Bigg Boss 6 Telugu
-
ప్రేమలో పడిన తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో కలిసి ఏకంగా
బిగ్‌బాస్ షోతో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి కాగా త్వరలో 8వ సీజన్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే పలువురు పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ప్రియుడిని కూడా పరిచయం చేసేసింది. ఇంతకీ ఎవరతడు?రామ్ గోపాల్ వర్మతో ఓ వీడియోలో కనిపించిన ఇనయా అప్పట్లో వైరల్ అయింది. అలా బిగ్ బాస్ 6వ సీజన్లో అడుగు పెట్టింది. ఉన్నంతలో పర్వాలేదనిపించే ఫెర్ఫార్మెన్స్ చేసింది. షో అయిపోయిన తర్వాత ఈమెకు పెద్దగా సినిమా ఛాన్సులు రాలేదు. దీంతో హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఎంటర్టైన్ చేస్తూ బిజీగా ఉంది.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' టీమ్‌కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?)ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఇనయా.. ఓ వ్యక్తితో కలిసి క్లోజ్‌గా కనిపించింది. తాజాగా అతడితోనే బాత్రూంలో టవల్ కట్టుకుని మరీ సెల్ఫీలకు పోజులిచ్చింది. దీని కింద బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న యాంకర్ శివ కామెంట్ చేయగా.. ఇనయా తన ప్రేమ నిజమేనని క్లారిటీ ఇచ్చేసింది.ఇనయా బాయ్ ఫ్రెండ్ విషయానికొస్తే ఇతడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి. యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని ఇన్ స్టాలోని బయో బట్టి తెలుస్తోంది. గతంలో జిమ్‌లో వీళ్ల ప్రేమ వ్యవహారం మొదలై, రిలేషన్షిప్ వరకు వచ్చిందని తెలుస్తోంది. రొమాంటిక్ పోజులు చూస్తుంటే త్వరలో పెళ్లి చేసేసుకుంటారేమో అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ సినిమా.. ఇకపై తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
ఎక్కడెక్కడో టచ్ చేశారు.. వస్తావా అంటే తెలియక సరే అన్నాను: కీర్తి భట్
బిగ్ బాస్ షోతో చాలామంది పేరు తెచ్చుకున్నారు. అలా ఆరో సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి కీర్తి భట్. పలు సీరియల్స్‌లో హీరోయిన్గా నటించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్నాళ్లు కోమాలో ఉండి, తిరిగి కోలుకుంది. రీసెంట్‌గానే ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ.. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే జంటగా ఓ ఇంటర్వ్యూకి వచ్చింది. తనకు జరిగిన దారుణమైన అనుభవాల్ని బయటపెట్టింది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన కీర్తి భట్.. 2019లో 'మనసిచ్చి చూడు' అనే సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'కార్తీకదీపం'లోనూ నటించింది. 2022లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ప్రస్తుతం 'మధురానగరిలో' సీరియల్ చేస్తోంది. 2017లో కీర్తి భట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవగా.. ఈమె తల్లిదండ్రులు, అన్న-వదిన మృత్యువాతపడ్డారు. అదృష్టం బాగుండి కీర్తి ప్రాణాలతో బయటపడింది. కానీ కొన్నాళ్ల పాటు కోమాలో ఉండి వచ్చింది. అప్పుడే దారుణమైన సంఘటనలు జరిగాయని కీర్తి చెప్పుకొచ్చింది.'ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగళూరు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. నన్ను ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. తెలుస్తుంది కానీ స్పర్మ లేకపోవడం వల్ల నెట్టేయడానికి కూడా బలముండేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎటైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్తే.. '200 ఇస్తా వస్తావా' అంటే సరే వస్తానని అనేదాన్ని. తర్వాత వాళ్ల లుక్ చూసి అర్థమయ్యేది' అని కీర్తి భట్ తనకెదురైన దారుణాల్ని బయటపెట్టింది. -
పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?
తెలుగు బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి వాసంతి కృష్ణన్ పెళ్లి చేసుకుంది. తన సొంతూరు తిరుపతిలో ప్రియుడు పవన్ కల్యాణ్‌తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం అర్థరాత్రి ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వాసంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన వాసంతి.. సీరియల్, సినిమాల్లో నటి. 'సిరిసిరి మువ్వలు' సీరియల్‌తో ఇండస్ట్రీలోకి వచ్చింది. గోరింటాక్, గుప్పెడంత మనసు సీరియల్స్‌లోనూ ఈమె యాక్ట్ చేసింది. గతేడాది 'భువన విజయం' లాంటి పలు చిన్న చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. తెలుగుతో పాటు కన్నడలోనూ ఈమె పలు సినిమాలు చేసింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పవన్ కల్యాణ్‌తో వాసంతి కృష్ణన్.. గతేడాది ప్రేమలో పడింది. అలా ప్రేమికులు కాస్త గతేడాది డిసెంబరులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే వాసంతిలానే ఈమె భర్త పవన్ కూడా నటుడే. హీరోగా ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు. (ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ రకుల్ పెళ్లి.. ఈ జోడీ ఆస్తి ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by @priyaaa14391 -
ఇంటర్వ్యూలో భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ ముద్దులాట.. దారుణమైన ట్రోల్స్!
యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలు రోజురోజుకీ మరింత దారుణంగా తయారవుతున్నాయి. హద్దులు దాటేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో ఈ డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే మరీ డైరెక్ట్‌గానే భర్తతో ముద్దులాట లాంటిది చేయడం వింతగా అనిపించింది. (ఇదీ చదవండి: అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన) బిగ్‌బాస్ 6వ సీజన్లో పాల్గొన్న వాసంతి కృష్ణన్.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయింది. పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోనుంది. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా ఈ జంటని ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూ చేశారు. మాట్లాడి వదిలేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండేది కాదు కానీ చేతులతో పట్టుకోకుండా ద్రాక్ష పళ్లు తినిపించడం అనే గేమ్ పెట్టారు. అయితే ఈ గేమ్ చూస్తుంటే లైవ్‌లోనే సరసాలు ఆడినట్లు కనిపించింది. ఇదే ఇంటర్వ్యూలో ఇలానే పలు గేమ్స్ పెట్టారు. తాజాగా వీటికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో.. వీళ్లపై ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. ఇంటర్వ్యూలో ఇలాంటి పనులేంట్రా బాబు అని తిట్లు అందుకుంటున్నారు. యాంకర్ సంగతి అటుంచితే ఇంటర్వ్యూ ఇచ్చే వారైనా కనీసం ఆలోచించరా అని నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) Anchor ❌ Broker ✅ Telugu telivision shows Chala Devalop ainayi 🤮🤮🤮 pic.twitter.com/Hf73bAnQGY — 𝕋𝔼𝕄ℙ𝔼ℝ🐯 (@faruk97717430) February 17, 2024 -
'తప్పుగా అనుకోవద్దు ప్లీజ్'.. వారందరికీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ రిక్వెస్ట్!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7పై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆదిరెడ్డికి ఓ సమస్య వచ్చిపడింది. సాయం కావాలంటూ ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అభిమానులుకు ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా ఇలా రావొద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: అయోధ్య రామ మందిరానికి బిగ్ బాస్ 'ఆదిరెడ్డి' విరాళం) ఆది రెడ్డి వీడియోలో మాట్లాడుతూ మాట్లాడుతూ.. 'దయచేసి అర్థం చేసుకోండి .. నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. నాకు వీలైనంత సాయం చేస్తుంటే ఉంటా. కానీ డైరెక్ట్‌గా ఇంటికి చాలా మంది వస్తున్నారు. వాళ్ల అందరికి నేనేం చేయగలను చెప్పండి . ఎవరు వచ్చినా ఆహారం అంటే ఒకరోజు పెట్టించగలను. కానీ వాళ్ల బాధలన్నీ చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితి. దయచేసి ఎవరు కూడా ఇంటికి కానీ.. సెలూన్‌కు కానీ రావొద్దు. సమాజానికి నా వంతు కృషి చేస్తాను. అంతే కానీ అందరికి చేయలేను కదా. ఎలాగోలా వచ్చిన వాళ్లకి ఛార్జీలకి ఇచ్చి పంపుతున్నా . దయచేసి అర్థం చేస్కోండి. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నాతో మాట్లాడాలంటే కామెంట్స్, మెసేజేస్ ద్వారా పంపండి.' అంటూ విజ్ఞప్తి చేశారు ఆదిరెడ్డి. కాగా.. ఆదిరెడ్డి ఇటీవలే 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించాడు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
యాంకర్ రవికి ఎందుకు సారీ చెప్పానంటే?: బిగ్‌బాస్ ఆదిరెడ్డి
బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్న మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి. తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. అయితే తాను ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7 షోపై కూడా చాలా వీడియోలు చేశాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌గా చాలా సార్లు మాట్లాడారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆది రెడ్డి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో యాంకర్ రవిపై చేసిన వీడియో పట్ల సారీ చెప్పడంపై ఆయన స్పందించారు. ఆదిరెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'యాంకర్ రవి అంటే నాకు భయం లేదు. కానీ నేను అతనికి సారీ చెప్పా. ఎందుకంటే నేను ఫ్యామిలీ రిలేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. నా వల్ల వాళ్లు బాధ పడ్డప్పుడు నేను సారీ చెప్తే తప్పేముంది? మనకు ఫ్యామిలీ రిలేషన్స్ ముఖ్యం కదా?. అసలు ఏం జరిగిందంటే.. బిగ్‌బాస్ టాస్క్‌లో యాంకర్ రవి అన్న సంచాలక్. ఆయనకు బిగ్‌బాస్ కొన్ని రూల్స్ చెప్పాడంట. ఆ విషయం బయట ఉన్న మనకు తెలియదు. కానీ.. నేను రవి అన్న కావాలనే సన్నీని ఓడించాడని నెగెటివ్‌గా వీడియోలో చెప్పా. కానీ హౌస్ లోపల జరిగేవి కొన్ని మనకు చూపించరు కదా. ఆ విషయం నాకు బిగ్‌బాస్ వెళ్లి వచ్చాక అర్థమైంది. మనమే రవిని తప్పుగా అనుకున్నామని నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సారీగా ఫీలయ్యాను. ' అంటూ క్లారిటీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
తిరుపతిలో బిగ్ బాస్ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో వాసంతి కృష్ణన్‌కు మంచి గుర్తింపు తెచ్చుకుంది. షోలో తన అందచందాలతో మరింత పాపులారిటీని క్రియేట్ చేసుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో తన గ్లామర్‌తో మెప్పించిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అనే వ్యక్తితో వాసంతి ఎంగేజ్మెంట్ జరిగింది. డిసెంబర్ 7న జరిగిన ఈ కార్యక్రమానికి బిగ్ బాస్,బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. వాసంతి పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తే... వారిద్దరూ ప్రేమించి ఆపై పెద్దలను ఒప్పించి ఒకటి కాబోతున్నారు. పవన్ కూడా ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఆ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన వాసంతి.. తన ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగింది. ఈ వేడుకలో శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, ఆర్జే సూర్య, గీతూ రాయల్, ఇనాయ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. మరికొందరు ఇన్‌స్టా ద్వారా వారిద్దిరికి శుభాకాంక్షలు తెలిపారు. వాసంతి, పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని సమాచారం.. ఇదే ఏడాదిలో మొదలైన వారిద్దరి ప్రేమ ఇలా పెళ్లికి ప్రథమ అడుగు పడింది. త్వరలో పెళ్లి ఎప్పుడు అనేది కూడా వాసంతినే ప్రకటించనుంది. అయితే బిగ్‌బాస్‌కు ముందు వాసంతి ఓ సీరియల్‌తో పాటు రెండు చిన్న సినిమాలలో నటించింది. సిరిసిరి మువ్వలు అనే సీరియల్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వాసంతి.. గోరింటాకు, గుప్పెడంత మనసు సీరియల్స్‌లో ఈమె నటించింది. సంపూర్ణేష్‌తో కలిసి ఓ మూవీలో నటించిన వాసింతి కన్నడలో కూడా పలు చిత్రాల్లో నటించడం విషేశం. View this post on Instagram A post shared by SUNKARA VEERA VENKATA SURYANARAYANA (@rjsurya_official) -
నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్
బిగ్ బాస్ సీజన్-7 నుంచి ఆరోవారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన పావని కేవలం ఒక వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వాస్తవానికి మిగిలిన కంటెస్టెంట్ల కంటే ఆమె మెరుగ్గానే ఆటలో తన సత్తా చూపినప్పటికే ఎలిమినేట్ అయ్యింది. దీంతో చాలామంది ప్రేక్షకులు నయని పావని ఎలిమినేషన్‌ను ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు. అమెను హౌస్ నుంచి పంపించడం చాలా అన్యాయం అని పలువురు కామెట్లు చేయగా.. యాంకర్ శివ కూడా ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ తెలిపాడు. ఓటింగ్‌కు, ఎలిమినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు తాజాగా బిగ్‌బాస్- 6 కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ కూడా నయని పావని ఎలిమినేషన్ ప్రక్రియను తప్పుపట్టాడు. నయని పావని ఎలిమినేట్ కావడంపై అర్జున్ కల్యాణ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా స్పందించాడు. నయని పావనీని ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్ బాస్ షో విలువను కోల్పోయింది అన్నాడు. ఆమె ఎలిమినేషన్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, అది తనను ఎంతగానో బాధించిదని తెలిపాడు. ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఇలా జరగడం కరెక్ట్ కాదని చెప్పాడు. దీంతో బిగ్‌బాస్ క్రెడిబిలిటీ దెబ్బతినడమే కాకుండా షో నిర్వాహుకులకు భారీ నష్టమని పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రేక్షకులు వేసే ఓటింగ్‌కు, కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరాడు. బిగ్‌బాస్ అన్ని సీజన్స్ కి సంబంధించిన ఓటింగ్, ఎలిమినేషన్ వివరాలు ఇవ్వాలని ఎవరైనా కోర్టులో పిల్ దాఖలు చేయాలని అర్జున్ కల్యాణ్ పేర్కొన్నాడు. కోర్టులు ఖాళీగా లేవు దీంతో అర్జున్ కల్యాణ్‌కు పలువురు నెటిజన్లు కొన్ని ప్రశ్నలు సందించారు. ఇలాంటి పిల్స్ తీసోకోవడానికి కోర్టులు ఖాళీగా లేవని ఒకరు రాసుకొచ్చారు. దీంతో అర్జున్ ఇలా తిరిగి రిప్లై ఇచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని చాలామంది తెలుగువారు ఈ షో చూస్తున్నారు. ఆపై ఓట్లు కూడా వేస్తున్నారు. కానీ వారి ఓట్లకు విలువ లేకుండా ఇలాంటి నిర్ణయాల తీసుకోవడం వల్ల ప్రేక్షకులు కూడా నిరుత్సాహానికి గురౌతున్నారు. దీంతో కంటెస్టెంట్స్ కూడా నష్టపోతున్నారు. (ఇదీ చదవండి: అమర్ దీప్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. లండన్‌లో స్టడీస్, పొలిటికల్ ఫ్యామిలీ ఇంకా మరెన్నో..) కేవలం ఓట్ల వల్లే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతూ ఇలాంటి తప్పుడు చర్యలతో బాధపెట్టడం కరెక్ట్ కాదు. ఇలాంటి ఎలిమినేషన్స్ వల్ల వారికి కావాల్సిన టీఆర్పీ వస్తుంది. మా సీజన్లో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. అలా బిగ్‌బాస్‌పై బజ్ క్రియేట్ చేశారు. ఈ కారణాలు చాలవా పిల్ ఫైల్ చేయడానికి.' అంటూ అర్జున్ అభిప్రాయం చెప్పాడు. బిగ్‌బాస్ అగ్రిమెంట్ సీక్రెట్ ఇదే ఇప్పుడు ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మరో నెటిజన్ ప్రశ్నించాడు. మీ ఎలిమినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని అర్జున్ను తప్పుపట్టారు. దీంతో ఆయన ఇలా తిరిగి సమాధానం ఇచ్చాడు. ' నేను ఎలిమినేషన్ సమయంలో బిగ్‌బాస్ వారు ఇచ్చిన అగ్రిమెంట్ కాంట్రాక్ట్‌లో ఉన్నాను. నేను ఎలిమినేషన్ అయిన తర్వాత అసలు విషయం తెలిసింది. బిగ్‌బాస్ -6లో నేను ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు. ఇదే విషయం నాకు ఎంతో ఆలస్యంగా తెలిసింది. బిగ్‌బాస్ అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఉంటుంది. హౌస్‌లోని ఒక కంటెస్టెంట్‌ను ఎప్పుడైనా, ఎలాగైనా, ఎటువంటి కారణం చెప్పకుండా ఎలిమినేట్ చేసే అధికారం షో నిర్వాహుకులకు ఉంటుంది.' అని అర్జున్ సెన్సేషనల్ విషయాన్ని తెలిపాడు. ఎలిమినేషన్స్ అనేవి ఓటింగ్ వల్ల మాత్రమే జరగవు. హౌస్‌లో వాళ్లు ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తున్నారు అనే విషయంపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్‌బాస్ అసలు గుట్టు ఇదా అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ కల్యాణ్ వ్యాఖ్యలకు బిగ్‌బాస్ టీమ్ ఏమైన సమాధానం చెబుతుందేమో తెలియాల్సి ఉంది. Felt really bad for #NayaniPavani. She didn't deserve it for sure. Huge loss for the show and their credibility. Hope ppl realize now that there is no link between voting and eliminations. Somebody should file a PIL to show the votings of all seasons and eliminations.… — Arjun Kalyan (@ArjunKalyan) October 15, 2023 @ArjunKalyan meeru eliminate ayinappudu enduku adagaledu evariki enni votes vachayo chupinchamani..if you remember BB season 3 Ali Reza ane contestant ki voting motham chupincharu ani tane last lo unnadu ani tane cheppadu..meeku guts leva adagadaniki appudu?? — Jagadeesh Bandaru (@NenuJagadeesh) October 15, 2023 -
కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!
తెలుగులో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మంది. అందులో ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీ షోలతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో అలరిస్తూ ఉంటుంది. అలాంటి ఈమె.. ఇప్పుడు కొత్తింట్లో అడుగుపెట్టింది. అప్పట్లో తన తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది. 'పటాస్' షోలో స్టాండప్ కామెడీ చేస్తూ వెలుగులోకి వచ్చిన ఫైమా.. ఆ తర్వాత 'జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత సహాయ పాత్రల్లో కనిపించిన ఈమె.. తన మార్క్ విచిత్రమై యాస, టైమింగ్‌తో ఆకట్టుకుంది. ఒకానొక దశలో టీమ్ లీడర్స్‌నే డామినేట్ చేసి మరీ గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: 'ఛాంగురే బంగారు రాజా' సినిమా రివ్యూ) అలా కమెడియన్‌గా చాలా క్రేజ్ తెచ్చుకున్న ఫైమా.. గతేడాది 'బిగ్‌బాస్'లో పాల్గొంది. దాదాపు 10 వారాల పాటు ఉండి, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అయితే షోలో అడుగుపెట్టినప్పుడు తల్లి గురించి కొన్ని విషయాలు చెప్పింది. బీడీలు చుట్టి, అలా వచ్చిన డబ్బుతో తమని పెంచిందని చెప్పిన ఫైమా.. ఆమెకి ఓ ఇల్లు కట్టివ్వాలనేదే తన కోరిక అని చెప్పింది. ఇప్పుడు ఆ కలని నిజం చేసి చూపించింది. ఇదిలా ఉండగా ఫైమా.. ప్రస్తుతం పలు షోల్లో కమెడియన్, డ్యాన్సర్‌గా ఆకట్టుకుంటోంది. మరోవైపు 'పటాస్' నుంచి తనతో ట్రావెల్ అవుతున్న కమెడియన్ ప్రవీణ్‌తో ఈమె ప్రేమలో ఉంది. ఇక ఎలానూ ఇల్లు కట్టేసింది కాబట్టి త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చూడాలి ఎప్పుడో ఆ శుభకార్యం జరుగుతుందో? (ఇదీ చదవండి: అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!) -
వయ్యారాలు ఒలకబోస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. శ్రీ సత్య గ్లామరస్ (ఫొటోలు)
-
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఇనయా సుల్తానా
బిగ్‌బాస్ సీజన్-6తో క్రేజ్ సంపాదించుకున్న ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆర్జీవీతో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదే గుర్తింపుతో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఇనయా లేడీ లైగర్‌గా పేరు సంపాదించుకుంది. మొదట ఆర్జీవీ భామ అని నెగిటివ్‌గా వార్తలొచ్చినా తన ఆటతీరు, మాటతీరుతో మెప్పించింది. అంతకుముందు అడపాదడపా చిత్రాల్లో మెరిసిన ఇనయా ఇప్పుడు హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. శివనాగు దర్శకత్వం వహిస్తున్న ‘నటరత్నాలు’ చిత్రంలో ఇనయా హీరోయిన్గా నటించనుంది. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో చందన ప్రొడక్షన్స్ పతాకంపై డా. దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు. -
శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్, చేయి కోసుకుంటానంటూ బ్లాక్మెయిల్!
బిగ్‌బాస్ ఫేం శ్రీసత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ 6 సీజనల్లో హౌజ్‌లో అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె స్టార్ మా ప్రసారం అవుతున్న బిబి జోడి డాన్స్‌లో షోలో అలరిస్తోంది. ఇందులో శ్రీసత్య మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సేతో జోడికట్టింది. వీరిద్దరి జోడికి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టేజ్‌పై డాన్స్ చేస్తుండగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ షో జడ్జస్ కూడా వారి పర్ఫామెన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్ డే పోస్ట్, చెప్పుతో కొడతానంటూ..! ఇదిలా ఉంటే మంగళవారం వాలంటైన్స్ డే సందర్భంగా మెహబూబ్ దిల్ సే శ్రీసత్యకి ఎర్ర గులాబిల బోకెతో ప్రపోజ్ చేసి షాకిచ్చాడు. దీంతో శ్రీసత్య అతడిపై సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొరియోగ్రఫర్స్ ప్రియాంక, సంకేత్ల సాయంతో మహబూబ్ దిల్ సే శ్రీసత్యకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. శ్రీసత్య దగ్గరికి వెళ్లి మొదట పరోక్షంగా ఓ అమ్మాయిని ప్రమించానని, తను రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనంటూ వాపోయాడు. ఎవరిని అంటూ ఆరా తీయగా.. నిన్నేనని ఆమెను సర్ప్రైజ్ చేశాడు. దీంతో శ్రీసత్య షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ హౌజ్‌లో పెంట అయ్యింది.. ఇప్పుడు కూడా పెంట అయ్యిద్ది? అంటూ మహబూబ్‌పై గట్టిగా అరిచింది. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ దీనికి అతడు ‘నువ్వు, నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయ్. నీలాంటి మంచి అమ్మాయిని వదుకోవాలనుకోవడం ఇష్టం లేదు’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ఇక శ్రీసత్య తన ప్రపోజల్‌ను ఒప్పుకోకపోవడంతో చేయి కోసుకుంటానంటూ మహబూబ్ బ్లాక్మెయిల్ చేయడంతో.. ‘ఇప్పటికే నేను ఆత్మహత్యయత్నం కూడా చేశా తెలుసా? నా ఎంగేజ్మెంట్ బ్రేకప్ తర్వాత నా లైఫ్‌లో ఎవరికి మరో చాన్స్ ఇవ్వాలనుకోవడం లేదు. నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది’ అంటుంది శ్రీసత్య. అలా కాసేపు ఇద్దరు అర్గ్యూ చేసుకున్న అనంతరం ఇది ప్రాంక్ అంటూ అందరికి షాకిచ్చాడు మహబూబ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. -
పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ఇనయా సుల్తానా.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు (ఫోటోలు)
-
బిగ్‌బాస్ 6కు అతి దారుణమైన టీఆర్పీ రేటింగ్!
బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజే వేరు. పక్కింటి ముచ్చట్లను చెవులు ఎక్కుపెట్టి వినే జనాలను ఆధారంగా చేసుకునే ఈ షో మొదలుపెట్టారు. వంద రోజులపాటు సెలబ్రిటీలను సోషల్ మీడియాకు, ఇంటికి దూరంగా ఓ ఇంట్లో ఉంచడం, వారు ఎలా ఉంటారో ప్రజలకు తెలియాలన్నదే షో కాన్సెప్ట్. ఇక్కడ జనాలు వారికి నచ్చినవారికి ఓటేస్తారు, నచ్చనివారిని బయటకు పంపించేస్తారు. అలా ఎంతమంది హౌస్‌లో అడుగుపెట్టినా చివరికి ఒక్కరే విజేతగా నిలుస్తారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ మొదటి సీజన్లో శివబాలాజీ, నాని వ్యాఖ్యాతగా ఉన్న రెండో సీజన్లో కౌశల్ మండా, నాగార్జున బిగ్‌బాస్ పగ్గాలు చేతపట్టిన మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్లో అభిజిత్, ఐదో సీజన్లో వీజే సన్నీ, ఆరో సీజన్లో సింగర్ రేవంత్ గెలిచారు. మొదట్లో భారీ టీఆర్పీ రేటింగ్స్‌తో ఊపందుకున్న బిగ్‌బాస్‌కు రానురానూ ఆదరణ కరువైపోయింది. బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు వచ్చిన టీఆర్పీయే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఫస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు 14.13, రెండో సీజన్ ఫినాలేకు 15.05, మూడో సీజన్ ఫినాలేకు 18.29, నాలుగో సీజన్ ఫినాలేకు 19.51, ఐదో సీజన్ ఫినాలేకు 16.04 టీఆర్పీ వచ్చాయి. రేవంత్ గెలుపొందిన ఆరో సీజన్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం అతి దారుణంగా 8.17 టీఆర్పీతో సరిపెట్టుకుంది. ఆరో సీజన్లో కంటెస్టెంట్ల ఎంపిక దగ్గరి నుంచి ఏదీ బాలేదని మొదటి నుంచే నెటిజన్లు పెదవి విరిచారు. పైగా ప్రారంభ వారాల్లోనే రేవంత్ విన్నర్ అని అందరూ ఫిక్సయ్యారు. అతడికి హౌస్‌లో గట్టి పోటీనిచ్చేవారే కరువయ్యారు. ఎలాగో అతడే గెలుస్తాడని ప్రేక్షకులు కూడా ఫిక్సైపోయి ఫినాలేను పక్కనపెట్టేసినట్లున్నారు. ఏదేమైనా మిగతా ఐదు సీజన్లకు డబల్ డిజిట్ టీఆర్పీ వస్తే ఆరో సీజన్ మాత్రం కేవలం సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకుని తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే అట్టర్ ఫ్లాప్ సీజన్‌గా నిలిచింది. చదవండి: పేదలకు నయన్ దంపతుల సర్ప్రైజ్ గిఫ్ట్స్ సమంత వండర్ఫుల్ లేడీ, తనను అమ్మలా కాపాడుకుంటా: రష్మిక -
బిగ్‌బాస్‌పై గీతురాయల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
చిత్తూరు రూరల్: ‘హాయ్..చిత్తూరు. నాయనా..మీ అభిమానం సల్లంగుండా!’ అంటూ బిగ్‌బాస్ ఫేమ్ గీతురాయల్ పలకరించింది. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైనా గీతు రాయల్ చిత్తూరు వాసుల్లో జోష్‌ను పెంచింది. గీతూ.. ఒక్క సెల్ఫీ– అంటూ యువత ఉత్సాహం చూపింది. ఆతర్వాత వేదికపైకి వెళ్లి హాయ్ చిత్తూరు అంటూ మొదలుపెట్టింది. ‘మీ అభిమానం చూస్తుంటే.. నా వల్ల కావడం లేదురా నాయనా.. నేను చిత్తూరు వదిలి వెళ్లి పోయి 15 ఏళ్లు అయింది. అయినా కూడా చిత్తూరు యాసను నా బ్లడ్‌లో ఎక్కించేసుకున్నా. ఏ సందర్భమైనా నేను చిత్తూరు యాసలోనే మాట్లాడుతున్నా. నన్ను ఏవరైనా మీది ఏ ఊరంటే..హేయ్.. మాది చిత్తూరు రా.. అని గర్వంగా చెబుతున్నా. బిగ్‌బాస్ వెళ్లాక నేను రెండు విషయాలు నేర్చుకున్నా. మనం తప్పు చేయకపోతే ఎదుటి వ్యక్తి ఎంతా తోపైనా అసలు తగ్గకూడదు. మనవైపు తప్పుంటే చిన్నపిల్లలైనా క్షమాపణ చెప్పాల్సిందే.. జీవితాంతం మీకు రుణపడి ఉంటా’ అని ముగించింది. ఆమెను తానా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. చదవండి: కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన బాలయ్య -
తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్ రేవంత్, వీడియో వైరల్
బిగ్‌బాస్ 6 తెలుగు విజేత, సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సీజన్లో బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన రేవంత్ తనదైన ఆట తీరు, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి టైటిల్ గెలిచేది తానే అంటూ ధీమా వ్యక్తం చేశాడు. చెప్పినట్టుగా బిగ్‌బాస్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 15 వారాల పాటు హౌజ్‌లో సందడి చేసిన రేవంత్ బిగ్‌బాస్ ఇంట్లో ఉండగానే తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య అన్విత ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సంతోషకర సమయంలో భార్య పక్కనే లేనని, బిడ్డను ఎత్తుకోలేకపోయానంటూ రేవంత్ ఇంట్లో కన్నీరు పెట్టుకున్నాడు. చదవండి: ఆస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’ ఇక ఎట్టకేలకు హౌజ్ నుంచి బయటకు రాగానే రేవంత్ తన కూతురిని తొలిసారి కలుసుకున్నాడు. టైటిల్‌తో బయటకు వచ్చిన రేవంత్‌కు ఆయన భార్య గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అంతేకాదు ఎప్పటికి గుర్తుండిపోయేలా బిడ్డను తొలిసారి రేవంత్ చేతికి ఇచ్చింది. విజేతగా ఇంటికి వెళ్లిన రేవంత్‌కు ఇది డబుల్ ధమాకా అనే చెప్పాలి. అటూ విన్నర్‌గా నిలిచి తొలిసారి తన కూతురిని చూడపోతున్నాడు. బిగ్‌బాస్ ట్రోఫీతో ఇంటికి వెళ్లిన రేవంత్ కళ్లకు గంతలు కట్టి లోపలికి తీసుకేళ్లారు. పాప దగ్గరికి వెళ్లగానే కళ్ల గంతలు తీసి కూతురిని రేవంత్ చేతికి అందించింది భార్య అన్విత. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచిన విజయ్.. తలైవాను అధిగమించాడా? పాపను అపురూపంగా చేతిలోకి తీసుకుంటూ రేవంత్.. తండ్రిగా ఎమోషనల్ అయిపోయాడు. తొలిసారి రేవంత్ తన బిడ్డను కలిసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రిగా కూతురిని చూసుకుని మురిసిపోతున్న రేవంత్ ఈ వీడియో అతడి ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. దీనికి ‘క్యూట్ వీడియో’, ‘మోస్ట్ అడారబుల్ మూమెంట్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ విజేతగా నిలచి టైటిల్‌ను తన బిడ్డకు అంకితం ఇస్తానంటూ రేవంత్ మొదటి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐍𝐕𝐈 (@anvitha_gangaraju) -
బిగ్ బాస్ సీజన్-6 తెలుగు: అందుకే సక్సెస్ కాలేదా..!
బిగ్ బాస్ తెలుగు -6 సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సింగర్ రేవంత్ విన్నర్‌గా నిలవగా.. శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పాలి. గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర నిరాశకు గురిచేసంది. మరి ఎందుకిలా జరిగింది. నాగార్జున హోస్ట్ చేసిన కూడా ఈ సీజన్ నిరాశపరిచేందుకు గల కారణాలేవో ఓ సారి చూద్దాం. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్- 6 'ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్' అనే ట్యాగ్‌లైన్‌తో అభిమానుల ముందుకొచ్చింది. ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్స్ తమ ఎత్తులు, పైఎత్తులతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. కానీ గతంలో కంటే ఈ సీజన్ ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇటీవల కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో చాలా మంది ప్రతివాదులు సీజన్‌ను 'ఫ్లాప్' అని పిలుస్తున్నారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావం: సెప్టెంబర్ 4న జరిగిన గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్ రేటింగ్స్‌లో తెలుగులో రియాలిటీ టీవీ సిరీస్ గత సీజన్ల కంటే అత్యల్ప టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. ఆసియా కప్ 2022లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ఈ షోపై ప్రభావం చూపింది. నిరాశపర్చిన కంటెస్టెంట్స్ ఫర్మామెన్స్: ఈ సీజన్ ప్రారంభంలో వినోదభరితమైన టాస్క్‌లతో మొదలైంది. కానీ చివరికి దాగా అదే ఊపును కొనసాగించలేకపోయారు. ఇది ప్రేక్షకుల ఆసక్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సీజన్ చివరి భాగంలో కొన్ని వినూత్న టాస్క్‌లు ప్రవేశపెట్టి ఉండాల్సింది. కంటెస్టెంట్స్ బలహీనతలు: ఈ సీజన్లో కొంతమంది పోటీదారులు బిగ్ బాస్ ఛాలెంజ్‌ను ప్రభావితం చేసినా.. కొందరు పోటీదారుల పనితీరు కారణంగా విజయవంతమైన టాస్క్‌లు కూడా సక్సెస్ కాలేదని బిగ్ బాస్ ప్రస్తావించారు. గీతూ, ఇనయ లాంటి కంటెస్టెంట్ల ఫర్ఫామెన్స్ ఇతర కంటెస్టెంట్ల సహనాన్ని పరీక్షించింది. ఆకట్టుకోలేక పోయిన జంటలు: టాస్క్‌లతో పాటు రొమాంటిక్ ట్రాక్స్ కూడా ఈ షో చూసే అభిమానులను ఆకట్టుకుంటాయి. కానీ ఈ సీజన్లో అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య సూర్య, ఆరోహి జోడీలు ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాయి. సూర్యపై తనకు క్రష్ ఉందని ఇనయ చెప్పినా అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ఊహించని ఎలిమినేషన్స్: అభినయ శ్రీ, సుదీప, బాలాదిత్య, గీతూ, ఇనయ లాంటి పోటీదారులను ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. దీంతో సోషల్ మీడియాలో కొందరు అభిమానులు ఒక వర్గం గీతూ, ఇనాయను తొలగించడాన్ని తప్పుబట్టారు. టీవీ, ఓటీటీలో ప్రసారం: ఈ కార్యక్రమం టీవీతో పాటు, ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కానీ రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ప్రతి ఎపిసోడ్‌లోని ఈవెంట్లను 'లీక్' చేయడం మరింత దెబ్బతీసింది. ఈ సీజన్లో వీక్షకుల సంఖ్య తక్కువగా ఉండటం వెనుక ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున అక్కినేని తప్ప మరెవరూ ధృవీకరించలేదు. వీక్షకుల సంఖ్య తగ్గడం గురించి తాను కూడా ఆందోళన చెందుతున్నానని నాగార్జున అన్నారు. అయితే మేకర్స్ ఈ విషయంలో సంతోషంగా ఉన్నందున షో కొనసాగించమని చెప్పారని తెలిపారు. -
అమ్మ ఆత్మహత్య చేసుకుంది: కన్నీళ్లు పెట్టుకున్న ఆదిరెడ్డి
ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఆదిరెడ్డి. నామినేషన్స్‌లో తను మాట్లాడినప్పుడు ఎదురు తిరగడానికి హౌస్మేట్స్ జంకేవారు. అంత సూటిగా, గునపంలా తన నామినేషన్ పాయింట్ దింపేవాడు. ఏదైనా పొరపాటు చేసినట్లు అనిపిస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాడు కానీ తను తప్పు చేయలేదనిపిస్తే నాగార్జునను సైతం ఎదిరించేందుకు వెనుకాడడు. బిగ్‌బాస్ ఆరో సీజన్లో అతడు థర్డ్ రన్నరప్‌గా నిలిచాడు. గుండె నిండా సంతోషంతో బయటకు వచ్చిన ఆదిరెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు. 'ఒకప్పుడు నాకెన్నో సమస్యలుండేవి, కానీ ఈరోజు లేదు. 2013లో అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పటికే బ్యాంకులో తీసుకున్న రూ.11 లక్షల లోన్ కట్టలేకపోయాం. 2018లో ఒకటిన్నర ఎకరా అమ్మేసి ఆ లోన్ తీర్చేశాం. అప్పటిదాకా చెల్లె పెన్షన్‌తో బతికాం. నెల్లూరులోని వరికుంటపాడుకు వెళ్తే అక్కడున్న ప్రతి మనిషి నేను పడ్డ కష్టాలన్నీ చెప్తారు. అమ్మ చనిపోయిన పదిహేను రోజుల తర్వాత బయటకు వెళ్తే తిన్నావా? అని జాలిగా అడిగేవారు. అంత దుర్భర స్థితిలో కాలం వెళ్లదీసాం. పెద్దయ్యాక మా అక్క ఫోన్ చేసి రెండు లక్షలు సంపాదించరా? నేను రెండు లక్షలు అప్పు చేసి నీకు పెళ్లి చేస్తానని మాట్లాడింది. అలాంటి దీన స్థాయి నుంచి పెళ్లి చేసుకుని నా కుటుంబంతో మంచి పొజిషన్లో నిలబడటమే కాకుండా ఇంతమంది జనాల ప్రేమను పొందడం నా సక్సెస్. ఒకప్పుడు వదులైన బట్టలేసుకుని తిరిగాను, ఇప్పుడు సూట్లు వేసుకుని దర్జాగా తిరుగుతున్నాను. ఒకప్పుడు నా ఊరు నన్ను జాలిగా చూసింది, ఇప్పుడు వారు గర్వపడేలా చేశాను. చాలా హ్యాపీ.. కష్టాల వల్ల అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నాకూ కష్టాలు ఎదురయ్యాయి. కానీ వాటిని తట్టుకుని నిలబడ్డాను. అమ్మ చనిపోయేముందు వరకు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే ఎవరి దగ్గరైనా ఒక బంగారు నగ అడిగి అది వేసుకునేది. ఆమె బతికి ఉండుంటే ఒంటినిండా నగలు వేసేవాడిని' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చదవండి: హీరోయిన్ కంటే ఎక్కువే సంపాదించిన ఆదిరెడ్డి గ్రాండ్ ఫినాలే నుంచి నేరుగా మండపానికి, నేహా పెళ్లి ఫోటో వైరల్ -
బిగ్ బాస్ సీజన్-6 రన్నరప్.. శ్రీహాన్ వారానికి ఎంత తీసుకున్నాడంటే..!
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్-6 విన్నర్‌గా సింగర్ రేవంత్ నిలవగా.. రన్నర్‌గా శ్రీహాన్ నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో ఈ షోలో పాల్గొన్నవారికి ఎంత ప్రైజ్ మనీ వచ్చింది. ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అదే విషయంపై చర్చ మొదలైంది. ఈ సీజన్ రన్నరప్ శ్రీహాన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఓ లుక్కేద్దాం. ఈ సీజన్లో శ్రీహాన్ ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణాన్ని దాటుకుంటూ వచ్చి గెలుపునకు అడుగు దూరంలో నిలిచారు. ఈ 15 వారాల జర్నీతో తన మనసును సంతోషంతో నింపుకున్నారు. తోటి ఇంటిసభ్యులకోసం శ్రీహాన్ నిలబడ్డ తీరును బిగ్ బాస్ ప్రశంసించారు. బిగ్ బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో పాల్గొనడానికి వారానికి రూ.1.75 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో 15 వారాలకు దాదాపు రూ.26 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. 15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. విన్నర్ డిక్లరేషన్ అనంతరం చివరిలో ట్విస్ట్ చోటుచేసుకోగా.. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. శ్రీహాన్ నిర్ణయం వల్ల రేవంత్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. కానీ ఏకంగా శ్రీహాన్ నలభై లక్షలు దక్కించుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలిచి రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో ఈ సీజన్ మొత్తంలో రూ.71 లక్షలు ఆర్జించాడు శ్రీహాన్ గ్రాండ్‌గా గ్రాండ్ ఫినాలే: దాదాపు మూడు నెలల పాటు ప్రేక్షకులను అలరించిన ఆరో సీజన్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు ఆది రెడ్డి, రోహిత్, రేవంత్, కీర్తి, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. చివరికి రేవంత్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచారు. ప్రస్తుత సీజన్లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. నిఖిల్, రవితేజ, రాధ, శ్రీలీల వంటి తారల రాకతో మరింత జోష్ వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. కింగ్ నాగార్జున మరోసారి తన హోస్ట్‌తో ఆకట్టుకున్నాడు. ఆద్యంతం ఈ సీజన్ అందరినీ బాగా అలరించింది. -
బిగ్‌బాస్ 6: టాప్ 3 కంటెస్టెంట్ కీర్తి.. 15 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బుల్లితెరపై తెలుగు బిగ్‌బాస్ 6 సీజన్ సందడికి ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ఈ సీజన్లో రేవంత్ విజేత నిలిచి ట్రోఫీ కైవసం చేసుకోగా.. శ్రీహాన్ రన్నర్‌గా నిలిచాడు. ఇక టాప్ 3 కంటెస్టెంట్‌గా కీర్తి నిలిచింది. మొదటి నుంచి కీర్తి హౌజ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్ సింపతి గేన్ చేస్తుందంటూ ఎన్ని కామెంట్స్ వచ్చినా తడబడకుండా ఆమె ముందుకు సాగుతూనే ఉంది. ఆటలో సైతం తన మార్క్ చూపిస్తూ వచ్చింది. చేతి వేలు దెబ్బతిన్నా ఆటలో.. ఎక్కడ తగ్గేదేలే అంటూ ముందకు సాగింది. గాయపడినప్పటికీ మిగతా కంటెస్టెంట్స్‌కి గట్టి పోటినిచ్చింది. తన ఆటతీరుతో ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న కీర్తి టాప్ 3లో నిలిచింది. ఫినాలేలో బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్‌ను వద్దనుకుని రూ. 30 లక్షల ప్రైజ్‌మనీని చేజార్చుకుంది. ఎవరూ చెప్పిన వినకుండా విన్నర్ అవుతాననే కాన్ఫిడెంట్‌తో రూ. 30 లక్షల బ్రీఫ్‌కేస్‌ను తిరస్కరించింది. దీంతో కొందరు ఆమెది ఓవర్ కాన్ఫీడెన్స్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. ఆడియన్స్ మాత్రం ఆమె కాన్ఫిడెన్స్‌కి ఫిదా అవుతున్నారు. మరికొందరు ఆ బ్రీఫ్‌కేస్ తీసుకుని ఉంటే తన శ్రమ తగిన ఫలితం ఉండేదంటూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి 15 వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది ఆసక్తిగా మారింది. పలు టీవీ సీరియల్స్ ద్వారా గుర్తింపు పొంది బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన కీర్తి ఒక్కొ వారానికి గానూ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలు తీసుకుందని వినికిడి. ఈ బజ్ ప్రకారం.. 15 వారాలపాటు హౌజ్‌లో కొనసాగిన కీర్తి మొత్తం రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల పైనే తీసుకుందని వినికిడి. దీనిప్రకారం హౌజ్‌లో లేడీ కంటెస్టెంట్స్‌తో పోలిస్తే అందరి కంటే కీర్తి రెమ్యునరేషన్ ఎక్కువని తెలుస్తోంది. చదవండి: మొత్తం బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా? ‘కాంతార’ భూత కోల వేడుకలో అనుష్క సందడి, వీడియో వైరల్ -
హీరోయిన్ కంటే ఎక్కువే సంపాదించిన ఆదిరెడ్డి!
కామన్ మ్యాన్ నుంచి రివ్యూయర్‌గా.. రివ్యూయర్ నుంచి కంటెస్టెంట్‌గా.. కంటెస్టెంట్ నుంచి కెప్టెన్‌గా.. కెప్టెన్ నుంచి థర్డ్ రన్నరప్‌గా ఎదిగాడు ఆదిరెడ్డి. విన్నర్ కాలేకపోయానన్న బాధ కన్నా తనను ఫినాలే వరకు తీసుకొచ్చి ఆదరించినందుకు ఎక్కువ సంతోషపడుతున్నాడు. తనకింత గుర్తింపు తెచ్చిన బిగ్‌బాస్ షోకు, ఓట్లేసి ఇంత దూరం తీసుకువచ్చిన ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. ప్రేక్షకుల అభిమానమే కాకుండా బిగ్‌బాస్ ద్వారా అతడు ఎంత సంపాదించాడో చూద్దాం.. గత కొన్ని సీజన్ల నుంచి ఆదిరెడ్డి రివ్యూలు ఇస్తూ పోతున్నాడు. అతడి రివ్యూలను మెచ్చుకునేవాళ్లు ఉన్నారు, విమర్శించే వాళ్లూ ఉన్నారు. ఏ కంటెస్టెంట్ దగ్గరో డబ్బులు నొక్కేసాడు, అందుకే వారిని పొగుడుతూ వేరేవారిని తిడుతున్నాడన్న మాటలు కూడా వినిపించేవి. కానీ అలాంటి విమర్శలను ధీటుగా తిప్పికొట్టేవాడు ఆదిరెడ్డి. నాకు డబ్బిచ్చేంత సీన్ ఏ కంటెస్టెంట్‌కూ లేదని, బిగ్‌బాస్ షోలో ఉన్నవారి కంటే యూట్యూబ్‌లో తాను ఎక్కువ సంపాదిస్తానని చెప్పేవాడు. తనను కొనడం ఎవ్వరితరం కాదని కుండ బద్ధలు కొట్టేవాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాని మాట్లాడుతూ.. ఒక సినిమాకు స్టార్ హీరోయిన్ అందుకునే పారితోషికం.. తన నెల సంపాదనతో సమానం అని ఆదిరెడ్డే స్వయంగా చెప్పాడని తెలిపాడు. అతడు డబ్బుల కోసం కాకుండా బిగ్‌బాస్ జర్నీని ఆస్వాదించాలని వచ్చాడని పేర్కొన్నాడు. షానీ చెప్పినదాని ప్రకారమైతే బిగ్‌బాస్ అతడికి కోట్లల్లో ఇవ్వాలి. కానీ అంత ఇచ్చుకోలేమని బిగ్‌బాస్ చేతులెత్తేశాడట! సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వారానికి లక్ష రూపాయలకు అటూఇటుగా పారితోషికం అందుకున్నాడట ఆది. ఈ లెక్కన 15 వారాలకుగానూ అతడు దాదాపు రూ.12 లక్షల వరకు ఆర్జించినట్లు తెలుస్తోంది. చదవండి: గ్రాండ్ ఫినాలే రోజు గ్రాండ్‌గా నేహా పెళ్లి, ఫోటో వైరల్ శ్రీహాన్‌కు హింట్.. బిగ్‌బాస్‌పై రేవంత్ ఫ్యాన్స్ ఫైర్ -
శ్రీహాన్‌కు హింట్.. బిగ్‌బాస్ షోపై రేవంత్ ఫ్యాన్స్ ఫైర్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విన్నర్ రేవంత్ అని ముందునుంచే అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. చివరికి అదే నిజమైంది. ప్రైజ్‌మనీలో నుంచి రూ.40 లక్షలు ఆఫర్ చేసినా నాకు కప్పే కావాలని మొండిగా కూర్చున్నాడు. కానీ శ్రీహాన్ మాత్రం ట్రోఫీ గెల్చుకుంటానో లేదోనన్న భయంతో ఆ ఆఫర్‌కు టెంప్ట్ అయిపోయి డబ్బులు తీసేసుకున్నాడు. చివరికి నాగ్.. రేవంత్ కంటే శ్రీహాన్‌కు కొద్దిగా ఓట్లు ఎక్కువ పడ్డాయని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. కానీ రేవంత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మావాడికి తక్కువ ఓట్లు రావడమేంటని మండిపడుతున్నారు. బిగ్‌బాస్ 6 విన్నర్ ఎవరు? అని స్టార్ మా నిర్వహించిన పోల్‌లో కూడా రేవంత్‌కు అత్యధికంగా 61 శాతం ఓట్లు పడ్డాయని, అలాంటప్పుడు శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లు అని అబద్ధాలాడుతున్నారేంటని గరమవుతున్నారు. అయినా ఫినాలేలో ఇద్దరు మిగిలినప్పుడు డబ్బులు ఆఫర్ చేయడమేంటి? అందులోనూ హౌస్మేట్స్ అందరితో శ్రీహాన్‌ను డబ్బులు తీసుకోమని హింట్ ఇవ్వడమేంటి? చివర్లో అతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడమేంటి? అని ఫైర్ అవుతున్నారు. ఆరు సీజన్లలో ఇంత చెత్త సీజన్‌ను ఎప్పుడూ చూడలేదని షోపై దుమ్మెత్తిపోస్తున్నారు. పైసా కూడా తీసుకోకుండా ప్రేక్షకుల ఓట్లకు విలువిచ్చి రేవంత్ ట్రోఫీ ఎత్తుకున్నాడని.. అతడే రియల్ విన్నర్ అంటూ గర్వపడుతున్నారు. అప్పుడు అభిజిత్, ఇప్పుడు రేవంత్ డబ్బును లెక్క చేయకుండా ట్రోఫీ కోసం నిలబడ్డారు, అదీ విన్నర్ లక్షణమంటూ కొనియాడుతున్నారు. మొదట్లో డబ్బు వద్దే వద్దన్న శ్రీహాన్ రూ.40 లక్షలనేసరికి మాటమార్చి బ్రీఫ్‌కేస్ అందుకుని ప్రేక్షకుల ఓట్లను కరివేపాకులా తీసిపారేశాడని విమర్శిస్తున్నారు. బిగ్‌బాస్ టీమ్ రేవంత్‌కు దక్కాల్సిన రూ.50 లక్షలు కూడా శ్రీహాన్‌కే కట్టబెట్టాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలా హోరెత్తిపోతున్న కామెంట్లతో ట్విటర్లో #Revanth, #BiggBossTelugu6 హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌గా మారాయి. చదవండి: రేవంత్ విజయానికి కారణాలివే! -
గ్రాండ్ ఫినాలే నుంచి నేరుగా మండపానికి.. నేహా పెళ్లి ఫోటో వైరల్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ గ్రాండ్‌గా ముగిసింది. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్ ఫినాలేకు చేరుకోగా రేవంత్ విజేతగా అవతరించాడు. రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే ప్రేక్షకుల ఓట్లు శ్రీహాన్‌కు ఎక్కువ వచ్చాయని, కానీ అతడు బ్రీఫ్‌కేస్ తీసుకోవడంతో రేవంత్ టైటిల్ గెలిచాడని ప్రకటించాడు నాగ్. ఇకపోతే ఈ గ్రాండ్ ఫినాలే వీరిద్దరికే కాదు నేహా చౌదరికి కూడా జీవితాంతం గుర్తుండిపోనుంది. కారణం.. అదే రోజు రాత్రి ఆమె పెళ్లి జరిగింది. తనను పెళ్లి కూతురిని చేసిన తర్వాత గ్రాండ్ ఫినాలే వచ్చిన నేహా షో అయిపోగానే అందరూ మండపానికి వచ్చి ఆశీర్వదించండని కోరింది. ఆదివారం రాత్రి పది గంటలకు ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులతో వీరు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్, ఎన్ని లక్షలంటే? 28 సీజన్లలో మొట్టమొదటిసారి.. బిగ్‌బాస్ షోలో ఇద్దరు విన్నర్స్ -
మొత్తం బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా?
బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. 15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. విన్నర్ డిక్లరేషన్ అనంతరం చివరిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. శ్రీహాన్ నిర్ణయం వల్ల రేవంత్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో శ్రీహాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కానీ, ఏకంగా శ్రీహాన్ నలభై లక్షలు దక్కించుకున్నాడు. దీంతో యాభై లక్షల ప్రైజ్ మనీలో విజేత రేవంత్‌కి దక్కింది పది లక్షలే. అయినప్పటికీ విన్నర్‌గా నిలిచిన రేవంత్ గెలుచుకున్న ప్రైజ్‌మనీ దాదాపు రూ. 50 లక్షల పైనే అయ్యింది. బిగ్‌బాస్ సీజన్ 6 ట్రోఫీతో పాటు అతను పది లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. వీటితో పాటు ‘సువర్ణభూమి’ వారి 605 గజాల ఫ్లాట్, పది లక్షల విలువైన మారుతి సుజుకి బ్రెజా కారుని ప్రకటించారు. సువర్ణ భూమి వారు ఇచ్చిన ప్లాట్ విలువ రూ. 30 లక్షలు ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రేవంత్‌కు యాభై లక్షలు అందుకున్నాడు. ఇకపోతే బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడనేది ఆసక్తిగా మారింది. ప్రైజ్‌మనీ విషయం పక్కన పెడితే.. అతడి 15 వారాల పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ తాజా బజ్ ప్రకారం.. రేవంత్ ఒక్కో వారానికి రూ. 2 లక్షల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రేవంత్ 15 వారాలకు గానూ నుంచి దాదాపు రూ. 30 లక్షల పైనే అందుకున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీతో పాటు పారితోషికం కలిపి రూ. 80 లక్షలపైనే సంపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రకంగా ఈ సీజన్లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా రేవంత్ నిలవడం విశేషం. చదవండి: అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి నాకు నేనే పెద్ద విమర్శకురాలిని: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు -
బిగ్‌బాస్ 6: రేవంత్ విజయానికి కారణాలివే!
టైటిల్ గెలిచేది నేనే, రాసిపెట్టుకోండి అని రేవంత్ చాలాసార్లు అన్నాడు. ప్రైజ్‌మనీలో నుంచి డబ్బులు కట్ అయినప్పుడు కూడా తన జేబులో ఉన్న డబ్బులు పోయినట్లు అందరికంటే ఎక్కువగా అల్లాడిపోయాడు. తిరిగి ప్రైజ్‌మనీ రూ.50 లక్షలకు చేరుకున్నప్పుడు ఏకంగా సీజన్ టైటిల్ గెలిచేసినట్లు సంబరపడ్డాడు. తన మీద, తన అభిమానుల మీదున్న నమ్మకం అది! మొదట్లో ఈ సీజన్ ట్రోఫీ ఎత్తేది నేనే అని రేవంత్ అన్నప్పుడు చాలామందికి విడ్డూరంగా అనిపించేది. కోపానికి, ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఇతడు గెలవడమేంటని నవ్వుకున్నారు. కానీ నాగ్ అతడు చేసిన తప్పొప్పులను ఎత్తిచూపినా, చూపకోయినా కోపాన్ని మాత్రం తగ్గించుకోమని పదేపదే హెచ్చరిస్తూ ఉండేవాడు. అయినా ఆవేశాన్ని అణచుకోకపోవడంతో ఏకంగా ఎల్లో కార్డ్ చూపించాడు. దెబ్బకు ఓ మెట్టు దిగిన రేవంత్ అందరినీ గుద్దిపడేస్తా అనే లెవల్లో కాకుండా తన జోలికొస్తే మాత్రమే ఊరుకోను అన్నట్లుగా కొంత కామ్ అయిపోయాడు. కానీ అప్పటివరకు గేమ్‌లో ఎంతోమందిని విసిరికొట్టాడు, నెట్టేశాడు, పడేశాడు, చాలా ఫిజికల్ అయ్యాడు. అంత క్రూరంగా గేమ్ ఆడేవాడు, కానీ అది గెలుపు కోసం మాత్రమే! అయితే రేవంత్‌లో ఉన్న ఓ గొప్ప లక్షణం ఏంటంటే కోపాన్ని ఎక్కువ సేపు కంటిన్యూ చేయడు. గొడవ అయిపోయాక దాన్ని మర్చిపోయి వెంటనే సారీ చెప్పి అవతలివాళ్లను అక్కున చేర్చుకుంటాడు. ఒకరకంగా ఇదతడికి మైనస్‌గానూ మారింది. అప్పటివరకు అంత ఆవేశపడ్డ వ్యక్తి సడన్‌గా సారీ చెప్తున్నాడంటే అది నటనా? నిజమా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ రానురానూ అతడి కోపం పాలపొంగు వంటిదని హౌస్‌మేట్స్‌కు, ప్రేక్షకులకు అర్థమైంది. ఇక ఫిజికల్ టాస్కుల్లో రేవంత్‌ను కొట్టేవాడే లేడు. నిద్రలో నుంచి లేపి టాస్కు ఆడమన్నా సిద్ధంగా ఉంటాడు. హౌస్‌లో రెండు సార్లు కెప్టెన్ అయిన ఘనత కూడా ఇతగాడి పేరు మీదుంది. స్నేహానికి ఎంత విలువిస్తాడో ప్రత్యక్షంగా చూశాం. కాకపోతే రేవంత్‌లో కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఎంతసేపూ సరుకులు అయిపోకుండా ఎలా వండాలి? అని ఆలోచించేవాడే తప్ప అవతలివాళ్ల ఆకలి తీరుతుందా? లేదా? అని అర్థం చేసుకునేవాడు కాదు. మా కడుపు నిండట్లేదు బాబోయ్, ఇంకాస్త వండండి అని చెప్పినా సరే పిడికెడంత బియ్యం కూడా ఎక్కువ పెట్టేవాడు కాదు. స్ట్రిక్ట్‌గా ఉండటంతో చాలామంది హౌస్మేట్స్ అతడిని వెనకాల తిట్టుకునేవారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. కొన్నిసార్లు రేవంత్ ఫుడ్ దాచుకుని తినేవాడు. ఇక ఆవేశంలో ఏం మాట్లాడతాడో అతడికే అర్థం కాదు. ఆ మాటలను తర్వాత మర్చిపోతుంటాడు కూడా! మరి ఇన్ని మైనస్‌లున్నా విజేత ఎలా అయ్యాడంటారా? రేవంత్ చెప్పినట్లే అతడికి హౌస్‌లో ఎవరూ గట్టి పోటీ ఇవ్వలేదు. శ్రీహాన్ మొదట్లో ఓపెన్ అవడానికి, గేమ్ ఆడటానికి సమయం పట్టింది. తర్వాత ఎంటర్టైన్మెంట్తో పాటు టాస్కులు ఆడినప్పటికీ నామినేషన్స్‌లో అతడు చేసే వెటకారంతో విమర్శలపాలు కావాల్సి వచ్చింది. కానీ చివర్లో మాత్రం పుంజుకుని రేవంత్‌తో ఓటింగ్‌లో తలపడ్డాడు. ఆదిరెడ్డి.. ఎంతసేపూ రివ్యూలు ఇస్తూ ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ అతిగా ఆలోచనల్లో గడిపేశాడు. కీర్తి.. ప్రతిచిన్నదానికీ హర్ట్ అవుతూ బాధపడటానికే ఎక్కువ సమయం వెచ్చించింది. మాటతో, ప్రవర్తనతో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న రోహిత్ ఆటలో మాత్రం వెనకబడ్డాడు. ఇక ఫినాలేలో ప్రేక్షకుల ఓట్లకు విలువిచ్చి డబ్బు తీసుకోకుండా చివరి క్షణం వరకు అలాగే నిలబడి ట్రోఫీ ఎగరేసుకుపోయాడు రేవంత్. చదవండి: విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్.. ఎన్ని లక్షలో తెలుసా? మరికొద్ది గంటల్లో పెళ్లి.. గ్రాండ్ ఫినాలేకు వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంటల -
BB6 Finale: చరిత్ర సృష్టించిన బిగ్‌బాస్ 6.. శ్రీహాన్, రేవంత్ ఇద్దరూ విన్నర్సే!
బిగ్‌బాస్ షో ఎంతమందితో ప్రారంభమైనా గెలిచేది ఒక్కరే. కానీ మొట్టమొదటిసారి బిగ్‌బాస్ షోలో ఇద్దరు విన్నర్స్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 బిగ్‌బాస్ సీజన్లు జరగ్గా ఇంతవరకు ఎన్నడూ లేనట్లుగా బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరు విజేతలుగా నిలిచారని తెలిపాడు నాగ్. రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్ రన్నరప్ అని ఒప్పేసుకున్నాడు. కప్పు ముఖ్యం బిగిలూ అనుకున్న రేవంత్ డబ్బులను లెక్కచేయకుండా ట్రోఫీ ఎత్తుకుని విన్నర్‌గా అవతరించాడు. అంతేకదా అనుకుంటున్నారేమో! చివర్లో అసలైన ట్విస్ట్ బయటపెట్టాడు నాగ్. ప్రేక్షకులు శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లేసి గెలిపించారని వెల్లడించడంతో అతడి ముఖం మతాబులా వెలిగిపోయింది. అదే సమయంలో ట్రోఫీ నాదే అని షో మొదటి రోజు నుంచే కలలు కంటున్న రేవంత్ ముఖం వెలవెలబోయింది. అయినా నాగార్జున ఆఫర్ చేసిన బ్రీఫ్‌కేస్ మాయ వల్ల శ్రీహాన్ రూ.40 లక్షలు గెల్చుకుని ప్రేక్షకుల ఓట్ల ప్రకారం విజేతగా నిలవగా.. కప్పు అందుకుని రేవంత్ విన్నర్ అయ్యాడు. చదవండి: ముద్దు పెట్టుకోబోయిన నాగ్.. మెలికలు తిరిగిన ఫైమా విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్.. ఎన్ని లక్షలంటే? -
విన్నర్ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్, ఎన్ని లక్షలో తెలుసా?
బ్రీఫ్‌కేస్... బిగ్‌బాస్ షో ఫినాలేలో ఇంట్రస్టింగ్ అంకం అది. గత సీజన్లలో ఓడిపోయి వట్టి చేతులతో వెళ్లేబదులు సూట్‌కేస్ అందుకుని హౌస్ నుంచి సంతృప్తిగా బయటకు వచ్చేసినవాళ్లు ఉన్నారు. మరి ఈ సీజన్లో ఎవరైనా సూట్‌కేసు అందుకుంటారా? అంటే డౌటే అన్న అనుమానం వ్యక్తమైంది. హౌస్‌లో టాప్ 3 కంటెస్టెంట్లు మిగిలినప్పుడు రవితేజ సూట్‌కేస్ పట్టుకుని వెళ్లాడు. మొదట ప్రైజ్‌మనీలో నుంచి పది శాతం ఇస్తానని తర్వాత దాన్ని 30 శాతం వరకు తీసుకెళ్లాడు. అయినా సరే ఎవరూ దాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. కీర్తిని ఆమె ఫ్రెండ్ డబ్బులు తీసుకోమని చెప్పినా ఆమె వద్దని తలాడించి చివరికి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసింది. తర్వాత శ్రీహాన్, రేవంత్.. ఇద్దరు మాత్రమే మిగిలారు. దీంతో నాగార్జున గోల్డెన్ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్ ఆ డబ్బును రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్ అమ్మానాన్న కోసం తీసుకుంటున్నానన్నాడు. అలా రన్నరప్‌గా శ్రీహాన్ రూ.40 లక్షలు గెల్చుకోగా, విన్నర్ రేవంత్‌కు కేవలం రూ.10 లక్షలు మాత్రమే మిగిలాయి. చదవండి: ఆ ముగ్గురి కంటే ముందే ఎలిమినేట్ అయినందుకు హ్యాపీ: ఆదిరెడ్డి మరికొద్ది గంటల్లో పెళ్లి.. పెళ్లికూతురి గెటప్‌లో ఫినాలేకు వచ్చిన నేహా చౌదరి -
కీర్తి వల్ల ఆత్మహత్యలు ఆగుతాయి: ఆదిరెడ్డి
స్పెషల్ గెస్టులతో బిగ్‌బాస్ ఫినాలే అదిరిపోయింది. అయితే సెలబ్రిటీలను ఊరికే పిలుస్తారా? వారితో ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. మొదటగా నిఖిల్ హౌస్‌లోకి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరైన రోహిత్‌ను ఎలిమినేట్ చేసి తనతోపాటు స్టేజీపైకి తీసుకొచ్చాడు. తర్వాత ధమాకా హీరోహీరోయిన్లు రవితేజ, శ్రీలీల జింతాత స్టెప్పుతో స్టేజీని అల్లాడించారు. అనంతరం ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. పదిమంది నామీద పడి మాట్లాడినా నేను ఎదురునిలబడగలనన్న ధైర్యం బిగ్‌బాస్‌తో వచ్చిందన్నాడు ఆది. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. 'కీర్తి బిగ్‌బాస్ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత ధైర్యంగా ముందుకెళ్లడం చాలామందికి ఇన్స్పిరేషన్. రేవంత్‌లో 20 తప్పులు ఉంటే 40 పాజిటివ్‌లు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి వచ్చి హౌస్‌లో గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. నాకంటే ఆ ముగ్గురు బాగా ఆడారు. కాబట్టి వాళ్లకంటే ముందే ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు. చదవండి: కాసేపట్లో పెళ్లి పెట్టుకుని గ్రాండ్ ఫినాలేకు వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ లవర్ బాయ్ ఎవరంటే? -
ముద్దు పెట్టుకోబోయిన నాగ్, మెలికలు తిరిగిన ఫైమా
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో అవార్డుల కార్యక్రమం జరిగింది. ఓ ఐదు అవార్డులను ప్రవేశపెట్టిన నాగ్ వాటికి ఎవరు అర్హులో చెప్పాలని ఫైనలిస్టులను ఆదేశించాడు. మొదటగా బెస్ట్ చెఫ్ అవార్డును ప్రవేశపెట్టాడు. ఇది మెరీనాకు సరిగ్గా సూటవుతుందన్నాడు రేవంత్. అందరికీ వంట చేసి పెడుతూనే తను గేమ్ ఆడేదని చెప్పాడు. దీంతో ఆ అవార్డును మెరీనాకు అందించాడు హోస్ట్. తర్వాత బెస్ట్ డ్యాన్సర్ అవార్డును ఫైమాకు ఇవ్వాలన్నాడు ఆదిరెడ్డి. ఆమె స్టేజీపైకి రాగానే చేతికి ముద్దు పెడతానంటూ ఆటపట్టించాడు నాగ్. దెబ్బకు హడలిపోయిన ఫైమా.. మీరు ముద్దులు ఇస్తే నాకు నిద్ర పట్టడం లేదంటూ దూరం జరిగింది. అనంతరం కీర్తి.. స్లీపింగ్ స్టార్ అవార్డును శ్రీసత్యకు ఇవ్వాలనడంతో నాగ్ దాన్ని ఆమెకు బహుకరించాడు. రోహిత్.. రాజ్ బెస్ట్ గేమర్ అని చెప్పడంతో అతడికి పురస్కారం ఇచ్చాడు నాగ్. శ్రీహాన్.. లవర్ బాయ్ అవార్డుకు అర్జున్ కల్యాణ్ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపైకి వెళ్లి అవార్డు అందుకున్నాడు. చదవండి: పెళ్లికూతురి గెటప్‌లోనే గ్రాండ్ ఫినాలేకు వచ్చిన నేహా చౌదరి బిగ్‌బాస్ 6 గ్రాండ్ ఫినాలే.. లైవ్ అప్డేట్స్ -
మరికొద్ది గంటల్లో పెళ్లి.. గ్రాండ్ ఫినాలేకు వచ్చిన కంటెస్టెంట్
పెళ్లా? బిగ్‌బాస్ షోనా? అంటే బిగ్‌బాస్‌నే ఎంచుకుంది యాంకర్ నేహా చౌదరి. కానీ మూడో వారంలోనే ఎలిమినేట్ కావడంతో ఇంటిదారి పట్టింది. ఇక దొరికిందే ఛాన్స్ అనుకున్న ఆమె కుటుంబసభ్యులు నేడు ఆమె పెళ్లి చేసేస్తున్నారు. అయితే పెళ్లికూతురి గెటప్‌లోనే గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది నేహా చౌదరి. ఇంకో ఏడాదిదాకా పెళ్లిని వాయిదా వేద్దామనుకున్నా, కానీ తప్పలేదని చెప్పింది. విధి ఆడిన వింత నాటకంలో బలిపశువు అయిపోయానని నేహా అనగానే బలిపశువు అయ్యేది నువ్వా? అతడా? అని నాగ్ కౌంటరిచ్చాడు. మీరు బిగ్‌బాస్ విన్నర్ ఎవరనేది ప్రకటించే సమయానికి నా మెడలో మూడు ముళ్లు పడనున్నాయని చెప్పుకొచ్చింది నేహా. పది గంటలకు నాకు పెళ్లైపోతుందని, నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్‌నే పెళ్లాడబోతున్నానని తెలిపింది. దీంతో నాగ్ మరికొద్ది గంటల్లో కొత్త జీవితాన్ని ఆరంభించనున్న ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక అంత బిజీలోనూ నేహా గ్రాండ్ ఫినాలేకు రావడం గ్రేట్ అనే చెప్పాలి. చదవండి: ఆదిరెడ్డి స్థానం మారింది -
బిగ్‌బాస్ షో విన్నర్‌గా రేవంత్.. ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విన్నర్‌గా రేవంత్ నిలిచారు. రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచారు. ఈ గ్రాండ్ ఫినాలేలో మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు హీరోయిన్స్ స్పెషల్ డ్యాన్సులతో కనువిందు చేశారు. ఈ గ్రాండ్ ఫినాలేలో నిఖిల్, ధమాకా టీమ్ రవితేజ, శ్రీలీల, సీనియర్ హీరోయిన్ రాధ స్టేజీపై సందడి చేశారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే వైభవంగా జరిగింది. వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్‌తో కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఇక వచ్చీ రావడంతో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆత్మీయంగా పలకరించాడు నాగ్. అనంతరం మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేసిన శ్రీసత్యతో ముచ్చటించాడు. మరికాసేపట్లో పెళ్లి పెట్టుకుని పెళ్లికూతురి గెటప్‌లో గ్రాండ్ ఫినాలేకు వచ్చిన నేహా చౌదరిని చూసి అవాక్కయ్యాడు. ఈ షో ముగిసిన వెంటనే అందరూ మండపానికి వచ్చేసి తనను ఆశీర్వదించాలని కోరింది నేహా. బిగ్‌బాస్ మినీ అవార్డులు.. తర్వాత టాప్ ఫైనలిస్టులతో అవార్డుల పంపిణీ చేపట్టాడు నాగ్. అందులో భాగంగా ఐదు అవార్డులు ప్రవేశపెట్టాడు. మొదటగా బెస్ట్ చెఫ్ అవార్డు మెరీనాకు ఇవ్వాలన్నాడు రేవంత్. అందరికీ వంట చేసి పెడుతూనే గేమ్ ఆడేదని చెప్పాడు. దీంతో ఆ అవార్డును మెరీనాకు అందించాడు హోస్ట్. తర్వాత బెస్ట్ డ్యాన్సర్ అవార్డును ఫైమాకు ఇవ్వాలన్నాడు ఆదిరెడ్డి. ఆమె స్టేజీపైకి రాగానే చేతికి ముద్దు పెడతానంటూ ఆటపట్టించాడు నాగ్. దెబ్బకు హడలిపోయిన ఫైమా.. మీరు ముద్దులు ఇస్తే నాకు నిద్ర పట్టడం లేదంటూ దూరం జరిగింది. అనంతరం కీర్తి.. స్లీపింగ్ స్టార్ అవార్డును శ్రీసత్యకు ఇవ్వాలనడంతో నాగ్ దాన్ని ఆమెకు బహుకరించాడు. రోహిత్.. రాజ్ బెస్ట్ గేమర్ అని చెప్పడంతో అతడికి పురస్కారం ఇచ్చాడు నాగ్. శ్రీహాన్.. బెస్ట్ లవర్ బాయ్ అవార్డుకు అర్జున్ కల్యాణ్ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపై వచ్చి అవార్డు అందుకున్నాడు. తర్వాత యంగ్ హీరో నిఖిల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వెళ్లి టాప్-5 కంటెస్టెంట్స్‌లో ఒకరైన రోహిత్‌ను ఎలిమినేట్ చేసి తనతో పాటు బయటకు తీసుకొచ్చేశాడు. ధమాకా హీరోహీరోయిన్లు రవితేజ, శ్రీలీల స్టేజీపైకి వచ్చి జింతాత స్టెప్పుతో ఓ ఊపు ఊపారు. ఇంతలో ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. 'కీర్తి బిగ్‌బాస్ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత ధైర్యంగా ముందుకెళ్లడం చాలామందికి ఇన్స్పిరేషన్. రేవంత్‌లో 20 తప్పులు ఉంటే 40 పాజిటివ్‌లు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి వచ్చి హౌస్‌లో గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. నాకంటే ఆ ముగ్గురు బాగా ఆడారు. కాబట్టి వాళ్లకంటే ముందే ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు. తర్వాత రవితేజ హౌస్‌లోకి వెళ్లి టాప్ 3 కంటెస్టెంట్లకు సూట్‌కేసు ఆఫర్ చేశాడు. ప్రైజ్‌మనీలో నుంచి పది శాతం మీ సొంతమని ఊదరగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని ముప్పై శాతానికి పెంచినా సరే వద్దే వద్దన్నట్లుగా సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో రవితేజ చేసేదేం లేక కీర్తి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ఇక హౌస్‌లో రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. ఈసారి వారి కోసం నాగార్జున రంగంలోకి దిగాడు. గోల్డెన్ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్ ఆ డబ్బును రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్ అమ్మానాన్న కోసం తీసుకుంటున్నానన్నాడు. ఇద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చాక రేవంత్‌కు ట్రోఫీ బహుకరించడంతో పాటు పది లక్షల చెక్, 605 గజాల సువర్ణభూమి ప్లాట్‌ను అందించారు. చివరగా అందరికీ దిమ్మతిరిగిపోయే న్యూస్ చెప్పాడు నాగ్. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరూ విన్నర్స్ అయ్యాడన్నాడు. అదెలాగంటే ట్రోఫీ అందుకుని రేవంత్ గెలిచాడని, కానీ ప్రేక్షకుల ఓట్లు శ్రీహాన్‌కే ఎక్కువ వచ్చాయని ట్విస్ట్ ఇచ్చాడు. ఏదేమైనా ట్రోఫీ అందుకుంది రేవంత్ కాబట్టి అతడిని అఫీషియల్ విన్నర్‌గా ప్రకటించాడు. -
గ్రాండ్ ఫినాలే ప్రోమో అదిరింది.. ఆదిరెడ్డి స్థానం మారింది!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ఎంత గ్రాండ్‌గా ప్రారంభమైందో అంతే గ్రాండ్‌గా ముగియనుంది. మరికొద్ది గంటల్లో ఫినాలే ఎపిసోడ్ మొదలుకానుంది. ఈ ఎపిసోడ్ ఏ రేంజ్లో ఉండబోతోందో సాంపుల్ చూపించేందుకు తాజాగా ప్రోమో వదిలారు. ఇందులో మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు హీరోయిన్స్ స్పెషల్ డ్యాన్సులు కూడా ఉండనున్నాయి. అలాగే నిఖిల్, ధమాకా టీమ్ రవితేజ, శ్రీలీల కూడా స్టేజీపై సందడి చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మాస్ మహారాజకు బ్రీఫ్‌కేస్ ఇచ్చి హౌస్ లోపలకు పంపించారు. కానీ ఫైనలిస్టులు ఎవరూ దాన్ని అందుకోవడానికి రెడీగా లేనట్లు కనిపించింది. ఇకపోతే ఎలాగో రేవంత్ విజేతగా అవతరించగా శ్రీహాన్ రన్నర్‌గా నిలిచాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మూడో స్థానంలో ఆదిరెడ్డి ఉన్నాడని మొదట పుకార్లు వ్యాపించినప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం కీర్తి సెకండ్ రన్నరప్‌గా నిలిచిందట. ఆదిరెడ్డి నాలుగో స్థానంతో, రోహిత్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: రూ. 5 లక్షలు పట్టేసిన శ్రీహాన్ -
రూ.5 లక్షలు గెలుచుకున్న శ్రీహాన్, రియలైజ్ అయిన కీర్తి
మాజీ కంటెస్టెంట్ల రాకతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కళ వచ్చింది. మొదటగా రోల్ రైడా హౌస్‌లో అడుగుపెట్టి త్వరలో బీబీ జోడీ షో రాబోతుందంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అది కంటెస్టెంట్లు జంటలుగా పాల్గొనే రియాలిటీ డ్యాన్స్ షో అని తెలిపాడు. తర్వాత ఫైనలిస్టులకు ఆల్ ద బెస్ట్ చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత మెహబూబ్, అషూ జంటగా లోపలకు ఎంట్రీ ఇచ్చారు. వారు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా ఏ ప్రశ్న అడిగినా తప్పు సమాధానమే చెప్పాలన్నారు. ఇందులో కీర్తి.. శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అని అడగ్గా ఆదిరెడ్డి టపీమని ఇనయ పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. అంతలోనే బ్యాడ్‌న్యూస్ అంటూ.. హౌస్‌లో ఒకరిని తమతోపాటు ఎలిమినేట్ చేసి తీసుకెళ్తామనగానే అందరి ముఖాలు వాడిపోయాయి. మరీ టెన్షన్ పెట్టడం మంచిదికాదని భావించిన వాళ్లు ఇది ప్రాంక్ అని చెప్పడంతో హౌస్మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. వారు వెళ్లిపోగానే అవినాష్- అరియానా వచ్చి డ్యాన్స్ చేసి, పంచ్‌లు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత చైతూ, కాజల్ వచ్చి ఫైనలిస్టులను సర్ప్రైజ్ చేశారు. శ్రీహాన్ అంటే ఎంటర్టైన్మెంట్, రేవంత్.. కోపం, ఆదిరెడ్డి.. కాన్ఫిడెంట్, రోహిత్.. కామ్ అండ్ కంపోజ్డ్, కీర్తి గేమ్ బాగా ఆడుతుందంటూ ఒక్కొక్కరి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాడు చైతూ. అనంతరం కొన్ని వస్తువులు వాడుతూ డ్యాన్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కీర్తి గెలిచి ఫ్రైడ్ చికెన్ సంపాదించుకుంది. ఈ జంట వెళ్లిపోగానే రవి-భాను లోపలకు ఎంట్రీ ఇచ్చారు. ఫైనలిస్టులకు టంగ్ ట్విస్టర్స్ ఇచ్చి వాటిని స్పీడ్‌గా చెప్పాలన్నాడు. అందరూ బానే చెప్పినా తెలుగు రాని కీర్తి కొంత తడబడుతూ దాన్ని పూర్తి చేసింది. తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. సీజన్ ముగింపుకు వచ్చేసరికి ఎవరి మీద అభిప్రాయం మారిందో చెప్పాలన్నాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. మొదట్లో కీర్తి మంచి ఫ్రెండ్‌గా ఉండేది. కానీ రానురానూ గొడవలయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ గేమ్ మీద ఫోకస్ పెట్టి ఇంతవరకు రావడం చిన్న విషయం కాదంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి.. మొదట్లో రేవంత్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడనిపించింది. కానీ చాలాకాలానికి అది యాటిట్యూడ్ కాదని అర్థమైందన్నాడు. రోహిత్ వంతు రాగా ఆదిరెడ్డి తప్పును అంగీకరిస్తారని తెలుసుకున్నానన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. ఆదిరెడ్డి రివ్యూయర్ కాబట్టి మానిప్యులేటర్ అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో అతడితో ఎక్కువగా ఉంటున్నాను. ఆ సమయంలోనే ఆయన్ను నేనెందుకు అర్థం చేసుకోలేకపోయానని ఫీలయ్యానని చెప్పాడు. కీర్తి వంతు రాగా.. శ్రీహాన్ జెన్యూన్ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది అని చెప్పింది. ఇకపోతే కొన్నివారాలుగా ఆన్లైన్లో లెన్స్‌కార్ట్ స్టైలిష్ కంటెస్టెంట్ పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా! ఇందులో శ్రీహాన్ గెలిచి స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలవడమే కాకుండా రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మరుసటి రోజు అఖిల్ సార్థక్, తేజస్విని మదివాడ హౌస్‌లోకి వచ్చి ఆటపాటలతో సందడి చేసి వీడ్కోలు తీసుకున్నారు. చదవండి: అర్జున్ కల్యాణ్‌కు నేనంటే లవ్.. వీడియో చూసి షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ విన్నర్ అతడే! -
అర్జున్ కల్యాణ్‌కు నేనంటే ప్రేమ.. వీడియో చూసి షాకైన శ్రీసత్య
గ్రాండ్ ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన శ్రీసత్యకు బిగ్‌బాస్ షాకిచ్చాడు. ఫినాలేకు చేరకుండానే మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆమెను బయటకు పంపించేశాడు. దీంతో హౌస్‌ను వీడలేక వీడి వచ్చేసింది శ్రీసత్య. తాజాగా ఆమె బిబి కెఫెలో యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముందుగా యాంకర్ శివ మాట్లాడుతూ.. శ్రీహాన్ మారిపోయాడంటున్నావేంటి అని అడిగాడు. అందుకు శ్రీసత్య.. అతడు మారడం తప్పనట్లేదు. కానీ సడన్‌గా ఫ్లిప్ అయ్యాడని చెప్పింది. వెంటనే అందుకున్న శివ.. ఫ్లిప్పింగ్ల కోసం నువ్వు మాట్లాడుతున్నావా? అని సెటైర్ వేశాడు. గెలుపును తీసుకుంటావు, కానీ ఓటమిని తీసుకోలేవని రేవంత్‌ను తప్పుపట్టిన నువ్వు ఓసారి ప్లేటు తీసి విసిరికొట్టావని గుర్తు చేశాడు. దీనికామె నేను ఫుడ్ మీద కోపం చూపించలేదని బదులిచ్చింది. అలాగే ఓసారి శ్రీహాన్, నేను కావాలనే ఇనయను రెచ్చగొట్టామంది. కాకపోతే అది గేమ్‌లో భాగంగానే స్పష్టం చేసింది. శ్రీహాన్, నువ్వు, రేవంత్ కావాలని బ్యాచ్‌గా ఏర్పడినట్లు అనిపించిందన్న శివ.. మీరు కావాలని గొడవలు పెట్టుకుంటారు కదా అని అడిగాడు. ఆ ప్రశ్నతో అవాక్కైన శ్రీసత్య.. ఫ్రెండ్సంటే కొట్టుకుంటారు కదా, అందులో తప్పేముందన్నట్లుగా ఫేస్ పెట్టింది. దీనికి శివ స్పందిస్తూ ఫ్రెండ్స్ తప్పులను వారి వెనకాల వెళ్లి చెప్పడం ఫ్రెండ్షిప్ కానే కాదని కుండ బద్ధలు కొట్టాడు. తర్వాత అర్జున్ కల్యాణ్ గురించి అడగ్గా డీసెంట్ బాయ్ అని చెప్పింది శ్రీసత్య. తనకు తెలిసినంతవరకు అతడికి నేనంటే ఇష్టం, ప్రేమ ఉండొచ్చని అభిప్రాయపడింది. ఇంతలో శివ ఓ వీడియో చూపించాడు. అందులో అర్జున్.. ఎలాగో నేను శ్రీసత్య వెనకాల తిరుగుతున్నాను. నువ్వు నా వెనక పడితే కంటెంట్‌కు మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయ్యేది కదా అంటూ వాసంతితో మాట్లాడాడు. ఈ వీడియో చూపించిన శివ.. అర్జున్ కల్యాణ్ దృష్టిలో శ్రీసత్య ఒక కంటెంట్ అని చెప్పగా శ్రీసత్యకు నోట మాట రాక షాక్‌లో ఉండిపోయింది. చదవండి: శ్రీసత్య ఎలిమినేట్, క్షమించని వేడుకున్న శ్రీహాన్ శ్రీసత్య పారితోషికం ఎంతో తెలుసా? -
బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ జోడీలు.. ఎంటర్టైన్మెంట్ అదిరిపోలా!
రేపటితో బిగ్‌బాస్ షో కథ క్లోజ్ కానుంది. శ్రీసత్య ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఐదుగురు మిగిలారు. వీరంతా ఫైనల్‌కు చేరుకున్నామన్న సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇకపోతే గత బిగ్‌బాస్ సీజన్లలో అలరించిన కొందరు కంటెస్టెంట్లతో త్వరలో బీబీ జోడీ రానుంది. ఈ షోలో ముక్కు అవినాష్- అరియానా, అఖిల్-తేజస్వి, అర్జున్- వాసంతి, సూర్య- ఫైమా, రవికృష్ణ- భాను, మెహబూబ్- అషు, చైతు- కాజల్, రోల్ రైడా-స్రవంతి జంటలుగా పాల్గొననున్నారు. ఈ షోను ప్రమోట్ చేసే క్రమంలో నేడు అషు, మెహబూబ్, అవినాష్, అరియానా హౌస్‌లో అడుగుపెట్టారు. ఇక ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్ అయిన అవినాష్ ఇంట్లో బెల్లీ డ్యాన్స్, నాగిని డ్యాన్స్ చేసి అందరినీ నవ్వించారు. మరి మాజీ కంటెస్టెంట్ల రచ్చ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య ఎంత సంపాదించిందంటే? తుస్సుమన్న అవతార్ 2, ఆసినిమాను కూడా దాటలేకపోయింది -
సస్పెన్స్‌కు తెరపడింది.. బిగ్‌బాస్6 విన్నర్ అతడే!
బిగ్‌బాస్ సీజన్-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్‌తో రేవంత్‌ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్‌బాస్ సీజన్-6 విజేత ఎవరన్నదానిపై హౌస్మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్-4 ప్లేస్‌ను కీర్తి దక్కించుకుంది. టాప్-3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్‌లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్-6 విజేతగా నిలవగా, శ్రీహాన్ రన్నరన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
శ్రీసత్య ఎలిమినేట్, క్షమించమని చేతులెత్తి వేడుకున్న శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 104: బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లు గెలవడమే కాకుండా ఏకాభిప్రాయంలోనూ నెగ్గి రోహిత్, శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లడిగే అవకాశాన్ని దక్కించుకున్నారు. నేడు మిగతావారికి కూడా ఛాన్స్ రావాలన్న ఉద్దేశంతో మరిన్ని టాస్కులు పెట్టాడు. అలా వాటిలో శ్రీహాన్, కీర్తి గెలిచి ప్రేక్షకులతో మాట్లాడారు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. 'నాకు ఓటడిగే అర్హత ఉందో, లేదో మీరే నిర్ణయించాలి. దానికంటే ముందు నేను తెలీకుండా చేసిన తప్పులకు క్షమాపణలు అడుగుతున్నా. నా మాటల వల్ల, యాటిట్యూడ్ వల్ల కొందరు బాధపడుతున్నారని తర్వాత తెలిసింది. నాకు తెలియకుండానే వారిని బాధపెట్టానని అర్థమయ్యాక నా తప్పులు సరిదిద్దుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. టికెట్ టు ఫినాలే రేవంత్ వదిలేయడం వల్ల నాకు వచ్చింది అని అందరూ అంటుంటే బాధగా ఉంది. కానీ గేమ్ అంతా మీరు చూశారు. ఊహించని పరిస్థితుల మధ్య బిగ్‌బాస్ షోకు వచ్చాను. ట్రోఫీ గెలవడం నాకు చాలా ముఖ్యం. మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి గెలిపించండి. ఎక్కువ క్షమించేవాళ్లే ఎక్కువ ప్రేమిస్తారు. నేను తప్పు చేసినందుకు క్షమించండి' అంటూ చేతులెత్తి వేడుకున్నాడు. అలాగే ఇండియన్ ఆర్మీ జవాన్లకు, అన్నం పెట్టే రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ సెల్యూట్ చేశాడు. తర్వాత కీర్తి మాట్లాడుతూ.. 'ఇన్నిరోజులు బిగ్‌బాస్ హౌస్‌లో కీర్తిని చూశారు. బయట ఎలా ఉన్నాను? లోపల ఎలా ఉన్నాను? అన్నీ చూశారు. మీ ఇంటి కూతురిలా నాకు సపోర్ట్ చేశారు. మున్ముందు కూడా అలాగే మద్దతిస్తారనుకుంటున్నాను. నా శక్తిని మించి ఆడాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నాలాంటివాళ్లు కూడా బలంగా ఉండాలనుకుంటున్నాను. ట్రోఫీ గెలిచినా కూడా ఆ డబ్బులు నాకోసం వాడుకోను. నాలాంటి అనాధల కోసం, సామాజిక కార్యక్రమాల కోసం ఆ డబ్బులు వాడతాను. అందరికీ ఓట్లేయండి, కానీ నాక్కొంచెం ఎక్కువ ఓట్లేయండి' అని కోరింది. తర్వాత ఉదయం ఆరుగంటలకే హౌస్‌మేట్స్‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ అర్జంటుగా బ్యాగులు సర్దేసుకోండి, ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేస్తానని చెప్పాడు. ఈ మాటతో షాకైన కంటెస్టెంట్లు చేసేదేం లేక బుద్ధిగా తమ బట్టలు సర్దేసుకుని గార్డెన్ ఏరియాలో వచ్చి నిల్చున్నారు. మీ అభిప్రాయంలో ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారో చెప్పమని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్.. రోహిత్ పేరు, కీర్తి.. ఆదిరెడ్డి, శ్రీసత్య.. రేవంత్, ఆదిరెడ్డి.. కీర్తి, రోహిత్.. శ్రీహాన్ ఎలిమినేట్ కావచ్చని అభిప్రాయపడ్డారు. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మెజారిటీ ఇంటిసభ్యులు కీర్తి వెళ్లిపోతుందని నిర్ణయించారు. కానీ ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం శ్రీసత్య టాప్ 5కి చేరుకోకుండా ఈ క్షణమే ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. ఎలిమినేషన్‌ను ముందే పసిగట్టిన శ్రీసత్యకు బాధను లోలోపలే దిగమింగి బయటకు మాత్రం చిరునవ్వుతో నిలబడింది. కానీ రేవంత్ బాధ ఆపుకోలేక ఏడ్చేశాడు. చివరికి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ హౌస్‌కు వీడ్కోలు పలికింది శ్రీసత్య. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోనున్న నాగ్ రేవంత్ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని అబద్ధం చెప్పాం -
డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య ఎంత సంపాదించిందంటే?
శ్రీసత్యది అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ గ్రాండ్ ఫినాలేకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ఎన్నో వారాలుగా కొందరు నెటిజన్లు ప్రయత్నించిన ఆపరేషన్ అసత్య అర్ధాంతరంగా ఆగిపోగా బిగ్‌బాస్ ఈసారి దాన్ని భుజాన వేసుకున్నాడేమో అన్నట్లుగా ఆమెను టాప్ 5లో ఉంచకుండా బయటకు పంపించేశాడు. ఫినాలే కోసం ఎలా రెడీ అవ్వాలి? అని ప్లానింగ్‌లో ఉన్న శ్రీసత్యకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి! మొదట్లో బిగ్‌బాస్ షోను పిక్నిక్ స్పాట్‌గా భావించింది శ్రీసత్య. అందరి ఆటను చూడ్డానికే వచ్చాను తప్ప ఆడటానికి కాదన్నట్లుగా ప్రవర్తించింది. ఆమె బిహేవియర్ చూసి హౌస్‌మేట్సే కాదు నాగార్జున సైతం తిట్టిపోశాడు. దీంతో మెల్లిగా తనను తాను మార్చుకుంటూ నెమ్మదిగా రంగంలోకి దిగి దెబ్బలు తగిలినా సరే ఆట వదిలేదే లేదన్నట్లుగా గేమ్ ఆడటం ప్రారంభించింది. అయితే ఇతరుల నామినేషన్స్ చూసి ఎగతాళి చేసినట్లుగా నవ్వడం, వెటకారం, రేవంత్ గురించి వెనకాల మాట్లాడటం ఇలా కొన్ని తప్పుల వల్ల ఆమెపై విపరతీమైన నెగెటివిటీ ఏర్పడింది. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లో అడుగుపెట్టారో అప్పుడు తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. ఇలా తయారయ్యావేంటి? నా కూతురు ఇలా ఉండదు అని తండ్రి ముఖం పట్టుకుని అనేసరికి వెటకారాన్ని తగ్గించేసింది. అనవసరంగా గొడవలు పెట్టుకోవడం మానేసింది. అందరితో బాగుండటానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఎన్నోవారాలుగా ఆపరేషన్ అసత్య అంటూ తనను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఫినాలేలో అడుగుపెట్టానోచ్ అని సంబరపడుతున్న తరుణంలో బిగ్‌బాస్ ఆమెను మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి బయటకు పంపించేయడం దారుణమనే చెప్పాలి. మరి 15 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమె ఎంత పారితోషికం అందుకుందని పలువురు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆమెకు వారానికి లక్ష చొప్పున పారితోషికం ఇచ్చారట. అంటే ఈ లెక్కన ఆమె 15 వారాలకు గానూ రూ.15 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. చదవండి: బిగ్‌బాస్ షోకు నాగార్జున గుడ్‌బై చెప్పనున్నాడా? -
బిగ్‌బాస్ షో హోస్టింగ్‌కు నాగార్జున గుడ్‌బై!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ఎప్పుడు ఎటు వైపు వెళ్తుందో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్నవారు ఎప్పుడో ఎలిమినేట్ అవగా గ్రాండ్ ఫినాలే వీక్‌లో మరొకరిని పంపించి ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. మరోపక్క ఈ సీజన్లో చాలావరకు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్స్ జరిగాయంటూ నెటిజన్లు నెట్టింట మండిపడ్డ విషయం తెలిసిందే! మరీ ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్‌తో ఈ ఆగ్రహం పీక్స్‌కు వెళ్లింది. అయితే దీనిపై నాగార్జున కూడా సీరియస్ అయ్యాడని, ఇక మీదట బిగ్‌బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు నెక్స్ట్ సీజన్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్‌గా రానున్నాడన్న ప్రచారమూ ఊపందుకుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది. కానీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి షోకి ఆదరణ తగ్గడమే కాక విమర్శలు ఎక్కువయ్యాయన్నది జగమెరిగిన సత్యం. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్‌కే అతి తక్కువ(8.5) టీఆర్పీ వచ్చింది. దీనిపై నాగ్ సైతం కొంత అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సీజన్లో మలుపులు, అన్‌ఫెయిర్ ఎలిమినేషన్లు టీఆర్పీకి గుదిబండగా మారాయి. అటు ప్రేక్షకులు సైతం ఈ సీజన్‌ను ఫ్లాప్ సీజన్‌గా తేల్చేశారు. కనీసం నెక్స్ట్ సీజన్‌కైనా మంచి కంటెస్టెంట్లను, ఫెయిర్ ఎలిమినేషన్లు పెట్టండని చురకలంటిస్తున్నారు. చదవండి: రేవంత్ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని చెప్పాం త్వరలో కొత్త జీవితం ప్రారంభిచబోతున్నా: మంచు మనోజ్ -
రేవంత్ తండ్రి చనిపోయినా దుబాయ్‌లో ఉన్నాడని అబద్ధం చెప్పా
టాస్కుల్లో రేవంత్‌ను కొట్టేవాడే లేడు. కానీ వ్యక్తిత్వంలో మాత్రం అతడు ఎక్కడో వెనక స్థానంలో ఉన్నాడు. మిగతావాళ్లను చులకన చేయడం, తనే తోపునని ఫీలవడం, టాస్కుల్లో ఫిజికల్ అవడం, ఓటమిని జీర్ణించుకోలేని తత్వం.. ఇలా చాలా మైనస్‌లే ఉన్నాయి. కానీ షో మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉన్నాడు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు. అందరితో గొడవలు పడతాడు, మళ్లీ కాసేపటికే సారీ చెప్పి కలిసిపోతాడు. అలా రేవంత్‌లో ప్లస్‌లు, మైనస్‌లు రెండూ ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే రేవంత్ కప్పు కొట్టేలా ఉన్నాడు. ఈ క్రమంలో రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా భర్త పేరు శంకర. నాకు మొదట కొడుకు పుట్టాడు. తర్వాత రేవంత్ కడుపులో ఉండగానే నా భర్త చనిపోయాడు. మా ఆయన లేకపోయినా బంగారంలాంటి పిల్లల్నిచ్చారని ఎప్పుడూ తలుచుకుంటాను. భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని పెంచానంటే అది నా ఫ్యామిలీ వల్లే.. మా నాన్న, అమ్మ, అన్నయ్యలు, వదినలు.. నన్ను, నా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. వాళ్లు అండగా లేకపోతే నేను రోడ్డున పడేదాన్ని. రేవంత్ పుట్టాక నీకు నాన్న లేడని చెప్తే ఎక్కడ మనసులో పెట్టుకుంటాడోనని నిజం దాచాను. మీ నాన్న దుబాయ్‌లో ఉంటారు.. నిదానంగా వస్తారులే అని చెప్పేవాళ్లం. వాడిని చూస్తే నాకు ఇప్పటికీ బాధగా ఉంటుంది. ఎందుకంటే వాడు తండ్రి ప్రేమకు నోచుకోలేదు. భగవంతుడు ఎందుకా లోటు మిగిల్చాడని ఎప్పుడూ బాధపడేదాన్ని. రేవంత్‌కు నా లక్షణాలే వచ్చాయి. కానీ అంత కోపం నాకు లేదు. వాడి కోపం కాసేపే ఉంటుంది. తర్వాత మామూలైపోయి సారీ చెప్తాడు' అని చెప్పుకొచ్చింది రేవంత్ తల్లి. చదవండి: కీర్తి ఎలిమినేట్ అవుతుందన్న హౌస్మేట్స్, ఝలక్ ఇవ్వనున్న బిగ్‌బాస్ -
కీర్తి ఎలిమినేట్ అవుతుందన్న హౌస్మేట్స్? జరగబోయేది ఇదే!
ఏ బుధవారమో, గురువారమో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందనుకుంటే దాన్ని శుక్రవారం దాకా లాక్కొచ్చాడు బిగ్‌బాస్. కానీ ఎలిమినేట్ కానుంది ఎవరో ఆల్రెడీ సోషల్ మీడియాలో లీకైంది. శ్రీసత్య ఈరోజు బిగ్‌బాస్ హౌస్ నుంచి పెట్టాబేడా సర్దుకుని రావడం ఖాయమని తెలిసిపోయింది. కానీ బిగ్‌బాస్ మాత్రం ఎవరు ఎలిమినేట్ అవుతారో గెస్ చేయండని ఇంటిసభ్యులను అడిగాడు. ఇందుకు శ్రీహాన్.. రోహిత్ పేరు చెప్పగా, ఆదిరెడ్డి, శ్రీసత్య.. కీర్తి వెళ్లిపోతుందని, కీర్తి.. ఆదిరెడ్డి ఎలిమినేట్ అవుతాడేమోనని అభిప్రాయపడ్డారు. 'మెజారిటీ ఇంటిసభ్యులందరూ కీర్తిని టాప్ 5కి అనర్హురాలుగా భావించారు. కానీ ప్రేక్షకుల అభిప్రాయంలో ఎలిమినేట్ కానుంది ఎవరంటే...' అన్న సస్పెన్స్‌తో ప్రోమో ముగించాడు బిగ్‌బాస్. ఇక హౌస్‌మేట్స్‌కు ఝలక్ ఇస్తూ కీర్తికి బదులుగా శ్రీసత్యను ఎలిమినేట్ చేయనున్నారు. అప్పుడు కంటెస్టెంట్ల ఎక్స్ప్రెషన్ ఏంటో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూసేయాల్సిందే! చదవండి: నా తప్పులు క్షమించి విన్నర్‌ను చేయండి: శ్రీసత్య ఇనయకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్ అవుతున్న ఫోటో -
బిగ్‌బాస్ లేడీ టైగర్ ఇనయాకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్ అవుతున్న ఫోటో
బిగ్‌బాస్ సీజన్-6కి లేడీ టైగర్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఇనయా సుల్తానా. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి ఎంటర్ అయిన ఇనయా నెగిటివ్ ఇమేజ్‌తోనే వెళ్లింది. ప్రేక్షకులు సహా ఇంటిసభ్యులు కూడా ఇనయా గురించి తక్కువ అంచనా వేశారు. మహాఅయితే రెండు, మూడు వారాల్లో ఎలిమినేట్ అవుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. హౌస్ మొత్తం టార్గెట్ చేసినా, ప్రతిసారి ఎలిమినేషన్స్‌కి పంపినా అంతకు రెట్టింపు ధైర్యంతో ఆటతీరు ప్రదర్శించింది. ఇదేతీరు ఆడియెన్స్‌ను కూడా బాగా అట్రాక్ట్ చేసింది. ఫినాలేలో టాప్-2 కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్న ఇనయా అనూహ్యంగా గతవారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కావాలనే ఇనయాను బయటకు పంపించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇనయాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పెళ్లికూతురిగా ముస్తాబైన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇనయా తల్లి కూడా పక్కనే ఉంది. దీంతో ఇనయాకు ముందే పెళ్లయిందా? అనే సందేహం వ్యక్తమవుతుంది. మరోవైపు కావాలనే ఇనయా క్రేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ఇలా చేస్తున్నారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే స్వయంగా ఇనయానే ఈ ఫోటోపై స్పందించాల్సి ఉంటుంది. -
నా తప్పులు మన్నించి విజేతగా నిలపండి.. ప్రేక్షకులను ఓట్లడిగిన శ్రీసత్య
Bigg Boss Telugu 6, Episode 102 Highlights: కంటెస్టెంట్లు అందరూ మీ గమ్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఫినాలే కోసం ఊదరగొట్టాడు బిగ్‌బాస్. మీ మనసుల్లోని మాటలను ప్రేక్షకులతో నేరుగా పంచుకుని వారి నుంచి ఓట్లు కోరవచ్చంటూ ఓట్ అప్పీల్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మొదటగా మీకు వినిపిస్తుందా? అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో బిగ్‌బాస్ ప్లే చేసిన సౌండ్స్‌ను గుర్తించి సరైన ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఛాలెంజ్ నుంచి తొలగిపోయారు. అయితే శ్రీసత్య అరవడం వల్లే తన గేమ్ పోయిందని విసుకున్నాడు శ్రీహాన్. నీ తప్పు కూడా ఉంది, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకు అని గట్టిగానే ఆన్సరిచ్చింది శ్రీసత్య. కాసేపటికి శ్రీహాన్ సారీ చెప్పడంతో గొడవ చప్పున చల్లారింది. మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ఆదిరెడ్డి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ల అప్పీలు కోసం ఎన్నుకోమన్నాడు బిగ్‌బాస్. రేవంత్ మినహా మిగిలిన ముగ్గురూ రోహిత్‌కే ఓటేయడంతో అతడు ఓట్లు అడిగే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో రోహిత్ మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను ఎలా ఆడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? నా థింకింగ్ ఏంటి? నా క్యారెక్టర్ ఏంటి? అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మొదట్లో మెరీనాతో కలిసి ఆడేవాళ్లం. సెపరేట్ అయ్యాక విడివిడిగా ఆడాం. నాకు ఎప్పుడూ అదృష్టం కలిసిరావట్లేదు. ఈ సీజన్ 6 టైటిల్ గెలవాలన్నదే నా కోరిక. నా కుటుంబం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి' అంటూ తన స్పీచ్ ముగించాడు. తర్వాత ఎగ్స్ షాట్ అనే ఛాలెంజ్‌లో రేవంత్, శ్రీసత్య, కీర్తి, శ్రీహాన్ పాల్గొనగా రేవంత్, శ్రీసత్య గెలుపొందారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో సెలక్ట్ చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్, కీర్తి, రోహిత్.. శ్రీసత్యకు ఓటేయగా ఆదిరెడ్డి ఒక్కడే రేవంత్‌కు మద్దతు పలికాడు. గెలిచేవాడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆదిరెడ్డి పరోక్షంగా రేవంతే విజేత అని అభిప్రాయపడినట్లు కనిపించింది. రేవంత్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అతడికి ఈ ఓట్ అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలని శ్రీసత్యకు ఇస్తే ఏం యూజ్ ఉంటుందని మాట్లాడాడు. దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా ఈ ఛాలెంజ్‌లో తనకు సపోర్ట్ చేయలేదని రేవంత్ ఒకింత హర్టయ్యాడు. ఇక శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లు అడుగుతూ.. 'మొదట్లో నాకు దెబ్బలు తగలకుండా ఆడాలనుకునేదాన్ని. కానీ మూడో వారం నుంచి నేను వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నేనేమైనా తప్పు చేసుంటే క్షమించండి. ఈ హౌస్‌లోకి వచ్చినప్పుడే విన్నర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ విజయం మీ చేతుల్లోనే ఉంది. ఈ టైటిల్ నాకెంతో ముఖ్యం.. ఈ సీజన్‌కు లేడీ విన్నర్ అయితే బాగుంటుంది. కాబట్టి మర్చిపోకుండా నాకు ఓటేయండి' అని అభ్యర్థించింది. మరోపక్క సోషల్ మీడియాలో శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె లేడీ విన్నర్ కావాలనుకుంటుందని చెప్పడంతో అభిమానుల మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి ఎన్నో వారాలుగా అన్యాయం.. ఎట్టకేలకు రోహిత్‌కు ఛాన్స్ -
ఎన్నోవారాలుగా అన్యాయం.. చిట్టచివరికి రోహిత్‌కు ఒక్క ఛాన్స్
కంటెస్టెంట్ల ఎమోషన్స్‌తో ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టబోతున్నామని ఫుల్ ఖుషీలో ఉన్నారు టాప్ 6 కంటెస్టెంట్లు. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ వారిలో ఒకరిని నేడే హౌస్ నుంచి పంపించేయనున్నారు. మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి కేవలం ఐదుగురిని మాత్రమే ఫినాలేకు పంపించనున్నారు. ఇకపోతే ఎప్పటిలాగే ఓట్ అప్పీల్ కోసం హౌస్‌మేట్స్‌కు ఆఖరి పోరాటం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో సౌండ్స్ విని వాటిని గుర్తుపట్టి అవేంటో రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి, రోహిత్ ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్నారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ అప్పీలు కోసం ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. ఏకాభిప్రాయం అన్న ప్రతిసారి రోహిత్‌ను సైడ్ చేసుకుంటూ వచ్చిన హౌస్మేట్స్ ఈ ఒక్కసారికి మాత్రం అతడికే అవకాశం ఇవ్వడం గమనార్హం. దీంతో అతడు.. పదిహేను వారాలుగా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కచ్చితంగా టైటిల్ గెలుస్తానని నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ ఇవ్వగా ఇందులో రేవంత్, శ్రీసత్య ముందు స్థానాల్లో నిలిచారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఎన్నుకోమనగా ఆదిరెడ్డి.. రేవంత్‌కు, శ్రీహాన్.. శ్రీసత్యకు ఓటేశారు. మరి మిగతావాళ్లు ఎవరిని సెలక్ట్ చేశారు? ఎవరు ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకున్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి నన్ను ఛీ, తూ అని గెంటేశారు, ఇప్పుడు చెప్తున్నా..: కీర్తి -
పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ చివరి అంకానికి చేరుకుంది. 21 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. కానీ ఫినాలేకు ఐదుగురు మాత్రమే వెళ్తారని ప్రకటించాడు నాగ్. అంటే ఎన్నడూ లేనిది ఈసారి కొత్తగా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టనున్నారు. నిన్నటివరకు వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని అతి తక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని నేడు ఎలిమినేట్ చేస్తారన్నమాట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీసత్యను మిడ్‌వీక్ ఎలిమినేషన్‌తో హౌస్ నుంచి బయటకు పంపించనున్నట్లు తెలుస్తోంది. కానీ హాట్‌స్టార్‌లో ఆమెకు ఓటింగ్ వేసేందుకు ఇంకా ఛాన్స్ ఉన్నట్లు చూపిస్తోంది. బహుశా ఓటింగ్ లిస్ట్ నుంచి ఆమెను తప్పిస్తే ఎలిమినేట్ అయింది ఎవరనేది ముందే తెలిసిపోతుందని బిగ్‌బాస్ తనను ఇంకా ఓటింగ్ లైన్లో ఉంచినట్లు కనిపిస్తోంది. కానీ దీనివల్ల మిగతా ఐదుగురికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తనను ఓటింగ్ లిస్ట్‌లో ఉంచడం వల్ల శ్రీసత్యకు ఓట్లేసినా అవి బూడిదలో పోసిన పన్నీరు కిందే లెక్క! అదే ఓటింగ్ లైన్ క్లోజ్ చేస్తే ప్రేక్షకులు తనకు కాకుండా మిగతా ఐదుగురిలో వారికి నచ్చినవారికి ఓట్లేసి గెలిపించుకునే ఆస్కారం ఉంది. మరోవైపు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందన్న విషయం టాప్ 6 కంటెస్టెంట్లకు ఇంతవరకు తెలియదు. గ్రాండ్ ఫినాలేకు ఎలా రెడీ అవాలి? సూట్ కేస్ ఆఫర్ చేస్తే ఏం చేయాలి? ఇలా దాని గురించే ఆలోచిస్తూ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. డబ్బుల కోసమే బిగ్‌బాస్‌కు వచ్చానన్న శ్రీసత్య సూట్‌కేస్ ఆఫర్ చేస్తే తీసుకుపోయేందుకు కూడా సిద్ధంగా ఉంది. అలాంటి సమయంలో ఆమెను ఫినాలేకు రెండు రోజుల ముందే బయటకు పంపించేయడం దారుణమనే చెప్పాలి. చదవండి: నన్ను బయటకు గెంటేసినవారికి ఇప్పుడు చెప్తున్నా -
నన్ను ఛీ, తూ అని బయటకు గెంటేసినవారికి ఇప్పుడు చెప్తున్నా: కీర్తి
Bigg Boss 6 Telugu, Episode 102: రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్‌లు వారి జర్నీలు చూసి గాల్లో తేలిపోతున్నారు. ఈరోజు శ్రీహాన్, కీర్తిల వంతు వచ్చింది. మొదటగా శ్రీహాన్ గార్డెన్ ఏరియాలోకి వచ్చాడు. అప్పుడే అతడి తల్లి ఫోన్ చేసి బిగ్‌బాస్‌కు వెళ్లాలన్న కోరిక ఎలాగో నెరవేరింది. ఇక ట్రోఫీ గెల్చుకుని రా అని కొడుకును ప్రేమగా కోరింది. తప్పకుండా టైటిల్ కొట్టే వస్తానని ధీమాగా చెప్పాడు శ్రీహాన్. బిగ్‌బాస్ శ్రీహాన్‌తో మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ ప్రయాణంలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో ఆట కోసం, గెలుసు కోసం సభ్యులు పడే తపన ఎలాంటిదో మునుపటి సీజన్లో దగ్గరి నుంచి చూశారు. ఈసారి స్వయంగా ఆ అనుభవాన్ని పొందేందుకు హౌస్‌లో అడుగుపెట్టారు. అందరితో సరదాగా ఉండటం, అవసరమొచ్చినప్పుడు ఎవరినైనా ఎదురించడం.. ఈ రెండూ మీలో ఉన్నాయి. మీలోని అల్లరి మీకు స్నేహితులను తీసుకొచ్చింది. కలిసి మీరు చేసిన వినోదం నవ్వులను పంచింది. వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా అనే విషయం మీకు బాగా తెలుసు. మీరు తోటి ఇంటిసభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను తెలుపుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్ తన స్నేహితుల కోసం తగ్గారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే స్నేహితులతో పోటీపడి టికెట్ టు ఫినాలే నెగ్గారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీరొక సేఫ్ ప్లేయర్ అనిపించినా వారి మాటలకు మీ ఆటతో సమాధానం చెప్పారు. సోషల్ మీడియా నుంచి ఎదిగి సాధ్యమైనంత ఎక్కువమందికి వినోదం పంచడానికి ఇతర సభ్యుల సహకారం లేకుండా మీకు మీరుగా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నించిన తీరు అందరికీ నచ్చింది. ఆ విషయమే మిమ్మల్ని ఇక్కడివరకూ తీసుకొచ్చింది. మీ పొరపాట్లు మీ రెండు వారాలు కెప్టెన్సీ దూరమయ్యేలా చేశాయి. ఎత్తుపల్లాలతో సాగే ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు గార్డెన్లో మీరు దించుకున్న గుండె బరువును బిగ్‌బాస్ విన్నారు. ఇంట్లో వారితో మాట్లాడే వచ్చే బలం ఎంతో అని తెలిసినా ఆ అవకాశాన్ని తోటిసభ్యుల కోసం వదులుకున్నారు. పట్టుకోవడంలోనే కాదు వదిలేయడంలో కూడా బలముంటుంది. దాంతో ఏదైనా సాధించొచ్చు. మీ బలాన్ని, వినోదాన్ని, పట్టుదలను ఇలాగే కొనసాగించి అనుకున్నవన్నీ సాధించాలని బిగ్‌బాస్ కోరుకుంటున్నాడు అని చెప్పాడు. ఇది విన్న శ్రీహాన్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత కీర్తి గార్డెన్ ఏరియాలోకి వచ్చింది. ఇంతలో ఫోన్ రింగైంది. అవతలి నుంచి మానస్ మాట్లాడుతూ.. 'ఒళ్లు హూనమైపోతున్నా, వేలికి ఫ్రాక్చర్ అయినా, సాఫ్ట్ టార్గెట్ అనుకుని నామినేట్ చేసినా ఎక్కడా బెదరకుండా ఆడిన ఆట చూసి నాకే కాదు లోపలున్న హౌస్‌మేట్స్‌కు, బయటున్న ప్రేక్షకులకు మబ్బులు వదిలిపోయాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో నీలాంటి కూతురు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకునేలా చేశారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని, అన్నింటిలో ముందుంటారని నిరూపించావు. ఈ సీజన్లో ఫస్ట్ లేడీ కెప్టెన్ అయ్యావు, అలాగే ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము' అని చెప్పి ఆమె పెదాలపై ఆత్మస్థైర్యంతో కూడిన నవ్వులు పూయించాడు. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. 'కీర్తి, కల్పితం కన్నా నిజ జీవితం ఎంతో నాటకీయమైనది. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహిస్తుంటే కణకణమండే కొడవలిలా జీవితంపై దండయాత్ర చేసేందుకు మీరు చూపించిన గుండె నిబ్బరం ఎంతోమందికి స్ఫూర్తి. అడవిలో మహావృక్షం ఒకటే ఉంటుంది. అది తాను ఒంటరినని బాధపడి తల వంచితే ఆకాశం తాకే తన ఎదుగుదలను చూడలేదు. మీకుగా సంపాదించిన పేరు, ప్రేమను ఎన్నో రెట్లు చేయడానికి బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. మొదటినుంచీ మొండిధైర్యాన్ని చూపిస్తూ వచ్చారు. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. భాష మీ భావాలను వ్యక్తపరిచేందుకు పరిమితిగా మారినా మీ కన్నీళ్లు మనసులోని భావాలను దాచలేకపోయాయి. కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితులు మీరెంత బలమైనవారో మర్చిపోయేలా చేసినట్లనిపించింది. సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతావారు నిందించినప్పుడు మీ మనసు గాయపడింది. మీరనుకున్న విషయాన్ని బలంగా వినిపించినా మద్దతు తెలిపే స్నేహితులు లేక నిరాశ చెందారు. కానీ మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి. అన్నింటినుంచీ తేరుకుని మొదటి ఫీమేల్ కెప్టెన్‌గా నిలిచారు. పద్నాలుగు వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత గ్రాండ్ ఫినాలేకు చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీ ఒక్కరు మాత్రమే కాదు, మీ కుటుంబం కూడా! ఎందుకంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షలు.. అని ముగించాడు. బిగ్‌బాస్ మాటలతో కీర్తి పులకరించపోయింది. 'ఈ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుంది. ఎవరైతే నన్ను ఛీ,తూ అన్నారో, నువ్వు చూడటానికి బాగోలేవు అంటూ బయటకు గెంటేశారో వారికి నేనీరోజు చెప్తున్నాను. ఇదీ కీర్తి.. ఈరోజు నా పేరెంట్స్ ఆత్మకు శాంతి దొరుకుతుందని భావిస్తున్నాను. ఇన్నాళ్లకు నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను. నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను' అంది కీర్తి. చదవండి: బిగ్‌బాస్ 6 విజేత ఎవరో తెలుసా? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు -
బిగ్‌బాస్ 6 విజేత ఎవరో తెలుసా? గూగుల్ తల్లి ఏం చెప్తుందంటే?
బిగ్‌బాస్ షో ప్రారంభమవుతుందంటే మురిసిపోయే జనాలు షోకి శుభం కార్డు పడుతుందంటే మాత్రం తెగ ఫీలైపోతుంటారు. కానీ ఈసారి మాత్రం హమ్మయ్య, ఎట్టకేలకు ముగింపు కాబోతుందని ఊపిరి పీల్చుకుంటున్నారు. అలా ఉంది మరి ఈ సీజన్. ఎంటర్టైన్మెంట్కు అడ్డా ఫిక్స్ అని నాగ్ అన్నాడే తప్ప మరీ అంత భీభత్సమైన ఎంటర్టైన్మెంట్ అయితే లేదు. పైగా బాగా ఆడుతున్నారనుకున్న కంటెస్టెంట్లను అన్యాయంగా ఎలిమినేట్ చేసేసి తమకు కావాల్సిన వాళ్లనే టాప్ 5లో పెట్టుకుంది బిగ్‌బాస్ యాజమాన్యం.. అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇనయ సుల్తాన ఎలిమినేట్ అయిన తర్వాత ఆరో సీజన్‌పై మరింత విమర్శలు వచ్చిపడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టీఆర్పీ కూడా ఢమాల్ అని పడిపోయింది. ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు ఉన్నారు. రోహిత్, రేవంత్, కీర్తి, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య.. వీరిలో ఒకరు రేపు ఎలిమినేట్ కాబోతున్నారు. దీంతో మిగిలిన మిగతా ఐదుగురు ఫినాలేలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే విన్నర్ ఎవరనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో గూగుల్ తల్లి బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విజేత ఎవరనేది ప్రకటించింది. ఈ షోలో మిస్టర్ పర్ఫెక్ట్గా నిలిచిన రోహిత్ విన్నర్‌గా అవతరించనున్నాడని తెలిపింది. బిగ్‌బాస్ 6 విన్నర్ ఎవరు? బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విజేత ఎవరు? ఇలా ఎలా అడిగినా రోహిత్ పేరే సూచిస్తోంది. మరి నిజంగానే అతడు టైటిల్ అందుకుంటాడేమో చూడాలి! ప్రస్తుతానికి అనఫీషియల్ ఓటింగ్‌లో రేవంత్, శ్రీహాన్ మొదటి స్థానం కోసం పోటీపడుతున్నారు. ఆదిరెడ్డి, రోహిత్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. కీర్తి, శ్రీసత్య ఓట్ల శాతంలో వెనకపడినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ షోకి ముందు వరకు రోహిత్ ఎవరికీ పెద్దగా తెలియదు. హౌస్‌లో అడుగుపెట్టాకే తన మాటతో, ఆటతో, నిజాయితీతో అభిమానులను సంపాదించుకున్నాడు. అటు హౌస్‌మేట్స్‌తో, ఇటు ప్రేక్షకులతో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. కానీ ఆటలో మిగతావారికంటే కొద్దిగా వెనుకబడటంతో ఓట్లలో కూడా వెనుకపడుతున్నాడు. ప్రస్తుతానికైతే రేవంత్ గెలిచే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు.. శ్రీహాన్ ఎమోషనల్ -
కుటుంబం లేదని బాధపడ్డారు.. కీర్తిని ఏడిపించిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు వంద రోజులు ప్రయాణించారు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే వారు చేసిన చిలిపి పనులు, అల్లర్లు, కష్టాలు, కొట్లాటలు, కోపతాపాలు, సంతోషాలు, ఏడుపులు.. ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. వీటన్నింటి పరిగణనలోకి తీసుకున్న బిగ్‌బాస్ వారి వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు. తాజాగా కీర్తి గురించి బిగ్‌బాస్ మాట్లాడుడూ.. కల్పితం కన్నా నిజ జీవితం ఎంతో నాటకీయమైనది. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహిస్తుంటే మీరు చూపించిన గుండె నిబ్బరం ఎందరికో స్ఫూర్తి. అడవిలో మహావృక్షం ఒకటే ఉంటుంది. అది తాను ఒంటరినని బాధపడి తల వంచితే ఆకాశం తాకే తన ఎదుగుదలను చూడలేదు. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతావారు నిందించినప్పుడు మీ మనసు గాయపడింది. కానీ మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి. గ్రాండ్ ఫినాలేకు చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీరు ఒక్కరు మాత్రమే కాదు, కుటుంబం కూడా! ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షలు. కష్టాల పునాదులపై నిర్మించి విజయాన్ని కదపడం అంత సులభం కాదు అంటూ బిగ్‌బాస్ కీర్తిని ఆకాశానికి ఎత్తేయడంతో ఆమె ఆనంద భాష్పాలు రాల్చింది. చదవండి: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు: శ్రీహాన్ -
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు.. శ్రీహాన్ ఎమోషనల్
ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణాన్ని దాటుకుంటూ వచ్చి గెలుపుకు అడుగు దూరంలో ఉన్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. ఇప్పటికే రేవంత్, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి వారి వంద రోజుల జర్నీని చూసి గుండె నిండా సంతోషాన్ని నింపుకున్నారు. ఈరోజు శ్రీహాన్, కీర్తిల వంతు వచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. శ్రీహాన్ గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. తోటి ఇంటిసభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను తెలుపుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్ తన స్నేహితుల కోసం తగ్గారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే స్నేహితులతో పోటీపడి టికెట్ టు ఫినాలే నెగ్గారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీరొక సేఫ్ ప్లేయర్ అనిపించినా మీ ఆటతో సమాధానం చెప్పారు. ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు బిగ్‌బాస్ విన్నారు. పట్టుకోవడంలోనే కాదు వదిలేయడంలో కూడా బలముంటుంది. మీ బలాన్ని, వినోదాన్ని, పట్టుదలను ఇలాగే కొనసాగించి అనుకున్నవన్నీ సాధించాలని బిగ్‌బాస్ కోరుకుంటున్నాడు అంటూ బిగ్‌బాస్ అతడిపై పొగడ్తల వర్షం కురిపించాడు. తన గురించి బిగ్‌బాస్ అంత గొప్పగా మాట్లాడేసరికి శ్రీహాన్‌కు కన్నీళ్లు ఆగలేవు. చదవండి: రోహిత్ జర్నీ హైలైట్, రుణపడి ఉంటానన్న ఆదిరెడ్డి అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది -
రోహిత్ జర్నీని అద్భుతంగా చూపించిన బిగ్‌బాస్, ఆదిరెడ్డి ఒక్క అడుగు దూరంలో..
బిగ్‌బాస్ సీజన్-6 చివరి అంకానికి చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు అతి దగ్గర్లో ఉన్న నేపథ్యంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు హౌస్‌లో తమ జర్నీ వీడియోలను చూపించాడు. ఇప్పటికే రేవంత్, సత్యల జర్నీ వీడియోలు చూశాం. ఇప్పుడు ఆదిరెడ్డి, రోహిత్‌ల జర్నీ ఎలా ఉంది? బిగ్‌బాస్ చేసిన రివ్యూ ఏంటి అన్నది చదివేద్దాం. ఆదిరెడ్డి జర్నీ గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. ''కామన్‌మ్యాన్‌గా ఇంట్లోకి అడుగుపెట్టి ప్రతి అంశంలో నిశితంగా చూడగలిగడం ఆటలో ఒక అడుగు ముందుంచింది. కొన్నిసార్లు మీ అంచనా తప్ప మీకే నష్టం జరిగింది. .మీలోని రివ్యూవర్‌ని కాకుండా ఒక సామాన్యుడ్ని కొన్ని సార్లు బయటపెట్టారు. అది అందరినీ ఆకట్టుకుంది. మీరు చేసిన డాన్స్ కూడా అందులో ఒకటి.మాట పడని స్వభావం.. మాట ఎలా అనాలో తెలిసిన తనం మీకు మాత్రమే సొంతం. సామాన్యుడిగా మొదలై విజేతగా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్న మీ ప్రయాణం కూడా ఆగకూడదని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్'' అంటూ జర్నీని ముగించారు. హౌస్‌లో చివరగా రోహిత్ జర్నీని చూపించాడు బిగ్‌బాస్. భార్య మెరీనా ఫోన్ కాల్‌తో ఫుల్ ఖుషీ అయిన రోహిత్‌కు ఆ తర్వాత బిగ్‌బాస్ వంద రోజుల జర్నీని చూపించాడు. ఇక రోహిత్ గురించి బిగ్‌బాస్ అద్భుతంగా చెప్పారు. ''భార్య భర్తలుగా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఏ ప్రయాణంలోనైనా ఎదురయ్యే సవాళ్లు, ఏర్పడే పరిస్థితుల కారణంగా వచ్చే కష్టసుఖాలు పంచుకోవడం కేవలం జీవిత భాగస్వామితోనే సాధ్యమవుతుంది. ఆ తోడు మీకు ఈ ఇంట్లో లభించింది. ఇదే విషయం గురించి ఇంట్లోవాళ్లు మిమ్మల్ని తరచూ నామినేట్ చేస్తున్నప్పుడు మీ మనసుకి బాధ కలిగింది. స్నేహితులు జట్టుగా ఆడితే తప్పు కానప్పుడు మీరు ఆడితే ఎందుకు చర్చనీయాంశం అయ్యిందో అర్థం కాలేదు. భార్యభర్తలకు మించిన స్నేహితులుంటారా? అనే భావన కలిగింది. అయినా మీరు అవేం లెక్కచెయ్యలేదు. మీ సహనాన్ని కోల్పోలేదు. మీ మంచితనాన్ని అవకాశంగా ఇతరులు తీసుకున్నా, మీరు వారికి మంచి చేయడానికే నిర్ణయించుకున్నారు. మీ అమ్మగారు మిమ్మల్ని కెప్టెన్‌గా చూడాలనే కోరిక అసంపూర్ణంగా మిగిలిపోయినా ఈ స్థానంలో మిమ్మల్ని ఇలా చూసి గర్వపడతారు'' అంటూ రోహిత్ గురించి అద్భుతంగా మాట్లాడారు. ఈ జర్నీ వీడియోతో రోహిత్ విన్నర్ మెటీరియల్ అనేంత పాజిటివ్‌గా చూపించారు. మిగతా ఇంటిసభ్యుల కంటే రోహిత్ జర్నీ వీడియో చాలా ఇంప్రెసివ్‌గా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బిగ్‌బాస్ 6: బయటకు రాగానే సూర్యను కలిసిన ఇనయా, ఫొటో వైరల్
గతవారం బిగ్‌బాస్ షో నుంచి ఇనయ సుల్తాన ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఫినాలేలో ఉండాల్సిన ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేయడాన్ని ఇప్పటికీ ఆమె ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందనుకున్న ఈ అమ్మడు అనూహ్యంగా 14 వారాలు హౌస్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఆరోహి ఎలిమినేట్ అయిన అనంతరం ఆమె సూర్యకు క్లోజ్ అయ్యింది. వీరిద్దరి సాన్నిహిత్యం చూసింది అంతా సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనుకున్నారు. చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు సూర్య తనకు మంచి స్నేహితుడు అంటూనే అతడిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది ఇనయ. అలాగే సూర్య కూడా. ఇక ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని, ఇక హౌజ్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటుండగా అనూహ్యంగా సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక సూర్య హౌజ్ వీడటంతో ఇనయ పడిన బాధ ఇంతఅంత కాదు. ఇక హౌజ్‌లో అతడి కప్పును వాడటం, సూర్య సూర్య అంటూ కలవరించడం చేసింది. ఆ తర్వాత హోస్ట్ నాగార్జున కాస్తా వారించడం ఇక ఆటపై దృష్టి పెట్టింది. అలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకున్న ఆమె 14వ వారం బిగ్‌బాస్ హౌజ్‌ను వీడింది. ఇక బయటక వచ్చిరాగానే ఇనయ, సూర్యను కలుసుకుంది. ఇనయతో కలిసి క్లోజ్‌గా దిగిన ఫొటోను సూర్య తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు. ఇందులో సూర్య, ఇనయను హగ్ చేసుకుని కనిపించాడు. దీంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ‘హౌజ్‌లో బాగా కనెక్ట్ అయిన వీరిద్దరు బయట కూడా అలాగే ఉంటారో లేదో చూడాలి’, ‘ఈ రిలేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూస్తాం’ కొందరూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ‘లేడీ టైగర్ ఇనయా’, ‘ఇనయది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్, రియల్ బిగ్‌బాస్ విన్నర్’ అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్ View this post on Instagram A post shared by RJ Surya (Konda Babu) (@rjsurya_official) -
జర్నీని చూసి కళ్లు చెమర్చిన శ్రీసత్య, గెలుపుపై రేవంత్ ధీమా!
Bigg Boss 6 Telugu, Episode 100: బిగ్‌బాస్ సీజన్ 6లో టాప్ 6 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు రెడీ అయ్యాయి. ఈరోజు ఇద్దరు హౌస్మేట్స్ జర్నీలను వారి కళ్లకు కట్టినట్లు చూపించాడు. అంతేకాకుండా ఇప్పటివరకు ఆడిన టాస్కులకు సంబంధించిన వస్తువులను గార్డెన్ ఏరియాలో ఉంచి పెట్టాడు. హౌస్‌లో సంతోషకరమైన, బాధాకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను అక్కడక్కడా అతికించాడు. మొదటగా రేవంత్‌ను గార్డెన్ ఏరియాలోకి రమ్మని పిలుపు వచ్చింది. డోర్ తీసుకుని బయటకు వచ్చిన రేవంత్ ఆ సెట్టింగ్ చూసి సర్ప్రైజ్ అయ్యాడు. అక్కడున్న బొమ్మను తీసుకుని ఈ షో గెలిచి ఇంటికి వెళ్లాక నా కూతుర్ని ఇలాగే ఎత్తుకుంటానని ఊహల్లో తేలిపోయాడు. ఇంతలో అతడికి భార్య అన్విత నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఎంతమంది ఉన్నా నువ్వు లేవనే బాధ ఉంది. కానీ నువ్వు గెలిచి రావాలని చెప్పడంతో సంతోషపడిపోయాడు రేవంత్. తర్వాత ఎప్పటిలాగే బిగ్‌బాస్ ఉపన్యాం అందుకున్నాడు. 'ఇప్పటివరకు గాత్రానికి సంబంధించిన ఎన్నో పోటీల్లో మీరు గెలిచారు. ఇప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించిన పోటీలో కూడా గెలవాలని బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. మొదటి రోజు నుంచే మీరు చూపించిన దూకుడు ఇతర పోటీసభ్యులకు తమ పోటీ ఎవరనే విషయాన్ని స్పష్టం చేసింది. మీ కోపం బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఓటమిని తీసుకోలేని మనస్తత్వం చుట్టూ ఉన్నవారికి మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశాన్నిచ్చింది. కోపాన్ని ఆయుధంగా కాకుండా ప్యాషన్‌గా మార్చారు. అది మీ నాయకత్వ లక్షణాలను, పట్టుదలను రెట్టింపు చేసింది. మీ ఆకలి.. టాస్కుల్లో ఎంత చూపించారో, హౌస్‌లో కూడా అంతే చూపించారు. దాచుకుని తినడంలో మీలోని చిన్నపిల్లాడి అమాయకత్వాన్ని బిగ్‌బాస్ గమనించాడు. మీ కోపం పరదా వెనకున్న సున్నిత మనసు బిగ్‌బాస్‌కు తెలుసు. జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. వాటన్నింటినీ దాచుకోకుండా ప్రేక్షకులకు చూపించినతీరు మిమ్మల్ని వారికి ఇంకా దగ్గర చేసింది. జీవితంలో తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని వదులుకుని ఇంటిసభ్యులకు దూరంగా ఉంటూ ఓవైపు కలతగా ఉన్నా, మరోవైపు గెలుపు కోసం ఎక్కడిదాకానైనా వెళ్లాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపింది...' అంటూ అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. అది చూసి ఎమోషనలైన రేవంత్.. బిగ్‌బాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకున్నాడు. తర్వాత శ్రీసత్యకు పిలుపు వచ్చింది. రాగానే అక్కతో ఫోన్ మాట్లాడి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఆమె గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. పరిస్థితులు భుజాలపై బరువును పెంచితే దాన్ని చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలే సత్తువ చూపించడమే మనిషి మొదటి విజయం. ఆ పట్టుదల, మొండితనం రెండూ ఉన్నాయి. కాబట్టే మీరు బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. కష్టం వచ్చినప్పుడు పారిపోవడమో, ఎదుర్కోవడమో రెండే దారులుంటాయి. మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడాన్ని ఎంచుకున్నారు. బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చిన మొదట్లో మీలో ఎన్నో అనుమానాలు, భయాలు, ప్రశ్నలు ఎవరికి ఎంత దగ్గరవ్వాలో తెలియని ఒక సంకోచ స్థితి మీ ఆటపై నుంచి దృష్టిని తప్పించినప్పుడు మీ అమ్మ కోసం బిగ్‌బాస్ ఇంట్లోకి మీరు వచ్చిన కారణం, అందుకు మీరు చేరుకోవాల్సిన లక్ష్యం గుర్తొచ్చాయి. ఒంటరితనమే అడ్డుగా మార్చుకున్న మీకు.. మీలో మరో కోణాన్ని తట్టే ఇద్దరు స్నేహితులు దొరికి ఈ ప్రయాణాన్ని సులువు చేశారు. మీ నవ్వు ఈ ఇంట్లో ఎప్పటికీ నిలిచిపోయేలా మీ బలాన్ని మీకు గుర్తు చేసిన తీరు మిమ్మల్ని ఇంకా దగ్గర చేసింది. సరైన వ్యక్తులు సరైన సమయంలో జీవితంలోకి రావడం ఎంత బలమో డీటాచ్మెంట్ను నమ్మే మీకు కొత్త అనుభవం. మన బలాన్ని మనం నమ్మిన తర్వాతే ప్రపంచం నమ్ముతుంది. అది నమ్మడం మొదలుపెట్టినప్పుడే మీరు కెప్టెన్ అయ్యారు. పద్నాలుగు వారాల ప్రయాణంలో ఒక్కోవారం మీకన్నా బలంగా ఉన్నవారిని దాటుకుంటూ ఆటలో ఆఖరి దశకు చేరుకున్నారు. మీ లక్ష్యం వైపు ఇలాగే ముందుకెళ్లాలని ఆశిస్తూ ఆల్ దె బెస్ట్ చెప్పాడు బిగ్‌బాస్. తర్వాత తన జర్నీ చూసి ఎమోషనలైంది శ్రీసత్య. మిగతా హౌస్మేట్స్ జర్నీ రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. చదవండి: సూర్యతో లవ్‌లో ఉన్నానని చెప్పానా? యాంకర్‌కు ఇచ్చిపడేసిన ఇనయ అమర్తేజుల హల్దీ ఫంక్షన్, ఫోటోలు వైరల్ -
యాంకర్‌కు ఇచ్చిపడేసిన ఇనయ, దెబ్బకు సైలెంటైన శివ
బిగ్‌బాస్ షోలో ఇనయ సుల్తాన ఎలిమినేట్ అయింది. ఫినాలేలో ఉండాల్సిన ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇకపోతే షో నుంచి ఎగ్జిట్ అయిన ఇనయ బిగ్‌బాస్ కెఫెలో యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అతడు అడిగే ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానాలిచ్చింది. ప్రతిసారి టైటిల్ విన్నర్ నేనే అని ఎందుకు అరిచేదాని? అని శివ ప్రశ్నించగా నా మీద నాకున్న నమ్మకంతోనే అలా అన్నానని చెప్పింది. సూర్యతో లవ్ ట్రాక్ వల్ల నీ గ్రాఫ్ తగ్గింది అని శివ చెప్పగా అతడిని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అని తిరిగి ప్రశ్నించింది. ఊహించని ప్రశ్నతో అవాక్కయ్యాడు శివ. సూర్య గురించి రేవంత్ దగ్గర ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేశావని అడగ్గా.. అది బ్యాక్ బిచ్చింగ్ కాదు, అప్పుడు కోపంలో అలా చెప్పానని ఆన్సరిచ్చింది. అంటే నీకు నచ్చినప్పుడు బాగా మాట్లాడతావు, నచ్చకపోతే ఎన్ని స్టేట్మెంట్లైనా వదులుతావు, అంతేనా? అని శివ సెటైర్ వేయగా.. ఎన్ని స్టేట్మెంట్లు కాదు, అప్పుడనిపించింది మాత్రమే చెప్తాను అంటూ కౌంటరిచ్చింది. రేవంత్ గురించి చెప్పమని శివ అడగడంతో అతడు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాడంది ఇనయ. అచ్చం నీలాగే కదా అని యాంకర్ సెటైర్ వేయగా తన గురించి అడిగినప్పుడు మధ్యలో నన్నెందుకు తీసుకొస్తున్నావు అని మండిపడింది. నేనూ, తను ఒకేలా ప్రవర్తిస్తామా? అని ప్రశ్నించగా నాకు తెలీదని బదులిచ్చాడు శివ. మరి తెలియనప్పుడు నా గురించి ఎందుకు చెప్పావని ఎదురు తిరిగింది. ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలు 'ఇనయ రాక్స్, యాంకర్ శివ షాక్స్', 'శివకు ఇనయ మాత్రమే కౌంటర్ ఇవ్వగలదు', 'లాస్ట్ కౌంటర్ అదిరిపోయింది', 'ప్రతి ఒక్కరినీ చులకన చేసి మాట్లాడుతున్న శివకు ఇనయ సరిగ్గా జవాబిచ్చింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: జర్నీ చూసి భావోద్వేగానికి లోనైన రేవంత్, శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్, అతడే టైటిల్ గెలవాలన్న ఇనయ -
అక్క గొంతు విని శ్రీసత్య, కూతురిని తలుచుకుని రేవంత్ ఎమోషనల్
బిగ్‌బాస్.. నిన్ను నీకే కొత్తగా చూపిస్తుంది. నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. షో ముగిసేసరికి నీకు నువ్వే కొత్తగా పరిచయమయ్యేలా చేస్తుంది. ఈ షోలో పాల్గొనే ప్రతి కంటెస్టెంట్ బిగ్‌బాస్ ద్వారా ఏదో ఒకటి నేర్చుకునే వెళ్తాడు. ఎవరితోనూ కలవని వాళ్లు కూడా అందరితో కలిసిపోతారు. తమలోని తప్పొప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటారు. బిగ్‌బాస్ ఆరో సీజన్ జర్నీ ముగింపుకు వచ్చింది. ఈ ఆదివారంతో షోకు శుభం కార్డు పడనుంది. దీంతో హౌస్‌లో మిగిలిన ఆరుగురికి వారి జర్నీలు చూపిస్తున్నాడు బిగ్‌బాస్. తమ ప్రయాణాన్ని చూసి హౌస్మేట్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు. కప్పు గెలుచుకుని ఇంటికి రా అంటూ అక్క ఫోన్ చేసి కోరడంతో భావోద్వేగానికి లోనైంది శ్రీసత్య. భుజాలపై బరువును చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలి సత్తువ చూపించడమే మొదటి విజయం. మీరు చిరునవ్వుతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు బిగ్‌బాస్. ఆ మాటలతో భావోద్వేగానికి లోనైంది శ్రీసత్య. అటు రేవంత్.. బొమ్మను ఎత్తుకుని గెలిచి ఇంటికెళ్లాక నా కూతురిని ఇలాగే ఎత్తుకుంటానంటూ నమ్మకంతో చెప్తున్నాడు. 'మీ కోపమే బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఈ విషయాన్ని వెంటనే అర్థం చేసుకుని అందుకు తగ్గుట్గా మారి మీ కోపాన్ని ప్యాషన్‌గా మార్చారు. జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశం వదిలి బిగ్‌బాస్ గేమ్ కోసం ఎంతదూరమైనా వెళ్లాలని ఆరాటపడ్డారు' అంటూ రేవంత్‌పై పొగడ్తలు కురిపించాడు బిగ్‌బాస్. -
బిగ్‌బాస్: ఇనయ సుల్తాన పారితోషికం ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో లేడీ టైగర్‌గా పేరు తెచ్చుకుంది ఇనయ సుల్తాన. టాస్కుల్లో టఫ్ ఫైట్ ఇచ్చే ఇనయ నామినేషన్స్‌లో కూడా అందరితో వాదించేది. మొదట్లో తన ప్రవర్తనతో చిరాకు పుట్టించినప్పటికీ రానురాను మాటతీరు, ఆటతీరు మెరుగుపరుచుకుని తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తనలో ఉన్న ఫైర్‌ను చూసి రేవంత్‌కు గట్టి పోటీనిచ్చేలా ఉందే అనుకున్నారంతా! కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫినాలేకు ఒక వారం ముందే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ను అలా ఎలా పంపించేస్తారని అభిమానులు బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ద్వారా పాపులారిటీ, స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఇనయ ఈ షో ద్వారా ఎంత వెనకేసిందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఇనయ సుల్తానా వారానికి లక్ష రూపాయల పైనే రెమ్యునరేషన్ అందుకుందట. ఈ లెక్కన పద్నాలుగు వారాలకు గానూ సుమారు రూ.15 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: మిడ్ వీక్ ఎలిమినేషన్, శ్రీహాన్‌కు ఇనయ ఫుల్ సపోర్ట్ -
మిడ్ వీక్ ఎలిమినేషన్! శ్రీహాన్ టైటిల్ కొట్టి రావాలన్న ఇనయ
Bigg Boss 6 Telugu, Episode 99: ఊహించిందే జరిగింది.. ఈ వారం ఇనయ ఎలిమినేట్ అయింది. ఫినాలేకు ఒక అడుగు దూరంలోనే తన ప్రయాణం ముగిసింది. తన జర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఇనయ. చివరి నిమిషంలో కెప్టెన్ అవడమే కాకుండా బెస్ట్ కెప్టెన్‌గా అందరిచేత శెభాష్ అనిపించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. మరి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్‌లో ఏమేం జరిగాయో చదివేయండి.. బిగ్‌బాస్ హౌస్ గురించి కంటెస్టెంట్లకు ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడానికి 'నీకెంత తెలుసు' అనే టాస్క్ ఇచ్చాడు నాగ్. హౌస్‌లో నిత్యం చూసే పరిసరాల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇందులో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రేవంత్ గిఫ్ట్ హ్యాంపర్ సొంతం చేసుకున్నాడు. తర్వాత పాటలు, డ్యాన్సులతో ఎంటర్టైన్ చేశారు హౌస్మేట్స్. నాగ్ అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో ఆదిరెడ్డి, ఇనయ మాత్రమే మిగిలారు. కంటెస్టెంట్లు ఊపిరి బిగపట్టుకుని చూస్తున్న సమయంలో ఇనయ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. ఎలాగైనా కప్పు కొట్టాలన్న తన కల నెరవేరకుండానే హౌస్ నుంచి బయటకు వచ్చేయడంతో భావోద్వేగానికి లోనైంది. ఒక్క అడుగు దూరంలో ఆగిపోయానని ఫీలైంది. స్టేజీమీదకు వచ్చిన ఇనయతో ఓ గేమ్ ఆడించాడు నాగ్. టాప్ 6 కంటెస్టెంట్లలో ఉన్న మంచి, చెడు లక్షణాలను చెప్పమన్నాడు. ఇనయ మాట్లాడుతూ.. శ్రీహాన్‌తో స్టార్ట్ చేస్తాను. అతడు మంచివాడని తర్వాత అర్థమైంది. అతడే టైటిల్ కొట్టి రావాలి. అవతలి వాళ్లను అర్థం చేసుకుంటే బాగుండు, బ్యాక్ బిచింగ్ తగ్గించుకోవాలి. ఆదిరెడ్డి.. నిజాయితీపరుడు. శ్రీసత్య తనకు నచ్చినవాళ్ల కోసం ఏదైనా చేస్తుంది. నచ్చనివాళ్లను విపరీతంగా రెచ్చగొడుతుంది. కీర్తి ఎలాంటి బాధనుంచైనా బయటపడగలదు, కానీ దానికి సమయం పడుతుంది. రోహిత్ డీసెంట్ గుడ్ బాయ్. కానీ తనలోని సామర్థ్యాన్ని పూర్తిగా బయటపెట్టలేదు. రేవంత్.. అందరితో బాగుంటాడు, అందరికీ ఫుడ్ షేర్ చేస్తాడు. కానీ అందరికీ మంచి చెప్పాలనుకుంటాడు, అది అవతలవాళ్లకు నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇనయను పంపించేసిన నాగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. బుధవారం ఒకరిని హౌస్ నుంచి పంపించేస్తామని తెలిపాడు. కాబట్టి హౌస్‌లో ఎవరిని హౌస్‌లో ఉంచాలనుకుంటున్నారో? ఎవరిని ఫినాలేకు పంపించాలనుకుంటున్నారో.. వారికి ఆలస్యం చేయకుండా ఓట్లు గుద్దేయండి.. చదవండి: లేడీ టైగర్‌ను పంపించేస్తారా.. చెత్త సీజన్ అంటూ ట్రోలింగ్ సినిమాలు వర్కవుట్ కాలేదు, చనిపోదామనుకున్నా -
చివరి రౌండ్లో ఆదిరెడ్డి, ఇనయ... ఇంకా సస్పెన్స్ ఏముంది?
బిగ్‌బాస్ షోలో ఈ వారం ఇనయ ఎలిమినేట్ కానుంది అన్న విషయాన్ని ఆమె అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. లేడీ సింగాన్ని బయటకు పంపించేయడమేంటని బిగ్‌బాస్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ ప్రోమో రిలీజైంది. ఇందులో నాగ్ హౌస్‌మేట్స్‌తో ఓ ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరు డ్యాన్స్ స్టెప్ వేస్తే అది ఏ పాటో మిగతావాళ్లు గెస్ చేయాల్సి ఉంటుంది. అలా పాటలు, డ్యాన్సులతో హౌస్మేట్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. ఆదిరెడ్డి అయితే నేను డ్యాన్సర్ అంటూ అందరికంటే ఓ స్టెప్పు ఎక్కువే వేశాడు. తర్వాత అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి ఆదిరెడ్డి, ఇనయ మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది బోర్డుపై చూపిస్తానడంతో ప్రోమో ముగిసింది. ఎలాగో ఆది సేవ్ అవగా ఇనయ ఎలిమినేట్ అయిందని అందరికీ తెలిసిపోవడంతో ఈ ఎలిమినేషన్ ఎలాంటి సస్పెన్స్ లేకుండా జరిగిపోయింది. చదవండి: అది రేవంత్‌ను చూసే నేర్చుకున్నా: నాగార్జున -
ఇది రేవంత్‌ను చూసి నేర్చుకున్నా: నాగార్జున
సండే ఫండే ప్రోమో వచ్చేసింది. ఈ సారి కూడా కంటెస్టెంట్లతో సరదా గేమ్స్ ఆడించాడు హోస్ట్ నాగార్జున. వంద రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటున్న ఏడుగురికి ఇంటి గురించి ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో హౌస్‌లో ఎన్ని గోల్డెన్ హ్యాండ్స్ ఉన్నాయి? వాష్‌రూమ్ ఏరియాలో ఎన్ని పూలకుండీలు ఉన్నాయి? లాంటి ప్రశ్నలడిగాడు. నాగార్జున ప్రశ్న అడగ్గానే ఎవరు గంట కొడితే వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే రెండు పాయింట్లు జోడిస్తానని, తప్పు సమాధానం చెప్తే రెండు పాయింట్లు మైనస్ చేస్తానన్నాడు. వీఐపీ బాల్కనీకి ఎన్ని మెట్లున్నాయి అని అడగ్గా ఆదిరెడ్డి పది మెట్లు అని చెప్పాడు. నాగార్జున మైనస్ 2 అన్నాడు. అప్పటికే బెల్ కొట్టిన శ్రీసత్య 7 లేదా 8 అని చెప్పింది. 7 మెట్లు సరైన సమాధానమంటూ వెంటనే ఒక పాయింట్ ఇచ్చాడు నాగ్. అదేంటి సర్, ఆమె రెండు ఆప్షన్లు చెప్పింది కదా అని రేవంత్ సందేహం వ్యక్తం చేయగా.. 'నేను సంచాలక్, నా ఇష్టం. అయినా ఇది నేను రేవంత్ దగ్గరే నేర్చుకున్నాను' అని పంచ్ ఇచ్చాడు. చదవండి: లేడీ సింగాన్ని పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా? ఈ వారం ఇనయ ఎలిమినేట్? -
'బిగ్‌బాస్' తర్వాత ట్రాక్ మారిందా? అర్జున్‌కు ముద్దు పెట్టేసిన వాసంతి
బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా లవ్ ట్రాక్‌లు ప్రతి సీజన్లో హైలైట్‌గా నిలుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా బిగ్‌బాస్ సీజన్-6లోనూ సత్య-అర్జున్ కల్యాణ్‌ల లవ్ యాంగిల్ ప్రత్యేకంగా నిలిచింది. తన గేమ్ ఆడటం కూడా మర్చిపోయి సత్య ప్రేమలో పడిపోయిన అర్జున్ 7వ వారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. హౌస్‌లో ఉన్నంతసేపూ సత్య-సత్య అంటూ తిరిగిన అర్జున్ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక మాత్రం ప్లేట్ మార్చిసినట్లు కనిపిస్తుంది. మరో కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్‌తో ఈమధ్య షికార్లు చేస్తున్న అర్జున్ రీసెంట్గా ఓ షోలో పాల్గొన్నాడు. ఇదే షోకు వాసంతి కూడా వచ్చింది. అయితే టాస్క్‌లో భాగంగా వాసంతి కాకరకాయ జ్యూస్ తాగాల్సి రాగా, తను తాగకుండా అర్జున్‌కు తాగమని ఇస్తుంది. వాసంతి కోసం అర్జున్ కరేలా జ్యూస్ తాగుతాడు. దీనికి ఇంప్రెస్ అయిన వాసంతి వెంటనే అతడి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ఎలిమినేషన్‌ను ముందే ఊహించిన ఇనయ? నాగార్జున హింట్
Bigg Boss 6 Telugu, Episode 98: ఫినాలే దగ్గరపడుతుండటంతో నాగార్జున ఫన్నీ టాస్కులు మానేసి సీరియస్ టాస్కులు ఆడించాడు. మొదటగా బిగ్‌బాస్ హౌస్‌లో ఓట్ల క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శ్రీహాన్ మాట్లాడుతూ.. రేవంత్ తప్పులను అంగీకరించడు. అతడికి కోపం ఎక్కువ. కానీ నేను తప్పులను ఒప్పుకోవడమే కాకుండా వాటిని సరిదిద్దుకుంటాను. తనకంటే బాగా ఎంటర్టైన్ చేస్తాను. అందుకోసం నాకు ఓటేసి గెలిపించాలి అని చెప్పాడు. ఇక రేవంత్ మాట్లాడుతూ.. నేను ఏ టాస్కునూ వదల్లేదు. విన్నర్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు నాకున్నాయి. శ్రీహానే కాదు, ఇక్కడ ఎవరినీ నాకు కాంపిటీటర్‌గా అనుకోలేదు అని చెప్పాడు. దీంతో శ్రీహాన్ మధ్యలో కలగజేసుకుంటూ ఒకటి చెప్పాలి సర్ అని అడిగాడు. దీనికి నాగ్.. రేవంత్ ఫ్లిప్పర్ అని చెప్పాలనుకున్నావు, అంతేనా? అన్నాడు. దీంతో అందుకున్న రేవంత్.. శ్రీహాన్ వెనకాల మాట్లాడతాడని తెలుసు, ఇంతకుముందు కూడా విన్నాను, కానీ ఎప్పుడూ తనను అడగలేదని చెప్పాడు. అతడి మాట విని షాకైన శ్రీహాన్.. నీకు చెప్పిన విషయాలే మాట్లాడానే తప్ప వెనకాల కొత్తగా ఏమీ మాట్లాడలేదు అని బదులిచ్చాడు. తర్వాత మిగతా ఐదుగురు కూడా తమలో ఉన్న పాజిటివ్ అంశాలను చెప్తూ దానికోసం ఓట్లేయాలన్నారు. అనంతరం హౌస్మేట్స్ దెయ్యం టాస్కులో ఎంత భయపడ్డారో వారికే వీడియో వేసి చూపించాడు నాగ్. చీకటి గదిలో తాము చేసిన విన్యాసాలు చూసి కంటెస్టెంట్లు పడీపడీ నవ్వుకున్నారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో మరో గేమ్ ఆడించాడు నాగ్. బెస్ట్ అనుకున్న ముగ్గురికి స్టార్ రేటింగ్స్ ఇచ్చి, వేస్ట్ అనుకున్న ముగ్గురికి క్రాస్ సింబల్ ఫేస్‌పైన ముద్రించాలన్నాడు. అలా ఈ గేమ్‌లో ఎవరెవరు ఎవరికి స్టార్స్, ఎవరికి క్రాస్ గుర్తులు ఇచ్చుకుంటూ వెళ్లారంటే.. కంటెస్టెంట్ 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్ సింగిల్ క్రాస్ డబల్ క్రాస్ (బ్యాడ్) ట్రిపుల్ క్రాస్ (వెరీ బ్యాడ్) ఆదిరెడ్డి. శ్రీహాన్ రేవంత్ రోహిత్ శ్రీసత్య ఇనయ కీర్తి కీర్తి రోహిత్ ఇనయ రేవంత్ శ్రీహాన్ కీర్తి ఆదిరెడ్డి శ్రీసత్య శ్రీహాన్ రేవంత్ ఆదిరెడ్డి రోహిత్ ఇనయ కీర్తి ఇనయ కీర్తి శ్రీసత్య రేవంత్ శ్రీహాన్ రోహిత్ ఆదిరెడ్డి రేవంత్ శ్రీసత్య శ్రీహాన్ కీర్తి ఆదిరెడ్డి రోహిత్ ఇనయ శ్రీహాన్ రేవంత్ ఆదిరెడ్డి శ్రీసత్య ఇనయ కీర్తి రోహిత్ రోహిత్ ఆదిరెడ్డి రేవంత్ కీర్తి శ్రీహాన్ శ్రీసత్య ఇనయ తర్వాత కీర్తి, రేవంత్ సేవ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో టికెట్ టు ఫినాలే సాధించిన శ్రీహాన్‌తో పాటు రేవంత్, కీర్తి ఫైనల్ వీక్‌కు వెళ్లారని ప్రకటించాడు నాగ్. మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో హౌస్మేట్స్ గెస్ చేయాలన్నాడు. ముందుగా శ్రీహాన్.. రోహిత్ వెళ్లిపోతాడని అభిప్రాయపడగా కీర్తి.. ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోతాడేమోనని చెప్పుకొచ్చింది. రేవంత్ వంతు రాగా.. ఎన్నడూ ఎవిక్షన్‌కు భయపడని ఇనయ మొట్టమొదటిసారి నిన్న భయపడింది. దాన్నిబట్టి ఆమె ఎలిమినేట్ కావచ్చేమోననుకున్నాడు. దీంతో ఇనయ అందుకుంటూ.. నిన్ననే కదా నేను టాప్ 5 కంటెస్టెంట్ అన్నావు, అంతలోనే మాట మార్చి ఈ వారం వెళ్లిపోతానని చెప్తున్నావేంటి అంటూ నిలదీసింది. రేవంత్ ఇప్పుడు తన మనసులో ఉన్నది మాట్లాడాడంటూ జరగబోయేది ఇదేనని చెప్పకనే చెప్పాడు నాగ్. ఇకపోతే మొన్నటిదాకా ప్రైజ్‌మనీని బిగ్‌బాస్ పెంచగా ఈసారి నాగార్జున ఇంటిసభ్యులకు మర ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన ముందున్న మూడు సూట్‌కేసుల్లో డబ్బులున్నాయని, ఎక్కువ అమౌంట్ ఉన్న కరెక్ట్ సూట్‌కేస్ సెలక్ట్ చేసుకోమన్నాడు. హౌస్మేట్స్ అత్యధికంగా రూ.3 లక్షలున్న సూట్‌కేసు సెలక్ట్ చేసుకున్నారు. దీంతో ఈ మూడు లక్షలు కలపగా ఫైనల్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలకు చేరింది. ఈ అరకోటి రూపాయలతో పాటు విన్నర్ రూ.25 లక్షల విలువైన 605 గజాల స్థలాన్ని గెలుచుకోనున్న విషయం తెలిసిందే! దీనికి తోడు మారుతి సుజుకి బ్రెజ్జా కారు సైతం సొంతం చేసుకోనున్నట్లు ప్రకటించడంతో హౌస్మేట్స్ ఎగిరి గంతేశారు. చదవండి: లేడీ టైగర్‌ను పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా? టాప్ 3లో ఉంటుందనుకున్న ఇనయ ఎలిమినేట్? -
ఇనయ ఎలిమినేషన్‌ను బయటపెట్టిన రేవంత్
వచ్చే వారమే బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉన్నా సింగిల్ ఎలిమినేషన్‌తో ఒక్కరినే ఎలిమినేట్ చేశారట. మరి ఆ బయటకు వచ్చేసింది ఎవరా? అని ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూశారంటే మీకే అర్థం అయిపోతుంది. ఆమె మరెవరో కాదు ఇనయ సుల్తాన. ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండే ఇనయ ఎలిమినేట్ కావడమేంటని అందరూ షాకవుతున్నారు. అయితే నాగార్జున మాత్రం ఇంటిసభ్యుల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈవారం ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారు? అని ప్రశ్నించాడు. ఇందుకు శ్రీహాన్.. రోహిత్ వెళ్లిపోతాడని అభిప్రాయపడ్డాడు. కీర్తి.. ఆదిరెడ్డి పేరు సూచించింది. రేవంత్‌ను ఇదే ప్రశ్న అడగ్గా.. ఎప్పుడూ నామినేషన్స్‌కు భయపడని ఇనయ నిన్న కొంత భయపడుతున్నట్లు చెప్పిందంటూ ఆమె పేరు చెప్పాడు. దీంతో మధ్యలో అందుకున్న ఇనయ.. నిన్ననే కదా, నేను టాప్ 5లో ఉంటానన్నావు, బయటకు వెళ్లనన్నావు అని నిలదీసింది. దీనిపై నాగ్ మాట్లాడుతూ.. నీకలా చెప్పాడేమో కానీ, తన మనసులో ఉన్న మాట ఇదే అని స్పష్టం చేశాడు. చదవండి: షాకింగ్ ట్విస్ట్.. ఇనయ ఎలిమినేటెడ్ వరస్ట్ సీజన్.. లేడీ సింగాన్ని పంపించేస్తారా? నెట్టింట ట్రోలింగ్ -
లేడీ టైగర్‌ను పంపించేస్తారా? చెత్త సీజన్ అంటూ ట్రోలింగ్
సాధారణంగా ఎలిమినేషన్ సండే జరుగుతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు మాత్రమే శనివారం కూడా ఒకర్ని బయటకు పంపించేస్తుంటారు. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనుకుంటే సింగిల్ ఎలిమినేషన్ చాలనుకున్నట్లున్నాడు బిగ్‌బాస్. ఇకపోతే ఇదివరకే షూటింగ్ ముగిసిందని, టాప్ 3 కంటెస్టెంట్ అయిన ఇనయను ఎలిమినేట్ చేశారంటూ ఓవార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ ఇనయ ఫ్యాన్స్ ఘోరంగా హర్ట్ అయ్యారు. ఒక్క ఇనయ ఫ్యాన్స్ మాత్రమే కాదు బిగ్‌బాస్ వీక్షించే ఎంతోమంది ఫినాలేలో ఉండాల్సిన వ్యక్తిని సడన్‌గా పంపించడమేంటని షాకవుతున్నారు. వేరేవాళ్లను సేవ్ చేయడం కోసం ఇనయను బలి చేశారని ఆగ్రహానికి లోనవుతున్నారు. ఫలితంగా ట్విటర్లో ఇనయ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్("INAYA UNFAIR ELIMINATION") ట్రెండ్ అవుతోంది. 33 వేలకుపైగా ట్వీట్లతో ట్విటర్ హోరెత్తిపోతోంది. 'ప్రేక్షకుల ఓట్లంటే లెక్క లేదా? ఇప్పటికే షో ఫ్లాపైంది, ఇంకా ఇనయను పంపించేసి మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు', 'చెత్త సీజన్‌కు చెత్త విన్నర్‌ను మీరే సెలక్ట్ చేసుకోండి, మగవాళ్లకు గట్టిపోటీనిచ్చిన లేడీ టైగర్ ఇనయ, అలాంటిది ఆమెను కనీసం ఫినాలేలో కూడా అడుగుపెట్టనీయకుండా ప్లాన్ చేసి పంపించేస్తారా?', రియాలిటీ షోలో కూడా పాలిటిక్సా?' అంటూ నెట్టింట నెటిజన్లు బిగ్‌బాస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఆమె లేకపోతే ఫినాలేకు టీఆర్పీయే రాదంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్ని వరస్ట్ సీజన్లు వచ్చినా అన్నింటికంటే పరమ వరస్ట్ ఈ సీజనే అని తిట్టిపోస్తున్నారు. Enni worst seasons vachina, S6 ni beat cheylev!! History lo nilichipothundhi, UNBEATABLE WORST SEASON! 1st nundi kastapadi game adinollantha vellipoyaru, theerigga vacation ki vachinollu migilipoyaru!! INAYA UNFAIR ELIMINATION — Nivvi☃️ (@Nivvi011) December 10, 2022 Fighter #inaya got robbed of her winning chance #BiggBossTelugu6 👎 INAYA UNFAIR ELIMINATION https://t.co/eiZFbmagir — Nish (@bb3telugublr) December 10, 2022 There is no value for audience votes in Telugu Bigboss INAYA UNFAIR ELIMINATION pic.twitter.com/BPERApPEBy — vikyath kumar (@vikyath_kumar) December 10, 2022 చదవండి: ఇనయ ఎలిమినేట్ -
శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడని తెలుసు: రేవంత్
దెయ్యాలను చూసి భయపడిపోయిన కంటెస్టెంట్లను చూసి మేము బాగా నవ్వుకున్నామన్నాడు నాగార్జున. ఈ సీజన్లోనే మోస్ట్ ఎంటర్టైనింగ్ వీడియో అంటూ దెయ్యం టాస్కులో కంటెస్టెంట్లు ఏ రేంజ్లో భయపడ్డారో మరోసారి చూపించాడు. తర్వాత అవతలి వాళ్లకంటే నేనే ఎందుకు బెస్ట్, నాకే ఎందుకు ఓట్లు వేయాలో చెప్పమంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. అప్పుడే ఫిట్టింగ్ పెట్టేశారంటూ గొణుక్కున్నాడు రేవంత్. రేవంత్ కన్నా నువ్వెందుకు బెటర్? నీకెందుకు ఓట్లేయాలో చెప్పు అని శ్రీహాన్‌ను ఆదేశించాడు నాగ్. దీనికతడు లేచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తుంటారు. కానీ దాన్ని ఒప్పుకోగలగాలి. ఆ గుణం రేవంత్‌కు లేదు అన్నాడు. అంతలోనే ఇంకో విషయం గుర్తురావడంతో చెప్పొచ్చా? అని పర్మిషన్ అడిగాడు. రేవంత్ ఫ్లిప్పర్, నేను కాదంటావు, అంతేనా.. అని నాగ్ గెస్ చేయగా ఛఛ, అది కాదన్నాడు శ్రీహాన్. మొన్న ఆదిరెడ్డితో అదే అన్నావుగా అని నాగ్ అనగా అలా అనలేదని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే రేవంత్ కలగజేసుకుంటూ శ్రీహాన్ నా వెనకాల మాట్లాడతాడని తెలుసు అంటూ ఉక్రోషానికి లోనయ్యాడు. ఈ మాటతో శ్రీహాన్ ఒక్కసారిగా షాకయ్యాడు. శ్రీహాన్ ఫ్లిప్పర్ అనే పదం వాడాడా? లేదా? అని ఆదిరెడ్డిని అడగ్గా అతడు తనకు గుర్తు లేదని బదులిచ్చాడు. దీంతో నాగ్.. నిన్ను మించిన ఫ్లిప్పర్ లేడులే అంటూ ఉడాల్ మామపై సెటైర్ వేశాడు. చదవండి: ఏమిటేమిటి? ఇనయ ఎలిమినేట్ అయిందా? సీనియర్ నటి దారుణ హత్య, కన్న కొడుకే కొట్టి చంపాడు -
ఏమిటేమిటి? ఇనయ ఎలిమినేట్ అయిందా?
'ఇనయ.. యూ ఆర్ ఎలిమినేటెడ్..' నాగార్జున ఈ మాట అనడాన్ని కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారా? కానీ జరిగేది ఇదేనని తెలుస్తోంది. టాప్ 2లో ఉంటుందనుకున్న ఇనయను అర్ధాంతరంగా ఎలిమినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనక జరిగితే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. బిగ్‌బాస్‌కు వచ్చాక అభిమానులను సంపాదించుకున్నవారిలో ఇనయ ఒకరు. 'మై లైఫ్ మై రూల్స్' అనే ఆమె 'మై గేమ్ మై స్ట్రాటజీస్' అన్నట్లుగా ఆడింది. తన ఆటతీరుకు, ఎవరినైనా ఎదురించే ధైర్యానికి ఎంతోమంది ఫిదా అయ్యారు. తనలో ఉన్న ఫైర్‌ను అలాగే కంటిన్యూ చేస్తే టాప్ 3లో చోటు దక్కించుకోవడం ఖాయం అనుకున్నారంతా. అన్నట్లుగానే నామినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి ఆమెను సేవ్ చేస్తూ వచ్చారు. ఈ వారం కూడా ఆమె నామినేషన్లోకి వచ్చింది. ఎప్పటిలాగే అనధికారిక పోల్స్‌లో మంచి ఓట్ల శాతంతో రెండు, మూడు స్థానాల్లో తచ్చాడుతోంది. శ్రీసత్య, కీర్తి చివరి ప్లేస్ నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ ఈ ఇద్దరిలో ఒకరిని పంపిచేస్తాడనుకుంటే ఎవరూ ఊహించని కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశాడట. అమ్మాయిల్లో ఫిజికల్ టాస్క్‌లలో తోపు పర్ఫామెన్స్ ఇచ్చిన ఇనయను ఎలిమినేట్ చేసినట్లు ఓ వార్త లీకైంది. రేవంత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఇనయను సడన్‌గా ఎలిమినేట్ చేయడమేంటని అప్పుడే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకవేళ బిగ్‌బాస్ కావాలని తప్పుడు సమాచారాన్ని లీక్ చేశాడా? అసలు ఈవారం శ్రీసత్య, కీర్తి, ఇనయలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: లెక్క తేలింది, విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే? -
లెక్క తేలింది, విన్నర్ గెలుచుకునే ప్రైజ్‌మనీ ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 97: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రైజ్‌మనీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. గతంలో దాన్ని కత్తిరించుకుంటూ పోయిన బిగ్‌బాస్ ఈ వారం ఆ కోల్పోయిన డబ్బు తిరిగి పొందేందుకు అవకాశాలిస్తూ పోయాడు. నేటితో ఆ ఛాన్స్‌లకు తెరదించాడు. ఫైనల్ ప్రైజ్‌మనీని ప్రకటించాడు. మరి ఆ అమౌంట్ ఎంతో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! రెండు రోజులగా దెయ్యం టాస్కుతో ఇంటిసభ్యులను హడలెత్తిస్తున్నాడు బిగ్‌బాస్. ఈరోజు శ్రీసత్య, కీర్తిలను చీకటి గదిలోకి పంపించాడు. వీళ్లిద్దరూ గడ్డిని చూసి కూడా గజగజ వణికిపోయారు చివరికి బిగ్‌బాస్ చెప్పిన వస్తువులు తీసుకురావడంతో రూ.20 వేలు ఇచ్చాడు. తర్వాత రోహిత్‌ను ఆ తర్వాత హౌస్మేట్స్ అందరినీ చీకటి గదిలో వేశారు. అక్కడ ఇనయ, కీర్తి దెయ్యాల్లా భయపెడుతూ అందరినీ ఓ ఆటాడుకున్నారు. ఈసారి ఇంటిసభ్యులు మరో రూ.13వేలు గెలిచారు. మనీబాల్ టాస్క్‌లో రేవంత్ రూ.500, రోహిత్ రూ.1500 సాధించాడు. అనంతరం ఆరో సీజన్‌లోని ఐకానిక్ సంఘటనలను మరోసారి ప్రదర్శించి ఎంటర్టైన్ చేయాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఇనయ- శ్రీహాన్‌ల పిట్ట కథ, హోటల్ టాస్క్‌లో శ్రీసత్య- అర్జున్ ఒప్పందం, అర్జున్-రేవంత్ పప్పు గొడవ, మిషన్ పాజిబుల్ టాస్క్‌లోని ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్(బాత్రూమ్ను అశుభ్రపరిచి గొడవ చేసిన గొడవ), కీర్తి వేలు గాయపడ్డ సంఘటన, కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్ గోనె సంచులను తన్నిన సీన్.. వీటన్నింటినీ మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించారు. అందరూ నటించడం కాదు ఏకంగా జీవించేశారు. వీరి యాక్టింగ్ స్కిల్స్‌తో బిగ్‌బాస్‌ను అలరించి రూ.43,000 గెలుచుకున్నారు. అన్ని ఛాలెంజ్‌లు, టాస్కులు పూర్తైన తర్వాత ఫైనల్‌గా విన్నర్ ప్రైజ్‌మనీ రూ.47,00,000కి చేరింది. ఈ సంతోషంలో రేవంత్ పాట పాడగా కీర్తి, శ్రీసత్య డ్యాన్సులేశారు. చదవండి: ఈ వారం డబుల్ ఎలిమినేషన్? ఫైమాకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన పటాస్ ప్రవీణ్ -
డబుల్ ఎలిమినేషన్? ఆమెను పంపించడం ఖాయమా?
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ముగింపుకు వచ్చింది. ప్రారంభంలో పస లేని ఈ షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారింది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా క్లైమాక్స్‌కు వచ్చాక షో వెలుగులు సంతరించుకుంటోంది. మొన్నటికాదా గొడవలు, పగలతో రగిలిపోయిన హౌస్మేట్స్ ఇప్పుడిప్పుడే ఫన్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు మిగిలారు. ఇందులో ఒకరిని బయటకు పంపించే సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలిచి నామినేషన్స్ నుంచి తప్పించుకుని మొట్టమొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. రేవంత్ ఎలాగో విన్నర్ మెటీరియల్ కాబట్టి అతడు ఓటింగ్‌లో ఎప్పటిలాగే టాప్‌లో ఉంటూ వస్తున్నాడు. తర్వాతి స్థానాల్లో ఇనయ, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో శ్రీసత్య, కీర్తి తచ్చాడుతున్నారు. నిజానికైతే ఈ వారం శ్రీసత్య ఎలిమినేట్ కావాల్సిందే! కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత శ్రీసత్యలో చాలా మార్పు వచ్చింది. వెటకారం పూర్తిగా తగ్గించేసింది. గేమ్‌లో తన ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా శ్రీహాన్, రేవంత్‌పైనా అరిచేసింది. వరుస టాస్కులు గెలిచింది. అందరితో కలిసిపోయి గొడవలకు దూరంగా ఉంది. ఫలితంగా ఈ వారం తన గ్రాఫ్ బాగా పెరిగింది. కీర్తి.. తన వేలి నొప్పి కారణంగా పలు టాస్కులు గెలవలేకపోయింది. అలా అని ఆడలేదని కాదు, తనవంతు ప్రయత్నం చేసింది. కానీ ప్రస్తుతం ఉన్నవారిలో ప్రేక్షకులు శ్రీసత్య, కీర్తిలలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని భావిస్తున్నట్లు అనధికారిక పోల్స్ చెప్తున్నాయి. పైగా ఈ వారం శ్రీసత్య గ్రాఫ్ పెరిగి ఓట్ల శాతం పెరగడంతో కీర్తి వెనకబడినట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన కీర్తి ఎలిమినేట్ కావొచ్చేమో, లేదంటే శ్రీసత్య- కీర్తి ఇద్దరినీ బిగ్‌బాస్ బయటకు పంపించేస్తాడేమో! ఈ సీజన్ సిక్స్ కాబట్టి ఫినాలేకు సిక్స్ మెంబర్స్‌ను పంపించే ప్లాన్స్ ఉంటే మాత్రం వీళ్లిద్దరిలో ఏ ఒక్కరో ఎలిమినేట్ కాక తప్పదు. మరి బిగ్‌బాస్ ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు? ఎవరు ఫినాలేకు దూరం కానున్నారో చూడాలి! చదవండి: రోడ్డు మీద చెప్పుల్లేకుండా తిరిగా: శ్రీహాన గర్ల్‌ఫ్రెండ్ సిరి ఫైమాకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన ప్రియుడు -
ఫైమాకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన పటాస్ ప్రవీణ్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో విన్నర్ ఎవరంటే ఇష్టం ఉన్నా లేకపోయినా రేవంత్ అనే చెప్తారు. గెలుపు గాలులు అతడివైవే వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే అతడు హౌస్‌లో ఏం మాట్లాడినా ఎవరూ పెద్దగా ఎదురుచెప్పరు, వార్నింగ్‌లు ఇచ్చినా, తిండి పెట్టకపోయినా గట్టిగా నిలదీసేవారే లేరు, ఒక్క ఫైమా తప్ప! అందరిలా ఆమె చేతులు కట్టుకుని కూచోకుండా తప్పనిపించిన ప్రతిసారి రేవంత్‌ను కడిగి పారేసింది. నేనే తోపు అని ఫీలైన రేవంత్ చేసే తప్పులను అందరి ముందే ఎత్తిచూపింది. కానీ వెటకారం వల్ల గేమ్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. తాజాగా ఆమె.. తన ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా ప్రియుడు పటాస్ ప్రవీణ్ బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఎలా వెల్కమ్ చెప్పారో చూడండంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో వదిలింది. ఇందులో ప్రవీణ్.. ఫైమాతో కేక్ కట్ చేయించాడు. కడప దర్గాలో పూజ చేయించిన నీళ్ల బాటిల్‌ను ఆమె చేతికిచ్చి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నాడు . తర్వాత తన మెడలో ఉన్న బంగారు గొలుసును ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. చదవండి: శ్రీహాన్‌తో బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన సిరి పూజ చేస్తున్న హీరో.. విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు -
శ్రీహాన్‌తో బ్రేకప్‌పై తొలిసారి నోరు విప్పిన సిరి!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో షణ్ను- సిరిల ఫ్రెండ్షిప్ హద్దు మీరిన సంగతి తెలిసిందే! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. తప్పనిపించినా వీడి ఉండలేకపోతున్నామని వాపోయారు. కానీ ఎప్పుడైతే సిరి బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడో అతడికి ముఖం చూపించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది సిరి. ఇక శ్రీహాన్.. నన్ను వదిలేస్తున్నావా? అని ఒక డైలాగ్ విసరడంతో సిరిని మరింత తిట్టిపోశారు నెటిజన్లు. అంత మంచివాడిని ఎలా మోసం చేయాలనిపించిందంటూ నానామాటలన్నారు. కట్ చేస్తే షో అయిపోయాక వాళ్లిద్దరూ ఎప్పటిలాగే కలిసిపోయారు. నెగెటివిటీకి చెక్ పెడుతూ మరింత దగ్గరయ్యారు. ఈసారి శ్రీహాన్ షోలో అడుగుపెట్టాడు. గేమ్ బాగా ఆడుతున్నాడు. కానీ వెటకారం, ఫ్రెండ్షిప్ వల్ల గెలుపుకు దూరం అవుతున్నాడు. అతడికి బయట నుంచి భీభత్సంగా సపోర్ట్ చేస్తోంది సిరి. తాజాగా ఆమె బిగ్‌బాస్ కెఫెలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో విషయాలు మనసు విప్పి మాట్లాడింది. 'ఇంట్లో ఎవరూ శ్రీహాన్‌కు బెస్ట్ ఫ్రెండ్ ట్యాగ్ ఇవ్వలేదు. అది చూసిన నాకే ఎంతో బాధనిపించింది, ఆ పరిస్థితిలో శ్రీహాన్ ఎంత బాధపడ్డాడో! నాకు పెళ్లి కాకుండానే కొడుకు చైతూ ఎలా వచ్చాడనుకుంటున్నారు. అతడు మా మామయ్య కొడుకు. కరోనా సమయంలో వైజాగ్ వెళ్లాం. అప్పుడు మాకు బాగా దగ్గరయ్యాడు. మామయ్యకు ఆరోగ్యం, ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో మేము తెచ్చేసుకుని పెంచుకుంటున్నాం. బహుశా ఏడాదిలోపు మా పెళ్లి కూడా అయిపోతుందనుకుంటా' అని చెప్పుకొచ్చింది. బ్రేకప్ రూమర్స్ గురించి మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ ఐదో సీజన్ తర్వాత మా మధ్య చాలా గొడవలయ్యాయి. బ్రేకప్ వరకూ వెళ్లాము. అతడు నన్ను వదిలి వెళ్లాక నాకు కోవిడ్ వచ్చింది. ఎవరికీ కనిపించకుండా ఎటైనా వెళ్లిపోదామనుకున్నాను. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి రోడ్ల మీద చెప్పులు లేకుండా తిరిగాను. ఫోన్ ఆన్ చేయగానే శ్రీహాన్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే జీవితంలో కనిపించను అని మెసేజ్ పెట్టాడు. వెంటనే నేను కాల్ చేశాను, రోడ్డు మీద తిరుగుతున్న నన్ను వచ్చి తీసుకెళ్లాడు. అలా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు మేము ఎప్పటికీ విడిపోనంత దగ్గరయ్యాం' అని చెప్పుకొచ్చింది సిరి. చదవండి: సూసైడ్ బాంబ్ అనుకొని అరెస్ట్ చేశారు: సత్యదేవ్ శ్రీసత్య, ఇనయల పరువు పాయే -
శ్రీసత్యను నమ్మని శ్రీహాన్, ఇనయ పరువు మొత్తం పాయే!
Bigg Boss 6 Telugu, Episode 96: టాస్కుల్లో, నామినేషన్స్‌లో కయ్యానికి కాలు దువ్వే కంటెస్టెంట్లు దెయ్యం పేరెత్తితే చాలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి, శ్రీహాన్ ఎంత ఘోరంగా వణికిపోయారో నిన్ననే చూశాం. నేడు మిగతా ఇంటిసభ్యుల వంతు వచ్చింది. మరి వారు భయపడ్డారా? భయపడినా సరే గెలిచారా? అనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని శ్రీసత్యకు పిలుపు వచ్చింది. అప్పటిదాకా మిగతావాళ్ల భయాన్ని చూసిన నవ్విన ఆమె తన వంతురాగానే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తలుపు దాటి లోపలకు వెళ్లడానికి తెగ భయపడిపోయింది. కన్ఫెషన్ రూమ్‌లోకి రాకపోతే డబ్బులు కట్ అవుతాయని బిగ్‌బాస్ హెచ్చరించినా ఆమెకు ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఎంతసేపటికీ అలా డోర్ దగ్గరే తచ్చాడుతూ ఉండటంతో లక్ష రూపాయలు కోల్పోయారని చెప్పాడు బిగ్‌బాస్. అనవసరంగా డబ్బులు పోయాయని తెగ ఫీలైన రేవంత్ శ్రీసత్యపై అరిచాడు. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బిగ్ బాంబ్ అనే మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో కీర్తి, శ్రీసత్య, రేవంత్ పోటీపడ్డారు. మిగతా హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో ఇనయ గెలుస్తుందని భావించారు, కానీ అక్కడ శ్రీసత్య విజయం సాధించింది. ఇంటిసభ్యుల అంచనా బోల్తా కొట్టడంతో రూ.64,900 గెలుచుకునే ఛాన్స్ కోల్పోయారని ప్రకటించాడు బిగ్‌బాస్. నేను గెలుస్తానని నా ఫ్రెండ్వైన నువ్వెందుకు నమ్మలేదంటూ శ్రీహాన్‌ను నిలదీసింది శ్రీసత్య. మూడు ఛాలెంజ్‌లు నేనే గెలిచినా కూడా నన్ను నమ్మాలనిపించలేదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలాడు శ్రీహాన్. తర్వాత ఇంటిసభ్యులందరికీ మనీ టవర్ ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రూ.41,500 గెలుచుకున్నారు. అనంతరం వెలిగించు - విజయం సాధించు గేమ్‌లో శ్రీహాన్, శ్రీసత్య పోటీపడ్డారు. హౌస్మేట్స్ ఊహించినట్లుగా శ్రీహాన్ గెలవడంతో రూ.1,23,400 కైవసం చేసుకున్నారు. ఇప్పటిదాకా గెలిచిన ఛాలెంజ్‌ల మొత్తాన్ని కలపగా ప్రైజ్‌మనీ రూ.46,00,000కి చేరింది. దీంతో హౌస్మేట్స్ మరీ ముఖ్యంగా రేవంత్ పండగ చేసుకున్నాడు. తర్వాత దెయ్యం టాస్కులో ఎంతో ధైర్యంగా చీకటి గదిలో అడుగు పెట్టిన ఇనయ అరుపులు, కేకలతో కన్ఫెషన్ రూమ్‌ను దద్దరిల్లేలా చేసింది. అంత భయంలోనూ ఎలాగోలా బిగ్‌బాస్ చెప్పిన షూ తీసుకుని బయటకు రావడం విశేషం. ఈ టాస్క్ గెలవడంతో రూ.12,000 లభించాయి. నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్‌లో అడుగుపెట్టిన రేవంత్ భయపడ్డాడో, భయపడ్డట్లు నటించాడో తెలీదు కానీ దెయ్యం గొంతునే ఇమిటేట్ చేసి అవలీలగా సూర్య కప్పు తీసుకుని వచ్చేశాడు. ఈసారి రూ.10,000 లభించాయి. ఇక దెయ్యం టాస్కులో కీర్తి మాత్రమే మిగిలింది. మరి తనకేమైనా మినహాయింపు ఉందా? లేదంటే రేపటి ఎపిసోడ్లో తనకు కూడా టాస్క్‌లో వెల్కమ్ చెప్తారా? చూడాలి! చదవండి: నాన్న చనిపోయాక ఆఫీస్ బాయ్‌గా మారాను: రాజశేఖర్ నా ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌కు టికెట్లు కావాలి.. హీరో ఆన్సరేంటో తెలుసా? -
చెల్లిని చదివించడం కోసం ఆఫీస్ బాయ్ అవతారమెత్తా
బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్లో నెగెటివిటీని కాకుండా గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోయిన వ్యక్తి రాజశేఖర్. జనాల ఓట్లు పడ్డప్పటికీ లక్ కలిసిరాకపోవడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అతడు ఆఫీస్ బాయ్ నుంచి మోడల్‌గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. మరి ఈ జర్నీ ఎలా సాధ్యమైందో అతడి మాటల్లోనే చదివేయండి.. 'నాది హైదరాబాద్. 2009లో మా నాన్న చనిపోయాడు. నా చెల్లిని చదివించడం కోసం ఆఫీస్ బాయ్‌గా పని చేశాను. కానీ మంచి ఉద్యోగం రావాలంటే చదువు అవసరమని అర్థమైంది. దీంతో ఓపక్క చదువుతూనే మరోపక్క పని చేసేవాడిని. అలా ఆఫీస్ బాయ్‌గా పని చేసిన అదే కార్యాలయంలో రిలేషన్షిప్ మేనేజర్‌గా, సేల్స్ టీమ్ లీడర్‌గా ఎదిగాను. తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు మోడలింగ్ ఆలోచన వచ్చింది. 2015లో మోడలింగ్ మొదలుపెట్టాను. 2018లో మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా నిలిచాను. ఎన్నో బ్రాండ్స్‌కు పని చేశాను. కెరియర్ బిల్డ్ చేసుకునే సమయంలో కరోనా దెబ్బ కొట్టింది. టీవీ ప్రాజెక్ట్స్ చేశాను. అప్పుడు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. టాప్ 5లో ఉంటాననుకున్నాను. కానీ కుదరలేదు ' అని చెప్పుకొచ్చాడు రాజ్. చదవండి: ఆ నటుడు నన్ను మోసం చేశాడు: నిర్మాత సంచలన ఆరోపణలు -
రూ.లక్ష పోగొట్టిన శ్రీసత్యపై రేవంత్ ఫైర్
ప్రైజ్‌మనీని పెంచుకునేందుకు ఇంటిసభ్యులకు సువర్ణావకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఇప్పటిదాకా టాస్కులతో డబ్బు సంపాదించిన హౌస్‌మేట్స్‌కు ఈసారి దెయ్యం టాస్కు ఇచ్చాడు. ఈ దెబ్బతో హడలిపోయిన ఇంటిసభ్యులు మా వల్ల కాదని బెంబేలెత్తుతున్నారు. అయినప్పటికీ భయంతో వణికిపోతూనే ఆదిరెడ్డి, శ్రీహాన్ చీకటి గదిలోకి వెళ్లి బిగ్‌బాస్ చెప్పిన వస్తువులను వెతికి తీసుకొచ్చారు. ఈసారి శ్రీసత్యను డార్క్ రూమ్‌లోకి వెళ్లమన్నాడు బిగ్‌బాస్. కానీ ఆమె మాత్రం నేనొక్కదాన్ని రాలేనంటూ తలుపు బయటే నిల్చుండిపోయింది. విన్నర్ అయ్యేది తనేనని ఫిక్స్ అయిన రేవంత్.. నీ వల్ల డబ్బులు కట్ అయితే మాత్రం సీరియస్ అవుతానని ముందే వార్నింగ్ ఇచ్చాడు. అయినా చివరికి అతడు అన్నట్లే జరిగింది. ఆమె లోపలకు వెళ్లకపోవడంతో లక్ష రూపాయలు కోల్పోయారని బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో శ్రీసత్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రేవంత్. తర్వాత బిగ్ బాంబ్ అనే మరో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో శ్రీసత్య, ఇనయ, రేవంత్ పాల్గొన్నారు. మరి వీరిలో ఎవరు గెలిచారు? ఎవ ఓడిపోయారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: ఇండస్ట్రీలో విషాదం, హాస్యనటుడు కన్నుమూత స్వాతి నా ఆల్‌టైం క్రష్: హరీష్ శంకర్ -
భయపడి చస్తూనే గెలిచేశారుగా, ఇప్పుడు ప్రైజ్‌మనీ ఎంతంటే?
Bigg Boss Telugu 6, Episode 95: ఇప్పటిదాకా నేను ఆడతానంటే నేను ఆడతానని ముందుకు వచ్చిన హౌస్మేట్స్ ఈరోజు దెయ్యం టాస్కులో మాత్రం నావల్ల కాదు బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోయారు. అయినా సరే విడిచిపెట్టని బిగ్‌బాస్ వారిని చీకటి గదిలోకి పిలిచి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఇంతకీ ఈ టాస్కులో వారు గెలిచారా? లేదా? అసలు ప్రైజ్‌మనీ లెక్క సెట్టయిందా? అనే విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! దెయ్యం దెబ్బకు జడుసుకుని చస్తున్నారు హౌస్మేట్స్. మరీ ముఖ్యంగా దెయ్యం పేరెత్తితేనే వణికిపోతున్నాడు ఆదిరెడ్డి. చూడటానికి తాటిచెట్టులా ఉన్నావు, అలా భయపడతావేంటి భయ్యా అని రేవంత్ సెటైర్లు వేశాడు. ఇకపోతే బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు నేడు ఐదో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో రోహిత్, ఆదిరెడ్డి పాల్గొన్నారు. వీరిలో విజేతను ఎంచుకోండంటూ మిగతా ఇంటిసభ్యులకు తలా ఇరవై వేలు అప్పజెప్పాడు బిగ్‌బాస్. ఈ ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి విజయం సాధించాడు. శ్రీసత్య మినహా మిగతా నలుగురు ఆదిరెడ్డికి సపోర్ట్ చేయడంతో వారి దగ్గరున్న మొత్తం కలిపి రూ.80 వేలు గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత పరమాన్నం కోసం కప్పులు తెచ్చుకోండని శ్రీహాన్‌కు చెప్పాడు రేవంత్. అన్నం తిన్నాక పరమాన్నం తింటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో రేవంత్.. నేను మీకు తినమని చెప్పలేదు, కేవలం రుచి చూడమన్నాననంతేనని మాట మార్చాడు. ఈ మాటతో అవాక్కైన శ్రీహాన్, శ్రీసత్య.. ఇందాకే కదా, కప్పులు తెచ్చుకో అన్నావ్ అని నిలదీయగా నేను జస్ట్ టేస్ట్ చూడమన్నాను, ప్రతిదాంట్లో తప్పులు వెతక్కండి అని అలిగాడు. రేవంత్‌కు తన తప్పులు చెప్తే అస్సలు తీసుకోడంటూ అసహనం వ్యక్తం చేశాడు శ్రీహాన్. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఇచ్చిన ఆరో ఛాలెంజ్‌లో శ్రీహాన్, కీర్తి పోటీపడ్డారు. హౌస్మేట్స్ అందరూ నీకే ఓటేస్తారు కాబట్టి బాగా ఆడి గెలవమని శ్రీహాన్‌కు సిగ్నల్స్ ఇచ్చింది కీర్తి. అన్నట్లుగానే ఈ గేమ్‌లో హౌస్మేట్స్ అందరూ శ్రీహాన్‌కే సపోర్ట్ చేయగా అతడు గెలవడంతో ప్రైజ్‌మనీలో రెండు లక్షలు జమయింది. ఈ టాస్కులో కుండ పగలగొట్టగా దాని మట్టి ఏరుకుని తిన్నారు శ్రీసత్య, ఇనయ, కీర్తి. ఇది చూసిన బిగ్‌బాస్.. ఇకనుంచి మీకు రేషన్‌కు బదులుగా మట్టి పంపిస్తే సరిపోతుందా అని ఆటపట్టించాడు. తర్వాత ఇంటిసభ్యులకో డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు. సమయానుసారం కన్ఫెషన్ రూమ్‌కి పిలుస్తానని, అప్పుడు తాను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే డబ్బులు లభిస్తాయన్నాడు. మొదట ఆదిరెడ్డిని పిలిచాడు. కన్ఫెషన్ రూమ్ గదంతా చీకటిగా ఉండటంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు ఆది. గదిలోని క్యాండిల్ వెతికి బయటకు తీసుకెళ్లమని ఆదేశించాడు బిగ్‌బాస్. అతడికి ఎంతసేపటికి క్యాండిల్ దొరకకపోవడంతో ఎవరైనా తోడు కావాలా? అని అడిగాడు. దీంతో అతడు శ్రీహాన్ పేరు చెప్పాడు. ఇక అప్పటికే భయపడి చస్తున్న ఆదిరెడ్డిని తన భయంతో మరింత హడలెత్తించాడు. ఇద్దరూ భయపడి చస్తూనే వస్తువులను వెతికారు. వీరి భయాన్ని చూసి ప్రేక్షకులు నవ్వాపుకోవడం కష్టమే! ఫైనల్‌గా ఇద్దరూ కలిసి క్యాండిల్, గన్ సాధించి పట్టుకోవడంతో మరింత డబ్బు జమైంది. ఫైనల్‌గా ఈ రోజు ఎపిసోడ్ ముగిసే సమయానికి ప్రైజ్‌మనీ రూ. 44,35,100కి చేరింది. చదవండి: రేవంత్ ఫుడ్ గొడవలు, ఇక మారడా? బుట్టబొమ్మతో లవ్‌లో పడ్డ సల్మాన్ ఖాన్ -
వణికిపోయిన శ్రీహాన్, ఆది.. ఉట్టి పిరికిపందల్లా ఉన్నారే!
మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా మాటలో, ఆటలో దూసుకుపోయే ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను భయంతో గజగజ వణికిపోయేలా చేస్తున్నాడు బిగ్‌బాస్. నిన్న దెయ్యం అరుపులతో హౌస్‌మేట్స్‌ను హడలెత్తించిన బిగ్‌బాస్ నేడు వారందరికీ ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. చీకటి గదిలోకి వెళ్లి క్యాండిల్‌ను కనుక్కోవాలని ఆదిరెడ్డికి ఓ పని అప్పజెప్పాడు. కానీ ఆది అడుగు తీసి అడుగు ముందుకు వేస్తే కదా.. భయంతో ఉన్నచోటనే ఉండిపోయాడు. అతడు భయపడటంతో మీకు తోడు కోసం ఎవరినైనా పంపించాలా? అని బిగ్‌బాస్ అడిగాడు. ఇందుకతడు శ్రీహాన్ పేరు చెప్పడంతో అతడిని చీకటి గదిలోకి రమ్మన్నాడు బిగ్‌బాస్. శ్రీహాన్ వచ్చి ధైర్యం చెప్తాడనుకుంటే అరుపులు, కేకలతో ఆదిరెడ్డిని మరింత భయపెట్టాడు. మరి ఇంతకీ వాళ్లిద్దరూ ఆ ఛాలెంజ్ గెలిచారా? లేదా? చూడాలి. చదవండి: కేజీఎఫ్ నటుడు కన్నుమూత -
రేవంత్ ఫుడ్ గొడవలు.. ఇప్పటికైనా మారడా?
మరి కొద్ది రోజుల్లో బిగ్‌బాస్ కథ ముగియనుంది. ఇలాంటి సమయంలో రసవత్తరమైన టాస్కులతో ఆటను రక్తికట్టించాల్సిన బిగ్‌బాస్ సోది టాస్కులిస్తూ మరింత చిరాకు పుట్టిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ ఒక్కరూ విన్నర్ మెటీరియల్ అనిపించకపోవడం సీజన్‌కే పెద్ద మైనస్. కాస్తో కూస్తో అభిమానగణంతో, ఆటతో విన్నర్ అవుతాడనుకున్న రేవంత్ తన ప్రవర్తనతో జనాలకు మరింత చికాకు పుట్టిస్తున్నాడు. ప్రతిదానికీ గొడవలు పడుతూ నేనే తోపు అన్నట్లుగా మాట్లాడుతూ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. తాజాగా అతడు ఇంట్లోవారితో మరోసారి గొడవపడ్డట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఇందులో రేవంత్.. ఫుడ్ కోసం శ్రీహాన్‌ను కప్పు తెచ్చుకోమన్నాడు. అంతలోనే నేను తినమని చెప్పలేదంటూ మాట మార్చాడు. వెంటనే అందుకున్న శ్రీహాన్, శ్రీసత్య.. ఇప్పుడే కప్పు తెచ్చుకోమన్నావ్ కదా అని నిలదీయడంతో రేవంత్ ఉలిక్కిపడ్డాడు. ప్రతిదాంట్లో తప్పులు వెతికితే నావల్ల కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే ఒప్పుకునే ధైర్యం ఉండాలని రేవంత్‌పై శ్రీహాన్ గరమయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు మరో ఛాలెంజ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ అందరూ ప్లాన్ ప్రకారం ఆడి గెలిచినట్లు తెలుస్తోంది. అదెలాగో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం.. శ్రీహాన్ దుప్పట్లో చేరిన శ్రీసత్య ఆ మూడు దెబ్బల వల్ల బాలీవుడ్‌నే వదిలేద్దామనుకున్నా: హీరో -
ఇనయకు దెయ్యం పట్టింది! భయంతో వణికిపోయిన ఆదిరెడ్డి, శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 94: మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు హౌస్‌మేట్స్‌కు వరుస ఛాలెంజ్‌లు విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్‌లలో ఎవరు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో చెప్పాలన్నాడు. అందులో ఎవరు గెలుస్తారో కూడా ముందే ఊహించాలన్నాడు. కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగిస్తానని మెలిక పెట్టాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నేడు రెండో ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రేవంత్, ఇనయ పోటీపడ్డారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.1,10,000 ప్రైజ్‌మనీకి తిరిగి యాడ్ అవుతాయన్నాడు. అందరూ అనుకున్నట్లుగా పిరమిడ్ పడొద్దు అనే ఛాలెంజ్‌లో రేవంత్ విజయం సాధించడంతో రూ.1,10,000 గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత మూడో ఛాలెంజ్ కోసం ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంచుకోమన్నాడు. దీంతో ఆదిరెడ్డి- కీర్తి, శ్రీహాన్- శ్రీసత్య మనీ ట్రాన్స్ఫర్ గేమ్‌లో పోటీపడ్డారు. ఇనయ, రేవంత్, రోహిత్.. ఆదిరెడ్డి టీమ్ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీహాన్- శ్రీసత్య గెలవడంతో వారు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత రేవంత్ ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ పాట పాడగా ఆదిరెడ్డి అందుకనుగుణంగా స్టెప్పులేశాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో ఛాలెంజ్ ప్రవేశపెట్టాడు. పవర్ పంచ్ టాస్క్‌లో రేవంత్, ఇనయ పాల్గొనగా అందరూ ఊహించినట్లు రేవంత్ గెలవడంతో ప్రైజ్‌మనీకి మరో రూ.2 లక్షలు జమయ్యాయి. దీంతో మొత్తం ప్రైజ్‌మనీ రూ.41,10,100కి చేరింది. రాత్రి శ్రీసత్య ఓ దెయ్యం కథ చెప్పింది. ఓ ఫంక్షన్లో ఓ అబ్బాయి వింతగా ప్రవర్తించాడని చెప్పింది. అందరూ ఆ అబ్బాయిని కొడుతున్నా అతడికి చలనం లేకుండా అలాగే నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడని చెప్పింది. ఇంతలో సడన్‌గా దెయ్యం సౌండ్ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్ బెడ్ మీదకు చేరింది. ఇక శ్రీహాన్ అయితే బాత్రూమ్కి వెళ్లడానికి కూడా భయపడ్డాడు. అది గమనించిన శ్రీసత్య కావాలని దెయ్యంలా నవ్వుతూ అతడిని మరింత భయపెట్టింది. ఇక ఇనయ అయితే ఏకంగా దెయ్యం పట్టినదానిలా ప్రవర్తించి ఆదిరెడ్డిని వణికిపోయేలా చేసింది. దెయ్యం భయంతో అందరూ జడుసుకుంటూ, నవ్వుకుంటూ ఏ అర్ధరాత్రికో పడుకున్నారు. చదవండి: స్టేజీపై భార్యను పరిచయం చేసిన హీరో సత్యదేవ్ నేను టాప్5లో ఉండనని తెలుసు, రేవంత్ ఎలిమినేట్ అవ్వాలి: ఫైమా -
రేవంత్‌ను ఎదిరించి మరీ గేమ్ ఆడిన శ్రీసత్య!
మొన్నటిదాకా ప్రైజ్‌మనీ కట్ చేస్తూ కంటెస్టెంట్ల ఆశల మీద నీళ్లు గుమ్మరించాడు బిగ్‌బాస్. తాజాగా ఆ కోల్పోయిన డబ్బులు తిరిగి సంపాదించుకునేందుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సమయానుసారం ఛాలెంజ్‌లు విసురుతూ.. అందులో ఎవరు గెలుస్తారో ముందే ఊహించాలని, కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగి ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తానని ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే ఒక ఛాలెంజ్ ఓడిపోయి, మరో ఛాలెంజ్ గెలిచిన హౌస్మేట్స్ తాజాగా మరో ఛాలెంజ్‌కు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో శ్రీసత్య, రేవంత్ గొడవపడ్డారు. నెక్స్ట్ గేమ్‌కు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వెళ్తారన్నావ్ కదా, ఎందుకు మాట మారుస్తున్నావని నిలదీసింది శ్రీసత్య. మొత్తం అన్ని గేమ్స్ అమ్మాయి- అబ్బాయి కలిసి ఆడతారని నేను చెప్పలేదే అని రేవంత్ అనగా కేవలం మొదటి మూడు రౌండ్స్ మాత్రమేనని కూడా చెప్పలేదు కదా అంది శ్రీసత్య. ప్రతిసారి అబ్బాయిలు మాత్రమే అంటే ఇంకెందుకు గేమ్స్.. మీరే ఆడుకోండి, అమ్మాయిలు ఆడరు అని ఫైర్ అయింది. దీనికి రేవంత్.. నీకు ఆలోచించే శక్తి లేదా? యాటిట్యూడా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రైజ్‌మనీ రూ.39,10,000 ఉండగా దీన్ని రూ.లక్ష పెంచుకునేందుకు ఓ గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. మనీ ట్రాన్స్ఫర్ గేమ్‌లో కీర్తి- ఆదిరెడ్డి, శ్రీసత్య-శ్రీహాన్ ఆడారు. మొత్తానికి రేవంత్‌ను ఎదిరించి మరీ గేమ్ ఆడింది శ్రీసత్య. మరి ఈ ఆటలో ఏ జంట గెలిచింది? మిగతావాళ్లు ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్ చేశారా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఇప్పటికిప్పుడు ఛాన్స్ ఇస్తే రేవంత్‌ను పంపించేస్తా: ఫైమా పైసా వసూల్ కోసం పోటీపడ్డ రేవంత్, ఇనయ -
నేను టాప్ 5లో ఉండనని అప్పుడే ఫిక్సయ్యా: ఫైమా
కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుందనుకుంటే వ్యంగ్యానికి, వెటకారానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది ఫైమా. బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో తన కామెడీతో అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ఫైమా రానురానూ కామెడీని పక్కనపెట్టి గేమ్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌తో గొడవలు, గొడవపడే క్రమంలో వెటకారాలు కనిపించాయి. 13 వారాల తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా తాజాగా బిగ్‌బాస్ కెఫె ఇంటర్వ్యూలో పాల్గొంది. వెటకారాన్ని ఎందుకు తగ్గించుకోలేదని యాంకర్ శివ అడగ్గా తాను బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉన్నానని బదులిచ్చింది. ఇప్పుడు నీకు ఇంట్లో ఉన్న ఒకరిని బయటకు పంపించే అవకాశం ఇస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తావన్న ప్రశ్నకు రేవంత్ పేరు చెప్పింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్ల గురించి ఆమె మాట్లాడుతూ.. స్ట్రాంగ్ అనుకున్న గీతూ వెళ్లిపోయినప్పుడే మా అంచనాలు తారుమారవుతున్నాయనిపించింది. నేను టాప్ 5లో ఉండనని అప్పుడే అర్థమైంది. ఇకపోతే ఆర్జే సూర్య వెళ్లిపోయే వారం రోజుల ముందు నుంచి ఇనయ నాతో సరిగా మాట్లాడటం మానేసింది. కోపంలో చాలా మాటలు అనేస్తుంది. దానివల్ల నేను చాలా హర్ట్ అయ్యాను. కానీ ఆమె గేమ్‌లో మగవాళ్లకు కూడా గట్టి పోటీనిస్తుంది. శ్రీహాన్ గేమ్‌లో ఓడిపోతున్నామని తెలిసినా గెలవడానికే ప్రయత్నిస్తాడు. రోహిత్ ఎవరినీ నొప్పించకుండా మాట్లాడతాడు. ఆదిరెడ్డి ఫెయిర్‌గా ఆడుతున్నాడు, కాకపోతే మరీ ఎక్కువ ఆలోచిస్తాడు, అదే అతడి మైసస్. రేవంత్ గేమ్ స్టార్ట్ అవకముందే అందరికీ వార్నింగ్ ఇస్తాడు. కానీ అంతా అయిపోయాక వచ్చి సారీ చెప్తాడు. కీర్తి స్ట్రాంగ్ ప్లేయర్. శ్రీసత్య మొదట్లో భయపడి ఆడలేదు కానీ తర్వాత గేమ ఆడటం మొదలుపెట్టింది' అని చెప్పుకొచ్చింది ఫైమా. చదవండి: పైసా వసూల్ కోసం పోటీపడ్డ ఇనయ, రేవంత్ -
పైసా వసూల్ కోసం పోటీపడ్డ రేవంత్, ఇనయ
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లకో గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇప్పటివరకు కట్ అయిన డబ్బులను ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తానన్నాడు. కాకపోతే అందుకోసం కొన్ని టాస్కులు గెలవాల్సి ఉంటుందని, ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్ చేయాలని మెలిక పెట్టాడు. అందుకు సరేనంటూ ఎగిరి గంతేశారు హౌస్మేట్స్. అందులో భాగంగా కంటెస్టెంట్లకు నేడు రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అందులో ఇనయ, రేవంత్ పోటీపడ్డారు. మెజారిటీ హౌస్మేట్స్ రేవంత్ గెలుస్తాడని భావించగా అదే నిజమైంది. దీంతో రూ.1,10,000 విన్నర్ ప్రైజ్‌మనీలో తిరిగి యాడ్ అయినట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్ ఇంకా ఏమేం ఛాలెంజ్లిచ్చాడు? ఎంత అమౌంట్ తిరిగి యాడ్ అయిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా? -
బిగ్‌బాస్ సీజన్-6లో టాప్-3లో ఉండేది వాళ్లేనా?
బిగ్‌బాస్ సీజన్-6, ఎపిసోడ్ 93 హైలైట్స్ : ప్రతి సీజన్లో లాగానే ఈసారి కూడా నెంబర్ గేమ్ టాస్క్ జరిగింది. తమ ఆటతీరు కారణంగా ఎవరు ఏఏ స్థానాల్లో ఉండాలో నిర్ణయించుకొని ఆయా నెంబర్స్ వద్ద నిలబడాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. దీని ప్రకారం నామినేషన్స్ కూడా ఉంటాయి. తమకు కావాల్సిన నెంబర్ ర్యాంకింగ్ కోసం హౌస్మేట్స్ వాదించుకోవచ్చు. వాళ్లు చెప్పింది కన్విన్సింగ్‌గా అనిపిస్తే ఆ సభ్యులు తమ ర్యాంకింగ్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఒకేవళ ఒకే ర్యాంక్ కోసం ఇద్దరు నిలబడితే వాళ్లిద్దరూ నామినేషన్స్‌లో ఉండే సందర్భాలు ఉన్నాయి. ఈ టాస్కులో మొదటగా రేవంత్ నెం1 స్థానంలో నిలుచున్నాడు. ఆ తర్వాత ఇనయా, కీర్తి, సత్యలు నిల్చుంటారు. ఇక 5,6,7 స్థానాల్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్‌లు ఉంటారు. బయట ఎలా ఉన్నానో.. ఇక్కడ కూడా అలాగే ఉన్నాను అంటూ రేవంత్ నెం1 స్థానంలో నిలబడ్డాడు. శ్రీహాన్ అయితే.. ‘నేను చేసింది తప్పు అని యాక్సెప్ట్ చేసే ధైర్యం కొంతమందికే ఉంటుంది.. దాంట్లో నేను ఒక్కడ్ని.. నాకు కావాల్సింది మొదటి స్థానం’ అంటూనే వెళ్లి 5వ స్థానానికి పరిమితం అవుతాడు. అయితే తమ నెంబర్ ర్యాంకింగ్స్ కోసం పోటీపడ్డ ఇంటి సభ్యులు టాస్క్ ముగిసిన సమయానికి రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డిలు తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇనయా, శ్రీసత్యలు 4, 5 స్థానల్లో నిల్చోగా, రోహిత్ 6వ స్థానంలో చివరగా కీర్తి 7వ స్థానంలో సెటిలైపోయింది. మరి హౌస్మేట్స్ అనుకున్నట్లుగా విన్నింగ్ ర్యాంకింగ్స్ కూడా ఉంటాయా? లేదా అన్నది చూడాల్సి ఉంది. -
బిగ్‌బాస్ 6: హాట్‌టాపిక్‌గా ఫైమా రెమ్యునరేషన్! 13 వారాలకు ఎంతంటే?
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ 6 తెలుగు 14వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం ఎలిమినేషన్లో భాగంగా ఫైమా హౌజ్‌ను వీడింది. ఫన్ అండ్ గేమ్ రెండూ కలిపి కొట్టే ఫైమా ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో కాస్తా సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. 13వ వారం మొదటి నుంచి కీర్తి ఎలిమినేట్ అవుతుందనే అభిప్రాయలు వ్యక్తం అవగా అనూహ్యంగా ఫైమా బిగ్‌బాస్‌ను వీడింది. ఇది ఆమె ఫాలోవర్స్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఆమె చేసిన కొన్ని పొరపాటు వల్ల నెగిటివిటి రావడంతో చివరికి ఫైమా బయటకు వచ్చేసింది. రోహిత్‌ను ఫైమా తిట్టడం వల్లే ఆమెకు నెగిటివిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏదేమైన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ఫైమా ఎలిమినేట్ అవ్వడం పలువురిని షాక్‌కు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే 13 వారాలకు గానూ ఫైమా తీసుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జబర్దస్త్ లేడీ కమెడియన్‌గా మంచి ఆదరన పొందిన ఫైమాకు ఎంత రెమ్యునరేషన్ అందిందనేది ఆసక్తిని సంతరించుకుంది. దీంతో తను తీసుకున్న మొత్తం ఎంత అని నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఫైమా రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం బిగ్‌బాస్ నుంచి ఫైమాకు భారీగానే పారితోషికం అందినట్లు తెలుస్తోంది. కాగా ఒక్కొక్కొ వారానికి గానూ ఫైమాకు బిగ్‌బాస్ రూ. 25వేల నుంచి 30 వేలు ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం చూస్తే 13 వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఫైమా కొనసాగింది. కాబట్టి మొత్తంగా ఆమెకు 3 లక్షల 25 వేలు ఆ పైచిలుకు పారితోషికం అందినట్లు తెలుస్తోంది. ఒక విధంగా చూస్తే ఇది ఆమెకు మంచి రెమ్యునరేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రియాలిటీ షోలు చేసినప్పుడు ఆమెకు ఎప్పుడు కూడా ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ వచ్చింది లేదు. ఇక ఇప్పుడు కెరీర్ మొత్తంలో ఆమెకు ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ రావడంతో ఫైమా ఫుల్ ఖుషిలో ఉన్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం. మరి బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌తో ఫైమా తదుపరి కెరీర్ ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇకపై ఫైమా జబర్దస్త్‌లో కనిపిస్తుందా? లేదా? అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. చదవండి: నెక్ట్స్ మహానటి ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ పేరు చెప్పిన అగ్ర నిర్మాతలు నిర్మాతపై దుష్పచారం, నటుడు యోగిబాబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు -
ఫైమా ఎలిమినేట్, ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున
Bigg Boss Telugu 6, Episode 92: బిగ్‌బాస్ ఆరో సీజన్లో మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఫన్ అండ్ గేమ్ రెండూ కలిపి కొట్టే ఫైమా ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. ఈరోజు హౌస్‌లో హిట్ 2 చిత్రయూనిట్ స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసి ఎంటర్టైన్ చేశారు. మరి నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. జీవితాంతం ఎవరు ఫ్రెండ్‌గా ఉంలనుకుంటున్నారు? ఎవరిని జీవితంలో అసలు ఫ్రెండ్‌గా వద్దనుకుంటున్నారో చెప్పాలంటూ చిన్న టాస్క్ ఇచ్చాడు నాగార్జున. దీనికి ఆది.. ఫైమాను ఫ్రెండ్ అని, ఇనయతో అంత ఫ్రెండ్షిప్ ఉండదంటూ ఆమె ఫోటోను డస్ట్‌బిన్‌లో వేశాడు. ఇనయ.. కీర్తిని ఫ్రెండ్‌గా, శ్రీహాన్‌తో ఫ్రెండ్షిప్ డౌటేనంటూ అతడి ఫోటోను చించేసింది. శ్రీహాన్ వంతు రాగా రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆదిరెడ్డి నెల్లూరులో ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలిసే ఛాన్స్ ఉండదని అతడి ఫోటోను చించేశాడు. రోహిత్.. రేవంత్ ఫ్రెండ్ అని, ఫైమాతో స్నేహం కట్ అవుతుందేమోనన్నాడు. ఫైమా.. ఆదిరెడ్డి తన జీవితాంతం ఫ్రెండ్ అని రోహిత్‌తో ఎక్కువ కనెక్షన్ లేదని చెప్పింది. కీర్తి.. ఇనయ ఫ్రెండ్ అంటూ శ్రీహాన్‌కు కటీఫ్ చెప్పింది. రేవంత్.. శ్రీసత్యతో దోస్తానా చేస్తానని, కీర్తి తనను తక్కువ అర్థం చేసుకుంటుందంటూ సైడ్ చేశాడు. శ్రీసత్య.. ఎక్కువ గొడవపడేది, ఎక్కువ క్లోజ్ అయింది రేవంత్‌తోనే అంటూ అతడే లైఫ్‌టైమ్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇంట్లో అందరికన్నా రోహిత్‌తో తక్కువ కనెక్షన్ ఉందని తన ఫొటోను చెత్తబుట్టలో పడేసింది. తర్వాత హిట్ 2 హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. ఇక అడివిశేష్‌కు ఓ కేసు అప్పజెప్పాడు నాగ్. బిగ్‌బాస్ హౌస్‌లో అద్దంపై కోడిబుర్ర అని రాసిందెవరో కనిపెట్టమన్నాడు. శేష్ ఎంతో ఈజీగా ఆ బొమ్మ గీసింది రేవంతేనని కనిపెట్టాడు. తర్వాత ఇంటిసభ్యులతో మూవీ డంబ్ షేర్ ఆర్ట్స్ ఆడిస్తూ వారికోసం కొన్ని సినిమా పోస్టర్లను అంకితమిచ్చాడు. అనంతరం ఫైమా ఎలిమినేట్ కావడంతో ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. స్టేజీమీదకు వచ్చిన ఫైమాతో ఎవరితో ఫన్? ఎవరితో ఫ్రస్టేషన్? చెప్పాలన్నాడు నాగ్. దీనికి ఫైమా ఫన్ కేటగిరీలో ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయ, రోహిత్‌లను చేర్చింది. రేవంత్‌ను ఫ్రస్టేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంది. ఇక ఫైమాకు చేతిని ముద్దుపెట్టుకుంటే చక్కిలిగిలి పుడుతుందని తెలియడంతో నాగార్జున ఆమె చేతిని ముద్దాడాడు. ఆమెకు వీడ్కోలు పలికిన అనంతరం నాగ్ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్ విన్నర్ రూ.25 లక్షల విలువైన 605 గజాల ప్లాట్ కూడా సొంతం చేసుకుంటారని చెప్పాడు. చదవండి: సెలూన్ అమ్మేసి పాత ఇల్లు కొన్న జబర్దస్త్ కమెడియన్ తండ్రి మాట వినకపోతే బన్నీలా తయారవుతారు: బండ్ల గణేశ్ -
ఆదిరెడ్డితో ఫ్రెండ్షిపే వద్దన్న శ్రీహాన్, రోహిత్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో రోహిత్ మినహా అందరూ ఏదో ఒక వారం కెప్టెన్ అయ్యారు. ఇప్పటికే ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? అని ఆరా తీస్తే ఇనయ బెస్ట్, ఆదిరెడ్డి వరస్ట్ కెప్టెన్ అని తేలింది. ఇక ఈ రోజు మరో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు నాగ్. హౌస్ నుంచి బయటకు వెళ్లాక జీవితాంతం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎవరితో ఫ్రెండ్షిప్ను ఇక్కడే కట్ చేస్తారని అడిగాడు. దీనికి శ్రీహాన్, రోహిత్.. రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆది రెడ్డిని తరచూ కలవడం కష్టమని చెప్పారు. కీర్తి మాట్లాడుతూ.. ఇనయ బాగా క్లోజ్ అయిందని చెప్పింది. తర్వాత రేవంత్ తెలివిగా అబ్బాయిల్లో నుంచి శ్రీహాన్, అమ్మాయిల్లో నుంచి శ్రీసత్య జీవితాంతం స్నేహితులుగా ఉండిపోతారని చెప్పాడు. ఇక హౌస్మేట్స్ వ్యక్తిత్వానికి సరిపోయేలా కొన్ని సినిమా పోస్టర్లను వారికి అంకితం చేశాడు బిగ్‌బాస్. అలా శ్రీసత్యకు అందాల రాక్షసి పోస్టర్, శ్రీహాన్‌కు దేశముదురు, ఇనయకు ఓ పిట్టకథ ఇలా పోస్టర్లు వేసుకుంటూ వెళ్లారు. చదవండి: బ్యూటీ సెలూన్ అమ్మి పాత ఇల్లు కొన్న కమెడియన్ క్రికెటర్‌తో లవ్.. మా మధ్య స్నేహం చెడింది: నటి -
హీరో అడివి శేష్‌కు ఆదిరెడ్డి కౌంటర్.. పగలబడి నవ్విన నాగ్
బిగ్‌బాస్ స్టేజీపైకి హిట్ 2 హీరో అడివి శేష్ వచ్చాడు. వచ్చీరాగానే అతడికో కేస్ అప్పజెప్పాడు నాగార్జున. అతడు వచ్చేముందే ఇంటిసభ్యుల్లో ఎవరైనా అద్దంపై కోడి బుర్ర అని రాసి దానిపై హారర్ బొమ్మ వేయమని సూచించాడు. తర్వాత అడివి శేష్‌ను పిలిచి ఆ బొమ్మ గీసిన నేరస్తుడిని పట్టుకోమని సవాలు విసిరాడు. ఆ బొమ్మ చూసిన అడివి శేష్ నన్ను కోడిబుర్ర అంటున్నారా? అని అడగడంతో అందరూ ఫక్కుమని నవ్వేశారు. ఇక శేష్ తనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి బొమ్మ గీసిందెవరో కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, నువ్వే గీశావా? అని అడగ్గా కనుక్కోవాల్సింది మీరు కదా సర్ అంటూ కౌంటరిచ్చాడు ఉడాల్ మామ. దీంతో నాగార్జున పగలబడి నవ్వాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఫన్ గేమ్స్ ఆడించాడు. మరి అడివి శేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఈ వారం ఆమె ఎలిమినేట్, సీజన్ బెస్ట్ కెప్టెన్ ఎవరంటే? కాబోయే భర్తను పరిచయం చేసిన బాహుబలి సింగర్ -
ఈ వారం ఆమె ఎలిమినేట్, సీజన్లోనే బెస్ట్ కెప్టెన్‌గా ఇనయ!
Bigg Boss Telugu 6, Episode 91: రేవంత్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడు తండ్రైన శుభవార్తను చెప్పాడు. డిసెంబర్ 1న రాత్రి 11 గంటలకు నాకు లక్ష్మీదేవి పుట్టిందంటూ అతడు ఇంటిసభ్యులతో ఈ గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. తర్వాత శ్రీహాన్, రేవంత్ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడగా శ్రీహాన్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్టుగా అవతరించాడు. ఇక నాగార్జున వచ్చీరాగానే ఈ 13 వారాల్లో మీరు రిగ్రెట్ అయిన వారం ఏంటి? దేనికోసం ఫీలయ్యారో చెప్పాలన్నాడు. దీనికి ఫైమా ఆరోవారం సుదీపతో మాట్లాడిన విధానం వల్లే నాకు వెటకారం అన్న ట్యాగ్ వచ్చిందని బాధపడింది. తర్వాత ఇనయ మాట్లాడుతూ.. తొమ్మిదోవారంలో నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి నానామాటలు అన్నాను, అలా అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. శ్రీహాన్ వంతు రాగా.. ఫ్యామిలీ వీక్ (12వ వారం)లో సిరి చెప్పడం వల్ల నా వెటకారంతో కీర్తి బాధపడుతుందని తెలిసింది. అలా చేయకుండా ఉండాల్సిందన్నాడు. కీర్తి మాట్లాడుతూ.. 13వ వారంలో టికెట్ టు ఫినాలే రేసులో టవర్ టాస్కును తన్నకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చింది. ఫస్ట్ వీక్ నుంచి ఆరో వారం వరకు నేను కోపతో ఏది పడితే అది అనేశాను. ఎనిమిదోవారం చేపల టాస్కులో ఫిజికల్‌గా ఆది, గీతూ, ఇనయలను బాధపెట్టాను. 13వ వారం ఆదిరెడ్డి రెచ్చగొట్టేసరికి ఓవర్‌గా రియాక్ట్ అయ్యాను, ఇవన్నీ నా పొరపాట్లేనని అంగీకరించాడు రేవంత్. 12వ వారం కెప్టెన్సీ టాస్కులో ఇనయను నమ్మి పెద్ద తప్పు చేశానన్నాడు రోహిత్. 2వ వారంలో నాకు దెబ్బలు తగులుతాయన్న భయంతో గేమ్ ఆడకుండా కూర్చున్నా, 11వ వారంలో కీర్తిని ఇమిటేట్ చేశా.. అదే నా రిగ్రెట్ అని చెప్పింది శ్రీసత్య. 2వ వారంలో నేను కూడా దెబ్బలు తగులుతాయేమోనని పెద్దగా ఆడలేదు, 9వ వారంలో మైక్ విసిరికొట్టాను, 11వ వారంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల యూజ్ ఉండదు అని అందరిముందు చెప్పడం తప్పనిపించింది. అమ్మాయిల విషయంలో ఓవర్ సెన్సిటివ్‌గా ఆడటం కూడా తప్పేనన్నాడు ఆదిరెడ్డి. తర్వాత నాగార్జున ఎవరు బెస్ట్ కెప్టెన్? ఎవరు వరస్ట్ కెప్టెన్? చెప్పాలంటూ గేమ్ ఆడించాడు. కంటెస్టెంట్ ఉత్తమ కెప్టెన్ చెత్త కెప్టెన్ రోహిత్ కీర్తి ఆదిరెడ్డి ఆదిరెడ్డి ఇనయ శ్రీసత్య శ్రీసత్య ఇనయ ఆదిరెడ్డి ఇనయ శ్రీసత్య శ్రీహాన్ శ్రీహాన్ ఇనయ ఆదిరెడ్డి కీర్తి ఫైమా శ్రీహాన్ ఫైమా ఇనయ రేవంత్ రేవంత్ ఆది రెడ్డి ఇనయ ఫైనల్‌గా హౌస్ మొత్తం ఇనయను బెస్ట్ కెప్టెన్‌గా, ఆదిరెడ్డిని వరస్ట్ కెప్టెన్‌గా నిలబెట్టింది. ఇకపోతే రేవంత్ అమ్మాయిలే వీక్ అని మాట్లాడాడని ఆదిరెడ్డి ఎప్పటినుంచో వాదిస్తూ వస్తున్నాడు. గతవారం ఈ విషయమై రేవంత్ అలా అనలేదని నాగార్జున క్లారిటీ ఇస్తూ వీడియో కూడా చూపించాడు. అయినప్పటికీ ఆది మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా పూర్తి వీడియోలో రేవంత్ ఆ మాట అన్నాడంటూ మొండిగా వ్యవహరించాడు. దీంతో నాగ్ ఈసారి పూర్తి వీడియో చూపించాడు. మొత్తం వీడియో చూపించాక రేవంత్ ఆడపిల్లలు వీక్, వాళ్లు వస్తే ఈజీగా ఆడేయొచ్చు అని అన్నాడా? లేదా? అని ఇనయ, కీర్తి, ఫైమాలను అడగ్గా వారు ముక్తకంఠంతో లేదని చెప్పారు. దీంతో నాగార్జున.. ఆది నాన్సెన్స్ మాట్లాడుతున్నావు, ఇకమీదట దీన్ని సాగదీయకుండా ఇక్కడితో ఆ ప్రస్తావనే ఆపేసేయ్ అని వేడుకున్నాడు. అనంతరం నాగ్.. రేవంత్‌ను సర్ప్రైజ్లో ముంచెత్తాడు. అతడికి తన భార్యాబిడ్డలతో మాట్లాడే అదృష్టాన్ని కల్పించాడు. వీడియో కాల్ ద్వారా స్క్రీన్‌పై భార్యాబిడ్డను చూసుకుని రేవంత్ మురిసిపోయాడు. ఈ సమయంలో నేను నీకు తోడుగా లేనందుకు సారీ అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత.. పెదవే పలికిన మాటల్లోన సాంగ్ పాడి దాన్ని అందరు తల్లులకు డెడికేట్ చేశాడు. ఇకపోతే ఈ వారం ఫైమా ఎలిమినేషన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. చదవండి: వంద కోట్ల దాకా పోగొట్టుకున్నాను, జయసుధ కూడా అంతే: చంద్రమోహన్ మహేశ్‌బాబు అలా అనగానే కన్నీళ్లు ఆగలేదు: అడివి శేష్ -
భార్యతో రేవంత్ వీడియోకాల్, కూతుర్ని చూసి భావోద్వేగం
బిగ్‌బాస్ కంటెస్టెంట్, సింగర్ రేవంత్ తండ్రైన విషయం తెలిసిందే! అతడి భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను బిగ్‌బాస్ రేవంత్‌కు చేరవేయడంతో అతడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇక నాగార్జున ఏకంగా అన్వితతో వీడియో కాల్ మాట్లాడించడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన ఇంటి మహాలక్ష్మిని చూసి ఎమోషనలయ్యాడు రేవంత్. ఈ సమయంలో భార్య పక్కన లేకుండా పోయానని, తన బిడ్డను ఎత్తుకోలేకపోయానని కొంత బాధపడ్డాడు. తన ఇంటి మహాలక్ష్మి, జూనియర్ రేవంత్ కోసం అద్భుతమైన పాట పాడాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రేవంత్ పాట పాడుతుంటే మా కళ్లలో నీళ్లు వచ్చేశాయి, రేవంత్ పాపను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: టికెట్ టు ఫినాలే గెలిచిన ఒకే ఒక్కడు విన్నర్‌గా.. మరి శ్రీహాన్‌కు సాధ్యమేనా? మహేశ్‌బాబు అలా అనగానే కన్నీళ్లొచ్చాయి: అడివి శేష్ -
టికెట్ టు ఫినాలే గెలిస్తే ఓటమి ఖాయమేనా?
బిగ్‌బాస్ షోలో ముఖ్యమైన ఘట్టం టికెట్ టు ఫినాలే. నిజంగానే టికెట్ టు ఫినాలే గెలవడం అవసరమా? ఇది గెలవకుండా ఫినాలేలో అడుగుపెట్టలేరా? ఇది గెలిచినవారు ఇంతకుముందు ఎవరైనా కప్పు కొట్టారా? లేదా? ఈ వివరాలన్నీ ఓసారి చదివేద్దాం.. బలమైన కంటెస్టెంట్‌కు భారీ అభిమానగణం తోడైతే వారికి టికెట్ టు ఫినాలే అవసరమే లేదు. అది లేకుండానే ఈజీగా ఫినాలేకు వెళ్లొచ్చు. కానీ రిస్క్, టెన్షన్ లేకుండా టాప్ 5లో చోటు దక్కించుకోవాలంటే మాత్రం టికెట్ టు ఫినాలే గెలుచుకోవాల్సిందే! నిజానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన మొదటి సీజన్లో టికెట్ టు ఫినాలే ప్రస్తావనే లేదు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్లో సామ్రాట్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫినాలేలో మొదటగా అడుగుపెట్టాడు. కానీ విజేతగా అవతరించలేకపోయాడు. నాగార్జున హోస్ట్‌గా చేసిన మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని మొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. అంతేకాకుండా ఆ సీజన్ విజేతగానూ అవతరించాడు. ఈ టికెట్ గెలిచి కప్పు కొట్టిన మొట్టమొదటి వ్యక్తిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. నాలుగో సీజన్లో టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. ఐదో సీజన్లో శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే సాధించాడు. కాకపోతే ఓ టాస్క్‌లో శ్రీరామ్ కాళ్లు సహకరించకపోవడంతో అతడి తరపున సన్నీ, షణ్ముఖ్‌లు టాస్క్‌లు పూర్తి చేసి అతడిని గెలిపించడం విశేషం. ఈ ఐదు సీజన్స్ గమనిస్తే టికెట్ టు పినాలే గెలిచినవారిలో రాహుల్ సిప్లిగంజ్ మినహా ఎవరూ విజేతలుగా నిలవలేకపోయారు. అఖిల్ ఒక్కడే కనీసం రన్నరప్ దాకా వచ్చి ఆగిపోయాడు. మరి ఈ సీజన్లో శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి అతడు విన్నర్ లేదా రన్నర్ అవుతాడా? ప్రస్తుతం అనధికారిక పోల్స్ చూస్తే రేవంత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఉన్న కొద్ది రోజుల్లో తన గ్రాఫ్ పెంచుకుని శ్రీహాన్ విన్నర్ అవుతాడా? కనీసం రన్నరప్‌గా అయినా నిలుస్తాడా? అనేది చూడాలి! చదవండి: మహేశ్‌బాబుతో మాట్లాడా, ఆయన అలా అనేసరికి కన్నీళ్లొచ్చాయి ఆ ముగ్గురూ వేస్ట్, అంత భయముంటే బిగ్‌బాస్‌కు రావొద్దు: రేవంత్ -
ముగ్గురమ్మాయిలపై రెచ్చిపోయిన కంటెస్టెంట్లు, తగ్గేదేలేదన్న రోహిత్
Bigg Boss 6 Telugu, Episode 90: 'టికెట్ టు ఫినాలే' ఛాలెంజ్ రేసులో రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్ ఐదుగురు మిగిలారు. అయితే తదుపరి ఛాలెంజ్‌లో వీరిలో నుంచి ముగ్గురు మాత్రమే పోటీపడాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఎవరికి వారు నేను తప్పుకోనంటే నేను తప్పుకోనంటూ వాదులాటకు దిగారు. దీంతో ఆ ముగ్గురు ఎవరో డిసైడ్ చేయండంటూ సంచాలకులైన ఇనయ, కీర్తి, శ్రీసత్యలపై భారం వేశాడు బిగ్‌బాస్. ఈ ముగ్గురు.. స్కోర్ బోర్డులో చివర్లో ఉన్న ఫైమా, రోహిత్, రేవంత్‌లను సెలక్ట్ చేశారు. టాప్‌లో ఉన్నవాళ్లను తీసేసి వేరేవాళ్లకు ఛాన్స్ ఇవ్వడమేంటి? ఈ సీజన్లో ఇదే వరస్ట్ డెసిషన్ అని చిరాకుపడ్డాడు ఆది. ఆలోచనలో పడ్డ రోహిత్.. టాప్ పొజిషన్లో ఉన్న వాళ్లను తీసేసి చివర్లో ఉన్న తనను ఆడేందుకు సెలక్ట్ చేయడం కరెక్ట్ కాదని భావించి గేమ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించాడు. అంటే గేమ్ ఆడనని చెప్తున్నావా? అని ఇనయ అడగడంతో శ్రీహాన్ ఫైరయ్యాడు. ఆటలో నుంచి తప్పుకుంటున్నవాళ్లను ఎందుకు బతిమాలుతున్నావు? అందరికీ ఛాన్స్ ఇవ్వడానికి ఇది ఫన్డే గేమ్ కాదని చురకలంటించాడు. దీంతో వెనక్కు తగ్గిన సంచాలకులు తమ నిర్ణయం మార్చుకుని రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఆడుతున్నారని చెప్పారు. చివర్లో ఉన్న రోహిత్ ఆడను అన్నందున చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఫైమాను కూడా తొలగించామని ఇనయ స్పష్టతనిచ్చింది. ఈ ఒక్కమాటతో గేమ్‌లో ఉన్నవాళ్లంతా నిప్పులు చెరిగారు. ఇంతకుముందు ఓమాట ఇప్పుడో మాట అంటూ సంచాలకులను తిట్టిపోశారు. రోహిత్ అయితే నా వల్ల ఫైమాను తొలగించామంటారేంటి? అంటూ ఇనయ మీద మండిపడ్డాడు. అయితే టాప్ 3 లేదంటే లాస్ట్‌లో ఉన్న 3 మెంబర్స్‌నే ఆడించాలనుకున్నాం అని సంచాలకులుగా చెప్తున్నా.. అది మీరెలా డిసైడ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. అసలేం సంచాలకులు వీరు, ముగ్గురూ వేస్టే.. అంత భయమున్నప్పుడు బిగ్‌బాస్‌కు రాకూడదు అంటూ రేవంత్ మరోసారి తన నోటిదురుసు ప్రదర్శించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లో రేవంత్ గెలవగా శ్రీహాన్, ఆది తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. సెకండ్ లెవల్ ముగిసే సమయానికి రేవంత్ 15, శ్రీహాన్, ఆది 14, ఫైమా 7, రోహిత్ 6 పాయింట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. సమాన పాయింట్లు వచ్చిన ఆది, శ్రీహాన్‌లకు ఓ గేమ్ ఇవ్వగా అందులో శ్రీహాన్ గెలిచాడు. దీంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రేవంత్, శ్రీహాన్ టికెట్ టు ఫినాలే రేస్ కోసం పోటీపడ్డారు. ఇకపోతే శ్రీహాన్ టికెట్ టు ఫినాలే సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్టుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్ ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆది -
బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యే పోటీ, ఫినాలేలో అడుగుపెట్టింది అతడే!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ కథ క్లైమాక్స్‌కు చేరువైంది. టికెట్ టు ఫినాలేతో టాప్ 5లో ఎవరు మొదట అడుగుపెడతారనేది తేలిపోనుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం మరో రెండు వారాల్లో సీజన్‌కు కొబ్బరికాయ కొట్టేయడం ఖాయం. ఇకపోతే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో ఏకాభిప్రాయం అంటూ పదేపదే హౌస్‌మేట్స్‌ను ఇరుకునపెడుతున్నాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో ఇప్పటికే కీర్తి, ఇనయ, శ్రీసత్య అవుట్ అయిపోగా మిగతా ఐదుగురు రేసులో ఉన్నారు. ఈ పోటీలో చివరగా శ్రీహాన్, రేవంత్ మిగలగా శ్రీహాన్ గెలిచి టికెట్ టు ఫినాలే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి శ్రీహాన్ ఈ టికెట్ టు ఫినాలే గెలవకపోయినా ఈజీగా టాప్ 5లో ఉంటాడు. ఏదేమైనా ఈ సీజన్లో మొదటి ఫైనలిస్టుగా నిలిచిన శ్రీహాన్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు అభిమానులు. చదవండి: జూబ్లీహల్స్లో 84 ఎకరాల ఫామ్ హౌస్ ప్రముఖ నటి కన్నుమూత -
సినిమాలు, సిరీస్‌లతో అర్జున్ కల్యాణ్ బిజీబిజీ!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో అడుగుపెట్టిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో అర్జున్ కల్యాణ్ ఒకరు. అయితే ఆటకు అదృష్టం కూడా తోడైతేనే హౌస్‌లో ఉండగలరు. ఈ రెండూ అతడికి కలిసి రాకపోవడంతో ఏడో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు అర్జున్. ఒకసారి అతడి నేపథ్యం ఏంటో చూసేద్దాం.. అర్జున్ కల్యాణ్ అమెరికాలో మాస్టర్స్ చేసి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమమ్, వరుడు కావలి, ప్లే బాక్ వంటి సినిమాలలో అర్జున్ చేసిన పాత్రలు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. మిస్సమ్మ, నారి నారి నడుమ మురారి వంటి వెబ్ సిరీస్‌లతో మరింత ఆదరణ లభించింది. ప్రస్తుతం అతడు మాటే మంత్రము, బాబు - నెంబర్ 1 బుల్ షిట్ గయ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే మరో సినిమాతో పాటు ఓ వెబ్‌సిరీస్ చర్చల దశలో ఉంది. ఇలా నటుడిగా ఆదరణ పొందుతున్న సమయంలో బిగ్‌బాస్ షో అర్జున్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ షోలో తనను ఎంతగానో ఆదరించిన ఆడియన్స్ మున్ముందు తాను చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లను కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాడు అర్జున్. చదవండి: మచ్చలేని మనిషి.. రోహిత్‌కు దండాలు పెడుతున్న ఆడియన్స్ ప్రముఖ నటి కన్నుమూత, రాష్ట్రపతి సంతాపం -
ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆదిరెడ్డి
ఏకాభిప్రాయం అనే ఒకే ఒక్క మాటతో హౌస్‌మేట్స్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు బిగ్‌బాస్. ఇంత దూరం వచ్చాక కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా మీలో మీరు కొట్టుకు చావండి, కానీ మీలో కొందరినే గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేసుకోమనడంతో కంటెస్టెంట్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసులో ఇనయ, శ్రీసత్య, కీర్తి గేమ్ నుంచి అవుట్ అయ్యారు. మిగిలిన ఐదుగురిలో ఏ ముగ్గురు నెక్స్ట్ ఛాలెంజ్ ఆడతారో ఏకాభిప్రాయానికి వచ్చి వారి పేర్లు చెప్పమన్నాడు బిగ్‌బాస్. ఎవరికి వారు నేను ఆడతానంటే నేను ఆడతాననడంతో సంచాలకులైన మిగతా ముగ్గురికి ఆ బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఇనయ.. స్కోర్ బోర్డులో టాప్‌లో ఉన్న ఆదిరెడ్డి, శ్రీహాన్‌ను తొలగించి రేవంత్, ఫైమా, రోహిత్ ఆడతారని వెల్లడించింది. ఇది విన్న ఆదిరెడ్డి ఈ సీజన్లో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదేనని ఫైరయ్యాడు. ఈ గొడవంతా ఎందుకనుకున్న రోహిత్ తాను ఆట నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటానన్నాడు. గేమ్ ఆడాలి కానీ ఫెయిర్‌గా కూడా ఆడాలి అంటూ రోహిత్ మిగతావారికి ఛాన్స్ ఇస్తూ సైడ్ అయిపోయాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రోహిత్ ఆటలో గాని మాటలోగాని మచ్చలేని మనిషి అని మెచ్చుకుంటున్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: విర్రవీగుతున్న రేవంత్, తప్పు చేసి అవతల వాళ్లను నిందించటమే పని! తండ్రయిన సింగర్ రేవంత్ -
తండ్రైన సింగర్ రేవంత్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత
బిగ్‌బాస్ సీజన్-6 టైటిల్ గెలవకముందే సింగర్ రేవంత్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్ మొదటిసారి తండ్రయ్యాడు. రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయానికే అన్విత నిండు గర్భిణి. హౌస్‌లో ఉన్న సమయంలోనే ఆమె సీమంతం కూడా జరిగింది. ఆ వీడియోను చూసి రేవంత్ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తండ్రిలేని లోటు తనకు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు రేవంత్ పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు పాప పుట్టిన విషయం తెలిస్తే రేవంత్ సంతోషానికి అవధులు లేకుండా పోతాయంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రేవంత్‌కు పాప పుట్టిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు రేవంత్-అన్విత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు బిగ్‌బాస్ సీజన్-6 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ రేవంత్‌కే ఉందని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Singer Revanth 🎤 (@singerrevanth) -
విర్రవీగుతున్న రేవంత్.. ఓడిపోయినా బిల్డప్ కొడుతున్నాడే!
Bigg Boss 6 Telugu, Episode 89: టికెట్ టు ఫినాలే రేస్‌లో ఏకాభిప్రాయం పేరుతో ఇంటిసభ్యులను ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. ఛాలెంజ్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఛాలెంజ్‌లో ఏ నలుగురు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో పేర్లు చెప్పమంటున్నాడు. దీంతో హౌస్మేట్స్ ఇదెక్కడి గొడవరా బాబూ అని తలలు బాదుకుంటున్నారు. ఈరోజు మొదటగా ఇవ్వబోయే ఛాలెంజ్‌లో ఏ నలుగురు పార్టిసిపేట్ చేస్తారో ఏకాభిప్రాయంతో చెప్పమన్నాడు బిగ్‌బాస్. మళ్లీ ఏకాభిప్రాయం ఏంట్రా దేవుడా అనుకున్న హౌస్మేట్స్ చిరాకు ప్రదర్శించారు. ఈ సమయంలో ఆదిరెడ్డి తెలివిగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ ఛాలెంజ్‌లో తను, రేవంత్ పక్కకు తప్పుకునేందుకు రెడీ అన్నాడు. కానీ నెక్స్ట్ ఛాలెంజ్‌లో ఫైమా, శ్రీహాన్ తప్పుకుంటానంటేనే ఈసారికి మేము సైడ్ అవుతామన్నాడు. అతడి నిర్ణయానికి అందరూ అంగీకారం తెలిపారు. దీంతో బిగ్‌బాస్ ఇచ్చిన రోల్ బేబీ రోల్ అనే టాస్క్‌లో రోహిత్, ఫైమా, శ్రీహాన్, కీర్తి పాల్గొన్నారు. సంచాలకులైన ఇనయ, శ్రీసత్య టవర్ పొడవుగా పేర్చిన శ్రీహాన్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టవర్ గేమ్‌లో శ్రీహాన్‌కు 4, రోహిత్‌కు 3, ఫైమాకు 2, కీర్తికి 1 పాయింట్స్ లభించాయి. సంచాలకులపై నిర్ణయంపై కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ఇష్టమొచ్చినవాళ్లకు ఇచ్చుకోండి అంటూ కోపంతో ఊగిపోతూ ఆవేశంలో తన టవర్‌ను తన్నేసింది. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు బిగ్‌బాస్ మార్కుల పట్టిక రిలీజ్ చేయగా శ్రీహాన్ 10, ఆది రెడ్డి 9, రేవంత్ 8, ఫైమా 7, రోహిత్ 4, కీర్తి 3 పాయింట్లతో ఉన్నారు. ఈ లెవల్ ముగిసే సమయానికి తక్కువ పాయింట్లు ఉన్న కీర్తిని రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో నెక్స్ట్ లెవల్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇచ్చే మొదటి ఛాలెంజ్‌లో ఏ ముగ్గురు పాల్గొంటారో చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ముందుగా అనుకున్న రూల్ ప్రకారం ఈసారి ఫైమా, శ్రీహాన్ గేమ్ నుంచి సైడవగా రేవంత్, ఆది రెడ్డి, రోహిత్ ఆటలో పాల్గొన్నారు. గుడ్డు జాగ్రత్త గేమ్‌లో అద్భుతంగా ఆడిన ఆదిరెడ్డికి 3, రోహిత్‌కు 2, రేవంత్‌కు 1 పాయింట్ వచ్చింది. ఓటమిని జీర్ణించుకోలేని రేవంత్ సంచాలకురాలైన కీర్తి కావాలనే మనసులో ఏదో పెట్టుకుని నన్ను తప్పించాలని చూసిందని ఉడికిపోయాడు. నేనెక్కడ గెలుస్తానోన్న భయంతో, నామీదే ధ్యాస పెట్టిందని, అలా భయపడాలి అంటూ తనకు తానే సెల్ఫ్ డబ్బా వాయించుకున్నాడు. ఓడిన ప్రతిసారి అందుకు ఇతరులే కారణమని నిందించడం అతడికి అలవాటుగా మారింది. ఇక ఇప్పటివరకు ఆడిన గేమ్ ఆధారంగా మార్కుల పట్టికలో ఆదిరెడ్డి(12 పాయింట్లు), శ్రీహాన్(10), రేవంత్(9), ఫైమా(7), రోహిత్(6) వరుస స్థానాల్లో ఉన్నారు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్లు ట్రోఫీ గెలవడానికి గల ప్రాముఖ్యతను వివరించమన్నాడు. ► మా అమ్మకు ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలి. వాళ్లు మొదటిసారి కోరిన కోరికను నెరవేర్చాలి - శ్రీహాన్ ► నాన్న పేరు నిలబెట్టేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - రోహిత్ ► బిగ్‌బాస్ షోలో మొదటి రోజు నుంచి ప్రతి టాస్కులో ఆడుతూనే ఉన్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్తూనే ఉన్నాను. అందరికంటే ఆ ట్రోఫీ నాకే ఎక్కువ ముఖ్యం - రేవంత్ ► నా జీవితంలో ఏదీ అంత ఈజీగా దొరకలేదు, పోరాడి సాధించాను. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిస్తే ఆ కిక్కే వేరు. కప్పు కొట్టాలన్న అమ్మానాన్న కల నెరవేర్చాలని ఉంది - శ్రీసత్య ► నాలాంటి అమ్మాయిలకు నేను ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలవాలి - కీర్తి ► కుటుంబం కోసం, అలాగే అమ్మాయిలకు ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - ఫైమా ► మొదటిసారి ఓ కామన్ మ్యాన్ 13 వారాలు హస్‌లో ఉన్నాడు. అడ్డదారులు తొక్కకుండా జెన్యూన్‌గా ఆడి ట్రోఫీ గెలిస్తే హ్యాపీ - ఆదిరెడ్డి ► నువ్వు అమ్మాయివి, నువ్వేం చేయలేవు, చదువుకోలేదు అని నన్ను నానామాటలన్నారు. ఏమీ లేకపోయినా ఏదైనా సాధించవచ్చని నిరూపించాలనుకుంటున్నా. అందుకే ఈ ట్రోఫీ గెల్చుకుని చాలామందికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. ఈ కప్పు కొట్టి నాన్నకు అంకితమిస్తా - ఇనయ చదవండి: డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక అదే చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాకైన హౌస్మేట్స్ -
అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ రాయల్
బిగ్‌బాస్ షోయే తన ప్రపంచం అనుకుంది గీతూ రాయల్. వీలైతే టాప్ 5లో చోటు కుదిరితే కప్పు కూడా పట్టుకొచ్చేదామనుకుంది. కానీ ఆమె ఆట, మాట తీరు నచ్చకపోవడంతో టాప్ 10లో కూడా ఉంచకుండానే ఆమెను ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు. ఊహించని ఎలిమినేషన్‌తో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది గీతూ. 20 రోజుల డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక ఓ తుప్పాస్ పని చేశా, ఈ విషయం అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది అంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో వదిలింది గీతూ. అందులో ఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ ఎపిసోడ్ చూసి ఏడ్చాను. ఎందుకంటే మా అమ్మ నా కోసం హౌస్‌లోకి వస్తుందని చీర కూడా కొని రెడీగా పెట్టాను. ఫ్యామిలీ ఎపిసోడ్ అయ్యాక ఎలిమినేట్ అయినా బాగుండేది. నేను ఎలిమినేట్ అయిన రోజు బాగా ఏడ్చేసరికి డిప్రెషన్లో ఉన్నానేమోనని నాగార్జున నన్ను పిలిచారు. ఆదిరెడ్డికి నాగార్జునగారు బాగా క్లాస్ పీకినరోజే ఆయన్ని కలిసాను. ఆయన నన్ను మళ్లీ ఓదార్చాడు అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో ఆమె తన కుడికాలిపై చిరుతచారల పచ్చబొట్టు వేయించుకుంది. టాటూ వేయించుకునేటప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉండటానికి బిగ్‌బాస్ చూస్తూ కూర్చుంది. కాలిపై ఉన్న గాయం తాలూకు మచ్చను కప్పివేసేందుకే టాటూ వేయించుకున్నట్లు తెలిపింది గీతూ. View this post on Instagram A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_) చదవండి: కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి పెళ్లి ఫొటోల్లో లావుగా ఉందంటూ ట్రోల్స్ -
కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాకైన హౌస్మేట్స్
బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే కోసం రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, ఫైమా, రోహిత్ తలపడుతున్నారు. వీరికి వరుస ఛాలెంజ్‌లు ఇస్తూ ఒక్కొక్కరిని పోటీ నుంచి తప్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌కు రోల్ బేబీ రోల్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో దొర్లుకుంటూ వెళ్లి బ్రిక్స్ తెచ్చుకుని వాటిని టవర్లా కట్టాల్సి ఉంటుంది. ఎవరు బాగా ఎత్తయిన టవర్ కడితే వారే గెలిచినట్లు! ఈ టాస్క్‌కు ఇనయ, శ్రీసత్య సంచాలకులుగా వ్యవహరించగా ఫైమా, కీర్తి, శ్రీహాన్, రోహిత్ ఆడారు. శ్రీహాన్ టవర్ ఎత్తుగా ఉందని శ్రీసత్య చెప్పడంతో కీర్తికి చిర్రెత్తిపోయింది. శ్రీహాన్ టవర్‌లో గ్యాప్ కనిపించట్లేదా? అన్ని విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని వాదించింది. నీ టవర్‌లో కూడా గ్యాప్స్ ఉన్నాయని శ్రీసత్య చెప్తుండగా ఆమె మాట వినిపించుకోలేదు కీర్తి. మీకు నచ్చినవారికి ఇచ్చుకోండి అంటూ తన టవర్‌ను ఒక్క తన్నుతో నేలకూల్చింది. ఆమె ప్రవర్తనతో అందరూ షాకయ్యారు. చదవండి: ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్, గొప్పోడివయ్యా రోహిత్ సిద్ధూకు హెడ్వెయిట్? డీజే టిల్లు నుంచి అనుపమ అవుట్ -
ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్, గొప్పోడివయ్యా రోహిత్!
Bigg Boss Telugu 6, Episode 88: ఎలాగైనా సరే టికెట్ టు ఫినాలే కొట్టాల్సిందేనని కసిగా ఆడుతున్నారు హౌస్మేట్స్. అయితే మొదట్లోనే ఆటలో అవుట్ అయిన శ్రీసత్య, కీర్తి, ఇనయలకు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. 'రంగు పడితే రివైవల్' గేమ్‌లో గెలిచినవారు తిరిగి రేసులో పాల్గొంటారని చెప్పాడు. ఈ గేమ్‌లో ముగ్గురమ్మాయిలు పోటాపోటీగా ఆడగా కీర్తి గెలిచి తిరిగి రేసులో నిలబడింది. అనంతరం శ్రీసత్య, ఇనయ మినహా పోటీలో ఉన్న మిగతా ఆరుగురు 'జెండాల జగడం' అనే గేమ్‌లో పాల్గొన్నారు. ఈ ఆటలో రేవంత్, ఆదిరెడ్డి తొలి రెండు స్థానాల్లో, ఫైమా, శ్రీహాన్, కీర్తి, రోహిత్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలబడ్డారు. తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్‌లో పాల్గొనే నలుగురి సభ్యులు ఎవరో ఏకాభిప్రాయంతో చెప్పమని ఆదేశించాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో హౌస్మేట్స్ డీలా పడ్డారు. ఎంతో కీలకమైన టికెట్ టు ఫినాలే గేమ్‌లో ఏకాభిప్రాయం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. నన్ను గేమ్‌లో నుంచి తీసేస్తే మాత్రం ఏ ఒక్కడినీ గెలవనివ్వను అని శ్రీహాన్ వార్నింగ్ ఇవ్వగా నాదీ అదే మాట అంటూ వంత పాడాడు రేవంత్. ఆడి ఓడిపోయినా సర్వాలేదు కానీ ఏకాభిప్రాయం వల్ల అసలు ఆటనే ఆడకపోవడం తట్టుకోలేమన్నాడు రోహిత్. దీంతో బిగ్‌బాస్.. ఆటలో లేని ఇనయ, శ్రీసత్యలను ఎవరు గేమ్‌లో ఉండాలి? ఎవరు గేమ్ నుంచి తప్పుకోవాలో డిసైడ్ చేయమన్నాడు. దీంతో వాళ్లు గత గేమ్‌లో చివరి ర్యాంకింగ్‌లో ఉన్న కీర్తి, రోహిత్‌లను ఆటలో నుంచి తొలగించారు. వారి నిర్ణయంపై కీర్తి రుసరుసలాడింది. ఇనయ వెళ్లి తనతో మాట్లాడించేందుకు ప్రయత్నించగా అది కాస్తా గొడవగా మారింది. దీంతో అటు కీర్తి, ఇటు ఇనయ ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. రోహిత్ మాత్రం సరైన నిర్ణయమే తీసుకున్నారని మెచ్చుకోవడంతో శ్రీసత్య అతడి నిజాయితీని పొగడకుండా ఉండలేకపోయింది. ఇక బ్యాలెన్స్ ద స్కోర్స్ గేమ్‌లో ఫైమా మొదట అవుట్ అయింది. తర్వాత రేవంత్, శ్రీహాన్ వరుసగా ఓడిపోగా ఆదిరెడ్డి కడ వరకు నిలబడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్ కోపంతో శ్రీసత్యపై చిటపటలాడాడు. ఈ గేమ్‌లో పర్ఫామెన్స్‌కుగానూ బిగ్‌బాస్ మార్కుల పట్టికను విడుదల చేశాడు. ఇందులో ఆదిరెడ్డికి 9, రేవంత్‌కు 8, శ్రీహాన్‌కు 6, ఫైమా 5 పాయింట్స్‌తో వరుస స్థానాల్లో ఉన్నారు. ఇకపోతే ఆదిరెడ్డి టికెట్ టు ఫినాలే గెలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: నన్ను సైడ్ చేస్తే ఎవ్వడినీ గెలవనివ్వను: శ్రీహాన్ పుష్ప సినిమా చూశా.. కానీ ఆ హీరో ఎవరో తెలియదు: నటి -
టికెట్ టు ఫినాలే విజేత, ఫస్ట్ ఫైనలిస్ట్ అతడే!
టికెట్ టు ఫినాలే.. ఈ ఒక్క టాస్క్ గెలిస్తే చాలు నేరుగా ఫినాలేలో అడుగు పెట్టొచ్చు. అందుకే ఎలాగైనా ఈ బంపర్ ఆఫర్ అందుకుని తీరాల్సిందేనని కసిగా ఆడుతున్నారు హౌస్మేట్స్. అయితే ఈ పోటీలో నెక్స్ట్ ఛాలెంజ్ కోసం పోటీపడే నలుగురు సభ్యులు ఎవరనేది ఇంటిసభ్యులే ఏకాభిప్రాయంతో నిర్ణయించాలన్నాడు బిగ్‌బాస్. ఇది విని హౌస్మేట్స్ డీలా పడిపోయారు. ఏకాభిప్రాయంలో తమని తీసేస్తే అప్పటిదాకా పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన చెందారు. అయినా టికెట్ టు ఫినాలేలో ఏకాభిప్రాయం ఆప్షన్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేశాడు ఆదిరెడ్డి. ఆడి ఓడిపోయినా పర్వాలేదు కానీ ఏకాభిప్రాయం వల్ల ఆడకుండానే ఆట నుంచి తప్పుకుంటే అది భరించలేమన్నాడు రోహిత్. ఒకవేళ టికెట్ టు ఫినాలేలో ఏకాభిప్రాయం వల్ల నన్ను తీసేస్తే ఒక్కడిని కూడా గెలవనివ్వని వార్నింగ్ ఇచ్చాడు శ్రీహాన్. మరి కంటెస్టెంట్లు తిరగబడటంతో బిగ్‌బాస్ వెనక్కు తగ్గాడా? లేదంటే హౌస్‌మేట్సే అడ్జస్ట్ అయి ఆటలో ముందుకు సాగారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సోషల్ మీడియా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిరెడ్డి టికెట్ టు పినాలే టాస్క్ గెలిచి టాప్ 5లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: టికెట్ టు ఫినాలే కోసం పోటాపోటీగా ఫైట్ చేసిన లేడీ టైగర్స్ -
'టికెట్ టు ఫినాలే' మళ్లీ బరిలో నిలబడ్డ కంటెస్టెంట్
బిగ్‌బాస్ షోకి ముగింపు దగ్గరపడింది. మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. నేరుగా ఫైనల్స్‌కు వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్. ఇప్పటికే ఈ గేమ్ నుంచి శ్రీసత్య, కీర్తి, ఇనయ అవుట్ అయ్యారు. కానీ వారికి మరో అవకాశం కల్పించి తిరిగి గేమ్‌లోకి రావడానికి ఓ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ముగ్గురమ్మాయిలకు రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఇనయ, కీర్తి.. సత్యను టార్గెట్ చేయడంతో ఆమె అవుట్ అయింది. తర్వాత మిగిలిన ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. రసవత్తరంగా జరిగిన ఈ పోటీలో కీర్తి గెలిచి తిరిగి టికెట్ టు ఫినాలే గేమ్‌లో అడుగుపెట్టింది. చదవండి: మీరిద్దరూ ఏం చేస్తున్నారసలు.. దొరికిపోయిన శ్రీహాన్ రష్యాలోనో తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ -
Bigg BOss 6 :మీరిద్దరు చేస్తుందేంటి? అది ఎటాక్‌లా లేదు.. టెలికాస్ట్‌లో చూసుకోండి!
Bigg Boss Telugu 6 Episode 87: బిగ్‌బాస్ ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చింది. 13వ వారంలో హౌస్‌లో 8 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ని పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి ‘స్నో మెన్’ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించేందుకు అవసరమైన ముక్కలు పై నుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి. ఎవరైతే ముందుగా స్నోమెన్‌ని రెడీ చేస్తారు వారు విజేతగా నిలుస్తారు. ఈ టాస్క్‌కి సంచాలక్‌గా ఇనాయాను నియమించాడు బిగ్‌బాస్. మొదటి దశలో రేవంత్, ఆదిరెడ్డి ఎక్కువ ముక్కలను సేకరించి స్నోమెన్‌ని నిర్మించారు. రోహిత్, ఫైమా, కీర్తి మాత్రం గేమ్ నియమాలకు విరుద్దంగా సేకరించిన వస్తువులను తమ దగ్గరే పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సంచాలక్‌గా ఉన్న ఇనయా గమనించలేదు. దీంతో బిగ్‌బాస్ ఇనయాను తొలగించి రేవంత్‌ని సంచాలక్‌గా నియమించాడు. రేవంత్ సంచాలక్‌గా వచ్చి రావడంతోనే కఠిన నియమాలు పెట్టాడు. సత్య తీసుకున్న స్నో మెన్ పార్ట్ విరిగిపోవడంతో దాన్ని అతికించి పెట్టింది. అలా చేస్తే కౌంట్ రాదని రేవంత్ చెప్పినా కూడా వినకుండా ‘అతికించినట్టు ఏమైనా తెలుస్తుందా ఏంటి కౌంట్ చేయకపోతే అది నీ ఇష్టం’ అని సత్య అసహనం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ ఆదేశంతో అందరికంటే తక్కువ వస్తువులున్న శ్రీసత్యను టాస్క్ నుంచి ఎలిమినేట్ చేశాడు రేవంత్. ఆ తర్వాత రెండో లెవల్ మొదలవుతుంది. ఇందులో భాగంగా స్టార్ట్-ఎండ్ బజర్ల మధ్య ఉన్న సమయంలో ఇతరుల బొమ్మలపై దాడి చేసి వీలైనన్ని వస్తువులను దొంగిలించవచ్చని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే పోటీదారులు మాత్రం పెద్దగా గొడవకు దిగలేదు. దొంగిలించడం పక్కకి పెట్టి తమ బొమ్మలను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రయత్నించారు. ఇనయా మాత్రం శ్రీహాన్ బొమ్మపై దాడి చేసేందుకు ట్రై చేసింది. ఈ క్రమంలో శ్రీహాన్ ఇనయాని గట్టిగా హత్తుకొని తన బొమ్మ దగ్గరకు వెళ్లకుండా చేశాడు. ఇనయా కూడా గతంలో మాదిరి గట్టిగా దాడికి దిగలేదు. ఒకర్నొకరు లాక్కోవడం, పట్టుకోవడం లాంటివి రొమాంటిక్‌గా చేశారు. శ్రీసత్య ఈ విషయాన్ని గమనించి ‘అసలు మీరిద్దరు ఏం చేశారు?’ అని అడగ్గా.. ఇనయా సిగ్గు పడుతూ.. ఎటాక్ చేశామని చెప్పింది. ‘అది ఎటాక్‌లా లేదు.. కావాలంటే టెలికాస్ట్‌లో చూసుకోండి’ అని శ్రీసత్య చెప్పింది. ఇంతటితో ఆగకుండా.. ఇనయాతో బాగానే చేశావే.. దొరికిపోయావ్ శ్రీహాన్ అంటూ ఆటపట్టించింది. రేవంత్, ఫైమా అయితే ఏకంగా వీరిద్దరు ఎలా చేశారో ఇమిటేట్ చేసి చూపించారు. శ్రీహాన్, ఇనయాలు ఈ విషయాన్ని కామెడీగానే తీసుకున్నారు. శ్రీహాన్ అయితే ఈ సంఘటనను మగధీర సినిమాతో పోలుస్తూ.. సత్య మిత్రవింద అని, ఇనయా ఐటమ్ గర్ల్ అని చెప్పాడు. దీంతో ఇనయా అలుగుతుంది. ఆమెను కూల్ చేసేందుకు నాయానే మిత్రవింద.. సత్య ఐటెమ్ గర్ల్ అని శ్రీహాన్ అన్నాడు. ఆ తర్వాత స్నోమెన్ టాస్క్‌లు తక్కువ వస్తువులు సేకరించిన కారణంగా ఇనయా, కీర్తిలను తొలగిస్తున్నట్లు సంచాలక్ శ్రీసత్య ప్రకటిస్తుంది. -
Bigg Boss 6 : ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ స్టార్ట్.. శ్రీసత్యపై రేవంత్ ఫైర్!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. 21 మందిలో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఎనిమిది మంది మిగిలారు. వారి కోసం ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్‌ని తీసుకొచ్చారు నిర్వాహకులు. ఇందులో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని వదిలారు మేకర్స్. ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి ‘స్నో మెన్’ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించేందుకు అవసరమైన ముక్కలు పై నుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి. ఎవరైతే ముందుగా స్నోమెన్‌ని రెడీ చేస్తారు వారు విజేతగా నిలుస్తారు. ఆ టాస్క్‌కి రేవంత్ సంచాలక్‌గా వ్యవహరించాడు. స్నో మెన్ పార్ట్స్ దక్కించుకోవడానికి ఇంటి సభ్యులు బాగానే కష్టపడ్డారు. సత్య తీసుకున్న స్నో మెన్ పార్ట్ విరిగిపోవడంతో దాన్ని అతికించి పెట్టింది. అలా చేస్తే కౌంట్ రాదని రేవంత్ చెప్పినా కూడా వినకుండా ‘అతికించినట్టు ఏమైనా తెలుస్తుందా ఏంటి కౌంట్ చేయకపోతే అది నీ ఇష్టం’ అని సత్య అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు తన సంపాధించిన స్నో మెన్ చేయి వేరే వాళ్లకి ఇచ్చేందుకు సిద్దమైంది. చేయి ఎవరికైనా కావాలా అని సత్య అనగానే తనకివ్వమని ఫైమా అడుగుతుంది. అలా ఇచ్చుకోవడాలు లేవని సంచాలక్ గా ఉన్న రేవంత్ అడ్డుపడ్డాడు. అయినా వినకుండా ఎవరికైనా ఇస్తా అని సత్య మొండిగా అనేసరికి ఇచ్చుకోవడాలు లేవని రేవంత్ సీరియస్ గా చెప్పేశాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి ‘టికెట్ టు ఫినాలే’ అందుకుంటారో చూడాలి. -
బిగ్‌బాస్ 6: ఆర్జీవీతో డాన్స్ వీడియోపై ఇనయా సుల్తానా ఏమందంటే..
ఇనయ సుల్తానా.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో తనదైన ఆట తీరు, ముక్కుసూటి తనంతో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఇనయ టాప్ కంటెస్టెంట్లో ఒకరిగా దూసుకుపోతోంది. బిగ్‌బాస్‌కు ముందు ఇనయ ఓ వైరల్ వీడియోతో సోషల్ మీడియాకు పరిచయమైన సంగతి తెలిసిందే. తన బర్త్‌డే పార్టీలో వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో కలిసి డాన్స్ చేసి ఆమె ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అలా ఆర్జీవీ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ అందుకుంది. బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టడానికి ముందు ఇనయ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ డాన్స్ వీడియోపై ఆమె స్పందించింది. ‘‘సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఆర్జీవీ సార్‌తో పరిచయం ఏర్పడింది. అదే సమయంలో నా పుట్టిన రోజు కూడా ఉండటంతో ఆయనను పార్టీకి పిలిచాను. అదే సమయంలో ఇద్దరం కలిసి డాన్స్ చేశాం. ఆ వీడియో నా బర్త్ డే జరిగిన నాలుగు రోజుల తర్వాత బాగా వైరల్ అయ్యింది. ఆ సమయంలో అమ్మ ఫోన్ చేసి బాగా ఏడ్చింది. ‘పరువు మొత్తం తీస్తున్నావ్’ అంటూ కుటుంబ సభ్యులు తిట్టారు. అది నన్ను చాలా బాధించింది. ఆ వీడియో చూసి మా బంధువులంత నన్ను ద్వేషించడం స్టార్ట్ చేశారు. నా గురించి మాట్లాడటం కూడా మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. అందుకే నేను వాళ్ళ గురించి కూడా ఎక్కడా చెప్పాలనుకోవడం లేదు’’ అంటూ ఇనయ ఎమోషనల్ అయ్యింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తను సినిమాల్లోకి రావడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, అదే సమయంలో ఆ వీడియో వైరల్ కావడం వాళ్లు చాలా బాధపడ్డారని చెప్పింది. అంతేకాదు అప్పటి నుంచి తనని తప్పుగా చూస్తున్నారని, పరువు తీస్తున్నావంటూ తనని ద్వేషిస్తున్నారని ఇనయ ఆవేదన వ్యక్తం చేసింది. I once again want to clarify that the guy in this video is not me and the Girl in Red is not @inaya_sultana and I swear this on American President JOE BIDEN pic.twitter.com/K8nNera7Rc — Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2021 చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ డీజే టిల్లుకు హీరోయిన్ల తిప్పలు.. అనుపమ కూడా అవుట్! -
నీలాంటోళ్లు బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉండొద్దు: రేవంత్
Bigg Boss 6 Telugu, Episode 86: ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. అటు రాజ్ తన వల్లే వెళ్లిపోయాడని తెగ ఫీలైంది ఫైమా. ఇంతకీ ఈరోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నేను శ్రీసత్యతో కలిసి ఉన్నందుకు ఏవేవో అనేస్తున్నావు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావని రేవంత్ మీద సీరియసయ్యాడు శ్రీహాన్. ఏదైనా అనేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ గరమయ్యాడు. దీంతో హర్టయిన రేవంత్ దూరంగా వెళ్లి కూర్చున్నాడు. కానీ కాసేపటికే ఈ గొడవలన్నీ ఎందుకు? మునుపటిలా మాట్లాడుకుందామంటూ కలిసిపోయారు. మరోపక్క ఫైమా.. తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఓట్లు వచ్చినా సరే రాజ్ వెళ్లిపోయాడని ఏడ్చేసింది. గతవారం రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు పాడైపోయిన పండ్లు, ఆకుకూరల ఫొటోలను రోహిత్‌కు చూపించాడు బిగ్‌బాస్. ఇక మీదటైనా ఆహారం వేస్ట్ కాకుండా చూసుకోమని హెచ్చరించాడు. ఇంట్లో జరిగిన తప్పు కారణంగా తమకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ రద్దు చేయమని అడిగాడు ప్రస్తుతం రేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్. అనంతరం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.. ► ఆదిరెడ్డి.. రేవంత్, రోహిత్ ► ఫైమా.. రేవంత్, రోహిత్ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► కీర్తి.. రేవంత్, శ్రీసత్య ► శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డి ► రోహిత్.. ఆది రెడ్డి, ఫైమా ► రేవంత్.. ఆది రెడ్డి, ఫైమా ► ఇనయ.. రేవంత్, శ్రీసత్య ముందుగా ఆదిరెడ్డి.. నాగార్జునగారు చూపించిన వీడియోలో ముందు జరిగిన డిస్కషన్ చూపించలేదు. నువ్వు గేమ్‌లో అమ్మాయి వస్తే మనకే లాభం అన్నట్లుగా మాట్లాడావు. అప్పుడు, ఇప్పుడు, ఇంకో పదేళ్ల తర్వాత కూడా నేను ఈ మాటపైనే స్టాండ్ అయి ఉంటా అని బల్లగుద్ది చెప్పాడు. అటు రేవంత్ మాత్రం నాగ్ సర్ ఆల్రెడీ నీదే తప్పని చెప్పాడు, ఇంక దీనికోసం చర్చించడం అనవసరం అంటూ నిట్టూర్చాడు. అటు ఫైమా - రేవంత్, శ్రీహాన్ - ఆదిరెడ్డిల మధ్య ఫైట్ మామూలుగా జరగలేదు. 'రోహిత్ స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తున్నావ్, అంటే నువ్వు వీక్ కదా, అలాంటివాళ్లు హౌస్‌లో ఉండనవసరం లేదు, నిన్ను బయటకు పంపించడానికే నామినేట్ చేస్తున్నా' అని ఫైమాతో వాదించాడు రేవంత్. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫైమా ఉగ్రరూపం దాల్చింది. 'రేవంత్ ముందొకటి మాట్లాడతాడు, వెనకాల ఒకటి మాట్లాడతాడు. ఇలా మాటలు మార్చేది ఎవరికీ కనిపించట్లేదా? ఎన్నోసార్లు నోరుజారాడు. అదెందుకు కనిపించట్లేదు?' అని అటు కంటెస్టెంట్లు, ఇటు బిగ్‌బాస్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది.ఫైనల్‌గా ఈ వారం ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, కీర్తి నామినేట్ అయ్యారు. చదవండి: నోరు జారుతుంది నువ్వు.. రేవంత్‌పై ఫైమా ఉగ్రరూపం బిగ్‌బాస్: రాజ్ రెమ్యునరేషన్ ఎంతంటే? -
బిగ్‌బాస్ ద్వారా రాజ్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో అడుగుపెట్టిన 21 మందిలో రాజ్ ఒకరు. మొదట్లో అతడు మాట్లాడటానికి కూడా భయపడటాన్ని చూసి ఎక్కువకాలం ఉండడని అనుకున్నారంతా! కానీ రోజులు గడిచేకొద్దీ తనను తాను మలుచుకుని ధైర్యంగా నిలబడ్డాడు. ఆదిరెడ్డిలాంటివారిని కూడా కరెక్ట్ పాయింట్ చెప్పి నోరు మూయించేంత మాటకారిగా ఎదిగాడు. గీతూతో ఫైట్ చేసిన విధానం కూడా అతడికి ప్లస్ పాయింట్‌గా మారింది. ఇక ఆటలో అయితే ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఆడాడు. దీంతో మొదటి నాలుగు వారాల్లోనే వెళ్తాడనుకున్న రాజ్ పన్నెండు వారాలు ఉండగలిగాడు. నిజానికి ఈ వారం కూడా ఉండేవాడే.. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను అడ్డుపెట్టుకుని రాజ్‌ను బయటకు పంపించేశారు. నిజానికి గత నాలుగో సీజన్లో ఓట్లతో చివరి స్థానంలో ఉన్న అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో ఆ వారం ఎలిమినేషన్ రద్దయింది. అంతేతప్ప చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న అరియానాను పంపించలేదు. కానీ ఈ సీజన్లో మాత్రం అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి సేవ్ అవడంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. ఇంతకీ రాజ్ పన్నెండు వారాల్లో ఎంత సంపాదించాడని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం రాజ్.. వారానికి రూ.25 వేల నుంచి 30 వేల రూపాయలు అందుకున్నాడట. అంటే మొత్తం 12 వారాలకుగానూ అతడు మూడు లక్షల పైచిలుకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: నరాలు కట్టయ్యాయా? పిచ్చిపిచ్చిగా వాగుతున్నావ్ రేవంత్ మీద నిప్పులు చెరిగిన ఫైమా -
నరాలు కట్టయ్యాయా శివ? నోటికొచ్చింది వాగుతున్నావ్!
హోస్టింగ్ అదిరింది అన్నవారితోనే ఇదేం హోస్టింగ్రా బాబూ అనిపించేలా చేస్తున్నాడు యాంకర్ శివ. బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిబి కెఫెలో ఇంటర్వ్యూ చేస్తాడు శివ. మొదట్లో ఇంటర్వ్యూలను రఫ్ఫాడించిన అతడు రానురానూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. అందులోనూ కటువుగా మాట్లాడటం రాని సాఫ్ట్ కంటెస్టెంట్లపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో యాంకర్ శివపై జనాలు మండిపడుతున్నారు. అమాయకపు కంటెస్టెంట్లను ఎందుకంత అవమానపరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శివ బిబి కెఫెలో రాజ్‌తో ఏం మాట్లాడాడు? ఎలాంటి ప్రశ్నలు అడిగాడో చూద్దాం.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలంటే ఆడాలి, మాట్లాడాలి.. ఈ రెండూ జరగకుండానే ఇన్నివారాలదాకా వచ్చావు. అంటే నువ్వు నక్క తోక తొక్కి వచ్చావు అని రాజ్‌ను కించపరిచినట్లుగా మాట్లాడాడు శివ. బిబి కెఫెకు వచ్చిన ఓ వ్యక్తి నువ్వు కెమెరాల నుంచి తప్పించుకుని భలే ఆడావన్నాడంటూ పడీపడీ నవ్వాడు. దీనికి ఏమని సమాధానమివ్వాలో అర్థం కాని రాజ్.. అదే నా గేమ్ అని ఒప్పుకుంటున్నాననగానే శివ మరోసారి నవ్వాడు. ఏమీ ఆడకుండా 12 వారాలు ఉన్నందుకు హ్యాపీగా ఉన్నట్లున్నావంటూ వెటకారంగా మాట్లాడాడు. దీనికి రాజ్.. ఏం మాట్లాడుతున్నావ్ బ్రో, నీకేమైనా నరాలు కట్ అయ్యాయా? అని ప్రశ్నించాడు. అయినా తగ్గని శివ కేవలం లక్ వల్లే ఇన్నివారాలు ఉండగలిగావన్నట్లుగా తనను పదేపదే అవమానించడం గమనార్హం. ఇది చూసిన నెటిజన్లు యాంకర్ శివకేమైనా పిచ్చిపట్టిందా? అని కామెంట్లు చేస్తున్నారు. తనలో ఉన్న మంచి లక్షణాల గురించి మాట్లాడకుండా పదేపదే తనను మానసికంగా దెబ్బ తీయాలని చూడటమెందుకోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రేవంత్ మీద నిప్పులు చెరిగిన ఫైమా అదే అసలైన మైనస్, అందువల్లే రాజ్ ఎలిమినేట్ అయ్యాడా! -
నోరు జారుతుంది నువ్వు.. ఫైమా దెబ్బకు సైలెంట్ అయిన రేవంత్
తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడూ ఉంటాడు. నేనే తోపు, నేనే స్ట్రాంగ్ అని ఫీలయ్యే రేవంత్‌కు ఎదురు తిరిగింది ఫైమా. వేరేవారి సపోర్ట్ లేనిదే గేమ్ ఆడలేవు, నువ్వు నాకు చెప్తున్నావా? అని రేవంత్ అనడంతో అగ్గిమీద గుగ్గిలమైంది ఫైమా. సపోర్ట్‌తో ఆడిన రేవంత్ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించింది. మనిషి ముందు ఒకలా, వెనకాల మరోలా మాట్లాడతాడు. ఎవరికీ ఇది కనిపించట్లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు నుంచీ తనే నోరుజారుతున్నా అది ఎందుకు ఎవరికీ కనిపించట్లేదని భగ్గుమంది. కరెక్ట్ పాయింట్లు లాగడంతో రేవంత్ దెబ్బకు సైలెంట్ అయిపోయాడు. ఎంతసేపూ నేనే స్ట్రాంగ్, నా ముందు మాట్లాడే ధైర్యం లేదు, వాళ్లకంత సీన్ లేదు అంటూ తోటికంటెస్టెంట్లను చులకన చేసి మాట్లాడే రేవంత్ నోటిదురుసుకు అడ్డుకట్ట వేయాలంటే ఫైమానే కరెక్ట్ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: ఆదిరెడ్డి వర్సెస్ శ్రీహాన్.. నామినేషన్స్‌లో ఎవరెవరంటే? ఆ కంటెస్టెంట్ పరువు తీసిన రాజ్, అతడే విన్నర్ అంట -
ఆదిరెడ్డి Vs శ్రీహాన్, నామినేషన్లో ఎవరున్నారంటే?
రాజ్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. ఇక నామినేషన్ ప్రక్రియకు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజైంది. ఫైమా మాట్లాడుతూ.. రేవంత్ తర్వాత నువ్వే స్ట్రాంగ్ అంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. నేను చెప్పేది వినకపోతే వెళ్లి సోఫాలో కూర్చో అంటూ రేవంత్ మీద ఫైరయ్యాడు ఆదిరెడ్డి. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో బిగ్‌బాస్ కనిష్ట ధర నీ నిర్ణయానికే వదిలేసినా నువ్వు చెక్ మీద లక్ష రూపాయలు రాయడం తప్పన్నాడు శ్రీహాన్. అంతా అయిపోయాక ఎవ్వరైనా మాట్లాడతారని ఆదిరెడ్డి పెదవి విరవడంతో అది మినిమమ్ కామన్సెన్స్ అన్నా, నేనైతే రూపాయి కూడా రాసేవాడిని అని మండిపడ్డాడు శ్రీహాన్. సెన్స్ అంటే ఫీలైన నువ్వు కామన్సెన్స్ అని మాట్లాడుతున్నావు, అది ఎంతవరకు కరెక్టో నీకే తెలియాలి అని కౌంటరిచ్చాడు ఆది. ఇక ఈ వారం కెప్టెన్ ఇనయ, శ్రీహాన్ మినహా మిగతా ఆరుగురు నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజ్ ఎలిమినేషన్‌కు కారణాలివే! ఒక్కటైన ప్రేమ జంట, ఫోటోలు వైరల్ -
ఆ కంటెస్టెంట్ పరువు తీసిన రాజ్, అతడే విన్నర్ అని వెల్లడి
Bigg Boss Telugu 6, Episode 85: ఎవరు తప్పు చేశారో నిలబెట్టి క్లాసు పీకే నాగార్జున ఈసారి మాత్రం డిఫరెంట్‌గా వారి తప్పొప్పులను వారితోనే చెప్పించాడు. హౌస్‌మేట్స్‌లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో చెప్పమని ఆదేశించాడు నాగ్. ముందుగా రోహిత్ మాట్లాడుతూ.. 'కీర్తి ఎక్కువ బాధపడుతుంది, ఫైమా, శ్రీసత్యలో వెటకారం ఎక్కువ. ఇనయ ఎవరికీ అవకాశమివ్వకుండా మాట్లాడుతుంది, రాజ్ పాయింట్ లేకున్నా అరుస్తాడు, రేవంత్‌కు కోపమెక్కు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు' అంటూ వారిలోని లోపాలను ఏకరువు పెట్టాడు. ఇలా అందరి గురించి చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ సాగదీయాల్సి వస్తుందనుకున్నాడో ఏమోకానీ నలుగురి కంటెస్టెంట్లలోని చెడు లక్షణాలు చెప్తే సరిపోతుందన్నాడు నాగ్. దీంతో ఇనయ మాట్లాడుతూ.. 'శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది. రేవంత్ ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతున్నాడు. రాజ్ నేనున్నానని చూపించుకోవడానికి అరుస్తాడు. ఆదిరెడ్డి ఆడకుండా కూర్చోవడం కరెక్ట్ కాదు' అని చెప్పింది. కీర్తి వంతు రాగా రేవంత్ అన్న ఓవర్ అగ్రెసివ్, శ్రీసత్య, శ్రీహాన్ వెటకారం, రోహిత్ ఎక్కువ కలవకపోవడం మైనస్ అని చెప్పింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'రేవంత్ బాగా ఆడతాడు, కానీ తాను బాగా ఆడతానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇనయ చాలా మాటలు వదిలేస్తుంది. శ్రీసత్యకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. రోహిత్ గట్టిగా స్పందించరు' అని చెప్పాడు. ఫైమా.. సరేవంత్ కోపం నచ్చదు. ఇనయ మాటతీరు మార్చుకోవాలి. రోహిత్ గేమ్‌లో పెద్దగా పర్ఫామెన్స్ కనిపించట్లేదు. కీర్తి ఎక్కువ ఎమోషనల్ అవుతుందిస అని చెప్పింది. శ్రీసత్య.. రోహిత్ సరైన టైమ్‌కు రియాక్ట్ అవడు. కీర్తి ఏం చెప్పినా వినిపించుకోదు. ఇనయ ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పింది. రాజ్ మాట్లాడుతూ.. రోహిత్ గట్టిగా మాట్లాడడు. ఇనయ ప్రతిదానిలో దూరుతుంది. శ్రీహాన్ గేమ్ కన్నా స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. శ్రీసత్య నామినేషన్లో తను చెప్పాలనుకుంది చెప్పి వెళ్లిపోతుందన్నాడు. ఇక శ్రీహాన్ వంతురాగా రాజ్‌కు కాన్ఫిడెన్స్ తక్కువ. రోహిత్ మంచితనం కొన్నిసార్లు సేఫ్‌గా కనిపిస్తుంది. రేవంత్ కొన్ని స్టేట్మెంట్లు వదిలేస్తాడు. సరదాగా అయినా సరే వద్దని వారించినా అర్థం చేసుకోడు. శ్రీసత్య వేరేవాళ్ల మాట నమ్మి ఫ్రెండ్‌ను దూరం పెట్టొద్దు అని సూచనలిచ్చాడు. రేవంత్.. ఫైమా వెటకారం తగ్గించుకోలేదని, ఆదిరెడ్డి మానిప్యులేటర్ అని, ఇనయ, కీర్తి కావాలని రెచ్చగొడుతారని మనసులో ఉన్న కోపాన్నంతా కక్కేశాడు. అందరూ మాట్లాడింది విన్న నాగ్.. మీలోని చెడు లక్షణాలను సరిచేసుకున్నవారు గెలుపుకు దగ్గరవుతారని సూచించాడు. తర్వాత వంట రాదన్న కీర్తితో ఆలూ ఫ్రై చేయించుకుని మరీ తిన్నాడు నాగ్. అనంతరం ఇంటిసభ్యులతో ఫన్ గేమ్స్ ఆడించాడు. ఇకపోతే నామినేషన్స్‌లో అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరకు ఫైమా, రాజ్ ఇద్దరే మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాజ్ కోసం వాడతానంది ఫైమా. అయితే రాజ్ మాత్రం నువ్వు ఆడి సంపాదించింది నీ కోసమే వాడుకో అని చెప్పాడు. దీంతో ఫైమా దాన్ని వాడకుండా వదిలేద్దామనకుంది. కానీ నాగార్జున మాత్రం.. ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో మీ ఇద్దరే ఉన్నారని, మీలో ఒకరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడితే మిగతా ఒకరు ఎలిమినేట్ అవుతారని స్పష్టం చేశాడు. అంటే ఓటింగ్‌తో సంబంధం లేకుండా పాస్‌తో గండం గట్టెక్కొచ్చని నొక్కి చెప్పాడు. దీంతో ఫైమా మనసు మార్చుకుని తనకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడింది. ఫలితంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. అయితే ఆడియన్స్ ఓట్ల ప్రకారం చివరి స్థానంలో ఉన్న ఫైమా ఎలిమినేట్ అవ్వాలని, కానీ పాస్ సాయంతో ఆమె సేవ్ అయి రాజ్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు నాగ్. దీంతో ఫైమా, ఇనయ ఎమోషనలయ్యారు. స్టేజీ మీదకు వచ్చిన రాజ్‌తో పంచ్, హగ్స్ గేమ్ ఆడించాడు నాగ్. ఫైమా, ఆది, రోహిత్, రేవంత్‌కు హగ్స్ ఇస్తానని, మిగతా నలుగురికి పంచ్ ఇచ్చాడు. వెళ్లేముందు కంటెస్టెంట్లకు విలువైన సూచనలిచ్చాడు రాజ్. ఫైమా దగ్గర కొంత ఫన్ తక్కువైందని, ఆదిరెడ్డి తను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటాడని, రోహిత్ కొన్ని సందర్భాల్లో మాట్లాడితే బాగుండన్నాడు. రేవంత్‌ది చిన్నపిల్లాడి మెంటాలిటీ అని, అతడు కచ్చితంగా టైటిల్ కొడతాడని ఫిక్సైపోమన్నాడు. శ్రీహాన్ అందరితో గట్టిగా మాట్లాడతాడు, కానీ ఫ్రెండ్స్ తప్పులను గట్టిగా చెప్తే బాగుండన్నాడు. శ్రీసత్యను నామినేషన్లో సరైన పాయింట్లు చెప్పమన్నాడు. ఇనయను టాప్ 5లో చూడాలనుకుంటున్నానని, ఆలోచించి మాట్లాడమని సూచించాడు. హౌస్‌లో కీర్తి తనకెప్పుడూ కనిపించలేదంటూ ఆమె పరువు తీశాడు. ఫైనల్‌గా రాజు ఎక్కడైనా రాజే అంటూ అతడిని పంపించేశాడు నాగ్. చదవండి: రాజశేఖర్ ఎలిమినేషన్‌కు కారణాలివే! నిజానికైతే ఫైమా ఎలిమినేట్ కావాల్సింది! -
అదే అసలైన మైనస్, అందువల్లే రాజ్ ఎలిమినేట్ అయ్యాడా!
మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌కు శుభం కార్డు పడనుంది. ఎవరు ఫినాలేకు చేరుకుంటారు? ఎవరు కప్పు కొడతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 12 వారం ఎలిమినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వారం రేవంత్, కీర్తి మినహా మిగతా ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఫైమా, రాజశేఖర్ ఇద్దరూ చివరి రెండు స్థానాల్లో ఉండగా ఫైనల్‌గా రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. అతడి గేమ్ చూసి రాజ్ కచ్చితంగా టాప్ 5లో ఉంటాడనుకున్నారు, కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజ్ బయటకు వచ్చేశాడు. ఇంతకీ రాజ్ ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం.. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో అడుగుపెట్టిన వ్యక్తి రాజ్. మాటల్లో తడబాటు, ఆటలో వెనకబడటం చూసి అతడు త్వరలోనే ఎలిమినేట్ అవుతాడనుకున్నారంతా! కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తన గ్రాఫ్‌ను నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చాడు. మాటల్లో, ఆటల్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ముందుకు సాగాడు. తనను చూసి నవ్వినవారితోనే చప్పట్లు కొట్టించుకున్నాడు. అయితే మొదటినుంచీ తనకంటూ ఫ్యాన్ బేస్ లేకపోవడం రాజ్‌కు పెద్ద మైనస్‌గా మారింది. వారాలు గడిచేకొద్దీ కంటెస్టెంట్ల మధ్య పోటీ ఎక్కువవుతూ వస్తుంది. అలాంటి సమయంలో హౌస్మేట్స్ గేమ్ కంటే కూడా బయట వారి అభిమానులు వేసే ఓట్లే కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడున్నవారిలో అందరికంటే తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రాజ్‌కే! పైగా తనకెలాంటి పీఆర్‌టీమ్ కూడా లేకపోవడంతో ఓట్లు పెద్దగా పడలేదు. మూడు వారాలుగా రాజ్ నామినేషన్లోకి రాలేదు. ఇది కూడా ఓట్లు పడకపోవడానికి ఒక ప్రధాన కారణం. మొదటి నుంచీ సోలో ప్లేయర్‌గా ఆడకుండా ఎవరో ఒకరి పక్కన నీడలా ఉండటం కూడా జనాలకు పెద్దగా నచ్చలేదు. హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే రాజ్ కన్నింగ్, చీటింగ్ ప్లేయర్ కాదు కానీ కొంత సేఫ్‌గా ఆడేవాడు. అప్పుడప్పుడూ స్మార్ట్‌గా కూడా ఆడేవాడు. కరెక్ట్ పాయింట్ మాట్లాడుతూ ఆదిరెడ్డి నోటికే తాళం వేసేవాడు. కాకపోతే చాలావరకు మాటల్లో కాన్ఫిడెన్స్, క్లారిటీ తక్కువగా ఉండేది. దీనివల్ల అతడు మిగతావారికంటే వీక్ అన్నట్లుగా కనిపించింది. చివరగా ఈవారం ఫైమాకు తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఆమె ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను ఎలిమినేట్ చేశారు. అంటే ప్రేక్షకుల ఓట్లతో కాకుండా బిగ్‌బాస్ నిర్ణయంతోనే అతడకు బయటకు వచ్చేశాడన్నమాట! చదవండి: మరోసారి తాతైన బ్రహ్మానందం ఆ పని చేసుండకపోతే ఫైమా ఎలిమినేట్ అయ్యేది! -
ఆ పని చేసుండకపోతే ఫైమా ఎలిమినేట్ అయ్యేది!
బిగ్‌బాస్ ఆడే ఆటలో కంటెస్టెంట్లు పావులు మాత్రమే. వారు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వారిని కచ్చితంగా చేసి తీరతారు. అందుకు నేటి ఎపిసోడ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్లో తొమ్మిది మంది ఉండగా వారిలో కొందరిని నిన్ననే సేవ్ చేశాడు నాగ్. మిగిలినవారిని ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరకు రాజ్, ఫైమా ఇద్దరే మిగిలారు. తను సేవ్ అయిపోతానని బలంగా నమ్మిన ఫైమా మొదటగా తన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను రాజ్ కోసం వాడేందుకు సిద్ధమైంది. కానీ నాగార్జున ఆలోచించుకోమని, మీ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకో అంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె భయపడిపోయి చివరి నిమిషంలో తనకోసమే వాడుతున్నట్లు ప్రకటించింది. తీరా ఓటింగ్‌లో ఫైమానే చివరి స్థానంలో ఉండగా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కింది. ఒకవేళ ఆ పాస్ వాడకపోయుంటే మాత్రం ఫైమా ఈ వారం బయటకు వచ్చేదే! ఫైమా సేవ్ అయిపోవడంతో ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుందనుకునేరు, కానే కాదు! ఓటింగ్‌లో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను అన్యాయంగా బయటకు పంపించేశారట. అంటే బిగ్‌బాస్ ఆడే ఆటలో రాజ్ బలైపోయాడన్న మాట. చదవండి: ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు: రేవంత్ ఓటీటీలో లవ్ టుడే, ఎప్పటినుంచంటే -
ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు: రేవంత్
ఫ్యామిలీస్ రాకతో హౌస్‌మేట్స్‌కు ఆనందంతో పాటు ఎవరు గెలుస్తారనేదానిపై ఓ క్లియర్ పిక్చర్ కనబడింది. ఎవరు టఫ్ కాంపిటీషన్ ఇస్తారన్నప్పుడు మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ రేవంత్ పేరు చెప్పారు. తర్వాత శ్రీహాన్, ఇనయ పేర్లు వినిపించాయి. అంటే అసలు సిసలైన పోటీ ఈ ముగ్గురి మధ్యే ఉందన్న సంకేతాలు కంటెస్టెంట్లకు చేరాయి. మరీ ముఖ్యంగా గెలుపు గాలులు రేవంత్వైపు వీస్తున్నట్లు వారికి చూచాయగా అర్థమైంది. ఇదిలా ఉంటే టాప్ 9 కంటెస్టెంట్లను ఎవరిలో చెడు లక్షణాలు ఉన్నాయో చెప్పమన్నాడు నాగ్. దీనికి ఇనయ.. కొన్ని సందర్భాల్లో రాజ్ ఎందుకు అరుస్తాడో అర్థం కాదని చెప్పింది. ఆదిరెడ్డి వంతురాగా.. రేవంత్ బాగా ఆడతాడు, అలాంటి వ్యక్తి బాగా ఆడతానని ప్రూవ్ చేసుకోనవసరం లేదన్నాడు. శ్రీసత్య.. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని, అది తనలో ఉన్న చెడు లక్షణమని పేర్కొంది. ఫైమాకు ఇంతవరకూ వెటకారం తగ్గలేదన్నాడు రేవంత్. ఇక సంచాలక్‌గా ఉన్నప్పుడు ఏ కంటెస్టెంట్‌కూ సపోర్ట్ చేయొద్దని ఫైమాకు చురకలంటించాడు నాగ్. ఇంకా ఈ కంటెస్టెంట్లు ఎవరి గురించి ఏం చెప్పారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: చచ్చినా బిగ్‌బాస్‌కు రానన్నాడు, ఇప్పుడేకంగా కప్పుకే గురి పెట్టాడు ఫైమా చేతిలో ఎలిమినేషన్, అతడే ఎలిమినేట్ కానున్నాడా? -
రాజ్ ఎలిమినేట్, అంధురాలి పెన్షన్‌తో ఐదేళ్లు బతికామన్న ఆది!
Bigg Boss 6 Telugu, Episode 84: ఇంటిసభ్యుల రాకతో హౌస్మేట్స్ ఫుల్ జోష్ మీదున్నారు. వారి జోష్ రెట్టింపు చేయడానికి మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను రప్పించారు. అయితే వారి గొంతు గుర్తుపడితనే వారితో మాట్లాడే అవకాశం కల్పిస్తానని మెలిక పెట్టాడు నాగ్. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ గొంతును గుర్తుపట్టడం డెడ్ ఈజీ కాబట్టి అందరూ ఎంచక్కా ఫ్యామిలీస్‌తో కబుర్లాడారు. మొదటగా ఇనయ కోసం ఆమె తమ్ముడితోపాటు మాజీ కంటెస్టెంట్ సోహైల్ వచ్చారు. ఇనయను, ఆమె తల్లిని కలిపినందుకు బిగ్స్కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఫినాలేలో డబ్బు ఆఫర్ చేస్తే తనలా సూట్‌కేస్ తీసుకోమని సలహా ఇచ్చాడు. తనకోసం వచ్చిన సోహైల్‌కు థ్యాంక్స్ చెప్పిన ఇనయ బయటకు వచ్చాక ఫోన్ నెంబర్ తీసుకుంటానంటూ మెలికలు తిరిగింది. సోహైల్ కోసం ఆమె మణికొండకు వచ్చిందని, తన జిమ్ సెంటర్లో జాయిన్ అయిందంటూ ఆమె గుట్టంతా బయటపెట్టాడు సోహైల్. ఇనయకు హౌస్‌లో రేవంత్ టఫ్ కాంపిటీషనర్ అని, ఆదిరెడ్డి అసలు పోటీ ఇవ్వడని ఇనయ తమ్ముడు అభిప్రాయపడ్డాడు. తర్వాత శ్రీహాన్ కోసం అతడి తండ్రి, శివబాలాజీ వచ్చారు. ఈ సందర్భంగా శివబాలాజీ.. నేను షో గెలిచి బయటకు వచ్చినప్పుడు రేవంత్ హౌస్‌లో జరిగేదంతా నిజమేనా? అడిగాడు. అవునని చెప్పినప్పుడు చచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్నాడు. మరి ఇప్పుడేంటి? అంటూ ఆటపట్టించాడు. తర్వాత శ్రీహాన్‌కు రేవంత్ కాంపిటీషన్ అయితే, ఫైమా పోటీనే కాదని చెప్పాడు. ఈ 12 వారాల ఆటకు శ్రీహాన్‌కు 9 మార్కులిచ్చాడు. ఫైమా తన అక్క సల్మాను, బుల్లెట్ భాస్కర్‌ను చూడగానే ఏడ్చేసింది. భాస్కర్ అయితే పంచులతో అందరినీ నవ్వించాడు. ఇనయను ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదన్నాడు. ఫైమాకు ఇనయ గట్టి పోటీ ఇస్తుందని, శ్రీసత్య పోటీనే కాదని చెప్పాడు. ఫైమా మాట్లాడుతూ.. అమ్మవాళ్లకు సొంతిల్లు కట్టించి, బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేశాకే తాను పెళ్లి చేసుకుంటానంది. అనంతరం రేవంత్ అన్నయ్య సంతోష్, స్నేహితుడు రోల్ రైడా స్టేజీపైకి వచ్చారు. తన తమ్ముడికి శ్రీహాన్ పోటీ అని, రోహిత్ అసలు పోటీనే కాదన్నాడు. తర్వాత రోహిత్ కోసం అతడి తమ్ముడు డింప్, నటుడు ప్రభాకర్ వచ్చి పలకరించారు. రోహిత్‌కు రేవంత్ పోటీ అని, రాజ్ పోటీయే కాదని చెప్పాడు ప్రభాకర్. రేవంత్‌ను గెలిస్తే టైటిల్ గెలవడం ఈజీ అని ఉన్నమాట చెప్పి అందరికీ హింటిచ్చాడు. తర్వాత ఆదిరెడ్డి కోసం చెల్లెలు నాగలక్ష్మి, మాజీ కంటెస్టెంట్ లహరి వచ్చారు. నువ్వు కనిపించనందుకు బాధగా ఉందన్నా అంటూ అంధురాలైన నాగలక్ష్మి బాధపడింది. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ఐదేళ్లు నేను ఖాళీగా ఉన్నసమయంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తో బతికాం అని చెప్పాడు. ఆదికి రేవంత్ కాంపిటీషన్ అని, శ్రీసత్య పోటీయే కాదని చెప్పింది నాగలక్ష్మి. కళ్లు లేని పిల్ల అని నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయరు. ఇప్పుడు లహరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంది అని మురిసిపోయింది. శ్రీసత్య కోసం తన బెస్ట్‌ఫ్రెండ్ హారిక, నటి విష్ణుప్రియ స్టేజీపైకి వచ్చారు. ఆమెకు రేవంత్ పోటీ అని, కీర్తి పోటీయే కాదని చెప్పారు. శ్రీసత్యను తన తల్లి కోసం టెన్షన్ పడొద్దని సూచించారు. అమ్మకు రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ జరుగుతోందని, తన ఆరోగ్యం గురించిఆందోళన పడొద్దని చెప్పారు. తర్వాత రాజ్ ఫ్రెండ్ వెంకీ, హీరో సాయిరోనక్ వచ్చి రాజ్‌కు ఆటలో రేవంత్ కాంపిటీషన్ అయితే, ఇనయ పోటీయే కాదని స్పష్టం చేశారు. కీర్తి కోసం ప్రియాంక, వితికాషెరు వచ్చారు. ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నావు, కానీ బయట చాలామంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అని కీర్తిలో ధ:ర్యం నింపింది వితికా. కీర్తికి హౌస్‌లో శ్రీహాన్ పోటీ అని, శ్రీసత్య పోటీయే కాదని కుండ బద్ధలు కొట్టారు ప్రియాంక, వితికా. ఇకపోతే సండే షూటింగ్ ఆల్రెడీ పూర్తవగా రాజ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నటించినందుకు నా భార్య ఇప్పటికీ ఏదోలా ఫీలవుతుంది: విష్ణు విశాల్ ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి?: స్పందించిన కూతురు -
టాప్ 9 కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ మరో సర్ప్రైజ్
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈపాటికే ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించిన బిగ్‌బాస్ వీకెండ్లో మిగతా ఇంటిసభ్యులను, ఫ్రెండ్స్‌ను స్టేజీపైకి రప్పించి వారిని సర్ప్రైజ్ చేయనున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. టాప్ 9 కంటెస్టెంట్ల కోసం వీజే సన్ని, రోల్ రైడా, బుల్లెట్ భాస్కర్, సింగర్ సాకెత్, సోహైల్ ఇలా ఎంతోమంది వచ్చారు. అయితే ఈసారి వారితో ఎవరు టాప్5 అనే గేమ్‌కు బదులుగా మరో డిఫరెంట్ గేమ్ ఆడించాడట. అదేంటో తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: అలాంటి కథలు చిరంజీవికి సెట్ కావు: పరుచూరి ఫైమా చేతిలో ఎలిమినేషన్, అతడే ఎలిమినేట్ కానున్నాడా? -
Bigg Boss: ఫైమా చేతిలో ఎలిమినేషన్, అతడే ఎలిమినేట్!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈవారం ఏడుగురు కంటెస్టెంట్లు రాజ్, ఫైమా, రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ నామినేషన్లో ఉన్నారు. వీరిలో శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ అత్యధిక ఓట్లతో టాప్ పొజిషన్లో ఉన్నారు. రోహిత్‌కు స్క్రీన్ స్పేస్ తగ్గించడంతో అతడిని ఎలిమినేట్ చేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ లాస్ట్ డే అతడికి భారీగా ఓట్లు పడి సేవ్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిందల్లా శ్రీసత్య, రాజ్, ఫైమా.. ఎలాగో ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. కాబట్టి తను డేంజర్ జోన్లో ఉంటే తనకోసమే వాడుకుంటుంది. ఒకవేళ నాగార్జున ఫైమాను ముందే సేవ్ చేసేస్తే మాత్రం చివరగా మిగిలిన ఇద్దరిలో ఒకరిని కాపాడేందుకు ఆ పాస్ వాడే ఆస్కారం ఉంది. అంటే ఈవారం ఎలిమినేషన్ ఫైమా చేతిలో ఉందన్నమాట! ఆమె ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తనకోసం వాడుకుంటుందా? రాజ్, శ్రీసత్యలలో ఎవరికైనా ఉపయోగిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు రాజ్‌ను ఎలిమినేట్ చేసేందుకు బిగ్‌బాస్ టీమ్ రెడీ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: కెప్టెన్‌గా ఇనయ కొత్త రూల్, ఫైమాకు మట్టి తినే అలవాటు ఆమెకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుందనుకున్నా: హమీదా -
ఫైమాకు మట్టి తినే అలవాటు, ఇనయ కొత్త రూల్ ఏంటంటే?
Bigg Boss 6 Telugu, Episode 83: ఫైమాకు ఆకలైందో మరేంటో కానీ పొద్దుపొద్దునే గార్డెన్ ఏరియాలో ఉన్న మట్టి ఏరుకుంటూ తింది. అది చూసిన బిగ్‌బాస్ ఆమెను ఓ ఆటాడుకున్నాడు. మీ రేషన్ మీరు వెతుక్కున్నారు కాబట్టి ఇంట్లో రేషన్ అవసరం లేదని సెటైర్లు వేశాడు. తనకు ఫుడ్ కట్ చేయమంటున్నాడేమోనని అనుకున్న ఫైమా ఇకమీదట మట్టి తిననని చెంపలేసుకుని సారీ చెప్పింది. తను వేసింది జోక్ అని అర్థం చేసుకోలేకపోయిన ఫైమాకు నాలుగు ఎక్స్ట్రా గుడ్లు పంపించాడు బిగ్‌బాస్. తర్వాత రేవంత్‌కు బిగ్‌బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అతడి భార్య అన్వితతో వీడియోకాల్ మాట్లాడించాడు. ఈ సందర్భంగా ఆమె డెలివరీ డేట్ కూడా ఇచ్చారని శుభవార్త చెప్పింది. నిన్ను చాలా మిస్ అవుతున్నానని చెప్పింది. ఇంతలో సడన్‌గా వీడియోకాల్ కట్ అవ్వడంతో రేవంత్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఇంకా మాట్లాడాలి బిగ్‌బాస్, ప్లీజ్ అని దీనంగా వేడుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతడి తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమెను చూడగానే రేవంత్ దుఃఖం పటాపంచలైంది. తల్లిని మనసారా హత్తుకుని ఆమెతో తనివితీరా మాట్లాడాడు. గడ్డం వద్దని అమ్మ చెప్పగానే వెంటనే దాన్ని తీసేసుకుని కొత్త లుక్‌తో కనిపించాడు. ఎక్కువ కోప్పడుతున్నావు, ఊరికే ఏడుస్తున్నావు, నెట్లో పెట్టేస్తున్నారు, కాస్త చూసుకోరా అని కొడుక్కి సలహాలు ఇచ్చింది. అలాగే వంటగదిలో రేషన్ దగ్గర కక్కుర్తి పడి అందరికీ అది ఇవ్వను, ఇది ఇవ్వను అనడం బాలేదంది. ఆ తర్వాత అందరితో కలిసి స్టెప్పేసి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది పెద్దావిడ. ఏదేమైనా రేవంత్‌కు డబుల్ ధమాకా అందిందని హౌస్మేట్స్ సంతోషించారు. కానీ రేవంత్ మాత్రం భార్యతో ఇంకాసేపు మాట్లాడాలని ఉందని మనసులో పదేపదే బాధపడ్డాడు. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన చివరి కెప్టెన్సీ టాస్క్‌లో ఇనయ గెలిచి కెప్టెన్‌గా అవతరించింది. ఎట్టకేలకు తను కెప్టెన్ కావడంతో భావోద్వేగానికి లోనైంది. చివరి కెప్టెన్ అయిన ఇనయ నేరుగా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. కెప్టెన్‌గా కొత్త నిబంధనలేమీ పెట్టడం లేదని ఎంజాయ్ చేద్దామంది. అలాగే ఎవరికి ఎంత ఫుడ్ కావాలంటే అంత తినండి అని చెప్పింది. దీంతో హౌస్మేట్స్ తెగ సంబరపడిపోయారు. చదవండి: శ్రీసత్య ఎప్పుడు వెళ్లిపోతుందా? అని ఎదురుచూసిన హమీదా కష్టాల్లో ఉన్న పనిమనిషికి సాయం చేసిన నయనతార -
Bigg Boss: చివరి కెప్టెన్‌గా ఇనయ, నేరుగా సెమీ ఫైనల్స్‌లోకి!
ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో హౌస్మేట్స్ గాల్లో తేలిపోతున్నారు. కళ్లనిండా వారిని చూసుకుని మనసు నిండా వారి జ్ఞాపకాలు పదిలంగా దాచుకుని అయినవాళ్లకు భారంగా వీడ్కోలు పలుకుతున్నారు ఇంటిసభ్యులు. మరో మూడు, నాలుగు వారాల్లో తిరిగి ఇంటికి వచ్చేస్తామంటూ కళ్లతోనే సంభాషిస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్లో చివరగా రేవంత్ తల్లి వచ్చి వెళ్లిపోవడంతో ఫ్యామిలీ వీక్ ముగియనుంది. ఇక హౌస్‌లో చివరి కెప్టెన్సీ పోటీ జరగనుంది. ఇందులో భాగంగా ఒక రౌండ్ చుట్టూరా ఇంటిసభ్యులు నిలబడి బజర్ మోగినప్పుడు మధ్యలో ఉన్న బంతిని అందుకోవాలి. మళ్లీ బజర్ మోగే సమయానికి ఎవరి చేతిలో అయితే బంతి ఉంటుందో వారు ఇద్దరిని ఆటలో నుంచి తొలగించవచ్చు. ఈ గేమ్‌లో ఇనయ పోటాపోటీగా ఆడి చివరి కెప్టెన్ అయినట్లు సోషల్ మీడియాలో లీకైంది. ఈ విషయం తెలిసి ఇనయ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎట్టకేలకు కెప్టెన్ అవ్వాలన్న ఆమె కల నెరవేరిందని సంతోషపడుతున్నారు. ఈ దెబ్బతో ఇనయ ఏకంగా సెమీ ఫైనల్స్‌లో స్థానం సంపాదించుకుంది. చదవండి: శ్రీసత్య ఎలిమినేషన్ కోసం ఎదురుచూస్తున్న హమీదా న్యూజిలాండ్ షూటింగ్లో రామ్‌చరణ్ -
శ్రీసత్యకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందనుకున్నా
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. రేపోమాపో టికెట్ టు ఫినాలే ప్రారంభం కానుంది. ఆల్రెడీ హౌస్‌మేట్స్‌కు బూస్ట్ ఇచ్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించి సర్ప్రైజ్ ఇస్తున్నాడు బిగ్‌బాస్. మరోవైపు బిగ్‌బాస్ షో గురించి నిత్యం ఎవరో ఒకరిని పిలిచి డిబేట్ పెడుతూనే ఉంది అరియానా. తాజాగా బిగ్‌బాస్ కెఫెకు మాజీ కంటెస్టెంట్ హమీదా వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'శ్రీసత్యకు దండం పెట్టాలి. ఆమె ఎలిమినేట్ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిది' అని అభిప్రాయపడింది. తన పేరెంట్స్ మాత్రం ఇనయకు పెద్ద ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చింది. అది సరే కానీ శ్రీసత్య ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నావా? అంటూ కౌంటరిచ్చింది అరియానా. చదవండి: రేవంత్‌కు బిగ్‌బాస్ షాక్, అంతలోనే సర్ప్రైజ్ ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్ -
రేవంత్‌కు బిగ్‌బాస్ షాక్.. అర్ధాంతరంగా..
ఫ్యామిలీ మెంబర్స్ రాకతో బిగ్‌బాస్ హౌస్ ఎమోషనల్‌గా మారింది. ఇప్పటికే ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా, కీర్తి, రాజ్, శ్రీహాన్, ఇనయ, రోహిత్ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చి వెళ్లారు. ఇంకా ఒకే ఒక్క కంటెస్టెంట్ తనవాళ్ల రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అతడే రేవంత్. త్వరలో తల్లి కాబోతున్న తన భార్య వస్తుందా? లేదంటే తన కన్నతల్లే వస్తుందా అని ఆశగా పదేపదే గేటువంక చూస్తున్నాడు. అతడి నిరీక్షణకు తెరదించాడు బిగ్‌బాస్. భార్యతో వీడియోకాల్ ఆప్షన్ ఇవ్వడమే కాకుండా తల్లిని ఇంట్లోకి పంపించి సర్ప్రైజ్ చేశాడు. ఇక రేవంత్ భార్య మాట్లాడుతూ.. ఎంతమంది ఉన్నా నువ్వు లేని బాధ చాలా ఎక్కువగా ఉందని చెప్పింది. ఇలా ఆమె మాట్లాడుతున్న సమయంలో సడన్‌గా వీడియోకాల్ కట్ చేశాడు బిగ్‌బాస్. ఒక్కసారి భార్యతో మాట్లాడతానని వేడుకున్నా బిగ్‌బాస్ కనికరించకపోవడంతో ఏడ్చేశాడు. అంతలోనే హౌస్‌లోకి అమ్మ రావడంతో ఆనందభాష్పాలతో ఎదురెళ్లాడు. ఆమె కీర్తిని దగ్గరకు తీసుకుని నువ్వు నా కూతురులాంటిదానివి కాదు, కూతురివే అంటూ ఆప్యాయంగా హత్తుకుంది. అమ్మ గడ్డం తీసుకోమని చెప్పగానే క్లీన్ షేవ్ చేసుకున్నాడు రేవంత్. చదవండి: ఇనయ కల నెరవేర్చిన బిగ్‌బాస్, శ్రీహాన్ కాళ్లు మొక్కిన సిరి పెళ్లిపీటలెక్కనున్న నటి, ఫొటోలు వైరల్ -
ఇనయ కల నెరవేర్చిన బిగ్‌బాస్, శ్రీహాన్ కాళ్లు మొక్కిన సిరి
Bigg Boss Telugu 6, Episode 82: పన్నెండు వారాల ఎడబాటుకు తెర దించుతూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపుతున్నాడు బిగ్‌బాస్. వారిని చూసి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు హౌస్మేట్స్. తమ వాళ్లను చూడగానే తెలియకుండానే కన్నీళ్లు కార్చుతున్నారు. వారితో కలిసి చిందులేస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చాయో చూద్దాం.. పన్నెండు వారాల తర్వాత ప్రేయసి కళ్లముందుకు రావడంతో భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీహాన్. హౌస్‌లోకి వెళ్లగానే శ్రీహాన్‌ను గట్టిగా పట్టుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించింది సిరి. ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని మెడపై ఉన్న టాటూ చూపించింది. తర్వాత సిరి కొడుకు చైతూ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. వచ్చీరాగానే ఈ చిచ్చరపిడుగు తన బుల్లిబుల్లి మాటలతో అందరినీ నవ్వించాడు. ఎవరెలా మాట్లాడతారో వారి డైలాగులను సరిగ్గా దింపేశాడు. తర్వాత.. ఇంతందం దారి మళ్లిందా.. పాటకు సిరి, శ్రీహాన్ స్టెప్పులేశారు. వారిద్దరి మధ్యలో చైతూ వచ్చేందుకు ప్రయత్నించడంతో పానకంలో పుడకలా వస్తావేంట్రా అని తిట్టలేక నవ్వుకున్నాడు శ్రీహాన్. చివరగా వెళ్లిపోయేముందు శ్రీహాన్ పాదాలు తాకి వీడ్కోలు తీసుకుంది సిరి. ఇక రాత్రిపూట కడుపులో మండుతుందని పాలు అడిగాడు రాజ్.. ఎప్పటిలాగే స్ట్రిక్ట్ మాస్టర్ రేవంత్ కుదరదని తెగేసి చెప్పాడు. అడిగినప్పుడు ఇవ్వడానికి ఏం ప్రాబ్లమ్ అని లోలోనే గునుక్కున్నాడు రాజ్. తర్వాతి రోజు కీర్తి కోసం ఆమె స్నేహితుడు, బుల్లితెర నటుడు మహేశ్ వచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ చేసి గోరుముద్దలు తినిపించాడు. ఎవ్వరూ కోల్పోలేనిది నువ్వు కోల్పోయావు. కానీ ఆ దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్ బిగ్‌బాస్. ఇక్కడ నీతో నీకే పోటీ.. లక్షల మంది సైన్యం నీ వెంట ఉన్నారు.. అదే నీ బలం.. అంటూ ఆమెలో పాజిటివిటీ నింపాడు. తను దత్తత తీసుకున్న పాప ఫొటోను బహుమతిగా అందించాడు. అయితే ఆమెను కాపాడుకోలేకపోయానని బోరున ఏడ్చింది కీర్తి. అనంతరం మహేశ్.. ఇనయను ముద్దుపెట్టమని అడగడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. అతడికి నో చెప్పడం ఇష్టం లేని ఇనయ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అనంతరం ఇనయ సుల్తాన తల్లి నజ్బూర్ హౌస్‌లోకి వచ్చింది. ఆమెను చూడగానే ఎమోషనలైంది ఇనయ. 'నాకోసం నువ్వు మనసులో ఇంత బాధపడుతున్నావని తెలీదు, అందుకే వచ్చాను. నీ జీవితం నువ్వు చూసుకున్నావు, ఇంత కష్టపడ్డావు. బిగ్‌బాస్‌కు వచ్చావు. గెలిచి రావాలి. నువ్వు బాగుండాలనేదే నా కోరిక' అని చెప్పింది. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోదాం అని ఇనయ అడిగితే అది తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే బాగా ఆడి గెలిచి రా అని బదులిచ్చింది. కేజీఎఫ్‌లోని అమ్మ సాంగ్ వేయడంతో తల్లి కాళ్ల మీద పడి ఏడ్చింది ఇనయ. అనంతరం ఆమె అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తల్లిని బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలన్న తన కల నెరవేరడంతో ఇనయ తెగ సంతోషపడిపోయింది. చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్ భారత ఆర్మీని అవమానించిందంటూ నటిపై ట్రోలింగ్ -
ఇనయను ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్, కీర్తి కోసం వచ్చింది ఎవరంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో ఓపక్క టీచింగ్ క్లాసులు మరోపక్క ఫ్యామిలీస్ ఎంట్రీతో నవ్వులు వెదజల్లుతున్నాయి. ఈ క్రమంలో శ్రీహాన్ ఫ్లర్టింగ్ ఎలా చేయాలనేది కంటెస్టెంట్లకు నేర్పిస్తున్నాడు. అమ్మాయిలను ఎలా పడగొట్టాలని టిప్స్ ఇస్తున్నాడు. తర్వాత కీర్తి కోసం ఆమె స్నేహితుడు, నటుడు మహేశ్ హౌస్‌లో అడుగుపెట్టాడు. అతడిని చూడగానే కీర్తి కళ్లల్లో ఆనందం కట్టలు తెచ్చుకుంది. వీరిద్దరూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతూ స్టెప్పులేశారు. కీర్తికి తన చిన్ననాటి ఫొటో గిఫ్ట్ ఇవ్వడంతో కంట్లో నుంచి నీళ్లు జలజలా రాలాయి. 'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో అవకాశం ఇచ్చాడు, అదే బిగ్‌బాస్ అని కీర్తిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించాడు. సినిమాల్లో రాణించేందుకు ఇల్లు వదిలేసి వచ్చిన ఇనయ తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఎన్నోసార్లు బాధపడింది. అలాంటిది.. ఆమెను తిరిగి తల్లితో కలిపాడు బిగ్‌బాస్. ఇనయ తల్లిని హౌస్‌లోకి పంపించాడు. ఆమెను చూడగానే కాళ్లమీద పడిపోయింది ఇనయ. గుండెల్ని పిండేసే ఈ ఎమోషనల్ ఎపిసోడ్ చూడాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: కొడుకుతో హౌస్‌లో అడుగుపెట్టిన సిరి యశోద ఓటీటీ విడుదల ఆపాలంటూ ఆదేశం -
కొడుకుతో హౌస్‌లోకి సిరి, శ్రీహాన్ పేరు పచ్చబొట్టు..
బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఫ్యామిలీ వీక్ ఎంతో ఎమోషనల్‌గా సాగుతుంది. వారాల తరబడి అయినవారికి దూరంగా ఉన్న హౌస్మేట్స్ కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను చూడగానే ఎగిరి గంతేస్తుంటారు. ప్రస్తుతం ఆరో సీజన్లో కూడా సేమ్ సిచ్యుయేషన్. 12 వారాల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌ను చూడటంతో భావోద్వేగానికి లోనవుతున్నారు టాప్ 9 కంటెస్టెంట్లు. నిన్న ఫైమా, శ్రీసత్య, రోహిత్ తల్లి హౌస్‌లోకి రాగా ఈ రోజు ఎపిసోడ్లో శ్రీహాన్ ప్రియురాలు సిరి, తన కొడుకు చైతూతో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్. నీకోసం ఓ సర్ప్రైజ్ అంటూ వెనక్కు తిరిగి మెడ కింద శ్రీహాన్ అని పొడిపించుకున్న పచ్చబొట్టు చూపించింది. అలాగే కొడుకు చైతూను తీసుకొచ్చింది. అతడు లోపలకు రాగానే తన మాటలతో చెలరేగిపోయాడు. హౌస్మేట్స్ తరచూ ఏమేం డైలాగ్స్ వాడతాడో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సర్ప్రైజ్లు చూసి శ్రీహాన్ సంతోషంలో మునిగి తేలాడు. నిజానికి ఇదంతా లైవ్‌లో నిన్ననే టెలికాస్ట్ అవగా ఈరోజు ఎపిసోడ్లో చూపించనున్నారు. చదవండి: అప్పుడు ఏడిపించంటూ సవాల్, ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది డబ్బుల్లేక అమ్మకు ఫిజియోథెరపీ ఆపేశారు: శ్రీసత్య ఎమోషనల్ -
ఇవే తగ్గించుకుంటే మంచిది.. శ్రీసత్యను హెచ్చరించిన తండ్రి
Bigg Boss Telugu 6, Episode 81: కన్నవాళ్లను చూడగానే అప్పటిదాకా పడ్డ శ్రమనంతా మర్చిపోతున్నారు హౌస్మేట్స్. 12 వారాల తర్వాత వారు ఎదురుపడటంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇక ఎవరి పేరెంట్స్ వచ్చినా ఆతృతగా దగ్గరికెళ్లి పలకరించి వారితో కలిసిపోవాలని ప్రయత్నిస్తూ అంతలోనే తన కన్నవాళ్లు గుర్తొచ్చి కన్నీళ్లను తుడుచుకుంటున్న కీర్తిని చూసి జాలిపడని వారే లేరు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ హౌస్‌లో అడుగుపెట్టాయో చూద్దాం.. ఈరోజు మొదటగా ఫైమా తల్లి షాహీదా బిగ్‌బాస్ హౌస్‌లో హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమె చూడగానే ఫైమా ముఖంలో సంతోషం వెల్లివెరిసింది. తల్లిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టేసింది. అందరూ నన్ను ఫైమా వాళ్ల అమ్మ అంటూ గుర్తుపట్టి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని ఎమోషనలైంది ఆమె తల్లి. అంతలోనే వాతావరణాన్ని కూల్ చేసేందుకు రేవంత్‌ను చూస్తే భయమైతుంది అంటూ హౌస్‌మేట్స్‌పై జోకులు పేల్చింది. ఇక ఫైమాను పక్కకు తీసుకెళ్లిన షాహీదా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ వాడొద్దని చెప్పింది. కోపం, వెటకారం తగ్గించుకోమని శ్రీసత్య, ఇనయలతో జాగ్రత్తగా ఉండమని సూచనలు చేసింది. తర్వాత తన కూతురితో పాటు ఇంటి సభ్యులందరితో కలిసి డ్యాన్స్ చేసింది. ఫైమా తన తల్లిని ఎత్తుకుని తిప్పుతుంటే కీర్తికి తన కన్నవాళ్లు గుర్తొచ్చి ఏడ్చేసింది. అందరిముందు తన బాధను బయపెట్టి వారి సంతోషాన్ని చెదరగొట్టడం ఇష్టం లేక బాత్రూమ్లోకి వెళ్లి బోరుమని ఏడ్చింది. తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్, లూప్ అంటూ ఓ ఆటాడుకున్నాడు. ఇదే ఛాన్స్ అనుకున్న ఇంటిసభ్యులు ఒకరినొకరు ఆటాడుకున్నారు. శ్రీహాన్‌ను ఫ్రీజ్ అన్నప్పుడు ఫైమా, శ్రీసత్య అతడికి ఆడవేషం కట్టి ఆటపట్టించారు. తర్వాత శ్రీసత్య తండ్రి గొంతు విని గార్డెన్ ఏరియాలోకి పరుగెత్తుకొచ్చింది. తండ్రిని, వీల్‌చైర్‌లో ఉన్న తల్లిని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. తల్లికి గోరుముద్దలు తినిపించింది. పేరెంట్స్ ప్రేమ దక్కినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని సత్యతో చెప్పింది కీర్తి. ఇక సత్య తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ.. 'నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు. ఇంత ఎత్తుకు ఎదుగుతావనుకోలేదు. కానీ కోపం, వెటకారం తగ్గించుకోవాలి. మొదటి మూడు వారాలు బాగున్నావు, తర్వాత ఇలా మారిపోయావేంటి? పాత సత్య ఇలా ఉండదు. నువ్వు పిచ్చిపిచ్చి నామినేషన్స్ వేశావు, ఇంట్లో ఎవరైనా సరే బలమైన కారణం లేకుండా సిల్లీ నామినేషన్స్ వేయొద్దు' అని హెచ్చరించాడు. వాళ్లు వెళ్లిపోగానే సత్య తన తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందింది. అమ్మ కాలు వాసింది, ఏదో భయంగా ఉంది. ఫిజియోథెరపీ ఆపేశారు. ఎవరూ సాయం చేయట్లేదని అర్థమైంది. వాళ్ల దగ్గర తినడానికి సరిపడా డబ్బులున్నాయి. కానీ చికిత్సకు సరిపేడంత లేవు అని ఏడ్చింది. అనంతరం తండ్రి తన కోసం చేసిన వంటకాలను అందరితో కలిసి పంచుకుంది. నెక్స్ట్ రోహిత్ అమ్మ అతడిని వెనక నుంచి వచ్చి కళ్లు మూసి సర్ప్రైజ్ చేసింది. తల్లిని చూడగానే భావోద్వేగానికి లోనైన రోహిత్.. ఆమె పాదాలమీద పడి ఆశీర్వాదం తీసుకుని అమ్మను పట్టుకుని ఏడ్చేశాడు. ఈ సందర్భంగా ఆమె.. నువ్వు ఒకసారి కెప్టెన్ అయి మా కలను నెరవేర్చు అని కోరింది. తర్వాత కొడుకుతో కలిసి బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసింది. ఇక మెరీనా తనకోసం పంపిన ఫొటోఫ్రేమ్ చూసి కంటతడి పెట్టుకున్నాడు రోహిత్. రిలేషన్లో ఉన్నప్పుడు మొట్టమొదట దిగిన సెల్ఫీ ఫొటో అదేనని ఆ ఫొటో తాలూకు జ్ఞాపకాలను పంచుకున్నాడు రోహిత్. రేపటి ఎపిసోడ్లో మిగతా హౌస్మేట్స్ ఫ్యామిలీస్ రానున్నాయి. చదవండి: అప్పుడు ఏడిపించంటూ సవాల్.. ఇప్పుడు రోజూ ఏడుస్తూనే ఉంది 51 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
అప్పుడు ఏడిపించంటూ సవాల్.. ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది!
బిగ్‌బాస్ షోలో తమను నిరూపించుకోవాలని, ప్రేక్షకుల మనసులు గెలిచి విజేతగా నిలవాలని ఇలా ఎన్నో కలలు కంటుంటారు కంటెస్టెంట్లు. ఏ కొద్ది మంది మాత్రమే వారి కలను సాకారం చేసుకుంటారు. మిగతావాళ్లు ప్రయాణం మధ్యలోనే వెనుదిరుగుతారు. అందులో గీతూ రాయల్ ఒకరు. బిగ్‌బాస్ షో అంటే పడి చచ్చే ఆమెకు ఆరో సీజన్లో పాల్గొనే బంపర్ ఆఫర్ వచ్చింది. విన్నర్ అయిపోతానని తనకు తానే ఫిక్స్ అయిపోయింది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆటకు ఆటంకం కలిగింది. ప్రయాణం మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. కనీసం టాప్ 10లో.కూడా పత్తా లేకుండా పోయింది. ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది గీతూ. ఆట నుంచి అర్ధాంతరంగా తొలగిపోవడాన్ని తట్టుకోలేక లోలోపలే కుమిలిపోతోంది. హౌస్‌లో ఉన్నప్పుడు నన్ను ఏడిపించు బిగ్‌బాస్ అంటూ సవాల్ విసిరిన గీతూ ఇప్పుడు నిత్యం ఏడుస్తూనే ఉంది. తాజాగా ఆమె బిగ్‌బాస్ షో చూస్తూ మరోసారి ఏడ్చేసింది. ఫ్యామిలీ వీక్ కావడంతో కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా హౌస్‌లో అడుగుపెడుతున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన గీతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోను గీతూ భర్త వికాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'గీతూ ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం చాలా కలలు కంది. షోలోకి వెళ్లకముందే వాళ్ల అమ్మకి చీర కొనిచ్చి దాన్ని కట్టుకురమ్మని చెప్పింది. సడన్ ఎలిమినేషన్ మేమంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. ఫ్యామిలీ థీమ్‌లో వాళ్ల అమ్మను బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలనుకుంది. ఇప్పుడిలా ఎపిసోడ్ చూసేటప్పుడు వాళ్ల అమ్మను గుర్తు చేసుకుని చాలా ఏడుస్తోంది. మేమంతా గీతూతో ఉన్నాం. మీరు కూడా ఉంటారనుకుంటున్నాం' అని రాసుకొచ్చాడు గీతూ భర్త. View this post on Instagram A post shared by Vikas Mickey (@vikasmickey) చదవండి: రోహిత్ కోసం ఎవరు వచ్చారో తెలుసా? ఎట్టకేలకు ఓటీటీలో కాంతార రిలీజ్ -
బిగ్‌బాస్: రోహిత్ కోసం ఎవరు వచ్చారో తెలుసా?
ఇంటిసభ్యుల రాకతో హౌస్మేట్స్ ముఖాలు మతాబుల్లా వెలిగిపోతున్నాయి. ఇప్పటికే ఆదిరెడ్డి తన కూతురి బర్త్‌డేను హౌస్‌లో సెలబ్రేట్ చేసినందుకు ఎగిరి గంతేస్తుండగా నెక్స్ట్ మా కోసం ఎవరు రాబోతున్నారా? అని ఇతర కంటెస్టెంట్లు గేటు వంక ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు శ్రీసత్య, ఫైమా, రోహిత్ తల్లి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రోహిత్‌ను సర్ప్రైజ్ చేయాలని వెనక నుంచి వచ్చి కళ్లు మూసింది అతడి తల్లి. ఆమె స్పర్శ తగలగానే రోహిత్ ఎమోషనలయ్యాడు. అమ్మ చేతిని ఆప్యాయంగా ముద్దాడుతూ తనపై ప్రేమను గుమ్మరించాడు. మరోపక్క మ్యూజిక్ క్లాస్‌లో టీచర్ రాజ్‌ను ఆడేసుకున్నారు విద్యార్థులు. వీరెక్కడ దొరికార్రా బాబూ అనుకున్న రాజ్ వారినేం చేయలేక తల పట్టుకున్నాడు. మొత్తానికి గొడవలు పక్కన పెట్టేసి సంతోషంలో మునిగి తేలుతున్నారు హౌస్మేట్స్. మరి ఈ ఫ్యామిలీ సందడిని చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఆదిరెడ్డి కలను నిజం చేసిన బిగ్‌బాస్ -
Bigg Boss 6: నడవలేని స్థితిలో శ్రీసత్య తల్లి.. వీల్‌చైర్‌పై బిగ్‌బాస్ హౌస్‌లోకి..
బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో ఆదిరెడ్డి భార్య, కూతురితో పాటు రాజ్ వాళ్ల తల్లి హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. వారి రాకతో ఆదిరెడ్డి, రాజ్‌లలో నూతనోత్తేజం వచ్చింది. ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా తమ కుటుంబ సభ్యులు వస్తారని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఫైమా, శ్రీసత్యల పేరెంట్స్ వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా అర్థమవుతుంది. అమ్మను చూసిన ఫైమా ఆనందంతో ఎగిరిగంతేసింది. తల్లిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. కూర్చొబెట్టుకొని కబుర్లు చెప్పింది. ‘నువ్వు ఇంగ్లీష్ అందరికి నేర్పిస్తున్నావు.. నాకు కూడా నేర్పించవా’ అంటూ కూతురిపై సెటైర్ వేసింది. ‘ఫైమా కాకుండా మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో చెప్పండి అని శ్రీసత్య అడగ్గా.. ‘అందరూ ఇష్టమే’అంటూ తెలివిగా తప్పించుకుంది. రేవంత్‌ని చూస్తూ.. ‘నిన్ను చూస్తే భయమేస్తుంది’ అని అనడంతో అంతా గట్టిగా నవ్వారు. ఇక శ్రీసత్య తన తల్లిని తలుచుకొని బాధపడంది. ‘మా మమ్మీ కూడా నడుస్తూ ఉంటే బాగుండేది’అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అదే సమయంలో గార్డెన్ ఏరియా నుంచి ‘సోనూ’ అని పిలుస్తూ శ్రీసత్య పేరెంట్స్ వచ్చారు. అయితే శ్రీసత్య తల్లి అనారోగ్యంతో కొంతకాలంగా నడవలేని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమెను వీల్‌చైర్‌లో తీసుకొని వచ్చాడు శ్రీసత్య తండ్రి. ఇక అమ్మానాన్నాలను చూసిన ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఇద్దరిని గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేసింది. తల్లికి అన్నం తిపిపించింది. ఇక రాజ్ గురించి చెబుతూ.. ‘ఫస్ట్ వీక్‌లో నామినేట్ ఏమని చేశాడో తెలుసా డాడీ.. ‘నువ్వు మాట్లాడుతున్నావు కానీ కనెక్షన్ కుదర్టేదు’అన్నాడు అని శ్రీసత్య చెప్పగా..‘నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్స్ వేస్తున్నావులే’అని డాడీ అనడంతో ఆమె మొహం మార్చుకుంది. రేవంత్ అయితే ఆయనకు షేక్‌హ్యాండ్ ఇస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకా శ్రీసత్య, ఫైమా పేరెంట్స్ ఏం ఏం చెప్పారు. వాళ్లు చేసిన సందడి ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఆదిరెడ్డి కలను నిజం చేసిన బిగ్‌బాస్.. ఎమోషనల్ అయిన హౌస్మేట్స్
Bigg Boss-6 Telugu, Episode 80 Highlights : బిగ్‌బాస్ సీజన్-6లో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. టాప్-9 కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముందుగా ఆదిరెడ్డి భార్య కవిత తన కూతురు అద్వైతతో కలిసి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. అయితే కవిత వస్తుందని ఇనయా ఆదిరెడ్డికి ముందే హింట్ ఇవ్వడంపై రేవంత్ సీరియస్ అయ్యాడు. అతనికి ఆ ఎగ్జయిట్మెంట్ ఉండకుండా నువ్వెందుకు రివీల్ చేశావంటూ కాస్త కోప్పడ్డాడు. ఇక కవిత ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆదిరెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కూతురు అద్వైత మాత్రం తండ్రిని అంతగా గుర్తుపట్టినట్లు లేదు. వచ్చినప్పటి నుంచి బాగా ఏడుస్తూనే కనిపించింది. ఇక కూతురి బర్త్‌డే వేడుకలను బిగ్‌బాస్ హౌస్‌లో చేయాలన్న ఆదిరెడ్డి కలను బిగ్‌బాస్ నిజం చేశాడు. కేక్ పంపించి హౌస్మేట్స్ సమక్షంలో బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. ఇక ఆదిరెడ్డి ఫ్యామిలీని చూసి రేవంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు. నిండు గర్భిణీగా ఉన్న తన భార్యను తలచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు కీర్తి కూడా తన ఫ్యామిలీని తలచుకొని ఏడ్చేసింది. మరోవైపు రాజ్ తల్లి ఉమారాణి హౌస్‌లోకి ఎంట్రీ కాగానే రాజ్ తల్లిని పట్టుకొని ఎమోషనల్ అయ్యాడు. ఇక కొడుకు బాగా ఆడాలని అలాగే టైటిల్ గెలవాలని దీవిస్తుంది. ఇప్పటివరకు తన తల్లిని సోషల్ మీడియాలో ఇంకెక్కడా బయటపెట్టలేదని, తొలిసారిగా బిగ్‌బాస్ స్టేజ్‌పైనే అందరికి పరిచయం చేస్తున్నానంటూ రాజ్ తెలిపాడు. మొత్తానికి ఫ్యామిలీ వీక్‌తో హౌస్‌మేట్స్‌కి మాంచి బూస్టింగ్ ఇచ్చినట్లయ్యింది. -
‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి ఆదిరెడ్డి ఫ్యామిలీ.. రేవంత్ కంటతడి
బిగ్‌బాస్ ఆరో సీజన్ చూస్తుండగానే పదకొండు వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. ఇందులో బాగంగా మొదటగా ఆదిరెడ్డి ఫ్యామిలీ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఆదిరెడ్డి తన భార్య కవిత, కూతురు అద్వితను చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాడు. కూతురికి అన్నం తినిపించాడు. అనంతరం తన ఆటతీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాడు. తన డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్నామని కవిత చెప్పడంతో ఆదిరెడ్డితో సహా ఇంటి సభ్యులంతా పగలబడి నవ్వారు. ‘అందరు మంచి వాళ్లు గేమ్ వరకు కొట్టుకోండి..తింటుకోండి కానీ..’ అని కవిత ఏదో చెప్పబోతుండగా.. ‘ఏంటి నన్ను కూడా కొట్టమంటున్నావా?’ అని ఆదిరెడ్డి అంటాడు. హా..నువ్వేమైనా పెద్ద తోపా అంటూ ఆదిరెడ్డికే సెటైర్ వేసింది కవి. కేక్ కట్ చేసి కూతురు బర్త్‌డేని సెలబ్రేట్ చేశారు. భార్య, కూతురు రాకతో ఆదిరెడ్డి చాలా సంతోషంగా ఉంటే.. రేవంత్ మాత్ర తన భార్య, పుట్టబోయే బిడ్డను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు. మరి రేవంత్ ఫ్యామిలీ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తుందా? అన్నది చూడాలి. -
శ్రీసత్య వెన్నుపోటు పొడుస్తోంది.. రేవంత్‌కు హింటిచ్చిన ఆడియన్స్!
Bigg Boss 6 Telugu, Episode 79: రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లు కడుపు మాడ్చుకునే పరిస్థితి వచ్చింది. అతడు రేషన్ మేనేజర్ అవడమేంటో కానీ పాలు, అన్నం.. ఇలా అన్నింటికీ కొలతలు పెడుతూ ఇంటిసభ్యులకు సరిగా తిండి పెట్టడం లేదు. గత వారం కెప్టెన్‌గా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనానికి ఎన్ని కప్పుల బియ్యం వండేదానివని ఫైమాను అడిగాడు ఆదిరెడ్డి. అందుకామె ఐదు కప్పులని చెప్పింది. కానీ రేవంత్ నాలుగు కప్పులు మాత్రమే చాలంటున్నాడు. అరకప్పు బియ్యం ఎక్కువ వేయమని శ్రీహాన్ చెప్పినా వినట్లేదని చికాకు పడ్డాడు ఆది. బియ్యం అయిపోయినప్పుడు అడిగితే ఇస్తున్నారని చెప్పింది ఫైమా. ఇదే విషయంపై రేవంత్‌ను నిలదీసింది. అతడు మాత్రం సరిపోతుందా? సరిపోదా? అనవసరం అని, రేషన్ ఎంతుందో దాన్ని బట్టే వండుతానని వితండవాదం చేశాడు. అలాగైతే ఎవరికీ ఆకలి తీరదన్నాడు శ్రీహాన్. నీ కెప్టెన్సీలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కానీ అందరి కడుపు నింపడానికి ఆలోచించట్లేదన్నాడు. మరోపక్క సమయానికి వచ్చి పాలు తాగకపోతే ఆ పూట పాలు మళ్లీ ఇచ్చేదే లేదని రూల్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేసింది ఇనయ. ఇలా ఎప్పటిలాగే రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఫుడ్ గొడవలు జరిగాయి. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి ఇద్దరు సభ్యుల ఫొటోలను షెడ్డర్లో వేయాల్సి ఉంటుంది. ► రోహిత్.. శ్రీహాన్, ఫైమా ► శ్రీసత్య.. రాజ్, రోహిత్ ► రాజ్.. శ్రీహాన్, శ్రీసత్య ► కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్య ► ఫైమా.. రోహిత్, ఇనయ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► ఇనయ.. ఫైమా, రాజ్ ► ఆదిరెడ్డి.. ఇనయ, శ్రీహాన్ ► రేవంత్.. ఫైమా, ఆది రెడ్డి రాజ్ మూడు వారాలుగా సేవ్ అవుతున్నందున అతడిని నామినేట్ చేస్తున్నానంది శ్రీసత్య. ఇందుకు ఒప్పుకోని బిగ్‌బాస్ సరైన కారణం చెప్పమని గద్దించాడు. దీంతో శ్రీసత్య అతడి గేమ్ కనిపించలేదని జవాబు చెప్పి జారుకుంది. ఇక ఇనయ.. తనను గేమ్‌లో పర్సనల్‌గా అటాక్ చేసి తన గేమ్ కనిపించకుండా చేసిన ఫైమాను నామినేట్ చేస్తున్నాననంది. రాజ్ నామీద పగ పెంచుకుని నన్ను నామినేట్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. వీరిద్దరూ తన ఫ్రెండ్స్ అని, వీళ్లను నామినేట్ చేయాల్సి వచ్చేంత దూరం పెరుగుతుందని ఊహించలేదంటూ ఏడ్చింది. వాళ్లు తనను ఫ్రెండ్ అనుకోలేదంటూ బాధపడింది. ఫైనల్‌గా ఈ వారం శ్రీహాన్, ఫైమా,రోహిత్, రాజ్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఇనయ నామినేషన్లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం కిచెన్‌లో మళ్లీ ఫైట్ జరిగింది. రేవంత్‌ను ఆలూ, ఉల్లిగడ్డ ఇవ్వమని కొందరు అడగ్గా కుదరదని తేల్చి చెప్పేశాడు కెప్టెన్. మీరేమనుకున్నా నేనేం చేయలేనని చేతులెత్తేశాడు. తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టైం వచ్చింది. హౌస్ అంతా నీకు సపోర్ట్ చేసి కెప్టెన్‌గా గెలిపించినప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక్కోసారి సపోర్ట్ చేయకపోతే సోలో ప్లేయర్, ఫేవరిటిజం అని పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. మీరు ఆడియన్స్ నుంచి సింపతీ కోరుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకటీరెండు రోజుల వరకే సింపతీ ఉంటుంది. కానీ జీవితాంతం ఉండదు. కళ్ల ముందే ఫేవరిటిజం కనిపించినప్పుడు కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడరని ఎవరిని నమ్ముతున్నారు? రాజ్.. నాగురించి చెడుగా ఎవరూ మాట్లాడరు. మొదట్లో నా రియల్ ఫ్రెండ్స్ సూర్య, ఫైమా, ఇనయ. కానీ ఇనయ నా వెనక గోతులు తవ్వుతుందేమోనని అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. స్నేహితుడిగా ఫీలైన రాజ్ అలా అనడంతో ఇనయ ఏడ్చేసింది. సూర్య వెళ్లిపోయాక వాళ్లిద్దరే మాట్లాడకుండా దూరం పెట్టి నన్ను శత్రువులా చూస్తున్నారు అని కంటతడి పెట్టుకుంది. ప్రశ్న: మీరు ఎప్పుడు ఏం చేస్తారనేది తోటి ఇంటిసభ్యులకే అర్థం కావట్లేదు. దీనికి మీ స్పందన ఏంటి? ఇనయ: మై లైఫ్, మై రూల్స్.. నాకు నచ్చినట్లే ఉంటా, అందుకే అన్‌ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తాను. ప్రశ్న: మీ క్లోజ్ ఫ్రెండ్ మీ గురించి బ్యాక్‌స్టాబింగ్, బిచింగ్ చేస్తుంది. మీకు తెలిస్తే ఏం చేస్తారు? శ్రీసత్య: ముందు బాధపడతాను. నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ను నమ్మి అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అయితే నేను వాళ్లను క్లోజ్ అనుకునే కన్నా వాళ్లు నన్నెంత క్లోజ్ అనుకుంటున్నారనేది ముఖ్యం. బహుశా వాళ్లకు నేనంత క్లోజ్ కాదేమో! నమ్మినవాళ్లు నా వెనకాల మాట్లాడితే నెక్స్ట్ టైం నా దగ్గరకు రానివ్వను. ఇక నాగార్జున చెప్పిన టాస్క్‌ను అమలు చేసే పనిలో పడ్డారు శ్రీసత్య, ఫైమా. అర్ధరాత్రి మేకప్ వేసుకుని రాజ్, శ్రీహాన్‌ను భయపెట్టి మిషన్ కంప్లీట్ చేశారు. చదవండి: మెరీనా పారితోషికం ఎంతో తెలుసా? నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది: యాంకర్ -
Bigg Boss: మదర్ ఇండియా పారితోషికం ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ షోకి వచ్చి బాగుపడ్డవాళ్లూ ఉన్నారు, ఉన్నపేరును చెడగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. ఈ సీజన్లో కూడా అంతే.. కొందరు విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకోగా మరికొందరు మాత్రం కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. బాలాదిత్య, వాసంతి, మెరీనా.. ఈ కోవలోకే చెందుతారు. అక్కడక్కడా చిన్నపాటి గొడవలు జరిగినా అవేవీ వీరి ఇమేజ్ను డ్యామేజ్ చేయలేకపోయాయి. అంతటి మంచి పేరు సంపాదించుకున్నారు వీళ్లంతా. ఇకపోతే 11 వారాలుగా ఇంట్లో అందరి ఆకలి తీర్చి మదర్ ఇండియాగా పేరు తెచ్చుకుంది మెరీనా. కయ్యానికి కాలు దువ్వకుండా అందరితో సఖ్యతగా ఉంటూ మంచితనంతో మెదిలింది. గత కొద్దివారాలుగా ఆటలోనూ ముందుంది. ఈమెకు బిగ్‌బాస్ భారీగా ముట్టజెప్పారట. వారానికి 35 వేల రూపాయల చొప్పున పారితోషికం అందించినట్లు తెలుస్తోంది. అలా 11 వారాలకుగానూ దాదాపు రూ.3,85,000 తీసుకుందట. చదవండి: మెరీనా ఎలిమినేషన్‌కు కారణాలివే! నువ్వు ఆటకోసం కూడా ఆలోచించావా?: మెరీనాపై యాంకర్ వెటకారం ప్రశ్నలు -
తెలుగు, హిందీలో సినిమాలు చేసిన మెరీనా
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో బుల్లితెర నటి మెరీనా పాల్గొంది. ఆమె పూర్తిపేరు మెరీనా అబ్రహం సాహ్ని. ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో పాపులర్ అయిన మెరీనా ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' సీరియల్లో నటించింది. 2016లో రొమాన్స్ విత్ ఫైనాన్స్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సబ్ కా దిల్ ఖుష్ అనే హిందీ చిత్రంలోనూ నటించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డు గెలుచుకుంది. సీరియల్ నటుడు రోహిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ బిగ్‌బాస్ హౌస్‌లో జంటగా అడుగుపెట్టారు. కానీ తర్వాత విడివిడిగా గేమ్ ఆడారు. మెరీనా బిగ్‌బాస్ హౌస్‌కు మదర్ ఇండియాగా పేరు తెచ్చుకుంది. -
నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది?.. యాంకర్ వెకిలినవ్వులు
బిగ్‌బాస్ హౌస్‌లో మంచి పేరు మూటగట్టుకున్న ఒక్కొక్కరూ వరుసగా బయటకు వచ్చేస్తున్నారు. బాలాదిత్య, వాసంతి, మెరీనా ఎలాంటి రిమార్క్ లేకుండా కడిగిన ముత్యంలా బయట అడుగుపెట్టారు. తాజాగా షో నుంచి బయటకు వచ్చిన మెరీనాను బిగ్‌బాస్ కెఫెలో ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ శివ. ఈ క్రమంలో ఆమెను మరీ కించపరుస్తూ మాట్లాడినట్లు కనిపిస్తోంది. జనాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు అన్న మాట హౌస్‌లో నువ్వే ఎక్కువగా వాడావు. జనాలు చూసేందుకు అసలు మీరేం చేశారు? అని ప్రశ్నించాడు. అందుకామె నేను నాలా ఉన్నానని బదులిచ్చింది. ఇంతకీ హౌస్‌లో మీరు గేమ్స్ ఆడారా? అని సూటిగా ప్రశ్నించాడు శివ. దానికి మెరీనా.. నావరకు ఎంతయిందో అంతే ఆడానని సాఫ్ట్‌గా ఆన్సరిచ్చింది. నువ్వూ, రోహిత్ ఏదో ట్రిప్‌కు వచ్చినట్లు అనిపించిందన్నాడు యాంకర్. నేను ఆడగలుగుతానా? లేదా? అని ఎంత టెన్షన్ పడ్డానో మీకేం తెలుసు అని కౌంటరిచ్చింది మెరీనా. వెంటనే శివ అందుకుంటూ నేను ఆడగలనా? లేదా? అని కూడా ఆలోచించారా? అని వెటకారంగా నవ్వాడు. మీరు ఎంత కోపం తెప్పించినా నాకు కోపం రాదని మెరీనా అనగా మీ దగ్గర నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది? అని డైలాగ్ వేశాడు. ఈ ఇంటర్వ్యూపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. కంటెస్టెంట్లందరినీ ఒకేలా ఇంటర్వ్యూ చేయాలి. అంతే తప్ప సాఫ్ట్, కూల్‌గా కనిపించేవారిపై ప్రతాపం చూపించడం కాదని యాంకర్ శివకు చురకలంటిస్తున్నారు. చదవండి: ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
ఆ ఒక్క ప్రశ్నతో దొరికిపోయిన కీర్తి, రాజ్ నిందతో ఏడ్చిన ఇనయ
జనాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు.. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతీ కంటెస్టెంటూ చెప్పే మాట ఇది. అలా అని ఇక్కడ ఇలా మాట్లాడకూడదు, అక్కడ అలా ప్రవర్తించకూడదు అని ఎవరూ నోరూ, కాళ్లు చేతులు కట్టేసుకుని కూర్చోలేదు. పైగా తామేం చేసినా రైటే అని, అది జనాలు అంగీకరిస్తారని ఎవరికి వారు ఊహల్లో తేలిపోమారు. ఇప్పుడిప్పుడే వారి కళ్ల ముందు ఏర్పడుకున్న మబ్బులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఆడియన్స్ అడిగే ప్రశ్నలతో ఉలిక్కిపడుతున్నారు హౌస్మేట్స్. ఈ మధ్యే శ్రీసత్య, శ్రీహాన్‌లను వాయించిన ప్రేక్షకులు నేడు రాజ్, కీర్తి, ఇనయల గురించి అడిగేశారు. ఈ క్రమంలో కీర్తికి.. 'ఇతర కంటెస్టెంట్ల సపోర్ట్‌తోనే మీరు కెప్టెన్ అయ్యారు కదా, మరి నాకెవరూ సపోర్ట్ చేయలేదు, సోలో ప్లేయర్ అని ఎందుకంటారు? సింపతీ ట్రై చేస్తున్నారా?' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి కీర్తి.. సింపతీ ఒకటీరెండు రోజులు ఉంటుందే తప్ప జీవితాంతం ఉండదని చెప్పింది. తర్వాత హౌస్‌లో మీ నిజమైన ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనకాల ఎవరు మాట్లాడరని అనుకుంటున్నారని రాజ్‌ను అడిగాడో ఆడియన్. దీనికతడు ఇనయ నా వెనకాల మాట్లాడుతుందనిపిస్తుందన్నాడు. ఒకప్పుడు స్నేహితుడుగా ఉన్న రాజ్ ప్రతిదానికీ తననే తప్పుపడుతుండటంతో తట్టుకోలేక ఏడ్చేసింది ఇనయ. చదవండి: 12వ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
ఆకలితో మాడుతున్న హౌస్మేట్స్, అయినా కరగని రేవంత్!
బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 9 మెంబర్స్ మిగిలారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేలో అడుగుపెడతారు. ఈరోజు మండే కావడంతో నామినేషన్స్ మొదలుకానున్నాయి. అయితే ఇప్పటికీ సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేస్తానంటే కుదరదని తెగేసి చెప్పాడు బిగ్‌బాస్. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి నామినేట్ చేయమన్నాడు. ఈ క్రమంలో శ్రీసత్య.. ఆటతీరును పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజ్ మూడు వారాల నుంచి సేవ్ అవుతున్నాడని నామినేట్ చేసింది. దీంతో బిగ్‌బాస్ తుప్పాస్ రీజన్ కాకుండా ఏదైనా వాలిడ్ పాయింట్ చెప్పమన్నాడు. మరోవైపు రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లకు కడుపు నిండా తిండి దొరక్కుండా పోయింది. ఉన్నదాన్ని పంచి పెట్టకుండా దాచి దెయ్యాలపాలు చేస్తున్నాడు. గతంలోనూ అలాగే చేయగా మరోసారి ఫుడ్ కట్ చేస్తున్నాడు. అంత కొద్దిగా వండితే సరిపోవట్లేదు మహాప్రభో అని మొత్తుకుంటున్నా నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించాడు. వారమంతా సరిగా తినీతినకుండా వారాంతంలో మాత్రం కడుపు నిండా పెడతానంటే కరెక్ట్ కాదు. అందువల్ల కెప్టెన్‌గా నువ్వు గెలుస్తావేమో కానీ అందరి ఆకలి తీరదు అని ముఖం మీదే చెప్పాడు శ్రీహాన్. రేషన్ సేవ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు కానీ కడుపులు నిండాలని ఆలోచించట్లేదు అని ఫైర్ అయ్యాడు. నిజంగానే రేవంత్ ఎంతసేపూ గేమ్ కోణంలో ఆలోచిస్తున్నాడే కానీ మానవత్వంతో ఓ ముద్ద ఎక్కువ పెట్టుంటే హౌస్మేట్స్ అందరితో మంచి కెప్టెన్ అనిపించుకునేవాడు. ఇకపోతే ఈ వారం రేవంత్, కీర్తి మినహా మిగతా ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. చదవండి: బిగ్‌బాస్ 6: బాటమ్ 5లో ఎవరంటే? మెరీనా ఎలిమినేషన్‌కు కారణాలివే! -
పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ నేహా చౌదరి.. వరుడు అతనే
బిగ్‌బాస్ సీజన్-6 కంటెస్టెంట్ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నేహానే వెల్లడించింది. అంతేకాకుండా కాబోయే భర్త ఫోటోను కూడా ఆడియెన్స్‌కు రివీల్ చేసింది. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది. అయితే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు పలు షోలకు యాంకరింగ్ చేసింది. ఇటీవలె బిగ్‌బాస్-6లో కూడా పాల్గొంది. ఇక ఈ షో ఎంట్రీ సమయంలో కూడా ‘బిగ్‌బాస్'కి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాళ్లకి చెప్పి వచ్చాను’ అని కూడా వెల్లడించింది. అప్పుడు చెప్పినట్లే బిగ్‌బాస్ జర్నీ అనంతరం నేహా పెళ్లి చేసుకోబోతుంది. తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అయిన అనిల్ అనే వ్యక్తినే అతి త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు నేహా తెలిపింది. View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) -
ఆ ఐదుగురి మనసు స్వచ్ఛమైనది, మిగతావాళ్లు..: మెరీనా
Bigg Boss Telugu 6, Episode 78: ఈరోజు పెద్ద ట్విస్టులు, సర్ప్రైజ్లు లేకుండా సాదాసీదాగా సాగింది ఎపిసోడ్. ఊహించినట్లే మెరీనా ఎలిమినేట్ అయిపోగా ఆమె భర్త రోహిత్ మినహా మిగతా ఎవ్వరూ బాధపడలేదు. మరి హౌస్‌లో ఈ రోజు ఏం జరిగింది? మెరీనా వెళ్లిపోయేముందు హౌస్మేట్స్ గురించి ఏం చెప్పింది? అనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. నాగార్జున హౌస్‌లో ఉన్న పదిమందిలో ఎవరు బాటమ్ 5లో ఉంటారో చెప్పమని కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఎవరు ఎవరెవరి పేర్లు చెప్పారంటే.. కంటెస్టెంట్ బాటమ్ 5 కంటెస్టెంట్లు ఆదిరెడ్డి మెరీనా, రోహిత్, రాజ్, కీర్తి, ఇనయ ఇనయ రాజ్, శ్రీసత్య, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి కీర్తి శ్రీసత్య, మెరీనా, శ్రీహాన్, రాజ్, ఆదిరెడ్డి రాజ్ మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి, ఇనయ, శ్రీహాన్ ఫైమా మెరీనా, రోహిత్, ఇనయ, కీర్తి, రాజ్ మెరీనా శ్రీహాన్, మెరీనా, ఇనయ, రాజ్, ఫైమా/శ్రీసత్య శ్రీహాన్ రోహిత్, మెరీనా, కీర్తి, రాజ్, ఆదిరెడ్డి రోహిత్ శ్రీహాన్, కీర్తి, మెరీనా, ఇనయ, రాజ్ శ్రీసత్య మెరీనా, రోహిత్, కీర్తి, ఇనయ, రాజ్ రేవంత్ మెరీనా, రోహిత్, కీర్తి, రాజ్, ఇనయ హౌస్ అంతా బల్లగుద్ది మరీ మెరీనాకు టాప్‌లో ఉండే అర్హతే లేదని స్పష్టం చేసింది. అన్నట్లుగానే నాగ్ మెరీనా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఆమె ఎలిమినేషన్‌ను హౌస్మేట్స్ ముందే పసిగట్టడంతో రోహిత్ తప్ప ఏ ఒక్కరూ బాధపడలేదు. నిత్యం వైఫైలా తన చుట్టూ తిరుగుతూ ఉండే మెరీనా ఒక్కసారిగా వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు రోహిత్. బాధను భరించలేక బయటకు ఏడ్చేశాడు. కాసేపు ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. అనంతరం స్టేజీపైకి వచ్చిన మెరీనాతో హౌస్‌లో ప్యూర్ ఎవరు? ఇంప్యూర్ ఎవరు? అనే గేమ్ ఆడించాడు నాగ్. ముందుగా మెరీనా స్వచ్ఛమైన వాళ్ల లిస్ట్ చెప్పుకొచ్చింది. రోహిత్‌లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదంది. కీర్తి ఏదో బాధలో ఉంటుందంటారు.. ఆమె బాధ నిజమని, తనేమీ యాక్ట్ చేయట్లేదని చెప్పింది. ఆదిరెడ్డి తనలో తానే మాట్లాడుకోవడం చూసి దెయ్యంతో మాట్లాడుతున్నాడేమో అనుకునేదాన్ని, ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని పేర్కొంది. అతడితో ఉంటే మనవాళ్లతో ఉన్న ఫీలింగ్ వస్తుందని తెలిపింది. రేవంత్‌కు కోపం వస్తే కోపం, బాధ అనిపిస్తే బాధ అన్నీ చూపిస్తాడని అదే స్వచ్ఛతకు నిదర్శనమని వివరించింది. నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే సాయం చేయడానికి ముందుకొచ్చే మొదటి వ్యక్తి రేవంత్ అని పొగిడింది. రాజ్ దగ్గర యాటిట్యూడ్ లేదని, ఒక్కో మెట్టు ఎక్కుతూ తనను తాను బిల్డ్ చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. తర్వాత ఇనయ, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమాలను ఇంప్యూర్ జాబితాలో పెట్టింది. అప్పుడప్పుడైనా ఎదుటివాళ్లు చెప్పేది వినమని ఇనయకు సూచించింది. శ్రీసత్య మానిప్యులేట్ అయినట్లు అనిపించిందని, ఫైమా కొన్నిసార్లు మాటలు వదిలేస్తుందని పేర్కొంది. శ్రీహాన్‌ను ఇప్పటికైనా ఇంట్లో అందరినీ సమానంగా చూడమని సూచించింది. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు కంట్రోల్లో ఉండాలి, ఓసారి నామీద అరిచావు, నేను సైలెంట్ క్యాండిడేట్ కాబట్టి సరిపోయింది, అక్కడ వేరేవాళ్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఘాటుగా హెచ్చరించింది. అనంతరం బిగ్‌బాస్ జర్నీకి ఫుల్స్టాప్ పెడుతూ స్టేజీ నుంచి వెళ్లిపోయింది. చదవండి: గీతూ పేరెంట్స్‌తో మాట్లాడా: బాలాదిత్య మెరీనా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలివే! -
Bigg Boss: అందువల్లే మెరీనా ఎలిమినేట్ అయిందా!
రియాలిటీ షోను రక్తికట్టించేందుకు నానాతంటాలు పడుతున్నాడు బిగ్‌బాస్. అందులో భాగంగానే గేట్లు ఎత్తడం, ఊహించని కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడం, ప్రైజ్‌మనీ తగ్గించడం.. ఇలా చాలా స్టంట్లే చేస్తున్నాడు. బిగ్‌బాస్ షో 11 వారం ముగింపుకు వచ్చింది. ఈసారి మెరీనా ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్‌కు గల కారణాలేంటో చూద్దాం.. మెరీనా తన భర్త రోహిత్‌తో కలిసి బిగ్‌బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. మొదట్లో వీరిద్దరినీ ఒకే కంటెస్టెంట్‌గా పరిగణించారు. తర్వాత మాత్రం ఇద్దరినీ విడదీసి ఎవరి ఆట వాళ్లను ఆడమన్నారు. కానీ గేమ్‌లో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవడం మిగతావాళ్లకు నచ్చలేదు. విడిగా ఆడమన్నా కలిసే ఆడుతున్నారంటూ పదేపదే దెప్పి పొడిచారు. చివరికి విడిగా ఆడారు కానీ అప్పటికే సమయం మించిపోయింది. రోహిత్ తన మాటలతో ఆటతో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ రోజురోజుకీ ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్నాడు. మెరీనా మాత్రం మదర్ ఇండియాలా అందరికీ వంట చేసి పెడుతూ, నవ్వుతూ పలకరిస్తూ స్నేహంగా మెదిలింది. పెద్దగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు. కానీ అదే ఆమెకు మైనస్‌గా మారింది. బిగ్‌బాస్ హౌస్ అన్నాక యాక్టివ్‌గా ఉండాలి, గొడవలు పడాలి, టాస్కులు ఆడాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఈ నాలుగింటిలో ఆమె వెనుకబడింది. అలాంటివారు షో రేటింగ్స్‌కు ఏమాత్రం ఉపయోగపడరు. దీంతో బిగ్‌బాస్ వీరిని ఏ క్షణంలోనైనా తీసేయొచ్చు. పైగా ఇప్పుడు హౌస్‌లో పది మంది మాత్రమే మిగిలారు. ఉన్నవాళ్లలో ఆటలో వెనుకబడింది ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క మెరీనా మాత్రమే! ఇంకా చెప్పాలంటే రోహిత్, మెరీనాకు ఒకటే ఫ్యాన్‌బేస్ ఉంది. ఇద్దరూ నామినేషన్లో ఉన్నప్పుడు రోహిత్‌ను హౌస్‌లో ఉంచేందుకు అతడికి ఎక్కువ ఓట్లు గుద్దడంతో మెరీనాకు తక్కువ పడ్డాయి. ఫలితంగా ఈవారం మెరీనా ఇంటి నుంచి వెళ్లిపోయింది. చదవండి: బయటకు వచ్చాక గీతూ తల్లికి ఫోన్ చేశా సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్ హత్యపై బయోపిక్ -
రాజ్‌ను భయపెట్టమన్న నాగ్, మెరీనాకు ఆ ఛాన్స్ లేదే!
శనివారం కోటింగ్‌లు.. సండే ఫన్ టాస్కులూ తెలిసిన విషయమే.. ఈసారి కూడా అదే జరిగింది. కాకపోతే నిన్నటి ఎపిసోడ్లో ఆదిరెడ్డికి మరీ ఓ రేంజ్లో క్లాస్ పీకాడు నాగార్జున. ఈరోజు అవన్నీ పక్కనపెట్టేసి హౌస్‌మేట్స్‌తో చిన్నపిల్లల ఆటలు ఆడించాడు. ఏ ఆటైతే ఏంటి? ఆడేందుకు రెడీ అన్న హౌస్మేట్స్ రెండు టీములుగా విడిపోయి ఆడారు. ఇకపోతే రాజ్‌కు దెయ్యాలంటే భయమన్న విషయాన్ని బయటపెట్టాడు నాగ్. ఈరోజు మెరీనా, శ్రీసత్య, ఫైమా. దెయ్యాల వేషం వేసుకుని రాజ్‌ను భయపెట్టాలన్నాడు. ఫైమా వేషం వేసుకోనక్కర్లేదు, ఇప్పటికే ఆమెకు భయపడుతున్నాడని శ్రీసత్య మధ్యలో అందుకుంది. అంటే ఫైమా దెయ్యంలా ఉందంటున్నావా? అని కౌంటర్ వేశాడు నాగ్. ఎలాగో మెరీనా అవుట్ కాబట్టి తను భయపెట్టలేదు. చదవండి: ఇనయ టాప్ 5లో కాదు, చివరి స్థానంలో ఉందట ఈ వారం ఎలిమినేట్ అయింది ఎవరంటే? -
టాప్ 10 కంటెస్టెంట్లలో అట్టడుగు స్థానంలో ఇనయ..
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం టాప్ 10 కంటెస్టెంట్లు మిగిలారు. వీరిలో ఒకరైన మెరీనా నేడు ఎలిమినేట్ కానుంది. దీంతో మిగిలిన తొమ్మిది మందైన రోహిత్, రాజ్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయ, కీర్తి, రేవంత్, ఆదిరెడ్డి,ఫైమా టైటిల్ కోసం పోటీపడనున్నారు. మరి వీరిలో ఎవరు బాటమ్ 5లో ఉంటారో హౌస్మేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు నాగ్. ఈమేరకు రిలీజైన ప్రోమోలో ఒక్కొక్కరు ఒక్కో కంటస్టెంట్ పేరు చెప్పారు. ► ఆదిరెడ్డి.. మెరీనా ► ఇనయ, శ్రీసత్య.. రాజ్ ► రాజ్, ఫైమా.. ఇనయ ► కీర్తి.. ఆదిరెడ్డి ► మెరీనా.. శ్రీహాన్ ► శ్రీహాన్, రోహిత్.. కీర్తి ► రేవంత్.. రోహిత్‌ల పేర్లు చెప్పారు. మెజారిటీ ఇంటిసభ్యులు ఇనయ, రాజ్‌లు ఫినాలే చేరుకోలేరని తేల్చి చెప్పారట. కానీ అనధికారిక పోలింగ్స్ చూస్తే మాత్రం ఇనయ టాప్ 3లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయం తెలిస్తే శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి ఏమైపోతారో చూడాలి! చదవండి: పూర్తిగా గీతూలా మారిన ఆదిరెడ్డి యంగ్ హీరో చెంప పగలగొట్టిన తేజ -
బయటకు వచ్చాక గీతూ తల్లికి ఫోన్ చేశాను: బాలాదిత్య
బిగ్‌బాస్ షోలో మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్నాడు బాలాదిత్య. కానీ ఒక్క సిగరెట్ కోసం ఏడ్చి, నానా రభస చేసి, గీతూపై నోరు జారి పెద్ద తప్పే చేశాడు. అయినా సరే అప్పటికే మంచి పేరు ఉండటంతో బాలాదిత్య ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం అంత గొడవపడ్డా అతడికే మద్దతు పలికారు ఫ్యాన్స్. బదులుగా అతడిని ఎమోషనల్‌గా బ్లాక్మెయిల్ చేసిన గీతూను బయటకు పంపించి తగిన బుద్ధి చెప్పారు. తాజాగా అతడు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నేను బిగ్‌బాస్ షో గెలవలేకపోవచ్చు. కానీ మన ఇంట్లో ఇలాంటి మనిషి ఉండాలని ఎంతోమంది కోరుకున్నారు. అది చాలు.. నన్ను పెంచిన తల్లిదండ్రులు, గురువుల వల్లే నాకు అంతటి పేరొచ్చింది. ఇకపోతే నాకు సిగరెట్ వీక్నెస్ కాదు. కానీ బయటకు అది నెగెటివ్‌గా వెళ్తుందని అర్థమై సిగరెట్లు తాగడమే మానేశాను. సిగరెట్ల విషయంలో గీతూను తిట్టినందుకు ఆమె తల్లికి ఫోన్ చేసి సారీ చెప్పాను' అని చెప్పాడు బాలాదిత్య. చదవండి: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే? శ్రీహాన్.. మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా నీలో.. ఆట్ కమల్ హాసన్ -
బిగ్‌బాస్‌కి వెళ్లి వచ్చాక 6 కేజీలు బరువు తగ్గాను : వాసంతి
బిగ్‌బాస్ సీజన్-6 గ్లామర్ డాల్లో పేరు తెచ్చుకున్న బ్యూటీ వాసంతి కృష్ణన్. ఆట కంటే అందంతోనే కాస్త ఎక్కువ నెట్టుకొచ్చిన వాసంతి గతవారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే హౌస్‌లోకి వెళ్లేటప్పుడు ఎంత పాజిటివ్ ఎనర్జీతో వెళ్లిందో అంతే పాజిటివ్ స్పిరిట్‌తో ఆమె బయటకొచ్చింది. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వాసంతి బిగ్‌బాస్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంది. 'బిగ్‌బాస్‌లో 70రోజుల పాటు ఉన్నాను. ఇంకొన్ని రోజులు ఉంటాననుకున్నా. కానీ అలా జరగలేదు. ఇక సూర్య, గీతూల ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో ఎప్పుడైనా, ఎవరైనా వెళ్లిపోతారు అని డిసైడ్ అయ్యాను. ఇక బిగ్‌బాస్‌కి వెళ్లి వచ్చాక 6కేజీలు తగ్గాను. అక్కడ అందరికీ సరిపోయినంత తిండి ఉంటుంది కానీ ఒత్తిడి వల్ల తిన్నది ఒంటబట్టదు. దీంతో చాలామంది మునుపటి కంటే బరువు తగ్గుతారు' అంటూ చెప్పుకొచ్చింది. -
ఆదిరెడ్డి ఇమేజ్ టోటల్ డ్యామేజ్.. గీతూకి పట్టిన గతి రాకుండా చూస్కో!
Bigg Boss 6 Telugu, Episode 77: ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎదుటివాళ్ల కంటే మనకే ఎక్కువ నష్టం అన్న విషయాన్ని పసిగట్టలేకపోతున్నాడు ఆదిరెడ్డి. ఇప్పటికే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేజేతులా గేమ్‌ను నాశనం చేసుకుని గీతూ బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు ఆది. దీంతో నాగార్జున అతడికి చీవాట్లు పెట్టి తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చాడు. మరి ఇంకా ఎవరెవరికి ఎలాంటి క్లాస్‌లు పీకాడు? ఎవరి బండారాలు బయటపెట్టాడు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! కెప్టెన్సీ అంటే అధికారం కాదని, బాధ్యత అని రేవంత్‌కు గుర్తు చేశాడు నాగార్జున. ఏదైనా పని చెప్పేటప్పుడు మాట్లాడే తీరు చూసుకోమని విసుక్కున్నాడు. శక్తి ఆటలో ప్రదర్శించమని, మాటలో కాదు అని చురకలంటించాడు అనంతరం ఆదిరెడ్డికి గట్టిగానే క్లాస్ పీకాడు. ఓ కథ చెప్పి మరీ అతడిని దోషిగా నిలబెట్టాడు. నోటికొచ్చిన స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావని గడ్డి పెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్, అది దక్కించుకుంటే ఓట్లు పడవు అని ఆడకుండా మూలన కూర్చున్నావు. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో డిసైడ్ చేయడానికి నువ్వేమైనా తోపా? తురుమా? అని తిట్టిపోశాడు. నువ్వు కామన్ మ్యాన్‌గా ఆడటానికి వచ్చావు, కేవలం మాట్లాడటానికి కాదు, గేమ్‌లో ఉన్న వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేసి నీ అభిప్రాయాలను వారితో చెప్పిస్తున్నావు. గేమ్ విషయంలో ఎక్కువ ఆలోచించి లూప్‌లు వెతికితే నీకూ గీతూ పరిస్థితే వస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక కెప్టెన్సీ కంటెండర్ గేమ్‌లో నువ్వు రూపాయి పెట్టి కూడా ముందుకు వెళ్లొచ్చు, కానీ లక్ష రూపాయలు రాశావు. ఇమ్యూనిటీ కోసమే కదా.. అని లాజిక్ అడిగాడు. ఇదే ప్రశ్న రాజ్ అడిగితే ఏదేదో చెప్పి అతడి నోరు మూయించాడు ఆది. ఇప్పుడు నాగ్ కూడా అదే అడిగేసరికి అడ్డంగా దొరికిపోయాడు. ఇకపోతే శ్రీహాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు శ్రీసత్యకు వంట రాదంటే వదిలేసి కీర్తిని మాత్రం వంట రాదంటే నేర్చుకుని చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఇదే అంశాన్ని ఓ ఆడియన్ అడగ్గా.. తనకసలు గుర్తే లేదని జవాబిచ్చాడు. దీంతో నాగ్.. గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తానన్నట్లుగా ఓ వీడియో వదిలాడు. అందులో శ్రీసత్య నాకు రాదు, చేయను అని స్పష్టంగా చెప్పింది. అయినా ఆమెను వదిలేసి, కీర్తిని మాత్రం వంట నేర్చుకుని చేయమన్నాడు. అంత అడ్డంగా దొరికినప్పటికీ సరిగా వినపడలేదంటూ మళ్లీ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అలాగే కుక్కలు మొరిగితే దేవలోకానికి ఏమీ కాదని కీర్తి చెప్పిన సామెతను సామెతలాగే చూడాలే తప్ప దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయనవసరం లేదని శ్రీహాన్, శ్రీసత్యలకు మొట్టికాయలు వేశాడు. ఇక ప్రతివారం నామినేషన్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది శ్రీసత్య. పక్కనోళ్లు నామినేట్ చేసుకుంటుంటే మరీ ముఖ్యంగా ఇనయను నామినేట్ చేసేటప్పుడు తెగ నవ్వుతుంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ లేవనెత్తాడు నాగ్. నామినేషన్స్‌లో నీకు నవ్వెందుకు వస్తుందని అడిగాడు. లోపల ఉన్న అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుందని ఆమె పరువు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో మీమ్స్ గేమ్ జరిగింది. అందులో భాగంగా అక్కడున్న మీమ్ కార్డులు ఎవరికి సూటవుతాయో వారికి ఇవ్వాలన్నాడు నాగ్. రేవంత్‌ను ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాడు ఆది. శ్రీసత్యకు ఓరి.. దీని వేషాలూ అన్న మీమ్ ఇచ్చాడు శ్రీహాన్. రాజ్.. ఓన్లీ వన్స్ ఫసక్ అనేలా మాట్లాడుతున్నాడంది ఫైమా. ఫైమాకు అట్లుంటది మనతోని ట్యాగ్ ఇచ్చాడు రాజ్. శ్రీహాన్‌కు సరె సర్లే, చాలా చూశాం ట్యాగ్ ఇచ్చింది కీర్తి. వీడెవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు.. చైల్డ్ ఆర్టిస్టా? అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయ. మస్తు షేడ్స్ ఉన్నాయ్రా నీలో, ఆట్.. కమల్ హాసన్ అన్న మీమ్ శ్రీహాన్‌కే సూటవుతుందన్నాడు రోహిత్. చాలా ఉన్నాయ్ దాచాం.. లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయ్ అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది శ్రీసత్య. ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలా.. అన్న మీమ్ రోహిత్కిచ్చింది మెరీనా. ఆదిరెడ్డి పని అయిపాయే అన్నాడు రేవంత్. నిజంగానే ఈరోజు ఎపిసోడ్లో ఆదిరెడ్డి పని అయిపోయింది. చదవండి: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే? పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా.. -
ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్టా? నువేమైనా తోపా? తురుమా?: నాగ్
బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా ఆడి తీరాల్సిందే.. ఆడి గెలుస్తావో, ఆట మొదట్లోనే ఓడిపోతావో.. అదంతా నీ ఇష్టం. కానీ నాకు నచ్చదు, నాకు అక్కర్లేదు, అసలు ఆడేవాళ్లే వేస్ట్ అని పోజులు కొట్టడానికి వీల్లేదు. ఈ వైఖరిని బిగ్‌బాస్ అస్సలు సహించడు. ఇంతకీ ఎవరి కోసం చెప్తున్నామో ఈపాటికే మీకర్థమై ఉంటుంది. ఇంకెవరు? రివ్యూయర్ ఆదిరెడ్డి గురించే.. ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు గేమ్ ఇచ్చినప్పుడు కూడా ఇదంతా అనవసరం అన్నట్లుగా మాట్లాడాడు. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడైతే నేను ఆడను, నాకు అవసరమే లేదని దర్జాగా కూర్చున్నాడు. టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాలి అని అవతలివాళ్లు చెప్పినా ఆడకపోవడమే నా గేమ్ అని అతి తెలివి ప్రదర్శించాడు. చివరికి ఈరోజు నాగార్జున చేతిలో చీవాట్లు తిన్నాడు. 'బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాలి కానీ అడ్డమైన కారణాలు చెప్పి ఆడకుండా ఉండొద్దు. నువ్వే ఆ టాస్క్ గెలిచుంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాయంతో జెన్యూన్ కంటెస్టెంట్ ఎలిమినేషన్‌ను ఆపగలిగేవాడివి కదా!అది సపోర్ట్ చేయడం కాదా? ఆటతీరు కాదా? అలా చేసుంటే జనాలు ఎంత మెచ్చుకునేవారు. అదంతా పక్కనపెట్టి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్ అంటావా? ఆ పాస్ ఎవరికి వస్తే వారికి ఓట్లు రావా? నువ్వేమైనా తోపా? తురుమా? ఆడియన్స్ ఏం అనుకుంటున్నారో డిసైడ్ చేయడానికి అని ఫైర్ అయ్యాడు. నీ తీరు మార్చుకో, లేదంటే ప్రేక్షకులే నిన్ను బయటకు పంపించేస్తార'ని హెచ్చరించాడు. దీంతో ఆదిరెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. చదవండి: టాప్ 10లో నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్ పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, ఒక్కరోజు బతికినా చాలు -
బిగ్‌బాస్: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే?
ఊహించని ఎలిమినేషన్లతో వరుస ట్విస్టులిచ్చిన బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఊహించని కంటెస్టెంట్‌నే బయటకు పంపించాడు. ఈవారం ఎవరు బయటకు వెళ్తున్నారో మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఇంకెవరు మెరీనానే! ఈ వారం కెప్టెన్ ఫైమా, ఇమ్యూనిటీ సంపాదించుకున్న రాజ్ మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు. వీరిలో మెరీనా, రోహిత్, కీర్తి డేంజర్ జోన్లో ఉండగా మెరీనాకు తక్కువ ఓట్లు పడటంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మెరీనా.. తన కోరిక తీరకుండానే బిగ్‌బాస్ నుంచి బయటకు రానున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఒక్కవారం హౌస్‌లో ఉండాలని, భర్త రోహిత్‌తో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లో పెళ్లిరోజు జరుపుకోవాలని కలలు కంది. చివరికి ఆమె కూడా తన ఎలిమినేషన్‌ను ముందే ఊహించిందో ఏమోకానీ జంటను విడదీయకండి బిగ్‌బాస్, ఉంటే ఇద్దరినీ ఉంచండి.. పంపిస్తే ఇద్దరినీ పంపించేయండి.. మేము యానివర్సరీ సెలబబ్రేట్ చేసుకోవాలని కోరింది. ఇద్దరినీ హౌస్‌లో ఉండమనడం ఓకే కానీ సేవ్ అయ్యే మనిషిని కూడా తనతో పాటే పంపించేయమనడమే ఒకింత విచిత్రంగా ఉంది. ఫినాలే దగ్గర పడుతున్న సమయంలో భర్తను ఇంటికి తీసుకెళ్లిపోతాననడమేంటని ఆడియన్స్ అవాక్కయ్యారు. కొంపతీసి మెరీనా అన్న మాటలను బిగ్‌బాస్ సీరియస్‌గా తీసుకుని డబుల్ ఎలిమినేషన్ పెడతారా? అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. కానీ చివరికి సింగిల్ ఎలిమినేషన్‌తో మెరీనాను మాత్రమే హౌస్‌లో నుంచి పంపించేసినట్లు తెలుస్తోంది. మరి మెరీనా ఎలిమినేషన్ రోహిత్‌కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది చూడాలి! చదవండి: కర్మ ఫలితం.. రేవంత్, శ్రీహాన్‌లకు బుద్ధి చెప్పిన హౌస్మేట్స్ -
Bigg Boss 6: కర్మ ఫలితం.. రేవంత్, శ్రీహాన్‌లకు బుద్దిచెప్పిన హౌస్మేట్స్
Bigg Boss 6 Telugu, Episode 76 Highlights : ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ గేమ్‌లో చివరగా ఫైమా, రేవంత్, శ్రీహాన్‌లు మిగిలారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకి నచ్చిన వాళ్లకి సపోర్ట్ చేసి మిగిలిన కంటెస్టెంట్లకు బస్తాను తగిలించాల్సి ఉంటుంది. కెప్టెన్సీ టాస్కులో రేవంత్, శ్రీహాన్‌లు కలిసి గేమ్ ఆడి ఎలా అయితే హోస్మేట్స్ని తప్పించారో, అందుకు బదులుగా సత్య తప్పా మిగితా కంటెస్టెంట్లు అంతా వీరిద్దరికి బాగానే బుద్ది చెప్పారు. బజ్ మోగిన ప్రతిసారి రేవంత్, శ్రీహాన్‌లకు బస్తాలు పెంచుకుంటూ పోయారు. పాపం శ్రీసత్య మాత్రం తన ఫ్రెండ్స్‌ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది కానీ హౌస్మేట్స్ అంతా ఒకటైపోవడంతో ఆమె ఆటలు సాగలేదు. ఇక బస్తాల బరువులు మోయలేక చివరికి ఆ బ్యాగ్‌ను శ్రీహాన్ కింద పెట్టేశాడు. ఇక అప్పుడు వెంటనే సత్య వెళ్లి శ్రీహాన్‌ను ఆమె ఒళ్లో పడుకోబెట్టి మరీ అతన్ని ఓదార్చింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఒకప్పుడు అర్జున్ టచ్ చేస్తేనే చిరాకు అన్న సత్య ఇప్పుడు శ్రీహాన్‌తో చాలా క్లోజ్ అయ్యిందని, అవసరం లేకపోయినా అతడిని టచ్ చేస్తుందంటూ ట్రోల్స్ రాయుళ్లు రెచ్చిపోయారు. ఇదిలా ఉండగా రేవంత్ ఈ టాస్కులో గెలవడానికి చాలానే కష్టపడినా హౌస్మేట్స్ అందరి సపోర్ట్ ఫైమాకే ఉండటంతో అతని కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చివరికి ఫైమాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో ఆమె తెగ సంతోషపడింది. -
కంటెస్టెంట్స్‌కి బిగ్‌బాస్ అమూల్యమైన అవకాశం, ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవాలంటే..
బిగ్‌బాస్ 6 తెలుగు: కంటెస్టెంట్‌కి బిగ్‌బాస్ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎలిమినేషన్ లేకుండా చివరి వరకు హౌజ్ కొనసాగేందుకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునేందుకు వారికి సదా అవకాన్ని ఇచ్చాడు. అయితే గెలుచుకునేందుకు కంటెస్టెంట్స్‌కి కఠిమైన టాస్క్‌తో పాటు వారి ప్రైజ్‌మనీలోంచి భారీగా కోతలు పెట్టాడు బిగ్‌బాస్. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. దీంతో ఆదిరెడ్డి ఈ పాస్ తనకు వద్దంటూ టాస్క్ ఆడని తేల్చేశాడు. ఇక హౌజ్ అందరు చర్చించుకున్న అనంతరం ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం రేవంత్, శ్రీహాన్, ఫైమా పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరు గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకుంటారో చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఆడియన్స్ ప్రశ్నలతో బయటపడ్డ శ్రీహాన్, శ్రీసత్య నిజస్వరూపం!
Bigg Boss 6 Telugu, Episode 75: సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు ఈ వారం వెళ్లిపోయేది తనే అని ఫిక్సయిన మెరీనా తన పెళ్లి రోజు గురించి కలలు కంది. నవంబర్ 29న వెడ్డింగ్ యానివర్సరీ ఉందని, ఆ రోజును ఇద్దరం కలిసే సెలబ్రేట్ చేసుకోవాలనుందని చెప్పింది. హౌస్ లోపల అయినా బయట అయినా ఇద్దరం కలిసే పెళ్లిరోజు జరుపుకోవాలని, అందుకు నువ్వే ఏదో ఒకటి చేయాలంటూ బిగ్‌బాస్‌ను వేడుకుంది. అంటే ఉంచితే ఇద్దరినీ హౌస్‌లో ఉంచమని పంపిస్తే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరినీ పంపించేయమని చెప్పకనే చెప్పింది. బిగ్‌బాస్‌కు కొత్త కొత్త ఐడియాలివ్వకని రోహిత్ చురకలేశాడు. అనంతరం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో పోటీదారులు శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్.. ఇతరుల గోల్ పోస్ట్‌లోకి బంతి వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌కు ఫైమా సంచాలకుడిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రేవంత్, శ్రీహాన్ కలిసి ఆడినట్లే అనిపించింది. ఇది చూసిన ఫైమా.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఈయన చేసేదేంటని సెటైర్లు వేసింది. మొదటి రౌండ్లో రోహిత్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్లో ఎవరూ అవుట్ కాకపోవడంతో కంటెండర్లు ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలన్నాడు బిగ్‌బాస్. ఎక్కువ ఓట్లు ఆదిరెడ్డికి పడటంతో అతడు అవుట్ అయ్యాడు. ఇక రేవంత్, ఫైమా గేమ్ ఆసాంతం దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. నీలాగా సపోర్ట్ తీసుకుని ఆడను అని రేవంత్ ఫైమాను ఉద్దేశించి అన్నాడు. వెంటనే ఆదిరెడ్డి అందుకుంటూ బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా? అన్నాడు. ఓపక్క నాతో, అటు ఇనయతో, తీరా గేమ్‌లోకి దిగాక శ్రీహాన్‌తో కలిసి ఆడావని కౌంటరిచ్చాడు. దీనికి కిమ్మనుకుండా సైలెంట్ అయిపోయాడు రేవంత్. మూడో రౌండ్లో ఇనయ తనను తాను సేవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడింది, కానీ గెలవలేకపోయింది. దీంతో కెప్టెన్ కాలేకపోయానని వెక్కివెక్కి ఏడ్చింది ఇనయ. చివరగా రేవంత్.. శ్రీహాన్‌ను ఓడించి కెప్టెన్‌గా అవతరించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అవడంతో రేవంత్ కంటి నుంచి ఆనందభాష్పాలు రాలాయి. అనంతరం ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నాడు బిగ్‌బాస్. మొదటి ప్రశ్న: నీ కెప్టెన్సీలో కీర్తిని రూడ్‌గా వంట చేయమన్నావు. ఆమె తనకు రాదని చెప్తే నేర్చుకోమన్నావు. మరి నీ ఫ్రెండ్ శ్రీసత్యకు ఎందుకు చెప్పలేదు? శ్రీహాన్: వంట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఆమెను కిచెన్ టీమ్‌లో వేశా. అంతేకాదు అప్పుడప్పుడు ఆమె కిచెన్‌లో పని చేయడం చూశాను. శ్రీసత్య వంట చేయను అన్న మాట నాకు వినిపించలేదు. అయినా తను కిచెన్‌లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది అని చెప్పాడు. నిజానికి శ్రీసత్య వంట రాదు, చేయను అన్నా కూడా శ్రీహాన్ లైట్ తీసుకున్నాడు. ఇద్దరూ అడ్డంగా దొరికిపోవడంతో కీర్తి ముఖం మతాబులా వెలిగిపోయింది. రెండో ప్రశ్న: ఫైమా మీరు మొదట్లో చూడటానికి ఎంతో ఎంటర్టైనింగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు స్వార్థపరురాలిగా కనిపిస్తున్నారు. ఈ రెండింటిలో మీ అసలు రూపం ఏది? ఫైమా: ఆటలో గెలవాలన్న కసి ఎక్కువైంది. దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి ఎంటర్టైన్ పక్కన పెట్టేశాను. మూడో ప్రశ్న: ఒక రివ్యూయర్ అయి ఉండి మీకు గేమ్ బాగా తెలుసని మీరే అంటుంటారు. కానీ మీ నామినేషన్స్ అందరికన్నా సిల్లీగా, సేఫ్‌గా ఉంటాయి. మీరు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని నామినేట్ చేసి అప్పుడు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోండి.. ఆదిరెడ్డి: స్ట్రాంగ్ ప్లేయర్స్‌ను బయటకు పంపించాలన్న ఆలోచన నాకు లేదు. వారితో గేమ్ ఆడి గెలవాలనుకుంటాను. నా కళ్ల ముందు జరిగే సంఘటనలను బట్టే నామినేషన్స్ చేశాను, తప్ప సిల్లీ రీజన్స్ ఇవ్వలేదు. మీకలా అనిపిస్తే నేనేం చేయలేను. మరీ ముఖ్యంగా నన్ను రివ్యూయర్‌గా కాకుండా కంటెస్టెంట్‌గా చూడండి. ప్రశ్న: ఇనయ తన ఫ్రెండ్‌ని వెన్నుపోటు పొడిచిందన్నారు. కానీ మీరు రేవంత్‌ను మూడుసార్లు నామినేట్ చేశారు. కెప్టెన్సీలో తనకి సపోర్ట్ చేయలేదు. అర్జున్ను యూజ్ చేసుకున్నారు. తన గేమ్ కూడా మీరే ఆడి తనని నామినేట్ చేశారు. మీరు చెప్పే విషయాలు మీరసలు పాటిస్తారా? శ్రీసత్య: తప్పుంటే ఎవరినైనా నామినేట్ చేస్తాను. రేప్పొద్దున శ్రీహాన్ది తప్పుంటే అతడిని కూడా నామినేట్ చేస్తా. ఇనయను రెచ్చగొట్టడానికే ఆమె వెన్నుపోటు పొడిచిందన్నాను. ఫ్రెండ్షిప్, గేమ్ ఒకటి కాదు. రేపు పాయింట్ ఉంటే శ్రీహాన్‌ను కూడా నామినేట్ చేస్తాను. అర్జున్ను నేను యూజ్ చేసుకోలేదు. హోటల్ టాస్క్‌లో సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. నేను చెప్పే విషయాలు కచ్చితంగా పాటిస్తాను. చదవండి: ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా -
బ్రెయిన్ దగ్గర పెట్టుకుని మాట్లాడు: రేవంత్‌కు ఆది వార్నింగ్
తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లు ఫైర్ మీదున్నారు. ఈ ఫైర్ మొదటినుంచీ ఉండుంటే బిగ్‌బాస్ ఇలా ప్రైజ్‌మనీ నుంచి లక్షల రూపాయలు కట్ చేసేవాడు కాదు. ఇప్పుడనుకునేం లాభం.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. అన్నట్లుగా బోర్ కొట్టించినందుకు ఫలితంగా ప్రైజ్‌మనీని తగ్గించుకుంటూ పోతున్నాడు. వీళ్లకంటే నాన్‌స్టాప్ సీజన్ కంటెస్టెంట్లే నయమని నెటిజన్లు అంటున్నారంటే వీరి ఎంటర్టైన్మెంట్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇనయ, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్ ఈ పోటీలో పాల్గొన్నారు. ఇనయను గేమ్‌లో అవుట్ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్‌ను టైం చూసి దెబ్బ కొట్టాడు ఆదిరెడ్డి. తర్వాత శ్రీహాన్, రేవంత్ కలిసి ఆదిరెడ్డిని అవుట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆది కోపంతో ఊగిపోయాడు. ఇక గేమ్‌లో రేవంత్, ఫైమా మధ్య ఫైట్ జరిగింది. వెటకారం తగ్గించుకుంటే మంచిది, నీలాగా నేను వెటకారం చేస్తే ఏడుస్తావని రేవంత్ చెప్పగా అమ్మో, నాకు భయమైతుంది మరి అని కౌంటరిచ్చింది ఫైమా. పక్కనోడు సపోర్ట్ చేస్తే కానీ గేమ్ ఆడలేవు, నువ్వు నాకు చెప్తున్నావా? అని ఆగ్రహించాడు రేవంత్. నువ్వు కూడా సపోర్ట్‌తోనే ఆడుతున్నావు, సొంతగా ఆడలేదని ఫైమా అనడంతో మరింత రెచ్చిపోయాడు రేవంత్. నేను ఎవ్వడి సాయం తీసుకోలేదని కరాఖండిగా చెప్పాడు. ఈ మాటతో షాకైన ఆదిరెడ్డి.. మాట్లాడేటప్పుడు బ్రెయిన్ దగ్గర పెట్టుకో. ఇంతకుముందే మనిద్దరం ఒక టీమ్ అన్నట్లుగా చెప్పావు. ఇక్కడేమో శ్రీహాన్‌తో కలిసిపోయి ఆడావు. ఎంతమందితో కలిసి ఆడుతావు? అని విమర్శించాడు. కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోవడాన్ని ఇనయ జీర్ణించుకోలేక ఏడ్చేసింది. మొత్తానికి ఈ వారం రేవంత్ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తారక్‌తో చేయాల్సింది ప్రైజ్‌మనీకి భారీగా ఎసరు, కొత్త కెప్టెన్ ఎవరంటే? -
తగ్గేదే లేదంటున్న బిగ్‌బాస్, విన్నర్‌కు మిగిలేది ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 74: వీలైనంత ప్రైజ్‌మనీని తగ్గించాలని బిగ్‌బాస్ కంకణం కట్టుకున్నట్లున్నాడు. కంటెస్టెంట్లు నో చెప్పడానికి వీలు లేని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌కు ఓ రేటు ఫిక్స్ చేశాడు. అలా ప్రైజ్‌మనీలో నుంచి కావాల్సినంత దండుకుంటున్నాడు. ఇంతకీ ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలు తగ్గింది? నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. రివ్యూలు వద్దని స్వయంగా నాగార్జునే చెప్పినా పట్టించుకోని ఆదిరెడ్డి ఈవారం ఎవరు వెళ్తారని సత్యతో డిస్కషన్ పెట్టాడు. దీనికామె క్షణం ఆలోచించకుండా కీర్తి అని చెప్పింది. అటు ఆదిరెడ్డి కూడా నాకూ అలాగే అనిపిస్తోందని వంత పాడాడు. అనంతరం బిగ్‌బాస్.. బీబీ ట్రాన్స్పోర్ట్ అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బీబీ ట్రక్కు సమయానుసారం ఒక్కో స్టాప్ దగ్గర ఆగిపోతుంది. అలా ఆగిన ప్రతిసారి ఎవరైతే ముందు వచ్చి ఎక్కుతారో వారే కెప్టెన్సీ పోటీదారులవుతారు. అయితే ప్రతి స్టాప్‌లో ఆ వాహనం ఎక్కేందుకు ఓ ధర ఉంటుందని, దాన్ని విన్నింగ్ ప్రైజ్‌మనీలో నుంచి తీసేస్తామని చెప్పాడు. దీనితోపాటు ఆ ట్రక్కు ఎక్కలేకపోయిన మిగతా ఇంటి సభ్యులు తమలో కెప్టెన్సీకి అనర్హులుగా భావించే ఇద్దరి పేర్లను చెప్తే వారిలో ఎవరు పోటీలో పాల్గొంటారు? ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారనేది పోటీదారులు నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో ఆదిరెడ్డి గెలవగా అతడు తన కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం లక్ష రూపాయలు వాడతానన్నాడు. ఇక ఇంటిసభ్యులు పోటీలో నుంచి ఎవరిని తప్పిద్దామని చర్చలు మొదలుపెట్టారు. శ్రీహాన్.. రోహిత్ కెప్టెన్‌గా ఇంటిని చూసుకోగలడన్న నమ్మకం లేదన్నాడు. దీనికి రోహిత్ ఆన్సరిస్తూ.. నువ్వు నన్ను కాంపిటీషన్‌గా చూస్తున్నావేమో, అందుకే పక్కన పెడుతున్నావని కౌంటరిచ్చాడు. దీనికి శ్రీహాన్.. అసలు నువ్వు నాకు కాంపిటీషనే కాదని బిల్డప్ ఇవ్వడం గమనార్హం. ఇక కీర్తి.. శ్రీసత్య, శ్రీహాన్ పేరు చెప్పడంతో శ్రీహాన్ వెటకారం మొదలుపెట్టాడు. అలా వీళ్లిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. చివరగా రోహిత్, ఫైమాలను నిల్చోబెట్టగా వీళ్లలో రోహిత్‌కు ఛాన్స్ ఇచ్చి ఫైమాను తొలగించాడు ఆదిరెడ్డి. రెండోసారి రేవంత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఈ రౌండ్లో ప్రైజ్‌మనీలో నుంచి రూ.25 వేలు తగ్గించాడు బిగ్‌బాస్. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, రాజ్‌లను ఎన్నుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్లయిన రేవంత్, ఆది.. శ్రీహాన్‌ను గేమ్‌లో ఉంచాలనుకుని రాజ్‌ను సైడ్ చేశారు. మూడో రౌండ్లో రోహిత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఇందుకుగానూ రూ.45,000 కట్ చేశాడు. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, శ్రీసత్యలను నిలబెట్టగా కెప్టెన్సీ కంటెండర్లు శ్రీహాన్‌ను గేమ్‌లో కంటిన్యూ చేయనున్నట్లు ప్రకటించారు. నాలుగో రౌండ్లో శ్రీహాన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలవగా ఇందుకోసం రూ.30,000 కోత పెట్టాడు బిగ్‌బాస్. కంటెండర్లు మెరీనాను ఆటలో కంటిన్యూ చేసి కీర్తిని సైడ్ చేశారు. ఐదో రౌండ్లో కంటెండర్‌షిప్ కోసం పోటీపడేందుకు రూ.70 వేలు పెట్టాడు బిగ్‌బాస్. ఈసారి ఇనయ ముందుగా ట్రక్ ఎక్కి కంటెండర్‌గా నిలిచింది. మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ద్వారా రూ.3 లక్షలు కోత పెట్టడంతో ప్రైజ్‌మనీ రూ. 41,00,300 చేరింది. తర్వాత శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీహాన్, శ్రీసత్య మాట్లాడుకున్నప్పుడు నేను ఆటలో అరటిపండు అయ్యాననే టైంలో రాజ్ క్లోజ్ అయ్యాడన్నాడు రేవంత్. ఆ మాటతో మండిపడ్డ శ్రీహాన్.. మేము మాట్లాడుకునేటప్పుడు నిన్ను రావద్దని అనలేదు కదా? అని ప్రశ్నించాడు. నేనేదో చాలా సాధారణంగా అన్నానని రేవంత్ అన్నా సరే శ్రీహాన్ వినిపించుకోలేదు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తున్నామన్నట్లుగా చెప్తున్నావని సీరియస్ అయ్యాడు. అటు శ్రీసత్య కూడా మధ్యలో అందుకుంటూ.. ఇప్పుడేంటి, నేను శ్రీహాన్‌తో ఎక్కువగా మాట్లాడొద్దు, అంతే కదా అని సూటిగా అడిగేసింది. చిన్నమాటను ఎక్కడికో తీసుకువెళ్తున్నారని భావించిన రేవంత్ గొడవ చేయడం ఎందుకని సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఇనయ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో రేవంత్ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది! చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఓటీటీలో ప్రిన్స్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
ప్రైజ్‌మనీలో మళ్లీ కోత! వాళ్లే కెప్టెన్సీ కంటెండర్స్!
ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అని ఫీలైనట్లున్నాడు బిగ్‌బాస్. మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, మీలో ది బెస్ట్ కంటెస్టెంట్‌కు అర కోటి ప్రైజ్‌మనీ ఇస్తానన్నాడు. కానీ ఎక్కడా? ఆదిరెడ్డి అన్నట్లు ఈ సీజన్లో ఎక్కువగా తుప్పాస్ కంటెస్టెంట్లే ఉన్నారు. బాగా ఆడి టీఆర్పీలు పెంచమంటే ఎవరికి వారు పిక్నిక్కు వచ్చినట్లు రిలాక్స్ అయ్యారు. దీంతో సీజన్‌కు చెడ్డపేరు వచ్చింది. ఫలితంగా బిగ్‌బాస్‌కు కోపం వచ్చింది. ఇంకేముంది.. ప్రైజ్‌మనీకి కత్తెర పెట్టే పనులు చేస్తున్నాడు. ఇప్పటికే నామినేషన్స్‌లో ఒకరిని సేవ్ చేయడం, బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ఓడిపోవడంతో ప్రైజ్‌మనీ రూ.50 లక్షల నుంచి రూ.44,00,300కి చేరింది. తాజాగా బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ కూడా డబ్బులతో ముడిపెడుతూ మీ అర్హతను కొనుక్కోమన్నాడు. ఐదో సీజన్లో పెట్టిన ట్రక్కు టాస్క్‌ను కొద్దిగా అటూఇటూ మార్చి మళ్లీ అదే టాస్క్ ప్రవేశపెట్టాడు. ఈ గేమ్‌లో ఇనయ, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో ఇనయ, రోహిత్ ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవనేలేదు. మరి ఈసారైనా వీరికి ఛాన్స్ వస్తుందేమో చూడాలి! ఇకపోతే ఈ టాస్క్ విలువ రెండు లక్షలని తెలుస్తోంది. మరి ఈ టాస్క్ గెలిచి ప్రైజ్‌మనీని కాపాడుకున్నారా.. మరో రెండు లక్షలు పోగొట్టుకున్నారా? తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఇంటి అద్దె కట్టలేక కష్టాలు, ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు: ఫైమా బిగ్‌బాస్ 6 విన్నర్ తానే అని గాల్లో తేలిపోతున్న ఆదిరెడ్డి -
మూడు రోజులు ఫ్యామిలీ అంతా తిండి లేక పస్తులున్నాం: శ్రీసత్య
బిగ్‌బాస్ సీజన్ 6ను రసవత్తరంగా మార్చడంలో కంటెస్టెంట్లు సఫలం కాలేదని వారి మీద కక్ష గట్టినట్టున్నాడు బిగ్‌బాస్. విన్నర్ క్వాలిటీస్ ఏ ఒక్కరికీ సరిగా లేవనుకున్నాడో, లేదా వారికి రూ.50 లక్షలు అనవసరం అనుకున్నాడో ఏమో కానీ ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టడం మొదలు పెట్టాడు. సండే రోజు నాగార్జున విజేత రూ.50 లక్షలు గెలుచుకుంటాడని ప్రకటించాడు. అంతలోనే అనేక ట్విస్టుల మధ్య ఈ ప్రైజ్‌మనీ రూ. 44,00,300కు పడిపోయింది. ఈ ఊచకోత ఇంకా జరిగేట్లు కనిపిస్తోంది. ఇకపోతే ఇంటిసభ్యులకు డబ్బెందుకు అవసరం? వారు డబ్బు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వారికి ప్రైజ్‌మనీ ఎందుకు అవసరం? అనేది చెప్పాలన్నాడు. మొదటగా ఫైమా మాట్లాడుతూ.. 'మా అమ్మకు మేము నలుగురం ఆడపిల్లలం.. చిన్నప్పటినుంచి చాలా కష్టాలు పడ్డాం. రోజూ పొలం పనికి వెళ్లి ఆ డబ్బుతో నిత్యావసరాలు తెచ్చుకునేవాళ్లం. ఊర్లో ఎన్నో కిరాయి ఇళ్లు తిరిగాం, ఎన్నో అవమానాలు పడ్డాం. ఒకసారైతే మాకంటే వేరేవాళ్ల అద్దె ఎక్కువ ఇస్తామన్నారని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నారు. కానీ ఎంత తిరిగినా ఉండటానికి ఇల్లు దొరకలేదు. మా అమ్మకు మంచి ఇల్లు కట్టివ్వాలన్నదే నా కోరిక' అని చెప్పింది. ఆదిరెడ్డి వంతు రాగా.. 'మా నాన్న సరిగా పనిచేయకపోవడం వల్ల అమ్మ ఎన్నో కష్టాలు పడింది. ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నెత్తిన గడ్డిమోపు వేసుకుని పని చేసేది. నాకిప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. కానీ మా ఆవిడకు ఇల్లంటే ఇష్టం. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీతో సొంతిల్లు కొనాలన్నదే నా డ్రీమ్' అన్నాడు. శ్రీసత్య మాట్లాడుతూ.. 'అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటూ తెలియకుండా పెంచారు. కష్టమనేదే లేకుండా చూసుకున్నారు. కానీ ఒకానొక సమయంలో ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి మా కుటుంబమంతా మూడు రోజులు తిండి లేక పస్తులున్నాం. డబ్బు లేకపోతే మన ముఖం కూడా ఎవరూ చూడరు. అమ్మకు వైద్యం చేయించేందుకు ఇల్లు కూడా అమ్మేశాం. నేను సంపాదించేదంతా అమ్మ వైద్యానికే అవుతుంది. బిగ్‌బాస్ విన్నింగ్ ప్రైజ్‌మనీతో మా అమ్మ కోలుకునేలా మంచి వైద్యం చేయించడంతో పాటు సొంతిల్లు కొనాలనుంది' అని చెప్పుకొచ్చింది. కీర్తి మాట్లాడుతూ.. నాకు సొంతంగా ఏదీ కొనాలని లేదు. కానీ నాలాంటి అనాధల కోసం ఒక ఆశ్రమం పెట్టాలని ఉందని చెప్పింది. చదవండి: ప్రైజ్‌మనీకి గురి పెట్టిన బిగ్‌బాస్ -
నేనే విన్నర్, నా ప్రైజ్‌మనీలో నుంచి డబ్బులు కట్ చేస్తారా?: ఆది
Bigg Boss Telugu 6, Episode 73: నామినేషన్స్‌లో జరిగిన గొడవను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు కీర్తి, సత్య. కానీ గొడవ సద్దుమణగడం కాదు కదా అది మరింత అగ్గి రాజుకుంది. శ్రీసత్య వైఖరితో ఏడ్చేసిన కీర్తి.. శ్రీసత్యకు రెచ్చగొట్టే అలవాటుందని నాకు బిగ్‌బాస్‌కు రాకముందే తెలుసు. తన క్యారెక్టరే అంత అని ఊరుకున్నా.. కానీ ఈరోజు నన్ను ఇమిటేట్ చేసి మాట్లాడటం నచ్చలేదని మిగతా వాళ్ల దగ్గర బాధపడింది. తను చేసింది తప్పని ఫీలైందో మరేంటో కానీ అర్ధరాత్రి శ్రీసత్య.. కీర్తి దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. నెక్స్ట్ డే ఏదో చిన్న విషయంలో శ్రీహాన్‌కు, రేవంత్‌కు మధ్య గొడవైంది. ఈ ఫ్రస్టేషన్లో తన మనసులో ఉన్న కోపాన్నంతా శ్రీసత్య ముందు కక్కేశాడు శ్రీహాన్. 'రేవంత్ నన్ను నామినేట్ చేసి నా తప్పు చెప్పాలనుకున్నాడట.. అలాగైతే వాడిదగ్గర వంద తప్పులు కనిపిస్తున్నాయి. కానీ నేను నా ఫ్రెండ్‌ను బయటకు పంపించి నువ్వు తప్పు చేశావని చెప్పాలనుకోను, పక్కకు పిలిచి అతడి తప్పేంటో చెప్తా. పదిమందిలో వాడిని లోకువ చేయను. కానీ వాడు మాత్రం అందరి ముందు నా తప్పు చెప్పాలనుకున్నాడు' అంటూ రగిలిపోయాడు. అనంతరం బిగ్‌బాస్.. నామినేషన్స్‌లో ఉన్నవారు తమను సేవ్ చేసుకుని ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ ఆ ఇమ్యూనిటీకి ఒక ధర ఉందని, ఆ మొత్తం విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి తగ్గిస్తామని చెప్పాడు. నామినేట్ అయిన సభ్యులు చేయాల్సిందల్లా.. వారు ఏ ధరకు ఇమ్యూనిటీని కొనుక్కుంటారో చెక్‌లో రాయాల్సి ఉంటుంది. ఏ సభ్యుడు ఎక్కువ ధర రాస్తాడో వారు సేవ్ అవుతారని ట్విస్ట్ ఇచ్చాడు. అది కూడా లక్ష నుంచి రూ.5 లక్షల మధ్యే రాయాల్సి ఉంటుందన్నాడు. దీంతో శ్రీహాన్ లక్ష రాయగా ఆదిరెడ్డి తానసలు ఇమ్యూనిటీయే కోరుకోవట్లేదని చెప్పాడు. 'ఒక సామాన్యుడిగా అడుగుపెట్టాను. జనాలకు నా ఆట నచ్చి వారి సపోర్ట్‌తో 11 వారాలు హౌస్‌లో ఉన్నాను. ఇలాంటి ఇమ్యూనిటీ కోరుకుని ఇక్కడిదాకా రాలేదు. ఈ సీజన్ గెలుస్తానని నాకు గట్టిగా నమ్మకముంది. అంటే నా ప్రైజ్‌మనీలో నుంచి రూ.5 లక్షలు కట్ అవుతాయన్నమాట! నా దాంట్లో నుంచి కట్ అవుతాయని తెలిసినా ఆ ఇమ్యూనిటీతో ముందుకు వెళ్లాలని లేదు. జనాల ఓట్లతో ముందుకు వెళ్తాను. ఇకపోతే ఇమ్యూనిటీ కోసం ఎక్కువ అమౌంట్ రాసేవారికి ఇంట్లో ఉండే అర్హతే లేదు' అంటూ గాల్లో మేడలు కట్టేశాడు ఆది. అనంతరం అతడు లక్ష రూపాయలు రాశాడు. శ్రీసత్య, కీర్తి, రేవంత్.. రూ.4,99,999, రోహిత్.. రూ.2,51,001, రాజ్.. రూ.4,99,700, మెరీనా, ఇనయ.. రూ.4,99,998 రాశారు. చెక్‌పై రాసే మొత్తాన్ని ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్పినా శ్రీసత్య.. శ్రీహాన్‌తో కోడ్ భాషలో చెప్పిందంటూ ఆమెపై అనర్హత వేటు వేశాడు బిగ్‌బాస్. అలాగే ఒకే అమౌంట్ ఇద్దరూ రాస్తే వారిని రిజెక్ట్ చేశాడు. దీంతో చివరగా రోహిత్, రాజ్ మిగిలారు. వీరిలో రాజ్ రాసిన చెక్ ధర ఎక్కువగా ఉండటంతో అతడు ఇమ్యునిటీ పొందినట్లు ప్రకటించాడు. అతడు రాసిన రూ.4,99,700 విన్నర్ ప్రైజ్‌మనీలో కోత పెట్టగా రూ.45,00,300 మిగిలింది. తర్వాత ఈ ప్రైజ్‌మనీని కాపాడుకోమంటూ సమయానుసారంగా ఛాలెంజ్‌లు ఇస్తానన్నాడు బిగ్‌బాస్. మొదటి ఛాలెంజ్‌లో భాగంగా కేవలం రన్స్ తీస్తూనే సెంచరీ పూర్తి చేయమన్నాడు. ఇందులో రోహిత్, రేవంత్ పాల్గొని 82 పరుగులు తీశారు. సెంచరీ పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ మరో లక్ష ప్రైజ్‌మనీ కట్ చేశాడు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ రూ.44,00,300కు వచ్చింది. ఇక ఈ వారం కెప్టెన్ ఫైమా, రాజ్ మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు. చదవండి: భలే ట్విస్ట్, ప్రైజ్‌మనీ కట్ -
భలే ట్విస్ట్.. ప్రైజ్‌మనీ కట్ చేసేందుకు పూనుకున్న బిగ్‌బాస్!
బిగ్‌బాస్ షో మొదలై పదివారాలు పూర్తయినా నామినేషన్స్ మాత్రం ఇంకా చప్పగానే సాగుతున్నాయి. నిన్నటి నామినేషన్స్ చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియాలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే నామినేషన్స్ నుంచి కాపాడుకునేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒక చెక్ ఇచ్చి దాని మీద యునిక్‌గా అనిపించే అమౌంట్ రాయమన్నాడు. ఏ సభ్యులైతే చెక్‌పై ఎక్కువ మనీ రాస్తారో వారు నామినేషన్ నుంచి సేవ్ అవుతారని చెప్పాడు. అయితే ఈ మొత్తం బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలో నుంచి తగ్గిస్తామని ట్విస్ట్ ఇచ్చాడు. చెక్‌పై ఎంత రాస్తున్నామన్నది ఎవరితో చర్చించడానికి వీల్లేదని బిగ్‌బాస్ మరీమరీ చెప్పాడు. ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో శ్రీసత్య ఈ పోటీలో అనర్హురాలిగా నిలిచింది. ఇక సేవ్ అవడం కోసం కక్కుర్తి పడి ఎక్కువ డబ్బులు రాస్తే మాత్రం వారికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదన్నాడు ఆదిరెడ్డి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎవరెంత అమౌంట్ రాశారంటే... ► ఆదిరెడ్డి - లక్ష రూపాయలు ► శ్రీహాన్ - లక్ష రూపాయలు ► రోహిత్ - రూ. 2.51,001 ► రాజ్ - రూ.4,99,700 ► మెరీనా - రూ.4,99,998 ► ఇనయ - రూ.4,99,998 ► కీర్తి - రూ. 4,99,999 ► రేవంత్ - రూ.4,99,999 ► సత్య - రూ.4,99,999 లక్షలు రాశారు. అదేంటో గానీ అత్యధిక నంబర్ రాసినవారు కాకుండా రాజ్‌ను సేవ్ చేశాడట బిగ్‌బాస్. అంతేకాదు, ప్రైజ్ మనీలో నుంచి రూ. 5 లక్షలు కట్ అయ్యాయట. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా? మరి అదెలా జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే! చదవండి: చెత్త రీజన్స్, చెత్త నామినేషన్స్.. కాకపోతే ఓ ట్విస్ట్