ట్‌లో ఫైమా కెప్టెన్‌గా అవతరించింది. ఇక మిగిలిందల్లా వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోవడమే! ఈమేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో వరస్ట్ ఇంటిసభ్యులను ఎంచుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్. సంబంధం లేని విషయాల్లో తలదూర్చుతోందని ఇనయకు స్టాంప్ గుద్దాడు ఆదిరెడ్డి. రోహిత్ కూడా ఇనయను చెత్త కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు. ముందు వారాలతో పోలిస్తే ఈవారం నీలో మార్పు కనిపించిందని, అది నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్ గుద్దింది శ్రీసత్య. ఏం మార్పు, ఏమైనా లావయ్యానా? అని రేవంత్ సెటైర్ వేయగా ఈ వెటకారమే నచ్చలేదంది శ్రీసత్య. తర్వాత రేవంత్ వంతు రాగా.. ఎవరెంత అరుస్తారో అందరికీ తెలుసు, మీరు నాతో పోల్చుకోవడం నాకు నచ్చలేదు అంటూ శ్రీసత్యకు స్టాంప్ వేశాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. కెప్టెన్సీ టాస్క్‌లో అంత అన్యాయం చేసిన రేవంత్‌ను వదిలేసి రోహిత్.. ఇనయకు ఓటేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ సగం తెలివితేటల వల్లే కెప్టెన్సీ పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అలాగే రేవంత్.. ఇన్నాళ్లకు సత్య నిజస్వరూపం తెలుసుకున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అతడి ఫ్యాన్స్. మరి ఎవరు వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలుకెళ్లారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: చెత్త సంచాలక్, రోహిత్‌కు అన్యాయం -
గీతూ అలానే వెళ్లిపోయింది, ఇప్పుడు మీరు మొదలుపెట్టారా?: ఇనయ
బిగ్‌బాస్ హౌస్‌లో పదకొండో వారం కెప్టెన్‌గా ఫైమా ఎన్నికైనట్లు ఆల్రెడీ లైవ్‌లో ప్రసారమైంది. కానీ ప్రధాన ఎపిసోడ్లో మాత్రం ఇంకా కెప్టెన్సీ పోటీనే చూపిస్తూ సాగదీస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో అయోమయం రేవంత్‌ను సంచాలక్‌గా పెట్టడంతో ఆటను గందరగోళం చేసి పడేశాడు. కీర్తి సర్కిల్లో నుంచి కాళ్లు బయటపెట్టినా ఆమెను సేవ్ చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి కీర్తి బ్యాగు కింద పెట్టడంతో ఆమెను రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. అలాగే ఫైమా సర్కిల్ దాటి బయటకు వచ్చినా తను అవుట్ అని ప్రకటించలేదు. గోనెసంచిని చేత్తో పట్టుకోవద్దని రూల్ పెట్టిన రేవంత్.. ఆదిరెడ్డి తన మోచేత్తో బ్యాగును పట్టుకుంటే శిలా విగ్రహంలా చూస్తూ ఉండిపోయాడు. రూల్స్ కరెక్ట్‌గా ఫాలో అయిన రోహిత్‌ను అవుట్ చేశాడు. ఇలా రేవంత్ కన్ఫ్యూజన్తో సరిగ్గా ఆడినవారు పోటీనుంచి వైదొలగిపోగా ఫైమా కెప్టెన్‌గా అవతరించింది. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేసుకున్నారని ఇనయ.. ఆదిరెడ్డి, ఫైమాలపై మండిపడింది. గీతూ అలానే ఇద్దరిని గెలిపించి వెళ్లిపోయింది, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు అని విమర్శలు గుప్పించింది. దీనికి ఆది.. నేను ఫైమాతో ప్లాన్ చేసి ఆడినట్లు తేలితే బిగ్‌బాస్ నుంచే వెళ్లిపోతానని శపథం చేశాడు. చదవండి: రేవంత్ చెత్త సంచాలక్, రోహిత్‌కు తీవ్ర అన్యాయం -
Bigg Boss 6: ఫైర్ పుట్టించిన ఇనయా-ఫైమా ఫైట్.. జుట్టూ జుట్టూ పట్టుకొని దన్నులాట!
బిగ్‌బాస్ హౌస్‌లో పదోవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రసవత్తరంగా సాగింది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘పాము- నిచ్చెన’ ఆట ఇచ్చాడు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయి మట్టితో పాము, నిచ్చెనలను కట్టాలి. రేవంత్, రాజ్,ఇనయా, మెరీనా, బాలదిత్య, శ్రీసత్య నిచ్చెన టీమ్‌లో ఉండగా.. మిగిలిన సభ్యులు పాముల టీమ్‌లో ఉన్నారు. . నిచ్చెనల టీమ్ నుంచి ఇనాయాను సంచాలక్‌గా నియమించగా.. పాముల టీమ్ నుంచి ఫైమాను సంచాలక్‌గా ప్రకటించారు. ఇరు జట్లు బంకమట్టి సంపాదించిన పాములు, నిచ్చెనలు తయారు చేయాలి. సమయానుసారం ఒక టీమ్ సభ్యుడు.. మరో టీమ్‌లో తనకిష్టమైన సభ్యుడిని ఎంచుకుని వారి నుంచి బంకమట్టిని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీంతో పాముల టీమ్ నుంచి కీర్తి.. నిచ్చెనల టీమ్‌లోని రాజ్‌ను ఎంచుకుని అతడి బంకమట్టిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అసలే గాయంతో విలవిల్లాడుతున్న కీర్తి..బలవంతుడైన రాజ్‌ని ఎంచుకొని తప్పు చేసింది. అతని నుంచి కొంచెం మట్టిని కూడా కీర్తి తీసుకోలేకపోయింది. నొప్పి కంటే ఎక్కువగా దీని కారణంగా ఆడలేకపోతున్నా బిగ్‌బాస్ అంటూ ఎమోషనల్ అయింది. . అనంతరం నిచ్చెనల టీమ్ నుంచి శ్రీసత్య బంకమట్టి దొంగతనానికి బయల్దేరుతుంది. పాముల టీమ్ నుంచి వాసంతిని ఎంచుకుంటుంది. అయితే వాసంతి మాత్రం కొంచెం మట్టిని కూడా వదులుకోలేదు. శ్రీసత్యని గట్టిగా పట్టుకొని కిందపడేసి మట్టిని ముట్టుకోకుండా చేసింది. అనంతరం తక్కువ మట్టి ఉన్న శ్రీసత్య(నిచ్చెన టీమ్), రోహిత్(పాముల టీమ్)లను ఆట నుంచి తప్పించారు. ఇంతలో బిగ్‌బాస్.. ఈ టాస్క్ చివరి రౌండ్ మరి కాసేపట్లో ముగుస్తుందని, ఇరుటీమ్ సభ్యులు ఎవరు ఎవరి మట్టినైనా దొంగిలించొచ్చు అని బిగ్‌బాస్ చెప్పడంతో అంతా రెచ్చిపోయారు. ముఖ్యంగా ఇనయా, ఫైమాల ఫైట్ హైలెట్‌గా నిలిచింది. ఇనయాను టార్గెట్ చేసిన ఫైమా.. ప్రతిసారి ఆమె మట్టిని కొట్టేసేందుకే ప్రయత్నించింది. దీంతో ఇనయా శివంగిలా పోరాటం చేసింది. ఫైమాను ఈడ్చి ఈడ్చి పడేసింది. అలాగే ఫైమా కట్టిన పాము నుంచి మట్టిని లాక్కునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇనయా, ఫైమాలు కిందపడి ఒకరినొకరు జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు.. ఇనయా అయితే ఫైమా రెండు చేతులను వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది. ‘ఇనయా తప్పు చేస్తున్నావు.. చేయి విరిగిపోతుంది’ రేవంత్ చెప్పినా వినలేదు. ఒకరినొకరు అడ్డుకునే క్రమంలో ఇద్దరి దుస్తులు కూడా చిరిగిపోయాయి. అయినా ఎక్కడా తగ్గలేదు. మరోవైపు శ్రీహాన్ కూడా ఇనయానే టార్గెట్ చేశారు. తన నిచ్చెనను కాపాడేందుకు ఎంతమంది సాయం అడిగినా ఎవరూ రాలేదు. ఈ టాస్క్‌లో చివరివరకు ఒంటరి పోరాటం చేసినా ఇనయా.. తక్కువ మట్టి ఉన్న కారణంగా ఔట్ అయింది. అయితే పాముల టీమ్‌ను నుంచి ఒకరిని తొలగించాల్సిన అవకాశం వచ్చినా.. ఫైమా, శ్రీహాన్‌లలో ఒకరిని కాకుండా జన్యూన్‌గా వాసంతిని తప్పించింది. అనంతరం పాము-నిచ్చెన టాస్క్ ఇంతటితో ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించారు. మరి ఈ టాస్క్‌లో గెలిచి ఎవరు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 6: ‘బిగ్‌బాస్’హౌస్‌లో తన్నులాట..ఫైమాను ఈడ్చి పడేసిన ఇనయా!
బిగ్‌బాస్ హౌస్‌లో మొన్నటివరకు ఇనయా, ఫైమా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. సూర్య హౌస్‌లో ఉన్నంత కాలం వీరంతా కలిసి మెలిసి గేమ్ ఆడారు. ఎప్పుడైతై సూర్య ఎలిమినేట్ అయ్యాడో.. అప్పటి నుంచి ఫైమా, ఇనయాల మధ్య దూరం పెరిగింది. పదో వారం కెప్టెన్సీ టాస్క్ వీరిద్దరిని మరింత దూరం చేసినట్లు తెలుస్తుంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘పాము- నిచ్చెన’ ఆట ఇచ్చాడు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయి మట్టితో పాము, నిచ్చెనలను కట్టారు. ఈ క్రమంలో ఇనయా, ఫైమా గొడవకు దిగినట్లు తెలుస్తోంది. తాను కట్టిన నిచ్చెన నుంచి మట్టిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఫైమాను..ఇనయా ఈడ్చి బయటకు నెట్టేసింది. అలాగే ఫైమా కట్టిన పాము నుంచి మట్టిని లాక్కునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇనయా, ఫైమాలు కిందపడి ఒకరినొకరు జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు.. ఇనయా అయితే ఫైమా రెండు చేతులను వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది. ‘ఇనయా తప్పు చేస్తున్నావు.. చేయి విరిగిపోతుంది’ రేవంత్ చెప్పినా వినలేదు. చివరకు బిగ్‌బాస్ ఆదేశాలతో ఇనయాను గేమ్ నుంచి ఔట్ చేసింది ఫైమా. దీంతో ‘ఈ హౌస్‌లో వరస్ట్ గేమర్ ఫైమా’అంటూ ఇనయా ఇంట్లోకి వెళ్లిపోయింది. మరి టాస్క్‌లో గెలిచి ఎవరు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
శ్రీసత్య, శ్రీహాన్ ఓవరాక్షన్.. ఇనయ సోది మొహమన్న ఫైమా
Bigg Boss Telugu 6, Episode 65: చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ షో మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. గేమ్ ఆడుతున్న గీతూ ఎందుకు ఎలిమినేట్ అయిందో అర్థం కాక జుట్టు పీక్కున్నారు మిగతా కంటెస్టెంట్లు. బిగ్‌బాస్ షో పదోవారంలోకి ఎంటరయ్యేసరికి హౌస్‌లో పన్నెండు మంది మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల ముఖాలపై గ్లాసు నీళ్లు పోయాన్నాడు బిగ్‌బాస్. కెప్టెన్ శ్రీసత్యను నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టమని ఆదేశించాడు. ► శ్రీసత్య.. బాలాదిత్య, ఇనయ ► ఆదిరెడ్డి.. ఇనయ, రేవంత్ ► వాసంతి.. ఇనయ, ఆదిరెడ్డి ► రేవంత్.. వాసంతి, ఆదిరెడ్డి ► కీర్తి.. శ్రీహాన్, ఇనయ ► బాలాదిత్య.. శ్రీహాన్, ఇనయ ► మెరీనా.. ఆది రెడ్డి, ఇనయ ► రాజ్.. ఇనయ, శ్రీహాన్ ► రోహిత్.. రేవంత్, ఆదిరెడ్డి ► ఫైమా.. వాసంతి, మెరీనా ► శ్రీహాన్.. కీర్తి, ఇనయ ► ఇనయ.. ఫైమా, శ్రీహాన్‌లను నామినేట్ చేసింది. అత్యధికంగా ఇనయకు ఎక్కువ నామినేషన్ ఓట్లు పడ్డాయి. గేమ్ కసిగా ఆడటం తప్పు కాదు, కానీ కంటెస్టెంట్ల మీద అగ్రెసివ్ చూపించకు. నీ వల్ల ఇప్పటికీ నా చేయి నొప్పిగా ఉంది. ఇనయను లాగి పడేశావు. అలాగే ఎంత కోపంలో ఉన్నా కూడా నోరు జారకూడదు అని హెచ్చరించాడు ఆదిరెడ్డి. అవతలివాళ్లను హర్ట్ చేసేంత కసి మంచిది కాదు అని సలహా ఇచ్చాడు. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో గీతూ చేసిన పనికి ఆదిరెడ్డి మైక్ విసిరేయడంతో అతడి టీమ్ గెలుపుకు ఒక దూరంలో ఆగిపోయింది. ఇదే కారణం చెప్పి బ్లూ టీమ్‌లోని సభ్యులు అతడిని నామినేట్ చేశారు. దీంతో ఆది.. 'తప్పంతా బిగ్‌బాస్‌ది. ఆయన్ను నామినేట్ చేయాలి. మన టీమ్‌కు బిగ్‌బాస్ అన్యాయం చేశాడు. మన టీమ్ ఓడిపోవడానికి బిగ్‌బాసే కారణం' అని ఫ్రస్టేట్ అయ్యాడు. ఓపక్క నామినేషన్స్ జరుగుతుంటే శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ వెకిలి చేష్టలు చేస్తూ పడీపడీ నవ్వుతుండటంతో బిగ్‌బాస్ సీరియసయ్యాడు. ఆ జోకేంటో బయటకు చెప్తే మిగతావాళ్లు కూడా నవ్వుతారు అని గద్దించాడు. నామినేషన్ ప్రక్రియకున్న మర్యాదను కనీసం కెప్టెన్ అయినా కాపాడితే బాగుంటుందనడంతో శ్రీసత్య సారీ చెప్పింది. ఇక ఇనయ, ఫైమాలు నామినేషన్లో వాదులాటకు దిగారు. నువ్వు నాకు నచ్చలేదంటే నాకు నచ్చలేదని ఒకరినొకరు తిట్టుకున్నారు. నువ్వు వెనక మాట్లాడుతావు, ఫేక్.. ఈ హౌస్‌లో ఎవరికీ నచ్చవు. సినిమాలో యాక్టింగ్ చేయు, ఇక్కడ కాదు. మనిషిని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు, సోది ముఖం అంటూ ఇనయను నానా తిట్టిపోసింది ఫైమా. ఆమె అనే మాటలకు రివర్స్ కౌంటరిస్తూ పోయింది ఇనయ. ఫైనల్‌గా పదో వారం బాలాదిత్య, మెరీనా, కీర్తి, ఫైమా, వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయ నామినేట్ అయ్యారు. చదవండి: చచ్చేదాకా రుణపడి ఉంటా: గీతూ పోస్ట్ వైరల్ కంటెంట్ క్వీన్ గీతూ ఎలిమినేషన్‌కు ఇవే కారణాలు -
బిగ్‌బాస్: బద్ధ శత్రువుల్లా మారిపోతున్న దోస్తులు!
ఎప్పుడైతే ఆర్జే సూర్య బయటకు వెళ్లిపోయాడో అప్పటినుంచి గేమ్.. హౌస్ వర్సెస్ ఇనయగా మారింది. గతవారం నామినేషన్స్‌లో ఇనయ హైలైట్ అవగా ఈసారి కూడా అదే జరిగేట్లు కనిపిస్తోంది. అత్యధికంగా ఇనయకు ఎక్కువ నామినేషన్ ఓట్లు పడనున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దోస్తుల మధ్య శత్రుత్వం పెరుగుతున్నట్లుంది. మొన్నటివరకు ఫ్రెండ్స్ అనుకున్న ఫైమా, ఇనయ రోజురోజుకీ బద్ధ శత్రువుల్లా మారిపోతున్నారు. ఈ రోజు గేమ్‌లో కూడా వీళ్లిద్దరూ ఓ రేంజ్లో గొడవ పడ్డారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. నువ్వు మాట్లాడిన విధానం నచ్చలేదు అని ఇనయ నామినేట్ చేయగా నువ్వు వెనక మాట్లాడేదానివి, ఫేక్ నాన్న.. వెళ్లు అంటూ వెక్కిరించింది ఫైమా. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నేను రియల్‌గా ఉన్నా అని ఇనయ ఆన్సరివ్వగా అసలు ఈ హౌస్‌లో ఎవరికీ నువ్వు నచ్చవని చెప్పింది ఫైమా. ఇక బాధలో ఉండి కూడా ముఖం మీద నవ్వు వస్తుందంటే అది డ్రామా, ఫేక్ అని శ్రీహాన్‌తో గొడవకు దిగింది కీర్తి. మరి ఈ గొడవలు, నామినేషన్స్ ప్రక్రియ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే! చదవండి: నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్, గుండె పగిలేలా ఏడ్చిన గీతూ ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే? -
ఇనయను మళ్లీ ఓ ఆటాడుకున్న ఆది రెడ్డి, నామినేషన్స్‌లో 9 మంది!
బిగ్‌బాస్ హౌస్ నుంచి గీతూ వెళ్లిపోవాలని చాలామంది బలంగా కోరుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం గీతూ వెళ్లిపోతుంటే ఎంతోమంది ఎమోషనలయ్యారు. ఆమె బిగ్‌బాస్‌ను వీడలేక వీడుతుంటే భారంగా నిట్టూర్చారు. ఈరోజు గీతూ లేకుండానే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. శ్రీహాన్‌కు, నాకూ బయట ఒక లైఫ్ ఉంది. మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడటం నచ్చలేదని ఇనయను నామినేట్ చేసింది శ్రీసత్య. పోయినవారం హ్యుమానిటీ గురించి మాట్లాడావు.. అని కీర్తి మాట్లాడటం మొదలు పెట్టిందో లేదో మధ్యలో అందుకున్నాడు శ్రీహాన్. హ్యుమానిటీ గురించి నేను హైలైట్ చేసుకోలేదు, హీరోయిన్లా నువ్వు చెప్పుకున్నావు అని కౌంటరిచ్చాడు. దీనికి కీర్తి.. ఇక్కడ ఎవరూ హీరోయిన్ కాదు, ఎవరూ హీరో కాదు, ఇదే కొంచెం తగ్గించుకోండి అని చురకలంటించింది. కావాలని ఒకరిని కొట్టడం తప్పని రేవంత్.. వాసంతిని నామినేట్ చేశాడు. దీంతో అవాక్కైన వాసంతి.. నువ్వు మనుషులను ఎలా విసిరేస్తున్నావో ఫుటేజీతో సహా అందరం చూశామని ఎద్దేవా చేసింది. అటు ఆదిరెడ్డి.. రేవంత్‌తో పాటు ఇనయను నామినేట్ చేశాడు. బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఏడవడం, బిగ్‌బాస్ పిలిస్తేనే బయటకు వస్తాననడం తప్పనిపించలేదా? అని అడిగాడు. దీనికామె అది నాకు, బిగ్‌బాస్‌కు మధ్య విషయం, మధ్యలో మీకెందుకు అని ప్రశ్నించింది. మీ ఇద్దరికీ ఉంటే మీరు బయటకు పోయి మాట్లాడుకోండి అని చిరాకు పడ్డాడు ఆది. అయినా ఇప్పటికీ దాన్ని తప్పుగా ఫీలవకపోవడం నా దురృదృష్టం అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ వారం తొమ్మిది మంది నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్, రాజ్, కెప్టెన్ శ్రీసత్య మినహా మిగిలిన తొమ్మిది మంది.. వాసంతి, రేవంత్, కీర్తి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, మెరీనా, బాలాదిత్య, ఫైమా నామినేషన్స్‌లో ఉన్నారట! చదవండి: కంటెంట్ క్వీన్ ఎలిమినేట్ అవడానికి కారణాలివే! నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్, ఎక్కడికీ పోను: ఏడ్చిన గీతూ -
ఇనయ.. నీ మనసులో ఏముందో తెలుసు, సీక్రెట్ రూమ్ ట్విస్ట్!
ఎప్పుడైతే వెళ్లిపోండి అని బిగ్‌బాస్ గేట్లు ఓపెన్ చేశాడో అప్పటినుంచి శ్రద్ధాసక్తులతో గేమ్ ఆడుతున్నారు కంటెస్టెంట్లు. ఈ క్రమంలో గెలవడం కోసం ఏదైనా చేస్తున్నారు. కొందరు అడ్డదారిన ఆడుతుంటే, మరికొందరు నీతిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగార్జున మాత్రం గెలవడం కోసం ఎలా ఆడినా తప్పు లేదని వెనకేసుకొస్తున్నాడు. కానీ ఆటలో లిమిట్స్ దాటిన కొందరికి ఆల్రెడీ క్లాస్ పీకాడు నాగ్. ఈరోజు సండే కావడంతో హౌస్‌మేట్స్‌తో ఫన్ గేమ్స్ ఆడించనున్నాడు. అంతేనా? మళ్లీ వాళ్ల మనసులోని భావాలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నాడు. ఈ ఆటలో మిమ్మల్ని పాములా కాటేస్తుంది ఎవరు? నిచ్చెనలా ముందుకు వెళ్లేందుకు సాయపడుతుంది ఎవరు? అని అడిగాడు నాగ్. ముందుగా ఫైమా.. ఇనయ తనను స్నేహం పేరుతో కాటేసిందని చెప్పింది. రేవంత్.. వాసంతిది పాము కళ్లు అన్నాడు. ఇక ఇనయతో మాట్లాడుతూ.. నీ మనసులో ఉంది నాకు తెలుసు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో తెలుసు అంటూ బిగ్‌బాస్‌ను సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయమన్నాడు నాగ్. దీంతో ఆమె ఎంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్లింది. కానీ ఇదంతా ఉట్టి నాటకం అని తెలుస్తోంది. పాపం ఇనయ... తనను ప్రాంక్ చేశారని తెలిశాక ఎలా ఫీలైందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: షాకింగ్ ఎలిమినేషన్, గీతక్క గుడ్‌బై ఆదిపురుష్‌పై అదనంగా వెయ్యి కోట్ల భారం -
అడ్డంగా దొరికిన శ్రీహాన్, ఇనయ.. గీతూ వల్ల అతడికి పనిష్మెంట్!
Bigg Boss Telugu 6, Episode 63: ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో రెడ్, బ్లూ టీమ్ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమని గీతూ, ఆదిరెడ్డిలను ఆదేశించాడు నాగ్. బ్లూ టీమ్ లీడర్ ఆది రెడ్డి.. రాజ్ ఫస్ట్, ఇనయ సెకండ్ అని చెప్పి మెరీనా, వాసంతి, బాలాదిత్య, రోహిత్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంకులిచ్చాడు. తనకు ఏడో ర్యాంకు ఇచ్చుకున్నాడు ఆది. ఈ సందర్భంగా నాగ్.. సిగరెట్ల కోసం గీతూను నానామాటలు అన్నావు, సిగరెట్ తాగగానే సారీ చెప్పావు అంటూ బాలాదిత్య మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో అతడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక మీదట సిగరెట్ ముట్టుకోనని శపథం చేశాడు. ఆట అయిపోయాక బాలాదిత్య బలహీనత మీద ఆడుకోవడం కరెక్ట్ కాదని గీతూకు కూడా హితవు కలిపాడు నాగ్. రెడ్ టీమ్ లీడర్ గీతూ.. శ్రీహాన్‌కు ఫస్ట్, ఫైమాకు సెకండ్, శ్రీసత్య, రేవంత్, కీర్తిలకు మూడు, నాలుగు, ఆరో ర్యాంకులిచ్చింది. తనకు తాను మాత్రం ఐదో ర్యాంకిచ్చుకుంది. రేవంత్ ఉన్మాదిలా ఆడిన వీడియోను చూపించాడు నాగ్. అందులో అతడు ఇనయను బలంగా నెట్టేశాడు. నువ్వు ఇంకా నీ కోపాన్ని తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత శ్రీహాన్‌ను.. కెప్టెన్సీలో నువ్వేం పొడిచావో చెప్పమని అడగడంతో అతడు నీళ్లు నమిలాడు. లాస్ట్ వీక్ గీతూకు వాష్‌రూమ్స్ కడగాలని ఇచ్చిన పనిష్మెంట్ ఎందుకు తగ్గించావని ప్రశ్నించాడు. ఆదిరెడ్డి సాయం చేస్తుంటే చూస్తూ కూర్చున్నావెందుకని నిలదీశాడు. వీడియో వేసి మరీ చూపించడంతో అడ్డంగా దొరికిపోయిన శ్రీహాన్ తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. తప్పు చేసినందుకు ఫలితంగా నెక్స్ట్ వీక్ కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయావన్నాడు నాగ్. అనంతరం బ్లూ టీమ్‌లో ఆది, రెడ్ టీమ్‌లో గీతూకు వరస్ట్ పర్ఫామర్ ట్యాగిచ్చాడు. తర్వాత ఆది, కీర్తి, రేవంత్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. ఇక బిగ్‌బాస్ ఇంటి విషయాల గురించి నాగ్ మాట్లాడుతూ.. ఇంట్లో ఫుడ్ సరిపోవట్లేదంటున్నారు. ఆల్రెడీ మీకు కావాల్సినంత ఫుడ్ బిగ్‌బాస్ పంపిస్తూనే ఉన్నాడు. అయినా ఎందుకా సమస్య తలెత్తుతోందని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. వేస్ట్ చేసిన ఫుడ్ వీడియోను చూపించి తప్పు మీ దగ్గరే ఉందని నిందించాడు. తనను టార్గెట్ చేస్తున్నారని పదే పదే వాదిస్తున్న ఇనయ తనకు ఏదైనా కావాలంటే ముందుగా కెప్టెన్‌కు చెప్పమని సూచించాడు. అందరూ రెండుసార్లు టీ తాగినంత మాత్రాన నీకు రెండుసార్లు పాలు ఇవ్వడం ఎలా కుదురుతుందని ప్రశ్నించాడు. ఇకపోతే శ్రీహాన్‌ను నువ్వెక్కడ పడుకుంటున్నావో చూస్తున్నా అనడం తప్పని స్పష్టం చేశాడు. దానికి ఇనయ తాను వేరే ఇంటెన్షన్‌తో అన్నానని ఆన్సరివ్వగా కెమెరాలు చూస్తున్నాయి, ఎంత కవర్ చేసినా దొరుకుతావు ఇనయ.. అని గద్దించాడు. దీంతో ఆమె కిమ్మనకుండా సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రేపటి ఎపిసోడ్లో గీతూ ఎలిమినేట్ అవగా నేను వెళ్లనంటూ ఏడుపందుకుందట. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. The weekend heat is on 🔥 @iamnagarjuna confronts the housemates on this week's happenings! Don't miss tonight's exciting episode of #BiggBossTelugu6 on @StarMaa & @DisneyPlusHSTel.#BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/NjDGUcR07T — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 5, 2022 చదవండి: షాకింగ్ ఎలిమినేషన్, గీతూ రాయల్ అవుట్ ఇనయపై సూర్య ప్రతీకారం? ఆ పోస్ట్‌తో క్లారిటీ! -
ఇనయపై ప్రతీకారం తీర్చుకుంటున్న సూర్య? అతడేమన్నాడంటే?
బిగ్‌బాస్ ఆరో సీజన్లో ఇనయ- సూర్యల లవ్ ట్రాక్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే! ఏమైందో ఏమో కానీ సడన్‌గా ఇనయ సూర్యను దూరం పెట్టడం, అతడిని నామినేట్ చేయడం, ఆ వారమే సూర్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ఓపక్క ఇష్టం అంటూనే నామినేట్ చేస్తావ్, వెళ్లిపోతుంటే ముద్దుల వర్షం కురిపిస్తూ ప్రేమ ఒలకబోస్తావు, ఎందుకంత నటిస్తున్నావు? అని నామినేషన్లో ఇనయను హౌస్మేట్స్ ఓ ఆటాడుకున్నారు. అయితే ఎవరెన్ని మాటలన్నా సరే ఇనయ మాత్రం.. సూర్య అంటే నాకిష్టం అంటూ అతడి ప్లేటులోనే తింటూ తన జ్ఞాపకాల్లో మునిగి తేలుతోంది. ఇదిలా ఉంటే గతవారం ఎలిమినేట్ అయిన సూర్య.. ఇనయ తన వెనకాల చులకన చేసి మాట్లాడిన వీడియో చూసి హర్టయ్యాడు. అందుకే, ఆమె గురించి ఎక్కడా ఎక్కువగా మాట్లాడట్లేదు. కానీ నెటిజన్లు ఊరుకుంటారా? పదేపదే ఇనయ కోసం గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉన్నారు. అందులోనూ సూర్య.. మెరీనా రోహిత్‌లకు సపోర్ట్ చేసి ఇనయను మాత్రం గాలికొదిలేయడాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇయన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? అంటూ నిలదీస్తున్నారు. తాజాగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సూర్య. 'చాలామంది పర్సనల్‌గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా.. నేను ఒక్కసారి ఫ్రెండ్ అనుకుంటే వాళ్లు ఎప్పటికీ నా ఫ్రెండే. నా వెనకాల గోతులు తీసినా, నా గురించి తప్పుగా మాట్లాడినా ఎప్పటికీ స్నేహితురాలిగానే భావిస్తా. ఫ్రెండ్షిప్కు నేనెప్పుడూ సపోర్ట్ చేస్తాను. ఇనయ ఫైటర్.. ఈ సీజన్లో ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లలో ఫైమా, రాజ్, ఇనయ, కీర్తి నా స్నేహితులు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. నిన్నటి గేమ్ గురించి మాట్లాడుతూ.. ఫైమా, ఇనయలను కెప్టెన్‌గా చూడాలనుకున్నాను. కెప్టెన్ దగ్గరి వరకు వచ్చి ఆగిపోయారు అని స్టోరీలో పేర్కొన్నాడు. చదవండి: బిగ్‌బాస్: ఈ వారం గీతక్క ఎలిమినేట్! ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త, కారణమేంటంటే? -
ఇనయపై రేవంత్ దాడి, ఈ వీడియో సాక్ష్యం!
Bigg Boss Telugu 6, Episode 62: నేను వెధవను, వెధవన్నర వెధవను, దొంగను, నన్ను నమ్మొద్దు అని అందరి ముందే అరిచి మరీ చెప్పింది గీతూ. ఆటలో తనమన బేధాలు లేవని కుండ బద్ధలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. కానీ ఆదిరెడ్డి వినిపించుకోలేదు. గీతక్క గీతక్క అంటూ నెత్తినెక్కించుకున్నాడు. చివరికి అతడికి వెన్నుపోటు పొడిచి గుణపాఠం నేర్పింది. ఇంతకీ మిషన్ పాజిబుల్ గేమ్‌లో ఏం జరిగింది. గీతూ వల్ల ఆది గేమ్ ఏమైంది? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! రాత్రిపూట టీషర్ట్లు కొట్టేయకూడదు అని రెండు టీముల లీడర్లైన ఆది, గీతూ ఒప్పందం చేసుకున్నారు. కానీ గీతూ మాత్రం అప్పటికే దొంగతనం ప్లాన్ వేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గీతూ గేమ్‌లో లేదు, అయినా సరే ఆది రెడ్డి టీషర్ట్ లేపేసింది. తెల్లారాక నిజం తెలుసుకున్న ఆది.. నాతో పర్సనల్‌గా ఆడావు అంటూ గీతూమీద నిప్పులు చెరిగాడు. అటు గీతూ మాత్రం.. బుద్ధి బలం వాడామంటూ అదేపనిగా డప్పు కొట్టుకుంది. నీ మంచితనమే వీక్నెస్, దానిమీదే కొట్టానంది. మరోపక్క గేమ్‌లో హౌస్మేట్స్ నిజంగానే కొట్టుకున్నారు. ఇనయ అవతలివాళ్లను కాళ్లతో విదిలించునేందుకు ప్రయత్నించగా రేవంత్ ఆమెను అవతల పడేశాడు. ఇంటెన్షల్‌గా కొడుతున్నారని ఇనయ అరిచి గోల చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అనంతరం బిగ్‌బాస్.. చనిపోయిన సభ్యులు భౌతికంగా పాల్గొనలేరని గీతూకు చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు. చనిపోయిన గీతూ.. ఆదిరెడ్డి టీషర్ట్ తీసింది కాబట్టి అతడు చనిపోలేదన్నాడు. కానీ మైక్ విసిరేసిన కారణంగా ఆదిరెడ్డిని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగించి షాకిచ్చాడు. తర్వాత మిషన్ పాజిబుల్ టాస్క్ పూర్తైనట్లు ప్రకటించాడు. తన వల్ల గేమ్‌లో అవుట్ అయినందుకు ఆదికి అదే పనిగా సారీ చెప్పింది గీతూ. అయినా క్షమించడానికి మనసొప్పని ఆది.. త్వరలో నిన్ను ఏడిపిస్తా, అదే నేను కొట్టబోయే దెబ్బ అని ప్రతీకార శంఖం పూరించాడు. మరోవైపు ఇనయ.. ఇంట్లో అందరికీ శత్రువునైపోయా, ఎమోషనల్‌గా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అంటూ తనలో తనే బాధపడింది. అటు గీతూ కూడా మనసంతా బాధగా ఉందని కంటతడి పెట్టుకుంది. బయట నాకు ఎన్నో వెన్నుపోట్లు, ఇక్కడ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నారు. వారి ప్రేమ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదిరెడ్డి నమ్మకం మీద కొట్టాను, అతడిని క్షమించమని అడుగుతాను అంటూ పడుకున్న వ్యక్తిని లేపి మరీ సారీ చెప్పింది గీతూ. మిషన్ పాజిబుల్ టాస్క్ డ్రా అవడంతో రెండు టీమ్ లీడర్లు కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్ల పేర్లు చెప్పమన్నారు. దీంతో రెండు టీమ్స్.. అందరు అమ్మాయిల పేర్లు చెప్పారు. అలా బెలూన్ కాపాడుకునే టాస్క్‌లో శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఫైమా, వాసంతి, గీతూ పోటీపడ్డారు. ఫైనల్‌గా శ్రీసత్య గెలిచి కెప్టెన్ అయింది. దీంతో ఆమె సంతోషంలో మునిగి తేలగా మిగతావారు మాత్రం కెప్టెన్సీ చేజారిపోయిందని బాధపడ్డారు. అయితే ఇనయ, రేవంత్ ఫైట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇనయ(#Inaya) హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. Does this not warrant RED CARD to a RED CHIP fellow ఛీVanth? 🤔#BiggBossTelugu6pic.twitter.com/osMqfhiBf5 — Naresh Reddy (@BBNTANALYST) November 4, 2022 Ma #Revanth annaw chala maaradu Yes, isari ammailaki bayapaddadu last ki🤣🤣🤣 Kani unmadhi lage behave chestunnadu inka #Inaya #Vasanthi #Marina#BiggBoss6Telugu #BiggBoss #BiggBossTelugu pic.twitter.com/XiRFlfprJH — Power Ranger 💙 (@BluePoweRangerr) November 4, 2022 చదవండి: నీ భార్యతో రొమాన్సా? పిచ్చిపిచ్చిగా ఉందా?: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒంటినిండి గాయాల మచ్చలు, కాళ్లలో ఐరన్ రాడ్లు, ఆమె ఓ ఫైటర్ -
గీతక్క మాయలో ఆదిరెడ్డి, కొత్త కెప్టెన్ ఎవరంటే?
Bigg Boss 6 Telugu, Episode 61: బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతోంది. సీక్రెట్ మిషన్ టాస్క్‌లో భాగంగా రెడ్ టీమ్ కావాలనే బాత్రూమ్ను డర్చీగా మార్చింది. కానీ ఆ నిందను బ్లూ టీమ్ మేద వేయడంతో హౌస్‌లో రచ్చ రంబోలా జరిగింది. సీక్రెట్ గేమ్ సక్సెస్ కావడంతో బ్లూ టీమ్‌లో చనిపోయిన రోహిత్‌ను తిరిగి బతికించారు. మధ్యాహ్నం భోజనం సమయానికి సూర్య ప్లేటు కోసం ఇల్లంతా వెతికింది ఇనయ. ఎక్కడా కనిపించకపోవడంతో ప్లేటు మీద సూర్య పేరును ఎవరు చెరిపేశారు? అని నిలదీసింది. దీనికి బాలాదిత్య నువ్వు వాడుతున్నావనే చెరిపేశారని ఆన్సరిచ్చాడు. అది విన్న రేవంత్.. అలా అనడం తప్పంటూ అందుకున్నాడు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, సత్య ఏం అందో అదే చెప్పానని బదులిచ్చాడు. నా ఎమోషన్‌తో ఆడుకుంటున్నారని ఫైర్ అయిన ఇనయ అన్నం తిననంటూ ఓ మూలన కూర్చుని ఏడ్చింది. ఇది చూసిన శ్రీసత్య.. అంత ప్రేముంటే బిగ్‌బాస్‌ను అడిగి మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెళ్లిపోయి సూర్య ఇంట్లో కూర్చోమను అని వెక్కిరించింది. ఇనయ అలిగి ఏడుస్తూ కూర్చోవడంతో కీర్తి ఓదార్చగా మెరీనా గోరు ముద్దలు తినిపించింది. తర్వాత గేమ్ తిరిగి ప్రారంభం కాగా రెడ్ స్క్వాడ్‌లో రేవంత్ కంటికి గాయం అయింది. ఇంతలో గీతూ అవుట్ అయింది. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన రెండో మిషన్‌లో రెడ్ టీమ్ గెలవడంతో వారు రోహిత్‌ను తిరిగి చంపేశారు. ఇక ఈ రోజుకు టాస్క్ సమయం ముగిసిందన్నాడు బిగ్‌బాస్. అయితే రాత్రి టీ షర్ట్లు దొంగిలిద్దామని ప్లాన్ వేసింది గీతూ. కానీ ఆదిరెడ్డితో మాత్రం టాస్క్ ఆన్ అయ్యాకే తిరిగి గేమ్ స్టార్ట్ చేద్దామని మాయమాటలు చెప్పింది. అతడూ సరేనని నమ్మాడు. అలా అతడిని బురిడీ కొట్టించి అర్ధరాత్రి ఆది రెడ్డి టీషర్ట్ దొంగిలించింది గీతూ. తెల్లవారుజామున ఆదిరెడ్డికి గీతూ గేమ్ అర్థమైంది. గేమ్ పాజ్‌లో ఉన్నప్పుడు టీషర్ట్స్ స్ట్రాప్స్ తీసేయడం తప్పని వారించగా తానసలు తీయలేదని అబద్ధమాడింది గీతూ. గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుందని హెచ్చరించాడతడు. అయితే ఈ మిషన్ పాజిబుల్ గేమ్ డ్రా అయిందట. దీంతో రెండు టీమ్స్‌లోని మెరీనా, వాసంతి, ఇనయ, ఫైమా, సత్య, గీతూ కెప్టెన్సీ కోసం పోటీపడగా సత్య కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: బుజ్జమ్మ తన గర్ల్‌ఫ్రెండే కాదన్న సూర్య, ఇనయ లైన్ క్లియర్? -
బుజ్జమ్మ సూర్య గర్ల్‌ఫ్రెండే కాదట! ఇనయ లైన్ క్లియర్?
ఆర్జే సూర్య బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా ప్రవర్తించింది ఇనయ. అతడితో కాసేపు బాగానే ఉంటుంది. అంతలోనే నీ ఫ్రెండ్షిప్ వద్దు, నువ్వూ వద్దు. నిన్ను నామినేట్ చేసి పడేస్తా అని కోపం చూపించింది. వీళ్ల లెక్కలు అర్థం కాక ఇనయకు తిక్క అనుకున్నారు హౌస్మేట్స్. కానీ ఎప్పుడైతే సూర్య ఎలిమినేట్ అయ్యాడో అప్పుడు సీన్ రివర్సైంది. నీవల్లే సూర్య వెళ్లిపోయాడు, నువ్వే పంపించావు, వెన్నుపోటు పొడిచావు అంటూ హౌస్ అంతా నానామాటలు అంది. అయినా సరే, ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుని అందరితో పోరాడింది ఇనయ. ఇక సూర్య వెళ్లిపోయిన క్షణం నుంచి అతడి నామస్మరణలోనే ఉంటోంది. అలా అని గేమ్‌ను నిర్లక్ష్యం చేయట్లేదు. సూర్య గేమ్ కూడా కలిపి ఆడుతోంది. అతడి టీషర్టే వేసుకుని ఆటాడింది. అతడి ప్లేట్లోనే తింటోంది, అతడి కప్‌లోనే కాఫీ తాగుతోంది. ఎవరెన్ని అంటున్నా సూర్య అంటే ఇష్టం అని గొంతెత్తి అరుస్తోంది. మరి ఇంత ప్రేమున్న ఇనయ సూర్య హౌస్‌లో ఉన్నప్పుడు అతడిని ఎందుకు దూరం పెట్టింది? అంటే బుజ్జమ్మే కారణం. సూర్యకు ఆల్రెడీ బుజ్జమ్మ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉన్నప్పుడు తను అతడికి దగ్గరవడం తప్పనుకుని దూరం పెట్టాలనుకుంది. కానీ అతడు వెళ్లిపోయాక మాత్రం నిత్యం సూర్య పేరు తలుచుకుంటూ అతడి జ్ఞాపకాల్లో మునిగి తేలుతోంది. అయితే సూర్యకు అసలు గర్ల్‌ఫ్రెండే లేదట. బుజ్జమ్మకు, తనకు మధ్య స్నేహం మాత్రమే ఉందని వివరించాడు సూర్య. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'బుజ్జమ్మ నా గర్ల్‌ఫ్రెండ్ కాదు, క్లోజ్‌ఫ్రెండ్ మాత్రమే. 8 ఏళ్లుగా మేము స్నేహితులుగా ఉన్నాము. దయచేసి మాగురించి తప్పుగా రాయకండి. నాకు ఆల్రెడీ పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే ఆ మాట చెప్పాను. కానీ అది ఎపిసోడ్లో చూపించలేదేమో!' అని క్లారిటీ ఇచ్చాడు. ఇది చూసిన జనాలు ఇనయ లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అంత ప్రేముంటే వెళ్లి సూర్య ఇంట్లో కూర్చోమను అరుదైన వ్యాధితో బాధపడుతున్న జాతిరత్నాలు డైరెక్టర్ -
అంత ప్రేముంటే వెళ్లి సూర్య ఇంట్లో కూర్చోమను: శ్రీసత్య
ఎదుటివాళ్ల బలహీనత మీద కొట్టడమే గేమ్.. ఇప్పుడిదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. మిషన్ పాజిబుల్ గేమ్‌లో శారీరక బలంతో పాటు బుద్ధి బలం కూడా వాడమన్నాడు బిగ్‌బాస్. ఇంకేముంది రెడ్ టీమ్ రెండో పాయింట్ మాత్రమే పట్టుకుని వేలాడింది. ఇప్పటికే ఒకటీరెండుసార్లు సిగరెట్ల విషయంలో బాలాదిత్యను టార్చర్ పెట్టిన గీతూ మరోసారి ఈ గేమ్‌లో అతడిని చెడుగుడు ఆడుకుంది. అటు శ్రీహాన్, శ్రీసత్య.. ఇనయను రెచ్చగొడుతూ ఆమెను వెక్కిరిస్తూ మరీ వింతగా ప్రవర్తిస్తున్నారు. ఓటమిని సహించలేని రేవంత్ ఎదుటివాళ్లను చులకన చేసి మాట్లాడుతూ తన నోటిదురుసు ప్రదర్శించాడు. ఇక తమ మీద నిందలు వేసిన ఇనయను ఎమోషనల్‌గా హింసించింది శ్రీసత్య. ప్లేటు మీద సూర్య పేరును చెరిపేసింది. సూర్య ప్లేటు ఎవరైనా చూశారా? అని ఇనయ అడగ్గా.. నువ్వు వాడుతున్నావనే ఆ పేరు చెరిపేశారు అని బాలాదిత్య ఉన్నమాట చెప్పాడు. దీంతో హర్టయిన ఇనయ తినాలని లేదు అంటూ ఓ మూలన ఏడ్చుకుంటూ కూర్చుంది. మెరీనా, కీర్తి ఆమెకు సూర్య పేరు చెప్పి తినిపించారు. అయితే శ్రీసత్య మాత్రం.. అంత ప్రేముంటే మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యి సూర్య వాళ్ల ఇంట్లో కూర్చోమను అని చిరాకుపడింది. ఇకపోతే బ్లూ టీమ్ తమ సీక్రెట్ టాస్క్‌ను విజయవంతం చేసే పనిలో పడింది. చదవండి: బాలాదిత్య చేతులెత్తి మొక్కినా కనికరించని గీతూ కాంతార మూవీ ఫస్ట్ హీరో నేను కాదు: రిషబ్ శెట్టి -
గీతూ చెత్త సంచాలక్, బాలాదిత్య చేతులెత్తి మొక్కినా..
Bigg Boss 6 Telugu, Episode 60: బిగ్‌బాస్ అంటే మైండ్ గేమ్ అని కొందరు, కాదు ఫిజికల్ గేమ్ అని మరికొందరు, ఆ రెండింటికన్నా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ బ్రదరూ అనేవాళ్లూ ఉన్నారు. కానీ కంటెస్టెంట్లలో కచ్చితంగా ఈ మూడు క్వాలిటీస్ ఉండాల్సిందే! దురదృష్టం కొద్దీ ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు హౌస్మేట్స్. ఫిజికల్ గేమ్ వచ్చినప్పుడు మైండ్ గేమ్, మైండ్ గేమ్ వచ్చినప్పుడు ఫిజికల్ గేమ్ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా టాస్క్ రాగానే వారి బలహీనతల మీద దెబ్బ కొట్టి రెచ్చగొట్టి పెంట చేస్తున్నారు. దీంతో గేమ్ స్పిరిట్ కంటే గొడవలే ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్ ద వార్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే గ్రనైట్ రెడ్ స్క్వాట్ ఆధీనంలో ఉండటంతో ఎవరెవరు పోటీపడాలి? సంచాలకులుగా ఎవరు ఉండాలనేది రెడ్ టీమ్ ఎంపిక చేయొచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, గీతూ సంచాలక్ అయింది. బ్లూ టీమ్‌లో వీక్‌గా ఉన్నారనుకున్న ఇనయ, వాసంతి, మెరీనాలు.. రేవంత్, శ్రీహాన్, ఫైమాతో పోటీపడాలని నిర్ణయించారు. గేమ్ మొదలు కాకముందే ఎప్పటిలా కొత్త రూల్స్ పెట్టింది గీతూ. గోడ మీద నుంచి రెండు కాళ్లు కింద పెడితే అవుట్ అని చెప్పింది. గేమ్ ప్రారంభం కాగానే ముగ్గురు ఆడాళ్లు సివంగుల్లా పోట్లాడారు. వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేసిన రేవంత్‌ను అవుట్ చేసింది వాసంతి. శ్రీహాన్ ఇనయను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. నామినేషన్లో తప్ప కంటెంట్ లేనిదానివి నువ్వు మట్లాడుతున్నావు అని విమర్శించాడు. దీనికి ఇనయ.. నువ్వూ ఈ మధ్య కంటెంట్ బాగా ఇస్తున్నావ్లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా అంది. ఇక ఇనయ నెట్టేసే క్రమంలో శ్రీహాన్ రెండు కాళ్లు కింద పెట్టినా గీతూ మాత్రం తాను చూడలేదని మాట్లాడింది. ఎవ్వరు చెప్పినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మొదటి మిషన్‌లో రెడ్ స్క్వాడ్ గెలవగా వారు బ్లూ స్క్వాడ్‌లో రోహిత్‌ను చంపారు. తర్వాత శ్రీహాన్.. ఇనయ దగ్గరకు వెళ్లి నా క్యారెక్టర్ గురించి ఏదో నోరు జారుతున్నావేంటి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మా రిలేషన్‌కు ఓ పేరుంది, లిమిట్ ఉంది అని ఎగబడ్డారు శ్రీసత్య, శ్రీహాన్. దానికి ఇనయ మీరు కింద పడుకోవడం చూశానని ఆన్సరిచ్చింది. మరోపక్క బాలాదిత్య సిగరెట్ల కోసం అల్లాడిపోయాడు. చేసింది చాలు, తప్పు చేయకు, నా మనసు విరిగిపోయింది అని సిగరెట్లు అడగ్గా గీతూ మాత్రం ఇవ్వనంటూ మొండికేసింది. నా స్టూడెంట్స్‌కు నేను సిగరెట్లు తాగడం తెలియొద్దనుకున్నా, కానీ తెలిసిపోయింది. అమ్మ చూస్తే బాధపడుతుంది అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఆదిత్య. ఆదిరెడ్డి సహా అందరూ బతిమాలడంతో చివరాఖరికి సిగరెట్లు ఇచ్చేసి ఏడ్చేసింది గీతూ. దీంతో ఆవేశంలో సిగ్గులేదు అన్నందుకు తనను క్షమించమని చేతులెత్తి వేడుకున్నాడు బాలాదిత్య. గీతూ మాత్రం అతడిని క్షమించే ప్రసక్తే లేదన్నట్లు ప్రవర్తించింది. తెల్లారి బాలాదిత్య సిగరెట్లు తాగుదామనుకునేలోపు లైటర్ కనిపించకుండా పోయింది. దీంతో ఆదిరెడ్డి.. బిగ్‌బాస్.. వీక్నెస్తో ఆడుకోమన్నాడని చెప్పి మీ బలాన్ని ప్రయోగించరా? అని కరెక్ట్ పాయింట్ లాగాడు. అటు గీతూ మాత్రం.. నేను దొంగ, వెధవెన్నర వెధవ.. జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి కాసేపు సతాయించి తర్వాత లైటర్ ఇచ్చేసింది. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇనయ సూర్య జ్ఞాపకాలతో తడిసి ముద్దైంది. నీ షర్ట్ వేసుకునే గేమ్ ఆడాను. ఎందుకింత గుర్తొస్తున్నావంటూ సూర్యను తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వింది. అటు శ్రీసత్య మాత్రం ఎవరు ఏ పాయింట్లో ట్రిగ్గర్ అవుతారో నాకు తెలుసు. కాబట్టి రేపు ఎదుటివాళ్లను రెచ్చగొట్టి గేమ్ ఆడదామని రేవంత్‌తో చెప్పుకొచ్చింది. మరుసటి రోజు ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికి సీక్రెట్ మిషన్ ఇచ్చాడు. వాష్‌రూమ్‌ను పూర్తిగా అశుభ్రపరిచి ఆ నింద రెడ్ స్క్వాడ్‌లో ఒకరి మీద వేయాలన్నాడు. ఈ మిషన్ కంప్లీట్ చేస్తే బ్లూ టీమ్‌లో ఒకరిని బతికించొచ్చన్నాడు. మరి ఆ సీక్రెట్ మిషన్ పాజిబులా? ఇంపాజిబులా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అందరికీ రుణపడి ఉంటా: రంభ వీడియో వైరల్ -
Bigg Boss 6: నిందలు తట్టుకోలేక బాత్రూంలోకి ఇనయా.. రంగంలోకి బిగ్‌బాస్
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్లో హౌస్మేట్స్ అంతా ఇనయాను టార్గెట్ చేశారు. ఆమె పర్సనల్ విషయాలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. ముఖ్యంగా సూర్య విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. దీంతో ఇనయా మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. నామినేషన్స్ పూర్తవ్వగానే బాత్ రూమ్‌లోకి వెళ్లి బోరున ఏడ్చింది. చాలా గిల్టీగా ఉంది బిగ్‌బాస్.. నా వల్ల కావడం లేదు అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. దీంతో హౌస్మేట్స్ అంతా వాష్‌రూమ్ దగ్గరకు వెళ్లి బయటకు రావాలని కోరారు. తాను బయటకు రాలేనని, ఒక్కసారి బిగ్‌బాస్‌తో మాట్లాడాలని ఇనయా డిమాండ్ చేసింది. అయితే బిగ్‌బాస్ నుంచి ఎలాంటి ఆదేశం రాకపోవడంతో.. రేవంత్ వాష్‌రూం డోర్‌ని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బిగ్‌బాస్ నుంచి ఇనయాకు పిలుపు వచ్చింది. కన్ఫేషన్ రూంలోకి వెళ్లిన ఇనయా.. తన బాధనంతా బిగ్‌బాస్‌తో చెప్పుకుంది. ‘నా లైఫ్‌లో చాలా గిల్ట్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీళ్లు వేసే నిందలు భరించలేకపోతున్నాను. నా వల్లనే సూర్య వెళ్లిపోయాడు అనడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు.నాకు నచ్చిన వాళ్లంతా నా నుంచి దూరమవుతుంటారు’అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. అప్పుడు బిగ్‌బాస్ ఇనయాను ఓదారుస్తూ.. ‘ఈ హౌస్‌లోకి రావడం.. వెళ్లిపోవడం అనేది ఆటలో ఒక భాగం.ఇక్కడికి రావడం మాత్రమే ఆటగాళ్ల చేతిలో ఉంటుంది. బయటకు వెళ్లడం అనేది ప్రేక్షకులు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మీరు మీ జీవితంలో చాలా చూశారు. నవ్వుతూ ఉండే ఒక అమ్మాయిగా ఈ ఇంట్లోకి వచ్చిన ఇనయాని..తనకు బాగా దగ్గరైన వాళ్లు ఇలా చూడాలని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. లేదు బిగ్‌బాస్ అని ఇనయా చెప్పింది. మీరు మీ కన్నీళ్లును తూడ్చుకొని బయటకు వెళ్లండి అని బిగ్‌బాస్ చెప్పడంతో ఇనయా నవ్వుతూ బయటకు వచ్చేసింది. -
ఇనయ బండారం బయటపెట్టిన రేవంత్, నామినేషన్స్‌లో 10 మంది!
Bigg Boss Telugu 6, Epispde 58: ఆర్జే సూర్య ఎలిమినేషన్ నేటి నామినేషన్స్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఓ పక్క సూర్య కప్‌లో కాఫీ తాగుతూ అతడి జ్ఞాపకాల్లో మునిగి తేలుతోంది ఇనయ. ఆమెను చూసిన ఫైమా.. సూర్యతో మాట్లాడితే బయటకు నెగెటివ్‌గా పోతుందన్న ఆమె అతడు వెళ్లిపోతుంటే ముద్దులు పెట్టింది.. మరి అది నెగెటివ్‌గా పోదా? అంటూ గీతూతో చెప్పుకొచ్చింది. అసలు సూర్యను నామినేట్ చేసి అతడు బయటకు వెళ్లడానికి ప్రధాన కారణంగా నిలిచింది ఇనయ అంటూ మెజారిటీ హౌస్మేట్స్ ఆమెకు ఒకటే నామినేషన్లు గుద్దారు. మరి ఇంటిసభ్యులు ఎవరెవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ ఎదుట ఉన్న దిష్టిబొమ్మలపై కుండలు పగలగొట్టాలని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదటగా వచ్చిన గీతూ.. నీ భర్తతో కలిసి ఆడుతున్నావంటూ మెరీనాను, నువ్వో కన్ఫ్యూజన్ పర్స్ అంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. రేవంత్.. ఇనయను నామినేట్ చేసే క్రమంలో వీరి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఇప్పటివరకు సూర్య నామినేషన్లోకి రాలేదు, గుద్దితే వెళ్లిపోతాడు. చాలా సేఫ్‌గా ఆడుతున్నాడు.. అని నువ్వే అన్నావు కదా అంటూ ఇనయను ఇరికించేశాడు. నేనలా అనలేదు, సూర్య గురించి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదని ఫైర్ అయింది ఇనయ. ఇక తనను ఛీ, తూ అనేసిందని కీర్తి కుండ పగలగొట్టాడు రేవంత్. ఈ హౌస్‌లో ఇనయ మోస్ట్ ఫేకః ఫేకస్య ఫేకోభ్యః అన్నాడు ఆది. సూర్యను నామినేట్ చేయడం, అతడు వెళ్లిపోయినప్పుడు బాధపెడటం? ఇదంతా ఫేక్ అన్నాడు. విన్నర్ క్వాలిటీస్ సహజంగా ఉండాలే తప్ప కావాలని ఇముడ్చుకోవాలని చూస్తున్నావనడంతో మధ్యలో అందుకున్న ఇనయ.. అవును నేను విన్నర్ అంటూ రెచ్చిపోయింది. వీరి గొడవ చూసి శ్రీసత్య, గీతూ, శ్రీహాన్, రేవంత్ పడీపడీ నవ్వారు. తర్వాత రేవంత్ కుండ పగలగొట్టాడు ఆది. గేమ్‌లో మమ్మల్ని పర్సనల్‌గా రెచ్చగొట్టావ్. అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నాకు ఓటేసి ఇప్పుడేమో నా గేమ్ అర్థం కావట్లేదని నామినేట్ చేయడం సిల్లీగా అనిపించిందంటూ గీతూ దిష్టిబొమ్మ కుండ పగలగొట్టాడు రోహిత్. కరెక్ట్‌గా పాయింట్ టూ పాయింట్ మాట్లాడటంతో గీతూ నోరు మూయించాడు. తర్వాత శ్రీసత్యను నామినేట్ చేశాడు. మంచితనం ఎక్కువైందంటూ బాలాదిత్యను, ప్రవర్తన నచ్చట్లేదంటూ ఇనయను నామినేట్ చేసింది ఫైమా. సూర్య పేరు రాసుకున్నప్పుడు, సూర్యుడి బొమ్మ వేసుకున్నప్పుడు, అతడికి ముద్దులు పెట్టినప్పుడు బయటకు నెగెటివ్ అవుతావని అనిపించలేదా? అని ఫైమా నిలదీయగా సూర్య అంటే నాకిష్టం అంది ఇనయ. సూర్య నీకడ్డం అవుతాడని నామినేట్ చేసి పంపించావు. అతడికి వెన్నుపోటు పొడిచావంటూ ఆదిరెడ్డి పదే పదే అనడంతో ఇనయ కంట్లో నీళ్లు తిరిగినా అది బయటపడకుండా కంట్రోల్ చేసుకుంది. ఫ్రెండ్షిప్లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరూ పొడవరంటూ ఇనయను నామినేట్ చేశాడు శ్రీహాన్. పైగా తను కెప్టెన్ కావడంతో ఈరోజు నువ్వు నన్ను నామినేట్ చేయలేవు అని చివర్లో ఆనందపడ్డాడు. మెరీనా - శ్రీసత్య, గీతూ; బాలాదిత్య - శ్రీసత్య, ఫైమా; కీర్తి - గీతూ, రేవంత్; వాసంతి - గీతూ, రేవంత్; రాజ్ - గీతూ, బాలాదిత్య; సత్య - బాలాదిత్య, ఇనయలను నామినేట్ చేశారు. ఫైనల్‌గా ఈ వారం బాలాదిత్య, గీతూ, ఇనయ, రేవంత్, ఫైమా, శ్రీసత్య, కీర్తి, రోహిత్, ఆది రెడ్డి, మెరీనా నామినేషన్లో ఉన్నారు. చదవండి: మూడు నెలలుగా కోమాలో, నటుడి భార్య మృతి లవ్‌లో ఉన్నాం.. హీరోహీరోయిన్లు -
హే, పో.. అంటూ కుండ దాచుకున్న ఆది, లాస్ట్ పంచ్ అదిరింది!
నామినేషన్స్‌లో ఫుల్ ఫైర్ మీదున్నారు హౌస్మేట్స్. ఎనిమిదో వారం సూర్య వెళ్లిపోగా అతడు ఎలిమినేట్ అవడానికి ఇనయ కారణం అంటూ ఆమెకు నామినేసన్స్ గుద్దిపడేస్తున్నారు. వారానికో రంగు మార్చే ఊసరవెల్లి నాకు ఊసరవెల్లి ట్యాగ్ ఇచ్చింది.. ఫ్రెండ్షిప్లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరూ పొడవరు అంటూ ఇనయను నామినేట్ చేశాడు శ్రీహాన్. సూర్యను ఎక్కడ కొట్టాలో కొట్టావు, దెబ్బకు వెళ్లిపోయాడన్నాడు ఆది. అయితే ఇనయ మాత్రం ఆదిరెడ్డి ఫేక్ ఆడుతున్నాడంటూ కుండను పగలగొట్టేందుకు వెళ్లగా అతడు మాత్రం హే, పో.. కొట్టమాకు అంటూ కుండ దాచేసుకున్నాడు. చమ్కీలకు, గోధుమపిండి, మరమరాలకు అన్నింటికీ నామినేట్ చేస్తావ్ అంటూ ఇనయను ఆడుకున్నాడు ఆది. శ్రీహాన్.. ఈరోజు మనం ఫస్ట్ చెప్పుకోబోయే చాప్టర్ పేరు హ్యుమానిటీ. నువ్వు మా దగ్గర చేపలు లాక్కుంటున్నప్పుడు శ్రీసత్య డ్రెస్ పైకి వెళ్లిపోతుంటే హ్యుమానిటీ గుర్తుకురాలేదా? అని అడిగాడు. దీనికి చిర్రెత్తిన కీర్తి.. నీట్‌గా నిల్చుని మాట్లాడినప్పుడు నీ ఎటకారం ఏంట్రా? అంది. రా.. అనకు అంటూ ఫైర్ అయ్యాడు శ్రీహాన్. నా వెటకారం మోతాదు మించిపోయిందని నామినేట్ చేశావు, నీ మంచితనం మోతాదు మించిపోయింది అంటూ బాలాదిత్యను నామినేట్ చేసింది ఫైమా. మంచితనానికి కూడా నామినేట్ చేస్తారా? అని షాకవుతున్నారు ఆడియన్స్. చివర్లో శ్రీహాన్ పంచ్ మాత్రం అదిరిపోయింది. ఇనయ దగ్గరకు వెళ్తూ.. ఒక్కటి మాత్రం నువ్వు చేయలేవు అంటూ ఈరోజు నన్ను నామినేట్ చేయలేవు అని హ్యాపీగా ఫీలయ్యాడు. చదవండి: నాలో విన్నర్ క్వాలిటీస్, నేనే బిగ్‌బాస్ విన్నర్ సినిమాల జాతర.. థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే! -
విన్నర్ క్వాలిటీస్.. బిగ్‌బాస్ 6 విన్నర్ నేనే: ఇనయ
అపరిచితురాలులా మారిపోయిన ఇనయకు నామినేషన్స్‌లో గట్టి దెబ్బే తగిలేట్లు కనిపిస్తోంది. కారణం.. ఇనయకు మొదట్లో ఆర్జే సూర్యతో అంతగా పడలేదు. కానీ ఎప్పుడైతే ఆరోహి వెళ్లిపోయిందో అప్పుడు అతడితో బాగా క్లోజ్ అయింది. బావా అంటూ వెనకాలే తిరుగుతూ అతడే తన ప్రపంచం అన్నట్లుగా మారిపోయింది. మళ్లీ అంతలోనే నీతో ఫ్రెండ్షిప్ కట్ అంటూ నామినేట్ చేసింది. ఆమె నామినేట్ చేసిన వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. సూర్య వెళ్లిపోవడాన్ని ఇనయ తట్టుకోలేక బోరుమని ఏడ్చింది. మరి వెళ్లిపోతే అంత బాధపడేదానివి ఎందుకని నామినేట్ చేశావ్.. అంటూ ఇనయపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ముప్పుతిప్పలు పెట్టారు హౌస్మేట్స్. ఆదిరెడ్డి అయితే.. ఫేకః.. ఫేకస్య.. ఫేకోభ్యః అంటూ ఇనయపై సెటైర్లు వేశాడు. సూర్యను నామినేట్ చేసింది నువ్వే.. ఎలిమినేషన్‌కు కారణమూ నువ్వే! మరి అతను వెళ్లిపోతే బాధపడతామన్నప్పుడు ఎందుకు నామినేట్ చేయడం? అని పాయింట్ లాగాడు. దీనికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాని ఇనయ అది నా ఇష్టమని బదులిచ్చింది. ఇక రేవంత్ కూడా ఇది యాక్టింగా? ఫేకా? అని అడగ్గా.. సూర్య గురించి ఇక్కడ తీసుకురానవసరం లేదు అంటూ ఫైర్ అయింది ఇనయ. విన్నర్ క్వాలిటీస్ మనలో ఉండాలే తప్ప.. కావాలని వాటిని మనలో పెట్టుకుని చేయకూడదని ఆదిరెడ్డి అనడంతో మధ్యలో అందుకున్న ఇనయ.. విన్నర్ క్వాలిటీస్ అన్నారు కదా, నేనే విన్నర్.. బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ నేనే అని గొంతెత్తి అరిచింది. దీంతో ఆదిరెడ్డి, శ్రీహాన్ నవ్వాపుకోలేకపోయారు. చదవండి: గీతూ పెద్ద ఇడియట్, ఇనయ, ఫైమాకు బలుపెక్కువ తల్లి కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య -
సూర్య- ఇనయ లవ్ భాష.. ఏంటో అర్థం కావట్లేదన్న నాగ్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ఈవారం డైరెక్ట్ ఎలిమినేషన్ జరిగింది. సండే కంటే ఒక రోజు ముందే సూర్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. స్టేజీపైకి వచ్చాక అతడు ఏమేం మాట్లాడాడో ప్రోమోలు వదులుతోంది బిగ్‌బాస్ టీమ్. ఓ వీడియోలో సూర్య.. నీ గేమ్ నువ్వు ఆడితే అసలు నీకు కాంపిటీషనే లేదని గీతూను ఆకాశానికెత్తాడు. అలాగే ఇనయ టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నానన్నాడు. అయితే సూర్య కనిపించడంతో తెగ ఎమోషనలైపోయింది ఇనయ. కొరియన్‌లా చేతివేళ్లతో లవ్ సింబల్‌ను చూపించింది. సూర్య కూడా అదే విధంగా సింబల్ చూపించాడు. దీంతో నాగ్.. ఇవన్నీ ఏంటసలు? నాకర్థం కావడం లేదని జుట్టు పీక్కున్నాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ మూవీ హీరోహీరోయిన్లు సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా స్పెషల్ గెస్టులుగా వచ్చేసి సందడి చేయబోతున్నారు. హౌస్‌మేట్స్‌తో పీపీతో పాట గేమ్ ఆడించారు. మరి ఆ ఆటలు, పాటలు చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: చివరిసారిగా సూర్యకు ఇనయ ముద్దుల వర్షం గీతూను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు -
చివరిసారిగా సూర్యకు ఇనయ ముద్దుల వర్షం, భారంగా వీడ్కోలు
Bigg Boss 6 Telugu, Episode 56: నాగార్జున వచ్చీరాగానే తన కోపాన్నంతా కక్కేశాడు. చేపల చెరువు టాస్క్‌లో గీతూ ఎలా ఆడిందో ఆదిని రివ్యూ ఇవ్వమన్నాడు. గీతూ ఫిజికల్‌గా బాగా ఆడిందని వెనకేసుకొచ్చాడు ఆది. మరి అంత బాగా ఆడితే మీ దగ్గరే ఎందుకు తక్కువ చేపలున్నాయన్నాడు. దీంతో వాళ్లు మౌనంగా ఉండిపోయారు. గీతూ మధ్యలో ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా పానకంలో పుడకలా మధ్యలో మాట్లాడకని వార్నింగ్ ఇచ్చాడు నాగ్. సంచాలక్‌గా తన ఆటతీరు ఎలా ఉంది? అని ప్రశ్నించగా మెజారిటీ హౌస్మేట్స్ ఆమె అలా ఆట మధ్యలో దూరడం తప్పని చెప్పారు. అయితే గీతూ మాత్రం.. నేనుండే సీజన్లో ఎవరు ఆడకపోయినా నేనే ఆడిస్తానని రెచ్చగొట్టాను. బయట కూడా నేను గేమర్‌ను అని చెప్పుకొచ్చింది. ఎదుటివాళ్ల వీక్నెస్ మీద ఆడటం గేమర్ లక్షణం కాదు. నువ్వు గేమర్ కాదు, వేస్ట్.. ఓటమి తట్టుకోలేక ఏడ్చావు. గేమ్ ఇంట్రస్టింగ్‌గా ఆడటం మా బిగ్‌బాస్ చూసుకుంటాడు. నువ్వేం చేయనవసరం లేదు. సరే పోనీ, కూరగాయలు కట్ చేశాక ఆ తొక్క అంతా డస్ట్‌బిన్‌లో వేయడానికి అంత గొడవ అవసరమా? నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది. కోపమొస్తే కామన్సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావని క్లాస్ పీకాడు నాగ్. నువ్వు గెలవడాని కంటే అవతలివాళ్ల వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలని చూశావని ఫైర్ అయ్యాడు. సంచాలక్‌గా తప్పు చేసిన గీతూ బిగ్‌బాస్ చెప్పేవరకు బాత్రూమ్స్ క్లీన్ చేయాలని పనిష్మెంట్ ఇచ్చాడు. ఎవరి ఆట వాళ్లు బాగా ఆడితే సీజన్ ఎక్కడుండాలో అక్కడుటుంది అన్నాడు. ఆట ఆడుతూనే అమ్మాయిల డ్రెస్ సరిదిద్దావంటూ బాలాదిత్యను మెచ్చుకున్నాడు నాగ్. శ్రీహాన్-శ్రీసత్య కలిసి ఆడారా? మిగతా జంటల సాయం తీసుకున్నారా? అని అడగ్గా వారు కలిసే ఆడామని తలూపారు. నాగ్ మాత్రం.. గీతూ దయాదాక్షిణ్యాల మీద మీ గేమ్ ఆధారపడిందని సెటైర్ వేశాడు. సూర్య.. తనను ముగ్గురమ్మాయిల(ఇనయ, ఫైమా, కీర్తి) కన్నా నేను ఫిజికల్‌గా తక్కువ అనేసరికి బాధపడ్డానంది వాసంతి. ఫెమినిస్ట్ అయి ఉండి అలా మాట్లాడతావా? అని విమర్శించడంతో ముఖం మాడ్చాడు సూర్య. కామెడీ విషయంలో కొన్నిసార్లు నోరుజారుతున్నావు, జాగ్రత్తగా ఉండని ఫైమాను హెచ్చరించాడు నాగ్. గేమ్‌లో రేవంత్ మిగతావారిని నెట్టేసిన వీడియో చూపించిన నాగ్.. ఉన్మాదిలా ఆడుతున్నావు, ఆ కోపం తగ్గించుకుంటూనే గేమ్ ఆడు అని సలహా ఇచ్చాడు. ఈ వారం అనర్హులు బ్యాడ్జ్ ఎవరికి ఇస్తావంటే కెప్టెన్ శ్రీహాన్.. కీర్తి పేరు సూచించాడు. పాజిటివ్ తీసుకున్నంత ఈజీగా నెగెటివ్ తీసుకోలేదంటూ ఆమెకు అనర్హురాలు బ్యాడ్జ్ తగిలించాడు. తర్వాత డైరెక్ట్ ఎలిమినేషన్ అంటూ సూర్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. ఊహించని ఎలిమినేషన్‌తో ఇనయ వెక్కి వెక్కి ఏడ్చింది. అతడిపై ముద్దుల వర్షం కురిపిస్తూ భారంగా వీడ్కోలు పలికింది. ఫైమా, కీర్తి సైతం సూర్య వెళ్లిపోతుంటే కంటనీరు పెట్టుకున్నారు. మిగతా హౌస్మేట్స్ అతడిని సీక్రెట్ రూమ్‌కి పంపిస్తారేమోనని అభిప్రాయపడ్డారు. మరి సూర్య స్టేజీపైన ఏం మాట్లాడాడు? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే! చదవండి: గీతూను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్ ఖేర్ -
నా చేతివంట తిన్నాక నాన్నకు గుండెపోటు వచ్చింది: ఇనయ
Bigg Boss 6 Telugu, Episode 55: ముందుగా అనుకున్నట్లుగానే శ్రీహాన్ కెప్టెన్ అయ్యాడయ్యాడు. అలా కెప్టెన్ అయ్యాడో లేదో ఇలా ఇనయతో గొడవపడ్డాడు. మొన్నటిదాకా కలిసిపోయిన వీళ్లిద్దరి కథ కెప్టెన్సీ టాస్క్‌తో మళ్లీ మొదటికి వచ్చింది. ఇనయ కత్తిపోటు వేయడాన్ని శ్రీహాన్ జీర్ణించుకోలేకపోయాడు. సరైన సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తాననడి డిసైడ్ అయ్యాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. సూర్య, ఇనయల ట్రాక్ చూసి జనాలు వీరిని సునయ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ నాగార్జున వీకెండ్లో పదేపదే బుజ్జమ్మ పేరు ఎత్తడంతో ఇనయ బాగా హర్టయింది. సూర్యకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని అన్నిసార్లు గుర్తు చేసినప్పుడు తను క్లోజ్‌గా ఉండటం తప్పని భావించింది. ఏకంగా అతడి ఫ్రెండ్షిప్నే వద్దంది. సూర్య మీద ద్వేషం పెంచుకుంది. టాప్ 5లో కాదు కదా వీలైనంత వెంటనే బయటకు వెళ్లిపోవాలని రగిలిపోయింది. కానీ ఆ కోపం చప్పున చల్లారిపోయినట్లు కనిపిస్తోంది. నాకు కోపమొస్తే అవతలివారిని బాధపెడతాడనని సూర్యతో చెప్పుకొచ్చింది ఇనయ. నీ బ్రాస్లేట్ రేవంత్ దగ్గర ఉండటం నచ్చలేదు, అందుకే తీసుకున్నానన్నాడు సూర్య. అలా ఇద్దరూ కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీ కంటిన్యూ అయింది. నిన్న రాజ్, రోహిత్, రేవంత్.. సూర్యకు; బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చగా ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. నేటి ఎపిసోడ్లో వాసంతి, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. తక్కువ కత్తులు దిగిన శ్రీహాన్ కెప్టెన్‌గా అవతరించాడు. మరోవైపు కిచెన్‌లో గీతూ, బాలాదిత్య పంచాయితీకి దిగారు. కూరగాయలు కట్ చేసినప్పుడు దాని తొక్కలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చు కదా అని బాలాదిత్య.. నేను ఎందుకు వేస్తా, అంత అవసరమనుకుంటే నువ్వే వేసేయ్ అంటూ గీతూ దెబ్బలాడుకున్నారు. అలా ఇద్దరి గొడవతో ఇంట్లో రగడ జరిగింది. తర్వాత యమహా కాల్ ఆఫ్ ద బ్లూ టాస్క్‌లో రోహిత్ గెలిచి జాకెట్ గెలుచుకున్నాడు. తనను విన్నర్‌గా ప్రకటించకపోవడంతో రేవంత్ చిర్రుబుర్రులాడాడు. అనంతరం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమని కెప్టెన్ శ్రీహాన్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో కెప్టెన్.. బాలాదిత్య ముఖానికి పెయింట్ పూయడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గీతూ ప్రవర్తన మీద ఓ కన్నేసిన ఆది రెడ్డి తన అభిప్రాయాన్ని ఆమె ముందుంచాడు. గీతక్క నువ్వు రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నావనిపిస్తోందన్నాడు. ఆమె మాత్రం అదేమీ పెద్దగా పట్టించుకోనట్లే కనిపించింది. ఇక ఆది కూతురు హద్విత ఫస్ట్ బర్త్‌డే కావడంతో అతడికి ఫ్యామిలీ వీడియో చూపించాడు బిగ్‌బాస్. ఆ వీడియోలో ఆది భార్య కవిత కూతురికి కేక్ కట్ చేసి తినిపించింది. తన తల్లిని, పెళ్లాంబిడ్డలను చూసి ఆది సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కెప్టెన్ శ్రీహాన్ ఇంటిసభ్యులకు పనులు అప్పగించేందుకు రెడీ అయిపోయాడు. ఇనయను వంట చేయమని అడిగాడు. దీనికి ఇనయ స్పందిస్తూ.. 'నేను చివరిసారిగా వంట చేసింది మా డాడీకే, నా వంట తిన్నాక ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వంట ముట్టుకోలేదు, ఇక మీదట చేయను కూడా' అని తెగేసి చెప్పింది. కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్ అనగా కూర లేకపోవడంతోనే తాను రైస్ పక్కన పెట్టేశానని మధ్యలో కల్పించుకుని ఆన్సరిచ్చింది ఇనయ. అసలు నీ పేరు ప్రస్తావించనప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు కెప్టెన్. అలా ఇద్దరి మధ్య కాసేపు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏదేమైనా అన్నం పడేస్తే మాత్రం అస్సలు ఊరుకోనన్నాడు శ్రీహాన్. మళ్లీ గొడవలవుతున్నాయని శ్రీహాన్ చిరాకుపడుతుంటే గీతూ మాత్రం.. ఇలా గొడవ జరిగితేనే సీజన్ హిట్టవుతుందని చెప్పుకురావడం విశేషం.. -
ఆదిరెడ్డికి సర్ప్రైజ్, కెప్టెన్‌గా తప్పు చేసిన శ్రీహాన్!?
ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు పొడిచిన ఇనయపై కసి పెంచుకున్నాడు శ్రీహాన్. సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తానని డిసైడ్ అయ్యాడు. ఎలాగో అతడు కెప్టెన్ అయిన విషయం బయటకు రానే వచ్చింది. తాజాగా అతడు ఇంటిబాధ్యతలు చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఇంట్లో కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్ చెప్తుండగా మధ్యలో ఇనయ కల్పించుకుని నాకు కూర సరిపోలేదని అన్నం వదిలేశానని క్లారిటీ ఇచ్చింది. దీంతో శ్రీహాన్ ఫైర్ అవుతూ.. 'నేను మాట్లాడినప్పుడు కాదు, తర్వాత క్లారిటీ ఇచ్చుకో! నేను అందరి పాయింట్స్ చెప్తున్నప్పుడు కామ్‌గా ఉండు, తర్వాత మాట్లాడుకో' అంటూ ఒంటికాలిపై లేచాడు. కర్రీ వేయలేదు కాబట్టే తినలేదని ఇనయ మరోసారి చెప్పగా అన్నానికి నువ్విచ్చే విలువ అదా? నా కళ్ల ముందు ఎవరైనా రైస్ పడేసినట్లు కనిపిస్తే అస్సలు ఊరుకోను అని హెచ్చరించాడు కొత్త కెప్టెన్. ఈరోజు ఆదిరెడ్డి కూతురు బర్త్‌డే కావడంతో బిగ్‌బాస్ అతడి కోసం స్పెషల్ వీడియో ప్లే చేశాడు. అది చూసి ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. మరోపక్క వరస్ట్ పర్ఫామర్‌గా ఎవరిని సెలక్ట్ చేయాలన్న బాధ్యతను కెప్టెన్ శ్రీహాన్‌కు ఇచ్చాడు బిగ్‌బాస్. అతడు సత్య, గీతూల కోపం అర్థం చేసుకున్నాడో ఏమో కానీ బాలాదిత్యను జైలుకు పంపించినట్లు తెలుస్తోంది. చదవండి: తొక్కలో పంచాయితీ, ఎంత చెప్పినా గీతూ వినదే ఒక్క పోస్ట్‌తో లవ్ కన్ఫర్మ్ చేసిన హీరో సిద్దార్థ్ -
ఇనయ నాటకాలు ఆడుతోంది, నేనేంటో చూపిస్తా: శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 54: మొత్తానికి గీతూ అనుకుంది సాధించింది. బాలాదిత్య- మెరీనా గేమ్‌లో ఉండటానికి వీల్లేదని డిసైడ్ అయిన గీతూ అన్నంత పని చేసింది. చేపల చెరువు టాస్క్‌లో సంచాలకురాలిగా వ్యవహరించిన గీతూ బాలాదిత్య జంటను గేమ్ నుంచి సైడ్ చేసింది. అత్యధిక చేపలున్న శ్రీహాన్- శ్రీసత్య ఇద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎన్నికయ్యారని బిగ్‌బాస్ ప్రకటించాడు. మరి వీరితోపాటు కెప్టెన్సీ బరిలో ఎవరెవరు దిగారు? ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. గీతూ మహిమ వల్ల శ్రీహాన్-శ్రీసత్య కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మిగిలిన నాలుగు జంటలు.. చర్చించుకుని ఒక్కో జంట నుంచి ఒక్కొక్కరి చొప్పున కెప్టెన్సీ పోటీదారుల పేర్లు వెల్లడించమన్నాడు బిగ్‌బాస్. దీంతో రేవంత్- ఇనయ జోడీ నుంచి రేవంత్, సూర్య- వాసంతి జంట నుంచి సూర్య, రోహిత్- కీర్తి జంట నుంచి కీర్తి, ఫైమా- రాజ్ జోడీ నుంచి ఫైమా కంటెండర్లుగా నిలబడ్డారు. కెప్టెన్సీ కోసం పోటీపడలేనందుకు ఇనయ వాష్‌రూమ్ ఏరియాలో సూర్యను పట్టుకుని తెగ ఏడ్చేసింది. కెప్టెన్సీకి ఒక్క అడుగు దగ్గరవడానికి చిక్కుల్లో కెప్టెన్సీ అనే టాస్క్ పూర్తి చేయాలన్నాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో అందరికంటే త్వరగా చిక్కుముడులు విప్పి కీర్తి, సూర్య, శ్రీహాన్ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. అయితే హౌస్మేట్స్ ఎవరిని కెప్టెన్‌గా చూడాలనుకోవట్లేదో వారికి కత్తిపోట్లు గుచ్చాలన్నాడు బిగ్‌బాస్. రాజ్, రోహిత్, రేవంత్.. సూర్యకు, బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. దీంతో హర్టయిన శ్రీహాన్.. ఇదంతా ప్రోమోకట్, కంటెంట్ కోసమేనన్నాడు. 'నెక్స్ట్ వీక్ ఎవరైనా నీది- సూర్యది బాండింగ్ మిస్ అవుతున్నామంటే వెంటనే వెళ్లి అతడితో కలిసిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో! కరెక్ట్ సమయం వచ్చినప్పుడు చెప్తా. అన్ని నాటకాలు ఆడుతోంది. ఎందుకీ యాక్టింగ్. స్టేబులిటీ లేదని నన్నంది. ఆమె వారానికోసారి రంగు మారుస్తోంది. నాకు నమ్మకద్రోహం చేసింది. నాకు కత్తి గుచ్చినందుకు బాధపడేలా చేస్తా' అని రగిలిపోయాడు శ్రీహాన్. మిగిలినవాళ్లు శ్రీహాన్‌కు సపోర్ట్ చేయడంతో అతడు కెప్టెన్ అయ్యాడు. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. చదవండి: బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా? అప్పుడే విషం చిమ్మి అంతలోనే కలిసిపోయిన బావామరదళ్లు