Bigg Boss 6 Telugu, Episode 94: మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు హౌస్‌మేట్స్‌కు వరుస ఛాలెంజ్‌లు విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్‌లలో ఎవరు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో చెప్పాలన్నాడు. అందులో ఎవరు గెలుస్తారో కూడా ముందే ఊహించాలన్నాడు. కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగిస్తానని మెలిక పెట్టాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నేడు రెండో ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రేవంత్, ఇనయ పోటీపడ్డారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.1,10,000 ప్రైజ్‌మనీకి తిరిగి యాడ్ అవుతాయన్నాడు.
అందరూ అనుకున్నట్లుగా పిరమిడ్ పడొద్దు అనే ఛాలెంజ్‌లో రేవంత్ విజయం సాధించడంతో రూ.1,10,000 గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత మూడో ఛాలెంజ్ కోసం ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంచుకోమన్నాడు. దీంతో ఆదిరెడ్డి- కీర్తి, శ్రీహాన్- శ్రీసత్య మనీ ట్రాన్స్‌ఫర్ గేమ్‌లో పోటీపడ్డారు. ఇనయ, రేవంత్, రోహిత్.. ఆదిరెడ్డి టీమ్ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీహాన్- శ్రీసత్య గెలవడంతో వారు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు.
తర్వాత రేవంత్ ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ పాట పాడగా ఆదిరెడ్డి అందుకనుగుణంగా స్టెప్పులేశాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో ఛాలెంజ్ ప్రవేశపెట్టాడు. పవర్ పంచ్ టాస్క్‌లో రేవంత్, ఇనయ పాల్గొనగా అందరూ ఊహించినట్లు రేవంత్ గెలవడంతో ప్రైజ్‌మనీకి మరో రూ.2 లక్షలు జమయ్యాయి. దీంతో మొత్తం ప్రైజ్‌మనీ రూ.41,10,100కి చేరింది.
రాత్రి శ్రీసత్య ఓ దెయ్యం కథ చెప్పింది. ఓ ఫంక్షన్‌లో ఓ అబ్బాయి వింతగా ప్రవర్తించాడని చెప్పింది. అందరూ ఆ అబ్బాయిని కొడుతున్నా అతడికి చలనం లేకుండా అలాగే నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడని చెప్పింది. ఇంతలో సడన్‌గా దెయ్యం సౌండ్ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్ బెడ్ మీదకు చేరింది. ఇక శ్రీహాన్ అయితే బాత్రూమ్‌కి వెళ్లడానికి కూడా భయపడ్డాడు. అది గమనించిన శ్రీసత్య కావాలని దెయ్యంలా నవ్వుతూ అతడిని మరింత భయపెట్టింది. ఇక ఇనయ అయితే ఏకంగా దెయ్యం పట్టినదానిలా ప్రవర్తించి ఆదిరెడ్డిని వణికిపోయేలా చేసింది. దెయ్యం భయంతో అందరూ జడుసుకుంటూ, నవ్వుకుంటూ ఏ అర్ధరాత్రికో పడుకున్నారు.
చదవండి: స్టేజీపై భార్యను పరిచయం చేసిన హీరో సత్యదేవ్
నేను టాప్5లో ఉండనని తెలుసు, రేవంత్ ఎలిమినేట్ అవ్వాలి: ఫైమా
Comments
Please login to add a commentAdd a comment