క్రీడలతో పోటీతత్వం
ఎమ్మెల్యే ముస్తఫా
గుంటూరు స్పోర్ట్స్: క్రీడలతో పోటీతత్వం అలవడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేత జట్లకు ట్రోఫీలు అందించారు. మహిళ విభాగంలో ఆచార్య నాగార్జున జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు స్పోర్ట్స్ క్లబ్ జట్టు ద్వితీయస్థానం, నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి.