Bigg Boss 6 Telugu: Family Surprise for Singer Revanth - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: రేవంత్‌కు బిగ్‌బాస్‌ షాక్‌, అంతలోనే మరో సర్‌ప్రైజ్‌!

Published Fri, Nov 25 2022 3:33 PM | Last Updated on Fri, Nov 25 2022 4:11 PM

Bigg Boss Telugu 6: Family Surprise For Singer Revanth - Sakshi

ఫ్యామిలీ మెంబర్స్‌ రాకతో బిగ్‌బాస్‌ హౌస్‌ ఎమోషనల్‌గా మారింది. ఇప్పటికే ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా, కీర్తి, రాజ్‌, శ్రీహాన్‌, ఇనయ, రోహిత్‌ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చి వెళ్లారు. ఇంకా ఒకే ఒక్క కంటెస్టెంట్‌ తనవాళ్ల రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అతడే రేవంత్‌. త్వరలో తల్లి కాబోతున్న తన భార్య వస్తుందా? లేదంటే తన కన్నతల్లే వస్తుందా అని ఆశగా పదేపదే గేటువంక చూస్తున్నాడు. అతడి నిరీక్షణకు తెరదించాడు బిగ్‌బాస్‌.

భార్యతో వీడియోకాల్‌ ఆప్షన్‌ ఇవ్వడమే కాకుండా తల్లిని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇక రేవంత్‌ భార్య మాట్లాడుతూ.. ఎంతమంది ఉన్నా నువ్వు లేని బాధ చాలా ఎక్కువగా ఉందని చెప్పింది. ఇలా ఆమె మాట్లాడుతున్న సమయంలో సడన్‌గా వీడియోకాల్‌ కట్‌ చేశాడు బిగ్‌బాస్‌. ఒక్కసారి భార్యతో మాట్లాడతానని వేడుకున్నా బిగ్‌బాస్‌ కనికరించకపోవడంతో ఏడ్చేశాడు. అంతలోనే హౌస్‌లోకి అమ్మ రావడంతో ఆనందభాష్పాలతో ఎదురెళ్లాడు. ఆమె కీర్తిని దగ్గరకు తీసుకుని నువ్వు నా కూతురులాంటిదానివి కాదు, కూతురివే అంటూ ఆప్యాయంగా హత్తుకుంది. అమ్మ గడ్డం తీసుకోమని చెప్పగానే క్లీన్‌ షేవ్‌ చేసుకున్నాడు రేవంత్‌.

చదవండి: ఇనయ కల నెరవేర్చిన బిగ్‌బాస్‌, శ్రీహాన్‌ కాళ్లు మొక్కిన సిరి
పెళ్లిపీటలెక్కనున్న నటి, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement