Bigg Boss Telugu 6: Netizens Satires On Bigg Boss Bedroom - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: అమీర్‌పేట హాస్టల్‌లా బెడ్‌రూమ్‌.. మొదటిరోజే తిప్పలు!

Published Tue, Sep 6 2022 5:44 PM | Last Updated on Wed, Sep 7 2022 4:10 PM

Bigg Boss Telugu 6: Netizens Satires On Bigg Boss Bedroom - Sakshi

బిగ్‌బాస్‌లో కొట్లాటలు కామన్‌.. కానీ షో మొదలైన మొదటిరోజే గొడవపడటమే కాస్త విడ్డూరంగా ఉంది. సెప్టెంబర్‌ 4న 21 మంది కంటెస్టెంట్లతో అట్టహాసంగా ప్రారంభమైంది బిగ్‌బాస్‌ 6. షో అలా మొదలైందో లేదో అప్పుడే కయ్యానికి కాలు దువ్వుతున్నారు కంటెస్టెంట్లు. తొలిరోజే గలాటా గీతూ, ఇనయ సుల్తానల మధ్య హెయిర్‌ వార్‌ జరిగింది. వీరి గొడవ ఈరోజు కూడా కంటిన్యూ అయ్యేలా ఉంది. మరోవైపు ఓ టాస్క్‌లో గీతూ అపరిచితురాలిలా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన చూసి అక్కడున్నవాళ్లే కాదు ఆడియన్స్‌ కూడా ఖంగు తిన్నారు. ఇదిలా ఉంటే ఏ సీజన్‌కు ఆ సీజన్‌ దానికదే ప్రత్యేకం అనేలా హౌస్‌ను అద్భుతంగా డిజైన్‌‌ చేస్తోంది బిగ్‌బాస్‌ టీమ్‌. ఈసారి కూడా ఎంతో విశాలంగా, సకల సదుపాయాలు ఉండేలా లగ్జరీగా ఇంటిని డిజైన్‌ చేశారు. కానీ బెడ్‌రూమ్‌ను మాత్రం చాలా ఇరుకుగా చేసినట్లు కనిపిస్తోంది.

ఇల్లు చూస్తే ఇంత పెద్దగా ఉంది, బెడ్‌రూమ్‌ ఏంటి? ఇలా ఉందని అయోమయానికి లోనయ్యారు కంటెస్టెంట్లు. కానీ చేసేదేం లేక జంటలుగా కలిపి ఉన్న బెడ్‌పైనే ఇద్దరిద్దరూ నిద్రించగా.. మిగిలినవారు మాత్రం నేలపై పడుకున్నారు. మొదటిరోజే వాళ్లు ఎదుర్కొన్న ఈ పరిస్థితి చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరీ ఘోరంగా బెడ్లు కూడా సరిగా ఏర్పాటు చేయరా? అని కామెంట్లు పెడుతున్నారు. దీని వెనక కూడా ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుంది, లేకపోతే బిగ్‌బాస్‌ కావాలని ఇలా ఎందుకు చేస్తాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆ బెడ్‌రూమ్‌ చూస్తుంటే ఇది బిగ్‌బాస్‌ హౌస్‌లా లేదని అమీర్‌పేట హాస్టల్‌లా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌. హౌస్‌ నుంచి కొందరు ఎలిమినేట్‌ అయ్యేవరకు కంటెస్టెంట్లకు ఈ తిప్పలు తప్పేలా లేవు.

చదవండి: బాత్రూంలో ‘హెయిర్స్‌’ లొల్లి.. అతి చేసిన గీతూ!
బ్రహ్మాస్త్రపై భారీ అంచనాలు, పాపం అంతా తలకిందులేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement