Bigg Boss 6 Telugu : What Is Housemates Ranking | Episode 93 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్‌ సీజన్‌-6లో చివరి స్థానాల్లో రోహిత్‌, కీర్తి

Published Tue, Dec 6 2022 9:22 AM | Last Updated on Tue, Dec 6 2022 11:37 AM

Bigg Boss 6 Telugu : What Is Housemates Ranking E93 Highlights - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6, ఎపిసోడ్‌ 93 హైలైట్స్‌ : ప్రతి సీజన్‌లో లాగానే ఈసారి కూడా నెంబర్‌ గేమ్‌ టాస్క్‌ జరిగింది. తమ ఆటతీరు కారణంగా ఎవరు ఏఏ స్థానాల్లో ఉండాలో నిర్ణయించుకొని ఆయా నెంబర్స్‌ వద్ద  నిలబడాలని బిగ్‌బాస్‌ ఆదేశిస్తాడు. దీని ప్రకారం నామినేషన్స్‌ కూడా ఉంటాయి. తమకు కావాల్సిన నెంబర్‌ ర్యాంకింగ్‌ కోసం హౌస్‌మేట్స్‌ వాదించుకోవచ్చు. వాళ్లు చెప్పింది కన్విన్సింగ్‌గా అనిపిస్తే ఆ సభ్యులు తమ ర్యాంకింగ్‌ను ఇచ్చే అవకాశం ఉంది.

ఒకేవళ ఒకే ర్యాంక్‌ కోసం ఇద్దరు నిలబడితే వాళ్లిద్దరూ నామినేషన్స్‌లో ఉండే సందర్భాలు ఉన్నాయి. ఈ టాస్కులో మొదటగా రేవంత్‌ నెం1 స్థానంలో నిలుచున్నాడు. ఆ తర్వాత ఇనయా, కీర్తి, సత్యలు నిల్చుంటారు. ఇక 5,6,7 స్థానాల్లో శ్రీహాన్‌, ఆదిరెడ్డి, రేవంత్‌లు ఉంటారు. బయట ఎలా ఉన్నానో.. ఇక్కడ కూడా అలాగే ఉన్నాను అంటూ రేవంత్‌ నెం1 స్థానంలో నిలబడ్డాడు. శ్రీహాన్ అయితే.. ‘నేను చేసింది తప్పు అని యాక్సెప్ట్ చేసే ధైర్యం కొంతమందికే ఉంటుంది.. దాంట్లో నేను ఒక్కడ్ని.. నాకు కావాల్సింది మొదటి స్థానం’ అంటూనే వెళ్లి 5వ స్థానానికి పరిమితం అవుతాడు. 

అయితే తమ నెంబర్‌ ర్యాంకింగ్స్‌ కోసం పోటీపడ్డ ఇంటి సభ్యులు టాస్క్‌ ముగిసిన సమయానికి రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డిలు తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇనయా, శ్రీసత్యలు 4, 5 స్థానల్లో నిల్చోగా, రోహిత్‌ 6వ స్థానంలో చివరగా కీర్తి 7వ స్థానంలో సెటిలైపోయింది. మరి హౌస్‌మేట్స్‌ అనుకున్నట్లుగా విన్నింగ్‌ ర్యాంకింగ్స్‌ కూడా ఉంటాయా? లేదా అన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement