
ఎన్నోసార్లు కెప్టెన్సీ కంటెండర్ అవుతున్నా కెప్టెన్ కాలేకపోతున్నారు కొందరు హౌస్‌మేట్స్. కారణం.. కెప్టెన్‌ను నిర్ణయించే బాధ్యత హౌస్‌మేట్స్ చేతిలో పెడుతున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే చాలాసార్లు అదే రూల్ ఫాలో అయిన బిగ్‌బాస్ ఈసారి కూడా మళ్లీ దాన్నే అమలు చేశాడు. ఎంతో కష్టపడి కెప్టెన్సీ బరిలో నిలిచిన కీర్తి, సూర్య, శ్రీహాన్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకోమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. ఈ ముగ్గురిలో సూర్య, కీర్తి ఇదివరకే ఒకసారి కెప్టెన్ అయ్యారు.
దీంతో మెజారిటీ ఇంటిసభ్యులు శ్రీహాన్‌కు మద్దతు పలుకుతూ మిగతావారికి కత్తిపోట్లు గుచ్చారు. అలా కీర్తికి ఒకటి, సూర్యకు మూడు కత్తిపోట్లు పడ్డాయి. తర్వాత ఇనయ లేచి సూర్యకు కత్తి గుచ్చేస్తా అంటూనే వెళ్లి శ్రీహాన్‌కు కత్తి పొడిచింది. ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కు ఇంటిసభ్యులు ముక్కున వేలేసుకున్నారు. ఇనయ గేమ్ చేంజర్ అని సూర్య ఉప్పొంగిపోగా వారానికి ఒకసారి రంగు ఎవరు మారుస్తున్నారు? అని ఇనయమీద అసహనం వ్యక్తం చేశాడు శ్రీహాన్. ఫైనల్‌గా ఈ రోజు శ్రీహాన్ పంట పండి అతడు కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది.
చదవండి: కలిసిపోయిన సునయ, ఈ వారం కెప్టెన్ ఎవరంటే?
ఆటోలో సిటీ అంతా తిరిగిన నటుడు, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment