Bigg Boss 6 Telugu: These Contestants Likely To Participate In BB Telugu Season 6 - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరే..

Published Sun, Aug 7 2022 12:37 PM | Last Updated on Thu, Sep 1 2022 2:04 PM

Bigg Boss 6 Telugu: These Contestants May Participate In BB6 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ షో కోసం తెగ వెయిట్‌ చేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ తర్వాత నాన్‌స్టాప్‌ పేరుతో ఓటీటీలో బిగ్‌బాస్‌ ప్రారంభమైనా అది అందరికీ చేరువవలేదు. కేవలం హాట్‌స్టార్‌ను వీక్షించేవారు మాత్రమే దాన్ని చూసేందుకు వీలుండటంతో చాలావరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ రియాలిటీ షోను మిస్సయ్యారు. అయితే వారి నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే షో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్‌ ఘనంగా లాంచ్‌ కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. కానీ కొందరు మాత్రం ఇంకా రావాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్‌, ఆర్జే సూర్య, యాంకర్‌ ఉదయభాను, అమర్‌దీప్‌, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్‌, సింగర్‌ రేవంత్‌, యాంకర్‌ అరోహి.. షోలో అడుగు పెట్టబోతున్నారట. గత సీజన్‌లో సిరి రాగా, ఈసారి సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ వస్తుండటంతో అతడి మీద భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ ఇటీవలే తన ప్రేయసి, సహనటి తేజస్వితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. మరి అతడు పెళ్లిని వాయిదా వేసుకుని వస్తాడా? లేదంటే త్వరగా పెళ్లి చేసేసుకుని బిగ్‌బాస్‌ షోకు రెడీ అవుతాడా? అన్నది చూడాలి! ప్రతి సీజన్‌లో ఓ కమెడియన్‌ ఉన్నట్లే ఈసారి కూడా ఓ హాస్యనటుడిని తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

గీతూ రాయల్‌.. సోషల్‌ మీడియాలో కొటేషన్లు చెప్తూ బాగా ఫేమస్‌ అయింది. అలాగే బిగ్‌బాస్‌ షోపై రివ్యూలు కూడా ఇచ్చింది. ఆది రెడ్డి కూడా ఈ షోపై రివ్యూలు ఇచ్చిన వ్యక్తే. బిగ్‌బాస్‌ ఓటీటీలో షోపై రివ్యూలు ఇచ్చిన యాంకర్‌ శివను లోనికి పంపించారు. ఈలెక్కన ఈసారి వీరిద్దరినీ కూడా హౌస్‌లోకి పంపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇక అందరినీ మించి ఉదయభాను షోలో అడుగుపెడ్తే ఎలా ఉంటుందో చూడాలని చాలామంది వెయిట్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌ యాంకర్‌ నేహా చౌదరి బిగ్‌బాస్‌కు వస్తుండటం కూడా చాలామంది ఆశ్చర్యపరుస్తోంది. మరి వీరిలో ఎవరు చివరిదాకా ఉంటారు? ఎవరు మొదట్లోనే హ్యాండ్‌ ఇస్తారు? ఇంకా ఎవరెవరు హౌస్‌లోకి రాబోతున్నారు? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే!

చదవండి: ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించిన ఈ నటి గురించి తెలుసా?
ఆర్‌ఆర్‌ఆర్‌లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement