విజేతలకు బహుమతుల ప్రదానం
Published Tue, Aug 2 2016 11:27 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
వాడపల్లి(దామరచర్ల) : కృష్ణా పుష్కరాల ఆవశ్యకతపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఇటీవల దామరచర్ల మండలం వాడపల్లి జెడ్పీఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కె.శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పుష్కరాలపై అవగహన కల్పించేందుకు ‘సాక్షి’
పత్రిక చేస్తున్న కృషిని కొనియాడారు. పత్రికలో ఇప్పటికే విద్యార్థులకు ఉపయోగపడే అనేక విషయాలు ప్రచురితమవుతున్నాయన్నారు. పోటీల్లో దుర్గాభవాని ప్రథమ స్థానంలో నిలువగా దాసరి శిరీష్ ద్వితీయ, అనిత తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగల వికాస సమితి అధ్యక్షుడు గుడిపాటి కోటయ్య, సాక్షి విలేకరి బండి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు గురులక్ష్మి, నాగలత, సరోజ, రాంరెడ్డి, సునీత,రజబలి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement