winners
-
ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలు
ఆర్థిక సేవల్లో మరింత భద్రతను పెంచడం, దివ్యాంగులు సులువుగా ఆర్థిక లావాదేవీలను వినియోగించేలా విభిన్న పరిష్కారాలు అందించిన కంపెనీలను భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మూడో హ్యాకథాన్ విజేతలుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాకథాన్(Hackathon)లో పాల్గొనేందుకు మొత్తం 534 ప్రతిపాదనలు వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.‘జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్’, ‘బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ’ థీమ్‌లతో గ్లోబల్ హ్యాకథాన్ మూడో ఎడిషన్‌ను ఆర్బీఐ ఇటీవల నిర్వహించింది. ఈ హ్యాక్‌థాన్‌కు వచ్చిన మొత్తం ప్రతిపాదనల్లో యునైటెడ్ స్టేట్స్(USA), యూకే, హాంకాంగ్, సింగపూర్, బ్రెజిల్, మొరాకోతో సహా దేశంలోని చాలా కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయి. వీటిలో 28 సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. వాటిని ఫైనల్ లిస్ట్ కోసం స్వతంత్ర జ్యూరీకి పంపించినట్లు పేర్కొంది. అందులో కింది కంపెనీలను విజేతలుగా నిలిచినట్లు ఆర్బీఐ ప్రకటించింది.ఎఫ్‌పీఎల్ టెక్నాలజీస్క్సాల్స్ టెక్నాలజీస్ఎపిఫై టెక్నాలజీస్న్యాప్ఐటీ సైబర్సెక్హెచ్విజన్ ఇండియారూప్య దర్శినివిస్ఆస్ట్ఇదీ చదవండి: రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఆర్థిక మోసాలను కట్టడి చేయడంతోపాటు, దివ్యాంగులు సులభంగా వీటిని వినియోగించేలా ఈ కంపెనీలు పరిష్కారాలు అందించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుత నిబంధనలకు లోబడి ఈ కంపెనీల టెక్నాలజీలు పటిష్ఠ భద్రతతో, సులువుగా ఆర్థిక సేవలను అందుబాటులో ఉంచేందుకు దోహదం చేస్తాయని తెలిపింది. -
‘‘అందమైన లోకమని.. రంగు రంగులుంటాయని...’’ (ఫొటోలు)
-
‘సైమా’ 2024 అవార్డుల విజేతలు వీళ్లే! (ఫోటోలు)
-
జాతీయ అవార్డుల విజేతలు వీరే (ఫోటోలు)
-
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
విజేత రష్మిక – వైదేహి జోడి
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వరల్డ్ టూర్ – డబ్ల్యూ35 టోర్నీ డబుల్స్ విభాగంలో భారత జోడి శ్రీవల్లి రష్మిక భమిడిపాటి – వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రష్మిక – వైదేహి జంట 6–3, 7–5 స్కోరుతో నాలుగో సీడ్ య సువాన్ లీ (చైనీస్ తైపీ) – సొహ్యున్ పార్క్ (కొరియా)ని ఓడించింది. మరో వైపు సింగిల్స్ విభాగంలో కూడా రష్మిక ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో రష్మిక 6–3, 6–4తో ఏడో సీడ్ పొలినా లాట్సెంకో (రష్యా)పై గెలుపొందింది. ఫైనల్లో రెండో సీడ్ దలిలా జకుపొవిక్ (స్లొవేకియా)తో రష్మిక తలపడుతుంది. -
పద్మ పురస్కార గ్రహీతలకు తెలంగాణ సర్కార్ సన్మానం
సాక్షి, హైదరాబాద్: పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. పద్మా అవార్డు గ్రహీతల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో ఆరుగురిని ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, మొదటి సినిమాలో ఎలాంటి తపన ఉందో 46 ఏళ్ల తరువాత కూడా చిరంజీవిలో అదే తపన ఉందన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరపడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తోందన్నారు. ప్రతీ ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల క్యాష్ రివార్డ్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతీ నెలా 25 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. -
Bigg Boss 7 Contestants Pics: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ విన్నెర్స్ ఫోటోలు
-
ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే
పర్యావరణ కాలుష్యం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి. ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే పర్యావరణ ఫోటోగ్రఫీ. పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల్ని హైలైట్ చేయడమే కాకుండా, తమ కెమెరా పనితీరుతో పర్యావరణ సంరక్షణ గురించి అనుక్షణం గుర్తు చేస్తారు. అలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ పర్యావరణ ఫోటోగ్రాఫర్ ఆప్ ది ఇయర్ విజేతలను ప్రకటించారు. చార్టర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ (CIWEM) ఆద్వర్యంలో గత 16 ఏళ్లుగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 159 దేశాల నుంచి ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఆరుగురిని విజేతలుగా ప్రకటించారు. వాళ్లు తీసిన ఫోటోలు ఏంటి అన్నది తెలియాలంటే ఫోటోగ్యాలరీని క్లిక్ చేయండి. (ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆటకు అందలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది. 2.99లక్షల మ్యాచ్‌లు.. 52.31లక్షల క్రీడాకారులు తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీపడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహిస్తారు. వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉండగా.. 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో సందడి చేయనున్నారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు (మెన్, ఉమెన్) సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్లైన్లో aadudamandhra.ap.gov. in వెబ్సైట్ ద్వారా, 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఐదు క్రీడాంశాల్లో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, ఖోఖోతో పాటు సంప్రదాయ యోగ, టెన్నీకాయిట్, మారథాన్ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఇప్పటికే క్రీడా సామగ్రిని జిల్లాలకు తరలించామన్నారు. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తామని చెప్పారు. నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఫైనల్స్‌ను విశాఖలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. -
జాతీయ అవార్డ్ విన్నర్స్‌కు మైత్రి మూవీ మేకర్స్ పార్టీ.. పాల్గొన్న అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Asian Games Medal Winners Pics: ప్రధాని మోదీతో ఏషియన్ గేమ్స్‌లో మెడల్స్ విన్నర్స్ (ఫొటోలు)
-
ప్రతిష్టాత్మక 'ఐఏఏ' అవార్డు విజేతలు వీరే..
ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) తన ప్రతిష్టాత్మకమైన IndAA అవార్డుల ఎనిమిదవ ఎడిషన్ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 1న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ఏబీపీ నెట్వర్క్ అండ్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కో-పార్ట్నర్గా ఉండగా.. నెట్వర్క్18 & జియో సినిమా అసోసియేట్ పార్ట్నర్గా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో 15 క్రియేటివ్ ఏజెన్సీలు 18 ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కేటగిరీలు.. ఒక ప్రత్యేక కేటగిరీలో అవార్డులు పొందాయి. అవార్డులలో 102 క్యాంపెయిన్స్ షార్ట్‌లిస్ట్ చేయగా.. వీటిలో డిజైన్ ప్రకారం, ప్రతి విభాగంలో ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. క్లోజ్ కాంటెస్ట్ విషయంలో మాత్రం జ్యూరీ చాలా చర్చల తర్వాత ఉమ్మడి విజేతలను ప్రకటించింది. క్రియేటివ్ ఏజెన్సీలలో లియో బర్నెట్, ముల్లెన్‌లోవ్ లింటాస్ గ్రూప్, ఒగిల్వీ ఆ కేటగిరీలో ఒక్కొక్కటి మూడు IndIAA అవార్డులను గెలుచుకున్నారు. కాగా బీబీడీవో, డీడీబీ ముద్ర అండ్ టీబీడబ్ల్యుఏ రెండు అవార్డులను గెలుచుకున్నాయి. గ్రే గ్రూప్, కెహత్ కబీరా పిక్చర్స్, మెక్కాన్ వరల్డ్‌గ్రూప్, పబ్లిసిస్ వరల్డ్‌వైడ్, రీడిఫ్యూజన్, ఎస్జీ మీడియా, టాలెంటెడ్, ది స్క్రిప్ట్ రూమ్, ది వోంబ్, టిల్ట్ బ్రాండ్ సొల్యూషన్స్ వంటి ఇతర క్రియేటీవ్ ఏజెన్సీలు & క్రియేటర్లు IndAA అవార్డును గెలుచుకున్నాయి. ఇక ఫుడ్ అండ్ బెవెరగె (పానీయాలు) & పర్సనల్ కేర్ కేటగిరి HUL బ్రాండ్లు విజేతలుగా నిలిచాయి. HDFC లైఫ్ ఇన్సూరెన్స్‌లో గెలుపొందగా, HDFC మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో గెలిచింది. ఈ సందర్భంగా జ్యూరీ ఛైర్మన్ అండ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, నెస్లే ఇండియా 'సురేష్ నారాయణ్' మాడ్లాడుతూ.. జ్యూరీ ఛైర్మన్‌గా నా ఐదవ సంవత్సరంలో ఇక్కడ సన్నిహితంగా పరిచయం చేసుకున్నాను. దేశంలోని గొప్ప క్రియేటివ్ మైండ్స్ కలిగిన కొందరిలో ఒకడిగా ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా 'జ్యూరీ చైర్ కా శంబోధన్' అనే పేరుతో ఒక చిన్న కవితతో అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, IAA ఇండియా అవార్డ్స్ ఛైర్మన్ అభిషేక్ కర్నాని కూడా మాట్లాడారు. బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాను ఏఐఐ సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'లక్ష్మీదేవి కంటే ముందు సరస్వతీ దేవి వచ్చిందని తన తండ్రి చెప్పినట్లు వెల్లడించాడు. -
రాజస్థాన్ రాయల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ విజయం
-
ఆస్కార్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం ఘన సన్మానం
-
Womens World Boxing Championship 2023:‘డబుల్’ గోల్డెన్ పంచ్
ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో భారత జెండా మరోసారి సగర్వంగా ఎగిరింది. భారత్‌నుంచి మరో ఇద్దరు కొత్త ప్రపంచ చాంపియన్లు రావడంతో ఆ ఘనత సాధించిన బాక్సర్ల సంఖ్య ఏడుకు చేరింది. హరియాణాకే చెందిన నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా విశ్వవేదికపై విజేతలుగా నిలిచారు. గతంలో యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన నీతూకు సీనియర్ విభాగంలో ఇది తొలి టైటిల్ కాగా... తొమ్మిది సంవత్సరాల క్రితం సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే రజతంతో సరిపెట్టుకొని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వర్ణం అందుకోవడం స్వీటీ బూరా సాధించిన ఘనత. న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల కేటగిరీలో స్వీటీ బూరా విశ్వ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్ పోరులో నీతూ తన ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలవగా...హోరాహోరీ సమరంలో స్వీటీ పైచేయి సాధించింది. వీరిద్దరు తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించడం విశేషం. ఫైనల్లో నీతూ 5–0తో లుట్‌సైఖన్ అల్టాన్సెట్సెగ్ (మంగోలియా)ను చిత్తు చేయగా, స్వీటీ 4–3తో వాంగ్ లినా (చైనా)ను ఓడించింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌నుంచి నలుగురు బాక్సర్లు ఫైనల్ చేరగా, శనివారం ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. నేడు జరిగే ఫైనల్లో భారత్ మరో రెండు స్వర్ణాలను ఆశిస్తోంది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్, 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్ బరిలోకి దిగుతారు. ఏకపక్షంగా... భివానికి చెందిన నీతూ భారీ ప్రేక్షకసమూహం మధ్య తొలి రౌండ్లో ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. లుట్‌సైఖన్ వద్ద జవాబు లేకపోవడంతో 5–0తో ఆధిక్యం లభించింది. రెండో రౌండ్ మాత్రం సమంగా సాగింది. అటాక్, కౌంటర్ అటాక్‌తో సమరం పోటాపోటీగా నడిచింది. ఈ క్రమంలో నీతూకు రిఫరీలు ఒక పాయింట్ పెనాల్టీ కూడా విధించారు. దాంతో రెండో రౌండ్ 3–2తో ముగిసింది. చివరి మూడు నిమిషాల్లో నీతూకు ఎదురు లేకుండా పోయింది. ఒత్తిడికి గురైన మంగోలియా బాక్సర్ కోలుకోలేకపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన లుట్‌సైఖన్‌పై ఈ రీతిలో నీతూ ప్రతీకారం తీర్చుకుంది. ప్రేక్షకుల మధ్య ఉన్న నీతూ మెంటార్, ఒలింపిక్ కాంస్యపతక విజేత విజేందర్ సింగ్ ఆమెను ప్రోత్సహిస్తూ కనిపించాడు. అటాక్...డిఫెన్స్... గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన వాంగ్ లినాతో స్వీటీ పోరు హోరాహోరీగా సాగింది. ఆరంభంలో స్వీటీ పంచ్‌లు ప్రభావం చూపలేదు. వాంగ్ సమర్థంగా వాటినుంచి తప్పించుకోగలిగింది. అయితే ఆ తర్వాత నేరుగా స్వీటీ విసిరిన పంచ్‌లు సరిగ్గా వాంగ్‌ను తాకాయి. దాంతో తొలి రెండు రౌండ్లను ఆమె 3–2 ఆధిక్యంతో ముగించింది. మూడో రౌండ్లో స్వీటీ అటు అటాక్, ఇటు డిఫెన్స్ కలగలిపి జాగ్రత్తగా ఆడింది. వాంగ్ పంచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోగలిగింది. దాంతో చివరి రౌండ్లో స్కోరు 4–1గా తేలింది. అయితే ఈ బౌట్‌పై వాంగ్ రివ్యూ కోరినా అంతిమ విజయం స్వీటీదే అయింది. విజేతలుగా నిలిచిన నీతూ, స్వీటీలకు చెరో లక్ష డాలర్లు (సుమారు రూ. 82.7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత్ నుంచి గతంలో ఐదుగురు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు. మేరీకోమ్ (ఆరు సార్లు – 2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), ఆర్ఎల్ జెన్నీ (2006), కేసీ లేఖ (2006), నిఖత్ జరీన్ (2022) ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఈ జాబితాలో నీతూ, స్వీటీ చేరారు. 22 ఏళ్ల నీతూ అతి వేగంగా బాక్సింగ్ తెరపైకి దూసుకొచ్చింది. తన ఎడమ చేతి వాటం శైలితో ‘మరో మేరీకోమ్’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2016లో యూత్ నేషనల్స్‌లో తొలిసారి విజేతగా నిలిచి అందరి దృష్టిలో పడింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇప్పటి వరకు నీతూ అత్యుత్తమ ప్రదర్శన. 30 ఏళ్ల స్వీటీ ఆరంభంలో కబడ్డీ క్రీడాకారిణి. కబడ్డీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్ వైపు మారింది. మూడు ఆసియా చాంపియన్‌షిప్ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014లో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. అయితే ఆ తర్వాత వేర్వేరు కారణాలతో కొంత కాలం ఆటకు దూరమైనా ఇప్పుడు తిరిగొచ్చి సత్తా చాటింది. భారత కబడ్డీ జట్టు కెప్టెన్ దీపక్ నివాస్ హుడా ఆమె భర్త. -
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
-
సస్పెన్స్‌కు తెరపడింది.. బిగ్‌బాస్6 విన్నర్ అతడే!
బిగ్‌బాస్ సీజన్-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్‌తో రేవంత్‌ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్‌బాస్ సీజన్-6 విజేత ఎవరన్నదానిపై హౌస్మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్-4 ప్లేస్‌ను కీర్తి దక్కించుకుంది. టాప్-3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్‌లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్-6 విజేతగా నిలవగా, శ్రీహాన్ రన్నరన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
భీమ జ్యువెల్స్ మెగా బంపర్ డ్రా: గిప్ట్గా సిట్రోయెన్ కార్లు
హైదరాబాద్: భీమ జ్యువెల్స్ 98వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన బంపర్ లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేసింది. సోమాజీగూడకు చెందిన రామ సుబ్బమ్మ, విపుల్ సిట్రోయెన్ కార్లను గెలుచుకున్నారు. భీమ సూపర్ సర్ప్రైజ్లో భాగంగా కస్టమర్లకు బంగారం, వెండి, వజ్రాల కొనుగోలుపై భారీ తగ్గింపు ఇచ్చింది. బంగారం, వెండి నాణేలతో పాటు ఇతర బహుమతులు కూడా అందజేసింది. ప్రతి దుకాణానికి సిట్రోయెన్ కారు ఇచ్చింది. ఈవెంట్లో లక్కీ విజేతలను ప్రకటించడం మరపురాని అనుభవమని కంపెనీ రీజినల్ బిజినెస్ హెడ్ రఘురామ్ రావు తెలిపారు. వ్యాపారవేత్త షేక్ అబ్దుల్ వాజీద్, బిల్డర్ కనకరాజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భీమ జ్యువెల్స్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి నవంబర్ 13 వరకు నెలరోజుల పాటు ఘనంగా వార్షికోత్సవాలను నిర్వహించింది. -
గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ విజేత మను గండాస్
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2022 గోల్ఫ్ టోర్నీలో న్యూఢిల్లీకి చెందిన మను గండాస్ విజేతగా నిలిచాడు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో 126 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. విజేతకు రూ.6 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. హైదరాబాద్‌కు చెందిన మిలింద్ సోనికి ‘బెస్ట్ అమెచ్యూర్’ అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు. చారిత్రక గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని, భవిష్యత్తులో గోల్ఫ్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. -
ప్రపోజల్స్‌పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు
జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్ షో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుని విజేతగా నిలిచింది శ్రుతిక సముద్రాల. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్‌లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు జీ సరిగమప షో విజేతగా నిలిచిన శ్రుతిక ఇటీవల సాక్షితో ముచ్చటిందచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తను చిన్నప్పటి నుంచి దివంగత లెజెండరి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సింగర్స్ చిత్ర, సుశీల గారిని ఫాలో అయ్యానని, అయితే తన ఫేవరేట్ సింగర్స్ మాత్రం చిత్రమ్మ, శ్రేయా ఘోషల్ అని చెప్పంది. ఇక చిత్రగారు పాడిన పాటల్లో ముంబైలోని ‘కన్నాను లే కళయికలు ఏడాడు ఆగవులే..’ అంటూ అచ్చం చిత్రగారిలా పాడి వినిపించింది. అనంతరం ఇక తనకు వచ్చిన మెసేజ్‌లో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి కదా.. అలా మీకు ఏమైన వచ్చాయా? అని యాంకర్ అడగ్గా.. శ్రుతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ది ఘోస్ట్‌లో నాగార్జున వాడిన ‘తమ హగనే’ అర్థమేంటో తెలుసా? ‘‘ఏంటో కానీ నాకు ఎక్కువగా అక్క అక్క అక్క అనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు. నేను చూసిన మెసేజ్‌లో అన్ని అక్క అనే ఉన్నాయి. ‘వీ సపోర్ట్ యూ అక్క’ అని మెసేజ్ పెడుతున్నారు. అవి చూసి నాకు షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే అందరు నన్న అంత పెద్దదాన్ని అనుకుంటున్నారా? ఏంటి.. అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా? అని అనిపిస్తోంది’ అంటూ శ్రుతిక చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన గురించి పంచుకున్న మరిన్ని విశేషాలను ఇక్కడ చూడండి. -
'జీ సరిగమప' విన్నర్ శృతిక సముద్రాల ఆసక్తికర వ్యాఖ్యలు
Zee Saregamapa Winner Shruthika Samudrala Interesting Comments: శృతిక సముద్రాల.. 20 ఏళ్లకే 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్ టైటిల్ పొందింది. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్‌లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే తను ఈ పోటీలో గెలవడానికి వాళ్ల అమ్మ ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. శ్రుతిక వాళ్ల అమ్మ ఉద్యోగం వదిలేసి మరీ తనకు అండగా నిలిచిందని తెలిపింది. అలాగే తన అభిమానులు కవిత, పాట, ఆటో వంటి బహుమతులు ఇచ్చారని, తనకు లవ్ ప్రపోజల్స్ రావడం కంటే తనను అందరూ అక్క అని పిలుస్తున్నారని పేర్కొంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. చదవండి: 'జీ సరిగమప'లో శృతిక గెలుచుకున్న ఖరీదైన బహుమతులు ఇవే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే? -
'జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్‌గా శృతిక సముద్రాల
సుమారు 26 వారాలపాటు నాన్-స్టాప్ వినోదాన్ని పంచి, ఎంతోమంది అద్భుతమైన సింగర్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్ని చూరగొన్న 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్' కార్యక్రమం ముగిసింది. ఫినాలేలో అదరగొట్టే ప్రదర్శనలతో హైదరాబాద్‌కి చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలిచింది. అలాగే తనకు గట్టి పోటీ ఇచ్చి వెంకట సుధాన్షు రన్నరప్‌గా నిలిచాడు. ప్రెస్టీజియస్ 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్' ట్రోఫీతో పాటు, శృతిక రూ. లక్ష నగదు, మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమానంగా అందుకుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన వెంకట సుధాన్షు రూ. 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో ఫినాలే లో జడ్జెస్ ని మెప్పించి, టైటిల్ గెలుచుకున్న శృతిక, బీఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లో డిగ్రీ పూర్తిచేసింది. 6 సంవత్సరాల వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన శృతిక, కర్నాటిక్ సంగీతంలో శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా, శృతిక మాట్లాడుతూ... "జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్ విన్నర్ గా నిలవడం ఒక డ్రీం-కం-ట్రూ మూమెంట్. ఇది నా లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్, ఎప్పటికి మరిచిపోలేనిది. ఈ ట్రోఫీని నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను. నాతో పాటు, నా తోటి ఫైనలిస్ట్స్ కూడా అద్భుతంగా పాడారు. కాబట్టి వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సరిగమప జర్నీలో వారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. అదేవిధంగా, ఈ జర్నీలో నాకు సహకరించిన జీ సరిగమప టీం, ముఖ్యంగా మెంటర్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్లకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, నేను సింగర్ గా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్న మా నాన్న శశికాంత్, అమ్మ రూప, అక్క శరణ్యకి, అలాగే సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీ రామాచారి కొమండూరి గారికి, శ్రీ నిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు." అని తెలిపింది. ఆగష్టు 14 న ప్రసారమైన ఫినాలే ఎపిసోడ్లో లెజెండరీ సింగర్ పి. సుశీల, శృతి హాసన్, నితిన్, కృతి శెట్టి సమక్షంలో 8 మంది ఫైనలిస్ట్స్ అద్భుతమైన ప్రదర్శనలతో మైమరిపించారు. ఈ ఫినాలే స్టేజ్ వేదికగా పి. సుశీల తాను సంగీత ప్రపంచానికి చేసిన సేవలను గుర్తిస్తూ నిర్వహించిన సన్మానం ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవగా, 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా మాజీ సైనికులకు చేసిన సన్మానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. -
మిస్ సౌత్ ఇండియాగా వైజాగ్ అమ్మాయి
ఏయూక్యాంపస్(విశాఖపట్నం): మిస్ సౌత్ ఇండియాగా విశాఖ అమ్మాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని చరిష్మా కృష్ణ ఎంపికైంది. కేరళలో పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె కిరీటం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టి, తన ప్రతిభతో చరిష్మా విజేతగా నిలిచింది. చదవండి: లైగర్‌ను దొంగచాటుగా కలిసిన బ్యూటీ! ప్రముఖ మోడల్ భారతి బెర్రి ఆమెకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫెమీనా మిస్ ఇండియాకు సిద్ధమవుతోంది. చిన్నతనం అమెరికాలో గడిపిన చరిష్మా కృష్ణ భరతనాట్యం, కూచిపూడి నృత్యం తొమ్మిదేళ్లుగా నేర్చుకుంటోంది. స్విమ్మింగ్, కరాటే, గుర్రపుస్వారీ విద్యలను సైతం నేర్చుకుంది. చిన్నతనం నుంచి కళలపై ఆసక్తితో నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది. తండ్రి హరికృష్ణ ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. -
Chess Olympiad 2022: భారత్ 24–0
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జట్లకు ఎదురే లేకుండా పోయింది. తొలి రోజు బోర్డులో ఎత్తు వేసినవారంతా విజేతలుగానే నిలిచారు. ఓపెన్‌లో మూడు, మహిళల్లో మరో మూడు... ఈ ఆరు జట్ల తరఫున బరిలోకి దిగిన 24 మంది ఆటగాళ్లు విజయం సాధించారు. ఓపెన్ కేటగిరీలో ఇరిగైసి అర్జున్, విదిత్ సంతోష్ గుజరాతీ, నారాయణన్, శశికిరణ్ కృష్ణన్లతో కూడిన భారత ‘ఎ’ జట్టు 4–0తో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. విదిత్ సంతోష్... మకొటో రాడ్‌వెల్‌పై గెలుపొందగా, రెండో బోర్డులో నల్లపావులతో ఆడిన తెలంగాణ కుర్రాడు అర్జున్, మనాంగో స్పెన్సర్‌ను ఓడించాడు. 32 ఎత్తుల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఎమరాల్డ్ ముషోర్‌పై ఎస్.ఎల్.నారాయణన్, జెంబా జెముసెపై శశికిరణ్ గెలుపొందారు. భారత ‘బి’ జట్టు 4–0తో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)పై నెగ్గింది. అల్ హొసానిపై గుకేశ్, ఇబ్రహీమ్‌పై శరీన్ నిహిల్, సయీద్‌పై ఆధిబన్, అబ్దుల్ రహమాన్‌పై రౌనక్ విజయం సాధించారు. భారత ‘సి’ జట్టు కూడా 4–0తో దక్షిణ సుడాన్‌పై నెగ్గింది. సైప్రియానోపై సేతురామన్, అజక్ మచ్ దువనీపై అభిజిత్ గుప్తా, గాంగ్ తోన్ గాంగ్‌పై మురళీ కార్తికేయన్, మజుర్ మన్యంగ్‌పై అభిమన్యు పీటర్ గెలుపొందారు. మహిళల విభాగంలో కూడా ఆతిథ్య జట్లు శుభారంభం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్ర శ్రేణి గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, వైషాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలున్న భారత్ ‘ఎ’ 4–0తో తజికిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. నదెజ్దా అంటొనొవాపై హంపి 41 ఎత్తుల్లో అలవోక విజయం సాధించింది. సబ్రినాపై వైషాలీ, రుక్సోనా సైదొవాపై తానియా, ముత్రిబా హొతమిపై భక్తి గెలిచారు. భారత్ ‘సి’ అమ్మాయిల జట్టు 4–0తో హాంకాగ్‌పై నెగ్గింది. లామ్ క యాన్పై బొడ్డా ప్రత్యూష, సిగప్పి కన్నప్పన్‌పై ఇషా కరవాడే, డెంగ్ జింగ్ జిన్‌పై పీవీ నందిదా, లి జాయ్ చింగ్‌పై సాహితి వర్షిణి విజయం సాధించారు. ‘బి’ జట్టు కూడా 4–0తో వేల్స్‌పై గెలిచింది. స్మిత్ ఒలివియాపై వంతిక అగ్రావల్, చాంగ్ కింబెర్లీపై సౌమ్య స్వామినాథన్, 1–0తో హియా రేపై మేరి ఆన్ గోమ్స్, ఖుషీ బగ్గాపై దివ్య దేశ్‌ముఖ్ నెగ్గారు. -
చెస్ టోర్నీ విజేత అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఆదిరెడ్డి అర్జున్ విజేతగా నిలిచాడు. ఆరు రౌండ్లపాటు నిర్వహించిన ఈ టోర్నీలో అర్జున్ 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరిదైన ఆరో రౌండ్లో చల్లా సహర్షపై అర్జున్ గెలుపొందాడు. ఈ టోర్నీలో అర్జున్ ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మొహమ్మద్ బాషిక్ ఇమ్రోజ్ (నల్లగొండ) రన్నరప్‌గా, సీహెచ్ కార్తీక్‌సాయి (రంగారెడ్డి) మూడో స్థానంలో, విహాన్ కార్తికేయ (రంగారెడ్డి) నాలుగో స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన సివిల్ సర్వీసెస్ విజేతలు
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021కి ఎంపికైన అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ వారితో ముచ్చటించి, అభినందనలు తెలిపారు. చదవండి: Cordelia Cruise Ship: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి.. -
తానా తెలుగు తేజం పోటీలు విజేతల ప్రకటన
డాలాస్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నర్విమచిన తెలుగు తేజం భాషా పటిమ పోటీలకు సంబంధించిన విజేతలను ప్రకటించారు. ఈ పోటీలు తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీఆధ్వర్యంలో 2022 జూన్ 4, 5 తేదీలలో జూమ్ లో నిర్వహించారు. ఈ పోటీలను (కిశోర, కౌమార, కౌశల) మూడు విభాగాలలో నిర్వహించగా ప్రవాసంలో వున్న వందలాది తెలుగు పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు. మెదడుకు మేత, పదవిన్యాసం, పురాణాలు, పదచదరంగం, తెలుగు జాతీయాలు, వేమన పద్యాలు, సుమతీ శతకాలు, మన తెలుగు కవులు, తెలుగులో మాట్లాడడం వంటి సంబందిత అంశాలు పోటీలు నిర్వహించారు. తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ చైర్మన్ చినసత్యం వీర్నపు పొటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ తోటకూర మదిలోనుంచి పుట్టిన ఆలోచన వల్లే ఈ పోటీలు కార్యరూపం దాల్చాయన్నారు. ఈ పోటీల నిర్వాహణకు అన్నివిధాలా సహయ సహకారాలు అందించిన చొక్కాపు వెంకటరమణ, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మనలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. ఈ పోటీలు నిర్వహించడానికి దాతలుగా వున్న ప్రసాద్ తోటకూర, చినసత్యం వీర్నపు, మురళి వెన్నం, రవి పొట్లూరి, వెంకట రాజా కసుకుర్తి, లోకేష్ నాయుడు కొణిదాల, శ్రీకాంత్ పోలవరపు, న్యాయ నిర్ణేతలుగా వున్న శ్రీమతి రాజేశ్వరి నల్లాని, గీతా మాధవి, రాధిక నోరి లకు ధన్యవాదలు తెలియజేశారు. విజేతల వివరాలు - కిశోర(5-10 సంవత్సరాలు) విభాగంలో – మొదటి బహుమతి శ్రీనిధి యలవర్తి, రెండవ బహుమతి చాణక్య సాయి లంక, మూడవ బహుమతి వేదాన్షి చందలు గెలుచుకున్నారు. కన్సోలేషన్ బహుమతులను శ్రీనిజ యలవర్తి, ఉదయ్ వొమరవెల్లిలకు దక్కాయి. - కౌమార (11-14 సంవత్సరాలు) విభాగంలో మొదటి బహుమతి రాధ శ్రీనిధి ఓరుగంటి, రెండవ బహుమతి ఇషిత మూలే, మూడవ బహుమతి సంజన వినీత దుగ్గిలు గెలుచుకున్నారు. కన్సోలేషన్ బహుమతులను ద్విజేష్ గోంట్ల, ఉదయ్ వొమరవెల్లిలను వరించాయి. - కౌశల (15-18 సంవత్సరాలు) విభాగంలో మొదటి బహుమతి శ్రీ ఆదిత్య కార్తీక్ , రెండవ బహుమతి శ్రీ షణ్ముఖ విహార్ దుగ్గి, మూడవ బహుమతి $116 ను శ్రీ యష్మిత్ మోటుపల్లిలకు వచ్చాయి. కాగా కన్సోలేషన్ బహుమతి శ్రీ గణేష్ నలజులకి దక్కింది. చదవండి: న్యూజిలాండ్‌లో తెలుగు సాహితీ సదస్సు -
సివిల్స్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్‌రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్‌రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్‌లను సీఎం జగన్ అభినందించారు. చదవండి: జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’ సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్‌కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్‌కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. -
కెప్టెన్సీ అనుభవం లేదు.. అప్పటికే ఎత్తుపల్లాలు.. అయినా
‘విజయం అయితే మీది... ఓటమి ఎదురైతే అది నాది’... ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హార్దిక్ పాండ్యా తన సహచరులతో చెప్పిన మాట ఇది. హార్దిక్‌కు ఐపీఎల్ టైటిల్స్ కొత్త కాదు. ఆటగాడిగా ముంబై ఇండియన్స్ తరఫున అతని ముద్ర ఎంతో ప్రత్యేకం. కానీ నాయకుడిగా ఇదే మొదటి అవకాశం. టీమ్‌కు ఒక ముఖచిత్రంలా ‘తమవాడు’ కావాలని గుజరాత్ యాజమాన్యం హార్దిక్‌ను కెప్టెన్‌గా పెట్టుకుంది తప్ప... గతంలో ఏనాడూ ఏ స్థాయిలోనూ సారథ్యం చేసిన అనుభవం లేని హార్దిక్ ఐపీఎల్ టీమ్‌ను ఎలా నడిపించగలడని అప్పుడే వినిపించింది. పైగా గత రెండేళ్లుగా వరుస గాయాలతో బాధపడుతూ అతను చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండటంతో పాటు భారత జట్టులోకి కూడా వస్తూ, పోతూ ఉన్నాడు. ఇలాంటి స్థితి నుంచి మొదలు పెట్టి సమర్థ నాయకత్వంతో టైటాన్స్‌కు వరుస విజయాలు అందించడమే కాదు ఏకంగా టైటిల్‌ను కూడా అందించిన పాండ్యాను ఎంత ప్రశంసించినా తక్కువే. ఎంతో మంది స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఐపీఎల్ ట్రోఫీని గెలిపించి అతను తన స్థాయిని గొప్పగా ప్రదర్శించాడు. మొత్తం లీగ్‌లో బ్యాటింగ్‌లో 131.26 స్ట్రయిక్‌రేట్‌తో 487 పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు (మొత్తం 8) పడగొట్టి ఆల్‌రౌండర్‌గా హార్దిక్ తనేంటో రుజువు చేశాడు. అయితే దానికి మించి అతని కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారత్ తరఫున ఆడుతూ ధోని నాయకత్వంలో కెరీర్లో పురోగతి సాధించిన హార్దిక్ ఐపీఎల్లో ధోని శైలిని గుర్తుకు తెచ్చాడంటే అతిశయోక్తి కాదు. 16 మ్యాచ్‌లలో ఎక్కడా అతను ఒక్కసారి కూడా సంయమనం కోల్పోయినట్లు గానీ మైదానంలో కీలక క్షణాల్లో ఆగ్రహావేశాలు ప్రదర్శించడం గానీ కనిపించలేదు. సహచరులందరికీ తగిన బాధ్యతలు అప్పగించి ‘మిస్టర్ కూల్’లా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయాడు. వ్యూహరచనల్లో గానీ ఆటగాళ్లను సమర్థంగా వాడుకునే ప్రణాళికల్లో గానీ అతను వేసిన ప్రతీ అడుగు సత్ఫలితాలనిచ్చింది. తొలి మ్యాచ్ నుంచి చూస్తే టైటాన్స్ విజయంలో దాదాపు ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ఎవరో ఒకరిపై ఆధారపడకుండా అందరినీ నమ్మడమే ఆ జట్టుకు సానుకూలాంశంగా మారింది. హార్దిక్, గిల్, సాహా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మిల్లర్, షమీ...ఇలా ప్రధాన ఆటగాళ్లంతా టోర్నీలో ఏదో ఒక దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారంటే సమష్టి ప్రదర్శన ఎలాంటిదో అర్థమవుతుంది. గిల్ (483 పరుగులు), మిల్లర్ (481), సాహా (317) తమ బ్యాటింగ్‌తో కీలకంగా నిలిచారు. ఐపీఎల్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన రషీద్ ఖాన్ బౌలింగ్ కూడా గుజరాత్‌కు ప్రత్యేక బలాన్నిచ్చింది. కేవలం 6.59 ఎకానమీతో అతను 19 వికెట్లు పడగొట్టగా... అనుభవజ్ఞుడైన షమీ (20 వికెట్లు) అండగా నిలిచాడు. తొలి సీజన్లో గుజరాత్ వేసిన తొలి బంతికి వికెట్‌తో శుభారంభం చేసిన షమీ... ఆ జట్టు తరఫున చివరి బంతికి వికెట్ తీసి ఘనంగా సీజన్‌ను ముగించాడు. ఫెర్గూసన్ తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం చూపించగలిగాడు. ఫ్రాంచైజీ అండగా నిలిచి ప్రోత్సహించిన యువ ఆటగాళ్లు సాయిసుదర్శన్, అభినవ్ మనోహర్, సాయికిషోర్ ఎక్కడా నిరాశపర్చకుండా తమకు ఇచ్చిన అవకాశాలను సమర్థంగా వాడుకొని జట్టుకు ఉపయోగపడ్డారు. గుజరాత్ చివరి ఓవర్లలో సాధించిన విజయాలో ఈ టోర్నీలో మరో ఎత్తు. ఎనిమిది సార్లు లక్ష్య ఛేదనకు దిగగా, ఏడుసార్లు చివరి ఓవర్లోనే జట్టు విజయం సాధించింది. 3 మ్యాచ్‌లలో ఆఖరి 4 ఓవర్లలో 50కి పైగానే పరుగులు చేయాల్సి వచ్చినా టైటాన్స్ తగ్గలేదు. ఈ ఏడు విజయాల్లో ఐదుసార్లు ఆఖరి ఓవర్లో పదికంటే ఎక్కువ పరుగులే చేయాల్సి రాగా, గుజరాత్ చేసి చూపించింది. పరుగులకంటే ఆ సమయంలో ఆటగాళ్లు చూపించిన ప్రశాంతత, ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన తీరు ప్రశంసనీయం. -సాక్షి, క్రీడా విభాగం చదవండి: IPL 2022: గుజరాత్ గుబాళింపు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) .@gujarat_titans - The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍 The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground - the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f — IndianPremierLeague (@IPL) May 29, 2022 -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ
ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో విజేతల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. . ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా, అబు ధాభి. హాంగ్ కాంగ్, సింగపూర్, ఐర్లాండ్, భారత దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. విజేతలకు నిర్వాహాకులు అభినందలు తెలిపారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి ఉత్తమ కథానిక విభాగం విజేతలు 1) “మరో కురుక్షేత్రం”- పాణిని జన్నాభట్ల (బోస్ట్‌న్, ఎంఏ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) ‘‘ధారావాహిక హత్యలు” –నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్ (టాంపా, ఫ్లోరిడా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “భూలోక స్వర్గం” – డా. కె. గీత (మోర్గాన్హిల్, కాలిఫోర్నియా, ప్రశంసా పత్రం) 4) “ఆట – పోరు”- తాడికొండ కె. శివకుమార శర్మ, (గ్రేటర్ వాషింగ్టన్, డీసీ, ప్రశంసా పత్రం) ఉత్తమ కవిత విభాగం విజేతలు 1) “ఈ రాత్రికి సౌత్ ఆఫ్రికా” -గౌతమ్ లింగా (జోహెన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా) ($116 నగదు పారితోషికం) 2) “ఏమంటేనేం?”- స్వాతి శ్రీపాద (డెట్రాయిట్, మిచిగాన్, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఒంటరి సాయంత్రాలు”- రవి మంత్రిప్రగడ (డబ్లిన్, ఐర్లాండ్ ప్రశంసా పత్రం) 4) “పువ్వు” - సతీష్ గొల్లపూడి (ఆక్లాండ్, న్యూజీలాండ్, ప్రశంసా పత్రం) “నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు 1) “క్రైమ్ నెవెర్ పేస్” – వీకేవీ ప్రసాద్ (హైదరాబాద్, ఇండియా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “రెండు నిమిషాలు- అమృత వర్షిణి (లోన్ట్రీ, యూఎస్ఏ) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఆడ పిల్ల”- షేక్ షబ్బర్ హుస్సేన్ (కడప, ఏపీ) ప్రశంసా పత్రం "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు 1) “భూమిని హత్తుకునే క్షణాలకోసం”- అసిఫా గోపాల్ (నెల్లూరు, ఏపీ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “తను వెళ్ళిపోయింది”- రాజు గడ్డం (కడవిపల్లి గ్రామం, ఇండియా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “శిల-కల”- ఆవుల కార్తీక (హైదరాబాద్) ప్రశంసా పత్రం -
‘పై’ ఎలక్ట్రానిక్స్ లక్కీడ్రాలో బహుమతుల బొనాంజా
గత ఏడాది డిసెంబర్ 5న ప్రముఖ రిటైల్ దిగ్గజం పై ఇంటర్నేషన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(Pai International Electronics Ltd) నిర్వహించిన మెగా ఫెస్టివల్ సేల్ లక్కీ డ్రాలో హైదరాబాద్‌కు చెందిన బాబీ అనే వ్యక్తి మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఏ కారును గెలుచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను పై సంస్థ యూట్యూబ్‌లో ప్రసారం చేసింది. 2021 గాను దసరా, దీపావళి నేపథ్యంలో రూ. 2 వేలు కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసే వారికి డిజిటల్ కూపన్లను పై ఇంటర్నేషనల్ అందించింది. ఈ సేల్‌లో బాబీ రూ. 8000 విలువైన సేల్ ఫోన్‌ను కొనుగోలు చేసి కారును గెల్చుకున్నాడు. కస్టమర్ల కోసం ప్రతియేడాది నాలుగు సార్లు, ప్రతి పండుగ సీజన్లో లక్కీ విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. గత 20 సంవత్సరాలలో,..320 కార్లు, 320 బైక్‌లు, రూ. 22.5 కోట్ల విలువైన ఉచిత షాపింగ్, రూ. 7.3 కోట్ల గోల్డ్ రివార్డ్, రూ. 2.65 కోట్ల విలువైన నగదు బహుమతులు, అలాగే 64.56 కోట్ల విలువైన పై లాయల్టీ పాయింట్లను అందించింది. Pai International Electronics Ltd రిటైల్ సంస్థ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నీచర్ కోసం ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తోంది. కస్టమర్ల కోసం అనేక రకాల సేల్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాకుండా కస్టమర్లకు అదనంగా లక్కీడ్రాలు, బహుమతులను ఉచితంగా అందిస్తోంది. పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లు విలువైన బహుమతులను ప్రకటించింది. వాటితో పాటుగా కస్టమర్లు 15 కోట్ల వరకు పైగా లాయల్టీ పాయింట్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. హ్యుందాయ్ ఆరా వంటి కార్లు, అలాగే ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కస్టమర్లకు అదనంగా గిఫ్ట్‌కార్డులను, రివార్డులను కూడా ప్రకటిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విస్తరించి ఉంది. ఇది సుమారు 87 లార్జ్ స్కేల్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్లతో పాటుగా దాదాపు 121 మొబైల్ ఫోన్ అవుట్లెట్లతో, 15 ఫర్నిచర్ షాపులను కలిగి ఉంది. కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. పై ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవలను కూడా చేస్తోంది పై ఇంటర్నేషనల్. పర్యావరణ పరిరక్షణ నుంచి నిరుపేద వృద్ధులకు, విద్యార్థులకు తన వంతు సహాకారాన్ని అందిస్తోంది. (అడ్వటోరియల్) -
తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్: అర్జున్ అదరహో...
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): మరో రౌండ్ మిగిలి ఉండగానే తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా అవతరించాడు. థాయ్ దాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్)తో శనివారం జరిగిన 12వ రౌండ్ గేమ్‌ను అర్జున్ కేవలం 15 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది గ్రాండ్మాస్టర్లతో సహా మొత్తం 14 మంది 13 రౌండ్లపాటు పోటీపడుతున్న ఈ టోర్నీలో 12వ రౌండ్ తర్వాత అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతూ టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. ఎన్గుయెన్, జొనాస్ బుల్ బెరీ (డెన్మార్క్) ఇద్దరూ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆదివారం చివరిదైన 13వ రౌండ్ గేమ్‌లో అర్జున్ ఓడిపోయి, ఎన్గుయెన్, జొనాస్ తమ గేముల్లో నెగ్గినా అర్జున్ స్కోరును దాటలేకపోతారు. వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాలెంజర్స్ టోర్నీ విజేత హోదాలో వచ్చే ఏడాది జరిగే టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తర్వాత టాటా స్టీల్ చాలెంజర్స్ టోర్నీ టైటిల్ గెలిచిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ‘క్లాసికల్ ఫార్మాట్లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఆదివారం జరిగే చివరి రౌండ్ గేమ్‌లో నెగ్గి గెలుపు సంబరాలు చేసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, శ్రీనాథ్ నారాయణన్ అందించిన సూచనలతో నా ఆట మరింత మెరుగైంది. ఈ టోర్నీ తొలి గేమ్‌లో ఓడిపోయే పరిస్థితి నుంచి తేరుకొని ‘డ్రా’ చేసుకోవడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెండో గేమ్‌లో విజయం సాధించాక అదే జోరును కొనసాగించా’ అని అర్జున్ వ్యాఖ్యానించాడు. -
భారత్‌దే ‘శాఫ్’ ఫుట్‌బాల్ టైటిల్
మాలీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. నేపాల్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత్ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సునీల్ ఛెత్రి (49వ ని.లో), సురేశ్ సింగ్ (50వ ని.లో), అబ్దుల్ సమద్ (90వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో సునీల్ ఛెత్రి ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆడుతున్న వారిలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో లయెనెల్ మెస్సీ (అర్జెంటీనా–80 గోల్స్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–115 గోల్స్) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. -
నా విజయం వెనుక చాలామంది కృషి ఉంది : సివిల్స్ 20 వ ర్యాంకర్
-
Italian Grand Prix: తొమ్మిదేళ్ల తర్వాత...
మోంజా (ఇటలీ): దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు విజేతగా నిలిచింది. 2012లో జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో చివరిసారిగా విజేతగా నిలిచిన ఆ జట్టు ఇన్నేళ్లకు ఇటలీ గ్రాండ్‌ప్రిలో మెరిసింది. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో మెక్లారెన్ డ్రైవర్ డానియెల్ రికియార్డో చాంపియన్‌గా నిలిచాడు. 53 ల్యాప్‌ల రేసును అతడు అందరికంటే ముందుగా గంటా 21 నిమిషాల 54.367 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2018 మొనాకో తర్వాత మళ్లీ రికియార్డో ఒక ఎఫ్1 రేసులో గెలుపొందడం ఇదే తొలిసారి. రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన రికియార్డో... ట్రాక్ తొలి మలుపులోనే వెర్స్టాపెన్ను అధిగమించి ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం తన లీడ్‌ను నిలబెట్టుకున్న అతడు విజేతగా నిలిచాడు. 1.747 సెకన్ల తేడాతో రేసును ముగించిన నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలువగా... మూడో స్థానంలో బొటాస్ (మెర్సిడెస్) నిలిచాడు. హోమ్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్లు లెక్లెర్క్ నాలుగో స్థానంలో... సెయింజ్ ఆరో స్థానంలో నిలిచారు. -
పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోదీ సమావేశం
-
టోక్యో ఒలింపిక్స్ విజేతలకు క్రీడాశాఖ సత్కారం
-
‘డ్రా’ అయితే సంయుక్త విజేతలే
దుబాయ్: తొలిసారి నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు చాంపియన్ (డబ్ల్యూటీసీ) విజేతను తేల్చే క్రమంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావించింది. కచ్చితంగా ఎవరో ఒకరు గెలవాలనేమీ లేదని, సాధారణ టెస్టుల తరహాలో మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ఇరు జట్లను ప్రకటించడమే సరైందని తేల్చింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18 సౌతాంప్టన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు సంబంధించి నిబంధనలపై స్పష్టతనిచ్చింది. ప్రైజ్‌మనీ ఎంతనే దానిపై మాత్రం ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ టెస్టు మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన విశేషాలు చూస్తే... మ్యాచ్ తేదీలు: జూన్ 18 నుంచి 22 వరకు వేదిక: సౌతాంప్టన్‌లోని ఏజియస్ బౌల్ మైదానం ఉపయోగించే బంతి: భారత్‌లో సాధారణంగా టెస్టు మ్యాచ్‌లను ఎస్జీ బంతులతో, న్యూజిలాండ్‌లో కూకాబుర్రా బంతులతో ఆడతారు. వేదిక మాత్రమే కాకుండా బంతులు ఉపయోగించడంలో కూడా ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం ఉండరాదని ఐసీసీ భావించింది. అందుకే ఫైనల్ కోసం డ్యూక్స్ బంతులను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వాడే డ్యూక్స్ బంతులు సీమ్ ఎక్కువగా ఉండి బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. మ్యాచ్ డ్రా అయితే విజేత ఎవరు: మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’గా ముగిస్తే భారత్, న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. డబ్ల్యూటీసీ ప్రకటించినప్పుడు ఈ నిబంధన ఉన్నా, ఇప్పుడు ఫైనల్‌కు ముందు ఐసీసీ దీనిని మళ్లీ పేర్కొంది. రిజర్వ్ డే ఉందా: ఉంది, జూన్ 23ను రిజర్వ్ డే ఉంచారు. అవసరమైతే ఆరో రోజూ ఆడిస్తాం అని ఐసీసీ ప్రకటించింది. ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే మ్యాచ్‌ను ఆరో రోజుకు పొడిగిస్తారా: ఈ విషయంలోనే ఐసీసీ ఇప్పుడు మరింత స్పష్టతనిచ్చింది. ‘రిజర్వ్ డే’ అనేది ప్రత్యామ్నాయ ఏర్పాటు మాత్రమే. అన్ని టెస్టుల్లాగే ఈ మ్యాచ్ కూడా ఐదు రోజులు పూర్తిగా జరిగి ఎవరో ఒకరు గెలవని పక్షంలో ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు తప్ప ఆరో రోజుకు పొడిగించి ఫలితం కోసం ప్రయత్నించరు. కేవలం వర్షం తదితర వాతావరణ సమస్యల కారణంగా ఐదు రోజుల్లో సమయం వృథా అయితే మాత్రమే దానిని పూడ్చేందుకు రిజర్వ్ డేలో సమయాన్ని వాడుకుంటారు. రిజర్వ్ డే ఎలా ఉంటుంది: ఆరో రోజు అవసరం పడితే గరిష్టంగా ఐదున్నర గంటల (330 నిమిషాలు) లేదా 83 ఓవర్లు ఆడిస్తారు. దీనికి చివరి గంట అదనం. వర్షం కారణంగా కొంతసేపు అంతరాయం కలిగినా... అదే రోజు ఆటను పొడిగించి దానిని సరిచేస్తూ వస్తే ‘రిజర్వ్ డే’ను వాడరు. దాదాపు రోజంతా నష్టపోతే మాత్రమే ఆరో రోజు ఆడించే అంశంపై రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఐదో రోజు చివరి గంటలో మాత్రం ఆరో రోజు ఆడించడం గురించి ప్రకటిస్తారు. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఇరు జట్లనూ రిఫరీ సమాచారం అందిస్తూ ఉంటారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఆడిస్తారా: ఇటీవల ఐసీసీ కొన్ని కొత్త నిబంధనలను టెస్టుల్లోకి తెచ్చింది. ప్రస్తుతం సాగుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్‌లో కూడా వాటిని వాడారు. దీని ప్రకారం షార్ట్ రన్లను థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లే ముందు బ్యాట్స్‌మన్ షాట్‌కు ప్రయత్నించాడా అనే అంపైర్‌ను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎల్బీల కోసం రివ్యూలో ఉపయోగించే ‘వికెట్ జోన్’ ఎత్తును కూడా పెంచారు. -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: వీరికి లక్కుంది..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వీరికి లక్కుంది.. వారికి అదే దక్కింది.. అన్న చందంగా జిల్లాలో ఈ నెల 9న జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 9 మంది అదృష్టవంతులు అతి తక్కువ మెజారిటీలతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. గెలిచిన అభ్యర్థులు తమ అదృష్టమంటూ ఆనందపడుతుంటే ఓడిన అభ్యర్థులు తమ ఖర్మంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు అనేక గ్రామ పంచాయతీల్లో నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను సొంత ఖర్చులతో గ్రామాలకు పిలిపించి ఓట్లు వేయించినప్పటికీ ఉత్కంఠ పోరులో సింగిల్ డిజిట్ తేడాతో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తక్కువ మెజారిటీతో చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపొందిన సర్పంచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ►చీమకుర్తి మండలం నిప్పట్లపాడు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. గెలుపు నీదా నాదా అన్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన లెక్కింపు ప్రక్రియలో ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు ఇరువురు అభ్యర్థుల ఆమోదంతో టాస్ వేశారు. ఇందులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీ చేసిన రావులపల్లి కోటేశ్వరరావు విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. ►ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో బరిలో ఉన్న చెన్నుపాటి రాజ్యలక్ష్మి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ►పర్చూరు మండలం తూర్పుపెద్దివారిపాలెం పంచాయతీలో సైతం చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన రావి సంధ్యారాణి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ►ఒంగోలు మండలంలోని యర్రజర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న తమ్మిశెట్టి రాములమ్మ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఇరువర్గాలకు చెరి 5 వార్డులు సమానంగా గెలుపొందడం విశేషం. ►చీమకుర్తి మండలం జీఎల్ పురం గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న మన్నం వెంకటరావు చివరకు 4 ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ►ఇంకొల్లు మండలం, సూదివారిపాలెం గ్రామంలో సైతం ఉత్కంఠభరితంగా పోటీ సాగింది. ఈ పోటీలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో బరిలో నిలిచిన గోరంట్ల జయలక్ష్మి 4 ఓట్ల స్వల్ప తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించారు. ►ఒంగోలు మండలం బొద్దులూరివారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీలో నిలిచిన కాట్రగడ్డ కవిత 7 ఓట్ల స్వల్ప తేడాతో విజయంఢంకా మోగించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో మొట్టమొదటి సారి వైఎస్ఆర్ సీపీ పాగా వేసింది. ►ఒంగోలు మండలంలో టీడీపీకి బలమైన గ్రామంగా ఉన్న దేవరంపాడులో సైతం పంచాయతీ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న నన్నపనేని వెంకటేశ్వరరావు 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరులో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు 9 ఓట్ల లోపు మెజారిటీలతో గెలుపొంది అదృష్టవంతులు అనిపించుకోగా, వీరిపై పోటీ చేసి ఓడిపోయిన 9 మందికి దురదృష్టవశాత్తు ఓటమే దక్కిందని అంతా సానుభూతి చూపుతున్నారు. ఇంకొంచెం కష్టపడి ఒక్క ఓటు తెచ్చుకున్నా గెలిచేవాళ్లమంటూ వీరిలో కొందరు తమ దురదృష్టానికి తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి. మొత్తానికి తొలిదశ ఎన్నికల్లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో తక్కువ మెజారిటీలతో గెలుపొందిన సర్పంచ్‌లకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. -
బరిలో తోడల్లుళ్లు.. జూపల్లిదే గెలుపు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ క్లీన్‌స్విప్ చేసింది. ఈ డివిజన్ నుంచి పోటీ చేసిన జూపల్లి సత్యనారాయణ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూకట్‌పల్లికి చెందిన ‘మాధవరం’ ఇంటికి అల్లుళ్లు కావటం విశేషం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా మాధవరం కుటుంబానికి అల్లుళ్లు కావటంతో పోటీ రసవత్తరంగా మారింది. బంధువుల మధ్యనే పోటీ నెలకొనడంతో ఎవరికి ప్రచారం చేయాలో, ఓటు ఎవరికి వేయాలో తేల్చుకోలేకపోయారు. చదవండి: గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాధవరం రామచంద్రరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మాధవరం కృష్ణారావు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. కూకట్పల్లి వెలమ సామాజిక వర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మాధవరం కుటుంబ సభ్యులకు అల్లుళ్లుగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థి నాయినేని పవన్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి విశ్వ తేజేశ్వరరావులు కూకట్పల్లి వాస్తవ్యులే. అయినా ఓ విధంగా తోడల్లుళ్ల మధ్య పోరాటం సాగిందని చెప్పవచ్చు. చివరికి జూపల్లి సత్యనారాయణకే ఓటర్లు పట్టం కట్టారు. చదవండి: ఏఎస్రావు నగర్, ఉప్పల్‌లో కాంగ్రెస్ గెలుపు -
డగ్లస్ స్టువార్ట్‌కు బుకర్ ప్రైజ్
లండన్: న్యూయార్క్‌కు చెందిన స్కాటిష్ రచయత డగ్లస్ స్టువార్ట్ 2020 సంవత్సర బుకర్ప్రైజ్ను గెలుచుకున్నారు. ‘‘షుగ్గీబెయిన్’’ పేరిట రచించిన తన ఆత్మకథకు ఆయన 50వేల పౌండ్ల బుకర్ ప్రైజ్‌ను సాధించారు. 1980 ప్రాంతంలో గ్లాస్గో నగరంలో జరిగిన ఘటనల సమాహారంగా ఈ నవలను మలచారు. పోటీలో ఐదుగురు రచయితలను తోసిరాజని డగ్లస్ ఈ బహుమతి పొందారు. పోటీలో పాల్గొని ఓటమి పొందిన వారిలో భారతీయ మూలాలున్న రచయిత అవని దోషి (రచన: బర్న్ట్ షుగర్)కూడా ఉన్నారు. రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్ అనంతరం డగ్లస్ న్యూయార్క్‌కు వచ్చారు. షుగ్గీ బెయిన్ పబ్లిష్ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించారు. (చదవండి: జార్జియా రీకౌంటింగ్‌లో బైడెన్ గెలుపు) -
సంయుక్త విజేతలుగా భారత్, రష్యా
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ వివాదాస్పద రీతిలో ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ ముగిసింది. భారత్, రష్యా జట్లను సంయుక్త విజేతలుగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. రెండు మ్యాచ్‌లతో కూడిన ఫైనల్లో తొలి మ్యాచ్‌లో ఆరు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇరు జట్లూ 3–3తో సమంగా నిలిచాయి. ఫైనల్లోని రెండో మ్యాచ్ సందర్భంగా ఇద్దరు భారత క్రీడాకారులు నిహాల్ సరీన్, దివ్య దేశ్‌ముఖ్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్ పోవడం.... చివరకు సమయాభావం వల్ల వారు గేమ్‌లను వదులుకోవాల్సి జరిగింది. దాంతో రష్యా 4.5–1.5తో ఈ మ్యాచ్‌ను గెలిచింది. మ్యాచ్‌లో విజయానికి 2 పాయింట్లు, ‘డ్రా’ అయితే చెరో పాయింట్ ఇస్తారు. ఫలితంగా రష్యా ఓవరాల్‌గా 3–1తో విజయం సాధించినట్లయింది. అయితే విజయావకాశాలు ఉన్నదశలో ఇంటర్నెట్ కనెక్షన్ పోయిన కారణంగానే తాము గేమ్‌లు కోల్పోవాల్సి వచ్చిందని ‘ఫిడే’ అప్పీల్ కమిటీకి భారత్ అప్పీల్ చేసింది. అప్పీల్‌ను విచారించిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షడు అర్కాడీ ద్వోర్కోవిచ్ (రష్యా) అన్ని అంశాలను పరిశీలించి, భారత అప్పీల్ సరైనదేనని భావిస్తూ రెండో మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి మ్యాచ్ సమంగా ముగియడంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. స్వర్ణం గెలిచిన భారత బృందంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఉన్నారు. టోర్నీ మొత్తంలో హంపి, హారిక నిలకడగా ఆడి భారత్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హంపి టైబ్రేక్ గేమ్‌లో గెలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతి, నిహాల్ సరీన్, అరవింద్ చిదంబరం, ప్రజ్ఞానంద, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, భక్తి కులకర్ణి, వంతిక అగర్వాల్ మిగతా సభ్యులుగా ఉన్నారు. రష్యాతో జరిగిన ఫైనల్ తొలి మ్యాచ్‌లో విదిత్–నెపోమ్నియాచి (37 ఎత్తులు); హరికృష్ణ–అర్తెమీవ్ (54 ఎత్తులు); హంపి–కాటరీనా లాగ్నో (48 ఎత్తులు); హారిక–అలెగ్జాండ్రా కొస్టెనిక్ (48 ఎత్తులు); ప్రజ్ఞానంద–అలెక్సీ సరానా (56 ఎత్తులు); దివ్య–షువలోవా (51 ఎత్తులు) గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. రెండో మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్–నెపోమ్నియాచి; విదిత్–దుబోవ్; హారిక–కొస్టెనిక్ గేమ్‌లు ‘డ్రా’గా ముగియగా... హంపి 88 ఎత్తుల్లో గోర్యాచిక్నా చేతిలో; దివ్య 25 ఎత్తుల్లో షువలోవా చేతిలో; నిహాల్ సరీన్ 25 ఎత్తుల్లో ఎసిపెంకో చేతిలో ఓడిపోయారు. దివ్య గెలిచే స్థితిలో, నిహాల్ ‘డ్రా’ చేసుకునే స్థితిలో ఉన్నపుడు ఇంటర్నెట్ కనెక్షన్ పోవడం, ఇంటర్నెట్ పునరుద్ధరణ జరిగేసరికి గేమ్ నిర్ణీత సమయం అయిపోవడంతో వారిద్దరు ఓడిపోయినట్లు ప్రకటించారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ముఖాముఖిగా ఈ ఏడాదే రష్యా రాజధాని మాస్కోలో ఆగస్టు 5 నుంచి 17 వరకు జరగాల్సిన చెస్ ఒలింపియాడ్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దాని స్థానంలో ఆన్లైన్లో చెస్ ఒలింపియాడ్‌ను నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందన... తొలిసారి నిర్వహించిన ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులైన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
కోల్‌కతాకే ఐఎస్ఎల్ కిరీటం
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ చరిత్రలో అట్లెటికో డి కోల్‌కతా జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఆరో సీజన్ ఫైనల్లో కోల్‌కతా 3–1 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. దాంతో ఐఎస్ఎల్ టైటిల్‌ను అత్యధికంగా మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఆరు సీజన్లు జరగ్గా... అందులో కోల్‌కతా (2014, 2016, 2019–20), చెన్నైయిన్ రెండు సార్లు (2015, 2017–18), బెంగళూరు ఒకసారి (2018–19) విజేతలుగా నిలిచాయి. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో నిర్వహించిన ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కోల్‌కతా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదల్లేదు. కోల్‌కతా ప్లేయర్ జావీ (10వ, 90+3వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... గార్సియా (48వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. చెన్నైయిన్ తరఫున వాల్‌స్కీస్ (69వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో చెన్నైయిన్ ప్లేయర్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలను కోల్‌కతా గోల్ కీపర్ అరిందామ్ భట్టాచార్య సమర్థవంతంగా అడ్డుకున్నాడు. సీజన్ చాంపియన్ కోల్‌కతాకు రూ. 8 కోట్లు... రన్నరప్ చెన్నైయిన్ రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. 15 గోల్స్ సాధించిన చెన్నైయిన్ ఆటగాడు వాల్‌స్కీస్‌కు ‘గోల్డెన్ బూట్’ అవార్డు దక్కింది. గోల్డెన్ గ్లవ్ అవార్డును బెంగళూరు ఎఫ్‌సీ గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు గెల్చుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ సుమీత్ (కోల్‌కతా)... ‘హీరో ఆఫ్ ద లీగ్’గా హ్యూగో బౌమౌస్ (గోవా ఎఫ్‌సీ) నిలిచారు. -
సాక్షి ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతి ప్రధానం
-
చాంపియన్స్ భవన్స్, సర్దార్ పటేల్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) తెలంగాణ రీజియన్ క్రికెట్ టోర్నమెంట్ జూనియర్ విభాగంలో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ (సైనిక్‌పురి), సీనియర్ విభాగంలో సర్దార్ పటేల్ (ఎస్పీ) డిగ్రీ కాలేజీ (సికింద్రాబాద్, పద్మారావునగర్) జట్లు విజేతలుగా నిలిచాయి. ‘సాక్షి’ మీడియా గ్రూప్, శ్రీ చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీ గురువారం ముగిసింది. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) మైదానంలో జరిగిన జూనియర్ విభాగం ఫైనల్లో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీ ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజీ (మంచిర్యాల) జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటైంది. సాయి (22), ఆసిఫ్ (15), వికాస్ (15) రాణించారు. భవన్స్ జట్టు బౌలర్లలో ఇలియాన్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... మయాంక్, రాహుల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భవన్స్ 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పో యి 78 పరుగులు చేసి గెలిచింది. భవన్స్ జట్టులో సాకేత్ (43; 7 ఫోర్లు), ఇలియాన్ (12) ఆకట్టుకున్నారు. ఎస్ఆర్ఆర్ బౌలర్ సాయి కృష్ణ రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఇలియాన్కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించింది. సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజీ జట్టు సీనియర్స్ విభాగం ఫైనల్లో సర్దార్ పటేల్ కాలేజీ 47 పరుగుల ఆధిక్యంతో ఆదర్శ్ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. తొలుత సర్దార్ పటేల్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు సాధించింది. షేక్ సోహైల్ (55), రాకేశ్ (43) రాణించారు. అనంతరం ఆదర్శ్ కాలేజీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసి ఓడిపోయింది. షేక్ సోహైల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ పురస్కారం దక్కింది. జూనియర్, సీనియర్ విభాగంలో విజేతగా నిలిచిన భవన్స్, సర్దార్ పటేల్ కాలేజీ జట్లకు రూ. 50 వేలు చొప్పున... రన్నరప్ ఎస్ఆర్ఆర్, ఆదర్శ్ డిగ్రీ కాలేజీ జట్లకు రూ. 25 వేలు చొప్పున ప్రైజ్‌మనీ అందజేశారు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన సాకేత్ (భవన్స్ శ్రీ అరబిందో), రాకేశ్ (సర్దార్ పటేల్ కాలేజీ)లకు రూ. 15 వేలు చొప్పున... ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్స్’గా నిలిచిన ఇలియాన్ (భవన్స్), షేక్ సోహైల్ (సర్దార్ పటేల్)లకు రూ. 10 వేలు చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. సైనిక్‌పురిలోని భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు రాణి రెడ్డి (కార్పొరేట్ ఎఫైర్స్), ఏఎల్ఎన్ రెడ్డి (బిజినెస్ కంట్రోల్), భవన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ కమోడోర్ (రిటైర్డ్) జేఎల్ఎన్ శాస్త్రి, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఏజీఎం డి.వెంకటేశ్వర్లు డీన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, చెక్‌లు అందజేశారు. -
సాక్షి ప్రీమియార్ లీగ్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం
-
ఏ పంట వేయాలో చెప్పేస్తుంది...
వారంతా రైతు బిడ్డలు. చిన్నప్పట్నుంచీ తాము తిరిగిన ఊరు, పంట పొలాలు, అక్కడ మట్టి పరిమళాలు గురించి మాత్రమే తెలుసు. అయితేనేం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగించుకోవడంలో తమకు ఎవరూ సాటి పోటీ లేదని నిరూపించుకున్నారు. చిన్నప్పట్నుంచీ భూమినే నమ్ముకున్న బతుకులైనా దానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం జోడించారు. వాన రాకడల్ని, వాతావరణంలో మార్పుల్ని, పంటలపై వాటి ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం ఒక యాప్‌ని రూపొందించారు. ఈ యాప్ ద్వారా మట్టిలో నాణ్యత ఎంత?, అది ఏ పంటలకు అనుకూలం? వంటివన్నీ ఆ యాప్ కచ్చితమైన అంచనాలతో చెప్పేస్తుంది. భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో అత్యంత మారుమూల గ్రామాలకు చెందిన వీరంతా ఒక బృందంగా ఏర్పడి ఈ యాప్‌ను రూపొందించింది. పుణేకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ఐసెర్టిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసే సరికొత్త ఆవిష్కరణలకు ఇచ్చే ప్రైజ్ వీరి యాప్‌కు లభించింది. సాఫ్ట్వేర్ కార్యక్రమాలకు సంబంధించిన హాక్‌థాన్ అనే వేదికలో వీరంతా చేరి తమ మేధకు పదునుపెట్టారు. హాక్‌థాన్ విసిరే సవాళ్లలో టీమ్ వర్క్, ఏఐ వినియోగం, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటివన్నీ విస్తృతంగా అధ్యయనం చేస్తారు. మొత్తం 12 మంది రైతు బిడ్డలంతా కలిసి ఈ యాప్‌ని రూపొందించి ప్రైజు కొట్టేశారు. -
చాంప్స్ మెద్వెదేవ్, కీస్
సిన్సినాటి (అమెరికా): ప్రతిష్టాత్మక సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), మహిళల సింగిల్స్ విభాగంలో 16వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) విజేతలుగా నిలిచారు. ఫైనల్స్‌లో మెద్వెదేవ్ 7–6 (7/3), 6–4తో 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించగా... మాడిసన్ కీస్ 7–5, 7–6 (7/5)తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మెద్వెదేవ్, కీస్ కెరీర్లో అత్యున్నత శ్రేణి టైటిల్స్ ఇవే కావడం విశేషం. చాంపియ్స్ మెద్వెదేవ్‌కు 11,14,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 95 లక్షలు)... మాడిసన్ కీస్‌కు 5,44,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 88 లక్షలు) లభించాయి. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన మెద్వెదేవ్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు. పది ఏస్‌లను సంధించిన అతను రెండుసార్లు గాఫిన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. గత రెండు వారాల్లో వాషింగ్టన్ ఓపెన్, మాంట్రియల్ మాస్టర్స్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న 23 ఏళ్ల మెద్వెదేవ్ మూడో ప్రయత్నంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఐదో రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో రష్యా తరఫున సఫిన్, డెవిడెంకో, చెస్నోకోవ్, ఖచనోవ్ ఈ ఘనత సాధించారు. తాజా విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదేవ్ ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2010లో డెవిడెంకో తర్వాత రష్యా ప్లేయర్ టాప్–5లోకి రావడం ఇదే ప్రథమం. కుజ్నెత్సోవాతో జరిగిన ఫైనల్లో కీస్ రెండు సెట్లలోనూ 3–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఫైనల్ చేరే క్రమంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్వన్స్ హలెప్ (రొమేనియా), వీనస్ (అమెరికా)లను ఓడించిన కీస్ తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో కీస్ 13 ఏస్‌లు సంధించింది. తాజా విజయంతో కీస్ ఏడాది తర్వాత టాప్–10ర్యాంకింగ్స్‌లోకి వచ్చింది. ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఆమె ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉంది. -
సిన్సినాటి చాంప్స్ మెద్వదేవ్, కీస్
సిన్సినాటి: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో సరికొత్త చాంపియన్లు అవతరించారు. పురుషుల సింగిల్స్‌లో డేనియల్ మెద్వదేవ్(రష్యా), మహిళల సింగిల్స్‌లో మాడిసన్ కీస్(అమెరికా) ట్రోఫీలు ఎగరేసుకుపోయారు. సోమవారం జరిగిన తుదిపోరులో తొమ్మిదోసీడ్, వరల్డ్ నెం.5 మెద్వదేవ్ 7–6(7/3), 6–4తో 16వ సీడ్, 15వ ర్యాంకర్ డేవిడ్ గఫిన్(బెల్జియం)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇది మెద్వదేవ్‌కు తొలి ఏటీపీ మాస్టర్స్ టైటిల్. కాగా, అద్భుత ఫామ్‌లో ఉన్న మెద్వదేవ్‌కు ఈ ఏడాది ఇది 43వ విజయం. అతని తర్వాతి స్థానంలో 41 విజయాలతో నాదల్(స్పెయిన్), 39 గెలుపులతో ఫెదరర్(స్విట్జర్లాండ్) ఉండడం విశేషం. మరోవైపు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్థానిక క్రీడాకారిణి మాడిసన్ కీస్నే విజయం వరించింది. తుదిపోరులో ఆమె 7–5, 7–6(7/5)తో స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా)పై చెమటోడ్చి నెగ్గింది. ఇది కీస్‌కు కెరీర్లో ఐదో టైటిల్ కాగా, ఈ సీజన్లో రెండోది. -
సంయుక్త విజేతలు భారత్, పాకిస్తాన్
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ విజేత పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 9 గంటల 10 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.40 నుంచి) ప్రారంభం కావాల్సింది. అయితే మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది. గంటన్నరపాటు వేచి చూసినా... వర్షం తగ్గకపోవడంతో నిర్వాహకులు ఫైనల్‌ను రద్దు చేసి భారత్, పాకిస్తాన్ లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. -
విజేత వెటెల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బెల్జియం గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఆదివారం పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన హామిల్టన్‌ను వెటెల్ తొలి ల్యాపులోనే అధిగమించాడు. అక్కడి నుంచి రేసు ముగిసేదాకా ఆధిక్యంలో కొనసాగిన వెటెల్ 44 ల్యాపుల ఈ రేసును గంటా 23 ని.34.476 సెకన్లలో పూర్తి చేశాడు. అతనికంటే 11.061 సెకన్లు ఆలస్యమైన హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఓకాన్లు వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ప్రధాన రేసు మొదలైన కాసేపటికే రేసింగ్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన హుల్కెన్బర్గ్పై ఫార్ములావన్ నిర్వాహకులు 10 స్థానాలు పెనాల్టీగా విధించారు. -
గెలుపు గుర్రం షిరహట్టి ...!
షిరహట్టి సీటును గెలుచుకున్న పార్టీనే కర్ణాటకలో సర్కార్‌ను ఏర్పాటు చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. 1972 నుంచి కూడా ఇదే తీరు కొనసాగుతోంది. మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో ఈ స్థానానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. జనతాపార్టీ మొదలుకుని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ వరకు గత 46 ఏళ్లుగా ఇక్కడి నుంచి గెలిచినవారు ఏ పార్టీలో ఉంటే అదే ప్రభుత్వం ఏర్పడుతూ వస్తోంది. ఒక్కో సందర్భంలో అధికారపార్టీకి చెందిన వారు ఓటమి పాలై ఇండిపెండెంట్ గెలిచినా, ఆ స్వతంత్ర ఎమ్మెల్యే చేరిన పార్టీనే అధికారానికి వస్తోంది. ఇదీ నియోజకవర్గం... ముంబై కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని 65వ నంబర్ నియోజకవర్గం షిరహట్టి. దాదాపు 2 లక్షల ఓటర్లు. 2013లో 71.8 శాతం ఓటింగ్ నమోదైంది. 20–49 ఏళ్లలోపున్న ఓటర్లు దాదాపు 81 శాతం ఉన్నారు.. వీరిలో 20–29 ఏళ్లలోపున్నవారు 31 శాతం, 30–39 ఏళ్లలోపున్నవారు 32 శాతమున్నారు. మతసామరస్యానికి షిరిహట్టి ప్రతీకగా నిలుస్తోంది. 450 ఏళ్లకు పైగా హిందువులు,ముస్లింలకు ఆరాధ్యనీయమైన శ్రీజగద్గురు ఫకిరీశ్వర మఠం ఇక్కడే ఉంది. ఈ మఠం ప్రధాన పూజారి సూఫీ, భక్తి మార్గాలను బోధిస్తారు. ప్రధాన పూజారి మరణించాక హిందు, ఇస్లామ్ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు ఆచరిస్తారు. ఇదీ రికార్డ్... –1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డబ్ల్యూవీ వదిరాజ్ఆచార్య గెలిచారు. అప్పుడు దేవరాజ్ అర్స్ నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది.1983 వరకు ఈ సీటుపై పట్టును కాంగ్రెస్ కొనసాగించింది. –1983లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపనల్ గులప్ప ఫకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి జనతాపార్టీకి మద్దతు ప్రకటించారు. అప్పుడు రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. 1985లోనూ జనతాపార్టీనే ఆ సీటును నిలుపుకోగా మళ్లీ హెగ్డే సీఎంగా ప్రమాణం చేశారు. –1989లో మళ్లీ ఆ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. వీరేంద్రపాటిల్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఆ రాష్ట్రంలో మతఘర్షణలు తలెత్తడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ ఆయనను సీఎంగా తొలగించారు. ఆ తర్వాత ఇది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదంగా మిగిలిపోయింది. –1994లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఫకీరప్పను జనతాదళ్ టికెట్‌పై జీఎం మహంతషెట్టార్ ఓడించారు. దరిమిలా హేచ్‌డీ దేవెగౌడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. –1999లో కాంగ్రెస్ మళ్లీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. –2004 ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. షిరహట్టి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ దక్కించుకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో జేడీ ఎస్తో జతకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కొంత కాలానికి బీజేపీతో హేచ్‌డీ కుమారస్వామి చేతులు కలపడంతో ఈ సర్కార్ పతనమైంది. –2008లో బీజేపీ తొలిసారిగా షిరహట్టిపై పట్టుసాధించింది. దక్షిణ భారత్‌లోనే మొదటిసారిగా బీఎస్యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. –2013లో కాంగ్రెస్ మళ్లీ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. సిద్ధరామయ్య సీఎం అయ్యారు. –ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దొడ్డమని రామకృష్ణ షిడ్లింగప్పపై బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్ప లామని పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లోనే ఈ రెండుపార్టీల తరఫునే వీరే బరిలో నిలిచారు. కేవలం 315 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో షిడ్లింగప్ప గెలుపొందారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సెల్పీ కొట్టు.. ఐఫోన్ పట్టు
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్లు మరి ఇంతగా అభివృద్ధి చెందక ముందు ఫోటో దిగాలంటే...ఒకటి మన దగ్గరైనా కెమెరా ఉండాలి లేదంటే ఫోటో స్టూడియోకైనా వెళ్లాలి. మరి ఇప్పుడో...ఈ పరిస్థితి పూర్తిగా మారింది. స్మార్ట్ ఫోన్లలో ఫ్రంట్ కెమరా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు ఓ కెమెరామాన్ అయ్యారు. ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజు కొన్నిలక్షల మంది సెల్ఫీల కోసం దాదాపు ఏడు నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఇలాంటి వారందరికి ఒక శుభవార్త... సెల్పీలు తీసుకోవడంలో మీకు మంచి ప్రావీణ్యం ఉన్నట్లయితే ఆపిల్ ఐ ఫోన్‌ను ఉచితంగా పొందవచ్చు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ ఈ ఐపీఎల్ సీజన్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ‘టీ20ఆన్‌ఎయిర్‌టెల్4జీ’ పోటీని నిర్వహిస్తుంది. అయితే ఈ అవకాశం కేవలం ఎయిర్టెల్ సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా... 1. ఎయిర్టెల్ 4జీ సిమ్‌ను తీసుకోవాలి. 2. తర్వాత ఆ సిమ్‌కార్డ్ కనిపించేలా పట్టుకొని ఒక సెల్ఫీ దిగాలి. 3. అనంతరం ఆ సెల్ఫీని సోషల్ మీడియా చానల్స్ అయిన ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో టీ20ఆన్‌ఎయిర్‌టెల్4జీ హాష్‌టాగ్‌లో పోస్టు చేయాలి. 4. ఎయిర్టెల్ ఇండియాను, మరో ముగ్గురు స్నేహితులను కూడా టాగ్ చేసి వారిని కూడా ఇదే విధంగా చేయమని చెప్పండి. వచ్చిన ఎంట్రీలలో నుంచి కంపెనీ ఏడుగురు విజేతలను ఎంపిక చేస్తుంది. వారిలో రోజుకు ఒక విజేతకు ఆపిల్ ఐఫోన్ 8ను అందించనుంది. విజేతలకు సంబంధించిన వివరాలను ఎయిర్టెల్ తన అధికారిక వెబ్‌పేజీలో ప్రకటించనుంది. విజేతలను ప్రకటించిన అనంతరం వారు 24 గంటలలోపే స్పందించి, తమ వివరాలను అందించాలి. అలా చేయని పక్షంలో డ్రాలో ఎంపికైన తరువాతి వ్యక్తికి ఐ ఫోన్8ను గెలుచుకునే అవకాశం కల్పించనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. -
క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ కాశీనగర్ జట్టు
పర్లాకిమిడి : గజపతి జిల్లాలోని కాశీనగర్ సమితి అల్లాడ గ్రామపంచాయతీలో నవీన్ సాము స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు కోడూరు నారాయణరావు మంగళవారం ప్రారంభిం చారు. ఈ టోర్నమెంట్లో కాశీనగర్, ఖండవ, అల్లాడ, గుణుపురం టీమ్‌లు పాల్గొన్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో కాశీనగర్ టీమ్ విన్నర్‌గా, గుణుపురం జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు కాశీనగర్ సమితి చైర్మన్ సీహెచ్ సింహాద్రి, కె.నారాయణరావులు షీల్డులు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శొబొరొ, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ కేటగిరీ–4 విజేతలు వీరే
హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–4, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై, మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని నీరజ్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఎస్. ఉదయశ్రీ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్ బాచుపల్లిలో చదువుతున్న సాయి శ్రీరామ్ కార్తీక్ బి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని గీతాంజలి దేవశాలలో చదువుతున్న మ్రినల్ కుటేరి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న ఆశ్రిత్ రెడ్డి బిరదవోలు కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్‌లో చదువుతున్న వి. కృష్ణ సాయి గాయిత్రి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం బ్రాంచ్‌లో చదువుతున్న కావేరి ప్రియా పుట్టి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ విజేతలు వీరే
హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–3, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై, మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లో ది ఆగాఖాన్ అకాడమీలో చదువుతున్న వెగా దర్శి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ బ్రాంచ్‌లో చదువుతున్న వి. సాయి అఖిల్ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ ద్వితీయ బహుమతి : హైదరాబాద్‌లోని వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్, బాచుపల్లిలో చదువుతున్న టి. సౌజన్య లక్ష్మి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి : హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అరిట్రో రే కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ తృతీయ బహుమతి : హైదరాబాద్‌లోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, బంజారాహిల్స్ బ్రాంచ్‌లో చదువుతున్న నిహారిక కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ తృతీయ బహుమతి : హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం బ్రాంచ్‌లో చదువుతున్న హరి వైష్ణవి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
ఎక్కడా తగ్గలేదు
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు గెలుచుకొని సగర్వంగా తిరిగి వెళుతుండటం పట్ల తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సంబరంగా ఉన్నాడు. చివరి టి20లో కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్, ఈ మ్యాచ్‌లో తమ వ్యూహాలన్నీ సఫలమయ్యాయని చెప్పాడు. ‘ఈ రెండు పరిమిత ఓవర్ల ట్రోఫీలను అందుకోవడం సంతోషంగా ఉంది. సిరీస్ మొత్తం మేం చాలా దూకుడుగా ఆడాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా బృందం వెనకడుగు వేయలేదు. దాని వల్లే ఇవాళ విజేతలుగా ఇక్కడ నిలబడ్డాం’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. తొలి ఆరు ఓవర్లలో కచ్చితత్వంతో వికెట్లపైకి మాత్రమే బంతులు వేయాలనేది తమ వ్యూహమని, దీనిని సమర్థంగా అమలు చేసి బౌలర్లు మ్యాచ్ గెలిపించారని అతను అన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే మేం మరో 15 పరుగులు తక్కువగా చేశాం. మాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే చివర్లో కాస్త జోరు తగ్గింది. అయితే ఈ అనుభవంతో మున్ముందు మరిన్ని విషయాలు నేర్చుకుంటాం’ అని రోహిత్ అభిప్రాయ పడ్డాడు. ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో గత రెండున్నర నెలలుగా అద్భుత ప్రదర్శన కనబర్చామన్న భువనేశ్వర్ కుమార్...ఈ పర్యటన తనకు మధురానుభూతిగా మిగిలిపోయిందని చెప్పాడు. -
జైట్లీ బడ్జెట్లో విన్నర్స్, లూజర్స్ వీరే!
న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పూర్తి స్థాయి బడ్జెట్ 2018ను నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు వరాల జల్లులు కురిపిస్తూ ఈ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఉద్యోగాలు, ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధికి కూడా జైట్లీ బడ్జెట్ పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో జైట్లీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో విన్నర్లు ఎవరు.. లూజర్లు ఎవరో తెలుసుకుందాం.. విన్నర్లు... వ్యవసాయదారులు : ఈ బడ్జెట్లో వ్యవసాయదారులే అతిపెద్ద విజేతలు. పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్లపై భారీ మొత్తంలో పెట్టుబడులు, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నగదు, సోలార్ పంపుల ద్వారా రైతులు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్‌ను రాష్ట్రాలు కొనుగోలు చేసేలా ఆదేశం వంటి వాటిని జైట్లీ ప్రవేశపెట్టారు. దీంతో వ్యవసాయ ఆధారిత కంపెనీలు శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, కేఎస్బీ పంప్స్ లిమిటెడ్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్, వాటర్‌బేస్ లిమిటెడ్, జేకే అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్, పీఎల్ ఇండస్ట్రీస్ లకు లబ్ది చేకూరనున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణదారులు... కేంద్రం కొత్తగా ప్రవేశపెడుతున్న నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ లాంటి కంపెనీలు ఎక్కువగా లబ్ది పొందనున్నాయి. ట్రాన్స్పోర్ట్ కంపెనీలు... రోడ్డు, రైల్వే మౌలిక సదుపాయాలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించనున్నట్టు జైట్లీ ప్రామిస్ చేశారు. ఈ వాగ్దానంతో నిర్మాణ, ఇంజనీరింగ్ సంస్థలకు, రైల్వే వాగన్ ప్రొడ్యూసర్లకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. కన్జ్యూమర్ కంపెనీలు... హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, మారికో లిమిటెడ్ వంటి కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల్లో ఇక రోజువారీ కూలీలకు ఉద్యోగం లభించనుంది. హీరో మోటార్‌కార్ప్ లిమిటెడ్, ఎం అండ్ ఎం లిమిటెడ్, లార్సెన్ అండ్ టుబ్రో లిమిటెడ్‌లకు లబ్ది చేకూరనుంది. జువెల్లర్స్, ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థలు కూడా జైట్లీ బడ్జెట్లో విన్నర్లుగా ఉన్నాయి. లూజర్లు.. ఆపిల్, శాంసంగ్ : మొబైల్ ఫోన్లపై బడ్జెట్లో కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచడంతో, దిగ్గజ కంపెనీలు ఆపిల్, శాంసంగ్‌లకు గట్టి షాక్ ఎదురైంది. ఆపిల్ ఇంక్‌కు, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తక్కువ రిటర్నులు పొందే అవకాశం కనిపిస్తోంది. ఫైనాన్స్ సెక్టార్ : ఈక్విటీ పెట్టుబడులపై ప్రభుత్వం ఎల్టీసీజీ పన్ను విధింపు నిర్ణయాన్ని ప్రకటించడంతో, ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలు, లైఫ్ ఇన్సూరర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉత్పత్తుల ప్రొవైడర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. రక్షణ రంగం : రక్షణ రంగానికి అంత పెద్ద మొత్తంలో బూస్టింగ్‌ను ఏమీ జైట్లీ ప్రకటించలేదు. దీంతో భారత్ ఫోర్స్ లిమిటెడ్ లాంటి రక్షణ రంగ కంపెనీలకు ప్రతికూలమే అని తెలుస్తోంది. కన్జూమర్స్ : ఆరోగ్యానికి సంబంధించిన ప్లాన్లు, లక్ష మంది పేద భారతీయులకు లబ్ది చేకూరనుంది. ఈ ప్లాన్ల కోసం విధించే హెల్త్, ఎడ్యుకేషన్ లెవీని 3 శాతం నుంచి 4 శాతం పెంచారు. ఈ లెవీ అన్ని ఉత్పత్తులకు, సర్వీసులకు అమలు చేయనున్నారు. -
2018 బడ్జెట్ : పెరిగేవి, తగ్గేవి
సాక్షి, ముంబై: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం కేంద్ర బడ్జెట్ 2018 ను ప్రవేశపెట్టారు. అంచనాలకనుగుణంగానే గ్రామీణ ఆర్థికవృద్ధి, వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇస్తూ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 15నుంచి 20శాతానికి పెంచగా, పేదప్రజలకు భారీ ఊరట కల్పించారు. అలాగే 10కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పించిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకం పెంపుతో ఇక స్మార్ట్ఫోన్ల దిగుమతులకు అసాధ్యమనే స్థితికి చేరామని ఐసీఏ అధ్యక్షుడు పంకజ్ మహాంద్రో వ్యాఖ్యానించారు. టెలివిజన్ లేదా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలంటే సామాన్య వినియోగదారుడి జేబుకు చిల్లు తప్పదు.. పార్లమెంటులో సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2018 లో నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ తర్వాత ఎక్సైజు, కస్టమ్స్ సుంకాల్లో మార్పులను ప్రకటించింది. ఈ బడ్జెట్ ప్రకారం మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకం 15 నుంచి 20 శాతానికి పెరిగింది. విద్యా సెస్ 3శాతం నుండి 4శాతం వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగేవి, తగ్గేవి ఒకసారి చూద్దాం. ధరలు పెరిగే ఉత్పత్తులు/ సేవల జాబితా * కార్లు, మోటార్ సైకిళ్ళు * మొబైల్ ఫోన్లు * వెండి * బంగారం * సన్ స్క్రీన్ * పాదరక్షలు * కూరగాయలు పండ్ల రసాలు * సన్ గ్లాసెస్ * సోయా ప్రోటీన్ కాని ఇతర ఆహార పదార్థాలు * పెర్ఫ్యూమ్స్ మరియు టాయిలెట్ వాటర్ * రంగు రత్నాలు * వజ్రాలు * ఇమిటేషన్ జ్యుయల్లరీ * స్మార్ట్ గడియారాలు / ధరించగలిగిన పరికరాలు *ఎల్సీడీ/ఎల్ఈడీ టీవీ ప్యానెల్లు * దంత ఉత్పత్తులు, * సిల్క్ ఫాబ్రిక్స్ * ఫర్నిచర్ * పరుపులు * లాంప్స్ * అన్ని రకాల గడియారాలు * ట్రైసైకిల్, స్కూటర్లు, పెడల్ కార్లు, చక్రాల బొమ్మలు, * వీడియో గేమ్ కన్సోల్లు * స్పోర్ట్స్ లేదా అవుట్డోర్ క్రీడలు, స్విమ్మింగ్ పూల్ సామగ్రి * సిగరెట్ , లైటర్లు, కొవ్వొత్తులు * కైట్స్ * వంట నూనెలు: ఆలివ్ నూనె, వేరుశనగ నూనె / ఇతర కూరగాయల నూనెలు ధర తగ్గే ఉత్పత్తులు / సేవల జాబితా * జీడిపప్పు * ముడి పదార్థాలు, కాంక్లియర్ ఇంప్లాంట్స్ తయారీలో ఉపయోగించే భాగాలు , ఉపకరణాలు * సోలార్ ప్యానెల్స్ / మాడ్యూల్స్ కోసం ఉపయోగించే సౌర స్వభావిత గాజు * కొన్ని క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్ ఉత్పతులు, -
సాక్షి పండగ సంబరాలు విజేతలు
-
మిస్ తెలుగు ప్రిన్సెస్ అపర్ణ
కాకినాడ కల్చరల్: స్థానిక జీ కన్వెన్షన్ హాలులో శనివారం జరిగిన మిస్ తెలుగు ప్రిన్సెస్ అందాల పోటీలలో విన్నర్‌గా కాకినాడకు చెందిన టీఎన్ఎస్ అపర్ణ ఎంపికయ్యారు. ఫస్ట్ రన్నర్‌గా వి.సంజన,(కాకినాడ) సెకండ్ రన్నర్‌గా ఎం.శ్రేష్ట (కాకినాడ) ఎంపికయ్యారు. అందమైన భామలు సంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ చేసి అలరించారు. వయ్యారాలు ఒలకపోస్తూ హంసనడకలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను అలరిం చింది. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా మిస్ వరల్డ్ అస్ట్రేలియా–2017 ఎస్మా వలోడర్ పాల్గొన్నారు. మహిళలు ఆత్మ«స్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. అందం ఒక్కటే ప్రధానం కాదని సేవాభా వం కూడా పెంపొందించుకోవాలని పోటీలలో పాల్గొన్న యువతులకు సూ చించారు. న్యాయ నిర్ణేతలుగా సుధాజైన్, వైఏ జయలక్ష్మి, ఎం.సరిత, మరియాలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్ సతీష్ శిఖా, సంస్థ సీఈఓ శిరిష, కోఆర్డినేటర్ నీరజ్, యాంకర్ రాఖీ, అర్జున్, శివ పాల్గొన్నారు. సేవే నిజమైన అందం ఈ పోటీలలో విన్నర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం అదిత్య కళాశాలలో బీబీఏ కోర్సు చేస్తున్నాను. మా తల్లిదండ్రులు (టీఎస్ఎస్ ప్రసాద్, గీత) ప్రోత్సాహంతో ఈ పోటీలలో పాల్గొన్నాను. మహిళలు ఆత్మస్థైర్యంతో ఉండాలి. మఖ్యంగా సేవాభావం కలిగిఉండాలి. ఉండాలి. అదే నిజమైన అందంగా భావిస్తాను. –టీఎన్ఎస్ అపర్ణ, తెలుగు ప్రిన్సెస్ విన్నర్ -
ఇళయరాజా సాక్షి కాంటెస్ట్ విజేతలు
కిక్కెక్కించే ఇళయరాజా పాటలు లైవ్‌లో వినేందుకు సిద్ధమైపోయారా? నవంబర్ 5న ఆయనే హైద్రాబాద్‌లో నేరుగా ఓ షో ఇచ్చేస్తున్నారు. అదీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్‌టైమ్. ఈ షోలో పాల్గొనేందుకు సాక్షి పాఠకులకు ఒక ప్రత్యేక కాంటెస్ట్ పెట్టి రెండు వందల మందికి ఒక్కొక్కరికి రెండు చొప్పున నాలుగు వందల పాసులు ఇవ్వనున్నట్లు తెలిపాం. ఇప్పుడు ఈ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇంకేం మరి! మీ పేరు ఉందో లేదో చూస్కోండి. రాజా కాలింగ్ ఆజా!! ఈ క్విజ్‌లో విజేతలుగా నిలిచిన వాళ్లందరికీ ఎసెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్ 3, 4, 5వ తేదీల్లో విజేతలు హైద్రాబాద్‌లోని సాక్షి ఆఫీసులో తమ ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూపించి పాసులు పొందవచ్చు. ఆదివారం రోజు మాత్రం మధ్యాహ్నం 2గంటల వరకే ఈ అవకాశం ఉంటుంది. నవంబర్ 5న హైద్రాబాద్‌లోని గచ్చిబొలి స్టేడియంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. NAME LOCATION KM SAVITRI HYDERABAD ALTHAF SHAIK HYDERABAD CH JAHNAVI HYDERABAD CHAVALA GOPALA KRISHNA HYDERABAD S.BHRAMARAMBA SHADNAGAR Y SRAVAN KUMAR HYDERABAD TONUGUR HANUMAN SINGH WARANGAL CH MOHAN KUMAR VISAKHAPATNAM K SRINIVAS HYDERABAD MAILA JYOTHY HYDERABAD KUSUMA NARESH WARANGAL P MARIYAMMA LENIN NAGAR B MYTHILI EAST GODAVARI B LALITHA DEVI VISAKHAPATNAM UNNAM VAJRAKIRAN GUNTUR KUSUMA KUMARI G KARIMNAGAR K PREETH KUMAR NRT U VARDINI WARANGAL S.SUDHEER KURNOOL A KIRAN KUMAR HYDERABAD D KRISHNA MOHAN KHAMMAM K.VENKATESHWARARAO GUDUR VVV.SATYANARAYANA RAJAHMUNDRY M SURESH BABU HYDERABAD M SAMBA SIVA REDDY KHAMMAM SARATH HYDERABAD INGURTHI LAXMI HYDERABAD R.KRISHNA KANTH HYDERABAD SK RABBANI SURYAPET GOGULA VENKATESHWARULU HYDERABAD B.ANIL KUMAR HYDERABAD Y VIJAY KUMAR REDDY HYDERABAD BHARANI TANAKU CH PRABHA HYDERABAD A TIRUPATHI HYDERABAD A KOTESHWARA RAO HYDERABAD C SIVA JYOTHI HYDERABAD G.RAJU KARIMNAGAR PALETI KIRAN KUMAR PRAKASAM DIST PJ SUNIL RAJAHMUNDRY D DINESH KUMAR HYDERABAD N ANIL KUMAR VISAKHAPATNAM B SRI VENKATA SAI MEDCHAL K.RAVINDRA HYDERABAD KALAVATHI ANANTAPUR A ANJANI NANDAN VIJAYAWADA IMTHIYAZ BASHA HYDERABAD MD MAHABOOB PASHA HYDERABAD GOTTE MUNISH HYDERABAD P VENKATESH HYDERABAD CHINTAKINDI GEETA HYDERABAD M MANJUNATH REDDY ANANTAPUR B DURGA PRADESH HYDERABAD G SREEMANN SURYAPET RAJA SATISH HYDERABAD GEETHA HYDERABAD CH RAJYA LAKSHMI HYDERABAD K SRINIVASA RAO VIJAYAWADA PURDHEESWARI HYDERABAD SASIKALA.P HYDERABAD DR B SRINIVASA RAO KAKINADA RAMESH V HYDERABAD V M NAIK GUNTUR M VINAY LATA HYDERABAD CH VIJAYA BHASKAR RAO WEST GODAVARI S MANASA NELLORE VINOD KG HYDERABAD K SATISH BABU KADAPA B SRINIVAS HYDERABAD K.PRASHANTH HYDERABAD CH PRASANNA KUMAR HYDERABAD M.PREM KUMAR NIRMAL BAS PRASAD WEST GODAWARI R.LAVAKUMAR REDDY HYDERABAD S PONNASWAMY NELLORE MANIMALA S MALLIREDDYPALLI AKKALA LAXMAN NARAYANPET M.ASWIN KUMAR SRIKAKULAM PRASHANTH HYDERABAD PATRA MANU KUMAR GUNTUR P SHABARI GIREESH PRAKASAM DIST VIDYA SAGAR HYDERABAD V VIJAYA SIMHA TIRUPATHI M ANNAREDDY HYDERABAD K KRISHNA MOHAN HYDERABAD SUNEETA PANGIDI HYDERABAD BHAVANI SIRISHA D HYDERABAD D NAGABHUSHANAM JAGITIAL P VENKATA DURGA HYDERABAD L.V.S VAMSHI MOHAN HYDERABAD N SOWJANYA HYDERABAD T SRIVARDHAN HYDERABAD S SREENIVASA RAO SURYAPET SHAIK ANWAR HYDERABAD SAI KRISHNA KOLLA HYDERABAD S.LALITHA SAI DURGA HYDERABAD G.PRAMOD VIJAYAWADA K.SUSHMITHA HYDERABAD MOHAN HYDERABAD RAMESH YELLANI HYDERABAD S UPPALAIAH WARANGAL D VISHNU VARDHAN REDDY HYDERABAD PULLURI USHA RANI KHAMMAM B SYAM KUMAR GUNTUR G SRINIVAS RAO HYDERABAD S.SURESH HYDERABAD SRINIVAS JETTI VIZAG G VAMSI KRISHNA ELURU T PHANEENDRA SAI HYDERABAD CH SRINIVASULU ANANTAPUR S RANGASWAMY KURNOOL M RAMAIAH HYDERABAD SHAH NAWAZ HYDERABAD V SRIKANTH HYDERABAD C PINKY DONAKONDA SHAIK AKBAR BASHA VIJAYAWADA YR RAMESH NANDYAL N RAMADEVI HYDERABAD KAKINADA LAKSHMI VIZIANAGARAM CH.VEENU HYDERABAD N S PRASAD HYDERABAD KVL KIREETI PRAKASAM DIST SHASHIKALA HYDERABAD MANSOOR ALI VIKARABAD SANTHOSH KASULA HYDERABAD P CHAND BASHA KADAPA R SWETHA MANCHERIAL K ANITHA HYDERABAD VENKATA KRISHNA HYDERABAD P SUMANASWINI WARANGAL SALI KEJEYA HYDERABAD A BHARATHI HYDERABAD KV MAHESWAR REDDY KADAPA KATTULA SATYA KUMARI EAST GODAVARI PRAVEEN JVL HYDERABAD D VENKATESWARA RAO BANGALORE B CHANDU NIZAMABAD P SURESH HYDERABAD M.RADHA HYDERABAD AJAY MADGULA TENALI T NAVEEN KUMAR HYDERABAD N SATYA PRASAD VIJAYAWADA C HARI KRISHNA HYDERABAD KN MOHAN HYDERABAD V SIRISHA REDDY HYDERABAD G RAMANA REDDY NIZAMABAD PRASHANTH B.SAI HYDERABAD A VINAYAK WARANGAL SINDHURI HYDERABAD B KARTHIK HYDERABAD VIJAY BHASKAR BHUPALPALLY CH PREMA CHAND PRAKASAM DIST I SUBHAS CHANDRA BOSE KURNOOL SHAIK SALEEM KAKINADA P KIRAN KUMAR KUKATPALLY J CHANDRA SEKHAR HYDERABAD P ASHOK REDDY HYDERABAD MD RASHEED PASHA SURYAPET RAMADEVI WANAPARTHY BV APPALA RAJU VISAKHAPATNAM M KRANTHI REDDY HYDERABAD SRAVANTHI HYDERABAD M.SWAMY KARIMNAGAR BL PRASAD HYDERABAD A SHANKAR VENKATAPUR GVJ SARMA KAKINADA E KISHAN WARANGAL A RAMESH GOUD NIZAMABAD A VIPANI HYDERABAD ARVIND GOUD M SHANKARPALLY B SAI PRASAD KARIMNAGAR P ANWAR BASHA PRAKASAM DIST RAMAKRISHNA ADURI HYDERABAD M RADHA HYDERABAD K SUNEETA HYDERABAD S K SHOWKATULLA KANDUKUR K JAGAN SRIKAKULUM D V SAI RAM TANGUTUR VARANASI MALLIKARJUNA SARMA KAKINADA RAJITA PATNAIK HYDERABAD V GANESH SAROOR NAGAR D RAJESH HYDERABAD K.KARUN HYDERABAD RAVINDER RYADA HYDERABAD G V SARMA NELLORE B JOHN PETER SAMALKOT DURGA PRASAD.B HYDERABAD P GOPICHAND HYDERABAD A SRINIVASA RAO JAGGAYYAPET M TIRUPATHI RAJANNA SIRICILLA PN RAGHAVENDRA REDDY ANANTAPUR BSV PHANI KUMAR HANMAKONDA C HARINI REDDY HYDERABAD H NAGARAJU KHAMMAM V RAVITEJA HYDERABAD SINGER MIMICRY SRINIVAS VIJAYAWADA VISWANADH HYDERABAD CH JAYARAJU NALGONDA B.CHINNA TIMAIAH MEDCHAL PALLE SRIKANTH HYDERABAD -
పంచుకున్నారు
-
ఆ పద, స్వరాలకు అవార్డులు
-యునెస్కో పోటీల్లో ‘రాధాకృష్ణ’ విద్యార్థినుల ప్రతిభ -నాట్య, సంగీత విభాగాల్లో బహుమతుల పంట రాజమహేంద్రవరం కల్చరల్ : జిల్లాలోని ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగిన దారోహర్ అంతర్జాతీయ సంగీత నృత్యపోటీలలో పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు గోరుగంతు బదరీ నారాయణ అవార్డులను ప్రదర్శించి, వివరాలను వెల్లడించారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాధాకృష్ణ విద్యార్థినులు అన్ని విభాగాలలో బహుమతులను గెలుచుకున్నారు. అద్భుతమైన కొరియోగ్రఫీని అందించినందుకు రాధాకృష్ణ అధ్యాపకురాలు గోరుగంతు ఉమాజయశ్రీ ‘కళాకుంజ్’ అవార్డును, అన్ని విభాగాలలో ప్రధాన పాత్ర పోషించిన కళాక్షేత్ర విద్యార్థిని లక్ష్మీదీపిక ‘కళాప్రభ’ అవార్డును గెలుచుకున్నారు. మరో విద్యార్థిని మాధురి లలితసంగీతంలో తృతీయ బహుమతిని, లక్ష్మీదీపిక, సునంద కూచిపూడి విభాగంలో ప్రథమ బహుమతిని సాధించారు. జూనియర్స్ విభాగంలో వినాయక కౌతం బృందం కళాకారులు ప్రథమ బహుమతిని, వీణ ఫ్యూషన్‌లో ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. గోదావరి హారతి, నవరాగమాలికా వర్ణాలకు ప్రథమ బహుమతి కూడా లభించింది. అన్ని విభాగాలలో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులు మొత్తం 15 బహుమతులను గెలుచుకుని, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటారని నారాయణ చెప్పారు. ఏ వేదికపై ప్రదర్శనలు ఇచ్చినా సనాతన భారతీయ వైభవాన్ని ప్రచారం చేయడమే తమ లక్ష్యమన్నారు. విలేకరుల సమావేశంలో కళాక్షేత్ర అధ్యాపకురాలు ఉమాజయశ్రీ, పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఖాన్, సభ్యులు పి.సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన నాటక పోటీలు
పాలకొల్లు టౌ న్ : సమాజంలోని రుగ్మతలను పోగొట్టి ప్రజలను చైతన్య వంతులను చేసే శక్తి నాటక రంగానికి ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం రాత్రి డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక రంగం కనుమరుగవకుండా భావితరాలకు అందించడానికి కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆ నాటి కళాకారుడు, ప్రముఖ సినీ, నాటక దర్శకుడు పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గరి నుంచి నేటి తరం గజల్ శ్రీనివాస్ వరకు ఎందరో ప్రముఖ కళాకారులను అందించి కళలకు పుట్టినిల్లుగా పాలకొల్లు భాసిల్లుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కళాపరిషత్‌లు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, విన్నకోట వేంకటేశ్వరరావు, డాక్టర్ కేఎస్పీఎ న్ వర్మ, మేడికొండ శ్రీనివాసచౌదరి, కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, రంగ స్థల వృత్తి కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, గుండా రామకృష్ణ, రాయప్రోలు భగవాన్, బుద్దాల వెంకట రామారావు, జీవీబీఎస్ మూర్తి, జి.రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు.. ఇక చాలు’ ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్రీ సాయి ఆర్ట్స్–కొలకలూరి వారి ‘చాలు..ఇక చాలు’ నాటిక మొదటి బహుమతిని గెలుచుకుంది. అభినందన ఆర్ట్స్–గుంటూరు వారి ‘కేవలం మనుషులం’, అరవింద ఆర్ట్స్–తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటికలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా ‘నాన్నా.. నువ్వో సున్నా’ నిలిచింది. దిష్టిబొమ్మలు నాటక రచయిత తాళాబత్తుల వేంకటేశ్వరరావు ఉత్తమ రచయితగా, నాన్నా నువ్వో సున్నా నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. చాలు–ఇక చాలులో నీలకంఠం పాత్రధారి కేవీ సుబ్బారాయుడు ఉత్తమ నటుడిగా, దిష్టిబొమ్మలు నాటికలో జానకమ్మ పాత్రధారిణి ఎం.లక్ష్మీ తులసి ఉత్తమ నటిగా, గోవు మాలచ్చిమిలో గోవిందయ్య పాత్రధారి జానా రామయ్య ఉత్తమ ప్రతినాయకుడిగా, సందడే..సందడి నాటికలో దొంగ పాత్రధారి కె.జోగారావు ఉత్తమ హాస్య నటుడిగా, కేవలం మనుషులం నాటికలో మీర్జా ఆలీఖా న్ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంపికయ్యారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రసాదరెడ్డి (హైదరాబాద్), కేకేఎల్ స్వామి (విజయనగరం), విన్నకోట వేంకటేశ్వరరావు (పాలకొల్లు) వ్యవహరించారు. -
తొలిసారిగా ఓ ముస్లిం నటుడికి ఆస్కార్
-
2017 ఆస్కార్ విజేతలు
లాస్ఏంజిల్స్: చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. డాల్బీ థియెటర్లో జరుగుతున్న ఈ 89వ ఆస్కార్ అవార్డుల వేడుకకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఉత్తమ సహాయనటుడు విభాగంలో పోటీపడిన దేవ్ పటేల్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో మూన్లైట్ చిత్రంలో నటించిన మహేర్షాలా అలీని అవార్డు వరించింది. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి ముస్లిం నటుడు మహేర్షాలా అలీనే కావడం విశేషం. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను విధించిన నేపథ్యంలో.. మహేర్షాలా ఆస్కార్ గెలవడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 2017 ఆస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం: మూన్లైట్ ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ) ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్) ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా లాండ్) ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ(మూన్లైట్) ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్(ఫెన్సెస్) ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైల్: సూసైడ్ స్క్వాడ్ చిత్రం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చిత్రం: ఫెంటాస్టిక్ బీస్ట్స్ ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్ ఇన్ అమెరికా ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అరైవల్ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ చిత్రం: హాక్సారిడ్జ్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: హాక్సారిడ్జ్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్మ్యాన్(ఇరాన్) బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: జూటోపియా బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: పైపర్ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ చిత్రం: లా లా ల్యాండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ద జంగిల్ బుక్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ద వైట్ హెల్మెట్స్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: సింగ్ బెస్ట్ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా లాండ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్( లా లా లాండ్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: మాంచెస్టర్ బై ద సీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: మూన్లైట్ మహేర్షాల అలీ -
జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే
రాజమహేంద్రవరం సిటీ : జిల్లా స్థాయి చదరంగం పోటీల ఓపెన్, అండర్–15, 10 విభాగాల్లో 12 మంది విజేతలుగా నిలిచారని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జి.వి.కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్ లో జరిగిన పోటీల్లో 140 మంది క్రీడాకారులు పోటీ పడ్డారన్నారు. ఓపెన్ విభాగంలో ఎం.చైతన్య, ఆర్.నరసింహ రవీంద్ర, ఎస్.సాయి గృహికేష్, ఎస్.బాలాజీరెడ్డి, అండర్ -15 బాలుర విభాగంలో సాయిసుహాస్, గౌతమ్, బాలికల విభాగంలో మాధుర్య, అమూల్య, అండర్ -10 బాలుర విభాగంలో జ్ఞానసాయి సంతోష్, మృత్యుంజయ, బాలికల విభాగంలో శ్రీవిద్యశాంభవి, వేదలత విజయం సాధించారని తెలిపారు. విజేతలకు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వై.డి.రామారావు బహుమతులు అందజేశారన్నారు. అండర్ –9 విభాగంలో పోటీలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం : జాతీయస్థాయి పురుషుల కబడ్డీ పోటీల విజేతగా విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు, మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు చాంపియన్లుగా నిలిచాయి. నరసాపురం రుస్తుంబాధలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌ల్లో పురుషుల విభాగంలో విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు 28–16 స్కోర్ తేడాతో బాబా హరిదాస్ హర్యానా జట్టుపై విజయం సాధించింది. మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు 27–25 పాయింట్ల తేడాతో గురుకుల్ హర్యానా(ఏ) జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. తొలుత మూడు, నాలుగు స్థానాల కోసం కూడా పోటీ తీవ్రంగా సాగింది. పురుషుల విభాగంలో మూడు, నాలుగు స్థానాల కోసం ఆంధ్రా, పోస్టల్ కర్నాటక మధ్య పోటీ జరిగింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 2 పాయింట్ల తేడాతో ఆంధ్రా జట్టు గెలిచి మూడోస్థానంలో నిలిచింది. పోస్టల్ కర్నాటక జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో హర్యానా(బి), దిండిగళ్ చెన్నై జట్లు నిలిచాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో హర్యానా(బి) జట్టు 8 ఫాయింట్ల తేడాతో దిండిగళ్ చెన్నై జట్టును ఓడించింది. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో పురుషుల విజేత జట్టుకు రూ.1 లక్ష నగదు, రెండోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.75 వేలు, మూడోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేలు, నాలుగోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.25 వేల నగదు, షీల్డులు అందించారు. మహిళా విభాగంలో గెలుపొందిన జట్లకు కూడా ఇదేరకంగా బహుమతులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వీర్లవెంకయ్య, జిల్లా కార్యదర్శి ఎం.రంగారావు పాల్గొన్నారు. -
బరువు మోసే రిలే పోటీల విజేత
అమృతలూరు : సంక్రాంతి సంబరాల్లో భాగంగా అమృతలూరులో గురువారం సాయంత్రం దావులూరి నాగేశ్వరరావు (చిన్న) స్మారక జిల్లాస్థాయి 50 కేజీల బరువు మోసే రిలే పోటీలను నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. నిర్ణీత దూరాన్ని నలుగురు మోసే రిలే పోటీలలో అమృతలూరుకు చెందిన నవభారత్ (సీహెచ్ వినీల్) యూత్ 1 నిమిషం, 36 సెకన్లలో మోసి ప్రథమస్థానం, చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి చెందిన కె. హనుమాన్ టీమ్ 1 నిమిషం, 46 సెకన్ల మోసి ద్వితీయస్థానం, అమృతలూరుకు చెందిన ప్రతాప్ యూత్ 1 నిమిషం, 53 సెకన్లలో మోసి తృతీయ స్థానం, అమృతలూరుకు చెందిన నవభారత్ (జి. విజయ్‌కుమార్) యూత్ 1 నిమిషం, 56 సెకన్లలో మోసి నాల్గో స్థానం సాధించాయి. ప్రథమ బహుమతి రూ. 3,200, ద్వితీయ బహుమతి రూ.2,400, తృతీయ బహుమతి రూ.1,600, నాల్గో బహుమతి రూ.1,000 విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు, సర్పంచ్ కూచిపూడి సతీష్‌కుమార్, గొట్టిపాటి భానుగంగాధర్, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా రాపర్ల మల్లికార్జునరావు, దేవరకొండ నాగరాజు వ్యవహరించారు. -
ముగిసిన షటిల్ టోర్నమెంట్ పోటీలు
కవిటం (పోడూరు) : స్థానిక శ్రీ చైతన్య షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్రి వెంకటరెడ్డి ప్లే గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నమెంట్ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకుడు గుంటూరి పెద్దిరాజు అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపించాలని సూచించారు. తణుకుకు చెందిన ప్రముఖ వైద్యుడు కర్రి శ్రీనివాసుల రెడ్డితో కలిసి విజేతలకు నగదు బహుమతులు అందించారు. మాజీ ఉప సర్పంచ్ కర్రి శ్రీనివాసరెడ్డి, కర్రి సత్యనారాయణరెడ్డి బ్రదర్స్, పడాల సత్యనారాయణరెడ్డి, చైతన్య షటిల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. మెడలిస్ట్ డబుల్స్ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్, అప్పారావు జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్ సింగిల్స్ విభాగంలో రాజమండ్రికి చెందిన అవినాష్ విజేతగా నిలిచాడు. నాన్ మెడలిస్ట్ డబుల్స్ విభాగంలో గుడివాడకు చెందిన రాము, ప్రతాప్ జోడి విజేతగా నిలిచారు. మెడలిస్ట్ సింగిల్స్ విభాగంలో వీరవాసరానికి చెందిన శ్రీరామ్ రన్నర్‌గా నిలిచాడు. బాలికల డబుల్స్ విభాగంలో కవిటంకు చెందిన సాయికుమారి, భావిక జోడి విజేతగా, ఆశా, మౌనిక జోడి రన్నర్‌గా నిలిచారు. ఉత్తమ ప్రతిభా పాటవ ఆటగాడిగా పాలకొల్లుకు చెందిన ఉదయకిరణ్ బహుమతి అందుకున్నాడు. -
ముగిసిన ఖేలో ఇండియా పోటీలు
కర్నూలు (టౌన్): ఖేలో ఇండియా జిల్లా స్థాయి పోటీలు మంగళవారం ముగిశాయి. ఆరురోజులుగా స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. చివరి రోజు అథ్లెటిక్స్, తైక్వాండో, వాలీబాల్, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్ క్రీడాంశాల్లో విద్యార్థినీ, విద్యార్థులు పోటీ పడ్డారు. వీటిలో గెలుపొందిన క్రీడాకారులకు డీఎస్డీఓ మలి్లకారు్జన మెడల్స్ అందజేశారు. విజేతల వివరాలు అథ్లెటిక్స్ అండర్–14 బాలుర వంద మీటర్ల పరుగులో ఆదోనికి చెందిన సాగర్, కోడుమూరుకు చెందిన అజిత్‌కుమార్, రాము, 400 మీటర్ల పరుగు పందెంలో ఎమ్మిగనూరుకు చెందిన ఫరూక్, ఆళ్లగడ్డకు చెందిన అబూసిద్ధిక్, పాణ్యంకు చెందిన వీరసాయి, లాంగ్‌జంప్‌లో మంత్రాలయానికి చెందిన నరసింహులు, కోడుమూరుకు చెందిన అజిత్‌కుమార్, మంత్రాలయానికి చెందిన టి.రాజు , షాట్‌ఫుట్ విభాగంలో ఆళ్లగడ్డకు చెందిన హేమంత్, పత్తికొండకు చెందిన రవి, ఎం.రాజు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అథ్లెటిక్స్ అండర్–14 బాలికల వంద మీటర్ల పరుగులో డోన్‌కు చెందిన రామలక్ష్మి, పాణ్యంకు చెందిన జి.ప్రియాంక, ఆళ్లగడ్డకు చెందిన డి.బెల్లి, 400 మీటర్ల పరుగులో పాణ్యంకు చెందిన మెహరూన్‌బీ, డోన్‌కు చెందిన డి.రేఖ, పత్తికొండకు చెందిన సి.మనీష, లాంగ్‌జంప్‌లో పత్తికొండకు చెందిన కె.రామలక్ష్మి, నందికొట్కూరుకు చెందిన టి.విజయరాణి, కోడుమూరుకు చెందిన బి.శిరీష, షాట్‌ఫుట్ విభాగంలో ఆలూరుకు చెందిన జి.సుజాత, బి.ఇందు, కోడుమూరుకు చెందిన కె.శోభ వరుసగా ఆయా విభాగాల్లో మొదటి మూడు స్థానాలు సాధించారు. -
రాష్ట్రస్థాయి ఫ్లోర్‌బాల్ విజేతలకు అభినందన
అమరావతి: రాష్ట్ర స్థాయి ప్లోర్‌బాల్ జట్టుకు ఎంపికయిన శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్ విద్యార్థులను మంగళవారం పాఠశాల కరస్పాండెంట్ మల్లెల శ్రీనాధచౌదరి, పాలక వర్గసభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఈసందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు అనూరాధ మాట్లాడుతూ ఈనెల 26వతేదీన కర్నూలు జరిగిన పోటీలలో అండర్ 17 ప్లోర్‌బాల్ బాలురవిభాగంలో చుండూరి వరప్రసాద్, బాలికల విభాగంలో చిలకా మనీషాలు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. జనవరి మొదటి వారంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే డిసెంబరు 3వతేదీన అమరావతి శ్రీరామకృష్ణహిందూ హైస్కూల్ గ్రౌండ్లో రాష్ట్రస్థాయి టెన్నిస్‌వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జట్టులో స్థానం సాధించిన విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా పాఠశాల పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేసి మరిన్ని విజయాలు సాదించాలన్నారు. సందర్భంగా పాలకవర్గ ఉపాధ్యక్షుడు పారేపల్లి వెంకటసత్యనారాయణరావు, ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ, ప్రసాద్, గాంధీలతోపాటుగా పలువురు ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు. -
పెద్దాపురం విద్యార్థులకు పతకాల పంట
జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన కరీం, మహేష్‌లు పెద్దాపురం : క్రీడారంగంలో పెద్దాపురం పట్టణాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి వన్నె తెచ్చిన పెద్దాపురం విద్యార్థులు బంగారుపతకాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ నెల 11న మీరట్‌లో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ షటిల్ బ్యాడ్మింట¯ŒS పోటీల్లో పట్టణానికి చెందిన తీగిరెడ్డి జ్ఞాన మహేష్, షేక్ కరీంముల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. సుమారు 20 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న బ్యాడ్మింట¯ŒS పోటీల్లో ప్రథమ స్థానం సాధించి పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన విద్యార్థులిద్దరికీ మన పెద్దాపురం ఫేస్బుక్ టీం ఘన స్వాగతం పలికి స్థానిక మెయి¯ŒSరోడ్డులో కేక్‌ను కట్ చేసి క్రీడాకారులను అభినందించారు. నాన్న ప్రోత్సాహంతోనే.. వృత్తి రీత్యా నాన్న మెకానిక్. ఆయన ప్రోత్సాహంతోనే నేనింతగా ఆడగలుతున్నాను. క్రీడల పట్ల ఉన్న మక్కువ, ప్రజల్లో వచ్చిన స్పందన మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఎప్పటికైనా క్రీడారంగం నుంచే ఉద్యోగం సాధించాలినే నా ఆకాంక్ష. – జ్ఞాన మహేష్ అందరి సహకారంతో.. అమ్మ, నాన్న, గురువు, స్నేహితుడు అందరి సహకారంతోనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అవరోధించాలనేది నా ఆకాంక్ష. ఇప్పటి వరకు తల్లిదండ్రులు, గురువర్యుల ప్రోత్సాహంతోనే ఈ విజయాన్ని సాధించాను. – కరీముల్లా -
ఉత్కంఠగా క్రికెట్ టోర్నమెంట్
గుంటూరు స్పోర్ట్స్: తాడికొండ మండలం లాం చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఏఎన్‌యూ అంతర కళాశాలల నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరింతంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో నర్సరావుపేటకు చెందిన పీఎస్సీ అండ్ కెఆర్ జట్టు 8 వికెట్ల తేడాతో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన హిందూ కాలేజ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పీఎస్సీ జట్టు 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి విజయం సాధించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో తాడికొండకు చెందిన బీఎస్‌ఎస్‌బీ జట్టు 3 పరుగుల తేడాతో నర్సరావుపేటకు చెందిన ఎంఏఎం ఫార్మసీ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బీఎస్‌ఎస్‌బీ జట్టు 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఫార్మసీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 7వికెట్లు 109 పరుగులు చేసి ఓటమి చెందింది. -
ఉత్కంఠభరితంగా ఫుట్‌బాల్ పోటీలు
తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్, కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫా డిస్ట్రిక్ట్ కప్ –2016 పోటీలు రెండోరోజు శుక్రవారం స్థానిక డాక్టర్ తేతలి సత్యనారాయణమూర్తి జెడ్పీ హైస్కూల్లో ఉత్కంఠభరితంగా సాగాయి. అండర్ –16 బాలికల విభాగంలో పల్లంట్ల జట్టు విజేతగా నిలిచింది. బెస్టు ఉమెన్ ఆఫ్ ది టోర్నమెంటుగా మేడపూడి పూజిత(జంగారెడ్డిగూడెం), బెస్టు గోల్ కీపర్‌గా పి.పద్మజ(పల్లంట్ల), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా జె.భూమిక (పల్లంట్ల) అవార్డులను, నగదును అందుకున్నారు. విజేతలకు టోర్నీ నిర్వాహకులు దాసరి భాస్కరరావు, ఉడిపి హోటల్ అధినేత అచ్చన్న బాబు బహుమతులు అందించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో పోటీతత్వం
ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు స్పోర్ట్స్: క్రీడలతో పోటీతత్వం అలవడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేత జట్లకు ట్రోఫీలు అందించారు. మహిళ విభాగంలో ఆచార్య నాగార్జున జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు స్పోర్ట్స్ క్లబ్ జట్టు ద్వితీయస్థానం, నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. -
అంతర్ కళాశాలల టెన్నిస్ విజేతలు వీరే
గుంటూరు స్పోర్ట్స్: హిందూ కళాశాల అధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల పురుషుల టెన్నిస్ పోటీలు జరిగాయి. పోటీల్లో ఆర్వీఆర్ అండ్ జేసీ, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల రన్నరప్ టైటిల్ సాధించగా, ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు తృతీయ స్థానం సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి హిందూ కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ అబ్జర్వర్ డి.చంద్రారెడ్డి, ఎ.వి.రాఘవయ్య, శివరామకృష్ణ, పి.రాజ్యలక్ష్మి, ఎం.విజయలక్ష్మి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ కళాశాలల టెన్నిస్ విజేతలు వీరే..
గుంటూరు స్పోర్ట్స్: హిందూ కళాశాల అధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల పురుషుల టెన్నిస్ పోటీలు జరిగాయి. పోటీల్లో ఆర్వీఆర్ అండ్ జేసీ, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల రన్నరప్ టైటిల్ సాధించగా, ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్లు తృతీయ స్థానం సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవానికి హిందూ కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ అబ్జర్వర్ డి.చంద్రారెడ్డి, ఎ.వి.రాఘవయ్య, శివరామకృష్ణ, పి.రాజ్యలక్ష్మి, ఎం.విజయలక్ష్మి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పారాలింపిక్స్ విజేతలకు పద్మ అవార్డులు!
న్యూఢిల్లీ: రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్ల పేర్లను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల కోసం ప్రతిపాదించనున్నారు. ‘పారాలింపిక్స్ విజేతలను మేం గౌరవించదలుచుకున్నాం. అందుకే పద్మ పురస్కారాల కోసం వారి పేర్లను హోం మంత్రిత్వ శాఖకు పంపించనున్నాం’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో తంగవేలు, దేవేంద్రలకు స్వర్ణాలు, దీపా మలిక్ రజతం, వరుణ్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. -
విజేతలకు బహుమతి ప్రదానం
రాజమహేంద్రవరం కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలో సుమారు 40 పాఠశాలల్లో నిర్వహించినపరిచయ్, ప్రవేశిక ధార్మికవిజ్ఞాన పరీక్షలలో విజేతలకు బుధవారం దానవాయిపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో బహుమతులను అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించినవారికి శ్రీవారి వెండిడాలరుతో పాటు వరుసగా రూ. 1,000, రూ. 750, రూ. 500 నగదుపురస్కారాలను అందజేశారు. ముఖ్య అతిథి, జిల్లా ధర్మప్రచార మండలి అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ బహుమతులు రానివారు నిరుత్సాహపడరాదు, విజేతలు విర్రవీగరాదని హితవు పలికారు. ఆధునికత పేరిట వెర్రి పోకడలు ప్రారంభమయ్యాయని, మన సంస్కృతి మీద దండయాత్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మపరిరక్షణకు టీటీడీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ధర్మప్రచార మండలి కో–ఆర్డినేటర్ ఎం.సత్యనారాయణ, ప్రోగ్రాం అసిస్టెంట్ ఓరుగంటి నరసింహయోగి, పురాణ పండితుడు వెంపరాల రామకృష్ణ ప్రసాద్, ధర్మప్రచార మండలి సభ్యుడు జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విజేతలు : పరిచయ్ పరీక్ష: బి. మనీషా (కొత్తలంక– ప్రథమ), ఎం. శ్రుతి (రాజమహేంద్రవరం– ద్వితీయ), జి. అమృత (కాట్రేనికోన– తృతీయ). ప్రవేశిక పరీక్ష : పి.పావని (బట్టెలంక, మలికిపురం మండలం– ప్రథమ), ఎన్‌ఎస్‌ఎల్‌వీ పావని (మురమళ్ల– ద్వితీయ), ఏఏవీ విజయలక్ష్మి (అంతర్వేది– తృతీయ) -
విజేతలకు బహుమతుల ప్రదానం
దేవరకొండ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేవరకొండ బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి షటిల్ టోర్నమెంట్ విజేతలకు మంగళవారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ బహుమతులు ప్రదానం చేశారు. టోర్నమెంట్లో 20 టీమ్‌లు పాల్గొనగా మొదటి బహుమతి కె. భాస్కర్, శేఖర్ టీమ్, రెండవ బహుమతి ఖాలిక్, ప్రకాష్ టీం గెలుపొందాయి. కార్యక్రమంలో దయానంద్, సురేశ్, శ్రీధర్‌గౌడ్, వెంకట్, వేణు, వినోద్, రామాచారి, మహేశ్, జగదీశ్, పరిపూర్ణా, అజహర్, శేఖర్, రవి, బాలాజీ, భాస్కర్, పూర్యా, వెంకట్ ఉన్నారు. -
విజేతలు
పెదగంట్యాడ: సందేశాలు, సందేహాలు యువతకు అందరూ ఇచ్చే టార్గెట్లు. ఒక టార్గెట్‌ను నిర్దేశించుకుని దానివైపే మిస్సైల్లా దూసుకుపోవాలని పెద్దలు ఇచ్చే సలహా. టార్గెట్ డాక్టర్, ఇంజినీర్ మాత్రమే కాదని ఆ రెండు దాటుకుని బయటికి వస్తే సమాజంలో ఎదగడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. అటువంటి విజయమార్గాలను ఎంచుకున్నారు వీరంతా... అబ్రకదబ్రలో దిట్ట బీఎస్‌రెడ్డి నగరానికి చెందిన ప్రముఖ మెజీషియన్ బిఎస్. రెడ్డి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. 25 సంవత్సరాలుగా మ్యాజిక్ షోస్ చేస్తూ ఇప్పటికి దేశ విదేశాల్లో మొత్తం 6500 ప్రదర్శనలు ఇచ్చారు. భ్రమ కల్పించడంలో ఆయన దిట్ట. సముద్ర తీరంలో ఎలాంటి ప్రాపర్టీస్ లేకుండా మనుషుల్ని గాలిలోకి లేపడంలో స్పెషలిస్ట్. అవార్డులు రివార్డులతో పాటు గౌరవ డాక్టరేట్‌ను పొందాడు. 2008లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఢిల్లీకి ఆహ్వానించారు. స్టీల్‌ప్లాంట్ గంగవరం పోర్టు తదితర కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామని ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారు.ప్రపంచస్థాయి స్టార్ మెజీషియన్ కావడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాడు. ‘యో వైజాగ్’ సష్టికర్త శిల్ప వైజాగ్‌లో అందరికీ తెలిసిన ఇంగ్లీష్ మ్యాగజైన్ యో వైజాగ్... గత ఆరేళ్లుగా ఈ మేగజైన్ నడిపిస్తున్న శిల్ప చాలా తక్కువ మందికి తెలుసు. మార్కెటింగ్ రంగంలో చాలా అనుభవం ఉన్న ఈ యంగ్ లేడీ కొత్తగా వైజాగ్‌లో ఏదైనా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. విదేశాల్లో ఉద్యోగం మానేసి వైజాగ్ వచ్చి తమ్ముడితో కలిసి యో వైజాగ్ ఇంగ్లీష్ మ్యాగజైన్‌ను మొదలు పెట్టింది. కవర్‌పేజీ కోసం స్టార్ల వెంటపడి మొత్తానికి అనుకున్నది సాధించారు. తనకు తెలిసిన మార్కెటింగ్ స్కిల్స్‌తో మ్యాగజైన్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. పలువురికి ఉపాధి కల్పించారు. ఈ మ్యాగజైన్లో పని చేసిన వాళ్లు పెద్ద ఇంగ్లీష్ పేపర్లకు రిపోర్టర్లుగా ఉద్యోగాలు సంపాదించారు. ఐటీ హబ్‌లో అరుణ్ సత్తా వరుణ్ బీటెక్ చదువుతూనే ఐటీ హబ్‌లో తన ప్రాజెక్ట్‌ను ఒకే చేయించుకుని డెస్క్ సంపాదించాడు. గవర్నమెంట్ నుంచి అన్లిమిటెడ్ ఇంటర్నెట్, కంప్యూటర్స్ ఇచ్చారు. తన దగ్గర కొంత మంది స్టూడెంట్స్ పని చేస్తున్నారు. నరేశ్ అనే యువకుడు మురళీనగర్‌లో జనరేషన్ యువ ఫౌండేషన్ ద్వారా చాలా మంది రోడ్ సైడ్ పిల్లల్ని చేరదీసి వారికి ప్రయివేటు స్కూల్స్‌లో చదువు చెప్పిస్తున్నాడు. దాదాపు 60 మంది పిల్లలు ఆయన సంరక్షణలో ఉన్నారు. ట్రాఫిక్‌లో అడుక్కునే పిల్లలను పూర్తిగా నిర్మూలించాలని సంకల్పించి దానిని సాధించారు. -
ముగిసిన స్నూకర్స్ పోటీలు
తెనాలి (మారీసుపేట) : కోగంటి శివప్రసాద్ మెమోరియల్ అమరావతి స్టేట్ స్నూకర్స్ టోర్నమెంట్ శనివారం రాత్రితో ముగిశాయి. కొత్తపేటలోని కనికచర్ల కల్యాణమండపంలో గురువారం నుంచి పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోటీలలో విజయవాడకు చెందిన వలీ, హరి, పరమేశ్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించినట్లు నిర్వాహకులు కోగంటి రోహిత్ తెలిపారు. వీరికి శనివారం రాత్రి మిర్చి హోటల్లో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీపీ కె.రాంబాబు, టీడీపీ నాయకులు వి.మురళి, కె.మురళి, కౌన్సిలర్లు తెనాలి సుధాకర్,పసుపులేటి త్రిమూర్తి, మాజీ కౌన్సిలర్ అత్తోట వందనం తదితరులు పాల్గొన్నారు. -
చెస్ విజేతలు మౌనిక, స్నేహిల్
గుంటూరు స్పోర్ట్స్ : జిల్లా చెస్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం స్థానిక చంద్రమౌళి నగర్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన అండర్–19 జిల్లా స్థాయి పోటీలలో బాలుర విభాగంలో కె.స్నేహిల్, బాలికల విభాగంలో బి.మౌనిక అక్షయ విజేతలుగా నిలిచారు. జిల్లా స్థాయి బాలబాలికల పోటీలలో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో కె.తనిష్క్ రెండవ, డి.హేమంత్ మూడవ, జి.హరిసూర్య భరద్వాజ్ నాల్గవ స్థానాలు సాధించారు. బాలికల విభాగంలో సి.హెచ్ వైష్ణవి రెండవ, సి.హెచ్.నీహారిక మూడవ, జి.రుత్విక నాల్గవ స్థానాలు సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా హాజరైన చెస్ అసోసియేషన్ కార్యదర్శి చల్లా రవీంద్రరాజు విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఈనెల 12 నుంచి 14 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
టెన్నిస్ విజేతలు శశాంక్, జ్ఞానిత
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా టెన్నిస్ సంఘం, ఎన్టీఆర్ స్డేడియం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–14 బాలబాలికల ఐటా టెన్నిస్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో చింతా శశాంక్ (విశాఖ) విజేతగా నిలువగా, బాలికల విభాగంలో ఎ.జ్ఞానిత (విశాఖ) విజేతలుగా నిలిచారు. బాలికల విభాగంలో లేళ్ల ఆశ్రిత (గుంటూరు), బాలుర విభాగంలో కిషన్ కుమార్ (చెన్నై) రన్నరప్ టైటిల్ సాధించారు. బాలుర డబుల్స్ విభాగంలో వరుణ్ కుమార్, కిషన్ కుమార్ జంట (చెన్నై) విజేతలుగా నిలిచారు. గిరిష్, అనంతమణి జంట (విశాఖ) రన్నరప్‌గా నిలిచారు. బాలికల డబుల్స్ విభాగంలో శరణ్య, సాత్విక జంట (విశాఖ) విజేతలుగా నిలిచారు. లేళ్ల ఆశ్రిత, ప్రవల్లిక జంట (గుంటూరు) రన్నరప్‌గా నిలిచారు. అనంతరం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ స్డేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు విజేతలకు ట్రోఫీలు అందించారు. -
విజేతలకు బహుమతుల ప్రదానం
వాడపల్లి(దామరచర్ల) : కృష్ణా పుష్కరాల ఆవశ్యకతపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఇటీవల దామరచర్ల మండలం వాడపల్లి జెడ్పీఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కె.శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పుష్కరాలపై అవగహన కల్పించేందుకు ‘సాక్షి’ పత్రిక చేస్తున్న కృషిని కొనియాడారు. పత్రికలో ఇప్పటికే విద్యార్థులకు ఉపయోగపడే అనేక విషయాలు ప్రచురితమవుతున్నాయన్నారు. పోటీల్లో దుర్గాభవాని ప్రథమ స్థానంలో నిలువగా దాసరి శిరీష్ ద్వితీయ, అనిత తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగల వికాస సమితి అధ్యక్షుడు గుడిపాటి కోటయ్య, సాక్షి విలేకరి బండి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు గురులక్ష్మి, నాగలత, సరోజ, రాంరెడ్డి, సునీత,రజబలి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి యోగా పతకాల పంట
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలోని రింగ్‌రోడ్డులోని శ్రీ పరమాత్మ జ్ఞాన మందిరంలో యోగా శిక్షణ పొందుతున్న పలువురు ఇటీవల జిల్లాస్థాయి పోటీల్లో బహుమతులు పొందారు. ఈనెల 20న విశాఖ బీచ్‌రోడ్డులో విజయసాయి యోగా చారిటబుల్ ట్రస్టు పదవ జిల్లాస్థాయి యోగా పోటీల్లో అనకాపల్లికి చెందిన పలువురు వివిధ కేటగిరీల్లో బహుమతులు సాధించారు. 25, 35 సంవత్సరాల విభాగంలో కాండ్రేగుల ఆదిలక్ష్మికి 4వస్థానం, 11, 14 సంవత్సరాల విభాగాల్లో కాండ్రేగుల స్పందనకు రెండోస్థానం, 11, 14 సంవత్సరాల బాలుర విభాగంలో బి.వరుణ్‌కు మూడోస్థానం లభించింది. 8, 11 సంవత్సరాల బాలికల విభాగంలో పి.సింధూజాకు మూడోస్థానం లభించింది. -
రాష్ట్రహ్యాండ్బాల్ ట్రోఫి కర్నూలుకే
కల్లూరు (రూరల్): జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి స»Œ జూనియర్స్ హ్యాండ్‌బాల్ పోటీల్లో బాలుర విభాగంలో కర్నూలు, బాలికల విభాగంలో కడప జట్లు విజేతలుగా నిలిచారు. ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ సౌజన్యంతో జరిగిన పోటీలకు సంబంధించి విజేతలుగా నిలిచిన వారికి శనివారం బీ క్యాంపు క్రీడా మైదానంలో బహుమతులు ప్రదానం చేశారు. నంద్యాల ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ డైరెక్టర్ కొండారెడ్డి, మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు అందజేసి అభినందించారు. విజేతల వివరాలు.. బాలుర విభాగంలో కర్నూలు విన్నర్స్, ప్రకాశం జట్టు రన్నర్స్, తూర్పు గోదావరి జట్టు తతీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో కడప విన్నర్స్, ప్రకాశం రన్నర్స్, శ్రీకాకుళం జట్టు తతీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్‌బాల్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి లెనిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజనేయులు, ఒలింపిక్ సంఘం అధ్యక్షులు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మిస్ పెర్ఫక్ట్ ఆంధ్రాగా నిషా
-
టెబుల్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు
విన్నర్లుగా నిలిచిన గౌతంకృష్ణ, శైలునూర్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజులుపాటు కొనసాగిన రాష్ట్రస్థాయి ప్రథమ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. బాలికల విభాగంలో విజయవాడకు చెందిన శైలు నూర్ బాషా 4–3 తేడాతో బీ నాగశ్రావణిపై విజయం సాధించింది. బాలుర విభాగంలో గుంటూరుకు చెందిన ఏ గౌతమ్‌కృష్ణ 4–2 తేడాతో ఏ. జగదీష్‌పై గెలుపొందాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎల్వీఆర్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విజేతలు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘ కార్యదర్శి ఎస్ఎం సుల్తాన్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడల నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియం అనువుగా ఉందన్నారు. జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘ అధ్యక్షుడు ఎన్వీ గురుదత్తు మాట్లాడుతూ టోర్నమెంట్‌కు 13 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ అకాడమీ వ్యవస్థాపకుడు చెరుకూరి సత్యనారాయణ, శాప్ ఓఎస్డీ ప్రత్తిపాటి రామకృష్ణ, సీనియర్ రిఫరీ ముక్కామల, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి టి. సంపత్ కుమార్, ఏపీ టేబుల్ టెన్నిస్ సంఘ జీవితకాల అధ్యక్షుడు చెంచురామయ్య, జిల్లా టెన్నిస్ సంఘ కార్యదర్శి కడియాల ప్రవీణ్‌కృష్ణ, టెన్నిస్ సంఘ సభ్యులు పీ రామచంద్ర రావు, రామసీత, కృష్ణపాణి, సురేంద్ర, డిప్యూటీ రిఫరీ పీ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి మ్యాథ్ బీ విజేతలు వీరే
సాక్షి మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి మ్యాథ్ బీ ఫలితాలు విడుదలయ్యాయి. కేటగిరీ–1లో ఒకటి, రెండో తరగతుల విద్యార్థులకు, కేటగిరీ–2లో మూడు, నాలుగు తరగతులు, కేటగిరీ–3లో ఐదు, ఆరు, ఏడు తరగతులు, కేటగిరీ–4లో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు పోటీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 300 పాఠశాలలకు చెందిన 5,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీలో తొలి, రెండో రౌండ్ రాతపూర్వకంగా, చివరి రౌండ్లో మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఒక్కో కేటగిరీలో ప్రథమ బహుమతి కింద స్వర్ణ పతకం, రూ.25 వేల నగదు; ద్వితీయ బహుమతి కింద రజత పతకం, రూ.15 వేలు, తృతీయ బహుమతి కింద కాంస్య పతకం, రూ.10 వేలు బహుమతిగా అందజేశారు. విజేతల వివరాలు.. -
బాజీరావు మస్తానీకి ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంట
-
విశాఖ సాక్షి సంబరాలులో విజేతలు
-
గెలిచినోళ్లకే కండువా, ఓడినోళ్లకు కాదు...!
అధికార పార్టీ గెలిచినోళ్లకే కండువా వేస్తుంది కాని ఓడినోళ్లకు కాదని ఒక నేతకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చిందట. హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తెగ హడావుడి చేసే ఈ నేత పార్టీని ఫిరాయించడం దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా జరగడం... సొంతపార్టీలోనే సదరు నేత కొనసాగాల్సి రావడంతో... అసలు కారణం ఏమై ఉంటుందా? అని ఆరా తీశారట అనుచరులు. అధికారపార్టీలోకి చేరేందుకు ఈ నేత రాజ్యసభ సీటు కావాలని లేదా హెచ్ఎండీఏ చైర్మన్‌గా నియమించాలని, హైదరాబాద్ మేయర్ పదవి లేదా ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కండిషన్లు పెట్టారట. ఈ చిట్టానంతా విన్న అధికారపార్టీ నేతలు నీకంత సీన్ లేదు, బేషరతుగా వస్తే రా లేకపోతే లేదు అని మొహమాటం లేకుండా చెప్పారట. పార్టీలో చేరిక కార్యక్రమానికి అగ్రనేత రారని, ఎవరైనా మంత్రి సమక్షంలోనే చేరాలని కూడా తమ వంతు కండిషన్లు చెప్పేశారట. అంతేకాకుండా నగరంలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిమితం కావాల్సి ఉంటుందంటూ తేల్చేశారట. దీనితో ఆ పార్టీలో చేరి అనామకుడిగా ఎందుకు మిగిలిపోవాలంటూ ఉన్నపార్టీలోనే కొనసాగాలని ఈ నేత డిసైడ్ అయ్యారట. అయితే సదరునేత ఉన్నపార్టీలోనే ఉంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శల్యసారధ్యం చేసి, గెలిచిన కొందరు కార్పొరేటర్లను తీసుకుని అధికారపార్టీలో ఎక్కడ చేరతాడోనన్న అనుమానం పార్టీనేతలను పెనుభూతంగా భయపెడుతోందట. ఈ నేతను వదిలించుకునేందుకు ఏమి చేయాలా అని కంటి మీద కునుకులేకుండా సొంతపార్టీనేతలు ఆలోచిస్తున్నారట... -
సీటీఎల్ చాంప్ పంజాబ్ మార్షల్స్
- ఫైనల్లో హైదరాబాద్ ఏసెస్‌కు నిరాశ సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్లో పంజాబ్ మార్షల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ 5-4, 5-4, 2-5, 5-4, 5-4 (22-21 గేమ్‌ల) తేడాతో హైదరాబాద్ ఏసెస్‌పై విజయం సాధించింది. ఈ ఏడాది పంజాబ్ అజేయంగా నిలువడం విశేషం. ముందుగా లెజెండ్స్ మ్యాచ్‌లో గ్రెగ్ రుసెద్‌స్కీ 5-4తో థామస్ జొహన్సన్ను ఓడించి పంజాబ్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో ఎలీనా స్వితోలినా 5-4తో మార్టినా హింగిస్‌ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఏసెస్ జోడి హింగిస్-కార్లోవిచ్ 5-2తో స్వితోలినా-బాగ్దాటిస్పై గెలిచి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించారు. అయితే పురుషుల డబుల్స్‌లో మార్షల్స్ ద్వయం బాగ్దాటిస్-సాకేత్ మైనేని 5-4తో కార్లోవిచ్-జీవన్ జంటను చిత్తు చేశారు. అనంతరం టోర్నీ చివరి మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో బాగ్దాటిస్ 5-4తో కార్లోవిచ్‌ను ఓడించి పంజాబ్‌కు విజయం ఖాయం చేశాడు. హింగిస్‌కు మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్, సాకేత్‌కు బెస్ట్ ఇండియన్ ప్లేయర్ అవార్డు దక్కాయి. విజేత పంజాబ్ జట్టుకు రూ. కోటి, రన్నరప్ హైదరాబాద్ ఏసెస్‌కు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది. -
బిహార్‌లో ఎవరెవరికి ఎన్ని సీట్లు..
పాట్నా: దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలుత వచ్చిన ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నా ఆ తర్వాత అనూహ్యంగా మహాకూటమి పుంజుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన పోరులో సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్‌ల మహా లౌకిక కూటమి 178 సీట్లను కైవసం చేసుకొని అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారిగా గెలుపొందిన సీట్లు.. పార్టీలు - గెలిచిన సీట్లు మహా కూటమి-178 జేడీయూ-71 ఆర్జేడీ-80 కాంగ్రెస్-27 ఎన్డీఏ-58 బీజేపీ-53 ఎల్ జేపీ-2 ఆర్ఎల్ఎస్పీ-2 హెచ్ఎంఎం-1 ఇతరులు-7 -
హ్యుందాయ్ ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు
హ్యుందాయ్ మోటార్ ఇండియా ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు అందజేసింది. వివరాల్లోకి వెళితే... సంస్థ తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్‌డ్రైవ్‌కు సంబంధించి ఒక లక్కీ డ్రా నిర్వహించింది. రీజినల్ మేనేజర్ డ్రా విజేతలను ప్రకటించారు. తల్వార్ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన ఏ రాజేష్ డ్రాలో మొదటి బహుమతి 32 అంగుళాల శామ్సంగ్ ఎల్ఈడీ టీవీని గెలుచుకున్నారు. లక్ష్మీ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన షేక్ అహ్మద్ శామ్సంగ్ 7 ట్యాబ్లెట్ బహుమతిగా పొందారు. అన్ని మోడళ్లకు సంబంధించి ఈ టెస్ట్ డ్రైవ్‌లో పాల్గొన్న దాదాపు 1707 మంది కస్టమర్లకు పవర్ బ్యాంక్స్ తదితర బహుమతులు గెలుపొందారు. -
పోరు ప్రశాంతం
- 4 సర్పంచ్...27 వార్డు స్థానాలకు ఎన్నికలు - 2 ఎంపీటీసీ స్థానాలకు కూడా.. - రెండు వార్డుల ఎన్నిక వాయిదా - సైనాల, డీసీ తండా పంచాయతీ ఎన్నికలు సైతం.. వరంగల్ అర్బన్ : జిల్లాలో 4 సర్పంచ్, 27 వార్డు స్థానాలకు శనివారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనంతరం విజేతలకు అధికారులు గెలుపుపత్రాలు అందజేశారు. జిల్లాలో మొత్తం 7 పంచాయతీలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చినా.. నెల్లికుదురు మండలం సైనాల, వర్ధన్నపేట మండలం డీసీ తండాకు నామినేషన్లు రాని కారణంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ములుగు మండలం పోట్లాపూర్ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదేవిధంగా 29 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. గీసుకొండ మండలంలోని రెండు వార్డులకు గుర్తుల కేటాయింపులో జరిగిన పొరపాట్ల వల్ల అక్కడ కూడా ఎన్నికలు ఈనెల 9కి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ప్రకటింది. తొలి ారిగా జిల్లాలో మూడు పంచాయతీలకు ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. విజేతలు వీరే... వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపల్లి సర్పంచ్‌గా ఆదెపు దయాకర్,స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నష్కల్ సర్పంచ్‌గా నంగునూరి రాధిక, చేర్యాల మండలం తాడూరు సర్పంచ్‌గా నర్రపద్మ, నర్సంపేట మండలం కమ్మపల్లి సర్పంచ్‌గా అజ్మీర విజయ ఎన్నికయ్యారు. వార్డుల విజేతలు గొడవటూరు పంచాయతీ(10వ వార్డు) బుర్రలక్ష్మి, బాన్జీపేట(9)చెట్ల బాబు, నిడిగొండ(6) మైలారపు స్వరూప, చౌటపల్లి(11)దామెర లచ్చమ్మ, విసునూరు(7)లకావత్ బిక్షం, తోరనాల(6)రచ్చ బాలలక్ష్మి,కొత్తూరు(10)గాదె కౌసల్య, వడ్డేకొత్తపల్లి(4)సాయిబాబు, పంతిని(7)శాన రాజమణి,ఒంటిమామిడిపల్లి(1)గాజు కొమురమల్లు,(2)మజ్జిగ శారద,(3)అప్సర భేగం,(4)ఎండీ.రఫీ,(6)మజ్జిగ రాములు,(7) అద్దెంకి సంధ్య,(8)ఏసీరెడ్డి ర జిత, (10)కె.రాజు, నైనాల(5)కొండపల్లి స్మిత, దాట్ల(7)బాషపంగు మహేందర్, పెరుమాండ్ల సంకీస(5)కిన్నెర బాబు, బుధరావుపేట(13)గుగులోత్ నీలమ్మ,తండా ధర్మారం(5)గుగులోత్ ధాని, సాదిరెడ్డిపల్లి(10) వాసం పావని, మాధవపురం(9)గుగులోత్ భద్రు, జంగాలపల్లి(3) సానబోయిన స్వాతి, బుద్దారం(4)గడ్డం మహేందర్, సుబ్బక్కపల్లి(2) సముద్రాల రాజయ్యఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. కేశిరెడ్డిపల్లి, ఊరట్టంలోఎంపీటీసీ.. బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నిక శనివారం ప్రశాంతంగా ముగిసింది. 76.7 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సదానందం, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రమాదేవి తెలిపారు. 1846 ఓట్లకు గాను, సాయంత్రం 5 గంటల వరకు 1417 ఓట్లు పోలైనాయన్నారు. ఈ నెల6న స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎస్ఎసై తాడ్వారుు మండలంలోని ఊరట్టం ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 76 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2315 ఓట్లకు 1770 ఓట్లు పోలయ్యూరు. -
మళ్లీ మనోళ్లే గెలిచారు
అమెరికా స్పెల్ బీ పోటీ విజేతలుగా భారతీయ అమెరికన్లు వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారతీయ అమెరికన్ విద్యార్థులు మరోసారి చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన తుది పోటీలో కాన్సాస్ రాష్ట్రానికి చెందిన వన్య శివశంకర్(13), మిస్సోరీ రాష్ట్రానికి చెందిన గోకుల్ వెంకటాచలం(14) సంయుక్త విజేతలుగా నిలిచారు. ఈ పోటీల చరిత్రలో వరుసగా రెండోసారి సంయుక్త విజేతలుగా నిలిచిన వారుగా రికార్డుకెక్కారు. ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య 8వ గ్రేడ్ చదువుతున్న వన్య, గోకుల్‌లు బంగారు ట్రోఫీని అందుకున్నారు. విజేతలకు రూ. 23.60 లక్షల చొప్పున నగదు లభించనుంది. వన్య శివశంకర్... 2009 స్పెల్ బీ పోటీ విజేత కావ్య సోదరి. మొత్తం 285 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. మూడో స్థానాన్ని సైతం కోల్ షేఫర్-రే అనే భారతీయ అమెరికన్ గెలుచుకోవడం గమనార్హం. -
సాక్షి మాక్ఎంసెట్ విజేతలకు బహుమతులు
-
బెస్ట్ మదర్ మా అమ్మే...
*మార్చి 8 మహిళ పురస్కారాలు-అమ్మ అమృతమూర్తి *తొలివిడత ఎంపిక పూర్తయింది! ... 24 మంది మధ్య పోటీ మొదలైంది! మహిళా దినోత్సవం సందర్భంగా ‘మార్చి 8 మహిళ’ పురస్కారాల కోసం అమ్మ (అమృతమూర్తి), అర్ధాంగి (జీవన సహచరి), యువతి (శక్తి స్వరూపిణి), మహిళారైతు (భూదేవి) అనే నాలుగు కేటగిరీలలో 8 అవార్డుల కోసం (ఒక్కో కేటగిరీలో ఇద్దరు విజేతలు చొప్పున) సాక్షి ‘ఫ్యామిలీ’ ఇచ్చిన ప్రకటనకు పాఠకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. అయితే, ‘యువతి’ కేటగిరీకి వచ్చిన ఎంట్రీలలో ఒక్కటి కూడా పోటీకి అర్హత సంపాదించలేక పోయింది! మిగిలిన మూడు కేటగిరీలలోనూ తొలి విడత వడపోతలో భాగంగా పేరు, ఊరి పేరు, ఫోన్ నెంబరు, ఫొటోలు లేని ఎంట్రీలను తొలగించాం. ‘అమ్మ’ కేటగిరీకి వచ్చిన ఎంట్రీలలో చాలామంది అసలు అమ్మ అంటేనే బెస్ట్ అంటూ అమ్మ మీద ప్రేమానురాగాలను చాటుకున్నారు. అమ్మ గురించి ఎక్కువ చెప్పినా, తక్కువ చెప్పినా, ఎలా చెప్పినా, అసలు చెప్పకపోయినా అమ్మ గొప్పదనం అమ్మదే. అయితే రాసిన విధానాన్ని బట్టి, రాసిన విషయంలోని స్పష్టతను బట్టి, ఇంకా పలు రకాల అంశాలను దృష్టిలో ఉంచుకుని ‘బెస్ట్ మదర్’ ఎంట్రీల వడపోత ప్రక్రియ కొనసాగించాం. అలాగే ‘అర్ధాంగి’ కేటగిరీకి వచ్చిన చాలా ఎంట్రీలలో భార్య అంటే భర్త కోసం జీవితాన్ని ధారపోయాలనే మూస ధోరణి కనిపించింది. వడపోతలో భాగంగా ఈ ధోరణిలో సాగిన ఎంట్రీలన్నిటినీ తొలగించాం. విడతలవారీ సాగిన ఈ వడపోత ప్రక్రియ అనంతరం పోటీకి యోగ్యత సంపాదించిన వందల ఎంట్రీలను వరుసగా పదిరోజులపాటు వడగట్టి కేటగిరీకి 8 చొప్పున 3 కేటగిరీల నుంచి 24 ఎంట్రీలను ఎంపిక చేశాం. ఎంపికైన ఈ 24 మంది గురించి ‘ఫ్యామిలీ’లో నేటి నుంచి వరుసగా 8 రోజుల పాటు రోజుకు ముగ్గురు చొప్పున ప్రచురిస్తున్నాం. అలా ప్రచురించిన వాటిలోంచి మళ్లీ న్యాయనిర్ణేతలు ఆరుగురిని (కేటగిరీకి ఇద్దరు చొప్పున) ఎంపిక చేసి మార్చి 7న (మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు) పురస్కారాల విజేతల్ని హైదరాబాద్‌లో సన్మానిస్తాం. ఆ విషయాన్ని విజేతలకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది. పోటీలో పాల్గొన్న పాఠకులందరికీ అభినందనలు. - ఎడిటర్, ‘సాక్షి’ ఫీచర్స్ అమ్మ అమృతమూర్తి-1 మాది కడప జిల్లా. మా అమ్మ పేరు ఆవుల లక్ష్మమ్మ. నేను చూసినవాళ్లలో బెస్ట్ మదర్ మా అమ్మే. అమ్మానాన్నకు పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు మా అమ్మకు పుట్టింటినుంచి, మెట్టింటి నుంచి సపోర్ట్ లేదు. కారణం మా పేదరికం. మా నాన్న వైపు వాళ్లు మా నాన్న కష్టాన్ని వాడుకున్నారు కాని ప్రతిఫలంగా అవమానాలు తప్ప ఆర్థిక సహాయం చేయలేదు. మా అమ్మ పుట్టింటి వైపువాళ్లకీ నాన్నంటే ఇష్టం లేదు. కాబట్టి ఏ సహాయమూ చేయలేదు. అమ్మానాన్నని విడదీయడానికి చాలా కష్టపడ్డారు. కాని మా అమ్మ మా నాన్న చెయ్యి వదలలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మేము కటిక పేదరికంలోనే మగ్గిపోయాము. మేము ముగ్గురం పిల్లం. పిల్లలు పెరిగే కొద్దీ మా నాన్న ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అయినా అమ్మానాన్న ఇద్దరూ బేల్దారీ పనికి వెళ్లి మాకు ఏ లోటు లేకుండా పెంచారు. నాన్నకి టీబీ వచ్చి మంచాన పడ్డారు. సరైన వైద్యానికి డబ్బుల్లేవు. మా అమ్మ కళ్ల ముందు పెరుగుతున్న పిల్లలు, మంచాన పడ్డ భర్త. ఆమె అదృష్టం ఏంటంటే అప్పటికే మా అక్కకు పెళ్లి చేసేసింది. అదీ అప్పులు తెచ్చి. మాతోపాటే అప్పులు కూడా పెరగసాగాయి. నాన్న అనారోగ్యం వల్ల అమ్మ ఒక్కత్తీ కూలికి వెళ్లి తెచ్చే డబ్బులు కుటుంబ పోషణకే తక్కువపడేవి. నాన్న వైద్యానికి సరిపోయేవి కావు. అయిన వాళ్లెవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మా అమ్మ ఆత్మాభిమానాన్ని చంపుకుని పిల్లల కోసం, భర్త కోసం ప్రాధేయపడ్డా ఛీ కొట్టారే కాని కనికరించలేదు. ఆ పరిస్థితుల్లోనూ మా అమ్మ తన ఆత్మస్ధైర్యాన్ని వదిలిపెట్టలేదు. భర్తని ఎలాగైనా బతికించుకోవాలనుకుంది. మళ్లీ అప్పులు తెచ్చి మా నాన్నకి ఆరోగ్యం బాగు చేసింది. నాన్నకు కొంచెం నయమయ్యాక నన్ను, మా అన్న బాధ్యతను మా నాన్నకు అప్పగించి తను అప్పులు తీర్చడానికి, మమ్మల్ని ప్రయోజకులను చేయడానికి పరాయిదేశం వెళ్లింది. కువైట్‌లో మా అమ్మ 8 సంవత్సరాలు ఉంది. ఇక్కడ అప్పులన్నీ తీర్చేశాము. కాని మా నాన్న నిర్లక్ష్యం వల్ల చేతిలో ఏమీ మిగుల్చుకోలేదు. రెండోసారి అమెరికా- ఇరాక్ మధ్య యుద్ధసమయంలో కువైట్‌లో చెలరేగిన అలజడుల వల్ల కట్టుబట్టలతో తిరిగి భారతదేశానికి వచ్చింది. మా అమ్మ రెక్కలకష్టంతో సంపాదించిన దానిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇదేంటని అడిగినందుకు మా నాన్న అమ్మని ఇష్టం ఉన్నట్టు కొట్టాడు. పని చేయడానికి శక్తి లేని మా నాన్నకి భార్యపై చేయిచేసుకోవడానికి బాగా శక్తి వచ్చింది. అయినా ఓర్పులో, సహనంలో మా అమ్మ సీతమ్మ వారి కంటే గొప్పది. కువైట్ నుంచి తిరిగివచ్చాక భర్తను, పిల్లలను పోషించడానికి తిరిగి కూలిపనులకు వెళ్లింది మా అమ్మ. ఆ డబ్బులతోనే మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని చదివించింది. తన జీవితాన్నే మా కోసం, మా నాన్న కోసం త్యాగం చేసిన గొప్ప స్త్రీ మా అమ్మ. మా అన్నను ఇంటర్ వరకు చదివించింది. కుటుంబ బాధ్యతలో మా అన్న కూడా పాలుపంచుకున్నాడు. నిరక్షరాస్యత వల్ల మా అమ్మ ఎంతో నష్టపోయింది. ఎంతో శ్రమపడింది. రెక్కల కష్టంతో ఇల్లు గడిపింది. ఒక స్త్రీగా ఎన్నో అవమానాలకు గురయ్యింది. ఇలాంటిజీవితం నా కూతురికి రాకూడదని నన్ను ఎం.ఏ వరకు చదివించింది. ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నాను. ఇంటిబాధ్యతను తీసుకుని, మా అమ్మను ఆ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోమన్నాను. జీవితం అంతా మా కోసం ధారపోసిన మా అమ్మను సంతోషంగా చూసుకోవాలి. మా అమ్మ కష్టపడకూడదు. మా ఇంటి దేవతగా చూసుకోవాలి. ఇదే నా ధ్యేయం. మహిళ దినోత్సవం నాడు మా అమ్మను ఆదర్శ మహిళగా అందరు తల్చుకుంటే చాలు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. - ఎ. సుహాసిని (లక్ష్మమ్మ కుమార్తె) -
పదాలతో చెడుగుడు.. పతకాలతో బుడతలు
సాక్షి, సిటీబ్యూరో: ఆంగ్ల పదాలతో చిన్నారులు చెడుగుడాడుకున్నారు. అడిగిందే తడవుగా ఇంగ్లిష్ వర్డ్స్ స్పెల్లింగులను గడగడా చెప్పి విద్యార్థులు ఔరా అనిపించారు. పిల్లల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ వినూత్నంగా నిర్వహిస్తున్న సాక్షి ఇండియా స్పెల్ బీ-2014 ఫైనల్స్ శనివారం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలతోపాటు నగదు బహుమతులు అందజేశారు. ఫైనల్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలు కూడా ఇచ్చారు. బంగారు పతాక విజేతలకు రూ. 25 వేలు, రజత పతకం గెలుపొందిన వారికి రూ.15 వేలు, కాంస్య పతకాలు పొందిన వారికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఇరు రాష్ట్రాల నుంచి మొత్తం 25 వేల మంది ఈ పోటీలకు నమోదు చేసుకోగా దాదాపు 160 మంది ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. శుక్రవారం నగరంలోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఫైనల్ పోటీలు జరిగాయి. నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో ఒక్కో కేటగిరి నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 24 మందిని పతకాలు వరించాయి. ముఖ్య అతిథులుగా హాజరైన సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి, భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డిలు విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. వీరితోపాటు భారతి సిమెంట్ మార్కెటింగ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎం.సి.మల్లారెడ్డి, అడ్వటైజింగ్ ఏజీఎం బి.చంద్రశేఖర్, పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి మేథో పోటీల్లో అమిత ఉత్సాహంగా పాలుపంచుకోవడం సంతోషకరమన్నారు. అందరూ పతకాలు పొందలేకపోయినా ఫైనల్స్ వరకూ రావడమే గొప్ప విజయంగా అభివర్ణించారు. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి విద్యార్థులను ఇంత దూరం తీసుకొచ్చి వారి ఆసక్తి, ప్రతిభను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల్లో మేధస్సు సంపత్తిని పెంపొందించే మరిన్ని పోటీలు నిర్వహించేందుకు సాక్షి సిద్ధంగా ఉందని రామచంద్రమూర్తి వెల్లడించారు. సాక్షి ఇండియా స్పెల్ బీ పోటీలు నిర్వహించడం వరుసగా ఇది మూడోసారి. వచ్చే ఏడాది జనవరిలో సాక్షి జీయో బీ-2015 పేరిట ప్రత్యేక పోటీలకు కూడా సాక్షి మీడియా శ్రీకారం చుట్టింది. -
ఇరు రాష్ట్రాలలో విజయం సాధించిన అభ్యర్థులు
హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఓట్ల లెక్కింపులో ఇదే విషయం స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో రెండవ స్థానంలో శివసేన, ఆ తర్వాత స్థానాలు వరుసగా కాంగ్రెస్, ఎన్సీపీ నిలిచేలా ఉన్నాయి. హర్యానాలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇక్కడ రెండవ స్థానంలో ఐఎన్ఎల్డీ, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉన్నాయి. ఇరు రాష్ట్రాలలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 55 శివసేన - 29 కాంగ్రెస్ - 25 ఎన్సీపీ - 21 ఇతరులు - 17 గెలుపొందినవారు: అజిత్ పవర్ (ఎన్సీపీ) వైభవ్ నాయక్ (శివసేన) దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్) ఓడిపోయినవారు: నారాయణ రాణె (కాంగ్రెస్) హర్యానాలోని మొత్తం 90 స్థానాలలో ఇప్పటివరకు ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు: బీజేపీ - 45 కాంగ్రెస్ - 14 ఐఎన్ఎల్డీ - 19 హెచ్జేసీ - 2 ఇతరులు - 6 విజయం సాధించినవారు: భూపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్) -
మన నోబెల్ విజేతలు
నోబెల్ బహుమతి అందుకున్న ఏడో భారతీయుడిగా కైలాస్ సత్యార్థి నిలిచారు. పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్తో పాటు సత్యార్థికి శాంతి నోబెల్ బహుమతిని ప్రకటించారు. సత్యార్థికి ముందు ఆరుగురు భారతీయులు ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు. వారి వివరాలు.. నోబెల్ పొందిన భారతీయులు: రవీంద్ర నాథ్ ఠాగూర్ -సాహిత్యం 1913 సీవీ రామన్-భౌతిక శాస్త్రం 1930 హర్గోవింద్ ఖురానా-వైద్యం 1968 మదర్ థెరిసా-శాంతి బహుమతి 1979 సుబ్రమణ్యం చంద్రశేఖర్- భౌతికశాస్త్రం 1983 అమర్థ్యసేన్-ఆర్థికశాస్త్రం 1998 కైలాస్ సత్యార్థి- శాంతి 2014 భారత సంతతికి చెందిన వారు, భారత్‌లో జన్మించి విదేశాలకు వెళ్లిన మరికొందరు ప్రముఖులు కూడా నోబెల్ బహుమతి అందుకున్నారు. -
ఏపిలో స్థానిక ఎన్నికల విజేతలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన, వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రోజు జరిగాయి. రెండు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలకు, జమ్మలమడుగు మునిసిపల్ చైర్మన్ స్థానానికి, పలు మండల అధ్యక్ష స్థానాలకు ఎన్నికలు జరిగాయి. విజేతల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. జిల్లా పరిషత్ ఎన్నికల విజేతలు * ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ - ఈదర హరిబాబు (వైఎస్ఆర్ సిపి మద్దతుతో) వైస్ చైర్మన్ - నూకసాని బాలాజీ (వైఎస్ఆర్ సిపి) * నెల్లూరు జిల్లా చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మునిసిపల్ ఎన్నిక విజేతలు * వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మునిసిపల్ చైర్పర్సన్ - తులసమ్మ(వైఎస్ఆర్ సిపి) మునిసిపల్ వైఎస్ చైర్మన్ - ముళ్ల జానీ(టిడిపి) మండలాధ్యక్ష ఎన్నికల్లో విజేతలు * పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలాధ్యక్ష పదవి - టిడిపి కో ఆప్షన్ మెంబర్ - అక్బర్ ఖాన్ (వైఎస్ఆర్ సిపి) * గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలాధ్యక్ష పదవి - టిడిపి * ప్రకాశం జిల్లా అద్దంకి మండలాధ్యక్షురాలు - గోరంట్ల పద్మావతి (వైఎస్ఆర్ సిపి) ఉపాధ్యక్షులు అరుణ -(వైఎస్ఆర్ సిపి) కో ఆప్షన్ మెంబర్: ఎస్కే మస్తాన్ వలీ(వైఎస్ఆర్ సిపి) * విజయనగరం జిల్లా మెంటాడ మండలాధ్యక్షుడు - సింహాచలం(వైఎస్ఆర్ సిపి) * చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలాధ్యక్షురాలు - పి.రేవతి (వైఎస్ఆర్ సిపి) ఉపాధ్యక్షులు - చెంగమ్మ (వైఎస్ఆర్ సిపి) * కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలాధ్యక్షురాలు - లింగవరపు రామకోటమ్మ (వైఎస్ఆర్ సిపి) కో ఆప్షన్ సభ్యుడు - సయ్యద్ బాబు (వైఎస్ఆర్ సిపి) * వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలాధ్యక్షురాలు - హేమలత (వైఎస్ఆర్ సిపి) * వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలాధ్యక్షురాలు - మల్లెల ఝాన్సీరాణి (వైఎస్ఆర్ సిపి) ఉపాధ్యక్షడు - మల్లెల రాజారామ్మోహన్‌రెడ్డి (వైఎస్ఆర్ సిపి) * విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలాధ్యక్షురాలు - వంతల జముల (వైఎస్ఆర్ సిపి) * విశాఖ జిల్లా చింతపల్లి మండలాధ్యక్షురాలు - కవడం మచ్చమ్మ (వైఎస్ఆర్ సిపి) * తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలాధ్యక్షురాలు - ఎ.సత్యవతి (వైఎస్ఆర్ సిపి) * కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలాధ్యక్షురాలు - సావిత్రి (వైఎస్ఆర్ సిపి) -
ఈడెన్ లో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జి
-
ఈడెన్ లో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జి
కోల్ కతా: ఐపీఎల్ 7 విజయోత్సవ వేడుకల్లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు ఈడెన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తాజా ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ సభ్యులకు స్టేడియంకు రావడానికి ముందే అక్కడకు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యే క్రమంలో పోలీసులు అభిమానులపై లాఠీఛార్జికి దిగారు. ఇందులో పలువురు అభిమానులకు తీవ్ర గాయాలైయ్యాయి. ఐపీఎల్ ఏడో అంచెలో చాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు మంగళవారమిక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు దాదాపు 30 వేలమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్లో నైట్ రైడర్స్ పంజాబ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవడమిది రెండో సారి. విజేతగా వస్తున్న నైట్ రైడర్స్ కోసం కోల్ కతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగీత, నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లను ఘనంగా సన్మాన ఏర్పాట్లు చేయడం కాస్తా వివాదాలకు దారి తీసింది. -
ఐపీఎల్-7 విజేతలకు ఘనస్వాగతం
కోల్ కతా: ఐపీఎల్ ఏడో అంచెలో చాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లకు మంగళవారమిక్కడి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు దాదాపు 30 వేలమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపెఎల్ ఫైనల్లో నైట్ రైడర్స్ పంజాబ్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా ఐపీఎల్ టైటిల్ గెలవడమిది రెండో సారి. విజేతగా వస్తున్న నైట్ రైడర్స్ కోసం కోల్ కతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సంగీత, నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. క్రికెటర్లను ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో కోల్ కతా జట్టు యజమాని, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, సహ యజమాని జూహీ చావ్లాతో పాటు బెంగాలీ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారు. -
ఒంటరులే.. విజేతలు!!
నేను సింగిల్.. అవుదాం మింగిల్ అనుకుంటూ పాటలు పాడేస్తున్నారా? కాసేపు ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఓసారి విశ్లేషించి చూసుకుంటే, ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తులో కూడా పెళ్లికెందుకు తొందర అని మీరు అనుకోక తప్పదు. కొత్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం పురుచ్చితలైవి జయలలిత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వీళ్లంతా ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్లే. మరో పోలిక ఏమిటంటే.. వీళ్లంతా ఒంటరులే. కొత్త ప్రధాని నరేంద్రమోడీకి పెళ్లయినా కూడా చాలాకాలంగా ఆయన బ్రహ్మచర్యాన్నే పాటిస్తున్న విషయం ఇప్పుడు బహిరంగ రహస్యం. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి, రోజుకు ఐదారు బహిరంగం సభల్లో పాల్గొని, ఎన్నికల వ్యూహాలు రూపొందించి.. ఒకరకంగా ఒంటిచేత్తో బీజేపీకి ఎవరితోనూ కూటమి కట్టాల్సిన అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ అందించారు. ఒడిషాలో బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఘోటక బ్రహ్మచారి. దేశమంతా నరేంద్రమోడీ గాలి వీస్తున్నా.. దానికి ఎదురొడ్డి నిలిచి గెలిచిన విజేత ఈయన. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగిన ఒడిషాలో నవీన్ సారథ్యంలోని బీజేడీ విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 115 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు గాను 20 స్థానాలు గెలుచుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా బ్రహ్మచారిణే. రాష్ట్రంలో తన ప్రాభవాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, ప్రతిపక్ష డీఎంకేకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకంగా 37 సీట్లు ఎగరేసుకుపోయారు. మిగిలిన రెండింటిలో కూడా ఒకచోట బీజేపీ, మరోచోట పీఎంకే గెలిచాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలు గెలుచుకున్నా.. ఈసారి ఆ పార్టీని జయయలిత అథఃపాతాళానికి తొక్కేశారు. శారదా చిట్‌ఫండ్ స్కాంతో ప్రతిష్ఠ మసకబారినా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు దాటినా, ప్రభుత్వంపైన.. సీఎం పైన వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా కూడా మమతా బెనర్జీ తన దమ్మేంటో చూపించారు. వామపక్షాల దుమ్ము దులిపేశారు. పశ్చిమబెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉంటే, వాటిలో 34 సీట్లను సొంతం చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో కేవలం 19 సీట్లే గెలుచుకున్నా, ఈసారి వామపక్షాల ఖాతాలోని మొత్తం 15 సీట్లనూ కొల్లగొట్టి తృణమూల్ బలాన్ని 34కు చేర్చారు. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న రెండు స్థానాలను మాత్రమే లెఫ్ట్‌ఫ్రంట్ గెలుచుకోగలిగింది. మమతా బెనర్జీ కూడా ఘోటక బ్రహ్మచారిణే అన్న విషయం కూడా తెలిసిందే. ఇలా.. ఈసారి ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన నలుగురూ ఒంటరి జీవితాలు గడుపుతున్నవాళ్లే. దీనిపై ఓ పరిశోధన కూడా జరిగింది. ఒంటరి జీవితం గడిపేవాళ్లకు ఎక్కువ సమయం ఉంటుందని, ఇంట్లో ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి సులభంగా పనులు చేసుకోగలరని అంటున్నారు. అలాగే ఇంట్లో ఎవరితో గొడవలు కూడా కావు కాబట్టి పని సులభంగా అవుతుందనీ చెబుతున్నారు. అందుకే.. సోలో బతుకే సో బెటరు!! -
జీవితపు ప్రతి మలుపూ...ఓ గెలుపు పిలుపు
అభాగినుల పాలిట అమ్మ జీవితంలో సుఖదుఃఖాలు సహజం. కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా ఎదిరించి, ముందుకు పోవడమే మనిషి చేయాల్సింది. అలా చేసినప్పుడే విజేతలుగా నిలుస్తాం. జీవితాన్ని గెలుస్తాం. కానీ, గెలుపంటే... కేవలం మనం గెలవడమే కాదు... మన తోటివారినీ గెలిపించడం! పడిపోతున్న సాటి మనిషికి చేయిచ్చి, నిలబెట్టడం! మన జీవనం మరెందరికో ప్రేరణ కలిగించడం! వ్యక్తిగత విషాదాన్ని కూడా వ్యవస్థకు స్ఫూర్తినిచ్చే మార్గానికి మళ్ళించుకున్నవాళ్ళే అసలైన విజేతలు... సమాజానికి స్ఫూర్తిదాతలు. అత్యాచార బాధితులకు అమ్మగా మారిన అనూరాధ, జీవిత విషాదాన్ని కడుపులో దాచుకొని తొమ్మిది పదులు దాటినా పరుగు ఆపని ఫౌజా సింగ్, క్యాన్సర్‌ను ఓడించి పర్వతారోహణతో తోటివారిని గెలిపిస్తున్న షాన్... వీరంతా మన మధ్యనే ఉన్న మామూలు మనుషులే అయినా జీవిత పోరాటంలోని ప్రతి మలుపునూ గెలుపు పిలుపుగా మార్చుకున్న ఆదర్శవంతులు. జీవితాన్ని గెలిచిన వీరి ప్రస్థానం అవిస్మరణీయ స్ఫూర్తి మంత్రం. నేపాల్ రాజధాని ఖాట్మండు. పోలీసు వ్యాన్ వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. లోపల ఏదో పనిలో ఉన్న అనూరాధా కొయిరాలా లేచి బయటికొచ్చింది. వ్యాన్‌లో నుంచి పోలీసులతో పాటు ఓ పద్నాలుగేళ్ల అమ్మాయి కూడా దిగింది. ఆమె ముఖం వాడిపోయి ఉంది. కళ్లు నీటి చలమల్లా ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు గీత. తండ్రి లేడు. అంధురాలైన తల్లికి ఆసరాగా ఉండటం కోసం, తమ ఇద్దరి కడుపులూ నిండడం కోసం కూలీ పని చేసేది. ఓ రోజు ఓ బంధువు గీతకు మంచి పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వేశ్యా గృహంలో అమ్మేశాడు. అప్పటికామె వయసు తొమ్మిదేళ్లు. ఆడుతూపాడుతూ గడవాల్సిన గీత బాల్యం... విటుల వికృత చేష్టలతో విషాదభరితమైంది. మూడేళ్లు నరకం చూసింది. ఓ రోజు పోలీసులు వేశ్యా గృహంపై దాడి చేసి, సోదాలు నిర్వహించినప్పుడు ఆమె దొరికింది. వాళ్లు ఆమెను అనూరాధ దగ్గరకు తీసుకెళ్లారు. గీతను లోపలకు తీసుకెళ్లింది అనూరాధ. అంతే... అంతవరకూ గుంభనంగా ఉన్న గీత వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించింది. ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది అనూరాధ. ‘నేనున్నాను’ అని భరోసా ఇస్తున్నట్టుగా వెన్ను నిమిరింది. ఆ ఆప్యాయతకు చలించిపోయింది గీత. అనూరాధలో అమ్మను చూసుకుంది. కానీ ఆమెకు తెలియదు... అప్పటికే తన లాంటి చాలామంది కూతుళ్లు అనూరాధకు ఉన్నారని! అది అభాగ్యులకు పుట్టిల్లు... మనిషికి కూడు, గూడు, గుడ్డ ముఖ్యావసరాలని అంటారు. కానీ ఆడపిల్లకు వీటితో పాటు మరో ముఖ్యావసరం ఉంది... ‘రక్షణ’. అమ్మాయిలకు ప్రమాదం ఎప్పుడూ పురుషుడి రూపంలో పొంచే ఉంటుంది అంటుంది అనూరాధ. భర్త, బంధువు, పక్కింటివాడు, వీధి చివర ఉండే పోకిరిగాడు, బడిలో పాఠాలు చెప్పే మాస్టారు, సహ విద్యార్థి, కిరాణా కొట్టువాడు, పాలవాడు... ఎవరి వల్ల ఎప్పుడు తమ మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందోనని భయపడుతూ బతకాల్సిన పరిస్థితి. ఇది అనూరాధకు నచ్చలేదు. అందుకే ఆడపిల్లల రక్షణే లక్ష్యంగా ఇరవయ్యేళ్లుగా తన జీవన ప్రస్థానాన్ని సాగిస్తోంది. 1993లో మైతీ నేపాల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది అనూరాధ. మైతీ అంటే పుట్టిల్లు అని అర్థం. కష్టం వస్తే ఆడపిల్లలు పుట్టింటికెళ్లి తల దాచుకుంటారు. అందుకే తన ఇంటిని పుట్టింటిని చేసిందామె. అమ్మలా కొండంత అండ అయింది. నాన్నలా ధైర్యాన్నిచ్చింది. అన్నలా కాపాడింది. దీనంతటి వెనుక... కదిలించే కథ ఉంది. అనూరాధ తల్లితండ్రులైన ప్రతాప్‌సింగ్, లక్ష్మి దంపతులు ఎదుటివారికి తోడ్పడటంలో ముందుండేవారు. వారి మంచితనాన్ని పుణికి పుచ్చుకుంది అనూరాధ. ఎవరు కష్టంలో ఉన్నా పరిగెత్తుకు వెళ్లేది. కానీ తన జీవితమే కష్టాలపాలవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. దినేష్ ప్రసాద్ కొయిరాలాతో పెళ్లి ఆమె జీవితాన్నే మార్చేసింది. భర్త క్రూరుడు. అష్టకష్టాలు పెట్టాడు. అనుమానించాడు. అవమానించాడు. ఎన్నో యేళ్లపాటు సహించింది. చివరికి ఓపిక నశించింది. హింసించడం ఎంత తప్పో, హింసకు తలవంచ డం కూడా అంతే తప్పన్న నిజాన్ని గ్రహించి, భర్త నుంచి విడిపోయింది. నాటితో హింస నుండి విముక్తి లభించింది. కానీ ఎందుకో మనశ్శాంతి లేదు. తానంటే చదువుకుంది. ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తోంది. ధైర్యంతో హింసను ఎదిరించింది. కానీ ఆ అవకాశం లేనివాళ్లంతా మౌనంగా భరిస్తున్నారు. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ‘మైతీ నేపాల్’ను స్థాపించింది. ఎక్కడ ఏ ఆడపిల్ల కష్టంలో ఉందని తెలిసినా అక్కడికి వెళ్లిపోతుంది. కాపాడి తీసుకొస్తుంది. గృహహింసకు గురవుతున్నవారినీ, అత్యాచార బాధితులనూ ఆదరించి అక్కున చేర్చుకుంటుంది. వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది. ఆసక్తి ఉంటే చదివిస్తుంది. లేదంటే చేతివృత్తులు నేర్పించి తమ కాళ్లమీద తాము నిలబడేలా చేస్తుంది. అలా ఇప్పటికి కొన్నివేల మంది జీవితాలను తీర్చిదిద్దింది. ఇప్పటికీ ఆమె గూటికి వందల మంది నిస్సహాయ వనితలు వస్తూనే ఉన్నారు. వాళ్లు ఎవరైనా ఆమె పిల్లలే. ఆమె ప్రేమకు అర్హులే. అందుకే వాళ్లంతా అనూరాధను అమ్మ అంటారు. ఆమె గుండెల్లో తల దాచుకుంటారు. ఆమె చూపే బాటలో సాగి బతుకులు బాగు చేసుకుంటారు. వాళ్లందరినీ చూస్తే ఒకటే అనిపిస్తుంది. అనూరాధ ఉన్నంతవరకూ ఏ ఆడపిల్లా ఒంటరిది కాదు. నిస్సహాయురాలూ కాదు, ఆమె కానివ్వదు! - సమీర నేలపూడి సేవానిరతికి గాను దాదాపు ముప్ఫై జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అనూరాధను వరించాయి. హాలీవుడ్ నటి డెమీ మూర్ అనూరాధ సేవకు ముగ్ధురాలై, ఆమెతో చేతులు కలిపింది. ‘మైతీ నేపాల్’కు తన వంతు సహాయాన్ని అందిస్తోంది. పలు దేశాల్లోని ప్రముఖ సంస్థలు విరాళాలివ్వడానికి ముందుకొచ్చాయి. అనూరాధ వల్ల నేపాల్‌లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు చాలావరకూ తగ్గిపోయాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించడం ఆమె సాధించిన గొప్ప విజయం! -
భయాలను భయపెట్టండి
మనసుల్లో దాగి ఉన్న అంతర్గత భయాలు మనుషులు ముందుకెళ్లకుండా అడ్డుపడతాయి. వీటిని వదిలించుకుంటే అనుకున్నది సాధించవచ్చు. భయాలను జయించాలంటే చేయాల్సింది.. ధైర్యంగా వాటికి ఎదురెళ్లడం. మనిషి ఎదురు తిరిగితే భయం తోకముడిచి వెనక్కి పారిపోవడం ఖాయం. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేని వ్యక్తులే జీవితంలో విజేతలుగా నిలుస్తారు. ఒక రుషి.. రెండు శునకాలు పూర్వం ఒక గొప్ప రుషి ఉండేవారు. ఆయన ఒకనాడు హిమాలయాల్లోని ప్రఖ్యాత ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఆలయ విశేషాలు తెలుసుకొనేందుకు అక్కడున్న ఒక స్థానికుడిని తన వెంట సహాయకుడిగా నియమించుకున్నారు. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద భీతి కలిగించే సన్నివేశం రుషి కంటపడింది. రెండు బలమైన శునకాలు ఆలయం గేటుకు గొలుసుతో కట్టేసి ఉన్నాయి. అవి వీరిని చూడగానే బిగ్గరగా మొరగడం ప్రారంభించాయి. వాటి రౌద్రరూపం చూస్తే ఎంతటివారికైనా గుండెలదిరిపోతాయి. రుషి మనసులోని భావాన్ని సహాయకుడు పసిగట్టాడు. ‘భయపడకండి గురుదేవా! ఆ శునకాలను గొలుసులతో బంధించారు. తెంచుకొనే అవకాశమే లేదు. అవి మనల్ని ఏమీ చేయలేవు’ అంటూ ధైర్యం చెప్పాడు. ఇద్దరూ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టారు. ప్రధాన ఆలయం వైపు నడక ప్రారంభించారు. గుడి గురించి సహాయకుడు చెబుతున్న విశేషాలు రుషి మనసులోకి చేరడం లేదు. ఆయన పదేపదే వెనక్కి తిరిగి శునకాల వైపు చూస్తున్నారు. వాటి అరుపులు ఆయన చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈసారి రుషి వెనక్కి తిరిగి చూడగానే.. ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. ఆయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. గొలుసులను తెంచుకున్న రెండు శునకాలు వీరి వైపు వేగంగా పరుగెత్తుకొస్తున్నాయి. వాటి నోటికి చిక్కితే బతుకుపై ఆశ వదులుకోవాల్సిందే. రుషి తక్షణమే అప్రమత్తమయ్యారు. మెరుపు వేగంతో పరుగందుకున్నారు.. శునకాల వైపు! అప్పుడేం జరిగిందో ఊహించండి. తమవైపు దూసుకొస్తున్న గురువు గారిని చూసి శునకాలు ఒక్కసారిగా బెదిరిపోయాయి. బుద్ధిగా వెనక్కి తిరిగి ద్వారం వద్దకు వెళ్లిపోయాయి. పారిపోతే.. జీవితాన్ని కోల్పోతాం! మనుషుల్లోని భయాలు కూడా ఆ శునకాల్లాంటివే. మనమంతా భయాలకు భయపడి, వాటికి దూరంగా పారిపోతుంటాం. అప్పుడు అవి మనల్ని ఏమీ చేయలేవని అనుకుంటున్నాం. కానీ, దానివల్ల జీవితంలో ఏం కోల్పోతున్నామో తెలుసుకోలేకపోతున్నాం. భయాలు ఎదురైనప్పుడు రుషిలాగే వాటికి ఎదురొడ్డి ముందుకెళ్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. భయాలను ఎదుర్కోండి, భయాలను భయపెట్టండి. ఎంతటి భయంకరమైన భయాలైనా మిమ్మల్ని ఏమీ చేయలేవని తెలుసుకుంటారు. ఎదిరించి గెలవలేమా? ఓడిపోతామనే భయంతో మనుషులు బతుకులీడుస్తుంటారు. ఓటమి భయం వెంటాడుతూ ఉంటుంది. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించలేకపోతుంటారు. భయానికి ఎందుకు భయపడాలి? దాన్ని ఎదిరించి గెలవలేమా?.. మీకు నీళ్లంటే భయమా? అయితే, ధైర్యంగా ఈత నేర్చుకోండి. స్విమ్మింగ్ క్లాసులో చేరండి. నలుగురిలో మాట్లాడాలంటే భయమా? దాన్ని అధిగమించండి. మాట్లాడేందుకు ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా నిర్భయంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తే నష్టం వస్తుందని భీతి చెందుతున్నారా? అయినా ప్రారంభించండి, ఏం జరుగుతుందో చూద్దాం! నష్టం వచ్చినా, లాభం వచ్చినా... ఒకటి మాత్రం తథ్యం. మీలో భయం కచ్చితంగా అంతమైపోతుంది. భయం అంటే నిరర్థక ఊహే! భయం అంటే.. తప్పుడు ఊహలను వాస్తవాలుగా భ్రమించడం. భయం అనేది కేవలం మనసులో జనించే ఒక నిరర్థకమైన ఊహేనని అర్థం చేసుకుంటే దాన్ని పూర్తిగా వదిలించుకోవచ్చు. మీలోని భయాన్ని మీ ముందున్న ఒక గోడగా భావించండి. మీ సంతోషాలు, విజయాలు గోడకు ఆవలి వైపున ఉన్నాయనుకోండి. అప్పుడేం చేస్తారు? గోడ నుంచి దూరంగా పారిపోతారా? విజయాన్ని అందుకోవాలంటే గోడను అధిగమించాల్సిందే. మీరు ధైర్యంగా అడుగు ముందుకేస్తే గోడ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. భయం కూడా అంతే.. దాని తీవ్రతను ఎక్కువగా ఊహించుకుంటే ఇంకా భయపెడుతుంది. భయంపై కపిల్‌దేవ్ జయం క్రికెట్ అభిమానులకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో 1990లో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక టెస్ట్ సిరీస్ గుర్తుండే ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్లకుగాను 653 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ 9 వికెట్లను కోల్పోయి 430 పరుగుల వద్ద ఆట కొనసాగిస్తోంది. కపిల్ దేవ్ మైదానంలోకి వచ్చారు. ఫాలోఆన్ తప్పాలంటే 24 పరుగులు చేయాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. భారత జట్టులో భయం, ఆందోళన పెరిగిపోతున్నాయి. విపరీతమైన ఒత్తిడిలోనూ కపిల్ దేవ్ నిబ్బరంగా ఆట కొనసాగించారు. వరుసగా నాలుగు సిక్సులు బాదారు. కావాల్సిన 24 పరుగులు సాధించారు. భయాలను ఎదుర్కోవడం అంటే అదే.. మీరు కూడా భయాలను దూరంగా తరిమేయండి. పరుగులు రావాలంటే భయాలను బ్యాటుతో బాది, స్టేడియం బయటకు పంపించాల్సిందే! -కెరీర్స్ 360 సౌజన్యంతో -
స్టార్ల సక్సెస్ మంత్ర
వాళ్లంతా విజేతలు. తమ కలలను నెరవేర్చుకొన్న వారు. అత్యున్నత లక్ష్యాలను సాధించిన వారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నవారు. ప్రత్యేకించి నేటి యువతకు అత్యంత ఇష్టులు. సక్సెస్‌కు ప్రతి రూపాల్లాంటి వారు. మరి వారు తమ అనుభవసారంతో సక్సెస్ గురించి, దాన్ని సాధించడం గురించి ఎలాంటి సలహాలు ఇచ్చారంటే... రిస్క్లేనిదే లైఫ్ లేదు! ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో చేసే రిస్క్. సర్దుకుపోయే మనస్తత్వంతో, సేఫ్‌సైడ్ ఉండాలనే తీరుతో జీవితంలో చాలా వాటిని కోల్పోతాం. రిస్క్ చేసినప్పుడే జీవితంలో మార్పు ఖాయం. - మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు నిజాయతీగా ఉండాలి మనకు మనం నిజాయితీగా ఉండటం విజయానికి సోపానం. శ్రమ విషయంలో, చేయాల్సిన పని విషయంలో లోపాలను గుర్తించగలిగితే, మనకు మనం సమాధానపడితే విజయానికి దారిలో ఉన్నట్టే.. - రఫెల్ నాదల్,టెన్నిస్ ఆటగాడు ఆత్మవిశ్వాసంతో... గుడ్లుకింగ్కు ప్రాధాన్యం ఇవ్వండి. అది మీకు హాయినిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తుంది. అలాంటి ఆత్మవిశ్వాసం ఉంటే ఇతర ఒత్తిళ్లన్నింటినీ మరిచి మీరు అనుకొన్నది సాధించగలరు... - మారియా షరపోవా , టెన్నిస్ ప్లేయర్ సుఖాలపై దృష్టిపెట్టొద్దు... లక్ష్యాన్ని సాధించాలి అని బలంగా నిర్ణయించుకొన్నాకా మరో ఆలోచన వద్దు. కలలను నిజం చేసుకోవడానికి పోరాడాలి. చాలా వాటిని త్యాగం చేయక తప్పవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి శ్రమిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలవు.. - లియోనల్ మెస్సీ, అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు. -
సాక్షి స్పెల్ బీ ఫైనల్స్ 2013 విజేతలు వీరే
-
సాక్షి ఇండియా స్పెల్‌బీ 2012 విజేతలతో చిట్‌చాట్