Buzz: Singer Revanth is the Winner of Bigg Boss 6 Telugu - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: సోషల్‌ మీడియాలో లీక్‌.. బిగ్‌బాస్‌ 6 రన్నర్‌? టాప్‌-3లో ఎవరున్నారో తెలుసా?

Published Sat, Dec 17 2022 10:26 AM | Last Updated on Sat, Dec 17 2022 1:15 PM

Buzz: Singer Revanth Is The Winner Of Bigg Boss 6 And Lift The Trophy - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్‌ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌కు పొలిటికల్‌ రంగు కూడా పులుముకుంది.

టాప్‌-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్‌ చేయడం, మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్‌ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్‌ పవర్‌తో రేవంత్‌ను విన్నర్‌ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్‌బాస్‌ సీజన్‌-6 విజేత ఎవరన్నదానిపై హౌస్‌మేట్స్‌ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్‌ లైన్స్‌ క్లోజ్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో అందుతున్న ఓటింగ్‌ ప్రకారం చివరగా రోహిత్‌ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్‌-4 ప్లేస్‌ను కీర్తి దక్కించుకుంది. టాప్‌-3లో ఆదిరెడ్డి, రేవంత్‌, శ్రీహాన్‌లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్‌ రేవంత్‌ సీజన్‌-6 విజేతగా నిలవగా, శ్రీహాన్‌ రన్నరన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఇక కామన్‌ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్‌-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement