prizes
-
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్‌లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్‌లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్‌ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్‌ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్‌లెట్‌లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
జాతీయ స్థాయి ఇంగ్లిష్ పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా విభా, లీప్ ఫార్వార్డ్ సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్రానికి రెండు బహుమతులు సాధించారు. గత నెల 14వ తేదీన విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులు ఈ నెల 12న ముంబైలో జరిగిన గ్రాండ్ ఫినాలే పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి బి.రేవంత్‌కుమార్ రెండో స్థానం, ఐదో తరగతి విద్యార్థి అనిల్‌కుమార్ బాణావత్ మూడో స్థానంలో నిలిచారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను అంచనా వేసేందుకు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ దేశంలోనే అతిపెద్ద పోటీ కార్యక్రమం. ఈ పోటీలో ఏపీ నుంచి ఐదుగురు విద్యార్థులు పాల్గొనగా, ఇద్దరు విద్యార్థులు రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి అభినందించారు. ఈఎల్పీ ద్వారా శిక్షణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు 2021లో ప్రభుత్వం ఇంగ్లిష్ లిటరసీ ప్రోగ్రామ్(ఈఎల్పి)ను ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆరీ్టతో విభా, లీప్ ఫార్వర్డ్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రొగ్రామ్ ద్వారా 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలను సులభంగా పలకడం, చదవడం నేర్పిస్తున్నారు. కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడంతో ప్రభుత్వం చేపట్టిన ఈఎల్పీ సత్ఫలితాలు ఇస్తోందని స్పష్టమవుతోంది. -
సునిశిత దృష్టితో గొప్ప కళాఖండాలు
సాక్షి, అమరావతి: ఫొటో జర్నలిస్టుల సునిశిత దృష్టి గొప్ప కళా ఖండాలను సృష్టిస్తుందని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు అన్నారు. మంగళవారం మీడియా అకాడమీ కార్యాలయంలో ‘ప్రపంచ ఫొటోగ్రఫీ–2023’ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్క ఫొటో వెయ్యి పదాలకు సమానమన్నారు. రాజకీయ, సామాజిక చైతన్యాన్ని ప్రేరేపించడంలో ఫొటో జర్నలిస్టులు తీసే ఫొటోలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విపత్తుల సమయంలో ఫొటో జర్నలిస్టుల సాహసోపేత సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు, మీడియా అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, ఫొటో ఇండియా అధినేత శ్రీనివాసరెడ్డి, ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు విజయ భాస్కరరావు, జనరల్ సెక్రటరీ రూబెన్ బేసాలియల్, ఇతర విజేతలు తమ వృత్తిలోని మరుపురాని, కీలక ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. -
అజియో ‘బిగ్బోల్డ్’ సేల్.. భారీ డిస్కౌంట్లతోపాటు బహుమతులు!
ముంబై: అజియో ‘బిగ్ బోల్డ్ సేల్’ (Ajio Big Bold Sale) పేరుతో ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్ 1 నుంచి మొదలు కానుంది. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, హోమ్, డెకార్, బ్యూటీ, జ్యువెలరీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై మంచి డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా ఉత్పత్తులపై 50 నుంచి 90 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. బిగ్బోల్డ్ సేల్‌లో అధిక కొనుగోళ్లు చేసిన కస్టమర్లకు ఐఫోన్ 14ప్రో, యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్, రూ.లక్ష విలువైన బంగారం, శామ్సంగ్ ఎస్23ను ఇస్తున్నట్టు పేర్కొంది. ముగ్గురు విజేతలు ఒక్కొక్కరు రూ.3 లక్షల విలువైన బంగారం గెలుచుకోవచ్చని ప్రకటించింది. -
ఏదో చిన్న బహుమతి వస్తుందనుకుంటే... ఏకంగా రూ. 7 కోట్లు....
యూఎస్‌లోని అన్నాడేల్కు చెందిన జోస్ ఫ్లోర్స్ వెలాస్క్వెజ్ సోడా డ్రింక్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడూ సేఫ్వేలో 'ట్వంటీ ఎక్స్ ది మనీ స్క్రాచ్ ఆఫ్ లాటరీ' టికెట్‌ని కొనుగోలు చేశాడు. కానీ అతను లాటరీ తగులుతుందన్నకోలేదు. అకస్మాత్తుగా ఒకరోజు వెలాస్క్వెజ్కి లాటరీ తగిలినట్లు వర్జీనియా లాటరీ అధికారులు చెప్పడంతో కలెక్ట్ చేసుకోవడానికి లాటరీ కార్యాలయాలనికి వెళ్లాడు. ఐతే అతను మాత్రం సుమారు రూ. 40 వేల ఖరీదు చేసే ఏ చిన్న బహుమతినో గెలుచుకుని ఉండొచ్చు అనుకున్నాడు. కానీ కార్యాలయానికి వెళ్లినవెంటను వారు దాదాపు రూ. 7 కోట్లు ఫ్రైజ్‌మనీ సొంతం చేసుకున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా వెలాస్క్వెజ్ షాక్‌కి గురయ్యాడు. వర్జీనియా లాటరీ అధికారులు లాటరీ టికెట్‌ని విక్రయించిన సూపర్ మార్కెట్ స్టోర్‌కి కూడా దాదాపు రూ. 7 లక్షల ఫ్రైజ్ మనీని అందజేసింది. అతను ఆ డబ్బును తన కుటుంబం కోసం, వ్యాపారం కోసం వినయోగించనున్నట్లు చెప్పాడు. చాలావరకు అమెరికన్లు ఇలాంటి లాటరీ టికెట్లను సూపర్ మార్కెట్లలోనూ, గ్యాస్స్టేషన్లలోనూ కొనుగోలు చేస్తుంటారు. గతంలో కూడా ఇలానే చాలామంది కనివినీ ఎరుగని రీతిలో ఊహించనంత పెద్ద మొత్తంలో డబ్బును సొంతం చేసుకున్నారు. (చదవండి: బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....) -
Yoga Family: టీవీ, పుస్తకాల్లో చూసి ఆసనాలు, జాతీయ స్థాయిలో సత్తా!
సాక్షి, నవాబుపేట(మహబూబ్‌నగర్): గురువు లేకున్నా.. కేవలం టీవీలో చూడటం, పుస్తకాల్లో చదవుతూ యోగా ఆసనాలు వంట పట్టించుకున్నాడు మరికల్‌కు చెందిన పురుష్తోత్తం. ఎలాంటి ఆసనాలైన సులువుగా చేయగల సమర్థుడు. ఏకంగా గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. యోగా ఆసనాల్లో ఆయనది ప్రత్యేక రికార్డు. మూడు సార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాగా.. ఎనిమిది సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించాడు. యోగా కుటుంబం.. నవాబుపేట మండలంలోని మరికల్కి చెందిన పురుషోత్తం గురువు లేకుండానే యోగాలో అగ్రస్థాయికి ఎదిగాడు. తనతో పాటు భార్య నిర్మల, కూతురు ఝాన్సిరాణి, కుమారుడు చరణ్‌లకు సైతం యోగాలో తానే శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాడు. దీంతో ఆయన కుటంబమే యోగా కుటుంబంగా మారింది. ఇప్పటికే ఆయన కూతురు, కుమారుడు పాఠశాల, కళాశాల సారథ్యంలో జిల్లా స్థాయి పథకాలు సాధించారు. భార్య మరికల్లో మహిళలకు.. పురుషోత్తం యువకులకు శిక్షణ ఇస్తున్నారు. సాధించిన పథకాలు.. ► 2014లో యోగా ఫెడరేషన్ ఆప్ ఇండియా ద్వారా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాçష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించి బంగారు పథకం. ► 2015లో నిజామాబాద్‌లో రాష్ట్ర స్థాయి ద్వితీయ పథకం పొందాడు. 2016లో మరోసారి రాష్ట్ర స్థాయి బంగారు పతకం పొందాడు. ► 2016లో కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరోసారి 5వ స్థానంలో నిలిచాడు. ► 2016లో దక్షిణ భారత దేశ జాతీయ స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించాడు. ► 2017– 2018 సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని నాల్గవ స్థానం సాధించాడు. చదవండి: International Yoga Day 2021: ధ్యానం... ఒక యోగం -
రాష్ట్ర క్రీడాకారులకు పురస్కారాలు
సాక్షి, అమరావతి: ఈనెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా... 2014 నుంచి జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులను నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. క్రీడా రంగానికి కొత్త శోభను తెస్తామని, ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘క్రీడా రంగానికి కొత్త శోభను తీసుకువస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నెల 29న క్రీడాదినోత్సవం సందర్భంగా 2014 నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తాం. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం’ అని ముఖ్యమంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు. -
అంగ‘రంగ’ వైభవమే..
రాజమహేంద్రవరం కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టి.వి.నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి రంగస్థల పురస్కారాలకు శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రం ముస్తాబైంది. ఈ పురస్కారాలతో పాటు 20వ నంది నాటక బహుమతుల ప్రదానోత్సవం కూడా ఇదే వేదికపై జరగనుంది. నేపథ్యం ఇదీ.. నవయుగ వైతాళికుడు, యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం జయంతి రంగస్థల దినోత్సవంగా ప్రకటించాలని మాజీ శాసన సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. వైఎస్ అకాలమరణంతో కొంత స్తబ్ధత ఏర్పడింది. అవార్డుల వివరాలివీ.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో విజయనగరం, గుంటూరు, కర్నూలు పట్టణాల్లో జరిగిన నందీ నాటకోత్సవాల్లో విజేతలకు ముఖ్య అతిథుల చేతులమీదుగా నంది నాటక బహుమతులను అందిస్తారు. ప్రతి జిల్లానుంచి ఎంపిక చేసిన ఐదుగురు కళాకారులకు కందుకూరి విశిష్ట పురస్కారాలను, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ముగ్గురికి కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. కందుకూరి విశిష్ట పురస్కారాలకు ఎంపికైన వారికి రూ.10,000/ నగదు, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికైన వారికి ఒకొక్కరికి రూ.లక్ష నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ప్రముఖ రంగస్థలనటుడు గుమ్మడి గోపాలకృష్ణకు నందమూరి తారక రామారావు పురస్కారం–2016ను అందజేస్తారు. ఈ పురస్కారం కింద అవార్డు గ్రహీతకు రూ.1.50 లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సత్కరిస్తారు. -
ఓవరాల్ చాంప్ ముసునూరు
ముసునూరు : నాలుగు రోజులుగా రసవత్తరంగా సాగిన ఎనిమిది జిల్లాల స్థాయి గురుకుల బాలికల క్రీడా పోటీల్లో కృష్ణాజిల్లా ముసునూరు ఓవరల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ముసునూరు, గుంటూరు జిల్లా కావూరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా, చివరికి ముసునూరు జట్టు విజేతగా నిలిచింది. శనివారం ఉదయం జరిగిన 800 మీటర్ల రిలే పోటీల సైతం ముసునూరు విజయం సాధించింది. పోటీగా నిలిచిన కావూరు రెండోస్థానాన్ని సరిపెట్టుకుంది. కబడ్డీ పోటీ కూడా ఉత్కంఠ మధ్య జరిగాయి. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సురేష్‌బాబు అధ్యక్షతన బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు గ్రహీత మూల్పురి లక్ష్మణస్వామి విజేతలకు బహుమతులతో పాటు నోట్ పుస్తకాలను అందజేశారు. నూజివీడుకు చెందిన వస్త్ర వ్యాపారి మిరియాల కృష్ణకిషోర్ దంపతులు విజేతలకు నూతన వస్త్రాలతోపాటు బాలికలందరికీ పౌచ్‌లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్, పిఈటీ బృందాన్ని సన్మానించారు. విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొర్లకుంట సొసైటీ అధ్యక్షుడు మూల్పురి నాగమల్లేశ్వరరావు, ప్రాంతీయ ఉపకార్యదర్శి కె.భారతీదేవి, పలు గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బృందగానంలో చిన్నారుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: భారత వికాస్ పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి బృందగాన పోటీల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు మున్నంగి హైస్కూల్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎన్జీవో కాలనీలోని పాఠశాలలో శనివారం విద్యార్థులకు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జానపద గేయ విభాగంలో ఎం.లక్ష్మీ హర్షిక, వై.హేమలత, డి.గౌరీ, ఎస్.జ్ఞానేశ్వరి, జి.సింధూరిరెడ్డి ద్వితీయ బహుమతి సాధించారని వివరించారు. ప్రిన్సిపాల్ సయ్యద్ మొహమ్మద్ గౌస్, ఇన్చార్జ్ జి.వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. -
క్రీడలతో పోటీతత్వం
ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు స్పోర్ట్స్: క్రీడలతో పోటీతత్వం అలవడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేత జట్లకు ట్రోఫీలు అందించారు. మహిళ విభాగంలో ఆచార్య నాగార్జున జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు స్పోర్ట్స్ క్లబ్ జట్టు ద్వితీయస్థానం, నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. -
‘తైక్వాండో’ ధీరులకు బహుమతులు
రేపల్లె: పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన అండర్–14, అండర్–17 విభాగాలలో నిర్వహించిన రాష్ట్ర తైక్వాండో ట్రైల్స్, జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బుధవారం క్రీడాప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కే.జగన్మోహనరావు, పీఈటీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–17 జూనియర్ బాలుర విభాగంలో నరసరావుపేటకు చెందిన ఎం.వి.ఎన్.మణికంఠ, పి.చైతన్యకుమార్, గుంటూరుకు చెందిన వి.వి.సాయిరామ్‌కుమార్, డి.పార్థుశివసాయికుమార్, కొల్లూరుకు చెందిన ఎన్.పవన్‌కుమార్, రేపల్లెకు చెందిన కె.క్రాంతివర్మ, పి.రాజదేవ్కుమార్, జి.హరి, కె.నాగవంశీ, బాలికల విభాగంలో రేపల్లెకు చెందిన చైతన్య, సాయిశర్వాణీ, గుంటూరుకు చెందిన జె.ఉమామహేశ్వరి, అండర్–14 విభాగంలో గుంటూరుకు చెందిన వి.హర్షవర్థనరెడ్డి, జె.దేశ్‌ముఖ్, మహేష్, తెనాలికి చెందిన దేవకీనందన్, కొల్లూరుకు చెందిన ధీరజ్ నాగసాయికుమార్, నరసరావుపేటకు చెందిన మోహన్‌గోపాల్, బాలికల విభాగంలో గుంటూరుకు చెందిన వై.జ్ఞానశివాని, కె.యశశ్విని, టి.లక్ష్మీలావణ్య, తెనాలికి చెందిన టి.లావణ్య, కొల్లూరుకు చెందిన ఆర్పీ మమత, నరసరావుపేటకు చెందిన డి.భానుసాయిలక్ష్మి, రేపల్లెకు చెందిన వి.లిఖితా మనోజ్ఞ విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని పలువురు అభినందించారు. -
విజేతలకు బహుమతుల ప్రదానం
దేవరకొండ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేవరకొండ బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి షటిల్ టోర్నమెంట్ విజేతలకు మంగళవారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ బహుమతులు ప్రదానం చేశారు. టోర్నమెంట్లో 20 టీమ్‌లు పాల్గొనగా మొదటి బహుమతి కె. భాస్కర్, శేఖర్ టీమ్, రెండవ బహుమతి ఖాలిక్, ప్రకాష్ టీం గెలుపొందాయి. కార్యక్రమంలో దయానంద్, సురేశ్, శ్రీధర్‌గౌడ్, వెంకట్, వేణు, వినోద్, రామాచారి, మహేశ్, జగదీశ్, పరిపూర్ణా, అజహర్, శేఖర్, రవి, బాలాజీ, భాస్కర్, పూర్యా, వెంకట్ ఉన్నారు. -
విద్యార్థులకు బహుమతుల అందజేత
: తెలంగాణ కోసం అలుపెరుగని ఉద్యమాలు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థులకు దిశ, నిర్దేశమని టీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు ఠాకూర్ సతీష్‌సింగ్, ఉపాధ్యక్షులు మిట్ట అనిల్‌గౌడ్ అన్నారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి శనివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు జయశంకర్ జీవిత చరిత్రపై పలు అంశాలను తెలియజేశారు. అంతకు ముందు జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆరుట్ల కిషోర్, ప్రభాకర్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు కర్రె నాగరాజు, కంసాని రాము, సిలగ అనిల్, మద్దూరి ప్రవీణ్, బొజ్జ భాను తదితరులున్నారు. -
టెన్నిస్ విజేతలు శశాంక్, జ్ఞానిత
గుంటూరు స్పోర్ట్స్: జిల్లా టెన్నిస్ సంఘం, ఎన్టీఆర్ స్డేడియం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–14 బాలబాలికల ఐటా టెన్నిస్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో చింతా శశాంక్ (విశాఖ) విజేతగా నిలువగా, బాలికల విభాగంలో ఎ.జ్ఞానిత (విశాఖ) విజేతలుగా నిలిచారు. బాలికల విభాగంలో లేళ్ల ఆశ్రిత (గుంటూరు), బాలుర విభాగంలో కిషన్ కుమార్ (చెన్నై) రన్నరప్ టైటిల్ సాధించారు. బాలుర డబుల్స్ విభాగంలో వరుణ్ కుమార్, కిషన్ కుమార్ జంట (చెన్నై) విజేతలుగా నిలిచారు. గిరిష్, అనంతమణి జంట (విశాఖ) రన్నరప్‌గా నిలిచారు. బాలికల డబుల్స్ విభాగంలో శరణ్య, సాత్విక జంట (విశాఖ) విజేతలుగా నిలిచారు. లేళ్ల ఆశ్రిత, ప్రవల్లిక జంట (గుంటూరు) రన్నరప్‌గా నిలిచారు. అనంతరం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ స్డేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు విజేతలకు ట్రోఫీలు అందించారు. -
విజేతలకు బహుమతుల ప్రదానం
వాడపల్లి(దామరచర్ల) : కృష్ణా పుష్కరాల ఆవశ్యకతపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఇటీవల దామరచర్ల మండలం వాడపల్లి జెడ్పీఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కె.శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పుష్కరాలపై అవగహన కల్పించేందుకు ‘సాక్షి’ పత్రిక చేస్తున్న కృషిని కొనియాడారు. పత్రికలో ఇప్పటికే విద్యార్థులకు ఉపయోగపడే అనేక విషయాలు ప్రచురితమవుతున్నాయన్నారు. పోటీల్లో దుర్గాభవాని ప్రథమ స్థానంలో నిలువగా దాసరి శిరీష్ ద్వితీయ, అనిత తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగల వికాస సమితి అధ్యక్షుడు గుడిపాటి కోటయ్య, సాక్షి విలేకరి బండి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు గురులక్ష్మి, నాగలత, సరోజ, రాంరెడ్డి, సునీత,రజబలి తదితరులు పాల్గొన్నారు. -
టెబుల్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు
విన్నర్లుగా నిలిచిన గౌతంకృష్ణ, శైలునూర్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజులుపాటు కొనసాగిన రాష్ట్రస్థాయి ప్రథమ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. బాలికల విభాగంలో విజయవాడకు చెందిన శైలు నూర్ బాషా 4–3 తేడాతో బీ నాగశ్రావణిపై విజయం సాధించింది. బాలుర విభాగంలో గుంటూరుకు చెందిన ఏ గౌతమ్‌కృష్ణ 4–2 తేడాతో ఏ. జగదీష్‌పై గెలుపొందాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎల్వీఆర్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విజేతలు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘ కార్యదర్శి ఎస్ఎం సుల్తాన్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడల నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియం అనువుగా ఉందన్నారు. జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘ అధ్యక్షుడు ఎన్వీ గురుదత్తు మాట్లాడుతూ టోర్నమెంట్‌కు 13 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ అకాడమీ వ్యవస్థాపకుడు చెరుకూరి సత్యనారాయణ, శాప్ ఓఎస్డీ ప్రత్తిపాటి రామకృష్ణ, సీనియర్ రిఫరీ ముక్కామల, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి టి. సంపత్ కుమార్, ఏపీ టేబుల్ టెన్నిస్ సంఘ జీవితకాల అధ్యక్షుడు చెంచురామయ్య, జిల్లా టెన్నిస్ సంఘ కార్యదర్శి కడియాల ప్రవీణ్‌కృష్ణ, టెన్నిస్ సంఘ సభ్యులు పీ రామచంద్ర రావు, రామసీత, కృష్ణపాణి, సురేంద్ర, డిప్యూటీ రిఫరీ పీ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
బస్తీమే..కుస్తీ
♦ నేటికీ కుస్తీ పోటీలు పదిలం ♦ ‘ఖేడ్’లో ముమ్మరంగా పోటీల నిర్వహణ ♦ పోటీలపై పెరుగుతున్న ఆదరణ ♦ ఆసక్తి చూపుతున్న యువకులు బహుమతులు, పారితోషికాలు మల్లయోధుల సొంతం ఉప్పొంగే ఉత్సాహం.. విజయతీరానికి చేరుకోవాలనే ఆత్రుత.. డప్పుల మోతలు.. ప్రజల కేరింతలు.. నిర్వాహకుల ప్రోత్సాహం.. వెరసి రంజుగా సాగే కుస్తీ పోటీలు. మల్లయోధులు హోరాహోరీగా తలపడే తీరు వీక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. మల్ల యోధులు సైతం ఎవరికి వారు రక్తం ఉడికిపోయేలా పోరాడుతూ ఎదుటి వారిని ఆత్మరక్షణలో పడేస్తుంటారు. ఎంతోమంది తమ అభిరుచి మేరకు మల్లయుద్ధంలోకి వస్తుంటారు. పేరు ప్రతిష్టల కోసం ఎంతో శ్రమించి ఈ రంగం వైపు వస్తుంటారు. వారి జీవన శైలి కూడా భిన్నంగా ఉంటుంది. వృత్తి ఏదైనా ప్రవృత్తిని కుస్తీ పోటీలుగా ఎం చుకుని రాణిస్తున్నారు. - కంగ్టి/కల్హేర్ కంగ్టి/కల్హేర్ : ఏటా నూతన సంవత్సరాదిగా ఉగాది పండుగతో ఆయా గ్రామాల్లో కుస్తీ పోటీలు ప్రారంభమవుతాయి. అదీగాక ఊరూరా నిర్వహించే గ్రామ దేవతల ఉత్సవాల్లోనూ కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో స్థానికులు, పరిసర గ్రామాల వారు, సరిహద్దు రాష్ట్రాల నుంచి మల్లయోధులు పాల్గొంటారు. కంగ్టి, కల్హేర్ మండలాల్లోనే వందల సంఖ్యలో మల్లయోధులు కుస్తీపోటీల్లో తలపడుతున్నారు. కంగ్టి మండలం గాంధీనగర్, సాధుతండా, దేవ్యాతండా, ఘన్పూర్ తండా, భీంరా తండా, రాంసింగ్ తండా, జీర్గీ తండాలతోపాటు కల్హేర్ మండలం బీబీపేట్, పత్తేపూర్, బొక్కస్‌గాం, మీర్ఖాన్పేట్, తండాల్లో వందల సంఖ్యలో మల్లయోధులు ‘కుస్తీ’ పడుతుంటారు. ఏటా కల్హేర్ మండలంలో అత్యధికంగా పోటీలు నిర్వహిస్తారు. కంగ్టిలో మూడు ఆలయాల వద్ద, నారాయణఖేడ్‌లో నాలుగు గ్రామాల్లో, మనూర్లో మూడు గ్రామాలు, పెద్దశంకరంపేట మండలంలో మూడు చోట్ల కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. విజేతలకు వెండి కంకణం బహూకరణ.. పోటీలో పాల్గొనే మల్ల యోధులకు నిర్వాహకులు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. గెలుపొందిన వారికి ప్రోత్సాహంగా నగదు పారితోషికం లేక వెండి కంకణాన్ని బహూకరిస్తారు. విజేతలు తాము అందుకున్న బహుమానాన్ని అందరికి చూపుతూ కల్లంలో కొంత సమయం విన్యాసాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ప్రేక్షకులు సైతం తమకు తోచినంత నగదును ఆనందంతో అందజేస్తారు. ఆహార అలవాట్లు ఇలా.. మల్ల యోధుల ఆహార అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. రోజూ తీసుకునే ఆహారంతోపాటు శీతాకాలం ఆరంభంలో అంజీర్, కొబ్బరి, కిస్మిస్, కాజు, ఖర్జూరం, బాదాం, ఆవునెయ్యితో తయారు చేసిన హల్వాతోపాటు పలు రకాల పండ్లను అదనంగా తీసుకుంటారు. దీనికితోడు నిత్యం వ్యాయామం చేస్తారు. డిప్స్ కొట్టడంతో చేతి కండలు పటిష్టంగా మారేలా సాధన చేస్తారు. వంశపారంపర్యంగా... మల్లయోధులు వంశపారంపర్యంగా కుస్తీ పోటీల్లోకి వస్తున్నారు. అప్పటికే వీరికి ఈ ఆటపై పరిచయం ఉంటుంది. తండాల్లో అత్యధికంగా గిరిజనులు తండ్రి, తాతల పేరు, ప్రఖ్యా తులను కాపాడేందుకు కుస్తీలపై ఆసక్తి కనబరుస్తున్నారు. మల్లయోధులు ఉద్యోగాలు పొందినా యువకులకు రెజ్లింగ్‌లో శిక్షణనిస్తూ పౌరాణిక కాలం నుంచి వస్తున్న కుస్తీ పోటీలకు ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్నారు. పీఈటీలుగా పహిల్వాన్లు... క ల్హేర్ మండలంలో పీఈటీలుగా పనిచేస్తున్న ముగ్గురు గతంలో కుస్తీ పోటీల్లో పాల్గొన్న వారే. దీంతో వారు విద్యార్థుల ఆసక్తికనుగుణంగా రెజ్లింగ్‌లో తర్ఫీదునిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన మల్లయోధులే పీఈటీలు కావడంతో కుస్తీ పోటీల విభాగంలో విద్యార్థులు రాణించే అవకాశం ఉంది. బీబీపేట్ జంలా తండాకు చెందిన సంగ్రామ్, గణేష్, బల్రాం కుస్తీ ఆటతోపాటు చదువుపై దృష్టి పెట్టారు. వారి కృషి మేరకు ఈపీటీలుగా అవకాశాలు వచ్చాయి. బాచేపల్లి జెడ్పీహెచ్ఎస్లో సంగ్రాం, సిర్గాపూర్‌లో బల్రాం, ఖేడ్ మండలం తుర్కపల్లిలో గణేష్ పీఈ టీలుగా పనిచేస్తున్నారు. వీరు రాష్ర్టస్థాయి, జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. ప్రతిభకు గుర్తింపుగా బంగారు, కాంస్య పతకాలు సాధించారు. బంధువులను చూసి ప్రేరణ పొందా.. కర్ణాటక, మహారాష్ట్రలో మా బంధువులు ఉన్నారు. వారి వద్దకు వెళ్లినప్పుడు కుస్తీ పోటీలు చూసి ప్రేరణ పొందా. నాతోపాటు పదోతరగతి చదువుతున్న తమ్ముడు రాథోడ్ విజయ్ సైతం పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనుబరుస్తున్నాడు. ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో నిర్వహించే పోటీలతోపాటు తడ్కల్, బాన్సువాడ, కంగ్టి, పిట్లంలో నిర్వహించే పోటీల్లో పాల్గొని గెలుపొంది పారితోషికం, బహుమతులు సొంతం చేసుకుంటున్నాం. - రాథోడ్ ప్రకాష్, ఘన్పూర్ తండా, కంగ్టి కుస్తీలో రాణిస్తున్నా... కుస్తీలు పట్టడం హాబీగా తీసుకుని ప్రాక్టీస్ చేసి పరిసర ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొంటాను. మూడు రాష్ట్రల సరిహద్దులో ఉండడంతో కంగ్టి, తడ్కల్, రాయిపల్లి, చింతాకీ, సావర్గాం తదితర గ్రామాల్లో కుస్తీ పోటీల్లో పాల్గొన్నాను. వంశపారంపర్యంగా కుస్తీపోటీల్లో పాల్గొంటున్నాం. తండ్రి బిజ్జు, తాత దేవ్‌జీలు కూడా పోటీల్లో మంచి ప్రతిభ కన బర్చారని తండా వాసులు చెప్పుకుంటారు. - రాథోడ్ లక్ష్మణ్, దెగుల్‌వాడి దేవ్లా తండా, కంగ్టి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను చిన్నప్పటి నుంచే కుస్తీ పట్టడం నేర్చుకున్నాను. నాన్న శివరాం, తాత ఓంలా నాయక్ కూడా కుస్తీలు పట్టేవారు. కుస్తీ పట్టి మంచి ప్రతిభ కనబర్చడంతోనే నాకు గుర్తింపు వచ్చింది. దీనికి తోడు చదువుకోవడంతో పీఈటీ ఉద్యోగం వచ్చింది. చాలా మంది విద్యార్థులకు రెజ్లింగ్‌లో శిక్షణ ఇస్తున్నాను. - సంగ్రాం, పీఈటీ, జెడ్పీహెచ్ఎస్ బాచేపల్లి, కల్హేర్ చిన్నప్పటి నుంచే పోటీ పడ్డాం.. చిన్నప్పటి నుంచే కుస్తీ పడడం నేర్చుకున్నా. ఇటీవలే కుస్తీపట్టడం మానేశా. వృద్ధాప్యంతో ఇబ్బందులు పడుతున్నా. నా కొడుకు తుకారాం మాత్రం పోటీల్లో పాల్గొని రాణిస్తున్నాడు. అందుకే ఈ మధ్య కాలంలో నేను కుస్తీపోటీలకు దూరంగా ఉన్నా. - శివరాం, బీబీపేట, జంలాతండా, కల్హేర్ -
సిండి‘కేటు’ దోపిడీ
మద్యం డాన్ల రహస్య సమావేశం? ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయం మామూళ్ల మత్తులో ఎక్సైజ్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు యథేచ్ఛగా కల్తీ మద్యం.. బెల్ట్‌షాపులు ఖమ్మం క్రైం: మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనలను పక్కనపెట్టి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్‌కు తలుపులు బార్లా తీస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన ఎక్సైజ్ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇష్టానుసారం ధరలు జిల్లాలో 148 మద్యం దుకాణాలు ఉన్నాయి. మొదట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు, మూడు నెలలపాటు దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా అమలు చేసింది. అప్పుడు ఎక్సైజ్ సిబ్బందికి పైసా మామూళ్లు ఇవ్వని వ్యాపారులు ఇప్పుడు మామూళ్లతో ముంచెత్తుతున్నారు. ‘మామూళ్లు ఇవ్వండి మీ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోండి’ అని ఎక్సైజ్ అధికారులు ఓపెన్‌గానే అంటున్నట్లు సమాచారం. వేసవికాలం కావడంతో మద్యం ప్రియులు బీర్లను ఎంచుకుంటున్నారు. ఇదే అదనుగా ఒక్కో బీరు బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. లిక్కర్ సీసాను రూ.10 నుంచి రూ.15 వరకు అధిక ధరకు అమ్ముతున్నారు. సిండికేట్ల పండగ సిండికేట్లు పండగ చేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఎక్సైజ్‌శాఖ డెరైక్టర్‌గా పనిచేసిన అకున్ సబర్వాల్ వేరేశాఖకు బదిలీ కావడంతో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ సిబ్బందికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా మద్యం సిండికేట్‌కు తలుపులు బార్లా తీయాలని కొంతమంది మద్యం డాన్లు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు రహస్య సమావేశం కూడా నిర్వహించారని సమాచారం. ఈ సిండికేట్ అమలుకావడానికి కొంతమంది ఎక్సైజ్ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. యథేచ్ఛగా పర్మిట్ రూమ్‌లు ఇష్టానుసారంగా పర్మిట్ రూమ్‌లు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకే మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. రాత్రి 10 గంటలకు మూయాల్సిన షాపులను అర్ధరాత్రి వరకూ కొనసాగిస్తున్నారు. ఖమ్మం త్రీటౌన్ టింబర్ డిపో రోడ్డులోని ఓ మద్యం షాప్ చుట్టూ పర్మిట్ దుకాణాలు ఏర్పాటైనా ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇలా ఎన్నో ఉన్నా పట్టించుకునే వారే లేకపోవడం గమనార్హం. కల్తీ విక్రయాలు జిల్లావ్యాప్తంగా 46 బార్లుండగా వాటిలో ఖమ్మంలోనే 42 ఉన్నాయి. మిగిలినవి ఇల్లెందు, కొత్తగూడెంలో ఉన్నాయి. కొన్ని బార్లలో కల్తీ మద్యం విక్రయిస్తూ దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఉదాహరణకు ఓ మద్యంప్రియుడు రూ.1500 బాటిల్ ఆర్డర్ చేస్తే మొదటి పెగ్గు వరకు అనుమానం రాకుండా తెచ్చి ఆ తర్వాత ఆ కాస్ట్లీ మద్యంలో చీప్‌లిక్కర్ కలిపి ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని బార్లలో నాణ్యతలేని తినుబండారాలను అమ్ముతూ మద్యం ప్రియుల ఆరోగ్యాన్నీ పాడు చేస్తున్నట్లు వినికిడి. గల్లీకో బెల్ట్‌షాప్ గల్లీకో బెల్ట్షాప్ను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నా..ఈ బెల్ట్‌షాప్‌ల వల్ల ప్రభుత్వాదాయానికి గండిపడుతున్నా ఎక్సైజ్‌శాఖ పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయా ప్రాంతంలో ఉన్న వైన్‌షాప్‌ల యజమానులే బెల్ట్‌షాపులకు మద్యం పంపిస్తున్నట్లు సమాచారం. ఈ బెల్ట్‌షాపుల నుంచి ఎక్సైజ్ సిబ్బందికి భారీగానే ముడుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
హ్యుందాయ్ ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు
హ్యుందాయ్ మోటార్ ఇండియా ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు అందజేసింది. వివరాల్లోకి వెళితే... సంస్థ తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్‌డ్రైవ్‌కు సంబంధించి ఒక లక్కీ డ్రా నిర్వహించింది. రీజినల్ మేనేజర్ డ్రా విజేతలను ప్రకటించారు. తల్వార్ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన ఏ రాజేష్ డ్రాలో మొదటి బహుమతి 32 అంగుళాల శామ్సంగ్ ఎల్ఈడీ టీవీని గెలుచుకున్నారు. లక్ష్మీ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన షేక్ అహ్మద్ శామ్సంగ్ 7 ట్యాబ్లెట్ బహుమతిగా పొందారు. అన్ని మోడళ్లకు సంబంధించి ఈ టెస్ట్ డ్రైవ్‌లో పాల్గొన్న దాదాపు 1707 మంది కస్టమర్లకు పవర్ బ్యాంక్స్ తదితర బహుమతులు గెలుపొందారు. -
సాక్షి మాక్ఎంసెట్ విజేతలకు బహుమతులు
-
రాష్ర్టస్థాయి ఎడ్ల పోటీల విజేత కృష్ణా జిల్లా జత
అనంతవరం (కొల్లూరు): రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందేల్లో కృష్ణా జిల్లా ఎడ్లు సత్తా చాటాయి. అత్యధిక దూరం బరువు లాగి ప్రథమ బహుమతి గెల్చుకున్నాయి. కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు సోమవారం ముగిశాయి. రెండోరోజు పోటీల్లో కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన సూరపనేని వేణుగోపాలరావుకు చెందిన ఒక ఎద్దు, ఘంటసాలకు చెందిన బండి పరాస్పరరావు ఎద్దు రెండు కలిసి 2785.7 అడుగుల దూరం బరువు లాగి మొదటి బహుమతిగా రూ.20 వేలు నగదు పొందాయి. అదేవిధంగా చెరుకుపల్లి మండలం, పగిడివారిపాలేనికి చెందిన కుంచన గోపాలరెడ్డి ఎడ్ల జత 2572.6 అడుగులు దూరం లాగి రెండవ బహుమతి(రూ.15వేలు) దక్కించుకున్నాయి. అనంతవరం గ్రామానికి చెందిన దూళిపూడి రంగయ్య మెమోరియల్ ఎడ్లజత 2540.10 అడుగుల దూరం లాగి మూడవ బహుమతి(రూ.10వేలు) సాధించాయి. ప్రకాశం జిల్లా తోటవానిపాలేనికి చెందిన రాయపాటి లక్ష్మీపతి ఎడ్ల జత 2500 అడుగులు దూరం లాగి నాలుగవ బహుమతి(రూ. 5 వేలు) పొందాయి. ఆయా ఎడ్ల యజమానులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ కనగాల మధుసూధన్ ప్రసాద్, రైతులు యలవర్తి కోటేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.