Bigg Boss 6 Telugu: Adi Reddy's Wife, Daughter and Raj's Mother came to BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డిని గుర్తుపట్టలేకపోయిన కూతురు.. భార్యను తలచుకొని రేవంత్‌ కన్నీళ్లు

Nov 23 2022 9:02 AM | Updated on Nov 23 2022 10:57 AM

Bigg Boss 6 Telugu: Adi Reddy Wife Kavitha And Raj Mother Came To Bb House - Sakshi

Bigg Boss-6 Telugu, Episode 80 Highlights : బిగ్‌బాస్‌ సీజన్‌-6లో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ వీక్‌ వచ్చేసింది. టాప్‌-9 కంటెస్టెంట్స్‌ కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముందుగా ఆదిరెడ్డి భార్య కవిత తన కూతురు అద్వైతతో కలిసి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. అయితే కవిత వస్తుందని ఇనయా ఆదిరెడ్డికి ముందే హింట్‌ ఇవ్వడంపై రేవంత్‌ సీరియస్‌ అయ్యాడు. అతనికి ఆ ఎగ్జయిట్‌మెంట్‌ ఉండకుండా నువ్వెందుకు రివీల్‌ చేశావంటూ కాస్త కోప్పడ్డాడు.

ఇక కవిత ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆదిరెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కూతురు అద్వైత మాత్రం తండ్రిని అంతగా గుర్తుపట్టినట్లు లేదు. వచ్చినప్పటి నుంచి బాగా ఏడుస్తూనే కనిపించింది. ఇక కూతురి బర్త్‌డే వేడుకలను బిగ్‌బాస్‌ హౌస్‌లో చేయాలన్న ఆదిరెడ్డి కలను బిగ్‌బాస్‌ నిజం చేశాడు. కేక్‌ పంపించి హౌస్‌మేట్స్‌ సమక్షంలో బర్త్‌డేను సెలబ్రేట్‌ చేశారు. ఇక ఆదిరెడ్డి ఫ్యామిలీని చూసి రేవంత్‌ బాగా ఎమోషనల్‌ అయ్యాడు.

నిండు గర్భిణీగా ఉన్న తన భార్యను తలచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు కీర్తి కూడా తన ఫ్యామిలీని తలచుకొని ఏడ్చేసింది. మరోవైపు రాజ్‌ తల్లి ఉమారాణి హౌస్‌లోకి ఎంట్రీ కాగానే రాజ్‌ తల్లిని పట్టుకొని ఎమోషనల్‌ అయ్యాడు. ఇక కొడుకు బాగా ఆడాలని అలాగే టైటిల్‌ గెలవాలని దీవిస్తుంది. ఇప్పటివరకు తన తల్లిని సోషల్‌ మీడియాలో ఇంకెక్కడా బయటపెట్టలేదని, తొలిసారిగా బిగ్‌బాస్‌ స్టేజ్‌పైనే అందరికి పరిచయం చేస్తున్నానంటూ రాజ్‌ తెలిపాడు. మొత్తానికి ఫ్యామిలీ వీక్‌తో హౌస్‌మేట్స్‌కి మాంచి బూస్టింగ్‌ ఇచ్చినట్లయ్యింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement