Shrihan
-
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
Siri Hanmanth- Shrihan: తొమ్మిదేళ్లుగా లవ్.. పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన సిరి హన్మంత్ (ఫోటోలు)
-
నలుగురి ఆవారా కుర్రాళ్ల కథే ‘మా ఆవారా జిందగీ’
ఆవారాగా తిరిగే నలుగురు ఆవారా కుర్రాళ్ళు నాలుగేళ్లు చదవాల్సిన బి.టెక్ ను ఎనిమిదేళ్లు చదివి బయటికి వచ్చిన తరువాత వారికి జాబ్స్ దొరకక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేశారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘మా ఆవారా జిందగీ’. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మా ఆవారా జిందగీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర దర్శకుడు దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..నలుగురి ఆవారా కుర్రాళ్ల పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? అనే ఫన్ ఓరియెంటెడ్, యూత్ ఫుల్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేశాం. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ నవ్వుకునేలా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుంది. జూన్ 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. (చదవండి: మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్!) ఈ మూవీలో బోల్డ్ సబ్జెక్టు ఉన్నా నా నుంచి అందరూ ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ వస్తుందని ఊహించరు. నన్ను ఇష్టపడే వాళ్ళు నా యాక్టింగ్ ను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. ఈ కథకు మమ్మల్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’అని నటుడు శ్రీహాన్ అన్నారు.‘ఫస్ట్ టైం సినిమాలో నటిస్తున్నాను. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’అని నటుడు అజయ్ అన్నారు.ఈ కార్యక్రమంలో నటుడు చెర్రీ, మహేందర్ నాథ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త బైక్ కొన్న శ్రీహాస్.. ఆ పాటతో పార్టీ అడిగిన సిరి, వీడియో వైరల్
బుల్లితెర జోడి శ్రీహాన్, సిరి హన్మంత్ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కలిసి నటించిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ప్రేమికులుగా మారారు. అయితే ఈ జంటకు బాగా పేరొచ్చింది మాత్రం బిగ్‌బాస్ రియాల్టీ షో వల్లే. బిగ్‌బాస్ ఐదో సీజన్లో సిరి, ఆరో సీజన్లో శ్రీహాన్ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరు తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. శ్రీహాన్ అయితే చివరి వరకు హౌస్‌లో ఉండి రన్నరఫ్‌గా నిలిచాడు. వాస్తవానికి అతను కూడా విన్నరనే చెప్పాలి. ఆడియన్స్ వేసిన ఓట్ల పరంగా శ్రీహాన్ విజేతగా నిలిచినప్పటికీ.. నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షల సూట్ కేసుకి తలొంచడంతో రేవంత్ విజేతగా నిలిచాడు. మొత్తానికి బిగ్‌బాస్ కారణంగా శ్రీహాన్.. అటు అభిమానుల్ని పెంచుకోవడంతో పాటు, ఇటు డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. ప్రస్తుతం ఆ డబ్బుతో లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా శ్రీహాన్ కొత్త బైక్‌ని కొన్నాడు. ప్రియురాలు సిరి, అతని కుమారుడు(సిరి, శ్రీహాన్ కలిసి ఓ పిల్లాడిని దత్తత తీసుకున్నారు)తో కలిసి కొత్త బైక్‌కి పూజలు కూడా చేయించారు. దీనికి సంబంధించిన వీడియోని సిరి తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘వేర్ ఈజ్ ద పార్టీ’పాట రూపంలో బాయ్ఫ్రేండ్ని పార్టీ అడిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by siri shrihan vibes 💙✨ (@siri_shrihan_vibes) -
షణ్ముఖ్‌తో అతి సన్నిహితం.. తప్పు చేశానంటూ స్టేజ్‌పై సిరి కన్నీళ్లు!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ముఖ్- సిరిల ఫ్రెండ్షిప్ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. ఇక కట్ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్ పెడుతూ మరింత దగ్గరయ్యారు. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా స్టార్ మా నిర్వహించిన స్పెషల్ ఎపిసోడ్లో శ్రీహాన్, సిరి జంట పాల్గొంది. వారితో పాటు మిగతా బుల్లితెర రియల్ కపుల్స్ కూడా ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సిరి తాను తప్పు చేశానంటూ స్టేజ్‌పైనే నిర్మోహమాటంగా ఒప్పేసుకుంది. శ్రీహాన్‌కు గోల్డ్ రోజు ఇచ్చి ప్రపోజ్ చేసిన సిరి, అతడు చాలా యూనిక్ అంటూ పొగిడింది. శ్రీహాన్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు అతడిని చాలా మిస్ అయ్యానని, గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ షర్ట్‌పై ముద్దులు పెట్టేదాన్ని అని చెప్పింది. అనంతరం ఆ షర్ట్‌ను ప్రియుడు శ్రీహాన్‌కు గిఫ్ట్ ఇచ్చింది. అలా పలు గిఫ్ట్‌లతో శ్రీహాన్‌ను సర్ప్రైజ్ చేసిన సిరి అనంతరం మాట్లాడుతూ.. ‘చిన్న, చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ స్టేజ్‌పై ఎవరు దాన్ని ఒప్పుకోరు. నేను నిజంగానే తప్పు చేశాను.. అది నాకు తెలియకుండానే జరిగింది’ అంటూ కన్నీరు పెట్టుకుంది. దీంతో సిరిని శ్రీహన్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. దీంతో అక్కడ ఉన్న యాంకర్ రవి, రష్మీతో పాటు మిగతా కంటెస్టెంట్స్ సైతం స్టేజ్‌పైకి వచ్చి సిరిని ఓదార్చారు. కాగా బిగ్‌బాస్ షో అనంతరం షణ్ముఖ్‌కు దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: కిరాక్ ఆర్పీ చేపల పులుసు బిజినెస్ వారి భిక్షే: రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ సీక్రెట్ డేటింగ్.. ఎట్టకేలకు మూడుమూళ్ల బంధంతో ఒక్కటైన హీరోహీరోయిన్ -
శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి!
షార్ట్ ఫలింస్, రీల్స్‌తో పాపులర్ అయిన జంటలో సిరి హన్మంత్, శ్రీహాన్ జంట ఒకటి. రీల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ వీరిద్దరు జంటగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రిలేషన్లో ఉంటున్న వీరిద్దరు బిగ్‌బాస్ షోతో బాగా పాపులర్ అయ్యారు. సిరి హన్మంత్ బిగ్‌బాస్ 5వ సీజన్లో, శ్రీహన్ బిగ్‌బాస్ 6వ సీజన్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌజ్‌లో తనదైన ఆట, చలాకితనంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సిరి మరోవైపు విపరీతమైన నెగిటివిటీని కూడా మూటగట్టుకుంది. చదవండి: ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్ నిర్మాత హౌజ్‌లో తన కో-కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో అతి సన్నిహితంగా మెదిలి ట్రోల్స్ బారిన పడింది. బయటకు వచ్చాక శ్రీహాన్‌తో ఆమెకు అభిప్రాయభేదాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి మనస్పర్థలు తొలగడంతో ఇద్దరు ఒక్కటయ్యారు. అయితే బిగ్‌బాస్ 5వ సీజన్ తర్వాత విడిపోయిన షణ్ముఖ్, దీప్తి సునేయన మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సిరీ బర్త్‌డే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ 6వ సీజన్లో రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ సిరి బర్త్‌డేను చాలా గ్రాండ్ సెలబ్రెట్ చేశాడు. ఆమెకు కాస్ట్లీ డైమండ్ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చాడు. చదవండి: నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలనే ఇలా చేస్తున్నారు: కిరణ్ అబ్బవరం ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటించిన సిరి శ్రీహాన్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ సిరి-శ్రీహాన్ పెళ్లిపై ప్రశ్నించాడు. ‘శ్రీహాన్‌ను మీరు త్వరగా పెళ్లి చేసుకోండి. మాకు చూడాలని ఉంది’ అని కోరాడు. ఇందుకు సిరి స్పందిస్తూ.. తప్పుకుండా.. త్వరలోనే చేసుకుంటామని సమాధానం ఇచ్చింది. అయితే ఎప్పుడు చేసుకుంటారనేది మాత్రం క్లారిటీగా చెప్పలేదు. మరోవైపు ఈ ఏడాది సిరి-శ్రీహాన్‌లు పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు వారి సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కాగా కొంతకాలంగా రిలేషన్లో సిరి-శ్రీహాన్ ఓ బాబును దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. -
బెల్ట్‌తో కొట్టుకుంటూ కొడుకును బెదిరించిన శ్రీహాన్, చిన్మయి ఫైర్
ఎక్కడ ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అవుతుంటుంది సింగర్ చిన్మయి శ్రీపాద. ఎవరైనా తప్పు చేశారని అనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అది తప్పని సోషల్ మీడియాలో నొక్కి చెప్తుంది. అలా ఎలా చేస్తారని చెడుగుడు ఆడేస్తుంది. తాజాగా బిగ్‌బాస్ రన్నరప్ శ్రీహాన్ అప్లోడ్ చేసిన వీడియోపై మండిపడింది చిన్మయి. ఇంతకీ అందులో ఏముందంటే.. మాట వినని చైతూను దారిలో పెట్టాలనుకున్న శ్రీహాన్ తనను తాను కొట్టుకుంటున్నట్లుగా నటించాడు. 'ఎన్నిసార్లు చెప్పాలి.. నా మాట వింటావా? లేదా?' అని బెల్ట్‌తో కొట్టుకున్నట్లు నటించాడు. దీంతో చైతూ 'వింటా డాడీ, కొట్టుకోవద్దు.. సారీ' అంటూ ఏడుస్తుండగా దీన్నంతటినీ వీడియో తీస్తున్న సిరి మాత్రం పకపకా నవ్వేసింది. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. 'మనకు మనం హాని చేసుకోవడం వల్ల పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చాలామంది పేరెంట్స్ పిల్లలు చెప్పినట్లు నడుచుకోకపోతే కొట్టుకోవడమో లేదంటే చచ్చిపోతామనో బెదిరిస్తారు. మరీ ముఖ్యంగా చూసిన సంబంధాన్ని ఓకే చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. ఈ ధోరణికి ఈ జనరేషన్‌లోనైనా ఫుల్స్టాప్ పెట్టాలి' అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన శ్రీహాన్ ఫ్యాన్స్ వాళ్లేదో సరదాగా చేశారు, దానికింత సీరియస్‌గా తీసుకుంటున్నారేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. పిల్లల ముందు స్వీయహాని చేసుకోవడం ముమ్మాటికీ తప్పే.. పిల్లల్ని అలాగేనా పెంచేది? అని ఫైర్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి: ఆ హీరో తుపాకి కాల్చడం నేర్పించాడు బాలయ్య, చిరుల సంక్రాంతి ఫైట్.. ఇది మొదటిసారి కాదు, 11వసారి -
బిగ్ బాస్ సీజన్-6 రన్నరప్.. శ్రీహాన్ వారానికి ఎంత తీసుకున్నాడంటే..!
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్-6 విన్నర్‌గా సింగర్ రేవంత్ నిలవగా.. రన్నర్‌గా శ్రీహాన్ నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో ఈ షోలో పాల్గొన్నవారికి ఎంత ప్రైజ్ మనీ వచ్చింది. ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అదే విషయంపై చర్చ మొదలైంది. ఈ సీజన్ రన్నరప్ శ్రీహాన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఓ లుక్కేద్దాం. ఈ సీజన్లో శ్రీహాన్ ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణాన్ని దాటుకుంటూ వచ్చి గెలుపునకు అడుగు దూరంలో నిలిచారు. ఈ 15 వారాల జర్నీతో తన మనసును సంతోషంతో నింపుకున్నారు. తోటి ఇంటిసభ్యులకోసం శ్రీహాన్ నిలబడ్డ తీరును బిగ్ బాస్ ప్రశంసించారు. బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో పాల్గొనడానికి వారానికి రూ.1.75 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో 15 వారాలకు దాదాపు రూ.26 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. 15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. విన్నర్ డిక్లరేషన్ అనంతరం చివరిలో ట్విస్ట్ చోటుచేసుకోగా.. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. శ్రీహాన్ నిర్ణయం వల్ల రేవంత్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. కానీ ఏకంగా శ్రీహాన్ నలభై లక్షలు దక్కించుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలిచి రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో ఈ సీజన్ మొత్తంలో రూ.71 లక్షలు ఆర్జించాడు శ్రీహాన్ గ్రాండ్‌గా గ్రాండ్ ఫినాలే: దాదాపు మూడు నెలల పాటు ప్రేక్షకులను అలరించిన ఆరో సీజన్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు ఆది రెడ్డి, రోహిత్, రేవంత్, కీర్తి, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. చివరికి రేవంత్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచారు. ప్రస్తుత సీజన్లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. నిఖిల్, రవితేజ, రాధ, శ్రీలీల వంటి తారల రాకతో మరింత జోష్ వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. కింగ్ నాగార్జున మరోసారి తన హోస్ట్‌తో ఆకట్టుకున్నాడు. ఆద్యంతం ఈ సీజన్ అందరినీ బాగా అలరించింది. -
శ్రీహాన్‌కు హింట్.. బిగ్‌బాస్ షోపై రేవంత్ ఫ్యాన్స్ ఫైర్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విన్నర్ రేవంత్ అని ముందునుంచే అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. చివరికి అదే నిజమైంది. ప్రైజ్‌మనీలో నుంచి రూ.40 లక్షలు ఆఫర్ చేసినా నాకు కప్పే కావాలని మొండిగా కూర్చున్నాడు. కానీ శ్రీహాన్ మాత్రం ట్రోఫీ గెల్చుకుంటానో లేదోనన్న భయంతో ఆ ఆఫర్‌కు టెంప్ట్ అయిపోయి డబ్బులు తీసేసుకున్నాడు. చివరికి నాగ్.. రేవంత్ కంటే శ్రీహాన్‌కు కొద్దిగా ఓట్లు ఎక్కువ పడ్డాయని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. కానీ రేవంత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మావాడికి తక్కువ ఓట్లు రావడమేంటని మండిపడుతున్నారు. బిగ్‌బాస్ 6 విన్నర్ ఎవరు? అని స్టార్ మా నిర్వహించిన పోల్‌లో కూడా రేవంత్‌కు అత్యధికంగా 61 శాతం ఓట్లు పడ్డాయని, అలాంటప్పుడు శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లు అని అబద్ధాలాడుతున్నారేంటని గరమవుతున్నారు. అయినా ఫినాలేలో ఇద్దరు మిగిలినప్పుడు డబ్బులు ఆఫర్ చేయడమేంటి? అందులోనూ హౌస్మేట్స్ అందరితో శ్రీహాన్‌ను డబ్బులు తీసుకోమని హింట్ ఇవ్వడమేంటి? చివర్లో అతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడమేంటి? అని ఫైర్ అవుతున్నారు. ఆరు సీజన్లలో ఇంత చెత్త సీజన్‌ను ఎప్పుడూ చూడలేదని షోపై దుమ్మెత్తిపోస్తున్నారు. పైసా కూడా తీసుకోకుండా ప్రేక్షకుల ఓట్లకు విలువిచ్చి రేవంత్ ట్రోఫీ ఎత్తుకున్నాడని.. అతడే రియల్ విన్నర్ అంటూ గర్వపడుతున్నారు. అప్పుడు అభిజిత్, ఇప్పుడు రేవంత్ డబ్బును లెక్క చేయకుండా ట్రోఫీ కోసం నిలబడ్డారు, అదీ విన్నర్ లక్షణమంటూ కొనియాడుతున్నారు. మొదట్లో డబ్బు వద్దే వద్దన్న శ్రీహాన్ రూ.40 లక్షలనేసరికి మాటమార్చి బ్రీఫ్‌కేస్ అందుకుని ప్రేక్షకుల ఓట్లను కరివేపాకులా తీసిపారేశాడని విమర్శిస్తున్నారు. బిగ్‌బాస్ టీమ్ రేవంత్‌కు దక్కాల్సిన రూ.50 లక్షలు కూడా శ్రీహాన్‌కే కట్టబెట్టాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలా హోరెత్తిపోతున్న కామెంట్లతో ట్విటర్లో #Revanth, #BiggBossTelugu6 హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌గా మారాయి. చదవండి: రేవంత్ విజయానికి కారణాలివే! -
BB6 Finale: చరిత్ర సృష్టించిన బిగ్‌బాస్ 6.. శ్రీహాన్, రేవంత్ ఇద్దరూ విన్నర్సే!
బిగ్‌బాస్ షో ఎంతమందితో ప్రారంభమైనా గెలిచేది ఒక్కరే. కానీ మొట్టమొదటిసారి బిగ్‌బాస్ షోలో ఇద్దరు విన్నర్స్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 బిగ్‌బాస్ సీజన్లు జరగ్గా ఇంతవరకు ఎన్నడూ లేనట్లుగా బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరు విజేతలుగా నిలిచారని తెలిపాడు నాగ్. రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్ రన్నరప్ అని ఒప్పేసుకున్నాడు. కప్పు ముఖ్యం బిగిలూ అనుకున్న రేవంత్ డబ్బులను లెక్కచేయకుండా ట్రోఫీ ఎత్తుకుని విన్నర్‌గా అవతరించాడు. అంతేకదా అనుకుంటున్నారేమో! చివర్లో అసలైన ట్విస్ట్ బయటపెట్టాడు నాగ్. ప్రేక్షకులు శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లేసి గెలిపించారని వెల్లడించడంతో అతడి ముఖం మతాబులా వెలిగిపోయింది. అదే సమయంలో ట్రోఫీ నాదే అని షో మొదటి రోజు నుంచే కలలు కంటున్న రేవంత్ ముఖం వెలవెలబోయింది. అయినా నాగార్జున ఆఫర్ చేసిన బ్రీఫ్‌కేస్ మాయ వల్ల శ్రీహాన్ రూ.40 లక్షలు గెల్చుకుని ప్రేక్షకుల ఓట్ల ప్రకారం విజేతగా నిలవగా.. కప్పు అందుకుని రేవంత్ విన్నర్ అయ్యాడు. చదవండి: ముద్దు పెట్టుకోబోయిన నాగ్.. మెలికలు తిరిగిన ఫైమా విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్.. ఎన్ని లక్షలంటే? -
విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్, ఎన్ని లక్షలో తెలుసా?
బ్రీఫ్‌కేస్... బిగ్‌బాస్ షో ఫినాలేలో ఇంట్రస్టింగ్ అంకం అది. గత సీజన్లలో ఓడిపోయి వట్టి చేతులతో వెళ్లేబదులు సూట్‌కేస్ అందుకుని హౌస్ నుంచి సంతృప్తిగా బయటకు వచ్చేసినవాళ్లు ఉన్నారు. మరి ఈ సీజన్లో ఎవరైనా సూట్‌కేసు అందుకుంటారా? అంటే డౌటే అన్న అనుమానం వ్యక్తమైంది. హౌస్‌లో టాప్ 3 కంటెస్టెంట్లు మిగిలినప్పుడు రవితేజ సూట్‌కేస్ పట్టుకుని వెళ్లాడు. మొదట ప్రైజ్‌మనీలో నుంచి పది శాతం ఇస్తానని తర్వాత దాన్ని 30 శాతం వరకు తీసుకెళ్లాడు. అయినా సరే ఎవరూ దాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. కీర్తిని ఆమె ఫ్రెండ్ డబ్బులు తీసుకోమని చెప్పినా ఆమె వద్దని తలాడించి చివరికి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసింది. తర్వాత శ్రీహాన్, రేవంత్.. ఇద్దరు మాత్రమే మిగిలారు. దీంతో నాగార్జున గోల్డెన్ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్ ఆ డబ్బును రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్ అమ్మానాన్న కోసం తీసుకుంటున్నానన్నాడు. అలా రన్నరప్‌గా శ్రీహాన్ రూ.40 లక్షలు గెల్చుకోగా, విన్నర్ రేవంత్‌కు కేవలం రూ.10 లక్షలు మాత్రమే మిగిలాయి. చదవండి: ఆ ముగ్గురి కంటే ముందే ఎలిమినేట్ అయినందుకు హ్యాపీ: ఆదిరెడ్డి మరికొద్ది గంటల్లో పెళ్లి.. పెళ్లికూతురి గెటప్‌లో ఫినాలేకు వచ్చిన నేహా చౌదరి -
రూ.5 లక్షలు గెలుచుకున్న శ్రీహాన్, రియలైజ్ అయిన కీర్తి
మాజీ కంటెస్టెంట్ల రాకతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కళ వచ్చింది. మొదటగా రోల్ రైడా హౌస్‌లో అడుగుపెట్టి త్వరలో బీబీ జోడీ షో రాబోతుందంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అది కంటెస్టెంట్లు జంటలుగా పాల్గొనే రియాలిటీ డ్యాన్స్ షో అని తెలిపాడు. తర్వాత ఫైనలిస్టులకు ఆల్ ద బెస్ట్ చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత మెహబూబ్, అషూ జంటగా లోపలకు ఎంట్రీ ఇచ్చారు. వారు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా ఏ ప్రశ్న అడిగినా తప్పు సమాధానమే చెప్పాలన్నారు. ఇందులో కీర్తి.. శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అని అడగ్గా ఆదిరెడ్డి టపీమని ఇనయ పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. అంతలోనే బ్యాడ్‌న్యూస్ అంటూ.. హౌస్‌లో ఒకరిని తమతోపాటు ఎలిమినేట్ చేసి తీసుకెళ్తామనగానే అందరి ముఖాలు వాడిపోయాయి. మరీ టెన్షన్ పెట్టడం మంచిదికాదని భావించిన వాళ్లు ఇది ప్రాంక్ అని చెప్పడంతో హౌస్మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. వారు వెళ్లిపోగానే అవినాష్- అరియానా వచ్చి డ్యాన్స్ చేసి, పంచ్‌లు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత చైతూ, కాజల్ వచ్చి ఫైనలిస్టులను సర్ప్రైజ్ చేశారు. శ్రీహాన్ అంటే ఎంటర్టైన్మెంట్, రేవంత్.. కోపం, ఆదిరెడ్డి.. కాన్ఫిడెంట్, రోహిత్.. కామ్ అండ్ కంపోజ్డ్, కీర్తి గేమ్ బాగా ఆడుతుందంటూ ఒక్కొక్కరి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాడు చైతూ. అనంతరం కొన్ని వస్తువులు వాడుతూ డ్యాన్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కీర్తి గెలిచి ఫ్రైడ్ చికెన్ సంపాదించుకుంది. ఈ జంట వెళ్లిపోగానే రవి-భాను లోపలకు ఎంట్రీ ఇచ్చారు. ఫైనలిస్టులకు టంగ్ ట్విస్టర్స్ ఇచ్చి వాటిని స్పీడ్‌గా చెప్పాలన్నాడు. అందరూ బానే చెప్పినా తెలుగు రాని కీర్తి కొంత తడబడుతూ దాన్ని పూర్తి చేసింది. తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. సీజన్ ముగింపుకు వచ్చేసరికి ఎవరి మీద అభిప్రాయం మారిందో చెప్పాలన్నాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. మొదట్లో కీర్తి మంచి ఫ్రెండ్‌గా ఉండేది. కానీ రానురానూ గొడవలయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ గేమ్ మీద ఫోకస్ పెట్టి ఇంతవరకు రావడం చిన్న విషయం కాదంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి.. మొదట్లో రేవంత్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడనిపించింది. కానీ చాలాకాలానికి అది యాటిట్యూడ్ కాదని అర్థమైందన్నాడు. రోహిత్ వంతు రాగా ఆదిరెడ్డి తప్పును అంగీకరిస్తారని తెలుసుకున్నానన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. ఆదిరెడ్డి రివ్యూయర్ కాబట్టి మానిప్యులేటర్ అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో అతడితో ఎక్కువగా ఉంటున్నాను. ఆ సమయంలోనే ఆయన్ను నేనెందుకు అర్థం చేసుకోలేకపోయానని ఫీలయ్యానని చెప్పాడు. కీర్తి వంతు రాగా.. శ్రీహాన్ జెన్యూన్ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది అని చెప్పింది. ఇకపోతే కొన్నివారాలుగా ఆన్లైన్లో లెన్స్‌కార్ట్ స్టైలిష్ కంటెస్టెంట్ పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా! ఇందులో శ్రీహాన్ గెలిచి స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలవడమే కాకుండా రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మరుసటి రోజు అఖిల్ సార్థక్, తేజస్విని మదివాడ హౌస్‌లోకి వచ్చి ఆటపాటలతో సందడి చేసి వీడ్కోలు తీసుకున్నారు. చదవండి: అర్జున్ కల్యాణ్‌కు నేనంటే లవ్.. వీడియో చూసి షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ విన్నర్ అతడే! -
సస్పెన్స్‌కు తెరపడింది.. బిగ్‌బాస్6 విన్నర్ అతడే!
బిగ్‌బాస్ సీజన్-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్‌తో రేవంత్‌ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్‌బాస్ సీజన్-6 విజేత ఎవరన్నదానిపై హౌస్మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్-4 ప్లేస్‌ను కీర్తి దక్కించుకుంది. టాప్-3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్‌లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్-6 విజేతగా నిలవగా, శ్రీహాన్ రన్నరన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
శ్రీసత్య ఎలిమినేట్, క్షమించమని చేతులెత్తి వేడుకున్న శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 104: బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లు గెలవడమే కాకుండా ఏకాభిప్రాయంలోనూ నెగ్గి రోహిత్, శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లడిగే అవకాశాన్ని దక్కించుకున్నారు. నేడు మిగతావారికి కూడా ఛాన్స్ రావాలన్న ఉద్దేశంతో మరిన్ని టాస్కులు పెట్టాడు. అలా వాటిలో శ్రీహాన్, కీర్తి గెలిచి ప్రేక్షకులతో మాట్లాడారు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. 'నాకు ఓటడిగే అర్హత ఉందో, లేదో మీరే నిర్ణయించాలి. దానికంటే ముందు నేను తెలీకుండా చేసిన తప్పులకు క్షమాపణలు అడుగుతున్నా. నా మాటల వల్ల, యాటిట్యూడ్ వల్ల కొందరు బాధపడుతున్నారని తర్వాత తెలిసింది. నాకు తెలియకుండానే వారిని బాధపెట్టానని అర్థమయ్యాక నా తప్పులు సరిదిద్దుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. టికెట్ టు ఫినాలే రేవంత్ వదిలేయడం వల్ల నాకు వచ్చింది అని అందరూ అంటుంటే బాధగా ఉంది. కానీ గేమ్ అంతా మీరు చూశారు. ఊహించని పరిస్థితుల మధ్య బిగ్‌బాస్ షోకు వచ్చాను. ట్రోఫీ గెలవడం నాకు చాలా ముఖ్యం. మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి గెలిపించండి. ఎక్కువ క్షమించేవాళ్లే ఎక్కువ ప్రేమిస్తారు. నేను తప్పు చేసినందుకు క్షమించండి' అంటూ చేతులెత్తి వేడుకున్నాడు. అలాగే ఇండియన్ ఆర్మీ జవాన్లకు, అన్నం పెట్టే రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ సెల్యూట్ చేశాడు. తర్వాత కీర్తి మాట్లాడుతూ.. 'ఇన్నిరోజులు బిగ్‌బాస్ హౌస్‌లో కీర్తిని చూశారు. బయట ఎలా ఉన్నాను? లోపల ఎలా ఉన్నాను? అన్నీ చూశారు. మీ ఇంటి కూతురిలా నాకు సపోర్ట్ చేశారు. మున్ముందు కూడా అలాగే మద్దతిస్తారనుకుంటున్నాను. నా శక్తిని మించి ఆడాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నాలాంటివాళ్లు కూడా బలంగా ఉండాలనుకుంటున్నాను. ట్రోఫీ గెలిచినా కూడా ఆ డబ్బులు నాకోసం వాడుకోను. నాలాంటి అనాధల కోసం, సామాజిక కార్యక్రమాల కోసం ఆ డబ్బులు వాడతాను. అందరికీ ఓట్లేయండి, కానీ నాక్కొంచెం ఎక్కువ ఓట్లేయండి' అని కోరింది. తర్వాత ఉదయం ఆరుగంటలకే హౌస్‌మేట్స్‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ అర్జంటుగా బ్యాగులు సర్దేసుకోండి, ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేస్తానని చెప్పాడు. ఈ మాటతో షాకైన కంటెస్టెంట్లు చేసేదేం లేక బుద్ధిగా తమ బట్టలు సర్దేసుకుని గార్డెన్ ఏరియాలో వచ్చి నిల్చున్నారు. మీ అభిప్రాయంలో ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారో చెప్పమని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్.. రోహిత్ పేరు, కీర్తి.. ఆదిరెడ్డి, శ్రీసత్య.. రేవంత్, ఆదిరెడ్డి.. కీర్తి, రోహిత్.. శ్రీహాన్ ఎలిమినేట్ కావచ్చని అభిప్రాయపడ్డారు. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మెజారిటీ ఇంటిసభ్యులు కీర్తి వెళ్లిపోతుందని నిర్ణయించారు. కానీ ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం శ్రీసత్య టాప్ 5కి చేరుకోకుండా ఈ క్షణమే ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. ఎలిమినేషన్‌ను ముందే పసిగట్టిన శ్రీసత్యకు బాధను లోలోపలే దిగమింగి బయటకు మాత్రం చిరునవ్వుతో నిలబడింది. కానీ రేవంత్ బాధ ఆపుకోలేక ఏడ్చేశాడు. చివరికి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ హౌస్‌కు వీడ్కోలు పలికింది శ్రీసత్య. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోనున్న నాగ్ రేవంత్ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని అబద్ధం చెప్పాం -
నా తప్పులు మన్నించి విజేతగా నిలపండి.. ప్రేక్షకులను ఓట్లడిగిన శ్రీసత్య
Bigg Boss Telugu 6, Episode 102 Highlights: కంటెస్టెంట్లు అందరూ మీ గమ్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఫినాలే కోసం ఊదరగొట్టాడు బిగ్‌బాస్. మీ మనసుల్లోని మాటలను ప్రేక్షకులతో నేరుగా పంచుకుని వారి నుంచి ఓట్లు కోరవచ్చంటూ ఓట్ అప్పీల్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మొదటగా మీకు వినిపిస్తుందా? అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో బిగ్‌బాస్ ప్లే చేసిన సౌండ్స్‌ను గుర్తించి సరైన ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఛాలెంజ్ నుంచి తొలగిపోయారు. అయితే శ్రీసత్య అరవడం వల్లే తన గేమ్ పోయిందని విసుకున్నాడు శ్రీహాన్. నీ తప్పు కూడా ఉంది, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకు అని గట్టిగానే ఆన్సరిచ్చింది శ్రీసత్య. కాసేపటికి శ్రీహాన్ సారీ చెప్పడంతో గొడవ చప్పున చల్లారింది. మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ఆదిరెడ్డి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ల అప్పీలు కోసం ఎన్నుకోమన్నాడు బిగ్‌బాస్. రేవంత్ మినహా మిగిలిన ముగ్గురూ రోహిత్‌కే ఓటేయడంతో అతడు ఓట్లు అడిగే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో రోహిత్ మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను ఎలా ఆడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? నా థింకింగ్ ఏంటి? నా క్యారెక్టర్ ఏంటి? అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మొదట్లో మెరీనాతో కలిసి ఆడేవాళ్లం. సెపరేట్ అయ్యాక విడివిడిగా ఆడాం. నాకు ఎప్పుడూ అదృష్టం కలిసిరావట్లేదు. ఈ సీజన్ 6 టైటిల్ గెలవాలన్నదే నా కోరిక. నా కుటుంబం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి' అంటూ తన స్పీచ్ ముగించాడు. తర్వాత ఎగ్స్ షాట్ అనే ఛాలెంజ్‌లో రేవంత్, శ్రీసత్య, కీర్తి, శ్రీహాన్ పాల్గొనగా రేవంత్, శ్రీసత్య గెలుపొందారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో సెలక్ట్ చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్, కీర్తి, రోహిత్.. శ్రీసత్యకు ఓటేయగా ఆదిరెడ్డి ఒక్కడే రేవంత్‌కు మద్దతు పలికాడు. గెలిచేవాడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆదిరెడ్డి పరోక్షంగా రేవంతే విజేత అని అభిప్రాయపడినట్లు కనిపించింది. రేవంత్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అతడికి ఈ ఓట్ అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలని శ్రీసత్యకు ఇస్తే ఏం యూజ్ ఉంటుందని మాట్లాడాడు. దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా ఈ ఛాలెంజ్‌లో తనకు సపోర్ట్ చేయలేదని రేవంత్ ఒకింత హర్టయ్యాడు. ఇక శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లు అడుగుతూ.. 'మొదట్లో నాకు దెబ్బలు తగలకుండా ఆడాలనుకునేదాన్ని. కానీ మూడో వారం నుంచి నేను వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నేనేమైనా తప్పు చేసుంటే క్షమించండి. ఈ హౌస్‌లోకి వచ్చినప్పుడే విన్నర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ విజయం మీ చేతుల్లోనే ఉంది. ఈ టైటిల్ నాకెంతో ముఖ్యం.. ఈ సీజన్‌కు లేడీ విన్నర్ అయితే బాగుంటుంది. కాబట్టి మర్చిపోకుండా నాకు ఓటేయండి' అని అభ్యర్థించింది. మరోపక్క సోషల్ మీడియాలో శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె లేడీ విన్నర్ కావాలనుకుంటుందని చెప్పడంతో అభిమానుల మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి ఎన్నో వారాలుగా అన్యాయం.. ఎట్టకేలకు రోహిత్‌కు ఛాన్స్ -
ఎన్నోవారాలుగా అన్యాయం.. చిట్టచివరికి రోహిత్‌కు ఒక్క ఛాన్స్
కంటెస్టెంట్ల ఎమోషన్స్‌తో ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టబోతున్నామని ఫుల్ ఖుషీలో ఉన్నారు టాప్ 6 కంటెస్టెంట్లు. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ వారిలో ఒకరిని నేడే హౌస్ నుంచి పంపించేయనున్నారు. మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి కేవలం ఐదుగురిని మాత్రమే ఫినాలేకు పంపించనున్నారు. ఇకపోతే ఎప్పటిలాగే ఓట్ అప్పీల్ కోసం హౌస్‌మేట్స్‌కు ఆఖరి పోరాటం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో సౌండ్స్ విని వాటిని గుర్తుపట్టి అవేంటో రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి, రోహిత్ ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్నారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ అప్పీలు కోసం ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. ఏకాభిప్రాయం అన్న ప్రతిసారి రోహిత్‌ను సైడ్ చేసుకుంటూ వచ్చిన హౌస్మేట్స్ ఈ ఒక్కసారికి మాత్రం అతడికే అవకాశం ఇవ్వడం గమనార్హం. దీంతో అతడు.. పదిహేను వారాలుగా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కచ్చితంగా టైటిల్ గెలుస్తానని నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ ఇవ్వగా ఇందులో రేవంత్, శ్రీసత్య ముందు స్థానాల్లో నిలిచారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఎన్నుకోమనగా ఆదిరెడ్డి.. రేవంత్‌కు, శ్రీహాన్.. శ్రీసత్యకు ఓటేశారు. మరి మిగతావాళ్లు ఎవరిని సెలక్ట్ చేశారు? ఎవరు ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకున్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి నన్ను ఛీ, తూ అని గెంటేశారు, ఇప్పుడు చెప్తున్నా..: కీర్తి -
నన్ను ఛీ, తూ అని బయటకు గెంటేసినవారికి ఇప్పుడు చెప్తున్నా: కీర్తి
Bigg Boss 6 Telugu, Episode 102: రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్‌లు వారి జర్నీలు చూసి గాల్లో తేలిపోతున్నారు. ఈరోజు శ్రీహాన్, కీర్తిల వంతు వచ్చింది. మొదటగా శ్రీహాన్ గార్డెన్ ఏరియాలోకి వచ్చాడు. అప్పుడే అతడి తల్లి ఫోన్ చేసి బిగ్‌బాస్‌కు వెళ్లాలన్న కోరిక ఎలాగో నెరవేరింది. ఇక ట్రోఫీ గెల్చుకుని రా అని కొడుకును ప్రేమగా కోరింది. తప్పకుండా టైటిల్ కొట్టే వస్తానని ధీమాగా చెప్పాడు శ్రీహాన్. బిగ్‌బాస్ శ్రీహాన్‌తో మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ ప్రయాణంలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో ఆట కోసం, గెలుసు కోసం సభ్యులు పడే తపన ఎలాంటిదో మునుపటి సీజన్లో దగ్గరి నుంచి చూశారు. ఈసారి స్వయంగా ఆ అనుభవాన్ని పొందేందుకు హౌస్‌లో అడుగుపెట్టారు. అందరితో సరదాగా ఉండటం, అవసరమొచ్చినప్పుడు ఎవరినైనా ఎదురించడం.. ఈ రెండూ మీలో ఉన్నాయి. మీలోని అల్లరి మీకు స్నేహితులను తీసుకొచ్చింది. కలిసి మీరు చేసిన వినోదం నవ్వులను పంచింది. వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా అనే విషయం మీకు బాగా తెలుసు. మీరు తోటి ఇంటిసభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను తెలుపుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్ తన స్నేహితుల కోసం తగ్గారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే స్నేహితులతో పోటీపడి టికెట్ టు ఫినాలే నెగ్గారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీరొక సేఫ్ ప్లేయర్ అనిపించినా వారి మాటలకు మీ ఆటతో సమాధానం చెప్పారు. సోషల్ మీడియా నుంచి ఎదిగి సాధ్యమైనంత ఎక్కువమందికి వినోదం పంచడానికి ఇతర సభ్యుల సహకారం లేకుండా మీకు మీరుగా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నించిన తీరు అందరికీ నచ్చింది. ఆ విషయమే మిమ్మల్ని ఇక్కడివరకూ తీసుకొచ్చింది. మీ పొరపాట్లు మీ రెండు వారాలు కెప్టెన్సీ దూరమయ్యేలా చేశాయి. ఎత్తుపల్లాలతో సాగే ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు గార్డెన్లో మీరు దించుకున్న గుండె బరువును బిగ్‌బాస్ విన్నారు. ఇంట్లో వారితో మాట్లాడే వచ్చే బలం ఎంతో అని తెలిసినా ఆ అవకాశాన్ని తోటిసభ్యుల కోసం వదులుకున్నారు. పట్టుకోవడంలోనే కాదు వదిలేయడంలో కూడా బలముంటుంది. దాంతో ఏదైనా సాధించొచ్చు. మీ బలాన్ని, వినోదాన్ని, పట్టుదలను ఇలాగే కొనసాగించి అనుకున్నవన్నీ సాధించాలని బిగ్‌బాస్ కోరుకుంటున్నాడు అని చెప్పాడు. ఇది విన్న శ్రీహాన్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత కీర్తి గార్డెన్ ఏరియాలోకి వచ్చింది. ఇంతలో ఫోన్ రింగైంది. అవతలి నుంచి మానస్ మాట్లాడుతూ.. 'ఒళ్లు హూనమైపోతున్నా, వేలికి ఫ్రాక్చర్ అయినా, సాఫ్ట్ టార్గెట్ అనుకుని నామినేట్ చేసినా ఎక్కడా బెదరకుండా ఆడిన ఆట చూసి నాకే కాదు లోపలున్న హౌస్‌మేట్స్‌కు, బయటున్న ప్రేక్షకులకు మబ్బులు వదిలిపోయాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో నీలాంటి కూతురు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకునేలా చేశారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని, అన్నింటిలో ముందుంటారని నిరూపించావు. ఈ సీజన్లో ఫస్ట్ లేడీ కెప్టెన్ అయ్యావు, అలాగే ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము' అని చెప్పి ఆమె పెదాలపై ఆత్మస్థైర్యంతో కూడిన నవ్వులు పూయించాడు. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. 'కీర్తి, కల్పితం కన్నా నిజ జీవితం ఎంతో నాటకీయమైనది. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహిస్తుంటే కణకణమండే కొడవలిలా జీవితంపై దండయాత్ర చేసేందుకు మీరు చూపించిన గుండె నిబ్బరం ఎంతోమందికి స్ఫూర్తి. అడవిలో మహావృక్షం ఒకటే ఉంటుంది. అది తాను ఒంటరినని బాధపడి తల వంచితే ఆకాశం తాకే తన ఎదుగుదలను చూడలేదు. మీకుగా సంపాదించిన పేరు, ప్రేమను ఎన్నో రెట్లు చేయడానికి బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. మొదటినుంచీ మొండిధైర్యాన్ని చూపిస్తూ వచ్చారు. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. భాష మీ భావాలను వ్యక్తపరిచేందుకు పరిమితిగా మారినా మీ కన్నీళ్లు మనసులోని భావాలను దాచలేకపోయాయి. కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితులు మీరెంత బలమైనవారో మర్చిపోయేలా చేసినట్లనిపించింది. సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతావారు నిందించినప్పుడు మీ మనసు గాయపడింది. మీరనుకున్న విషయాన్ని బలంగా వినిపించినా మద్దతు తెలిపే స్నేహితులు లేక నిరాశ చెందారు. కానీ మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి. అన్నింటినుంచీ తేరుకుని మొదటి ఫీమేల్ కెప్టెన్‌గా నిలిచారు. పద్నాలుగు వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత గ్రాండ్ ఫినాలేకు చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీ ఒక్కరు మాత్రమే కాదు, మీ కుటుంబం కూడా! ఎందుకంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షలు.. అని ముగించాడు. బిగ్‌బాస్ మాటలతో కీర్తి పులకరించపోయింది. 'ఈ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుంది. ఎవరైతే నన్ను ఛీ,తూ అన్నారో, నువ్వు చూడటానికి బాగోలేవు అంటూ బయటకు గెంటేశారో వారికి నేనీరోజు చెప్తున్నాను. ఇదీ కీర్తి.. ఈరోజు నా పేరెంట్స్ ఆత్మకు శాంతి దొరుకుతుందని భావిస్తున్నాను. ఇన్నాళ్లకు నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను. నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను' అంది కీర్తి. చదవండి: బిగ్‌బాస్ 6 విజేత ఎవరో తెలుసా? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు -
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు.. శ్రీహాన్ ఎమోషనల్
ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణాన్ని దాటుకుంటూ వచ్చి గెలుపుకు అడుగు దూరంలో ఉన్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. ఇప్పటికే రేవంత్, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి వారి వంద రోజుల జర్నీని చూసి గుండె నిండా సంతోషాన్ని నింపుకున్నారు. ఈరోజు శ్రీహాన్, కీర్తిల వంతు వచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. శ్రీహాన్ గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. తోటి ఇంటిసభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను తెలుపుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్ తన స్నేహితుల కోసం తగ్గారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే స్నేహితులతో పోటీపడి టికెట్ టు ఫినాలే నెగ్గారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీరొక సేఫ్ ప్లేయర్ అనిపించినా మీ ఆటతో సమాధానం చెప్పారు. ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు బిగ్‌బాస్ విన్నారు. పట్టుకోవడంలోనే కాదు వదిలేయడంలో కూడా బలముంటుంది. మీ బలాన్ని, వినోదాన్ని, పట్టుదలను ఇలాగే కొనసాగించి అనుకున్నవన్నీ సాధించాలని బిగ్‌బాస్ కోరుకుంటున్నాడు అంటూ బిగ్‌బాస్ అతడిపై పొగడ్తల వర్షం కురిపించాడు. తన గురించి బిగ్‌బాస్ అంత గొప్పగా మాట్లాడేసరికి శ్రీహాన్‌కు కన్నీళ్లు ఆగలేవు. చదవండి: రోహిత్ జర్నీ హైలైట్, రుణపడి ఉంటానన్న ఆదిరెడ్డి అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది -
మిడ్ వీక్ ఎలిమినేషన్! శ్రీహాన్ టైటిల్ కొట్టి రావాలన్న ఇనయ
Bigg Boss 6 Telugu, Episode 99: ఊహించిందే జరిగింది.. ఈ వారం ఇనయ ఎలిమినేట్ అయింది. ఫినాలేకు ఒక అడుగు దూరంలోనే తన ప్రయాణం ముగిసింది. తన జర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఇనయ. చివరి నిమిషంలో కెప్టెన్ అవడమే కాకుండా బెస్ట్ కెప్టెన్‌గా అందరిచేత శెభాష్ అనిపించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. మరి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్‌లో ఏమేం జరిగాయో చదివేయండి.. బిగ్‌బాస్ హౌస్ గురించి కంటెస్టెంట్లకు ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడానికి 'నీకెంత తెలుసు' అనే టాస్క్ ఇచ్చాడు నాగ్. హౌస్‌లో నిత్యం చూసే పరిసరాల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇందులో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రేవంత్ గిఫ్ట్ హ్యాంపర్ సొంతం చేసుకున్నాడు. తర్వాత పాటలు, డ్యాన్సులతో ఎంటర్టైన్ చేశారు హౌస్మేట్స్. నాగ్ అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో ఆదిరెడ్డి, ఇనయ మాత్రమే మిగిలారు. కంటెస్టెంట్లు ఊపిరి బిగపట్టుకుని చూస్తున్న సమయంలో ఇనయ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. ఎలాగైనా కప్పు కొట్టాలన్న తన కల నెరవేరకుండానే హౌస్ నుంచి బయటకు వచ్చేయడంతో భావోద్వేగానికి లోనైంది. ఒక్క అడుగు దూరంలో ఆగిపోయానని ఫీలైంది. స్టేజీమీదకు వచ్చిన ఇనయతో ఓ గేమ్ ఆడించాడు నాగ్. టాప్ 6 కంటెస్టెంట్లలో ఉన్న మంచి, చెడు లక్షణాలను చెప్పమన్నాడు. ఇనయ మాట్లాడుతూ.. శ్రీహాన్‌తో స్టార్ట్ చేస్తాను. అతడు మంచివాడని తర్వాత అర్థమైంది. అతడే టైటిల్ కొట్టి రావాలి. అవతలి వాళ్లను అర్థం చేసుకుంటే బాగుండు, బ్యాక్ బిచింగ్ తగ్గించుకోవాలి. ఆదిరెడ్డి.. నిజాయితీపరుడు. శ్రీసత్య తనకు నచ్చినవాళ్ల కోసం ఏదైనా చేస్తుంది. నచ్చనివాళ్లను విపరీతంగా రెచ్చగొడుతుంది. కీర్తి ఎలాంటి బాధనుంచైనా బయటపడగలదు, కానీ దానికి సమయం పడుతుంది. రోహిత్ డీసెంట్ గుడ్ బాయ్. కానీ తనలోని సామర్థ్యాన్ని పూర్తిగా బయటపెట్టలేదు. రేవంత్.. అందరితో బాగుంటాడు, అందరికీ ఫుడ్ షేర్ చేస్తాడు. కానీ అందరికీ మంచి చెప్పాలనుకుంటాడు, అది అవతలవాళ్లకు నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇనయను పంపించేసిన నాగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. బుధవారం ఒకరిని హౌస్ నుంచి పంపించేస్తామని తెలిపాడు. కాబట్టి హౌస్‌లో ఎవరిని హౌస్‌లో ఉంచాలనుకుంటున్నారో? ఎవరిని ఫినాలేకు పంపించాలనుకుంటున్నారో.. వారికి ఆలస్యం చేయకుండా ఓట్లు గుద్దేయండి.. చదవండి: లేడీ టైగర్‌ను పంపించేస్తారా.. చెత్త సీజన్ అంటూ ట్రోలింగ్ సినిమాలు వర్కవుట్ కాలేదు, చనిపోదామనుకున్నా -
ఎలిమినేషన్‌ను ముందే ఊహించిన ఇనయ? నాగార్జున హింట్
Bigg Boss 6 Telugu, Episode 98: ఫినాలే దగ్గరపడుతుండటంతో నాగార్జున ఫన్నీ టాస్కులు మానేసి సీరియస్ టాస్కులు ఆడించాడు. మొదటగా బిగ్‌బాస్ హౌస్‌లో ఓట్ల క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శ్రీహాన్ మాట్లాడుతూ.. రేవంత్ తప్పులను అంగీకరించడు. అతడికి కోపం ఎక్కువ. కానీ నేను తప్పులను ఒప్పుకోవడమే కాకుండా వాటిని సరిదిద్దుకుంటాను. తనకంటే బాగా ఎంటర్టైన్ చేస్తాను. అందుకోసం నాకు ఓటేసి గెలిపించాలి అని చెప్పాడు. ఇక రేవంత్ మాట్లాడుతూ.. నేను ఏ టాస్కునూ వదల్లేదు. విన్నర్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు నాకున్నాయి. శ్రీహానే కాదు, ఇక్కడ ఎవరినీ నాకు కాంపిటీటర్‌గా అనుకోలేదు అని చెప్పాడు. దీంతో శ్రీహాన్ మధ్యలో కలగజేసుకుంటూ ఒకటి చెప్పాలి సర్ అని అడిగాడు. దీనికి నాగ్.. రేవంత్ ఫ్లిప్పర్ అని చెప్పాలనుకున్నావు, అంతేనా? అన్నాడు. దీంతో అందుకున్న రేవంత్.. శ్రీహాన్ వెనకాల మాట్లాడతాడని తెలుసు, ఇంతకుముందు కూడా విన్నాను, కానీ ఎప్పుడూ తనను అడగలేదని చెప్పాడు. అతడి మాట విని షాకైన శ్రీహాన్.. నీకు చెప్పిన విషయాలే మాట్లాడానే తప్ప వెనకాల కొత్తగా ఏమీ మాట్లాడలేదు అని బదులిచ్చాడు. తర్వాత మిగతా ఐదుగురు కూడా తమలో ఉన్న పాజిటివ్ అంశాలను చెప్తూ దానికోసం ఓట్లేయాలన్నారు. అనంతరం హౌస్మేట్స్ దెయ్యం టాస్కులో ఎంత భయపడ్డారో వారికే వీడియో వేసి చూపించాడు నాగ్. చీకటి గదిలో తాము చేసిన విన్యాసాలు చూసి కంటెస్టెంట్లు పడీపడీ నవ్వుకున్నారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో మరో గేమ్ ఆడించాడు నాగ్. బెస్ట్ అనుకున్న ముగ్గురికి స్టార్ రేటింగ్స్ ఇచ్చి, వేస్ట్ అనుకున్న ముగ్గురికి క్రాస్ సింబల్ ఫేస్‌పైన ముద్రించాలన్నాడు. అలా ఈ గేమ్‌లో ఎవరెవరు ఎవరికి స్టార్స్, ఎవరికి క్రాస్ గుర్తులు ఇచ్చుకుంటూ వెళ్లారంటే.. కంటెస్టెంట్ 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్ సింగిల్ క్రాస్ డబల్ క్రాస్ (బ్యాడ్) ట్రిపుల్ క్రాస్ (వెరీ బ్యాడ్) ఆదిరెడ్డి. శ్రీహాన్ రేవంత్ రోహిత్ శ్రీసత్య ఇనయ కీర్తి కీర్తి రోహిత్ ఇనయ రేవంత్ శ్రీహాన్ కీర్తి ఆదిరెడ్డి శ్రీసత్య శ్రీహాన్ రేవంత్ ఆదిరెడ్డి రోహిత్ ఇనయ కీర్తి ఇనయ కీర్తి శ్రీసత్య రేవంత్ శ్రీహాన్ రోహిత్ ఆదిరెడ్డి రేవంత్ శ్రీసత్య శ్రీహాన్ కీర్తి ఆదిరెడ్డి రోహిత్ ఇనయ శ్రీహాన్ రేవంత్ ఆదిరెడ్డి శ్రీసత్య ఇనయ కీర్తి రోహిత్ రోహిత్ ఆదిరెడ్డి రేవంత్ కీర్తి శ్రీహాన్ శ్రీసత్య ఇనయ తర్వాత కీర్తి, రేవంత్ సేవ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో టికెట్ టు ఫినాలే సాధించిన శ్రీహాన్‌తో పాటు రేవంత్, కీర్తి ఫైనల్ వీక్‌కు వెళ్లారని ప్రకటించాడు నాగ్. మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో హౌస్మేట్స్ గెస్ చేయాలన్నాడు. ముందుగా శ్రీహాన్.. రోహిత్ వెళ్లిపోతాడని అభిప్రాయపడగా కీర్తి.. ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోతాడేమోనని చెప్పుకొచ్చింది. రేవంత్ వంతు రాగా.. ఎన్నడూ ఎవిక్షన్‌కు భయపడని ఇనయ మొట్టమొదటిసారి నిన్న భయపడింది. దాన్నిబట్టి ఆమె ఎలిమినేట్ కావచ్చేమోననుకున్నాడు. దీంతో ఇనయ అందుకుంటూ.. నిన్ననే కదా నేను టాప్ 5 కంటెస్టెంట్ అన్నావు, అంతలోనే మాట మార్చి ఈ వారం వెళ్లిపోతానని చెప్తున్నావేంటి అంటూ నిలదీసింది. రేవంత్ ఇప్పుడు తన మనసులో ఉన్నది మాట్లాడాడంటూ జరగబోయేది ఇదేనని చెప్పకనే చెప్పాడు నాగ్. ఇకపోతే మొన్నటిదాకా ప్రైజ్‌మనీని బిగ్‌బాస్ పెంచగా ఈసారి నాగార్జున ఇంటిసభ్యులకు మర ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన ముందున్న మూడు సూట్‌కేసుల్లో డబ్బులున్నాయని, ఎక్కువ అమౌంట్ ఉన్న కరెక్ట్ సూట్‌కేస్ సెలక్ట్ చేసుకోమన్నాడు. హౌస్మేట్స్ అత్యధికంగా రూ.3 లక్షలున్న సూట్‌కేసు సెలక్ట్ చేసుకున్నారు. దీంతో ఈ మూడు లక్షలు కలపగా ఫైనల్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలకు చేరింది. ఈ అరకోటి రూపాయలతో పాటు విన్నర్ రూ.25 లక్షల విలువైన 605 గజాల స్థలాన్ని గెలుచుకోనున్న విషయం తెలిసిందే! దీనికి తోడు మారుతి సుజుకి బ్రెజ్జా కారు సైతం సొంతం చేసుకోనున్నట్లు ప్రకటించడంతో హౌస్మేట్స్ ఎగిరి గంతేశారు. చదవండి: లేడీ టైగర్‌ను పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా? టాప్ 3లో ఉంటుందనుకున్న ఇనయ ఎలిమినేట్? -
శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడని తెలుసు: రేవంత్
దెయ్యాలను చూసి భయపడిపోయిన కంటెస్టెంట్లను చూసి మేము బాగా నవ్వుకున్నామన్నాడు నాగార్జున. ఈ సీజన్లోనే మోస్ట్ ఎంటర్టైనింగ్ వీడియో అంటూ దెయ్యం టాస్కులో కంటెస్టెంట్లు ఏ రేంజ్లో భయపడ్డారో మరోసారి చూపించాడు. తర్వాత అవతలి వాళ్లకంటే నేనే ఎందుకు బెస్ట్, నాకే ఎందుకు ఓట్లు వేయాలో చెప్పమంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. అప్పుడే ఫిట్టింగ్ పెట్టేశారంటూ గొణుక్కున్నాడు రేవంత్. రేవంత్ కన్నా నువ్వెందుకు బెటర్? నీకెందుకు ఓట్లేయాలో చెప్పు అని శ్రీహాన్‌ను ఆదేశించాడు నాగ్. దీనికతడు లేచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటారు. కానీ దాన్ని ఒప్పుకోగలగాలి. ఆ గుణం రేవంత్‌కు లేదు అన్నాడు. అంతలోనే ఇంకో విషయం గుర్తురావడంతో చెప్పొచ్చా? అని పర్మిషన్ అడిగాడు. రేవంత్ ఫ్లిప్పర్, నేను కాదంటావు, అంతేనా.. అని నాగ్ గెస్ చేయగా ఛఛ, అది కాదన్నాడు శ్రీహాన్. మొన్న ఆదిరెడ్డితో అదే అన్నావుగా అని నాగ్ అనగా అలా అనలేదని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే రేవంత్ కలగజేసుకుంటూ శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడని తెలుసు అంటూ ఉక్రోషానికి లోనయ్యాడు. ఈ మాటతో శ్రీహాన్ ఒక్కసారిగా షాకయ్యాడు. శ్రీహాన్ ఫ్లిప్పర్ అనే పదం వాడాడా? లేదా? అని ఆదిరెడ్డిని అడగ్గా అతడు తనకు గుర్తు లేదని బదులిచ్చాడు. దీంతో నాగ్.. నిన్ను మించిన ఫ్లిప్పర్ లేడులే అంటూ ఉడాల్ మామపై సెటైర్ వేశాడు. చదవండి: ఏమిటేమిటి? ఇనయ ఎలిమినేట్ అయిందా? సీనియర్ నటి దారుణ హత్య, కన్న కొడుకే కొట్టి చంపాడు -
లెక్క తేలింది, విన్నర్ గెలుచుకునే ప్రైజ్‌మనీ ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 97: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రైజ్‌మనీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. గతంలో దాన్ని కత్తిరించుకుంటూ పోయిన బిగ్‌బాస్ ఈ వారం ఆ కోల్పోయిన డబ్బు తిరిగి పొందేందుకు అవకాశాలిస్తూ పోయాడు. నేటితో ఆ ఛాన్స్‌లకు తెరదించాడు. ఫైనల్ ప్రైజ్‌మనీని ప్రకటించాడు. మరి ఆ అమౌంట్ ఎంతో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! రెండు రోజులగా దెయ్యం టాస్కుతో ఇంటిసభ్యులను హడలెత్తిస్తున్నాడు బిగ్‌బాస్. ఈరోజు శ్రీసత్య, కీర్తిలను చీకటి గదిలోకి పంపించాడు. వీళ్లిద్దరూ గడ్డిని చూసి కూడా గజగజ వణికిపోయారు చివరికి బిగ్‌బాస్ చెప్పిన వస్తువులు తీసుకురావడంతో రూ.20 వేలు ఇచ్చాడు. తర్వాత రోహిత్‌ను ఆ తర్వాత హౌస్మేట్స్ అందరినీ చీకటి గదిలో వేశారు. అక్కడ ఇనయ, కీర్తి దెయ్యాల్లా భయపెడుతూ అందరినీ ఓ ఆటాడుకున్నారు. ఈసారి ఇంటిసభ్యులు మరో రూ.13వేలు గెలిచారు. మనీబాల్ టాస్క్‌లో రేవంత్ రూ.500, రోహిత్ రూ.1500 సాధించాడు. అనంతరం ఆరో సీజన్‌లోని ఐకానిక్ సంఘటనలను మరోసారి ప్రదర్శించి ఎంటర్టైన్ చేయాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఇనయ- శ్రీహాన్‌ల పిట్ట కథ, హోటల్ టాస్క్‌లో శ్రీసత్య- అర్జున్ ఒప్పందం, అర్జున్-రేవంత్ పప్పు గొడవ, మిషన్ పాజిబుల్ టాస్క్‌లోని ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్(బాత్రూమ్ను అశుభ్రపరిచి గొడవ చేసిన గొడవ), కీర్తి వేలు గాయపడ్డ సంఘటన, కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్ గోనె సంచులను తన్నిన సీన్.. వీటన్నింటినీ మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించారు. అందరూ నటించడం కాదు ఏకంగా జీవించేశారు. వీరి యాక్టింగ్ స్కిల్స్‌తో బిగ్‌బాస్‌ను అలరించి రూ.43,000 గెలుచుకున్నారు. అన్ని ఛాలెంజ్‌లు, టాస్కులు పూర్తైన తర్వాత ఫైనల్‌గా విన్నర్ ప్రైజ్‌మనీ రూ.47,00,000కి చేరింది. ఈ సంతోషంలో రేవంత్ పాట పాడగా కీర్తి, శ్రీసత్య డ్యాన్సులేశారు. చదవండి: ఈ వారం డబుల్ ఎలిమినేషన్? ఫైమాకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన పటాస్ ప్రవీణ్ -
శ్రీహాన్‌తో బ్రేకప్‌పై తొలిసారి నోరు విప్పిన సిరి!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ను- సిరిల ఫ్రెండ్షిప్ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. అంత మంచివాడిని ఎలా మోసం చేయాలనిపించిందంటూ నానామాటలన్నారు. కట్ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్ పెడుతూ మరింత దగ్గరయ్యారు. ఈసారి శ్రీహాన్ షోలో అడుగుపెట్టాడు. గేమ్ బాగా ఆడుతున్నాడు. కానీ వెటకారం, ఫ్రెండ్షిప్ వల్ల గెలుపుకు దూరం అవుతున్నాడు. అతడికి బయట నుంచి భీభత్సంగా సపోర్ట్ చేస్తోంది సిరి. తాజాగా ఆమె బిగ్‌బాస్ కెఫెలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలు మనసు విప్పి మాట్లాడింది. 'ఇంట్లో ఎవరూ శ్రీహాన్‌కు బెస్ట్ ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వలేదు. అది చూసిన నాకే ఎంతో బాధనిపించింది, ఆ పరిస్థితిలో శ్రీహాన్ ఎంత బాధపడ్డాడో! నాకు పెళ్లి కాకుండానే కొడుకు చైతూ ఎలా వచ్చాడనుకుంటున్నారు. అతడు మా మామయ్య కొడుకు. కరోనా సమయంలో వైజాగ్ వెళ్లాం. అప్పుడు మాకు బాగా దగ్గరయ్యాడు. మామయ్యకు ఆరోగ్యం, ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో మేము తెచ్చేసుకుని పెంచుకుంటున్నాం. బహుశా ఏడాదిలోపు మా పెళ్లి కూడా అయిపోతుందనుకుంటా' అని చెప్పుకొచ్చింది. బ్రేకప్ రూమర్స్ గురించి మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ ఐదో సీజన్ తర్వాత మా మధ్య చాలా గొడవలయ్యాయి. బ్రేకప్ వరకూ వెళ్లాము. అతడు నన్ను వదిలి వెళ్లాక నాకు కోవిడ్ వచ్చింది. ఎవరికీ కనిపించకుండా ఎటైనా వెళ్లిపోదామనుకున్నాను. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి రోడ్ల మీద చెప్పులు లేకుండా తిరిగాను. ఫోన్ ఆన్ చేయగానే శ్రీహాన్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే జీవితంలో కనిపించను అని మెసేజ్ పెట్టాడు. వెంటనే నేను కాల్ చేశాను, రోడ్డు మీద తిరుగుతున్న నన్ను వచ్చి తీసుకెళ్లాడు. అలా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు మేము ఎప్పటికీ విడిపోనంత దగ్గరయ్యాం' అని చెప్పుకొచ్చింది సిరి. చదవండి: సూసైడ్ బాంబ్ అనుకొని అరెస్ట్ చేశారు: సత్యదేవ్ శ్రీసత్య, ఇనయల పరువు పాయే -
భయపడి చస్తూనే గెలిచేశారుగా, ఇప్పుడు ప్రైజ్‌మనీ ఎంతంటే?
Bigg Boss Telugu 6, Episode 95: ఇప్పటిదాకా నేను ఆడతానంటే నేను ఆడతానని ముందుకు వచ్చిన హౌస్మేట్స్ ఈరోజు దెయ్యం టాస్కులో మాత్రం నావల్ల కాదు బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోయారు. అయినా సరే విడిచిపెట్టని బిగ్‌బాస్ వారిని చీకటి గదిలోకి పిలిచి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఇంతకీ ఈ టాస్కులో వారు గెలిచారా? లేదా? అసలు ప్రైజ్‌మనీ లెక్క సెట్టయిందా? అనే విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! దెయ్యం దెబ్బకు జడుసుకుని చస్తున్నారు హౌస్మేట్స్. మరీ ముఖ్యంగా దెయ్యం పేరెత్తితేనే వణికిపోతున్నాడు ఆదిరెడ్డి. చూడటానికి తాటిచెట్టులా ఉన్నావు, అలా భయపడతావేంటి భయ్యా అని రేవంత్ సెటైర్లు వేశాడు. ఇకపోతే బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు నేడు ఐదో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో రోహిత్, ఆదిరెడ్డి పాల్గొన్నారు. వీరిలో విజేతను ఎంచుకోండంటూ మిగతా ఇంటిసభ్యులకు తలా ఇరవై వేలు అప్పజెప్పాడు బిగ్‌బాస్. ఈ ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి విజయం సాధించాడు. శ్రీసత్య మినహా మిగతా నలుగురు ఆదిరెడ్డికి సపోర్ట్ చేయడంతో వారి దగ్గరున్న మొత్తం కలిపి రూ.80 వేలు గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత పరమాన్నం కోసం కప్పులు తెచ్చుకోండని శ్రీహాన్‌కు చెప్పాడు రేవంత్. అన్నం తిన్నాక పరమాన్నం తింటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో రేవంత్.. నేను మీకు తినమని చెప్పలేదు, కేవలం రుచి చూడమన్నాననంతేనని మాట మార్చాడు. ఈ మాటతో అవాక్కైన శ్రీహాన్, శ్రీసత్య.. ఇందాకే కదా, కప్పులు తెచ్చుకో అన్నావ్ అని నిలదీయగా నేను జస్ట్ టేస్ట్ చూడమన్నాను, ప్రతిదాంట్లో తప్పులు వెతక్కండి అని అలిగాడు. రేవంత్‌కు తన తప్పులు చెప్తే అస్సలు తీసుకోడంటూ అసహనం వ్యక్తం చేశాడు శ్రీహాన్. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఇచ్చిన ఆరో ఛాలెంజ్‌లో శ్రీహాన్, కీర్తి పోటీపడ్డారు. హౌస్మేట్స్ అందరూ నీకే ఓటేస్తారు కాబట్టి బాగా ఆడి గెలవమని శ్రీహాన్‌కు సిగ్నల్స్ ఇచ్చింది కీర్తి. అన్నట్లుగానే ఈ గేమ్‌లో హౌస్మేట్స్ అందరూ శ్రీహాన్‌కే సపోర్ట్ చేయగా అతడు గెలవడంతో ప్రైజ్‌మనీలో రెండు లక్షలు జమయింది. ఈ టాస్కులో కుండ పగలగొట్టగా దాని మట్టి ఏరుకుని తిన్నారు శ్రీసత్య, ఇనయ, కీర్తి. ఇది చూసిన బిగ్‌బాస్.. ఇకనుంచి మీకు రేషన్‌కు బదులుగా మట్టి పంపిస్తే సరిపోతుందా అని ఆటపట్టించాడు. తర్వాత ఇంటిసభ్యులకో డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు. సమయానుసారం కన్ఫెషన్ రూమ్‌కి పిలుస్తానని, అప్పుడు తాను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే డబ్బులు లభిస్తాయన్నాడు. మొదట ఆదిరెడ్డిని పిలిచాడు. కన్ఫెషన్ రూమ్ గదంతా చీకటిగా ఉండటంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు ఆది. గదిలోని క్యాండిల్ వెతికి బయటకు తీసుకెళ్లమని ఆదేశించాడు బిగ్‌బాస్. అతడికి ఎంతసేపటికి క్యాండిల్ దొరకకపోవడంతో ఎవరైనా తోడు కావాలా? అని అడిగాడు. దీంతో అతడు శ్రీహాన్ పేరు చెప్పాడు. ఇక అప్పటికే భయపడి చస్తున్న ఆదిరెడ్డిని తన భయంతో మరింత హడలెత్తించాడు. ఇద్దరూ భయపడి చస్తూనే వస్తువులను వెతికారు. వీరి భయాన్ని చూసి ప్రేక్షకులు నవ్వాపుకోవడం కష్టమే! ఫైనల్‌గా ఇద్దరూ కలిసి క్యాండిల్, గన్ సాధించి పట్టుకోవడంతో మరింత డబ్బు జమైంది. ఫైనల్‌గా ఈ రోజు ఎపిసోడ్ ముగిసే సమయానికి ప్రైజ్‌మనీ రూ. 44,35,100కి చేరింది. చదవండి: రేవంత్ ఫుడ్ గొడవలు, ఇక మారడా? బుట్టబొమ్మతో లవ్‌లో పడ్డ సల్మాన్ ఖాన్ -
వణికిపోయిన శ్రీహాన్, ఆది.. ఉట్టి పిరికిపందల్లా ఉన్నారే!
మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా మాటలో, ఆటలో దూసుకుపోయే ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను భయంతో గజగజ వణికిపోయేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. నిన్న దెయ్యం అరుపులతో హౌస్‌మేట్స్‌ను హడలెత్తించిన బిగ్‌బాస్ నేడు వారందరికీ ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. చీకటి గదిలోకి వెళ్లి క్యాండిల్‌ను కనుక్కోవాలని ఆదిరెడ్డికి ఓ పని అప్పజెప్పాడు. కానీ ఆది అడుగు తీసి అడుగు ముందుకు వేస్తే కదా.. భయంతో ఉన్నచోటనే ఉండిపోయాడు. అతడు భయపడటంతో మీకు తోడు కోసం ఎవరినైనా పంపించాలా? అని బిగ్‌బాస్ అడిగాడు. ఇందుకతడు శ్రీహాన్ పేరు చెప్పడంతో అతడిని చీకటి గదిలోకి రమ్మన్నాడు బిగ్‌బాస్. శ్రీహాన్ వచ్చి ధైర్యం చెప్తాడనుకుంటే అరుపులు, కేకలతో ఆదిరెడ్డిని మరింత భయపెట్టాడు. మరి ఇంతకీ వాళ్లిద్దరూ ఆ ఛాలెంజ్ గెలిచారా? లేదా? చూడాలి. చదవండి: కేజీఎఫ్ నటుడు కన్నుమూత -
రేవంత్ ఫుడ్ గొడవలు.. ఇప్పటికైనా మారడా?
మరి కొద్ది రోజుల్లో బిగ్‌బాస్ కథ ముగియనుంది. ఇలాంటి సమయంలో రసవత్తరమైన టాస్కులతో ఆటను రక్తికట్టించాల్సిన బిగ్‌బాస్ సోది టాస్కులిస్తూ మరింత చిరాకు పుట్టిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ ఒక్కరూ విన్నర్ మెటీరియల్ అనిపించకపోవడం సీజన్‌కే పెద్ద మైనస్. కాస్తో కూస్తో అభిమానగణంతో, ఆటతో విన్నర్ అవుతాడనుకున్న రేవంత్ తన ప్రవర్తనతో జనాలకు మరింత చికాకు పుట్టిస్తున్నాడు. ప్రతిదానికీ గొడవలు పడుతూ నేనే తోపు అన్నట్లుగా మాట్లాడుతూ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. తాజాగా అతడు ఇంట్లోవారితో మరోసారి గొడవపడ్డట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇందులో రేవంత్.. ఫుడ్ కోసం శ్రీహాన్‌ను కప్పు తెచ్చుకోమన్నాడు. అంతలోనే నేను తినమని చెప్పలేదంటూ మాట మార్చాడు. వెంటనే అందుకున్న శ్రీహాన్, శ్రీసత్య.. ఇప్పుడే కప్పు తెచ్చుకోమన్నావ్ కదా అని నిలదీయడంతో రేవంత్ ఉలిక్కిపడ్డాడు. ప్రతిదాంట్లో తప్పులు వెతికితే నావల్ల కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే ఒప్పుకునే ధైర్యం ఉండాలని రేవంత్‌పై శ్రీహాన్ గరమయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు మరో ఛాలెంజ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ అందరూ ప్లాన్ ప్రకారం ఆడి గెలిచినట్లు తెలుస్తోంది. అదెలాగో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం.. శ్రీహాన్ దుప్పట్లో చేరిన శ్రీసత్య ఆ మూడు దెబ్బల వల్ల బాలీవుడ్‌నే వదిలేద్దామనుకున్నా: హీరో -
ఇనయకు దెయ్యం పట్టింది! భయంతో వణికిపోయిన ఆదిరెడ్డి, శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 94: మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు హౌస్‌మేట్స్‌కు వరుస ఛాలెంజ్‌లు విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్‌లలో ఎవరు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో చెప్పాలన్నాడు. అందులో ఎవరు గెలుస్తారో కూడా ముందే ఊహించాలన్నాడు. కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగిస్తానని మెలిక పెట్టాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నేడు రెండో ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రేవంత్, ఇనయ పోటీపడ్డారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.1,10,000 ప్రైజ్‌మనీకి తిరిగి యాడ్ అవుతాయన్నాడు. అందరూ అనుకున్నట్లుగా పిరమిడ్ పడొద్దు అనే ఛాలెంజ్‌లో రేవంత్ విజయం సాధించడంతో రూ.1,10,000 గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత మూడో ఛాలెంజ్ కోసం ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంచుకోమన్నాడు. దీంతో ఆదిరెడ్డి- కీర్తి, శ్రీహాన్- శ్రీసత్య మనీ ట్రాన్స్ఫర్ గేమ్‌లో పోటీపడ్డారు. ఇనయ, రేవంత్, రోహిత్.. ఆదిరెడ్డి టీమ్ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీహాన్- శ్రీసత్య గెలవడంతో వారు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత రేవంత్ ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ పాట పాడగా ఆదిరెడ్డి అందుకనుగుణంగా స్టెప్పులేశాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో ఛాలెంజ్ ప్రవేశపెట్టాడు. పవర్ పంచ్ టాస్క్‌లో రేవంత్, ఇనయ పాల్గొనగా అందరూ ఊహించినట్లు రేవంత్ గెలవడంతో ప్రైజ్‌మనీకి మరో రూ.2 లక్షలు జమయ్యాయి. దీంతో మొత్తం ప్రైజ్‌మనీ రూ.41,10,100కి చేరింది. రాత్రి శ్రీసత్య ఓ దెయ్యం కథ చెప్పింది. ఓ ఫంక్షన్లో ఓ అబ్బాయి వింతగా ప్రవర్తించాడని చెప్పింది. అందరూ ఆ అబ్బాయిని కొడుతున్నా అతడికి చలనం లేకుండా అలాగే నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడని చెప్పింది. ఇంతలో సడన్‌గా దెయ్యం సౌండ్ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్ బెడ్ మీదకు చేరింది. ఇక శ్రీహాన్ అయితే బాత్రూమ్కి వెళ్లడానికి కూడా భయపడ్డాడు. అది గమనించిన శ్రీసత్య కావాలని దెయ్యంలా నవ్వుతూ అతడిని మరింత భయపెట్టింది. ఇక ఇనయ అయితే ఏకంగా దెయ్యం పట్టినదానిలా ప్రవర్తించి ఆదిరెడ్డిని వణికిపోయేలా చేసింది. దెయ్యం భయంతో అందరూ జడుసుకుంటూ, నవ్వుకుంటూ ఏ అర్ధరాత్రికో పడుకున్నారు. చదవండి: స్టేజీపై భార్యను పరిచయం చేసిన హీరో సత్యదేవ్ నేను టాప్5లో ఉండనని తెలుసు, రేవంత్ ఎలిమినేట్ అవ్వాలి: ఫైమా -
ఆదిరెడ్డితో ఫ్రెండ్షిపే వద్దన్న శ్రీహాన్, రోహిత్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో రోహిత్ మినహా అందరూ ఏదో ఒక వారం కెప్టెన్ అయ్యారు. ఇప్పటికే ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? అని ఆరా తీస్తే ఇనయ బెస్ట్, ఆదిరెడ్డి వరస్ట్ కెప్టెన్ అని తేలింది. ఇక ఈ రోజు మరో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు నాగ్. హౌస్ నుంచి బయటకు వెళ్లాక జీవితాంతం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎవరితో ఫ్రెండ్షిప్ను ఇక్కడే కట్ చేస్తారని అడిగాడు. దీనికి శ్రీహాన్, రోహిత్.. రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆది రెడ్డిని తరచూ కలవడం కష్టమని చెప్పారు. కీర్తి మాట్లాడుతూ.. ఇనయ బాగా క్లోజ్ అయిందని చెప్పింది. తర్వాత రేవంత్ తెలివిగా అబ్బాయిల్లో నుంచి శ్రీహాన్, అమ్మాయిల్లో నుంచి శ్రీసత్య జీవితాంతం స్నేహితులుగా ఉండిపోతారని చెప్పాడు. ఇక హౌస్మేట్స్ వ్యక్తిత్వానికి సరిపోయేలా కొన్ని సినిమా పోస్టర్లను వారికి అంకితం చేశాడు బిగ్‌బాస్. అలా శ్రీసత్యకు అందాల రాక్షసి పోస్టర్, శ్రీహాన్‌కు దేశముదురు, ఇనయకు ఓ పిట్టకథ ఇలా పోస్టర్లు వేసుకుంటూ వెళ్లారు. చదవండి: బ్యూటీ సెలూన్ అమ్మి పాత ఇల్లు కొన్న కమెడియన్ క్రికెటర్‌తో లవ్.. మా మధ్య స్నేహం చెడింది: నటి -
టికెట్ టు ఫినాలే గెలిస్తే ఓటమి ఖాయమేనా?
బిగ్‌బాస్ షోలో ముఖ్యమైన ఘట్టం టికెట్ టు ఫినాలే. నిజంగానే టికెట్ టు ఫినాలే గెలవడం అవసరమా? ఇది గెలవకుండా ఫినాలేలో అడుగుపెట్టలేరా? ఇది గెలిచినవారు ఇంతకుముందు ఎవరైనా కప్పు కొట్టారా? లేదా? ఈ వివరాలన్నీ ఓసారి చదివేద్దాం.. బలమైన కంటెస్టెంట్‌కు భారీ అభిమానగణం తోడైతే వారికి టికెట్ టు ఫినాలే అవసరమే లేదు. అది లేకుండానే ఈజీగా ఫినాలేకు వెళ్లొచ్చు. కానీ రిస్క్, టెన్షన్ లేకుండా టాప్ 5లో చోటు దక్కించుకోవాలంటే మాత్రం టికెట్ టు ఫినాలే గెలుచుకోవాల్సిందే! నిజానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన మొదటి సీజన్లో టికెట్ టు ఫినాలే ప్రస్తావనే లేదు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్లో సామ్రాట్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫినాలేలో మొదటగా అడుగుపెట్టాడు. కానీ విజేతగా అవతరించలేకపోయాడు. నాగార్జున హోస్ట్‌గా చేసిన మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని మొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. అంతేకాకుండా ఆ సీజన్ విజేతగానూ అవతరించాడు. ఈ టికెట్ గెలిచి కప్పు కొట్టిన మొట్టమొదటి వ్యక్తిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. నాలుగో సీజన్లో టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. ఐదో సీజన్లో శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే సాధించాడు. కాకపోతే ఓ టాస్క్‌లో శ్రీరామ్ కాళ్లు సహకరించకపోవడంతో అతడి తరపున సన్నీ, షణ్ముఖ్‌లు టాస్క్‌లు పూర్తి చేసి అతడిని గెలిపించడం విశేషం. ఈ ఐదు సీజన్స్ గమనిస్తే టికెట్ టు పినాలే గెలిచినవారిలో రాహుల్ సిప్లిగంజ్ మినహా ఎవరూ విజేతలుగా నిలవలేకపోయారు. అఖిల్ ఒక్కడే కనీసం రన్నరప్ దాకా వచ్చి ఆగిపోయాడు. మరి ఈ సీజన్లో శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి అతడు విన్నర్ లేదా రన్నర్ అవుతాడా? ప్రస్తుతం అనధికారిక పోల్స్ చూస్తే రేవంత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఉన్న కొద్ది రోజుల్లో తన గ్రాఫ్ పెంచుకుని శ్రీహాన్ విన్నర్ అవుతాడా? కనీసం రన్నరప్‌గా అయినా నిలుస్తాడా? అనేది చూడాలి! చదవండి: మహేశ్‌బాబుతో మాట్లాడా, ఆయన అలా అనేసరికి కన్నీళ్లొచ్చాయి ఆ ముగ్గురూ వేస్ట్, అంత భయముంటే బిగ్‌బాస్‌కు రావొద్దు: రేవంత్ -
ముగ్గురమ్మాయిలపై రెచ్చిపోయిన కంటెస్టెంట్లు, తగ్గేదేలేదన్న రోహిత్
Bigg Boss 6 Telugu, Episode 90: 'టికెట్ టు ఫినాలే' ఛాలెంజ్ రేసులో రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్ ఐదుగురు మిగిలారు. అయితే తదుపరి ఛాలెంజ్‌లో వీరిలో నుంచి ముగ్గురు మాత్రమే పోటీపడాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఎవరికి వారు నేను తప్పుకోనంటే నేను తప్పుకోనంటూ వాదులాటకు దిగారు. దీంతో ఆ ముగ్గురు ఎవరో డిసైడ్ చేయండంటూ సంచాలకులైన ఇనయ, కీర్తి, శ్రీసత్యలపై భారం వేశాడు బిగ్‌బాస్. ఈ ముగ్గురు.. స్కోర్ బోర్డులో చివర్లో ఉన్న ఫైమా, రోహిత్, రేవంత్‌లను సెలక్ట్ చేశారు. టాప్‌లో ఉన్నవాళ్లను తీసేసి వేరేవాళ్లకు ఛాన్స్ ఇవ్వడమేంటి? ఈ సీజన్లో ఇదే వరస్ట్ డెసిషన్ అని చిరాకుపడ్డాడు ఆది. ఆలోచనలో పడ్డ రోహిత్.. టాప్ పొజిషన్లో ఉన్న వాళ్లను తీసేసి చివర్లో ఉన్న తనను ఆడేందుకు సెలక్ట్ చేయడం కరెక్ట్ కాదని భావించి గేమ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించాడు. అంటే గేమ్ ఆడనని చెప్తున్నావా? అని ఇనయ అడగడంతో శ్రీహాన్ ఫైరయ్యాడు. ఆటలో నుంచి తప్పుకుంటున్నవాళ్లను ఎందుకు బతిమాలుతున్నావు? అందరికీ ఛాన్స్ ఇవ్వడానికి ఇది ఫన్డే గేమ్ కాదని చురకలంటించాడు. దీంతో వెనక్కు తగ్గిన సంచాలకులు తమ నిర్ణయం మార్చుకుని రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఆడుతున్నారని చెప్పారు. చివర్లో ఉన్న రోహిత్ ఆడను అన్నందున చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఫైమాను కూడా తొలగించామని ఇనయ స్పష్టతనిచ్చింది. ఈ ఒక్కమాటతో గేమ్‌లో ఉన్నవాళ్లంతా నిప్పులు చెరిగారు. ఇంతకుముందు ఓమాట ఇప్పుడో మాట అంటూ సంచాలకులను తిట్టిపోశారు. రోహిత్ అయితే నా వల్ల ఫైమాను తొలగించామంటారేంటి? అంటూ ఇనయ మీద మండిపడ్డాడు. అయితే టాప్ 3 లేదంటే లాస్ట్‌లో ఉన్న 3 మెంబర్స్‌నే ఆడించాలనుకున్నాం అని సంచాలకులుగా చెప్తున్నా.. అది మీరెలా డిసైడ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. అసలేం సంచాలకులు వీరు, ముగ్గురూ వేస్టే.. అంత భయమున్నప్పుడు బిగ్‌బాస్‌కు రాకూడదు అంటూ రేవంత్ మరోసారి తన నోటిదురుసు ప్రదర్శించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లో రేవంత్ గెలవగా శ్రీహాన్, ఆది తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. సెకండ్ లెవల్ ముగిసే సమయానికి రేవంత్ 15, శ్రీహాన్, ఆది 14, ఫైమా 7, రోహిత్ 6 పాయింట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. సమాన పాయింట్లు వచ్చిన ఆది, శ్రీహాన్‌లకు ఓ గేమ్ ఇవ్వగా అందులో శ్రీహాన్ గెలిచాడు. దీంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రేవంత్, శ్రీహాన్ టికెట్ టు ఫినాలే రేస్ కోసం పోటీపడ్డారు. ఇకపోతే శ్రీహాన్ టికెట్ టు ఫినాలే సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్టుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్ ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆది -
బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యే పోటీ, ఫినాలేలో అడుగుపెట్టింది అతడే!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ కథ క్లైమాక్స్‌కు చేరువైంది. టికెట్ టు ఫినాలేతో టాప్ 5లో ఎవరు మొదట అడుగుపెడతారనేది తేలిపోనుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం మరో రెండు వారాల్లో సీజన్‌కు కొబ్బరికాయ కొట్టేయడం ఖాయం. ఇకపోతే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో ఏకాభిప్రాయం అంటూ పదేపదే హౌస్‌మేట్స్‌ను ఇరుకునపెడుతున్నాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో ఇప్పటికే కీర్తి, ఇనయ, శ్రీసత్య అవుట్ అయిపోగా మిగతా ఐదుగురు రేసులో ఉన్నారు. ఈ పోటీలో చివరగా శ్రీహాన్, రేవంత్ మిగలగా శ్రీహాన్ గెలిచి టికెట్ టు ఫినాలే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి శ్రీహాన్ ఈ టికెట్ టు ఫినాలే గెలవకపోయినా ఈజీగా టాప్ 5లో ఉంటాడు. ఏదేమైనా ఈ సీజన్లో మొదటి ఫైనలిస్టుగా నిలిచిన శ్రీహాన్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు అభిమానులు. చదవండి: జూబ్లీహల్స్లో 84 ఎకరాల ఫామ్ హౌస్ ప్రముఖ నటి కన్నుమూత -
టికెట్ టు ఫినాలే విజేత, ఫస్ట్ ఫైనలిస్ట్ అతడే!
టికెట్ టు ఫినాలే.. ఈ ఒక్క టాస్క్ గెలిస్తే చాలు నేరుగా ఫినాలేలో అడుగు పెట్టొచ్చు. అందుకే ఎలాగైనా ఈ బంపర్ ఆఫర్ అందుకుని తీరాల్సిందేనని కసిగా ఆడుతున్నారు హౌస్మేట్స్. అయితే ఈ పోటీలో నెక్స్ట్ ఛాలెంజ్ కోసం పోటీపడే నలుగురు సభ్యులు ఎవరనేది ఇంటిసభ్యులే ఏకాభిప్రాయంతో నిర్ణయించాలన్నాడు బిగ్‌బాస్. ఇది విని హౌస్మేట్స్ డీలా పడిపోయారు. ఏకాభిప్రాయంలో తమని తీసేస్తే అప్పటిదాకా పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన చెందారు. అయినా టికెట్ టు ఫినాలేలో ఏకాభిప్రాయం ఆప్షన్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేశాడు ఆదిరెడ్డి. ఆడి ఓడిపోయినా పర్వాలేదు కానీ ఏకాభిప్రాయం వల్ల ఆడకుండానే ఆట నుంచి తప్పుకుంటే అది భరించలేమన్నాడు రోహిత్. ఒకవేళ టికెట్ టు ఫినాలేలో ఏకాభిప్రాయం వల్ల నన్ను తీసేస్తే ఒక్కడిని కూడా గెలవనివ్వని వార్నింగ్ ఇచ్చాడు శ్రీహాన్. మరి కంటెస్టెంట్లు తిరగబడటంతో బిగ్‌బాస్ వెనక్కు తగ్గాడా? లేదంటే హౌస్‌మేట్సే అడ్జస్ట్ అయి ఆటలో ముందుకు సాగారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సోషల్ మీడియా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిరెడ్డి టికెట్ టు పినాలే టాస్క్ గెలిచి టాప్ 5లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: టికెట్ టు ఫినాలే కోసం పోటాపోటీగా ఫైట్ చేసిన లేడీ టైగర్స్ -
Bigg BOss 6 :మీరిద్దరు చేస్తుందేంటి? అది ఎటాక్‌లా లేదు.. టెలికాస్ట్‌లో చూసుకోండి!
Bigg Boss Telugu 6 Episode 87: బిగ్‌బాస్ ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ని పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి ‘స్నో మెన్’ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించేందుకు అవసరమైన ముక్కలు పై నుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి. ఎవరైతే ముందుగా స్నోమెన్‌ని రెడీ చేస్తారు వారు విజేతగా నిలుస్తారు. ఈ టాస్క్‌కి సంచాలక్‌గా ఇనాయాను నియమించాడు బిగ్‌బాస్. మొదటి దశలో రేవంత్, ఆదిరెడ్డి ఎక్కువ ముక్కలను సేకరించి స్నోమెన్‌ని నిర్మించారు. రోహిత్, ఫైమా, కీర్తి మాత్రం గేమ్ నియమాలకు విరుద్దంగా సేకరించిన వస్తువులను తమ దగ్గరే పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సంచాలక్‌గా ఉన్న ఇనయా గమనించలేదు. దీంతో బిగ్‌బాస్ ఇనయాను తొలగించి రేవంత్‌ని సంచాలక్‌గా నియమించాడు. రేవంత్ సంచాలక్‌గా వచ్చి రావడంతోనే కఠిన నియమాలు పెట్టాడు. సత్య తీసుకున్న స్నో మెన్ పార్ట్ విరిగిపోవడంతో దాన్ని అతికించి పెట్టింది. అలా చేస్తే కౌంట్ రాదని రేవంత్ చెప్పినా కూడా వినకుండా ‘అతికించినట్టు ఏమైనా తెలుస్తుందా ఏంటి కౌంట్ చేయకపోతే అది నీ ఇష్టం’ అని సత్య అసహనం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ ఆదేశంతో అందరికంటే తక్కువ వస్తువులున్న శ్రీసత్యను టాస్క్ నుంచి ఎలిమినేట్ చేశాడు రేవంత్. ఆ తర్వాత రెండో లెవల్ మొదలవుతుంది. ఇందులో భాగంగా స్టార్ట్-ఎండ్ బజర్ల మధ్య ఉన్న సమయంలో ఇతరుల బొమ్మలపై దాడి చేసి వీలైనన్ని వస్తువులను దొంగిలించవచ్చని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే పోటీదారులు మాత్రం పెద్దగా గొడవకు దిగలేదు. దొంగిలించడం పక్కకి పెట్టి తమ బొమ్మలను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రయత్నించారు. ఇనయా మాత్రం శ్రీహాన్ బొమ్మపై దాడి చేసేందుకు ట్రై చేసింది. ఈ క్రమంలో శ్రీహాన్ ఇనయాని గట్టిగా హత్తుకొని తన బొమ్మ దగ్గరకు వెళ్లకుండా చేశాడు. ఇనయా కూడా గతంలో మాదిరి గట్టిగా దాడికి దిగలేదు. ఒకర్నొకరు లాక్కోవడం, పట్టుకోవడం లాంటివి రొమాంటిక్‌గా చేశారు. శ్రీసత్య ఈ విషయాన్ని గమనించి ‘అసలు మీరిద్దరు ఏం చేశారు?’ అని అడగ్గా.. ఇనయా సిగ్గు పడుతూ.. ఎటాక్ చేశామని చెప్పింది. ‘అది ఎటాక్‌లా లేదు.. కావాలంటే టెలికాస్ట్‌లో చూసుకోండి’ అని శ్రీసత్య చెప్పింది. ఇంతటితో ఆగకుండా.. ఇనయాతో బాగానే చేశావే.. దొరికిపోయావ్ శ్రీహాన్ అంటూ ఆటపట్టించింది. రేవంత్, ఫైమా అయితే ఏకంగా వీరిద్దరు ఎలా చేశారో ఇమిటేట్ చేసి చూపించారు. శ్రీహాన్, ఇనయాలు ఈ విషయాన్ని కామెడీగానే తీసుకున్నారు. శ్రీహాన్ అయితే ఈ సంఘటనను మగధీర సినిమాతో పోలుస్తూ.. సత్య మిత్రవింద అని, ఇనయా ఐటమ్ గర్ల్ అని చెప్పాడు. దీంతో ఇనయా అలుగుతుంది. ఆమెను కూల్ చేసేందుకు నాయానే మిత్రవింద.. సత్య ఐటెమ్ గర్ల్ అని శ్రీహాన్ అన్నాడు. ఆ తర్వాత స్నోమెన్ టాస్క్‌లు తక్కువ వస్తువులు సేకరించిన కారణంగా ఇనయా, కీర్తిలను తొలగిస్తున్నట్లు సంచాలక్ శ్రీసత్య ప్రకటిస్తుంది. -
నీలాంటోళ్లు బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉండొద్దు: రేవంత్
Bigg Boss 6 Telugu, Episode 86: ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. అటు రాజ్ తన వల్లే వెళ్లిపోయాడని తెగ ఫీలైంది ఫైమా. ఇంతకీ ఈరోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నేను శ్రీసత్యతో కలిసి ఉన్నందుకు ఏవేవో అనేస్తున్నావు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావని రేవంత్ మీద సీరియసయ్యాడు శ్రీహాన్. ఏదైనా అనేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ గరమయ్యాడు. దీంతో హర్టయిన రేవంత్ దూరంగా వెళ్లి కూర్చున్నాడు. కానీ కాసేపటికే ఈ గొడవలన్నీ ఎందుకు? మునుపటిలా మాట్లాడుకుందామంటూ కలిసిపోయారు. మరోపక్క ఫైమా.. తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఓట్లు వచ్చినా సరే రాజ్ వెళ్లిపోయాడని ఏడ్చేసింది. గతవారం రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు పాడైపోయిన పండ్లు, ఆకుకూరల ఫొటోలను రోహిత్‌కు చూపించాడు బిగ్‌బాస్. ఇక మీదటైనా ఆహారం వేస్ట్ కాకుండా చూసుకోమని హెచ్చరించాడు. ఇంట్లో జరిగిన తప్పు కారణంగా తమకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ రద్దు చేయమని అడిగాడు ప్రస్తుతం రేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్. అనంతరం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.. ► ఆదిరెడ్డి.. రేవంత్, రోహిత్ ► ఫైమా.. రేవంత్, రోహిత్ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► కీర్తి.. రేవంత్, శ్రీసత్య ► శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డి ► రోహిత్.. ఆది రెడ్డి, ఫైమా ► రేవంత్.. ఆది రెడ్డి, ఫైమా ► ఇనయ.. రేవంత్, శ్రీసత్య ముందుగా ఆదిరెడ్డి.. నాగార్జునగారు చూపించిన వీడియోలో ముందు జరిగిన డిస్కషన్ చూపించలేదు. నువ్వు గేమ్‌లో అమ్మాయి వస్తే మనకే లాభం అన్నట్లుగా మాట్లాడావు. అప్పుడు, ఇప్పుడు, ఇంకో పదేళ్ల తర్వాత కూడా నేను ఈ మాటపైనే స్టాండ్ అయి ఉంటా అని బల్లగుద్ది చెప్పాడు. అటు రేవంత్ మాత్రం నాగ్ సర్ ఆల్రెడీ నీదే తప్పని చెప్పాడు, ఇంక దీనికోసం చర్చించడం అనవసరం అంటూ నిట్టూర్చాడు. అటు ఫైమా - రేవంత్, శ్రీహాన్ - ఆదిరెడ్డిల మధ్య ఫైట్ మామూలుగా జరగలేదు. 'రోహిత్ స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తున్నావ్, అంటే నువ్వు వీక్ కదా, అలాంటివాళ్లు హౌస్‌లో ఉండనవసరం లేదు, నిన్ను బయటకు పంపించడానికే నామినేట్ చేస్తున్నా' అని ఫైమాతో వాదించాడు రేవంత్. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫైమా ఉగ్రరూపం దాల్చింది. 'రేవంత్ ముందొకటి మాట్లాడతాడు, వెనకాల ఒకటి మాట్లాడతాడు. ఇలా మాటలు మార్చేది ఎవరికీ కనిపించట్లేదా? ఎన్నోసార్లు నోరుజారాడు. అదెందుకు కనిపించట్లేదు?' అని అటు కంటెస్టెంట్లు, ఇటు బిగ్‌బాస్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది.ఫైనల్‌గా ఈ వారం ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, కీర్తి నామినేట్ అయ్యారు. చదవండి: నోరు జారుతుంది నువ్వు.. రేవంత్‌పై ఫైమా ఉగ్రరూపం బిగ్‌బాస్: రాజ్ రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఆదిరెడ్డి Vs శ్రీహాన్, నామినేషన్లో ఎవరున్నారంటే?
రాజ్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. ఇక నామినేషన్ ప్రక్రియకు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజైంది. ఫైమా మాట్లాడుతూ.. రేవంత్ తర్వాత నువ్వే స్ట్రాంగ్ అంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. నేను చెప్పేది వినకపోతే వెళ్లి సోఫాలో కూర్చో అంటూ రేవంత్ మీద ఫైరయ్యాడు ఆదిరెడ్డి. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో బిగ్‌బాస్ కనిష్ట ధర నీ నిర్ణయానికే వదిలేసినా నువ్వు చెక్ మీద లక్ష రూపాయలు రాయడం తప్పన్నాడు శ్రీహాన్. అంతా అయిపోయాక ఎవ్వరైనా మాట్లాడతారని ఆదిరెడ్డి పెదవి విరవడంతో అది మినిమమ్ కామన్సెన్స్ అన్నా, నేనైతే రూపాయి కూడా రాసేవాడిని అని మండిపడ్డాడు శ్రీహాన్. సెన్స్ అంటే ఫీలైన నువ్వు కామన్సెన్స్ అని మాట్లాడుతున్నావు, అది ఎంతవరకు కరెక్టో నీకే తెలియాలి అని కౌంటరిచ్చాడు ఆది. ఇక ఈ వారం కెప్టెన్ ఇనయ, శ్రీహాన్ మినహా మిగతా ఆరుగురు నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజ్ ఎలిమినేషన్‌కు కారణాలివే! ఒక్కటైన ప్రేమ జంట, ఫోటోలు వైరల్ -
ఆ కంటెస్టెంట్ పరువు తీసిన రాజ్, అతడే విన్నర్ అని వెల్లడి
Bigg Boss Telugu 6, Episode 85: ఎవరు తప్పు చేశారో నిలబెట్టి క్లాసు పీకే నాగార్జున ఈసారి మాత్రం డిఫరెంట్‌గా వారి తప్పొప్పులను వారితోనే చెప్పించాడు. హౌస్‌మేట్స్‌లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో చెప్పమని ఆదేశించాడు నాగ్. ముందుగా రోహిత్ మాట్లాడుతూ.. 'కీర్తి ఎక్కువ బాధపడుతుంది, ఫైమా, శ్రీసత్యలో వెటకారం ఎక్కువ. ఇనయ ఎవరికీ అవకాశమివ్వకుండా మాట్లాడుతుంది, రాజ్ పాయింట్ లేకున్నా అరుస్తాడు, రేవంత్‌కు కోపమెక్కు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు' అంటూ వారిలోని లోపాలను ఏకరువు పెట్టాడు. ఇలా అందరి గురించి చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ సాగదీయాల్సి వస్తుందనుకున్నాడో ఏమోకానీ నలుగురి కంటెస్టెంట్లలోని చెడు లక్షణాలు చెప్తే సరిపోతుందన్నాడు నాగ్. దీంతో ఇనయ మాట్లాడుతూ.. 'శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది. రేవంత్ ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతున్నాడు. రాజ్ నేనున్నానని చూపించుకోవడానికి అరుస్తాడు. ఆదిరెడ్డి ఆడకుండా కూర్చోవడం కరెక్ట్ కాదు' అని చెప్పింది. కీర్తి వంతు రాగా రేవంత్ అన్న ఓవర్ అగ్రెసివ్, శ్రీసత్య, శ్రీహాన్ వెటకారం, రోహిత్ ఎక్కువ కలవకపోవడం మైనస్ అని చెప్పింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'రేవంత్ బాగా ఆడతాడు, కానీ తాను బాగా ఆడతానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇనయ చాలా మాటలు వదిలేస్తుంది. శ్రీసత్యకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. రోహిత్ గట్టిగా స్పందించరు' అని చెప్పాడు. ఫైమా.. సరేవంత్ కోపం నచ్చదు. ఇనయ మాటతీరు మార్చుకోవాలి. రోహిత్ గేమ్‌లో పెద్దగా పర్ఫామెన్స్ కనిపించట్లేదు. కీర్తి ఎక్కువ ఎమోషనల్ అవుతుందిస అని చెప్పింది. శ్రీసత్య.. రోహిత్ సరైన టైమ్‌కు రియాక్ట్ అవడు. కీర్తి ఏం చెప్పినా వినిపించుకోదు. ఇనయ ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పింది. రాజ్ మాట్లాడుతూ.. రోహిత్ గట్టిగా మాట్లాడడు. ఇనయ ప్రతిదానిలో దూరుతుంది. శ్రీహాన్ గేమ్ కన్నా స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. శ్రీసత్య నామినేషన్లో తను చెప్పాలనుకుంది చెప్పి వెళ్లిపోతుందన్నాడు. ఇక శ్రీహాన్ వంతురాగా రాజ్‌కు కాన్ఫిడెన్స్ తక్కువ. రోహిత్ మంచితనం కొన్నిసార్లు సేఫ్‌గా కనిపిస్తుంది. రేవంత్ కొన్ని స్టేట్మెంట్లు వదిలేస్తాడు. సరదాగా అయినా సరే వద్దని వారించినా అర్థం చేసుకోడు. శ్రీసత్య వేరేవాళ్ల మాట నమ్మి ఫ్రెండ్‌ను దూరం పెట్టొద్దు అని సూచనలిచ్చాడు. రేవంత్.. ఫైమా వెటకారం తగ్గించుకోలేదని, ఆదిరెడ్డి మానిప్యులేటర్ అని, ఇనయ, కీర్తి కావాలని రెచ్చగొడుతారని మనసులో ఉన్న కోపాన్నంతా కక్కేశాడు. అందరూ మాట్లాడింది విన్న నాగ్.. మీలోని చెడు లక్షణాలను సరిచేసుకున్నవారు గెలుపుకు దగ్గరవుతారని సూచించాడు. తర్వాత వంట రాదన్న కీర్తితో ఆలూ ఫ్రై చేయించుకుని మరీ తిన్నాడు నాగ్. అనంతరం ఇంటిసభ్యులతో ఫన్ గేమ్స్ ఆడించాడు. ఇకపోతే నామినేషన్స్‌లో అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరకు ఫైమా, రాజ్ ఇద్దరే మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాజ్ కోసం వాడతానంది ఫైమా. అయితే రాజ్ మాత్రం నువ్వు ఆడి సంపాదించింది నీ కోసమే వాడుకో అని చెప్పాడు. దీంతో ఫైమా దాన్ని వాడకుండా వదిలేద్దామనకుంది. కానీ నాగార్జున మాత్రం.. ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో మీ ఇద్దరే ఉన్నారని, మీలో ఒకరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడితే మిగతా ఒకరు ఎలిమినేట్ అవుతారని స్పష్టం చేశాడు. అంటే ఓటింగ్‌తో సంబంధం లేకుండా పాస్‌తో గండం గట్టెక్కొచ్చని నొక్కి చెప్పాడు. దీంతో ఫైమా మనసు మార్చుకుని తనకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడింది. ఫలితంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. అయితే ఆడియన్స్ ఓట్ల ప్రకారం చివరి స్థానంలో ఉన్న ఫైమా ఎలిమినేట్ అవ్వాలని, కానీ పాస్ సాయంతో ఆమె సేవ్ అయి రాజ్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు నాగ్. దీంతో ఫైమా, ఇనయ ఎమోషనలయ్యారు. స్టేజీ మీదకు వచ్చిన రాజ్‌తో పంచ్, హగ్స్ గేమ్ ఆడించాడు నాగ్. ఫైమా, ఆది, రోహిత్, రేవంత్‌కు హగ్స్ ఇస్తానని, మిగతా నలుగురికి పంచ్ ఇచ్చాడు. వెళ్లేముందు కంటెస్టెంట్లకు విలువైన సూచనలిచ్చాడు రాజ్. ఫైమా దగ్గర కొంత ఫన్ తక్కువైందని, ఆదిరెడ్డి తను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటాడని, రోహిత్ కొన్ని సందర్భాల్లో మాట్లాడితే బాగుండన్నాడు. రేవంత్‌ది చిన్నపిల్లాడి మెంటాలిటీ అని, అతడు కచ్చితంగా టైటిల్ కొడతాడని ఫిక్సైపోమన్నాడు. శ్రీహాన్ అందరితో గట్టిగా మాట్లాడతాడు, కానీ ఫ్రెండ్స్ తప్పులను గట్టిగా చెప్తే బాగుండన్నాడు. శ్రీసత్యను నామినేషన్లో సరైన పాయింట్లు చెప్పమన్నాడు. ఇనయను టాప్ 5లో చూడాలనుకుంటున్నానని, ఆలోచించి మాట్లాడమని సూచించాడు. హౌస్‌లో కీర్తి తనకెప్పుడూ కనిపించలేదంటూ ఆమె పరువు తీశాడు. ఫైనల్‌గా రాజు ఎక్కడైనా రాజే అంటూ అతడిని పంపించేశాడు నాగ్. చదవండి: రాజశేఖర్ ఎలిమినేషన్‌కు కారణాలివే! నిజానికైతే ఫైమా ఎలిమినేట్ కావాల్సింది! -
ఇనయ కల నెరవేర్చిన బిగ్‌బాస్, శ్రీహాన్ కాళ్లు మొక్కిన సిరి
Bigg Boss Telugu 6, Episode 82: పన్నెండు వారాల ఎడబాటుకు తెర దించుతూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపుతున్నాడు బిగ్‌బాస్. వారిని చూసి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు హౌస్మేట్స్. తమ వాళ్లను చూడగానే తెలియకుండానే కన్నీళ్లు కార్చుతున్నారు. వారితో కలిసి చిందులేస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చాయో చూద్దాం.. పన్నెండు వారాల తర్వాత ప్రేయసి కళ్లముందుకు రావడంతో భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీహాన్. హౌస్‌లోకి వెళ్లగానే శ్రీహాన్‌ను గట్టిగా పట్టుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించింది సిరి. ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని మెడపై ఉన్న టాటూ చూపించింది. తర్వాత సిరి కొడుకు చైతూ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. వచ్చీరాగానే ఈ చిచ్చరపిడుగు తన బుల్లిబుల్లి మాటలతో అందరినీ నవ్వించాడు. ఎవరెలా మాట్లాడతారో వారి డైలాగులను సరిగ్గా దింపేశాడు. తర్వాత.. ఇంతందం దారి మళ్లిందా.. పాటకు సిరి, శ్రీహాన్ స్టెప్పులేశారు. వారిద్దరి మధ్యలో చైతూ వచ్చేందుకు ప్రయత్నించడంతో పానకంలో పుడకలా వస్తావేంట్రా అని తిట్టలేక నవ్వుకున్నాడు శ్రీహాన్. చివరగా వెళ్లిపోయేముందు శ్రీహాన్ పాదాలు తాకి వీడ్కోలు తీసుకుంది సిరి. ఇక రాత్రిపూట కడుపులో మండుతుందని పాలు అడిగాడు రాజ్.. ఎప్పటిలాగే స్ట్రిక్ట్ మాస్టర్ రేవంత్ కుదరదని తెగేసి చెప్పాడు. అడిగినప్పుడు ఇవ్వడానికి ఏం ప్రాబ్లమ్ అని లోలోనే గునుక్కున్నాడు రాజ్. తర్వాతి రోజు కీర్తి కోసం ఆమె స్నేహితుడు, బుల్లితెర నటుడు మహేశ్ వచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ చేసి గోరుముద్దలు తినిపించాడు. ఎవ్వరూ కోల్పోలేనిది నువ్వు కోల్పోయావు. కానీ ఆ దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్ బిగ్‌బాస్. ఇక్కడ నీతో నీకే పోటీ.. లక్షల మంది సైన్యం నీ వెంట ఉన్నారు.. అదే నీ బలం.. అంటూ ఆమెలో పాజిటివిటీ నింపాడు. తను దత్తత తీసుకున్న పాప ఫొటోను బహుమతిగా అందించాడు. అయితే ఆమెను కాపాడుకోలేకపోయానని బోరున ఏడ్చింది కీర్తి. అనంతరం మహేశ్.. ఇనయను ముద్దుపెట్టమని అడగడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. అతడికి నో చెప్పడం ఇష్టం లేని ఇనయ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అనంతరం ఇనయ సుల్తాన తల్లి నజ్బూర్ హౌస్‌లోకి వచ్చింది. ఆమెను చూడగానే ఎమోషనలైంది ఇనయ. 'నాకోసం నువ్వు మనసులో ఇంత బాధపడుతున్నావని తెలీదు, అందుకే వచ్చాను. నీ జీవితం నువ్వు చూసుకున్నావు, ఇంత కష్టపడ్డావు. బిగ్‌బాస్‌కు వచ్చావు. గెలిచి రావాలి. నువ్వు బాగుండాలనేదే నా కోరిక' అని చెప్పింది. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోదాం అని ఇనయ అడిగితే అది తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే బాగా ఆడి గెలిచి రా అని బదులిచ్చింది. కేజీఎఫ్‌లోని అమ్మ సాంగ్ వేయడంతో తల్లి కాళ్ల మీద పడి ఏడ్చింది ఇనయ. అనంతరం ఆమె అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తల్లిని బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలన్న తన కల నెరవేరడంతో ఇనయ తెగ సంతోషపడిపోయింది. చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్ భారత ఆర్మీని అవమానించిందంటూ నటిపై ట్రోలింగ్ -
కొడుకుతో హౌస్‌లోకి సిరి, శ్రీహాన్ పేరు పచ్చబొట్టు..
బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఫ్యామిలీ వీక్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతుంది. వారాల తరబడి అయినవారికి దూరంగా ఉన్న హౌస్మేట్స్ కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను చూడగానే ఎగిరి గంతేస్తుంటారు. ప్రస్తుతం ఆరో సీజన్లో కూడా సేమ్ సిచ్యుయేషన్. 12 వారాల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌ను చూడటంతో భావోద్వేగానికి లోనవుతున్నారు టాప్ 9 కంటెస్టెంట్లు. నిన్న ఫైమా, శ్రీసత్య, రోహిత్ తల్లి హౌస్‌లోకి రాగా ఈ రోజు ఎపిసోడ్లో శ్రీహాన్ ప్రియురాలు సిరి, తన కొడుకు చైతూతో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్. నీకోసం ఓ సర్ప్రైజ్ అంటూ వెనక్కు తిరిగి మెడ కింద శ్రీహాన్ అని పొడిపించుకున్న పచ్చబొట్టు చూపించింది. అలాగే కొడుకు చైతూను తీసుకొచ్చింది. అతడు లోపలకు రాగానే తన మాటలతో చెలరేగిపోయాడు. హౌస్మేట్స్ తరచూ ఏమేం డైలాగ్స్ వాడతాడో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సర్ప్రైజ్లు చూసి శ్రీహాన్ సంతోషంలో మునిగి తేలాడు. నిజానికి ఇదంతా లైవ్‌లో నిన్ననే టెలికాస్ట్ అవగా ఈరోజు ఎపిసోడ్లో చూపించనున్నారు. చదవండి: అప్పుడు ఏడిపించంటూ సవాల్, ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది డబ్బుల్లేక అమ్మకు ఫిజియోథెరపీ ఆపేశారు: శ్రీసత్య ఎమోషనల్ -
ఆకలితో మాడుతున్న హౌస్మేట్స్, అయినా కరగని రేవంత్!
బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 9 మెంబర్స్ మిగిలారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేలో అడుగుపెడతారు. ఈరోజు మండే కావడంతో నామినేషన్స్ మొదలుకానున్నాయి. అయితే ఇప్పటికీ సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేస్తానంటే కుదరదని తెగేసి చెప్పాడు బిగ్‌బాస్. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి నామినేట్ చేయమన్నాడు. ఈ క్రమంలో శ్రీసత్య.. ఆటతీరును పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజ్ మూడు వారాల నుంచి సేవ్ అవుతున్నాడని నామినేట్ చేసింది. దీంతో బిగ్‌బాస్ తుప్పాస్ రీజన్ కాకుండా ఏదైనా వాలిడ్ పాయింట్ చెప్పమన్నాడు. మరోవైపు రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లకు కడుపు నిండా తిండి దొరక్కుండా పోయింది. ఉన్నదాన్ని పంచి పెట్టకుండా దాచి దెయ్యాలపాలు చేస్తున్నాడు. గతంలోనూ అలాగే చేయగా మరోసారి ఫుడ్ కట్ చేస్తున్నాడు. అంత కొద్దిగా వండితే సరిపోవట్లేదు మహాప్రభో అని మొత్తుకుంటున్నా నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించాడు. వారమంతా సరిగా తినీతినకుండా వారాంతంలో మాత్రం కడుపు నిండా పెడతానంటే కరెక్ట్ కాదు. అందువల్ల కెప్టెన్‌గా నువ్వు గెలుస్తావేమో కానీ అందరి ఆకలి తీరదు అని ముఖం మీదే చెప్పాడు శ్రీహాన్. రేషన్ సేవ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు కానీ కడుపులు నిండాలని ఆలోచించట్లేదు అని ఫైర్ అయ్యాడు. నిజంగానే రేవంత్ ఎంతసేపూ గేమ్ కోణంలో ఆలోచిస్తున్నాడే కానీ మానవత్వంతో ఓ ముద్ద ఎక్కువ పెట్టుంటే హౌస్మేట్స్ అందరితో మంచి కెప్టెన్ అనిపించుకునేవాడు. ఇకపోతే ఈ వారం రేవంత్, కీర్తి మినహా మిగతా ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. చదవండి: బిగ్‌బాస్ 6: బాటమ్ 5లో ఎవరంటే? మెరీనా ఎలిమినేషన్‌కు కారణాలివే! -
ఆ ఐదుగురి మనసు స్వచ్ఛమైనది, మిగతావాళ్లు..: మెరీనా
Bigg Boss Telugu 6, Episode 78: ఈరోజు పెద్ద ట్విస్టులు, సర్ప్రైజ్లు లేకుండా సాదాసీదాగా సాగింది ఎపిసోడ్. ఊహించినట్లే మెరీనా ఎలిమినేట్ అయిపోగా ఆమె భర్త రోహిత్ మినహా మిగతా ఎవ్వరూ బాధపడలేదు. మరి హౌస్‌లో ఈ రోజు ఏం జరిగింది? మెరీనా వెళ్లిపోయేముందు హౌస్మేట్స్ గురించి ఏం చెప్పింది? అనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. నాగార్జున హౌస్‌లో ఉన్న పదిమందిలో ఎవరు బాటమ్ 5లో ఉంటారో చెప్పమని కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఎవరు ఎవరెవరి పేర్లు చెప్పారంటే.. కంటెస్టెంట్ బాటమ్ 5 కంటెస్టెంట్లు ఆదిరెడ్డి మెరీనా, రోహిత్, రాజ్, కీర్తి, ఇనయ ఇనయ రాజ్, శ్రీసత్య, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి కీర్తి శ్రీసత్య, మెరీనా, శ్రీహాన్, రాజ్, ఆదిరెడ్డి రాజ్ మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి, ఇనయ, శ్రీహాన్ ఫైమా మెరీనా, రోహిత్, ఇనయ, కీర్తి, రాజ్ మెరీనా శ్రీహాన్, మెరీనా, ఇనయ, రాజ్, ఫైమా/శ్రీసత్య శ్రీహాన్ రోహిత్, మెరీనా, కీర్తి, రాజ్, ఆదిరెడ్డి రోహిత్ శ్రీహాన్, కీర్తి, మెరీనా, ఇనయ, రాజ్ శ్రీసత్య మెరీనా, రోహిత్, కీర్తి, ఇనయ, రాజ్ రేవంత్ మెరీనా, రోహిత్, కీర్తి, రాజ్, ఇనయ హౌస్ అంతా బల్లగుద్ది మరీ మెరీనాకు టాప్‌లో ఉండే అర్హతే లేదని స్పష్టం చేసింది. అన్నట్లుగానే నాగ్ మెరీనా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఆమె ఎలిమినేషన్‌ను హౌస్మేట్స్ ముందే పసిగట్టడంతో రోహిత్ తప్ప ఏ ఒక్కరూ బాధపడలేదు. నిత్యం వైఫైలా తన చుట్టూ తిరుగుతూ ఉండే మెరీనా ఒక్కసారిగా వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు రోహిత్. బాధను భరించలేక బయటకు ఏడ్చేశాడు. కాసేపు ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. అనంతరం స్టేజీపైకి వచ్చిన మెరీనాతో హౌస్‌లో ప్యూర్ ఎవరు? ఇంప్యూర్ ఎవరు? అనే గేమ్ ఆడించాడు నాగ్. ముందుగా మెరీనా స్వచ్ఛమైన వాళ్ల లిస్ట్ చెప్పుకొచ్చింది. రోహిత్‌లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదంది. కీర్తి ఏదో బాధలో ఉంటుందంటారు.. ఆమె బాధ నిజమని, తనేమీ యాక్ట్ చేయట్లేదని చెప్పింది. ఆదిరెడ్డి తనలో తానే మాట్లాడుకోవడం చూసి దెయ్యంతో మాట్లాడుతున్నాడేమో అనుకునేదాన్ని, ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని పేర్కొంది. అతడితో ఉంటే మనవాళ్లతో ఉన్న ఫీలింగ్ వస్తుందని తెలిపింది. రేవంత్‌కు కోపం వస్తే కోపం, బాధ అనిపిస్తే బాధ అన్నీ చూపిస్తాడని అదే స్వచ్ఛతకు నిదర్శనమని వివరించింది. నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే సాయం చేయడానికి ముందుకొచ్చే మొదటి వ్యక్తి రేవంత్ అని పొగిడింది. రాజ్ దగ్గర యాటిట్యూడ్ లేదని, ఒక్కో మెట్టు ఎక్కుతూ తనను తాను బిల్డ్ చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. తర్వాత ఇనయ, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమాలను ఇంప్యూర్ జాబితాలో పెట్టింది. అప్పుడప్పుడైనా ఎదుటివాళ్లు చెప్పేది వినమని ఇనయకు సూచించింది. శ్రీసత్య మానిప్యులేట్ అయినట్లు అనిపించిందని, ఫైమా కొన్నిసార్లు మాటలు వదిలేస్తుందని పేర్కొంది. శ్రీహాన్‌ను ఇప్పటికైనా ఇంట్లో అందరినీ సమానంగా చూడమని సూచించింది. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు కంట్రోల్లో ఉండాలి, ఓసారి నామీద అరిచావు, నేను సైలెంట్ క్యాండిడేట్ కాబట్టి సరిపోయింది, అక్కడ వేరేవాళ్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఘాటుగా హెచ్చరించింది. అనంతరం బిగ్‌బాస్ జర్నీకి ఫుల్స్టాప్ పెడుతూ స్టేజీ నుంచి వెళ్లిపోయింది. చదవండి: గీతూ పేరెంట్స్‌తో మాట్లాడా: బాలాదిత్య మెరీనా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలివే! -
ఆదిరెడ్డి ఇమేజ్ టోటల్ డ్యామేజ్.. గీతూకి పట్టిన గతి రాకుండా చూస్కో!
Bigg Boss 6 Telugu, Episode 77: ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎదుటివాళ్ల కంటే మనకే ఎక్కువ నష్టం అన్న విషయాన్ని పసిగట్టలేకపోతున్నాడు ఆదిరెడ్డి. ఇప్పటికే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేజేతులా గేమ్‌ను నాశనం చేసుకుని గీతూ బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు ఆది. దీంతో నాగార్జున అతడికి చీవాట్లు పెట్టి తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చాడు. మరి ఇంకా ఎవరెవరికి ఎలాంటి క్లాస్‌లు పీకాడు? ఎవరి బండారాలు బయటపెట్టాడు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! కెప్టెన్సీ అంటే అధికారం కాదని, బాధ్యత అని రేవంత్‌కు గుర్తు చేశాడు నాగార్జున. ఏదైనా పని చెప్పేటప్పుడు మాట్లాడే తీరు చూసుకోమని విసుక్కున్నాడు. శక్తి ఆటలో ప్రదర్శించమని, మాటలో కాదు అని చురకలంటించాడు అనంతరం ఆదిరెడ్డికి గట్టిగానే క్లాస్ పీకాడు. ఓ కథ చెప్పి మరీ అతడిని దోషిగా నిలబెట్టాడు. నోటికొచ్చిన స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావని గడ్డి పెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్, అది దక్కించుకుంటే ఓట్లు పడవు అని ఆడకుండా మూలన కూర్చున్నావు. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో డిసైడ్ చేయడానికి నువ్వేమైనా తోపా? తురుమా? అని తిట్టిపోశాడు. నువ్వు కామన్ మ్యాన్‌గా ఆడటానికి వచ్చావు, కేవలం మాట్లాడటానికి కాదు, గేమ్‌లో ఉన్న వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేసి నీ అభిప్రాయాలను వారితో చెప్పిస్తున్నావు. గేమ్ విషయంలో ఎక్కువ ఆలోచించి లూప్‌లు వెతికితే నీకూ గీతూ పరిస్థితే వస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక కెప్టెన్సీ కంటెండర్ గేమ్‌లో నువ్వు రూపాయి పెట్టి కూడా ముందుకు వెళ్లొచ్చు, కానీ లక్ష రూపాయలు రాశావు. ఇమ్యూనిటీ కోసమే కదా.. అని లాజిక్ అడిగాడు. ఇదే ప్రశ్న రాజ్ అడిగితే ఏదేదో చెప్పి అతడి నోరు మూయించాడు ఆది. ఇప్పుడు నాగ్ కూడా అదే అడిగేసరికి అడ్డంగా దొరికిపోయాడు. ఇకపోతే శ్రీహాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు శ్రీసత్యకు వంట రాదంటే వదిలేసి కీర్తిని మాత్రం వంట రాదంటే నేర్చుకుని చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఇదే అంశాన్ని ఓ ఆడియన్ అడగ్గా.. తనకసలు గుర్తే లేదని జవాబిచ్చాడు. దీంతో నాగ్.. గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తానన్నట్లుగా ఓ వీడియో వదిలాడు. అందులో శ్రీసత్య నాకు రాదు, చేయను అని స్పష్టంగా చెప్పింది. అయినా ఆమెను వదిలేసి, కీర్తిని మాత్రం వంట నేర్చుకుని చేయమన్నాడు. అంత అడ్డంగా దొరికినప్పటికీ సరిగా వినపడలేదంటూ మళ్లీ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అలాగే కుక్కలు మొరిగితే దేవలోకానికి ఏమీ కాదని కీర్తి చెప్పిన సామెతను సామెతలాగే చూడాలే తప్ప దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయనవసరం లేదని శ్రీహాన్, శ్రీసత్యలకు మొట్టికాయలు వేశాడు. ఇక ప్రతివారం నామినేషన్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది శ్రీసత్య. పక్కనోళ్లు నామినేట్ చేసుకుంటుంటే మరీ ముఖ్యంగా ఇనయను నామినేట్ చేసేటప్పుడు తెగ నవ్వుతుంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ లేవనెత్తాడు నాగ్. నామినేషన్స్‌లో నీకు నవ్వెందుకు వస్తుందని అడిగాడు. లోపల ఉన్న అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుందని ఆమె పరువు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో మీమ్స్ గేమ్ జరిగింది. అందులో భాగంగా అక్కడున్న మీమ్ కార్డులు ఎవరికి సూటవుతాయో వారికి ఇవ్వాలన్నాడు నాగ్. రేవంత్‌ను ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాడు ఆది. శ్రీసత్యకు ఓరి.. దీని వేషాలూ అన్న మీమ్ ఇచ్చాడు శ్రీహాన్. రాజ్.. ఓన్లీ వన్స్ ఫసక్ అనేలా మాట్లాడుతున్నాడంది ఫైమా. ఫైమాకు అట్లుంటది మనతోని ట్యాగ్ ఇచ్చాడు రాజ్. శ్రీహాన్‌కు సరె సర్లే, చాలా చూశాం ట్యాగ్ ఇచ్చింది కీర్తి. వీడెవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు.. చైల్డ్ ఆర్టిస్టా? అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయ. మస్తు షేడ్స్ ఉన్నాయ్రా నీలో, ఆట్.. కమల్ హాసన్ అన్న మీమ్ శ్రీహాన్‌కే సూటవుతుందన్నాడు రోహిత్. చాలా ఉన్నాయ్ దాచాం.. లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయ్ అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది శ్రీసత్య. ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలా.. అన్న మీమ్ రోహిత్కిచ్చింది మెరీనా. ఆదిరెడ్డి పని అయిపాయే అన్నాడు రేవంత్. నిజంగానే ఈరోజు ఎపిసోడ్లో ఆదిరెడ్డి పని అయిపోయింది. చదవండి: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే? పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా.. -
Bigg Boss 6: కర్మ ఫలితం.. రేవంత్, శ్రీహాన్‌లకు బుద్దిచెప్పిన హౌస్మేట్స్
Bigg Boss 6 Telugu, Episode 76 Highlights : ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ గేమ్‌లో చివరగా ఫైమా, రేవంత్, శ్రీహాన్‌లు మిగిలారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకి నచ్చిన వాళ్లకి సపోర్ట్ చేసి మిగిలిన కంటెస్టెంట్లకు బస్తాను తగిలించాల్సి ఉంటుంది. కెప్టెన్సీ టాస్కులో రేవంత్, శ్రీహాన్‌లు కలిసి గేమ్ ఆడి ఎలా అయితే హోస్మేట్స్ని తప్పించారో, అందుకు బదులుగా సత్య తప్పా మిగితా కంటెస్టెంట్లు అంతా వీరిద్దరికి బాగానే బుద్ది చెప్పారు. బజ్ మోగిన ప్రతిసారి రేవంత్, శ్రీహాన్‌లకు బస్తాలు పెంచుకుంటూ పోయారు. పాపం శ్రీసత్య మాత్రం తన ఫ్రెండ్స్‌ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది కానీ హౌస్మేట్స్ అంతా ఒకటైపోవడంతో ఆమె ఆటలు సాగలేదు. ఇక బస్తాల బరువులు మోయలేక చివరికి ఆ బ్యాగ్‌ను శ్రీహాన్ కింద పెట్టేశాడు. ఇక అప్పుడు వెంటనే సత్య వెళ్లి శ్రీహాన్‌ను ఆమె ఒళ్లో పడుకోబెట్టి మరీ అతన్ని ఓదార్చింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఒకప్పుడు అర్జున్ టచ్ చేస్తేనే చిరాకు అన్న సత్య ఇప్పుడు శ్రీహాన్‌తో చాలా క్లోజ్ అయ్యిందని, అవసరం లేకపోయినా అతడిని టచ్ చేస్తుందంటూ ట్రోల్స్ రాయుళ్లు రెచ్చిపోయారు. ఇదిలా ఉండగా రేవంత్ ఈ టాస్కులో గెలవడానికి చాలానే కష్టపడినా హౌస్మేట్స్ అందరి సపోర్ట్ ఫైమాకే ఉండటంతో అతని కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చివరికి ఫైమాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో ఆమె తెగ సంతోషపడింది. -
కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్ అమూల్యమైన అవకాశం, ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవాలంటే..
బిగ్‌బాస్ 6 తెలుగు: కంటెస్టెంట్‌కి బిగ్‌బాస్ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎలిమినేషన్ లేకుండా చివరి వరకు హౌజ్ కొనసాగేందుకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునేందుకు వారికి సదా అవకాన్ని ఇచ్చాడు. అయితే గెలుచుకునేందుకు కంటెస్టెంట్స్‌కి కఠిమైన టాస్క్‌తో పాటు వారి ప్రైజ్‌మనీలోంచి భారీగా కోతలు పెట్టాడు బిగ్‌బాస్. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. దీంతో ఆదిరెడ్డి ఈ పాస్ తనకు వద్దంటూ టాస్క్ ఆడని తేల్చేశాడు. ఇక హౌజ్ అందరు చర్చించుకున్న అనంతరం ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రేవంత్, శ్రీహాన్, ఫైమా పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరు గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకుంటారో చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఆడియన్స్ ప్రశ్నలతో బయటపడ్డ శ్రీహాన్, శ్రీసత్య నిజస్వరూపం!
Bigg Boss 6 Telugu, Episode 75: సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు ఈ వారం వెళ్లిపోయేది తనే అని ఫిక్సయిన మెరీనా తన పెళ్లి రోజు గురించి కలలు కంది. నవంబర్ 29న వెడ్డింగ్ యానివర్సరీ ఉందని, ఆ రోజును ఇద్దరం కలిసే సెలబ్రేట్ చేసుకోవాలనుందని చెప్పింది. హౌస్ లోపల అయినా బయట అయినా ఇద్దరం కలిసే పెళ్లిరోజు జరుపుకోవాలని, అందుకు నువ్వే ఏదో ఒకటి చేయాలంటూ బిగ్‌బాస్‌ను వేడుకుంది. అంటే ఉంచితే ఇద్దరినీ హౌస్‌లో ఉంచమని పంపిస్తే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరినీ పంపించేయమని చెప్పకనే చెప్పింది. బిగ్‌బాస్‌కు కొత్త కొత్త ఐడియాలివ్వకని రోహిత్ చురకలేశాడు. అనంతరం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో పోటీదారులు శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్.. ఇతరుల గోల్ పోస్ట్‌లోకి బంతి వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌కు ఫైమా సంచాలకుడిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రేవంత్, శ్రీహాన్ కలిసి ఆడినట్లే అనిపించింది. ఇది చూసిన ఫైమా.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఈయన చేసేదేంటని సెటైర్లు వేసింది. మొదటి రౌండ్లో రోహిత్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్లో ఎవరూ అవుట్ కాకపోవడంతో కంటెండర్లు ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలన్నాడు బిగ్‌బాస్. ఎక్కువ ఓట్లు ఆదిరెడ్డికి పడటంతో అతడు అవుట్ అయ్యాడు. ఇక రేవంత్, ఫైమా గేమ్ ఆసాంతం దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. నీలాగా సపోర్ట్ తీసుకుని ఆడను అని రేవంత్ ఫైమాను ఉద్దేశించి అన్నాడు. వెంటనే ఆదిరెడ్డి అందుకుంటూ బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా? అన్నాడు. ఓపక్క నాతో, అటు ఇనయతో, తీరా గేమ్‌లోకి దిగాక శ్రీహాన్‌తో కలిసి ఆడావని కౌంటరిచ్చాడు. దీనికి కిమ్మనుకుండా సైలెంట్ అయిపోయాడు రేవంత్. మూడో రౌండ్లో ఇనయ తనను తాను సేవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడింది, కానీ గెలవలేకపోయింది. దీంతో కెప్టెన్ కాలేకపోయానని వెక్కివెక్కి ఏడ్చింది ఇనయ. చివరగా రేవంత్.. శ్రీహాన్‌ను ఓడించి కెప్టెన్‌గా అవతరించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అవడంతో రేవంత్ కంటి నుంచి ఆనందభాష్పాలు రాలాయి. అనంతరం ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నాడు బిగ్‌బాస్. మొదటి ప్రశ్న: నీ కెప్టెన్సీలో కీర్తిని రూడ్‌గా వంట చేయమన్నావు. ఆమె తనకు రాదని చెప్తే నేర్చుకోమన్నావు. మరి నీ ఫ్రెండ్ శ్రీసత్యకు ఎందుకు చెప్పలేదు? శ్రీహాన్: వంట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఆమెను కిచెన్ టీమ్‌లో వేశా. అంతేకాదు అప్పుడప్పుడు ఆమె కిచెన్‌లో పని చేయడం చూశాను. శ్రీసత్య వంట చేయను అన్న మాట నాకు వినిపించలేదు. అయినా తను కిచెన్‌లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది అని చెప్పాడు. నిజానికి శ్రీసత్య వంట రాదు, చేయను అన్నా కూడా శ్రీహాన్ లైట్ తీసుకున్నాడు. ఇద్దరూ అడ్డంగా దొరికిపోవడంతో కీర్తి ముఖం మతాబులా వెలిగిపోయింది. రెండో ప్రశ్న: ఫైమా మీరు మొదట్లో చూడటానికి ఎంతో ఎంటర్టైనింగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు స్వార్థపరురాలిగా కనిపిస్తున్నారు. ఈ రెండింటిలో మీ అసలు రూపం ఏది? ఫైమా: ఆటలో గెలవాలన్న కసి ఎక్కువైంది. దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి ఎంటర్టైన్ పక్కన పెట్టేశాను. మూడో ప్రశ్న: ఒక రివ్యూయర్ అయి ఉండి మీకు గేమ్ బాగా తెలుసని మీరే అంటుంటారు. కానీ మీ నామినేషన్స్ అందరికన్నా సిల్లీగా, సేఫ్‌గా ఉంటాయి. మీరు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని నామినేట్ చేసి అప్పుడు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోండి.. ఆదిరెడ్డి: స్ట్రాంగ్ ప్లేయర్స్‌ను బయటకు పంపించాలన్న ఆలోచన నాకు లేదు. వారితో గేమ్ ఆడి గెలవాలనుకుంటాను. నా కళ్ల ముందు జరిగే సంఘటనలను బట్టే నామినేషన్స్ చేశాను, తప్ప సిల్లీ రీజన్స్ ఇవ్వలేదు. మీకలా అనిపిస్తే నేనేం చేయలేను. మరీ ముఖ్యంగా నన్ను రివ్యూయర్‌గా కాకుండా కంటెస్టెంట్‌గా చూడండి. ప్రశ్న: ఇనయ తన ఫ్రెండ్‌ని వెన్నుపోటు పొడిచిందన్నారు. కానీ మీరు రేవంత్‌ను మూడుసార్లు నామినేట్ చేశారు. కెప్టెన్సీలో తనకి సపోర్ట్ చేయలేదు. అర్జున్ను యూజ్ చేసుకున్నారు. తన గేమ్ కూడా మీరే ఆడి తనని నామినేట్ చేశారు. మీరు చెప్పే విషయాలు మీరసలు పాటిస్తారా? శ్రీసత్య: తప్పుంటే ఎవరినైనా నామినేట్ చేస్తాను. రేప్పొద్దున శ్రీహాన్ది తప్పుంటే అతడిని కూడా నామినేట్ చేస్తా. ఇనయను రెచ్చగొట్టడానికే ఆమె వెన్నుపోటు పొడిచిందన్నాను. ఫ్రెండ్షిప్, గేమ్ ఒకటి కాదు. రేపు పాయింట్ ఉంటే శ్రీహాన్‌ను కూడా నామినేట్ చేస్తాను. అర్జున్ను నేను యూజ్ చేసుకోలేదు. హోటల్ టాస్క్‌లో సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. నేను చెప్పే విషయాలు కచ్చితంగా పాటిస్తాను. చదవండి: ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా -
తగ్గేదే లేదంటున్న బిగ్‌బాస్, విన్నర్‌కు మిగిలేది ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 74: వీలైనంత ప్రైజ్‌మనీని తగ్గించాలని బిగ్‌బాస్ కంకణం కట్టుకున్నట్లున్నాడు. కంటెస్టెంట్లు నో చెప్పడానికి వీలు లేని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌కు ఓ రేటు ఫిక్స్ చేశాడు. అలా ప్రైజ్‌మనీలో నుంచి కావాల్సినంత దండుకుంటున్నాడు. ఇంతకీ ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలు తగ్గింది? నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. రివ్యూలు వద్దని స్వయంగా నాగార్జునే చెప్పినా పట్టించుకోని ఆదిరెడ్డి ఈవారం ఎవరు వెళ్తారని సత్యతో డిస్కషన్ పెట్టాడు. దీనికామె క్షణం ఆలోచించకుండా కీర్తి అని చెప్పింది. అటు ఆదిరెడ్డి కూడా నాకూ అలాగే అనిపిస్తోందని వంత పాడాడు. అనంతరం బిగ్‌బాస్.. బీబీ ట్రాన్స్పోర్ట్ అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బీబీ ట్రక్కు సమయానుసారం ఒక్కో స్టాప్ దగ్గర ఆగిపోతుంది. అలా ఆగిన ప్రతిసారి ఎవరైతే ముందు వచ్చి ఎక్కుతారో వారే కెప్టెన్సీ పోటీదారులవుతారు. అయితే ప్రతి స్టాప్‌లో ఆ వాహనం ఎక్కేందుకు ఓ ధర ఉంటుందని, దాన్ని విన్నింగ్ ప్రైజ్‌మనీలో నుంచి తీసేస్తామని చెప్పాడు. దీనితోపాటు ఆ ట్రక్కు ఎక్కలేకపోయిన మిగతా ఇంటి సభ్యులు తమలో కెప్టెన్సీకి అనర్హులుగా భావించే ఇద్దరి పేర్లను చెప్తే వారిలో ఎవరు పోటీలో పాల్గొంటారు? ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారనేది పోటీదారులు నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో ఆదిరెడ్డి గెలవగా అతడు తన కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం లక్ష రూపాయలు వాడతానన్నాడు. ఇక ఇంటిసభ్యులు పోటీలో నుంచి ఎవరిని తప్పిద్దామని చర్చలు మొదలుపెట్టారు. శ్రీహాన్.. రోహిత్ కెప్టెన్‌గా ఇంటిని చూసుకోగలడన్న నమ్మకం లేదన్నాడు. దీనికి రోహిత్ ఆన్సరిస్తూ.. నువ్వు నన్ను కాంపిటీషన్‌గా చూస్తున్నావేమో, అందుకే పక్కన పెడుతున్నావని కౌంటరిచ్చాడు. దీనికి శ్రీహాన్.. అసలు నువ్వు నాకు కాంపిటీషనే కాదని బిల్డప్ ఇవ్వడం గమనార్హం. ఇక కీర్తి.. శ్రీసత్య, శ్రీహాన్ పేరు చెప్పడంతో శ్రీహాన్ వెటకారం మొదలుపెట్టాడు. అలా వీళ్లిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. చివరగా రోహిత్, ఫైమాలను నిల్చోబెట్టగా వీళ్లలో రోహిత్‌కు ఛాన్స్ ఇచ్చి ఫైమాను తొలగించాడు ఆదిరెడ్డి. రెండోసారి రేవంత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఈ రౌండ్లో ప్రైజ్‌మనీలో నుంచి రూ.25 వేలు తగ్గించాడు బిగ్‌బాస్. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, రాజ్‌లను ఎన్నుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్లయిన రేవంత్, ఆది.. శ్రీహాన్‌ను గేమ్‌లో ఉంచాలనుకుని రాజ్‌ను సైడ్ చేశారు. మూడో రౌండ్లో రోహిత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఇందుకుగానూ రూ.45,000 కట్ చేశాడు. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, శ్రీసత్యలను నిలబెట్టగా కెప్టెన్సీ కంటెండర్లు శ్రీహాన్‌ను గేమ్‌లో కంటిన్యూ చేయనున్నట్లు ప్రకటించారు. నాలుగో రౌండ్లో శ్రీహాన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలవగా ఇందుకోసం రూ.30,000 కోత పెట్టాడు బిగ్‌బాస్. కంటెండర్లు మెరీనాను ఆటలో కంటిన్యూ చేసి కీర్తిని సైడ్ చేశారు. ఐదో రౌండ్లో కంటెండర్‌షిప్ కోసం పోటీపడేందుకు రూ.70 వేలు పెట్టాడు బిగ్‌బాస్. ఈసారి ఇనయ ముందుగా ట్రక్ ఎక్కి కంటెండర్‌గా నిలిచింది. మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ద్వారా రూ.3 లక్షలు కోత పెట్టడంతో ప్రైజ్‌మనీ రూ. 41,00,300 చేరింది. తర్వాత శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీహాన్, శ్రీసత్య మాట్లాడుకున్నప్పుడు నేను ఆటలో అరటిపండు అయ్యాననే టైంలో రాజ్ క్లోజ్ అయ్యాడన్నాడు రేవంత్. ఆ మాటతో మండిపడ్డ శ్రీహాన్.. మేము మాట్లాడుకునేటప్పుడు నిన్ను రావద్దని అనలేదు కదా? అని ప్రశ్నించాడు. నేనేదో చాలా సాధారణంగా అన్నానని రేవంత్ అన్నా సరే శ్రీహాన్ వినిపించుకోలేదు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తున్నామన్నట్లుగా చెప్తున్నావని సీరియస్ అయ్యాడు. అటు శ్రీసత్య కూడా మధ్యలో అందుకుంటూ.. ఇప్పుడేంటి, నేను శ్రీహాన్‌తో ఎక్కువగా మాట్లాడొద్దు, అంతే కదా అని సూటిగా అడిగేసింది. చిన్నమాటను ఎక్కడికో తీసుకువెళ్తున్నారని భావించిన రేవంత్ గొడవ చేయడం ఎందుకని సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఇనయ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో రేవంత్ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది! చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఓటీటీలో ప్రిన్స్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
ఆ ఇద్దరే టార్గెట్, నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?
నామినేషన్స్ ఊహించగలమేమో కానీ ఎలిమినేషన్ మాత్రం ఊహించలేకున్నాం. ఈ మధ్య అనుకోని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 11 మంది ఎలిమినేట్ అవడంతో ప్రస్తుతం హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. తాజాగా వీరందరూ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొన్న ప్రోమో రిలీజైంది. ఇందులో నామినేట్ చేయాలనుకున్న ఇంటిసభ్యులపై చెత్తను గుమ్మరించాల్సి ఉంటుంది. మొదటిసారి ఆదిరెడ్డి.. తానింతవరకు నామినేట్ చేయని ఇంటిసభ్యులైన శ్రీహాన్, రోహిత్‌లను సెలక్ట్ చేసుకున్నాడు. బాతూ మాట్లాడాడంటూ రోహిత్‌పై చెత్త గుమ్మరించింది ఫైమా. ఎప్పటిలాగే శ్రీహాన్.. కీర్తిని నామినేట్ చేశాడు. ఇకపోతే శ్రీహాన్- ఇనయల గొడవ గాలి మళ్లి ఆది- ఇనయల గొడవగా మారింది. ఈ మధ్య వీరిద్దరు ఎక్కువ కొట్లాడుకుంటున్నారు. అయితే ఈవారం ఇనయను నామినేట్ చేయలేకపోవడంతో ఆది నెక్స్ట్ వీక్ మాత్రం తననే నామినేట్ చేస్తానని స్పష్టం చేశాడు. బిగ్‌బాస్ హెచ్చరించినా సరే శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్ నామినేషన్లో ముసిముసి నవ్వులు నవ్వుతుండటం గమనార్హం. ఇక ఈ వారం కెప్టెన్ ఫైమా మినహా అందరూ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఎక్కువమంది రోహిత్, ఇనయలనే టార్గెట్ చేశారు. చదవండి: వాసంతి ఎలిమినేట్, ఆ ముగ్గురే తన ఫేక్ ఫ్రెండ్స్ -
జైల్లో ఇనయ, వదిలేస్తే టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారే!
Bigg Boss 6 Telugu, Episode 69: గీతూ వెళ్లిపోయాక ఆదిరెడ్డి మరీ విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి అతడి మాటలు, ఆట చూస్తుంటే గీతూ పూనినట్లే అనిపిస్తోంది. ఇనయ మీద నోరేసుకుని పడిపోయి అనవసరంగా ఆమెకు హైప్ ఇస్తున్నాడు ఆది. హౌస్‌లో అందరూ ఇనయ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నా బయట తనకది పాజిటివ్ అవుతుండటం గమనార్హం. నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. కెప్టెన్సీ టాస్క్‌లో ఆదిరెడ్డి, ఫైమా కలిసి ఆడారని ఇనయ ఆరోపించింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆది.. 'అసలు నీకు బ్రెయిన్ ఉందా? నేను ఫైమాతో ప్లాన్ చేశానని తేలితే బిగ్‌బాస్ వదిలి వెళ్లిపోతా' అని సవాలు విసిరాడు. అటు ఫైమా కూడా.. నువ్వు ఎంత ఒర్రినా ఎక్కువ రోజులుండవులే అని శివాలెత్తింది. సంచాలక్ కన్ఫ్యూజన్కు శ్రీసత్యకు చిర్రెత్తిపోయింది. కళ్ల ముందు తనను లాగుతున్నా ఏమీ అనకుండా నిల్చుండిపోయాడని రేవంత్‌పై అసహనం వ్యక్తం చేసింది. చివరగా ఈ పోటీలో ఫైమా గెలిచి కొత్త కెప్టెన్‌గా అవతరించింది. గెలవగానే ఫైమా ఇనయను పట్టుకుని ఏడ్చేసింది. ఇది చూసి షాకైన హౌస్మేట్స్ ఇప్పుడే గొడవ పెట్టుకున్నారు, అప్పుడే కలిసిపోయారా? అని ఆశ్చర్యపోయారు. రాత్రి రేవంత్, రాజ్ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో శ్రీహాన్‌ను మధ్యలోకి లాగుతూ.. నేను గెలిస్తే రావు, కానీ సత్య గెలిస్తే దుప్పటి పట్టుకుని మరీ తన దగ్గరకు వెళ్లిపోతావు అని కామెంట్ చేశాడు. ఇది శ్రీహాన్ సరదాగా తీసుకోలేకపోయాడు. కామెడీగా అయినా సరే, ఏది పడితే అది అనేయకు అని హెచ్చరించాడు. అలా నోటికొచ్చింది మాట్లాడితే నీకు, ఇనయకు తేడా ఏంటని ప్రశ్నించాడు. దీనికి రేవంత్.. తానసలు ఆ మాటే అనలేదని బుకాయించాడు. అనంతరం బిగ్‌బాస్ ఈవారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమన్నాడు. ముందుగా ఫైమా.. వాసంతికి; ఇనయ, కీర్తి.. రోహిత్‌కు; వాసంతి, మెరీనా.. కీర్తికి; రాజ్.. శ్రీసత్యకు స్టాంప్ వేశారు. సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయ్యావంటూ రేవంత్‌కు స్టాంప్ వేశాడు బాలాదిత్య. సంచాలక్‌గా నువ్వు గేమ్ మధ్యలో రూల్స్ మార్చావు, ముందు వారాల్లో కంటే ఇప్పుడు నీలో చాలా మార్పు కనిపించింది. ఈ వారం నీలో ఏదీ నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్ వేసింది శ్రీసత్య. అటు ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్.. ఇనయకు స్టాంపేశారు. తర్వాత రేవంత్ వంతు రాగా.. అరవడం గురించి మీరు నాతో పోల్చుకున్నారు. అది నచ్చలేదు. రాత్రి నీ గురించి మాట్లాడుకున్నాం అన్నావు, అది నీ భ్రమ అంటూ తిరిగి శ్రీసత్యకు స్టాంప్ గుద్దాడు. ఎక్కువగా ఇనయకు ఓట్లు పడటంతో ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేసి జైలుకు పంపించారు. అయితే హౌస్మేట్స్ ఆమెతో ఎంత గొడవపడితే బయట ఆమెకు అంత మద్దతు పెరుగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో ఆమెను ఏకంగా జైలుకే పంపించి ఇనయకు మరింత హైపిచ్చారు. చూస్తుంటే అందరూ కలిసి ఇనయకు టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారు. చదవండి: బిగ్‌బాస్, నాగార్జున నేనే తోపు అన్నట్లు పొగిడారు: గీతూ డ్రైవర్‌కు రూ.15 లక్షల సాయం చేసిన బన్నీ, ఎందుకో తెలుసా? -
రేవంత్‌కు శ్రీహాన్ వెన్నుపోటు? ఇప్పటికైనా తెలుసుకుంటాడా?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ఆట అంటే ప్రాణం పెట్టి ఆడేవాళ్లలో సింగర్ రేవంత్ ముందువరుసలో ఉంటాడు. తనమన బేధాలు పక్కనపెట్టి గెలుపే తన లక్ష్యంగా పోరాడుతుంటాడు. ఒకరికి నేను ఎదురెళ్లినా వారికే రిస్కు, ఒకరు నాకెదురొచ్చినా వాళ్లకే రిస్కు అన్న రేంజ్లో గేమ్ ఆడతాడు. ఈ క్రమంలో తనకు తెలియకుండానే కొన్నిసార్లు అవతలి హౌస్‌మేట్స్‌ను నెట్టేసి, కొట్టేసినంత పని చేశాడు. దీంతో నాగార్జున గేమ్ ఆడాలి కానీ అంత ఫిజికల్ అవకూడదని హెచ్చరిస్తూనే రేవంత్‌కు ఎల్లో కార్డ్ ఇచ్చాడు. ఇంకోసారి ఫిజికల్ అయితే నేరుగా బయటకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ దెబ్బతో రేవంత్ ఓ మెట్టు తగ్గక తప్పలేదు. కానీ దీన్నే తమ అస్త్రంగా మలుచుకున్నారు మిగతా హౌస్మేట్స్. స్నేక్ అండ్ లాడర్ టాస్క్‌లో పాము టీమ్ సభ్యులు అతడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలనుకున్నారు. అతడు చేయి పట్టుకున్నా, లాగినా, వదిలించుకున్నా, ఆఖరికి కన్నెత్తి చూసినా సరే ఫిజికల్ అవుతున్నావు అని పదే పదే అరవడంతో రేవంత్ సైడ్ అయిపోయాడు. నేనేం చేయకపోయినా ఫిజికల్ అవుతున్నానని నిందలు వేస్తున్నారని అప్సెట్ అయ్యాడు. చివరికి గేమ్ అయిపోయాక టాస్క్‌లో కావాలని రెచ్చగొట్టామని వారు క్లారిటీ ఇవ్వడంతో అతడు మరింత బాధపడ్డాడు. ఇప్పటికే ఎల్లో కార్డ్ వచ్చిన బాధలో ఉంటే నా వీక్నెస్తో ఆడుకున్నారని తనలో తనే మధనపడ్డాడు. దీనికి తోడు శ్రీహాన్ చేసిన పనికి కూడా అతడు హర్ట్ అయినట్లు తెలుస్తోంది. గతవారం గీతూ పనిష్మెంట్ సరిగా చేయకపోవడంతో ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న శ్రీహాన్‌కు నాగార్జున ఓ పనిష్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా! ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ చేయలేవని స్పష్టం చేశాడు నాగ్. అయితే స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో పాము టీమ్ విజయం సాధించింది. ఇందులో శ్రీహాన్ కూడా ఉన్నాడు. అతడు కెప్టెన్సీ కంటెండర్ కాలేనందున అతడి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోమన్నాడు. దీనికతడు గేమ్‌లో ఎంతో కష్టపడ్డ రేవంత్‌ను పక్కనపెట్టి ప్రస్తుతం ఇంట్లో కెప్టెన్‌గా ఉన్న శ్రీసత్యను ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో రేవంత్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని సరిచేసుకుని తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు రేవంత్. అందుకోసం బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి గేమ్‌లో ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. అతడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు శ్రీహాన్ తన పేరు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్న ఎదురవుతోంది. శ్రీసత్య ఈవారమే కెప్టెన్ అయినందున తనకు ముందు వారాల్లో ఛాన్స్ ఇవ్వాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పక్కనే ఉంటూ బెస్ట్ ఫ్రెండ్‌కే వెన్నుపోటు పొడిచాడని రేవంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అతడు తన స్నేహితులెవరో తెలుసుకుంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. హౌస్మేట్స్ అంతా టార్గెట్ చేయడం ఒక ఎత్తయితే క్లోజ్ ఫ్రెండ్ తనను లెక్క చేయకపోవడం మరో ఎత్తు అని, అందుకే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడని భావిస్తున్నారు. అటు శ్రీహాన్ ఫ్యాన్స్ మాత్రం.. ఇద్దరి ఫ్రెండ్స్‌కు ఒకేసారి న్యాయం చేయలేడు కదా, ఎవరికో ఒకరికి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం అయితే ఇచ్చాడు కదా, అది సరిపోదా? అని వెనకేసుకొస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్‌కు రాకుండా ఉండాల్సింది: ఏడ్చిన రేవంత్ కంట్రోల్ తప్పిన రోహిత్, బ్యాగును తన్నుతూ ఫైర్ -
శ్రీసత్య, శ్రీహాన్ ఓవరాక్షన్.. ఇనయ సోది మొహమన్న ఫైమా
Bigg Boss Telugu 6, Episode 65: చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ షో మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. గేమ్ ఆడుతున్న గీతూ ఎందుకు ఎలిమినేట్ అయిందో అర్థం కాక జుట్టు పీక్కున్నారు మిగతా కంటెస్టెంట్లు. బిగ్‌బాస్ షో పదోవారంలోకి ఎంటరయ్యేసరికి హౌస్‌లో పన్నెండు మంది మాత్రమే మిగిలారు. మరి వీరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల ముఖాలపై గ్లాసు నీళ్లు పోయాన్నాడు బిగ్‌బాస్. కెప్టెన్ శ్రీసత్యను నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టమని ఆదేశించాడు. ► శ్రీసత్య.. బాలాదిత్య, ఇనయ ► ఆదిరెడ్డి.. ఇనయ, రేవంత్ ► వాసంతి.. ఇనయ, ఆదిరెడ్డి ► రేవంత్.. వాసంతి, ఆదిరెడ్డి ► కీర్తి.. శ్రీహాన్, ఇనయ ► బాలాదిత్య.. శ్రీహాన్, ఇనయ ► మెరీనా.. ఆది రెడ్డి, ఇనయ ► రాజ్.. ఇనయ, శ్రీహాన్ ► రోహిత్.. రేవంత్, ఆదిరెడ్డి ► ఫైమా.. వాసంతి, మెరీనా ► శ్రీహాన్.. కీర్తి, ఇనయ ► ఇనయ.. ఫైమా, శ్రీహాన్‌లను నామినేట్ చేసింది. అత్యధికంగా ఇనయకు ఎక్కువ నామినేషన్ ఓట్లు పడ్డాయి. గేమ్ కసిగా ఆడటం తప్పు కాదు, కానీ కంటెస్టెంట్ల మీద అగ్రెసివ్ చూపించకు. నీ వల్ల ఇప్పటికీ నా చేయి నొప్పిగా ఉంది. ఇనయను లాగి పడేశావు. అలాగే ఎంత కోపంలో ఉన్నా కూడా నోరు జారకూడదు అని హెచ్చరించాడు ఆదిరెడ్డి. అవతలివాళ్లను హర్ట్ చేసేంత కసి మంచిది కాదు అని సలహా ఇచ్చాడు. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో గీతూ చేసిన పనికి ఆదిరెడ్డి మైక్ విసిరేయడంతో అతడి టీమ్ గెలుపుకు ఒక దూరంలో ఆగిపోయింది. ఇదే కారణం చెప్పి బ్లూ టీమ్‌లోని సభ్యులు అతడిని నామినేట్ చేశారు. దీంతో ఆది.. 'తప్పంతా బిగ్‌బాస్‌ది. ఆయన్ను నామినేట్ చేయాలి. మన టీమ్‌కు బిగ్‌బాస్ అన్యాయం చేశాడు. మన టీమ్ ఓడిపోవడానికి బిగ్‌బాసే కారణం' అని ఫ్రస్టేట్ అయ్యాడు. ఓపక్క నామినేషన్స్ జరుగుతుంటే శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ వెకిలి చేష్టలు చేస్తూ పడీపడీ నవ్వుతుండటంతో బిగ్‌బాస్ సీరియసయ్యాడు. ఆ జోకేంటో బయటకు చెప్తే మిగతావాళ్లు కూడా నవ్వుతారు అని గద్దించాడు. నామినేషన్ ప్రక్రియకున్న మర్యాదను కనీసం కెప్టెన్ అయినా కాపాడితే బాగుంటుందనడంతో శ్రీసత్య సారీ చెప్పింది. ఇక ఇనయ, ఫైమాలు నామినేషన్లో వాదులాటకు దిగారు. నువ్వు నాకు నచ్చలేదంటే నాకు నచ్చలేదని ఒకరినొకరు తిట్టుకున్నారు. నువ్వు వెనక మాట్లాడుతావు, ఫేక్.. ఈ హౌస్‌లో ఎవరికీ నచ్చవు. సినిమాలో యాక్టింగ్ చేయు, ఇక్కడ కాదు. మనిషిని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు, సోది ముఖం అంటూ ఇనయను నానా తిట్టిపోసింది ఫైమా. ఆమె అనే మాటలకు రివర్స్ కౌంటరిస్తూ పోయింది ఇనయ. ఫైనల్‌గా పదో వారం బాలాదిత్య, మెరీనా, కీర్తి, ఫైమా, వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయ నామినేట్ అయ్యారు. చదవండి: చచ్చేదాకా రుణపడి ఉంటా: గీతూ పోస్ట్ వైరల్ కంటెంట్ క్వీన్ గీతూ ఎలిమినేషన్‌కు ఇవే కారణాలు -
ఇనయను మళ్లీ ఓ ఆటాడుకున్న ఆది రెడ్డి, నామినేషన్స్‌లో 9 మంది!
బిగ్‌బాస్ హౌస్ నుంచి గీతూ వెళ్లిపోవాలని చాలామంది బలంగా కోరుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం గీతూ వెళ్లిపోతుంటే ఎంతోమంది ఎమోషనలయ్యారు. ఆమె బిగ్‌బాస్‌ను వీడలేక వీడుతుంటే భారంగా నిట్టూర్చారు. ఈరోజు గీతూ లేకుండానే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. శ్రీహాన్‌కు, నాకూ బయట ఒక లైఫ్ ఉంది. మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడటం నచ్చలేదని ఇనయను నామినేట్ చేసింది శ్రీసత్య. పోయినవారం హ్యుమానిటీ గురించి మాట్లాడావు.. అని కీర్తి మాట్లాడటం మొదలు పెట్టిందో లేదో మధ్యలో అందుకున్నాడు శ్రీహాన్. హ్యుమానిటీ గురించి నేను హైలైట్ చేసుకోలేదు, హీరోయిన్లా నువ్వు చెప్పుకున్నావు అని కౌంటరిచ్చాడు. దీనికి కీర్తి.. ఇక్కడ ఎవరూ హీరోయిన్ కాదు, ఎవరూ హీరో కాదు, ఇదే కొంచెం తగ్గించుకోండి అని చురకలంటించింది. కావాలని ఒకరిని కొట్టడం తప్పని రేవంత్.. వాసంతిని నామినేట్ చేశాడు. దీంతో అవాక్కైన వాసంతి.. నువ్వు మనుషులను ఎలా విసిరేస్తున్నావో ఫుటేజీతో సహా అందరం చూశామని ఎద్దేవా చేసింది. అటు ఆదిరెడ్డి.. రేవంత్‌తో పాటు ఇనయను నామినేట్ చేశాడు. బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఏడవడం, బిగ్‌బాస్ పిలిస్తేనే బయటకు వస్తాననడం తప్పనిపించలేదా? అని అడిగాడు. దీనికామె అది నాకు, బిగ్‌బాస్‌కు మధ్య విషయం, మధ్యలో మీకెందుకు అని ప్రశ్నించింది. మీ ఇద్దరికీ ఉంటే మీరు బయటకు పోయి మాట్లాడుకోండి అని చిరాకు పడ్డాడు ఆది. అయినా ఇప్పటికీ దాన్ని తప్పుగా ఫీలవకపోవడం నా దురృదృష్టం అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ వారం తొమ్మిది మంది నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్, రాజ్, కెప్టెన్ శ్రీసత్య మినహా మిగిలిన తొమ్మిది మంది.. వాసంతి, రేవంత్, కీర్తి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, మెరీనా, బాలాదిత్య, ఫైమా నామినేషన్స్‌లో ఉన్నారట! చదవండి: కంటెంట్ క్వీన్ ఎలిమినేట్ అవడానికి కారణాలివే! నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్, ఎక్కడికీ పోను: ఏడ్చిన గీతూ -
గీతూ అవుట్! ఏడ్చేసిన శ్రీహాన్, ఫైమా
ఒక్కసారి ఆటలో దిగాక తల్లీదండ్రులను కూడా లెక్క చేయనని తేల్చి చెప్పింది గీతూ. తనకు బిగ్‌బాస్ గేమ్ తర్వాతే ఏదైనా అని తెగేసి చెప్పింది. అన్నట్లుగానే గేమ్ కోసం తనకు దగ్గరైనవాళ్లను ఇబ్బంది పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. కానీ ఆమె ఏం చేసినా ఆట కోసమే చేసింది. బిగ్‌బాస్ అంటే అంత పిచ్చి గీతూకు. అయితే గీతూ ఆటతీరు లోపల కంటెస్టెంట్లనే కాదు జనాలను కూడా ఇబ్బంది పెట్టింది. ఒకరి బలహీనతలతో ఆడుకోవడం, కొందరిని టార్గెట్ చేయడం ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. తనకు బుద్ధిబలం ఉన్నా దాన్ని సరిగా వాడుకోలేదు. ఫలితంగా ఈ వారం ఆమె ఎలిమినేట్ అవబోతోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో హౌస్‌మేట్స్‌తో ఫన్ గేమ్ ఆడించి వారికి రిలాక్స్ చేశాడు నాగ్. అందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చాక చివర్లో సత్య, గీతూ ఇద్దరే మిగిలారు. అయితే ఎవరికి వారు తాము సేవ్ అవుతామన్న ధీమాతోనే కనిపిస్తున్నారు. కానీ చివరగా గీతూ ఎలిమినేట్ కానుందన్న విషయం మనందరికీ తెలిసిందే! తను వెళ్లిపోవడంతో ఫైమా, శ్రీహాన్ కంటతడి పెట్టుకున్నారు. చదవండి: అడ్డంగా దొరికిన ఇనయ, గీతూ వల్ల శ్రీహాన్‌కు పనిష్మెంట్ షాకింగ్, గలాటా గీతూ ఎలిమినేట్ -
అడ్డంగా దొరికిన శ్రీహాన్, ఇనయ.. గీతూ వల్ల అతడికి పనిష్మెంట్!
Bigg Boss Telugu 6, Episode 63: ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో రెడ్, బ్లూ టీమ్ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమని గీతూ, ఆదిరెడ్డిలను ఆదేశించాడు నాగ్. బ్లూ టీమ్ లీడర్ ఆది రెడ్డి.. రాజ్ ఫస్ట్, ఇనయ సెకండ్ అని చెప్పి మెరీనా, వాసంతి, బాలాదిత్య, రోహిత్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంకులిచ్చాడు. తనకు ఏడో ర్యాంకు ఇచ్చుకున్నాడు ఆది. ఈ సందర్భంగా నాగ్.. సిగరెట్ల కోసం గీతూను నానామాటలు అన్నావు, సిగరెట్ తాగగానే సారీ చెప్పావు అంటూ బాలాదిత్య మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో అతడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక మీదట సిగరెట్ ముట్టుకోనని శపథం చేశాడు. ఆట అయిపోయాక బాలాదిత్య బలహీనత మీద ఆడుకోవడం కరెక్ట్ కాదని గీతూకు కూడా హితవు కలిపాడు నాగ్. రెడ్ టీమ్ లీడర్ గీతూ.. శ్రీహాన్‌కు ఫస్ట్, ఫైమాకు సెకండ్, శ్రీసత్య, రేవంత్, కీర్తిలకు మూడు, నాలుగు, ఆరో ర్యాంకులిచ్చింది. తనకు తాను మాత్రం ఐదో ర్యాంకిచ్చుకుంది. రేవంత్ ఉన్మాదిలా ఆడిన వీడియోను చూపించాడు నాగ్. అందులో అతడు ఇనయను బలంగా నెట్టేశాడు. నువ్వు ఇంకా నీ కోపాన్ని తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత శ్రీహాన్‌ను.. కెప్టెన్సీలో నువ్వేం పొడిచావో చెప్పమని అడగడంతో అతడు నీళ్లు నమిలాడు. లాస్ట్ వీక్ గీతూకు వాష్‌రూమ్స్ కడగాలని ఇచ్చిన పనిష్మెంట్ ఎందుకు తగ్గించావని ప్రశ్నించాడు. ఆదిరెడ్డి సాయం చేస్తుంటే చూస్తూ కూర్చున్నావెందుకని నిలదీశాడు. వీడియో వేసి మరీ చూపించడంతో అడ్డంగా దొరికిపోయిన శ్రీహాన్ తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. తప్పు చేసినందుకు ఫలితంగా నెక్స్ట్ వీక్ కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయావన్నాడు నాగ్. అనంతరం బ్లూ టీమ్‌లో ఆది, రెడ్ టీమ్‌లో గీతూకు వరస్ట్ పర్ఫామర్ ట్యాగిచ్చాడు. తర్వాత ఆది, కీర్తి, రేవంత్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. ఇక బిగ్‌బాస్ ఇంటి విషయాల గురించి నాగ్ మాట్లాడుతూ.. ఇంట్లో ఫుడ్ సరిపోవట్లేదంటున్నారు. ఆల్రెడీ మీకు కావాల్సినంత ఫుడ్ బిగ్‌బాస్ పంపిస్తూనే ఉన్నాడు. అయినా ఎందుకా సమస్య తలెత్తుతోందని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. వేస్ట్ చేసిన ఫుడ్ వీడియోను చూపించి తప్పు మీ దగ్గరే ఉందని నిందించాడు. తనను టార్గెట్ చేస్తున్నారని పదే పదే వాదిస్తున్న ఇనయ తనకు ఏదైనా కావాలంటే ముందుగా కెప్టెన్‌కు చెప్పమని సూచించాడు. అందరూ రెండుసార్లు టీ తాగినంత మాత్రాన నీకు రెండుసార్లు పాలు ఇవ్వడం ఎలా కుదురుతుందని ప్రశ్నించాడు. ఇకపోతే శ్రీహాన్‌ను నువ్వెక్కడ పడుకుంటున్నావో చూస్తున్నా అనడం తప్పని స్పష్టం చేశాడు. దానికి ఇనయ తాను వేరే ఇంటెన్షన్‌తో అన్నానని ఆన్సరివ్వగా కెమెరాలు చూస్తున్నాయి, ఎంత కవర్ చేసినా దొరుకుతావు ఇనయ.. అని గద్దించాడు. దీంతో ఆమె కిమ్మనకుండా సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రేపటి ఎపిసోడ్లో గీతూ ఎలిమినేట్ అవగా నేను వెళ్లనంటూ ఏడుపందుకుందట. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. The weekend heat is on 🔥 @iamnagarjuna confronts the housemates on this week's happenings! Don't miss tonight's exciting episode of #BiggBossTelugu6 on @StarMaa & @DisneyPlusHSTel.#BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/NjDGUcR07T — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 5, 2022 చదవండి: షాకింగ్ ఎలిమినేషన్, గీతూ రాయల్ అవుట్ ఇనయపై సూర్య ప్రతీకారం? ఆ పోస్ట్‌తో క్లారిటీ! -
గీతూ చెత్త సంచాలక్, బాలాదిత్య చేతులెత్తి మొక్కినా..
Bigg Boss 6 Telugu, Episode 60: బిగ్‌బాస్ అంటే మైండ్ గేమ్ అని కొందరు, కాదు ఫిజికల్ గేమ్ అని మరికొందరు, ఆ రెండింటికన్నా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ బ్రదరూ అనేవాళ్లూ ఉన్నారు. కానీ కంటెస్టెంట్లలో కచ్చితంగా ఈ మూడు క్వాలిటీస్ ఉండాల్సిందే! దురదృష్టం కొద్దీ ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు హౌస్మేట్స్. ఫిజికల్ గేమ్ వచ్చినప్పుడు మైండ్ గేమ్, మైండ్ గేమ్ వచ్చినప్పుడు ఫిజికల్ గేమ్ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా టాస్క్ రాగానే వారి బలహీనతల మీద దెబ్బ కొట్టి రెచ్చగొట్టి పెంట చేస్తున్నారు. దీంతో గేమ్ స్పిరిట్ కంటే గొడవలే ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్ ద వార్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే గ్రనైట్ రెడ్ స్క్వాట్ ఆధీనంలో ఉండటంతో ఎవరెవరు పోటీపడాలి? సంచాలకులుగా ఎవరు ఉండాలనేది రెడ్ టీమ్ ఎంపిక చేయొచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, గీతూ సంచాలక్ అయింది. బ్లూ టీమ్‌లో వీక్‌గా ఉన్నారనుకున్న ఇనయ, వాసంతి, మెరీనాలు.. రేవంత్, శ్రీహాన్, ఫైమాతో పోటీపడాలని నిర్ణయించారు. గేమ్ మొదలు కాకముందే ఎప్పటిలా కొత్త రూల్స్ పెట్టింది గీతూ. గోడ మీద నుంచి రెండు కాళ్లు కింద పెడితే అవుట్ అని చెప్పింది. గేమ్ ప్రారంభం కాగానే ముగ్గురు ఆడాళ్లు సివంగుల్లా పోట్లాడారు. వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేసిన రేవంత్‌ను అవుట్ చేసింది వాసంతి. శ్రీహాన్ ఇనయను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. నామినేషన్లో తప్ప కంటెంట్ లేనిదానివి నువ్వు మట్లాడుతున్నావు అని విమర్శించాడు. దీనికి ఇనయ.. నువ్వూ ఈ మధ్య కంటెంట్ బాగా ఇస్తున్నావ్లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా అంది. ఇక ఇనయ నెట్టేసే క్రమంలో శ్రీహాన్ రెండు కాళ్లు కింద పెట్టినా గీతూ మాత్రం తాను చూడలేదని మాట్లాడింది. ఎవ్వరు చెప్పినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మొదటి మిషన్‌లో రెడ్ స్క్వాడ్ గెలవగా వారు బ్లూ స్క్వాడ్‌లో రోహిత్‌ను చంపారు. తర్వాత శ్రీహాన్.. ఇనయ దగ్గరకు వెళ్లి నా క్యారెక్టర్ గురించి ఏదో నోరు జారుతున్నావేంటి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మా రిలేషన్‌కు ఓ పేరుంది, లిమిట్ ఉంది అని ఎగబడ్డారు శ్రీసత్య, శ్రీహాన్. దానికి ఇనయ మీరు కింద పడుకోవడం చూశానని ఆన్సరిచ్చింది. మరోపక్క బాలాదిత్య సిగరెట్ల కోసం అల్లాడిపోయాడు. చేసింది చాలు, తప్పు చేయకు, నా మనసు విరిగిపోయింది అని సిగరెట్లు అడగ్గా గీతూ మాత్రం ఇవ్వనంటూ మొండికేసింది. నా స్టూడెంట్స్‌కు నేను సిగరెట్లు తాగడం తెలియొద్దనుకున్నా, కానీ తెలిసిపోయింది. అమ్మ చూస్తే బాధపడుతుంది అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఆదిత్య. ఆదిరెడ్డి సహా అందరూ బతిమాలడంతో చివరాఖరికి సిగరెట్లు ఇచ్చేసి ఏడ్చేసింది గీతూ. దీంతో ఆవేశంలో సిగ్గులేదు అన్నందుకు తనను క్షమించమని చేతులెత్తి వేడుకున్నాడు బాలాదిత్య. గీతూ మాత్రం అతడిని క్షమించే ప్రసక్తే లేదన్నట్లు ప్రవర్తించింది. తెల్లారి బాలాదిత్య సిగరెట్లు తాగుదామనుకునేలోపు లైటర్ కనిపించకుండా పోయింది. దీంతో ఆదిరెడ్డి.. బిగ్‌బాస్.. వీక్నెస్తో ఆడుకోమన్నాడని చెప్పి మీ బలాన్ని ప్రయోగించరా? అని కరెక్ట్ పాయింట్ లాగాడు. అటు గీతూ మాత్రం.. నేను దొంగ, వెధవెన్నర వెధవ.. జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి కాసేపు సతాయించి తర్వాత లైటర్ ఇచ్చేసింది. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇనయ సూర్య జ్ఞాపకాలతో తడిసి ముద్దైంది. నీ షర్ట్ వేసుకునే గేమ్ ఆడాను. ఎందుకింత గుర్తొస్తున్నావంటూ సూర్యను తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వింది. అటు శ్రీసత్య మాత్రం ఎవరు ఏ పాయింట్లో ట్రిగ్గర్ అవుతారో నాకు తెలుసు. కాబట్టి రేపు ఎదుటివాళ్లను రెచ్చగొట్టి గేమ్ ఆడదామని రేవంత్‌తో చెప్పుకొచ్చింది. మరుసటి రోజు ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికి సీక్రెట్ మిషన్ ఇచ్చాడు. వాష్‌రూమ్‌ను పూర్తిగా అశుభ్రపరిచి ఆ నింద రెడ్ స్క్వాడ్‌లో ఒకరి మీద వేయాలన్నాడు. ఈ మిషన్ కంప్లీట్ చేస్తే బ్లూ టీమ్‌లో ఒకరిని బతికించొచ్చన్నాడు. మరి ఆ సీక్రెట్ మిషన్ పాజిబులా? ఇంపాజిబులా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అందరికీ రుణపడి ఉంటా: రంభ వీడియో వైరల్ -
ఇనయ బండారం బయటపెట్టిన రేవంత్, నామినేషన్స్‌లో 10 మంది!
Bigg Boss Telugu 6, Epispde 58: ఆర్జే సూర్య ఎలిమినేషన్ నేటి నామినేషన్స్‌ను మరింత రసవత్తరంగా మార్చింది. ఓ పక్క సూర్య కప్‌లో కాఫీ తాగుతూ అతడి జ్ఞాపకాల్లో మునిగి తేలుతోంది ఇనయ. ఆమెను చూసిన ఫైమా.. సూర్యతో మాట్లాడితే బయటకు నెగెటివ్‌గా పోతుందన్న ఆమె అతడు వెళ్లిపోతుంటే ముద్దులు పెట్టింది.. మరి అది నెగెటివ్‌గా పోదా? అంటూ గీతూతో చెప్పుకొచ్చింది. అసలు సూర్యను నామినేట్ చేసి అతడు బయటకు వెళ్లడానికి ప్రధాన కారణంగా నిలిచింది ఇనయ అంటూ మెజారిటీ హౌస్మేట్స్ ఆమెకు ఒకటే నామినేషన్లు గుద్దారు. మరి ఇంటిసభ్యులు ఎవరెవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ ఎదుట ఉన్న దిష్టిబొమ్మలపై కుండలు పగలగొట్టాలని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదటగా వచ్చిన గీతూ.. నీ భర్తతో కలిసి ఆడుతున్నావంటూ మెరీనాను, నువ్వో కన్ఫ్యూజన్ పర్స్ అంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. రేవంత్.. ఇనయను నామినేట్ చేసే క్రమంలో వీరి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఇప్పటివరకు సూర్య నామినేషన్లోకి రాలేదు, గుద్దితే వెళ్లిపోతాడు. చాలా సేఫ్‌గా ఆడుతున్నాడు.. అని నువ్వే అన్నావు కదా అంటూ ఇనయను ఇరికించేశాడు. నేనలా అనలేదు, సూర్య గురించి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదని ఫైర్ అయింది ఇనయ. ఇక తనను ఛీ, తూ అనేసిందని కీర్తి కుండ పగలగొట్టాడు రేవంత్. ఈ హౌస్‌లో ఇనయ మోస్ట్ ఫేకః ఫేకస్య ఫేకోభ్యః అన్నాడు ఆది. సూర్యను నామినేట్ చేయడం, అతడు వెళ్లిపోయినప్పుడు బాధపెడటం? ఇదంతా ఫేక్ అన్నాడు. విన్నర్ క్వాలిటీస్ సహజంగా ఉండాలే తప్ప కావాలని ఇముడ్చుకోవాలని చూస్తున్నావనడంతో మధ్యలో అందుకున్న ఇనయ.. అవును నేను విన్నర్ అంటూ రెచ్చిపోయింది. వీరి గొడవ చూసి శ్రీసత్య, గీతూ, శ్రీహాన్, రేవంత్ పడీపడీ నవ్వారు. తర్వాత రేవంత్ కుండ పగలగొట్టాడు ఆది. గేమ్‌లో మమ్మల్ని పర్సనల్‌గా రెచ్చగొట్టావ్. అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నాకు ఓటేసి ఇప్పుడేమో నా గేమ్ అర్థం కావట్లేదని నామినేట్ చేయడం సిల్లీగా అనిపించిందంటూ గీతూ దిష్టిబొమ్మ కుండ పగలగొట్టాడు రోహిత్. కరెక్ట్‌గా పాయింట్ టూ పాయింట్ మాట్లాడటంతో గీతూ నోరు మూయించాడు. తర్వాత శ్రీసత్యను నామినేట్ చేశాడు. మంచితనం ఎక్కువైందంటూ బాలాదిత్యను, ప్రవర్తన నచ్చట్లేదంటూ ఇనయను నామినేట్ చేసింది ఫైమా. సూర్య పేరు రాసుకున్నప్పుడు, సూర్యుడి బొమ్మ వేసుకున్నప్పుడు, అతడికి ముద్దులు పెట్టినప్పుడు బయటకు నెగెటివ్ అవుతావని అనిపించలేదా? అని ఫైమా నిలదీయగా సూర్య అంటే నాకిష్టం అంది ఇనయ. సూర్య నీకడ్డం అవుతాడని నామినేట్ చేసి పంపించావు. అతడికి వెన్నుపోటు పొడిచావంటూ ఆదిరెడ్డి పదే పదే అనడంతో ఇనయ కంట్లో నీళ్లు తిరిగినా అది బయటపడకుండా కంట్రోల్ చేసుకుంది. ఫ్రెండ్షిప్లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరూ పొడవరంటూ ఇనయను నామినేట్ చేశాడు శ్రీహాన్. పైగా తను కెప్టెన్ కావడంతో ఈరోజు నువ్వు నన్ను నామినేట్ చేయలేవు అని చివర్లో ఆనందపడ్డాడు. మెరీనా - శ్రీసత్య, గీతూ; బాలాదిత్య - శ్రీసత్య, ఫైమా; కీర్తి - గీతూ, రేవంత్; వాసంతి - గీతూ, రేవంత్; రాజ్ - గీతూ, బాలాదిత్య; సత్య - బాలాదిత్య, ఇనయలను నామినేట్ చేశారు. ఫైనల్‌గా ఈ వారం బాలాదిత్య, గీతూ, ఇనయ, రేవంత్, ఫైమా, శ్రీసత్య, కీర్తి, రోహిత్, ఆది రెడ్డి, మెరీనా నామినేషన్లో ఉన్నారు. చదవండి: మూడు నెలలుగా కోమాలో, నటుడి భార్య మృతి లవ్‌లో ఉన్నాం.. హీరోహీరోయిన్లు -
హే, పో.. అంటూ కుండ దాచుకున్న ఆది, లాస్ట్ పంచ్ అదిరింది!
నామినేషన్స్‌లో ఫుల్ ఫైర్ మీదున్నారు హౌస్మేట్స్. ఎనిమిదో వారం సూర్య వెళ్లిపోగా అతడు ఎలిమినేట్ అవడానికి ఇనయ కారణం అంటూ ఆమెకు నామినేసన్స్ గుద్దిపడేస్తున్నారు. వారానికో రంగు మార్చే ఊసరవెల్లి నాకు ఊసరవెల్లి ట్యాగ్ ఇచ్చింది.. ఫ్రెండ్షిప్లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరూ పొడవరు అంటూ ఇనయను నామినేట్ చేశాడు శ్రీహాన్. సూర్యను ఎక్కడ కొట్టాలో కొట్టావు, దెబ్బకు వెళ్లిపోయాడన్నాడు ఆది. అయితే ఇనయ మాత్రం ఆదిరెడ్డి ఫేక్ ఆడుతున్నాడంటూ కుండను పగలగొట్టేందుకు వెళ్లగా అతడు మాత్రం హే, పో.. కొట్టమాకు అంటూ కుండ దాచేసుకున్నాడు. చమ్కీలకు, గోధుమపిండి, మరమరాలకు అన్నింటికీ నామినేట్ చేస్తావ్ అంటూ ఇనయను ఆడుకున్నాడు ఆది. శ్రీహాన్.. ఈరోజు మనం ఫస్ట్ చెప్పుకోబోయే చాప్టర్ పేరు హ్యుమానిటీ. నువ్వు మా దగ్గర చేపలు లాక్కుంటున్నప్పుడు శ్రీసత్య డ్రెస్ పైకి వెళ్లిపోతుంటే హ్యుమానిటీ గుర్తుకురాలేదా? అని అడిగాడు. దీనికి చిర్రెత్తిన కీర్తి.. నీట్‌గా నిల్చుని మాట్లాడినప్పుడు నీ ఎటకారం ఏంట్రా? అంది. రా.. అనకు అంటూ ఫైర్ అయ్యాడు శ్రీహాన్. నా వెటకారం మోతాదు మించిపోయిందని నామినేట్ చేశావు, నీ మంచితనం మోతాదు మించిపోయింది అంటూ బాలాదిత్యను నామినేట్ చేసింది ఫైమా. మంచితనానికి కూడా నామినేట్ చేస్తారా? అని షాకవుతున్నారు ఆడియన్స్. చివర్లో శ్రీహాన్ పంచ్ మాత్రం అదిరిపోయింది. ఇనయ దగ్గరకు వెళ్తూ.. ఒక్కటి మాత్రం నువ్వు చేయలేవు అంటూ ఈరోజు నన్ను నామినేట్ చేయలేవు అని హ్యాపీగా ఫీలయ్యాడు. చదవండి: నాలో విన్నర్ క్వాలిటీస్, నేనే బిగ్‌బాస్ విన్నర్ సినిమాల జాతర.. థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే! -
ఉన్మాదిలా ఆడుతున్నావు: వీడియో చూపించి పరువు తీసిన నాగ్
చాలా రోజుల తర్వాత ఫుల్ ఫైర్ మీదున్నాడు నాగార్జున. ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరినీ వాయించేస్తున్నాడు. ఆఖరికి కెప్టెన్ అయినందుకు శ్రీహాన్‌ను ప్రశంసిస్తాడనుకుంటే అతడిని కూడా విమర్శించాడు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో నాగ్.. చేపల చెరువు టాస్క్‌లో శ్రీహాన్- శ్రీసత్య కలిసి ఆడారా? లేదా వేరే జంటల సాయం తీసుకున్నారా? అని అడిగాడు. ఇందుకు వాళ్లు కాస్త అనుమానంగానే తలూపుతూ కలిసే ఆడామన్నారు. నాగ్ మాత్రం గీతూ దయాదాక్షిణ్యాల మీదే మీ గేమ్ ఆధారపడిందని పరువు తీశాడు. ఇక చీటీలు వేసుకుని కెప్టెన్సీ కంటెండర్లు కావడమేంటని అడిగాడు హోస్ట్. దీనికి వాసంతి మాట్లాడుతూ.. ముగ్గురు అమ్మాయిల కన్నా నువ్వు ఫిజికల్‌గా తక్కువ అనేసరికి షాక్‌లో ఉండిపోయానంది. నువ్వో ఫెమినిస్ట్ అని చెప్పుకుంటావు, మరి ఫిజికల్‌గా తక్కువ అంటూ అనడం.. ఫెమినిస్ట్ మాట్లాడాల్సిన మాటలేనా? అని నాగ్.. సూర్యను నిలదీయడంతో అతడు సిగ్గుతో తల దించాడు. కామెడీకి హద్దు ఉంటుందని మర్చిపోతున్నావంటూ ఫైమాను హెచ్చరించాడు. గేమ్‌లో రేవంత్ మిగతావారిని ఇష్టమొచ్చినట్లు నెట్టేసిన వీడియోను చూపించిన నాగ్.. ఒక ఉన్మాదిలా ఆడుతున్నావని తిట్టిపోశాడు. అనంతరం ఈరోజు డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. వెళ్లిపోయేది మరెవరో కాదు, సూర్య అని సోషల్ మీడియాలో ఆల్రెడీ లీకైన విషయం తెలిసిందే! చదవండి: నువ్వేంది ఆడించేది? బిగ్‌బాస్ లేడా?: నాగార్జున వాళ్లు సేఫ్, అతడు ఎలిమినేట్ -
నా చేతివంట తిన్నాక నాన్నకు గుండెపోటు వచ్చింది: ఇనయ
Bigg Boss 6 Telugu, Episode 55: ముందుగా అనుకున్నట్లుగానే శ్రీహాన్ కెప్టెన్ అయ్యాడయ్యాడు. అలా కెప్టెన్ అయ్యాడో లేదో ఇలా ఇనయతో గొడవపడ్డాడు. మొన్నటిదాకా కలిసిపోయిన వీళ్లిద్దరి కథ కెప్టెన్సీ టాస్క్‌తో మళ్లీ మొదటికి వచ్చింది. ఇనయ కత్తిపోటు వేయడాన్ని శ్రీహాన్ జీర్ణించుకోలేకపోయాడు. సరైన సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తాననడి డిసైడ్ అయ్యాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. సూర్య, ఇనయల ట్రాక్ చూసి జనాలు వీరిని సునయ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ నాగార్జున వీకెండ్లో పదేపదే బుజ్జమ్మ పేరు ఎత్తడంతో ఇనయ బాగా హర్టయింది. సూర్యకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని అన్నిసార్లు గుర్తు చేసినప్పుడు తను క్లోజ్‌గా ఉండటం తప్పని భావించింది. ఏకంగా అతడి ఫ్రెండ్షిప్నే వద్దంది. సూర్య మీద ద్వేషం పెంచుకుంది. టాప్ 5లో కాదు కదా వీలైనంత వెంటనే బయటకు వెళ్లిపోవాలని రగిలిపోయింది. కానీ ఆ కోపం చప్పున చల్లారిపోయినట్లు కనిపిస్తోంది. నాకు కోపమొస్తే అవతలివారిని బాధపెడతాడనని సూర్యతో చెప్పుకొచ్చింది ఇనయ. నీ బ్రాస్లేట్ రేవంత్ దగ్గర ఉండటం నచ్చలేదు, అందుకే తీసుకున్నానన్నాడు సూర్య. అలా ఇద్దరూ కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీ కంటిన్యూ అయింది. నిన్న రాజ్, రోహిత్, రేవంత్.. సూర్యకు; బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చగా ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. నేటి ఎపిసోడ్లో వాసంతి, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. తక్కువ కత్తులు దిగిన శ్రీహాన్ కెప్టెన్‌గా అవతరించాడు. మరోవైపు కిచెన్‌లో గీతూ, బాలాదిత్య పంచాయితీకి దిగారు. కూరగాయలు కట్ చేసినప్పుడు దాని తొక్కలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చు కదా అని బాలాదిత్య.. నేను ఎందుకు వేస్తా, అంత అవసరమనుకుంటే నువ్వే వేసేయ్ అంటూ గీతూ దెబ్బలాడుకున్నారు. అలా ఇద్దరి గొడవతో ఇంట్లో రగడ జరిగింది. తర్వాత యమహా కాల్ ఆఫ్ ద బ్లూ టాస్క్‌లో రోహిత్ గెలిచి జాకెట్ గెలుచుకున్నాడు. తనను విన్నర్‌గా ప్రకటించకపోవడంతో రేవంత్ చిర్రుబుర్రులాడాడు. అనంతరం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమని కెప్టెన్ శ్రీహాన్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో కెప్టెన్.. బాలాదిత్య ముఖానికి పెయింట్ పూయడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గీతూ ప్రవర్తన మీద ఓ కన్నేసిన ఆది రెడ్డి తన అభిప్రాయాన్ని ఆమె ముందుంచాడు. గీతక్క నువ్వు రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నావనిపిస్తోందన్నాడు. ఆమె మాత్రం అదేమీ పెద్దగా పట్టించుకోనట్లే కనిపించింది. ఇక ఆది కూతురు హద్విత ఫస్ట్ బర్త్‌డే కావడంతో అతడికి ఫ్యామిలీ వీడియో చూపించాడు బిగ్‌బాస్. ఆ వీడియోలో ఆది భార్య కవిత కూతురికి కేక్ కట్ చేసి తినిపించింది. తన తల్లిని, పెళ్లాంబిడ్డలను చూసి ఆది సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కెప్టెన్ శ్రీహాన్ ఇంటిసభ్యులకు పనులు అప్పగించేందుకు రెడీ అయిపోయాడు. ఇనయను వంట చేయమని అడిగాడు. దీనికి ఇనయ స్పందిస్తూ.. 'నేను చివరిసారిగా వంట చేసింది మా డాడీకే, నా వంట తిన్నాక ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వంట ముట్టుకోలేదు, ఇక మీదట చేయను కూడా' అని తెగేసి చెప్పింది. కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్ అనగా కూర లేకపోవడంతోనే తాను రైస్ పక్కన పెట్టేశానని మధ్యలో కల్పించుకుని ఆన్సరిచ్చింది ఇనయ. అసలు నీ పేరు ప్రస్తావించనప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు కెప్టెన్. అలా ఇద్దరి మధ్య కాసేపు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏదేమైనా అన్నం పడేస్తే మాత్రం అస్సలు ఊరుకోనన్నాడు శ్రీహాన్. మళ్లీ గొడవలవుతున్నాయని శ్రీహాన్ చిరాకుపడుతుంటే గీతూ మాత్రం.. ఇలా గొడవ జరిగితేనే సీజన్ హిట్టవుతుందని చెప్పుకురావడం విశేషం.. -
ఆదిరెడ్డికి సర్ప్రైజ్, కెప్టెన్‌గా తప్పు చేసిన శ్రీహాన్!?
ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు పొడిచిన ఇనయపై కసి పెంచుకున్నాడు శ్రీహాన్. సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తానని డిసైడ్ అయ్యాడు. ఎలాగో అతడు కెప్టెన్ అయిన విషయం బయటకు రానే వచ్చింది. తాజాగా అతడు ఇంటిబాధ్యతలు చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఇంట్లో కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్ చెప్తుండగా మధ్యలో ఇనయ కల్పించుకుని నాకు కూర సరిపోలేదని అన్నం వదిలేశానని క్లారిటీ ఇచ్చింది. దీంతో శ్రీహాన్ ఫైర్ అవుతూ.. 'నేను మాట్లాడినప్పుడు కాదు, తర్వాత క్లారిటీ ఇచ్చుకో! నేను అందరి పాయింట్స్ చెప్తున్నప్పుడు కామ్‌గా ఉండు, తర్వాత మాట్లాడుకో' అంటూ ఒంటికాలిపై లేచాడు. కర్రీ వేయలేదు కాబట్టే తినలేదని ఇనయ మరోసారి చెప్పగా అన్నానికి నువ్విచ్చే విలువ అదా? నా కళ్ల ముందు ఎవరైనా రైస్ పడేసినట్లు కనిపిస్తే అస్సలు ఊరుకోను అని హెచ్చరించాడు కొత్త కెప్టెన్. ఈరోజు ఆదిరెడ్డి కూతురు బర్త్‌డే కావడంతో బిగ్‌బాస్ అతడి కోసం స్పెషల్ వీడియో ప్లే చేశాడు. అది చూసి ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. మరోపక్క వరస్ట్ పర్ఫామర్‌గా ఎవరిని సెలక్ట్ చేయాలన్న బాధ్యతను కెప్టెన్ శ్రీహాన్‌కు ఇచ్చాడు బిగ్‌బాస్. అతడు సత్య, గీతూల కోపం అర్థం చేసుకున్నాడో ఏమో కానీ బాలాదిత్యను జైలుకు పంపించినట్లు తెలుస్తోంది. చదవండి: తొక్కలో పంచాయితీ, ఎంత చెప్పినా గీతూ వినదే ఒక్క పోస్ట్‌తో లవ్ కన్ఫర్మ్ చేసిన హీరో సిద్దార్థ్ -
ఇనయ నాటకాలు ఆడుతోంది, నేనేంటో చూపిస్తా: శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 54: మొత్తానికి గీతూ అనుకుంది సాధించింది. బాలాదిత్య- మెరీనా గేమ్‌లో ఉండటానికి వీల్లేదని డిసైడ్ అయిన గీతూ అన్నంత పని చేసింది. చేపల చెరువు టాస్క్‌లో సంచాలకురాలిగా వ్యవహరించిన గీతూ బాలాదిత్య జంటను గేమ్ నుంచి సైడ్ చేసింది. అత్యధిక చేపలున్న శ్రీహాన్- శ్రీసత్య ఇద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎన్నికయ్యారని బిగ్‌బాస్ ప్రకటించాడు. మరి వీరితోపాటు కెప్టెన్సీ బరిలో ఎవరెవరు దిగారు? ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. గీతూ మహిమ వల్ల శ్రీహాన్-శ్రీసత్య కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మిగిలిన నాలుగు జంటలు.. చర్చించుకుని ఒక్కో జంట నుంచి ఒక్కొక్కరి చొప్పున కెప్టెన్సీ పోటీదారుల పేర్లు వెల్లడించమన్నాడు బిగ్‌బాస్. దీంతో రేవంత్- ఇనయ జోడీ నుంచి రేవంత్, సూర్య- వాసంతి జంట నుంచి సూర్య, రోహిత్- కీర్తి జంట నుంచి కీర్తి, ఫైమా- రాజ్ జోడీ నుంచి ఫైమా కంటెండర్లుగా నిలబడ్డారు. కెప్టెన్సీ కోసం పోటీపడలేనందుకు ఇనయ వాష్‌రూమ్ ఏరియాలో సూర్యను పట్టుకుని తెగ ఏడ్చేసింది. కెప్టెన్సీకి ఒక్క అడుగు దగ్గరవడానికి చిక్కుల్లో కెప్టెన్సీ అనే టాస్క్ పూర్తి చేయాలన్నాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో అందరికంటే త్వరగా చిక్కుముడులు విప్పి కీర్తి, సూర్య, శ్రీహాన్ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. అయితే హౌస్మేట్స్ ఎవరిని కెప్టెన్‌గా చూడాలనుకోవట్లేదో వారికి కత్తిపోట్లు గుచ్చాలన్నాడు బిగ్‌బాస్. రాజ్, రోహిత్, రేవంత్.. సూర్యకు, బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. దీంతో హర్టయిన శ్రీహాన్.. ఇదంతా ప్రోమోకట్, కంటెంట్ కోసమేనన్నాడు. 'నెక్స్ట్ వీక్ ఎవరైనా నీది- సూర్యది బాండింగ్ మిస్ అవుతున్నామంటే వెంటనే వెళ్లి అతడితో కలిసిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో! కరెక్ట్ సమయం వచ్చినప్పుడు చెప్తా. అన్ని నాటకాలు ఆడుతోంది. ఎందుకీ యాక్టింగ్. స్టేబులిటీ లేదని నన్నంది. ఆమె వారానికోసారి రంగు మారుస్తోంది. నాకు నమ్మకద్రోహం చేసింది. నాకు కత్తి గుచ్చినందుకు బాధపడేలా చేస్తా' అని రగిలిపోయాడు శ్రీహాన్. మిగిలినవాళ్లు శ్రీహాన్‌కు సపోర్ట్ చేయడంతో అతడు కెప్టెన్ అయ్యాడు. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. చదవండి: బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా? అప్పుడే విషం చిమ్మి అంతలోనే కలిసిపోయిన బావామరదళ్లు -
ట్విస్ట్ ఇచ్చిన ఇనయ.. షాక్‌లో సూర్య, శ్రీహాన్
ఎన్నోసార్లు కెప్టెన్సీ కంటెండర్ అవుతున్నా కెప్టెన్ కాలేకపోతున్నారు కొందరు హౌస్మేట్స్. కారణం.. కెప్టెన్‌ను నిర్ణయించే బాధ్యత హౌస్మేట్స్ చేతిలో పెడుతున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే చాలాసార్లు అదే రూల్ ఫాలో అయిన బిగ్‌బాస్ ఈసారి కూడా మళ్లీ దాన్నే అమలు చేశాడు. ఎంతో కష్టపడి కెప్టెన్సీ బరిలో నిలిచిన కీర్తి, సూర్య, శ్రీహాన్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకోమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. ఈ ముగ్గురిలో సూర్య, కీర్తి ఇదివరకే ఒకసారి కెప్టెన్ అయ్యారు. దీంతో మెజారిటీ ఇంటిసభ్యులు శ్రీహాన్‌కు మద్దతు పలుకుతూ మిగతావారికి కత్తిపోట్లు గుచ్చారు. అలా కీర్తికి ఒకటి, సూర్యకు మూడు కత్తిపోట్లు పడ్డాయి. తర్వాత ఇనయ లేచి సూర్యకు కత్తి గుచ్చేస్తా అంటూనే వెళ్లి శ్రీహాన్‌కు కత్తి పొడిచింది. ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కు ఇంటిసభ్యులు ముక్కున వేలేసుకున్నారు. ఇనయ గేమ్ చేంజర్ అని సూర్య ఉప్పొంగిపోగా వారానికి ఒకసారి రంగు ఎవరు మారుస్తున్నారు? అని ఇనయమీద అసహనం వ్యక్తం చేశాడు శ్రీహాన్. ఫైనల్‌గా ఈ రోజు శ్రీహాన్ పంట పండి అతడు కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: కలిసిపోయిన సునయ, ఈ వారం కెప్టెన్ ఎవరంటే? ఆటోలో సిటీ అంతా తిరిగిన నటుడు, వీడియో వైరల్ -
అప్పుడే విషం చిమ్మి అంతలోనే కలిసిపోయిన బావామరదళ్లు!
ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్న రీతిలో గేమ్ ఆడుతున్నారు హౌస్మేట్స్. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే కెప్టెన్ అయిపోదామన్న కసితో ఆడుతున్నారు. కానీ గీతూ మాత్రం గేమ్ మొదటి రౌండ్లోనే అవుట్ అయిపోవడంతో తనకు నచ్చనివారిని టార్గెట్ చేసి సైడ్ చేసేస్తోంది. నచ్చినవారికి అనుకూలంగా గేమ్‌ను తిప్పుతోంది. ఈ క్రమంలోనే తనకు దొరికిన నల్ల చేపతో శ్రీహాన్-శ్రీసత్యలకు ఎక్కువ చేపలు వచ్చేలా చేసింది. ఇకపోతే ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో శ్రీహాన్, సూర్య, రేవంత్, శ్రీసత్య, కీర్తి, ఫైమా తాళ్లు ముడి విప్పే గేమ్‌లో పాల్గొన్నారు. ఫైనల్‌గా శ్రీహాన్ గెలిచి కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికి చాలాసార్లు కెప్టెన్సీ కంటెండర్ దాకా వచ్చి ఆగిపోయాడు శ్రీహాన్. చివరికి ఏడు వారాల తర్వాత తొలిసారి కెప్టెన్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు సూర్యను బావా అని పిలుస్తూ దగ్గరైన ఇనయ.. అతడు టాప్ 5లో కూడా ఉండకూడదని విషం చిమ్మింది. మళ్లీ ఇంతలోనే అతడిని పట్టుకుని ఏడుస్తూ కనిపించింది. అంటే బావా మరదళ్లు కలిసిపోయారా? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: గీతూ టార్గెట్ ఆ రెండు జంటలే! రామ్‌గోపాల్ వర్మ సంచలన ప్రకటన -
రేవంత్‌ను నామినేట్ చేసినా వేస్ట్, టాప్ 5, ఫిక్స్: శ్రీసత్య
Bigg Boss 6 Telugu, Episode 47 Highlights: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రస్తుతం ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. బిగ్‌బాస్ వార్నింగ్‌లు, టాస్కులతో ఎపిసోడ్స్‌లో కొంత ఫ్రెష్‌నెస్ కనిపిస్తోంది. కడుపు మాడితే ఎలా ఉంటుందో చూపించిన బిగ్‌బాస్ ఇప్పుడు హౌస్‌లో ఉండటానికి హౌస్మేట్స్ తమకు అర్హత ఉందని నిరూపించుకోవాలంటూ టాస్క్ ఇచ్చాడు. మరోవైపు శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. మరి ఆ విశేషాలేంటో నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో వివరంగా చదివేద్దాం.. ప్రతిరోజు ఏదైనా హుషారెత్తించే పాటతో నిద్రలేపే బిగ్‌బాస్ ఈరోజు మాత్రం కుక్క అరుపులు ప్లే చేసి కంటెస్టెంట్లు ఉలిక్కిపడేలా చేశాడు. కాసేపటికే హౌస్మేట్స్ ఆకలి అంటూ అలమటిస్తుండటంతో తిరిగి ఫుడ్ పంపించాడు బిగ్‌బాస్. కానీ దీనికంటే ముందుగా హౌస్మేట్స్ ఇకమీదట 100 శాతం ఎఫర్ట్స్ పెడతామని ప్రతిజ్ఞ చేశారు. మెరీనా అయితే టాస్క్ ఉన్నా లేకపోయినా ఈరోజు నుంచి కచ్చితంగా కంటెంట్ ఇస్తానని శపథం చేసింది. మౌనవ్రతం వీడిన బిగ్‌బాస్.. ఇంట్లో ఉండే అర్హత కోసం పోటీపడాలని సూచించాడు. పిట్ట గోలకు ఫుల్స్టాప్ చెప్పి ఇనయ, శ్రీహాన్ కలిసిపోవడంతో వారిని మిగతా హౌస్మేట్స ఆటపట్టించారు. మమ్మల్నందరినీ వదిలేసి కేవలం ఇనయకు మాత్రమే బాగున్నావని ఎలా కాంప్లిమెంట్ ఇస్తావ్ అంటూ శ్రీహాన్ మీద మూకుమ్మడిగా దాడి చేసింది హౌస్‌లోని మహిళా లోకం. దీంతో ఇలా బుక్కైపోయానేంట్రా బాబూ అని తల గోక్కున్నాడతడు. తర్వాత శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. అందులో భాగంగా ఇనయ దగ్గరుండి కేక్ మీద చోటు అని రాయించి హార్ట్ సింబల్ వేయించింది. బర్త్‌డే బాయ్ కేక్ కట్ చేసి మొదట ఇనయకు తినిపించాడు. వీరి సడన్ ఫ్రెండ్షిప్ చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం బిగ్‌బాస్ బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో నిన్నటి టీమ్సే కొనసాగుతాయన్నాడు. రేవంత్, ఫైమా, బాలాదిత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, కీర్తి రెడ్ టీమ్ కాగా ఇనయ ఆ టీమ్ లీడర్‌గా వ్యవహరించింది. మిగిలినవారంతా బ్లూ టీమ్ కాగా దానికి శ్రీసత్య లీడర్‌గా కొనసాగింది. ఈ గేమ్‌లో శ్రీహాన్.. శ్రీసత్య చేతిలో నుంచి బొమ్మ లాక్కునే క్రమంలో ఆమె కింద పడింది. ఇక రేవంత్ ఏం చేసినా శ్రీసత్య పాయింట్ అవుట్ చేస్తూ రెచ్చగొట్టడంతో అతడు సహనం కోల్పోయి ఫైర్ అయ్యాడు. అలా వీరిద్దరూ టాస్క్‌లో ఒకరినొకరు విమర్శించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అర్జున్.. నిన్ను వెక్కిరించినందుకు అతడిని నామినేట్ చేయ్ అని శ్రీసత్యకు సలహా ఇచ్చాడు. అయితే శ్రీసత్య మాత్రం.. అతడిని నామినేట్ చేసినా బయటకు వెళ్లడు, టాప్ 5 కంటెస్టెంట్, ఫిక్స్ అయిపోవాల్సిందే అని అని చెప్పింది. ఈ గేమ్ రెండో లెవల్లో కంటెస్టెంట్లు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కాళ్లు అడ్డం పెట్టాడని అర్జున్ను రేవంత్, నెట్టేశాడని ఆదిరెడ్డిని వాసంతి కొట్టారు. హింస ఉండకూడదు అని సత్య నెత్తీనోరు మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చదవండి: దమ్ముంటే అడ్డుకో, ఎత్తిపడేసిన శ్రీహాన్ -
దమ్ముంటే అడ్డుకో.. అర్జున్ను ఎత్తిపడేసిన శ్రీహాన్
బిగ్‌బాస్ వార్నింగులు, ఇంట్రస్టింగ్ టాస్కులతో షో రంజుగా మారింది. మొదట ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా బిగ్‌బాస్ తీసుకెళ్లిపోగా టాస్కులు గెలిచి దాన్ని తిరిగి సంపాదించుకున్నారు హౌస్మేట్స్. ఈ క్రమంలో ఇంటిసభ్యులు శ్రీహాన్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు. విచిత్రంగా ఇనయ దగ్గరుండి ఆ పనులు చూసుకోవటం గమనార్హం. ఇదే విషయంపై శ్రీహాన్‌ను ఆటపట్టించారు మిగతా హౌస్మేట్స్. మరోవైపు ఇనయ కేక్‌పై చోటు అని రాయించి హార్ట్ సింబల్ పెట్టించింది. ఇదేదో నా కొంప ముంచేలా ఉందంటూనే శ్రీహాన్ కేక్ కట్ చేసి ఇనయకు తినిపించాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌తో వీరి పిట్ట గోల ముగిసినట్లైంది. ఆహారం కోసం పోట్లాడిన హౌస్మేట్స్ ఇంట్లో ఉండేందుకు కావాల్సిన అర్హత కోసం ఫైట్ చేయండంటూ పూల టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో కూడా ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించినట్లు తెలుస్తోంది. ఇందులో అర్జున్, శ్రీహాన్‌కు గట్టిగానే గొడవ జరిగినట్లు కనిపిస్తోంది. అర్జున్ను ఎత్తి పడేసిన శ్రీహాన్ దమ్ముంటే అడ్డుకో అంటూ తొడకొట్టి సవాలు విసిరాడు. మరి ఈ టాస్క్‌లో ఏ టీమ్ గెలిచింది? అనేది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: ఆదిరెడ్డి బయటకు పోతావ్, వేరేవాళ్లు పోతే ఫీలవుతా: గీతూ -
లవ్ ట్రాక్ ఎత్తేసిన సునయ, ఇప్పుడు కొత్త డ్రామా!
Bigg Boss 6 Telugu, Episode 44: 'సునయ' లవ్ ట్రాక్ ప్రేక్షకులకు రోత పుడుతుందని అర్థమైనట్లుంది. అందుకే ఇకపై కలిసి ఉండటం కన్నా గొడవలు పెట్టుకోవడం బెటర్ అని ఇనయ, సూర్య డిసైడ్ అయ్యాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం అందరిముందు దెబ్బలాడుకున్నారు. అటు సూర్య మాత్రం.. నాకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం వల్ల ఇనయ గేమ్ దెబ్బతినడం నచ్చట్లేదు. ఆమె గేమ్‌ను నేనే మారుస్తా. మా ఇద్దరి మధ్య నిజంగానే డిష్యుం డిష్యుం జరిగేలా చేస్తా. కానీ ఇనయ అంటే నాకిష్టం. ఇండిపెండెంట్ ఉమెన్ను నేను ఇష్టపడతా అంటూ కెమెరాలతో మనసులో మాట పంచుకున్నాడు సూర్య. అటు గీతూ.. ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనను ఫ్లర్ట్ చేయలేదని చెప్పింది. ఎందుకక్కా? అని రేవంత్ అడగ్గా బహుశా అందంగా లేనేమోనని బదులిచ్చింది. దానికి ఆది రెడ్డి కంపను తెచ్చుకుని అతికించుకోవడం ఎందుకులే అని ఊరుకున్నారులేనని దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. కాసేపటికే బిగ్‌బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైమా.. వాసంతి, బాలాదిత్యను; రోహిత్.. రేవంత్, శ్రీహాన్‌ను; శ్రీసత్య.. బాలాదిత్య, రేవంత్‌ను; బాలాదిత్య.. రేవంత్, ఫైమాను, ఆది రెడ్డి.. అర్జున్, వాసంతిని; మెరీనా.. రేవంత్; ఆది రెడ్డిని; గీతూ.. వాసంతి, బాలాదిత్యను; రాజ్.. బాలాదిత్య, వాసంతిని; ఇనయ.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; అర్జున్.. బాలాదిత్య, ఆది రెడ్డిని; వాసంతి.. రాజ్, రేవంతిని; కీర్తి.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; రేవంత్.. మెరీనా, శ్రీసత్యను; సూర్య.. బాలాదిత్య, రేవంత్‌ను నామినేట్ చేశారు. శ్రీహాన్.. డ్రామా క్వీన్ అంటూ ఇనయను నామినేట్ చేశాడు. 23 ఏళ్లుగా స్ట్రాంగ్ అని చెప్పే కీర్తి ఇంట్లో ప్రతిదానికి ఏడుస్తుంది, అంటే ఆమె వీక్ కంటెస్టెంట్ అని చెప్తూ కీర్తిని నామినేట్ చేశాడు. ఇక ఈ ప్రక్రియలో తాను నామినేషన్‌కు భయపడుతున్నానని ఆదిరెడ్డి, రాజ్ అనడంతో వాసంతి చిర్రెత్తిపోయింది. నామినేషన్స్‌కు ఇక్కడ ఎవరూ భయపడట్లేదా? నేనొక్కదాన్నే భయపడుతున్నానా? ఏమైనా అంటే ఇదే కారణం వెతుక్కుంటారని చిటపటలాడింది. తనకు నామినేషన్స్ నథింగ్ అని, హెయిర్ తన జీవితం అయినా అయినా దాన్ని కట్ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఈ ఏడోవారం రోహిత్, వాసంతి, ఆదిత్య, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్, కీర్తి, శ్రీసత్య, మెరీనా, రాజ్, ఫైమా నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: అది ఫేవరెటిజమా?: యాంకర్‌నే నిలదీసిన సుదీప ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒంటరిగా రమ్మన్నాడు -
ఆ ఇద్దరు తప్ప అందరూ నామినేషన్లోనే!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం పదిహేను మంది మిగిలారు. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏదైనా టాస్క్ ద్వారా కాకుండా ఇంటిసభ్యులు కారణాలు చెప్పి మిగతావారిని నామినేట్ చేశారు. ఈ క్రమంలో కెప్టెన్ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. తన కెప్టెన్సీలో బిగ్‌బాస్ రూల్స్ పక్కనపెట్టి తనే ఆదమరిచి నిద్రపోయాడంటూ నామినేసన్ ఓట్లు గుద్దారు. తను ఫ్రెండ్ అనుకున్న శ్రీసత్య కూడా వేరే ఆప్షన్ లేదంటూ రేవంత్‌నే నామినేట్ చేసింది. ఇనయ బిహేవియర్ నచ్చలేదంటూ ఆమెను నామినేషన్లోకి పంపాడు శ్రీహాన్. నువ్వు మంచివాడిగా ఎలా ఉన్నావో అదే పేరుతో బయటకు వెళ్లిపోతే బాగుందని బాలాదిత్యకు ఓటేసింది గీతూ. సిస్టర్ అనుకున్న గీతూ తను వెళ్లిపోవాలని కోరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆదిత్య. హౌస్ మంచి కోసం తాను పాటుపడుతుంటే తననే పంపించేయాలని చూస్తున్నారని బాధపడ్డాడు. చూస్తుంటే గీతూ, కెప్టెన్ సూర్య మినహా మిగతా అందరూ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గీతూ జిడ్డు.. రేవంత్ అయితే.. : సుదీప -
ఇనయకు తెలిస్తే శ్రీసత్యను చెప్పుతో కొట్టడం ఖాయం.. కీర్తి
Bigg Boss Telugu 6, Episode 38: బిగ్‌బాస్ షో ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ కొన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు. ఆడియో కాల్, వీడియో కాల్, ఇంటి నుంచి ఫుడ్ అంటూ వారిని సర్ప్రైజ్ చేశాడు. అయితే ఇక్కడే ఏదో మెలిక కూడా పెట్టాడు. మరి ఆ సర్ప్రైజ్లు ఎవరెవరికి దక్కాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నామినేషన్స్ ముగిసినా దాన్నుంచి బయటపడలేకపోయింది కీర్తి. 'ఇనయను నీ ఎంకమ్మ అనడం పెద్ద బూతు అని శ్రీసత్య అందరి ముందు నొక్కి చెప్పింది. కానీ అదే శ్రీసత్య ఇనయను ఘోరమైన బూతులు అంది. అదేంటో చెప్తే ఇనయ ఆమెను చెప్పు తీసుకుని కొట్టడం ఖాయం. ఆమె ఏమందో చెప్తే హౌస్ అల్లకల్లోలం అయిపోతుంది' అని ఫైమాతో చెప్పుకొచ్చింది కీర్తి. మరుసటి రోజు బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో 100% చార్జ్ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ వారం హౌస్మేట్స్ కోసం బిగ్‌బాస్ కొన్ని సర్ప్రైజ్లను ప్లాన్ చేశాడు. అయితే ఇంటిసభ్యులు ఎంచుకునే ప్రతి సర్ప్రైజ్కు బదులుగా బ్యాటరీలోని కొంత చార్జ్ తగ్గిపోతుంది. అంతేకాక ఇంటి నియమాలను ఉల్లంఘిస్తే కూడా చార్జ్ తగ్గిపోతుందని చెప్పాడు బిగ్‌బాస్. ముందుగా శ్రీహాన్‌ను పిలిచి నాన్నతో వీడియో కాల్ మాట్లాడటానికి 58%, సిరితో ఆడియో కాల్‌కు 30%, ఇంటి నుంచి మటన్ బిర్యానీ కావాలంటే 15% బ్యాటరీ ఉపయోగించాలని బిగ్‌బాస్ తెలిపాడు. మొదట ఇవేవీ తనకు వద్దనుకున్నాడు, కానీ బిగ్‌బాస్ ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిందేనని హెచ్చరించడంతో మటన్ బిర్యానీ కావాలని చెప్పాడు. తర్వాత సుదీపను పిలిచి నీ భర్తతో మాట్లాడతావా? టీషర్ట్ కావాలా? మీ అమ్మ చేసిన చికెన్ కర్రీ కావాలా? అని అడిగాడు. అందుకామె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉన్నదాంట్లో తక్కువ బ్యాటరీ ఉన్న ఆడియో కాల్(30%)ను ఎంచుకుంది. దీంతో ఆమె తన భర్త రంగనాథ్‌తో తనివితీరా మాట్లాడింది. అటు శ్రీహాన్ తన మటన్ బిర్యానీని గీతూతో షేర్ చేసుకున్నాడు. రేవంత్ పడుకోవడంతో 5% , గీతూ సరిగా మైక్ ధరించకపోవడంతో మరో 5% తగ్గిపోయింది. తర్వాత ఆదిరెడ్డి అందరి గురించి ఆలోచించను, ఇప్పుడు తనకు ఫ్యామిలీనే ముఖ్యం అనుకున్నాడు. ఎక్కువ బ్యాటరీ కట్ అయ్యే ఫ్యామిలీతో వీడియో కాల్(40%)ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. దీంతో అతడు తన భార్యాకూతురితో వీడియో కాల్ మాట్లాడగా... ఈ సంతోషంతో ఆదిరెడ్డికి రాత్రి నిద్ర కూడా పట్టినట్లు లేదు. చదవండి: వాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకుంటున్నారో తెలీట్లేదు స్టేజ్‌పై ఏడ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ -
బిగ్‌బాస్ వార్నింగ్.. ఏడ్చేసిన శ్రీహాన్, శ్రీసత్య
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ వరుసగా ఆరో వారంలోకి అడుగు పెట్టింది. ఈపాటికే నామినేషన్స్ అయిపోగా ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఈ మేరకు హౌస్‌మేట్స్‌కు రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మనసుకు ఎంతో దగ్గరైన వాళ్లకు ఇన్నిరోజులు దూరంగా ఉండటం సులభమైన విషయం కాదు. అందుకే, ఈవారం ఇంటిసభ్యులందరికీ వారి బ్యాటరీలను రీచార్జ్ చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో ఈ ఆటలో ముందుకు కొనసాగే అవకాశాన్ని కల్పిస్తూ 'బ్యాటరీ రీచార్జ్' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అందులో భాగంగా శ్రీహాన్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. నచ్చిన వ్యక్తుల నుంచి వీడియో కాల్, ఆడియో మెసేజ్ లేదంటే ఫుడ్.. వీటిలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోమన్నాడు. కానీ శ్రీహాన్ తనకు ఏదీ వద్దని చెప్పగా మూడింటిలో ఒకటి ఎంచుకోకపోతే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, వాటిని ఇంటిసభ్యులందరూ ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. దీంతో అతడు ఆ మూడింట్లో ఒకటి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీహాన్ కంటతడి పెట్టుకోగా అటు శ్రీసత్య కూడా ఈరోజు మా అమ్మకు నిద్ర పట్టదంటూ ఏడ్చేసింది. మరి వీరి బాధకు కారణమేంటి? అసలు ఈ బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఎలా జరిగింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: తుప్పాస్ రీజన్స్ అంటూ రాజ్‌పై గీతూ ప్రతీకారం.. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలు.. -
Bigg Boss 6: నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వు సిరి.. శ్రీహాన్ ఎమోషనల్
బిగ్‌బాస్-6లో ఎంటర్టైన్మెంట్తో పాటు బోలెడం ఎమోషనల్ జర్నీ కూడా కనిపిస్తుంది. ఈవారం బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ బిగ్‌బాస్ కోరికలన్నీ తీర్చడానికి ప్రయత్నించారు.దీంతో హౌస్మేట్స్ కోరికలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు బిగ్‌బాస్ తెలిపాడు. ఇందులో భాగంగా హౌస్మేట్స్ తమ కోరికలను బయటపెట్టారు. సిరి..షూట్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారైనా మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కో అని చెబుతూ శ్రీహాన్ ఎమోషనల్ అవుతాడు. ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వమని బిగ్‌బాస్ వేదికగా అడుగుతాడు. ఇక సుదీప తన భర్తను మిస్ అవుతున్నానని, అతని ఫోటోతో పాటు టీషర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంది. ఇక తన తండ్రి గురించి చెబుతూ అర్జున్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. డాడీలా నిన్ను చూసుకోలేను కానీ డాడీ లేని లోటు చూసుకుంటానంటూ ఇనయా బాగా ఎమోషనల్ అవుతుంది. మొత్తంగా ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగనుందని అర్థమవుతుంది. మరి హౌస్మేట్స్ అందరి కోరికలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. చదవండి: Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్ -
Bigg Boss 6: సత్యతో శ్రీహాన్ రొమాంటిక్ డ్యాన్స్... ఫీలైన అర్జున్
బిగ్‌బాస్‌లో నామినేషన్స్ హీట్‌ను కూల్ చేసేందుకు ఎంటర్టైన్మెంట్ను ఓ రేంజ్లో ప్లాన్ చేశారు. బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా హౌస్మేట్స్ తమ టాలెంట్‌తో బిగ్‌బాస్‌ను మెప్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదటగా సూర్య మిమిక్రీ చేసి అదరగొట్టాడు. ఒక ఆ తర్వాత సత్య, శ్రీహాన్‌లు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. ఇద్దరూ డ్యూయెట్ చేస్తుంటే అర్జున్ ముఖం మాత్రం మాడిపోయింది. వాళ్లను చూసి బాగానే హర్ట్ అయినట్లున్నాడు. అసలే నామినేషన్స్‌లో సత్యతో వాదించడం రాక సెల్ఫ్ నామినేట్ అయిన అర్జున్ ఈరోజు ఎపిసోడ్లో అయినా కాసింత ఎంటర్టైన్మెంట్ చేసి మెప్పిస్తాడేమో చూడాలి. ఇక గీతూకు బిగ్‌బాస్ చికెన్ తినే అవకాశం ఇచ్చాడు. ఇందుకు బదులుగా ఆమె హౌస్‌లో మాంచి గాసిప్ చెప్పాల్సి ఉంటుంది. అయితే మొదటి రెండుసార్లు గాసిప్ చెప్పడంలో గీతూ ఫెయిల్ కావడంతో చికెన్ వాసన చూసే అవకాశం మాత్రమే ఇస్తున్నట్లు ప్రోమోలో కనిపిస్తుంది. మరి బిగ్‌బాస్ బర్త్‌డే సందర్భంగా ఎవరెవరు ఎలా ఎంటర్టైన్ చేయనున్నారో చూడాల్సి ఉంది. -
హీరోగా బిగ్‌బాస్ శ్రీహాన్.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
బిగ్‌బాస్ ఫేం శ్రీహాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ఆవారా జిందగి. దేప శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫన్ ఓరియెంటెడ్ మూవీగా యూత్ ఫుల్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను వదిలారు. సినిమా కథను రిప్రెజెంట్ చేసేలా నలుగురు కుర్రాళ్లతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100% ఫన్ అన్నది ట్యాగ్‌లైన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. -
Bigg Boss 6: ఈసారి కాస్త డిఫరెంట్‌గా.. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే
ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో రోహిత్ అండ్ మెరీనాలకు షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. గతంలో పోలిస్తే ఈసారి నామినేషన్స్ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగింది. వారిలోనే ఎవరో ఒకరు నామినేట్ అయి, మరొకరు సేవ్ అవ్వాల్సిందిగా ఆదేశించాడు. మరి ఈవారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారన్నది బిగ్‌బాస్-6 30వ ఎపిసోడ్ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ సీజన్-6లో ఐదోవారం నామినేషన్స్ ప్రక్రియ ఈసారి డిఫరెంట్‌గా సాగింది. ఇప్పటిదాకా జంటగా ఆడిన రోహిత్ అండ్ మెరీనాలను ఎవరి ఆట వాళ్లు ఆడాలంటూ బిగ్‌బాస్ ఆదేశించారు. ఇక ఈసారి ఇద్దరు క్లోజ్‌ఫ్రెండ్స్ మధ్య నామినేషన్స్ చిచ్చు రగిల్చాడు బిగ్‌బాస్. దీంతో ఎవరు అర్హులో చర్చించుకొని, ఒకరిని నామినేట్ చేయాలని చెప్పారు. ఇక ఈ నామినేషన్స్ మొదటగా మెరీనా అండ్ రోహిత్‌లతో ప్రారంభమైంది. ఇక రోహిత్ కోసం మెరీనా త్యాగం చేసింది. దీంతో ఆమె నామినేషన్స్‌లోకి వచ్చేసింది. ఇనయా, శ్రీహాన్‌లను తర్వాత జంటగా పిలిచారు. అయితే ఆమెతో నేను రాను బిగ్‌బాస్ అంటూ శ్రీహాన్ సెటైర్లు వేశాడు. తర్వాత రేసు నుంచి తప్పుకోవడానికి కూడా శ్రీహాన్ నిరాకరించాడు. నీకు కెప్టెన్ అయ్యే అర్హత లేదంటూ మాట్లాడగా.. నీకంటే నేను చాలా బెటర్, టైటిల్ కప్పు కొట్టే వెళ్తానంటూ ఇనయా శపథం చేసింది. ఇంక శ్రీహాన్‌ను అడగడం వేస్ట్ అనుకుందేమో కానీ నామినేషన్స్‌లో తనే ఉంటానంటూ డిసైడ్ అయ్యింది. ఇక అర్జున్- సత్యలలో సత్య తన వాయిస్‌ను స్ట్రాంగ్‌గా వినిపించేసరికి అర్జున్ ఏం చేయలేక నామినేషన్స్‌లో ఉన్నాడు. రేవంత్, ఆదిరెడ్డిలలో ఈవారం రేవంత్ సేవ్ కాగా, ఆదిరెడ్డి నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఫైమా, సూర్యలలో ఈవారం సూర్య సేవ్ అయ్యాడు. మొత్తంగా ఈవారం ఇనయా, చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా,బాలాదిత్య, వసంతిలు నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. -
Bigg Boss 6: అర్జున్‌కు షాకిచ్చిన సత్య.. రోహిత్ కోసం మెరీనా త్యాగం
బిగ్‌బాస్ సీజన్-6 ఇప్పుడు ఐదోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవారం నామినేషన్స్‌లో బిగ్‌బాస్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యే భలే ఫిట్టింగు పెట్టాడు. ఇద్దరి చేతులకి సంకెళ్లు వేసి ఇద్దరిలో ఎవరు నామినేట్ కావాలో వాళ్లనే డిసైడ్ చేసుకోమని చెప్పడంతో అప్పటిదాకా ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్ల మధ్య కూడా వైరం మొదలైంది. ఇక ఈ నామినేషన్స్‌లో బిగ్‌బాస్ మరో ట్విస్ట్ కూడా పెట్టాడు. జంటగా హౌస్‌లోకి వచ్చిన మెరీనా అండ్ రోహిత్‌లకు షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ ఈసారి నుంచి ఎవరి ఆట వాళ్లు ఆడాలని పేర్కొన్నాడు. దీంతో మెరీనా రోహిత్ కోసం నామినేషన్‌ను త్యాగం చేసింది. నేను వెళ్లిపోయినా సరే, నువ్వు ఉండాలి అంటూ భర్తకు సపోర్ట్ చేసింది. ఇక సుదీప, వాసంతిలలో ఈవారం సుదీప్ సేవ్ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు సత్య కోసం అర్జున్ నామినేట్ అయినట్లు ప్రోమోను బట్టి అర్థమవుతుంది. లాస్ట్ వీక్ నీకు హెల్ప్ చేశాను.. నువ్వు నామినేషన్స్‌లో ఉన్నా సేవ్ అవుతావ్ అని అర్జున్ బ్రతిమిలాడినా సత్య మాత్రం అందుకు ససేమీరా అనేసింది. నామీద పెట్టుకున్న నమ్మకం ఏదో నీమీద పెట్టుకో అంటూ సైలెంట్‌గానే షాకిచ్చింది. ఇక శ్రీహాన్, ఇనయాల మధ్య మళ్లీ నామినేషన్స్ చిచ్చు రేపగా, రేసు నుంచి తప్పుకోవడానికి శ్రీహాన్ నిరాకరించాడు. దీంతో సరే నేనే నామినేషన్స్‌లో ఉంటా. టైటిల్ కప్పు కొట్టే వెళ్తానంటూ ఇనయా శపథం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘బిగ్‌బాస్’ ఫేం శ్రీహాన్
బిగ్‌బాస్ హౌస్‌లో తనదైన ఆటతీరులో అందరిని ఆకట్టుకుంటున్నాడు శ్రీహాన్. ఇనయాతో గొడవ తర్వాత అతనికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభిస్తోంది. అతను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాకముందే అతని నటించిన కొత్త విడుదలయ్యేలా ఉంది. శ్రీహాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అవారా జిందగి’. జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుండటం ఆసక్తికర అంశం. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ ఆవారా జిందగీ రూపొందుతోంది. ఈ చిత్రానికి నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రతీక్ నాగ్సంగీతం అందించారు. కామెడీ యాంగిల్లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. -
Bigg Boss 6: నామినేషన్స్.. ఇనయా-శ్రీహాన్‌ల మధ్య మళ్లీ పిట్ట వివాదం..
బిగ్‌బాస్ నాలుగోవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఇద్దరు సభ్యుల తలపై ఒక్కో టమాటాను పూర్తిగా స్మాష్ చేసి తాము ఎందుకు నామినేట్ చేస్తున్నారో సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో శ్రీహాన్ ఇనయాల మధ్య పిట్ట టాపిక్ వస్తుంది. వాడు అంటే తీసుకోలేని వాడు పిట్ట ఎలా చెప్తావ్ అని వాదించావ్, నిన్ను పేరు పెట్టి పిట్ట అని అనలేదు కదా అని శ్రీహాన్ చెప్పగా, అక్కడ ఉన్నది నేను కాబట్టి నన్నే పిట్ట అన్నావ్ అంటూ ఇనయా బదులిస్తుంది. ఆ తర్వాత శ్రీహాన్‌ను నామినేట్ చేయడానికి ఇనయా వెళ్లగా, ఆవలింతలు తీస్తూ ఒక్క నిమిషం ఆగు అంటూ శ్రీహాన్ హేళన చేస్తాడు. ఒక కొన్ని ప్రశ్నలు అడుగుతా ఆన్సర్ చెయ్ అని అడగ్గా.. నచ్చితే చెప్తా, లేదంటే లేదు అంటూ శ్రీహాన్ అంటాడు. అయినే సరే ఇనయా తాను అడగాల్సిన ప్రశ్నలు అడిగేస్తుంది.. నా కన్నా నీ ఏజ్ తక్కువ అని ఎలా అంటావ్? నీ కన్నా బాడీలో పెద్దగా ఉన్నంతమాత్రానా పెద్దదాన్ని అయిపోతానా? అసలు నా ఏజ్ గురించి నీకు తెలుసా? అంటూ ఫైర్ అవుతుంది. అసలు ఇవన్నీ తాను అనలేదని, కేవలం తన ఏజ్ గురించి మాత్రమే చెప్పానంటూ శ్రీహాన్ బదులిస్తాడు. చూస్తుంటే వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తుంది. ఇక సుదీప రేవంత్‌ను నామినేట్ చేయగా, ఇంటి, ఇనయాలను గీతూ నామినేట్ చేస్తుంది. కోపంలో కొన్నికొన్ని కోల్పోతావ్ అంటూ ఆరోహి ఇనయాను నామినేట్ చేస్తుంది. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉంటారో చూద్దాం. -
కెప్టెన్ ఎవరో తెలిసిపోయిందిగా.. రాజ్ క్రష్ ఆమేనా?
సూర్య-ఆరోహిల మధ్య గొడవ అలానే కంటిన్యూ అవుతుంది. రాజ్ తనతో ఇంకా మాట్లాడటం లేదని తలుచుకొని ఆరోహి ఏడుస్తుండగా, శ్రీహాన్ ఓదారుస్తాడు. ఆ తర్వాత రాజ్ లగేజ్ రూంకి వెళ్లడంతో తనను ఫాలో అవుతూ ఆరోహి కూడా వెళ్తుంది. అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మరి వీళ్లిద్దరూ ఇప్పటికైనా మాట్లాడతారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక మరోవైపు నిన్నటి ఎపిసోడ్లో రాజ్‌కు ఈ హౌస్‌లో ఎవరో క్రష్ ఉందని గమనించిన హౌస్మేట్స్ ఆమె ఎవరన్నది ఎలా అయినా రాబట్టాలని తెగ ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా గీతూ.. నీ క్రష్ నేను కదా, నాకు నువ్వు క్రష్ అంటూ సరదాగా రాజ్‌తో మాట్లాడుతుంది. దీంతో ఫైమా ఎంట్రీ ఇచ్చి మరి నేనేంటి అంటూ ఫన్నీగా అడుగుతుంది. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో చివరగా ఎత్తర జెండా అనే టాస్క్‌ని నిర్వహిస్తాడు బిగ్‌బాస్. ఇందులో కెప్టెన్సీ పోటీదారులు ఇసుకను ఎత్తి తమకిచ్చిన బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. మరి ఈ టాస్కులో విజేతగా నిలిచి కెప్టెన్‌గా ఎవరు నిలిచారన్నది ఆసక్తిగా మారింది. కానీ నెట్టింట అందుతున్న సమాచారం ప్రకారం ఆదిరెడ్డి కెప్టెన్ అయినట్లు సమాచారం. -
ఇనయా-శ్రీహాన్‌ల మధ్య బిగ్ ఫైట్.. మధ్యలో దూరిన గీతూ
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ముగుస్తుంది. పోలీస్ టీం ఇందులో విజేతగా నిలుస్తుంది. శ్రీహాన్-ఇనయాల మధ్య మాటల యుద్దం జరగడానికి గల కారణాలేంటి? కెప్టెన్సీ పోటీదారులుగా చివరగా మిగిలిన వాళ్లెవరు అన్నది బిగ్‌బాస్ సీజన్-6 19వ ఎపిసోడ్లో చూద్దాం. కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్ నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ ముగుస్తుంది. ఈ టాస్కులో ఎక్కువ బొమ్మలు ఉన్న పోలీస్ టీం విజేతలుగా నిలుస్తారు. కెప్టెన్సీ కంటెండర్స్‌గా సత్య, గీతూ, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను టీం సభ్యులు ఎన్నుకుంటారు. ఇక ఆ తర్వాత జరిగిన టాస్కులో గీతూ తొలుత ఎలిమినేట్ అవుతుంది. ఆ తర్వాత బ్రిక్స్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఫైమా చేతులు ఉపయోగించిందన్న కారణంతో రేవంత్ ఆమెను డిస్ క్వాలిఫై చేస్తాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ జరిగినా రేవంత్ సంచలాక్గా ఉన్నందున అతని నిర్ణయం ఫైనల్ అవుతుంది. అయితే ఫైమా డిస్ క్వాలిఫై అనడంతో ఇనయా ఎంట్రీ ఇస్తుంది. శ్రీహాన్ చేతులు తగలడం నేను చూశానంటూ రేవంత్‌కి చెబుతుంది. ఇది విన్న శ్రీహాన్... ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా.. సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్ తీసుకో అని అంటాడు. ఇక అక్కడ మొదలవుతుంది రచ్చ. నన్ను పిట్ట అని ఎలా అంటావంటూ ఇనయా నోరేసుకొని పడిపోతుంది. నిన్ను వాడు అంటే తీసుకోలేని వాడివి నన్ను పిట్ట అని ఎందుకు అన్నావ్ అని రెచ్చిపోయింది. దీంతో గీతూ ఇచ్చి అతను నిన్ను అనలేదు, నన్నే పిట్ట అన్నాడు అని సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఇనయా ఆగకపోవడంతో ఇక ఇలా కాదునుకుందో ఏమో కానీ గీతూ ఇనయాని హేళన చేస్తున్నట్లు ప్రవర్తించింది. వచ్చిందీ పాలపిట్టా అంటూ ఇష్టం వచ్చిన పాటలు పాడుతూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇనయా.. మళ్లీ నోరేసుకొని పడిపోతుండటంతో శ్రీహాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మగాడివైతే నేను చెప్పింది విని అంటూ ఇనయా మాటలు హద్దులు దాటుతుంది. మరి ఈ టాస్కులో కెప్టెన్‌గా ఆదిరెడ్డి, సత్య, శ్రీహాన్‌లలో ఎవరు నిలుస్తారన్నది ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. -
లాజిక్ లేకుండా గేమ్ ఆడిన గీతూ.. షాక్ అయిన హౌస్మేట్స్
కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట అనే టాస్కులో ఇనాయాకు శ్రీహాన్, రేవంత్‌లతో గొడవ అవుతుంది. మరోవైపు రూల్స్ బ్రేక్ చేసి గీతూ తనకు నచ్చిన విధంగా గేమ్ ఆడి హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపిస్తుంది. చివరగా ఆమె స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అయింది అన్నది బిగ్‌బాస్ సీజన్-6 17వ ఎపిసోడ్ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అడవిలో ఆట అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో ఇనయ, చంటి, ఆదిత్య, రోహిత్,ఆదిరెడ్డి, మెరీనా, శ్రీ సత్య, ఫైమా, , రాజ్‌లు పోలీసులుగా వ్యవహరించగా,వసంతి, నేహ, కీర్తి, శ్రీహాన్, సూర్య,రేవంత్, ఆరోహి, సుదీప, , అర్జున్‌లు దొంగలుగా వ్యవహరించారు. గీతూ అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా వ్యవహరించింది. ఇందులో బజర్ సౌండ్‌ని బట్టి దొంగలు అడవిలో దొంగతనం చేయడం, రైడ్ చేసి వాళ్లని పట్టుకోవడం పోలీసుల వంతు. ఇక ఈ గేమ్‌లో ఇనయాకు శ్రీహాన్, రేవంత్‌లతో గొడవ అవుతుంది. ఇనయా నోరుజారి వాళ్లను వాడు, వీడు అని అనడంతో మాటలు జాగ్రత్త.. ఇంట్లొ మ్యానర్స్ నేర్పలేదా అంటూ రేవంత్ ఫైర్ అవుతాడు. తర్వాత ఇనయా సారీ చెప్పడంతో శ్రీహాన్ కూల్ అవుతాడు. ఇదిలా ఉండగా దొంగల నుంచి బొమ్మలు కొనుక్కోవాలని రూల్ బుక్‌లో ఉన్నా.. నా గేమ్ నా ఇష్టం అన్నట్లు గీతూ వ్యవహరించింది. ఆల్రెడీ దొంగలు తీసుకున్న బొమ్మలను వారికి తెలియకుండా దొంగతనం చూసి రూల్స్ బ్రేక్ చేస్తుంది గీతూ. ఎవరెన్ని చెప్పినా అది తన గేమ్ స్ట్రాటజీ అంటూ గీతూ నచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక దొంగలతో డీల్ కుదుర్చుకునే క్రమంలో ఒక్కో బొమ్మకు 200అని పైసా కూడా ఎక్కువ ఇవ్వనంటూ గీతూ ఆర్డర్ వేస్తుంది. మొదటగా శ్రీహాన్ ఆమెకు బొమ్మలు అమ్మాడు. ఇక టైం ఎక్కువగా లేకపోవడంతో టాస్క్‌ను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు బిగ్‌బాస్ ఆదేశించాడు. మరి ఈ టాస్కులో ఎవరు గెలిచారన్నది తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ వరకు వేచిచూడాల్సిందే. -
బిగ్‌బాస్ రెండోవారం ఇంటి కెప్టెన్ అతడే.. కొట్టేసుకుందాం అన్న గీతూ
బిగ్‌బాస్ సీజన్-6లో రెండోవారం ఇంటి కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఇక మూవీ ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు, కృతిశెట్టిలు బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించి వారికి టాస్కులు ఇచ్చారు. ఇందులో ఎవరు విజేతగా నిలిచారన్నది బిగ్‌బాస్-6 పదమూడో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ రెండోవారం కెప్టెన్సీ టాస్కులో ఎలాంటి సస్పెన్స్ లేకుండా రాజ్ కెప్టెన్‌గా నిలిచాడు. ఈవారం ఎలిమినేషన్లో ఉండటం రాజ్‌కు కలిసొచ్చింది. దీంతో ఈ కెప్టెన్సీ టాస్క్ అతనికి ఏమైనా హెల్ప్ అవుతుందని భావించిన ఇంటిసభ్యులు అతనికే ఏకాభిప్రాయంతో ఓట్లేశారు. అయితే ఇంత కష్టపడినా తనకు ఒక్కరు కూడా ఓటు వేయలేదంటూ ఇనయా తెగ ఫీల్ అయిపోయింది. చివరికి అత్యదిక ఓట్లతో రాజ్ కెప్టెన్సీ కుర్చీపై కూర్చొని ఇంటి సభ్యల కోసం ఏదైనా పనిష్మెంట్ వస్తే అది తానే తీసుకుంటానంటూ వాగ్ధానం చేస్తాడు. ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ప్రమోషన్స్ కోసం సుధీర్‌బాబు, కృతిశెట్టి హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులతో సరదాగా ముచ్చటించారు. పాపులర్ డైలాగులను తమ స్టైల్లో చెప్పాలంటూ టాస్కులు ఆడించారు. ఇందులో రేవంత్ మొదటగా పోకిరి సినిమాలోని ‘ఎవడు కొడ్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు’ అనే డైలాగ్ చెప్పాడు. ఆ తర్వాత గీతూ వచ్చి తమిళ్ ఏంటి? తెలుగేంటి? డార్లింగ్.. గొడవైంది, కొట్టేసుకుందాం రా అంటూ తన స్టైల్లో చెప్పి సూపర్ అనిపించింది. అంతేకాకుండా ఇదే డైలాగ్‌ను చిన్నపిల్లల వాయిస్‌లో చెప్పి ఆశ్చరానికి గురిచేసింది. ఇక ఈ టాస్కులో సత్య, రాజ్, శ్రీహాన్‌లు చేసిన ఓ స్కిట్ ఆకట్టుకుంది. ఇక చివర్లో సత్యను బెస్ట్ యాక్ట్రెస్‌గా, శ్రీహాన్‌కు బెస్ట్ యాక్టర్‌గా ప్రకటించి అవార్డులు ఇచ్చారు. -
Bigg Boss 6: రాత్రంతా గీతూ గలాట.. శ్రీహాన్‌కు బిగ్ షాక్!
రెండోవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్‌కి సిసింద్రి టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్‌లో ఫైమా, రేవంత్, చలాకి చంటి పాల్గొనగా.. అందరికంటే ముందు టాస్క్ కంప్లీట్ చేసి తొలి కెప్టెన్సీ పోటిదారుడిగా నిలిచాడు చంటి. ఇక రాత్రి కావడంతో కెప్టెన్సీ టాస్క్‌ని ఆపేశాడు బిగ్‌బాస్. టాస్క్ సమయం పూర్తయినందున తదుపరి ఆదేశం వరకు తమ బేబీ బొమ్మలను ప్రతి కంటెస్టెంట్ జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆదేశం ఇచ్చాడు. అయితే బొమ్మలను దాచుకోవడానికి వీలు లేదంటూ చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. తమకి ఇచ్చిన బొమ్మలు లాస్ట్ అండ్ ఫౌండ్కి వెళ్లకుండా చూసుకోవడంతో పాటు బిగ్‌బాస్ ఇచ్చిన చాలెంజ్‌లో గెలవడమే కంటెస్టెంట్స్ ప్రస్తుత టాస్క్. ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను తాజాగా వదిలాడు బిగ్‌బాస్. ఈ తాజా ప్రోమోలో గలాట గీతూ తన చేతివాటం చూపించింది. రాత్రంత నిద్ర పోకుండా బొమ్మలు దొంగలించేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా కెప్టెన్ ఆదిత్య బొమ్మను దొంగలించి తీసుకెళుతుండగా.. ఇంటి సభ్యులు ఆమెను అడ్డుకుని ఆదిత్యను బతికించారు. మరోవైపు శ్రీహాన్.. అర్జున్ నిద్రపోతుండటం చూసి మెల్లిగా అతడి బొమ్మను దొంగలించి లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేశాడు. ఇటూ సమయం కోసం కాచుకు కూర్చున్న గీతూ తన ప్లాన్‌ను ఇంప్టీమెంట్ చేసి సక్సెస్ అయ్యింది. తను టార్గెట్ చేసిన ఇద్దరిలో ఒకరైన శ్రీహాన్ బొమ్మను దొంగలించి లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పెట్టేసింది. గీతూ గలాట చూసి హౌజ్మెట్స్లో సగం మంది రాత్రి మూడు గంటల వరకు పడుకోలేదు. చూస్తుంటే గీతూ వల్ల శ్రీహాన్ ఈ కెప్టెన్సీ పోటీ నుంచి వైదొలిగినట్టే కనిపిస్తోంది. మరి శ్రీహాన్ తన బొమ్మను కాపాడుకున్నాడా? లేక గీతూ చేతిలో బుక్కయ్యాడా? తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఇక గీతూ ముందురోజు ఎపిసోడ్లో కూడా రేవంత్, అభినయ శ్రీ, శ్రీ సత్య బొమ్మలను ఆమె లాస్ట్ అండ్ ఫౌండ్ వేసి వారిని కెప్టెన్సీ పోటీకి అనర్హులుగా చేసింది. -
ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్, ఒక్కరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవుతారట!
ఏదైనా కొత్తదనం చూపించాలనుకున్నాడో మరేంటో కానీ బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్‌ను ఏకంగా సోమవారం నుంచి బుధవారానికి మార్చేశాడు. మరి ఈ మూడు రోజుల్లో కంటెస్టెంట్లకు ఏమాత్రం ఓట్లు పడతాయో తెలీదు కానీ కచ్చితంగా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఇంతకీ లేడీ కంటెస్టెంటే ఎందుకు ఎలిమినేట్ అవుతుంది? అసలు ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు? అనేది బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోని నాలుగో ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి.. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు ఇచ్చిన క్లాస్.. మాస్.. ట్రాష్ నిన్నటితోనే ముగిసింది. ట్రాష్‌లో ఉన్న ఆదిత్య, ఇనయ, అభినయ శ్రీ నేరుగా నామినేట్ అయ్యారు. క్లాస్ టీమ్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా ఈవారం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. మాస్ టీమ్‌లో ఉన్న మిగతా సభ్యులు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. జంటగా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్ జంటగానే నామినేషన్లోకి వెళ్తారని, ఒకవేళ ఎలిమినేట్ అయినా ఇద్దరూ కలిసే బయటకు వెళ్తారని స్పష్టం చేశాడు. గతంలో వరుణ్-వితిక దంపతులు హౌస్‌లో అడుగుపెట్టినా ఎవరి ఆట వారే ఆడుకున్నారు, ఎవరి నామినేషన్ వారే చేసుకున్నారు. బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు విడివిడిగానే వెళ్లిపోయారు. మరి ఈసారి ఎంట్రీ ఇచ్చిన కపుల్‌కు బిగ్‌బాస్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడంటే ఈ సీజన్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండేట్లు కనిపిస్తోంది. ఇకపోతే బిగ్‌బాస్ షోలో మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. వేస్ట్ కంటెస్టెంట్లు అనుకునేవాళ్ల పేర్లను పేపర్‌పై స్టాంప్ చేసి, దాన్ని ఫ్లష్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా రేవంత్ మాట్లాడుతూ.. పని చేయడానికి ముందుకు రావట్లేదంటూ ఫైమా, ఆరోహి రావులను నామినేట్ చేశాడు. తాను నిద్రపోయినప్పుడు కిచకిచమంటూ సూర్యతో ముచ్చట్లు పెడుతూ తన నిద్ర డిస్టర్బ్ చేసిందని ఆరోహిపై ఆరోపణలు గుప్పించాడు. దీనికి ఆ యాంకర్ స్పందిస్తూ.. ఆరోజు మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు మీదగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పానని, అనవసరంగా నన్ను బద్నాం చేయకండి అని గట్టిగానే కౌంటరిచ్చింది. కీర్తి భట్ మాట్లాడుతూ.. తనకు, శ్రీహాన్‌కు మధ్య ఉన్న బంధంపై రేవంత్ జోక్ చేశాడని, దీంతో శ్రీహాన్‌ను చోటు భయ్యా అని పిలవాల్సి వచ్చిందని చెప్పింది. తనలా చేయడం వల్ల శ్రీహాన్ సరిగా మాట్లాడటమే మానేశాడని వాపోయింది. మరోవైపు పనుల్లో ఇన్వాల్వ్మెంట్ లేదని చంటిని నామినేట్ చేసింది. తర్వాత ఆరోహి వంతు రాగా అత్యుత్సాహంతో మీకు తెలీకుండానే అందరినీ హర్ట్ చేస్తున్నావంటూ రేవంత్‌ను, నేను ప్రేమగా శ్రీసత్య అని చాలాసార్లు పిలిచాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదంటూ శ్రీసత్యను నామినేట్ చేసింది. శ్రీసత్య వంతు వచ్చేసరికి.. నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనుషులతో మాట్లాడటం మానేశా. అందులోనూ కొత్తవాళ్లతో మాట్లాడటానికి టైం పడుతుంది. ముఖ్యంగా తనకు యాటిట్యూడ్ లేదని స్పష్టం చేస్తూ వాసంతి, రాజశేఖర్‌ను నామినేట్ చేసింది. అనంతరం సుదీప.. రేవంత్, చంటిని; ఫైమా.. రేవంత్, అర్జున్‌లను; అర్జున్.. ఫైమా, ఆరోహిలను; రాజశేఖర్.. వాసంతి, శ్రీ సత్యలను; షాని.. శ్రీసత్య, చంటిని; శ్రీహాన్.. రేవంత్, కీర్తిని; సూర్య.. రేవంత్, చంటిని; చంటి.. రేవంత్, సుదీపను; వాసంతి.. రేవంత్‌ను, యాటిట్యూడ్ చూపిస్తుందని శ్రీ సత్యను నామినేట్ చేసింది. మెరీనా- రోహిత్ దంపతులు.. ఫైమా, చంటిని నామినేట్ చేశారు. అనంతరం మెరీనా మాట్లాడుతూ.. నేను కిచెన్‌లో వంట చేస్తున్నప్పుడు ఆరోహి.. నేను మెరీనా కన్నా తక్కువ సైజ్ అని ఎవరితోనో చెప్పింది. నాకు బాడీ షేమింగ్ నచ్చదంటూ ఎమోషనలైంది. అయితే అసలు తను ఆ మాట అనలేదని ఆరోహి బలంగా చెప్పినప్పటికీ మెరీనా వినిపించుకోలేదు. నామినేషన్ ప్రక్రియ ముగిసేసరికి అందరికన్నా అత్యధికంగా రేవంత్‌కు 8 ఓట్లు పడటం గమనార్హం. నామినేషన్స్ తంతు ముగిసిందనుకునే సమయానికి చివర్లో బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ట్రాష్లోని సభ్యులొకరు మాస్ టీమ్ మెంబర్‌తో స్వాప్ అవ్వొచ్చని చెప్పాడు. దీంతో బాలాదిత్యను సేఫ్ చేసి ఆ స్థానంలోకి ఆరోహిని పంపించారు. ఫైనల్‌గా మొదటి వారం రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనయ, ఆరోహి, అభినయశ్రీ ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. చదవండి: బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు ఒప్పుకోలేదు -
అందుకు బిగ్‌బాస్‌కి వచ్చా: సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్
Shrihan In Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్-5లో సిరి బాయ్‌ఫ్రెండ్‌గా పాపులర్ అయిన శ్రీహాన్ గతంలో షార్ట్‌ఫిల్మ్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే సిరితో కలిసి పలు షార్ట్‌ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్ సీజన్-5లో సిరి-షణ్ముఖ్ లవ్‌ట్రాక్ వారిద్దరికి నెగిటివిటీని తెచ్చిపెడితే, శ్రీహాన్‌కు మాత్రం కలిసొచ్చింది. బిగ్‌బాస్ స్టేజ్‌పై శ్రీహాన్ మాట్లాడిన మాటలు, పాట పాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. సిరిపై సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ చేస్తున్న శ్రీహాన్ మాత్రం ఆమెకు అండగా నిలబడ్డాడు. ఇలా సిరి బాయ్‌ఫ్రెండ్‌గా వార్తల్లో నిలిచిన శ్రీహాన్ బిగ్‌బాస్ -6లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారే అవకాశం ఉంది. మరి శ్రీహాన్ పాజిటివిటీతోనే షో నుంచి బయటకు వస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
ఆదిరెడ్డి, అమర్దీప్.. బిగ్‌బాస్ 6లో ఇంకా ఎవరెవరంటే?
బిగ్‌బాస్ షో కోసం తెగ వెయిట్ చేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్‌బాస్ ఐదో సీజన్ తర్వాత నాన్‌స్టాప్ పేరుతో ఓటీటీలో బిగ్‌బాస్ ప్రారంభమైనా అది అందరికీ చేరువవలేదు. కేవలం హాట్‌స్టార్‌ను వీక్షించేవారు మాత్రమే దాన్ని చూసేందుకు వీలుండటంతో చాలావరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రియాలిటీ షోను మిస్సయ్యారు. అయితే వారి నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే షో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్ ఘనంగా లాంచ్ కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. కానీ కొందరు మాత్రం ఇంకా రావాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్, ఆర్జే సూర్య, యాంకర్ ఉదయభాను, అమర్దీప్, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్, సింగర్ రేవంత్, యాంకర్ అరోహి.. షోలో అడుగు పెట్టబోతున్నారట. గత సీజన్లో సిరి రాగా, ఈసారి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ వస్తుండటంతో అతడి మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక బుల్లితెర నటుడు అమర్దీప్ ఇటీవలే తన ప్రేయసి, సహనటి తేజస్వితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. మరి అతడు పెళ్లిని వాయిదా వేసుకుని వస్తాడా? లేదంటే త్వరగా పెళ్లి చేసేసుకుని బిగ్‌బాస్ షోకు రెడీ అవుతాడా? అన్నది చూడాలి! ప్రతి సీజన్లో ఓ కమెడియన్ ఉన్నట్లే ఈసారి కూడా ఓ హాస్యనటుడిని తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గీతూ రాయల్.. సోషల్ మీడియాలో కొటేషన్లు చెప్తూ బాగా ఫేమస్ అయింది. అలాగే బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చింది. ఆది రెడ్డి కూడా ఈ షోపై రివ్యూలు ఇచ్చిన వ్యక్తే. బిగ్‌బాస్ ఓటీటీలో షోపై రివ్యూలు ఇచ్చిన యాంకర్ శివను లోనికి పంపించారు. ఈలెక్కన ఈసారి వీరిద్దరినీ కూడా హౌస్‌లోకి పంపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అందరినీ మించి ఉదయభాను షోలో అడుగుపెడ్తే ఎలా ఉంటుందో చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి బిగ్‌బాస్‌కు వస్తుండటం కూడా చాలామంది ఆశ్చర్యపరుస్తోంది. మరి వీరిలో ఎవరు చివరిదాకా ఉంటారు? ఎవరు మొదట్లోనే హ్యాండ్ ఇస్తారు? ఇంకా ఎవరెవరు హౌస్‌లోకి రాబోతున్నారు? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే! చదవండి: ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించిన ఈ నటి గురించి తెలుసా? ఆర్ఆర్ఆర్లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే.. -
కొత్త కారు కొన్న సిరి.. డ్రైవింగ్ నేర్చుకో అని సెటైర్లు
సిరి హన్మంత్.. బిగ్‌బాస్ రియాల్టీ షో ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. బిగ్‌బాస్-5లో ఆమె చేసిన రచ్చ అంత ఇంత కాదు. హౌస్‌లో షణ్ముఖ్‌తో క్లోజ్‌గా ఉండటం..బయటకు వచ్చాక ఆమె కారణంగానే షణ్ముఖ్, దీప్తి సునైనా విడిపోయారనే వార్తలు వినిపించడంతో సిరి పేరు నెట్టింట మరింత వైరల్ అయింది. ఒకానొక దశలో సిరి, ఆమె ప్రియుడు శ్రీహాన్ కూడా విడిపోయారనే టాక్ వచ్చింది. కానీ మళ్లీ కలిశారు. ఇప్పుడు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. తాజాగా వీరిద్దరు కలిసి కొత్త కారు కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సిరి ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో శ్రీహాన్ కూడా ఉన్నాడు. అంతేకాదు సిరి కొత్త కారు కొనడంపై శ్రీహాన్ కౌంటర్ కూడా వేశాడు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూనే ‘ముందు డ్రైవింగ్ నేర్చుకో సిరి..’అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ వేశాడు. మొత్తానికి విడిపోతారనుకున్న సిరి, శ్రీహాన్ ఇలా జంటగా కారు కొనడం పట్ల ఇరువురి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ ఆరో సీజన్లోకి శ్రీహాన్ రాబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే శ్రీహాస్ వస్తే మాత్రం ఆట అదిరిపోతుంది. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) -
బిగ్‌బాస్ 6లోకి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ !..
Siri Hanmanth Boyfriend Srihan In Bigg Boss Season 6 Telugu: మొన్నటిదాకా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ) సందడి చేసింది. ఇప్పుడు బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్ 6 అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన లోగో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే కంటెస్టెంట్స్ ఎవరబ్బా అనే ముచ్చట జోరుగా నడుస్తోంది. అయితే వీరిలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు శ్రీహాన్. నిజానికి బిగ్‌బాస్ ఓటీటీ మొదటి సీజన్లోనే శ్రీహాన్ కంటెస్టెంట్‌గా రాబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే బిగ్‌బాస్ బుల్లితెర ఐదో సీజన్లో సిరి, షణ్ముఖ్ ట్రాక్ వారిపై నెగెటివిటీని తెచ్చిపెట్టింది. ఈ నెగెటివిటీ శ్రీహాన్‌కు కలిసొచ్చింది. అంతేకాకుండా బిగ్‌బాస్ స్టేజ్‌పై శ్రీహాన్ మాట్లాడిన మాటలు, పాడిన పాట అందరిని ఆకట్టుకున్నాయి. సిరి, షణ్ముఖ్‌పై వచ్చిన ట్రోలింగ్‌తో బాధపడిన శ్రీహాన్ తన మాటలు, పాట రూపంలో చూపించి బీభత్సమైన పాజిటివిటీని సంపాదించుకున్నాడు. దీంతో శ్రీహాన్‌కు బిగ్‌బాస్ ఓటీటీ అవకాశం వచ్చిన దాన్ని తిరస్కరించాడని సమాచారం. అయితే తాజాగా బిగ్‌బాస్ సీజన్ 6లో శ్రీహాన్ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో శ్రీహాన్ పాల్గొంటే కచ్చితంగా టైటిల్ రేస్‌లో ముందుంటాడని చాలా మంది భావిస్తున్నారట. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ సీజన్ 6కు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్ సమంత రానుందన్న వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. చదవండి: అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్, బిగ్‌బాస్ హోస్ట్‌గా సమంత? View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) -
సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది: శ్రీహాన్
బిగ్‌బాస్ షోతో లాభపడేవాళ్లతోపాటు నష్టపోయేవాళ్లు కూడా ఉన్నారు. ఈ షోలో అడుగుపెట్టిన కొందరికి సినిమా అవకాశాలు వస్తే మరికొందరు మాత్రం నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చారు. అలాంటివారిలో సిరి హన్మంత్ ఒకరు. సీరియల్స్, యూట్యూబ్ వెబ్‌సిరీస్‌తో పాపులర్ అయిన ఆమె హౌస్‌లో షణ్ముఖ్ జశ్వంత్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఆమెపై ఎక్కడలేని నెగెటివిటీ వచ్చింది. బయట తనకోసం ప్రియుడు శ్రీహాన్ ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్లు ప్రవర్తిస్తుందని విమర్శలు వచ్చాయి. అంతేకాదు బిగ్‌బాస్ దెబ్బతో షణ్ముఖ్- దీప్తి సునయన విడిపోయినట్లుగానే సిరి, శ్రీహాన్ కూడా విడిపోనున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బిగ్‌బాస్ తర్వాత ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవుతూ రూమర్లకు చెక్ పెట్టేశారు. తాజాగా తన ప్రేయసిపై పొగడ్తలు కురిపించాడు శ్రీహాన్. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లతో ఓ సరదా ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ రవి. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులో శ్రీహాన్ ఓ వీడియో సందేశం పంపాడు. అందులో సిరి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. 'సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకిప్పటికీ పడుతూనే ఉంది. సిరి ఏదైనా సాధించాలనుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దేన్నీ పట్టించుకోదు. తను వైజాగ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి కొన్ని సాధించాలనుకుంది. యాంకరింగ్ చేసుకుంటూ సీరియల్స్, సీరియల్స్ నుంచి సినిమాలు, సినిమాల నుంచి మొన్నటి బిగ్‌బాస్ వరకు.. మొత్తం తన కష్టమే. ఎవ్వరూ సాయం చేసింది లేదు. ఎవరి సపోర్ట్ తను తీసుకుందీ లేదు. కానీ ఎంత మాట్లాడినా సిరిని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రముఖ సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో! -
శ్రీహాన్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు, చివరికి ఇలా క్లారిటీ ఇచ్చిందా?
సిరి హన్మంత్.. బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ 5 సీజన్ తర్వాత సిరి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. విమర్శలు, ట్రోల్స్‌తో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దీనికి కారణం బిగ్‌బాస్ హౌస్‌లో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ఆమె అతి సన్నిహితంగా ఉండటమే. ఇక బయటకు వచ్చిన ఆమె తనపై వస్తున్న నెగిటివిటీని చూసి షాకయ్యింది. ఈ స్థాయిలో తనకు వ్యతిరేకత రావడం చూసి డిప్రెషన్లోకి వెళ్లింది. అలాంటి సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు. చదవండి: ఎన్టీఆర్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చాయి, ఎమోషనల్ అయ్యా: ఒలీవియా అయితే ప్రారంభంలో అతను కూడా సిరిని దూరం పెట్టాడని వార్తలు వినిపించాయి. అంతేకాదు వారిద్దరికి సంబంధించిన వ్యక్తిగత పోస్ట్‌లను కూడా శ్రీహాన్ డిలిట్ చేయడంతో షణ్మఖ్-దీప్తి సునైన బాటలోనే వీరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ అలాంటిదేం లేదని శ్రీహాన్ క్లారిటీ ఇచ్చాడు. అటు సిరి కూడా శ్రీహాన్ బర్త్‌డే విష్ తప్పితే అతడి గురించి స్పెషల్‌గా ఎలాంటి పోస్ట్ షేర్ చేయకపోవడంతో ఆ ఊహాగానాలకు బ్రేక్ పడలేదు. దీంతో వారి ఫాలోవర్స్‌లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా వాటిన్నింటికి చెక్ పెడుతూ సిరి, శ్రీహాన్‌తో దిగిన ఫొటోను పంచుకుంది. ఈ సందర్భంగా అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రతి క్షణం(మంచి-చెడు సమయాల్లో) నా పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్, నా సర్వస్వం. అతడే ఇతను. మై వన్ అండ్ ఓన్లీ శ్రీహాన్’ అంటూ సిరి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. వీరిద్దరిని ఒక్కటిగా చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ పోస్ట్‌తో వారి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని సిరి చెప్పకనే చెప్పిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా మొత్తానికి సిరి-శ్రీహాన్ కలిశారని, ఇక షణ్ముఖ్, దీప్తిలో ఎప్పుడు కలుస్తారో అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌లో షణ్ముఖ్, సిరి తీరుపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి విడిపోవడానికి సిరి కారణమంటూ ఆమెను నిందించారు. తనకు బయట ఒక ప్రియుడున్నప్పటికీ ఆ విషయం మర్చిపోయి షణ్నూకి హగ్గులు, ముద్దులిస్తూ అతిగా ప్రవర్తించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) -
బ్రేకప్‌కు ఎండ్ కార్డ్.. మళ్లీ కలిసిపోయిన సిరి-శ్రీహాన్
Siri Hanmanth And Shrihan Patchup After Bigg Boss: బిగ్‌బాస్ సీజన్-5 ఎఫెక్ట్ రెండు జంటల మధ్య చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కి బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. అటు శ్రీహాన్ కూడా సిరి ఫోటోలు డిలీట్ చేయడంతో అతను కూడా దీప్తి సునయనను ఫాలో అయినట్లు అందరూ అనుకున్నారు. దీంతో అతడు కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనంతటిని పటాపంచలు చేస్తూ సిరి-శ్రీహాన్‌లు కలిసిపోయారు. రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన వీరిద్దరు యాంకర్ రవి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. అనంతరం వాళ్ల ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. మీ ఇద్దరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. దీంతో సిరి-శ్రీహాన్‌ల బ్రేకప్‌కు ఎండ్ కార్డ్ పడినట్లయ్యింది. ఏది ఏమైనా ఎన్ని కలతలు వచ్చినా బిగ్‌బాస్ తర్వాత మీరిద్దరు కలవడం సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీప్తి సునయన- షణ్నూలు కూడా కలిసిపోతే బావుండు అని కోరుకుంటున్నారు. -
బిగ్‌బాస్ ఓటీటీలో సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్?
ఇప్పటివరకు బిగ్‌బాస్ షో చాలామందికి లైఫ్ ఇవ్వడాన్ని చూశాం.. కానీ తొలిసారిగా రెండు జంటల మధ్య చిచ్చు పెట్టడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ గత నెలలో ముగిసింది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు జెస్సీ, శ్వేత, లోబో, యానీ మాస్టర్ ఇలా ఎంతోమందికి మంచి మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కానీ బోలెడంత పాపులారిటీతో హౌస్‌లో అడుగుపెట్టిన యాంకర్ రవి ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని బయటకు వచ్చాడు. అలాగే సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ నెగెటివిటీని మూటగట్టుకోవడమే కాక ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికాడు. అటు సిరి హన్మంత్ లవ్ లైఫ్ కూడా కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తోంది. శ్రీహాన్‌తో నిశ్చితార్థం తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన సిరి, షణ్నుతో క్లోజ్‌గా ఉండటం, ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాననంటూ పదేపదే అతడికి హగ్గులివ్వడం చాలామందికి నచ్చలేదు. తప్పని తెలిసినా అతడితో క్లోజ్‌గా మూవ్ అవడాన్ని శ్రీహాన్ జీర్ణించుకోలేకపోయినట్లు తెలుస్తోంది. సిరి వైఖరితో కలత చెందిన శ్రీహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలను డిలీట్ చేశాడు. కేవలం వారిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్‌లకు సంబంధించిన ఫొటోలను మాత్రం అలాగే ఉంచాడు. దీంతో వీరిద్దరు కూడా త్వరలోనే విడిపోనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే త్వరలోనే శ్రీహాన్ బిగ్‌బాస్ షోలో కనిపించనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ ఓటీటీకి శ్రీహాన్‌ను తీసుకురావాలన్న ప్లాన్‌లో ఉన్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. ఇప్పటికే సిరి వ్యవహారంతో బాధలో ఉన్న శ్రీహాన్ ఈ రియాలిటీ షోకు రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం! కానీ ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే మాత్రం షోలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు లేకపోలేదు. -
సిరి ఫోటోలు డిలీట్ చేసిన ప్రియుడు.. బ్రేకప్‌కు సంకేతమా?
After Shanmkh And Deepthi Breakup, Shrihan Deleting Siri Pics In Instagram: బిగ్‌బాస్ సీజన్-5 రెండు జంటల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. ఇప్పుడు దీప్తి సునయన బాటలోనే సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సిరిని దూరం పెడుతూ వస్తున్న శ్రీహాన్.. త్వరలోనే ఆమెకు గుడ్‌బై చెప్పనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బిగ్‌బాస్ షో పూర్తైనా వీరిద్దరూ జంటగా కనిపించలేదు. అయితే తాజాగా సిరితో తెగదెంపులు చేసుకునేందుకు శ్రీహాన్ సిద్ధమయినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చాడు. కేవలం ఇద్దరూ కలిసి చేసిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్డేట్స్ మినహా సిరితో ఉన్న ఫోటోలన్నింటిని శ్రీహాన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్నుంచి తొలగించాడు. బిగ్‌బాస్ షోలో అనేక సార్లు షణ్నూతో కనెక్షన్ వస్తుందంటూ సిరి చెప్పిన మాటలతో శ్రీహాన్ గుండె బద్దలయ్యిందని, ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి షణ్నూతో చేసిన రొమాన్స్ భరించలేక శ్రీహాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై వారిద్దరూ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఇటీవలె సిరి బర్త్‌డేకు సైతం శ్రీహాన్ విషెస్ చెప్పడం విశేషం. -
వైరల్‌గా మారిన సిరి బాయ్‌ఫ్రెండ్ ఇన్‌స్టా పోస్ట్..
Shrihan Emotional Intsgram Post Amids Break Up Rumours With Siri: బిగ్‌బాస్ షోతో కొందరు ఓవర్ నైట్ స్టార్స్ అయితే, మరికొందరు మాత్రం ఇమేజ్ డ్యామేజ్ చేసుకొని బయటకు వస్తారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-5లో సిరి-షణ్ముఖ్‌లు కూడా ఈ విధంగానే నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఫలితంగా తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ దీప్తి సునయన షణ్ముఖ్‌తో విడిపోయింది. ఇక కలిసుండలేనంటూ తెగదెంపులు చేసుకుంది. ఇక అప్పటినుంచి శ్రీహాన్ కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్పేస్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి ఇన్‌స్టా అకౌంట్లపై ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం(జనవరి3)న సిరి బర్త్‌డే సందర్భంగా శ్రీహాన్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్. గాడ్ బ్లస్ యూ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. కాగా బిగ్‌బాస్‌లో సిరిని ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఆమె గెలుపు కోసం చివరి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన శ్రీహాన్.. బిగ్‌బాస్ తర్వాత మాత్రం సిరితో కలిసి ఎక్కడా కనిపించలేదు. దీంతో దీప్తి- షణ్ముక్‌ల మాదిరిగానే వీళ్లు కూడా విడిపోతారా అనే ఊహాగానాల నేపథ్యంలో శ్రీహాన్ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. -
సిరి లేకపోతే షణ్ముఖ్ పిచ్చోడయ్యేవాడు: శ్రీహాన్ ఫైర్
Bigg Boss 5 Telugu, Siri Hanmanth Boyfriend Shrihan On Fire: యూట్యూబ్ స్టార్ శ్రీహాన్, సిరి హన్మంత్ ప్రేమికులన్న విషయం అందరికీ తెలిసిందే! సిరి బిగ్‌బాస్ షోకు వెళ్లడానికి ముందు వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ సిరి హౌస్‌లో ఈ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుందంటూ అనేక విమర్శలు వచ్చాయి. షణ్ముఖ్ వద్దంటున్నా హగ్గివ్వడం, అతడికి ముద్దులివ్వడాన్ని చాలామంది తప్పుపట్టారు. సిరి ఇలా దిగజారిపోయిందేంటని ఆమెను దుమ్మెత్తిపోశారు. తన క్యారెక్టర్‌ను కించపరుస్తూ నానామాటలు అన్నారు. కానీ శ్రీహాన్ మాత్రం నెచ్చెలికే అండగా నిలిచాడు. సిరి గురించి తనకు బాగా తెలుసని, తన మీద కొండంత నమ్మకం ఉందంటూ మాట్లాడాడు. కానీ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో చాలామంది సిరి క్యారెక్టర్‌ను తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఓట్ల కోసమే షణ్ముఖ్‌కు దగ్గరైందని, బిగ్‌బాస్ షోలో మనుగడ సాగించడానికే అతడి మీదపడుతోందని విమర్శించారు. కొందరైతే ఆమె వల్ల షణ్ను నెగెటివ్ అవుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. ఈ కామెంట్లు చూసి తట్టుకోలేకపోయిన శ్రీహాన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. 'నన్ను ఎంతోమంది ఏవేవో అంటున్నా ఏ రోజూ నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే వాటివల్ల పేరెంట్స్ బ్లేమ్ అవ్వకూడదని ఆలోచించాను. కానీ ఈ రోజు ఎవరి ద్వారానో ఒక స్క్రీన్‌షాట్ బయటకు వస్తే పాపం సిరి ఏం చేసిందని, ఒక అమ్మాయని కూడా చూడకుండా క్యారెక్టర్ బ్లేమ్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. మీ అమ్మ గురించి నేను ఆగిపోయాను.' 'ఎవరి గేమ్ ఏంటో తెలిసి కూడా సిరి వల్ల నెగెటివ్ అయ్యాడు అంటారేంటి? నెగెటివ్ అవ్వడం కాదు, ఒకవేళ సిరి తోడుగా లేకపోతే వేరే సపోర్ట్ లేక అతడు(షణ్ను) పిచ్చోడయ్యేవాడు. ఎందుకంటే వేరే ఎవ్వరితో కలవడు కాబట్టి! ఇక్కడ సిరి వేరేవాళ్లతో మాట్లాడినా తప్పే, డ్యాన్స్ వేసినా తప్పే, నవ్వినా తప్పే, నేనే నీకు ప్రపంచం అని క్రియేట్ చేస్తే తను మాత్రం ఏం చేస్తుంది? ఇంకా ఎవరి దగ్గరకని వెళ్తుంది? ఫ్రెండ్ బాధపడకూడదని ఆలోచించి ఆగుతుంటే అడ్జస్ట్ అవుతుంటే వీళ్లు ఇచ్చే విలువ ఇదా?.. బిగ్‌బాస్ చివరి రోజుల్లో ఎందుకు ఈ నెగెటివిటీలు అని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నా ఆగుతుంటే అనవసరంగా సిరి అనడం ఏంటి?' అని మండిపడ్డాడు. మొత్తానికి శ్రీహాన్ ఇన్నాళ్లకు అటు ట్రోలర్స్‌కు ఇటు షణ్నుకు గట్టిగానే ఇచ్చిపడేశాడంటున్నారు నెటిజన్లు. అయితే ఇన్నాళ్లూ పెదవి విప్పకుండా మౌనంగా ఎందుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. అంటే సిరి టాప్ 5లో అడుగుపెట్టే సమయం కోసం ఎదురుచూసి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు. అటు షణ్నుది మాత్రమే తప్పు లేదని సిరిది కూడా తప్పుందంటున్నారు మరికొందరు. అతడు ఎంత కంట్రోల్ చేస్తున్నా, ఆఖరికి ఆమె తల్లిని, బాయ్‌ఫ్రెండ్ అయిన మిమ్మల్ని కూడా అన్ని మాటలంటున్నా పట్టించుకోకుండా అతడి పక్కన వాలిపోవడం తప్పు కాదా? అని నిలదీస్తున్నారు. ఇదిలా వుంటే శ్రీహాన్ ఈ పోస్టులను కాసేపటికే డిలీట్ చేయడం గమనార్హం. Finally #Shrihan said it.. But Y only after coming to Top 5 ?? Did he wait for it and saying now??? He could have done long before..... Now everything he says seems like he waited for siri to reach top5 and saying it 🤷🏻♀️#BiggBossTelugu5 #Siri#TitleHunterVJSunny #Sunny pic.twitter.com/oA2jVCu02T — Suneetha (@suneethak7) December 15, 2021