బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విన్నర్ రేవంత్ అని ముందునుంచే అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. చివరికి అదే నిజమైంది. ప్రైజ్‌మనీలో నుంచి రూ.40 లక్షలు ఆఫర్ చేసినా నాకు కప్పే కావాలని మొండిగా కూర్చున్నాడు. కానీ శ్రీహాన్ మాత్రం ట్రోఫీ గెల్చుకుంటానో లేదోనన్న భయంతో ఆ ఆఫర్‌కు టెంప్ట్ అయిపోయి డబ్బులు తీసేసుకున్నాడు. చివరికి నాగ్.. రేవంత్ కంటే శ్రీహాన్‌కు కొద్దిగా ఓట్లు ఎక్కువ పడ్డాయని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. కానీ రేవంత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
మావాడికి తక్కువ ఓట్లు రావడమేంటని మండిపడుతున్నారు. బిగ్‌బాస్ 6 విన్నర్ ఎవరు? అని స్టార్ మా నిర్వహించిన పోల్‌లో కూడా రేవంత్‌కు అత్యధికంగా 61 శాతం ఓట్లు పడ్డాయని, అలాంటప్పుడు శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లు అని అబద్ధాలాడుతున్నారేంటని గరమవుతున్నారు. అయినా ఫినాలేలో ఇద్దరు మిగిలినప్పుడు డబ్బులు ఆఫర్ చేయడమేంటి? అందులోనూ హౌస్‌మేట్స్ అందరితో శ్రీహాన్‌ను డబ్బులు తీసుకోమని హింట్ ఇవ్వడమేంటి? చివర్లో అతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడమేంటి? అని ఫైర్ అవుతున్నారు. ఆరు సీజన్లలో ఇంత చెత్త సీజన్‌ను ఎప్పుడూ చూడలేదని షోపై దుమ్మెత్తిపోస్తున్నారు.
పైసా కూడా తీసుకోకుండా ప్రేక్షకుల ఓట్లకు విలువిచ్చి రేవంత్ ట్రోఫీ ఎత్తుకున్నాడని.. అతడే రియల్ విన్నర్ అంటూ గర్వపడుతున్నారు. అప్పుడు అభిజిత్, ఇప్పుడు రేవంత్ డబ్బును లెక్క చేయకుండా ట్రోఫీ కోసం నిలబడ్డారు, అదీ విన్నర్ లక్షణమంటూ కొనియాడుతున్నారు. మొదట్లో డబ్బు వద్దే వద్దన్న శ్రీహాన్ రూ.40 లక్షలనేసరికి మాటమార్చి బ్రీఫ్‌కేస్ అందుకుని ప్రేక్షకుల ఓట్లను కరివేపాకులా తీసిపారేశాడని విమర్శిస్తున్నారు. బిగ్‌బాస్ టీమ్ రేవంత్‌కు దక్కాల్సిన రూ.50 లక్షలు కూడా శ్రీహాన్‌కే కట్టబెట్టాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలా హోరెత్తిపోతున్న కామెంట్లతో ట్విటర్‌లో #Revanth, #BiggBossTelugu6 హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌గా మారాయి.
చదవండి: రేవంత్ విజయానికి కారణాలివే!
Comments
Please login to add a commentAdd a comment