Geetu Royal
-
నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్
బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన పెంపుడు పిల్లి ఓరియో చనిపోయిందని, ఈ బాధను తట్టుకోలేకపోతున్నానంటూ బోరున విలపించింది. ఓరియో బంగారం.. నా బిడ్డ లేదు.. ఐ లవ్యూ.. అంటూ చివరిసారి తనను సమాధి చేస్తూ ఏడ్చేసింది. తనతో సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.ఆరోజు ఇంటికి రాలేదు2021, డిసెంబర్ 13న ఓరియో మా కుటుంబంలోకి వచ్చింది. ఈ ఏడాది జూలై 27న శాశ్వతంగా అందరినీ వదిలి వెళ్లిపోయింది. నా పిల్లి చాలా అమాయకమైనది. దీనికి కనీసం ఎలా అరవాలో, కరవాలో కూడా తెలియదు. రోజూలాగే జూలై 27న ఉదయం 3.45 గంటలకు బయట వీధిలోకి వెళ్లింది. 5.30 కల్లా ఇంటికి తిరిగొచ్చేది. కానీ ఆరోజు రాలేదు. సాయంత్రం నాలుగు వరకు వెతుకుతూనే ఉన్నాం.నా బిడ్డను చంపేశాయిచివరికి అది చనిపోయి కనిపించింది. సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం వల్ల వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలకు వచ్చాయి. నా బిడ్డను వెంటాడి మరీ చంపేశాయి. ఆ సమయంలో తను ఎంత భయపడిపోయిందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఓరియో పడ్డ వేదనను తలుచుకుంటేనే కష్టంగా ఉంది. ఓరియో అంటే నాకు ప్రాణం.. దాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను. బొచ్చు కావాలన్న గీతూఓరియో నాన్న... వీలైతే తిరిగొచ్చేయు బంగారుకొండ.. మమ్మా నిన్ను ఎంతో ప్రేమిస్తోంది అని రాసుకొచ్చింది. గీతూకు ఓరియో అంటే ఎంతిష్టమో చాలాసార్లు చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు కూడా ఇంటి నుంచి ఏం కావాలంటే ఓరియో బొచ్చు కావాలని అడగడం అప్పట్లో తెగ వైరలయింది. View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) చదవండి: బన్నీ... హనీ... భారీ ఫైట్ -
40 ఏళ్లు మాత్రమే బతుకుతాను.. డాక్టర్స్ మాటలతో డిప్రెషన్: గీతూ రాయల్
బిగ్‌బాస్ షో ద్వారా గీతూ రాయల్ చాలా పాపులర్ అయింది. సీజన్ 6లో ఆడుగుపెట్టిన గీతూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. వాస్తవంగా ఆమె టిక్‌టాక్ వీడియోలతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు కొటేషన్లు చెబుతూ యూత్‌ను ఆకట్టుకుంది. ఆపై బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పే స్థాయి నుంచి ఏడో సీజన్లో బిగ్‌బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించే రేంజ్‌కు చేరుకుని భారీగా ఫ్యాన్స్‌ను సంపాధించుకుంది.తాజాగా గీతూ ఒక వీడియోను షేర్ చేసింది.. సుమారుగా 5 నెలల నుంచి తను ఓ సమస్యతో బాధపడుతున్నట్లు అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తను పడుతున్న అనారోగ్యానికి కారణాలు చెప్పింది. నేను గత ఐదు నెలలుగా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నాను. 'దీనికి కారణం నేను బ్యాంకాక్ వెళ్లిన సమయంలో అనేక రకాల బొద్దింకలు, పురుగులు వంటి ఆహారపదార్థాలు తిన్నాను. అందువల్లే నేనే అనారోగ్యానికి గురైయాను అనుకుంటున్నాను. ఈ క్రమంలో మరో సందేహం కూడా ఉంది. ఒకసారి విజయవాడకు వెళ్లాను.. అక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. ఇదీ కూడా కారణం కావచ్చని అనుకుంటున్నాను. ఈ రెండు సంఘటనల తర్వాతే నేను అనారోగ్యానికి గురికావడం జరిగింది. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. దీంతో చాలా డిప్రెషన్‌కు గురి కావడం జరిగింది.మొదటగా నాకు ఒక గాయం అయింది. మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఫైనల్‌గా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఒక పరీక్ష ద్వారా అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీనికి రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రతివారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. డాక్టర్లు చెప్పిన మాటలతో బాగా డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. ప్రస్తుతం అయితే కొంతమేరకు బాగానే ఉన్నాను.' అంటూ గీతూ చెప్పింది.అలాంటి పొరపాటు చేస్తే.. 40 ఏళ్లు మాత్రమే బతుకుతానుఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్,నిద్ర తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతూ రాయల్ చెప్పింది. పూర్తిగా డాక్టర్స్ చెప్పిన ప్రకారం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది.. వైద్యుల సూచనలు పాటించకుంటే మరింత అనారోగ్యానికి గురికావడం జరుగుతుందట. ఈ క్రమంలో 40 ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్లు గీతూ పేర్కొంది. ఫైనల్‌గా తన అనారోగ్య పరిస్థితికి గల కారణాల గురించి ఒక వీడియో ద్వారా పూర్తి వివరాలు పంచుకుంది. -
బిగ్ బాస్ ఫేమ్ గీతూ పై జూనియర్ ఆర్టిస్ట్ సౌమ్య శెట్టి ఫైర్
-
నాపై 74 తులాల బంగారం చోరీ కేసు, చచ్చిపోదామనుకున్నా:నటి
జూనియర్ ఆర్టిస్ట్, నటి సౌమ్య శెట్టి బంగారు ఆభరణాలను దొంగిలించిందంటూ కొద్దిరోజుల క్రితం ఓ వార్త వైరలైంది. విశాఖపట్నం దొండపర్తిలో రిటైర్డ్ పోస్టల్ అధికారి జనపాల ప్రసాద్‌బాబు ఇంట్లో 74 తులాల బంగారం చోరీ చేసిందంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ నగల్లో కొంత విక్రయించి గోవా వెళ్లి ఎంజాయ్ చేయగా మిగిలిన 40 తులాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నోరు నొక్కేస్తున్నారు బెయిల్‌మీద బయటకు వచ్చిన సౌమ్య ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నా మీద తప్పుడు కేసు పెట్టారు. లేనిపోని నిందలు వేశారు. రిమాండ్‌లో లేకపోయినా రిమాండ్‌లో ఉంది, జైల్లో ఉందంటూ అసత్య ప్రచారం చేసి నన్ను జాతీయ స్థాయిలో పాపులర్ చేశారు. బయటకొచ్చి నిజాలు చెప్తుంటే ఏవేవో కేసులు పెట్టి నోరు నొక్కేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నా.. కానీ నా భర్త బతికి పోరాడాలని చెప్పారు. ఫైట్ చేస్తాను. పోరాడతా.. మీరు అబద్ధాన్ని నిజం చేశారు. కానీ నన్ను భయపెట్టలేరు. నాకు దొంగ అని ట్యాగ్ వేసి పిచ్చికుక్కను చేసి జైల్లో వేద్దామనుకున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. నేనూ నా నిజం చెప్పుకోవాలి. కోర్టులో ఏది రుజువు కాకముందే నా జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేశారు. నా వైపు దేవుడున్నాడు. పోరాడతాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది. అలాగే రిటైర్డ్ పోస్టల్ అధికారి కుటుంబానిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తనపై దుష్ప్రచారం చేసిన గీతూరాయల్, ధనుష్‌లపై పరువునష్టం దావా వేయబోతున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Soumya killampalli (@soumyashettysomu23) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే.. మరి థియేటర్లో..! -
ఫిబ్రవరి 28న పెళ్లి.. మౌనిక తట్టుకోలేకే అలా చేసింది: గీతూ రాయల్
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు సంపత్ వినయ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్తే అతడి తమ్ముడు, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ పోలీసులకు దొరికిపోయాడు. సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని డాక్టర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంపత్‌ను అరెస్ట్ చేసేందుకు అతడి గదికి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో పోలీసులు అతడిని తీసుకెళ్లారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2021లోనే రోకా.. తాజాగా ఈ కేసుపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను, షణ్ముఖ్ బాగానే మాట్లాడుకునేవాళ్లం. కానీ అతడు బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు నేనిచ్చిన రివ్యూల వల్ల అతడి కుటుంబానికి, నాకు మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. షణ్ను అన్నయ్య సంపత్ వినయ్ ప్రేయసి మౌనిక నాకు మంచి స్నేహితురాలు. తను నా ఫీమేల్ క్రష్ కూడా! మౌనిక, సంపత్ చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. వీరికి 2021లోనే రోకా జరిగింది. ఏడాది తిరిగేలోగా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది. ఈ నెలాఖరున పెళ్లి.. ఇంతలోనే.. కానీ అంతలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పెళ్లికి గ్యాప్ తీసుకున్నారు. అంతా సద్దుమణిగాక గతేడాది నవంబర్‌లో పసుపు దంచడం వంటి పెళ్లి పనులు మొదలుపెట్టేశారు. లగ్నపత్రికలు పంచారు, కళ్యాణమండపం కూడా బుక్ చేశారు. ఫిబ్రవరి 28న పెళ్లి జరగాల్సి ఉంది. వారం రోజుల్లో పెళ్లి ఉందనగా సంపత్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట! ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో లైఫ్ పంచుకోవాలనుకోవడం నాకైతే నచ్చలేదు. డిప్రెషన్లోకి వెళ్లింది అది ఏ అమ్మాయైనా తట్టుకోలేదు. అందుకనే తనలా చేసి ఉంటుంది. ఏదైనా ఉంటే ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాలి. పైగా ఆమె అతడికి ఇంటికి వెళ్తే లోపలికి రానివ్వకపోవడం కరెక్ట్ కాదు. మౌనిక చాలా సెన్సిటివ్.. తన గురించి ఆలోచిస్తేనే బాధేస్తోంది. ఆ మధ్య తను డిప్రెషన్లోకి కూడా వెళ్లింది' అని చెప్పుకొచ్చింది. చదవండి: అందరూ ప్రార్థించండి.. వేడుకుంటున్న పాయల్ -
హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్.. ఆయనసలు..: గీతూ రాయల్
బిగ్‌బాస్ షోలో గీతూ రాయల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ షోపై రివ్యూలు చెప్పుకునే ఈ యూట్యూబర్ ఆరో సీజన్లో అడుగుపెట్టి నానారచ్చ చేసింది. ఎలిమినేట్ అయినప్పుడు గుండె బాదుకుని ఏడ్చింది. అయితే ఈ షో వల్ల మనుషుల విలువ తెలిసిందని.. మరెన్నో నేర్చుకున్నానని చెప్పింది. ఇక ఏడో సీజన్లో బిగ్‌బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది గీతూ. జనాలు అడగాలనుకున్న ప్రశ్నలన్నింటినీ కంటెస్టెంట్ల ముఖం పట్టుకుని అడిగేసింది. నాగార్జున సైతం టచ్ చేయని టాపిక్‌లను లేవనెత్తి మరీ వారిని ఇరకాటంలో పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున హోస్ట్‌గా ఫెయిలయ్యాడంటోంది. స్క్రిప్ట్ వస్తుందని తెలియదు ఇంకా గీతూ మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్లపై జనాలకు చాలా డౌట్స్ ఉంటాయి. అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. నాగార్జున అడుగుతారనుకుంటే.. ఇప్పటివరకు ఆయన చేసిన సీజన్స్ అన్నింటిలోనూ చప్పచప్పగా ప్రశ్నలడిగేవారు. స్క్రూ టైట్ చేసే ప్రశ్నలు, బెండు తీసేలా ఎప్పుడూ మాట్లాడలేదు. కూల్‌గా వచ్చి కూల్‌గా మాట్లాడేసి వెళ్లిపోయారు. ఈ ఒక్క సీజన్‌కు మాత్రమే నాగార్జున కఠినంగా ఉన్నాడు. నాగార్జు హోస్ట్‌గా ఫెయిలయ్యారనే చెప్పాలి.. ఈ మాట ఎందుకన్నానంటే.. నాగార్జున ఎపిసోడ్స్ చూసి మాట్లాడతారనుకున్నాను. తనకు స్క్రిప్ట్ వస్తుందన్న విషయం నాకు తెలియదు. నా తప్పు లేదు ఆరో సీజన్లో చంటిగారు కీర్తిని వెటకారంగా మాట్లాడారు. అప్పుడు వీకెండ్లో రెండుసార్లు వీడియో తిప్పి తిప్పి చూపించి నాదే తప్పు అని ఒప్పించడానికి ప్రయత్నించారు. చంటి-కీర్తి విషయంలో నా తప్పే లేదు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. అలాంటివి జరిగినప్పుడు నాగార్జున స్టాండ్ తీసుకుని ఏది కరెక్ట్? ఏది తప్పు? అనేది గట్టిగా చెప్తే బాగుండేది. నా విషయంలోనే కాదు సన్నీ- షణ్ముఖ్ విషయంలోనూ సన్నీ తప్పు లేకపోయినా హౌస్ మొత్తానితో తనదే తప్పు అనిపించారు. ఇక బిగ్‌బాస్ బజ్‌లో నాగార్జున అడగలేకపోయిన వాటిని నేను అడిగాను' అని చెప్పుకొచ్చింది గీతూ. చదవండి: గీతాంజలి, నిన్నే పెళ్లాడతా.. మిస్ అయ్యా! రెండోపెళ్లిపై ఏమందంటే? -
'హౌస్‌లో మోస్ట్ కన్నింగ్ పర్సన్ ఎవరంటే'.. యావర్ కామెంట్స్ వైరల్!
బిగ్‌బాస్ సీజన్-7 రియాలిటీ షో గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వినర్‌గా అవతరించాడు. టాప్-2లో ఉన్న అమర్దీప్, ప్రశాంత్ నిలవగా.. చివరికీ రైతుబిడ్డనే ట్రోఫీని సాధించాడు. అయితే అంతకుముందు టాప్-3 కంటెస్టెంట్, యావర్-4 స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే యావర్ రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని ఎలిమినేట్ అయ్యారు. అయితే షో ముగిసిన తర్వాత బయటకొచ్చిన యావర్ ఇంటర్వ్యూలో యాంకరప్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు.. పోలీసులపై ప్రశాంత్ అసహనం) యావర్ మాట్లాడుతూ..' నేను నా ఫ్యామిలీ కోసమే రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని వచ్చేశా. టైటిల్ గెలవడమనేది పెద్ద విషయం కాదు. హౌస్‌లో మోస్ట్ కన్నింగ్ పర్సన్ శోభా అని.. మాస్క్ వేసుకుని ఉన్న వ్యక్తి అమర్దీప్. సింపతీ కోరుకునేది అశ్విని.. డబుల్ యాక్షన్ గౌతమ్.' అంటూ సమాధానలిచ్చాడు యావర్. అంతే కాకుండా నాకు తెలుగు రాదు అన్నమాటను నీకు అనుకూలంగా మార్చుకున్నావా? అని యాంకర్ ప్రశ్నించగా.. గట్టిగా నవ్వేశాడు యావర్. ఇదంతా ఉల్టా పుల్టా అంటూ తనదైన శైలిలో ఆన్సరిచ్చాడు. -
నువ్వసలు ఆడటానికే వచ్చావా? అన్న గీతూ.. దండం పెట్టేసిన పూజా
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ పేరుకు తగ్గట్లే అంతా ఉల్టాపుల్టాగా సాగుతోంది. ప్రేక్షకులు మాకొద్దు బాబోయ్ అని దండం పెట్టేసిన కంటెస్టెంట్ రతిక రోజ్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకురావడం.. షో మొదలైన నెల రోజులకు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొత్తగా ఐదుగురు హౌస్‌లో ఎంట్రీ ఇవ్వడం.. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. నిన్నటి సండే ఎపిసోడ్లో నిజాయితీగా గేమ్ ఆడిన పూజా మూర్తిని బయటకు పంపించేసి నెగెటివిటీ పోగు చేసుకున్న రతికాను హౌస్‌లోకి పంపించారు. అప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది హౌస్‌లో అడుగుపెట్టిన రెండు వారాలకే ఎలిమినేట్ అయిన పూజా మూర్తి తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఇంటర్వ్యూలో తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టింది. తనను తుప్పాస్ కారణాలతో నామినేట్ చేశాడంటూ తేజ ఫోటోను ముక్కలు ముక్కలుగా చించేసింది. తనకు బదులుగా అశ్విని, భోలె షావళిలలో ఎవరైనా ఒకరిని పంపించేయాల్సిందని అభిప్రాయపడింది. ఒక మనిషిని కింది నుంచి పైదాకా చూసి హా.. నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్లే అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది.. అశ్విని అలా చేసినప్పుడు తనకు పట్టరానంత కోపం వచ్చిందని పేర్కొంది. తర్వాత రైతుబిడ్డ ఫోటోను చింపేసింది. గైడ్ చేయడం కూడా ఒక గేమ్.. లోపల ఉన్నవాళ్లలో కొందరు ఆడకుండానే హౌస్‌లో ఎలాగోలా నెగ్గుకొస్తున్నారంది. ఇంతలో గీతూ.. నువ్వు హౌస్‌మేట్స్‌తో కలిసి ఆడటానికి వచ్చారా? వారిని ఎంకరేజ్ చేయడానికి వచ్చారా? అని సూటిగా ప్రశ్నించింది. తాను గైడ్ చేశానని, అది కూడా గేమే అని ఒప్పేసుకుంది పూజా. అయితే అంతిమ విజయం ఆటగాడిదే, కానీ కోచ్‌ది కాదని కౌంటరిచ్చింది గీతూ రాయల్. దీంతో ఆమె ప్రశ్నలకు దండం పెట్టేసింది పూజా మూర్తి. అయితే గీతూ చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉందంటున్నారు నెటిజన్లు. ప్లేయర్ గెలుస్తాడు, కానీ కోచ్ కాదన్నది శివాజీకి కూడా వర్తిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్.. పూజా మూర్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
వాడుకోవడం అలవాటేగా.. గీతూ ప్రశ్నలకు బిక్కముఖం వేసిన రతిక
రతిక రోజ్.. ఎలిమినేట్ అయినప్పుడు నాగ్ ఓ మాటన్నాడు. ఇదొక పాఠం. బయటకు వెళ్లిన తర్వాత అబ్జర్వ్ చేసుకో అని చెప్పాడు. అటు తన జర్నీలోనూ ప్రశాంత్, యావర్‌తో నడిపిన ప్రేమ విన్యాసాలను చూపించేసరికి రతిక ముఖంలో రక్తం చుక్కలేకుండా పోయింది. పైగా లవ్ ట్రాక్‌లు, వెన్నుపోట్లు తప్ప ఆట ఏమీ లేదు. తన ఎలిమినేషన్ ప్రాంక్ అంటారేమోనని ఆశగా ఎదురుచూసింది రతిక. అంత సీన్ లేదన్నట్లుగా నాగ్ తనను అక్కడి నుంచి బయటకు పంపించేశాడు. ఎవరిని వెన్నుపోటు పొడిచాను?: రతిక ఎలిమినేషన్‌తో షాక్‌లో ఉన్న రతిక తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ గలాటా గీతూ అడిగే ప్రశ్నలకు తనకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఈ రోజ్ హౌస్‌లో అందరినీ వాడుకుని ఆడుకోవాలనుకుంది. కానీ, చివరకు వాడిపోయింది అంటూ రతికా రోజ్‌తో ఇంటర్వ్యూ మొదలుపెట్టింది గీతూ రాయల్. బాహుబలిలో కట్టప్పనే మించిపోయావనడంతో.. బిక్కముఖం వేసిన రతిక.. ఎవరిని వెన్నుపోటు పొడిచానని అడిగింది. దీనికి గీతూ.. రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది. ప్రశాంత్ విషయంలో చేయి అందించిందే మీరు.. అని చెప్పడంతో రతిక నేనా? అని అమాయకంగా ప్రశ్నించింది. మీరు హౌస్‌లోనే కాదు, ఇక్కడ కూడా మానిప్యులేట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని కౌంటర్ ఇచ్చింది గీతూ. వాడుకోవడం బాగా అలవాటేగా.. గీతూ కౌంటర్ ఇక హౌస్‌లో తన మాజీ ప్రియుడు(రాహుల్ సిప్లిగంజ్) గురించి పదేపదే మాట్లాడిన సంగతిని సైతం ప్రస్తావించింది గీతూ. ఎక్స్(మాజీ ప్రియుడు) అనే ఎమోషన్‌ను బాగా వాడుకున్నట్లు అనిపించింది. అయినా మీకు వాడుకోవడం బాగా అలవాటేగా అని సెటైర్ వేసింది. తన మాటలకు బిత్తరపోయిన రతిక.. వాడుకునే అలవాటుంటే ఆ టైం వచ్చినప్పుడే వాడుకునేదాన్ని అని బదులిచ్చింది. ప్రశాంత్ క్రైయింగ్ స్టార్ అయితే రతిక కన్నింగ్ స్టార్, ఫ్లిప్పింగ్ స్టార్.. రతిక కన్నా పాము నయం అంటూ సోషల్ మీడియా వచ్చిన కామెంట్లు చూపించింది గీతూ. ఇది చూసిన రతికకు మైండ్ బ్లాక్ అయిపోయింది. జనాలకు అలా అర్థమైతే అది నా ఖర్మ, దానికేం చేయలేం అని ఆన్సరిచ్చింది. ప్రశాంత్ అపరిచితుడు అనంతరం పల్లవి ప్రశాంత్ ఫోటోకు నిప్పు పెడుతూ రోజుకో యాంగిల్ చూపిస్తున్నాడు. అపరిచితుడిలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రతిక ఇంకా షాక్ నుంచి బయటపడినట్లు అనిపించడం లేదు. ఏదైతేనేం.. ఈ ఇంటర్వ్యూ ప్రోమో కింద జనాలు మాత్రం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఎలిమినేట్ అయితే బాధేసేది, కానీ రతిక వెళ్లిపోయినందుకు ఎంత సంతోషంగా ఉందో అని కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్ 6లో గీతూ, బిగ్‌బాస్ 7లో రతిక.. చాలా ఇరిటేట్ చేశారని అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం.. రతికను అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ముందు ముందు జనాలకు తెలిసొస్తుందని చెప్పుకొస్తున్నారు. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ప్రియుడు ఎమోషనల్.. వీడియో వైరల్ -
తెలుగులో బూతులు, ఇంగ్లీష్‌లో నీతులా.. బిక్కమొహం వేసిన దామిని
మధుర గాత్రంతో పాటల రూపంలో ఎప్పుడూ వినిపించే దామిని బిగ్‌బాస్ షో ద్వారా కనిపించాలనుకుంది. ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనుకుంది. ఆటతో సత్తా చాటాలనుకుంది. అయితే ఎప్పుడూ కిచెన్లోనే వంట చేస్తూ వంటలక్కగా పేరు తెచ్చుకుంది. ఆటలో వెనుకబడింది. ఫలితంగా మూడో వారానికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొంది. గీతూ రాయల్ అడిగే సూటి ప్రశ్నలకు బిక్కముఖం వేసింది. ప్రిన్స్ యావర్ ముఖాన, నోటిలో పేడ కొట్టిన టాస్క్‌ను గుర్తు చేసింది గీతూ. పేడ కొట్టి ఒక మనిషికి ఊపిరాడకుండా చేయొచ్చనుకున్నారా? అని అడగ్గా అది కేవలం ఒక టాస్క్ మాత్రమేన, తానేమైనా సీరియల్ కిల్లర్‌లా కనిపిస్తున్నానా? అని అడిగింది. తను ఇంగ్లీష్‌లో మాట్లాడిన బూతులను సైతం ప్రస్తావించింది గీతూ. నీ దృష్టిలో తెలుగులో మాట్లాడితే బూతులు ఇంగ్లీష్‌లో మాట్లాడితే నీతులా అనడంతో ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుడ్లు తేలేసింది దామిని. తర్వాత కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. రతిక అన్నీ సగం సగం వింటుందని, శుభశ్రీ రెడీ అవడం మీద దృష్టి పెట్టడమే కాకుండా పని కూడా చేస్తే బాగుంటుందని పేర్కొంది. యావర్ ఇతరులను కాస్త అర్థం చేసుకోవాలని, తేజ వెటకారం తగ్గించుకోవాలంది. శోభా శెట్టి చెంచా తేజ అని, గౌతమ్ తనకే అన్నీ తెలుసనుకుంటాడంది. శివాజీది కన్నింగ్ గేమ్ అని, ప్రశాంత్ గురించి మాట్లాడటమే వేస్ట్ అంది దామిని. మొత్తానికి హౌస్‌లో తనే తోపు అనుకున్న దామినికి బిగ్‌బాస్ బజ్‌లో గట్టి కౌంటర్లే పడ్డాయి. -
ప్రిన్స్ ఒక వెధవ.. ప్రశాంత్‌కు డ్రగ్ ఎక్కేసింది: షకీలా
బిగ్‌బాస్ షోలో ఊహించిన ఎలిమినేషన్సే జరుగుతున్నాయి. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించగా అదే నిజమైంది. నెక్స్ట్ లైన్లో ఉంది ప్రిన్స్ యావర్ అనుకున్నారు. కారణం కిరణ్‌లాగే అతడికి కూడా తెలుగు రాదు. ఇంకేముంది, తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయం అని అందరూ ఊహించారు. కానీ ప్రిన్స్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ఊహించినట్లే జరిగింది.. గేమ్‌లో ఫైర్‌బ్రాండ్‌లా ఆడుతూ చెలరేగిపోయాడు. తన టీమ్‌ను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో ప్రిన్స్ గ్రాఫ్ పెరిగి సేఫ్ జోన్లో అడుగుపెట్టాడు. ఇక హౌస్‌లో పెద్దగా ఏ గొడవల జోలికి పోని షకీలా ఎలిమినేట్ కావచ్చని ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. రెండో వారం షకీలా అమ్మ ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. నువ్వేంటి నన్ను అడిగేది? షకీలా ఫైర్ గీతూ రాయల్ అడిగే పదునైన ప్రశ్నలకు అంతే పదునుగా సమాధానాలిచ్చింది. హౌస్‌లో మీరు శివాజీ బ్యాచా? సీరియల్ బ్యాచా? అని అడగ్గా నేను బ్యాచ్‌లో ఉన్నానని చెప్పానా? నువ్వేంటి నన్ను అడిగేది అని గీతూపై ఫైర్ అయింది. హౌస్‌లో రియల్‌గా ఉన్నారా? ఫేక్‌గా ఉన్నారా? అని అడగ్గా తానేదీ ప్లాన్ చేయలేదని చెప్పింది. పిలిస్తే వచ్చాను తప్ప ఏదో ఆశయం పెట్టుకుని ఇక్కడకు రాలేదని పేర్కొంది. తర్వాత ఒక్కో కంటెస్టెంట్ గురించి కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడింది. ప్రశాంత్‌కు డ్రగ్ ఎక్కేసింది 'అమర్ దీప్.. చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాడు. ప్రిన్స్ యావర్.. వెధవ, కేవలం తనకున్న బాడీని ఉపయోగించి శారీరక బలంతో అంచెలంచెలు ఎదుగుతానంటే అది అసాధ్యం. పల్లవి ప్రశాంత్.. బ్లడీ రాంగ్ యాటిట్యూడ్. పాపులారిటీ అనే డ్రగ్ ప్రశాంత్‌కు ఎక్కేసింది. ఆట సందీప్ హౌస్‌లో ఉండేందుకు అర్హత ఉన్న వ్యక్తి. రతిక అందంగా కనిపించే పాము.. నేను చస్తే హౌస్‌లో ఉన్న 14 మంది రావాలి. అదీ నాకు కావాల్సింది' అని చెప్పుకొచ్చింది షకీలా. -
ఘనంగా యాంకర్ లాస్య సీమంతం వేడుక, ఫొటోలు వైరల్
యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను మరోసారి గర్భవతి అయినట్లు భర్త మంజునాథ్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా ఆమె సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్య సీమంతం వేడుకలో బిగ్‌బాస్ ఫేం గీతూ రాయల్, టీవీ నటి సుష్మ ఇతర బుల్లితెర నటీనటులు సందడి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_) -
బిగ్‌బాస్‌పై గీతురాయల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
చిత్తూరు రూరల్: ‘హాయ్..చిత్తూరు. నాయనా..మీ అభిమానం సల్లంగుండా!’ అంటూ బిగ్‌బాస్ ఫేమ్ గీతురాయల్ పలకరించింది. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైనా గీతు రాయల్ చిత్తూరు వాసుల్లో జోష్‌ను పెంచింది. గీతూ.. ఒక్క సెల్ఫీ– అంటూ యువత ఉత్సాహం చూపింది. ఆతర్వాత వేదికపైకి వెళ్లి హాయ్ చిత్తూరు అంటూ మొదలుపెట్టింది. ‘మీ అభిమానం చూస్తుంటే.. నా వల్ల కావడం లేదురా నాయనా.. నేను చిత్తూరు వదిలి వెళ్లి పోయి 15 ఏళ్లు అయింది. అయినా కూడా చిత్తూరు యాసను నా బ్లడ్‌లో ఎక్కించేసుకున్నా. ఏ సందర్భమైనా నేను చిత్తూరు యాసలోనే మాట్లాడుతున్నా. నన్ను ఏవరైనా మీది ఏ ఊరంటే..హేయ్.. మాది చిత్తూరు రా.. అని గర్వంగా చెబుతున్నా. బిగ్‌బాస్ వెళ్లాక నేను రెండు విషయాలు నేర్చుకున్నా. మనం తప్పు చేయకపోతే ఎదుటి వ్యక్తి ఎంతా తోపైనా అసలు తగ్గకూడదు. మనవైపు తప్పుంటే చిన్నపిల్లలైనా క్షమాపణ చెప్పాల్సిందే.. జీవితాంతం మీకు రుణపడి ఉంటా’ అని ముగించింది. ఆమెను తానా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. చదవండి: కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన బాలయ్య -
అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ రాయల్
బిగ్‌బాస్ షోయే తన ప్రపంచం అనుకుంది గీతూ రాయల్. వీలైతే టాప్ 5లో చోటు కుదిరితే కప్పు కూడా పట్టుకొచ్చేదామనుకుంది. కానీ ఆమె ఆట, మాట తీరు నచ్చకపోవడంతో టాప్ 10లో కూడా ఉంచకుండానే ఆమెను ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు. ఊహించని ఎలిమినేషన్‌తో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది గీతూ. 20 రోజుల డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక ఓ తుప్పాస్ పని చేశా, ఈ విషయం అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది అంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో వదిలింది గీతూ. అందులో ఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ ఎపిసోడ్ చూసి ఏడ్చాను. ఎందుకంటే మా అమ్మ నా కోసం హౌస్‌లోకి వస్తుందని చీర కూడా కొని రెడీగా పెట్టాను. ఫ్యామిలీ ఎపిసోడ్ అయ్యాక ఎలిమినేట్ అయినా బాగుండేది. నేను ఎలిమినేట్ అయిన రోజు బాగా ఏడ్చేసరికి డిప్రెషన్లో ఉన్నానేమోనని నాగార్జున నన్ను పిలిచారు. ఆదిరెడ్డికి నాగార్జునగారు బాగా క్లాస్ పీకినరోజే ఆయన్ని కలిసాను. ఆయన నన్ను మళ్లీ ఓదార్చాడు అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో ఆమె తన కుడికాలిపై చిరుతచారల పచ్చబొట్టు వేయించుకుంది. టాటూ వేయించుకునేటప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉండటానికి బిగ్‌బాస్ చూస్తూ కూర్చుంది. కాలిపై ఉన్న గాయం తాలూకు మచ్చను కప్పివేసేందుకే టాటూ వేయించుకున్నట్లు తెలిపింది గీతూ. View this post on Instagram A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_) చదవండి: కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి పెళ్లి ఫొటోల్లో లావుగా ఉందంటూ ట్రోల్స్ -
అప్పుడు ఏడిపించంటూ సవాల్.. ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది!
బిగ్‌బాస్ షోలో తమను నిరూపించుకోవాలని, ప్రేక్షకుల మనసులు గెలిచి విజేతగా నిలవాలని ఇలా ఎన్నో కలలు కంటుంటారు కంటెస్టెంట్లు. ఏ కొద్ది మంది మాత్రమే వారి కలను సాకారం చేసుకుంటారు. మిగతావాళ్లు ప్రయాణం మధ్యలోనే వెనుదిరుగుతారు. అందులో గీతూ రాయల్ ఒకరు. బిగ్‌బాస్ షో అంటే పడి చచ్చే ఆమెకు ఆరో సీజన్లో పాల్గొనే బంపర్ ఆఫర్ వచ్చింది. విన్నర్ అయిపోతానని తనకు తానే ఫిక్స్ అయిపోయింది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆటకు ఆటంకం కలిగింది. ప్రయాణం మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. కనీసం టాప్ 10లో.కూడా పత్తా లేకుండా పోయింది. ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది గీతూ. ఆట నుంచి అర్ధాంతరంగా తొలగిపోవడాన్ని తట్టుకోలేక లోలోపలే కుమిలిపోతోంది. హౌస్‌లో ఉన్నప్పుడు నన్ను ఏడిపించు బిగ్‌బాస్ అంటూ సవాల్ విసిరిన గీతూ ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది. తాజాగా ఆమె బిగ్‌బాస్ షో చూస్తూ మరోసారి ఏడ్చేసింది. ఫ్యామిలీ వీక్ కావడంతో కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా హౌస్‌లో అడుగుపెడుతున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన గీతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోను గీతూ భర్త వికాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'గీతూ ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం చాలా కలలు కంది. షోలోకి వెళ్లకముందే వాళ్ల అమ్మకి చీర కొనిచ్చి దాన్ని కట్టుకురమ్మని చెప్పింది. సడన్ ఎలిమినేషన్ మేమంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. ఫ్యామిలీ థీమ్‌లో వాళ్ల అమ్మను బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలనుకుంది. ఇప్పుడిలా ఎపిసోడ్ చూసేటప్పుడు వాళ్ల అమ్మను గుర్తు చేసుకుని చాలా ఏడుస్తోంది. మేమంతా గీతూతో ఉన్నాం. మీరు కూడా ఉంటారనుకుంటున్నాం' అని రాసుకొచ్చాడు గీతూ భర్త. View this post on Instagram A post shared by Vikas Mickey (@vikasmickey) చదవండి: రోహిత్ కోసం ఎవరు వచ్చారో తెలుసా? ఎట్టకేలకు ఓటీటీలో కాంతార రిలీజ్ -
బయటకు వచ్చాక గీతూ తల్లికి ఫోన్ చేశాను: బాలాదిత్య
బిగ్‌బాస్ షోలో మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్నాడు బాలాదిత్య. కానీ ఒక్క సిగరెట్ కోసం ఏడ్చి, నానా రభస చేసి, గీతూపై నోరు జారి పెద్ద తప్పే చేశాడు. అయినా సరే అప్పటికే మంచి పేరు ఉండటంతో బాలాదిత్య ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం అంత గొడవపడ్డా అతడికే మద్దతు పలికారు ఫ్యాన్స్. బదులుగా అతడిని ఎమోషనల్‌గా బ్లాక్మెయిల్ చేసిన గీతూను బయటకు పంపించి తగిన బుద్ధి చెప్పారు. తాజాగా అతడు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నేను బిగ్‌బాస్ షో గెలవలేకపోవచ్చు. కానీ మన ఇంట్లో ఇలాంటి మనిషి ఉండాలని ఎంతోమంది కోరుకున్నారు. అది చాలు.. నన్ను పెంచిన తల్లిదండ్రులు, గురువుల వల్లే నాకు అంతటి పేరొచ్చింది. ఇకపోతే నాకు సిగరెట్ వీక్నెస్ కాదు. కానీ బయటకు అది నెగెటివ్‌గా వెళ్తుందని అర్థమై సిగరెట్లు తాగడమే మానేశాను. సిగరెట్ల విషయంలో గీతూను తిట్టినందుకు ఆమె తల్లికి ఫోన్ చేసి సారీ చెప్పాను' అని చెప్పాడు బాలాదిత్య. చదవండి: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే? శ్రీహాన్.. మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా నీలో.. ఆట్ కమల్ హాసన్ -
గీతు రాయల్ తో చిట్ చాట్
-
పుష్ప 2లో ఛాన్స్, స్పందించిన గీతూ రాయల్
బిగ్‌బాస్ గేమ్‌ను రఫ్ఫాడించింది గీతూ రాయల్. టాప్ 5లో ఉంటుందనుకుంటే తొమ్మిదో వారంలోనే బయటకు వచ్చేసింది. విన్నర్ అయి కప్పు కొడతాననుకుంటే కనీసం టాప్ 10లో కూడా లేనని తెగ బాధపడిపోయింది గీతూ. బిగ్‌బాసే ప్రాణం అనుకున్న ఆమె తన ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. డిప్రెషన్లోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. తాజాగా ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'నేను పీఆర్ లేకుండా బిగ్‌బాస్‌కు వెళ్లాను. దీనివల్ల నేను కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, నడిస్తే తప్పు అన్నట్లుగా అయిపోయింది. ఇక నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం నా ఓవర్ కాన్ఫిడెన్స్. ఓటమిని తీసుకోలేకపోయాను, డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక క్వారంటైన్లో ఉన్న గదికే వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నాను. ఆ రెండురోజులు తిండితిప్పలు మానేసి రిపీట్ మోడ్‌లో ఎలిమినేషన్ ఎపిసోడ్ పెట్టుకుని దాన్నే చూస్తూ ఏడ్చుకుంటూ ఉండిపోయా. తర్వాత అమ్మానాన్న వచ్చి బాధపడొద్దని నన్ను ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు నాకు వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు, ఎడిటింగ్లు చూసి కొంతమంది మనుషులను గెలుచుకున్నానని సంతృప్తి చెందాను. బిగ్‌బాస్ సీజన్ 6 గెలిచే అర్హత ఆది రెడ్డికే ఉంది. రేవంత్‌కు కూడా గెలిచే అర్హత ఉంది కానీ అతడికి భయంకరమైన కోపం ఉంది. అదే అతడి మైనస్! హౌస్‌లో ఇనయ లేకపోతే ఇంత కంటెంట్ ఉండేదే కాదు. కాకపోతే కొన్ని విషయాల్లో ఆమె ఫేక్‌గా అనిపిస్తుంది. ఆమె లేకపోతే బిగ్‌బాస్ చూడబుద్ధే కాదు. తను రన్నర్ కాదుకానీ టాప్ 5లో ఉంటుంది. ఇంకా ఆది, రోహిత్, రేవంత్ టాప్ 5లో ఉంటారు. వెటకారం వల్ల శ్రీహాన్ నెగెటివ్ అవుతున్నాడు. కాబట్టి అతడు టాప్ 5లో ఉంటాడో లేడో చెప్పలేకపోతున్నా. నాకు పుష్ప 2లో ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే పుష్ప కో డైరెక్టర్ నా నంబర్ అడిగారని నాకూ తెలిసింది. అంతే తప్ప వాళ్లు నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు. భవిష్యత్తు ప్రణాళికల విషయానికి వస్తే నేను మంచి పొలిటీషియన్ కావాలనుకుంటున్నా, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది గీతూ రాయల్. చదవండి: ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావు, నిన్నేమనాలి? వాళ్లది తొండి గేమ్, ఫైమాకు వెటకారం ఎక్కువే -
బిగ్‌బాస్, నాగార్జున భయంకరంగా పొగిడేవారు, చివరికి: గీతూ
బిగ్‌బాస్ హౌస్‌లో గీతూ రాయల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారంతా! కచ్చితంగా టాప్ 5లో ఉంటుందని ఊహించారు. గీతూ అయితే ఏకంగా విన్నర్ అవుతానని ఫిక్స్ అయిపోయింది. తానిలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోవడానికి ప్రధాన కారణం బిగ్‌బాసే అంటోంది. 'బిగ్‌బాస్, నాగార్జున నన్ను బాగా పొగిడేవారు. కానీ అది ఎపిసోడ్లో చూపించలేదు. నేనేం చేసినా బిగ్‌బాస్ ఎప్పుడూ తప్పని చెప్పలేదు. నాగార్జున అయితే ప్రతీవారం నా గేమ్‌ను మెచ్చుకునేవారు. మీకు వీకెండ్ ఎపిసోడ్ గంట మాత్రమే చూపిస్తారు. కానీ అక్కడ నాలుగైదు గంటలు జరిగేది. అందులో నన్ను భయంకరంగా పొగిడేవారు. అది చూసి నేనింత తోపా అని నేనూ ఫీలైపోయాను. బిగ్‌బాస్ దత్తపుత్రిక గీతూ అంటున్నారు కదా, హౌస్‌లో ఉన్నప్పుడు నాకూ అలాగే అనిపించింది. బిగ్‌బాస్‌కు నేనంటే ఇష్టం కావచ్చు, అందుకే ఏం చేసినా ఏమీ అనట్లేదనుకున్నాను. బిగ్‌బాస్ టీమ్ నన్ను మునగ చెట్టెక్కించింది. నాకింక తిరుగులేదనుకున్నా. టాప్ 5లో సీటు గ్యారెంటీ, గెలిచే ఛాన్స్ కూడా ఉందనుకున్నా. ఓడిపోయాక తెలిసింది అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని! నేను బయటకు వచ్చేటప్పుడు కూడా నాగార్జున.. ఈ హౌస్‌లో నటించని, మాస్క్ లేని ఏకైక కంటెస్టెంట్ గీతూ అన్నారు. హౌస్మేట్స్ అందరిలో ఫైర్ తెప్పించింది గీతూనే అన్నారు. కానీ అది ఎపిసోడ్లో చూపించలేదు. ప్రాణం పోయినా గీతూ అబద్ధం చెప్పదు. కెప్టెన్ కాకుండానే బయటకు వచ్చాను, హౌస్‌ను ఒక్కసారి కూడా పాలించలేదని నాగార్జున దగ్గర బాధపడితే ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు కెప్టెన్ అవ్వకపోయినా 9 వారాలు హౌస్‌ను పాలించావన్నాడు. ఇంత ఎక్కించాక ఎవరైనా తోపని ఫీలవకుండా ఉంటారా?' అని బాధపడింది గీతూ. చదవండి: గీతూ అలాగే వెళ్లిపోయింది, ఇప్పుడు మీరు మొదలుపెట్టారా? చెత్త సంచాలక్, గేమ్ సర్వనాశనం -
పాజిటివ్ కామెంట్స్ చేయమని రూ. 25వేలు ఇచ్చా.. మోసం చేశారు : గీతూ
బిగ్‌బాస్ సీజన్-6లో ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గీతూ రాయల్. టైటిల్ ఫేవరెట్‌గా మారిపోయిన గీతూ అనూహ్యంగా ఇంటినుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ ప్రేక్షకులనే కాదు, హౌజ్‌మేట్స్‌ని కూడా షాకింగ్‌కి గురిచేసింది. ఇక గీతూ కూడా ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. హౌజ్‌ని వీడేముందు గీతూ ‘నన్ను పంపించొద్దు బిగ్‌బాస్’ అంటూ వేడుకున్న తీరు ప్రతిఒక్కరిని కదిలించింది. చివరికి అయిష్టాంగానే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చింది. అయితే ఎలిమినేట్ అయ్య ఇన్నిరోజులు అవుతున్నా ఆమె ఇంతవరకు బయటకు రాలేదు. బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ మినహా ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తాజాగా గీతూ అఙ్ఞానం వీడింది. బిగ్‌బాస్‌లో తన జర్నీ దగ్గరి నుంచి ఏ పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది? బిగ్‌బాస్ ప్రయాణంలో తాను నేర్చుకున్న గుణపాఠం ఏంటి? వంటి పలు విషయాలపై గీతూ సుధీర్ఘంగా చర్చించింది. తాజాగా తన యూట్యూబ్ చానల్లో ఓ ఆస్తక్తికర వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చేముందు నన్ను ప్రమోట్ చేయమని కొందరికి రూ. 25 వేలు ఇచ్చాను. అయితే వారు ఏ పని చేయకుండా డబ్బులు తీసుకుని మోసం చేశారు. నా గురించి ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కామంట్ చేయలేదు. ఇంక నేను నమ్మిన స్నేహితులు కూడా నన్ను మోసం చేశారు. వారందరూ నాకు సపోర్ట్ చేస్తారనే ధైర్యంతో హౌజ్‌లో అడుగుపెట్టాను. కానీ ఏ ఒక్కరి నుంచి కూడా నాకు మద్దతు రాలేదని బయటకు వచ్చాకా తెలిసింది. నిజంగా ఇది నన్ను తీవ్రంగా బాధించింది. నా గేమ్‌ను తప్పు పడుతున్నారు. అభిజిత్, కౌశల్ కంటే నేనేం తక్కువ? వాళ్లు చేస్తే రైట్, నేను చేస్తా తప్పా?’ అంటూ గీతూ వాపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
బిగ్‌బాస్ 6: 9 వారాలకు గీతూ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ 6 సీజన్లో ఎక్కువగా మార్మోగుతున్న పేరు గీతూ రాయల్. మొదటి నుంచి హౌజ్‌లో అందరికంటే ఎక్కువ కంటెంట్ ఇస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇక ఆమె అనూహ్యా ఎలిమినేషన్ మాత్రం అందరికి షాకిచ్చింది. కేవలం ప్రేక్షకులే కాదు హౌజ్‌మేట్స్ కూడా గీతూ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకోపోతున్నారు. ఇక హౌజ్‌ని వీడేముందు గీతూ ‘నన్ను పంపించొద్దు బిగ్‌బాస్’ అంటూ వేడుకున్న తీరు ప్రతిఒక్కరిని కదిలించింది. చివరికి అయిష్టాంగానే ఆమె హౌజ్‌ను వీడింది. అయితే సోషల్ మీడియాలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ పాపులర్ అయ్యింది గీతూ. సోషల్ మీడియా ఇన్ఫులేన్సర్గా గుర్తింపు తెచ్చుకుని బిగ్‌బాస్ 6వ సీజన్ ఆఫర్ కొట్టేసింది. అలా హౌజ్‌లో అడుగు పెట్టిన ఆమె తనదైన ఆట తీరుతో 9 వారాల పాటు ఎంటర్టైన్ చేసింది. ఈ నేపథ్యంలో గీతూ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ఆమె పారితోషికంగా ఎంత అనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో గీతూ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం... గీతూకి వారానికి రూ. 25వేల చొప్పున పారితోషికం అందిందని తెలుస్తోంది. అలా 9 వారాలకు రూ. 2.5 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే అందరి కంటే బాగా ఆడిన గీతూకి ఇంత తక్కువ పారితోషికం ఏంటని ఆమె ఫాలోవర్స్ అభిప్రాయ పడుతున్నారు. కాగా హౌజ్‌లో రేవంత్, బాలాదిత్య, నేహా చౌదరి, శ్రీసత్య, కీర్తి, వాసంతి, ఇనయ సుల్తానా, రోహిత్, మెరినా, సూర్యల కంటే గీతూ రెమ్యునరేషన్యే తక్కువనే చర్చ కూడా జరుగుతోంది. గీతూ కొంపముంచింది అదేనా? అయితే గీతూ ఆహం ఎక్కువ అనే విషయం తెలిసిందే. అన్ని తనకే తెలుసు అన్నట్టుగా హౌజ్‌లో టాస్క్‌లో ఆమె వ్యవహరించేది. అంతేకాదు టాస్క్‌ల్లో తన బుద్దిబలంతో పాటు తన అతి తెలివి వాడి రూల్స్ మార్చేది. ఇలా ఓసారి హోస్ట్ నాగార్జున చేతిలో చీవాట్లు కూడా తింది. ఇక ఆమె అతి వల్లే గీతూకి నెగిటివిటీ వచ్చిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు హౌజ్ పనుల విషయంలో బద్ధకంగా చూపించడం.. తనకు కెటాయించిన పనిని కూడా సరిగ చేయకుండ పక్కవారితో చేయించేది. ఏం చెప్పిన తనకు ఓసీడీ అంటూ తప్పించుకునేది. శ్రీహాన్ కెప్టెన్సీలో గీతూ చేసిన తప్పిదం వల్లే అతడు ఈ వారం కంటెండర్‌గా అనర్హుడయ్యాడు. ఇది పక్కన పెడితే శ్రీహాన్ గీతూతో సింగిల్‌గా వాష్‌రూమ్ క్లీనింగ్ చెపిస్తానంటూ హోస్ట్‌కు మాటిచ్చాడు. కనీసం అది కూడా దృష్టిలో పెట్టుకొకుండా గీతూ తన పని చేయకుండ ఆదిరెడ్డితో చేయించింది. దీంతో శ్రీహాన్ ఈవారం కెప్టెన్సీ కంటెండర్ పోటీకి అనర్హుడు అయ్యాడు. అతడి ఫ్యాన్స్ నుంచి కూడా గీతూకి వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: స్టార్ హీరో విక్రమ్‌కు గోల్డెన్ వీసా.. నటి పూర్ణ భర్తకు సంబంధం ఏంటీ? పరిస్థితి మరింత దిగజారింది: రష్మిక ఎమోషనల్ పోస్ట్ -
దానివల్ల ఎలిమినేట్ అయ్యానంటే ఒప్పుకోను: గీతూ
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక బిగ్‌బాస్ కెఫెలో యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది గీతూ రాయల్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'తప్పును నిర్భయంగా తప్పని చెప్పే సత్తా నాకుంది. నన్ను అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ జనాలకు నేను నచ్చలేదేమో, నేను మాట్లాడింది రూడ్‌గా అనిపించినట్లుంది. అయినా అందరితో నేను చాలా ప్రేమగానే ఉన్నాను. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. బాలాదిత్యతో సిగరెట్ల విషయంలో నేను తప్పు చేయలేదు. ఆ చిన్న గొడవ వల్ల బయటకు వచ్చానంటే నేను ఒప్పుకోను. అయినా టాప్ టెన్‌లో కూడా లేనంటే నేను ఓడిపోయినట్లే. ఆదిరెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను ఎంతో బాగా అర్థం చేసుకున్నాడు. మనుషుల గురించి, లైఫ్ గురించి, సమయం గురించి అన్నీ బిగ్‌బాస్‌కు వచ్చాకే తెలిసింది. ఎవరెళ్లిపోతారని ఊరికే గెస్ చేసేదాన్ని. అందరి గురించి రివ్యూలు చెప్పే నేను నా గురించి నేను సరిగా రివ్యూ ఇవ్వలేకపోయాను' అని ఎమోషనలైంది గీతూ. అనంతరం యాంకర్ శివ మాట్లాడుతూ.. షో తర్వాత కూడా ఎవరితో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావు? ఎవరితో చేయకూడదనుకుంటున్నావు? అని అడిగాడు. దీనికి గీతూ బదులిస్తూ.. ఆదిరెడ్డి, శ్రీసత్య, బాలాదిత్య, శ్రీహాన్, ఫైమా, రేవంత్‌లను జీవితాంతం వదలనంది. మెరీనా, రాజ్, ఇనయ, వాసంతి, కీర్తి, రోహిత్‌లతో బంధం ఏమీ వద్దని వారి ఫొటోలు పగలగొట్టింది. చదవండి: కంటెంట్ క్వీన్ ఎలిమినేట్ అవడానికి కారణాలివే! బిగ్‌బాస్: బద్ధ శత్రువుల్లా దోస్తులు -
చచ్చేదాకా రుణపడి ఉంటా: గీతూ రాయల్ పోస్ట్ వైరల్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ఎక్కువగా మార్మోగిపోయిన కంటెస్టెంట్ గీతూ రాయల్. మొదటి నుంచీ తన గురించే ఎక్కువ చర్చ జరిగింది. ప్రోమోలు కూడా తన మీదే ఎక్కువగా వచ్చేవి. గేమ్ కోసం ఏది చేయడానికైనా రెడీ అంటూ ముందుండేది గీతూ. కానీ గేమ్ గెలవడం కోసం ఒకరి మనసును నొప్పించడానికి కూడా వెనుకాడేది కాదు. ఇది చాలామందికి నచ్చలేదు. ఆటలో గెలవడం ముఖ్యం కాదు, ఎలా ఆడామన్నది ముఖ్యమని వాదించారు. గత రెండు వారాలుగా గీతూ స్వయంగా తనంతట తానే గేమ్‌ను నాశనం చేసుకుంది. నెగెటివిటీ మూటగట్టుకుంది. నన్ను ఏడిపించు చూద్దాం అంటూ పదేపదే సవాలు చేసిన గీతూకు బాధను పరిచయం చేశాడు బిగ్‌బాస్. గెలుపు తప్ప ఎలిమినేషన్ గురిచి కలలో కూడా ఊహించని గీతూను ఎలిమినేట్ చేసి షాకిచ్చాడు. తానిక బిగ్‌బాస్ హౌస్‌లో ఉండకూడదన్న ఊహనే భరించలేకపోయింది రాయలక్క. బిగ్‌బాస్‌ను వదిలి ఇంటికి వెళ్లను అంటూ తల్లడిల్లిపోయింది. దీంతో వేరే మనుషులు ఆమెను ఓదార్చుతూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోవాల్సి వచ్చింది. ఎలిమినేషన్ తర్వాత గీతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'నా జీవితంలో బిగ్‌బాస్ అత్యంత అందమైన ఫేజ్. కానీ అందులో నేను ఓడిపోయాను. మనుషుల విలువ తెలిసింది. నా తప్పులని క్షమించండి ప్లీజ్.. నన్ను నన్నుగా అర్థం చేసుకుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ చచ్చిపోయేవరకు రుణపడి ఉంటాను' అని రాసుకొచ్చింది. 'మీ అందరినీ నిరాశపర్చినందుకు క్షమించండి. నా వల్ల బిగ్‌బాస్ మీద చిరాకు వచ్చిన వాళ్లకు కూడా పెద్ద సారీ' అంటూ ఏడుస్తున్న ఎమోజీలను క్యాప్షన్‌లో జోడించింది. ఈ పోస్ట్‌పై ఆమె అభిమానులు స్పందిస్తూ.. నువ్వు లేని బిగ్‌బాస్ షోను ఎలా చూడగలమని కామెంట్లు చేస్తున్నారు. 'ఒక కంటెస్టెంట్ వెళ్లిపోతుంటే మా కళ్లల్లో నీళ్లు తిరగడం ఇదే మొదటిసారి', 'అన్‌ఫెయిర్ ఎలిమినేషన్', 'మిమ్మల్ని చాలా మిస్ అవుతాం' అని విచారం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_) చదవండి: ఇనయను మళ్లీ ఆడుకున్న ఆదిరెడ్డి, నామినేషన్స్‌లో ఎవరెవరంటే? కంటెంట్ క్వీన్ గీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! -
నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్.. గుండె పగిలేలా ఏడ్చిన గీతూ
Bigg Boss 6 Telugu, Episode 64: గెలుపు కోసం తాపత్రయపడింది, ఎలాగైనా గెలిచి తీరాలనుకుంది. తనమన బేధాలు చూడకుండా గేమ్ ఆడింది. కలలో కూడా బిగ్‌బాస్‌నే కలవరించింది. అందరికీ ఆదర్శంగా నిలవాలనుకుంది. ఎవ్వరేమన్నా లెక్క చేయకుండా ముందుకు వెళ్లింది. భుజబలం కంటే బుద్ధి బలాన్నే ఎక్కువగా వాడుతూ తొమ్మిది వారాలు హౌస్‌లో కొనసాగింది. కళ్లు మూసినా, తెరిచినా కప్పు అందుకున్నట్లే అని పగటి కలలు కంది. కానీ చివరికి అది నిజంగానే పగటి కలగా మిగిలిపోయింది. ఊహించని ఎలిమినేషన్‌తో ఆమె గుండె ముక్కలయ్యింది. మరి ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయే చివరి క్షణాల్లో ఏం మాట్లాడిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నాగార్జున రావడంతోనే హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు. మీ గేమ్‌లో పాములా కాటేసేది ఎవరు? నిచ్చెనలా సాయపడేది ఎవరని అడిగాడు. దీనికి కంటెస్టెంట్లు ఏమని సమాధానమిచ్చారంటే.. ముందుగా బాలాదిత్య.. గీతూ పాము, ఆదిరెడ్డి నిచ్చెన అని చెప్పాడు. ఆదిరెడ్డి.. శ్రీహాన్ పాము, గీతూ నిచ్చెన గీతూ.. బాలాదిత్య పాము, ఆది నిచ్చెన ఫైమా.. ఇనయ పాము, గీతూ నిచ్చెన ఇనయ.. ఆది పాము, గీతూ నిచ్చెన రాజ్.. ఆది పాము, ఫైమా నిచ్చెన రోహిత్.. గీతూ పాము, మెరీనా నిచ్చెన శ్రీహాన్.. ఇనయ పాము, రేవంత్ నిచ్చెన రేవంత్.. వాసంతి పాము, శ్రీహాన్ నిచ్చెన వాసంతి.. శ్రీహాన్ పాము, ఆది నిచ్చెన కీర్తి.. శ్రీహాన్ పాము, మెరీనా నిచ్చెన మెరీనా.. గీతూ పాము, ఆది నిచ్చెన శ్రీసత్య.. ఫైమా పాము, గీతూ నిచ్చెన అని చెప్పుకొచ్చారు. ఇక ఇనయను ప్రాంక్ చేశాడు నాగ్. నువ్వు ఎవరి కోసం ఎదురుచూస్తున్నావో తెలుసు అంటూ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయమన్నాడు. దీంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లగా అక్కడ సూర్య ఫొటో మాత్రమే ఉంది. దానికి ముద్దులు పెట్టి ఎమోషనలైంది. నువ్వు అనుకుంటున్నట్లు సూర్య సీక్రెట్ రూమ్‌లో లేడని, ఇంట్లో బుజ్జమ్మతో ఉన్నాడని గాలి తీశాడు. ముందు నీ గేమ్ మీద ఫోకస్ చేయమని హితవు పలికాడు. నాగ్ నామినేషన్లో ఉన్న అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో సత్య, గీతూ ఇద్దరూ మిగిలారు. గీతూ యూ ఆర్ ఎలిమినేటెడ్ అనగానే రాయలక్క ఆ మాట వినలేక చెవులు మూసుకుంది. నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవుదామనుకుంటే పంపించేస్తున్నారేంటి బిగ్‌బాస్ అని ఏడ్చేసింది. నేను బాధపెట్టి ఉంటే ఐయామ్ సారీ అని వెక్కి వెక్కి ఏడ్చింది గీతూ. నువ్వు నాకు బిగ్‌బాస్ ఇచ్చిన గిఫ్ట్ అని ఆదిని పట్టుకుని ఎమోషనలైంది. ఐ లవ్ యూ బిగ్‌బాస్, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు పోవాలని లేదు, వెళ్లను అని బోరుమని ఏడ్చింది. ఆమె వెళ్లిపోతుంటే రేవంత్, ఫైమా, సత్య, శ్రీహాన్, బాలాదిత్య, ఆదిరెడ్డి అందరూ దుఃఖం ఆపుకోలేకపోయారు. ప్రతి నిమిషం ప్రాణం పెట్టి ఆడాను. నిద్రలో కూడా బిగ్‌బాస్ షో గెలవాలనే అనుకున్నా. కానీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని కలలో కూడా అనుకోలేదంటూ నాగార్జున ముందు కన్నీరు పెట్టుకుంది గీతూ. ఆమెను ఓదారుస్తూ షో బ్రేకర్స్ ఎవరు? షో మేకర్స్ ఎవరు? అనే గేమ్ ఆడించాడు నాగ్. అందులో భాగంగా గీతూ.. ఆది, రేవంత్, సత్య, ఫైమా, శ్రీహాన్‌ల వల్ల షో ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని చెప్పింది. ఆదిరెడ్డి అంత మంచోడిని నేనెప్పుడూ చూడలేదని, ఫైమాకు చాలా తెలివితేటలు ఉన్నాయంది. తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడ్డానంది. ఇనయ, మెరీనా, రోహిత్, రాజ్, కీర్తిల గేమ్ తక్కువగా ఉందనిపించిందని చెప్పుకొచ్చింది. తర్వాత ఆది మాట్లాడుతూ.. గీతూ ఒక యునిక్ కంటెస్టెంట్, 24 గంటలు గేమ్ గురించే ఆలోచించి, గేమ్‌లో రిలేషన్స్ కూడా చూడని ఆ కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ హౌస్ బయట చూడటం బాధగా ఉందని ఎమోషనలయ్యాడు. చివరగా రేవంత్.. వాలుకనుల దానా నీ విలువ చెప్పు మైనా.. అంటూ గీతూకోసం పాటందుకోవడంతో ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. నేనిక్కడి నుంచి పోను, ఇక్కడే ఉంటానని వేడుకుంది. కానీ ఒక్కసారి ఎలిమినేట్ అయ్యాక తనను బయటకు పంపించడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా అలాగే నిల్చుండిపోయాడు నాగ్. చదవండి: గీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! గీతూ కోసం ఏడ్చేసిన శ్రీహాన్, ఫైమా -
కంటెంట్ క్వీన్ ఎలిమినేట్ అవడానికి కారణాలివే!
బిగ్‌బాస్ షోను ఇష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఈసారేంటో సీజన్ అస్సలు బాలేదని ఎంతోమంది పెదవి విరుస్తున్నారు. అలాంటివారికోసం కావాల్సినన్ని గొడవలు, కొట్లాటలు, మైండ్ గేమ్‌లతో ముందుకొచ్చింది గీతూ రాయల్. నేనుండగా సీజన్ ఫ్లాప్ కానిచ్చేది లేదని కంకణం కట్టుకుంది. ఫిజికల్‌గా ఆడకపోయినా బుద్ధిబలంతో ఆడతా, మిగతావారిని కూడా ఆటాడిస్తానంది. అలా అని అందరినీ మోటివేట్ చేసి ఆడించలేదు. రెచ్చగొట్టి, టార్గెట్ చేసి, ఎత్తుకు పైఎత్తులు వేసి, ఎమోషన్స్ హర్ట్ చేసి ఆడించాలనుకుంది. ఈ క్రమంలో తనపై ఎక్కడలేని నెగెటివిటీ పోగయ్యింది. ఎమోషన్స్‌తో ఆడుకోవడమేంటని బాహాటంగానే విమర్శలు వచ్చాయి. కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకోక తప్పదు, గీతూ ఇదంతా కేవలం ఆటలో భాగంగానే చేసింది. బిగ్‌బాస్‌కు వచ్చాక తనకు గేమే సర్వస్వం అనుకుంది. గేమ్ తర్వాతే ఎవరైనా అని ఎప్పుడో చెప్పేసింది, అదే ఆచరించింది కూడా! అసలు గీతూ కంటే కూడా గేమ్ ఆడని కంటెస్టెంట్లు హౌస్‌లో చాలామంది ఉన్నారు. కానీ గత రెండు వారాలుగా ఆమె చేజేతులా తన గేమ్‌ను నాశనం చేసుకుంది. ముఖ్యంగా గీతూ- సత్య కాంబినేషన్ చాలామందికి నచ్చలేదు. పూల టాస్కులో వీళ్లు మిగతావాళ్లతో పోలిస్తే అంతగా ఆడలేదు, కానీ నోరు పారేసుకోవడంలో ముందున్నారు. చేపల చెరువు టాస్కులో ఇనయ- రేవంత్ బాగా ఆడారు. ఈ గేమ్‌లో సంచాలక్‌గా గీతూ హద్దులు మీరి ఆడటం, మెరీనా- బాలాదిత్యలను టార్గెట్ చేయడం, చివర్లో రేవంత్ చేపలన్నీ శ్రీసత్య- శ్రీహాన్‌లకు వచ్చేలా చేయడం వారి అభిమానులకు నచ్చలేదు. ఎప్పుడైతే మిషన్ పాజిబుల్ టాస్క్ ఇచ్చారో గీతూ, సత్యలపై నెగెటివిటీ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఈ టాస్క్‌లో రెండు టీమ్స్‌గా విడిపోమనగానే శ్రీసత్య ఎలాంటి చర్చ పెట్టకుండా తనకు నచ్చినవారి పేర్లు టకటకా చెప్పేసి తామంతా రెడ్ టీమ్‌లో ఉంటామంది. రెడ్ టీమ్ సభ్యులు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుని ఆటాడారు. ఇందులోనూ గీతూ గేమ్ ఎక్కువ హైలైట్ అయింది. బాలాదిత్యను ఏడిపించడం, ఆదిరెడ్డిని మోసం చేయడం ఆమెకు నెగెటివ్ అయింది. ఆమె వల్ల ఆదిరెడ్డి కెప్టెన్సీకి పోటీపడే అవకాశం కోల్పోగా, నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్ పూర్తి చేయకపోడంతో గతవారం కెప్టెన్ అయిన శ్రీహాన్ నెక్స్ట్ వీక్ కెప్టెన్సీకి పోటీపడే ఛాన్స్ మిస్సయ్యాడు. అలా ఆమె తప్పుల వల్ల ఇతరులు బాధపడ్డారు. ఒకానొక దశలో గీతూ బిగ్‌బాస్ ఆదేశాలను కూడా వినిపించుకోని స్థాయికి వెళ్లిపోయింది. బొచ్చులో ఆట అని నాగార్జున విమర్శించాక కూడా ఆమె తన తీరు మార్చుకోకపోవడంతో ఇలాంటి చేదు ఫలితం అనుభవించాల్సి వచ్చింది. కానీ బిగ్‌బాస్ చరిత్రలో గీతూ లాంటి కంటెస్టెంట్లు మాత్రం చాలా అరుదుగా వస్తుంటారు. చదవండి: గీతూ అవుట్, ఏడ్చిన శ్రీహాన్, ఫైమా -
గీతూ అవుట్! ఏడ్చేసిన శ్రీహాన్, ఫైమా
ఒక్కసారి ఆటలో దిగాక తల్లీదండ్రులను కూడా లెక్క చేయనని తేల్చి చెప్పింది గీతూ. తనకు బిగ్‌బాస్ గేమ్ తర్వాతే ఏదైనా అని తెగేసి చెప్పింది. అన్నట్లుగానే గేమ్ కోసం తనకు దగ్గరైనవాళ్లను ఇబ్బంది పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. కానీ ఆమె ఏం చేసినా ఆట కోసమే చేసింది. బిగ్‌బాస్ అంటే అంత పిచ్చి గీతూకు. అయితే గీతూ ఆటతీరు లోపల కంటెస్టెంట్లనే కాదు జనాలను కూడా ఇబ్బంది పెట్టింది. ఒకరి బలహీనతలతో ఆడుకోవడం, కొందరిని టార్గెట్ చేయడం ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. తనకు బుద్ధిబలం ఉన్నా దాన్ని సరిగా వాడుకోలేదు. ఫలితంగా ఈ వారం ఆమె ఎలిమినేట్ అవబోతోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో హౌస్‌మేట్స్‌తో ఫన్ గేమ్ ఆడించి వారికి రిలాక్స్ చేశాడు నాగ్. అందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చాక చివర్లో సత్య, గీతూ ఇద్దరే మిగిలారు. అయితే ఎవరికి వారు తాము సేవ్ అవుతామన్న ధీమాతోనే కనిపిస్తున్నారు. కానీ చివరగా గీతూ ఎలిమినేట్ కానుందన్న విషయం మనందరికీ తెలిసిందే! తను వెళ్లిపోవడంతో ఫైమా, శ్రీహాన్ కంటతడి పెట్టుకున్నారు. చదవండి: అడ్డంగా దొరికిన ఇనయ, గీతూ వల్ల శ్రీహాన్‌కు పనిష్మెంట్ షాకింగ్, గలాటా గీతూ ఎలిమినేట్ -
అడ్డంగా దొరికిన శ్రీహాన్, ఇనయ.. గీతూ వల్ల అతడికి పనిష్మెంట్!
Bigg Boss Telugu 6, Episode 63: ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో రెడ్, బ్లూ టీమ్ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమని గీతూ, ఆదిరెడ్డిలను ఆదేశించాడు నాగ్. బ్లూ టీమ్ లీడర్ ఆది రెడ్డి.. రాజ్ ఫస్ట్, ఇనయ సెకండ్ అని చెప్పి మెరీనా, వాసంతి, బాలాదిత్య, రోహిత్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంకులిచ్చాడు. తనకు ఏడో ర్యాంకు ఇచ్చుకున్నాడు ఆది. ఈ సందర్భంగా నాగ్.. సిగరెట్ల కోసం గీతూను నానామాటలు అన్నావు, సిగరెట్ తాగగానే సారీ చెప్పావు అంటూ బాలాదిత్య మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో అతడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక మీదట సిగరెట్ ముట్టుకోనని శపథం చేశాడు. ఆట అయిపోయాక బాలాదిత్య బలహీనత మీద ఆడుకోవడం కరెక్ట్ కాదని గీతూకు కూడా హితవు కలిపాడు నాగ్. రెడ్ టీమ్ లీడర్ గీతూ.. శ్రీహాన్‌కు ఫస్ట్, ఫైమాకు సెకండ్, శ్రీసత్య, రేవంత్, కీర్తిలకు మూడు, నాలుగు, ఆరో ర్యాంకులిచ్చింది. తనకు తాను మాత్రం ఐదో ర్యాంకిచ్చుకుంది. రేవంత్ ఉన్మాదిలా ఆడిన వీడియోను చూపించాడు నాగ్. అందులో అతడు ఇనయను బలంగా నెట్టేశాడు. నువ్వు ఇంకా నీ కోపాన్ని తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత శ్రీహాన్‌ను.. కెప్టెన్సీలో నువ్వేం పొడిచావో చెప్పమని అడగడంతో అతడు నీళ్లు నమిలాడు. లాస్ట్ వీక్ గీతూకు వాష్‌రూమ్స్ కడగాలని ఇచ్చిన పనిష్మెంట్ ఎందుకు తగ్గించావని ప్రశ్నించాడు. ఆదిరెడ్డి సాయం చేస్తుంటే చూస్తూ కూర్చున్నావెందుకని నిలదీశాడు. వీడియో వేసి మరీ చూపించడంతో అడ్డంగా దొరికిపోయిన శ్రీహాన్ తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. తప్పు చేసినందుకు ఫలితంగా నెక్స్ట్ వీక్ కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయావన్నాడు నాగ్. అనంతరం బ్లూ టీమ్‌లో ఆది, రెడ్ టీమ్‌లో గీతూకు వరస్ట్ పర్ఫామర్ ట్యాగిచ్చాడు. తర్వాత ఆది, కీర్తి, రేవంత్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. ఇక బిగ్‌బాస్ ఇంటి విషయాల గురించి నాగ్ మాట్లాడుతూ.. ఇంట్లో ఫుడ్ సరిపోవట్లేదంటున్నారు. ఆల్రెడీ మీకు కావాల్సినంత ఫుడ్ బిగ్‌బాస్ పంపిస్తూనే ఉన్నాడు. అయినా ఎందుకా సమస్య తలెత్తుతోందని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. వేస్ట్ చేసిన ఫుడ్ వీడియోను చూపించి తప్పు మీ దగ్గరే ఉందని నిందించాడు. తనను టార్గెట్ చేస్తున్నారని పదే పదే వాదిస్తున్న ఇనయ తనకు ఏదైనా కావాలంటే ముందుగా కెప్టెన్‌కు చెప్పమని సూచించాడు. అందరూ రెండుసార్లు టీ తాగినంత మాత్రాన నీకు రెండుసార్లు పాలు ఇవ్వడం ఎలా కుదురుతుందని ప్రశ్నించాడు. ఇకపోతే శ్రీహాన్‌ను నువ్వెక్కడ పడుకుంటున్నావో చూస్తున్నా అనడం తప్పని స్పష్టం చేశాడు. దానికి ఇనయ తాను వేరే ఇంటెన్షన్‌తో అన్నానని ఆన్సరివ్వగా కెమెరాలు చూస్తున్నాయి, ఎంత కవర్ చేసినా దొరుకుతావు ఇనయ.. అని గద్దించాడు. దీంతో ఆమె కిమ్మనకుండా సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రేపటి ఎపిసోడ్లో గీతూ ఎలిమినేట్ అవగా నేను వెళ్లనంటూ ఏడుపందుకుందట. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. The weekend heat is on 🔥 @iamnagarjuna confronts the housemates on this week's happenings! Don't miss tonight's exciting episode of #BiggBossTelugu6 on @StarMaa & @DisneyPlusHSTel.#BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/NjDGUcR07T — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 5, 2022 చదవండి: షాకింగ్ ఎలిమినేషన్, గీతూ రాయల్ అవుట్ ఇనయపై సూర్య ప్రతీకారం? ఆ పోస్ట్‌తో క్లారిటీ! -
బాలాదిత్య అన్న ఒకే ఒక్క మాటతో నా గుండె పగిలింది: గీతూ
బిగ్‌బాస్ షోలో ఏ బంధమైనా తనకు ఆట తర్వాతే అంది గీతూ. అందుకే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో బిగ్‌బాస్ భుజబలమే కాదు బుద్ధి బలం కూడా వాడొచ్చు.. అన్న ఒక్క పాయింట్‌ను పట్టుకుని గేమ్‌ను ఎన్నో మలుపులు తిప్పింది. మొదటగా బాలాదిత్య వీక్నెస్ అయిన సిగరెట్లను దాచేసి అతడిని నానా హింసించింది. గేమ్‌లోనూ, గేమ్ అయిపోయాక కూడా సిగరెట్లు ఇచ్చేదేలేదని మొండికేసింది. ఈ గొడవను వీకెండ్లో లేవనెత్తాడు నాగ్. ముందుగా బ్లూ టీమ్ లీడర్‌ను తన టీమ్ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమన్నాడు. ఆదిరెడ్డి.. బాలాదిత్యకు 5వ ర్యాంకిచ్చాడు. దీంతో నాగ్.. నీకేసిన నంబర్ కూడా సిగ్గుపడి వెనక్కు తిరిగిందని బాలాదిత్య పరువు తీశాడు. సిగ్గుండాలి, మనిషివేనా, ప్రేమతో ఆడుకుంటావా? ఇంగిత జ్ఞానం ఉందా?... ఆఫ్టరాల్ సిగరెట్ కోసం ఇన్ని మాటలు అనాలా? అని అడిగాడు నాగ్. అవన్నీ కోపంలో అనలేదని, బాధతో అలా మాట్లాడానని సంజాయిషీ ఇచ్చుకున్నాడు బాలాదిత్య. అటు గీతూ మాత్రం.. 'ఎన్ని మాటలన్నా ఫీలవలేదని, కానీ.. ఇన్నిరోజులు నువ్వు నటిస్తున్నావంటే నేను నమ్మలేదు, ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది అన్న ఒక్క మాటకు నా గుండె పగిలిపోయింది సర్' అని ఆన్సరిచ్చింది. ఆటలో సిగరెట్లు దాచడం కరెక్టే, కానీ ఆట అయిపోయాక కూడా అతడి బలహీనత మీద ఆడుకోవడం సరికాదని చెప్పాడు నాగ్. చదవండి: ఇనయపై సూర్య ప్రతీకారం, ఆ పోస్టులతో క్లారిటీ! గీతూ రాయల్ ఎలిమినేట్ -
షాకింగ్ ఎలిమినేషన్: గీతూకి బిగ్‌బాస్ దెబ్బ!
బిగ్‌బాస్ హౌస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. టాప్ 5లో ఉంటాడనుకున్న సూర్య గతవారమే ఎలిమినేట్ కాగా ఏకంగా విన్నర్ అయిపోతానని ఊహల్లో తేలిపోయిన గీతూ రాయల్ అనూహ్యంగా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్‌బాస్ కొట్టిన దెబ్బకు కంటెస్టెంట్లు నోరెళ్లబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి గీతూ తన గేమ్‌ను చేజేతులా నాశనం చేసుకుంది. మొదట్లో గీతూ వల్లే ఈ సీజన్ అంతో ఇంతో ఇంట్రస్ట్‌గా మారింది. ఆమెపైనే ఎక్కువగా ప్రోమోలు వచ్చేవి. నాగార్జున కూడా గీతూ గేమ్‌ను మెచ్చుకునేవాడు. కానీ ఆ విజయాన్ని నెత్తికెక్కించుకుంది రాయలక్క. కంటెస్టెంట్లే కాదు, బిగ్‌బాస్ చెప్పినా వినేదే లేదంటూ తనకు నచ్చినట్లు అడ్డదిడ్డంగా గేమ్ ఆడటం మొదలుపెట్టింది. బుద్ధిబలం వాడుతున్నానంటూ పదేపదే తనను నమ్మిన వారి ఎమోషన్స్‌ను దెబ్బతీసింది. గేమ్‌లోనూ కొత్త కొత్త రూల్స్ పెడుతూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన అటు ప్రేక్షకులకే కాదు బిగ్‌బాస్‌కి కూడా కోపం తెప్పించింది. దీంతో నాగ్.. నీ గేమ్ బొచ్చులో ఆటలా ఉందని చీదరించుకున్నాడు, పద్ధతి మార్చుకోమని సూచించాడు. అయినా తన తీరు మార్చుకోని గీతూ ఈవారం మరింత రెచ్చిపోయింది. తనను నమ్మిన ఏకైక వ్యక్తి ఆదిరెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచింది. ఆమె స్ట్రాటజీలు, లూపులు వెతుక్కుని గేమ్ ఆడటాలు చూసి జనాలకు విసుగుపుట్టింది. ఫలితంగా ఆమెను ఈ వారం ఇంటి నుంచి బయటకు పంపిచేశారు. చదవండి: ఇనయపై పగపట్టిన రేవంత్, ఈ వీడియోనే సాక్ష్యం -
ఇనయపై రేవంత్ దాడి, ఈ వీడియో సాక్ష్యం!
Bigg Boss Telugu 6, Episode 62: నేను వెధవను, వెధవన్నర వెధవను, దొంగను, నన్ను నమ్మొద్దు అని అందరి ముందే అరిచి మరీ చెప్పింది గీతూ. ఆటలో తనమన బేధాలు లేవని కుండ బద్ధలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. కానీ ఆదిరెడ్డి వినిపించుకోలేదు. గీతక్క గీతక్క అంటూ నెత్తినెక్కించుకున్నాడు. చివరికి అతడికి వెన్నుపోటు పొడిచి గుణపాఠం నేర్పింది. ఇంతకీ మిషన్ పాజిబుల్ గేమ్‌లో ఏం జరిగింది. గీతూ వల్ల ఆది గేమ్ ఏమైంది? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! రాత్రిపూట టీషర్ట్లు కొట్టేయకూడదు అని రెండు టీముల లీడర్లైన ఆది, గీతూ ఒప్పందం చేసుకున్నారు. కానీ గీతూ మాత్రం అప్పటికే దొంగతనం ప్లాన్ వేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గీతూ గేమ్‌లో లేదు, అయినా సరే ఆది రెడ్డి టీషర్ట్ లేపేసింది. తెల్లారాక నిజం తెలుసుకున్న ఆది.. నాతో పర్సనల్‌గా ఆడావు అంటూ గీతూమీద నిప్పులు చెరిగాడు. అటు గీతూ మాత్రం.. బుద్ధి బలం వాడామంటూ అదేపనిగా డప్పు కొట్టుకుంది. నీ మంచితనమే వీక్నెస్, దానిమీదే కొట్టానంది. మరోపక్క గేమ్‌లో హౌస్మేట్స్ నిజంగానే కొట్టుకున్నారు. ఇనయ అవతలివాళ్లను కాళ్లతో విదిలించునేందుకు ప్రయత్నించగా రేవంత్ ఆమెను అవతల పడేశాడు. ఇంటెన్షల్‌గా కొడుతున్నారని ఇనయ అరిచి గోల చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అనంతరం బిగ్‌బాస్.. చనిపోయిన సభ్యులు భౌతికంగా పాల్గొనలేరని గీతూకు చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు. చనిపోయిన గీతూ.. ఆదిరెడ్డి టీషర్ట్ తీసింది కాబట్టి అతడు చనిపోలేదన్నాడు. కానీ మైక్ విసిరేసిన కారణంగా ఆదిరెడ్డిని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగించి షాకిచ్చాడు. తర్వాత మిషన్ పాజిబుల్ టాస్క్ పూర్తైనట్లు ప్రకటించాడు. తన వల్ల గేమ్‌లో అవుట్ అయినందుకు ఆదికి అదే పనిగా సారీ చెప్పింది గీతూ. అయినా క్షమించడానికి మనసొప్పని ఆది.. త్వరలో నిన్ను ఏడిపిస్తా, అదే నేను కొట్టబోయే దెబ్బ అని ప్రతీకార శంఖం పూరించాడు. మరోవైపు ఇనయ.. ఇంట్లో అందరికీ శత్రువునైపోయా, ఎమోషనల్‌గా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అంటూ తనలో తనే బాధపడింది. అటు గీతూ కూడా మనసంతా బాధగా ఉందని కంటతడి పెట్టుకుంది. బయట నాకు ఎన్నో వెన్నుపోట్లు, ఇక్కడ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నారు. వారి ప్రేమ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదిరెడ్డి నమ్మకం మీద కొట్టాను, అతడిని క్షమించమని అడుగుతాను అంటూ పడుకున్న వ్యక్తిని లేపి మరీ సారీ చెప్పింది గీతూ. మిషన్ పాజిబుల్ టాస్క్ డ్రా అవడంతో రెండు టీమ్ లీడర్లు కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్ల పేర్లు చెప్పమన్నారు. దీంతో రెండు టీమ్స్.. అందరు అమ్మాయిల పేర్లు చెప్పారు. అలా బెలూన్ కాపాడుకునే టాస్క్‌లో శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఫైమా, వాసంతి, గీతూ పోటీపడ్డారు. ఫైనల్‌గా శ్రీసత్య గెలిచి కెప్టెన్ అయింది. దీంతో ఆమె సంతోషంలో మునిగి తేలగా మిగతావారు మాత్రం కెప్టెన్సీ చేజారిపోయిందని బాధపడ్డారు. అయితే ఇనయ, రేవంత్ ఫైట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇనయ(#Inaya) హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. Does this not warrant RED CARD to a RED CHIP fellow ఛీVanth? 🤔#BiggBossTelugu6pic.twitter.com/osMqfhiBf5 — Naresh Reddy (@BBNTANALYST) November 4, 2022 Ma #Revanth annaw chala maaradu Yes, isari ammailaki bayapaddadu last ki🤣🤣🤣 Kani unmadhi lage behave chestunnadu inka #Inaya #Vasanthi #Marina#BiggBoss6Telugu #BiggBoss #BiggBossTelugu pic.twitter.com/XiRFlfprJH — Power Ranger 💙 (@BluePoweRangerr) November 4, 2022 చదవండి: నీ భార్యతో రొమాన్సా? పిచ్చిపిచ్చిగా ఉందా?: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒంటినిండి గాయాల మచ్చలు, కాళ్లలో ఐరన్ రాడ్లు, ఆమె ఓ ఫైటర్ -
గీతూ చేసిన పనికి ఆదిరెడ్డిని శిక్షించిన బిగ్‌బాస్!
ఆకు వచ్చి ముళ్లు మీద పడ్డా, ముళ్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే.. ఈ సామెత ప్రస్తుతం ఆదిరెడ్డికి బాగా సెట్టయింది. గీతక్క గీతక్క అంటూ ఆమెను నమ్మినందుకు గేమ్‌లో వెన్నుపోటు పొడిచింది. ఆల్రెడీ తను అవుట్ అయినా సరే గేమ్ ఆడి ఆదికి కోపం తెప్పించి అతడు కూడా గేమ్‌లో లేకుండా చేసింది. ఆదిరెడ్డి ఆవేశంలో మైక్ విసిరేసినందుకు వారం అతడిని కెప్టెన్సీ టాస్క్‌కు అనర్హుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్. చేసిందంతా చేశాక కాళ్లబేరానికి వచ్చింది గీతూ. ఆది దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. నువ్వు చెప్పిన రూల్ నువ్వే ఫాలో కాలేదు, నీ వల్ల నేను చచ్చిపోయాను అని బాధపడ్డాడు ఆది. అనంతరం మెరీనా, వాసంతి, ఫైమా, గీతూ, సత్య, ఇనయ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. బెలూన్లు కాపాడుకునే టాస్క్‌లో శ్రీసత్య గెలిచి కెప్టెన్‌గా అవతరించింది. చదవండి: గీతక్కా, నీకు కన్నీళ్లు తెప్పిస్తా, చూడు..: ఉడాల్ మామ వార్నింగ్ ఆ హీరోతో ఒక్క సినిమా కూడా చేయని టబు -
గీతక్కా, నీకు కన్నీళ్లు తెప్పిస్తానని మాటిస్తున్నా: ఆది
బిగ్‌బాస్ సీజన్ 6లో శ్రీహాన్, ఇనయ గొడవ ఎంతో ఫేమస్. నామినేషన్స్ వస్తున్నాయంటే చాలు వీరి పోట్లాట చూద్దామని ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఆ రేంజ్లో ఉంటాయి వీరి గొడవలు. అయితే గీతూ, ఆదిరెడ్డి గొడవ పెట్టుకుంటే చూడాలని వెయిట్ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇన్నాళ్లకు వారి ముచ్చట తీరబోతోంది. ఈ రోజు గేమ్‌లో ఆది గీతూతో పోట్లాటకు దిగాడు. ఆటలో నమ్మించి గొంతు కోసిందని ఫ్రస్టేట్ అయ్యాడు ఆది. తన టీషర్ట్ స్ట్రిప్స్ దొంగతనం చేయనని మాటిచ్చి తీరా అదే పని చేసి ఆదికి ఝలక్ ఇచ్చింది గీతూ. ఇది తెలిసిన ఆది ఆవేశం ఆపుకోలేక తన టీషర్ట్ తీసేసి మైక్ విసిరికొట్టాడు. నువ్వు పర్సనల్‌గా ఆడావు అని ఫైర్ అయ్యాడు. నిన్ను ఏడిపించే రోజు దగ్గరలోనే ఉందని మాటిస్తున్నా, అదే నేను కొట్టే దెబ్బ అని రగిలిపోయాడు ఆదిరెడ్డి. కాగా గీతూ తనకు దగ్గరైన అందరినీ దూరం చేసుకుంటూ వస్తోంది. మొదట రాజ్‌తో మంచిగా ఉండి అతడితో కయ్యానికి దిగి దూరమైంది. తర్వాత బాలాదిత్యతో కావాలని గొడవలు పెట్టుకుంది. ఇప్పుడు ఉన్న ఒక్క ఫ్రెండ్ ఆదిరెడ్డని నమ్మించి మోసం చేసి అతడి కోపానికి కారణమైంది. మరోపక్క ఇనయ.. తనను కావాలని కొడుతున్నారని ఆరోపించింది. దీనికి శ్రీహాన్.. ఇంటెన్షన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అని ఎగతాళి చేశాడు. ఇకపోతే ఆల్రెడీ శ్రీసత్య కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: ఫ్లైట్ నుంచి దూకేశా: శర్వానంద్ ముంబై హీరోయిన్స్‌పై అడివి శేష్ షాకింగ్ కామెంట్స్ -
గీతక్క మాయలో ఆదిరెడ్డి, కొత్త కెప్టెన్ ఎవరంటే?
Bigg Boss 6 Telugu, Episode 61: బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతోంది. సీక్రెట్ మిషన్ టాస్క్‌లో భాగంగా రెడ్ టీమ్ కావాలనే బాత్రూమ్ను డర్చీగా మార్చింది. కానీ ఆ నిందను బ్లూ టీమ్ మేద వేయడంతో హౌస్‌లో రచ్చ రంబోలా జరిగింది. సీక్రెట్ గేమ్ సక్సెస్ కావడంతో బ్లూ టీమ్‌లో చనిపోయిన రోహిత్‌ను తిరిగి బతికించారు. మధ్యాహ్నం భోజనం సమయానికి సూర్య ప్లేటు కోసం ఇల్లంతా వెతికింది ఇనయ. ఎక్కడా కనిపించకపోవడంతో ప్లేటు మీద సూర్య పేరును ఎవరు చెరిపేశారు? అని నిలదీసింది. దీనికి బాలాదిత్య నువ్వు వాడుతున్నావనే చెరిపేశారని ఆన్సరిచ్చాడు. అది విన్న రేవంత్.. అలా అనడం తప్పంటూ అందుకున్నాడు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, సత్య ఏం అందో అదే చెప్పానని బదులిచ్చాడు. నా ఎమోషన్‌తో ఆడుకుంటున్నారని ఫైర్ అయిన ఇనయ అన్నం తిననంటూ ఓ మూలన కూర్చుని ఏడ్చింది. ఇది చూసిన శ్రీసత్య.. అంత ప్రేముంటే బిగ్‌బాస్‌ను అడిగి మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెళ్లిపోయి సూర్య ఇంట్లో కూర్చోమను అని వెక్కిరించింది. ఇనయ అలిగి ఏడుస్తూ కూర్చోవడంతో కీర్తి ఓదార్చగా మెరీనా గోరు ముద్దలు తినిపించింది. తర్వాత గేమ్ తిరిగి ప్రారంభం కాగా రెడ్ స్క్వాడ్‌లో రేవంత్ కంటికి గాయం అయింది. ఇంతలో గీతూ అవుట్ అయింది. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన రెండో మిషన్‌లో రెడ్ టీమ్ గెలవడంతో వారు రోహిత్‌ను తిరిగి చంపేశారు. ఇక ఈ రోజుకు టాస్క్ సమయం ముగిసిందన్నాడు బిగ్‌బాస్. అయితే రాత్రి టీ షర్ట్లు దొంగిలిద్దామని ప్లాన్ వేసింది గీతూ. కానీ ఆదిరెడ్డితో మాత్రం టాస్క్ ఆన్ అయ్యాకే తిరిగి గేమ్ స్టార్ట్ చేద్దామని మాయమాటలు చెప్పింది. అతడూ సరేనని నమ్మాడు. అలా అతడిని బురిడీ కొట్టించి అర్ధరాత్రి ఆది రెడ్డి టీషర్ట్ దొంగిలించింది గీతూ. తెల్లవారుజామున ఆదిరెడ్డికి గీతూ గేమ్ అర్థమైంది. గేమ్ పాజ్‌లో ఉన్నప్పుడు టీషర్ట్స్ స్ట్రాప్స్ తీసేయడం తప్పని వారించగా తానసలు తీయలేదని అబద్ధమాడింది గీతూ. గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుందని హెచ్చరించాడతడు. అయితే ఈ మిషన్ పాజిబుల్ గేమ్ డ్రా అయిందట. దీంతో రెండు టీమ్స్‌లోని మెరీనా, వాసంతి, ఇనయ, ఫైమా, సత్య, గీతూ కెప్టెన్సీ కోసం పోటీపడగా సత్య కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: బుజ్జమ్మ తన గర్ల్‌ఫ్రెండే కాదన్న సూర్య, ఇనయ లైన్ క్లియర్? -
ఇప్పుడసలైన మజా.. ఆదిరెడ్డి వర్సెస్ గీతూ గేమ్ స్టార్ట్!
బిగ్‌బాస్ ఇచ్చే గేమ్‌లో ఏవైనా లొసుగులు ఉన్నాయా? అని చూసే మొట్టమొదటి వ్యక్తి గీతూ. ఫిజికల్‌గా గేమ్ ఆడలేని ఆమె బుద్ధి బలంతో గేమ్‌ను రఫ్ఫాడించాలనుకుంటుంది. ఈ క్రమంలో అతి తెలివి ప్రదర్శించి నాగార్జునతో గతవారం చీవాట్లు కూడా తింది. ఇకపోతే నిన్నటివరకు బాలాదిత్య వీక్నెస్ మీద దెబ్బ కొట్టిన గీతూ ఈరోజు ఆదిరెడ్డితో గొడవ పెట్టుకునేట్లు కనిపిస్తోంది. బాత్రూమ్ ఏరియాలో ఆది టీషర్ట్ దాచుకుంటే వెళ్లి దాన్ని దొంగిలించింది గీతూ. పోనీ తను గేమ్‌లో ఉందా? అంటే లేదు. ఆల్రెడీ బ్లూ టీమ్ తనను అవుట్ చేసింది. అయినా సరే, ఆది టీషర్ట్ దొంగిలించి దాచేసింది. ఎవరు తీశారని అడిగితే తాను తీయలేదని చెప్పింది. కానీ ఆది మాత్రం ఆమె మీదే డౌట్ పడ్డాడు. ఒకవేళ గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుందని హెచ్చరించాడు ఆది. చదవండి: బుజ్జమ్మ సూర్య గర్ల్‌ఫ్రెండే కాదట, అంటే ఇనయ లైన్ క్లియర్ అయినట్లేనా? అంత ప్రేముంటే ఇప్పుడే సూర్య ఇంటికి వెళ్లిపోమను: శ్రీసత్య -
గీతూ చెత్త సంచాలక్, బాలాదిత్య చేతులెత్తి మొక్కినా..
Bigg Boss 6 Telugu, Episode 60: బిగ్‌బాస్ అంటే మైండ్ గేమ్ అని కొందరు, కాదు ఫిజికల్ గేమ్ అని మరికొందరు, ఆ రెండింటికన్నా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ బ్రదరూ అనేవాళ్లూ ఉన్నారు. కానీ కంటెస్టెంట్లలో కచ్చితంగా ఈ మూడు క్వాలిటీస్ ఉండాల్సిందే! దురదృష్టం కొద్దీ ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు హౌస్మేట్స్. ఫిజికల్ గేమ్ వచ్చినప్పుడు మైండ్ గేమ్, మైండ్ గేమ్ వచ్చినప్పుడు ఫిజికల్ గేమ్ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా టాస్క్ రాగానే వారి బలహీనతల మీద దెబ్బ కొట్టి రెచ్చగొట్టి పెంట చేస్తున్నారు. దీంతో గేమ్ స్పిరిట్ కంటే గొడవలే ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్ ద వార్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే గ్రనైట్ రెడ్ స్క్వాట్ ఆధీనంలో ఉండటంతో ఎవరెవరు పోటీపడాలి? సంచాలకులుగా ఎవరు ఉండాలనేది రెడ్ టీమ్ ఎంపిక చేయొచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, గీతూ సంచాలక్ అయింది. బ్లూ టీమ్‌లో వీక్‌గా ఉన్నారనుకున్న ఇనయ, వాసంతి, మెరీనాలు.. రేవంత్, శ్రీహాన్, ఫైమాతో పోటీపడాలని నిర్ణయించారు. గేమ్ మొదలు కాకముందే ఎప్పటిలా కొత్త రూల్స్ పెట్టింది గీతూ. గోడ మీద నుంచి రెండు కాళ్లు కింద పెడితే అవుట్ అని చెప్పింది. గేమ్ ప్రారంభం కాగానే ముగ్గురు ఆడాళ్లు సివంగుల్లా పోట్లాడారు. వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేసిన రేవంత్‌ను అవుట్ చేసింది వాసంతి. శ్రీహాన్ ఇనయను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. నామినేషన్లో తప్ప కంటెంట్ లేనిదానివి నువ్వు మట్లాడుతున్నావు అని విమర్శించాడు. దీనికి ఇనయ.. నువ్వూ ఈ మధ్య కంటెంట్ బాగా ఇస్తున్నావ్లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా అంది. ఇక ఇనయ నెట్టేసే క్రమంలో శ్రీహాన్ రెండు కాళ్లు కింద పెట్టినా గీతూ మాత్రం తాను చూడలేదని మాట్లాడింది. ఎవ్వరు చెప్పినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మొదటి మిషన్‌లో రెడ్ స్క్వాడ్ గెలవగా వారు బ్లూ స్క్వాడ్‌లో రోహిత్‌ను చంపారు. తర్వాత శ్రీహాన్.. ఇనయ దగ్గరకు వెళ్లి నా క్యారెక్టర్ గురించి ఏదో నోరు జారుతున్నావేంటి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మా రిలేషన్‌కు ఓ పేరుంది, లిమిట్ ఉంది అని ఎగబడ్డారు శ్రీసత్య, శ్రీహాన్. దానికి ఇనయ మీరు కింద పడుకోవడం చూశానని ఆన్సరిచ్చింది. మరోపక్క బాలాదిత్య సిగరెట్ల కోసం అల్లాడిపోయాడు. చేసింది చాలు, తప్పు చేయకు, నా మనసు విరిగిపోయింది అని సిగరెట్లు అడగ్గా గీతూ మాత్రం ఇవ్వనంటూ మొండికేసింది. నా స్టూడెంట్స్‌కు నేను సిగరెట్లు తాగడం తెలియొద్దనుకున్నా, కానీ తెలిసిపోయింది. అమ్మ చూస్తే బాధపడుతుంది అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఆదిత్య. ఆదిరెడ్డి సహా అందరూ బతిమాలడంతో చివరాఖరికి సిగరెట్లు ఇచ్చేసి ఏడ్చేసింది గీతూ. దీంతో ఆవేశంలో సిగ్గులేదు అన్నందుకు తనను క్షమించమని చేతులెత్తి వేడుకున్నాడు బాలాదిత్య. గీతూ మాత్రం అతడిని క్షమించే ప్రసక్తే లేదన్నట్లు ప్రవర్తించింది. తెల్లారి బాలాదిత్య సిగరెట్లు తాగుదామనుకునేలోపు లైటర్ కనిపించకుండా పోయింది. దీంతో ఆదిరెడ్డి.. బిగ్‌బాస్.. వీక్నెస్తో ఆడుకోమన్నాడని చెప్పి మీ బలాన్ని ప్రయోగించరా? అని కరెక్ట్ పాయింట్ లాగాడు. అటు గీతూ మాత్రం.. నేను దొంగ, వెధవెన్నర వెధవ.. జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి కాసేపు సతాయించి తర్వాత లైటర్ ఇచ్చేసింది. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇనయ సూర్య జ్ఞాపకాలతో తడిసి ముద్దైంది. నీ షర్ట్ వేసుకునే గేమ్ ఆడాను. ఎందుకింత గుర్తొస్తున్నావంటూ సూర్యను తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వింది. అటు శ్రీసత్య మాత్రం ఎవరు ఏ పాయింట్లో ట్రిగ్గర్ అవుతారో నాకు తెలుసు. కాబట్టి రేపు ఎదుటివాళ్లను రెచ్చగొట్టి గేమ్ ఆడదామని రేవంత్‌తో చెప్పుకొచ్చింది. మరుసటి రోజు ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికి సీక్రెట్ మిషన్ ఇచ్చాడు. వాష్‌రూమ్‌ను పూర్తిగా అశుభ్రపరిచి ఆ నింద రెడ్ స్క్వాడ్‌లో ఒకరి మీద వేయాలన్నాడు. ఈ మిషన్ కంప్లీట్ చేస్తే బ్లూ టీమ్‌లో ఒకరిని బతికించొచ్చన్నాడు. మరి ఆ సీక్రెట్ మిషన్ పాజిబులా? ఇంపాజిబులా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అందరికీ రుణపడి ఉంటా: రంభ వీడియో వైరల్ -
బాలాదిత్యపై కక్ష, ఎలిమినేషన్ జోన్లో బిగ్‌బాస్ ముద్దుబిడ్డ!
బిగ్‌బాస్ షోను బుల్లితెర హిట్ షోగా పిలుచుకుంటారు. ఈ షో వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక షోలో పాల్గొనే కంటెస్టెంట్లు కూడా ప్రేక్షకులను అలరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అయితే దాదాపు ప్రతి సీజన్లో కంటెస్టెంట్లు గొడవలు పడి గేమ్ తర్వాత కలిసిపోతుంటారు. ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా అది గేమ్, నామినేషన్స్ వరకు మాత్రమే! కానీ ఈసారి ఏంటో గేమ్ కన్నా కూడా గొడవలకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ఈ సీజన్లో ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం పరిపాటిగా మారింది. మొన్నటివరకు అన్న అంటూ బాలాదిత్యతో బంధం కలుపుకున్న గీతూ ఆయన్నే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మొన్న చేపల చెరువు టాస్క్‌లో కావాలని బాలాదిత్య టీమ్‌ను గేమ్ నుంచి సైడ్ చేసింది. ఇప్పుడేమో అతడి బలహీనత అయిన సిగరెట్లను దాచి కక్ష సాధిస్తోంది. మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భుజబలంతో పాటు బుద్ధి బలం కూడా వాడమన్నాడు బిగ్‌బాస్. ఇంకే, ఆ ఒక్క పాయింట్‌ను పట్టుకుని సిగరెట్లు, లైటర్ దాచేసింది గీతూ. గేమ్ అయిపోయినా, తనకు సిగరెట్లు కావాలని అతడు ఏడుస్తున్నా కూడా ఆమె మనసు కరగడం లేదు. మరోవైపు ఇనయ వల్లే సూర్య ఎలిమినేట్ అయ్యాడని నామినేషన్లో అరిచి మరీ చెప్పారు శ్రీహాన్, శ్రీసత్య. కానీ గేమ్‌లో కూడా పదే పదే అదే పాయింట్ లేవనెత్తి ఆమెను వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేయడం అవసరమా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. అందరికంటే గీతక్క ఎక్కువ రోత పుట్టిస్తుందని, ముందుగా ఆమెను ఎలిమినేట్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలాదిత్యను ఇలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే గీతూ ఈ వారమే బయటకు వెళ్లడం ఖాయమంటున్నారు. ప్రస్తుతానికైతే ఓటింగ్‌లో రేవంత్, బాలాదిత్య టాప్‌లో ఉండగా గీతూ చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నిందలు తట్టుకోలేక బాత్రూమ్లోకి ఇనయ క్యాసినో కింగ్ చీకోటితో ఆర్జీవీ -
Bigg Boss 6: సిగరెట్ కోసం ఇంత అవమానిస్తావా..సిగ్గుండాలి..గీతూపై బాలాదిత్య ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ‘మిషన్ పాజిబుల్’ రసవత్తరంగా సాగింది. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్‌గా ఉంటే.. ఆదిరెడ్డి, రాజ్, ఇనయా, వాసంతి, రోహిత్, మెరినా, బాలాదిత్య బ్లూ టీమ్‌గా ఉన్నారు. ఒక టీమ్‌లోని సభ్యులను మరో టీమ్ సభ్యులు హత్య చేయాలి. దాని కోసం తమ ప్రత్యర్థి టీమ్ సభ్యుల భుజాలపై ఉన్న నాలుగు స్ట్రిప్పులను లాగేయాలి. చనిపోయిన సభ్యులు దెయ్యం అవుతారు. అయితే ఈ టాస్క్‌లో భుజ బలం మాత్రమే కాదు బుద్ది బలం కూడా చూపించాలి అని బిగ్‌బాస్ చెప్పడంతో గీతూ రెచ్చిపోయింది. బాలాదిత్య వీక్నెస్తో ఆడుకునేందుకు గీతూ-శ్రీసత్య-శ్రీహాన్ స్కెచ్ వేశారు. బాలాదిత్య సిగిరెట్లు, లైటర్ దాచేసి అతని వీక్నెస్ మీద దెబ్బకొట్టారు. అవి కావాలంటే నాలుగు స్ట్రిప్పులు కావాలని అడిగింది గీతూ. దీంతో బాలాదిత్య ఎమోషన్ అయిపోయాడు. 'ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం.. ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా? నన్ను ఇంత దారుణంగా అవమానిస్తావా? సిగ్గుండాలి’ అంటూ బాలాదిత్య ఫైర్ అయ్యాడు. ప్రపంచం మొత్తం దాన్ని నమ్మొద్దు అని చెప్పినా నేను వినలేదు. దాన్ని బంగారం అని మాట్లాడాను.. కానీ నా ఎమోషన్స్‌తో ఆడుకుంటుంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినప్పటికీ గీతూ మాత్రం సిగరేట్, లైటర్ ఇవ్వలేదు. మాటకు మాట సమాధానం ఇస్తూ.. గట్టిగానే ఉంది. సిగరేట్ కోసం సిగ్గుండాలి అంటాడా అంటూ ఆదిరెడ్డితో చెబుతూ బాధపడింది. ఈ టాస్క్ సగంలో ఉండగానే.. నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. మరి ఈ ‘మిషన్ పాజిబుల్’టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఎంతలా దిగజారుతున్నావో అర్థమవుతుందా? గీతూపై బాలాదిత్య ఫైర్
బిగ్‌బాస్ సీజన్-6లో కెప్టెన్సీ పోటాదారుల టాస్క్ హాట్‌హాట్‌గా జరిగింది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు రెండు టీమ్స్‌గా విడిపోవాల్సి ఉంటుంది. అయితే టాస్క్ అవుతుండగానే గీతూ మళ్లీ ఎమోషన్స్‌తోనే ఆడుకుంది. ఎదుటివాళ్ల వీక్నెస్ పాయింట్ మీదే దెబ్బకొట్టాలని చూసింది. టాస్క్‌లో గెలవడం కోసం బాలాదిత్య లైటర్‌ను దాచేసింది. అప్పటికే బాలాదిత్య వచ్చి అడగ్గా.. గేమ్‌లో రెండు స్ట్రిప్‌లు ఇస్తే లైటర్ ఇస్తాం అంటూ గీతూ, సత్యలు అన్నారు. దీంతో మరింత ఫైర్ అయిన బాలాదిత్య ఆటలో గెలవాలి కానీ ఇదేం పద్దతి అంటూ కోప్పడ్డాడు. అయినా సరే గీతూ.. రెండు స్ట్రిప్‌లు ఇస్తే లైటర్ ఇస్తా.. ఇంకో రెండు స్ట్రిప్‌లు ఇస్తే సిగరెట్ ఇస్తా అంటూ మరింత రెచ్చిపోయింది. ఇంక ఆ మాటలకు బాలాదిత్య బాగా ఎమోషనల్ అయ్యాడు.. 'ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం.. ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా?? నన్ను ఇంత దారుణంగా అవమానిస్తావా?అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రపంచం మొత్తం దాన్ని నమ్మొద్దు అని చెప్పినా నేను వినలేదు. దాన్ని బంగారం అని మాట్లాడాను.. కానీ నా ఎమోషన్స్‌తో ఆడుకుంటుంది' అంటూ బాలాదిత్య ఫైర్ అయ్యాడు. -
చివరిసారిగా సూర్యకు ఇనయ ముద్దుల వర్షం, భారంగా వీడ్కోలు
Bigg Boss 6 Telugu, Episode 56: నాగార్జున వచ్చీరాగానే తన కోపాన్నంతా కక్కేశాడు. చేపల చెరువు టాస్క్‌లో గీతూ ఎలా ఆడిందో ఆదిని రివ్యూ ఇవ్వమన్నాడు. గీతూ ఫిజికల్‌గా బాగా ఆడిందని వెనకేసుకొచ్చాడు ఆది. మరి అంత బాగా ఆడితే మీ దగ్గరే ఎందుకు తక్కువ చేపలున్నాయన్నాడు. దీంతో వాళ్లు మౌనంగా ఉండిపోయారు. గీతూ మధ్యలో ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా పానకంలో పుడకలా మధ్యలో మాట్లాడకని వార్నింగ్ ఇచ్చాడు నాగ్. సంచాలక్‌గా తన ఆటతీరు ఎలా ఉంది? అని ప్రశ్నించగా మెజారిటీ హౌస్మేట్స్ ఆమె అలా ఆట మధ్యలో దూరడం తప్పని చెప్పారు. అయితే గీతూ మాత్రం.. నేనుండే సీజన్లో ఎవరు ఆడకపోయినా నేనే ఆడిస్తానని రెచ్చగొట్టాను. బయట కూడా నేను గేమర్‌ను అని చెప్పుకొచ్చింది. ఎదుటివాళ్ల వీక్నెస్ మీద ఆడటం గేమర్ లక్షణం కాదు. నువ్వు గేమర్ కాదు, వేస్ట్.. ఓటమి తట్టుకోలేక ఏడ్చావు. గేమ్ ఇంట్రస్టింగ్‌గా ఆడటం మా బిగ్‌బాస్ చూసుకుంటాడు. నువ్వేం చేయనవసరం లేదు. సరే పోనీ, కూరగాయలు కట్ చేశాక ఆ తొక్క అంతా డస్ట్‌బిన్‌లో వేయడానికి అంత గొడవ అవసరమా? నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది. కోపమొస్తే కామన్సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావని క్లాస్ పీకాడు నాగ్. నువ్వు గెలవడాని కంటే అవతలివాళ్ల వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలని చూశావని ఫైర్ అయ్యాడు. సంచాలక్‌గా తప్పు చేసిన గీతూ బిగ్‌బాస్ చెప్పేవరకు బాత్రూమ్స్ క్లీన్ చేయాలని పనిష్మెంట్ ఇచ్చాడు. ఎవరి ఆట వాళ్లు బాగా ఆడితే సీజన్ ఎక్కడుండాలో అక్కడుటుంది అన్నాడు. ఆట ఆడుతూనే అమ్మాయిల డ్రెస్ సరిదిద్దావంటూ బాలాదిత్యను మెచ్చుకున్నాడు నాగ్. శ్రీహాన్-శ్రీసత్య కలిసి ఆడారా? మిగతా జంటల సాయం తీసుకున్నారా? అని అడగ్గా వారు కలిసే ఆడామని తలూపారు. నాగ్ మాత్రం.. గీతూ దయాదాక్షిణ్యాల మీద మీ గేమ్ ఆధారపడిందని సెటైర్ వేశాడు. సూర్య.. తనను ముగ్గురమ్మాయిల(ఇనయ, ఫైమా, కీర్తి) కన్నా నేను ఫిజికల్‌గా తక్కువ అనేసరికి బాధపడ్డానంది వాసంతి. ఫెమినిస్ట్ అయి ఉండి అలా మాట్లాడతావా? అని విమర్శించడంతో ముఖం మాడ్చాడు సూర్య. కామెడీ విషయంలో కొన్నిసార్లు నోరుజారుతున్నావు, జాగ్రత్తగా ఉండని ఫైమాను హెచ్చరించాడు నాగ్. గేమ్‌లో రేవంత్ మిగతావారిని నెట్టేసిన వీడియో చూపించిన నాగ్.. ఉన్మాదిలా ఆడుతున్నావు, ఆ కోపం తగ్గించుకుంటూనే గేమ్ ఆడు అని సలహా ఇచ్చాడు. ఈ వారం అనర్హులు బ్యాడ్జ్ ఎవరికి ఇస్తావంటే కెప్టెన్ శ్రీహాన్.. కీర్తి పేరు సూచించాడు. పాజిటివ్ తీసుకున్నంత ఈజీగా నెగెటివ్ తీసుకోలేదంటూ ఆమెకు అనర్హురాలు బ్యాడ్జ్ తగిలించాడు. తర్వాత డైరెక్ట్ ఎలిమినేషన్ అంటూ సూర్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. ఊహించని ఎలిమినేషన్‌తో ఇనయ వెక్కి వెక్కి ఏడ్చింది. అతడిపై ముద్దుల వర్షం కురిపిస్తూ భారంగా వీడ్కోలు పలికింది. ఫైమా, కీర్తి సైతం సూర్య వెళ్లిపోతుంటే కంటనీరు పెట్టుకున్నారు. మిగతా హౌస్మేట్స్ అతడిని సీక్రెట్ రూమ్‌కి పంపిస్తారేమోనని అభిప్రాయపడ్డారు. మరి సూర్య స్టేజీపైన ఏం మాట్లాడాడు? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే! చదవండి: గీతూను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్ ఖేర్ -
గీతూను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు!
నాకంటే తోపులెవరూ లేరిక్కడ అని బిగ్‌బాస్ హౌస్‌లో చెలరేగిపోయింది గీతూ. ఫిజికల్ టాస్క్ ఇస్తే గుద్దిపడేస్తానంది. తీరా టాస్క్(చేపల చెరువు టాస్క్)లో అందరికంటే ముందే ఓడిపోయింది. పోనీ సంచాలక్‌గా ఉండమంటే అక్కడ తను చెప్పేదే వేదం అన్నట్లుగా ఇష్టమొచ్చిన రూల్స్ పెట్టి తనూ ఆడుతూ కొందరిని టార్గెట్ చేసింది. అందరికీ ఆడటం చేతకావట్లేదని, తాడే ఆడిస్తానంటూ డిసైడ్ అయింది. కానీ చివరికి ఏమైంది. నాగార్జునతో చీవాట్లు తింది. గుద్దిపడేస్తా అన్నావ్ ఏదీ నీ గేమ్ అని అడగడంతో తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక బిక్క ముఖం వేసుకుంది గీతూ. ఈ ప్రోమో చూసి ఫుల్ ఖుషీ అవుతున్న కొందరు నెటిజన్లు.. మొన్నటి నుంచి గీతూ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం.. నాగ్ తిక్క కుదర్చి లెక్క సరిచేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మీమ్స్, కామెంట్లతో గీతూను ఓ ఆటాడుకుంటున్నారు. అవేంటో మీరూ చూసేయండి.. Nag Mama about #GeetuRoyal game play today...#BiggBossTelugu6 pic.twitter.com/TeTWTHxRxu — Vamc Krishna (@lyf_a_zindagi) October 29, 2022 Now #Geethu be like:- meelo fire theppinchalane ila cgesanu sir nijam ga kavalani kadu 😭😭. Her blind supporters:- akka pedda gamer ra#BiggBossTelugu6 https://t.co/k2owIq5jRg — Srinivas movie buff (@movieandcricbuf) October 29, 2022 #biggbosstelugu6 Geethu after episode 😂 Em parledu at least weekend lo content vachindi 🤣 pic.twitter.com/9hJZaB0V0W — Aggipetti macha 2️⃣.0️⃣🔥 (@Raising18428245) October 29, 2022 Baita kuda gamer endi Geetakka #BiggBossTelugu6 pic.twitter.com/N2RHd0azm8 — Eleven (EL) ᴬᵇⁱʲᵉᵉᵗ (@aravindaareddy) October 29, 2022 Konni dailogues ayte 🔥🔥 1)Game interesting ceyadam BB pani 2)Evari aata valu Adige season ekada vundalo akada vuntadi 3)Asalu nuv ekavaru aatalo involve avadaniki 4)Nee aata bocculo aata😂 Geethu Nenu gamer sir audience nuv oka pedda boomer mari #BiggBossTelugu6 — Just_my_opinion (@Just_my_view1) October 29, 2022 Baita kuda gamer endi Geetakka #BiggBossTelugu6 pic.twitter.com/N2RHd0azm8 — Eleven (EL) ᴬᵇⁱʲᵉᵉᵗ (@aravindaareddy) October 29, 2022 Saana sammaga undi kadara andariki pic.twitter.com/sfRqHG67NM — Mangalam Srinu𓃵 (@MangSrinu) October 29, 2022 Nagarjuna garu eliminate them immediately sir asalu time sense ledu aa Chittoor chintakayalakiiiiii🤣🤣🤣🤣 pic.twitter.com/Yueuj42Ytn — Ravi (@ravi_jaky) October 29, 2022 #Jayasurya: Nuvvu thaggodhdhu Nag mawa, aa #Geethu ki budhdhi vachchedaaka gaddi peduthoone undu. HMs ni nene aadistunna andhi, ilaage vadilesthe host tho hosting nene cheyistunna antadhi 😌#BiggBossTelugu6 pic.twitter.com/2DAeeZtssO — 🇮🇳sri2tweet😷🔔 (@sri2tweet1) October 29, 2022 Ee GeeTHU chese ee chestalu chudatsnki ebbatuga unnay.#BiggBossTelugu6 https://t.co/zxd1sDNhgC — 🐯 (@LUCKYTAROCKIAN9) October 29, 2022 -
నువ్వేంది ఆడించేది, బిగ్‌బాస్ లేడా?: నాగ్ ఫైర్
బిగ్‌బాస్ ప్రోమో కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. హోస్ట్ నాగార్జున గీతూను పొగుడుతాడా? తిడతాడా? అని తెగ వెయిట్ చేస్తున్నారు. వారి ఎదురుచూపులకు బ్రేక్ ఇస్తూ తాజాగా ప్రోమో రిలీజైంది. వచ్చీరాగానే ఫుల్ ఫైర్ మీదున్నట్లున్నాడు నాగ్. ఫిజికల్ టాస్క్ ఇస్తే గుద్దిపడేస్తా అంది గీతూ.. మరి చేపల చెరువు టాస్క్‌లో గీతూ గుద్దిపడేసిందా? అని ఆదిని అడిగాడు నాగ్. దానికతడు బాగా ఆడిందని చెప్పగా మరెందుకు అందరికంటే తక్కువ చేపలు మీదగ్గరే ఉన్నాయని ప్రశ్నించాడు హోస్ట్. గెలవడానికంటే కూడా అవతలివాళ్ల వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలని చూశావని నాగ్ మీద ఫైర్ అయ్యాడు నాగ్. నేనుండే సీజన్లో వాళ్లు ఆడకపోయినా మనమే ఆడించాలని రెచ్చగొట్టానని ఆన్సరిచ్చింది గీతూ. గేమ్ ఇంట్రస్టింగ్‌గా చేయడం బిగ్‌బాస్ చూసుకుంటాడు. ఎవరి ఆట వాళ్లు ఆడితే సీజన్ ఎక్కడుండాలో అక్కడుంటుంది అని కౌంటరిచ్చాడు నాగార్జున. నేను బయట కూడా గేమర్ సర్ అని గీతూ అనగా ఎదుటివాళ్ల వీక్నెస్ మీద ఆడటం గేమర్ కాదని గడ్డిపెట్టాడు నాగ్. సంచాలక్ అంటే అంపైర్ మాత్రమే, ఆటలో ఇన్వాల్వ్ అవ్వడానికి నువ్వెవరు.. నీ ఆట బొచ్చులో ఆట ఐపోయింది. కోపమొస్తే కామన్సెన్స్ కూడా కోల్పోతావా? అని తిట్టిపోసి ఆమెను శిక్షించాల్సిందేనన్నాడు. మరి గీతూకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: కశ్మీర్ ఫైల్స్ నటుడు -
నా చేతివంట తిన్నాక నాన్నకు గుండెపోటు వచ్చింది: ఇనయ
Bigg Boss 6 Telugu, Episode 55: ముందుగా అనుకున్నట్లుగానే శ్రీహాన్ కెప్టెన్ అయ్యాడయ్యాడు. అలా కెప్టెన్ అయ్యాడో లేదో ఇలా ఇనయతో గొడవపడ్డాడు. మొన్నటిదాకా కలిసిపోయిన వీళ్లిద్దరి కథ కెప్టెన్సీ టాస్క్‌తో మళ్లీ మొదటికి వచ్చింది. ఇనయ కత్తిపోటు వేయడాన్ని శ్రీహాన్ జీర్ణించుకోలేకపోయాడు. సరైన సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తాననడి డిసైడ్ అయ్యాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. సూర్య, ఇనయల ట్రాక్ చూసి జనాలు వీరిని సునయ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ నాగార్జున వీకెండ్లో పదేపదే బుజ్జమ్మ పేరు ఎత్తడంతో ఇనయ బాగా హర్టయింది. సూర్యకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని అన్నిసార్లు గుర్తు చేసినప్పుడు తను క్లోజ్‌గా ఉండటం తప్పని భావించింది. ఏకంగా అతడి ఫ్రెండ్షిప్నే వద్దంది. సూర్య మీద ద్వేషం పెంచుకుంది. టాప్ 5లో కాదు కదా వీలైనంత వెంటనే బయటకు వెళ్లిపోవాలని రగిలిపోయింది. కానీ ఆ కోపం చప్పున చల్లారిపోయినట్లు కనిపిస్తోంది. నాకు కోపమొస్తే అవతలివారిని బాధపెడతాడనని సూర్యతో చెప్పుకొచ్చింది ఇనయ. నీ బ్రాస్లేట్ రేవంత్ దగ్గర ఉండటం నచ్చలేదు, అందుకే తీసుకున్నానన్నాడు సూర్య. అలా ఇద్దరూ కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీ కంటిన్యూ అయింది. నిన్న రాజ్, రోహిత్, రేవంత్.. సూర్యకు; బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చగా ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. నేటి ఎపిసోడ్లో వాసంతి, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. తక్కువ కత్తులు దిగిన శ్రీహాన్ కెప్టెన్‌గా అవతరించాడు. మరోవైపు కిచెన్‌లో గీతూ, బాలాదిత్య పంచాయితీకి దిగారు. కూరగాయలు కట్ చేసినప్పుడు దాని తొక్కలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చు కదా అని బాలాదిత్య.. నేను ఎందుకు వేస్తా, అంత అవసరమనుకుంటే నువ్వే వేసేయ్ అంటూ గీతూ దెబ్బలాడుకున్నారు. అలా ఇద్దరి గొడవతో ఇంట్లో రగడ జరిగింది. తర్వాత యమహా కాల్ ఆఫ్ ద బ్లూ టాస్క్‌లో రోహిత్ గెలిచి జాకెట్ గెలుచుకున్నాడు. తనను విన్నర్‌గా ప్రకటించకపోవడంతో రేవంత్ చిర్రుబుర్రులాడాడు. అనంతరం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమని కెప్టెన్ శ్రీహాన్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో కెప్టెన్.. బాలాదిత్య ముఖానికి పెయింట్ పూయడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గీతూ ప్రవర్తన మీద ఓ కన్నేసిన ఆది రెడ్డి తన అభిప్రాయాన్ని ఆమె ముందుంచాడు. గీతక్క నువ్వు రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నావనిపిస్తోందన్నాడు. ఆమె మాత్రం అదేమీ పెద్దగా పట్టించుకోనట్లే కనిపించింది. ఇక ఆది కూతురు హద్విత ఫస్ట్ బర్త్‌డే కావడంతో అతడికి ఫ్యామిలీ వీడియో చూపించాడు బిగ్‌బాస్. ఆ వీడియోలో ఆది భార్య కవిత కూతురికి కేక్ కట్ చేసి తినిపించింది. తన తల్లిని, పెళ్లాంబిడ్డలను చూసి ఆది సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కెప్టెన్ శ్రీహాన్ ఇంటిసభ్యులకు పనులు అప్పగించేందుకు రెడీ అయిపోయాడు. ఇనయను వంట చేయమని అడిగాడు. దీనికి ఇనయ స్పందిస్తూ.. 'నేను చివరిసారిగా వంట చేసింది మా డాడీకే, నా వంట తిన్నాక ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వంట ముట్టుకోలేదు, ఇక మీదట చేయను కూడా' అని తెగేసి చెప్పింది. కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్ అనగా కూర లేకపోవడంతోనే తాను రైస్ పక్కన పెట్టేశానని మధ్యలో కల్పించుకుని ఆన్సరిచ్చింది ఇనయ. అసలు నీ పేరు ప్రస్తావించనప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు కెప్టెన్. అలా ఇద్దరి మధ్య కాసేపు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏదేమైనా అన్నం పడేస్తే మాత్రం అస్సలు ఊరుకోనన్నాడు శ్రీహాన్. మళ్లీ గొడవలవుతున్నాయని శ్రీహాన్ చిరాకుపడుతుంటే గీతూ మాత్రం.. ఇలా గొడవ జరిగితేనే సీజన్ హిట్టవుతుందని చెప్పుకురావడం విశేషం.. -
'తొక్క'లో పంచాయితీ.. ఎంత చెప్పినా గీతూ వినదే..!
సీతయ్య.. ఎవ్వరి మాటా వినడు అన్నట్లు ప్రవర్తిస్తోంది గీతూ రాయల్. మొన్నటివరకు బాలాదిత్యను అన్న అని పిలుస్తూ అతడితో సఖ్యతగా మెసులుకున్న గీతూ రానురానూ అతడిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. నామినేట్ చేయడం, అతడిని గేమ్ నుంచి తప్పించడం, అసలు అతడేం బాగా ఆడలేదని కావాలని నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం చూస్తుంటే అతడి మీద కక్ష పెట్టుకున్నట్లే కనిపిస్తోంది. మరోపక్క బాలాదిత్య మాత్రం ఒక్కసారి చెల్లి అన్నందుకు ఇప్పటికీ అదే బంధుత్వానికి కట్టుబడి ఉన్నట్లున్నాడు. గీతూ కసురుకున్నా, విసుకున్నా, నోరు జారినా అతడు మాత్రం తనకు మంచి చెప్పడానికే ప్రయత్నిస్తున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో కూరగాయలు కట్ చేసినప్పుడు అదే చేత్తో తొక్కలు డస్ట్ బిన్లో వేయండి అని గీతూకు చెప్పాడు బాలాదిత్య. ఆమె మాత్రం నేను వేయను అని ముక్కుసూటిగా చెప్పేసింది. వేస్తే మంచిదానివి అవుతావుగా అంటే కూడా నేను మంచిదాన్నే కాదు అని వాదించింది. నీ మాటతీరుతో, చేతలతో పెంట చేసుకుంటున్నావని అతడు హెచ్చరించినా, నేను పెంట చేసుకుంటే నేనే పోతా, హ్యాపీగా ఉండు అని సమాధానమిచ్చింది. నువ్వు పోతే నేను హ్యాపీగా ఉండను, నువ్వు బాగుపడితే సంతోషంగా ఉంటానని కౌంటరిచ్చాడు ఆదిత్య. చదవండి: పూరీ జగన్నాథ్ ఇంటికి పోలీసుల భద్రత రామ్ సినిమాలో ఊర్వశి రౌతేలా? ఇదిగో క్లారిటీ -
ఒక్క చేపతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న రేవంత్‌ను కిందకు దించిన గీతూ
Bigg Boss 6 Telugu, Episode 53: గేమ్‌లో ఉన్నా లేకపోయినా ఆటాడాల్సిందేనని డిసైడ్ అయిపోయింది గీతూ. అందుకే సంచాలకురాలిగా ఉన్నా కూడా గేమ్ పడింది. ఇక్కడ తను ఫేవరిటిజం చూపిస్తూ ఆది ఫేవరిటిజం చూపిస్తున్నాడని అడ్డదిడ్డంగా వాగింది. మరోపక్క చేపల చెరువు టాస్క్‌లో మెరీనా- బాలాదిత్య జంట ఎక్కువ టార్గెట్ అయింది. మరి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఎక్కడివరకు వచ్చింది? హౌస్‌లో ఏమేం జరిగిందో ఇప్పుడు చదివేద్దాం.. అప్పటిదాకా ఫెవికాల్లా కలిసిపోయిన సూర్య- ఇనయ నామినేషన్స్ నుంచి సరిగా మాట్లాడుకోవడమే మానేశారు. పైగా ఇనయ సూర్య మీద కక్ష పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 'సూర్యకు బుజ్జమ్మ ఉన్నప్పుడు అతడితో క్లోజ్ అవడం తప్పనిపించింది. సూర్యను టాప్ 5లో ఉండనివ్వకూడదు. అతడు చాలా తప్పులు చేస్తున్నాడు, ఇక వదిలిపెట్టను. ప్రతివారం నామినేట్ చేస్తాను. గీతూ కూడా త్వరలోనే వెళ్లిపోతుంది' అంటూ ఏదేదో మాట్లాడింది ఇనయ. మరోపక్క రేవంత్ వల్లే తన గేమ్ ఆగిపోయింది అని ఉడికిపోయిన గీతూ అర్ధరాత్రి అతడి చేపలు దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. కానీ వర్కవుట్ కాలేదు. ఇక పొద్దున్నే స్విమ్మింగ్ పూల్‌లో నల్ల చేప కనిపించడంతో లటుక్కున పట్టుకుని దాచేసుకుంది గీతూ. ఇకపోతే తాను దొంగతనానికి ప్రయత్నించిన విషయాన్ని ఎందుకు అందరికీ చెప్తున్నావని మెరీనా మీద మండిపడింది గీతూ. నువ్వు ఆడవు, ఒకరిని ఆడనివ్వవు అంటూ ఫైర్ అయింది. గెలవలేకపోతున్నావు కాబట్టే ఫ్రస్టేట్ అవుతున్నావంటూ ఉన్నమాట అనేసింది మెరీనా. తర్వాత చేపల చెరువు టాస్క్ తిరిగి ప్రారంభమైంది. ఈసారి గీతూ, ఆదిలు సంచాలకులుగా వ్యవహరించారు. అయితే చేపలు పడుతుంటే వాటిని క్యాచ్ చేసేందుకు ప్రయత్నించింది గీతూ. నువ్వు గేమ్ ఆడితే సంచాలకురాలిగా అనర్హత వేటు వేస్తానని హెచ్చరించాడు ఆది. అయినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత పూల్‌లో దిగిన ఫైమాకు గోల్డ్ కాయిన్ దొరికింది. దీని సాయంతో బిగ్‌బాస్ ఇచ్చిన రెండో ఛాలెంజ్ షీల్డ్ వార్ టాస్క్‌లో ఏయే జంటలను ఎంపిక చేయాలనేది ఫైమా జోడీ నిర్ణయిస్తున్నంది. ఫైమా- రాజ్.. తమతో పాటు సూర్య- వాసంతి, ఆదిత్య- మెరీనా, శ్రీసత్య- శ్రీహాన్ జంటలు పోటీకి దిగుతాయని వెల్లడించారు. ఈ ఛాలెంజ్‌లో సూర్య- వాసంతి టీమ్ గెలిచి 15 చేపలు గెలుచుకుంది. ఫైనల్‌గా చేపల చెరువు టాస్క్ ముగిసే సమయానికి శ్రీసత్య- శ్రీహాన్ 67, రేవంత్- ఇనయ 129, ఫైమా- రాజ్ 109, సూర్య- వాసంతి 89, రోహిత్- కీర్తి 84, బాలాదిత్య- మెరీనా -37 చేపలు సంపాదించారు. అయితే నల్ల చేప సాయంతో రెండు జంటల చేపలను స్వాప్ చేయొచ్చని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకే దొరికింది ఛాన్స్ అనుకున్న గీతూ పొద్దున దొరికిన బ్లాక్ ఫిష్‌ను బయటకు తీసింది. ఫ్రెండ్స్ మధ్యలో చిచ్చు పెడ్తానంటూ అందరికంటే ఎక్కువ చేపలు ఉన్న రేవంత్- ఇనయ జోడీని శ్రీసత్య- శ్రీహాన్‌తో స్వాప్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రేవంత్ జోడీకి 67 చేపలు రాగా శ్రీహాన్ జోడీకి 129 చేపలు వచ్చాయి. అందరికంటే తక్కువ చేపలున్న బాలాదిత్య- మెరీనా జంట ఆట నుంచి వైదొలిగారు. చదవండి: లైగర్ వివాదం.. పూరీ డబ్బులెందుకు ఇవ్వాలి?: నిర్మాత అమ్మ ఆరోగ్యానికి రిస్క్, అయినా నాన్న పట్టించుకోలేదు: శ్రీదేవి కూతురు అంపైర్‌గా ఉండమంటే బ్యాటింగ్, ఇలాగైతే తిట్టరా మరి! -
గీతూ గేమ్ చేంజరా? బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లు
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్‌ను జంటలుగా విభజించిన బిగ్‌బాస్ చేపల చెరువు అనే టాస్క్ ఇచ్చాడు. మధ్యమధ్యలో కొత్త కొత్త ఛాలెంజ్‌లు కూడా విసురుతున్నాడు. కెప్టెన్సీ బరిలో నిలిచేందుకు జంటలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అయితే గేమ్ చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లోకి ఓ నల్ల చేప వచ్చిందని, దాని సాయంతో రెండు జంటల బాస్కెట్లను స్వాప్ చేయొచ్చని మెలిక పెట్టాడు. ఇక ఆ నల్ల చేప గీతూకే దొరకగా.. రేవంత్- ఇనయ జోడీల బాస్కెట్‌ను శ్రీహాన్- శ్రీసత్య జంటతో స్వాప్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంత కష్టపడి ఆడితే గీతూ ఒక్క చేపతో తమను గేమ్ నుంచి సైడ్ చేసేయడం ఇనయ, రేవంత్‌కు అస్సలు నచ్చలేదు. ఆ ఫ్రస్టేషన్లో వారు ఒకింత కోపం, మరింత బాధతో మాట్లాడుతుంటే దానికి కౌంటర్లిస్తూ ఆనందం పొందింది గీతూ. మొత్తానికి ఈ టాస్క్‌లో గీతూ గేమ్ చేంజర్ అని హాట్‌స్టార్ ట్వీట్ వేస్తే గేమ్ స్పాయిలర్ అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా ఫస్ట్ రౌండ్లోనే అవుటైపోయిన గీతూకు నల్ల చేప ఎలా దొరికింది? ఇదెలా సాధ్యమంటూ బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్నారు. ఫైనల్‌గా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ఎవరు బాగా ఆడారు? ఎవరు కెప్టెన్సీ బరిలో నిలవనున్నారు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! Black Fish! Geetu, the game changer.#BBLiveOnHotstar, streaming 24/7.#BiggBossTelugu6 pic.twitter.com/FBiOJMSZmq — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 26, 2022 చదవండి: ఇంటింటికీ వెళ్లి ప్రమోషన్ చేయాలా, నా వల్ల కాదు: రణ్‌బీర్ అంపైర్‌గా ఉండమంటే బ్యాటింగ్.. గీతూ గేమ్ ఏంటో? -
అంపైర్‌గా ఉండమంటే బ్యాటింగ్, గీతూను ఛీ కొడుతున్న నెటిజన్స్
బిగ్‌బాస్ హౌస్ చేపల మార్కెట్‌గా మారిపోయింది. పై నుంచి చేపల వర్షం పడుతుంటే వాటిని పట్టుకునేందుకు పోటీపడుతున్నారు హౌస్మేట్స్. చేపల చెరువు అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ఇప్పటికే గీతూ- ఆదిరెడ్డి జంట ఔట్ అయింది. దీంతో బిగ్‌బాస్ నెక్స్ట్ లెవల్ కోసం ఆ జంటను సంచాలకులుగా నిర్ణయించాడు. ఇదే సరైన అవకాశం అనుకున్న గీతూ ఆటను తనకు నచ్చినట్లు మార్చేస్తోంది. చేపలు దాచుకునే బుట్టను ఎవరూ కవర్ చేయకూడదని కొత్త రూల్ తీసుకొచ్చింది. అలాగే మిగతా హౌస్‌మేట్స్‌తో పాటు తను కూడా చేపలు పట్టుకునేందుకు వెళ్లింది. మెరీనాను టార్గెట్ చేసి ఆమె దగ్గరున్న చేపలను లాక్కుని విసిరేసింది. ఇవన్నీ చూసి సహసంచాలకుడైన ఆదిరెడ్డికి తిక్క లేచింది. నువ్వు చేస్తోంది తప్పని ఆమెను విమర్శించాడు. దీనికి గీతూ.. నువ్వు అతి చేయకు ఆదిరెడ్డి, నా గేమ్ మధ్యలో ఎందుకు వస్తున్నావు? అని ప్రశ్నించింది. ఇన్ని రోజులలో ఏ సంచాలకుడైనా గేమ్ ఆడటం చూశావా? అని ఆది నిలదీయగా తాను గేమ్ ఆడట్లేదని, ఆడిస్తున్నానని ఆన్సరిచ్చింది గీతూ. ఇక గీతూ అతి తెలివి ప్రదర్శించడంపై హౌస్మేట్స్ మండిపడ్డారు. బ్యాట్స్‌మెన్ షాట్ కొట్టాక అంపైర్ క్యాచ్ పట్టడంలా ఉంది అని బాలాదిత్య సెటైర్ వేయగా అవును, అసలది కరెక్ట్ కాదని అసహనం ప్రదర్శించాడు ఆదిరెడ్డి. అయినా సరే అడ్డదిడ్డంగా వాదిస్తూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ప్రవర్తిస్తూ రెచ్చిపోతోంది గీతూ. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు గీతూను దుమ్మెత్తిపోస్తున్నారు. ఓటమిని సహంచలేక ఆమె ఇలా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తోందని విమర్శిస్తున్నారు. ఇంత దరిద్రమైన గేమ్ ఆడే కంటెస్టెంట్‌ను ఎన్నడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్‌లో చేపల లొల్లి, వెక్కివెక్కి ఏడ్చిన గీతూ -
‘బిగ్‌బాస్’లో చేపల లొల్లి.. వెక్కి వెక్కి ఏడ్చిన గీతూ
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం మొదలైన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రసవత్తరంగా సాగింది. కెప్టెన్సీ రేసులో నిలిచేందుకు హౌస్‌మేట్స్‌కి ‘చేపల చెరువు’ అనే టాస్క్ఇచ్చాడు బిగ్‌బాస్. దీని కోసం ఇంటి సభ్యులను జంటలుగా విడదీశాడు. సూర్య- వసంతి, రేవంత్- ఇనయ, శ్రీహాన్- శ్రీసత్య, బాలాదిత్య -మెరీనా, ఆదిరెడ్డి -గీతు, రోహిత్ -కీర్తి, రాజ్- పైమా జంటలుగా విడిపోయి, గార్డెన్ ఏరియాలో కురిసే చేపల వర్షంలో చేపలను పట్టుకోవాలి. టాస్క్ మధ్యలో బిగ్‌బాస్ అడిగినప్పుడు ఏ జంట దగ్గర తక్కువ చేపలు ఉంటాయో.. ఆ జంట ఈ టాస్క్ నుంచి తప్పుకుంటుంది. మధ్య మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజ్‌లు గెలిచిన జంట తమ చేపల సంఖ్యను పెంచుకోవచ్చు. చాలెంజ్‌లో పోటీపడేందుకు హారన్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ ఫూల్లోకి ప్రతి జంట నుంచి ఒకరు దిగి గొల్డ్ కాయిన్ని వెతకాల్సి ఉంటుంది. గోల్డ్ కాయిన్ దొరికిన జంట చాలెంజ్‌లో పాల్గొనడమే కాకుండా.. తమతో ఎవరు పోటీ పడొచ్చో కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇక టాస్క్‌లో ఫిజికల్‌గా గెలవలేమని భావించిన గీతూ, ఆదిరెడ్డి.. మాటలతో ఆటలో చిచ్చు పెట్టాలని ప్లాన్ వేసింది. రేవంత్‌ని మాటలతో రెచ్చగొట్టి ఆపితే..ఇనయా ఎక్కువగా చేపలు ఏరలేదని ఆదిరెడ్డికి ముందే చెప్పింది. అయితే గీతూ ప్లాన్ వర్కౌట్ కాలేదు. చేపల వర్షం పడినప్పుడు అందరూ పోటీపడి మరి చేపలను ఏరుకున్నారు. ఇక తక్కువ చేపలు ఏరుకున్న గీతూ.. వాసంతి బుట్ట నుంచి చేపలను దొంగిలించేందుకు ప్రయత్నించింది. కానీ సూర్య అడ్డుకున్నాడు. దీంతో మెరినాను టార్గెట్ చేసింది. అయితే బాలాదిత్యతో పాటు రోహిత్ కూడా గీతూని అడ్డుకున్నారు. దీంతో రోహిత్, మెరినా కలిసి ఆడుతున్నారని, నిజం ఒప్పుకోవడానికి నాలాగా గట్స్ ఉండాలంటూ రెచ్చగొట్టింది. ‘నువ్వు నా జోలికి రావొద్దు’అంటూ మెరీనా గీతూపై ఫైర్ అయింది. తాను అందరిని టార్గెట్ చేస్తానని, ప్రతి ఒక్కరి బుట్టలో నుంచి చెపలు దొంగిలిస్తానని చెప్పింది. ఈ గొడవల మధ్యే హారన్ మోగింది. దీంతో ప్రతి జంట నుంచి ఒక్కొక్కరు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్మిమింగ్‌ఫూల్‌లోకి వెళ్లారు. అయితే అనూహ్యంగా గోల్డ్ కాయిన్ రేవంత్‌కి దొరికింది. అనంతరం బిగ్‌బాస్ ఆదేశాల మేరకు చేపలను లెక్కించగా.. గీతూ, ఆదిరెడ్డి జంట దగ్గర తక్కువ సంఖ్యలో చేపలు లభించడంతో టాస్క్ నుంచి తప్పుకుంది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ‘ఫుష్ ఫర్ ఫిష్ ’లో రేవంత్‌తో పోటీపడేందుకు రాజ్-ఫైమా, శ్రీహాన్- శ్రీసత్య, బాలాదిత్య -మెరీనా బరిలోకి దిగారు. ఈ చాలెంజ్‌లో రాజ్-ఫైమా జంట విజేతగా నిలిచి 10 చేపలను దక్కించుకుంది. హారన్ మోగినప్పుడు మైక్ ధరించి స్విమ్మింగ్ ఫూల్లోకి దిగిన కారణంగా శ్రీసత్య, సూర్య జంటల నుంచి 10 చేపలను వెనక్కి తీసుకున్నాడు బిగ్‌బాస్. టాస్క్ సమయం ముగిసేసరికి రేవంత్-ఇనయా జంట దగ్గర అత్యధిక చేపలు ఉన్నాయి. అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి తప్పుకోవడంతో గీతూ వెక్కివెక్కి ఏడ్చింది. టాస్క్ కోసమే అందరిని రెచ్చగొట్టానని హౌస్‌మేట్స్‌కి చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకుంది. టాస్‌లో తనను నెట్టేసిన రేవంత్‌ని కాలితో తన్నడంతో పాటు బూతు పదాన్ని వాడానని, అందుకు క్షమాపణ కోరుతున్నానని చెప్పింది. రేవంత్ కూడా దానిని పెద్దగా పట్టించుకోలేదని, అనుకోకుండా నెట్టేశానని చెప్పింది. మరి ‘చేపల చెరుపు’టాస్క్‌లో చివరకు ఎవరు గెలిచి కెప్టెన్స్ అవుతారో చూడాలి. -
గీతూపై మెరీనా ఫైర్.. నా జోలికి రావొద్దంటూ వార్నింగ్
బిగ్‌బాస్ సీజన్-6లో ఈవారం పోటీదారుల కోసం చేపల చెరువు అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా వీలైనన్ని ఎక్కువ చేపల్ని తమ బుట్టలో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైర్ లేదని బిగ్‌బాస్ మండిపడటంతో కంటెస్టెంట్లు తెగ కష్టపడుతున్నారు. వంత శాతం ఎఫర్ట్ పెట్టి మరీ చెడుగుడు ఆడేస్తున్నారు. ఇక ఈ టాస్కులో ఇద్దరు సభ్యులను ఒక టీంగా విభజించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫిజికల్‌గా పోటీ పడకపోతే, మెంటల్‌గా రేవంత్‌ను దెబ్బకొట్టాలి అంటూ గీతూ ఆదికి సలహా ఇస్తుంది. మరోవైపు గీతూకి, రోహిత్‌కి కూడా టాస్క్‌లో గొడవ అవడంతో..మెరీనాను ఉద్దేశించి మీరు ఎప్పుడూ భార్యభర్తలుగానే టాస్కులు ఆడుతున్నారంటూ గీతూ కౌంటర్ ఇవ్వగా, మెరీనా ఫైర్ అయ్యింది. నా జోలికి రావొద్దు..వస్తే మామూలుగా ఉండదంటూ మెరీనా విశ్వరూపం చూపించింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
నా ముందు నువ్వు నథింగ్: గీతూపై రేవంత్ ఫైర్
వారమంతా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా సరే నామినేషన్స్ వచ్చేసరికి దోస్తానా పక్కన పెట్టేస్తుంటారు హౌస్మేట్స్. సరైన కారణం ఉందంటే చాలు నామినేషన్లో ఓట్లతో గుద్దిపడేస్తుంటారు. మొన్నటివరకూ నువ్వూ నేను జంట.. టాక్ ఆఫ్ ద టౌన్ అంట.. అని డ్యూయెట్ సాంగ్ పాడుకున్న ఇనయ, సూర్య.. ఇప్పుడు మాత్రం కొట్లాటకు దిగారు. తాజా ప్రోమోలో గీతూ, రేవంత్‌కు మధ్య మాటల యుద్ధం జరిగినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ వీక్ నుంచి రూల్స్ పాటించనిది నువ్వేనని గీతూ.. నువ్వు గొప్ప అని ఫీలవుతున్నావు, తగ్గించుకో, నా ముందు నువ్వు నథింగ్ అని రేవంత్ పోట్లాడుకున్నారు. చాలామంది మెరీనా గేమ్ కనిపించట్లేదని ఆమెను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. మొదటి నుంచీ అందరూ నన్ను నామినేట్ చేస్తున్నారని నువ్వూ చేస్తున్నావ్ తప్ప నీకు పెద్దగా ఏ రీజన్ లేదని కీర్తిపై ఫైర్ అయ్యాడు రేవంత్. మరి ఈ పోట్లాటలు, కొట్లాటలు చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: అరుంధతిలో బాలనటి, ఇప్పుడెలా ఉందంటే? -
ఆది రెడ్డి జీరో, ఎలిమినేట్ అయిపోతావ్!: గీతూ
Bigg Boss Telugu 6, Episode 46: బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీ గేమింగ్ లీగ్ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే కదా! ఈ లీగ్‌లో రేవంత్, ఫైమా, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజ్, కీర్తి, ఇనయ, శ్రీహాన్.. టాలీవుడ్ ఫాంటసిస్ టీమ్ కాగా సూర్య, రోహిత్, అర్జున్, రాజ్, శ్రీసత్య, గీతూ, మెరీనా, వాసంతి టాలీవుడ్ డైనమిక్ టీమ్‌లో ఉన్నారు. ఈ రెండు టీమ్స్‌లో అతి కొద్ది మంది మాత్రమే పర్ఫామ్ చేయగా మిగతా ఎవరూ అసలు టాస్క్‌ను సరిగా పట్టించుకోలేదని ఫైర్ అయ్యాడు బిగ్‌బాస్. ఆ కోపాన్ని నేటి ఎపిసోడ్‌లోనూ కంటిన్యూ చేశాడు. ఇంటిసభ్యులతో మాట్లాడటం మానేశాడు. ఏది చెప్పాలనుకున్నా లెటర్స్ ద్వారానే తెలియజేశాడు. మరి ఆ వివరాలేంటో నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రద్దవడంతో కెప్టెన్‌గా తాను ఫెయిలయ్యానంటూ కెమెరాల ముందు ఏడ్చేశాడు సూర్య. మరోపక్క ఆదిరెడ్డి రివ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఈ సీజన్‌కు వచ్చినవాళ్లలో ఎక్కువమంది తుప్పాస్ కంటెస్టెంట్స్ అని గీతూతో చెప్పుకొచ్చాడు. ఆమెనేమో.. నువ్వు నిన్నటి టాస్క్‌లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, బిగ్‌బాస్‌ను కాదు నన్ను నిరాశపర్చావు అంటూ పెద్ద క్లాస్ పీకింది. ఇలాగైతే ఫేమ్ ఉన్నవాళ్లు ఉండి లేనివాళ్లు వెళ్లిపోతారని జోస్యం పలికింది. 'నువ్వు ఎక్కడ పోతావోనని నాకు భయమేస్తోంది ఆది రెడ్డి. నువ్వు కూడా ఎలిమినేట్ అయ్యేవాళ్ల లిస్ట్‌లో ఉండొచ్చు. కానీ నా వల్ల సేఫ్ అవుతావు. అది పక్కన పెట్టేస్తే నీ వల్ల ఎంటర్టైన్ చేసేవాళ్లు వెళ్లిపోయినా బాధపడతా. నీ దగ్గర ఎంటర్టైన్మెంట్ జీరో' అని అతడిని తక్కువ చేస్తూ మాట్లాడింది. ఆమె మాటలు చూస్తుంటే బాధపడతానంటూనే ఆదిరెడ్డి వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు ఉంది. ఇంతలో అక్కడికి బాలాదిత్య రావడంతో.. నువ్వు మోస్ట్ ఇమ్మేచ్యూర్ పర్సన్‌వి అంటూ అతడిని కూడా తిట్టేసింది. అయినా సరే ఆయన ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయాడు. టాస్క్ బాగా ఆడనివాళ్లలో ఇనయ పేరు కూడా ఉంది. దీంతో తన ఫ్రెండ్సే సరిగా పట్టించుకోవడం లేదని ఫీలైంది ఇనయ. ఆ బాధ పరోక్షంగా శ్రీహాన్‌తో మాట్లాడటానికి కారణమైంది. నన్ను నామినేట్ చేశావనే కోపంతో నిన్ను నామినేట్ చేశానంతే తప్ప నీమీద ఎలాంటి కోపం లేదు, చాలామంది కంటే నువ్వు బెటర్ అని శ్రీహాన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చింది ఇనయ. ఆమె అలా పొగడటంతో సంతోషపడిపోయాడు శ్రీహాన్. మరోపక్క ఇనయను కావాలనే దూరం పెడుతున్నానని సూర్య కెమెరాలతో చెప్పాడు. తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులను బెడ్రూమ్లో ఉండాలని ఆదేశించాడు. వాళ్లందరూ బెడ్రూమ్లో ఉన్నప్పుడు లాక్ చేసేసి ఇంట్లోకి దొంగలను పంపించి ఫుడ్ అంతా వెనక్కు తీసుకెళ్లాడు. అంతేకాదు, ఇప్పటినుంచి ఏది కావాలన్నా పోరాడి సంపాదించుకోవాలని చెప్పాడు. మరోవైపు ఆకలి బాధతో సూర్య, గీతూ స్పూన్ చక్కెర దొరుకుతే దాన్ని సీక్రెట్‌గా ఆరగించారు. ఆకలితో అలమటిస్తున్న ఇంటిసభ్యులకు కబడ్డీ పోటీ పెట్టాడు బిగ్‌బాస్. టాలీవుడ్ ఫాంటసీస్, టాలీవుడ్ డైనమిక్ టీమ్స్ పోటాపోటీగా తలపడ్డాయి. కబడ్డీ ఆటలో అమ్మాయిలు రెచ్చిపోయి మరీ ఆడారు. ఈ పోటీకి గీతూ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో టాలీవుడ్ డైనమిక్ టీమ్ గెలవడంతో అందులోని సభ్యులకు అన్నం, పప్పు పంపించగా వాళ్లు కడుపు నిండా ఆరగించారు. తర్వాత రివర్స్ టగ్ ఆఫ్ వార్ టాస్క్ జరగ్గా దీనికి ఫైమా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో టాలీవుడ్ ఫాంటసిస్ టీమ్ గెలిచింది. వీరికి రోటీలు రావడంతో ఆవురావురుమని తిన్నారు. అయితే వేరే టీమ్ మెంబర్ అయిన గీతూ.. ఆదిరెడ్డి ప్లేట్లో నుంచి కొంత తీసుకుని తింది. ఫలితంగా బిగ్‌బాస్ వాళ్లిద్దరికీ పనిష్మెంట్ ఇచ్చాడు. బయట నుంచి అంట్ల గిన్నెలను పంపించి వాటిని శుభ్రంగా తోమాలని శిక్ష విధించాడు. చచ్చాంరా దేవుడా అనుకుంటూ గీతూ, ఆది వాటిని క్లీన్ చేశారు. ఫస్ట్ టైం అంట్లు తోమామని తెగ బాధపడిపోయారు. తర్వాత హౌస్మేట్స్ శ్రీహాన్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. చదవండి: ఆదిరెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల ఫొటోలు, వీడియోలు -
ఆది, గీతూలతో అంట్లు తోమించిన బిగ్‌బాస్
హౌస్మేట్స్ మీద పీకల్లోతు కోపంలో ఉన్నాడు బిగ్‌బాస్. ఎంటర్టైన్ చేయండ్రా బాబూ అంటే సోది కబుర్లు పెట్టుకుంటూ టైంపాస్ చేస్తున్నారని కంటెస్టంట్లపై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. వీళ్ల కడుపు మాడ్చితేనే దారికొస్తారని డిసైడ్ అయిన బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న వంటసామాగ్రి అంతా లాగేసుకున్నాడు. మళ్లీ అంతలోనే ఆకలితో అలమటిస్తున్న ఇంటిసభ్యులను చూసి జాలిపడిన ఆయన హౌస్‌లోకి ఫుడ్ పంపించాడు. కాకపోతే దాన్ని దక్కించుకోవాలంటే టాస్కులు గెలవాలని మెలిక పెట్టాడు. అలా కబడ్డీ, రివర్స్ టగ్ ఆఫ్ వార్ టాస్కులిచ్చాడు. గెలిచిన టీమ్ సభ్యులు తమ ఆహారాన్ని మిగతా టీమ్ సభ్యులతో షేర్ చేసుకోకూడదని ముందుగానే హెచ్చరించాడు. అయినా ఇదేమీ పట్టించుకోని గీతూ.. గెలిచిన టీమ్ మెంబర్ అయిన ఆది రెడ్డి ప్లేటులోని ఆహారాన్ని కొంత తీసుకుని తినేసింది. దీంతో బిగ్‌బాస్.. తన మాట పెడచెవిన పెట్టిన ఇద్దరికీ పనిష్మెంట్ ఇచ్చాడు. బయట నుంచి అంట్ల పాత్రలు పంపించి వాటిని కడగమని ఆదేశించాడు. చేసినదానికి అనుభవించక తప్పుతుందా? అనుకుంటూ ఆది రెడ్డి, గీతూ.. ఇద్దరూ అంట్లు తోమారు. ఆ తర్వాత ఇద్దరూ తెగ బాధపడ్డారు. ఇంతవరకు ఎప్పుడూ అంట్లు తోమిందే లేదు, ఇదేం టార్చర్‌రా బాబు అని తలలు పట్టుకున్నారు. చదవండి: ఆది రెడ్డి ముఖంపై కాళ్లూపిన గీతూ విష్ణుప్రియ ఫేస్బుక్లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు -
ఆది రెడ్డి ముఖంపై కాలు పెట్టిన గీతూ, నెట్టింట ట్రోలింగ్!
ప్రతి ఇంట్లో తనలాంటి అమ్మాయి ఉండాలి అనుకునేలా చేస్తానంది గీతూ రాయల్. మరి నిజంగానే గీతూ అందరికీ రోల్ మోడల్‌గా నిలబడేట్లుగా ప్రవర్తిస్తుందా? అంటే ఆమెకు గుండె ధైర్యం, ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకునే స్థైర్యం, వాక్చాతుర్యం, ఎవరేమన్నా డోంట్ కేర్ అంటూ లెక్కచేయని తత్వం ఉన్నాయి. కానీ అదే సమయంలో ఎదుటివారిని చులకన చేస్తూ మాట్లాడే స్వభావం, పక్కవాళ్లను (ఆఖరికి బిగ్‌బాస్‌ను సైతం) కాస్తైనా పట్టించుకోని తెంపరి తనం, హద్దులు మీరే అల్లరి.. ఇలా చాలానే ఉన్నాయి. అంతదాకా ఎందుకు? గీతూ ప్రవర్తనకు నిదర్శనంగా పై ఒక్క ఫొటో చాలు.. బిగ్‌బాస్ ఇంట్లో ఎవరితోనూ రిలేషన్స్ పెట్టుకోను, వాళ్లతో కలిసి ఉన్నంత మాత్రాన సంబంధాలు కలుపుకోను అని మొదట్లో బల్ల గుద్ది చెప్పింది గీతూ. కానీ సీజన్ సగానికి వచ్చేసరికి బాలాదిత్య, ఆదిరెడ్డిలతో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ పెట్టుకుంది. వసంతి నామినేట్ చేసినప్పుడు కూడా నాకు క్లోజ్‌గా ఉన్న నువ్వు నామినేషన్ చేస్తే తీసుకోలేకపోయానంది. ఇలా తనకెవరూ వద్దంటూనే అందరితో బాగా కలిసిపోయింది. ఇదిలా ఉంటే ఎటూ ఆదిరెడ్డి.. గీతక్క.. గీతక్క.. అంటూ వెనకాలే తిరుగుతుండటంతో అతడిపై తన పైత్యం చూపించింది గీతూ. సోఫాలో పడుకుని తన కాళ్లు ఆదిరెడ్డి ముఖం వైపు చాపింది. అంతేనా? ఆది ముఖం మీదే కాళ్లు ఊపుతూ మాట్లాడింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మనిషి ముఖం మీద కాళ్లు ఊపడం సంస్కారమా? అని ఫైర్ అవుతున్నారు. తను ఏం చేసినా అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతోనే గీతూ తలపొగరు రోజురోజుకూ పెరిగిపోతుంది అని మండిపడుతున్నారు. అమ్మాయిలకు ఆదర్శంగా ఉంటానన్నావు, అవునవున్లే, నిన్ను చూసి ఎలా ఉండకూడదో తెలుసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. ముఖం మీద కాలు పెట్టొద్దన్న కామన్సెన్స్ కూడా లేదు, మళ్లీ అందరికీ నీతులు చెప్తుంది, వరస్ట్ బిహేవియర్ అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా గీతూ అతి చేష్టలు తగ్గించుకోకపోతే ఆమెకు మొదటికే మోసం వస్తుంది! Intlo ala alavatu ayyundochu... But thats a very bad habit.. Moham meedha kalu petta koodadhu anedhi just common sense...she need to change thay habit... atleast when she said when I want to inspire girls or everyone #GeetuRoyal #BiggBossTelugu6 pic.twitter.com/KSi0rdIVr6 — Vamc Krishna (@lyf_a_zindagi) October 18, 2022 చదవండి: టాస్క్‌లో బోరింగ్ ఫర్ఫామెన్స్, బిగ్‌బాస్ వార్నింగ్ -
బిగ్‌బాస్ 6: గీతూ రాయల్ భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా?
బిగ్‌బాస్ హౌజ్‌లో గీతూ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హౌజ్ అంత ఒకటి అంటే తన మరోకటి అంటుంది. తన దారే సపరేట్ అంటూ హౌజ్‌లో అందరికి చుక్కలు చూపిస్తుంది. చిత్తురు యాస మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న గీతూ హౌజ్‌మేట్స్‌కు మాత్రం తలనొప్పిగా ఉంటుంది. ఎలాంటి దాపరికం లేకుండ మనసులో మాటలను నిర్మోహమాటంగా బయట పెడుతుంది. తన ముక్కుసూటి తనంతో ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ తనదైన ఆట తీరుతో హౌజ్‌మేట్స్‌కి చెమటలు పట్టిస్తుంది. తన యాస, మాటలు, గొడవలు, వివాదాలతో హౌజ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకున్న గీతూకి మిగతా హౌజ్‌మేట్స్‌తో పోలిస్తే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారడంలో అతిశయోక్తి లేదు. ఇక టాస్కుల్లో సైతం అబ్బాయిలకు గట్టి పోటీని ఇస్తుంది. తన విభిన్న వ్యవహర శైలితో అందరిని ఆశ్చర్యపరుస్తున్న గీతూది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో వికాస్ అనే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె భర్త వికాస్ తమిళ నేపథ్య కుటుంబానికి చెందినవాడు. అతను ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వికాస్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా భార్య ఆట తీరుపై అతడు స్పందిస్తూ.. గీతూ ఆట తనకు బాగా నచ్చిందని, తను చాలా బాగా ఆడుతూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ అందిస్తుందన్నాడు. అలాగే తన భార్య అలా టీవీ చూడటం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక గీతూ తన పక్కన లేకపోవడంతో తనని మిస్ అవుతున్నాననే భావన కలుగుతోందన్నాడు. పెళ్లయినప్పుటి నుంచి గీతూ దూరంగా ఉండటం ఇదే తొలిసారి అని చెప్పాడు. ఇక గీతూ మాట తీరు గురించి మాట్లాడుతూ... ‘తన మాట తీరే అంత. ఆమె రూడ్‌గా మాట్లాడినట్లు ఉంటుంది. తన వాయిస్ పెద్దగా ఉండటం వల్ల అల అనిపిస్తుంది. కానీ నిజానికి తను చాలా మృదు స్వభావి. పలకరింపులో కూడా సాఫ్ట్ నెస్ ఉండదు. హౌజ్‌లో గీతూ నటించడం లేదు. సహజంగా ఆమె ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నటన అయితే ప్రతివారం ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుందని కదా’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు. -
గీతూ జిడ్డు, ఫైమా ఇమ్మెచ్యూర్, రేవంత్ అయితే..: సుదీప
Bigg Boss Telugu 6, Episode 43: సండేను ఫండే చేసేందుకు నాగార్జున గట్టిగానే ట్రై చేశాడు. టాస్కుల పేరుతో పాటలు, డ్యాన్సులతో ఎపిసోడ్‌ను ఎలాగోలా నెట్టుకొచ్చాడు. ఆరోవారం ఆరో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశాడు. మరి ఆ వివరాలన్నీ తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. నాగార్జున వచ్చీరాగానే ఆదిరెడ్డి, కీర్తి, రాజ్‌ను సేఫ్ చేశాడు. తర్వాత హౌస్‌మేట్స్‌కి స్క్రీన్‌పై బొమ్మలు చూపించి ఆ పాటేంటో గెస్ చేయమని గేమ్ ఆడించాడు. ఫుల్ ఎనర్జీతో ఉన్న కంటెస్టెంట్లు పాట గెస్ చేయడమూ దానికి తగ్గట్లు స్టెప్పులేయడమూ చేశారు. ఇదైపోగానే మరో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు నాగ్. కొన్ని డైలాగ్ ప్లేట్లు ఇచ్చి ఇది మీకు సెట్టవుతుందా? లేదా మరెవరికైనా సెట్టవుతుందా? చెప్పమన్నాడు. ముందుగా బాలాదిత్య లేచి... అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు, విలన్లు లేరీ నాటకంలో అన్న డైలాగ్ గీతూకు సరిగ్గా సరిపోతుందన్నాడు. సొల్లాపు, దమ్ముంటే నన్ను ఆపు అని సూర్యను హెచ్చరించింది ఇనయ. నా పేరు శివమణి, నాక్కొంచెం మెంటల్ అంది ఫైమా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని చెప్పింది శ్రీసత్య. నా సావు నేను సస్తా, నీకెందుకు? అని రాజ్‌ను అడిగేసింది గీతూ. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులు అని ఒకరకంగా ఫైమాకు వార్నింగ్ ఇచ్చింది సుదీప. మాస్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది అని ఇనయను హెచ్చరించాడు సూర్య. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు, మాడిపోతావు అని ఇనయకు వార్నింగ్ ఇచ్చాడు శ్రీహాన్. నా సావు నేను సస్తా, నీకెందుకు అని ఆదిరెడ్డిని అడిగింది కీర్తి. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే అన్న డైలాగ్‌ను ఒకరికొకరు అంకితమిచ్చుకున్నారు రోహిత్, ఆదిరెడ్డి. దమ్ము టన్నులు టన్నులుంది చూస్తావా? అని గీతూను అడిగాడు రాజ్. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని అందరిముందు రోహిత్‌కు స్ట్రాంగ్‌గా చెప్పింది మెరీనా. చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ఫాడిస్తా అని అర్జున్ను బెదిరించాడు రేవంత్. చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ఫాడిస్తా అని రేవంత్‌ను బెదిరించింది వాసంతి. నన్ను కొడుతున్నాడు, పకోడి అని పిలుస్తున్నాడు, ఈసారి నన్ను కొడితే తిరిగి కొడ్తానంది వాసంతి. తర్వాత గీతూ సేఫ్ అయింది. చివరగా బాలాదిత్య, సుదీప మిగలగా.. సుదీప ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో బాలాదిత్య, మెరీనా, వాసంతి కన్నీళ్లు పెట్టుకున్నారు. గీతూ మాత్రం ఏదో ఆలోచిస్తూ.. మనం ఈ హౌస్‌లో మాట్లాడకపోతేనే బాగుంటుంది, బయట వెళ్లాక ఈ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ పెట్టుకుందామని బాలాదిత్యతో అంది. తర్వాత స్టేజీ మీదకు వచ్చిన సుదీప.. ఇంటిసభ్యులను కొన్ని కూరగాయల మీనింగ్స్‌తో పోల్చింది. అల్లం ఎలా వంకరటింకరగా ఉంటుందో గీతూ అలా వంకరటింకరగా నడుస్తుందని చెప్పింది. పచ్చిమిర్చి ఘాటులా రేవంత్‌ది షార్ట్టంగ్ అంది. ఆదిరెడ్డి కొబ్బరికాయలా పైకి గట్టిగా ఉన్నా లోపల సాఫ్ట్‌గా ఉంటాడంది. అర్జున్ కన్ఫ్యూజ్డ్, శ్రీహాన్ మాస్క్ వెనకాల దాక్కున్నాడు, అంటే పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైనవి చూపిస్తాడు అని పేర్కొంది. రాడిష్లా ఇనయను చాలా తక్కువ మంది ఇష్టపడ్తారంది. కానీ ఆమె మనసులో ఏమీ పెట్టుకోదని మెచ్చుకుంది. ఫైమా ఇంకా చిన్నదే కాబట్టి ఇమ్మెచ్యూర్ అంది. బద్ధకస్తురాలైన గీతూను జిడ్డుతో పోల్చింది. చదవండి: చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో.. : వాసంతి హన్సిక రాయల్ వెడ్డింగ్, పెళ్లి ఎక్కడో తెలుసా? -
గీతూను ఆడేసుకున్న నాగ్.. తిక్క కుదిర్చాడుగా!
సినిమాలతోనే కాదు రియాలిటీ షో హోస్ట్‌గానూ మెప్పిస్తున్నాడు కింగ్ నాగార్జున. బిగ్‌బాస్ మూడో సీజన్ నుంచి వరుసగా అతడే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో బిగ్‌బాస్ ఓటీటీని కూడా హోస్ట్‌గా రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం నాగ్ ఆరో సీజన్‌ను హ్యాండిల్ చేస్తున్నాడు. అయితే ప్రతి సీజన్లోనూ శనివారం క్లాస్ పీకడం, ఆదివారం ఎంటర్టైన్మెంట్కు పెద్ద పీట వేయడం చూస్తూనే ఉన్నాం. నిన్న హౌస్‌మేట్స్‌కు వీడియోలు చూపించి గేమ్ పరంగా ఎవరు బెస్ట్? ఎవరు వేస్ట్? అని చెప్పిన నాగ్ నేడు మాత్రం సరదా ఆటలతో వారిని ఉత్సాహపరిచాడు. హౌస్‌మేట్స్‌తో బొమ్మలతో పాట గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా స్క్రీన్‌పై ఉన్న బొమ్మలను చూసి అది ఏ పాటో గెస్ చేయాలి. ఇక టాస్కుల కోసం ఏదైనా వస్తువులు అవసరమైతే అవి గీతూ తీసుకురావాలన్నాడు నాగ్. ఆమెకు బద్ధకమని ఆదిత్య చెప్పడంతో కావాలని మరీ గీతూకు పదేపదే పనులు అప్పజెప్పాడు హోస్ట్. దీంతో ఏందిరా నాయనా, సామీ.. అని తల పట్టుకున్న గీతూ తొండి సార్, నాతో ఆడుకుంటున్నారు అని బుంగమూతి పెట్టుకుంది. మరి వీరి ఫన్ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే! చదవండి: లీకైన ఎలిమినేషన్, ఆమె అవుట్ -
అతడు ఎక్కడ దూరమైపోతాడోనని కుళ్లి కుళ్లి ఏడ్చా: గీతూ
Bigg Boss Telugu 6, Episode 42: నీ క్రష్ ఎవరో చెప్పొచ్చుగా అని ఇంటిసభ్యులు ఇనయను ఆటపట్టించారు. దీంతో ఆమె తెగ సిగ్గుపడుతూ బాత్రూమ్ ఏరియాలో ఉన్న సూర్య దగ్గరకు పరుగెత్తికెళ్లింది. ఇంతలో హౌస్మేట్స్ ఇంకెవరు, సూర్యనే తన క్రష్ అయి ఉండొచ్చని కరెక్ట్‌గా గెస్ చేశారు. అదే మాట తనను అడగ్గా అందరూ ఊహించిందే నిజమని చెప్పింది. మరోవైపు అర్జున్ మీదకు అరిచేసింది శ్రీసత్య.ఈ పంచాయితీలు నాకొద్దు, నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటా అన్న రీతిలో గమ్మునుండిపోయాడు అర్జున్. కానీ అంతలోనే శ్రీసత్య వచ్చి సారీ చెప్పి అతడిని కూల్ చేసింది. ఇక వీకెండ్లో స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చిన నాగ్ అవసరమైన వారికి వీడియోలు చూపిస్తూ క్లాసులు పీకాడు. ఈ వారం బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో రోహిత్ గొప్ప త్యాగం చేసిన విషయం తెలిసిందే కదా! రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ అవడంతో బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్ అయింది. దీన్ని ఫైమా, రేవంత్, వాసంతి, కీర్తి, సూర్య, రాజ్ వాడేసుకున్నారు. కానీ రోహిత్ వాడుకునేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇది అన్యాయమని ఇంటిసభ్యులను కడిగిపారేశాడు నాగ్. రోహిత్ కోసం ఒకరు త్యాగం చేయాల్సిందేనని చెప్పాడు. దీంతో వాసంతిని సెలక్ట్ చేయగా బిగ్‌బాస్ ఆదేశం మేరకు తన జుట్టును కత్తిరించుకుంది. అనంతరం రోహిత్- మెరీనాలకు వారి ఫ్యామిలీ వీడియో మెసేజ్ చూపించడంతో ఇద్దరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కెప్టెన్ రేవంత్ రూల్స్ మర్చిపోయి ఆదమరిచి నిద్రించిన వీడియోను బిగ్‌బాస్ ప్లే చేయడంతో అందరూ పడీపడీ నవ్వారు. తర్వాత బాలాదిత్యకు అసలు సిసలైన వీడియో చూపించారు. ఓ టాస్క్‌లో భాగంగా ఇల్లంతా ఫుడ్ మానేయాలి లేదంటే బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలని బిగ్‌బాస్ చెప్పాడంటూ గీతూ అందరితో అంది. కానీ బిగ్‌బాస్ అక్కడ ఇంటిసభ్యులు కేవలం చక్కెర మాత్రమే త్యాగం చేయాలన్నాడు. దాన్ని ఆమె తనకు నచ్చినట్లు మార్చేసింది. దీనికి సంబంధించిన వీడియో చూసిన ఆదిత్య నిజమేంటో తెలుసుకుని గుడ్లు తేలేశాడు. అయినా తన చెల్లెలు. గీతూ తన మంచి కోసమే ఇలా చేసిందని వెనకేసుకురావడం విశేషం. కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన ఫైమాను నాగ్ ఏదైనా ఆసక్తికర విషయం చెప్పమన్నాడు. దానికామె సూర్య, ఇయన మధ్య 'క్రష్' స్టోరీ ఇంట్రస్టింగ్‌గా ఉందంది. బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో ఎవరు ఎలా పర్ఫామ్ చేశారో ర్యాంకులిచ్చాడు నాగ్. సూర్య, ఫైమా, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, రోహిత్ బాగా ఆడారన్నాడు. బాలాదిత్య, రాజ్, కీర్తి, వాసంతి, సుదీప, మెరీనా, ఆది రెడ్డి యావరేజ్ అని చెప్పాడు. ఇనయ ఒకప్పుడు ఆటలో గుడ్, ఈ వారం ఆటలో డెడ్ అని చెప్పాడు నాగ్. నీ ఫోకస్ ఆట నుంచి మనుషుల మీదకు మారిందన్నాడు.అర్జున్ ఆట బాగా ఆడుతున్నావ్ కానీ ఒక మాట మీద నిలకడగా ఉండనందుకు యావరేజ్ అని చెప్పాడు నాగ్. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన గీతూ.. ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పింది. బిగ్‌బాస్ నన్ను ఏడిపించు అని పదే పదే అంటాను కదా, ఆదిరెడ్డిని తిడ్తుంటే నాకు బాధేస్తోంది అని అతడి భార్య అంది. దీంతో ఆది నాకు దూరమైపోతాడేమో అనిపించింది రాత్రి దుప్పట్లో కుళ్లి కుళ్లి ఏడ్చేశాను అని చెప్పింది. కాగా, చివర్లో శ్రీసత్య సేఫ్ అయినట్లు నాగ్ వెల్లడించాడు. చదవండి: అతడు సేఫ్, ఆమె ఎలిమినేట్! సిగరెట్లు లేక అల్లాడుతున్న ఆదిత్య, అతడి భార్య ఏమందంటే? -
సిగరెట్లు లేక అల్లాడుతున్న బాలాదిత్య, అతడి భార్య ఏమందంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో సాఫ్ట్ అండ్ స్వీట్‌గా నడుచుకునే వ్యక్తి బాలాదిత్య. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇతడు బిగ్‌బాస్ షోతో జనాలకు మరింత దగ్గరవ్వాలనుకున్నాడు. కానీ అతి మంచితనమే అతడికి శత్రువుగా మారింది. ఇది నిజంగా మంచితనమేనా? సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఫేక్ కంటెస్టెంట్ అని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సరే అతడు మాత్రం ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. ఇకపోతే ఇటీవల బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో బాలాదిత్య తన సిగరెట్లు త్యాగం చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే అతడు సిగరెట్లు మానేలా చేసింది గీతూ. బ్యాటరీ రీచార్జ్ అవ్వాలంటే ఇంటిసభ్యులు చక్కెర త్యాగం చేయాలి, లేదంటే బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలని గీతూకు పిలిచి చెప్పాడు బిగ్‌బాస్. దొరికిందే ఛాన్స్ అనుకున్న గీతూ.. ఇంటిసభ్యులు ఫుడ్ మానేయమడా? లేదా బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేస్తాడా? తేల్చుకోమని బిగ్‌బాస్ చెప్పాడంది. దీంతో ఆదిత్య ముందుకు వచ్చి పొగ తాగడాన్ని వదిలేశాడు. కానీ ఇప్పటికీ కెమెరాల ముందుకు వచ్చి సిగరెట్లు పంపించమని బతిమిలాడుతూనే ఉన్నాడు. ఈ వ్యవహారంపై బాలాదిత్య భార్య మానస స్పందించింది. 'బాలాదిత్య సిగరెట్లు తాగడం మానేయాలనుకుంటే మానేయగలడు. హనుమాన్ మాల వేసుకున్నప్పుడు 40 రోజులు ఒక్క సిగరెట్ ముట్టుకోలేదు. అయితే గీతూ అందరి ఎదుట సిగరెట్ మానేయాలని చెప్పడం బాగోలేదు. అది తన వీక్నెస్ అని తెలిసి, తనతో ర్యాపో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి ఆయనకే చెప్తే బాగుండని ఆదిత్య అనుకున్నాడు. అతడితో స్మోకింగ్ మానిపించాలన్నదే ఆమె ఉద్దేశ్యం. దాన్ని నేను తప్పుపట్టను' అని చెప్పింది. చదవండి: ఇనయనే వెంటపడుతోంది.. సూర్య గర్ల్‌ఫ్రెండ్ లుండీ డ్యాన్స్‌తో రచ్చ లేపిన కీర్తి సురేశ్ -
ఆరోహి పోయిందనుకుంటే ఇనయను తగులుకున్నాడేంట్రా నాయనా!
బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో హౌస్మేట్స్ గురించి ఎలాంటి చర్చ నడుస్తోంది? ఇలా అన్ని విషయాలను కెఫె ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటోంది అరియానా గ్లోరీ. ఒక్క అరియానానే కాదు.. ఈ షోకు నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్‌గా విచ్చేస్తూ బిగ్‌బాస్ షో గురించి రివ్యూ ఇస్తున్నారు. తాజాగా ఈ కెఫె షోకి మాజీ కంటెస్టెంట్ స్రవంతి చొక్కారపు వచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'ఫస్ట్ గీతూ అస్సలు నచ్చలేదు. కానీ రానురానూ అద్భుతంగా ఆడుతోంది. రేవంత్, గీతూ, శ్రీహాన్.. కచ్చితంగా టాప్ 5లో ఉంటారు. సూర్య విషయానికి వస్తే.. ఒక ఎమోషన్‌కు అటాచ్ అయితే గేమ్ వీక్ అవుతుందని నేను నమ్ముతాను. ఆరోహి ఉన్నప్పుడు ఏంది? ఇలా చేస్తున్నాడనుకున్నాను. సరే ఆరోహి పోయింది, ఆట బాగా ఆడతాడనుకుంటే మళ్లీ ఈ ఇనయ పిల్లను తగులుకున్నాడేంట్రా నాయనా అనిపించింది. అటు అర్జున్ కల్యాణ్ కూడా పదేపదే శ్రీసత్య వెనకాల పడటం అవసరం లేదు. ఆ ఒక్క విషయం నుంచి బయటపడితే తను బాగా ఆడగలడు. వాసంతి.. డ్యాన్స్ చేయలేదని ఆదిరెడ్డిని నామినేట్ చేయడం ఘోరం. మరీ ఎడ్డిదానిలా ప్రవర్తించింది. ప్రతి సీజన్లో ఒక కోపిష్టి ఉంటాడు. అలా ఈ సీజన్లో రేవంత్ ఒకరు. ఆ కోపాన్ని కొంత కంట్రోల్ చేసుకుంటే అతడు బెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. ఈ సీజన్లో మోస్ట్ కన్నింగ్ కంటెస్టెంట్ శ్రీసత్య' అని హౌస్మేట్స్ గురించి రివ్యూ ఇచ్చింది స్రవంతి. చదవండి: విన్నర్ అయిపోతానన్న గీతూ.. టాప్ 5లో ఉంటావన్న తండ్రి సినిమా ఛాన్స్ పేరుతో ఇంటికి పిలిచి.. : దర్శకుడి బండారం బయటపెట్టిన నటి -
విన్నర్దాకా పోకు, టాప్ 5లో ఉంటావంతే: గీతూ తండ్రి
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్‌తో ఇంటిసభ్యులకు మంచి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే ఈ టాస్క్‌లో భాగంగా శ్రీహాన్, ఆది రెడ్డి, సుదీపలు బ్యాటరీలో 95 శాతం వాడుకోవడంతో 5 శాతమే మిగిలింది. తిరిగి బ్యాటరీ రీచార్జ్ చేయాలంటే ఇంట్లోని చక్కెర మొత్తాన్ని త్యాగం చేయాలని లేదంటే బాలాదిత్యను స్మోకింగ్ మానేయమని ఒప్పించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో గీతూ దొరికిందే ఛాన్సని ఆదిత్యతో పొగ తాగడం మానేలా చేద్దామనుకుంది. వెంటనే ఇంటిసభ్యుల దగ్గరికి వెళ్లి బిగ్‌బాస్ చెప్పింది కాకుండా తనకు నచ్చిన పాయింట్‌ను యాడ్ చేసింది. అందరూ తిండి మానేస్తే 70 శాతం చార్జ్ అవుతుందని, ఒకవేళ బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేస్తే 90 శాతం చార్జ్ అవుతుందని చెప్పింది. దీంతో అతడు మారుమాట్లాడకుండా తన వ్యసనమైన సిగరెట్లను త్యాగం చేశాడు. అనంతరం కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన గీతూ ఆడియో కాల్(15) ఎంచుకుంది. తర్వాత అర్జున్.. తనకోసం కాకుండా సత్యకు వీడియో కాల్ ట్రాన్స్ఫర్ చేయండన్నాడు. అది కుదరదని బిగ్‌బాస్ చెప్పడంతో వీడియో మెసేజ్ (35) సెలక్ట్ చేసుకున్నాడు. ఇక గీతూకు తన తండ్రి ఫోన్ చేసి చాలానే మాట్లాడాడు. ఇప్పుడే విన్నర్ అని ఊహించుకోకు. కానీ ప్రస్తుతానికైతే టాప్ 5లో ఉంటావు. కొంచెం యాటిట్యూడ్ మార్చుకో. ప్రతి ఆడపిల్ల కూడా గీతూలా ఉండాలి అనిపించేలా చేయు. కానీ కొన్ని మార్చుకుంటేనే అందరికీ రోల్ మోడల్ అవుతావు అని సూచనలిచ్చాడు ఆమె తండ్రి. తర్వాత అర్జున్ తండ్రి వీడియో మెసేజ్ చూసి ఇంటిసభ్యులంతా ఎమోషనలయ్యారు. మరోపక్క ఇనయ.. తనకు ఫైమాతో ఉంటే అమ్మతో, సూర్యతో ఉంటే నాన్నతో, రాజ్‌తో ఉంటే ఫ్రెండ్స్‌తో ఉన్నట్లు ఉందని చెప్తూ ఎమోషనలైంది. అంతలోనే ఆమెను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలవడంతో ఉన్నదాంట్లో తక్కువైన ఫొటో ఫ్రేమ్(25)ను సెలక్ట్ చేసుకుంది. గీతూ, ఇనయ, అర్జున్ వాడుకోగా మిగిలిన బ్యాటరీ 5 శాతమే ఉండటంతో దాన్ని మళ్లీ రీచార్జ్ చేయడానికి బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఫైమా ఇంగ్లీష్‌లో సినిమాల గురించి చెప్తుంటే అదేం సినిమానో ఇంటిసభ్యులు గెస్ చేయాలి. ఆ టాస్క్ విజయవంతంగా పూర్తి కావడంతో బ్యాటరీ మళ్లీ రీచార్జ్ అయింది. తర్వాత శ్రీసత్య 35 శాతం ఉన్న వీడియో కాల్ సెలక్ట్ చేసుకుంది. వీడియో కాల్లో తల్లిదండ్రులను చూడగానే సత్య భావోద్వేగానికి లోనైంది. తర్వాత బాలాదిత్య 50 శాతం ఉన్న ఆడియోకాల్ ఎంచుకుని భార్య, కుమార్తెతో తనివితీరా మాట్లాడాడు. అయితే అందరికీ ఛాన్స్ రావాలని తక్కువ రీచార్జ్ ఉన్న ఫుడ్ ఆప్షన్ ఎంచుకుని పేరెంట్స్‌తో మాట్లాడలేకపోయాడు శ్రీహాన్. ఇలా బ్యాటరీ రీచార్జ్ చేసే ఆప్షన్ ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదంటూ ఓ మూలకెళ్లి కూర్చుని ఒక్కడే ఏడ్చేశాడు. ఇదిలా ఉంటే మెరీనా మైక్ ధరించనప్పుడు, రేవంత్ పడుకున్నప్పుడు కలిపి పది శాతం వరకు చార్జ్ తగ్గిపోయింది. ఈ లెక్కన వీళ్లకు నామినేషన్స్‌లో ఇదే కారణం చెప్పి ఓట్లు గుద్దడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలి మహేశ్‌బాబును అలా చూడటం ఇదే మొదటిసారి -
తిండైనా మానేయండి, లేదా అతడితో ఆ పనైనా చేయించండి!
బిగ్‌బాస్ షో మొదలై ఆరు వారాలైందో లేదో అప్పుడే ఇంటిసభ్యుల మీద వరాల జల్లు మొదలైంది. కంటెస్టెంట్లకు వారి ఇంటిసభ్యుల మీద బెంగను తీర్చుకునే అవకాశం కల్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే శ్రీహాన్ తన తల్లి వండిన మటన్ బిర్యానీని ఆరగించగా ఆదిరెడ్డి భార్యాబిడ్డలతో వీడియో కాల్ మాట్లాడాడు. ఈ రోజు మిగతా హౌస్‌మేట్స్‌కు సర్ప్రైజ్లు ఇస్తూనే అదే సమయంలో వారి నుంచి కొన్ని త్యాగాలు కోరుతున్నాడు బిగ్‌బాస్. ఈ మేరకు తాజాగా రిలీజైన ప్రోమోలో పెద్ద తిరకాసే పెట్టాడు. ఇంటిసభ్యులందరూ ఏమీ తినకూడదు లేదంటే బాలాదిత్య సిగరెట్లు మొత్తం త్యాగం చేయాలి.. అప్పుడే బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్ అవుతుందన్నాడు. అందరూ ఇబ్బందిపడేకంటే తనే సిగరెట్ మానేస్తానన్నాడు బాలాదిత్య. అతడు స్మోక్ చేయకుండా చూడాల్సిన బాధ్యత కెప్టెన్‌దేనని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇకపోతే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన అర్జున్.. తనకిచ్చిన మూడు ఆప్షన్లు ఎంచుకోకుండా.. సత్య గురించి తెగ ఆలోచించాడు. తనకే ఆప్షనూ వద్దని వీలైతే సత్య తన తల్లితో మాట్లాడేలా చూడండని వేడుకున్నాడు. కానీ అది కుదరదనడంతో తండ్రితో వీడియోకాల్ ఎంచుకున్నాడు. తండ్రిని చూడగానే అర్జున్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరోవైపు గీతూ తనకు పిల్లి బొచ్చు, ఆడియో కాల్ రెండూ కావాలని కోరింది. మరి బిగ్‌బాస్ గీతూ అడిగిన రెండు కోరికలను నెరవేరుస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఘోరమైన బూతు, అదేంటో తెలిస్తే ఇనయ చెప్పుతో కొడుతుంది -
నీవల్లే చంటి వెళ్లిపోయాడు.. నామినేషన్లో ఒకటే గుద్దుడు!
Bigg Boss 6 Telugu, Episode 37: మండే వచ్చిందంటే చాలు బయట వాతావరణం కూల్‌గా ఉన్నా బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం హీట్ ఓ రేంజ్లో ఉంటుంది. వారంలో ఎన్నడూ నోరు మెదపని కంటెస్టెంట్ కూడా నామినేషన్స్‌లో గొంతు విప్పాల్సిందే! అవసరమైతే పోట్లాటకు, కుదిరితే కొట్లాటకు సైతం రెడీగా ఉండాల్సిందే! ఆ లెవల్లో ఉంటాయి బిగ్‌బాస్ నామినేషన్స్. మరి ఈ ఆరోవారం నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే ఈ హైలైట్స్ చదివేయండి. మొన్నటిదాకా శ్రీసత్య- అర్జున్, సూర్య-ఆరోహిలను జంటలుగా చూపించారు. అయితే శ్రీసత్య తనకు ఇంట్రస్ట్ లేదని, ఎంత ట్రై చసినా వేస్ట్ అని చెప్పేయడంతో వారి ప్రేమ కహానీ అక్కడే ఆగిపోయింది. అటు ఆరోహి ఎలిమినేట్ అవడంతో ఇనయ వెంటపడ్డాడు సూర్య. ప్రస్తుతానికి హౌస్‌లో వీరేదో ప్రేమపక్షులు అన్నంత రేంజ్లో పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇదిలా పక్కన పెడితే ఆటకు కాకుండా అందానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే వాసంతి అంటే రేవంత్‌కు ఇంట్రస్ట్ ఉందంటూ ఆదిరెడ్డి చెవులు కొరికింది గీతూ. దీనికి అర్జున్ కూడా అవునంటూ వంత పాడాడు. అతడు వేరేవాళ్లను లింక్ చేస్తే జోక్.. మనం చేస్తే మాత్రం సీరియస్ అవుతాడని చిటపటలాడాడు. తర్వాత బిగ్‌బాస్.. ఇద్దరు ఇంటిసభ్యుల ముఖంపై ఫోమ్ పూసి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించాడు. మొదటగా కెప్టెన్ రేవంత్.. బాలాదిత్య, సుదీపలను నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. హౌస్‌లో గేమ్ ఆడుతూ ఉండాలే తప్ప మంచితనంతో ఉండొద్దంటూ మెరీనాను నామినేట్ చేశాడు. ఓవర్ థింకింగ్ అంటూ కీర్తికి ఫోమ్ పూశాడు. మెరీనా నామినేట్ చేసేటప్పుడు ఆది హైపర్ అయిపోయాడు. ఈ క్రమంలో రోహిత్, ఆది కొట్టుకునేదాకా వెళ్లారు. కీర్తి.. గీతూ, సత్యలను; రోహిత్.. శ్రీహాన్, ఆదిని; సుదీప.. ఆది, కీర్తిలను; వాసంతి.. గీతూ, ఆదిలను; శ్రీహాన్.. గీతూ, రాజ్‌లను; బాలాదిత్య.. గీతూ, రాజ్‌లను; అర్జున్.. కీర్తిని, ఆదిని; సూర్య.. గీతూ, ఆదిని; ఫైమా.. సుదీప, బాలాదిత్యను; ఇనయ.. శ్రీహాన్, కీర్తి; రాజ్.. గీతూ, బాలాదిత్యను; మెరీనా.. కీర్తి, ఆది రెడ్డిని నామినేట్ చేశారు. రాజ్ తనను నామినేట్ చేయడం సహించలేకపోయిన గీతూ తన వంతు వచ్చేసరికి చెలరేగిపోయింది. 'నన్ను తుప్పాస్ రీజన్స్‌తో నామినేట్ చేశావు. నువ్వు ఈ హౌస్‌లో అందరికంటే వీక్, ఒక్క శాతం ఎంటర్టైన్మెంట్ చేయలేదు అంటూ రాజ్‌ను ఏకిపారేసింది. అతడితో పాటు కీర్తిని నామినేట్ చేసింది. శ్రీసత్య మాట్లాడుతూ.. బూతులు మాట్లాడావంటూ కీర్తిని, ఎంటర్టైన్మెంట్ తక్కువైందని ఆదిని నామినేట్ చేసింది. నీ వల్లే చంటి బయటకు వెళ్లాడని కీర్తికి ఎక్కువ నామినేషన్ ఓట్లు పడటం గమనార్హం. ఫైనల్‌గా ఈ వారం కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మెరీనా నామినేట్ అయ్యారు. చదవండి: ఆ హగ్గులేంది? రాత్రిపూట ఆ రచ్చేంది? గీతూకే అంతుంటే నాకెంతుండాలి? -
రేవంత్ నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు, ఫైమాతో.. : గీతూ
బిగ్‌బాస్ 6- ఎపిసోడ్ 33 హైలైట్స్: బిగ్‌బాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా వినోదాన్ని పంచింది. మొత్తంగా ఇలా అయినా జనాలకు కావాల్సినంత ఫన్ దొరికింది. అయితే బర్త్‌డే వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించడంతో, ఈ రోజు హౌస్మేట్స్ కోరికలను తెలుసుకోవాలనుకున్నాడు బిగ్‌బాస్. అందులో భాగంగా కంటెస్టెంట్లు వారి కుటుంబసభ్యులు నెరవేర్చగలిగే కోరికలేంటో చెప్పమని ఆదేశించాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. 'నా బర్త్‌డేకు నా చేతుల మీదుగా శ్రీహాన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనాథలకు, వృద్ధులకు సాయం చేద్దామనుకున్నా. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నా కాబట్టి సిరి ఆ పని పూర్తి చేయాలి. అలాగే మా అమ్మానాన్నలకు రోజుకొక్కసారైనా ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడు సిరి' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. తన గారాలపట్టికి హౌస్ నుంచి బయటకు వచ్చాక మంచి పేరు పెడతానంటూ ఎమోషనల్ అయ్యాడు బాలాదిత్య. మా బావ, అమ్మ ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలనుందని మనసులో మాటను బయటపెట్టింది ఫైమా. నా తల్లిదండ్రులు మాట్లాడిన ఒక వీడియో బైట్ చూపిస్తే అంతే చాలంటూ ఎమోషనలయ్యారు అర్జున్, సూర్య. మా అమ్మ బిగ్‌బాస్ హౌస్‌కు రావాలి, తనని గట్టిగా హగ్ చేసుకోవాలనుంది. తనను మా నాన్న అంత బాగా చూసుకోలేనేమో కానీ ఆయన లేని లోటును మాత్రం గుర్తు చేయను అని ఏడ్చేసింది ఇనయ. మా ఆయన రంగనాథ్, కుటుంబం అంతా మాట్లాడిన వీడియో చూపించాలని కోరుకుంటున్నానంది పింకీ. 'ఓరియో నాకు ప్రతిరోజు ముద్దు పెట్టి నిద్ర లేపుతాడు. నా పెంపుడు కుక్కలు ఓరియో, ఫిడోల బొచ్చు కావాలి. అది నాకు చాలా అమూల్యమైనది' అని చెప్పుకొచ్చింది గీతూ. 'అక్టోబర్ 27న నా కూతురి బర్త్‌డే. ఆమె పుట్టినరోజు బిగ్‌బాస్ హౌస్‌లో జరగాలన్నదే నా కోరిక' అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. అనంతరం బిగ్‌బాస్ ఈ వారం ఎక్కువ ఎంటర్టైన్ చేసిన ఆరుగురిని కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఎంపిక చేయమని కెప్టెన్ కీర్తికి బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఆమె ఫైమా, రేవంత్, సూర్య, గీతూ, ఆదిత్య, రాజశేఖర్ పేర్లను సూచించింది. వీరు గేమ్ ఆడగా.. మొదటి లెవల్లో గెలిచి తొలి మూడు స్థానాల్లో ఉన్న సూర్య, బాలాదిత్య, రేవంత్ రెండో లెవల్‌కు వెళ్లారు. రెండో లెవల్ గేమ్ రేపు ప్రసారం కానుంది. అయితే ఈ ముగ్గురిలో రేవంత్ గెలిచి కెప్టెన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేవంత్ తన బుగ్గ మీద ముద్దుపెట్టడం నచ్చలేదని అతడితోనే చెప్పింది గీతూ. తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పడంతో తన తీరు మార్చుకుంటానన్నాడు రేవంత్. అలాగే ఫైమా కాళ్లపై పడుకున్నావని, కాస్త వాళ్లు కంఫర్టో కాదో చూసుకోమని సూచించింది గీతూ. చదవండి: మూడుసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చిన గీతూ తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన అర్జున్ -
మూడుసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చిన గీతూ!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు? అంటే అందులో గీతూ రాయల్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. హౌస్‌లో ఆమె గొంతు వినిపించడమే కాదు, ప్రేక్షకులకు ఆమె ఆట కూడా కనిపిస్తుంది. వరుసగా నామినేట్ అవుతూ వస్తున్న గీతూ ఈ వారం కాస్త బ్రేక్ తీసుకుని బిగ్‌బాస్ హౌస్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. సీతయ్య ఎవ్వడి మాటా వినడు అనే టైప్‌లో పక్కవాళ్లు చెప్పింది కాకుండా తన మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతోంది. అటు టాస్క్‌లు ఆడుతూ, ఇటు ఎంటర్టైన్ చేస్తూ తగ్గేదేలే అంటోంది. ముక్కుసూటిగా మాట్లాడే గీతూ రియల్ లైఫ్‌లో మూడుసార్లు చావు అంచుల వరకు వెళ్లొచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గీతూ పేరెంట్స్ మాట్లాడుతూ.. 'మా కుటుంబానికి ఆగస్టు గండం ఉంది. ఆగస్టు వస్తుందంటేనే భయపడిపోతాం. ఆ నెలలో ఏదో ఒక ఇబ్బందులు వస్తుంటాయి. గీతూ ఒకసారి బస్సు దిగేటప్పుడు కిందపడి తలకు బాగా దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. కానీ బతికి బట్టకట్టింది. అలా చిన్నప్పుడు ఓసారి, పదో తరగతిలో ఓసారి, డిగ్రీలో ఓసారి కోమాలోకి వెళ్లి వచ్చింది. కర్నూలు, చెన్నై, బెంగళూరులో మూడుసార్లు ఆమె కోమాలోకి వెళ్లి బయటపడింది. నిజానికి ఆమెను బతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు, కానీ భగవంతుడి దయ వల్ల ఆమె తిరిగి ఊపిరి తీసుకుంది. అయితే మూడుసార్లు కోమాలోకి వెళ్లడం వల్ల కొన్నిసార్లు తను చిన్నచిన్న విషయాలు మర్చిపోతుంటుంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో టాస్కులు ఆడే సమయంలో ఆమె తలకు ఎక్కడ దెబ్బ తగులుతుందోనన్న భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది' అని చెప్పుకొచ్చారు. చదవండి: ఒక్క దెబ్బతో పడిపోయిన ఇనయా గ్రాఫ్ -
Bigg Boss 6 : ఫైమాకు సీక్రెట్ టాస్క్, వాళ్ల గురించి గాసిప్ చెప్పిన గీతూ
బిగ్‌బాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ సరదాగా సాగింది. తన పుట్టినరోజు సందర్భంగా కేక్ పంపించిన బిగ్‌బాస్.. దాన్ని తినాలంటే మాత్రం ఎంటర్టైన్ చేయాలని ఆదేశించాడు. దీంతో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్లు చేశారు. బిగ్‌బాస్‌ను సంతృప్తి పరిచేందుకు హౌస్మేట్స్ తమ టాలెంట్‌తో బాగానే మెప్పించారు. సూర్య మిమిక్రీతో అదరగొడితే, సత్య, శ్రీహాన్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేసింది. ఇక వీళ్లిద్దరి డ్యాన్స్ చూసి అర్జున్ ముఖం మాడిపోయిన దోశ మాదిరి అయిపోయింది. అందరూ వీరి డ్యూయెట్ చూసి చప్పట్లు కొడుతుంటే అర్జున్ మాత్రం బాగా హర్ట్ అయ్యాడు. ఇక గీతూకు చికెన్ ఆఫర్ చేసిన బిగ్‌బాస్ దాన్ని తినాలంటే గాసిప్ చెప్పాలంటూ ఫిట్టింగు పెట్టాడు. దీంతో సూర్య, ఇనయల మధ్య ఏదో నడుస్తోందని చెప్పిన గీతూ, సత్యను అర్జున్ భయంకరంగా ట్రై చేస్తున్నాడని పేర్కొంది. ఇక బాలాదిత్య మాటి మాటికీ.. దీపు దీపు అంటుంటే నాకు మండతా ఉంది అని చెప్పగా ‘అంతమంటతో నువ్ ఈ చికెన్‌ని తినలేవులే కానీ.. మాట్లాడి మాట్లాడి బాగా అలిసిపోయినట్టు ఉన్నావ్.. ముందు కొంచెం చికెన్ తిను అన్నాడు బిగ్‌బాస్. ఆ తర్వాత ఫైమాని లోపలికి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. దీంతో ఫైమా కూడా బయట తెగ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మొత్తంగా బిగ్‌బాస్ బర్త్‌డే ఎపిసోడ్ ఇలా సాగింది. -
తొలిసారి గీతూపై ఫైర్ అయిన నాగార్జున.. కారణం అదేనా?
బిగ్‌బాస్ సీజన్-6 దసరా ఎపిసోడ్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎప్పుడూ చలాకీగా ఉండే గీతూపై నాగార్జున తొలిసారి సీరియస్ అయ్యారు. కీర్తి, చంటీల మధ్య అప్పటికే ఒక డిస్కషన్ జరుగుతుంది. వీరితో నాగార్జున మాట్లాడుతుండగానే గీతూ ఎంట్రీ ఇచ్చి చంటీకీ నెగిటివ్‌గా ఏదో చెప్పబోయింది. దీంతో 'గీతూ వెయిట్.. ఫస్ట్ సీడౌన్.. హే నేను వాళ్లతో మాట్లాడుతున్నా.. నేను మిగతా వాళ్లతో మాట్లాడుతుంటే ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటావు. నీకు ఇది బాగా అలవాటు అయిపోయింది..' అంటూ నాగార్జు ఫైర్ అయ్యారు. దీంతో ఇంకోసారి ఇలా చేయనంటూ గీతూ సారీ చెప్పింది. అయితే పండగ ఎపిసోడ్లో నాగార్జున గీతూపై సీరియస్ కావడంపై నెట్టింట చర్చ నడుస్తుంది. హౌస్‌లో మొదటినుంచి గీతూకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారన్న విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు వీకెండ్ ఎపిసోడ్‌లోనూ నాగార్జున కూడా గీతూకు సపోర్ట్‌గానే మాట్లాడుతున్నారన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. అందుకే కావాలనే నాగ్ గీతూకి క్లాస్ పీకినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా మిగతా ఎపిసోడ్లోతో పోలిస్తే గీతూకి కాసింత ప్రయారిటీ కూడా తగ్గించరని తెలుస్తుంది. చూడాలి మరి గలగలా మాట్లాడే గీతూ ఇప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.. -
Bigg Boss 6: ఆ అమ్మాయికి ఎథిక్స్ లేవు..ఛీఛీ ఎందుకు వచ్చానో: రేవంత్
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం గలాట గీతూ హవా నడుస్తోంది. మూడు వారాలుగా గీతూ ఆట తీరుపై నాగార్జున ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాడు. దీంతో గీతూ మరింత రెచ్చిపోయి..ఆటలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఆమె మాట్లాడే తీరు మాత్రం అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఆడియన్స్‌కి కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదే విషయంపై నాగార్జున కాస్త సున్నితంగా ఆమెను హెచ్చరించాడు. కొన్నిమాటలు ఎదుటివాళ్లకు ఇబ్బందికరంగా ఉంటున్నాయని, వాటిని తగ్గించుకోవాలని సూచించాడు. ఇదిలా ఉంటే గీతూపై రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమెను ఎథిక్స్ లేవని, ఫ్యామిలీ వాల్యూ తెలియదని చెప్పాడు. ఇదంతా శనివారం ఎపిసోడ్లో టెలికాస్ట్ అయింది. (చదవండి: షాకింగ్ ఎలిమినేషన్: ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..) బిగ్‌బాస్ జైలులో ఉన్న అర్జున్ దగ్గరికి వెళ్లిన రేవంత్.. గీతూ ప్రవర్తన గురించి మాట్లాడుతూ..‘కొంతమంది ఎమోషన్స్‌ని కూడా యాక్టింగ్ అంటున్నారు. వాళ్లకి ఫ్యామిలీ వాల్యూ తెలియదు. గీతు అంటుంది.. తల్లి ప్రేమ కంటే కుక్క ప్రేమ గొప్పదట. అసలు ఇలాంటి వాళ్లని ఎందుకు పిలిచారో.. ఇలాంటి వాళ్లు ఉన్న హౌస్‌లో నేను ఎందుకు ఉన్నానని సిగ్గుపడుతున్నా. అబ్బాయిలమైన మనకే కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఎథిక్స్ లేవు. ఆమెను చూస్తుంటే..ఛీఛీ ఇలాంటి వాళ్లు ఉన్న హౌస్‌లోకి ఎందుకు వచ్చానో అనిపిస్తుంది. ఆమె గురించి బయట చాలా విన్నాను. ఎంతకైనా తెగిస్తుంది. ఏమైనా చేస్తుందని విన్నా.. కానీ మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని తెలియదు. గీతూతో పోలిస్తే ఆదిరెడ్డి చాలా బెటర్. రివ్యూ సిస్టమ్ నుంచి బయటకు రావడంతో.. ప్రతిదీ తెలుసు అనుకుంటున్నారు. జనాలకు ఏం నచ్చుతుందో కూడా వీళ్లే చెప్పేస్తున్నారు.. వీళ్లేమైనా దేవుళ్లా? నాకు అర్ధం కావడం లేదు. వీళ్లని అసలు మనం కాంపిటేటర్స్లా లెక్కలోకి తీసుకోకూడదు’ అని రేవంత్ అన్నాడు. ఇక గీతూ కూడా రేవంత్‌కు నోటిదూల ఎక్కువని ఆదిరెడ్డి, అర్జున్‌లతో చెప్పుకొచ్చింది. అయితే నాగార్జున వీరిద్దరి నోటీదూల గురించి పరోక్షంగా, కాస్త వ్యంగ్యంగా హెచ్చరించాడు. -
Bigg Boss 6 : కెప్టెన్‌గా ఆదిరెడ్డి, జైలుకు వెళ్లిన అర్జున్.. ఏడ్చేసిన కీర్తి
బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఆదిరెడ్డి విజేతగా నిలుస్తాడు. ఇక అందరికంటే ఎక్కువగా కంటెంట్ ఇస్తున్నది తానే అంటూ గీతూ తన అభిప్రాయం చెప్తుంది. దీనికి ఇంటి సభ్యులు కూడా అంగీకరించి ఆమెకు 10నిమిషాల చైన్‌ను కట్టబెడతారు. మరోవైపు అందరికంటే తక్కువగా జీరో మినిట్స్ ట్యాగ్‌తో అర్జుణ్ జైలుకు వెళ్తాడు. ఇంకా మరెన్నో విశేషాలను బిగ్‌బాస్ సీజన్-6 20వ ఎపిసోడ్ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ కొత్త కెప్టెన్సీ ఎంపిక కోసం ఎత్తెర జెండా అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా ఇసుక కుప్పలో నుంచి ఇసుకను ఓ చిన్న బకెట్లో తీసుకెళ్లి వాళ్లకు కేటాయించిన డబ్బాలో వేయాల్సి ఉంటుంది. పైమా డిస్క్వాలిఫై అయినందున ఆదిరెడ్డి, శ్రీహాన్, సత్యలు ఈ టాస్క్‌లో ఆడారు. శ్రీహాన్ గెలుపుకు ఒక అడుగు దూరంలో మిగిలిపోతాడు. అందరికంటే ముందుగా ఆదిరెడ్డి టాస్క్‌ను విజయవంతంగా కంప్లీట్ చేయడంతో అతనే కెప్టెన్‌గా నిలుస్తాడు. దీంతో తన భార్య కవితను తలుచుకొని ఉద్వేగానికి లోనవుతాడు. నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటావ్.. లవ్ యూ కవిత అంటూ భార్యకు ప్రేమ సందేశాన్ని పంపుతాడు. ఇక డేంజర్ జోన్లో ఉన్న వసంతికి ఎందుకో గానీ ఎలిమినేట్ అవుతాన్న భయం మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇనయాతోనూ ఇదే విషయాన్ని చర్చించింది. మరోవైపు గీతూ కావాలని కేవలం కంటెంట్ కోసమే చేస్తున్నా అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారంటూ ఫీల్ అవుతుంది. ఇక ఎపిసోడ్లో ఎవరు ఎన్ని నిమిషాలు కనిపిస్తారన్నది ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని దానికి సంబంధించిన చెయిన్స్ ధరించాల్సి ఉంటుంది అని టాస్క్ నిర్వహించగా, అందరి కంటే ఎక్కువగా గీతూ 10నిమిషాల చైన్‌ను ధరిస్తుంది. రేవంత్ 7నిమిషాలు, ఫైమా 6నిమిషాలు, శ్రీహాన్, ఇనయాలకు 5నిమిషాల చైన్ ధరిస్తారు. ఇక చివరగా అందరికంటే తక్కువగా జీరో నిమిషాలు సంపాదించిన ఆరోహి, ఆర్జున్, కీర్తిలలో ఎవరో ఒకరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. దీంతో ముగ్గురూ ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని అర్జున్ను జైలుకు పంపుతారు. అయితే తనకు జీరో అన్న ట్యాగ్ రావడంపై కీర్తి భోరుమని ఏడ్చేస్తుంది. దీంతో శ్రీహాన్ ఆమెను ఓదారుస్తాడు. -
కెప్టెన్ ఎవరో తెలిసిపోయిందిగా.. రాజ్ క్రష్ ఆమేనా?
సూర్య-ఆరోహిల మధ్య గొడవ అలానే కంటిన్యూ అవుతుంది. రాజ్ తనతో ఇంకా మాట్లాడటం లేదని తలుచుకొని ఆరోహి ఏడుస్తుండగా, శ్రీహాన్ ఓదారుస్తాడు. ఆ తర్వాత రాజ్ లగేజ్ రూంకి వెళ్లడంతో తనను ఫాలో అవుతూ ఆరోహి కూడా వెళ్తుంది. అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మరి వీళ్లిద్దరూ ఇప్పటికైనా మాట్లాడతారా? లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక మరోవైపు నిన్నటి ఎపిసోడ్లో రాజ్‌కు ఈ హౌస్‌లో ఎవరో క్రష్ ఉందని గమనించిన హౌస్మేట్స్ ఆమె ఎవరన్నది ఎలా అయినా రాబట్టాలని తెగ ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా గీతూ.. నీ క్రష్ నేను కదా, నాకు నువ్వు క్రష్ అంటూ సరదాగా రాజ్‌తో మాట్లాడుతుంది. దీంతో ఫైమా ఎంట్రీ ఇచ్చి మరి నేనేంటి అంటూ ఫన్నీగా అడుగుతుంది. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో చివరగా ఎత్తర జెండా అనే టాస్క్‌ని నిర్వహిస్తాడు బిగ్‌బాస్. ఇందులో కెప్టెన్సీ పోటీదారులు ఇసుకను ఎత్తి తమకిచ్చిన బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. మరి ఈ టాస్కులో విజేతగా నిలిచి కెప్టెన్‌గా ఎవరు నిలిచారన్నది ఆసక్తిగా మారింది. కానీ నెట్టింట అందుతున్న సమాచారం ప్రకారం ఆదిరెడ్డి కెప్టెన్ అయినట్లు సమాచారం. -
ఇనయా-శ్రీహాన్‌ల మధ్య బిగ్ ఫైట్.. మధ్యలో దూరిన గీతూ
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ముగుస్తుంది. పోలీస్ టీం ఇందులో విజేతగా నిలుస్తుంది. శ్రీహాన్-ఇనయాల మధ్య మాటల యుద్దం జరగడానికి గల కారణాలేంటి? కెప్టెన్సీ పోటీదారులుగా చివరగా మిగిలిన వాళ్లెవరు అన్నది బిగ్‌బాస్ సీజన్-6 19వ ఎపిసోడ్లో చూద్దాం. కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్ నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ ముగుస్తుంది. ఈ టాస్కులో ఎక్కువ బొమ్మలు ఉన్న పోలీస్ టీం విజేతలుగా నిలుస్తారు. కెప్టెన్సీ కంటెండర్స్‌గా సత్య, గీతూ, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను టీం సభ్యులు ఎన్నుకుంటారు. ఇక ఆ తర్వాత జరిగిన టాస్కులో గీతూ తొలుత ఎలిమినేట్ అవుతుంది. ఆ తర్వాత బ్రిక్స్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఫైమా చేతులు ఉపయోగించిందన్న కారణంతో రేవంత్ ఆమెను డిస్ క్వాలిఫై చేస్తాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ జరిగినా రేవంత్ సంచలాక్గా ఉన్నందున అతని నిర్ణయం ఫైనల్ అవుతుంది. అయితే ఫైమా డిస్ క్వాలిఫై అనడంతో ఇనయా ఎంట్రీ ఇస్తుంది. శ్రీహాన్ చేతులు తగలడం నేను చూశానంటూ రేవంత్‌కి చెబుతుంది. ఇది విన్న శ్రీహాన్... ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా.. సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్ తీసుకో అని అంటాడు. ఇక అక్కడ మొదలవుతుంది రచ్చ. నన్ను పిట్ట అని ఎలా అంటావంటూ ఇనయా నోరేసుకొని పడిపోతుంది. నిన్ను వాడు అంటే తీసుకోలేని వాడివి నన్ను పిట్ట అని ఎందుకు అన్నావ్ అని రెచ్చిపోయింది. దీంతో గీతూ ఇచ్చి అతను నిన్ను అనలేదు, నన్నే పిట్ట అన్నాడు అని సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఇనయా ఆగకపోవడంతో ఇక ఇలా కాదునుకుందో ఏమో కానీ గీతూ ఇనయాని హేళన చేస్తున్నట్లు ప్రవర్తించింది. వచ్చిందీ పాలపిట్టా అంటూ ఇష్టం వచ్చిన పాటలు పాడుతూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇనయా.. మళ్లీ నోరేసుకొని పడిపోతుండటంతో శ్రీహాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మగాడివైతే నేను చెప్పింది విని అంటూ ఇనయా మాటలు హద్దులు దాటుతుంది. మరి ఈ టాస్కులో కెప్టెన్‌గా ఆదిరెడ్డి, సత్య, శ్రీహాన్‌లలో ఎవరు నిలుస్తారన్నది ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. -
నేహాపై ఫైర్ అయిన మెరీనా.. బుద్ధి ఉండదా అంటూ ఆగ్రహం
బిగ్‌బాస్ సీజన్-6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరిరోజు కూడా పోలీసులకు, దొంగలకు మధ్య వాగ్వివాదం నడుస్తుంది. పట్టుబడిని మెరీనాను దొంగలు బెడ్రూమ్లో వేసి లాక్ చేస్తారు. దీంతో ఆమె అక్కడున్న కబోర్డ్స్లలో బొమ్మలు వెతుకుతుంటుంది. దీంతో ఆమెకు ఆ యాక్సిస్ లేదని, అలా చేయడానికి వీళ్లేదని నేహా ఫైర్ అవ్వగా.. మాటిమాటికి గుర్రు అంటే ఎట్లా? బుద్ది ఉండదా? అంటూ మెరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు వంద రూపాయలకి ఒక బొమ్మ కొంటానంటూ గీతూ దొంగలతో డీల్ మాట్లాడుతుంది. అంతేకాకుండా చివర్లో వాళ్లకు ఓ బహుమతి కూడా ఇస్తానని ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా సత్యతో పరిహోర కలపేందుకు అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడు. అయినా సరే పట్టించుకోని సత్య.. హౌస్‌లో అందరినీ అన్నయ్య అనే పిలుస్తానని చెప్పడంతో అర్జున్ కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సత్యను తప్పా మిగతా అందిరినీ సిస్టర్ అని పిలుస్తానని చెప్పిన అర్జున్ సత్యతో లవ్ ట్రాక్ నడిపిందుకు రకరకాల ఫీట్లు చేస్తున్నాడు. దీనికి సత్య రియాక్షన్ ఏమైనా మారుతుందా లేక నో ఫీలింగ్స్ అంటూ అలానే ఉండిపోతుందా చూద్దాం. -
సొంత టీమ్ సభ్యులే రేవంత్‌కు వెన్నుపోటు.. శపథం చేసిన సింగర్
బిగ్‌బాస్ -6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట గేమ్ కొనసాగుతుంది. ఇందులో పోలీసులు, దొంగలుగా రెండు టీమ్స్‌గా విడిపోయారు. అయితే దొంగల టీమ్‌లో ఏమాత్రం యూనిటీ (ఐక్యత)లేకపోవడంతో వాళ్లమధ్యే గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో గీతూతో రేవంత్ డీల్ కుదుర్చుకున్నాడని అనుమానపడిన దొంగల టీమ్ ఈరోజు రేవంత్ దాచుకున్న బొమ్మలనే దొంగతం చేస్తారు. దీనికి సత్య కూడా సహాయం చేస్తుంది. అయితే తన బొమ్మలు తన దొంగలు టీమ్ సభ్యులే కొట్టేశారని తెలిసి రేవంత్ ఆశ్చర్యపోతాడు. నిద్రపోదామనుకున్నా, కానీ నిద్రపోనూ, పోలీసుల టీమ్ ను గెలిపిస్తా అంటూ శపథం చేస్తాడు. వాళ్లకంటే తాను దారుణమైన కన్నింగ్ అని, ఇలా చేయడానికి మినిమం సెన్స్ ఉండాలంటూ మండిపడతాడు. అంతేకాకుండా పోలీసులకు తన దగ్గరున్న వస్తువులు చేస్తుందుకు కూడా ఆఫర్ చేస్తాడు. దీంతో సుదీప నీ వరకు వస్తే గేమ్ వచ్చిందా?నువ్వు టీమ్ మొత్తాన్ని డిస్ క్వాలిఫై చేస్తావా అంటూ రేవంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి చివరికి రేవంత్ ఏం చేశాడు? పోలీసులతో చేరి నిజంగానే వాళ్లను గెలిపించాడా? లేక మనసు మార్చుకున్నాడా అన్నది ఈరోజు ఎపిసోడ్లో చూడాల్సి ఉంది. -
లాజిక్ లేకుండా గేమ్ ఆడిన గీతూ.. షాక్ అయిన హౌస్మేట్స్
కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట అనే టాస్కులో ఇనాయాకు శ్రీహాన్, రేవంత్‌లతో గొడవ అవుతుంది. మరోవైపు రూల్స్ బ్రేక్ చేసి గీతూ తనకు నచ్చిన విధంగా గేమ్ ఆడి హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపిస్తుంది. చివరగా ఆమె స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అయింది అన్నది బిగ్‌బాస్ సీజన్-6 17వ ఎపిసోడ్ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అడవిలో ఆట అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో ఇనయ, చంటి, ఆదిత్య, రోహిత్,ఆదిరెడ్డి, మెరీనా, శ్రీ సత్య, ఫైమా, , రాజ్‌లు పోలీసులుగా వ్యవహరించగా,వసంతి, నేహ, కీర్తి, శ్రీహాన్, సూర్య,రేవంత్, ఆరోహి, సుదీప, , అర్జున్‌లు దొంగలుగా వ్యవహరించారు. గీతూ అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా వ్యవహరించింది. ఇందులో బజర్ సౌండ్‌ని బట్టి దొంగలు అడవిలో దొంగతనం చేయడం, రైడ్ చేసి వాళ్లని పట్టుకోవడం పోలీసుల వంతు. ఇక ఈ గేమ్‌లో ఇనయాకు శ్రీహాన్, రేవంత్‌లతో గొడవ అవుతుంది. ఇనయా నోరుజారి వాళ్లను వాడు, వీడు అని అనడంతో మాటలు జాగ్రత్త.. ఇంట్లొ మ్యానర్స్ నేర్పలేదా అంటూ రేవంత్ ఫైర్ అవుతాడు. తర్వాత ఇనయా సారీ చెప్పడంతో శ్రీహాన్ కూల్ అవుతాడు. ఇదిలా ఉండగా దొంగల నుంచి బొమ్మలు కొనుక్కోవాలని రూల్ బుక్‌లో ఉన్నా.. నా గేమ్ నా ఇష్టం అన్నట్లు గీతూ వ్యవహరించింది. ఆల్రెడీ దొంగలు తీసుకున్న బొమ్మలను వారికి తెలియకుండా దొంగతనం చూసి రూల్స్ బ్రేక్ చేస్తుంది గీతూ. ఎవరెన్ని చెప్పినా అది తన గేమ్ స్ట్రాటజీ అంటూ గీతూ నచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక దొంగలతో డీల్ కుదుర్చుకునే క్రమంలో ఒక్కో బొమ్మకు 200అని పైసా కూడా ఎక్కువ ఇవ్వనంటూ గీతూ ఆర్డర్ వేస్తుంది. మొదటగా శ్రీహాన్ ఆమెకు బొమ్మలు అమ్మాడు. ఇక టైం ఎక్కువగా లేకపోవడంతో టాస్క్‌ను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు బిగ్‌బాస్ ఆదేశించాడు. మరి ఈ టాస్కులో ఎవరు గెలిచారన్నది తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ వరకు వేచిచూడాల్సిందే. -
బిగ్‌బాస్ రెండోవారం ఇంటి కెప్టెన్ అతడే.. కొట్టేసుకుందాం అన్న గీతూ
బిగ్‌బాస్ సీజన్-6లో రెండోవారం ఇంటి కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఇక మూవీ ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు, కృతిశెట్టిలు బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించి వారికి టాస్కులు ఇచ్చారు. ఇందులో ఎవరు విజేతగా నిలిచారన్నది బిగ్‌బాస్-6 పదమూడో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ రెండోవారం కెప్టెన్సీ టాస్కులో ఎలాంటి సస్పెన్స్ లేకుండా రాజ్ కెప్టెన్‌గా నిలిచాడు. ఈవారం ఎలిమినేషన్లో ఉండటం రాజ్‌కు కలిసొచ్చింది. దీంతో ఈ కెప్టెన్సీ టాస్క్ అతనికి ఏమైనా హెల్ప్ అవుతుందని భావించిన ఇంటిసభ్యులు అతనికే ఏకాభిప్రాయంతో ఓట్లేశారు. అయితే ఇంత కష్టపడినా తనకు ఒక్కరు కూడా ఓటు వేయలేదంటూ ఇనయా తెగ ఫీల్ అయిపోయింది. చివరికి అత్యదిక ఓట్లతో రాజ్ కెప్టెన్సీ కుర్చీపై కూర్చొని ఇంటి సభ్యల కోసం ఏదైనా పనిష్మెంట్ వస్తే అది తానే తీసుకుంటానంటూ వాగ్ధానం చేస్తాడు. ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ప్రమోషన్స్ కోసం సుధీర్‌బాబు, కృతిశెట్టి హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులతో సరదాగా ముచ్చటించారు. పాపులర్ డైలాగులను తమ స్టైల్లో చెప్పాలంటూ టాస్కులు ఆడించారు. ఇందులో రేవంత్ మొదటగా పోకిరి సినిమాలోని ‘ఎవడు కొడ్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు’ అనే డైలాగ్ చెప్పాడు. ఆ తర్వాత గీతూ వచ్చి తమిళ్ ఏంటి? తెలుగేంటి? డార్లింగ్.. గొడవైంది, కొట్టేసుకుందాం రా అంటూ తన స్టైల్లో చెప్పి సూపర్ అనిపించింది. అంతేకాకుండా ఇదే డైలాగ్‌ను చిన్నపిల్లల వాయిస్‌లో చెప్పి ఆశ్చరానికి గురిచేసింది. ఇక ఈ టాస్కులో సత్య, రాజ్, శ్రీహాన్‌లు చేసిన ఓ స్కిట్ ఆకట్టుకుంది. ఇక చివర్లో సత్యను బెస్ట్ యాక్ట్రెస్‌గా, శ్రీహాన్‌కు బెస్ట్ యాక్టర్‌గా ప్రకటించి అవార్డులు ఇచ్చారు. -
బొక్కబోర్లా పడిన గీతూ... రేవంత్‌కి చేసిన అన్యాయం ఫైమాకు తగిలిందిగా
సిసింద్రీ టాస్క్ ముగిసింది. మొదటిరోజు దూకుడుగా ఆడిన గీతూ రెండోరోజు మాత్రం బోల్తా పడింది. ఆమె చేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదు. మరోవైపు తాను చేసిన దానికి రేవంత్ కావాలనే డిస్క్వాలిఫై చేశాడంటూ ఫైమా కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఈ వారం కెప్టెన్సీ కంటెడర్స్‌గా ఎవరు నియమితులయ్యారు? ఫైమా రేవంత్‌లలో ఎవరు ఎవర్ని టార్గెట్ చేశారు? అన్నది బిగ్‌బాస్ తెలుగు సీజన్-6 పదకొండవ ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ సీజన్-6లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. రెండో ఇంటి కెప్టెన్‌ని ఎంచుకోవడానికి బిగబాస్ నిర్వహించిన సిసింద్రీ టాస్కులో మొదటిరోజు ఎవరిని నిద్రలేకుండా చేసిన గీతూ తన బొమ్మ విషయంలో మాత్రం బోల్తా పడింది. తెలివిగా బొమ్మకు ఉన్న బట్టలు తీసేసి, దాన్ని స్టోర్‌రూమ్‌లో దాచిపెట్టింది. అయితే ఆమె ప్లాన్ ఫెయిలైంది. రేవంత్ ఆ బొమ్మను చూసి లాస్ట్ అండ్ ఫౌండ్ వద్ద ఉంచేయడంతో గీతూ కెప్టెన్సీ పోటాదారుల లిస్ట్ నుంచి ఔట్ అయింది. ఇక ఆ తర్వాత రేసులో ఉన్న ఇంటి సభ్యులకు రింగులో కింగ్ టాస్క్ నిర్వహించాడు బిగ్‌బాస్. ఇందులో పాల్గొన్న సభ్యులు చేతులతో కాకుండా తమకు ఇచ్చిన షీల్డుతోనే అవతలి వాళ్లని రింగునుంచి బయటకు తోసేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడల్లా ఒక్కొక్కరు యాడ్ అవుతుంటారు. చివరికి ఎవరు రింగులో మిగులుతారో వాళ్లే విజేత. ముందుగా ఆరోహి, ఫైమా బరిలోకి దిగారు. వాళ్లింకా పోటీపడుతూ ఉండగానే కీర్తి వచ్చింది. ఆ తర్వాత ఇనయా, అర్జున్ తోడయ్యారు. ముందుగా వీళ్లంతా కలిసి అర్జున్ను బయటకు తోసేశారు. ఆ తర్వాత ఫైమా కింద కూర్చోవడం, చేతులను పదేపదే ఉపయోగించడంతో సంచలక్‌గా ఉన్న రేవంత్ ఆమెను గేమ్ నుంచి డిస్క్వాలిఫై చేశాడు. దీంతో ఫైమా తనను ఆడనివ్వకుండా చేశారంటూ వెక్కివెక్కి ఏడ్చింది. అంతముందు రోజు రేవంత్ గెలవకుండా అడ్డుపడిన ఫైమాకు ఆ తర్వాతి రోజు అలాంటి పరిస్థితే ఎదురు అయ్యింది. అయితే ఆమె మాత్రం రేవంత్ కావాలనే ఇలా చేశారండూ కీర్తితో చెప్పి వాపోయింది. ఆ తర్వాత కీర్తి, ఇనయాల మధ్య పోరు ఉండగా నొప్పితో కీర్తి రింగ్ నుంచి బయటకు వచ్చేసింది. చివరగా ఇస్క్రీం టైం అనే టాస్క్‌లో స్క్రీన్‌లో చూపించినట్లుగా కరెక్ట్‌గా ఐసీక్రీం షేప్ పెట్టాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో రాజశేఖర్ విజేతగా నిలిచాడు. ఇక రెండో రౌండ్లో ఆర్జే సూర్య గెలిచాడు. మొత్తానికి సిసింద్రీ టాస్క్ ముగిసేసరికి చంటి, ఇనయ, రాజ్(రాజశేఖర్), సూర్యలు ఈవారం కెప్టెన్నీ కంటెండర్లుగా నిలిచారు. మరి వీరిలో ఈవారం ఇంటి కెప్టెన్‌గా ఎవరు గెలుస్తారన్నది చూడాల్సి ఉంది. -
Bigg Boss 6: రాత్రంతా గీతూ గలాట.. శ్రీహాన్‌కు బిగ్ షాక్!
రెండోవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్‌కి సిసింద్రి టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్‌లో ఫైమా, రేవంత్, చలాకి చంటి పాల్గొనగా.. అందరికంటే ముందు టాస్క్ కంప్లీట్ చేసి తొలి కెప్టెన్సీ పోటిదారుడిగా నిలిచాడు చంటి. ఇక రాత్రి కావడంతో కెప్టెన్సీ టాస్క్‌ని ఆపేశాడు బిగ్‌బాస్. టాస్క్ సమయం పూర్తయినందున తదుపరి ఆదేశం వరకు తమ బేబీ బొమ్మలను ప్రతి కంటెస్టెంట్ జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆదేశం ఇచ్చాడు. అయితే బొమ్మలను దాచుకోవడానికి వీలు లేదంటూ చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. తమకి ఇచ్చిన బొమ్మలు లాస్ట్ అండ్ ఫౌండ్కి వెళ్లకుండా చూసుకోవడంతో పాటు బిగ్‌బాస్ ఇచ్చిన చాలెంజ్‌లో గెలవడమే కంటెస్టెంట్స్ ప్రస్తుత టాస్క్. ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను తాజాగా వదిలాడు బిగ్‌బాస్. ఈ తాజా ప్రోమోలో గలాట గీతూ తన చేతివాటం చూపించింది. రాత్రంత నిద్ర పోకుండా బొమ్మలు దొంగలించేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా కెప్టెన్ ఆదిత్య బొమ్మను దొంగలించి తీసుకెళుతుండగా.. ఇంటి సభ్యులు ఆమెను అడ్డుకుని ఆదిత్యను బతికించారు. మరోవైపు శ్రీహాన్.. అర్జున్ నిద్రపోతుండటం చూసి మెల్లిగా అతడి బొమ్మను దొంగలించి లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేశాడు. ఇటూ సమయం కోసం కాచుకు కూర్చున్న గీతూ తన ప్లాన్‌ను ఇంప్టీమెంట్ చేసి సక్సెస్ అయ్యింది. తను టార్గెట్ చేసిన ఇద్దరిలో ఒకరైన శ్రీహాన్ బొమ్మను దొంగలించి లాస్ట్ అండ్ ఫౌండ్‌లో పెట్టేసింది. గీతూ గలాట చూసి హౌజ్మెట్స్లో సగం మంది రాత్రి మూడు గంటల వరకు పడుకోలేదు. చూస్తుంటే గీతూ వల్ల శ్రీహాన్ ఈ కెప్టెన్సీ పోటీ నుంచి వైదొలిగినట్టే కనిపిస్తోంది. మరి శ్రీహాన్ తన బొమ్మను కాపాడుకున్నాడా? లేక గీతూ చేతిలో బుక్కయ్యాడా? తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఇక గీతూ ముందురోజు ఎపిసోడ్లో కూడా రేవంత్, అభినయ శ్రీ, శ్రీ సత్య బొమ్మలను ఆమె లాస్ట్ అండ్ ఫౌండ్ వేసి వారిని కెప్టెన్సీ పోటీకి అనర్హులుగా చేసింది. -
బిగ్‌బాస్-6 రెండోవారం నామినేషన్స్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ సీజన్-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్ అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో హౌస్‌మేట్‌కు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని బిగ్‌బాస్ తెలిపాడు. మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు? చివర్లో బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అన్నది బిగ్‌బాస్ తెలుగు సీజన్-6 తొమ్మిదో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ రెండోవారం నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేసేవారి పేరు చెప్పి వాళ్ల ఫోటో అతికించి ఉన్న కుండను బావిలో పడేయాలి. మొదటగా ఆరోహి ఆదిరెడ్డిని నామినేట్ చేస్తూ అతనితో పెద్దగా బాండింగ్ లేదని, ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయినా పర్లేదు అన్న ఉద్దేశంతో నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. దీనికి కౌంటర్‌గా హౌస్‌లో గేమ్ ఆడనివాళ్లు వెళ్లిపోవాలా లేక నీతో ర్యాపో లేదని వళ్లిపోవాలా అంటూ ఆదిరెడ్డి ప్రశ్నించాడు. అయితే ఆమెను నామినేట్ చేయకుండా మెరీనా అండ్ రోహిత్‌లను నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పాడు. అందరిదీ ఒక బుర్ర పనిచేస్తే వాళ్లది రెండు బుర్రలు పనిచేస్తున్నాయని, ఇది బిగ్‌బాస్ నిర్ణయం అయినప్పటికీ తాను వాళ్లనే నామినేట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇక ఆ తర్వాత శ్రీహాన్ గలాటా గీతుని నామినేట్ చేస్తూ ‘ఈ మగాళ్లకి బుద్ధిలేదు అని అన్నావ్.. అందరూ ఏం చేశారు అంటూ నిలదీశాడు. దీంతో గీతూ తన ఉద్దేశం నిజంగా అది కాదని,ప్రతికుక్కకి ఒకరోజు వస్తుందంటే కుక్కకి ఒకరోజు వస్తుందని కాదు జస్ట్ అది స్టేట్ మెంట్’ అంటూ తనను తాను సమర్ధించుకుంది. ఇక నామినేషన్ పక్రియలో గీతూ-రేవంత్‌ల మధ్య మాటల యుద్ధం నడిచింది. నిన్ను నామినేట్ చేయాలంటేనే ఛీచీ.. అనే ఫీలింగ్ కలిగింది. నీతో మాట్లాడటం కూడా నాకు అసహ్యం.అశుద్దం మీద రాయి వేస్తే మనమీదే పడుతుంది. నీవు అలాంటిదానివే అంటూ రేవంత్ గీతూని ఉద్దేశించి మాట్లాడాడు. మొత్తంమీద రెండోవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కీర్తి, అర్జున్, గీతూశేఖర్లు రేవంత్‌ను నామినేట్ చేయగా, నేహా, చలాకీ చంటీ, సుదీప, ఆర్జే సూర్య, రేవంత్‌లు గీతూను నామనేట్ చేశారు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడన్న కారణంతో అభినయ, శ్రీ సత్యలు షానీని నామినేట్ చేశారు. తనతో రెండు రోజుల నుంచి సరిగ్గా మాట్లాడటం లేదని, కనీసం చూసి నవ్వడం లేదన్న సిల్లీ రీజన్‌తో వసంతి ఫైమాను నామినేట్ చేసింది. చివర్లో కెప్టెన్ అయిన కారణంగా ఇద్దరిని డైరెక్ట్ నామినేట్ చేయాల్సిందిగా బాలాదిత్యకు బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో మీరు బయటకు వెళ్లరనే నమ్మకంతో షానీ, రాజశేఖర్‌లను నామినేట్ చేస్తున్నట్లు బాలాదిత్య తెలిపాడు. మరి ఈ వారం నామినేట్ అయిన రేవంత్, గీతూ, ఫైమా, అభినయ, ఆదిరెడ్డి,రాజశేఖర్,మెరీనా అండ్ రోహిత్, షానీలలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. -
ఇదెక్కడి తిక్కల్ది..మెచ్యూర్డ్‌గా ప్రవర్తించు.. గీతూ,రేవంత్‌లకు నాగ్ క్లాస్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులేంటో చెప్పి, వారి ఆట తీరు ఎలా ఉంది? ఎలా మార్చుకుంటే బాగుంటుంది? తదితర విషయాలను చెప్పడానికి బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. హోస్ట్‌గా తనకున్న అనుభవంతో 21 మంది ఆట తీరును చక్కగా వివరించాడు.అంతేకాకుండా వారి లోపాలను తనదైన శైలీలో ఎత్తిచూపాడు. ఎలిమినేషన్లో ఉన్న ఏడుగురి ఇంటి సభ్యుల నుంచి ఇద్దరిని సేఫ్ చేశాడు కూడా. ఆ ఇద్దరు ఎవరు? ఇంటి సభ్యులను నాగ్ ఇచ్చిన సలహాలు ఏంటి? ఎవరికి మెచ్చుకున్నాడు? ఎవరిని తిట్టాడు? ఏడో ఎపిసోడ్ హైలెట్స్‌లో చదివేయండి హోస్ట్ నాగార్జున స్టేజ్ మీదకు రాగానే ఆనందం వ్యక్తం చేశాడు. దానికి కారణంగా ఈ సారి బిగ్‌బాస్ వీకెండ్ షోకి ఆడియన్స్ కూడా వచ్చారు. కరోనా కాలంగా గతేడాది ఆడియన్స్‌ని తీసుకురాలేకపోయామని, ఈ సారి రావడం చలా హ్యాపీగా ఉందని చెప్పాడు. అలాగే గీతూని జైలు పెట్టడం కరెక్టేనా అని ఆడియన్స్ ఒపినియన్ అడిగాడు. వారిలో ఎక్కువ శాతం ఇంటి సభ్యులు చేసిన పని మంచిదేనని చెప్పారు. ఇక కంటెస్టెంట్స్‌ని పలకరించిన నాగ్..ఒక్కొక్కరి ఆట తీరు, చేసిన తప్పులు వివరిస్తూనే... ఆటను ఇంకెలా మెరుగుపరుచుకోవాలో పలు సూచనలు ఇచ్చాడు. సింగర్ రేవంత్ ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నాడని, వాటిని తగ్గించుకోవాలని చెప్పాడు. అలాగే మెచ్యూర్డ్‌గా ఉండాలని సలహా ఇచ్చాడు. ఇక గలాట గీతు ఆట తీరును మెచ్చుకుంటూనే.. ఆమె మాట తీరును తప్పుపట్టాడు. ముఖ్యంగా బాత్రూంలోని హెయిర్ గురించి గీతూ చేసిన గోలను తప్పుపట్టాడు. నువ్వు చెప్పిన విషయం మంచిదే కానీ విధానం మంచిగా లేదన్నాడు.‘పదే పదే ఇనయాను తిక్కదానా? అనడం బాగా లేదు. నువ్ అలా పదే పదే తిక్కల్దానా అని అంటే.. నువ్ తిక్కల్దానివి అని జనాలు అనుకుంటారు’ అని నవ్వుతూనే చెప్పాల్సిన విషయం చెప్పేశాడు. అయితే గీతూ మాత్రం ఆ విషయాలను పెద్ద సీరియస్‌గా పట్టించుకోకపోవడమే కాకుండా...అవును సర్ నాకు కాస్త తిక్క ఉందిని రివర్స్ కౌంటర్ వేసింది. అప్పుడు నాగార్జున ‘శుభ్రత గురించి అన్ని మాటలు చెప్పావ్ కదా.. టిష్యూలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావ్.. మనం చెప్పే మాటలను మనం పాటించాలి.. సంబంధం లేని విషయంలో దూరితే జైల్లో వేస్తారు’అని అనడంతో ఇంటి సభ్యులంతా ఘోల్లున నవ్వారు. నిన్న జరిగిన గేమ్‌లో సంచాలకురాలిగా వ్యవహరించిన ఫైమాపై నాగ్ ప్రశంసలు కురిపించారు. ‘ఫస్ట్ వీక్‌లోనే బెస్ట్ సంచాలక్‌గా నిరూపించావు. ప్రతివారం నాతో ఇలాగే ఫేమస్ ఫైమా అనిపించుకోవాలి’ అని చెబుతూనే.. బల్లితో ఆమె పోల్చుకోవడం నచ్చలేదని చెప్పాడు. బిగ్‌బాస్ క్యూట్ కపుల్ రోహిత్, మెరీనాలను ఆట తీరు బాగుందని చెప్పాడు. ఇక రోహిత్ తనతో టైమ్ స్పెండ్ చేస్తలేడని, హగ్ ఇవ్వడం లేదని వాపోతున్న మెరీనా బాధను నాగ్ అర్థం చేసుకొని దగ్గరుండి మరీ హగ్ ఇప్పించాడు. ఆదిరెడ్డిని రివ్యూలు ఇవ్వడం మానేసి ఆట ఆడమంటూ సలహాలు ఇచ్చాడు. కొరియోగ్రఫీలోనే కాదు ఫ్రెండ్షిప్ చేసుకోవడంలోనూ అంతే ఫాస్ట్‌గా ఉండాలని అభినయశ్రీకి చెప్పాడు. కీర్తి భట్ ఆట తీరు బాగుందని, అయితే ఎవరో చెప్పారు కదా అని శ్రీహాన్‌ని బ్రో అని పిలవొద్దని, నీకు నిజంగా అనిపిస్తేనే అలా పిలవమని చెప్పాడు. అర్జున్ కల్యాణ్‌ని బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు. గీతూతో మాట్లాడిన తీరు.. రేవంత్‌ని పక్కకి తీసుకెళ్ల మాట్లాడడం బాగుందని చెప్పాడు. అదే సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఏదైనా ఉంటే వాళ్ల ముందే మాట్లాడలని,వెనకాల వద్దని సలహా ఇచ్చాడు. ఇక సూర్య గురించి మాట్లాడుతూ.. ‘నీ ఆట తీరు బాగుంది. ఎవరికి ఆకలి వేసినా ఇబ్బంది పడకుండా వండుకొని తీసుకొచ్చి తినిపిస్తున్నావ్. ఇలా ఉండాలి’అని మెచ్చుకున్నాడు.వీరితో పాటు మిగిలిన ఇంటి సభ్యుల తప్పొప్పులను కూడా నాగ్ వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఎలిమినేషన్లో ఉన్న ఏడుగురిలో నుంచి మొదటగా శ్రీసత్య, తర్వాత చంటీలను సేవ్ చేశాడు. ఇక మిగిలిన ఐదుగురిలో అంటే..రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనయా సుల్తానా, అభినయశ్రీ లలో ఎవరు బయటకు వెళ్తారనేది రేపటి(ఆదివారం) ఎపిసోడ్లో తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఓటింగ్ ప్రకారం.. ఆరోహి, ఇనయా సుల్తానా డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని, బయటకు వెళ్లేందుకు ఇనయాకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్-6 మొదటి కెప్టెన్‌గా మిస్టర్ కూల్.. జైలుకు వెళ్లిన గీతూ
బిగ్‌బాస్ సీజన్-6 మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య గెలిచాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా నీళ్లలొ వేసిన తాళం చెవిని నోటితో తీసి, వాటితో బాక్సులను ఓపెన్ చేసి, అందులో ఉన్న కారు నెంబర్ ను చూడాలి. ఆ నెంబర్ ప్లేటులోని అక్షరాలు, నెంబర్లను వెతికి కార్లకు అతికించాలి. ఈ టాస్కులో మెరీనా అండ్ రోహిత్, నేహా చౌదరి, గీతూ రాయల్,బాలాదిత్య, ఆర్జే సూర్య, ఆదిరెడ్డిలు పోటీపడగా చివరికి బాలాదిత్య విజేతగా నిలిచాడు. ఇక ఆ తర్వాత ఇంట్లో అసలు రచ్చ మొదలైంది. ఈ కెప్టెన్సీ టాస్కులో వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఇందులో రేవంత్ గీతూని నామినేట్ చేయాలనుకున్నట్లు భావించినా ఆమెకు పీరియడ్స్ కావడంతో జైలుకు పంపడం ఇష్టం లేదని, దీంతో ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. ఇక సుదీప గీతూకి గట్టిగానే ఇచ్చిపడేసింది. ‘నాకు నచ్చినట్టు నేనుంటా, నేను నా ఇంట్లో ఉండే ఎవరూ ఒప్పుకోరు’ అని చెప్పి ముఖంపై రెడ్ మార్క్ వేసింది. చలాకీ చంటి కూడా గీతూకే ఓటేశారు. ఆ తర్వాత రాజశేఖర్, ఇనయా. శ్రీసత్య, ఆరోహి, ఆర్జే సూర్య, వాసంతి, నేహా, మెరీనా జంట, అర్జున్‌లు గీతూకే వరస్ట్ పెర్ఫార్మర్గా ఓటేశారు. అయితే గీతూ మాత్రం తను చేసిందే కరెక్ట్ అంటూ సమర్థించుకుంది. అంతేకాకుండా గేమ్ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నానని, ఇంట్లో ఒకవేళ తన పేరెంట్స్‌ని తీసుకొచ్చినా వాళ్లని వెనక్కినెట్టి తాను గెలవాలని కోరుకుంటానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌లో ఉన్నంతమాత్రానా మీరంతా నా ఫ్యామిలీ కాదు. జస్ట్ కో పార్టిసిపెంట్స్ అంటూ ఇతర కంటెస్టెంట్లని ఉద్దేశించి గీతూ తన ఓపీనియన్ చెప్పింది. ఇక హస్మేట్స్లో దాదాపు ఎక్కువ ఓట్లు గీతూకే వచ్చినందుకు చివరికి ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమెకు పీరియడ్స్ ఉండటంతో ఈ ఒక్కసారికి ఆమెను క్షమించాలని బాలాదిత్య రిక్వెస్ట్ చేసినా బిగ్‌బాస్ నుంచి ఆదేశాలు రాకపోవడంతో గీతూని జైలుకి పంపారు. -
అసలైన ఆట మొదలైందిగా.. బిగ్‌బాస్ సీజన్-6 తొలి కెప్టెన్ ఎవరంటే
బిగ్‌బాస్ సీజన్-6లో తొలిరోజు నుంచే గొడవలు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో గొడవలు ఏ స్థాయికి వెళ్తాయా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే 21మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో కొందరు కంటెస్టెంట్లు చీటికిమాటికీ వాగ్వాదానికి దిగుతుంటే, మరికొందరు కంటెస్టెంట్లు మాకేం పట్టలేదంటూ సైలెంట్‌గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో మొదటి కెప్టెన్ కోసం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు. ఇందులో ఫైమా సంచాలకురాలిగా వ్యహరించింది. కెప్టెన్సీ పోటీదారులుగా క్లాస్ సెక్షన్లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి,నేహా చౌదరి సహా మాస్ సెక్షన్ నుంచి మెరానా-రోహిత్, ఆర్జే సూర్య, బాలాదిత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. అయితే టాస్క్ జరుగుతున్నప్పుడు కూడా కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. చీటింగ్ చేస్తుందంటూ మెరీనా గీతుపై ఫైర్ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా విడుదల చేసింది. మరోవైపు ఫైమా- నేహా చౌదరి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమో చూసి అర్థమవుతుంది. ఇంతకీ ఈ గొడవకు కారణమేంటి? వీరిలో బిగ్‌బాస్ సీజన్-6 మొదటి కెప్టెన్ ఎవరన్నది తేలాల్సి ఉంది. Captaincy task modhalaindhi...Who will make it? 👀 Find out on @StarMaa tonight, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/N2ihSMTABY — starmaa (@StarMaa) September 9, 2022 -
రేవంత్ త్వరగా ఎలిమినేట్ అవ్వాలి: గీతూ
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే బిగ్‌బాస్ ఆరో సీజన్ 21 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. షో ఇలా మొదలైందో లేదో అప్పుడే గొడవలు షురూ అయ్యాయి. ఆర్జీవీ హీరోయిన్ ఇనయ సుల్తానా ఎక్కువగా వాదనలకు దిగుతూ కనిపిస్తుండగా గీతూ ఛాన్స్ దొరికితే చాలు అందరినీ చెడుగుడు ఆడేసుకుంటోంది. ఆది, చలాకీ చంటి ప్రస్తుతానికైతే కామ్‌గా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. మిగతా హౌస్మేట్స్ కూడా ఇప్పుడిప్పుడే ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి రోజు నుంచే సింగర్ రేవంత్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాడు. తన మాట వినాలన్న ధోరణి అతడిలో ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ఇదే మిగతా కంటెస్టెంట్లకు నచ్చడం లేదు. వెరసి నామినేషన్లో అందరూ మనసులో ఉన్నదంతా కక్కేశారు. ఫలితంగా అందరికంటే ఎక్కువగా రేవంత్‌కు ఎనిమిది ఓట్లు పడ్డాయి. అయినా అతడికున్న పాపులారిటీతో ఈ గండాన్ని ఈజీగా దాటేస్తాడు. అతడి అత్యుత్సాహాన్ని కాసేపు పక్కనపెడితే రేవంత్ ఎందుకో ప్రతిదానికీ తెగ ఎమోషనల్ అవుతున్నాడు. అప్పుడే గట్టిగా మాట్లాడతాడు, అంతలోనే సైలెంట్ అయిపోతాడు, ఎవరికీ కనిపించకుండా బాత్రూం ఏరియాలోకి వెళ్లి ఏడ్చేస్తాడు. అతడి ప్రవర్తనే ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. తాజాగా రిలీజైన ప్రోమోలో కూడా అతడే హైలైట్ అయ్యాడు. 'నామినేషన్లోకి రావడం పాపం కాదు, జనాలు నిన్నేమీ బూతులు తిట్టుకోరు' అంటూ నామినేషన్స్ హీట్ నుంచి రేవంత్‌ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆదిత్య. అయితే గీతూ మాత్రం ఆయన ఎంత త్వరగా బయటకు వెళ్తే ఆయనకే మంచిది అని వేదాంతం పలికింది. ఆయన కనక హౌస్‌లో ఇదే బిహేవియర్‌తో కొనసాగితే మాత్రం జనాలు.. ఇంత పెద్ద సింగర్, ఇట్ల చేస్తున్నాడేంది అనుకోవడం ఖాయం అని అభిప్రాయపడింది. మరి రేవంత్ తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుని గేమ్‌పై ఫోకస్ పెడ్తాడా? లేడా? అనేది చూడాలి! చదవండి: చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది: యాంకర్, నటి లైగర్ ఎఫెక్ట్: అద్దె ఇల్లు ఖాళీ చేసిన పూరీ -
నామినేషన్స్‌లో ఆ ముగ్గురు, బయటకు వెళ్లేది ఆవిడే!
Bigg Boss 6 Telugu, Episode 3: బిగ్‌బాస్ షోలో మొదటి రోజునే నామినేషన్స్ జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కంటెస్టెంట్ల సత్తా తెలుసుకునేందుకు వారితో గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. మొదటిరోజే ఇంటిసభ్యులను క్లాస్.. మాస్.. ట్రాష్ అంటూ మూడు భాగాలుగా విడిపోవాలన్నాడు. విశేష అధికారాలుండే క్లాస్ టీమ్‌లో బాలాదిత్య, శ్రీహాన్, సూర్య ఉండగా రేవంత్, గీతూ, ఇనయ సుల్తాన ట్రాష్‌లోకి.. మిగిలినవారంతో మాస్ టీమ్‌లోకి వచ్చారు. అయితే సమయానుసారం ఛాలెంజ్‌లు ఇస్తూ కంటెస్టెంట్లు టీమ్ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో మొదటి ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి గెలిచి అతడు క్లాస్ టీమ్‌లో ఎంటరయ్యాడు. అందులో ఉన్న శ్రీహాన్ మాస్ టీమ్ సభ్యుడిగా మారిపోయాడు. ఈరోజు బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ట్రాష్ నుంచి ఒకరు క్లాస్ సభ్యుడితో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. అలా గీతూ క్లాస్‌లోకి ఎంటరవగా బాలాదిత్య ట్రాష్‌లోకి వచ్చి పడ్డాడు. గీతూ అలా ఓ మెట్టు ఎక్కిందో లేదో అప్పుడే పర్ఫామెన్స్ మొదలుపెట్టేసింది. ఇనయను టార్గెట్ చేసి కావాలని ఆమెతో పనులు చేయించుకుంది. మాస్ సభ్యులతో సపర్యలు చేయించుకుని సంబరపడిపోయింది. మరోవైపు రేవంత్ సడన్‌గా బాత్రూమ్లోకి వెళ్లి ఏడ్చేశాడు. అటు ఇనయ కూడా ఓటమిని జీర్ణించుకులేక ఓపక్క ఏడుస్తూనే ప్రతిదానికీ వాదనకు దిగడం చికాకు పుట్టించింది. ఆ తర్వాత ఇచ్చిన టాస్కుల్లో గెలిచిన రేవంత్, నేహా మాస్ టీమ్‌లోకి, బాలాదిత్య, అభినయ ట్రాష్‌లోకి వెళ్లారు. ఫైనల్‌గా ఈ క్లాస్.. మాస్.. ట్రాష్ టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. నేహా, ఆదిరెడ్డి, గీతూ క్లాస్ టీమ్‌లో ఉన్న కారణంగా ఈ ముగ్గురూ నామినేషన్స్‌లో లేరని ప్రకటించాడు బిగ్‌బాస్. అంతేకాదు, వీరు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ట్రాష్ టీమ్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయ సుల్తానా ఈ వారం నేరుగా నామినేషన్లోకి వచ్చారు. ఇదిలా ఉంటే భార్యాభర్తలైన మెరీనా- రోహిత్ మధ్య చిన్నచిన్నగొడవలు వచ్చాయి. హగ్ ఇస్తుంటే కూడా వదిలించుకుని వెళ్లిపోయాడంటూ బుంగమూతి పెట్టుకుంది మెరీనా. తను చెప్పేది కూడా వినిపించుకోవడం లేదని అలక పూనింది. దీంతో రోహిత్ సారీ చెప్పి చూసినా ఆమె పట్టించుకోలేదు. మొత్తానికి ఈ వారం ఇనయ, బాలాదిత్య, అభినయ నామినేషన్స్‌లోకి వచ్చారు. ఉన్న ముగ్గురిలో ఇనయపై నెగెటివిటీ ఎక్కువగా ఉంది. మరి వీళ్లతో పాటు ఇంకెవరు నామినేషన్స్‌లోకి వస్తారో తెలియాలంటే రేపటివరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఇనయాకు చుక్కలు చూపించిన గీతూ.. టాస్క్ తర్వాత పరిస్థితి ఏంటి? ఏంది రేవంత్, అప్పుడే బూతులు మొదలెట్టావా? -
అది బిగ్‌బాస్ హౌసా? అమీర్‌పేట హాస్టలా?
బిగ్‌బాస్‌లో కొట్లాటలు కామన్.. కానీ షో మొదలైన మొదటిరోజే గొడవపడటమే కాస్త విడ్డూరంగా ఉంది. సెప్టెంబర్ 4న 21 మంది కంటెస్టెంట్లతో అట్టహాసంగా ప్రారంభమైంది బిగ్‌బాస్ 6. షో అలా మొదలైందో లేదో అప్పుడే కయ్యానికి కాలు దువ్వుతున్నారు కంటెస్టెంట్లు. తొలిరోజే గలాటా గీతూ, ఇనయ సుల్తానల మధ్య హెయిర్ వార్ జరిగింది. వీరి గొడవ ఈరోజు కూడా కంటిన్యూ అయ్యేలా ఉంది. మరోవైపు ఓ టాస్క్‌లో గీతూ అపరిచితురాలిలా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన చూసి అక్కడున్నవాళ్లే కాదు ఆడియన్స్ కూడా ఖంగు తిన్నారు. ఇదిలా ఉంటే ఏ సీజన్‌కు ఆ సీజన్ దానికదే ప్రత్యేకం అనేలా హౌస్‌ను అద్భుతంగా డిజైన్ చేస్తోంది బిగ్‌బాస్ టీమ్. ఈసారి కూడా ఎంతో విశాలంగా, సకల సదుపాయాలు ఉండేలా లగ్జరీగా ఇంటిని డిజైన్ చేశారు. కానీ బెడ్రూమ్ను మాత్రం చాలా ఇరుకుగా చేసినట్లు కనిపిస్తోంది. ఇల్లు చూస్తే ఇంత పెద్దగా ఉంది, బెడ్రూమ్ ఏంటి? ఇలా ఉందని అయోమయానికి లోనయ్యారు కంటెస్టెంట్లు. కానీ చేసేదేం లేక జంటలుగా కలిపి ఉన్న బెడ్‌పైనే ఇద్దరిద్దరూ నిద్రించగా.. మిగిలినవారు మాత్రం నేలపై పడుకున్నారు. మొదటిరోజే వాళ్లు ఎదుర్కొన్న ఈ పరిస్థితి చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరీ ఘోరంగా బెడ్లు కూడా సరిగా ఏర్పాటు చేయరా? అని కామెంట్లు పెడుతున్నారు. దీని వెనక కూడా ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది, లేకపోతే బిగ్‌బాస్ కావాలని ఇలా ఎందుకు చేస్తాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆ బెడ్రూమ్ చూస్తుంటే ఇది బిగ్‌బాస్ హౌస్లా లేదని అమీర్‌పేట హాస్టల్లా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు బిగ్‌బాస్ ఫ్యాన్స్. హౌస్ నుంచి కొందరు ఎలిమినేట్ అయ్యేవరకు కంటెస్టెంట్లకు ఈ తిప్పలు తప్పేలా లేవు. చదవండి: బాత్రూంలో ‘హెయిర్స్’ లొల్లి.. అతి చేసిన గీతూ! బ్రహ్మాస్త్రపై భారీ అంచనాలు, పాపం అంతా తలకిందులేనా? -
Bigg Boss 6: ఇనయాకు చుక్కలు చూపించిన గీతూ!
బిగ్‌బాస్ ఆరో సీజన్లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. రెండో రోజే గీతూ.. ఇనయ సుల్తానా మధ్య ‘హెయిర్’ వార్ జరిగిన విషయం తెలిసిందే. బాత్రూంలో స్నానం చేసిన వారు అక్కడి హెయిర్‌ని తీసేయాలని గీతూ అంటే..నాతోనే ఎందుకు చెప్తున్నావని ఇనయ సుల్తానా వాగ్వాదానికి దిగింది. నీకు తిక్క అంటే నీకు తిక్క అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు. అది మనసులో పెట్టుకున్న గీతూ.. ఇనయాతో ఓ ఆట ఆడుకున్నటు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. (చదవండి: బిగ్‌బాస్‌పై సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలు) ‘క్లాస్.. మాస్.. ట్రాష్’ టాస్క్‌లో ‘క్లాస్’టీమ్‌లోకి వెళ్లిన గీతూ..ట్రాష్ టీమ్‌లో ఉన్న ఇనయాకు చుక్కలు చూపించింది. టాస్క్‌లో భాగంగా గీతూ ఏ పని చెప్తే ఇనయా సుల్తాన ఆ పని చేయాలి. దీంతో ఆమెతో బాటిల్ తెప్పించుకోవడం.. నిమ్మరసం చేయించుకోవడం.. చివరకు దువ్వెనను కూడా తెప్పించుకుంది. అలాగే పాట పాడాలని ఆదేశించగా.. ‘నేను పని చెప్తే చేస్తా కానీ నీ కోసం పాటలు, పద్యాలు పాడను’అని తెగేసి చెప్పింది ఇనయా. ప్రతి చిన్న పనిని ఇనయాతోనే చేయించుకుంటూ ఇంట్లో నవ్వులు పూయించింది. అదే సమయంలో ఇనయాకు మాత్రం విసుగు వచ్చేలా చేసింది. మరి టాస్క్ పూర్తయ్యాక గీతు పరిస్థితి ఏంటో చూడాలి. -
Bigg Boss 6: బిగ్‌బాస్ చెప్పినా ఆ పని చేయను.. గలాట గీతూ
బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్రవర్సీలు.. ఒకరినొకరు అరుచుకోవడం.అయితే ప్రతీసారి సీజన్ మొదలైన తర్వాత కనీసం వారం రోజుల తర్వాత ఈ చిచ్చు మొదలవుతుంది. కానీ ఆరో సీజన్లో మాత్రం రెండో రోజే రచ్చ మొదలైపోయింది. గలాట గీతూ, ఇనయ సుల్తానాల మధ్య ‘హెయిర్స్’వార్ జరిగింది. నీకు తిక్క అంటే నీకు తిక్క అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. గీతూకి ఓ సలహా ఇచ్చాడు బాలాదిత్య, కీర్తి భట్‌తో సూర్య పులిహోర కలపడం స్టార్ చేశాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగిందో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. పక్కా లోకల్ పాటతో నిద్రలేచారు ఇంటి సభ్యులు. అభినయ శ్రీ తన మాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇంతలోనే గలాట గీతూ బాత్రూం గొడవ మొదలుపెట్టేసింది. బాత్రూంలో ఎవరివో హెయిర్స్ ఉన్నాయని, తలస్నానం చేసినప్పుడు ఎవరి హెయిర్స్ వాళ్లే తీసి పడేయాలి, బిగ్‌బాస్ తనకు ఈ టాస్క్ ఇచ్చినా చేయనని చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై ఇనయ సుల్తానాతో గొడవ జరిగింది. నువ్వు తిక్కదానికి అంటే.. నువ్వు తిక్కదానివి అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. ఈ లొల్లిపై గీతూకు బాలాదిత్య ఓ సలహా ఇచ్చాడు. నువ్వు చెప్పిన విషయం కరెక్టే అయినా... విధానం సరిగా లేదని గీతూతో అన్నాడు. అయితే ఆ సహాలను గీతూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలోనే ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్ఇచ్చాడు. ‘క్లాస్.. మాస్.. ట్రాష్’అనే ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ మూడు భాగాలుగా విడిపోవాలి. క్లాస్‌కు విశేషాధికారాలుంటాయి. వారు ఏ పనైనా చేసుకోవచ్చు. వీఐపీ బాల్కనీ వాడుకోవచ్చు. కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం ఉంటుంది. నేరుగా నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. ఇక ట్రాష్ సభ్యులు గార్డెన్ ఏరియాలోనే వంట చేసుకోవాలి. కప్టెన్సీ పోటీదారులయ్యే అర్హత ఉండదు. నేరుగా నామినేషన్లోకి వెళ్తారు. మాస్ సభ్యులు సామాన్యులుగా ఉంటారు. వారికి ఎలాంటి అధికారాలు ఉండవు. చివరకు మాస్ సభ్యుల్లో ముగ్గురు క్లాస్, ముగ్గురు ట్రాష్ ఉంటారు’అని బిగ్‌బాస్ ఇచ్చిన లెటర్ని చదివేసింది ఫైమా. ఆ తర్వాత ఇంటిసభ్యులు ఓటింగ్‌కి వెళ్లారు.అందులో బాలాదిత్య, శ్రీహాన్, సూర్యలు క్లాస్.. రేవంత్, గీతూ, ఇనయ సుల్తానలు ట్రాష్‌లోకి వచ్చారు. మిగిలిన అందరూ కూడా మాస్ సభ్యులు అని ఓటింగ్ లో తేల్చారు. ఇక కెప్టెన్సీలో ఎవరికి సపోర్ట్ చేయాలో వాసంతి, ఆరోహి, షానిలు చర్చించుకున్నారు. మరోవైపు వాసంతికి నాగార్జున ఇచ్చిన మూడు బ్యాడ్జీలను తనకు నచ్చిన వాళ్లకి పెట్టేసింది. హగ్ బ్యాడ్జ్ గీతూకి, పంచ్ బ్యాడ్జ్ షానీకి, కిస్ బ్యాడ్జ్ మెరినాకి ఇచ్చేసింది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో రెండో లెవల్లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ అవకాశం ఇచ్చాడు. సమయానుసారం మాస్ మరియు ట్రాష్ సభ్యులకు బిగ్‌బాస్ కొన్ని చాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో గెలిచిన వారికి ఓ తరగతి పైకి వెళ్లే అవకాశం ఉటుంది. గెలిచిన సభ్యులు వెళ్లిన తరగతి నుంచి ఒకరు స్వాప్ అయి ఒక మెట్టు కిందకు దిగుతారు. క్లాష్..మాస్..ట్రాష్’టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఏ తరగతిలో ఉంటే..వారికి ఆ తరగతిలో ఉన్న ప్రయోజనాలు లేదా నష్టాలు వర్తిస్తాయి. ప్రతి చాలెంజ్‌లో క్లాస్‌లొని ముగ్గురు సభ్యులు సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా మొదటి చాలెంజ్.. కొబ్బరి బోండాల యుద్దం అంటూ టాస్క్ ఇచ్చాడు. ఈ ఆట ఆడేందుకు ఆది రెడ్డి, ఇనయ ముందుకు వచ్చారు. ఈ గేమ్‌లో ఆదిరెడ్డి గెలిచి క్లాస్ సభ్యుడిగా మారిపోయాడు. క్లాస్ సభ్యుల్లోంచి శ్రీహాన్ మాస్ సభ్యుడిగా వచ్చాడు. ఇక కీర్తిభట్‌తో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు సూర్య. ఆమె వేసుకున్న టీషర్ట్ బాగుందని, అలాంటిదే తన వద్ద ఉందని చెప్పగా..అవునా..మరి వేసుకోవాల్సింది అని కీర్తి కౌంటర్ ఇచ్చింది. రేపు వేసుకుంటాలే అని సూర్య చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇంకేంటి పిచ్చి అని స్వీట్‌గా పిలవగా... ‘ఏమన్నావ్..’ అని కీర్తి షాకైంది.. పిచ్చి అని నేను అంటుంటాను అలా అనడం నాకు ఇష్టమని సూర్య అంటే..పిచ్చి అనేది ఫేవరేట్ వర్డ్ అంటూ కీర్తి తెగ సిగ్గు పడుతుంది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ఓడిపోయానని ఇనయ బాధ పడుతుంటే.. అభినయ శ్రీ వచ్చి ఓదార్చింది. ట్రాష్ సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మీరు ట్రాషీ కాదని చెప్పండి. గర్వించే విషయాలను, సందేశాలను మిగతా సభ్యులకు వినిపించండి. వాటిని బాటిల్‌పై రాసి స్విమ్మింగ్ పూల్‌లో వేయండి’అని బిగ్‌బాస్ చెప్పాడు. మొదటగా ఇనయ మాట్లాడుతూ.. ‘ముజబుర్ రెహ్మాన్.. మా నాన్న.. నన్ను తారగా గుర్తించాడు.. నాకు ఎక్కువ ఇష్టమైన వ్యక్తి.. తాను ఇండస్ట్రీలోకి వెళ్లాలని అనుకున్నాడు. వెళ్లాడు.. కానీ ఆర్థిక కష్టాలు., ఇంట్లో సమస్యలు.. వల్ల వెనక్కి వచ్చాడు.. మాతోనే ఉండిపోయాడు.. రెండేళ్ల క్రితం చనిపోయాడు.. డాడీ కలను పూర్తి చేసేందుకు నేను ఇండస్ట్రీకి వచ్చాను.. ఇక్కడకు రావడానికి కారణం మా డాడీనే.. పారిపోయి వచ్చాను..నేను యాక్ట్ చేయడం మా మ్మమ్మీకి ఇష్టం లేదు.. ఫుడ్ కూడా లేని స్థితి.. హాస్టల్లో అన్నంలో నీళ్లు పోసుకుని తిన్నాను.. మళ్లీ ఈ రోజు ఇక్కడ కూడా అదే గుర్తొచ్చింది..అలానే తిన్నాను. ఐ లవ్ మై డాడ్. అందరూ పిలవాలని.. ఇనయ రెహ్మాన్ అని పేరు పెట్టుకున్నాను. ఇంత పెద్ద షోలో చెబుతున్నాను.. ఐ లవ్ మై డాడ్’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది విని కీర్తిభట్ వెక్కివెక్కి ఏడ్చింది. తన గతంలో గుర్తుచేసుకొని బాగా ఎమోషనల్ అయింది. వీరిని గీతూ భయపడింది. నేను ఇప్పుడు చెప్పలేను బాబోయ్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కచ్చితంగా చెప్పాల్సిందే అనడంతో.. కొంచెం టైం కావాలని కోరింది. దీంతో రేవంత్ తన గురించి చెప్పుకొచ్చాడు. ‘నాన్న చనిపోయిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు. ఆరో తరగతి వరకు చెప్పలేదు.. బాగా చదువుకుంటే వస్తాడని అన్నారు.. ఆయన లేరనే విషయం తెలియక ముందు అమెరికా వెళ్లాలని.. మా డాడీని చూడాలని అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే అమ్మానాన్నల ప్రేమ, ప్రజల ప్రేమ’ అని అన్నాను. ఇక గీతూ మాట్లాడుతూ.. ‘సంతోషం, ఏడుపు, ప్రేమ, కోపం ఏదీ కూడా ఆపుకోలేదు.. ఈ రోజు నన్ను ఇక్క డ అందరూ ట్రాషీ అన్నారు. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను అలానే అనేవాళ్లు.. నేను ఎదుటి వాళ్లను పట్టించుకోలేదు.. నన్ను గౌరవిస్తేనే నేను గౌరవిస్తా.. మా ఊర్లో, బంధువులు అందరూ కూడా ఎవ్వరినీ కూడా నాతో మాట్లాడొద్దని అనేవాళ్లు.. అందరూ నన్ను దూరం పెట్టేశారు.. రివ్యూలు చెప్పినప్పుడు నన్ను జనాలు గుర్తించారు.. మోటివేషన్ వీడియోలు చేసినప్పుడు నాలో విషయం ఉందని గమనించారు.. జనాలు షేర్ చేశారు.. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నాను.. నా ఫాలోవర్లే వల్లే ఇంత దూరం వచ్చింది.. నాలో టాలెంట్ ఉందని, నన్ను స్టార్ అని జనాలు గుర్తించారు. నేను స్టార్ అని తెలిసిన తరువాత చాలా మంది వచ్చారు.. అంతకంటే ముందే నా ఫాలోవర్లు నాకు సపోర్ట్‌గా నిలిచారు.. సిగ్గు లేకుండా ఏడుస్తున్నా. ఏం చెప్పానో నాకు తెలియడం లేదు.. గలీజ్ గా ఉంది.’తనదైన శైలీలో చెప్పుకొచ్చింది గీతూ. మొత్తంగా ఈ ఎపిసోడ్లో గీతూ కొంచెం అతి చేసినట్లు అనిపించింది. -
నా బాడీ అంటే నాకు ఇష్టం లేదు : గీతూ రాయల్
Geetu Royal In Bigg Boss 6 Telugu: సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి గీతూ రాయల్ గురించి తెలిసే ఉంటుంది. తన యాసతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతూ రాయల్ బిగ్‌బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యింది. టిక్‌టాక్ స్టార్‌గా యూట్యూబర్‌గా గీతూ రాయల్‌కు బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక జబర్దస్త్‌లో ఆమె చేసిన పుష్ప స్కిట్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ నైట్‌లో పాపులారిటీ దక్కించుకున్న ఈ గలాటా గీతూ బిగ్‌బాస్-6లో అడుగుపెట్టింది. మరి తన మాటలతోనే కాకుండా ఆటతోనూ ఏ విధంగా మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. -
బిగ్‌బాస్-6 ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్లే.. నో ఛేంజ్
బుల్లితెరపై బిగ్‌బాస్-6 సందడి మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే హౌజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీజన్-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వినోదం పంచనున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ రియాల్టీ షో రేపు(ఆదివారం)నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే నెట్టింట బిగ్‌బాస్ సందడి షూరు అయ్యింది. ఈసారి షోలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీరిలో 20మంది పేర్లు బయటికి రాగా ఇదే ఫైనల్ లిస్ట్ అని లీకు వీరులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం..గీతూ రాయల్, ఆదిరెడ్డి, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, యాంకర్ నేహా చౌదరి, ఆర్జే సూర్య, కమెడియన్ చంటి,నటుడు బాలాదిత్య, షాన్ని, సింగర్ రేవంత్, నటి సుదీప(పింకీ), యాంకర్ ఆరోహీ రావ్, సీరియల్ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా(ఆర్జీవీ వీడియోతో పాపులర్), లేడీ కమెడియన్ ఫైమా, నటి వసంతి, అర్జున్, రాజశేఖర్, రియల్ కపుల్ రోహిత్, మరీనాలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కామనర్స్ కూడా ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. -
Geetu Royal: బాడీ షేమింగ్ అంటూ ఏడ్చిన గీతూ.. షణ్ను ఫ్యాన్స్ ఫైర్
బిగ్‌బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయింది గీతూ రాయల్. బుల్లితెర షోలలోనూ మెరుస్తున్న ఈమె త్వరలో బిగ్‌బాస్ 6లో పాల్గొననుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గీతూ రాయల్ కంటతడి పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారంటూ సుమారు గంటసేపు ఏడ్చింది. 'నన్ను ఇంట్లో వాళ్లతో సహా చాలామంది బాడీ షేమింగ్ చేశారు. అందుకని నేను చాలా వరకు బాడీని కవర్ చేసేలా డ్రెస్సులు వేసుకున్నాను. కానీ ఇటీవలే నా కజిన్స్, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను.. నువ్వు ముందు నీ బాడీని ప్రేమించమని చెప్పారు. కానీ, నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నా. జనాలు మీ బాడీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. మనుషుల లుక్స్‌ను బట్టి వారిని అంచనా వేయకండి. దయచేసి బాడీ షేమింగ్ చేయొద్దు' అంటూ ఏడ్చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారగా నువ్వు గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్నును బాడీ షేమింగ్ చేయలేదా? అతడిని తిట్టిపోయలేదా? అని ప్రశ్నిస్తున్నారు షణ్ను ఫ్యాన్స్. దీనిపై ఆమె స్పందిస్తూ.. 'బిగ్‌బాస్ గేమ్ జడ్జ్ చేయడమే నా పని. మా వాడిని అన్నప్పుడు లేదా? అని తిడుతున్నారు. ఆయన బయటకు వచ్చినప్పుడు నేను అతడి పేరు కూడా ఎత్తలేదు. ఎందుకంటే బిగ్‌బాస్ తర్వాత ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేనేదో కావాలని సింపతీ క్రియేట్ చేస్తున్నానంటున్నారు. నాకేమీ చేతకాదు అని ఒప్పుకున్నప్పుడు సింపతీ క్రియేట్ చేస్తా. ఇప్పుడు నాకు చాలా టాలెంట్ ఉంది. నాకీ సింపతీ అక్కర్లేదు. పాత రివ్యూలను, పాత విషయాలను అలాగే పట్టుకుని వేలాడేవారిని నిబ్బాస్ అంటారు. కొంచెం మారండి' అని ఘాటుగానే సమాధానమిచ్చింది. అయినప్పటికీ ఊరుకోని షణ్ను అభిమానులు మావాడిని బాడీషేమింగ్ చేసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు నిన్ను బాడీ షేమింగ్ చేస్తుంటే బాధేస్తుందా? అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇదిప్పట్లో ముగిసేలా లేదనుకున్న గీతూ రాయల్ చివరగా ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియో షేర్ చేస్తూ.. 'నేను నిజంగా ఎవరినైనా బాడీ షేమింగ్ చేసుంటే ఆ వీడియో పంపించండి. ఒకవేళ అది నిజమైతే బాహాటంగా సారీ చెప్తా' అని చెప్పుకొచ్చింది. చదవండి: అన్ని కోట్లిస్తామన్న కంపెనీ, కుదరదన్న ఐకాన్ స్టార్ బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు -
ఆదిరెడ్డి, అమర్దీప్.. బిగ్‌బాస్ 6లో ఇంకా ఎవరెవరంటే?
బిగ్‌బాస్ షో కోసం తెగ వెయిట్ చేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్‌బాస్ ఐదో సీజన్ తర్వాత నాన్‌స్టాప్ పేరుతో ఓటీటీలో బిగ్‌బాస్ ప్రారంభమైనా అది అందరికీ చేరువవలేదు. కేవలం హాట్‌స్టార్‌ను వీక్షించేవారు మాత్రమే దాన్ని చూసేందుకు వీలుండటంతో చాలావరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రియాలిటీ షోను మిస్సయ్యారు. అయితే వారి నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే షో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్ ఘనంగా లాంచ్ కానుంది. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చింది. కానీ కొందరు మాత్రం ఇంకా రావాలా? వద్దా? అన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దీపికా పిల్లి, నేహా చౌదరి, శ్రీహాన్, ఆర్జే సూర్య, యాంకర్ ఉదయభాను, అమర్దీప్, ఆదిరెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్, సింగర్ రేవంత్, యాంకర్ అరోహి.. షోలో అడుగు పెట్టబోతున్నారట. గత సీజన్లో సిరి రాగా, ఈసారి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ వస్తుండటంతో అతడి మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక బుల్లితెర నటుడు అమర్దీప్ ఇటీవలే తన ప్రేయసి, సహనటి తేజస్వితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. మరి అతడు పెళ్లిని వాయిదా వేసుకుని వస్తాడా? లేదంటే త్వరగా పెళ్లి చేసేసుకుని బిగ్‌బాస్ షోకు రెడీ అవుతాడా? అన్నది చూడాలి! ప్రతి సీజన్లో ఓ కమెడియన్ ఉన్నట్లే ఈసారి కూడా ఓ హాస్యనటుడిని తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గీతూ రాయల్.. సోషల్ మీడియాలో కొటేషన్లు చెప్తూ బాగా ఫేమస్ అయింది. అలాగే బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చింది. ఆది రెడ్డి కూడా ఈ షోపై రివ్యూలు ఇచ్చిన వ్యక్తే. బిగ్‌బాస్ ఓటీటీలో షోపై రివ్యూలు ఇచ్చిన యాంకర్ శివను లోనికి పంపించారు. ఈలెక్కన ఈసారి వీరిద్దరినీ కూడా హౌస్‌లోకి పంపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక అందరినీ మించి ఉదయభాను షోలో అడుగుపెడ్తే ఎలా ఉంటుందో చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి బిగ్‌బాస్‌కు వస్తుండటం కూడా చాలామంది ఆశ్చర్యపరుస్తోంది. మరి వీరిలో ఎవరు చివరిదాకా ఉంటారు? ఎవరు మొదట్లోనే హ్యాండ్ ఇస్తారు? ఇంకా ఎవరెవరు హౌస్‌లోకి రాబోతున్నారు? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే! చదవండి: ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించిన ఈ నటి గురించి తెలుసా? ఆర్ఆర్ఆర్లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే..