Singer Revanth
-
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్‌బాస్ 1బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్‌బాస్ 2బిగ్‌బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్‌బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్‌బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్‌బాస్ 5బిగ్‌బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్‌బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్‌బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్ రేవంత్, వీడియో వైరల్
బిగ్‌బాస్ 6 తెలుగు విజేత, సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సీజన్లో బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన రేవంత్ తనదైన ఆట తీరు, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి టైటిల్ గెలిచేది తానే అంటూ ధీమా వ్యక్తం చేశాడు. చెప్పినట్టుగా బిగ్‌బాస్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 15 వారాల పాటు హౌజ్‌లో సందడి చేసిన రేవంత్ బిగ్‌బాస్ ఇంట్లో ఉండగానే తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య అన్విత ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సంతోషకర సమయంలో భార్య పక్కనే లేనని, బిడ్డను ఎత్తుకోలేకపోయానంటూ రేవంత్ ఇంట్లో కన్నీరు పెట్టుకున్నాడు. చదవండి: ఆస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’ ఇక ఎట్టకేలకు హౌజ్ నుంచి బయటకు రాగానే రేవంత్ తన కూతురిని తొలిసారి కలుసుకున్నాడు. టైటిల్‌తో బయటకు వచ్చిన రేవంత్‌కు ఆయన భార్య గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అంతేకాదు ఎప్పటికి గుర్తుండిపోయేలా బిడ్డను తొలిసారి రేవంత్ చేతికి ఇచ్చింది. విజేతగా ఇంటికి వెళ్లిన రేవంత్‌కు ఇది డబుల్ ధమాకా అనే చెప్పాలి. అటూ విన్నర్‌గా నిలిచి తొలిసారి తన కూతురిని చూడపోతున్నాడు. బిగ్‌బాస్ ట్రోఫీతో ఇంటికి వెళ్లిన రేవంత్ కళ్లకు గంతలు కట్టి లోపలికి తీసుకేళ్లారు. పాప దగ్గరికి వెళ్లగానే కళ్ల గంతలు తీసి కూతురిని రేవంత్ చేతికి అందించింది భార్య అన్విత. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచిన విజయ్.. తలైవాను అధిగమించాడా? పాపను అపురూపంగా చేతిలోకి తీసుకుంటూ రేవంత్.. తండ్రిగా ఎమోషనల్ అయిపోయాడు. తొలిసారి రేవంత్ తన బిడ్డను కలిసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రిగా కూతురిని చూసుకుని మురిసిపోతున్న రేవంత్ ఈ వీడియో అతడి ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. దీనికి ‘క్యూట్ వీడియో’, ‘మోస్ట్ అడారబుల్ మూమెంట్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ విజేతగా నిలచి టైటిల్‌ను తన బిడ్డకు అంకితం ఇస్తానంటూ రేవంత్ మొదటి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐍𝐕𝐈 (@anvitha_gangaraju) -
శ్రీహాన్‌కు హింట్.. బిగ్‌బాస్ షోపై రేవంత్ ఫ్యాన్స్ ఫైర్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విన్నర్ రేవంత్ అని ముందునుంచే అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. చివరికి అదే నిజమైంది. ప్రైజ్‌మనీలో నుంచి రూ.40 లక్షలు ఆఫర్ చేసినా నాకు కప్పే కావాలని మొండిగా కూర్చున్నాడు. కానీ శ్రీహాన్ మాత్రం ట్రోఫీ గెల్చుకుంటానో లేదోనన్న భయంతో ఆ ఆఫర్‌కు టెంప్ట్ అయిపోయి డబ్బులు తీసేసుకున్నాడు. చివరికి నాగ్.. రేవంత్ కంటే శ్రీహాన్‌కు కొద్దిగా ఓట్లు ఎక్కువ పడ్డాయని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. కానీ రేవంత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మావాడికి తక్కువ ఓట్లు రావడమేంటని మండిపడుతున్నారు. బిగ్‌బాస్ 6 విన్నర్ ఎవరు? అని స్టార్ మా నిర్వహించిన పోల్‌లో కూడా రేవంత్‌కు అత్యధికంగా 61 శాతం ఓట్లు పడ్డాయని, అలాంటప్పుడు శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లు అని అబద్ధాలాడుతున్నారేంటని గరమవుతున్నారు. అయినా ఫినాలేలో ఇద్దరు మిగిలినప్పుడు డబ్బులు ఆఫర్ చేయడమేంటి? అందులోనూ హౌస్మేట్స్ అందరితో శ్రీహాన్‌ను డబ్బులు తీసుకోమని హింట్ ఇవ్వడమేంటి? చివర్లో అతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడమేంటి? అని ఫైర్ అవుతున్నారు. ఆరు సీజన్లలో ఇంత చెత్త సీజన్‌ను ఎప్పుడూ చూడలేదని షోపై దుమ్మెత్తిపోస్తున్నారు. పైసా కూడా తీసుకోకుండా ప్రేక్షకుల ఓట్లకు విలువిచ్చి రేవంత్ ట్రోఫీ ఎత్తుకున్నాడని.. అతడే రియల్ విన్నర్ అంటూ గర్వపడుతున్నారు. అప్పుడు అభిజిత్, ఇప్పుడు రేవంత్ డబ్బును లెక్క చేయకుండా ట్రోఫీ కోసం నిలబడ్డారు, అదీ విన్నర్ లక్షణమంటూ కొనియాడుతున్నారు. మొదట్లో డబ్బు వద్దే వద్దన్న శ్రీహాన్ రూ.40 లక్షలనేసరికి మాటమార్చి బ్రీఫ్‌కేస్ అందుకుని ప్రేక్షకుల ఓట్లను కరివేపాకులా తీసిపారేశాడని విమర్శిస్తున్నారు. బిగ్‌బాస్ టీమ్ రేవంత్‌కు దక్కాల్సిన రూ.50 లక్షలు కూడా శ్రీహాన్‌కే కట్టబెట్టాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలా హోరెత్తిపోతున్న కామెంట్లతో ట్విటర్లో #Revanth, #BiggBossTelugu6 హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌గా మారాయి. చదవండి: రేవంత్ విజయానికి కారణాలివే! -
మొత్తం బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా?
బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. 15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. విన్నర్ డిక్లరేషన్ అనంతరం చివరిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. శ్రీహాన్ నిర్ణయం వల్ల రేవంత్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో శ్రీహాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కానీ, ఏకంగా శ్రీహాన్ నలభై లక్షలు దక్కించుకున్నాడు. దీంతో యాభై లక్షల ప్రైజ్ మనీలో విజేత రేవంత్‌కి దక్కింది పది లక్షలే. అయినప్పటికీ విన్నర్‌గా నిలిచిన రేవంత్ గెలుచుకున్న ప్రైజ్‌మనీ దాదాపు రూ. 50 లక్షల పైనే అయ్యింది. బిగ్‌బాస్ సీజన్ 6 ట్రోఫీతో పాటు అతను పది లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. వీటితో పాటు ‘సువర్ణభూమి’ వారి 605 గజాల ఫ్లాట్, పది లక్షల విలువైన మారుతి సుజుకి బ్రెజా కారుని ప్రకటించారు. సువర్ణ భూమి వారు ఇచ్చిన ప్లాట్ విలువ రూ. 30 లక్షలు ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రేవంత్‌కు యాభై లక్షలు అందుకున్నాడు. ఇకపోతే బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడనేది ఆసక్తిగా మారింది. ప్రైజ్‌మనీ విషయం పక్కన పెడితే.. అతడి 15 వారాల పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ తాజా బజ్ ప్రకారం.. రేవంత్ ఒక్కో వారానికి రూ. 2 లక్షల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రేవంత్ 15 వారాలకు గానూ నుంచి దాదాపు రూ. 30 లక్షల పైనే అందుకున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీతో పాటు పారితోషికం కలిపి రూ. 80 లక్షలపైనే సంపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రకంగా ఈ సీజన్లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా రేవంత్ నిలవడం విశేషం. చదవండి: అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి నాకు నేనే పెద్ద విమర్శకురాలిని: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు -
బిగ్‌బాస్ 6: రేవంత్ విజయానికి కారణాలివే!
టైటిల్ గెలిచేది నేనే, రాసిపెట్టుకోండి అని రేవంత్ చాలాసార్లు అన్నాడు. ప్రైజ్‌మనీలో నుంచి డబ్బులు కట్ అయినప్పుడు కూడా తన జేబులో ఉన్న డబ్బులు పోయినట్లు అందరికంటే ఎక్కువగా అల్లాడిపోయాడు. తిరిగి ప్రైజ్‌మనీ రూ.50 లక్షలకు చేరుకున్నప్పుడు ఏకంగా సీజన్ టైటిల్ గెలిచేసినట్లు సంబరపడ్డాడు. తన మీద, తన అభిమానుల మీదున్న నమ్మకం అది! మొదట్లో ఈ సీజన్ ట్రోఫీ ఎత్తేది నేనే అని రేవంత్ అన్నప్పుడు చాలామందికి విడ్డూరంగా అనిపించేది. కోపానికి, ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఇతడు గెలవడమేంటని నవ్వుకున్నారు. కానీ నాగ్ అతడు చేసిన తప్పొప్పులను ఎత్తిచూపినా, చూపకోయినా కోపాన్ని మాత్రం తగ్గించుకోమని పదేపదే హెచ్చరిస్తూ ఉండేవాడు. అయినా ఆవేశాన్ని అణచుకోకపోవడంతో ఏకంగా ఎల్లో కార్డ్ చూపించాడు. దెబ్బకు ఓ మెట్టు దిగిన రేవంత్ అందరినీ గుద్దిపడేస్తా అనే లెవల్లో కాకుండా తన జోలికొస్తే మాత్రమే ఊరుకోను అన్నట్లుగా కొంత కామ్ అయిపోయాడు. కానీ అప్పటివరకు గేమ్‌లో ఎంతోమందిని విసిరికొట్టాడు, నెట్టేశాడు, పడేశాడు, చాలా ఫిజికల్ అయ్యాడు. అంత క్రూరంగా గేమ్ ఆడేవాడు, కానీ అది గెలుపు కోసం మాత్రమే! అయితే రేవంత్‌లో ఉన్న ఓ గొప్ప లక్షణం ఏంటంటే కోపాన్ని ఎక్కువ సేపు కంటిన్యూ చేయడు. గొడవ అయిపోయాక దాన్ని మర్చిపోయి వెంటనే సారీ చెప్పి అవతలివాళ్లను అక్కున చేర్చుకుంటాడు. ఒకరకంగా ఇదతడికి మైనస్‌గానూ మారింది. అప్పటివరకు అంత ఆవేశపడ్డ వ్యక్తి సడన్‌గా సారీ చెప్తున్నాడంటే అది నటనా? నిజమా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ రానురానూ అతడి కోపం పాలపొంగు వంటిదని హౌస్‌మేట్స్‌కు, ప్రేక్షకులకు అర్థమైంది. ఇక ఫిజికల్ టాస్కుల్లో రేవంత్‌ను కొట్టేవాడే లేడు. నిద్రలో నుంచి లేపి టాస్కు ఆడమన్నా సిద్ధంగా ఉంటాడు. హౌస్‌లో రెండు సార్లు కెప్టెన్ అయిన ఘనత కూడా ఇతగాడి పేరు మీదుంది. స్నేహానికి ఎంత విలువిస్తాడో ప్రత్యక్షంగా చూశాం. కాకపోతే రేవంత్‌లో కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఎంతసేపూ సరుకులు అయిపోకుండా ఎలా వండాలి? అని ఆలోచించేవాడే తప్ప అవతలివాళ్ల ఆకలి తీరుతుందా? లేదా? అని అర్థం చేసుకునేవాడు కాదు. మా కడుపు నిండట్లేదు బాబోయ్, ఇంకాస్త వండండి అని చెప్పినా సరే పిడికెడంత బియ్యం కూడా ఎక్కువ పెట్టేవాడు కాదు. స్ట్రిక్ట్‌గా ఉండటంతో చాలామంది హౌస్మేట్స్ అతడిని వెనకాల తిట్టుకునేవారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. కొన్నిసార్లు రేవంత్ ఫుడ్ దాచుకుని తినేవాడు. ఇక ఆవేశంలో ఏం మాట్లాడతాడో అతడికే అర్థం కాదు. ఆ మాటలను తర్వాత మర్చిపోతుంటాడు కూడా! మరి ఇన్ని మైనస్‌లున్నా విజేత ఎలా అయ్యాడంటారా? రేవంత్ చెప్పినట్లే అతడికి హౌస్‌లో ఎవరూ గట్టి పోటీ ఇవ్వలేదు. శ్రీహాన్ మొదట్లో ఓపెన్ అవడానికి, గేమ్ ఆడటానికి సమయం పట్టింది. తర్వాత ఎంటర్టైన్మెంట్తో పాటు టాస్కులు ఆడినప్పటికీ నామినేషన్స్‌లో అతడు చేసే వెటకారంతో విమర్శలపాలు కావాల్సి వచ్చింది. కానీ చివర్లో మాత్రం పుంజుకుని రేవంత్‌తో ఓటింగ్‌లో తలపడ్డాడు. ఆదిరెడ్డి.. ఎంతసేపూ రివ్యూలు ఇస్తూ ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ అతిగా ఆలోచనల్లో గడిపేశాడు. కీర్తి.. ప్రతిచిన్నదానికీ హర్ట్ అవుతూ బాధపడటానికే ఎక్కువ సమయం వెచ్చించింది. మాటతో, ప్రవర్తనతో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న రోహిత్ ఆటలో మాత్రం వెనకబడ్డాడు. ఇక ఫినాలేలో ప్రేక్షకుల ఓట్లకు విలువిచ్చి డబ్బు తీసుకోకుండా చివరి క్షణం వరకు అలాగే నిలబడి ట్రోఫీ ఎగరేసుకుపోయాడు రేవంత్. చదవండి: విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్.. ఎన్ని లక్షలో తెలుసా? మరికొద్ది గంటల్లో పెళ్లి.. గ్రాండ్ ఫినాలేకు వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంటల -
BB6 Finale: చరిత్ర సృష్టించిన బిగ్‌బాస్ 6.. శ్రీహాన్, రేవంత్ ఇద్దరూ విన్నర్సే!
బిగ్‌బాస్ షో ఎంతమందితో ప్రారంభమైనా గెలిచేది ఒక్కరే. కానీ మొట్టమొదటిసారి బిగ్‌బాస్ షోలో ఇద్దరు విన్నర్స్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 బిగ్‌బాస్ సీజన్లు జరగ్గా ఇంతవరకు ఎన్నడూ లేనట్లుగా బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరు విజేతలుగా నిలిచారని తెలిపాడు నాగ్. రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్ రన్నరప్ అని ఒప్పేసుకున్నాడు. కప్పు ముఖ్యం బిగిలూ అనుకున్న రేవంత్ డబ్బులను లెక్కచేయకుండా ట్రోఫీ ఎత్తుకుని విన్నర్‌గా అవతరించాడు. అంతేకదా అనుకుంటున్నారేమో! చివర్లో అసలైన ట్విస్ట్ బయటపెట్టాడు నాగ్. ప్రేక్షకులు శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లేసి గెలిపించారని వెల్లడించడంతో అతడి ముఖం మతాబులా వెలిగిపోయింది. అదే సమయంలో ట్రోఫీ నాదే అని షో మొదటి రోజు నుంచే కలలు కంటున్న రేవంత్ ముఖం వెలవెలబోయింది. అయినా నాగార్జున ఆఫర్ చేసిన బ్రీఫ్‌కేస్ మాయ వల్ల శ్రీహాన్ రూ.40 లక్షలు గెల్చుకుని ప్రేక్షకుల ఓట్ల ప్రకారం విజేతగా నిలవగా.. కప్పు అందుకుని రేవంత్ విన్నర్ అయ్యాడు. చదవండి: ముద్దు పెట్టుకోబోయిన నాగ్.. మెలికలు తిరిగిన ఫైమా విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్.. ఎన్ని లక్షలంటే? -
విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్, ఎన్ని లక్షలో తెలుసా?
బ్రీఫ్‌కేస్... బిగ్‌బాస్ షో ఫినాలేలో ఇంట్రస్టింగ్ అంకం అది. గత సీజన్లలో ఓడిపోయి వట్టి చేతులతో వెళ్లేబదులు సూట్‌కేస్ అందుకుని హౌస్ నుంచి సంతృప్తిగా బయటకు వచ్చేసినవాళ్లు ఉన్నారు. మరి ఈ సీజన్లో ఎవరైనా సూట్‌కేసు అందుకుంటారా? అంటే డౌటే అన్న అనుమానం వ్యక్తమైంది. హౌస్‌లో టాప్ 3 కంటెస్టెంట్లు మిగిలినప్పుడు రవితేజ సూట్‌కేస్ పట్టుకుని వెళ్లాడు. మొదట ప్రైజ్‌మనీలో నుంచి పది శాతం ఇస్తానని తర్వాత దాన్ని 30 శాతం వరకు తీసుకెళ్లాడు. అయినా సరే ఎవరూ దాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. కీర్తిని ఆమె ఫ్రెండ్ డబ్బులు తీసుకోమని చెప్పినా ఆమె వద్దని తలాడించి చివరికి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసింది. తర్వాత శ్రీహాన్, రేవంత్.. ఇద్దరు మాత్రమే మిగిలారు. దీంతో నాగార్జున గోల్డెన్ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్ ఆ డబ్బును రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్ అమ్మానాన్న కోసం తీసుకుంటున్నానన్నాడు. అలా రన్నరప్‌గా శ్రీహాన్ రూ.40 లక్షలు గెల్చుకోగా, విన్నర్ రేవంత్‌కు కేవలం రూ.10 లక్షలు మాత్రమే మిగిలాయి. చదవండి: ఆ ముగ్గురి కంటే ముందే ఎలిమినేట్ అయినందుకు హ్యాపీ: ఆదిరెడ్డి మరికొద్ది గంటల్లో పెళ్లి.. పెళ్లికూతురి గెటప్‌లో ఫినాలేకు వచ్చిన నేహా చౌదరి -
రూ.5 లక్షలు గెలుచుకున్న శ్రీహాన్, రియలైజ్ అయిన కీర్తి
మాజీ కంటెస్టెంట్ల రాకతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కళ వచ్చింది. మొదటగా రోల్ రైడా హౌస్‌లో అడుగుపెట్టి త్వరలో బీబీ జోడీ షో రాబోతుందంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అది కంటెస్టెంట్లు జంటలుగా పాల్గొనే రియాలిటీ డ్యాన్స్ షో అని తెలిపాడు. తర్వాత ఫైనలిస్టులకు ఆల్ ద బెస్ట్ చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత మెహబూబ్, అషూ జంటగా లోపలకు ఎంట్రీ ఇచ్చారు. వారు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా ఏ ప్రశ్న అడిగినా తప్పు సమాధానమే చెప్పాలన్నారు. ఇందులో కీర్తి.. శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అని అడగ్గా ఆదిరెడ్డి టపీమని ఇనయ పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. అంతలోనే బ్యాడ్‌న్యూస్ అంటూ.. హౌస్‌లో ఒకరిని తమతోపాటు ఎలిమినేట్ చేసి తీసుకెళ్తామనగానే అందరి ముఖాలు వాడిపోయాయి. మరీ టెన్షన్ పెట్టడం మంచిదికాదని భావించిన వాళ్లు ఇది ప్రాంక్ అని చెప్పడంతో హౌస్మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. వారు వెళ్లిపోగానే అవినాష్- అరియానా వచ్చి డ్యాన్స్ చేసి, పంచ్‌లు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత చైతూ, కాజల్ వచ్చి ఫైనలిస్టులను సర్ప్రైజ్ చేశారు. శ్రీహాన్ అంటే ఎంటర్టైన్మెంట్, రేవంత్.. కోపం, ఆదిరెడ్డి.. కాన్ఫిడెంట్, రోహిత్.. కామ్ అండ్ కంపోజ్డ్, కీర్తి గేమ్ బాగా ఆడుతుందంటూ ఒక్కొక్కరి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాడు చైతూ. అనంతరం కొన్ని వస్తువులు వాడుతూ డ్యాన్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కీర్తి గెలిచి ఫ్రైడ్ చికెన్ సంపాదించుకుంది. ఈ జంట వెళ్లిపోగానే రవి-భాను లోపలకు ఎంట్రీ ఇచ్చారు. ఫైనలిస్టులకు టంగ్ ట్విస్టర్స్ ఇచ్చి వాటిని స్పీడ్‌గా చెప్పాలన్నాడు. అందరూ బానే చెప్పినా తెలుగు రాని కీర్తి కొంత తడబడుతూ దాన్ని పూర్తి చేసింది. తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. సీజన్ ముగింపుకు వచ్చేసరికి ఎవరి మీద అభిప్రాయం మారిందో చెప్పాలన్నాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. మొదట్లో కీర్తి మంచి ఫ్రెండ్‌గా ఉండేది. కానీ రానురానూ గొడవలయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ గేమ్ మీద ఫోకస్ పెట్టి ఇంతవరకు రావడం చిన్న విషయం కాదంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి.. మొదట్లో రేవంత్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడనిపించింది. కానీ చాలాకాలానికి అది యాటిట్యూడ్ కాదని అర్థమైందన్నాడు. రోహిత్ వంతు రాగా ఆదిరెడ్డి తప్పును అంగీకరిస్తారని తెలుసుకున్నానన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. ఆదిరెడ్డి రివ్యూయర్ కాబట్టి మానిప్యులేటర్ అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో అతడితో ఎక్కువగా ఉంటున్నాను. ఆ సమయంలోనే ఆయన్ను నేనెందుకు అర్థం చేసుకోలేకపోయానని ఫీలయ్యానని చెప్పాడు. కీర్తి వంతు రాగా.. శ్రీహాన్ జెన్యూన్ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది అని చెప్పింది. ఇకపోతే కొన్నివారాలుగా ఆన్లైన్లో లెన్స్‌కార్ట్ స్టైలిష్ కంటెస్టెంట్ పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా! ఇందులో శ్రీహాన్ గెలిచి స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలవడమే కాకుండా రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మరుసటి రోజు అఖిల్ సార్థక్, తేజస్విని మదివాడ హౌస్‌లోకి వచ్చి ఆటపాటలతో సందడి చేసి వీడ్కోలు తీసుకున్నారు. చదవండి: అర్జున్ కల్యాణ్‌కు నేనంటే లవ్.. వీడియో చూసి షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ విన్నర్ అతడే! -
సస్పెన్స్‌కు తెరపడింది.. బిగ్‌బాస్6 విన్నర్ అతడే!
బిగ్‌బాస్ సీజన్-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్‌తో రేవంత్‌ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్‌బాస్ సీజన్-6 విజేత ఎవరన్నదానిపై హౌస్మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్-4 ప్లేస్‌ను కీర్తి దక్కించుకుంది. టాప్-3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్‌లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్-6 విజేతగా నిలవగా, శ్రీహాన్ రన్నరన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
శ్రీసత్య ఎలిమినేట్, క్షమించమని చేతులెత్తి వేడుకున్న శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 104: బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లు గెలవడమే కాకుండా ఏకాభిప్రాయంలోనూ నెగ్గి రోహిత్, శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లడిగే అవకాశాన్ని దక్కించుకున్నారు. నేడు మిగతావారికి కూడా ఛాన్స్ రావాలన్న ఉద్దేశంతో మరిన్ని టాస్కులు పెట్టాడు. అలా వాటిలో శ్రీహాన్, కీర్తి గెలిచి ప్రేక్షకులతో మాట్లాడారు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. 'నాకు ఓటడిగే అర్హత ఉందో, లేదో మీరే నిర్ణయించాలి. దానికంటే ముందు నేను తెలీకుండా చేసిన తప్పులకు క్షమాపణలు అడుగుతున్నా. నా మాటల వల్ల, యాటిట్యూడ్ వల్ల కొందరు బాధపడుతున్నారని తర్వాత తెలిసింది. నాకు తెలియకుండానే వారిని బాధపెట్టానని అర్థమయ్యాక నా తప్పులు సరిదిద్దుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. టికెట్ టు ఫినాలే రేవంత్ వదిలేయడం వల్ల నాకు వచ్చింది అని అందరూ అంటుంటే బాధగా ఉంది. కానీ గేమ్ అంతా మీరు చూశారు. ఊహించని పరిస్థితుల మధ్య బిగ్‌బాస్ షోకు వచ్చాను. ట్రోఫీ గెలవడం నాకు చాలా ముఖ్యం. మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి గెలిపించండి. ఎక్కువ క్షమించేవాళ్లే ఎక్కువ ప్రేమిస్తారు. నేను తప్పు చేసినందుకు క్షమించండి' అంటూ చేతులెత్తి వేడుకున్నాడు. అలాగే ఇండియన్ ఆర్మీ జవాన్లకు, అన్నం పెట్టే రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ సెల్యూట్ చేశాడు. తర్వాత కీర్తి మాట్లాడుతూ.. 'ఇన్నిరోజులు బిగ్‌బాస్ హౌస్‌లో కీర్తిని చూశారు. బయట ఎలా ఉన్నాను? లోపల ఎలా ఉన్నాను? అన్నీ చూశారు. మీ ఇంటి కూతురిలా నాకు సపోర్ట్ చేశారు. మున్ముందు కూడా అలాగే మద్దతిస్తారనుకుంటున్నాను. నా శక్తిని మించి ఆడాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నాలాంటివాళ్లు కూడా బలంగా ఉండాలనుకుంటున్నాను. ట్రోఫీ గెలిచినా కూడా ఆ డబ్బులు నాకోసం వాడుకోను. నాలాంటి అనాధల కోసం, సామాజిక కార్యక్రమాల కోసం ఆ డబ్బులు వాడతాను. అందరికీ ఓట్లేయండి, కానీ నాక్కొంచెం ఎక్కువ ఓట్లేయండి' అని కోరింది. తర్వాత ఉదయం ఆరుగంటలకే హౌస్‌మేట్స్‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ అర్జంటుగా బ్యాగులు సర్దేసుకోండి, ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేస్తానని చెప్పాడు. ఈ మాటతో షాకైన కంటెస్టెంట్లు చేసేదేం లేక బుద్ధిగా తమ బట్టలు సర్దేసుకుని గార్డెన్ ఏరియాలో వచ్చి నిల్చున్నారు. మీ అభిప్రాయంలో ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారో చెప్పమని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్.. రోహిత్ పేరు, కీర్తి.. ఆదిరెడ్డి, శ్రీసత్య.. రేవంత్, ఆదిరెడ్డి.. కీర్తి, రోహిత్.. శ్రీహాన్ ఎలిమినేట్ కావచ్చని అభిప్రాయపడ్డారు. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మెజారిటీ ఇంటిసభ్యులు కీర్తి వెళ్లిపోతుందని నిర్ణయించారు. కానీ ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం శ్రీసత్య టాప్ 5కి చేరుకోకుండా ఈ క్షణమే ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. ఎలిమినేషన్‌ను ముందే పసిగట్టిన శ్రీసత్యకు బాధను లోలోపలే దిగమింగి బయటకు మాత్రం చిరునవ్వుతో నిలబడింది. కానీ రేవంత్ బాధ ఆపుకోలేక ఏడ్చేశాడు. చివరికి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ హౌస్‌కు వీడ్కోలు పలికింది శ్రీసత్య. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోనున్న నాగ్ రేవంత్ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని అబద్ధం చెప్పాం -
రేవంత్ తండ్రి చనిపోయినా దుబాయ్‌లో ఉన్నాడని అబద్ధం చెప్పా
టాస్కుల్లో రేవంత్‌ను కొట్టేవాడే లేడు. కానీ వ్యక్తిత్వంలో మాత్రం అతడు ఎక్కడో వెనక స్థానంలో ఉన్నాడు. మిగతావాళ్లను చులకన చేయడం, తనే తోపునని ఫీలవడం, టాస్కుల్లో ఫిజికల్ అవడం, ఓటమిని జీర్ణించుకోలేని తత్వం.. ఇలా చాలా మైనస్‌లే ఉన్నాయి. కానీ షో మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉన్నాడు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు. అందరితో గొడవలు పడతాడు, మళ్లీ కాసేపటికే సారీ చెప్పి కలిసిపోతాడు. అలా రేవంత్‌లో ప్లస్‌లు, మైనస్‌లు రెండూ ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే రేవంత్ కప్పు కొట్టేలా ఉన్నాడు. ఈ క్రమంలో రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా భర్త పేరు శంకర. నాకు మొదట కొడుకు పుట్టాడు. తర్వాత రేవంత్ కడుపులో ఉండగానే నా భర్త చనిపోయాడు. మా ఆయన లేకపోయినా బంగారంలాంటి పిల్లల్నిచ్చారని ఎప్పుడూ తలుచుకుంటాను. భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని పెంచానంటే అది నా ఫ్యామిలీ వల్లే.. మా నాన్న, అమ్మ, అన్నయ్యలు, వదినలు.. నన్ను, నా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. వాళ్లు అండగా లేకపోతే నేను రోడ్డున పడేదాన్ని. రేవంత్ పుట్టాక నీకు నాన్న లేడని చెప్తే ఎక్కడ మనసులో పెట్టుకుంటాడోనని నిజం దాచాను. మీ నాన్న దుబాయ్‌లో ఉంటారు.. నిదానంగా వస్తారులే అని చెప్పేవాళ్లం. వాడిని చూస్తే నాకు ఇప్పటికీ బాధగా ఉంటుంది. ఎందుకంటే వాడు తండ్రి ప్రేమకు నోచుకోలేదు. భగవంతుడు ఎందుకా లోటు మిగిల్చాడని ఎప్పుడూ బాధపడేదాన్ని. రేవంత్‌కు నా లక్షణాలే వచ్చాయి. కానీ అంత కోపం నాకు లేదు. వాడి కోపం కాసేపే ఉంటుంది. తర్వాత మామూలైపోయి సారీ చెప్తాడు' అని చెప్పుకొచ్చింది రేవంత్ తల్లి. చదవండి: కీర్తి ఎలిమినేట్ అవుతుందన్న హౌస్మేట్స్, ఝలక్ ఇవ్వనున్న బిగ్‌బాస్ -
నా తప్పులు మన్నించి విజేతగా నిలపండి.. ప్రేక్షకులను ఓట్లడిగిన శ్రీసత్య
Bigg Boss Telugu 6, Episode 102 Highlights: కంటెస్టెంట్లు అందరూ మీ గమ్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఫినాలే కోసం ఊదరగొట్టాడు బిగ్‌బాస్. మీ మనసుల్లోని మాటలను ప్రేక్షకులతో నేరుగా పంచుకుని వారి నుంచి ఓట్లు కోరవచ్చంటూ ఓట్ అప్పీల్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మొదటగా మీకు వినిపిస్తుందా? అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో బిగ్‌బాస్ ప్లే చేసిన సౌండ్స్‌ను గుర్తించి సరైన ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఛాలెంజ్ నుంచి తొలగిపోయారు. అయితే శ్రీసత్య అరవడం వల్లే తన గేమ్ పోయిందని విసుకున్నాడు శ్రీహాన్. నీ తప్పు కూడా ఉంది, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకు అని గట్టిగానే ఆన్సరిచ్చింది శ్రీసత్య. కాసేపటికి శ్రీహాన్ సారీ చెప్పడంతో గొడవ చప్పున చల్లారింది. మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ఆదిరెడ్డి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ల అప్పీలు కోసం ఎన్నుకోమన్నాడు బిగ్‌బాస్. రేవంత్ మినహా మిగిలిన ముగ్గురూ రోహిత్‌కే ఓటేయడంతో అతడు ఓట్లు అడిగే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో రోహిత్ మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను ఎలా ఆడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? నా థింకింగ్ ఏంటి? నా క్యారెక్టర్ ఏంటి? అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మొదట్లో మెరీనాతో కలిసి ఆడేవాళ్లం. సెపరేట్ అయ్యాక విడివిడిగా ఆడాం. నాకు ఎప్పుడూ అదృష్టం కలిసిరావట్లేదు. ఈ సీజన్ 6 టైటిల్ గెలవాలన్నదే నా కోరిక. నా కుటుంబం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి' అంటూ తన స్పీచ్ ముగించాడు. తర్వాత ఎగ్స్ షాట్ అనే ఛాలెంజ్‌లో రేవంత్, శ్రీసత్య, కీర్తి, శ్రీహాన్ పాల్గొనగా రేవంత్, శ్రీసత్య గెలుపొందారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో సెలక్ట్ చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్, కీర్తి, రోహిత్.. శ్రీసత్యకు ఓటేయగా ఆదిరెడ్డి ఒక్కడే రేవంత్‌కు మద్దతు పలికాడు. గెలిచేవాడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆదిరెడ్డి పరోక్షంగా రేవంతే విజేత అని అభిప్రాయపడినట్లు కనిపించింది. రేవంత్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అతడికి ఈ ఓట్ అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలని శ్రీసత్యకు ఇస్తే ఏం యూజ్ ఉంటుందని మాట్లాడాడు. దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా ఈ ఛాలెంజ్‌లో తనకు సపోర్ట్ చేయలేదని రేవంత్ ఒకింత హర్టయ్యాడు. ఇక శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లు అడుగుతూ.. 'మొదట్లో నాకు దెబ్బలు తగలకుండా ఆడాలనుకునేదాన్ని. కానీ మూడో వారం నుంచి నేను వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నేనేమైనా తప్పు చేసుంటే క్షమించండి. ఈ హౌస్‌లోకి వచ్చినప్పుడే విన్నర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ విజయం మీ చేతుల్లోనే ఉంది. ఈ టైటిల్ నాకెంతో ముఖ్యం.. ఈ సీజన్‌కు లేడీ విన్నర్ అయితే బాగుంటుంది. కాబట్టి మర్చిపోకుండా నాకు ఓటేయండి' అని అభ్యర్థించింది. మరోపక్క సోషల్ మీడియాలో శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె లేడీ విన్నర్ కావాలనుకుంటుందని చెప్పడంతో అభిమానుల మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి ఎన్నో వారాలుగా అన్యాయం.. ఎట్టకేలకు రోహిత్‌కు ఛాన్స్ -
జర్నీని చూసి కళ్లు చెమర్చిన శ్రీసత్య, గెలుపుపై రేవంత్ ధీమా!
Bigg Boss 6 Telugu, Episode 100: బిగ్‌బాస్ సీజన్ 6లో టాప్ 6 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు రెడీ అయ్యాయి. ఈరోజు ఇద్దరు హౌస్మేట్స్ జర్నీలను వారి కళ్లకు కట్టినట్లు చూపించాడు. అంతేకాకుండా ఇప్పటివరకు ఆడిన టాస్కులకు సంబంధించిన వస్తువులను గార్డెన్ ఏరియాలో ఉంచి పెట్టాడు. హౌస్‌లో సంతోషకరమైన, బాధాకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను అక్కడక్కడా అతికించాడు. మొదటగా రేవంత్‌ను గార్డెన్ ఏరియాలోకి రమ్మని పిలుపు వచ్చింది. డోర్ తీసుకుని బయటకు వచ్చిన రేవంత్ ఆ సెట్టింగ్ చూసి సర్ప్రైజ్ అయ్యాడు. అక్కడున్న బొమ్మను తీసుకుని ఈ షో గెలిచి ఇంటికి వెళ్లాక నా కూతుర్ని ఇలాగే ఎత్తుకుంటానని ఊహల్లో తేలిపోయాడు. ఇంతలో అతడికి భార్య అన్విత నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఎంతమంది ఉన్నా నువ్వు లేవనే బాధ ఉంది. కానీ నువ్వు గెలిచి రావాలని చెప్పడంతో సంతోషపడిపోయాడు రేవంత్. తర్వాత ఎప్పటిలాగే బిగ్‌బాస్ ఉపన్యాం అందుకున్నాడు. 'ఇప్పటివరకు గాత్రానికి సంబంధించిన ఎన్నో పోటీల్లో మీరు గెలిచారు. ఇప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించిన పోటీలో కూడా గెలవాలని బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. మొదటి రోజు నుంచే మీరు చూపించిన దూకుడు ఇతర పోటీసభ్యులకు తమ పోటీ ఎవరనే విషయాన్ని స్పష్టం చేసింది. మీ కోపం బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఓటమిని తీసుకోలేని మనస్తత్వం చుట్టూ ఉన్నవారికి మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశాన్నిచ్చింది. కోపాన్ని ఆయుధంగా కాకుండా ప్యాషన్‌గా మార్చారు. అది మీ నాయకత్వ లక్షణాలను, పట్టుదలను రెట్టింపు చేసింది. మీ ఆకలి.. టాస్కుల్లో ఎంత చూపించారో, హౌస్‌లో కూడా అంతే చూపించారు. దాచుకుని తినడంలో మీలోని చిన్నపిల్లాడి అమాయకత్వాన్ని బిగ్‌బాస్ గమనించాడు. మీ కోపం పరదా వెనకున్న సున్నిత మనసు బిగ్‌బాస్‌కు తెలుసు. జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. వాటన్నింటినీ దాచుకోకుండా ప్రేక్షకులకు చూపించినతీరు మిమ్మల్ని వారికి ఇంకా దగ్గర చేసింది. జీవితంలో తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని వదులుకుని ఇంటిసభ్యులకు దూరంగా ఉంటూ ఓవైపు కలతగా ఉన్నా, మరోవైపు గెలుపు కోసం ఎక్కడిదాకానైనా వెళ్లాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపింది...' అంటూ అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. అది చూసి ఎమోషనలైన రేవంత్.. బిగ్‌బాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకున్నాడు. తర్వాత శ్రీసత్యకు పిలుపు వచ్చింది. రాగానే అక్కతో ఫోన్ మాట్లాడి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఆమె గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. పరిస్థితులు భుజాలపై బరువును పెంచితే దాన్ని చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలే సత్తువ చూపించడమే మనిషి మొదటి విజయం. ఆ పట్టుదల, మొండితనం రెండూ ఉన్నాయి. కాబట్టే మీరు బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. కష్టం వచ్చినప్పుడు పారిపోవడమో, ఎదుర్కోవడమో రెండే దారులుంటాయి. మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడాన్ని ఎంచుకున్నారు. బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చిన మొదట్లో మీలో ఎన్నో అనుమానాలు, భయాలు, ప్రశ్నలు ఎవరికి ఎంత దగ్గరవ్వాలో తెలియని ఒక సంకోచ స్థితి మీ ఆటపై నుంచి దృష్టిని తప్పించినప్పుడు మీ అమ్మ కోసం బిగ్‌బాస్ ఇంట్లోకి మీరు వచ్చిన కారణం, అందుకు మీరు చేరుకోవాల్సిన లక్ష్యం గుర్తొచ్చాయి. ఒంటరితనమే అడ్డుగా మార్చుకున్న మీకు.. మీలో మరో కోణాన్ని తట్టే ఇద్దరు స్నేహితులు దొరికి ఈ ప్రయాణాన్ని సులువు చేశారు. మీ నవ్వు ఈ ఇంట్లో ఎప్పటికీ నిలిచిపోయేలా మీ బలాన్ని మీకు గుర్తు చేసిన తీరు మిమ్మల్ని ఇంకా దగ్గర చేసింది. సరైన వ్యక్తులు సరైన సమయంలో జీవితంలోకి రావడం ఎంత బలమో డీటాచ్మెంట్ను నమ్మే మీకు కొత్త అనుభవం. మన బలాన్ని మనం నమ్మిన తర్వాతే ప్రపంచం నమ్ముతుంది. అది నమ్మడం మొదలుపెట్టినప్పుడే మీరు కెప్టెన్ అయ్యారు. పద్నాలుగు వారాల ప్రయాణంలో ఒక్కోవారం మీకన్నా బలంగా ఉన్నవారిని దాటుకుంటూ ఆటలో ఆఖరి దశకు చేరుకున్నారు. మీ లక్ష్యం వైపు ఇలాగే ముందుకెళ్లాలని ఆశిస్తూ ఆల్ దె బెస్ట్ చెప్పాడు బిగ్‌బాస్. తర్వాత తన జర్నీ చూసి ఎమోషనలైంది శ్రీసత్య. మిగతా హౌస్మేట్స్ జర్నీ రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. చదవండి: సూర్యతో లవ్‌లో ఉన్నానని చెప్పానా? యాంకర్‌కు ఇచ్చిపడేసిన ఇనయ అమర్తేజుల హల్దీ ఫంక్షన్, ఫోటోలు వైరల్ -
అక్క గొంతు విని శ్రీసత్య, కూతురిని తలుచుకుని రేవంత్ ఎమోషనల్
బిగ్‌బాస్.. నిన్ను నీకే కొత్తగా చూపిస్తుంది. నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. షో ముగిసేసరికి నీకు నువ్వే కొత్తగా పరిచయమయ్యేలా చేస్తుంది. ఈ షోలో పాల్గొనే ప్రతి కంటెస్టెంట్ బిగ్‌బాస్ ద్వారా ఏదో ఒకటి నేర్చుకునే వెళ్తాడు. ఎవరితోనూ కలవని వాళ్లు కూడా అందరితో కలిసిపోతారు. తమలోని తప్పొప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటారు. బిగ్‌బాస్ ఆరో సీజన్ జర్నీ ముగింపుకు వచ్చింది. ఈ ఆదివారంతో షోకు శుభం కార్డు పడనుంది. దీంతో హౌస్‌లో మిగిలిన ఆరుగురికి వారి జర్నీలు చూపిస్తున్నాడు బిగ్‌బాస్. తమ ప్రయాణాన్ని చూసి హౌస్మేట్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు. కప్పు గెలుచుకుని ఇంటికి రా అంటూ అక్క ఫోన్ చేసి కోరడంతో భావోద్వేగానికి లోనైంది శ్రీసత్య. భుజాలపై బరువును చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలి సత్తువ చూపించడమే మొదటి విజయం. మీరు చిరునవ్వుతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు బిగ్‌బాస్. ఆ మాటలతో భావోద్వేగానికి లోనైంది శ్రీసత్య. అటు రేవంత్.. బొమ్మను ఎత్తుకుని గెలిచి ఇంటికెళ్లాక నా కూతురిని ఇలాగే ఎత్తుకుంటానంటూ నమ్మకంతో చెప్తున్నాడు. 'మీ కోపమే బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఈ విషయాన్ని వెంటనే అర్థం చేసుకుని అందుకు తగ్గుట్గా మారి మీ కోపాన్ని ప్యాషన్‌గా మార్చారు. జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశం వదిలి బిగ్‌బాస్ గేమ్ కోసం ఎంతదూరమైనా వెళ్లాలని ఆరాటపడ్డారు' అంటూ రేవంత్‌పై పొగడ్తలు కురిపించాడు బిగ్‌బాస్. -
ఇది రేవంత్‌ను చూసి నేర్చుకున్నా: నాగార్జున
సండే ఫండే ప్రోమో వచ్చేసింది. ఈ సారి కూడా కంటెస్టెంట్లతో సరదా గేమ్స్ ఆడించాడు హోస్ట్ నాగార్జున. వంద రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటున్న ఏడుగురికి ఇంటి గురించి ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో హౌస్‌లో ఎన్ని గోల్డెన్ హ్యాండ్స్ ఉన్నాయి? వాష్‌రూమ్ ఏరియాలో ఎన్ని పూలకుండీలు ఉన్నాయి? లాంటి ప్రశ్నలడిగాడు. నాగార్జున ప్రశ్న అడగ్గానే ఎవరు గంట కొడితే వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే రెండు పాయింట్లు జోడిస్తానని, తప్పు సమాధానం చెప్తే రెండు పాయింట్లు మైనస్ చేస్తానన్నాడు. వీఐపీ బాల్కనీకి ఎన్ని మెట్లున్నాయి అని అడగ్గా ఆదిరెడ్డి పది మెట్లు అని చెప్పాడు. నాగార్జున మైనస్ 2 అన్నాడు. అప్పటికే బెల్ కొట్టిన శ్రీసత్య 7 లేదా 8 అని చెప్పింది. 7 మెట్లు సరైన సమాధానమంటూ వెంటనే ఒక పాయింట్ ఇచ్చాడు నాగ్. అదేంటి సర్, ఆమె రెండు ఆప్షన్లు చెప్పింది కదా అని రేవంత్ సందేహం వ్యక్తం చేయగా.. 'నేను సంచాలక్, నా ఇష్టం. అయినా ఇది నేను రేవంత్ దగ్గరే నేర్చుకున్నాను' అని పంచ్ ఇచ్చాడు. చదవండి: లేడీ సింగాన్ని పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా? ఈ వారం ఇనయ ఎలిమినేట్? -
ఇనయ ఎలిమినేషన్‌ను బయటపెట్టిన రేవంత్
వచ్చే వారమే బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉన్నా సింగిల్ ఎలిమినేషన్‌తో ఒక్కరినే ఎలిమినేట్ చేశారట. మరి ఆ బయటకు వచ్చేసింది ఎవరా? అని ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూశారంటే మీకే అర్థం అయిపోతుంది. ఆమె మరెవరో కాదు ఇనయ సుల్తాన. ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండే ఇనయ ఎలిమినేట్ కావడమేంటని అందరూ షాకవుతున్నారు. అయితే నాగార్జున మాత్రం ఇంటిసభ్యుల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈవారం ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారు? అని ప్రశ్నించాడు. ఇందుకు శ్రీహాన్.. రోహిత్ వెళ్లిపోతాడని అభిప్రాయపడ్డాడు. కీర్తి.. ఆదిరెడ్డి పేరు సూచించింది. రేవంత్‌ను ఇదే ప్రశ్న అడగ్గా.. ఎప్పుడూ నామినేషన్స్‌కు భయపడని ఇనయ నిన్న కొంత భయపడుతున్నట్లు చెప్పిందంటూ ఆమె పేరు చెప్పాడు. దీంతో మధ్యలో అందుకున్న ఇనయ.. నిన్ననే కదా, నేను టాప్ 5లో ఉంటానన్నావు, బయటకు వెళ్లనన్నావు అని నిలదీసింది. దీనిపై నాగ్ మాట్లాడుతూ.. నీకలా చెప్పాడేమో కానీ, తన మనసులో ఉన్న మాట ఇదే అని స్పష్టం చేశాడు. చదవండి: షాకింగ్ ట్విస్ట్.. ఇనయ ఎలిమినేటెడ్ వరస్ట్ సీజన్.. లేడీ సింగాన్ని పంపించేస్తారా? నెట్టింట ట్రోలింగ్ -
శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడని తెలుసు: రేవంత్
దెయ్యాలను చూసి భయపడిపోయిన కంటెస్టెంట్లను చూసి మేము బాగా నవ్వుకున్నామన్నాడు నాగార్జున. ఈ సీజన్లోనే మోస్ట్ ఎంటర్టైనింగ్ వీడియో అంటూ దెయ్యం టాస్కులో కంటెస్టెంట్లు ఏ రేంజ్లో భయపడ్డారో మరోసారి చూపించాడు. తర్వాత అవతలి వాళ్లకంటే నేనే ఎందుకు బెస్ట్, నాకే ఎందుకు ఓట్లు వేయాలో చెప్పమంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. అప్పుడే ఫిట్టింగ్ పెట్టేశారంటూ గొణుక్కున్నాడు రేవంత్. రేవంత్ కన్నా నువ్వెందుకు బెటర్? నీకెందుకు ఓట్లేయాలో చెప్పు అని శ్రీహాన్‌ను ఆదేశించాడు నాగ్. దీనికతడు లేచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటారు. కానీ దాన్ని ఒప్పుకోగలగాలి. ఆ గుణం రేవంత్‌కు లేదు అన్నాడు. అంతలోనే ఇంకో విషయం గుర్తురావడంతో చెప్పొచ్చా? అని పర్మిషన్ అడిగాడు. రేవంత్ ఫ్లిప్పర్, నేను కాదంటావు, అంతేనా.. అని నాగ్ గెస్ చేయగా ఛఛ, అది కాదన్నాడు శ్రీహాన్. మొన్న ఆదిరెడ్డితో అదే అన్నావుగా అని నాగ్ అనగా అలా అనలేదని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే రేవంత్ కలగజేసుకుంటూ శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడని తెలుసు అంటూ ఉక్రోషానికి లోనయ్యాడు. ఈ మాటతో శ్రీహాన్ ఒక్కసారిగా షాకయ్యాడు. శ్రీహాన్ ఫ్లిప్పర్ అనే పదం వాడాడా? లేదా? అని ఆదిరెడ్డిని అడగ్గా అతడు తనకు గుర్తు లేదని బదులిచ్చాడు. దీంతో నాగ్.. నిన్ను మించిన ఫ్లిప్పర్ లేడులే అంటూ ఉడాల్ మామపై సెటైర్ వేశాడు. చదవండి: ఏమిటేమిటి? ఇనయ ఎలిమినేట్ అయిందా? సీనియర్ నటి దారుణ హత్య, కన్న కొడుకే కొట్టి చంపాడు -
లెక్క తేలింది, విన్నర్ గెలుచుకునే ప్రైజ్‌మనీ ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 97: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రైజ్‌మనీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. గతంలో దాన్ని కత్తిరించుకుంటూ పోయిన బిగ్‌బాస్ ఈ వారం ఆ కోల్పోయిన డబ్బు తిరిగి పొందేందుకు అవకాశాలిస్తూ పోయాడు. నేటితో ఆ ఛాన్స్‌లకు తెరదించాడు. ఫైనల్ ప్రైజ్‌మనీని ప్రకటించాడు. మరి ఆ అమౌంట్ ఎంతో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! రెండు రోజులగా దెయ్యం టాస్కుతో ఇంటిసభ్యులను హడలెత్తిస్తున్నాడు బిగ్‌బాస్. ఈరోజు శ్రీసత్య, కీర్తిలను చీకటి గదిలోకి పంపించాడు. వీళ్లిద్దరూ గడ్డిని చూసి కూడా గజగజ వణికిపోయారు చివరికి బిగ్‌బాస్ చెప్పిన వస్తువులు తీసుకురావడంతో రూ.20 వేలు ఇచ్చాడు. తర్వాత రోహిత్‌ను ఆ తర్వాత హౌస్మేట్స్ అందరినీ చీకటి గదిలో వేశారు. అక్కడ ఇనయ, కీర్తి దెయ్యాల్లా భయపెడుతూ అందరినీ ఓ ఆటాడుకున్నారు. ఈసారి ఇంటిసభ్యులు మరో రూ.13వేలు గెలిచారు. మనీబాల్ టాస్క్‌లో రేవంత్ రూ.500, రోహిత్ రూ.1500 సాధించాడు. అనంతరం ఆరో సీజన్‌లోని ఐకానిక్ సంఘటనలను మరోసారి ప్రదర్శించి ఎంటర్టైన్ చేయాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఇనయ- శ్రీహాన్‌ల పిట్ట కథ, హోటల్ టాస్క్‌లో శ్రీసత్య- అర్జున్ ఒప్పందం, అర్జున్-రేవంత్ పప్పు గొడవ, మిషన్ పాజిబుల్ టాస్క్‌లోని ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్(బాత్రూమ్ను అశుభ్రపరిచి గొడవ చేసిన గొడవ), కీర్తి వేలు గాయపడ్డ సంఘటన, కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్ గోనె సంచులను తన్నిన సీన్.. వీటన్నింటినీ మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించారు. అందరూ నటించడం కాదు ఏకంగా జీవించేశారు. వీరి యాక్టింగ్ స్కిల్స్‌తో బిగ్‌బాస్‌ను అలరించి రూ.43,000 గెలుచుకున్నారు. అన్ని ఛాలెంజ్‌లు, టాస్కులు పూర్తైన తర్వాత ఫైనల్‌గా విన్నర్ ప్రైజ్‌మనీ రూ.47,00,000కి చేరింది. ఈ సంతోషంలో రేవంత్ పాట పాడగా కీర్తి, శ్రీసత్య డ్యాన్సులేశారు. చదవండి: ఈ వారం డబుల్ ఎలిమినేషన్? ఫైమాకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన పటాస్ ప్రవీణ్ -
శ్రీసత్యను నమ్మని శ్రీహాన్, ఇనయ పరువు మొత్తం పాయే!
Bigg Boss 6 Telugu, Episode 96: టాస్కుల్లో, నామినేషన్స్‌లో కయ్యానికి కాలు దువ్వే కంటెస్టెంట్లు దెయ్యం పేరెత్తితే చాలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి, శ్రీహాన్ ఎంత ఘోరంగా వణికిపోయారో నిన్ననే చూశాం. నేడు మిగతా ఇంటిసభ్యుల వంతు వచ్చింది. మరి వారు భయపడ్డారా? భయపడినా సరే గెలిచారా? అనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని శ్రీసత్యకు పిలుపు వచ్చింది. అప్పటిదాకా మిగతావాళ్ల భయాన్ని చూసిన నవ్విన ఆమె తన వంతురాగానే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తలుపు దాటి లోపలకు వెళ్లడానికి తెగ భయపడిపోయింది. కన్ఫెషన్ రూమ్‌లోకి రాకపోతే డబ్బులు కట్ అవుతాయని బిగ్‌బాస్ హెచ్చరించినా ఆమెకు ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఎంతసేపటికీ అలా డోర్ దగ్గరే తచ్చాడుతూ ఉండటంతో లక్ష రూపాయలు కోల్పోయారని చెప్పాడు బిగ్‌బాస్. అనవసరంగా డబ్బులు పోయాయని తెగ ఫీలైన రేవంత్ శ్రీసత్యపై అరిచాడు. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బిగ్ బాంబ్ అనే మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో కీర్తి, శ్రీసత్య, రేవంత్ పోటీపడ్డారు. మిగతా హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో ఇనయ గెలుస్తుందని భావించారు, కానీ అక్కడ శ్రీసత్య విజయం సాధించింది. ఇంటిసభ్యుల అంచనా బోల్తా కొట్టడంతో రూ.64,900 గెలుచుకునే ఛాన్స్ కోల్పోయారని ప్రకటించాడు బిగ్‌బాస్. నేను గెలుస్తానని నా ఫ్రెండ్వైన నువ్వెందుకు నమ్మలేదంటూ శ్రీహాన్‌ను నిలదీసింది శ్రీసత్య. మూడు ఛాలెంజ్‌లు నేనే గెలిచినా కూడా నన్ను నమ్మాలనిపించలేదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలాడు శ్రీహాన్. తర్వాత ఇంటిసభ్యులందరికీ మనీ టవర్ ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రూ.41,500 గెలుచుకున్నారు. అనంతరం వెలిగించు - విజయం సాధించు గేమ్‌లో శ్రీహాన్, శ్రీసత్య పోటీపడ్డారు. హౌస్మేట్స్ ఊహించినట్లుగా శ్రీహాన్ గెలవడంతో రూ.1,23,400 కైవసం చేసుకున్నారు. ఇప్పటిదాకా గెలిచిన ఛాలెంజ్‌ల మొత్తాన్ని కలపగా ప్రైజ్‌మనీ రూ.46,00,000కి చేరింది. దీంతో హౌస్మేట్స్ మరీ ముఖ్యంగా రేవంత్ పండగ చేసుకున్నాడు. తర్వాత దెయ్యం టాస్కులో ఎంతో ధైర్యంగా చీకటి గదిలో అడుగు పెట్టిన ఇనయ అరుపులు, కేకలతో కన్ఫెషన్ రూమ్‌ను దద్దరిల్లేలా చేసింది. అంత భయంలోనూ ఎలాగోలా బిగ్‌బాస్ చెప్పిన షూ తీసుకుని బయటకు రావడం విశేషం. ఈ టాస్క్ గెలవడంతో రూ.12,000 లభించాయి. నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్‌లో అడుగుపెట్టిన రేవంత్ భయపడ్డాడో, భయపడ్డట్లు నటించాడో తెలీదు కానీ దెయ్యం గొంతునే ఇమిటేట్ చేసి అవలీలగా సూర్య కప్పు తీసుకుని వచ్చేశాడు. ఈసారి రూ.10,000 లభించాయి. ఇక దెయ్యం టాస్కులో కీర్తి మాత్రమే మిగిలింది. మరి తనకేమైనా మినహాయింపు ఉందా? లేదంటే రేపటి ఎపిసోడ్లో తనకు కూడా టాస్క్‌లో వెల్కమ్ చెప్తారా? చూడాలి! చదవండి: నాన్న చనిపోయాక ఆఫీస్ బాయ్‌గా మారాను: రాజశేఖర్ నా ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌కు టికెట్లు కావాలి.. హీరో ఆన్సరేంటో తెలుసా? -
రూ.లక్ష పోగొట్టిన శ్రీసత్యపై రేవంత్ ఫైర్
ప్రైజ్‌మనీని పెంచుకునేందుకు ఇంటిసభ్యులకు సువర్ణావకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఇప్పటిదాకా టాస్కులతో డబ్బు సంపాదించిన హౌస్‌మేట్స్‌కు ఈసారి దెయ్యం టాస్కు ఇచ్చాడు. ఈ దెబ్బతో హడలిపోయిన ఇంటిసభ్యులు మా వల్ల కాదని బెంబేలెత్తుతున్నారు. అయినప్పటికీ భయంతో వణికిపోతూనే ఆదిరెడ్డి, శ్రీహాన్ చీకటి గదిలోకి వెళ్లి బిగ్‌బాస్ చెప్పిన వస్తువులను వెతికి తీసుకొచ్చారు. ఈసారి శ్రీసత్యను డార్క్ రూమ్‌లోకి వెళ్లమన్నాడు బిగ్‌బాస్. కానీ ఆమె మాత్రం నేనొక్కదాన్ని రాలేనంటూ తలుపు బయటే నిల్చుండిపోయింది. విన్నర్ అయ్యేది తనేనని ఫిక్స్ అయిన రేవంత్.. నీ వల్ల డబ్బులు కట్ అయితే మాత్రం సీరియస్ అవుతానని ముందే వార్నింగ్ ఇచ్చాడు. అయినా చివరికి అతడు అన్నట్లే జరిగింది. ఆమె లోపలకు వెళ్లకపోవడంతో లక్ష రూపాయలు కోల్పోయారని బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో శ్రీసత్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రేవంత్. తర్వాత బిగ్ బాంబ్ అనే మరో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో శ్రీసత్య, ఇనయ, రేవంత్ పాల్గొన్నారు. మరి వీరిలో ఎవరు గెలిచారు? ఎవ ఓడిపోయారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: ఇండస్ట్రీలో విషాదం, హాస్యనటుడు కన్నుమూత స్వాతి నా ఆల్‌టైం క్రష్: హరీష్ శంకర్ -
రేవంత్ ఫుడ్ గొడవలు.. ఇప్పటికైనా మారడా?
మరి కొద్ది రోజుల్లో బిగ్‌బాస్ కథ ముగియనుంది. ఇలాంటి సమయంలో రసవత్తరమైన టాస్కులతో ఆటను రక్తికట్టించాల్సిన బిగ్‌బాస్ సోది టాస్కులిస్తూ మరింత చిరాకు పుట్టిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ ఒక్కరూ విన్నర్ మెటీరియల్ అనిపించకపోవడం సీజన్‌కే పెద్ద మైనస్. కాస్తో కూస్తో అభిమానగణంతో, ఆటతో విన్నర్ అవుతాడనుకున్న రేవంత్ తన ప్రవర్తనతో జనాలకు మరింత చికాకు పుట్టిస్తున్నాడు. ప్రతిదానికీ గొడవలు పడుతూ నేనే తోపు అన్నట్లుగా మాట్లాడుతూ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. తాజాగా అతడు ఇంట్లోవారితో మరోసారి గొడవపడ్డట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇందులో రేవంత్.. ఫుడ్ కోసం శ్రీహాన్‌ను కప్పు తెచ్చుకోమన్నాడు. అంతలోనే నేను తినమని చెప్పలేదంటూ మాట మార్చాడు. వెంటనే అందుకున్న శ్రీహాన్, శ్రీసత్య.. ఇప్పుడే కప్పు తెచ్చుకోమన్నావ్ కదా అని నిలదీయడంతో రేవంత్ ఉలిక్కిపడ్డాడు. ప్రతిదాంట్లో తప్పులు వెతికితే నావల్ల కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే ఒప్పుకునే ధైర్యం ఉండాలని రేవంత్‌పై శ్రీహాన్ గరమయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు మరో ఛాలెంజ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ అందరూ ప్లాన్ ప్రకారం ఆడి గెలిచినట్లు తెలుస్తోంది. అదెలాగో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం.. శ్రీహాన్ దుప్పట్లో చేరిన శ్రీసత్య ఆ మూడు దెబ్బల వల్ల బాలీవుడ్‌నే వదిలేద్దామనుకున్నా: హీరో -
ఇనయకు దెయ్యం పట్టింది! భయంతో వణికిపోయిన ఆదిరెడ్డి, శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 94: మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు హౌస్‌మేట్స్‌కు వరుస ఛాలెంజ్‌లు విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్‌లలో ఎవరు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో చెప్పాలన్నాడు. అందులో ఎవరు గెలుస్తారో కూడా ముందే ఊహించాలన్నాడు. కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగిస్తానని మెలిక పెట్టాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నేడు రెండో ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రేవంత్, ఇనయ పోటీపడ్డారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.1,10,000 ప్రైజ్‌మనీకి తిరిగి యాడ్ అవుతాయన్నాడు. అందరూ అనుకున్నట్లుగా పిరమిడ్ పడొద్దు అనే ఛాలెంజ్‌లో రేవంత్ విజయం సాధించడంతో రూ.1,10,000 గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత మూడో ఛాలెంజ్ కోసం ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంచుకోమన్నాడు. దీంతో ఆదిరెడ్డి- కీర్తి, శ్రీహాన్- శ్రీసత్య మనీ ట్రాన్స్ఫర్ గేమ్‌లో పోటీపడ్డారు. ఇనయ, రేవంత్, రోహిత్.. ఆదిరెడ్డి టీమ్ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీహాన్- శ్రీసత్య గెలవడంతో వారు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత రేవంత్ ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ పాట పాడగా ఆదిరెడ్డి అందుకనుగుణంగా స్టెప్పులేశాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో ఛాలెంజ్ ప్రవేశపెట్టాడు. పవర్ పంచ్ టాస్క్‌లో రేవంత్, ఇనయ పాల్గొనగా అందరూ ఊహించినట్లు రేవంత్ గెలవడంతో ప్రైజ్‌మనీకి మరో రూ.2 లక్షలు జమయ్యాయి. దీంతో మొత్తం ప్రైజ్‌మనీ రూ.41,10,100కి చేరింది. రాత్రి శ్రీసత్య ఓ దెయ్యం కథ చెప్పింది. ఓ ఫంక్షన్లో ఓ అబ్బాయి వింతగా ప్రవర్తించాడని చెప్పింది. అందరూ ఆ అబ్బాయిని కొడుతున్నా అతడికి చలనం లేకుండా అలాగే నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడని చెప్పింది. ఇంతలో సడన్‌గా దెయ్యం సౌండ్ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్ బెడ్ మీదకు చేరింది. ఇక శ్రీహాన్ అయితే బాత్రూమ్కి వెళ్లడానికి కూడా భయపడ్డాడు. అది గమనించిన శ్రీసత్య కావాలని దెయ్యంలా నవ్వుతూ అతడిని మరింత భయపెట్టింది. ఇక ఇనయ అయితే ఏకంగా దెయ్యం పట్టినదానిలా ప్రవర్తించి ఆదిరెడ్డిని వణికిపోయేలా చేసింది. దెయ్యం భయంతో అందరూ జడుసుకుంటూ, నవ్వుకుంటూ ఏ అర్ధరాత్రికో పడుకున్నారు. చదవండి: స్టేజీపై భార్యను పరిచయం చేసిన హీరో సత్యదేవ్ నేను టాప్5లో ఉండనని తెలుసు, రేవంత్ ఎలిమినేట్ అవ్వాలి: ఫైమా -
రేవంత్‌ను ఎదిరించి మరీ గేమ్ ఆడిన శ్రీసత్య!
మొన్నటిదాకా ప్రైజ్‌మనీ కట్ చేస్తూ కంటెస్టెంట్ల ఆశల మీద నీళ్లు గుమ్మరించాడు బిగ్‌బాస్. తాజాగా ఆ కోల్పోయిన డబ్బులు తిరిగి సంపాదించుకునేందుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సమయానుసారం ఛాలెంజ్‌లు విసురుతూ.. అందులో ఎవరు గెలుస్తారో ముందే ఊహించాలని, కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగి ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తానని ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే ఒక ఛాలెంజ్ ఓడిపోయి, మరో ఛాలెంజ్ గెలిచిన హౌస్మేట్స్ తాజాగా మరో ఛాలెంజ్‌కు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో శ్రీసత్య, రేవంత్ గొడవపడ్డారు. నెక్స్ట్ గేమ్‌కు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వెళ్తారన్నావ్ కదా, ఎందుకు మాట మారుస్తున్నావని నిలదీసింది శ్రీసత్య. మొత్తం అన్ని గేమ్స్ అమ్మాయి- అబ్బాయి కలిసి ఆడతారని నేను చెప్పలేదే అని రేవంత్ అనగా కేవలం మొదటి మూడు రౌండ్స్ మాత్రమేనని కూడా చెప్పలేదు కదా అంది శ్రీసత్య. ప్రతిసారి అబ్బాయిలు మాత్రమే అంటే ఇంకెందుకు గేమ్స్.. మీరే ఆడుకోండి, అమ్మాయిలు ఆడరు అని ఫైర్ అయింది. దీనికి రేవంత్.. నీకు ఆలోచించే శక్తి లేదా? యాటిట్యూడా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రైజ్‌మనీ రూ.39,10,000 ఉండగా దీన్ని రూ.లక్ష పెంచుకునేందుకు ఓ గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. మనీ ట్రాన్స్ఫర్ గేమ్‌లో కీర్తి- ఆదిరెడ్డి, శ్రీసత్య-శ్రీహాన్ ఆడారు. మొత్తానికి రేవంత్‌ను ఎదిరించి మరీ గేమ్ ఆడింది శ్రీసత్య. మరి ఈ ఆటలో ఏ జంట గెలిచింది? మిగతావాళ్లు ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్ చేశారా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఇప్పటికిప్పుడు ఛాన్స్ ఇస్తే రేవంత్‌ను పంపించేస్తా: ఫైమా పైసా వసూల్ కోసం పోటీపడ్డ రేవంత్, ఇనయ -
పైసా వసూల్ కోసం పోటీపడ్డ రేవంత్, ఇనయ
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లకో గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇప్పటివరకు కట్ అయిన డబ్బులను ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తానన్నాడు. కాకపోతే అందుకోసం కొన్ని టాస్కులు గెలవాల్సి ఉంటుందని, ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్ చేయాలని మెలిక పెట్టాడు. అందుకు సరేనంటూ ఎగిరి గంతేశారు హౌస్మేట్స్. అందులో భాగంగా కంటెస్టెంట్లకు నేడు రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అందులో ఇనయ, రేవంత్ పోటీపడ్డారు. మెజారిటీ హౌస్మేట్స్ రేవంత్ గెలుస్తాడని భావించగా అదే నిజమైంది. దీంతో రూ.1,10,000 విన్నర్ ప్రైజ్‌మనీలో తిరిగి యాడ్ అయినట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్ ఇంకా ఏమేం ఛాలెంజ్లిచ్చాడు? ఎంత అమౌంట్ తిరిగి యాడ్ అయిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా? -
ఆదిరెడ్డితో ఫ్రెండ్షిపే వద్దన్న శ్రీహాన్, రోహిత్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో రోహిత్ మినహా అందరూ ఏదో ఒక వారం కెప్టెన్ అయ్యారు. ఇప్పటికే ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? అని ఆరా తీస్తే ఇనయ బెస్ట్, ఆదిరెడ్డి వరస్ట్ కెప్టెన్ అని తేలింది. ఇక ఈ రోజు మరో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు నాగ్. హౌస్ నుంచి బయటకు వెళ్లాక జీవితాంతం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎవరితో ఫ్రెండ్షిప్ను ఇక్కడే కట్ చేస్తారని అడిగాడు. దీనికి శ్రీహాన్, రోహిత్.. రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆది రెడ్డిని తరచూ కలవడం కష్టమని చెప్పారు. కీర్తి మాట్లాడుతూ.. ఇనయ బాగా క్లోజ్ అయిందని చెప్పింది. తర్వాత రేవంత్ తెలివిగా అబ్బాయిల్లో నుంచి శ్రీహాన్, అమ్మాయిల్లో నుంచి శ్రీసత్య జీవితాంతం స్నేహితులుగా ఉండిపోతారని చెప్పాడు. ఇక హౌస్మేట్స్ వ్యక్తిత్వానికి సరిపోయేలా కొన్ని సినిమా పోస్టర్లను వారికి అంకితం చేశాడు బిగ్‌బాస్. అలా శ్రీసత్యకు అందాల రాక్షసి పోస్టర్, శ్రీహాన్‌కు దేశముదురు, ఇనయకు ఓ పిట్టకథ ఇలా పోస్టర్లు వేసుకుంటూ వెళ్లారు. చదవండి: బ్యూటీ సెలూన్ అమ్మి పాత ఇల్లు కొన్న కమెడియన్ క్రికెటర్‌తో లవ్.. మా మధ్య స్నేహం చెడింది: నటి -
ఈ వారం ఆమె ఎలిమినేట్, సీజన్లోనే బెస్ట్ కెప్టెన్‌గా ఇనయ!
Bigg Boss Telugu 6, Episode 91: రేవంత్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడు తండ్రైన శుభవార్తను చెప్పాడు. డిసెంబర్ 1న రాత్రి 11 గంటలకు నాకు లక్ష్మీదేవి పుట్టిందంటూ అతడు ఇంటిసభ్యులతో ఈ గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. తర్వాత శ్రీహాన్, రేవంత్ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడగా శ్రీహాన్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్టుగా అవతరించాడు. ఇక నాగార్జున వచ్చీరాగానే ఈ 13 వారాల్లో మీరు రిగ్రెట్ అయిన వారం ఏంటి? దేనికోసం ఫీలయ్యారో చెప్పాలన్నాడు. దీనికి ఫైమా ఆరోవారం సుదీపతో మాట్లాడిన విధానం వల్లే నాకు వెటకారం అన్న ట్యాగ్ వచ్చిందని బాధపడింది. తర్వాత ఇనయ మాట్లాడుతూ.. తొమ్మిదోవారంలో నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి నానామాటలు అన్నాను, అలా అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. శ్రీహాన్ వంతు రాగా.. ఫ్యామిలీ వీక్ (12వ వారం)లో సిరి చెప్పడం వల్ల నా వెటకారంతో కీర్తి బాధపడుతుందని తెలిసింది. అలా చేయకుండా ఉండాల్సిందన్నాడు. కీర్తి మాట్లాడుతూ.. 13వ వారంలో టికెట్ టు ఫినాలే రేసులో టవర్ టాస్కును తన్నకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చింది. ఫస్ట్ వీక్ నుంచి ఆరో వారం వరకు నేను కోపతో ఏది పడితే అది అనేశాను. ఎనిమిదోవారం చేపల టాస్కులో ఫిజికల్‌గా ఆది, గీతూ, ఇనయలను బాధపెట్టాను. 13వ వారం ఆదిరెడ్డి రెచ్చగొట్టేసరికి ఓవర్‌గా రియాక్ట్ అయ్యాను, ఇవన్నీ నా పొరపాట్లేనని అంగీకరించాడు రేవంత్. 12వ వారం కెప్టెన్సీ టాస్కులో ఇనయను నమ్మి పెద్ద తప్పు చేశానన్నాడు రోహిత్. 2వ వారంలో నాకు దెబ్బలు తగులుతాయన్న భయంతో గేమ్ ఆడకుండా కూర్చున్నా, 11వ వారంలో కీర్తిని ఇమిటేట్ చేశా.. అదే నా రిగ్రెట్ అని చెప్పింది శ్రీసత్య. 2వ వారంలో నేను కూడా దెబ్బలు తగులుతాయేమోనని పెద్దగా ఆడలేదు, 9వ వారంలో మైక్ విసిరికొట్టాను, 11వ వారంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల యూజ్ ఉండదు అని అందరిముందు చెప్పడం తప్పనిపించింది. అమ్మాయిల విషయంలో ఓవర్ సెన్సిటివ్‌గా ఆడటం కూడా తప్పేనన్నాడు ఆదిరెడ్డి. తర్వాత నాగార్జున ఎవరు బెస్ట్ కెప్టెన్? ఎవరు వరస్ట్ కెప్టెన్? చెప్పాలంటూ గేమ్ ఆడించాడు. కంటెస్టెంట్ ఉత్తమ కెప్టెన్ చెత్త కెప్టెన్ రోహిత్ కీర్తి ఆదిరెడ్డి ఆదిరెడ్డి ఇనయ శ్రీసత్య శ్రీసత్య ఇనయ ఆదిరెడ్డి ఇనయ శ్రీసత్య శ్రీహాన్ శ్రీహాన్ ఇనయ ఆదిరెడ్డి కీర్తి ఫైమా శ్రీహాన్ ఫైమా ఇనయ రేవంత్ రేవంత్ ఆది రెడ్డి ఇనయ ఫైనల్‌గా హౌస్ మొత్తం ఇనయను బెస్ట్ కెప్టెన్‌గా, ఆదిరెడ్డిని వరస్ట్ కెప్టెన్‌గా నిలబెట్టింది. ఇకపోతే రేవంత్ అమ్మాయిలే వీక్ అని మాట్లాడాడని ఆదిరెడ్డి ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నాడు. గతవారం ఈ విషయమై రేవంత్ అలా అనలేదని నాగార్జున క్లారిటీ ఇస్తూ వీడియో కూడా చూపించాడు. అయినప్పటికీ ఆది మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా పూర్తి వీడియోలో రేవంత్ ఆ మాట అన్నాడంటూ మొండిగా వ్యవహరించాడు. దీంతో నాగ్ ఈసారి పూర్తి వీడియో చూపించాడు. మొత్తం వీడియో చూపించాక రేవంత్ ఆడపిల్లలు వీక్, వాళ్లు వస్తే ఈజీగా ఆడేయొచ్చు అని అన్నాడా? లేదా? అని ఇనయ, కీర్తి, ఫైమాలను అడగ్గా వారు ముక్తకంఠంతో లేదని చెప్పారు. దీంతో నాగార్జున.. ఆది నాన్సెన్స్ మాట్లాడుతున్నావు, ఇకమీదట దీన్ని సాగదీయకుండా ఇక్కడితో ఆ ప్రస్తావనే ఆపేసేయ్ అని వేడుకున్నాడు. అనంతరం నాగ్.. రేవంత్‌ను సర్ప్రైజ్లో ముంచెత్తాడు. అతడికి తన భార్యాబిడ్డలతో మాట్లాడే అదృష్టాన్ని కల్పించాడు. వీడియో కాల్ ద్వారా స్క్రీన్‌పై భార్యాబిడ్డను చూసుకుని రేవంత్ మురిసిపోయాడు. ఈ సమయంలో నేను నీకు తోడుగా లేనందుకు సారీ అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత.. పెదవే పలికిన మాటల్లోన సాంగ్ పాడి దాన్ని అందరు తల్లులకు డెడికేట్ చేశాడు. ఇకపోతే ఈ వారం ఫైమా ఎలిమినేషన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. చదవండి: వంద కోట్ల దాకా పోగొట్టుకున్నాను, జయసుధ కూడా అంతే: చంద్రమోహన్ మహేశ్‌బాబు అలా అనగానే కన్నీళ్లు ఆగలేదు: అడివి శేష్ -
భార్యతో రేవంత్ వీడియోకాల్, కూతుర్ని చూసి భావోద్వేగం
బిగ్‌బాస్ కంటెస్టెంట్, సింగర్ రేవంత్ తండ్రైన విషయం తెలిసిందే! అతడి భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను బిగ్‌బాస్ రేవంత్‌కు చేరవేయడంతో అతడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇక నాగార్జున ఏకంగా అన్వితతో వీడియో కాల్ మాట్లాడించడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన ఇంటి మహాలక్ష్మిని చూసి ఎమోషనలయ్యాడు రేవంత్. ఈ సమయంలో భార్య పక్కన లేకుండా పోయానని, తన బిడ్డను ఎత్తుకోలేకపోయానని కొంత బాధపడ్డాడు. తన ఇంటి మహాలక్ష్మి, జూనియర్ రేవంత్ కోసం అద్భుతమైన పాట పాడాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రేవంత్ పాట పాడుతుంటే మా కళ్లలో నీళ్లు వచ్చేశాయి, రేవంత్ పాపను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: టికెట్ టు ఫినాలే గెలిచిన ఒకే ఒక్కడు విన్నర్‌గా.. మరి శ్రీహాన్‌కు సాధ్యమేనా? మహేశ్‌బాబు అలా అనగానే కన్నీళ్లొచ్చాయి: అడివి శేష్ -
ముగ్గురమ్మాయిలపై రెచ్చిపోయిన కంటెస్టెంట్లు, తగ్గేదేలేదన్న రోహిత్
Bigg Boss 6 Telugu, Episode 90: 'టికెట్ టు ఫినాలే' ఛాలెంజ్ రేసులో రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్ ఐదుగురు మిగిలారు. అయితే తదుపరి ఛాలెంజ్‌లో వీరిలో నుంచి ముగ్గురు మాత్రమే పోటీపడాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఎవరికి వారు నేను తప్పుకోనంటే నేను తప్పుకోనంటూ వాదులాటకు దిగారు. దీంతో ఆ ముగ్గురు ఎవరో డిసైడ్ చేయండంటూ సంచాలకులైన ఇనయ, కీర్తి, శ్రీసత్యలపై భారం వేశాడు బిగ్‌బాస్. ఈ ముగ్గురు.. స్కోర్ బోర్డులో చివర్లో ఉన్న ఫైమా, రోహిత్, రేవంత్‌లను సెలక్ట్ చేశారు. టాప్‌లో ఉన్నవాళ్లను తీసేసి వేరేవాళ్లకు ఛాన్స్ ఇవ్వడమేంటి? ఈ సీజన్లో ఇదే వరస్ట్ డెసిషన్ అని చిరాకుపడ్డాడు ఆది. ఆలోచనలో పడ్డ రోహిత్.. టాప్ పొజిషన్లో ఉన్న వాళ్లను తీసేసి చివర్లో ఉన్న తనను ఆడేందుకు సెలక్ట్ చేయడం కరెక్ట్ కాదని భావించి గేమ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించాడు. అంటే గేమ్ ఆడనని చెప్తున్నావా? అని ఇనయ అడగడంతో శ్రీహాన్ ఫైరయ్యాడు. ఆటలో నుంచి తప్పుకుంటున్నవాళ్లను ఎందుకు బతిమాలుతున్నావు? అందరికీ ఛాన్స్ ఇవ్వడానికి ఇది ఫన్డే గేమ్ కాదని చురకలంటించాడు. దీంతో వెనక్కు తగ్గిన సంచాలకులు తమ నిర్ణయం మార్చుకుని రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఆడుతున్నారని చెప్పారు. చివర్లో ఉన్న రోహిత్ ఆడను అన్నందున చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఫైమాను కూడా తొలగించామని ఇనయ స్పష్టతనిచ్చింది. ఈ ఒక్కమాటతో గేమ్‌లో ఉన్నవాళ్లంతా నిప్పులు చెరిగారు. ఇంతకుముందు ఓమాట ఇప్పుడో మాట అంటూ సంచాలకులను తిట్టిపోశారు. రోహిత్ అయితే నా వల్ల ఫైమాను తొలగించామంటారేంటి? అంటూ ఇనయ మీద మండిపడ్డాడు. అయితే టాప్ 3 లేదంటే లాస్ట్‌లో ఉన్న 3 మెంబర్స్‌నే ఆడించాలనుకున్నాం అని సంచాలకులుగా చెప్తున్నా.. అది మీరెలా డిసైడ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. అసలేం సంచాలకులు వీరు, ముగ్గురూ వేస్టే.. అంత భయమున్నప్పుడు బిగ్‌బాస్‌కు రాకూడదు అంటూ రేవంత్ మరోసారి తన నోటిదురుసు ప్రదర్శించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లో రేవంత్ గెలవగా శ్రీహాన్, ఆది తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. సెకండ్ లెవల్ ముగిసే సమయానికి రేవంత్ 15, శ్రీహాన్, ఆది 14, ఫైమా 7, రోహిత్ 6 పాయింట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. సమాన పాయింట్లు వచ్చిన ఆది, శ్రీహాన్‌లకు ఓ గేమ్ ఇవ్వగా అందులో శ్రీహాన్ గెలిచాడు. దీంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రేవంత్, శ్రీహాన్ టికెట్ టు ఫినాలే రేస్ కోసం పోటీపడ్డారు. ఇకపోతే శ్రీహాన్ టికెట్ టు ఫినాలే సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్టుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్ ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆది -
తండ్రైన సింగర్ రేవంత్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత
బిగ్‌బాస్ సీజన్-6 టైటిల్ గెలవకముందే సింగర్ రేవంత్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్ మొదటిసారి తండ్రయ్యాడు. రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయానికే అన్విత నిండు గర్భిణి. హౌస్‌లో ఉన్న సమయంలోనే ఆమె సీమంతం కూడా జరిగింది. ఆ వీడియోను చూసి రేవంత్ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తండ్రిలేని లోటు తనకు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు రేవంత్ పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు పాప పుట్టిన విషయం తెలిస్తే రేవంత్ సంతోషానికి అవధులు లేకుండా పోతాయంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌కు పాప పుట్టిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు రేవంత్-అన్విత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు బిగ్‌బాస్ సీజన్-6 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ రేవంత్‌కే ఉందని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Singer Revanth 🎤 (@singerrevanth) -
విర్రవీగుతున్న రేవంత్.. ఓడిపోయినా బిల్డప్ కొడుతున్నాడే!
Bigg Boss 6 Telugu, Episode 89: టికెట్ టు ఫినాలే రేస్‌లో ఏకాభిప్రాయం పేరుతో ఇంటిసభ్యులను ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. ఛాలెంజ్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఛాలెంజ్‌లో ఏ నలుగురు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో పేర్లు చెప్పమంటున్నాడు. దీంతో హౌస్మేట్స్ ఇదెక్కడి గొడవరా బాబూ అని తలలు బాదుకుంటున్నారు. ఈరోజు మొదటగా ఇవ్వబోయే ఛాలెంజ్‌లో ఏ నలుగురు పార్టిసిపేట్ చేస్తారో ఏకాభిప్రాయంతో చెప్పమన్నాడు బిగ్‌బాస్. మళ్లీ ఏకాభిప్రాయం ఏంట్రా దేవుడా అనుకున్న హౌస్మేట్స్ చిరాకు ప్రదర్శించారు. ఈ సమయంలో ఆదిరెడ్డి తెలివిగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ ఛాలెంజ్‌లో తను, రేవంత్ పక్కకు తప్పుకునేందుకు రెడీ అన్నాడు. కానీ నెక్స్ట్ ఛాలెంజ్‌లో ఫైమా, శ్రీహాన్ తప్పుకుంటానంటేనే ఈసారికి మేము సైడ్ అవుతామన్నాడు. అతడి నిర్ణయానికి అందరూ అంగీకారం తెలిపారు. దీంతో బిగ్‌బాస్ ఇచ్చిన రోల్ బేబీ రోల్ అనే టాస్క్‌లో రోహిత్, ఫైమా, శ్రీహాన్, కీర్తి పాల్గొన్నారు. సంచాలకులైన ఇనయ, శ్రీసత్య టవర్ పొడవుగా పేర్చిన శ్రీహాన్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టవర్ గేమ్‌లో శ్రీహాన్‌కు 4, రోహిత్‌కు 3, ఫైమాకు 2, కీర్తికి 1 పాయింట్స్ లభించాయి. సంచాలకులపై నిర్ణయంపై కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ఇష్టమొచ్చినవాళ్లకు ఇచ్చుకోండి అంటూ కోపంతో ఊగిపోతూ ఆవేశంలో తన టవర్‌ను తన్నేసింది. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు బిగ్‌బాస్ మార్కుల పట్టిక రిలీజ్ చేయగా శ్రీహాన్ 10, ఆది రెడ్డి 9, రేవంత్ 8, ఫైమా 7, రోహిత్ 4, కీర్తి 3 పాయింట్లతో ఉన్నారు. ఈ లెవల్ ముగిసే సమయానికి తక్కువ పాయింట్లు ఉన్న కీర్తిని రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో నెక్స్ట్ లెవల్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇచ్చే మొదటి ఛాలెంజ్‌లో ఏ ముగ్గురు పాల్గొంటారో చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ముందుగా అనుకున్న రూల్ ప్రకారం ఈసారి ఫైమా, శ్రీహాన్ గేమ్ నుంచి సైడవగా రేవంత్, ఆది రెడ్డి, రోహిత్ ఆటలో పాల్గొన్నారు. గుడ్డు జాగ్రత్త గేమ్‌లో అద్భుతంగా ఆడిన ఆదిరెడ్డికి 3, రోహిత్‌కు 2, రేవంత్‌కు 1 పాయింట్ వచ్చింది. ఓటమిని జీర్ణించుకోలేని రేవంత్ సంచాలకురాలైన కీర్తి కావాలనే మనసులో ఏదో పెట్టుకుని నన్ను తప్పించాలని చూసిందని ఉడికిపోయాడు. నేనెక్కడ గెలుస్తానోన్న భయంతో, నామీదే ధ్యాస పెట్టిందని, అలా భయపడాలి అంటూ తనకు తానే సెల్ఫ్ డబ్బా వాయించుకున్నాడు. ఓడిన ప్రతిసారి అందుకు ఇతరులే కారణమని నిందించడం అతడికి అలవాటుగా మారింది. ఇక ఇప్పటివరకు ఆడిన గేమ్ ఆధారంగా మార్కుల పట్టికలో ఆదిరెడ్డి(12 పాయింట్లు), శ్రీహాన్(10), రేవంత్(9), ఫైమా(7), రోహిత్(6) వరుస స్థానాల్లో ఉన్నారు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్లు ట్రోఫీ గెలవడానికి గల ప్రాముఖ్యతను వివరించమన్నాడు. ► మా అమ్మకు ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలి. వాళ్లు మొదటిసారి కోరిన కోరికను నెరవేర్చాలి - శ్రీహాన్ ► నాన్న పేరు నిలబెట్టేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - రోహిత్ ► బిగ్‌బాస్ షోలో మొదటి రోజు నుంచి ప్రతి టాస్కులో ఆడుతూనే ఉన్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్తూనే ఉన్నాను. అందరికంటే ఆ ట్రోఫీ నాకే ఎక్కువ ముఖ్యం - రేవంత్ ► నా జీవితంలో ఏదీ అంత ఈజీగా దొరకలేదు, పోరాడి సాధించాను. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిస్తే ఆ కిక్కే వేరు. కప్పు కొట్టాలన్న అమ్మానాన్న కల నెరవేర్చాలని ఉంది - శ్రీసత్య ► నాలాంటి అమ్మాయిలకు నేను ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలవాలి - కీర్తి ► కుటుంబం కోసం, అలాగే అమ్మాయిలకు ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - ఫైమా ► మొదటిసారి ఓ కామన్ మ్యాన్ 13 వారాలు హస్‌లో ఉన్నాడు. అడ్డదారులు తొక్కకుండా జెన్యూన్‌గా ఆడి ట్రోఫీ గెలిస్తే హ్యాపీ - ఆదిరెడ్డి ► నువ్వు అమ్మాయివి, నువ్వేం చేయలేవు, చదువుకోలేదు అని నన్ను నానామాటలన్నారు. ఏమీ లేకపోయినా ఏదైనా సాధించవచ్చని నిరూపించాలనుకుంటున్నా. అందుకే ఈ ట్రోఫీ గెల్చుకుని చాలామందికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. ఈ కప్పు కొట్టి నాన్నకు అంకితమిస్తా - ఇనయ చదవండి: డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక అదే చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాకైన హౌస్మేట్స్ -
ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్, గొప్పోడివయ్యా రోహిత్!
Bigg Boss Telugu 6, Episode 88: ఎలాగైనా సరే టికెట్ టు ఫినాలే కొట్టాల్సిందేనని కసిగా ఆడుతున్నారు హౌస్మేట్స్. అయితే మొదట్లోనే ఆటలో అవుట్ అయిన శ్రీసత్య, కీర్తి, ఇనయలకు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. 'రంగు పడితే రివైవల్' గేమ్‌లో గెలిచినవారు తిరిగి రేసులో పాల్గొంటారని చెప్పాడు. ఈ గేమ్‌లో ముగ్గురమ్మాయిలు పోటాపోటీగా ఆడగా కీర్తి గెలిచి తిరిగి రేసులో నిలబడింది. అనంతరం శ్రీసత్య, ఇనయ మినహా పోటీలో ఉన్న మిగతా ఆరుగురు 'జెండాల జగడం' అనే గేమ్‌లో పాల్గొన్నారు. ఈ ఆటలో రేవంత్, ఆదిరెడ్డి తొలి రెండు స్థానాల్లో, ఫైమా, శ్రీహాన్, కీర్తి, రోహిత్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలబడ్డారు. తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్‌లో పాల్గొనే నలుగురి సభ్యులు ఎవరో ఏకాభిప్రాయంతో చెప్పమని ఆదేశించాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో హౌస్మేట్స్ డీలా పడ్డారు. ఎంతో కీలకమైన టికెట్ టు ఫినాలే గేమ్‌లో ఏకాభిప్రాయం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. నన్ను గేమ్‌లో నుంచి తీసేస్తే మాత్రం ఏ ఒక్కడినీ గెలవనివ్వను అని శ్రీహాన్ వార్నింగ్ ఇవ్వగా నాదీ అదే మాట అంటూ వంత పాడాడు రేవంత్. ఆడి ఓడిపోయినా సర్వాలేదు కానీ ఏకాభిప్రాయం వల్ల అసలు ఆటనే ఆడకపోవడం తట్టుకోలేమన్నాడు రోహిత్. దీంతో బిగ్‌బాస్.. ఆటలో లేని ఇనయ, శ్రీసత్యలను ఎవరు గేమ్‌లో ఉండాలి? ఎవరు గేమ్ నుంచి తప్పుకోవాలో డిసైడ్ చేయమన్నాడు. దీంతో వాళ్లు గత గేమ్‌లో చివరి ర్యాంకింగ్‌లో ఉన్న కీర్తి, రోహిత్‌లను ఆటలో నుంచి తొలగించారు. వారి నిర్ణయంపై కీర్తి రుసరుసలాడింది. ఇనయ వెళ్లి తనతో మాట్లాడించేందుకు ప్రయత్నించగా అది కాస్తా గొడవగా మారింది. దీంతో అటు కీర్తి, ఇటు ఇనయ ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. రోహిత్ మాత్రం సరైన నిర్ణయమే తీసుకున్నారని మెచ్చుకోవడంతో శ్రీసత్య అతడి నిజాయితీని పొగడకుండా ఉండలేకపోయింది. ఇక బ్యాలెన్స్ ద స్కోర్స్ గేమ్‌లో ఫైమా మొదట అవుట్ అయింది. తర్వాత రేవంత్, శ్రీహాన్ వరుసగా ఓడిపోగా ఆదిరెడ్డి కడ వరకు నిలబడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్ కోపంతో శ్రీసత్యపై చిటపటలాడాడు. ఈ గేమ్‌లో పర్ఫామెన్స్‌కుగానూ బిగ్‌బాస్ మార్కుల పట్టికను విడుదల చేశాడు. ఇందులో ఆదిరెడ్డికి 9, రేవంత్‌కు 8, శ్రీహాన్‌కు 6, ఫైమా 5 పాయింట్స్‌తో వరుస స్థానాల్లో ఉన్నారు. ఇకపోతే ఆదిరెడ్డి టికెట్ టు ఫినాలే గెలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: నన్ను సైడ్ చేస్తే ఎవ్వడినీ గెలవనివ్వను: శ్రీహాన్ పుష్ప సినిమా చూశా.. కానీ ఆ హీరో ఎవరో తెలియదు: నటి -
నీలాంటోళ్లు బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉండొద్దు: రేవంత్
Bigg Boss 6 Telugu, Episode 86: ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. అటు రాజ్ తన వల్లే వెళ్లిపోయాడని తెగ ఫీలైంది ఫైమా. ఇంతకీ ఈరోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నేను శ్రీసత్యతో కలిసి ఉన్నందుకు ఏవేవో అనేస్తున్నావు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావని రేవంత్ మీద సీరియసయ్యాడు శ్రీహాన్. ఏదైనా అనేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ గరమయ్యాడు. దీంతో హర్టయిన రేవంత్ దూరంగా వెళ్లి కూర్చున్నాడు. కానీ కాసేపటికే ఈ గొడవలన్నీ ఎందుకు? మునుపటిలా మాట్లాడుకుందామంటూ కలిసిపోయారు. మరోపక్క ఫైమా.. తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఓట్లు వచ్చినా సరే రాజ్ వెళ్లిపోయాడని ఏడ్చేసింది. గతవారం రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు పాడైపోయిన పండ్లు, ఆకుకూరల ఫొటోలను రోహిత్‌కు చూపించాడు బిగ్‌బాస్. ఇక మీదటైనా ఆహారం వేస్ట్ కాకుండా చూసుకోమని హెచ్చరించాడు. ఇంట్లో జరిగిన తప్పు కారణంగా తమకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ రద్దు చేయమని అడిగాడు ప్రస్తుతం రేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్. అనంతరం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.. ► ఆదిరెడ్డి.. రేవంత్, రోహిత్ ► ఫైమా.. రేవంత్, రోహిత్ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► కీర్తి.. రేవంత్, శ్రీసత్య ► శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డి ► రోహిత్.. ఆది రెడ్డి, ఫైమా ► రేవంత్.. ఆది రెడ్డి, ఫైమా ► ఇనయ.. రేవంత్, శ్రీసత్య ముందుగా ఆదిరెడ్డి.. నాగార్జునగారు చూపించిన వీడియోలో ముందు జరిగిన డిస్కషన్ చూపించలేదు. నువ్వు గేమ్‌లో అమ్మాయి వస్తే మనకే లాభం అన్నట్లుగా మాట్లాడావు. అప్పుడు, ఇప్పుడు, ఇంకో పదేళ్ల తర్వాత కూడా నేను ఈ మాటపైనే స్టాండ్ అయి ఉంటా అని బల్లగుద్ది చెప్పాడు. అటు రేవంత్ మాత్రం నాగ్ సర్ ఆల్రెడీ నీదే తప్పని చెప్పాడు, ఇంక దీనికోసం చర్చించడం అనవసరం అంటూ నిట్టూర్చాడు. అటు ఫైమా - రేవంత్, శ్రీహాన్ - ఆదిరెడ్డిల మధ్య ఫైట్ మామూలుగా జరగలేదు. 'రోహిత్ స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తున్నావ్, అంటే నువ్వు వీక్ కదా, అలాంటివాళ్లు హౌస్‌లో ఉండనవసరం లేదు, నిన్ను బయటకు పంపించడానికే నామినేట్ చేస్తున్నా' అని ఫైమాతో వాదించాడు రేవంత్. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫైమా ఉగ్రరూపం దాల్చింది. 'రేవంత్ ముందొకటి మాట్లాడతాడు, వెనకాల ఒకటి మాట్లాడతాడు. ఇలా మాటలు మార్చేది ఎవరికీ కనిపించట్లేదా? ఎన్నోసార్లు నోరుజారాడు. అదెందుకు కనిపించట్లేదు?' అని అటు కంటెస్టెంట్లు, ఇటు బిగ్‌బాస్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది.ఫైనల్‌గా ఈ వారం ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, కీర్తి నామినేట్ అయ్యారు. చదవండి: నోరు జారుతుంది నువ్వు.. రేవంత్‌పై ఫైమా ఉగ్రరూపం బిగ్‌బాస్: రాజ్ రెమ్యునరేషన్ ఎంతంటే? -
నోరు జారుతుంది నువ్వు.. ఫైమా దెబ్బకు సైలెంట్ అయిన రేవంత్
తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడూ ఉంటాడు. నేనే తోపు, నేనే స్ట్రాంగ్ అని ఫీలయ్యే రేవంత్‌కు ఎదురు తిరిగింది ఫైమా. వేరేవారి సపోర్ట్ లేనిదే గేమ్ ఆడలేవు, నువ్వు నాకు చెప్తున్నావా? అని రేవంత్ అనడంతో అగ్గిమీద గుగ్గిలమైంది ఫైమా. సపోర్ట్‌తో ఆడిన రేవంత్ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించింది. మనిషి ముందు ఒకలా, వెనకాల మరోలా మాట్లాడతాడు. ఎవరికీ ఇది కనిపించట్లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు నుంచీ తనే నోరుజారుతున్నా అది ఎందుకు ఎవరికీ కనిపించట్లేదని భగ్గుమంది. కరెక్ట్ పాయింట్లు లాగడంతో రేవంత్ దెబ్బకు సైలెంట్ అయిపోయాడు. ఎంతసేపూ నేనే స్ట్రాంగ్, నా ముందు మాట్లాడే ధైర్యం లేదు, వాళ్లకంత సీన్ లేదు అంటూ తోటికంటెస్టెంట్లను చులకన చేసి మాట్లాడే రేవంత్ నోటిదురుసుకు అడ్డుకట్ట వేయాలంటే ఫైమానే కరెక్ట్ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: ఆదిరెడ్డి వర్సెస్ శ్రీహాన్.. నామినేషన్స్‌లో ఎవరెవరంటే? ఆ కంటెస్టెంట్ పరువు తీసిన రాజ్, అతడే విన్నర్ అంట -
ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు: రేవంత్
ఫ్యామిలీస్ రాకతో హౌస్‌మేట్స్‌కు ఆనందంతో పాటు ఎవరు గెలుస్తారనేదానిపై ఓ క్లియర్ పిక్చర్ కనబడింది. ఎవరు టఫ్ కాంపిటీషన్ ఇస్తారన్నప్పుడు మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ రేవంత్ పేరు చెప్పారు. తర్వాత శ్రీహాన్, ఇనయ పేర్లు వినిపించాయి. అంటే అసలు సిసలైన పోటీ ఈ ముగ్గురి మధ్యే ఉందన్న సంకేతాలు కంటెస్టెంట్లకు చేరాయి. మరీ ముఖ్యంగా గెలుపు గాలులు రేవంత్వైపు వీస్తున్నట్లు వారికి చూచాయగా అర్థమైంది. ఇదిలా ఉంటే టాప్ 9 కంటెస్టెంట్లను ఎవరిలో చెడు లక్షణాలు ఉన్నాయో చెప్పమన్నాడు నాగ్. దీనికి ఇనయ.. కొన్ని సందర్భాల్లో రాజ్ ఎందుకు అరుస్తాడో అర్థం కాదని చెప్పింది. ఆదిరెడ్డి వంతురాగా.. రేవంత్ బాగా ఆడతాడు, అలాంటి వ్యక్తి బాగా ఆడతానని ప్రూవ్ చేసుకోనవసరం లేదన్నాడు. శ్రీసత్య.. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని, అది తనలో ఉన్న చెడు లక్షణమని పేర్కొంది. ఫైమాకు ఇంతవరకూ వెటకారం తగ్గలేదన్నాడు రేవంత్. ఇక సంచాలక్‌గా ఉన్నప్పుడు ఏ కంటెస్టెంట్‌కూ సపోర్ట్ చేయొద్దని ఫైమాకు చురకలంటించాడు నాగ్. ఇంకా ఈ కంటెస్టెంట్లు ఎవరి గురించి ఏం చెప్పారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: చచ్చినా బిగ్‌బాస్‌కు రానన్నాడు, ఇప్పుడేకంగా కప్పుకే గురి పెట్టాడు ఫైమా చేతిలో ఎలిమినేషన్, అతడే ఎలిమినేట్ కానున్నాడా? -
రేవంత్‌కు బిగ్‌బాస్ షాక్.. అర్ధాంతరంగా..
ఫ్యామిలీ మెంబర్స్ రాకతో బిగ్‌బాస్ హౌస్ ఎమోషనల్‌గా మారింది. ఇప్పటికే ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా, కీర్తి, రాజ్, శ్రీహాన్, ఇనయ, రోహిత్ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చి వెళ్లారు. ఇంకా ఒకే ఒక్క కంటెస్టెంట్ తనవాళ్ల రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అతడే రేవంత్. త్వరలో తల్లి కాబోతున్న తన భార్య వస్తుందా? లేదంటే తన కన్నతల్లే వస్తుందా అని ఆశగా పదేపదే గేటువంక చూస్తున్నాడు. అతడి నిరీక్షణకు తెరదించాడు బిగ్‌బాస్. భార్యతో వీడియోకాల్ ఆప్షన్ ఇవ్వడమే కాకుండా తల్లిని ఇంట్లోకి పంపించి సర్ప్రైజ్ చేశాడు. ఇక రేవంత్ భార్య మాట్లాడుతూ.. ఎంతమంది ఉన్నా నువ్వు లేని బాధ చాలా ఎక్కువగా ఉందని చెప్పింది. ఇలా ఆమె మాట్లాడుతున్న సమయంలో సడన్‌గా వీడియోకాల్ కట్ చేశాడు బిగ్‌బాస్. ఒక్కసారి భార్యతో మాట్లాడతానని వేడుకున్నా బిగ్‌బాస్ కనికరించకపోవడంతో ఏడ్చేశాడు. అంతలోనే హౌస్‌లోకి అమ్మ రావడంతో ఆనందభాష్పాలతో ఎదురెళ్లాడు. ఆమె కీర్తిని దగ్గరకు తీసుకుని నువ్వు నా కూతురులాంటిదానివి కాదు, కూతురివే అంటూ ఆప్యాయంగా హత్తుకుంది. అమ్మ గడ్డం తీసుకోమని చెప్పగానే క్లీన్ షేవ్ చేసుకున్నాడు రేవంత్. చదవండి: ఇనయ కల నెరవేర్చిన బిగ్‌బాస్, శ్రీహాన్ కాళ్లు మొక్కిన సిరి పెళ్లిపీటలెక్కనున్న నటి, ఫొటోలు వైరల్ -
శ్రీసత్య వెన్నుపోటు పొడుస్తోంది.. రేవంత్‌కు హింటిచ్చిన ఆడియన్స్!
Bigg Boss 6 Telugu, Episode 79: రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లు కడుపు మాడ్చుకునే పరిస్థితి వచ్చింది. అతడు రేషన్ మేనేజర్ అవడమేంటో కానీ పాలు, అన్నం.. ఇలా అన్నింటికీ కొలతలు పెడుతూ ఇంటిసభ్యులకు సరిగా తిండి పెట్టడం లేదు. గత వారం కెప్టెన్‌గా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనానికి ఎన్ని కప్పుల బియ్యం వండేదానివని ఫైమాను అడిగాడు ఆదిరెడ్డి. అందుకామె ఐదు కప్పులని చెప్పింది. కానీ రేవంత్ నాలుగు కప్పులు మాత్రమే చాలంటున్నాడు. అరకప్పు బియ్యం ఎక్కువ వేయమని శ్రీహాన్ చెప్పినా వినట్లేదని చికాకు పడ్డాడు ఆది. బియ్యం అయిపోయినప్పుడు అడిగితే ఇస్తున్నారని చెప్పింది ఫైమా. ఇదే విషయంపై రేవంత్‌ను నిలదీసింది. అతడు మాత్రం సరిపోతుందా? సరిపోదా? అనవసరం అని, రేషన్ ఎంతుందో దాన్ని బట్టే వండుతానని వితండవాదం చేశాడు. అలాగైతే ఎవరికీ ఆకలి తీరదన్నాడు శ్రీహాన్. నీ కెప్టెన్సీలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కానీ అందరి కడుపు నింపడానికి ఆలోచించట్లేదన్నాడు. మరోపక్క సమయానికి వచ్చి పాలు తాగకపోతే ఆ పూట పాలు మళ్లీ ఇచ్చేదే లేదని రూల్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేసింది ఇనయ. ఇలా ఎప్పటిలాగే రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఫుడ్ గొడవలు జరిగాయి. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి ఇద్దరు సభ్యుల ఫొటోలను షెడ్డర్లో వేయాల్సి ఉంటుంది. ► రోహిత్.. శ్రీహాన్, ఫైమా ► శ్రీసత్య.. రాజ్, రోహిత్ ► రాజ్.. శ్రీహాన్, శ్రీసత్య ► కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్య ► ఫైమా.. రోహిత్, ఇనయ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► ఇనయ.. ఫైమా, రాజ్ ► ఆదిరెడ్డి.. ఇనయ, శ్రీహాన్ ► రేవంత్.. ఫైమా, ఆది రెడ్డి రాజ్ మూడు వారాలుగా సేవ్ అవుతున్నందున అతడిని నామినేట్ చేస్తున్నానంది శ్రీసత్య. ఇందుకు ఒప్పుకోని బిగ్‌బాస్ సరైన కారణం చెప్పమని గద్దించాడు. దీంతో శ్రీసత్య అతడి గేమ్ కనిపించలేదని జవాబు చెప్పి జారుకుంది. ఇక ఇనయ.. తనను గేమ్‌లో పర్సనల్‌గా అటాక్ చేసి తన గేమ్ కనిపించకుండా చేసిన ఫైమాను నామినేట్ చేస్తున్నాననంది. రాజ్ నామీద పగ పెంచుకుని నన్ను నామినేట్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. వీరిద్దరూ తన ఫ్రెండ్స్ అని, వీళ్లను నామినేట్ చేయాల్సి వచ్చేంత దూరం పెరుగుతుందని ఊహించలేదంటూ ఏడ్చింది. వాళ్లు తనను ఫ్రెండ్ అనుకోలేదంటూ బాధపడింది. ఫైనల్‌గా ఈ వారం శ్రీహాన్, ఫైమా,రోహిత్, రాజ్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఇనయ నామినేషన్లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం కిచెన్‌లో మళ్లీ ఫైట్ జరిగింది. రేవంత్‌ను ఆలూ, ఉల్లిగడ్డ ఇవ్వమని కొందరు అడగ్గా కుదరదని తేల్చి చెప్పేశాడు కెప్టెన్. మీరేమనుకున్నా నేనేం చేయలేనని చేతులెత్తేశాడు. తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టైం వచ్చింది. హౌస్ అంతా నీకు సపోర్ట్ చేసి కెప్టెన్‌గా గెలిపించినప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక్కోసారి సపోర్ట్ చేయకపోతే సోలో ప్లేయర్, ఫేవరిటిజం అని పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. మీరు ఆడియన్స్ నుంచి సింపతీ కోరుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకటీరెండు రోజుల వరకే సింపతీ ఉంటుంది. కానీ జీవితాంతం ఉండదు. కళ్ల ముందే ఫేవరిటిజం కనిపించినప్పుడు కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడరని ఎవరిని నమ్ముతున్నారు? రాజ్.. నాగురించి చెడుగా ఎవరూ మాట్లాడరు. మొదట్లో నా రియల్ ఫ్రెండ్స్ సూర్య, ఫైమా, ఇనయ. కానీ ఇనయ నా వెనక గోతులు తవ్వుతుందేమోనని అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. స్నేహితుడిగా ఫీలైన రాజ్ అలా అనడంతో ఇనయ ఏడ్చేసింది. సూర్య వెళ్లిపోయాక వాళ్లిద్దరే మాట్లాడకుండా దూరం పెట్టి నన్ను శత్రువులా చూస్తున్నారు అని కంటతడి పెట్టుకుంది. ప్రశ్న: మీరు ఎప్పుడు ఏం చేస్తారనేది తోటి ఇంటిసభ్యులకే అర్థం కావట్లేదు. దీనికి మీ స్పందన ఏంటి? ఇనయ: మై లైఫ్, మై రూల్స్.. నాకు నచ్చినట్లే ఉంటా, అందుకే అన్‌ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తాను. ప్రశ్న: మీ క్లోజ్ ఫ్రెండ్ మీ గురించి బ్యాక్‌స్టాబింగ్, బిచింగ్ చేస్తుంది. మీకు తెలిస్తే ఏం చేస్తారు? శ్రీసత్య: ముందు బాధపడతాను. నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ను నమ్మి అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అయితే నేను వాళ్లను క్లోజ్ అనుకునే కన్నా వాళ్లు నన్నెంత క్లోజ్ అనుకుంటున్నారనేది ముఖ్యం. బహుశా వాళ్లకు నేనంత క్లోజ్ కాదేమో! నమ్మినవాళ్లు నా వెనకాల మాట్లాడితే నెక్స్ట్ టైం నా దగ్గరకు రానివ్వను. ఇక నాగార్జున చెప్పిన టాస్క్‌ను అమలు చేసే పనిలో పడ్డారు శ్రీసత్య, ఫైమా. అర్ధరాత్రి మేకప్ వేసుకుని రాజ్, శ్రీహాన్‌ను భయపెట్టి మిషన్ కంప్లీట్ చేశారు. చదవండి: మెరీనా పారితోషికం ఎంతో తెలుసా? నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది: యాంకర్ -
ఆకలితో మాడుతున్న హౌస్మేట్స్, అయినా కరగని రేవంత్!
బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 9 మెంబర్స్ మిగిలారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేలో అడుగుపెడతారు. ఈరోజు మండే కావడంతో నామినేషన్స్ మొదలుకానున్నాయి. అయితే ఇప్పటికీ సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేస్తానంటే కుదరదని తెగేసి చెప్పాడు బిగ్‌బాస్. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి నామినేట్ చేయమన్నాడు. ఈ క్రమంలో శ్రీసత్య.. ఆటతీరును పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజ్ మూడు వారాల నుంచి సేవ్ అవుతున్నాడని నామినేట్ చేసింది. దీంతో బిగ్‌బాస్ తుప్పాస్ రీజన్ కాకుండా ఏదైనా వాలిడ్ పాయింట్ చెప్పమన్నాడు. మరోవైపు రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లకు కడుపు నిండా తిండి దొరక్కుండా పోయింది. ఉన్నదాన్ని పంచి పెట్టకుండా దాచి దెయ్యాలపాలు చేస్తున్నాడు. గతంలోనూ అలాగే చేయగా మరోసారి ఫుడ్ కట్ చేస్తున్నాడు. అంత కొద్దిగా వండితే సరిపోవట్లేదు మహాప్రభో అని మొత్తుకుంటున్నా నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించాడు. వారమంతా సరిగా తినీతినకుండా వారాంతంలో మాత్రం కడుపు నిండా పెడతానంటే కరెక్ట్ కాదు. అందువల్ల కెప్టెన్‌గా నువ్వు గెలుస్తావేమో కానీ అందరి ఆకలి తీరదు అని ముఖం మీదే చెప్పాడు శ్రీహాన్. రేషన్ సేవ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు కానీ కడుపులు నిండాలని ఆలోచించట్లేదు అని ఫైర్ అయ్యాడు. నిజంగానే రేవంత్ ఎంతసేపూ గేమ్ కోణంలో ఆలోచిస్తున్నాడే కానీ మానవత్వంతో ఓ ముద్ద ఎక్కువ పెట్టుంటే హౌస్మేట్స్ అందరితో మంచి కెప్టెన్ అనిపించుకునేవాడు. ఇకపోతే ఈ వారం రేవంత్, కీర్తి మినహా మిగతా ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. చదవండి: బిగ్‌బాస్ 6: బాటమ్ 5లో ఎవరంటే? మెరీనా ఎలిమినేషన్‌కు కారణాలివే! -
ఆదిరెడ్డి ఇమేజ్ టోటల్ డ్యామేజ్.. గీతూకి పట్టిన గతి రాకుండా చూస్కో!
Bigg Boss 6 Telugu, Episode 77: ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎదుటివాళ్ల కంటే మనకే ఎక్కువ నష్టం అన్న విషయాన్ని పసిగట్టలేకపోతున్నాడు ఆదిరెడ్డి. ఇప్పటికే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేజేతులా గేమ్‌ను నాశనం చేసుకుని గీతూ బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు ఆది. దీంతో నాగార్జున అతడికి చీవాట్లు పెట్టి తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చాడు. మరి ఇంకా ఎవరెవరికి ఎలాంటి క్లాస్‌లు పీకాడు? ఎవరి బండారాలు బయటపెట్టాడు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! కెప్టెన్సీ అంటే అధికారం కాదని, బాధ్యత అని రేవంత్‌కు గుర్తు చేశాడు నాగార్జున. ఏదైనా పని చెప్పేటప్పుడు మాట్లాడే తీరు చూసుకోమని విసుక్కున్నాడు. శక్తి ఆటలో ప్రదర్శించమని, మాటలో కాదు అని చురకలంటించాడు అనంతరం ఆదిరెడ్డికి గట్టిగానే క్లాస్ పీకాడు. ఓ కథ చెప్పి మరీ అతడిని దోషిగా నిలబెట్టాడు. నోటికొచ్చిన స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావని గడ్డి పెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్, అది దక్కించుకుంటే ఓట్లు పడవు అని ఆడకుండా మూలన కూర్చున్నావు. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో డిసైడ్ చేయడానికి నువ్వేమైనా తోపా? తురుమా? అని తిట్టిపోశాడు. నువ్వు కామన్ మ్యాన్‌గా ఆడటానికి వచ్చావు, కేవలం మాట్లాడటానికి కాదు, గేమ్‌లో ఉన్న వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేసి నీ అభిప్రాయాలను వారితో చెప్పిస్తున్నావు. గేమ్ విషయంలో ఎక్కువ ఆలోచించి లూప్‌లు వెతికితే నీకూ గీతూ పరిస్థితే వస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక కెప్టెన్సీ కంటెండర్ గేమ్‌లో నువ్వు రూపాయి పెట్టి కూడా ముందుకు వెళ్లొచ్చు, కానీ లక్ష రూపాయలు రాశావు. ఇమ్యూనిటీ కోసమే కదా.. అని లాజిక్ అడిగాడు. ఇదే ప్రశ్న రాజ్ అడిగితే ఏదేదో చెప్పి అతడి నోరు మూయించాడు ఆది. ఇప్పుడు నాగ్ కూడా అదే అడిగేసరికి అడ్డంగా దొరికిపోయాడు. ఇకపోతే శ్రీహాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు శ్రీసత్యకు వంట రాదంటే వదిలేసి కీర్తిని మాత్రం వంట రాదంటే నేర్చుకుని చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఇదే అంశాన్ని ఓ ఆడియన్ అడగ్గా.. తనకసలు గుర్తే లేదని జవాబిచ్చాడు. దీంతో నాగ్.. గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తానన్నట్లుగా ఓ వీడియో వదిలాడు. అందులో శ్రీసత్య నాకు రాదు, చేయను అని స్పష్టంగా చెప్పింది. అయినా ఆమెను వదిలేసి, కీర్తిని మాత్రం వంట నేర్చుకుని చేయమన్నాడు. అంత అడ్డంగా దొరికినప్పటికీ సరిగా వినపడలేదంటూ మళ్లీ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అలాగే కుక్కలు మొరిగితే దేవలోకానికి ఏమీ కాదని కీర్తి చెప్పిన సామెతను సామెతలాగే చూడాలే తప్ప దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయనవసరం లేదని శ్రీహాన్, శ్రీసత్యలకు మొట్టికాయలు వేశాడు. ఇక ప్రతివారం నామినేషన్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది శ్రీసత్య. పక్కనోళ్లు నామినేట్ చేసుకుంటుంటే మరీ ముఖ్యంగా ఇనయను నామినేట్ చేసేటప్పుడు తెగ నవ్వుతుంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ లేవనెత్తాడు నాగ్. నామినేషన్స్‌లో నీకు నవ్వెందుకు వస్తుందని అడిగాడు. లోపల ఉన్న అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుందని ఆమె పరువు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో మీమ్స్ గేమ్ జరిగింది. అందులో భాగంగా అక్కడున్న మీమ్ కార్డులు ఎవరికి సూటవుతాయో వారికి ఇవ్వాలన్నాడు నాగ్. రేవంత్‌ను ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాడు ఆది. శ్రీసత్యకు ఓరి.. దీని వేషాలూ అన్న మీమ్ ఇచ్చాడు శ్రీహాన్. రాజ్.. ఓన్లీ వన్స్ ఫసక్ అనేలా మాట్లాడుతున్నాడంది ఫైమా. ఫైమాకు అట్లుంటది మనతోని ట్యాగ్ ఇచ్చాడు రాజ్. శ్రీహాన్‌కు సరె సర్లే, చాలా చూశాం ట్యాగ్ ఇచ్చింది కీర్తి. వీడెవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు.. చైల్డ్ ఆర్టిస్టా? అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయ. మస్తు షేడ్స్ ఉన్నాయ్రా నీలో, ఆట్.. కమల్ హాసన్ అన్న మీమ్ శ్రీహాన్‌కే సూటవుతుందన్నాడు రోహిత్. చాలా ఉన్నాయ్ దాచాం.. లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయ్ అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది శ్రీసత్య. ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలా.. అన్న మీమ్ రోహిత్కిచ్చింది మెరీనా. ఆదిరెడ్డి పని అయిపాయే అన్నాడు రేవంత్. నిజంగానే ఈరోజు ఎపిసోడ్లో ఆదిరెడ్డి పని అయిపోయింది. చదవండి: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే? పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా.. -
Bigg Boss 6: కర్మ ఫలితం.. రేవంత్, శ్రీహాన్‌లకు బుద్దిచెప్పిన హౌస్మేట్స్
Bigg Boss 6 Telugu, Episode 76 Highlights : ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ గేమ్‌లో చివరగా ఫైమా, రేవంత్, శ్రీహాన్‌లు మిగిలారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకి నచ్చిన వాళ్లకి సపోర్ట్ చేసి మిగిలిన కంటెస్టెంట్లకు బస్తాను తగిలించాల్సి ఉంటుంది. కెప్టెన్సీ టాస్కులో రేవంత్, శ్రీహాన్‌లు కలిసి గేమ్ ఆడి ఎలా అయితే హోస్మేట్స్ని తప్పించారో, అందుకు బదులుగా సత్య తప్పా మిగితా కంటెస్టెంట్లు అంతా వీరిద్దరికి బాగానే బుద్ది చెప్పారు. బజ్ మోగిన ప్రతిసారి రేవంత్, శ్రీహాన్‌లకు బస్తాలు పెంచుకుంటూ పోయారు. పాపం శ్రీసత్య మాత్రం తన ఫ్రెండ్స్‌ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది కానీ హౌస్మేట్స్ అంతా ఒకటైపోవడంతో ఆమె ఆటలు సాగలేదు. ఇక బస్తాల బరువులు మోయలేక చివరికి ఆ బ్యాగ్‌ను శ్రీహాన్ కింద పెట్టేశాడు. ఇక అప్పుడు వెంటనే సత్య వెళ్లి శ్రీహాన్‌ను ఆమె ఒళ్లో పడుకోబెట్టి మరీ అతన్ని ఓదార్చింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఒకప్పుడు అర్జున్ టచ్ చేస్తేనే చిరాకు అన్న సత్య ఇప్పుడు శ్రీహాన్‌తో చాలా క్లోజ్ అయ్యిందని, అవసరం లేకపోయినా అతడిని టచ్ చేస్తుందంటూ ట్రోల్స్ రాయుళ్లు రెచ్చిపోయారు. ఇదిలా ఉండగా రేవంత్ ఈ టాస్కులో గెలవడానికి చాలానే కష్టపడినా హౌస్మేట్స్ అందరి సపోర్ట్ ఫైమాకే ఉండటంతో అతని కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చివరికి ఫైమాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో ఆమె తెగ సంతోషపడింది. -
ఆడియన్స్ ప్రశ్నలతో బయటపడ్డ శ్రీహాన్, శ్రీసత్య నిజస్వరూపం!
Bigg Boss 6 Telugu, Episode 75: సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు ఈ వారం వెళ్లిపోయేది తనే అని ఫిక్సయిన మెరీనా తన పెళ్లి రోజు గురించి కలలు కంది. నవంబర్ 29న వెడ్డింగ్ యానివర్సరీ ఉందని, ఆ రోజును ఇద్దరం కలిసే సెలబ్రేట్ చేసుకోవాలనుందని చెప్పింది. హౌస్ లోపల అయినా బయట అయినా ఇద్దరం కలిసే పెళ్లిరోజు జరుపుకోవాలని, అందుకు నువ్వే ఏదో ఒకటి చేయాలంటూ బిగ్‌బాస్‌ను వేడుకుంది. అంటే ఉంచితే ఇద్దరినీ హౌస్‌లో ఉంచమని పంపిస్తే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరినీ పంపించేయమని చెప్పకనే చెప్పింది. బిగ్‌బాస్‌కు కొత్త కొత్త ఐడియాలివ్వకని రోహిత్ చురకలేశాడు. అనంతరం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో పోటీదారులు శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్.. ఇతరుల గోల్ పోస్ట్‌లోకి బంతి వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌కు ఫైమా సంచాలకుడిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రేవంత్, శ్రీహాన్ కలిసి ఆడినట్లే అనిపించింది. ఇది చూసిన ఫైమా.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఈయన చేసేదేంటని సెటైర్లు వేసింది. మొదటి రౌండ్లో రోహిత్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్లో ఎవరూ అవుట్ కాకపోవడంతో కంటెండర్లు ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలన్నాడు బిగ్‌బాస్. ఎక్కువ ఓట్లు ఆదిరెడ్డికి పడటంతో అతడు అవుట్ అయ్యాడు. ఇక రేవంత్, ఫైమా గేమ్ ఆసాంతం దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. నీలాగా సపోర్ట్ తీసుకుని ఆడను అని రేవంత్ ఫైమాను ఉద్దేశించి అన్నాడు. వెంటనే ఆదిరెడ్డి అందుకుంటూ బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా? అన్నాడు. ఓపక్క నాతో, అటు ఇనయతో, తీరా గేమ్‌లోకి దిగాక శ్రీహాన్‌తో కలిసి ఆడావని కౌంటరిచ్చాడు. దీనికి కిమ్మనుకుండా సైలెంట్ అయిపోయాడు రేవంత్. మూడో రౌండ్లో ఇనయ తనను తాను సేవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడింది, కానీ గెలవలేకపోయింది. దీంతో కెప్టెన్ కాలేకపోయానని వెక్కివెక్కి ఏడ్చింది ఇనయ. చివరగా రేవంత్.. శ్రీహాన్‌ను ఓడించి కెప్టెన్‌గా అవతరించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అవడంతో రేవంత్ కంటి నుంచి ఆనందభాష్పాలు రాలాయి. అనంతరం ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నాడు బిగ్‌బాస్. మొదటి ప్రశ్న: నీ కెప్టెన్సీలో కీర్తిని రూడ్‌గా వంట చేయమన్నావు. ఆమె తనకు రాదని చెప్తే నేర్చుకోమన్నావు. మరి నీ ఫ్రెండ్ శ్రీసత్యకు ఎందుకు చెప్పలేదు? శ్రీహాన్: వంట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఆమెను కిచెన్ టీమ్‌లో వేశా. అంతేకాదు అప్పుడప్పుడు ఆమె కిచెన్‌లో పని చేయడం చూశాను. శ్రీసత్య వంట చేయను అన్న మాట నాకు వినిపించలేదు. అయినా తను కిచెన్‌లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది అని చెప్పాడు. నిజానికి శ్రీసత్య వంట రాదు, చేయను అన్నా కూడా శ్రీహాన్ లైట్ తీసుకున్నాడు. ఇద్దరూ అడ్డంగా దొరికిపోవడంతో కీర్తి ముఖం మతాబులా వెలిగిపోయింది. రెండో ప్రశ్న: ఫైమా మీరు మొదట్లో చూడటానికి ఎంతో ఎంటర్టైనింగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు స్వార్థపరురాలిగా కనిపిస్తున్నారు. ఈ రెండింటిలో మీ అసలు రూపం ఏది? ఫైమా: ఆటలో గెలవాలన్న కసి ఎక్కువైంది. దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి ఎంటర్టైన్ పక్కన పెట్టేశాను. మూడో ప్రశ్న: ఒక రివ్యూయర్ అయి ఉండి మీకు గేమ్ బాగా తెలుసని మీరే అంటుంటారు. కానీ మీ నామినేషన్స్ అందరికన్నా సిల్లీగా, సేఫ్‌గా ఉంటాయి. మీరు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని నామినేట్ చేసి అప్పుడు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోండి.. ఆదిరెడ్డి: స్ట్రాంగ్ ప్లేయర్స్‌ను బయటకు పంపించాలన్న ఆలోచన నాకు లేదు. వారితో గేమ్ ఆడి గెలవాలనుకుంటాను. నా కళ్ల ముందు జరిగే సంఘటనలను బట్టే నామినేషన్స్ చేశాను, తప్ప సిల్లీ రీజన్స్ ఇవ్వలేదు. మీకలా అనిపిస్తే నేనేం చేయలేను. మరీ ముఖ్యంగా నన్ను రివ్యూయర్‌గా కాకుండా కంటెస్టెంట్‌గా చూడండి. ప్రశ్న: ఇనయ తన ఫ్రెండ్‌ని వెన్నుపోటు పొడిచిందన్నారు. కానీ మీరు రేవంత్‌ను మూడుసార్లు నామినేట్ చేశారు. కెప్టెన్సీలో తనకి సపోర్ట్ చేయలేదు. అర్జున్ను యూజ్ చేసుకున్నారు. తన గేమ్ కూడా మీరే ఆడి తనని నామినేట్ చేశారు. మీరు చెప్పే విషయాలు మీరసలు పాటిస్తారా? శ్రీసత్య: తప్పుంటే ఎవరినైనా నామినేట్ చేస్తాను. రేప్పొద్దున శ్రీహాన్ది తప్పుంటే అతడిని కూడా నామినేట్ చేస్తా. ఇనయను రెచ్చగొట్టడానికే ఆమె వెన్నుపోటు పొడిచిందన్నాను. ఫ్రెండ్షిప్, గేమ్ ఒకటి కాదు. రేపు పాయింట్ ఉంటే శ్రీహాన్‌ను కూడా నామినేట్ చేస్తాను. అర్జున్ను నేను యూజ్ చేసుకోలేదు. హోటల్ టాస్క్‌లో సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. నేను చెప్పే విషయాలు కచ్చితంగా పాటిస్తాను. చదవండి: ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా -
బ్రెయిన్ దగ్గర పెట్టుకుని మాట్లాడు: రేవంత్‌కు ఆది వార్నింగ్
తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లు ఫైర్ మీదున్నారు. ఈ ఫైర్ మొదటినుంచీ ఉండుంటే బిగ్‌బాస్ ఇలా ప్రైజ్‌మనీ నుంచి లక్షల రూపాయలు కట్ చేసేవాడు కాదు. ఇప్పుడనుకునేం లాభం.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. అన్నట్లుగా బోర్ కొట్టించినందుకు ఫలితంగా ప్రైజ్‌మనీని తగ్గించుకుంటూ పోతున్నాడు. వీళ్లకంటే నాన్‌స్టాప్ సీజన్ కంటెస్టెంట్లే నయమని నెటిజన్లు అంటున్నారంటే వీరి ఎంటర్టైన్మెంట్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇనయ, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్ ఈ పోటీలో పాల్గొన్నారు. ఇనయను గేమ్‌లో అవుట్ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్‌ను టైం చూసి దెబ్బ కొట్టాడు ఆదిరెడ్డి. తర్వాత శ్రీహాన్, రేవంత్ కలిసి ఆదిరెడ్డిని అవుట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆది కోపంతో ఊగిపోయాడు. ఇక గేమ్‌లో రేవంత్, ఫైమా మధ్య ఫైట్ జరిగింది. వెటకారం తగ్గించుకుంటే మంచిది, నీలాగా నేను వెటకారం చేస్తే ఏడుస్తావని రేవంత్ చెప్పగా అమ్మో, నాకు భయమైతుంది మరి అని కౌంటరిచ్చింది ఫైమా. పక్కనోడు సపోర్ట్ చేస్తే కానీ గేమ్ ఆడలేవు, నువ్వు నాకు చెప్తున్నావా? అని ఆగ్రహించాడు రేవంత్. నువ్వు కూడా సపోర్ట్‌తోనే ఆడుతున్నావు, సొంతగా ఆడలేదని ఫైమా అనడంతో మరింత రెచ్చిపోయాడు రేవంత్. నేను ఎవ్వడి సాయం తీసుకోలేదని కరాఖండిగా చెప్పాడు. ఈ మాటతో షాకైన ఆదిరెడ్డి.. మాట్లాడేటప్పుడు బ్రెయిన్ దగ్గర పెట్టుకో. ఇంతకుముందే మనిద్దరం ఒక టీమ్ అన్నట్లుగా చెప్పావు. ఇక్కడేమో శ్రీహాన్‌తో కలిసిపోయి ఆడావు. ఎంతమందితో కలిసి ఆడుతావు? అని విమర్శించాడు. కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోవడాన్ని ఇనయ జీర్ణించుకోలేక ఏడ్చేసింది. మొత్తానికి ఈ వారం రేవంత్ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తారక్‌తో చేయాల్సింది ప్రైజ్‌మనీకి భారీగా ఎసరు, కొత్త కెప్టెన్ ఎవరంటే? -
ప్రతిసారి నేనే బాధితుడిగా మారాల్సి వస్తోంది: రేవంత్
నామినేషన్స్ వచ్చాయంటే చాలు ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ప్రవర్తిస్తారు హౌస్మేట్స్. ఎక్కడెక్కడినుంచో ఏవేవో కారణాలు వెతికి పట్టుకుని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో మాటల యుద్ధాలు కూడా జరుగుతాయి. కానీ నామినేషన్ ప్రక్రియ ముగియగానే అందరూ తిరిగి మామూలవడమే ఒక మ్యాజిక్‌గా అనిపిస్తుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా నామినేషన్స్‌కు సంబంధించి మరో ప్రోమో రిలీజైంది. ఇందులో రాజ్.. వాసంతి నా గురించి మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు, నీకెందుకు? అని ఇనయను నిలదీశాడు. దీనికామె.. తనకేదనిపిస్తే అది చెప్పేస్తానంది. అంటే నువ్వు ఏం సోది చెప్పినా మేమందరం కూర్చుని వినాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆవేశంలో బూతు మాటలు అనేస్తున్నావని ఇనయను నామినేట్ చేసింది శ్రీసత్య. ఎవరి వల్ల కెప్టెన్సీ గేమ్ ఓడిపోయాడో ఆ ఇద్దరినే(రేవంత్, ఆది రెడ్డిని) నామినేట్ చేశాడు రోహిత్. సంచాలక్‌గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నావంటూ రేవంత్‌ను నామినేట్ చేసింది మెరీనా. ఇక రేవంత్ వంతు రాగా.. ఈ హౌస్‌లో ప్రతి చిన్న పాయింట్ పట్టుకుని నామినేట్ చేస్తున్నారు. అలా చిన్నపాటి విషయాలకు కూడా నామినేట్ చేసిన సందర్భాల్లో 70% నేనే బాధితుడిని అవుతున్నా అని చెప్పుకొచ్చాడు. చదవండి: అందంలో బుట్టబొమ్మ ఆటలో ఉత్త బొమ్మ.. పరువు తీసిన యాంకర్ -
వాసంతి ఎలిమినేట్, ఆ ముగ్గురే తన ఫేక్ ఫ్రెండ్స్!
Bigg Boss 6 Telugu, Episode 71: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 21 మందితో మొదలైంది. పది వారాలు గడిచేసరికి 11 మంది ఎలిమినేట్ అవగా హౌస్‌లో ప్రస్తుతం పది మంది మాత్రమే మిగిలారు. దీంతో బిగ్‌బాస్ షో మరింత రసవత్తరంగా మారనుంది. ఇకపోతే ఈరోజు గ్లామర్ ఆఫ్ ది హౌస్ వాసంతి ఎలిమినేషన్ ఎలా జరిగింది? ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చాక ఏం మాట్లాడింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! ఎప్పటిలాగే సండే ఫండే అనేమాటకు కట్టుబడి నాగ్ హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించాడు. ఇందుకోసం రేవంత్, ఇనయ, మెరీనా, రాజ్, ఫైమాలను A టీమ్‌గా.. కీర్తి, శ్రీహాన్, రోహిత్, వాసంతి, శ్రీసత్యలను B టీమ్‌గా విడగొట్టాడు నాగ్. మొదట ఆడించిన ఫన్ గేమ్‌లో టీమ్ A (రేవంత్) గెలిచింది. తర్వాత కనుక్కోండి చూద్దాం అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్‌మేట్స్‌తో పాటు సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటో చూపించి అదెవరో కనుక్కోవాలన్నాడు. తప్పు సమాధానం చెప్పినవారికి చిత్రవిచిత్ర పనిష్మెంట్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో రాంగ్ ఆన్సర్లిచ్చిన ఫైమా.. ముగ్గురు కంటెస్టెంట్లు అయిన బాలాదిత్య, రేవంత్, రాజ్‌లను ఇమిటేట్ చేసి నవ్వించింది. తర్వాత వాసంతి గోడకుర్చీ వేసి ఎనిమిదవ ఎక్కం చదివింది. కానీ ఇక్కడ కూడా తప్పు చదివి నవ్వులపాలైంది. ఆ తర్వాత తప్పు జవాబు చెప్పిన ఇనయ, కీర్తి కోడిలా గెంతుతూ పాట పాడారు. రెండో గేమ్‌లో కూడా B టీమ్‌పై A టీమ్ విజయం సాధించింది. దీంతో A టీమ్‌కు గిఫ్ట్ హ్యాంపర్ అందించారు. నాగార్జున నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి వాసంతి, మెరీనా ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరిలో వాసంతి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. హౌస్‌ను వీడేందుకు మనసొప్పని వాసంతి కన్నీళ్లతో బయటకు వచ్చేసింది. స్టేజీపైకి వచ్చిన వాసంతితో.. 5 ఫేక్ ఫ్రెండ్స్, 5 బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని గేమ్ ఆడించాడు. దీనికి ఆమె ఐదుగురు పేర్లు చెప్పలేనంటూ మెరీనా, ఇనయ, రేవంత్, కీర్తి తన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. ఫైమా, ఆదిరెడ్డి, రాజ్ ఫేక్ ఫ్రెండ్స్ అని పేర్కొంది. వాసంతి ఎలిమినేషన్‌తో హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. మీ పది మందిలో ఒకరే విజేత అని, వారికి రూ.50 లక్షల బహుమతి ఉంటుందని ప్రకటించాడు నాగ్. మరి ఈ టాప్ 10 కంటెస్టెంట్ల నెక్స్ట్ గేమ్ ఎలా ఉండనుంది? ఎవరు టాప్ 5కి చేరువవుతారు? ఎవరు విన్నర్‌గా నిలిచి అర కోటి రూపాయలు అందుకుంటారో చూడాలి! చదవండి: పేరెంట్స్ గుండెల మీద తన్నాను, తప్పు తెలిసి అమ్మ కాళ్ల మీద పడ్డా: సూర్య ఎవరు చేసిన పనికి వాళ్లే బాధ్యులు.. గీతూ ఎలిమినేషన్‌పై బాలాదిత్య కామెంట్స్ -
చివరి నిమిషంలో ట్విస్ట్! బాలాదిత్యతో పాటు వాసంతి అవుట్!
Bigg Boss Telugu 6, Episode 70: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో వరుసగా ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. గీతూ ఎలిమినేషన్ మరవకముందే బాలాదిత్య ఎలిమినేట్ అయ్యాడు. దీంతో షాక్‌లోకి వెళ్లిపోయాడు ఆది. తాను స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లు అవుట్ అవుతున్నారేంటని అయోమయానికి లోనయ్యాడు. మరి వెళ్లేముందు బాలాదిత్య హౌస్‌మేట్స్‌కు ఎలాంటి సూచనలిచ్చాడో చూద్దాం.. మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌ను ప్రస్తావించిన నాగార్జున.. ఆ టాస్క్‌లో రేవంత్ సంచాలక్‌గా వ్యవహరించాడని చెప్పాడు. అటు ఇనయ కోపంలో ఏది పడితే అది అనేస్తుందని సీరియస్ అయ్యాడు. నామినేషన్స్‌లో ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావు, అది తప్పని హెచ్చరించడంతో ఆమె సారీ చెప్పింది. అనంతరం హౌస్‌మేట్స్‌తో డాక్టర్- పేషెంట్ గేమ్ ఆడించాడు నాగ్. కొన్ని జబ్బుల పేర్లున్న కార్డులు పంపించి అది ఎవరికి సూటవుతుందో వారి మెడలో వేయాలన్నాడు నాగ్. అంతేకాకుండా ఆ జబ్బుకు తగ్గట్లు మందు ఇవ్వాలన్నాడు. ముందుగా శ్రీసత్య.. రేవంత్‌కు మొండితనం ఎక్కువని చెప్పి నిమ్మరసం తాగించింది. ఇనయ.. వాసంతికి ఇమ్మెచ్యురిటీ ఎక్కువని, మనిషి ఎదిగినా తన బ్రెయిన్ ఎదగలేదంటూ ఉసిరి రసం ట్రీట్మెంట్ ఇచ్చింది. రాజ్.. ఇనయ వితండవాదం చేస్తుందని కాకరకాయ రసం తాగించాడు. ఫైమా.. ఇనయకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువంటూ ఆమెకు నిమ్మరసం అందించింది. నమ్మకద్రోహం చేసిందంటూ వాసంతితో ఉసిరి రసం తాగించింది మెరీనా. ఇనయ ఇగోతో గేమ్ ఆడుతుందన్నాడు ఆదిరెడ్డి. శ్రీసత్యకు కక్కుర్తి ఎక్కువన్నాడు రేవంత్. ఇనయకు తలపొగరు ఎక్కువని చెప్పాడు రోహిత్. శ్రీసత్యకు ఇగో ఎక్కువంది కీర్తి. ఫైమాకు స్వార్థమెక్కువని బాలాదిత్య, రేవంత్‌కు స్వార్థమెక్కువని శ్రీహాన్ అభిప్రాయపడ్డారు. శ్రీసత్య మానిప్యులేటర్ అని వాసంతి అనగా అది నేనూ ఒప్పుకుంటానన్నాడు నాగ్. అనంతరం బాలాదిత్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో అందరూ షాకయ్యారు. స్టేజీపైకి వచ్చిన బాలాదిత్య హౌస్‌మేట్స్‌కు విలువైన సూచనలు చేశాడు. ఆదిరెడ్డిని గట్టిగా అరవకుండా కాన్ఫిడెంట్‌గా మాట్లాడమన్నాడు. స్ట్రాటజీలు ఫెయిరా? అన్ఫెయిరా? కాస్త చూసుకొని ఆడమని ఫైమాకు సలహా ఇచ్చాడు. రాజ్.. ఏదైనా క్లారిటీగా చెప్పాలన్నాడు. రోహిత్‌ను టెంపర్ లూజవ్వద్దని సూచించాడు. మెరీనా ఇండిపెండెంట్‌గా ఆడాలన్నాడు. గీతూ తర్వాత ఎక్కువ కనెక్ట్ అయింది సత్యకే అంటూ కోపంలో మాటలు వదిలేయొద్దని కోరాడు. శ్రీహాన్ తెలివైనవాడని, కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమన్నాడు. రేవంత్ రౌద్రంగా కనిపించే పసిపిల్లాడని చెప్పాడు. అగ్రెషన్ ఒక్కటి తగ్గించుకోవాలని సూచించాడు. ఇనయకు ఏదైనా చెప్పే ధైర్యం ఉంది, కానీ చెప్పే విధానం సరిగా లేదంటూ దాన్ని సరిచేసుకోమన్నాడు. కీర్తిని ఎక్కువ ఆలోచించొద్దన్నాడు. వాసంతిని ఓటమి నుంచి మోటివేట్ అయి గేమ్ ఆడాలని పేర్కొన్నాడు. ఇక హౌస్‌లో ఏ నెగెటివిటీ మూటగట్టుకోకుండా స్వచ్ఛమైన మనసుతో మంచివాడన్న బిరుదుతోనే బయటకు వచ్చేశాడు బాలాదిత్య. రేపటి ఎపిసోడ్లో మెరీనాకు బదులుగా వాసంతి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఓడిపోతే బూతులు మాట్లాడతావా: ఇనయపై నాగ్ ఫైర్ టాప్ 5లో శ్రీహాన్ డౌటే, ఇనయ లేకపోతే బిగ్‌బాసే లేదు: గీతూ -
జైల్లో ఇనయ, వదిలేస్తే టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారే!
Bigg Boss 6 Telugu, Episode 69: గీతూ వెళ్లిపోయాక ఆదిరెడ్డి మరీ విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి అతడి మాటలు, ఆట చూస్తుంటే గీతూ పూనినట్లే అనిపిస్తోంది. ఇనయ మీద నోరేసుకుని పడిపోయి అనవసరంగా ఆమెకు హైప్ ఇస్తున్నాడు ఆది. హౌస్‌లో అందరూ ఇనయ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నా బయట తనకది పాజిటివ్ అవుతుండటం గమనార్హం. నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. కెప్టెన్సీ టాస్క్‌లో ఆదిరెడ్డి, ఫైమా కలిసి ఆడారని ఇనయ ఆరోపించింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆది.. 'అసలు నీకు బ్రెయిన్ ఉందా? నేను ఫైమాతో ప్లాన్ చేశానని తేలితే బిగ్‌బాస్ వదిలి వెళ్లిపోతా' అని సవాలు విసిరాడు. అటు ఫైమా కూడా.. నువ్వు ఎంత ఒర్రినా ఎక్కువ రోజులుండవులే అని శివాలెత్తింది. సంచాలక్ కన్ఫ్యూజన్కు శ్రీసత్యకు చిర్రెత్తిపోయింది. కళ్ల ముందు తనను లాగుతున్నా ఏమీ అనకుండా నిల్చుండిపోయాడని రేవంత్‌పై అసహనం వ్యక్తం చేసింది. చివరగా ఈ పోటీలో ఫైమా గెలిచి కొత్త కెప్టెన్‌గా అవతరించింది. గెలవగానే ఫైమా ఇనయను పట్టుకుని ఏడ్చేసింది. ఇది చూసి షాకైన హౌస్మేట్స్ ఇప్పుడే గొడవ పెట్టుకున్నారు, అప్పుడే కలిసిపోయారా? అని ఆశ్చర్యపోయారు. రాత్రి రేవంత్, రాజ్ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో శ్రీహాన్‌ను మధ్యలోకి లాగుతూ.. నేను గెలిస్తే రావు, కానీ సత్య గెలిస్తే దుప్పటి పట్టుకుని మరీ తన దగ్గరకు వెళ్లిపోతావు అని కామెంట్ చేశాడు. ఇది శ్రీహాన్ సరదాగా తీసుకోలేకపోయాడు. కామెడీగా అయినా సరే, ఏది పడితే అది అనేయకు అని హెచ్చరించాడు. అలా నోటికొచ్చింది మాట్లాడితే నీకు, ఇనయకు తేడా ఏంటని ప్రశ్నించాడు. దీనికి రేవంత్.. తానసలు ఆ మాటే అనలేదని బుకాయించాడు. అనంతరం బిగ్‌బాస్ ఈవారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమన్నాడు. ముందుగా ఫైమా.. వాసంతికి; ఇనయ, కీర్తి.. రోహిత్‌కు; వాసంతి, మెరీనా.. కీర్తికి; రాజ్.. శ్రీసత్యకు స్టాంప్ వేశారు. సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయ్యావంటూ రేవంత్‌కు స్టాంప్ వేశాడు బాలాదిత్య. సంచాలక్‌గా నువ్వు గేమ్ మధ్యలో రూల్స్ మార్చావు, ముందు వారాల్లో కంటే ఇప్పుడు నీలో చాలా మార్పు కనిపించింది. ఈ వారం నీలో ఏదీ నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్ వేసింది శ్రీసత్య. అటు ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్.. ఇనయకు స్టాంపేశారు. తర్వాత రేవంత్ వంతు రాగా.. అరవడం గురించి మీరు నాతో పోల్చుకున్నారు. అది నచ్చలేదు. రాత్రి నీ గురించి మాట్లాడుకున్నాం అన్నావు, అది నీ భ్రమ అంటూ తిరిగి శ్రీసత్యకు స్టాంప్ గుద్దాడు. ఎక్కువగా ఇనయకు ఓట్లు పడటంతో ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేసి జైలుకు పంపించారు. అయితే హౌస్మేట్స్ ఆమెతో ఎంత గొడవపడితే బయట ఆమెకు అంత మద్దతు పెరుగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో ఆమెను ఏకంగా జైలుకే పంపించి ఇనయకు మరింత హైపిచ్చారు. చూస్తుంటే అందరూ కలిసి ఇనయకు టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారు. చదవండి: బిగ్‌బాస్, నాగార్జున నేనే తోపు అన్నట్లు పొగిడారు: గీతూ డ్రైవర్‌కు రూ.15 లక్షల సాయం చేసిన బన్నీ, ఎందుకో తెలుసా? -
శ్రీసత్యకు ఇచ్చిపడేసిన రేవంత్, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీ దాదాపు ముగిసినట్లే! లైవ్ టెలికాస్ట్‌లో ఫైమా కెప్టెన్‌గా అవతరించింది. ఇక మిగిలిందల్లా వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోవడమే! ఈమేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో వరస్ట్ ఇంటిసభ్యులను ఎంచుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్. సంబంధం లేని విషయాల్లో తలదూర్చుతోందని ఇనయకు స్టాంప్ గుద్దాడు ఆదిరెడ్డి. రోహిత్ కూడా ఇనయను చెత్త కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు. ముందు వారాలతో పోలిస్తే ఈవారం నీలో మార్పు కనిపించిందని, అది నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్ గుద్దింది శ్రీసత్య. ఏం మార్పు, ఏమైనా లావయ్యానా? అని రేవంత్ సెటైర్ వేయగా ఈ వెటకారమే నచ్చలేదంది శ్రీసత్య. తర్వాత రేవంత్ వంతు రాగా.. ఎవరెంత అరుస్తారో అందరికీ తెలుసు, మీరు నాతో పోల్చుకోవడం నాకు నచ్చలేదు అంటూ శ్రీసత్యకు స్టాంప్ వేశాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. కెప్టెన్సీ టాస్క్‌లో అంత అన్యాయం చేసిన రేవంత్‌ను వదిలేసి రోహిత్.. ఇనయకు ఓటేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ సగం తెలివితేటల వల్లే కెప్టెన్సీ పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అలాగే రేవంత్.. ఇన్నాళ్లకు సత్య నిజస్వరూపం తెలుసుకున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అతడి ఫ్యాన్స్. మరి ఎవరు వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలుకెళ్లారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: చెత్త సంచాలక్, రోహిత్‌కు అన్యాయం -
రేవంత్ చెత్త సంచాలక్, రోహిత్‌కు తీవ్ర అన్యాయం
Bigg Boss Telugu 6, Episode 68: నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ కంటెండర్‌గా తన స్థానంలో శ్రీసత్యను సెలక్ట్ చేశాడు శ్రీహాన్. హౌస్మేట్స్ అందరూ తనను టార్గెట్ చేయడంతో డీప్‌గా హర్టయ్యాడు రేవంత్. మరి ఈరోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది? రేవంత్ తిరిగి నార్మల్ అయ్యాడా? అనేది చూద్దాం.. 'గేమ్‌లో ఫిజికల్ అవకముందే అయ్యానని అన్నారు. అంత కష్టపడి ఆడితే నాకు ప్రతిఫలం దక్కలేదు. అసలు ఈ హౌస్‌కు రాకుండా ఉండాల్సింది, ఓడిపోయాను' అని బాధపడ్డాడు రేవంత్. మెరీనా అతడిని ఓదారుస్తూ కంటనీరు తుడవగా.. కెప్టెన్సీలో సపోర్ట్ కావాలంటే నీకు, కీర్తికి సాయం చేస్తానని మాటిచ్చాడు రేవంత్. ఇక శ్రీసత్య తినడానికి పిలిస్తే కూడా తనకు ఒంటరిగా ఉండాలనుందని ఆమెను దూరం పెట్టాడు. అర్ధరాత్రి భార్య ఫొటో చూస్తూ ఆమెనే తలుచుకున్న రేవంత్ బిగ్‌బాస్ గెలిచే ఇంటికి వస్తానని మరోమారు గట్టిగా మనసులో అనుకున్నాడు. తర్వాతి రోజు కూడా రేవంత్ ముభావంగానే ఉన్నాడు. ఇంతలో బిగ్‌బాస్.. రేవంత్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి కెప్టెన్సీ టాస్క్ నిర్వహించమని చెప్పాడు. వస్తా నీ వెనుక అనే కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీసత్య, ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్ పోటీపడ్డారు. టాస్క్ మధ్యలో రకరకాల రూల్స్ పెట్టాడు రేవంత్. దీంతో శ్రీసత్య మధ్యలో నీకిష్టం వచ్చినట్లు ఎలా పెడతావని ఆగ్రహించింది. సంచాలక్‌గా నా ఇష్టం వచ్చిందే చేస్తానని తెగేసి చెప్పాడతడు. అతడు పెట్టిన నియమాల్లో బ్యాగు చేత్తో పట్టుకోవద్దని కూడా ఉంది. దీంతో రోహిత్ బ్యాగు చేత్తో పట్టుకోలేదు. కానీ ఆదిరెడ్డి మాత్రం చేత్తో అదిమి పట్టుకుంటున్నా సంచాలక్ నోరెత్తలేదు. పైగా రోహిత్ అవుట్ అని చెప్పడంతో అతడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అక్కడ ఆది.. చేత్తో పట్టుకుంటే కనిపించడం లేదా? అని ప్రశ్నించాడు. తన గోనెసంచిని కాలితో తన్ని ఫ్రస్టేషన్ తీర్చుకున్నాడు. అన్‌ఫెయిర్ అంటూ రేవంత్ మీద మండిపడ్డాడు. దీంతో అతడు వెళ్లి ఎక్కడ తప్పు జరిగిందని ఆరా తీశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెత్త సంచాలక్‌గా వ్యవహరించడం వల్ల పోటీదారులు తికమకపడాల్సి వచ్చింది. ఫైనల్‌గా ఈ టాస్క్‌లో ఫైమా కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: బికినీలో నిహారిక, టాటూ ఫొటోలు వైరల్ -
మనసుకు గాయమంటూ రేవంత్ ఏడుపు, కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన బిగ్‌బాస్
కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో అందరూ తన వీక్నెస్తో ఆడుకోవడంతో రేవంత్ బాగా హర్టయ్యాడు. ఫిజికల్ కాకపోయినా ఫిజికల్ అయ్యానంటూ తనను టార్గెట్ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. దీనికి తోడు కెప్టెన్సీ కంటెండర్‌గా తనకు బదులుగా శ్రీహాన్.. శ్రీసత్య పేరును సెలక్ట్ చేయడాన్ని అతడు జీర్ణించుకోలేనట్లు తెలుస్తోంది. అందుకే ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చుని తనలో తనే మధనపడుతున్నాడు. స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో అందరికంటే ఎక్కువ మట్టి తెచ్చి సాధించినా కూడా నాకు ప్రతిఫలం అందలేదు. నేను ఓడిపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈరోజు నేను గేమ్ ఆడలేకపోయాను. నాలా నేను లేను.. మనసుకు తగిలిన గాయం అంత ఈజీగా పోదు అని శూన్యంలోకి చూస్తూ మాట్లాడాడు. ఇలా డల్‌గా ఉంటే జనాలకు నచ్చవు, నాతో ప్రాబ్లమ్ అయితే చెప్పు, నేను మాట్లాడను అని శ్రీసత్య అనగా నాకు నాతోనే ప్రాబ్లమ్ అని ఆన్సరిచ్చాడు రేవంత్. తర్వాత బిగ్‌బాస్ రేవంత్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. మరి కన్ఫెషన్ రూమ్‌లో బిగ్‌బాస్ రేవంత్‌కు ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చాడా? లేదంటే అతడిని ఓదార్చడానికి పిలిచాడా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: పెళ్లి పీటలెక్కబోతున్న నాగశౌర్య రేవంత్‌కు శ్రీహాన్ వెన్నుపోటు పొడిచాడా? -
రేవంత్‌కు శ్రీహాన్ వెన్నుపోటు? ఇప్పటికైనా తెలుసుకుంటాడా?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ఆట అంటే ప్రాణం పెట్టి ఆడేవాళ్లలో సింగర్ రేవంత్ ముందువరుసలో ఉంటాడు. తనమన బేధాలు పక్కనపెట్టి గెలుపే తన లక్ష్యంగా పోరాడుతుంటాడు. ఒకరికి నేను ఎదురెళ్లినా వారికే రిస్కు, ఒకరు నాకెదురొచ్చినా వాళ్లకే రిస్కు అన్న రేంజ్లో గేమ్ ఆడతాడు. ఈ క్రమంలో తనకు తెలియకుండానే కొన్నిసార్లు అవతలి హౌస్‌మేట్స్‌ను నెట్టేసి, కొట్టేసినంత పని చేశాడు. దీంతో నాగార్జున గేమ్ ఆడాలి కానీ అంత ఫిజికల్ అవకూడదని హెచ్చరిస్తూనే రేవంత్‌కు ఎల్లో కార్డ్ ఇచ్చాడు. ఇంకోసారి ఫిజికల్ అయితే నేరుగా బయటకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ దెబ్బతో రేవంత్ ఓ మెట్టు తగ్గక తప్పలేదు. కానీ దీన్నే తమ అస్త్రంగా మలుచుకున్నారు మిగతా హౌస్మేట్స్. స్నేక్ అండ్ లాడర్ టాస్క్‌లో పాము టీమ్ సభ్యులు అతడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలనుకున్నారు. అతడు చేయి పట్టుకున్నా, లాగినా, వదిలించుకున్నా, ఆఖరికి కన్నెత్తి చూసినా సరే ఫిజికల్ అవుతున్నావు అని పదే పదే అరవడంతో రేవంత్ సైడ్ అయిపోయాడు. నేనేం చేయకపోయినా ఫిజికల్ అవుతున్నానని నిందలు వేస్తున్నారని అప్సెట్ అయ్యాడు. చివరికి గేమ్ అయిపోయాక టాస్క్‌లో కావాలని రెచ్చగొట్టామని వారు క్లారిటీ ఇవ్వడంతో అతడు మరింత బాధపడ్డాడు. ఇప్పటికే ఎల్లో కార్డ్ వచ్చిన బాధలో ఉంటే నా వీక్నెస్తో ఆడుకున్నారని తనలో తనే మధనపడ్డాడు. దీనికి తోడు శ్రీహాన్ చేసిన పనికి కూడా అతడు హర్ట్ అయినట్లు తెలుస్తోంది. గతవారం గీతూ పనిష్మెంట్ సరిగా చేయకపోవడంతో ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న శ్రీహాన్‌కు నాగార్జున ఓ పనిష్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా! ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ చేయలేవని స్పష్టం చేశాడు నాగ్. అయితే స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో పాము టీమ్ విజయం సాధించింది. ఇందులో శ్రీహాన్ కూడా ఉన్నాడు. అతడు కెప్టెన్సీ కంటెండర్ కాలేనందున అతడి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోమన్నాడు. దీనికతడు గేమ్‌లో ఎంతో కష్టపడ్డ రేవంత్‌ను పక్కనపెట్టి ప్రస్తుతం ఇంట్లో కెప్టెన్‌గా ఉన్న శ్రీసత్యను ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో రేవంత్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని సరిచేసుకుని తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు రేవంత్. అందుకోసం బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి గేమ్‌లో ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. అతడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు శ్రీహాన్ తన పేరు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్న ఎదురవుతోంది. శ్రీసత్య ఈవారమే కెప్టెన్ అయినందున తనకు ముందు వారాల్లో ఛాన్స్ ఇవ్వాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పక్కనే ఉంటూ బెస్ట్ ఫ్రెండ్‌కే వెన్నుపోటు పొడిచాడని రేవంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అతడు తన స్నేహితులెవరో తెలుసుకుంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. హౌస్మేట్స్ అంతా టార్గెట్ చేయడం ఒక ఎత్తయితే క్లోజ్ ఫ్రెండ్ తనను లెక్క చేయకపోవడం మరో ఎత్తు అని, అందుకే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడని భావిస్తున్నారు. అటు శ్రీహాన్ ఫ్యాన్స్ మాత్రం.. ఇద్దరి ఫ్రెండ్స్‌కు ఒకేసారి న్యాయం చేయలేడు కదా, ఎవరికో ఒకరికి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం అయితే ఇచ్చాడు కదా, అది సరిపోదా? అని వెనకేసుకొస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్‌కు రాకుండా ఉండాల్సింది: ఏడ్చిన రేవంత్ కంట్రోల్ తప్పిన రోహిత్, బ్యాగును తన్నుతూ ఫైర్ -
బిగ్‌బాస్‌కు రాకుండా ఉండాల్సింది: ఏడ్చిన రేవంత్
Bigg Boss Telugu 6, Episode 67: బిగ్‌బాస్ షో మొదలై పది వారాలు కావస్తోంది. ఇప్పటివరకు కెప్టెన్ కాలేని వాళ్లు చాలామందే ఉన్నారు. అందులో ఒకరు ఈవారం కెప్టెన్‌గా అవతరించారు. మరి ఆ కొత్త కెప్టెన్ ఎవరు? ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరిగిందో తెలియాలంటే నేటి బిగ్‌బాస్ హైలైట్స్ చదివేయాల్సిందే! నిన్నటి గేమ్‌లో అవుట్ అయిన సత్య, ఇనయ, వాసంతి, రోహిత్ తిరిగి రేస్‌లోకి వచ్చేందుకు మంచి ఆఫరిచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా వీళ్లు ప్రత్యర్థుల మీద స్టిక్కర్స్ అతికించాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో సత్య, రోహిత్ విజయం సాధించి తిరిగి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో పాల్గొన్నారు. ఆటలో ఓడిపోయినందుకు ఫ్రస్టేట్ అయిన ఇనయ ఏదో బూతు మాట్లాడేసి తర్వాత అనుకోకుండా అన్నానని సారీ చెప్పింది. కెప్టెన్సీ కంటెండర్లు అవడానికి బిగ్‌బాస్ చివరగా నాగమణి అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో నిచ్చెన టీమ్(బాలాదిత్య, రాజ్, రేవంత్, సత్య, మెరీనా,) మణులను కాపాడుకోవాల్సి ఉండగా మిగతా టీమ్ వాటిని దక్కించుకోవాల్సి ఉంటుంది. నిచ్చెన టీమ్ దగ్గరున్న మణులను పాము టీమ్ సభ్యులు తీసుకునేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. అందులో భాగంగా మొట్టమొదటగా రేవంత్‌ను కావాలని రెచ్చగొడితే అతడు ఆటాడకుండా పక్కకు తప్పుకుంటారని ప్లాన్ వేశారు. గేమ్ మొదలు కాగానే అదే ప్లాన్‌ను అమల్లో పెట్టారు. రేవంత్ జస్ట్ తోసేసినా సరే ఫిజికల్ అవుతున్నాడంటూ కావాలని రెచ్చగొట్టారు. వారి మాటలకు ఆవేశంతో ఊగిపోయిన రేవంత్ ఫిజికల్ అయితే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఆదిరెడ్డి, ఫైమా అయితే రేవంత్‌కు మరింత కోపం తెప్పించేందుకు ప్రయత్నించారు. అవతలి టీమ్‌లోని శ్రీహాన్ , ఆది రెడ్డి అయితే బాలాదిత్య, రేవంత్‌ల కాళ్లు పట్టుకుని ఈడ్చుకు లాగారు. ఆట ముగిసేసరికి సంచాలకులుగా వ్యవహరించిన వాసంతి, ఇనయ పాము టీమ్ గెలిచినట్లు తెలిపారు. దీంతో ఆ టీమ్‌లోని ఫైమా, ఆదిరెడ్డి రోహిత్, కీర్తి కెప్టెన్సీ కోసం పోటీపడారు. నాగ్ ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా శ్రీహాన్ పోటీపడే అర్హత కోల్పోయాడు. అతడి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోవచ్చని బిగ్‌బాస్ తెలపడంతో శ్రీహాన్.. తన స్థానంలో శ్రీసత్య పోటీపడుతుందని తెలిపాడు. బంగారు మణి నిచ్చెన టీమ్‌లోని మెరీనా దగ్గర ఉండటంతో ఆమె సైతం కెప్టెన్సీ బరిలో నిలిచింది. ఇక ఈ గేమ్‌లో ఫైమా కొత్త కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అందరూ తన వీక్నెస్ మీద కొట్టడాన్ని తట్టుకోలేకపోయాడు రేవంత్. 'టాస్క్ సమయంలో నేను కోప్పడుతున్నానని కావాలని లేనిపోనివి చెప్పి నా కాళ్లూచేతులు కట్టేశారు. ఇంకోసారి ఫిజికల్‌గా ఆడితే ఎల్లో కార్డ్ ఇస్తానన్నారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఈ బిగ్‌బాస్ హౌస్‌కి రాకుండా ఉండాల్సింది' అంటూ ఎమోషనలయ్యాడు రేవంత్. చదవండి: బిగ్‌బాస్: గీతూ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? ఫిజికల్ అన్నారంటే తోలు తీస్తా: రేవంత్ వార్నింగ్ -
ఫిజికల్ అన్నారంటే తోలు తీసేస్తా: రేవంత్ వార్నింగ్
కెప్టెన్ అవుదామంటే కంటెండర్ కూడా కాలేకపోయానని ఏడ్చేసింది ఇనయ. అటు సత్య కూడా గేమ్‌లో కంటతడి పెట్టుకుంది. మరోవైపు కెప్టెన్సీ పోటీదారులవ్వడానికి బిగ్‌బాస్ నాగమణి అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా టీమ్ సభ్యులు వారికిచ్చిన నాగమణులను కాపాడుకోవాల్సి ఉంటుంది. అవతలి టీమ్ వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇచ్చిందే ఫిజికల్ గేమ్ కావడంతో కిందామీదా పడి ఎలాగైనా మణులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్.. ఎవరో గట్టిగా లాగుతున్నారు, ఇంతకింతా ఉంటుంది. మళ్లీ ఎవరైనా నన్ను ఫిజికల్ అన్నారంటే తోలు తీసేస్తా అని హెచ్చరించాడు. అనడమే కాదు తన మణులు లాక్కోడానికి వచ్చినవాళ్లను తోసిపారేశాడు. దీంతో ఫిజికల్ అవొద్దు అని కీర్తి, ఆదిరెడ్డి హెచ్చరించారు. అయినా తగ్గని రేవంత్... నేను ఆపడానికి ట్రై చేస్తుంటే వాళ్లు చేతకాక ఫిజికల్ అంటున్నారని సీరియసయ్యాడు. ఇకపోతే ఈ గేమ్‌లో స్నేక్ టీమ్ గెలిచినట్లు సమాచారం. ఆ టీమ్‌లో శ్రీహాన్ కూడా ఉన్నాడు. కానీ అతడికి ఈవారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అర్హత లేదని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా! దీంతో అతడు తన స్థానంలో శ్రీసత్యను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో తన్నులాట -
Bigg Boss 6 Telugu: గాయం కారణంగా కన్నీళ్లు పెట్టుకున్న కీర్తి
బిగ్‌బాస్ సీజన్-6లో అనుకోని విధంగా గీతూ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇది హౌస్‌మేట్స్‌కి కూడా షాకింగ్ అనే చెప్పొచ్చు. దీంతో గేమ్‌పై మరింత కసి పెరిగింది. తర్వాత వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్ పాము-నిచ్చెనల టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో ఇంటిసభ్యులు రెండు టీమ్స్‌గా విడిపోవాల్సి ఉంటుంది. సగం మంది పామును, మరికొందరేమో నిచ్చెనను కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాము టీమ్ నుంచి ఒకరు వెళ్లి నిచ్చెనను చిన్నగా చేసి ఆ మట్టిని తమ పాము కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ టాస్కులో కీర్తి బాగా ఎమోషనల్ అయింది. నిచ్చెన టీమ్‌లో రాజ్‌తో పోటీపడుతూ కిందపడిపోయింది. తన చేతికి తగిల గాయం కారణంగా సరిగ్గా గేమ్ ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఈ టాస్కులో పామ్ వర్సెస్ నిచ్చెన టీమ్స్‌లో ఎవరు గెలుస్తారన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది. -
ఇనయపై రేవంత్ దాడి, ఈ వీడియో సాక్ష్యం!
Bigg Boss Telugu 6, Episode 62: నేను వెధవను, వెధవన్నర వెధవను, దొంగను, నన్ను నమ్మొద్దు అని అందరి ముందే అరిచి మరీ చెప్పింది గీతూ. ఆటలో తనమన బేధాలు లేవని కుండ బద్ధలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. కానీ ఆదిరెడ్డి వినిపించుకోలేదు. గీతక్క గీతక్క అంటూ నెత్తినెక్కించుకున్నాడు. చివరికి అతడికి వెన్నుపోటు పొడిచి గుణపాఠం నేర్పింది. ఇంతకీ మిషన్ పాజిబుల్ గేమ్‌లో ఏం జరిగింది. గీతూ వల్ల ఆది గేమ్ ఏమైంది? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! రాత్రిపూట టీషర్ట్లు కొట్టేయకూడదు అని రెండు టీముల లీడర్లైన ఆది, గీతూ ఒప్పందం చేసుకున్నారు. కానీ గీతూ మాత్రం అప్పటికే దొంగతనం ప్లాన్ వేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గీతూ గేమ్‌లో లేదు, అయినా సరే ఆది రెడ్డి టీషర్ట్ లేపేసింది. తెల్లారాక నిజం తెలుసుకున్న ఆది.. నాతో పర్సనల్‌గా ఆడావు అంటూ గీతూమీద నిప్పులు చెరిగాడు. అటు గీతూ మాత్రం.. బుద్ధి బలం వాడామంటూ అదేపనిగా డప్పు కొట్టుకుంది. నీ మంచితనమే వీక్నెస్, దానిమీదే కొట్టానంది. మరోపక్క గేమ్‌లో హౌస్మేట్స్ నిజంగానే కొట్టుకున్నారు. ఇనయ అవతలివాళ్లను కాళ్లతో విదిలించునేందుకు ప్రయత్నించగా రేవంత్ ఆమెను అవతల పడేశాడు. ఇంటెన్షల్‌గా కొడుతున్నారని ఇనయ అరిచి గోల చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అనంతరం బిగ్‌బాస్.. చనిపోయిన సభ్యులు భౌతికంగా పాల్గొనలేరని గీతూకు చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు. చనిపోయిన గీతూ.. ఆదిరెడ్డి టీషర్ట్ తీసింది కాబట్టి అతడు చనిపోలేదన్నాడు. కానీ మైక్ విసిరేసిన కారణంగా ఆదిరెడ్డిని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగించి షాకిచ్చాడు. తర్వాత మిషన్ పాజిబుల్ టాస్క్ పూర్తైనట్లు ప్రకటించాడు. తన వల్ల గేమ్‌లో అవుట్ అయినందుకు ఆదికి అదే పనిగా సారీ చెప్పింది గీతూ. అయినా క్షమించడానికి మనసొప్పని ఆది.. త్వరలో నిన్ను ఏడిపిస్తా, అదే నేను కొట్టబోయే దెబ్బ అని ప్రతీకార శంఖం పూరించాడు. మరోవైపు ఇనయ.. ఇంట్లో అందరికీ శత్రువునైపోయా, ఎమోషనల్‌గా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అంటూ తనలో తనే బాధపడింది. అటు గీతూ కూడా మనసంతా బాధగా ఉందని కంటతడి పెట్టుకుంది. బయట నాకు ఎన్నో వెన్నుపోట్లు, ఇక్కడ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నారు. వారి ప్రేమ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదిరెడ్డి నమ్మకం మీద కొట్టాను, అతడిని క్షమించమని అడుగుతాను అంటూ పడుకున్న వ్యక్తిని లేపి మరీ సారీ చెప్పింది గీతూ. మిషన్ పాజిబుల్ టాస్క్ డ్రా అవడంతో రెండు టీమ్ లీడర్లు కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్ల పేర్లు చెప్పమన్నారు. దీంతో రెండు టీమ్స్.. అందరు అమ్మాయిల పేర్లు చెప్పారు. అలా బెలూన్ కాపాడుకునే టాస్క్‌లో శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఫైమా, వాసంతి, గీతూ పోటీపడ్డారు. ఫైనల్‌గా శ్రీసత్య గెలిచి కెప్టెన్ అయింది. దీంతో ఆమె సంతోషంలో మునిగి తేలగా మిగతావారు మాత్రం కెప్టెన్సీ చేజారిపోయిందని బాధపడ్డారు. అయితే ఇనయ, రేవంత్ ఫైట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇనయ(#Inaya) హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. Does this not warrant RED CARD to a RED CHIP fellow ఛీVanth? 🤔#BiggBossTelugu6pic.twitter.com/osMqfhiBf5 — Naresh Reddy (@BBNTANALYST) November 4, 2022 Ma #Revanth annaw chala maaradu Yes, isari ammailaki bayapaddadu last ki🤣🤣🤣 Kani unmadhi lage behave chestunnadu inka #Inaya #Vasanthi #Marina#BiggBoss6Telugu #BiggBoss #BiggBossTelugu pic.twitter.com/XiRFlfprJH — Power Ranger 💙 (@BluePoweRangerr) November 4, 2022 చదవండి: నీ భార్యతో రొమాన్సా? పిచ్చిపిచ్చిగా ఉందా?: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒంటినిండి గాయాల మచ్చలు, కాళ్లలో ఐరన్ రాడ్లు, ఆమె ఓ ఫైటర్ -
గీతక్క మాయలో ఆదిరెడ్డి, కొత్త కెప్టెన్ ఎవరంటే?
Bigg Boss 6 Telugu, Episode 61: బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతోంది. సీక్రెట్ మిషన్ టాస్క్‌లో భాగంగా రెడ్ టీమ్ కావాలనే బాత్రూమ్ను డర్చీగా మార్చింది. కానీ ఆ నిందను బ్లూ టీమ్ మేద వేయడంతో హౌస్‌లో రచ్చ రంబోలా జరిగింది. సీక్రెట్ గేమ్ సక్సెస్ కావడంతో బ్లూ టీమ్‌లో చనిపోయిన రోహిత్‌ను తిరిగి బతికించారు. మధ్యాహ్నం భోజనం సమయానికి సూర్య ప్లేటు కోసం ఇల్లంతా వెతికింది ఇనయ. ఎక్కడా కనిపించకపోవడంతో ప్లేటు మీద సూర్య పేరును ఎవరు చెరిపేశారు? అని నిలదీసింది. దీనికి బాలాదిత్య నువ్వు వాడుతున్నావనే చెరిపేశారని ఆన్సరిచ్చాడు. అది విన్న రేవంత్.. అలా అనడం తప్పంటూ అందుకున్నాడు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, సత్య ఏం అందో అదే చెప్పానని బదులిచ్చాడు. నా ఎమోషన్‌తో ఆడుకుంటున్నారని ఫైర్ అయిన ఇనయ అన్నం తిననంటూ ఓ మూలన కూర్చుని ఏడ్చింది. ఇది చూసిన శ్రీసత్య.. అంత ప్రేముంటే బిగ్‌బాస్‌ను అడిగి మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెళ్లిపోయి సూర్య ఇంట్లో కూర్చోమను అని వెక్కిరించింది. ఇనయ అలిగి ఏడుస్తూ కూర్చోవడంతో కీర్తి ఓదార్చగా మెరీనా గోరు ముద్దలు తినిపించింది. తర్వాత గేమ్ తిరిగి ప్రారంభం కాగా రెడ్ స్క్వాడ్‌లో రేవంత్ కంటికి గాయం అయింది. ఇంతలో గీతూ అవుట్ అయింది. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన రెండో మిషన్‌లో రెడ్ టీమ్ గెలవడంతో వారు రోహిత్‌ను తిరిగి చంపేశారు. ఇక ఈ రోజుకు టాస్క్ సమయం ముగిసిందన్నాడు బిగ్‌బాస్. అయితే రాత్రి టీ షర్ట్లు దొంగిలిద్దామని ప్లాన్ వేసింది గీతూ. కానీ ఆదిరెడ్డితో మాత్రం టాస్క్ ఆన్ అయ్యాకే తిరిగి గేమ్ స్టార్ట్ చేద్దామని మాయమాటలు చెప్పింది. అతడూ సరేనని నమ్మాడు. అలా అతడిని బురిడీ కొట్టించి అర్ధరాత్రి ఆది రెడ్డి టీషర్ట్ దొంగిలించింది గీతూ. తెల్లవారుజామున ఆదిరెడ్డికి గీతూ గేమ్ అర్థమైంది. గేమ్ పాజ్‌లో ఉన్నప్పుడు టీషర్ట్స్ స్ట్రాప్స్ తీసేయడం తప్పని వారించగా తానసలు తీయలేదని అబద్ధమాడింది గీతూ. గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుందని హెచ్చరించాడతడు. అయితే ఈ మిషన్ పాజిబుల్ గేమ్ డ్రా అయిందట. దీంతో రెండు టీమ్స్‌లోని మెరీనా, వాసంతి, ఇనయ, ఫైమా, సత్య, గీతూ కెప్టెన్సీ కోసం పోటీపడగా సత్య కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: బుజ్జమ్మ తన గర్ల్‌ఫ్రెండే కాదన్న సూర్య, ఇనయ లైన్ క్లియర్? -
ఇనయ బండారం బయటపెట్టిన రేవంత్, నామినేషన్స్‌లో 10 మంది!
Bigg Boss Telugu 6, Epispde 58: ఆర్జే సూర్య ఎలిమినేషన్ నేటి నామినేషన్స్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఓ పక్క సూర్య కప్‌లో కాఫీ తాగుతూ అతడి జ్ఞాపకాల్లో మునిగి తేలుతోంది ఇనయ. ఆమెను చూసిన ఫైమా.. సూర్యతో మాట్లాడితే బయటకు నెగెటివ్‌గా పోతుందన్న ఆమె అతడు వెళ్లిపోతుంటే ముద్దులు పెట్టింది.. మరి అది నెగెటివ్‌గా పోదా? అంటూ గీతూతో చెప్పుకొచ్చింది. అసలు సూర్యను నామినేట్ చేసి అతడు బయటకు వెళ్లడానికి ప్రధాన కారణంగా నిలిచింది ఇనయ అంటూ మెజారిటీ హౌస్మేట్స్ ఆమెకు ఒకటే నామినేషన్లు గుద్దారు. మరి ఇంటిసభ్యులు ఎవరెవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ ఎదుట ఉన్న దిష్టిబొమ్మలపై కుండలు పగలగొట్టాలని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదటగా వచ్చిన గీతూ.. నీ భర్తతో కలిసి ఆడుతున్నావంటూ మెరీనాను, నువ్వో కన్ఫ్యూజన్ పర్స్ అంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. రేవంత్.. ఇనయను నామినేట్ చేసే క్రమంలో వీరి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఇప్పటివరకు సూర్య నామినేషన్లోకి రాలేదు, గుద్దితే వెళ్లిపోతాడు. చాలా సేఫ్‌గా ఆడుతున్నాడు.. అని నువ్వే అన్నావు కదా అంటూ ఇనయను ఇరికించేశాడు. నేనలా అనలేదు, సూర్య గురించి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదని ఫైర్ అయింది ఇనయ. ఇక తనను ఛీ, తూ అనేసిందని కీర్తి కుండ పగలగొట్టాడు రేవంత్. ఈ హౌస్‌లో ఇనయ మోస్ట్ ఫేకః ఫేకస్య ఫేకోభ్యః అన్నాడు ఆది. సూర్యను నామినేట్ చేయడం, అతడు వెళ్లిపోయినప్పుడు బాధపెడటం? ఇదంతా ఫేక్ అన్నాడు. విన్నర్ క్వాలిటీస్ సహజంగా ఉండాలే తప్ప కావాలని ఇముడ్చుకోవాలని చూస్తున్నావనడంతో మధ్యలో అందుకున్న ఇనయ.. అవును నేను విన్నర్ అంటూ రెచ్చిపోయింది. వీరి గొడవ చూసి శ్రీసత్య, గీతూ, శ్రీహాన్, రేవంత్ పడీపడీ నవ్వారు. తర్వాత రేవంత్ కుండ పగలగొట్టాడు ఆది. గేమ్‌లో మమ్మల్ని పర్సనల్‌గా రెచ్చగొట్టావ్. అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నాకు ఓటేసి ఇప్పుడేమో నా గేమ్ అర్థం కావట్లేదని నామినేట్ చేయడం సిల్లీగా అనిపించిందంటూ గీతూ దిష్టిబొమ్మ కుండ పగలగొట్టాడు రోహిత్. కరెక్ట్‌గా పాయింట్ టూ పాయింట్ మాట్లాడటంతో గీతూ నోరు మూయించాడు. తర్వాత శ్రీసత్యను నామినేట్ చేశాడు. మంచితనం ఎక్కువైందంటూ బాలాదిత్యను, ప్రవర్తన నచ్చట్లేదంటూ ఇనయను నామినేట్ చేసింది ఫైమా. సూర్య పేరు రాసుకున్నప్పుడు, సూర్యుడి బొమ్మ వేసుకున్నప్పుడు, అతడికి ముద్దులు పెట్టినప్పుడు బయటకు నెగెటివ్ అవుతావని అనిపించలేదా? అని ఫైమా నిలదీయగా సూర్య అంటే నాకిష్టం అంది ఇనయ. సూర్య నీకడ్డం అవుతాడని నామినేట్ చేసి పంపించావు. అతడికి వెన్నుపోటు పొడిచావంటూ ఆదిరెడ్డి పదే పదే అనడంతో ఇనయ కంట్లో నీళ్లు తిరిగినా అది బయటపడకుండా కంట్రోల్ చేసుకుంది. ఫ్రెండ్షిప్లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరూ పొడవరంటూ ఇనయను నామినేట్ చేశాడు శ్రీహాన్. పైగా తను కెప్టెన్ కావడంతో ఈరోజు నువ్వు నన్ను నామినేట్ చేయలేవు అని చివర్లో ఆనందపడ్డాడు. మెరీనా - శ్రీసత్య, గీతూ; బాలాదిత్య - శ్రీసత్య, ఫైమా; కీర్తి - గీతూ, రేవంత్; వాసంతి - గీతూ, రేవంత్; రాజ్ - గీతూ, బాలాదిత్య; సత్య - బాలాదిత్య, ఇనయలను నామినేట్ చేశారు. ఫైనల్‌గా ఈ వారం బాలాదిత్య, గీతూ, ఇనయ, రేవంత్, ఫైమా, శ్రీసత్య, కీర్తి, రోహిత్, ఆది రెడ్డి, మెరీనా నామినేషన్లో ఉన్నారు. చదవండి: మూడు నెలలుగా కోమాలో, నటుడి భార్య మృతి లవ్‌లో ఉన్నాం.. హీరోహీరోయిన్లు -
విన్నర్ క్వాలిటీస్.. బిగ్‌బాస్ 6 విన్నర్ నేనే: ఇనయ
అపరిచితురాలులా మారిపోయిన ఇనయకు నామినేషన్స్‌లో గట్టి దెబ్బే తగిలేట్లు కనిపిస్తోంది. కారణం.. ఇనయకు మొదట్లో ఆర్జే సూర్యతో అంతగా పడలేదు. కానీ ఎప్పుడైతే ఆరోహి వెళ్లిపోయిందో అప్పుడు అతడితో బాగా క్లోజ్ అయింది. బావా అంటూ వెనకాలే తిరుగుతూ అతడే తన ప్రపంచం అన్నట్లుగా మారిపోయింది. మళ్లీ అంతలోనే నీతో ఫ్రెండ్షిప్ కట్ అంటూ నామినేట్ చేసింది. ఆమె నామినేట్ చేసిన వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. సూర్య వెళ్లిపోవడాన్ని ఇనయ తట్టుకోలేక బోరుమని ఏడ్చింది. మరి వెళ్లిపోతే అంత బాధపడేదానివి ఎందుకని నామినేట్ చేశావ్.. అంటూ ఇనయపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ముప్పుతిప్పలు పెట్టారు హౌస్మేట్స్. ఆదిరెడ్డి అయితే.. ఫేకః.. ఫేకస్య.. ఫేకోభ్యః అంటూ ఇనయపై సెటైర్లు వేశాడు. సూర్యను నామినేట్ చేసింది నువ్వే.. ఎలిమినేషన్‌కు కారణమూ నువ్వే! మరి అతను వెళ్లిపోతే బాధపడతామన్నప్పుడు ఎందుకు నామినేట్ చేయడం? అని పాయింట్ లాగాడు. దీనికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాని ఇనయ అది నా ఇష్టమని బదులిచ్చింది. ఇక రేవంత్ కూడా ఇది యాక్టింగా? ఫేకా? అని అడగ్గా.. సూర్య గురించి ఇక్కడ తీసుకురానవసరం లేదు అంటూ ఫైర్ అయింది ఇనయ. విన్నర్ క్వాలిటీస్ మనలో ఉండాలే తప్ప.. కావాలని వాటిని మనలో పెట్టుకుని చేయకూడదని ఆదిరెడ్డి అనడంతో మధ్యలో అందుకున్న ఇనయ.. విన్నర్ క్వాలిటీస్ అన్నారు కదా, నేనే విన్నర్.. బిగ్‌బాస్ సీజన్ 6 విన్నర్ నేనే అని గొంతెత్తి అరిచింది. దీంతో ఆదిరెడ్డి, శ్రీహాన్ నవ్వాపుకోలేకపోయారు. చదవండి: గీతూ పెద్ద ఇడియట్, ఇనయ, ఫైమాకు బలుపెక్కువ తల్లి కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య -
ఒక్క చేపతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న రేవంత్‌ను కిందకు దించిన గీతూ
Bigg Boss 6 Telugu, Episode 53: గేమ్‌లో ఉన్నా లేకపోయినా ఆటాడాల్సిందేనని డిసైడ్ అయిపోయింది గీతూ. అందుకే సంచాలకురాలిగా ఉన్నా కూడా గేమ్ పడింది. ఇక్కడ తను ఫేవరిటిజం చూపిస్తూ ఆది ఫేవరిటిజం చూపిస్తున్నాడని అడ్డదిడ్డంగా వాగింది. మరోపక్క చేపల చెరువు టాస్క్‌లో మెరీనా- బాలాదిత్య జంట ఎక్కువ టార్గెట్ అయింది. మరి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఎక్కడివరకు వచ్చింది? హౌస్‌లో ఏమేం జరిగిందో ఇప్పుడు చదివేద్దాం.. అప్పటిదాకా ఫెవికాల్లా కలిసిపోయిన సూర్య- ఇనయ నామినేషన్స్ నుంచి సరిగా మాట్లాడుకోవడమే మానేశారు. పైగా ఇనయ సూర్య మీద కక్ష పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 'సూర్యకు బుజ్జమ్మ ఉన్నప్పుడు అతడితో క్లోజ్ అవడం తప్పనిపించింది. సూర్యను టాప్ 5లో ఉండనివ్వకూడదు. అతడు చాలా తప్పులు చేస్తున్నాడు, ఇక వదిలిపెట్టను. ప్రతివారం నామినేట్ చేస్తాను. గీతూ కూడా త్వరలోనే వెళ్లిపోతుంది' అంటూ ఏదేదో మాట్లాడింది ఇనయ. మరోపక్క రేవంత్ వల్లే తన గేమ్ ఆగిపోయింది అని ఉడికిపోయిన గీతూ అర్ధరాత్రి అతడి చేపలు దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. కానీ వర్కవుట్ కాలేదు. ఇక పొద్దున్నే స్విమ్మింగ్ పూల్‌లో నల్ల చేప కనిపించడంతో లటుక్కున పట్టుకుని దాచేసుకుంది గీతూ. ఇకపోతే తాను దొంగతనానికి ప్రయత్నించిన విషయాన్ని ఎందుకు అందరికీ చెప్తున్నావని మెరీనా మీద మండిపడింది గీతూ. నువ్వు ఆడవు, ఒకరిని ఆడనివ్వవు అంటూ ఫైర్ అయింది. గెలవలేకపోతున్నావు కాబట్టే ఫ్రస్టేట్ అవుతున్నావంటూ ఉన్నమాట అనేసింది మెరీనా. తర్వాత చేపల చెరువు టాస్క్ తిరిగి ప్రారంభమైంది. ఈసారి గీతూ, ఆదిలు సంచాలకులుగా వ్యవహరించారు. అయితే చేపలు పడుతుంటే వాటిని క్యాచ్ చేసేందుకు ప్రయత్నించింది గీతూ. నువ్వు గేమ్ ఆడితే సంచాలకురాలిగా అనర్హత వేటు వేస్తానని హెచ్చరించాడు ఆది. అయినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత పూల్‌లో దిగిన ఫైమాకు గోల్డ్ కాయిన్ దొరికింది. దీని సాయంతో బిగ్‌బాస్ ఇచ్చిన రెండో ఛాలెంజ్ షీల్డ్ వార్ టాస్క్‌లో ఏయే జంటలను ఎంపిక చేయాలనేది ఫైమా జోడీ నిర్ణయిస్తున్నంది. ఫైమా- రాజ్.. తమతో పాటు సూర్య- వాసంతి, ఆదిత్య- మెరీనా, శ్రీసత్య- శ్రీహాన్ జంటలు పోటీకి దిగుతాయని వెల్లడించారు. ఈ ఛాలెంజ్‌లో సూర్య- వాసంతి టీమ్ గెలిచి 15 చేపలు గెలుచుకుంది. ఫైనల్‌గా చేపల చెరువు టాస్క్ ముగిసే సమయానికి శ్రీసత్య- శ్రీహాన్ 67, రేవంత్- ఇనయ 129, ఫైమా- రాజ్ 109, సూర్య- వాసంతి 89, రోహిత్- కీర్తి 84, బాలాదిత్య- మెరీనా -37 చేపలు సంపాదించారు. అయితే నల్ల చేప సాయంతో రెండు జంటల చేపలను స్వాప్ చేయొచ్చని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకే దొరికింది ఛాన్స్ అనుకున్న గీతూ పొద్దున దొరికిన బ్లాక్ ఫిష్‌ను బయటకు తీసింది. ఫ్రెండ్స్ మధ్యలో చిచ్చు పెడ్తానంటూ అందరికంటే ఎక్కువ చేపలు ఉన్న రేవంత్- ఇనయ జోడీని శ్రీసత్య- శ్రీహాన్‌తో స్వాప్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రేవంత్ జోడీకి 67 చేపలు రాగా శ్రీహాన్ జోడీకి 129 చేపలు వచ్చాయి. అందరికంటే తక్కువ చేపలున్న బాలాదిత్య- మెరీనా జంట ఆట నుంచి వైదొలిగారు. చదవండి: లైగర్ వివాదం.. పూరీ డబ్బులెందుకు ఇవ్వాలి?: నిర్మాత అమ్మ ఆరోగ్యానికి రిస్క్, అయినా నాన్న పట్టించుకోలేదు: శ్రీదేవి కూతురు అంపైర్‌గా ఉండమంటే బ్యాటింగ్, ఇలాగైతే తిట్టరా మరి! -
గీతూ గేమ్ చేంజరా? బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లు
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్‌ను జంటలుగా విభజించిన బిగ్‌బాస్ చేపల చెరువు అనే టాస్క్ ఇచ్చాడు. మధ్యమధ్యలో కొత్త కొత్త ఛాలెంజ్‌లు కూడా విసురుతున్నాడు. కెప్టెన్సీ బరిలో నిలిచేందుకు జంటలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అయితే గేమ్ చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లోకి ఓ నల్ల చేప వచ్చిందని, దాని సాయంతో రెండు జంటల బాస్కెట్లను స్వాప్ చేయొచ్చని మెలిక పెట్టాడు. ఇక ఆ నల్ల చేప గీతూకే దొరకగా.. రేవంత్- ఇనయ జోడీల బాస్కెట్‌ను శ్రీహాన్- శ్రీసత్య జంటతో స్వాప్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంత కష్టపడి ఆడితే గీతూ ఒక్క చేపతో తమను గేమ్ నుంచి సైడ్ చేసేయడం ఇనయ, రేవంత్‌కు అస్సలు నచ్చలేదు. ఆ ఫ్రస్టేషన్లో వారు ఒకింత కోపం, మరింత బాధతో మాట్లాడుతుంటే దానికి కౌంటర్లిస్తూ ఆనందం పొందింది గీతూ. మొత్తానికి ఈ టాస్క్‌లో గీతూ గేమ్ చేంజర్ అని హాట్‌స్టార్ ట్వీట్ వేస్తే గేమ్ స్పాయిలర్ అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా ఫస్ట్ రౌండ్లోనే అవుటైపోయిన గీతూకు నల్ల చేప ఎలా దొరికింది? ఇదెలా సాధ్యమంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. ఫైనల్‌గా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ఎవరు బాగా ఆడారు? ఎవరు కెప్టెన్సీ బరిలో నిలవనున్నారు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! Black Fish! Geetu, the game changer.#BBLiveOnHotstar, streaming 24/7.#BiggBossTelugu6 pic.twitter.com/FBiOJMSZmq — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 26, 2022 చదవండి: ఇంటింటికీ వెళ్లి ప్రమోషన్ చేయాలా, నా వల్ల కాదు: రణ్‌బీర్ అంపైర్‌గా ఉండమంటే బ్యాటింగ్.. గీతూ గేమ్ ఏంటో? -
గీతూపై మెరీనా ఫైర్.. నా జోలికి రావొద్దంటూ వార్నింగ్
బిగ్‌బాస్ సీజన్-6లో ఈవారం పోటీదారుల కోసం చేపల చెరువు అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా వీలైనన్ని ఎక్కువ చేపల్ని తమ బుట్టలో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైర్ లేదని బిగ్‌బాస్ మండిపడటంతో కంటెస్టెంట్లు తెగ కష్టపడుతున్నారు. వంత శాతం ఎఫర్ట్ పెట్టి మరీ చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక ఈ టాస్కులో ఇద్దరు సభ్యులను ఒక టీంగా విభజించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫిజికల్‌గా పోటీ పడకపోతే, మెంటల్‌గా రేవంత్‌ను దెబ్బకొట్టాలి అంటూ గీతూ ఆదికి సలహా ఇస్తుంది. మరోవైపు గీతూకి, రోహిత్‌కి కూడా టాస్క్‌లో గొడవ అవడంతో..మెరీనాను ఉద్దేశించి మీరు ఎప్పుడూ భార్యభర్తలుగానే టాస్కులు ఆడుతున్నారంటూ గీతూ కౌంటర్ ఇవ్వగా, మెరీనా ఫైర్ అయ్యింది. నా జోలికి రావొద్దు..వస్తే మామూలుగా ఉండదంటూ మెరీనా విశ్వరూపం చూపించింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ఎంగేజ్మెంట్ రోజు స్టేజీపై తిట్టాడు: శ్రీసత్య బ్రేకప్ కహానీ
Bigg Boss Telugu 6, Episode 51: ఈ వారం సర్ప్రైజింగ్ నామినేషన్స్ జరిగాయి. ఓ జంట వాళ్లలో వాళ్లే పోట్లాడుకోగా, గొడవలకు చెక్ పెట్టి కలిసిపోయారనుకున్నవాళ్లు మళ్లీ నామినేట్ చేసుకున్నారు. మరి ఆ విశేషాలేంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! శ్రీసత్య నా మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి శ్రీహాన్‌తో మనసు విప్పి మాట్లాడింది. 'నా లైఫ్‌లో ఫస్ట్ ఫంక్షన్ ఎంగేజ్మెంట్. ఎంత ఇష్టంతో చేసుకున్నానో! అప్పటిదాకా అతడి గురించి ఎవరేం చెప్పినా శత్రువులా చూసేదాన్ని. రిలేషన్లోకి వెళ్లాక అమ్మాయిగా మారిపోయాను. పక్కవాళ్ల ఇష్టమే నా ఇష్టంగా మారిపోయింది. కానీ అతడు నిశ్చితార్థం రోజు స్టేజీమీదే తిట్టాడు. ఒక నెల రోజుల తర్వాత కొందరు అమ్మాయిలు అతడి స్క్రీన్షాట్లు చూపించారు. ఆ తర్వాత చాలా జరిగాయి. మా అమ్మ ఆస్పత్రిపాలవడంతో మళ్లీ పాత సత్య తిరిగి వచ్చింది' అని తన పాత జ్ఞాపకాలను పంచుకుంది. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి ఫొటోలను మంటల్లో వేయాలన్నాడు బిగ్‌బాస్. ► శ్రీసత్య.. సూర్య, మెరీనా ► ఆదిరెడ్డి.. ఇనయ, మెరీనా ► గీతూ.. ఇనయ, మెరీనా ► బాలాదిత్య.. శ్రీసత్య, గీతూ ► కీర్తి.. రేవంత్, శ్రీసత్య ► సూర్య.. ఇనయ, శ్రీసత్య ► రోహిత్.. గీతూ, శ్రీసత్య ► ఇనయ.. శ్రీహాన్, సూర్య ► ఫైమా.. శ్రీసత్య, మెరీనా ► రాజ్.. ఇనయ, రేవంత్ ► మెరీనా.. ఫైమా, రాజ్ ► రేవంత్.. కీర్తి, గీతూ ► వాసంతి.. ఆదిరెడ్డి, సూర్య ► శ్రీహాన్.. మెరీనా, బాలాదిత్యను నామినేట్ చేశాడు. రేవంత్‌ను అన్న అన్నందుకు నాకు నేను థూ అనుకుంటానంది కీర్తి. అలాగైతే నేను థూథూ అనుకోవాలని కౌంటరిచ్చాడు రేవంత్. ఇక రేవంత్ చాలాసార్లు దొంగతనం చేసి తిన్నాడని ఆరోపించింది గీతూ. నువ్వే దొంగవి, పెద్ద గొప్ప అని ఫీలైపోకు, నువ్వు నాకు నథింగ్ అంటూ మండిపడ్డాడు రేవంత్. ఇక ఇనయ.. సూర్యకు,శ్రీహాన్‌కు చెక్ పెట్టేసింది. నీకూ, నాకు మధ్య ఏదేదో ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ మన మధ్య స్నేహం మాత్రమే ఉంది. నాగ్ సర్ నీకు బుజ్జమ్మ ఉందని పదే పదే చెప్తూ ఉన్నప్పుడు మనం క్లోజ్‌గా ఉండటం కరెక్ట్ కాదు. మన స్నేహం వేరేలా బయటకు వెళ్తున్నప్పుడు నేను నీతో ఉండటం తప్పనిపించింది అని చెప్పుకొచ్చింది ఇనయ. దీనికి సూర్య స్పందిస్తూ... బుజ్జమ్మది, నాది స్నేహం కంటే ఎక్కువ. మనది స్నేహమని నువ్వే అంటున్నావు. అలాంటప్పుడు అందరూ ఏదో అంటున్నారని మన ఫ్రెండ్షిప్ను కట్ చేస్తానంటున్నావా? అని అడిగాడు సూర్య. దానికి ఇనయ అవునని తలూపుతూ ఇప్పటినుంచి కేవలం హౌస్మేట్గానే చూస్తానని తేల్చేసింది. అటు శ్రీహాన్‌ను నామినేట్ చేస్తూ అందరూ మన గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, అది నాకు నచ్చట్లేదని చెప్పింది. ఫైనల్‌గా ఈ వారం రోహిత్, వాసంతి, మెరీనా, శ్రీసత్య, ఇనయ, గీతూ, రేవంత్, ఆదిరెడ్డి, సూర్య, బాలాదిత్య, కీర్తి, రాజ్, ఫైమా, శ్రీహాన్ నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: బాత్రూమ్స్ క్లీన్ చేసినందుకు బాగా డబ్బులిచ్చేవారు: నటుడు నా ముందు నువ్వు నథింగ్: రేవంత్ -
నా ముందు నువ్వు నథింగ్: గీతూపై రేవంత్ ఫైర్
వారమంతా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా సరే నామినేషన్స్ వచ్చేసరికి దోస్తానా పక్కన పెట్టేస్తుంటారు హౌస్మేట్స్. సరైన కారణం ఉందంటే చాలు నామినేషన్లో ఓట్లతో గుద్దిపడేస్తుంటారు. మొన్నటివరకూ నువ్వూ నేను జంట.. టాక్ ఆఫ్ ద టౌన్ అంట.. అని డ్యూయెట్ సాంగ్ పాడుకున్న ఇనయ, సూర్య.. ఇప్పుడు మాత్రం కొట్లాటకు దిగారు. తాజా ప్రోమోలో గీతూ, రేవంత్‌కు మధ్య మాటల యుద్ధం జరిగినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ వీక్ నుంచి రూల్స్ పాటించనిది నువ్వేనని గీతూ.. నువ్వు గొప్ప అని ఫీలవుతున్నావు, తగ్గించుకో, నా ముందు నువ్వు నథింగ్ అని రేవంత్ పోట్లాడుకున్నారు. చాలామంది మెరీనా గేమ్ కనిపించట్లేదని ఆమెను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. మొదటి నుంచీ అందరూ నన్ను నామినేట్ చేస్తున్నారని నువ్వూ చేస్తున్నావ్ తప్ప నీకు పెద్దగా ఏ రీజన్ లేదని కీర్తిపై ఫైర్ అయ్యాడు రేవంత్. మరి ఈ పోట్లాటలు, కొట్లాటలు చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: అరుంధతిలో బాలనటి, ఇప్పుడెలా ఉందంటే? -
రేవంత్‌ను నోరు మూసుకోవాలన్న ఆది, సింగర్‌కు నాగ్ పనిష్మెంట్
బిగ్‌బాస్ షో దీపావళి ఎపిసోడ్ ప్రారంభమైంది. ముందుగా బిగ్‌బాస్ సీజన్ 6 మీద బాలాదిత్య రాసిన పాటను శ్రీహాన్, రేవంత్‌తో కలిసి పాడాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో సహా హౌస్‌లో ఉన్న అందరినీ ప్రస్తావిస్తూ ఆ పాట సాగింది. ఇది విన్నాక నాగ్ సాంగ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. కొన్ని బోర్డులను ఎవరికి సెట్ అవుతాయో వారి మెడలో వేయాలన్నాడు. దీంతో ముందుగా గీతూ లేచి.. చేతికర్ర బోర్డు అర్జున్ మెడలో వేస్తూ అతడు ఒకరి మీద ఆధారపడతాడు, సొంతంగా నిర్ణయం తీసుకోడని చెప్పుకొచ్చింది. గీతూ అందరినీ రెచ్చగొడుతుందన్నాడు శ్రీహాన్. కోపాన్ని తగ్గించుకోమని రేవంత్‌కు సలహా ఇచ్చారు ఫైమా, కీర్తి. నామినేషన్లో ఇనయ ప్రతిదాన్నీ సాగదీస్తుందని చెప్పింది మెరీనా. గీతూకు బద్ధకమెక్కువ అన్నాడు రాజ్. వాసంతి షో పీస్ అని, ఆమె అందం చూస్తే జెలసీ వచ్చేస్తోందంది ఇనయ. ఇనయ ఇగో వల్ల తాను హర్ట్ అయ్యానంది వాసంతి. రేవంత్ గోరంతది కొండంత చేసి చెప్తాడంది శ్రీసత్య. గీతూ బుద్ధి శుద్ధి చేసుకోవాలన్నాడు బాలాదిత్య. ఇనయ ప్రతిదానికి పొడుస్తుందన్నాడు సూర్య. ఎదుటివాళ్లు చెప్పేది వినేవరకు రేవంత్ నోరు మూసుకోవాలన్నాడు ఆదిరెడ్డి. రేవంత్ తనకున్న నెగెటివ్స్ డస్ట్‌బిన్‌లో వేయాలన్నాడు అర్జున్. రాజ్ ట్యూబ్‌లైట్ అన్నారు రోహిత్. గీతూ అవసరానికి వాడుకుంటుందన్నాడు రేవంత్. ఇకపోతే మొన్నామధ్య బిగ్‌బాస్.. ఇంటిసభ్యులకు ఫుడ్ కట్ చేసిన విషయం తెలిసిందే కదా! గేమ్స్ పెట్టి అందులో గెలిచిన టీమ్‌కు మాత్రమే ఫుడ్ పంపించాడు. అయితే గెలిచిన టీమ్ మెంబర్ అయిన ఆదిరెడ్డి ఓడిన టీమ్ మెంబర్ గీతూకు ఫుడ్ షేర్ చేయడంతో వీరిద్దరికీ అంట్లు తోమమని పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్‌బాస్. కానీ రేవంత్ కూడా గీతూకు ఫుడ్ షేర్ చేశాడంటూ ఆ విషయాన్ని బయటపెట్టాడు నాగ్. అందుకు శిక్షగా ఈరోజు ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ రేవంత్ తోమాలని చెప్పాడు. తర్వాత రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, ఫైమా సేఫ్ అయినట్లు ప్రకటించాడు. చదవండి: ఉదయ్‌కిరణ్‌తో ఐదు సినిమాలకు సంతకం చేశా: సుదీప -
బిగ్‌బాస్ విన్నర్ ఎవరో హింట్! అందరికంటే వరస్ట్ ఆమేనట!
Bigg Boss 6 Telugu, Episode 49: బిగ్‌బాస్ టైటిల్ ఎవరు గెలిచే ఆస్కారం ఉందన్న ప్రశ్నకు ఈరోజు ఎపిసోడ్ కొంచెం క్లూ ఇచ్చినట్లైంది. ఇంట్లో ఉండేందుకు ఎవరికి ఎక్కువ అర్హత ఉంది? ఎవరు అసలు ఉండాల్సిన అవసరమే లేదు? చెప్పాలని గేమ్ ఆడించాడు నాగ్. ఈ క్రమంలో ఊహించని పేర్లు డిజర్వ్ కేటగిరీలోకి రావడం విశేషం. మరి ఎవరు ఏ జాబితాలో ఉన్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నాగార్జున స్టేజీపైకి వచ్చీరావడంతోనే పప్పు గొడవను ప్రస్తావించాడు. అంటే ఈరోజు రేవంత్‌కు గట్టిగానే వాయింపులు ఉంటాయని హింటిచ్చేశాడు. పప్పు విషయంలో తప్పెవరిది? అని శ్రీసత్యను అడిగాడు నాగ్. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్లు ఏమనుకున్నా ఓకే, కానీ గేమ్‌లో ఉన్నప్పుడు అతడిని నువ్వు ఉండ్రా పప్పు అని చిన్నచూపు చూడటం తప్పు. అందరిముందు అలా అనేసరికి అర్జున్ నువ్వేం మాట్లాడవా? అని అడిగానంది. మరి సత్య స్టాండ్ తీసుకునేదాకా నువ్వెందుకు గొడవపడలేదని అర్జున్ను నిలదీశాడు నాగ్. దానికతడు అది సరైన సమయం కాదేమోనని మొదట గొడవకు దిగలేదన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. అలా అందరి ముందు అనడం తప్పు, కానీ చనువుతోనే ఆ మాట అన్నానని రేవంత్ తన మాటకు అర్థవివరణ ఇచ్చాడు. దీంతో నాగ్.. పప్పు, పకోడి, దొబ్బేయ్.. ఇలా ఏది పడితే అది అనకూడదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఫలితంగా అతడు అర్జున్‌కు సారీ చెప్పాడు. కానీ తన మనసులో ఉన్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేశాడు. ఇక నాగ్.. ఈ హౌస్‌లో ఉండేందుకు అర్హులెవరు? అనర్హులెవరు? అనేది కంటెస్టెంట్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన శ్రీహాన్.. గీతూ అర్హురాలు, రోహిత్ అనర్హుడు అని చెప్పాడు. ► మెరీనా, వాసంతి.. సూర్య డిజర్వ్, రాజ్ అన్‌డిజర్వ్ అని పేర్కొన్నారు. ►గీతూ.. శ్రీహాన్ డిజర్వ్, మెరీనా అన్‌డిజర్వ్ అని చెప్పింది. ►రేవంత్, శ్రీసత్య, అర్జున్, ఇనయ, బాలాదిత్య.. శ్రీహాన్ డిజర్వ్, మెరీనా అన్‌డిజర్వ్ అని చెప్పేశారు. ►ఫైమా.. రేవంత్ డిజర్వ్డ్, మెరీనా అన్డిజర్వ్డ్ అని అభిప్రాయపడ్డారు. ►రోహిత్.. బాలాదిత్య డిజర్వ్, అర్జున్ అన్‌డిజర్వ్ అని చెప్పాడు. ►రాజ్.. శ్రీహాన్ డిజర్వ్, రేవంత్ అన్‌డిజర్వ్ అని తెలిపాడు. ►సూర్య.. గీతూ డిజర్వ్, వాసంతి అన్‌డిజర్వ్ అని పేర్కొన్నాడు. ►కీర్తి.. రేవంత్ డిజర్వ్, వాసంతి అన్‌డిజర్వ్ కంటెస్టెంట్‌గా పేర్కొంది. ►ఆదిరెడ్డి.. శ్రీహాన్ డిజర్వ్, అర్జున్ అన్‌డిజర్వ్ అని పేర్కొన్నాడు. ఫైనల్‌గా ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్, వాసంతి, అర్జున్, మెరీనా అనర్హులుగా, సూర్య, శ్రీహాన్, గీతూ, రేవంత్ అర్హులుగా నిలిచారు. ఏ జాబితాలోనూ పేర్లులేని వారంతా తటస్థులని పేర్కొన్నాడు నాగ్. మొత్తానికి అర్హులలో ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని హౌస్మేట్స్ అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది. తర్వాత శ్రీసత్య గేమ్ గురించి మాట్లాడాడు హోస్ట్. టీమ్ లీడర్‌గా శ్రీసత్య ఫెయిర్గేమ్ ఆడాలని సూక్తులు చెప్పింది, మరి తను పాటించిందా? అని ప్రశ్నించాడు. మళ్లీ తనే అందుకుంటూ.. చీటీల్లో ఎవరి పేరు వస్తే వారు నామినేట్ అన్నారు. అందులో శ్రీసత్య పేరొచ్చింది. తెల్లారేసరికి ఆమె చీటీలు వద్దు, ఓటింగ్ అనేసింది. అంటే ఆమె అందరినీ మానిప్యులేట్ చేసి ఓటింగ్ వేయడం అవసరమా? అని అడిగాడు. దానికామె చీటీలాట ఆడి తిట్టించుకోవడం ఎందుకని ఓటింగ్‌కు వెళ్లామని కవర్ చేసింది. ముందు చీటీలు అని చెప్పి తర్వాత ఓటింగ్‌కు వెళ్లడం కరెక్టా? కాదా? అని ఆమె టీమ్‌నే అడగ్గా గీతూ మాత్రమే అందులో తప్పేముంది? కరెక్టేనంటూ సత్యకు సపోర్ట్ చేసింది. మిగతావారు మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో నాగ్.. నీ టీమ్‌ను నువ్వు మానిప్యులేట్ చేశావన్నాడు. రూ.5 లక్షలు గెలుచుకునే అవకాశం బిగ్‌బాస్ 6 స్టైలిస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలిచినవారికి రూ.5 లక్షలు లభిస్తాయని లెన్స్‌కార్ట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీకు ఇష్టమైన లెన్స్‌కార్ట్ స్టైలిష్ హౌస్‌మేట్‌కు ప్రతివారం ఓటు వేసి టైటిల్ గెలిచేలా చేయాలి. ఎక్కువసార్లు విన్ అయిన కంటెస్టెంట్ రూ.5 లక్షలు గెలుస్తారు. ప్రేక్షకులు లెన్స్‌కార్ట్ యాప్ లేదా వెబ్సైట్లో వారికి ఓటేయాల్సి ఉంటుంది. చదవండి: తమ్మీ.. నీకు అడుక్కు తిందామన్నా దొరకదు కన్ఫ్యూజన్ మాస్టర్ ఎలిమినేటెడ్! -
రేవంత్‌కు క్లాస్ పీకిన నాగ్, అడ్డంగా దొరికేసిన శ్రీసత్య!
హౌస్‌లో ఉండేందుకు ఎవరు అనర్హులు? అని బిగ్‌బాస్ నిన్ననే ఇంటిసభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాడు. ఎక్కువమంది వాసంతి అనర్హురాలు అని చెప్పడంతో ఆమెను జైల్లో కూడా వేశారు. ఇందుకు వాసంతి బాధపడటం పక్కనపెట్టి అదేదో గొప్పగా ఫీలైంది. నేను బాగా ఆడాను కాబట్టే జైలుకు వెళ్లానని నాగార్జునతో చెప్పుకొచ్చింది. ఆమె సమాధానం విని అవాక్కైన నాగ్ జైలుకు వెళ్తే అర్హురాలివని ఫీలవుతున్నావా? అని అడిగాడు. దీనికామె ఏం సమాధానం చెప్పాలో తెలీక బిక్కముఖం వేసుకుంది. ఇక నాగ్.. ఇంట్లో ఉండేందుకు ఎవరు డిజర్వ్ అనుకుంటున్నారో చెప్పమని ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి అడిగాడు. అనూహ్యంగా చాలామంది శ్రీహాన్ అర్హుడని తేల్చేశారు. మెరీనా పెద్దగా ఆడట్లేదు కాబట్టి ఆమె అనర్హురాలని పేర్కొన్నారు. గేమ్‌లో రేవంత్.. అర్జున్ను పప్పు అనడాన్ని ప్రస్తావించాడు నాగ్. రేవంత్ మాట్లాడిన ప్రతిసారి పప్పు నువ్వు ఆగు అంటూ అవహేళన చేశాడు. పప్పు విషయంలో తప్పెవరిది అని శ్రీసత్యను అడిగాడు. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏం అనుకున్నా ఓకే కానీ గేమ్‌లో అందరిముందు నువ్వుండ్రా పప్పు అనడం తప్పనిపించింది అని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై నాగ్ రేవంత్‌కు గట్టిగానే కోటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఎవరు నామినేట్ అవుదామనేది చిట్టీలు వేసి డిసైడ్ అవుదామన్న శ్రీసత్య, తన పేరు చీటీలో వచ్చేసరికి ఓటింగ్ పెట్టుకుందామంది. అలా శ్రీసత్య సేఫ్ అయి ఓటింగ్ వల్ల వాసంతి నామినేట్ అయింది. ఈ విషయంలో శ్రీసత్య మైండ్‌గేమ్‌ను బయటపెట్టాడు నాగ్. చదవండి: జపాన్ వీధుల్లో రామ్‌చరణ్, తారక్ సందడి ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్లో అఖండ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు -
బిగ్‌బాస్: జైలుకు వెళ్లే డిజాస్టర్ కంటెస్టెంట్ ఎవరంటే?
శ్రీహాన్, రేవంత్, శ్రీసత్య మంచి ఫ్రెండ్స్.. కానీ గేమ్‌లో శ్రీహాన్ వల్ల కింద పడ్డా లైట్ తీసుకున్న శ్రీసత్య రేవంత్ అరుపులకు మాత్రం చిర్రెత్తిపోయింది. అతడితో ఫైట్‌కు దిగింది. నామినేట్ చేసినా బయటకు పోలేడు అని అసహనం వ్యక్తం చేసింది. నిన్న ఒక్క టాస్క్‌లోనే కాదు, చాలా సందర్భాల్లో రేవంత్‌కు వ్యతిరేకంగా నిలబడింది. అతడితో గొడవకు అర్జున్ను ఉసిగొల్పింది. ఇవన్నీ చూసిన ప్రేక్షకులు అసలు వీళ్లిద్దరూ ఫ్రెండ్సేనా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులను డిజాస్టర్ ఎవరో చెప్పమని ఆదేశించాడు. శ్రీసత్య ఊహించినట్లుగానే రేవంత్ పేరు ప్రస్తావించింది. బిగ్‌బాస్ రూల్స్ పాటించట్లేదని ఫైర్ అయింది. ఇక శ్రీహాన్.. మెరీనా పేరును, వాసంతి.. గీతూను, సూర్య, రేవంత్ ఇద్దరూ వాసంతిని, అర్జున్.. రేవంత్‌ను డిజాస్టర్‌గా పేర్కొన్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ రూల్స్ పాటించని రేవంత్ తన దగ్గరకు వచ్చి నీతులు చెప్తున్నాడని చిందులు తొక్కింది వాసంతి. మొత్తంగా ఈరోజు వాసంతి జైలుకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో లీకువీరులు దండోరా వేసి మరీ చెప్తున్నారు. మరి అదెంతవరకు నిజమో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: అది ప్రాంక్ కాదు, నిజమే: రష్మీ ఆటకు దక్కని ప్రతిఫలం, కన్నీరుపెట్టుకున్న వాసంతి -
రేవంత్‌ను నామినేట్ చేసినా వేస్ట్, టాప్ 5, ఫిక్స్: శ్రీసత్య
Bigg Boss 6 Telugu, Episode 47 Highlights: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రస్తుతం ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. బిగ్‌బాస్ వార్నింగ్‌లు, టాస్కులతో ఎపిసోడ్స్‌లో కొంత ఫ్రెష్‌నెస్ కనిపిస్తోంది. కడుపు మాడితే ఎలా ఉంటుందో చూపించిన బిగ్‌బాస్ ఇప్పుడు హౌస్‌లో ఉండటానికి హౌస్మేట్స్ తమకు అర్హత ఉందని నిరూపించుకోవాలంటూ టాస్క్ ఇచ్చాడు. మరోవైపు శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. మరి ఆ విశేషాలేంటో నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో వివరంగా చదివేద్దాం.. ప్రతిరోజు ఏదైనా హుషారెత్తించే పాటతో నిద్రలేపే బిగ్‌బాస్ ఈరోజు మాత్రం కుక్క అరుపులు ప్లే చేసి కంటెస్టెంట్లు ఉలిక్కిపడేలా చేశాడు. కాసేపటికే హౌస్మేట్స్ ఆకలి అంటూ అలమటిస్తుండటంతో తిరిగి ఫుడ్ పంపించాడు బిగ్‌బాస్. కానీ దీనికంటే ముందుగా హౌస్మేట్స్ ఇకమీదట 100 శాతం ఎఫర్ట్స్ పెడతామని ప్రతిజ్ఞ చేశారు. మెరీనా అయితే టాస్క్ ఉన్నా లేకపోయినా ఈరోజు నుంచి కచ్చితంగా కంటెంట్ ఇస్తానని శపథం చేసింది. మౌనవ్రతం వీడిన బిగ్‌బాస్.. ఇంట్లో ఉండే అర్హత కోసం పోటీపడాలని సూచించాడు. పిట్ట గోలకు ఫుల్స్టాప్ చెప్పి ఇనయ, శ్రీహాన్ కలిసిపోవడంతో వారిని మిగతా హౌస్మేట్స ఆటపట్టించారు. మమ్మల్నందరినీ వదిలేసి కేవలం ఇనయకు మాత్రమే బాగున్నావని ఎలా కాంప్లిమెంట్ ఇస్తావ్ అంటూ శ్రీహాన్ మీద మూకుమ్మడిగా దాడి చేసింది హౌస్‌లోని మహిళా లోకం. దీంతో ఇలా బుక్కైపోయానేంట్రా బాబూ అని తల గోక్కున్నాడతడు. తర్వాత శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. అందులో భాగంగా ఇనయ దగ్గరుండి కేక్ మీద చోటు అని రాయించి హార్ట్ సింబల్ వేయించింది. బర్త్‌డే బాయ్ కేక్ కట్ చేసి మొదట ఇనయకు తినిపించాడు. వీరి సడన్ ఫ్రెండ్షిప్ చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం బిగ్‌బాస్ బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో నిన్నటి టీమ్సే కొనసాగుతాయన్నాడు. రేవంత్, ఫైమా, బాలాదిత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, కీర్తి రెడ్ టీమ్ కాగా ఇనయ ఆ టీమ్ లీడర్‌గా వ్యవహరించింది. మిగిలినవారంతా బ్లూ టీమ్ కాగా దానికి శ్రీసత్య లీడర్‌గా కొనసాగింది. ఈ గేమ్‌లో శ్రీహాన్.. శ్రీసత్య చేతిలో నుంచి బొమ్మ లాక్కునే క్రమంలో ఆమె కింద పడింది. ఇక రేవంత్ ఏం చేసినా శ్రీసత్య పాయింట్ అవుట్ చేస్తూ రెచ్చగొట్టడంతో అతడు సహనం కోల్పోయి ఫైర్ అయ్యాడు. అలా వీరిద్దరూ టాస్క్‌లో ఒకరినొకరు విమర్శించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అర్జున్.. నిన్ను వెక్కిరించినందుకు అతడిని నామినేట్ చేయ్ అని శ్రీసత్యకు సలహా ఇచ్చాడు. అయితే శ్రీసత్య మాత్రం.. అతడిని నామినేట్ చేసినా బయటకు వెళ్లడు, టాప్ 5 కంటెస్టెంట్, ఫిక్స్ అయిపోవాల్సిందే అని అని చెప్పింది. ఈ గేమ్ రెండో లెవల్లో కంటెస్టెంట్లు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కాళ్లు అడ్డం పెట్టాడని అర్జున్ను రేవంత్, నెట్టేశాడని ఆదిరెడ్డిని వాసంతి కొట్టారు. హింస ఉండకూడదు అని సత్య నెత్తీనోరు మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చదవండి: దమ్ముంటే అడ్డుకో, ఎత్తిపడేసిన శ్రీహాన్ -
అయిందా, బాగయిందా? బిగ్‌బాస్‌తోనే ఆటలా?
బిగ్‌బాస్ చెప్తే వినాలి, లేదంటే ఇదిగో ఇలానే అవుతుంది. అటు టాస్కులు సరిగా ఆడరు, ఇటు ఇంటి నియమాలూ పాటించరు. ప్రేక్షకులకు విసుగొస్తున్నా మారకపోతారా? ఆడకపోతారా? ఎంటర్టైన్ చేయకపోతారా? అన్న ఆశతో సీజన్ చూస్తూ వస్తున్నారు. కానీ వీళ్ల తీరు చూసి బిగ్‌బాస్ ఇక ఉండబట్టలేకపోయాడు. మొట్టమొదటిసారిగా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. మీకు హౌస్‌లో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపోండి అని ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు మరో లెవల్లో పనిష్మెంట్ ఇచ్చాడు. ఇంట్లోకి దొంగలను పంపించి వారు దాచుకున్న ఆహారాన్నంతా వెనక్కు లాగేసుకున్నాడు. మీకు తిండి దొరకాలంటే పోరాడి సాధించాలని కండీషన్ పెట్టాడు. దీంతో ఇంకో ఆప్షన్ లేక హౌస్మేట్స్ సరేనంటూ తలూపారు. ఆకలి నకనకలాడుతున్న సమయంలో బిగ్‌బాస్ ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించి కబడ్డీ ఆడించాడు. ఈ టాస్క్‌లో సూర్య టీమ్ గెలిచి ఫుడ్ సంపాదిచినట్లు తెలుస్తోంది. మరి ఆ టీమ్‌లో ఎవరెవరున్నారు? మిగతా టీమ్‌కు తిండి దొరికిందా? లేదా పస్తులున్నారా? వంటి వివరాలన్నీ తెలియాలంటే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే! చదవండి: ఏంటీ, చులకనా, వెళ్లిపోండి: బిగ్‌బాస్ ఆదిపురుష్ డైరెక్టర్‌కు కాస్ట్లీ కారు గిఫ్ట్ -
Bigg Boss 6: ‘అరేయ్ పప్పు’.. ఈ ఒక్కమాటే టాస్క్‌ని రద్దు చేసిందా?
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ రద్దయింది. బిగ్‌బాస్ ఇచ్చిన ‘సెలెబ్రెటీ గేమింగ్ లీగ్’ టాస్క్‌ని కంటెస్టెంట్స్ సరిగా ఆడలేదు. దీంతో బిగ్‌బాస్ అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి సీరియస్ అయ్యాడు. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలాంటి చెత్త ఆటను చూడలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంతేకాదు.. ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించడంలేదంటూ.. టాస్క్‌నే నిలివివేశాడు. హౌస్‌లో ఈ వారం కెప్టెన్ ఉండబోడని స్పష్టం చేశాయి. (చదవండి: కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఫైర్.. కెప్టెన్సీ టాస్క్ నిలిపివేత) అయితే ఈ టాస్క్ రద్దుకు శ్రీసత్య కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. అర్జున్‌ని రెచ్చగొట్టిమరి రేవంత్‌తో గొడవకు దిపింది. దీంతో వారు పాత్రల్లోని బయటకు వచ్చి గొడవపడ్డారు. అసలు విషయం ఏంటంటే.. రెండు టీమ్‌లుగా విడిపోయిన కంటెస్టెంట్స్‌కి ‘వాల్‌పోస్టర్’అనే చాలెంజ్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఇరు టీమ్ సభ్యులు.. వాల్‌పోస్టర్లను అతికించడం ప్రారంభించారు. మధ్యలో అర్జున్ ఏదో అంటుంటే.. ‘అరేయ్ పప్పు’అని రేవంత్ అంటాడు. ఆ విషయాన్ని అర్జున్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ శ్రీసత్య మాత్రం ‘నిన్ను ఏమైనా అంటే రియాక్ట్ అవ్వవా, మనిషివి కావా’అంటూ కసురుకుంది. దాంతో అర్జున్ రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు పాత్రల్లోంచి బయటకు వచ్చి మరి తిట్టుకుంటారు. ఈ గొడవ తర్వాత ఇంటి సభ్యులెవరు తమ తమ పాత్రల్లో ఉన్నట్లు కనిపించదు. అసలే ఎంటర్టైన్మెంట్ లేదు.. పోనీ గేమ్ అయినా సరిగా ఆడుతున్నారా అంటే అదీ లేదు. అందుకే బిగ్‌బాస్ రంగంలోకి దిగి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి కంటెస్టెంట్స్‌ని ఏ సీజన్లో చూడలేదని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ ఆదేశాలను, ఇంటి నియమాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇష్టం లేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవచ్చుని గేట్లు ఎత్తేశాడు. దీంతో ఇంటి సభ్యులు దిగొచ్చి క్షమాపణలు కోరారు. అయినప్పటికీ బిగ్‌బాస్ కరగలేదు. ఈ వారం టాస్కే లేదని చెప్పేశాడు. మరి ఇప్పుడు హౌజ్‌మేట్స్ ఏం చేస్తారో? గేమ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. -
లవ్ ట్రాక్ ఎత్తేసిన సునయ, ఇప్పుడు కొత్త డ్రామా!
Bigg Boss 6 Telugu, Episode 44: 'సునయ' లవ్ ట్రాక్ ప్రేక్షకులకు రోత పుడుతుందని అర్థమైనట్లుంది. అందుకే ఇకపై కలిసి ఉండటం కన్నా గొడవలు పెట్టుకోవడం బెటర్ అని ఇనయ, సూర్య డిసైడ్ అయ్యాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం అందరిముందు దెబ్బలాడుకున్నారు. అటు సూర్య మాత్రం.. నాకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం వల్ల ఇనయ గేమ్ దెబ్బతినడం నచ్చట్లేదు. ఆమె గేమ్‌ను నేనే మారుస్తా. మా ఇద్దరి మధ్య నిజంగానే డిష్యుం డిష్యుం జరిగేలా చేస్తా. కానీ ఇనయ అంటే నాకిష్టం. ఇండిపెండెంట్ ఉమెన్ను నేను ఇష్టపడతా అంటూ కెమెరాలతో మనసులో మాట పంచుకున్నాడు సూర్య. అటు గీతూ.. ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనను ఫ్లర్ట్ చేయలేదని చెప్పింది. ఎందుకక్కా? అని రేవంత్ అడగ్గా బహుశా అందంగా లేనేమోనని బదులిచ్చింది. దానికి ఆది రెడ్డి కంపను తెచ్చుకుని అతికించుకోవడం ఎందుకులే అని ఊరుకున్నారులేనని దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. కాసేపటికే బిగ్‌బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైమా.. వాసంతి, బాలాదిత్యను; రోహిత్.. రేవంత్, శ్రీహాన్‌ను; శ్రీసత్య.. బాలాదిత్య, రేవంత్‌ను; బాలాదిత్య.. రేవంత్, ఫైమాను, ఆది రెడ్డి.. అర్జున్, వాసంతిని; మెరీనా.. రేవంత్; ఆది రెడ్డిని; గీతూ.. వాసంతి, బాలాదిత్యను; రాజ్.. బాలాదిత్య, వాసంతిని; ఇనయ.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; అర్జున్.. బాలాదిత్య, ఆది రెడ్డిని; వాసంతి.. రాజ్, రేవంతిని; కీర్తి.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; రేవంత్.. మెరీనా, శ్రీసత్యను; సూర్య.. బాలాదిత్య, రేవంత్‌ను నామినేట్ చేశారు. శ్రీహాన్.. డ్రామా క్వీన్ అంటూ ఇనయను నామినేట్ చేశాడు. 23 ఏళ్లుగా స్ట్రాంగ్ అని చెప్పే కీర్తి ఇంట్లో ప్రతిదానికి ఏడుస్తుంది, అంటే ఆమె వీక్ కంటెస్టెంట్ అని చెప్తూ కీర్తిని నామినేట్ చేశాడు. ఇక ఈ ప్రక్రియలో తాను నామినేషన్‌కు భయపడుతున్నానని ఆదిరెడ్డి, రాజ్ అనడంతో వాసంతి చిర్రెత్తిపోయింది. నామినేషన్స్‌కు ఇక్కడ ఎవరూ భయపడట్లేదా? నేనొక్కదాన్నే భయపడుతున్నానా? ఏమైనా అంటే ఇదే కారణం వెతుక్కుంటారని చిటపటలాడింది. తనకు నామినేషన్స్ నథింగ్ అని, హెయిర్ తన జీవితం అయినా అయినా దాన్ని కట్ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఈ ఏడోవారం రోహిత్, వాసంతి, ఆదిత్య, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్, కీర్తి, శ్రీసత్య, మెరీనా, రాజ్, ఫైమా నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: అది ఫేవరెటిజమా?: యాంకర్‌నే నిలదీసిన సుదీప ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒంటరిగా రమ్మన్నాడు -
ఆ ఇద్దరు తప్ప అందరూ నామినేషన్లోనే!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం పదిహేను మంది మిగిలారు. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏదైనా టాస్క్ ద్వారా కాకుండా ఇంటిసభ్యులు కారణాలు చెప్పి మిగతావారిని నామినేట్ చేశారు. ఈ క్రమంలో కెప్టెన్ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. తన కెప్టెన్సీలో బిగ్‌బాస్ రూల్స్ పక్కనపెట్టి తనే ఆదమరిచి నిద్రపోయాడంటూ నామినేసన్ ఓట్లు గుద్దారు. తను ఫ్రెండ్ అనుకున్న శ్రీసత్య కూడా వేరే ఆప్షన్ లేదంటూ రేవంత్‌నే నామినేట్ చేసింది. ఇనయ బిహేవియర్ నచ్చలేదంటూ ఆమెను నామినేషన్లోకి పంపాడు శ్రీహాన్. నువ్వు మంచివాడిగా ఎలా ఉన్నావో అదే పేరుతో బయటకు వెళ్లిపోతే బాగుందని బాలాదిత్యకు ఓటేసింది గీతూ. సిస్టర్ అనుకున్న గీతూ తను వెళ్లిపోవాలని కోరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆదిత్య. హౌస్ మంచి కోసం తాను పాటుపడుతుంటే తననే పంపించేయాలని చూస్తున్నారని బాధపడ్డాడు. చూస్తుంటే గీతూ, కెప్టెన్ సూర్య మినహా మిగతా అందరూ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గీతూ జిడ్డు.. రేవంత్ అయితే.. : సుదీప -
గీతూ జిడ్డు, ఫైమా ఇమ్మెచ్యూర్, రేవంత్ అయితే..: సుదీప
Bigg Boss Telugu 6, Episode 43: సండేను ఫండే చేసేందుకు నాగార్జున గట్టిగానే ట్రై చేశాడు. టాస్కుల పేరుతో పాటలు, డ్యాన్సులతో ఎపిసోడ్‌ను ఎలాగోలా నెట్టుకొచ్చాడు. ఆరోవారం ఆరో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశాడు. మరి ఆ వివరాలన్నీ తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. నాగార్జున వచ్చీరాగానే ఆదిరెడ్డి, కీర్తి, రాజ్‌ను సేఫ్ చేశాడు. తర్వాత హౌస్‌మేట్స్‌కి స్క్రీన్‌పై బొమ్మలు చూపించి ఆ పాటేంటో గెస్ చేయమని గేమ్ ఆడించాడు. ఫుల్ ఎనర్జీతో ఉన్న కంటెస్టెంట్లు పాట గెస్ చేయడమూ దానికి తగ్గట్లు స్టెప్పులేయడమూ చేశారు. ఇదైపోగానే మరో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు నాగ్. కొన్ని డైలాగ్ ప్లేట్లు ఇచ్చి ఇది మీకు సెట్టవుతుందా? లేదా మరెవరికైనా సెట్టవుతుందా? చెప్పమన్నాడు. ముందుగా బాలాదిత్య లేచి... అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు, విలన్లు లేరీ నాటకంలో అన్న డైలాగ్ గీతూకు సరిగ్గా సరిపోతుందన్నాడు. సొల్లాపు, దమ్ముంటే నన్ను ఆపు అని సూర్యను హెచ్చరించింది ఇనయ. నా పేరు శివమణి, నాక్కొంచెం మెంటల్ అంది ఫైమా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని చెప్పింది శ్రీసత్య. నా సావు నేను సస్తా, నీకెందుకు? అని రాజ్‌ను అడిగేసింది గీతూ. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులు అని ఒకరకంగా ఫైమాకు వార్నింగ్ ఇచ్చింది సుదీప. మాస్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది అని ఇనయను హెచ్చరించాడు సూర్య. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు, మాడిపోతావు అని ఇనయకు వార్నింగ్ ఇచ్చాడు శ్రీహాన్. నా సావు నేను సస్తా, నీకెందుకు అని ఆదిరెడ్డిని అడిగింది కీర్తి. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే అన్న డైలాగ్‌ను ఒకరికొకరు అంకితమిచ్చుకున్నారు రోహిత్, ఆదిరెడ్డి. దమ్ము టన్నులు టన్నులుంది చూస్తావా? అని గీతూను అడిగాడు రాజ్. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని అందరిముందు రోహిత్‌కు స్ట్రాంగ్‌గా చెప్పింది మెరీనా. చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ఫాడిస్తా అని అర్జున్ను బెదిరించాడు రేవంత్. చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ఫాడిస్తా అని రేవంత్‌ను బెదిరించింది వాసంతి. నన్ను కొడుతున్నాడు, పకోడి అని పిలుస్తున్నాడు, ఈసారి నన్ను కొడితే తిరిగి కొడ్తానంది వాసంతి. తర్వాత గీతూ సేఫ్ అయింది. చివరగా బాలాదిత్య, సుదీప మిగలగా.. సుదీప ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో బాలాదిత్య, మెరీనా, వాసంతి కన్నీళ్లు పెట్టుకున్నారు. గీతూ మాత్రం ఏదో ఆలోచిస్తూ.. మనం ఈ హౌస్‌లో మాట్లాడకపోతేనే బాగుంటుంది, బయట వెళ్లాక ఈ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ పెట్టుకుందామని బాలాదిత్యతో అంది. తర్వాత స్టేజీ మీదకు వచ్చిన సుదీప.. ఇంటిసభ్యులను కొన్ని కూరగాయల మీనింగ్స్‌తో పోల్చింది. అల్లం ఎలా వంకరటింకరగా ఉంటుందో గీతూ అలా వంకరటింకరగా నడుస్తుందని చెప్పింది. పచ్చిమిర్చి ఘాటులా రేవంత్‌ది షార్ట్టంగ్ అంది. ఆదిరెడ్డి కొబ్బరికాయలా పైకి గట్టిగా ఉన్నా లోపల సాఫ్ట్‌గా ఉంటాడంది. అర్జున్ కన్ఫ్యూజ్డ్, శ్రీహాన్ మాస్క్ వెనకాల దాక్కున్నాడు, అంటే పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైనవి చూపిస్తాడు అని పేర్కొంది. రాడిష్లా ఇనయను చాలా తక్కువ మంది ఇష్టపడ్తారంది. కానీ ఆమె మనసులో ఏమీ పెట్టుకోదని మెచ్చుకుంది. ఫైమా ఇంకా చిన్నదే కాబట్టి ఇమ్మెచ్యూర్ అంది. బద్ధకస్తురాలైన గీతూను జిడ్డుతో పోల్చింది. చదవండి: చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో.. : వాసంతి హన్సిక రాయల్ వెడ్డింగ్, పెళ్లి ఎక్కడో తెలుసా? -
చెయ్యి చూశావా?.. రేవంత్‌కు వాసంతి వార్నింగ్!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ఆరో వారం ముగింపుకు వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఈపాటికే సోషల్ మీడియాలో లీకైంది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీగా నటించిన సుదీప హౌస నుంచి పెట్టే బేడా సర్దుకుని బయటకు వచ్చేయనున్నట్లు తెలుస్తోంది. దానికంటే ముందు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ టాస్కులు ఆడించాడు బిగ్‌బాస్. అందులో భాగంగా కొన్ని డైలాగులను ఇంటిసభ్యులు ఒకరికొకరు అంకితం చేసుకోవాలన్నాడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో అన్న డైలాగ్‌ను బాలాదిత్య.. గీతూకు అంకితమిచ్చాడు. చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ఫాడిస్తా అని రేవంత్‌కు వార్నింగ్ ఇచ్చింది వాసంతి. పదేపదే తనను పకోడీ అని పిలుస్తున్నాడంటూ నాగ్‌కు కంప్లైంట్ ఇచ్చింది. అందుకే అతడిని కొట్టేస్తానని చెప్పింది. ప్రతి ఇంట్లో నాలాంటి పిల్ల ఉంటే బాగుండు అనుకునేలా చేస్తానని గీతూ అందో లేదో వద్దు బాబోయ్ అని ప్రేక్షకులు దండం పెట్టేశారు. వారి రియాక్షన్ చూసి గీతూ అవాక్కయింది. అయితే హౌస్‌లో కూడా మా అందరిదీ అదే ఫీలింగ్ అని పంచ్ ఇచ్చాడు రేవంత్. చదవండి: ఉరేసుకుంటానని అప్పుడే హింటిచ్చిన నటి, వీడియో వైరల్ గీతూ తిక్క కుదిర్చిన నాగార్జున -
నేను వెళ్లిపోతా..: బిగ్‌బాస్‌నే బెదిరించిన చంటి
Bigg Boss 6 Telugu, Epiosde 34 Highlights: మొన్నటిదాకా బిగ్‌బాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో సరదాగా సాగింది షో. అయితే కెప్టెన్సీ టాస్క్‌తో నిన్నటి నుంచి హౌస్‌లో కొంచెం గంభీరం కనిపించింది. ఈసారైనా కెప్టెన్‌గా అవతరించాలని ఎంతోమంది ప్రయత్నించినా ఎట్టకేలకు అది రేవంత్‌ను వరించింది. మరి రేవంత్‌కు ఎవరెవరు సపోర్ట్ చేశారు? అసలు హౌస్‌లో ఏం జరిగిందో చదివేయండి.. బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్ ఎక్కితే ఎపిసోడ్లో కనిపించడం ఖాయం అనుకుంటున్నారో ఏమో కానీ అర్జున్, సూర్య, ఇనయ కంటెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక బయట లవర్స్‌ను కలపడం, విడగొట్టడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది వాసంతి. దీంతో అర్జున్ కల్పించుకుంటూ.. నేను శ్రీసత్య వెనకాల తిరిగితే, నువ్వు నా వెనక తిరగొచ్చు కదా, అప్పుడది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయ్యేది, మంచి కంటెంట్ ఉండేదన్నాడు. అంటే కంటెంట్ కోసమే అతడు అమ్మాయిల వెనకాల తిరుగుతున్నట్లు మాట్లాడాడు. మొన్నటిదాకా ఆరోహినే ప్రపంచం అన్నట్లుగా ఉన్న సూర్య ఆమె వెళ్లిపోగానే ఇనయకు క్లోజయ్యాడు. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్ మొదటి లెవల్లో గెలిచిన బాలాదిత్య, రేవంత్, సూర్యలు రెండో లెవల్‌కు వెళ్లారు. వీరిలో ఎవరికి ఎక్కువ పూలదండలు పడితే అతడు కెప్టెన్‌గా నిలుస్తాడని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో ఆ ముగ్గురు ఇంటిసభ్యులను కాకా పట్టే పనిలో పడ్డారు. కానీ సూర్య కెప్టెన్‌గా నిలిచేది తనే అని ఎంతో ధీమాగా ఉన్నాడు. అతడి నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ ప్రక్రియ మొదలవ్వగానే మొదటగా గీతూ సూర్యకు మద్దతిస్తూ అతడి మెడలో పూలమాల వేసింది. కీర్తి, రోహిత్, చంటి.. సూర్యకు; గీతూ, సుదీప, శ్రీసత్య, ఫైమా.. బాలాదిత్యకు; వాసంతి, అర్జున్, ఇనయ, మెరీనా, శ్రీహాన్, ఆదిరెడ్డి.. రేవంత్‌కు పూలదండలు వేశారు. ఎక్కువ మాలలు పడిన రేవంత్ కెప్టెన్‌గా అవతరించాడు. అనంతరం బిగ్‌బాస్.. వీఐపీ బాల్కనీలోకి ఇంటిసభ్యులరందరికీ ప్రవేశం కల్పించాడు. అటు చంటి మాత్రం ఎంటర్టైన్ చేయడం తగ్గించేసి ఎందుకో డల్‌గా కనిపిస్తున్నాడు. ఈరోజైతే ఏకంగా నేను వెళ్లిపోతా అంటూ ఒకరకంగా బిగ్‌బాస్‌నే బెదిరించాడు. తర్వాత బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో శ్రీహాన్, అర్జున్, రాజశేఖర్‌లకు కొంత గాయాలయ్యాయి. వెంటనే శ్రీసత్య వెళ్లి శ్రీహాన్ దెబ్బతగిలిందా అని అతడిమీద ప్రేమ కురిపించింది. ఆ తర్వాత అర్జున్.. ఏమైనా దెబ్బలు తగిలాయా? అని ఆరా తీసింది. నాకోసం చివర్లో అడుగుతావా? అని అర్జున్ తెగ ఫీలయ్యాడు. అటు శ్రీసత్య మాత్రం ఎలాగైనా రేపటిలోపు అర్జున్ను ఏడిపించాల్సిందేనని శపథం చేసి కూర్చుంది. ఇదిలా ఉంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ముగిసే సమయానికి బాలాదిత్య, గీతూ పోట్లాటకు దిగడంతో రేవంత్ కల్పించుకుని గొడవను సద్దుమణిగేలా చేశాడు. చదవండి: ఆ హీరోయిన్‌తో అర్జున్ కల్యాణ్ ప్రేమాయణం ప్రియుడంటే కియారాకు ఎంత ప్రేమో, వీడియో చూశారా? -
సూర్యకు ఝలక్ ఇచ్చిన ఇనయ, అతడికి ఫుల్ హ్యాపీ!
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే కంటెస్టెంట్లకు ఒక్కసారైనా కెప్టెన్ కావాలన్న ఆశ ఉంటుంది. ఎందుకంటే అది నామినేషన్, ఎలిమినేషన్ల నుంచి గట్టెక్కించే మహా ఆయుధం. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. కెప్టెన్సీ కంటెండర్స్‌ను ఎంపిక చేసే పనిని బిగ్‌బాస్ కీర్తికి అప్పెజెప్పగా ఆమె బాలాదిత్య, రాజశేఖర్, రేవంత్, గీతూ, సూర్య, ఫైమాలను ఎంచుకుంది. వీరందరూ మొదటి లెవల్ గేమ్ ఆడగా అందులో టాప్‌లో నిలిచిన సూర్య, బాలాదిత్య, రేవంత్‌లు రెండో లెవల్‌కు సెలక్ట్ అయ్యారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకోమని బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. ఎవరి మెడలో ఎక్కువ పూలదండలు పడితే వారే కెప్టెన్ అయినట్లని వెల్లడించాడు. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన వ్యక్తులకు వారు దండలు వేయగా ఇనయ మాత్రం అనూహ్యంగా సూర్యకు కాకుండా రేవంత్‌కు పూలమాల వేయడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఫైనల్‌గా రేవంత్ తొలిసారి కెప్టెన్‌గా అవతరించాడు. మరో పక్క లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో బాలాదిత్య, గీతూకు మధ్య మాటల యుద్ధం జరిగింది. మరి ఈ ఫైట్‌లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: మూడుసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చిన గీతూ తనను గట్టిగా హగ్ చేసుకోవాలి: ఇనయ -
రేవంత్ నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు, ఫైమాతో.. : గీతూ
బిగ్‌బాస్ 6- ఎపిసోడ్ 33 హైలైట్స్: బిగ్‌బాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా వినోదాన్ని పంచింది. మొత్తంగా ఇలా అయినా జనాలకు కావాల్సినంత ఫన్ దొరికింది. అయితే బర్త్‌డే వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించడంతో, ఈ రోజు హౌస్మేట్స్ కోరికలను తెలుసుకోవాలనుకున్నాడు బిగ్‌బాస్. అందులో భాగంగా కంటెస్టెంట్లు వారి కుటుంబసభ్యులు నెరవేర్చగలిగే కోరికలేంటో చెప్పమని ఆదేశించాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. 'నా బర్త్‌డేకు నా చేతుల మీదుగా శ్రీహాన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనాథలకు, వృద్ధులకు సాయం చేద్దామనుకున్నా. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నా కాబట్టి సిరి ఆ పని పూర్తి చేయాలి. అలాగే మా అమ్మానాన్నలకు రోజుకొక్కసారైనా ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడు సిరి' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. తన గారాలపట్టికి హౌస్ నుంచి బయటకు వచ్చాక మంచి పేరు పెడతానంటూ ఎమోషనల్ అయ్యాడు బాలాదిత్య. మా బావ, అమ్మ ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలనుందని మనసులో మాటను బయటపెట్టింది ఫైమా. నా తల్లిదండ్రులు మాట్లాడిన ఒక వీడియో బైట్ చూపిస్తే అంతే చాలంటూ ఎమోషనలయ్యారు అర్జున్, సూర్య. మా అమ్మ బిగ్‌బాస్ హౌస్‌కు రావాలి, తనని గట్టిగా హగ్ చేసుకోవాలనుంది. తనను మా నాన్న అంత బాగా చూసుకోలేనేమో కానీ ఆయన లేని లోటును మాత్రం గుర్తు చేయను అని ఏడ్చేసింది ఇనయ. మా ఆయన రంగనాథ్, కుటుంబం అంతా మాట్లాడిన వీడియో చూపించాలని కోరుకుంటున్నానంది పింకీ. 'ఓరియో నాకు ప్రతిరోజు ముద్దు పెట్టి నిద్ర లేపుతాడు. నా పెంపుడు కుక్కలు ఓరియో, ఫిడోల బొచ్చు కావాలి. అది నాకు చాలా అమూల్యమైనది' అని చెప్పుకొచ్చింది గీతూ. 'అక్టోబర్ 27న నా కూతురి బర్త్‌డే. ఆమె పుట్టినరోజు బిగ్‌బాస్ హౌస్‌లో జరగాలన్నదే నా కోరిక' అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. అనంతరం బిగ్‌బాస్ ఈ వారం ఎక్కువ ఎంటర్టైన్ చేసిన ఆరుగురిని కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఎంపిక చేయమని కెప్టెన్ కీర్తికి బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఆమె ఫైమా, రేవంత్, సూర్య, గీతూ, ఆదిత్య, రాజశేఖర్ పేర్లను సూచించింది. వీరు గేమ్ ఆడగా.. మొదటి లెవల్లో గెలిచి తొలి మూడు స్థానాల్లో ఉన్న సూర్య, బాలాదిత్య, రేవంత్ రెండో లెవల్‌కు వెళ్లారు. రెండో లెవల్ గేమ్ రేపు ప్రసారం కానుంది. అయితే ఈ ముగ్గురిలో రేవంత్ గెలిచి కెప్టెన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేవంత్ తన బుగ్గ మీద ముద్దుపెట్టడం నచ్చలేదని అతడితోనే చెప్పింది గీతూ. తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పడంతో తన తీరు మార్చుకుంటానన్నాడు రేవంత్. అలాగే ఫైమా కాళ్లపై పడుకున్నావని, కాస్త వాళ్లు కంఫర్టో కాదో చూసుకోమని సూచించింది గీతూ. చదవండి: మూడుసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చిన గీతూ తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన అర్జున్ -
Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్
బిగ్‌బాస్-6, ఎపిసోడ్32 హైలైట్స్ : బిగ్‌బాస్ ఫైమాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్మేట్స్ నిద్ర లేపాల్సి ఉంటుంది. ఇక ఆమె టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్న టైంలో వసంతి, మెరీనాలు దెయ్యం గెటప్‌లు వేసి ప్రాంక్ చేస్తారు. ఈవారం వారిద్దరూ నామినేషన్స్‌లో ఉండటంతో ఎలా అయినా కాస్తైనా కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దెయ్యం గెటప్‌లు వేసి ఎంటర్టైన్ చేద్దామనుకున్నారు. కానీ వాళ్లు వేసి దెయ్యం గెటప్‌లకు హౌస్‌లో ఎవరూ భయపడలేదు. దీంతో వాళ్ల కష్టం వృదా అయినట్లే అనిపించింది. ఇక్కడ ఫైమాకు కూడా మైనస్ అయ్యింది. ఆమె సీక్రెట్ టాస్క్ చేద్దామంటే, వీళ్లు వచ్చి టైం వేస్ట్ చేసేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్మేట్స్ కోసం చిన్న కేక్ పీస్ పంపించాడు. దీన్ని ఎవరైనా నలుగురు తినాల్సిందిగా కోరగా, సుదీప తన డామినేటింగ్ వాయిస్‌తో ఓటింగ్‌కి వెళ్దామని చెప్తుంది. దీంతో ప్రతిదానికి ఓటింగ్ ఏంటంటూ రేవంత్ చాలా అసహనం వ్యక్తం చేశారు. వీళ్లు ఇలా తేల్చుకునేలోపే ఆ కేక్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టమని బిగ్‌బాస్ ఆదేశించాడు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా రేవంత్, శ్రీహాన్‌లు వేసిన లేడీ గెటప్‌లు ఎంటన్టైనింగ్గా అనిపించాయి. ఆ తర్వాత చంటి, శ్రీహాన్‌లకు కాళ్లు వ్యాక్స్ చేయించుకోవాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించగా, శ్రీహాన్ అక్కడ కామెడీ చేస్తాడు. ఇదిలా ఉండగా కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన ఇనయాను ఏదైనా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటూ బిగ్‌బాస్ ఆదేశించగా, తనకు సూర్య అంటే క్రష్ అని, అతనిపై రోజురోజుకు ఇష్టం పెరుగుతుందని చెప్తుంది. అంతేకాకుండా ఆరోహితో సూర్య క్లోజ్‌గా ఉంటే తనకు జలసీగా అనిపిస్తుందని చెప్తుంది. ఇప్పటికే ఆరోహి-సూర్యలపై బయట నెగిటివ్‌గానే ఉంది. ఇనయా కూడా సూర్య అంటే ఇష్టం అని చెప్పడం, అతనికి హగ్గులు ఇస్తూ క్లోజ్‌గా ఉండటం ఆమె గ్రాఫ్‌ను తగ్గించింది. ఓటింగ్‌లోనూ మునుపటి కంటే వెనుకపడిపోయింది. మరి రానున్న రోజుల్లో ఈ ట్రయాంగిల్ ఆమె ఆటతీరును మార్చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
Bigg Boss 6: చంటికి షాకిచ్చిన బిగ్‌బాస్.. కెప్టెన్సీ రేసు నుంచి ఔట్
బిగ్‌బాస్ హౌస్‌లో హోటల్ టాస్క్ నడుస్తోంది. బీబీ హోటల్ స్టాఫ్‌గా సుదీప, బాలాదిత్య, మెరీనా, గీతూ, రేవంత్, చంటి ఉంటే.. గ్లామ్ ప్యారడైజ్ హోటల్ స్టాఫ్‌గా వాసంతి, ఫైమా, కీర్తి, శ్రీసత్య, ఆరోహి ఉన్నారు. ఇక గెస్టులుగా శ్రీహాన్, ఇనయా, ఆదిరెడ్డి, రాజ్, అర్జున్ ఉన్నారు. బీబీ హోటల్ మేనేజర్ సుదీప వచ్చి.. గెస్టులు వాష్ రూమ్‌కి వెళ్లాలి అనుకుంటే.. ప్రతి ఒక్కరు రూ.500 ఇవ్వాలని కండీషన్ పెట్టింది. అయితే దీనికి ఆదిరెడ్డి ఓకే చెప్పగా.. సూర్య, రాజ్ మాత్రం మేం అల్రెడీ డీల్ మాట్లాడుకున్నాం. మాకు అవసరం లేదని చెప్పారు. మీకు ఏదైనా ఉంటే.. రెండు హోటళ్ల మేనేజర్లు కలిసి మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో సుదీప వెళ్లి గ్లామ్ ప్యారడైజ్ హోటల్ మేనేజర్ ఫైమాతో మట్లాడింది. అయితే అక్కడ డీల్ పెట్టుకున్న ఫైమానే తొలుత ఎవరు ఎవరితో డీల్ పెట్టుకున్నారో తెలియదని దాటవేసే ప్రయత్నం చేసింది. చివరకు వాళ్ల టీమ్ వాళ్లతో చర్చించి.. డీల్ మాట్లాడుకోవడం తప్పేనని.. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశామని చెప్పారు. ఇక మతిమరుపు క్యారెక్టర్లో ఉన్న సూర్యతో.. ‘నేను నీ ప్రేయసిని.. మర్చిపోయావా’అంటూ ఇనయా తనలో నిద్రపోయిన నటనను లేపింది. ఇక్కడ ఇద్దరూ ఆస్కార్ లెవల్ ఫెర్ఫామెన్స్ ఇచ్చారు. ‘సూర్యా మనం ఇక్కడే కూర్చున్నాం.. ఇక్కడే పడుకున్నాం.. బేబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం.. ఇన్ని రోజులు మన మధ్య జరిగినవి అన్నీ మర్చిపోయావా? నిజంగానే నాకు నువ్ అంటే నాకు చాలా ఇష్టం.. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నా.. నువ్ నన్ను మర్చిపోతే నేను ఎలా బతకాలి’ అని ఇనయ అంటే.. ‘నిజంగా మనం ప్రేమించుకున్నామా? మనషులు అర్ధం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నిలా స్వచ్ఛమైనది అని భారీ డైలాగ్‌తో సూర్య చెలరేగిపోయాడు. ఇక వాష్ రూం దగ్గర కాపలాగా ఉన్న రేవంత్ దగ్గరకు ఆదిరెడ్డి వెళ్లి.. వాష్‌రూం వెళ్తానని అడుగుతాడు. అప్పుడు రేవంత్ ‘ లేదు బ్రో మా వాళ్లు మీటింగ్ పెట్టారు.. వాళ్లు చెప్పినట్టు చేయాలి.. ఇక్కడ నాకు వచ్చేది రూపాయి లేదు.. ఎవరికి వాళ్లు వాళ్ల ఫేవరేట్ పీపుల్ని కాపాడుకుంటున్నారు కాబట్టి.. ఇది ఎలాగూ తేలదు వాళ్లు చెప్పింది చేస్తే.. కనీసం వందో రెండొందలో వస్తుందని’ అన్నాడు ఇంతలో రోహిత్ వచ్చి.. రేవంత్‌ని చూసి నవ్వుతాడు. ఆది రెడ్డి కూడా గట్టిగా నవ్వడంతో.. ‘నవ్వండి బ్రో.. ఎవరెంత నవ్వుతారో నవ్వండి.. రేపటి రోజున బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్‌ని నేను ఇలా పట్టుకున్నప్పుడు మీ నవ్వులు ఏమౌతాయో చూస్తాను’ అని అన్నాడు రేవంత్. ఇక బిగ్‌బాస్ ఇరు హోటళ్ల సభ్యులను పిలిచి..ఎవరి దగ్గరు ఎంత డబ్బు ఉందో చెప్పమని అడిగాడు. దీంతో బీబీ హోటల్ దగ్గరు రూ.4600 ఉంటే.. గ్లామ్ ప్యారడైజ్ దగ్గరు 5300 ఉన్నాయని చెప్పారు. ఎక్కువ డబ్బులు ఉన్న గ్లామ్ ప్యారడైజ్ సభ్యుల ఆదిపత్యంలోకి బీబీ హోటల్ కూడా వస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. అంతేకాదు బీబీ స్టాఫ్ నుంచి ముగ్గురు సభ్యులను మాత్రమే తమ టీమ్‌లోకి తీసుకోవాలని.. మిగిలిన వారిని ఉద్యోగంలో నుంచి తీసేసి.. పోటీదారుల నుంచి తొలగించొచ్చని చెప్పాడు. దీంతో రేవంత్, ఆదిత్యలను తొలగించి.. సుదీప, గీతూ, మెరీనాలను తమ టీమ్‌లోకి తీసుకున్నారు. ఇక సీక్రెట్ టాస్క్‌లో విఫలమయ్యాడని చెబతూ.. చంటీని కెప్టెన్సీ పోటీదారుల రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్. దీంతో రేవంత్,ఆదిత్యలతో పాటు చంటీ కూడా కెప్టెన్ అయ్యే చాన్స్‌ని మిస్ అయ్యాడు. -
‘లెహరాయి’ నుంచి ‘అప్సరస.. అప్సరస’సాంగ్ రిలీజ్
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస ని దర్శకుడి గా పరిచయం చేస్తూ బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్సరస అప్సరస’ అనే మరో సాంగ్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆలపించారు.‘తీపితో తేల్చి చెప్పా.. తొలితీపి నీ పలుకని .. తారనే పిలిచి చూపా ..తొలి తారా నీ నవ్వని’లాంటి లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు రామకృష్ణ పరమహంస’ తెలిపారు. ఈ చిత్రంలో ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
Bigg Boss 6: నామినేషన్స్.. ఇనయా-శ్రీహాన్‌ల మధ్య మళ్లీ పిట్ట వివాదం..
బిగ్‌బాస్ నాలుగోవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఇద్దరు సభ్యుల తలపై ఒక్కో టమాటాను పూర్తిగా స్మాష్ చేసి తాము ఎందుకు నామినేట్ చేస్తున్నారో సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో శ్రీహాన్ ఇనయాల మధ్య పిట్ట టాపిక్ వస్తుంది. వాడు అంటే తీసుకోలేని వాడు పిట్ట ఎలా చెప్తావ్ అని వాదించావ్, నిన్ను పేరు పెట్టి పిట్ట అని అనలేదు కదా అని శ్రీహాన్ చెప్పగా, అక్కడ ఉన్నది నేను కాబట్టి నన్నే పిట్ట అన్నావ్ అంటూ ఇనయా బదులిస్తుంది. ఆ తర్వాత శ్రీహాన్‌ను నామినేట్ చేయడానికి ఇనయా వెళ్లగా, ఆవలింతలు తీస్తూ ఒక్క నిమిషం ఆగు అంటూ శ్రీహాన్ హేళన చేస్తాడు. ఒక కొన్ని ప్రశ్నలు అడుగుతా ఆన్సర్ చెయ్ అని అడగ్గా.. నచ్చితే చెప్తా, లేదంటే లేదు అంటూ శ్రీహాన్ అంటాడు. అయినే సరే ఇనయా తాను అడగాల్సిన ప్రశ్నలు అడిగేస్తుంది.. నా కన్నా నీ ఏజ్ తక్కువ అని ఎలా అంటావ్? నీ కన్నా బాడీలో పెద్దగా ఉన్నంతమాత్రానా పెద్దదాన్ని అయిపోతానా? అసలు నా ఏజ్ గురించి నీకు తెలుసా? అంటూ ఫైర్ అవుతుంది. అసలు ఇవన్నీ తాను అనలేదని, కేవలం తన ఏజ్ గురించి మాత్రమే చెప్పానంటూ శ్రీహాన్ బదులిస్తాడు. చూస్తుంటే వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తుంది. ఇక సుదీప రేవంత్‌ను నామినేట్ చేయగా, ఇంటి, ఇనయాలను గీతూ నామినేట్ చేస్తుంది. కోపంలో కొన్నికొన్ని కోల్పోతావ్ అంటూ ఆరోహి ఇనయాను నామినేట్ చేస్తుంది. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉంటారో చూద్దాం. -
Bigg Boss 6: ఆ అమ్మాయికి ఎథిక్స్ లేవు..ఛీఛీ ఎందుకు వచ్చానో: రేవంత్
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం గలాట గీతూ హవా నడుస్తోంది. మూడు వారాలుగా గీతూ ఆట తీరుపై నాగార్జున ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాడు. దీంతో గీతూ మరింత రెచ్చిపోయి..ఆటలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఆమె మాట్లాడే తీరు మాత్రం అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఆడియన్స్‌కి కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదే విషయంపై నాగార్జున కాస్త సున్నితంగా ఆమెను హెచ్చరించాడు. కొన్నిమాటలు ఎదుటివాళ్లకు ఇబ్బందికరంగా ఉంటున్నాయని, వాటిని తగ్గించుకోవాలని సూచించాడు. ఇదిలా ఉంటే గీతూపై రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమెను ఎథిక్స్ లేవని, ఫ్యామిలీ వాల్యూ తెలియదని చెప్పాడు. ఇదంతా శనివారం ఎపిసోడ్లో టెలికాస్ట్ అయింది. (చదవండి: షాకింగ్ ఎలిమినేషన్: ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..) బిగ్‌బాస్ జైలులో ఉన్న అర్జున్ దగ్గరికి వెళ్లిన రేవంత్.. గీతూ ప్రవర్తన గురించి మాట్లాడుతూ..‘కొంతమంది ఎమోషన్స్‌ని కూడా యాక్టింగ్ అంటున్నారు. వాళ్లకి ఫ్యామిలీ వాల్యూ తెలియదు. గీతు అంటుంది.. తల్లి ప్రేమ కంటే కుక్క ప్రేమ గొప్పదట. అసలు ఇలాంటి వాళ్లని ఎందుకు పిలిచారో.. ఇలాంటి వాళ్లు ఉన్న హౌస్‌లో నేను ఎందుకు ఉన్నానని సిగ్గుపడుతున్నా. అబ్బాయిలమైన మనకే కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఎథిక్స్ లేవు. ఆమెను చూస్తుంటే..ఛీఛీ ఇలాంటి వాళ్లు ఉన్న హౌస్‌లోకి ఎందుకు వచ్చానో అనిపిస్తుంది. ఆమె గురించి బయట చాలా విన్నాను. ఎంతకైనా తెగిస్తుంది. ఏమైనా చేస్తుందని విన్నా.. కానీ మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని తెలియదు. గీతూతో పోలిస్తే ఆదిరెడ్డి చాలా బెటర్. రివ్యూ సిస్టమ్ నుంచి బయటకు రావడంతో.. ప్రతిదీ తెలుసు అనుకుంటున్నారు. జనాలకు ఏం నచ్చుతుందో కూడా వీళ్లే చెప్పేస్తున్నారు.. వీళ్లేమైనా దేవుళ్లా? నాకు అర్ధం కావడం లేదు. వీళ్లని అసలు మనం కాంపిటేటర్స్లా లెక్కలోకి తీసుకోకూడదు’ అని రేవంత్ అన్నాడు. ఇక గీతూ కూడా రేవంత్‌కు నోటిదూల ఎక్కువని ఆదిరెడ్డి, అర్జున్‌లతో చెప్పుకొచ్చింది. అయితే నాగార్జున వీరిద్దరి నోటీదూల గురించి పరోక్షంగా, కాస్త వ్యంగ్యంగా హెచ్చరించాడు. -
Bigg Boss 6 : కెప్టెన్‌గా ఆదిరెడ్డి, జైలుకు వెళ్లిన అర్జున్.. ఏడ్చేసిన కీర్తి
బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఆదిరెడ్డి విజేతగా నిలుస్తాడు. ఇక అందరికంటే ఎక్కువగా కంటెంట్ ఇస్తున్నది తానే అంటూ గీతూ తన అభిప్రాయం చెప్తుంది. దీనికి ఇంటి సభ్యులు కూడా అంగీకరించి ఆమెకు 10నిమిషాల చైన్‌ను కట్టబెడతారు. మరోవైపు అందరికంటే తక్కువగా జీరో మినిట్స్ ట్యాగ్‌తో అర్జుణ్ జైలుకు వెళ్తాడు. ఇంకా మరెన్నో విశేషాలను బిగ్‌బాస్ సీజన్-6 20వ ఎపిసోడ్ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ కొత్త కెప్టెన్సీ ఎంపిక కోసం ఎత్తెర జెండా అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా ఇసుక కుప్పలో నుంచి ఇసుకను ఓ చిన్న బకెట్లో తీసుకెళ్లి వాళ్లకు కేటాయించిన డబ్బాలో వేయాల్సి ఉంటుంది. పైమా డిస్క్వాలిఫై అయినందున ఆదిరెడ్డి, శ్రీహాన్, సత్యలు ఈ టాస్క్‌లో ఆడారు. శ్రీహాన్ గెలుపుకు ఒక అడుగు దూరంలో మిగిలిపోతాడు. అందరికంటే ముందుగా ఆదిరెడ్డి టాస్క్‌ను విజయవంతంగా కంప్లీట్ చేయడంతో అతనే కెప్టెన్‌గా నిలుస్తాడు. దీంతో తన భార్య కవితను తలుచుకొని ఉద్వేగానికి లోనవుతాడు. నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటావ్.. లవ్ యూ కవిత అంటూ భార్యకు ప్రేమ సందేశాన్ని పంపుతాడు. ఇక డేంజర్ జోన్లో ఉన్న వసంతికి ఎందుకో గానీ ఎలిమినేట్ అవుతాన్న భయం మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇనయాతోనూ ఇదే విషయాన్ని చర్చించింది. మరోవైపు గీతూ కావాలని కేవలం కంటెంట్ కోసమే చేస్తున్నా అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారంటూ ఫీల్ అవుతుంది. ఇక ఎపిసోడ్లో ఎవరు ఎన్ని నిమిషాలు కనిపిస్తారన్నది ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని దానికి సంబంధించిన చెయిన్స్ ధరించాల్సి ఉంటుంది అని టాస్క్ నిర్వహించగా, అందరి కంటే ఎక్కువగా గీతూ 10నిమిషాల చైన్‌ను ధరిస్తుంది. రేవంత్ 7నిమిషాలు, ఫైమా 6నిమిషాలు, శ్రీహాన్, ఇనయాలకు 5నిమిషాల చైన్ ధరిస్తారు. ఇక చివరగా అందరికంటే తక్కువగా జీరో నిమిషాలు సంపాదించిన ఆరోహి, ఆర్జున్, కీర్తిలలో ఎవరో ఒకరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. దీంతో ముగ్గురూ ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని అర్జున్ను జైలుకు పంపుతారు. అయితే తనకు జీరో అన్న ట్యాగ్ రావడంపై కీర్తి భోరుమని ఏడ్చేస్తుంది. దీంతో శ్రీహాన్ ఆమెను ఓదారుస్తాడు. -
ఇనయా-శ్రీహాన్‌ల మధ్య బిగ్ ఫైట్.. మధ్యలో దూరిన గీతూ
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ముగుస్తుంది. పోలీస్ టీం ఇందులో విజేతగా నిలుస్తుంది. శ్రీహాన్-ఇనయాల మధ్య మాటల యుద్దం జరగడానికి గల కారణాలేంటి? కెప్టెన్సీ పోటీదారులుగా చివరగా మిగిలిన వాళ్లెవరు అన్నది బిగ్‌బాస్ సీజన్-6 19వ ఎపిసోడ్లో చూద్దాం. కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్ నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ ముగుస్తుంది. ఈ టాస్కులో ఎక్కువ బొమ్మలు ఉన్న పోలీస్ టీం విజేతలుగా నిలుస్తారు. కెప్టెన్సీ కంటెండర్స్‌గా సత్య, గీతూ, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను టీం సభ్యులు ఎన్నుకుంటారు. ఇక ఆ తర్వాత జరిగిన టాస్కులో గీతూ తొలుత ఎలిమినేట్ అవుతుంది. ఆ తర్వాత బ్రిక్స్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఫైమా చేతులు ఉపయోగించిందన్న కారణంతో రేవంత్ ఆమెను డిస్ క్వాలిఫై చేస్తాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ జరిగినా రేవంత్ సంచలాక్గా ఉన్నందున అతని నిర్ణయం ఫైనల్ అవుతుంది. అయితే ఫైమా డిస్ క్వాలిఫై అనడంతో ఇనయా ఎంట్రీ ఇస్తుంది. శ్రీహాన్ చేతులు తగలడం నేను చూశానంటూ రేవంత్‌కి చెబుతుంది. ఇది విన్న శ్రీహాన్... ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా.. సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్ తీసుకో అని అంటాడు. ఇక అక్కడ మొదలవుతుంది రచ్చ. నన్ను పిట్ట అని ఎలా అంటావంటూ ఇనయా నోరేసుకొని పడిపోతుంది. నిన్ను వాడు అంటే తీసుకోలేని వాడివి నన్ను పిట్ట అని ఎందుకు అన్నావ్ అని రెచ్చిపోయింది. దీంతో గీతూ ఇచ్చి అతను నిన్ను అనలేదు, నన్నే పిట్ట అన్నాడు అని సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఇనయా ఆగకపోవడంతో ఇక ఇలా కాదునుకుందో ఏమో కానీ గీతూ ఇనయాని హేళన చేస్తున్నట్లు ప్రవర్తించింది. వచ్చిందీ పాలపిట్టా అంటూ ఇష్టం వచ్చిన పాటలు పాడుతూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇనయా.. మళ్లీ నోరేసుకొని పడిపోతుండటంతో శ్రీహాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మగాడివైతే నేను చెప్పింది విని అంటూ ఇనయా మాటలు హద్దులు దాటుతుంది. మరి ఈ టాస్కులో కెప్టెన్‌గా ఆదిరెడ్డి, సత్య, శ్రీహాన్‌లలో ఎవరు నిలుస్తారన్నది ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. -
Bigg Boss 6: సిగ్గూ, శరం ఉండాలి.. కోపంతో ఊగిపోయిన రేవంత్
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరుగుతోంది. ‘అడవిలో ఆట’ పేరిట జరుగుతున్న ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు.ఒక టీమ్ పోలీసులుగా వ్యవహరించనుండగా, రెండో టీమ్ దొంగలుగా ఉన్నారు. గీతూ రాయల్ మాత్రం స్వార్థపరురాలైన వ్యాపారస్థురాలిగా ఉంటోంది. అయితే టాస్క్‌లు రెండు టీమ్‌లు సభ్యులు బిగ్‌బాస్ రూల్స్‌ని బ్రేక్ చేశారు. వస్తువులను కాపాడాల్సిన పోలీసులే.. అడవిలోని విలువైన వస్తువులను దొంగతనం చేశారు. ఇక వస్తువులను కొనాల్సిన గీతూ కూడా కొన్నింటిని కొట్టేసింది.దీంతో బిగ్‌బాస్ మరోసారి టాస్క్ గురించి వివరించాడు. రైడ్‌కి వెళ్లిన పోలీసులు సమయానికి మించి అక్కడే ఉంటే..వారిని దొంగలు కిడ్నాప్ చేయ్యొచ్చు. ఈ కండీషన్‌పై స్టోర్ రూంలోకి వెళ్లిన ఇనయాను దొంగలు కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ఇద్దరు దొంగలు మాత్రమే ఇనయాను కిడ్నాప్ చేయాల్సి ఉండగా.. అందరూ వచ్చి ఆమెను పట్టుకున్నారు. తనను తాను తప్పించుకునే క్రమంలో ఇనయా.. ఆరోహిని కాలితో తన్నడంతో పాటు నేహ చెంపపై కొట్టింది. గుండెల మీద పట్టుకొని బయటకు నెట్టి చెంపపై కొట్టిందని రేవంత్‌తో చెబుతూ నేహా బాధ పడుతుంటే..షూతో ఆరోహి మొహం మీద తన్నిందని రేవంత్ చెప్పాడు. ఇక ఇదే విషయంపై కీర్తి, ఇనయా మధ్య డిస్కషన్ జరిగింది. నేను రైడ్‌కి వెళ్లే సమయంలో నేహ బెడ్ రూమ్‌లో ఉందని ఇనయా అంటే..లేదని కీర్తి చెప్పింది..ఇలా ఇద్దరు గొడవపడుతుంటే.. చంటి కలగజేసుకొని ఆ సమయంలో నేహ బెడ్ రూమ్‌లో లేదని చెప్పడంతో అందరూ కూల్ అయిపోయారు. గీతూ, ఇనయాల మధ్య కూడా కిడ్నాప్ గురించే గొడవ జరిగింది. ఆ సమయంలో దొంగల టీమ్‌లోని సభ్యులెవరో తన డ్రెస్‌ని పైకి లాగారని ఇనయా అంటే.. ఇవన్నీ తప్పుడు మాటలని గీతూ మొహం మీదే చెప్పేసింది.‘నువ్ తప్పు మాటలు మాట్లాడుతున్నావ్.. మాటలు మారుస్తున్నావ్ ’అంటూ ఇనయాను రెచ్చగొట్టింది. చివరకు ఇనయా నేను చేసిందే తప్పే..కానీ వాళ్లు చేసింది ఎంతవకు కరెక్ట్? అని చెబుతూనే.. కిడ్నాప్ చేసుకోండి అని ఇంట్లోకి వెళ్లింది. ‘అడవిలో ఆట’ టాస్క్‌లో ఎలాగైనా గెలిచి కెప్టెన్సీ కంటెండర్ కావాలని గీతూ కన్నింగ్ ప్లాన్ వేసింది. తను కొనుగోలు చేసిన బొమ్మలను కాపాడుకునేందుకు సూర్య, శ్రీహాన్‌లతో డీల్ కుదుర్చుకుంది. అయితే గీతూ ఇచ్చిన డబ్బులను శ్రీహాన్ తీసుకున్నాడు కానీ.. సూర్య మాత్రం తీసుకోలేదు. ఇక దొంగల టీమ్ సభ్యుడైన రేవంత్‌పై ఆ టీమ్ సభ్యులే అనుమానం వ్యక్తం చేశారు. గీతూతో రేవంత్ డీల్ కుదుర్చుకున్నాడని, అతని బొమ్మలు లేపేద్దామని నేహా, ఆరోహి ప్లాన్ వేశారు. అనుకున్నట్లే రేవంత్ దాచుకున్న బొమ్మలను దొంగిలించారు. దీంతో రేవంత్ కోపంతో ఊగిపోయాడు. తన బొమ్మలను లేపేసిన వారికి సిగ్గూ శరం లేదంటూ మండిపోయాడు. నీతులు చెప్పడమే కాదు పాటించాలి కూడా అంటూ దొంగల టీమ్‌పై అసహనం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా రాత్రంతా నిద్ర పోనని, పోలీసుల టీమ్‌ని గెలించడమే తన లక్ష్యమని చెప్పాడు. బుధవారం నాటి ఆట ముగిసే సరికి.. శ్రీహాన్, సూర్యల వద్దే ఎక్కువ డబ్బులున్నట్టు కనిపిస్తోంది.అలాగే గీతూ కూడా తనకు కావాల్సిన బొమ్మలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. -
సొంత టీమ్ సభ్యులే రేవంత్‌కు వెన్నుపోటు.. శపథం చేసిన సింగర్
బిగ్‌బాస్ -6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట గేమ్ కొనసాగుతుంది. ఇందులో పోలీసులు, దొంగలుగా రెండు టీమ్స్‌గా విడిపోయారు. అయితే దొంగల టీమ్‌లో ఏమాత్రం యూనిటీ (ఐక్యత)లేకపోవడంతో వాళ్లమధ్యే గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో గీతూతో రేవంత్ డీల్ కుదుర్చుకున్నాడని అనుమానపడిన దొంగల టీమ్ ఈరోజు రేవంత్ దాచుకున్న బొమ్మలనే దొంగతం చేస్తారు. దీనికి సత్య కూడా సహాయం చేస్తుంది. అయితే తన బొమ్మలు తన దొంగలు టీమ్ సభ్యులే కొట్టేశారని తెలిసి రేవంత్ ఆశ్చర్యపోతాడు. నిద్రపోదామనుకున్నా, కానీ నిద్రపోనూ, పోలీసుల టీమ్ ను గెలిపిస్తా అంటూ శపథం చేస్తాడు. వాళ్లకంటే తాను దారుణమైన కన్నింగ్ అని, ఇలా చేయడానికి మినిమం సెన్స్ ఉండాలంటూ మండిపడతాడు. అంతేకాకుండా పోలీసులకు తన దగ్గరున్న వస్తువులు చేస్తుందుకు కూడా ఆఫర్ చేస్తాడు. దీంతో సుదీప నీ వరకు వస్తే గేమ్ వచ్చిందా?నువ్వు టీమ్ మొత్తాన్ని డిస్ క్వాలిఫై చేస్తావా అంటూ రేవంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి చివరికి రేవంత్ ఏం చేశాడు? పోలీసులతో చేరి నిజంగానే వాళ్లను గెలిపించాడా? లేక మనసు మార్చుకున్నాడా అన్నది ఈరోజు ఎపిసోడ్లో చూడాల్సి ఉంది. -
ఆత్మహత్యాయత్నం చేశా.. ఆస్పత్రికి ఎవరూ రాలేదు: శ్రీసత్య
బిగ్‌బాస్ సీజన్-6 గురువారం నాటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగింది. హౌస్మేట్స్ తమ జీవితంలో ఒక బేబీని ఉండటం, అది వారి జీవితాన్ని ఎలా మార్చింది అన్నది ఈ ప్రక్రియలో ఓపెన్అప్ అయ్యారు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు తమ జీవితంలో జరిగిన సాడ్ స్టోరీని వివరించి కంటతడి పెట్టించారు. మరోవైపు బిగ్‌బాస్ రెండో ఇంటి కెప్టెన్‌గా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది బిగ్‌బాస్ తెలుగు సీజన్-6 పన్నెండో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. ముందుగా ఆదిరెడ్డి మాట్లాడాడు. తన తల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పాడు. కానీ కష్టాలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఈరోజు తన తల్లి బతికిఉంటే తన సక్సెస్‌ని చూసి సంతోషించేందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తన కూతురులోనే అమ్మను చూసుకుంటున్నానని తెలిపాడు. ఇక సుదీప తన ప్రెగ్నెన్సీ స్టోరీని వివరిస్తూ అందరిని కంటతడి పెట్టించింది. థైరాయిడ్ కారణంగా బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని చెబుతూ సుదీప కన్నీళ్లు పెట్టుకుంది. తన చెల్లి కూతురిలో తన బిడ్డను చూసుకున్నానని, కానీ తనను తిరిగి ఇచ్చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిపోయిందని చెప్పింది. ఎప్పటికైనా తనకంటూ ఓ బిడ్డ పుడుతుందనే ఆశతో బతుకుతున్నానని చెప్పింది. చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు నొచుకోలేదని చెప్పిన రేవంత్ త్వరలోనే తాను తండ్రి కాబోతున్నానని చెబుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ఎప్పుడెప్పుడు తన బిడ్డతో నాన్న అని పిలిపించుకుందామా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే చలకీ చంటీ జీవితంలోనూ అంతులేని విషాదం ఉంది. కళ్లెదుటే ఫైర్ యాక్సిడెంట్లో తన తల్లి చనిపోయిందని చెప్పిన చంటీ ఆ తర్వాత కవల పిల్లల రూపంలో తనకు ఆ దేవుడు అమ్మను ప్రసాదించాడని తెలిపాడు. బిగ్‌బాస్ క్యూట్ కపుల్ మెరీనా అండ్ రోహిత్‌లు తమ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని వివరిస్తూ.. మూడోనెల దాటాక బేబీ హార్ట్‌బీట్ లేదని చెప్పారు. వేరే ఆప్షన్ లేదు..బేబీని తీసేయాల్సి వచ్చింది అని చెబుతూ ఏడ్చేశారు. దేవుడిని దర్శించుకొని తిరిగి వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో తన కుటుంబం మొత్తం చనిపోయారని చెబుతూ కీర్తి భట్ ఎమోషనల్ అయ్యింది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పిన శ్రీసత్య అది ఫ్యామిలీకి చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పింది. తన ఫ్యామిలీ దూరమవడంతో ఓ అనాథ పాపను దత్తత తీసుకున్నానని చెప్పిన కీర్తి బిగ్‌బాస్‌కి వచ్చేముందే తన కూతుర్ని పోగోట్టుకున్నానని చెప్పింది. చివరి నిమిషంలో కూడా తన కూతురితో ఉండలేకపోయినందుకు బాధగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.ఇదిలా ఉండగా బిగ్‌బాస్ సీజన్-6 రెండో ఇంటి కెప్టెన్ కోసం కెప్టెన్సీ పోటీదారులంతా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో తమకు ఓటేయాలంటూ ఎవరి పద్ధతిలో వాళ్లు అడిగారు. అయితే ఈ ప్రక్రియలో రాజ్‌కి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుందామనే నిర్ణయానికి వచ్చారు. ఇవాల్టి ఎపిసోడ్లో రెండో ఇంటి కెప్టెన్ ఎవరో తెలియనుంది. -
బొక్కబోర్లా పడిన గీతూ... రేవంత్‌కి చేసిన అన్యాయం ఫైమాకు తగిలిందిగా
సిసింద్రీ టాస్క్ ముగిసింది. మొదటిరోజు దూకుడుగా ఆడిన గీతూ రెండోరోజు మాత్రం బోల్తా పడింది. ఆమె చేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదు. మరోవైపు తాను చేసిన దానికి రేవంత్ కావాలనే డిస్క్వాలిఫై చేశాడంటూ ఫైమా కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఈ వారం కెప్టెన్సీ కంటెడర్స్‌గా ఎవరు నియమితులయ్యారు? ఫైమా రేవంత్‌లలో ఎవరు ఎవర్ని టార్గెట్ చేశారు? అన్నది బిగ్‌బాస్ తెలుగు సీజన్-6 పదకొండవ ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ సీజన్-6లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. రెండో ఇంటి కెప్టెన్‌ని ఎంచుకోవడానికి బిగబాస్ నిర్వహించిన సిసింద్రీ టాస్కులో మొదటిరోజు ఎవరిని నిద్రలేకుండా చేసిన గీతూ తన బొమ్మ విషయంలో మాత్రం బోల్తా పడింది. తెలివిగా బొమ్మకు ఉన్న బట్టలు తీసేసి, దాన్ని స్టోర్‌రూమ్‌లో దాచిపెట్టింది. అయితే ఆమె ప్లాన్ ఫెయిలైంది. రేవంత్ ఆ బొమ్మను చూసి లాస్ట్ అండ్ ఫౌండ్ వద్ద ఉంచేయడంతో గీతూ కెప్టెన్సీ పోటాదారుల లిస్ట్ నుంచి ఔట్ అయింది. ఇక ఆ తర్వాత రేసులో ఉన్న ఇంటి సభ్యులకు రింగులో కింగ్ టాస్క్ నిర్వహించాడు బిగ్‌బాస్. ఇందులో పాల్గొన్న సభ్యులు చేతులతో కాకుండా తమకు ఇచ్చిన షీల్డుతోనే అవతలి వాళ్లని రింగునుంచి బయటకు తోసేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడల్లా ఒక్కొక్కరు యాడ్ అవుతుంటారు. చివరికి ఎవరు రింగులో మిగులుతారో వాళ్లే విజేత. ముందుగా ఆరోహి, ఫైమా బరిలోకి దిగారు. వాళ్లింకా పోటీపడుతూ ఉండగానే కీర్తి వచ్చింది. ఆ తర్వాత ఇనయా, అర్జున్ తోడయ్యారు. ముందుగా వీళ్లంతా కలిసి అర్జున్ను బయటకు తోసేశారు. ఆ తర్వాత ఫైమా కింద కూర్చోవడం, చేతులను పదేపదే ఉపయోగించడంతో సంచలక్‌గా ఉన్న రేవంత్ ఆమెను గేమ్ నుంచి డిస్క్వాలిఫై చేశాడు. దీంతో ఫైమా తనను ఆడనివ్వకుండా చేశారంటూ వెక్కివెక్కి ఏడ్చింది. అంతముందు రోజు రేవంత్ గెలవకుండా అడ్డుపడిన ఫైమాకు ఆ తర్వాతి రోజు అలాంటి పరిస్థితే ఎదురు అయ్యింది. అయితే ఆమె మాత్రం రేవంత్ కావాలనే ఇలా చేశారండూ కీర్తితో చెప్పి వాపోయింది. ఆ తర్వాత కీర్తి, ఇనయాల మధ్య పోరు ఉండగా నొప్పితో కీర్తి రింగ్ నుంచి బయటకు వచ్చేసింది. చివరగా ఇస్క్రీం టైం అనే టాస్క్‌లో స్క్రీన్‌లో చూపించినట్లుగా కరెక్ట్‌గా ఐసీక్రీం షేప్ పెట్టాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో రాజశేఖర్ విజేతగా నిలిచాడు. ఇక రెండో రౌండ్లో ఆర్జే సూర్య గెలిచాడు. మొత్తానికి సిసింద్రీ టాస్క్ ముగిసేసరికి చంటి, ఇనయ, రాజ్(రాజశేఖర్), సూర్యలు ఈవారం కెప్టెన్నీ కంటెండర్లుగా నిలిచారు. మరి వీరిలో ఈవారం ఇంటి కెప్టెన్‌గా ఎవరు గెలుస్తారన్నది చూడాల్సి ఉంది. -
బిగ్‌బాస్-6 కెప్టెన్సీ పోటీదారుల కోసం సిసింద్రీ టాస్క్
బిగ్‌బాస్ సీజన్-6 రెండోవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. దీంతో కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్ సిసింద్రీ టాస్క్ నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటిసభ్యులకు కంటెండర్‌షిప్ ఒక బేబీ రూపంలో లభిస్తుంది. బేబీ బాగోగులు చూసుకుంటూనే సమయానుసారం బిగ్‌బాస్ కొన్ని ఛాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది. అసలే ఓసీడీ ఉన్న గీతూకి బేబీ డైపర్ మార్చమని ఆదేశం రావడంతో ఇంటిసభ్యులంతా ఆమెకు మరిన్ని డైరెక్షన్స్ ఇస్తూ జోకులేస్తుంటారు. ఇక గేమ్ విషయానికి వస్తే.. ఈ టాస్కులో గోనెసంచులతో నడుస్తూ బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశం మేరకు టాస్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా టాస్కులో విజేతగా గెలిచిన వారు ఇంటి కెప్టెన్‌గా నియమించబడతారు. ఈ గేమ్‌లో చలాకీ చంటీ, ఫైమాలతో రేవంత్‌కి గొడవ జరిగినట్లు ప్రోమోను బట్టి అర్థమవుతుంది. 'గేమ్ పోతేపోనీ కానీ, ఒకల్ని ఓడగొట్టాలని చూస్తే మనమే ఓడిపోతాం కంగ్రాట్స్ చంటి అన్నా' అంటూ రేవంత్ తన ఆవేదనని ప్రదర్శిస్తాడు. ఆ తర్వాత ఫైమాతోనూ వాదనకు దిగగా.. 'నువ్వు గెలవడానికి నేను ఆడటం ఎందుకు అన్నా' అంటూ రేవంత్‌కి అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ టాస్కులో విజేతగా గెలిచి రెండో ఇంటి కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారన్నది చూడాల్సి ఉంది. -
బిగ్‌బాస్-6 రెండోవారం నామినేషన్స్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ సీజన్-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో హౌస్‌మేట్‌కు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని బిగ్‌బాస్ తెలిపాడు. మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు? చివర్లో బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అన్నది బిగ్‌బాస్ తెలుగు సీజన్-6 తొమ్మిదో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ రెండోవారం నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేసేవారి పేరు చెప్పి వాళ్ల ఫోటో అతికించి ఉన్న కుండను బావిలో పడేయాలి. మొదటగా ఆరోహి ఆదిరెడ్డిని నామినేట్ చేస్తూ అతనితో పెద్దగా బాండింగ్ లేదని, ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయినా పర్లేదు అన్న ఉద్దేశంతో నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. దీనికి కౌంటర్‌గా హౌస్‌లో గేమ్ ఆడనివాళ్లు వెళ్లిపోవాలా లేక నీతో ర్యాపో లేదని వళ్లిపోవాలా అంటూ ఆదిరెడ్డి ప్రశ్నించాడు. అయితే ఆమెను నామినేట్ చేయకుండా మెరీనా అండ్ రోహిత్‌లను నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పాడు. అందరిదీ ఒక బుర్ర పనిచేస్తే వాళ్లది రెండు బుర్రలు పనిచేస్తున్నాయని, ఇది బిగ్‌బాస్ నిర్ణయం అయినప్పటికీ తాను వాళ్లనే నామినేట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక ఆ తర్వాత శ్రీహాన్ గలాటా గీతుని నామినేట్ చేస్తూ ‘ఈ మగాళ్లకి బుద్ధిలేదు అని అన్నావ్.. అందరూ ఏం చేశారు అంటూ నిలదీశాడు. దీంతో గీతూ తన ఉద్దేశం నిజంగా అది కాదని,ప్రతికుక్కకి ఒకరోజు వస్తుందంటే కుక్కకి ఒకరోజు వస్తుందని కాదు జస్ట్ అది స్టేట్ మెంట్’ అంటూ తనను తాను సమర్ధించుకుంది. ఇక నామినేషన్ పక్రియలో గీతూ-రేవంత్‌ల మధ్య మాటల యుద్ధం నడిచింది. నిన్ను నామినేట్ చేయాలంటేనే ఛీచీ.. అనే ఫీలింగ్ కలిగింది. నీతో మాట్లాడటం కూడా నాకు అసహ్యం.అశుద్దం మీద రాయి వేస్తే మనమీదే పడుతుంది. నీవు అలాంటిదానివే అంటూ రేవంత్ గీతూని ఉద్దేశించి మాట్లాడాడు. మొత్తంమీద రెండోవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కీర్తి, అర్జున్, గీతూశేఖర్లు రేవంత్‌ను నామినేట్ చేయగా, నేహా, చలాకీ చంటీ, సుదీప, ఆర్జే సూర్య, రేవంత్‌లు గీతూను నామనేట్ చేశారు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడన్న కారణంతో అభినయ, శ్రీ సత్యలు షానీని నామినేట్ చేశారు. తనతో రెండు రోజుల నుంచి సరిగ్గా మాట్లాడటం లేదని, కనీసం చూసి నవ్వడం లేదన్న సిల్లీ రీజన్‌తో వసంతి ఫైమాను నామినేట్ చేసింది. చివర్లో కెప్టెన్ అయిన కారణంగా ఇద్దరిని డైరెక్ట్ నామినేట్ చేయాల్సిందిగా బాలాదిత్యకు బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో మీరు బయటకు వెళ్లరనే నమ్మకంతో షానీ, రాజశేఖర్‌లను నామినేట్ చేస్తున్నట్లు బాలాదిత్య తెలిపాడు. మరి ఈ వారం నామినేట్ అయిన రేవంత్, గీతూ, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి,రాజశేఖర్,మెరీనా అండ్ రోహిత్, షానీలలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. -
బిగ్‌బాస్-6 రెండోవారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే..
బిగ్‌బాస్-6 ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్ అని ఏ ముహూర్తాన నాగార్జున అన్నాడో కానీ హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. ఈ సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే అలకలు, గొడవలతో ఆడియెన్స్‌కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందుతుంది. గత సీజన్లతో పోలిస్తే నామినేషన్ ప్రక్రియలో మార్పులు చేసిన బిగ్‌బాస్ ఈసారి ఇంటిసభ్యులకు నామినేట్ చేయడానకి ఒక ఓటు మాత్రమే లభిస్తుందని ఆదేశించాడు. దీంతో అసలు రచ్చ మొదలైంది. హౌస్‌లో అందరితో ర్యాపో ఉంది కానీ మీతో లేదు అంటూ ఆరోహి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. దీనికి కౌంటర్‌గా ఇంట్లో గేమ్ ఆడనివాళ్లు వెళ్లిపోవాలా లేక నీతో ర్యాపో లేదని వెళ్లిపోవాలా అని ఎదురు ప్రశ్న విసిరాడు. ఆట విషయంలో కూడా మీకంటే బెటర్‌గానే ఆడుతున్నానంటూ ఆదిరెడ్డి పేర్కొనగా ఆరోహి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి ఏం ఇరగదేశారని అంత ఆశ్చర్యపోతున్నారు అంటూ ఆదిరెడ్డి గట్టిగా బదులిచ్చాడు. ఇక బిగ్‌బాస్ డిసీషన్నే నామినేట్ చేస్తున్నా అంటూ మెరీనా అండ్ రోహిత్‌లను కూడా నామినేట్ చేశాడు. మరోవైపు రేవంత్-కీర్తి భట్ల మధ్య కూడా వాగ్వాదం నడిచింది. ఇక సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం..రేవంత్, శ్రీ సత్య, షానీ, ఫైమా, మెరీనా అండ్ రోహిత్, ఆదిరెడ్డి, గీతూ, అభినయలు నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. -
ఇదెక్కడి తిక్కల్ది..మెచ్యూర్డ్‌గా ప్రవర్తించు.. గీతూ,రేవంత్‌లకు నాగ్ క్లాస్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులేంటో చెప్పి, వారి ఆట తీరు ఎలా ఉంది? ఎలా మార్చుకుంటే బాగుంటుంది? తదితర విషయాలను చెప్పడానికి బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. హోస్ట్‌గా తనకున్న అనుభవంతో 21 మంది ఆట తీరును చక్కగా వివరించాడు.అంతేకాకుండా వారి లోపాలను తనదైన శైలీలో ఎత్తిచూపాడు. ఎలిమినేషన్లో ఉన్న ఏడుగురి ఇంటి సభ్యుల నుంచి ఇద్దరిని సేఫ్ చేశాడు కూడా. ఆ ఇద్దరు ఎవరు? ఇంటి సభ్యులను నాగ్ ఇచ్చిన సలహాలు ఏంటి? ఎవరికి మెచ్చుకున్నాడు? ఎవరిని తిట్టాడు? ఏడో ఎపిసోడ్ హైలెట్స్‌లో చదివేయండి హోస్ట్ నాగార్జున స్టేజ్ మీదకు రాగానే ఆనందం వ్యక్తం చేశాడు. దానికి కారణంగా ఈ సారి బిగ్‌బాస్ వీకెండ్ షోకి ఆడియన్స్ కూడా వచ్చారు. కరోనా కాలంగా గతేడాది ఆడియన్స్‌ని తీసుకురాలేకపోయామని, ఈ సారి రావడం చలా హ్యాపీగా ఉందని చెప్పాడు. అలాగే గీతూని జైలు పెట్టడం కరెక్టేనా అని ఆడియన్స్ ఒపినియన్ అడిగాడు. వారిలో ఎక్కువ శాతం ఇంటి సభ్యులు చేసిన పని మంచిదేనని చెప్పారు. ఇక కంటెస్టెంట్స్‌ని పలకరించిన నాగ్..ఒక్కొక్కరి ఆట తీరు, చేసిన తప్పులు వివరిస్తూనే... ఆటను ఇంకెలా మెరుగుపరుచుకోవాలో పలు సూచనలు ఇచ్చాడు. సింగర్ రేవంత్ ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నాడని, వాటిని తగ్గించుకోవాలని చెప్పాడు. అలాగే మెచ్యూర్డ్‌గా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక గలాట గీతు ఆట తీరును మెచ్చుకుంటూనే.. ఆమె మాట తీరును తప్పుపట్టాడు. ముఖ్యంగా బాత్రూంలోని హెయిర్ గురించి గీతూ చేసిన గోలను తప్పుపట్టాడు. నువ్వు చెప్పిన విషయం మంచిదే కానీ విధానం మంచిగా లేదన్నాడు.‘పదే పదే ఇనయాను తిక్కదానా? అనడం బాగా లేదు. నువ్ అలా పదే పదే తిక్కల్దానా అని అంటే.. నువ్ తిక్కల్దానివి అని జనాలు అనుకుంటారు’ అని నవ్వుతూనే చెప్పాల్సిన విషయం చెప్పేశాడు. అయితే గీతూ మాత్రం ఆ విషయాలను పెద్ద సీరియస్‌గా పట్టించుకోకపోవడమే కాకుండా...అవును సర్ నాకు కాస్త తిక్క ఉందిని రివర్స్ కౌంటర్ వేసింది. అప్పుడు నాగార్జున ‘శుభ్రత గురించి అన్ని మాటలు చెప్పావ్ కదా.. టిష్యూలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావ్.. మనం చెప్పే మాటలను మనం పాటించాలి.. సంబంధం లేని విషయంలో దూరితే జైల్లో వేస్తారు’అని అనడంతో ఇంటి సభ్యులంతా ఘోల్లున నవ్వారు. నిన్న జరిగిన గేమ్‌లో సంచాలకురాలిగా వ్యవహరించిన ఫైమాపై నాగ్ ప్రశంసలు కురిపించారు. ‘ఫస్ట్ వీక్‌లోనే బెస్ట్ సంచాలక్‌గా నిరూపించావు. ప్రతివారం నాతో ఇలాగే ఫేమస్ ఫైమా అనిపించుకోవాలి’ అని చెబుతూనే.. బల్లితో ఆమె పోల్చుకోవడం నచ్చలేదని చెప్పాడు. బిగ్‌బాస్ క్యూట్ కపుల్ రోహిత్, మెరీనాలను ఆట తీరు బాగుందని చెప్పాడు. ఇక రోహిత్ తనతో టైమ్ స్పెండ్ చేస్తలేడని, హగ్ ఇవ్వడం లేదని వాపోతున్న మెరీనా బాధను నాగ్ అర్థం చేసుకొని దగ్గరుండి మరీ హగ్ ఇప్పించాడు. ఆదిరెడ్డిని రివ్యూలు ఇవ్వడం మానేసి ఆట ఆడమంటూ సలహాలు ఇచ్చాడు. కొరియోగ్రఫీలోనే కాదు ఫ్రెండ్షిప్ చేసుకోవడంలోనూ అంతే ఫాస్ట్‌గా ఉండాలని అభినయశ్రీకి చెప్పాడు. కీర్తి భట్ ఆట తీరు బాగుందని, అయితే ఎవరో చెప్పారు కదా అని శ్రీహాన్‌ని బ్రో అని పిలవొద్దని, నీకు నిజంగా అనిపిస్తేనే అలా పిలవమని చెప్పాడు. అర్జున్ కల్యాణ్‌ని బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు. గీతూతో మాట్లాడిన తీరు.. రేవంత్‌ని పక్కకి తీసుకెళ్ల మాట్లాడడం బాగుందని చెప్పాడు. అదే సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఏదైనా ఉంటే వాళ్ల ముందే మాట్లాడలని,వెనకాల వద్దని సలహా ఇచ్చాడు. ఇక సూర్య గురించి మాట్లాడుతూ.. ‘నీ ఆట తీరు బాగుంది. ఎవరికి ఆకలి వేసినా ఇబ్బంది పడకుండా వండుకొని తీసుకొచ్చి తినిపిస్తున్నావ్. ఇలా ఉండాలి’అని మెచ్చుకున్నాడు.వీరితో పాటు మిగిలిన ఇంటి సభ్యుల తప్పొప్పులను కూడా నాగ్ వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఎలిమినేషన్లో ఉన్న ఏడుగురిలో నుంచి మొదటగా శ్రీసత్య, తర్వాత చంటీలను సేవ్ చేశాడు. ఇక మిగిలిన ఐదుగురిలో అంటే..రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనయా సుల్తానా, అభినయశ్రీ లలో ఎవరు బయటకు వెళ్తారనేది రేపటి(ఆదివారం) ఎపిసోడ్లో తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఓటింగ్ ప్రకారం.. ఆరోహి, ఇనయా సుల్తానా డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని, బయటకు వెళ్లేందుకు ఇనయాకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్-6: వారిద్దరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?
బిగ్‌బాస్ సీజన్-6 రోజురోజుకి రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్స్ కంటే ఈసారి నామినేష్స్ ప్రక్రియలో కాస్తంతా మార్పులు చేశారు బిగ్‌బాస్ టీం. ఇక ఈ సీజన్లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నదానిపై నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈసారి నామినేషన్స్‌లో రేవంత్,ఫైమా, చంటి, శ్రీసత్య, ఆరోహి, ఇనయా సుల్తానా, అభినయలు ఉండగా వీరిలో హౌస్ నుంచి బయటకు వెళ్లేది ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అందరి కంటే అత్యధికంగా సింగర్ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది. హౌస్మేట్స్ టార్గెట్ చేసినట్లు బయట ప్రొజెక్ట్ అవడంతో రేవంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయని టాక్. ఇక రేవంత్ తర్వాత ఫైమా,శ్రీసత్య, చంటిలకు ఎక్కువ ఓట్స్ వచ్చినట్లు సమాచారం. ఇక డేంజర్ జోన్లో అభినయ, ఇనయా సుల్తానా, ఆరోహి రావ్లు ఉన్నారు. వీరిలో అభినయతో పోలిస్తే ఇనయా, ఆరోహి రావ్‌లకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈవారం బిగ్‌బాస్ నుంచి ఇనయా, ఆరోహి రావ్లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈవారం ఆరోహి హౌస్‌కి గుడ్‌బై చెప్పనుందని లీకువీరులు ఇప్పటికే లీక్ చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. చదవండి: బిగ్‌బాస్-6 మొదటి కెప్టెన్‌గా మిస్టర్ కూల్.. జైలుకు వెళ్లిన గీతూ -
బిగ్‌బాస్-6 మొదటి కెప్టెన్‌గా మిస్టర్ కూల్.. జైలుకు వెళ్లిన గీతూ
బిగ్‌బాస్ సీజన్-6 మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య గెలిచాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా నీళ్లలొ వేసిన తాళం చెవిని నోటితో తీసి, వాటితో బాక్సులను ఓపెన్ చేసి, అందులో ఉన్న కారు నెంబర్ ను చూడాలి. ఆ నెంబర్ ప్లేటులోని అక్షరాలు, నెంబర్లను వెతికి కార్లకు అతికించాలి. ఈ టాస్కులో మెరీనా అండ్ రోహిత్, నేహా చౌదరి, గీతూ రాయల్,బాలాదిత్య, ఆర్జే సూర్య, ఆదిరెడ్డిలు పోటీపడగా చివరికి బాలాదిత్య విజేతగా నిలిచాడు. ఇక ఆ తర్వాత ఇంట్లో అసలు రచ్చ మొదలైంది. ఈ కెప్టెన్సీ టాస్కులో వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఇందులో రేవంత్ గీతూని నామినేట్ చేయాలనుకున్నట్లు భావించినా ఆమెకు పీరియడ్స్ కావడంతో జైలుకు పంపడం ఇష్టం లేదని, దీంతో ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. ఇక సుదీప గీతూకి గట్టిగానే ఇచ్చిపడేసింది. ‘నాకు నచ్చినట్టు నేనుంటా, నేను నా ఇంట్లో ఉండే ఎవరూ ఒప్పుకోరు’ అని చెప్పి ముఖంపై రెడ్ మార్క్ వేసింది. చలాకీ చంటి కూడా గీతూకే ఓటేశారు. ఆ తర్వాత రాజశేఖర్, ఇనయా. శ్రీసత్య, ఆరోహి, ఆర్జే సూర్య, వాసంతి, నేహా, మెరీనా జంట, అర్జున్‌లు గీతూకే వరస్ట్ పెర్ఫార్మర్గా ఓటేశారు. అయితే గీతూ మాత్రం తను చేసిందే కరెక్ట్ అంటూ సమర్థించుకుంది. అంతేకాకుండా గేమ్ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నానని, ఇంట్లో ఒకవేళ తన పేరెంట్స్‌ని తీసుకొచ్చినా వాళ్లని వెనక్కినెట్టి తాను గెలవాలని కోరుకుంటానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌లో ఉన్నంతమాత్రానా మీరంతా నా ఫ్యామిలీ కాదు. జస్ట్ కో పార్టిసిపెంట్స్ అంటూ ఇతర కంటెస్టెంట్లని ఉద్దేశించి గీతూ తన ఓపీనియన్ చెప్పింది. ఇక హస్మేట్స్లో దాదాపు ఎక్కువ ఓట్లు గీతూకే వచ్చినందుకు చివరికి ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమెకు పీరియడ్స్ ఉండటంతో ఈ ఒక్కసారికి ఆమెను క్షమించాలని బాలాదిత్య రిక్వెస్ట్ చేసినా బిగ్‌బాస్ నుంచి ఆదేశాలు రాకపోవడంతో గీతూని జైలుకి పంపారు. -
క్యారెక్టర్ చంపుకోలేను, ఈ నిమిషమే పంపించేయండి: రేవంత్
బిగ్‌బాస్ అంటేనే కొట్లాట అన్నట్లు ఉంది ప్రస్తుతం హౌస్ పరిస్థితి. నామినేషన్స్‌ను అందరూ లైట్ తీసుకున్నా రేవంత్ మాత్రం బాగా హర్ట్ అయినట్లు కనిపించాడు. అవును మ హౌస్‌లో అతడికే కదా ఎక్కువ నామినేషన్ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఆ ఫ్రస్టేషన్‌ను ఈరోజు కూడా కొనసాగించడంతో అందరితో గొడవలు పడ్డాడు. తన వాదన కరెక్ట్‌గానే ఉన్నా సీరియస్‌గా చెప్పడంతో అతడే ఏదో తప్పు చేస్తున్నట్లు చూశారు మిగతా హౌస్మేట్స్. మరి ఈ రోజు హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయి? ఎవరు ప్లాన్‌గా గేమ్ ఆడుతున్నారు? అనేది బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లోని ఐదో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ఆరోహి తనను బాడీ షేమింగ్ చేసిందని కన్నీళ్లు పెట్టుకుని మరీ చెప్పింది మెరీనా. ఈరోజుమాత్రం నిజానిజాలేంటో ఆరా తీసిన తర్వాత తన మాటను వెనక్కు తీసుకుంది. తను మాట్లాడినదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అందరి ముందు క్లారిటీ ఇచ్చింది. ఇక రేవంత్ పరిస్థితి చూసిన గీతూ అతడి మీద జోకులేసింది. 'ఆయన మరీ అమాయకంగా ఉన్నాడు. ఆయన ఎంత త్వరగా వెళ్లిపోతే ఆయనకే మంచిది. మారేట్లు కూడా అనిపించడం లేదు' అని అభిప్రాయపడింది. భార్యాభర్తలైన మెరీనా-రోహిత్ ఎప్పటిలాగే గొడవపడ్డారు. రోహిత్ తనతో కాసేపు వాకింగ్ చేయమంటే పట్టించుకోకుండా శ్రీసత్యతో వెళ్లిపోయాడంటూ గొడవకు దిగింది మెరీనా. నా భర్తతో నేను వాకింగ్ చేయొద్దా అంటూ రాద్ధాంతం చేసి రచ్చ చేసి ఏడ్చి ఇదంతా ప్రాంక్ అనేసింది. కానీ అప్పటికే అదంతా నాటకం అని మిగతా హౌస్‌మేట్స్‌కు అర్థమవడంతో ఆ ప్రాంక్ పెద్దగా పేలలేదు. ఎవరేం చేస్తున్నారా? అని అందరి మీద ఓ కన్నేసిన చంటి.. గీతూ సరిగా పని చేయదు, కానీ పక్కనోళ్లకు మాత్రం పని చెప్తుందని అసహనానికి లోనయ్యాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులను రెండు టీమ్స్‌గా విడిపోమని చెప్పి డీస్నీ హాట్‌స్టార్ గేమ్ ఆడించాడు. ఇందులో సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఆరోహి, రేవంత్, పింకీ, మెరీనా, రోహిత్, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి, వాసంతి, షని.. A టీమ్ కాగా మిగతా వారంతా B టీమ్‌లో ఉన్నారు. B టీమ్ తరపు నుంచి ఆడేందుకు నేను వెళ్తానంటే నేను వెళ్తానని ఆరోహి, రేవంత్ పోటీపడ్డారు. చివరికి ఆరోహి పోటీలో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే ఈ గేమ్‌లో B టీమ్ గెలవడంతా వారు స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు. A టీమ్ సభ్యుడైన రేవంత్ మాత్రం డిసప్పాయింట్ అయ్యాడు. రెండుసార్లు నేను వెళ్తానంటే కూడా వినిపించుకోకుండా ఆరోహి వెళ్లిందని, చివరికి గేమ్ ఓడిపోయామని చిటపటలాడాడు. అతడి మాటలతో హర్ట్ అయిన ఆరోహి నాతో మాట్లాడకు అంటూ వేలెత్తి చూపించి పౌరుషంగా అక్కడినుంచి వెళ్లిపోయి బోరుమని ఏడ్చేసింది. ఇదెక్కడి గోలరా బాబు, ఇప్పుడేమన్నానని ఇంత సీన్ అనుకున్న రేవంత్ కెమెరా ముందుకెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. 'నా వల్ల ప్రాబ్లమ్ అనుకుంటే నన్ను పంపించేయండి. అంతేకానీ ఇలా నటిస్తూ ఒకర్ని సంతోషపెట్టడం కోసం నా క్యారెక్టర్‌ను నేను చంపుకోలేను. ఇక్కడ చాలామంది గ్రూప్‌గా ఆడుతున్నారు. నేను సింగిల్‌గా ఆడతా, ఎన్నిరోజులైనా ఆడతా. ఇంత సిన్సియర్ పీపుల్ మధ్య నేను అర్హుడిని కాదేమో, ఈ నిమిషమే నన్ను పంపించేయండి. ఇలా యాక్ట్ చేస్తూ బతకడం రాదు' అని చెప్పాడు. కానీ రాత్రయ్యేసరికి ఆరోహి రేవంత్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. అయినా వీరి గొడవ సద్దుమణిగినట్లు కనిపించలేదు. ఫ్రస్టేషన్ పీక్స్‌లో ఉన్న రేవంత్ తన మనసులో ఉన్న ఆవేశాన్ని బయటకు కక్కుతూ.. నేనేంటో చూపిస్తా అన్నాడు. ఆ పాయింట్ పట్టుకున్న ఆదిరెడ్డి వెంటనే మధ్యలో దూరి ఇక్కడ అందరూ సమానమే అని వాదనకు దిగుతూ రేవంత్‌ను రెచ్చగొట్టినట్లు అనిపించింది. . దీంతో రేవంత్ నేనేం సోషల్ మీడియా నుంచి రాలేదు అని నోరు జారాడు. అంటే సోషల్ మీడియా నుంచి వచ్చినవాళ్లు చులకనగా కనిపిస్తున్నారా? అని ఆదిరెడ్డి ప్రశ్నించాడు. అలా వీరి గొడవ పెద్ద జడివానలా మారేట్లు ఉందని గ్రహించిన శ్రీహాన్ రేవంత్‌ను హౌస్‌లోకి తీసుకెళ్లాడు. ఇక ఈరోజంతా గొడవలు పడి మైండ్ హీటెక్కిన రేవంత్‌ను పెదరాయుడు బాలాదిత్య ఎప్పటిలాగే అతడిని కూర్చోబెట్టుకుని నాలుగు మంచి మాటలు చెప్తూ అతడి మైండ్ కూల్ చేశాడు. చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో కూలీ పనులకు వెళ్లేదాన్ని ట్విస్ట్, ఒక్కరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవుతారట -
రేవంత్ త్వరగా ఎలిమినేట్ అవ్వాలి: గీతూ
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే బిగ్‌బాస్ ఆరో సీజన్ 21 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. షో ఇలా మొదలైందో లేదో అప్పుడే గొడవలు షురూ అయ్యాయి. ఆర్జీవీ హీరోయిన్ ఇనయ సుల్తానా ఎక్కువగా వాదనలకు దిగుతూ కనిపిస్తుండగా గీతూ ఛాన్స్ దొరికితే చాలు అందరినీ చెడుగుడు ఆడేసుకుంటోంది. ఆది, చలాకీ చంటి ప్రస్తుతానికైతే కామ్‌గా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. మిగతా హౌస్మేట్స్ కూడా ఇప్పుడిప్పుడే ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి రోజు నుంచే సింగర్ రేవంత్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాడు. తన మాట వినాలన్న ధోరణి అతడిలో ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ఇదే మిగతా కంటెస్టెంట్లకు నచ్చడం లేదు. వెరసి నామినేషన్లో అందరూ మనసులో ఉన్నదంతా కక్కేశారు. ఫలితంగా అందరికంటే ఎక్కువగా రేవంత్‌కు ఎనిమిది ఓట్లు పడ్డాయి. అయినా అతడికున్న పాపులారిటీతో ఈ గండాన్ని ఈజీగా దాటేస్తాడు. అతడి అత్యుత్సాహాన్ని కాసేపు పక్కనపెడితే రేవంత్ ఎందుకో ప్రతిదానికీ తెగ ఎమోషనల్ అవుతున్నాడు. అప్పుడే గట్టిగా మాట్లాడతాడు, అంతలోనే సైలెంట్ అయిపోతాడు, ఎవరికీ కనిపించకుండా బాత్రూం ఏరియాలోకి వెళ్లి ఏడ్చేస్తాడు. అతడి ప్రవర్తనే ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. తాజాగా రిలీజైన ప్రోమోలో కూడా అతడే హైలైట్ అయ్యాడు. 'నామినేషన్లోకి రావడం పాపం కాదు, జనాలు నిన్నేమీ బూతులు తిట్టుకోరు' అంటూ నామినేషన్స్ హీట్ నుంచి రేవంత్‌ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆదిత్య. అయితే గీతూ మాత్రం ఆయన ఎంత త్వరగా బయటకు వెళ్తే ఆయనకే మంచిది అని వేదాంతం పలికింది. ఆయన కనక హౌస్‌లో ఇదే బిహేవియర్‌తో కొనసాగితే మాత్రం జనాలు.. ఇంత పెద్ద సింగర్, ఇట్ల చేస్తున్నాడేంది అనుకోవడం ఖాయం అని అభిప్రాయపడింది. మరి రేవంత్ తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుని గేమ్‌పై ఫోకస్ పెడ్తాడా? లేడా? అనేది చూడాలి! చదవండి: చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది: యాంకర్, నటి లైగర్ ఎఫెక్ట్: అద్దె ఇల్లు ఖాళీ చేసిన పూరీ -
ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్, ఒక్కరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవుతారట!
ఏదైనా కొత్తదనం చూపించాలనుకున్నాడో మరేంటో కానీ బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్‌ను ఏకంగా సోమవారం నుంచి బుధవారానికి మార్చేశాడు. మరి ఈ మూడు రోజుల్లో కంటెస్టెంట్లకు ఏమాత్రం ఓట్లు పడతాయో తెలీదు కానీ కచ్చితంగా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఇంతకీ లేడీ కంటెస్టెంటే ఎందుకు ఎలిమినేట్ అవుతుంది? అసలు ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు? అనేది బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోని నాలుగో ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి.. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు ఇచ్చిన క్లాస్.. మాస్.. ట్రాష్ నిన్నటితోనే ముగిసింది. ట్రాష్‌లో ఉన్న ఆదిత్య, ఇనయ, అభినయ శ్రీ నేరుగా నామినేట్ అయ్యారు. క్లాస్ టీమ్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా ఈవారం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. మాస్ టీమ్‌లో ఉన్న మిగతా సభ్యులు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. జంటగా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్ జంటగానే నామినేషన్లోకి వెళ్తారని, ఒకవేళ ఎలిమినేట్ అయినా ఇద్దరూ కలిసే బయటకు వెళ్తారని స్పష్టం చేశాడు. గతంలో వరుణ్-వితిక దంపతులు హౌస్‌లో అడుగుపెట్టినా ఎవరి ఆట వారే ఆడుకున్నారు, ఎవరి నామినేషన్ వారే చేసుకున్నారు. బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు విడివిడిగానే వెళ్లిపోయారు. మరి ఈసారి ఎంట్రీ ఇచ్చిన కపుల్‌కు బిగ్‌బాస్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడంటే ఈ సీజన్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండేట్లు కనిపిస్తోంది. ఇకపోతే బిగ్‌బాస్ షోలో మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. వేస్ట్ కంటెస్టెంట్లు అనుకునేవాళ్ల పేర్లను పేపర్‌పై స్టాంప్ చేసి, దాన్ని ఫ్లష్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా రేవంత్ మాట్లాడుతూ.. పని చేయడానికి ముందుకు రావట్లేదంటూ ఫైమా, ఆరోహి రావులను నామినేట్ చేశాడు. తాను నిద్రపోయినప్పుడు కిచకిచమంటూ సూర్యతో ముచ్చట్లు పెడుతూ తన నిద్ర డిస్టర్బ్ చేసిందని ఆరోహిపై ఆరోపణలు గుప్పించాడు. దీనికి ఆ యాంకర్ స్పందిస్తూ.. ఆరోజు మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు మీదగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పానని, అనవసరంగా నన్ను బద్నాం చేయకండి అని గట్టిగానే కౌంటరిచ్చింది. కీర్తి భట్ మాట్లాడుతూ.. తనకు, శ్రీహాన్‌కు మధ్య ఉన్న బంధంపై రేవంత్ జోక్ చేశాడని, దీంతో శ్రీహాన్‌ను చోటు భయ్యా అని పిలవాల్సి వచ్చిందని చెప్పింది. తనలా చేయడం వల్ల శ్రీహాన్ సరిగా మాట్లాడటమే మానేశాడని వాపోయింది. మరోవైపు పనుల్లో ఇన్వాల్వ్మెంట్ లేదని చంటిని నామినేట్ చేసింది. తర్వాత ఆరోహి వంతు రాగా అత్యుత్సాహంతో మీకు తెలీకుండానే అందరినీ హర్ట్ చేస్తున్నావంటూ రేవంత్‌ను, నేను ప్రేమగా శ్రీసత్య అని చాలాసార్లు పిలిచాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదంటూ శ్రీసత్యను నామినేట్ చేసింది. శ్రీసత్య వంతు వచ్చేసరికి.. నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనుషులతో మాట్లాడటం మానేశా. అందులోనూ కొత్తవాళ్లతో మాట్లాడటానికి టైం పడుతుంది. ముఖ్యంగా తనకు యాటిట్యూడ్ లేదని స్పష్టం చేస్తూ వాసంతి, రాజశేఖర్‌ను నామినేట్ చేసింది. అనంతరం సుదీప.. రేవంత్, చంటిని; ఫైమా.. రేవంత్, అర్జున్‌లను; అర్జున్.. ఫైమా, ఆరోహిలను; రాజశేఖర్.. వాసంతి, శ్రీ సత్యలను; షాని.. శ్రీసత్య, చంటిని; శ్రీహాన్.. రేవంత్, కీర్తిని; సూర్య.. రేవంత్, చంటిని; చంటి.. రేవంత్, సుదీపను; వాసంతి.. రేవంత్‌ను, యాటిట్యూడ్ చూపిస్తుందని శ్రీ సత్యను నామినేట్ చేసింది. మెరీనా- రోహిత్ దంపతులు.. ఫైమా, చంటిని నామినేట్ చేశారు. అనంతరం మెరీనా మాట్లాడుతూ.. నేను కిచెన్‌లో వంట చేస్తున్నప్పుడు ఆరోహి.. నేను మెరీనా కన్నా తక్కువ సైజ్ అని ఎవరితోనో చెప్పింది. నాకు బాడీ షేమింగ్ నచ్చదంటూ ఎమోషనలైంది. అయితే అసలు తను ఆ మాట అనలేదని ఆరోహి బలంగా చెప్పినప్పటికీ మెరీనా వినిపించుకోలేదు. నామినేషన్ ప్రక్రియ ముగిసేసరికి అందరికన్నా అత్యధికంగా రేవంత్‌కు 8 ఓట్లు పడటం గమనార్హం. నామినేషన్స్ తంతు ముగిసిందనుకునే సమయానికి చివర్లో బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ట్రాష్లోని సభ్యులొకరు మాస్ టీమ్ మెంబర్‌తో స్వాప్ అవ్వొచ్చని చెప్పాడు. దీంతో బాలాదిత్యను సేఫ్ చేసి ఆ స్థానంలోకి ఆరోహిని పంపించారు. ఫైనల్‌గా మొదటి వారం రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనయ, ఆరోహి, అభినయశ్రీ ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. చదవండి: బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు ఒప్పుకోలేదు -
Bigg Boss 6: అతడు సేఫ్, నామినేషన్లో ఏడుగురు!
ఇప్పటిదాకా ఒక లెక్క... ఇప్పుడింకో లెక్క అంటున్నాడు బిగ్‌బాస్. గతంలో బిగ్‌బాస్ మొదలైన మొదటి రోజే నామినేషన్స్ జరిగేవి. కానీ ఈసారి మాత్రం టాస్కులిస్తూ, ఆడిస్తూ ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించాడు. క్లాస్.. మాస్.. ట్రాష్ టాస్క్ ముగిశాక ట్రాష్ టీమ్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయ సుల్తానా నేరుగా నామినేషన్లోకి వచ్చారు. అయితే బిగ్‌బాస్ ఈరోజు ప్రతి ఒక్క ఇంటిసభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాలని ఆదేశించాడు. ఇదివరకే రిలీజైన ప్రోమోలో అయితే సింగర్ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే బాలాదిత్య నామినేషన్లో నుంచి సేఫ్ అయ్యాడట! ఫైనల్‌గా మొదటి వారం అభినయ, ఇనయతో పాటు ఆరోహి రావు, ఫైమా, చంటి, రేవంత్, శ్రీసత్య నామినేషన్స్‌లో ఉన్నట్లు వినికిడి. ఎలాగో రేవంత్, ఫైమా, చంటి వారికున్న పాపులారిటీతో ఈజీగా ఈ గండం నుంచి గట్టెక్కడం గ్యారెంటీ. మిగిలినవారిలో ఆరోహి, ఇనయ డేంజర్ జోన్లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఉంటారు? ప్రేక్షకులు ఎవరిని పంపించేస్తారో చూడాలి! చదవండి: కపుల్ మధ్య మొదలైన చిచ్చు, అప్పుడే ఏమైంది! నామినేషన్ నుంచి తప్పించుకోలేకపోయిన ఆర్జీవీ హీరోయిన్ -
Bigg Boss 6: అతను ఆటకారి కాదు.. మాటకారి.. రేవంత్‌పై ఫైమా ఫైర్
బిగ్‌బాస్ ఆరో సీజన్లో నామినేషన్ ప్రక్రియ ఈ రోజు మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ప్రతి సీజన్లో రెండో రోజే ఇంటి నుంచి బయటకు పంపించడానికి నామినేషన్ ప్రక్రియ షురూ చేసే బిగ్‌బాస్.. ఈ సారి మాత్రం కాస్త ఆలస్యంగా ఆ పనిని మొదలు పెట్టాడు. ఇంట్లో వేస్ట్ అని భావించి ఎవరిని ఫ్లషౌట్ చేయాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా బయటపెట్టండి అని బిగ్‌బాస్ చెప్పడంతో ఇంటి సభ్యులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ నచ్చని వాళ్లని నామినేట్ చేశారు. (చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో మొగుడు పెళ్లాల కొట్లాట.. వీళ్లేం రొమాంటిక్ కపుల్ రా బాబు!) ఈ నామినేషన్ ప్రక్రియ ఫైమా, రేవంత్‌ల మధ్య గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫైమా పని చేయడం చూడలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు రేవంత్. అయితే ఫైమా మాత్రం అందుకు అంగీకరించలేదు. ‘నేను పనిచేసేటప్పుడు నువ్వు అటువైపు రాలేదేమో’ అని ఫైమా అంటే.. ‘మే బీ నేను ఇంట్లో లేనేమో.. నాకు ఆ విషయం తెలియదు’అని వెతకారంగా కౌంటర్ ఇచ్చాడు రేవంత్. ఇక అర్జున్ కల్యాణ్ కూడా పని చేయడం చూడలేదంటూ ఫైమాను నామినేట్ చేశాడు. అతనితో కూడా వాగ్వాదానికి దిగింది ఫైమా. ఇక రేవంత్‌ని నామినేట్ చేసిన ఫైమా.. ‘ఇక్కడ కొంతమంది ఆటకారులు ఉంటారు..కానీ అతను మాటకారి’అని చెప్పుకొచ్చింది. అలాగే గట్టిగా మాట్లాడితే ఆయనదే కరెక్ట్ అనుకుంటాడని చెప్పగా..‘నా వాయిసే ఇంత. మీ గురించి నా వాయిస్ మార్చుకోను’అని రేవంత్ తెగేసి చెప్పాడు. ఫైమాతో పాటు సుదీప, కీర్తిభట్, ఆరోహి కూడా రేవంత్‌ని నామినేట్ చేశారు. మరి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఎవరు నామినేట్ అయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
అన్నింటికీ ఓవరాక్షన్, వెళ్లిపో.. ఏడ్చిన రేవంత్
బుల్లితెర ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన బిగ్‌బాస్ 6 ఆట షురూ అయింది. అటు కంటెస్టెంట్లు కూడా ఎంతో ఉత్సాహంగా తమ గేమ్‌ను మొదలుపెట్టారు. ఇప్పటికే బిగ్‌బాస్ క్లాస్.. మాస్.. ట్రాష్ అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో క్లాస్వాళ్లకు అన్ని అధికారాలు ఉంటాయి. వీరికి ఇంటిసభ్యులతో ఏ పనులైనా చేయించుకునే వీలుంది. అయితే ట్రాష్‌లో ఉండే గీతూ క్లాస్‌లోకి వచ్చీరావడంతోనే ఇనయ సుల్తానాతో సపర్యలు చేయించుకుంది. వీరిని చూసి మిగతావాళ్లు తెగ నవ్వుకున్నారు. ఇకపోతే తాజాగా బిగ్‌బాస్ రెండో ఛాలెంజ్ విసిరినట్లు కనిపిస్తోంది.ఈ ఛాలెంజ్‌కు ముందో, తర్వాతో తెలీదు గానీ బాత్రూమ్ ఏరియాలో రేవంత్ ఏడుస్తూ కనిపించాడు. ఆ తర్వాత ఏం పరిస్థితి తెచ్చావు సామీ? అని కెమెరాల వైపు చూసి మాట్లాడాడు. ఎవరికి వాళ్లు మేమే లీడర్స్ అని ఫీలవుతున్నారని గీతూ అభిప్రాయపడింది. ఇక నేహా, ఇనయ ఓ గేమ్‌లో పోటీపడగా నేహా గెలిచినట్లు తెలుస్తోంది. దీంతో బాధపడ్డ ఇనయ నాకు ఎవ్వరి సపోర్ట్ లేదని అర్థమైందని చిన్నబుచ్చుకుంది. మరోవైపు రోహిత్ తాను చెప్పేది కూడా వినిపించుకోవట్లేదని భర్తపై కస్సుబుస్సులాడింది మెరీనా. వెంటనే తప్పు తెలుసుకున్న అతడు భార్యకు క్షమాపణ చెప్పాడు. అయినా ఆమె అవసరం లేదంటూ విసురుగా వెళ్లిపోయింది. దీంతో తిక్కలేచిన రోహిత్ అన్నింటికీ ఓవరాక్షన్ అంటే వెళ్లిపో అని తిట్టిపోశాడు. మరి భార్యాభర్తల అలక క్షణకాలమేనా? లేదా ఇలా గొడవలతోనే రోజంతా గడిపేస్తారా? చూడాలి! చదవండి: అది బిగ్‌బాస్ హౌసా? అమీర్‌పేట హాస్టలా: నెటిజన్ల విమర్శలు బిగ్‌బాస్ చెప్పినా చేయనంతే: గీతూ -
అడ్డంగా బుక్కై నాలుక్కరుచుకున్న సింగర్ రేవంత్
బిగ్‌బాస్ షో అంటేనే ఓ మాయాలోకం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు. అంతేకాదు, కంటెస్టెంట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారనేది కూడా ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. సాధారణంగా బిగ్‌బాస్ షోలో ఎంటరైన కంటెస్టెంట్లకు ఆ హౌస్ అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. కానీ కొందరు మాత్రం అబ్బే, ఇది మన ఇల్లే అనేట్లుగా సౌకర్యంగా ఫీలవుతున్నారు. అప్పుడే చికాకులు పడుతూ, పెడుతూ చిటపటలాడుతున్నారు. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో మొదటి రోజు ఆర్జీవీ హీరోయిన్ ఇనయ సుల్తాన, గలాటా గీతూ, సింగర్ రేవంత్ హైలైట్ అయ్యారు. కారణం గీతూ, ఇనయ గొడవపడ్డారు. అటు రేవంత్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకానొక సమయంలో కొంత బూతు మాట్లాడి ఆ వెంటనే నాలుక్కరుచుకుని సారీ చెప్పాడు. తాను వండింది నచ్చితే తినండి లేదంటే లేదంటూ చిరాకు ప్రదర్శిస్తున్నాడు. తనకసలు బిగ్‌బాస్ షో గురించి అవగాహన లేదంటూ, తోటి కంటెస్టెంట్లు ఎవరూ తెలీదంటూ ఏవేవో మాట్లాడేస్తున్నాడు. దీంతో రేవంత్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడేంటని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అతడు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాడని, బిగ్‌బాస్ ఇంట్లో సర్దుకోవడానికి కొంత టైం పడుతుందంటూ సింగర్‌ను వెనకేసుకొస్తున్నారు అతడి ఫ్యాన్స్. The more revanth speak out he will be in trouble 😵💫. He just lost His point and speaking that he doesn't know BB show , He doesn't know contestants & talking about valid points in just two days. How silly is this ?#BiggBossTelugu6 #BiggBoss6Telugu — Biggboss6 Viewer (@MSDFan145) September 6, 2022 His views are different from others. But he is not fake i think he is confused that's it.#BiggBossTelugu6 #Revanth https://t.co/uUlzG8dj1y — Sri Lakshmi (@SriLaks55746118) September 6, 2022 #SingerRevanth He should adjust to Bigboss environment ASAP. Edi just small task ante inka future lo inka kanna peddavi untai apudu edisthey nadavadhu #BiggBossTelugu6 https://t.co/LmnV3O6Cd4 — Srutzk (@Srutzk98) September 6, 2022 #Revanth ni badha enti ayya swami gelichav ga silent ga undu em matladutunnavo nikanna ardamavutunda 😂#BiggBossTelugu6 — CandC (@introvert_2608) September 6, 2022 #BiggBossTelugu6 Em cheptunav vrooo #Revanth 🙏 SriSatya correct ga cheptunte aedo cheptanav asalu 😞 — Mahesh🐰 (@mahiitweetz) September 6, 2022 Positive Opinion on #BalaAditya ninna Episode Chusaka Negative Opinion on #geeturoyal #Revanth not upto the mark #BiggBossTelugu6 — బాటసారి (@VenkatR941) September 6, 2022 చదవండి: బిగ్‌బాస్ చెప్పినా ఆ పని మాత్రం చేయను: గీతూ అమీర్‌పేట హాస్టల్లా బిగ్‌బాస్ హౌస్, పాపం కంటెస్టెంట్లు -
Bigg Boss 6: బిగ్‌బాస్ చెప్పినా ఆ పని చేయను.. గలాట గీతూ
బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్రవర్సీలు.. ఒకరినొకరు అరుచుకోవడం.అయితే ప్రతీసారి సీజన్ మొదలైన తర్వాత కనీసం వారం రోజుల తర్వాత ఈ చిచ్చు మొదలవుతుంది. కానీ ఆరో సీజన్లో మాత్రం రెండో రోజే రచ్చ మొదలైపోయింది. గలాట గీతూ, ఇనయ సుల్తానాల మధ్య ‘హెయిర్స్’వార్ జరిగింది. నీకు తిక్క అంటే నీకు తిక్క అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. గీతూకి ఓ సలహా ఇచ్చాడు బాలాదిత్య, కీర్తి భట్‌తో సూర్య పులిహోర కలపడం స్టార్ చేశాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగిందో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. పక్కా లోకల్ పాటతో నిద్రలేచారు ఇంటి సభ్యులు. అభినయ శ్రీ తన మాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇంతలోనే గలాట గీతూ బాత్రూం గొడవ మొదలుపెట్టేసింది. బాత్రూంలో ఎవరివో హెయిర్స్ ఉన్నాయని, తలస్నానం చేసినప్పుడు ఎవరి హెయిర్స్ వాళ్లే తీసి పడేయాలి, బిగ్‌బాస్ తనకు ఈ టాస్క్ ఇచ్చినా చేయనని చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై ఇనయ సుల్తానాతో గొడవ జరిగింది. నువ్వు తిక్కదానికి అంటే.. నువ్వు తిక్కదానివి అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. ఈ లొల్లిపై గీతూకు బాలాదిత్య ఓ సలహా ఇచ్చాడు. నువ్వు చెప్పిన విషయం కరెక్టే అయినా... విధానం సరిగా లేదని గీతూతో అన్నాడు. అయితే ఆ సహాలను గీతూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలోనే ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్ఇచ్చాడు. ‘క్లాస్.. మాస్.. ట్రాష్’అనే ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ మూడు భాగాలుగా విడిపోవాలి. క్లాస్‌కు విశేషాధికారాలుంటాయి. వారు ఏ పనైనా చేసుకోవచ్చు. వీఐపీ బాల్కనీ వాడుకోవచ్చు. కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం ఉంటుంది. నేరుగా నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. ఇక ట్రాష్ సభ్యులు గార్డెన్ ఏరియాలోనే వంట చేసుకోవాలి. కప్టెన్సీ పోటీదారులయ్యే అర్హత ఉండదు. నేరుగా నామినేషన్లోకి వెళ్తారు. మాస్ సభ్యులు సామాన్యులుగా ఉంటారు. వారికి ఎలాంటి అధికారాలు ఉండవు. చివరకు మాస్ సభ్యుల్లో ముగ్గురు క్లాస్, ముగ్గురు ట్రాష్ ఉంటారు’అని బిగ్‌బాస్ ఇచ్చిన లెటర్ని చదివేసింది ఫైమా. ఆ తర్వాత ఇంటిసభ్యులు ఓటింగ్‌కి వెళ్లారు.అందులో బాలాదిత్య, శ్రీహాన్, సూర్యలు క్లాస్.. రేవంత్, గీతూ, ఇనయ సుల్తానలు ట్రాష్‌లోకి వచ్చారు. మిగిలిన అందరూ కూడా మాస్ సభ్యులు అని ఓటింగ్ లో తేల్చారు. ఇక కెప్టెన్సీలో ఎవరికి సపోర్ట్ చేయాలో వాసంతి, ఆరోహి, షానిలు చర్చించుకున్నారు. మరోవైపు వాసంతికి నాగార్జున ఇచ్చిన మూడు బ్యాడ్జీలను తనకు నచ్చిన వాళ్లకి పెట్టేసింది. హగ్ బ్యాడ్జ్ గీతూకి, పంచ్ బ్యాడ్జ్ షానీకి, కిస్ బ్యాడ్జ్ మెరినాకి ఇచ్చేసింది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో రెండో లెవల్లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ అవకాశం ఇచ్చాడు. సమయానుసారం మాస్ మరియు ట్రాష్ సభ్యులకు బిగ్‌బాస్ కొన్ని చాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో గెలిచిన వారికి ఓ తరగతి పైకి వెళ్లే అవకాశం ఉటుంది. గెలిచిన సభ్యులు వెళ్లిన తరగతి నుంచి ఒకరు స్వాప్ అయి ఒక మెట్టు కిందకు దిగుతారు. క్లాష్..మాస్..ట్రాష్’టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఏ తరగతిలో ఉంటే..వారికి ఆ తరగతిలో ఉన్న ప్రయోజనాలు లేదా నష్టాలు వర్తిస్తాయి. ప్రతి చాలెంజ్‌లో క్లాస్‌లొని ముగ్గురు సభ్యులు సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా మొదటి చాలెంజ్.. కొబ్బరి బోండాల యుద్దం అంటూ టాస్క్ ఇచ్చాడు. ఈ ఆట ఆడేందుకు ఆది రెడ్డి, ఇనయ ముందుకు వచ్చారు. ఈ గేమ్‌లో ఆదిరెడ్డి గెలిచి క్లాస్ సభ్యుడిగా మారిపోయాడు. క్లాస్ సభ్యుల్లోంచి శ్రీహాన్ మాస్ సభ్యుడిగా వచ్చాడు. ఇక కీర్తిభట్‌తో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు సూర్య. ఆమె వేసుకున్న టీషర్ట్ బాగుందని, అలాంటిదే తన వద్ద ఉందని చెప్పగా..అవునా..మరి వేసుకోవాల్సింది అని కీర్తి కౌంటర్ ఇచ్చింది. రేపు వేసుకుంటాలే అని సూర్య చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇంకేంటి పిచ్చి అని స్వీట్‌గా పిలవగా... ‘ఏమన్నావ్..’ అని కీర్తి షాకైంది.. పిచ్చి అని నేను అంటుంటాను అలా అనడం నాకు ఇష్టమని సూర్య అంటే..పిచ్చి అనేది ఫేవరేట్ వర్డ్ అంటూ కీర్తి తెగ సిగ్గు పడుతుంది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ఓడిపోయానని ఇనయ బాధ పడుతుంటే.. అభినయ శ్రీ వచ్చి ఓదార్చింది. ట్రాష్ సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మీరు ట్రాషీ కాదని చెప్పండి. గర్వించే విషయాలను, సందేశాలను మిగతా సభ్యులకు వినిపించండి. వాటిని బాటిల్‌పై రాసి స్విమ్మింగ్ పూల్‌లో వేయండి’అని బిగ్‌బాస్ చెప్పాడు. మొదటగా ఇనయ మాట్లాడుతూ.. ‘ముజబుర్ రెహ్మాన్.. మా నాన్న.. నన్ను తారగా గుర్తించాడు.. నాకు ఎక్కువ ఇష్టమైన వ్యక్తి.. తాను ఇండస్ట్రీలోకి వెళ్లాలని అనుకున్నాడు. వెళ్లాడు.. కానీ ఆర్థిక కష్టాలు., ఇంట్లో సమస్యలు.. వల్ల వెనక్కి వచ్చాడు.. మాతోనే ఉండిపోయాడు.. రెండేళ్ల క్రితం చనిపోయాడు.. డాడీ కలను పూర్తి చేసేందుకు నేను ఇండస్ట్రీకి వచ్చాను.. ఇక్కడకు రావడానికి కారణం మా డాడీనే.. పారిపోయి వచ్చాను..నేను యాక్ట్ చేయడం మా మ్మమ్మీకి ఇష్టం లేదు.. ఫుడ్ కూడా లేని స్థితి.. హాస్టల్లో అన్నంలో నీళ్లు పోసుకుని తిన్నాను.. మళ్లీ ఈ రోజు ఇక్కడ కూడా అదే గుర్తొచ్చింది..అలానే తిన్నాను. ఐ లవ్ మై డాడ్. అందరూ పిలవాలని.. ఇనయ రెహ్మాన్ అని పేరు పెట్టుకున్నాను. ఇంత పెద్ద షోలో చెబుతున్నాను.. ఐ లవ్ మై డాడ్’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది విని కీర్తిభట్ వెక్కివెక్కి ఏడ్చింది. తన గతంలో గుర్తుచేసుకొని బాగా ఎమోషనల్ అయింది. వీరిని గీతూ భయపడింది. నేను ఇప్పుడు చెప్పలేను బాబోయ్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కచ్చితంగా చెప్పాల్సిందే అనడంతో.. కొంచెం టైం కావాలని కోరింది. దీంతో రేవంత్ తన గురించి చెప్పుకొచ్చాడు. ‘నాన్న చనిపోయిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు. ఆరో తరగతి వరకు చెప్పలేదు.. బాగా చదువుకుంటే వస్తాడని అన్నారు.. ఆయన లేరనే విషయం తెలియక ముందు అమెరికా వెళ్లాలని.. మా డాడీని చూడాలని అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే అమ్మానాన్నల ప్రేమ, ప్రజల ప్రేమ’ అని అన్నాను. ఇక గీతూ మాట్లాడుతూ.. ‘సంతోషం, ఏడుపు, ప్రేమ, కోపం ఏదీ కూడా ఆపుకోలేదు.. ఈ రోజు నన్ను ఇక్క డ అందరూ ట్రాషీ అన్నారు. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను అలానే అనేవాళ్లు.. నేను ఎదుటి వాళ్లను పట్టించుకోలేదు.. నన్ను గౌరవిస్తేనే నేను గౌరవిస్తా.. మా ఊర్లో, బంధువులు అందరూ కూడా ఎవ్వరినీ కూడా నాతో మాట్లాడొద్దని అనేవాళ్లు.. అందరూ నన్ను దూరం పెట్టేశారు.. రివ్యూలు చెప్పినప్పుడు నన్ను జనాలు గుర్తించారు.. మోటివేషన్ వీడియోలు చేసినప్పుడు నాలో విషయం ఉందని గమనించారు.. జనాలు షేర్ చేశారు.. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నాను.. నా ఫాలోవర్లే వల్లే ఇంత దూరం వచ్చింది.. నాలో టాలెంట్ ఉందని, నన్ను స్టార్ అని జనాలు గుర్తించారు. నేను స్టార్ అని తెలిసిన తరువాత చాలా మంది వచ్చారు.. అంతకంటే ముందే నా ఫాలోవర్లు నాకు సపోర్ట్‌గా నిలిచారు.. సిగ్గు లేకుండా ఏడుస్తున్నా. ఏం చెప్పానో నాకు తెలియడం లేదు.. గలీజ్ గా ఉంది.’తనదైన శైలీలో చెప్పుకొచ్చింది గీతూ. మొత్తంగా ఈ ఎపిసోడ్లో గీతూ కొంచెం అతి చేసినట్లు అనిపించింది. -
త్వరలో తండ్రి కాబోతున్న సింగర్ రేవంత్.. స్టేజ్‌పై ఎమోషనల్
సింగర్ రేవంత్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. బాహుబలి చిత్రంలోని మనోహరీ.. పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న రేవంత్ 2017లో ఇండియన్ ఐడల్-9లో పాల్గొని టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-6లో 21వ కంటెస్టెంట్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వెళ్లేముందు ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకున్న రేవంత్ ముఖ్యంగా తన భార్యను మిస్ అవుతున్నట్లు ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. రేవంత్‌కి ఇటీవలె అన్విత అనే అమ్మాయితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు అన్వితతో కలిసి ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేస్తుంటారు రేవంత్. అయితే ప్రస్తుతం రేవంత్ భార్య అన్విత ఆరు నెలల గర్భంతో ఉంది. ఇలాంటి సమయంలో తన పక్కన లేకుండా బిగ్‌బాస్‌లోకి వెళ్లడం కొంచెం బాధగా ఉందంటూ రేవంత్ స్టేజ్‌పైనే ఎమెషనల్ అయ్యాడు. కాగా రేవంత్ భార్య అన్విత కూడా షోలో కనిపించి భర్తకు బెస్ట్ విషెస్ తెలిపింది. ఇక రేవంత్ త్వరలోనే తండ్రి కానుండటంతో సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులకు నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ కామెంట్స చేస్తున్నారు. -
మంచి ప్లే బాయ్ అట? మా ఆవిడ చూస్తుంది సర్: రేవంత్
Singer Revanth In Bigg Boss 6 Telugu: సింగర్ రేవంత్.. బిగ్‌బాస్-6 లో 21వ, చివరి కంటెస్టెంట్‌గా రేవంత్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. రావడంతోనే నువ్వు మంచి ప్లే బాయ్ అటకదా అని నాగార్జున అడగ్గా.. ఈ షో తన భార్య చూస్తుందంటూ ఫన్నీగా బదులిచ్చాడు రేవంత్. ముఖ్యంగా తన భార్యను మిస్ అవుతున్నానని చెప్పిన రేవంత్ ప్రస్తుతం ఆమె 6నెలల గర్భంతో ఉన్నట్లు తెలిపాడు. దీంతో స్టేజ్‌పైకి రేవంత్ భార్యను పిలిచి సర్ప్రైజ్ చేశారు కింగ్ నాగార్జున. ఇదిలా ఉండగా బాహుబలిలోని మనోహరీ.. పాటతో పాపులారిటీ దక్కించుకున్నాడు. శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్ బుల్లితెరపై పలు మ్యూజిక్ కాంపిటీషన్స్‌లో పాల్గొన్నాడు. 2017లో సోనీ మ్యూజిక్ చానల్ నిర్వహించే ప్రముఖ పోటీ ఇండియన్ ఐడల్-9లో పాల్గొనడమే కాకుండా టైటిల్ విన్నర్‌గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.కోటి, మణిశర్మ, కీరవాణి, చక్రి, థమన్ లాంటి ప్రముఖ దర్శకుల వద్ద 200కు పైగా పాటలు పాడాడు. ర్యాప్ సింగర్‌గా సింగర్ రేవంత్‌కు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తాడన్నది చూడాలి.