basket ball
-
20 ఏళ్ల తర్వాత ఆల్ స్టార్ ఎన్బీఏ మ్యాచ్‌కు దూరమైన లెబ్రాన్ జేమ్స్
శాన్ఫ్రాన్సిస్కో: విఖ్యాత నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ ఆల్ స్టార్ మ్యాచ్‌కు అమెరికా దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ తొలిసారి దూరమయ్యాడు. 20 ఏళ్ల తర్వాత లెబ్రాన్ జేమ్స్ లేకుండా ఆల్ స్టార్ మ్యాచ్ జరగడం గమనార్హం. 2005 నుంచి ప్రతి సీజన్లో ఆల్ స్టార్ మ్యాచ్‌లలో ఆడిన 40 ఏళ్ల లెబ్రాన్ ఈసారి చీలమండ గాయంతో ఆడలేకపోయాడు. రెగ్యులర్ సీజన్లో లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ఆడే లెబ్రాన్ ఆల్ స్టార్ మ్యాచ్‌లలో ఈసారి షకిల్లా ఓనీల్ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సింది. 2005లో తొలిసారి ఆల్ స్టార్ మ్యాచ్‌లో ఆడిన లెబ్రాన్ వరుసగా 20 ఏళ్లపాటు ఈ మేటి మ్యాచ్‌లలో భాగస్వామిగా ఉన్నాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 113 కేజీల బరువున్న లెబ్రాన్ ఇప్పటి వరకు ఎన్బీఏ లీగ్‌లో 1,540 మ్యాచ్‌లు ఆడి అత్యధికంగా 41,641 పాయింట్లు స్కోరు చేశాడు. -
తండ్రి, తనయుడు కలిసి.. ఎన్బీఏలో కొత్త చరిత్ర
లాస్ ఏంజెలిస్: నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎన్బీఏ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన దిగ్గజ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్‌తో పాటు... అతడి కుమారుడు బ్రోనీ జేమ్స్ ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగారు. తద్వారా ఎన్బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రీ కొడుకులుగా వీరు రికార్డుల్లోకెక్కారు. లీగ్‌లో భాగంగా లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మంగళవారం మినెసొటా టింబర్వోల్వస్ జట్టుతో జరిగిన పోరులో కలిసి ఆడారు. సుదీర్ఘ ఎన్బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రి కుమారులు లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మాత్రమే కావడం విశేషం. 39 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ ఇప్పటి వరకు ఎన్బీఏలో 40,490 పాయింట్లు సాధించి ఈ జాబితా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 20 ఏళ్ల బ్రోనీ జేమ్స్ ఈ సీజన్లోనే ఎన్బీఏ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ రెండో క్వార్టర్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో బ్రోనీ కోర్టులోకి అడుగు పెట్టాడు. దీంతో అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించగా... తండ్రి సూచనలు పాటిస్తూ బ్రోనీ రెండున్నర నిమిషాల పాటు ఆటలో కొనసాగాడు. బ్రోనీ మైదానాన్ని వీడే సమయంలో కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తంచేశారు. గత వేసవిలో జరిగిన వేలంలోనే లేకర్స్ జట్టు బ్రోనీ జేమ్స్‌ను దక్కించుకోగా... ఇప్పుడు సీజన్ ఆరంభ పోరుతో తండ్రీ కుమారులు కలిసి ఆడే అవకాశం దక్కింది. బ్రోనీ బరిలోకి దిగడానికి ముందు లెబ్రాన్ మాట్లాడుతూ... ‘సిద్ధంగా ఉన్నావా. మ్యాచ్ తీవ్రత గమనించావు కదా... ఒత్తిడికి లోనవకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించు’ అని అన్నాడు. పొరబాట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని... మైదానంలో వంద శాతం కష్ట పడటంపైనే దృష్టి పెట్టాలని సూచించాడు. మ్యాచ్‌లో లెబ్రాన్ జేమ్స్ 16 పాయింట్లతో సత్తా చాటగా... లేకర్స్ జట్టు 110– 103 పాయింట్ తేడాతో టింబర్వోల్వస్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు లెబ్రాన్ భార్య, బ్రోనీ తల్లి సవన్నా జేమ్స్ కూడా హాజరై... భర్త, కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. బేస్‌బాల్ మేజర్ లీగ్‌లో కెన్ గ్రెఫీ సీనియర్ అతడి కుమారుడు కెన్ గ్రెఫీ జూనియర్ ఇలాంటి అరుదైన రికార్డు సాధించారు. 1990వ దశకంలో వీరిద్దరూ 51 మ్యాచ్‌ల్లో కలిసి ఆడారు. మంగళవారం ఎన్బీఏ మ్యాచ్‌కు హాజరైన కెన్ గ్రెఫీ జంట... జేమ్స్ ద్వయాన్ని అభినందించింది. నాలుగుసార్లు ఎన్బీఏ చాంపియన్‌గా నిలిచిన లెబ్రాన్ చాన్నాళ్ల క్రితమే కుమారుడితో కలిసి ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అప్పటికి బ్రోనీ విద్యార్థి దశలోనే ఉండగా... ఆ తర్వాత కఠోర శిక్షణతో రాటుదేలిన బ్రోనీ టీనేజ్లోనే తన ప్రతిభతో లేకర్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది కార్డియాక్ అరెస్ట్‌కు గురైన బ్రోనీ జేమ్స్... ఓపెన్ హార్ట్ సర్జరీ నుంచి కోలుకొని తిరిగి ఆట కొనసాగిస్తున్నాడు. -
Olympics: ఒలింపిక్స్‌లో వరుసగా ఆరు స్వర్ణాలు
Diana Taurasi: ఒలింపిక్స్ బాస్కెట్‌బాల్‌లో అమెరికా క్రీడాకారిణి డయానా టురాసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. వరుసగా ఆరు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా 67–66తో ఫ్రాన్స్‌ను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టులో డయానా సభ్యురాలిగా ఉంది. 42 ఏళ్ల డయానా 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లోనూ పసిడి పతకాలు గెలిచిన అమెరికా బాస్కెట్‌బాల్ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా హవా పారిస్ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా ఐదు స్వర్ణాలతో అదరగొట్టింది. చివరిరోజు మహిళల ప్లస్ 81 కేజీల విభాగంలో చైనా లిఫ్టర్ లీ వెన్వెన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. లీ వెన్వెన్ మొత్తం 309 కేజీల (స్నాచ్‌లో 136 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 173 కేజీలు) బరువెత్తింది. చైనా తరఫున ఈ క్రీడల్లో హు జీహుయ్ (49 కేజీలు), షిఫాంగ్ లువో (59 కేజీలు), లీ ఫాబిన్ (61 కేజీలు), లీ హువాన్హువా (102 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు. -
Basket Ball: 7 అడుగుల 5 అంగుళాల ఆజానుబాహురాలు.. ఎంత అలవోకగా పాయింట్లు సాధిస్తుందో చూడండి..!
మహిళల బాస్కెట్‌బాల్‌లో 17 ఏళ్ల చైనా అమ్మాయి ఝాంగ్ జియు సంచలనాలు సృష్టిస్తుంది . 7 అడుగుల 5 అంగుళాల ఆజానుబాహురాలైన జియు తన హైట్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుని అలవోకగా పాయింట్లు సాధిస్తూ టాక్ ఆఫ్ ద సోషల్‌మీడియాగా మారింది. జియు తన ఎత్తు కారణంగా దూరం నుంచి ఖచ్చితత్వంగా డైరెక్ట్ షూట్లు చేయడంతో పాటు దుర్భేద్యమైన డిఫెన్స్‌ను ప్రదర్శించగలుగుతుంది. 16-year-old Zhang Ziyu, the 7’5 female basketball player, barely broke a sweat during her debut for Team Chinapic.twitter.com/nOScHVR4RN— Dexerto (@Dexerto) June 25, 2024అంతర్జాతీయ కెరీర్లో తన తొలి టోర్నమెంట్ (FIBA అండర్ 18 మహిళల ఆసియా కప్ 2024) ఆడుతున్న జియు.. తాజాగా ఇండొనేషియాతో జరిగిన మ్యాచ్‌లో 19 పాయింట్లు సాధించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. జియు కేవలం 13 నిమిషాల వ్యవధిలో 9 షూట్లను పాయింట్లుగా మలిచింది. ఈ గేమ్‌లో చైనా 109-50 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్ అనంతరం ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (FIBA) జియు సాధించిన పాయింట్లకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. జియు చెమటోడ్చకుండా పాయింట్లు సాధిస్తుందని కొందరంటుంటే.. మరికొందరు జియుని చీట్ కోడ్ అని అంటున్నారు. మొత్తానికి జియు బాస్కెట్‌బాల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
వీడికి నోబెల్ ఇవ్వాల్సిందే
-
ఇది కదా షాట్ అంటే.. కొడితే నేరుగా..!
అమెరికన్ సెంచరీ ఛాంపియన్షిప్ సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నీలో సంచలనం నమోదైంది. గోల్డెన్ స్టేట్ వారియర్స్ స్టార్, అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ Hole-in-one (ఒకే షాట్‌కు రంధ్రంలోకి బంతి పడటం) ఫీట్‌ను నమోదు చేశాడు. తాహో సరస్సు తీరాన ఇటీవల జరిగిన పోటీలో కర్రీ ఈ ఘనత సాధించాడు. Shooters Shoot!!! Hole In One vibes out here in Lake Tahoe. That’s✌🏽@acchampionship @callawaygolf pic.twitter.com/8Nzlznf9EL — Stephen Curry (@StephenCurry30) July 16, 2023 152 గజాల పార్-3 ఏడవ రంధ్రంలోకి కర్రీ నేరుగా షాట్ కొట్టాడు. బంతి గమ్యానికి చేరగానే కర్రీ ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. టోపీని గాల్లోకి ఎగరేసి, స్ప్రింటర్‌లా తాను సాధించిన లక్ష్యంవైపు పరుగులు పెట్టాడు. విజయదరహాసంతో ఊగిపోతూ.. గాల్లోకి పంచ్‌లు విసురుతూ ఘనంగా తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇది కదా షాట్ అంటే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏం షాట్ కొట్టావు గురూ.. అంటూ కర్రీని అభిమానులు అభినందిస్తున్నారు. కాగా, గోల్ఫ్ క్రీడలో Hole-in-one ఫీట్ అనేది చాలా అరుదుగా నమోదవుతుంది. ఈ ఫీట్‌తో కర్రీ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుని, తన ప్రత్యర్ధులపై పైచేయి సాధించాడు. ఇంటితో ఆగని కర్రీ అమెరికన్ సెంచరీ ఛాంపియన్షిప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. సెలబ్రిటీ టోర్నమెంట్లో కర్రీకి ఇది తొలి టైటిల్. ఈ టోర్నీలో కర్రీ (75 పాయింట్లు) తన సమీప ప్రత్యర్ధి మార్డీ ఫిష్‌పై (మాజీ ప్రో టెన్నిస్ ప్లేయర్) 2 పాయింట్ల తేడాతో నెగ్గాడు. -
Michael Jordan: బాస్ ఆఫ్ బాస్కెట్‌బాల్
ఆరు సార్లు ప్రతిష్ఠాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు... ఆరు ఫైనల్స్‌లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డు... ఐదు సార్లు టోర్నీ మొత్తంలో అత్యంత విలువైన ఆటగాడు...14 సీజన్ల పాటు ఆల్‌స్టార్ జట్టులో చోటు...రెండు ఒలింపిక్ పతకాలు...కనీసం రెండంకెల పాయింట్లు స్కోరు చేసిన వరుస మ్యాచ్‌లు ఏకంగా 840... ఒక మ్యాచ్‌లో ఒంటిచేత్తో ఏకంగా 69 పాయింట్లు సాధించిన ఘనత... ఒకటేమిటి, ఇలా ఆ దిగ్గజం గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే పుటలు సరిపోవు. లెక్కలేనన్ని రికార్డులను అతను తిరగరాశాడు. అతను కోర్టులో అడుగుపెడితే అభిమానులకు అతి పెద్ద పండుగ! ఆట మొదలుపెడితే అద్భుతాలు ఆవిష్కృతం కావడమే, లోకం ఊగిపోవడమే! క్రీడా చరిత్రలో ఒక ఆటపై ఒక వ్యక్తి ఇంతగా తనదైన ముద్ర వేయడం అరుదు. ఆ సూపర్ స్టార్ పేరే మైకేల్ జోర్డాన్. మరో మాటలకు తావు లేకుండా ఆల్‌టైమ్ గ్రేట్. ఒక తరం పాటు బాస్కెట్‌బాల్ అంటే జోర్డాన్; జోర్డాన్ అంటే బాస్కెట్‌బాల్! 1984లో ఎన్బీఏ జట్టు షికాగో బుల్స్ తొలి సారి జోర్డాన్‌ను తీసుకుంది. అప్పుడు వారికీ తెలీదు. తాము ఎలాంటి సంచలనాన్ని ఎంచుకున్నామో, మున్ముందు అతను చూపే అద్భుతాలు ఎలాంటివో వారూ ఊహించలేదు. సీనియర్లు మెల్లమెల్లగా తప్పుకుంటున్న దశలో జోర్డాన్ రాక బుల్స్ టీమ్‌ను శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టింది. అతను పాయింట్ సాధించే క్రమంలో ఎగిరే తీరు, ’స్లామ్ డంక్స్’తో పాటు ‘ఫ్రీ త్రో లైన్’లో పాయింట్లు సాధించే తీరు ప్రపంచ క్రీడాభిమానులందరూ నివ్వెరపోయేలా చేశాయి. అందుకే జోర్డాన్ కోసం వారంతా పడిచచ్చిపోవడం మొదలైంది. బుల్స్‌తో చేరిన తర్వాత తొలి ఎన్బీఏ టైటిల్ సాధించేందుకు కొంత సమయం పట్టినా తన అద్భుత ఆటతో బుల్స్‌కు రెండుసార్లు త్రీ–పీట్ (హ్యాట్రిక్) టైటిల్స్‌ను అందించాడు. 1991–93 వరకు వరుసగా మూడేళ్లు షికాగో బుల్స్ పైచేయి సాధించిందంటే అందుకు జోర్డానే కారణం. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన మూడేళ్ల తర్వాత తిరిగొచ్చిన జోర్డాన్... మరోసారి వరుసగా మూడేళ్లు బుల్స్ టైటిల్ సాధించడంలో మళ్లీ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఎన్బీఏ లీగ్ చరిత్రలో తొలి బిలియనీర్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. స్కూల్, కాలేజీల్లో సత్తా చాటి... జోర్డాన్ జీవితంలో పెద్దగా ఎత్తుపల్లాలేమీ లేవు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని బాల్యం బాగానే సాగింది. ఆటల్లో ఎంతో ఆసక్తి కనబర్చిన అతను తన స్కూల్లో బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, ఫుట్‌బాల్ ఆడాడు. బాస్కెట్‌బాల్ అతడిని ఎక్కువగా ఆకర్షించడంతో జట్టులో చోటు కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో జోర్డాన్ ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. మామూలుగా అయితే ఇది మంచి ఎత్తు. కానీ స్కూల్ లెవల్ బాస్కెట్‌బాల్ ఆడేందుకు ఇది సరిపోదని, చాలా తక్కువ అంటూ అతడికి చోటు నిరాకరించారు! దాంతో అదే స్కూల్ జూనియర్ టీమ్ తరఫున అతను ఆడాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటి పాయింట్ల వర్షం కురిపించాడు. తర్వాతి ఏడాది వచ్చేసరికి జోర్డాన్ ఎత్తు మరో 10 సెంటీమీటర్లు పెరిగింది. దాంతో పాటు శిక్షణలో కఠోరంగా శ్రమించాడు కూడా. ఫలితంగా తిరస్కరించిన జట్టులోనే చోటు లభించింది. తమ టీమ్‌ను వరుసగా గెలిపించడంతో పాటు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక బాస్కెట్‌బాల్ స్కాలర్‌షిప్‌లన్నీ వచ్చి చేరాయి. ఆపై కాలేజీ టీమ్‌లో కూడా చెలరేగడంతో కాలేజీ బాస్కెట్‌బాల్ అమెరికన్ టీమ్‌లో కూడా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయానికే బాస్కెట్‌బాల్‌లో జోర్డాన్ అందరి దృష్టిలో పడి భవిష్యత్ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ తర్వాత ఎదురు లేకుండా అతని ప్రస్థానం కొనసాగింది. తిరుగులేని ప్రదర్శనతో... షికాగో బుల్స్... ఎన్బీఏలో 1966నుంచి బరిలో ఉన్న జట్టు. 18 సీజన్ల పాటు ఆడినా ప్రదర్శన అంతంతమాత్రంగా ఉంది. కానీ 1984 డ్రాఫ్ట్ ఆ జట్టుకు ఒక్కసారిగా ఆకర్షణను తెచ్చింది. దానికి కారణం ఒకే ఒక్కడు మైకేల్ జోర్డాన్. జోర్డాన్ బరిలోకి దిగితే చాలు అభిమానులు ఊగిపోయారు. ఫలితంతో సంబంధం లేకుండా అతను ఉంటే చాలు, అతని ఆట చూస్తే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఆ ఏడాది బుల్స్ ఆడిన 82 మ్యాచ్‌లు అన్నింటిలో బరిలోకి దిగిన ఏకైక ఆటగాడైన జోర్డాన్ ప్రతీ గేమ్‌కు సగటున 28.2 పాయింట్లు సాధించిన శిఖరాన నిలిచాడు. అయితే ఇతర సహచరుల నుంచి తగినంత సహకారం లేక టీమ్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగింది. కానీ 1991లో ఎట్టకేలకు బుల్స్ ఎదురు చూసిన క్షణం వచ్చింది. ఫైనల్లో టాప్ టీమ్ లాస్ ఏంజెల్స్ లేకర్స్‌ను ఓడించి బుల్స్ తొలి సారి చాంపియన్‌గా నిలిచింది. 31.5 సగటు పాయింట్లతో టాప్ స్కోర్ సాధించిన జోర్డాన్ అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత వరుసగా రెండేళ్లు ఇదే కొనసాగింది. ఫలితంగా మరో రెండు టైటిల్స్ జట్టు ఖాతాలో చేరాయి. అనూహ్యంగా దూరమై... 1993లో జోర్డాన్ తండ్రి అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. తండ్రిని ఎంతో ప్రేమించిన జోర్డాన్ తనకు బాస్కెట్‌బాల్‌పై ఆసక్తి తగ్గిపోయిందంటూ హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా అప్పటికే ఎంతో కీర్తిని పొందినా, చిన్నప్పుడు తన తండ్రి తనను బేస్‌బాల్ ఆటగాడిగా చూడాలని కోరుకున్నాడంటూ ఒక్కసారిగా బేస్‌బాల్ మైనర్ లీగ్‌లో కూడా అడుగు పెట్టాడు. అక్కడ రెండు సీజన్ల పాటు బ్యారన్స్, స్కార్పియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే రెండేళ్ల తర్వాత తన టీమ్ బుల్స్ పరిస్థితి బాగా లేకపోవడంతో సీజన్ మధ్యలో ’ఐయామ్ బ్యాక్’ అంటూ రిటైర్మెంట్కు గుడ్‌బై చెప్పిన మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. సుమారు 18 నెలల పాటు ఆట నుంచి దూరంగా ఉన్నా జోర్డాన్‌లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఒంటి చేతుల్లో టీమ్‌ను ప్లే ఆఫ్ వరకు చేర్చగలిగాడు. అయితే తాను చేయాల్సింది ఇంకా ఉందని భావించిన జోర్డాన్ తర్వాతి సీజన్ కోసం సీరియస్‌గా కష్టపడ్డాడు. అందుకు తగ్గ ఫలితం కూడా జట్టుకు లభించింది. మరో సారి వరుసగా మూడేళ్ల పాటు (1996, 97, 98) బుల్స్ ఎన్బీఏ చాంపియన్‌గా నిలవడం విశేషం. రెండోసారి మళ్లీ రిటైర్మెంట్ ప్రకటించి, మూడేళ్ల తర్వాత జోర్డాన్ మళ్లీ వెనక్కి వచ్చాడు. ఈసారి జట్టు మారి రెండేళ్ల పాటు వాషింగ్టన్ విజార్డ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జోర్డాన్ టీమ్ నుంచి తప్పుకున్న తర్వాత 1998నుంచి ఇప్పటి వరకు ఎన్బీఏలో షికాగో బుల్స్ మరో టైటిల్ గెలవలేకపోయిందంటే అతని ఘనత ఏమిటో అర్థమవుతుంది. 1984 లాస్ ఏంజెల్స్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లలో అమెరికాకు స్వర్ణ పతకాలు అందించి జాతీయ జట్టు తరఫున కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. బాస్కెట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా అమిత ప్రాచుర్యం కల్పించడంలో జోర్డాన్ కీలక పాత్ర పోషించాడు. అతని కారణంగానే 90వ దశలో ఎన్బీఏ లీగ్ వాణిజ్యపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. స్వయంగా జోర్డాన్ ఎండార్స్మెంట్ల ద్వారా మార్కెట్‌ను శాసించాడు. అతనితో ఒప్పందాల కోసం పెద్ద పెద్ద సంస్థలు ‘క్యూ’ కట్టి పోటీ పడ్డాయి. ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యధికంగా మార్కెటింగ్ చేయబడిన ఆటగాడిగా అతను గుర్తింపు పొందారు. అన్నింటికి మించి ‘నైకీ’ సంస్థ అతని జంప్‌తో ప్రత్యేకంగా రూపొందించిన షూస్ విశ్వవ్యాప్తంగా సంచలనం సష్టించాయి. ‘ఎయిర్ జోర్డాన్’ పేరుతో రూపొందించిన ఈ కమర్షియల్‌తో అతని స్థాయి ఏమిటో తెలిసింది. పలు సినిమాలు, డాక్యుమెంటరీల్లో కూడా నటించిన జోర్డాన్ పలు పుస్తకాలు రచించాడు. అయితే ’ఫర్ ద లవ్ ఆఫ్ ద గేమ్’ పేరుతో వచ్చిన జోర్డాన్ ఆత్మకథలో అతని కెరీర్, జీవితంలో అన్ని కోణాలు కనిపిస్తాయి. -
క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్.. టీమిండియా సేఫ్!
అంతర్జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్‌రాడార్ 2022 ఏడాదిలో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. ఈ నివేదికలో 13 క్రికెట్ మ్యాచ్‌ల్లో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపించడం ఆసక్తి కలిగించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే స్పోర్ట్‌రాడార్‌కు చెందిన నిపుణులు రెగ్యులర్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి కార్యకలపాలపై తమ పరిశోధన నిర్వహించారు. దీనికి సంబంధించి 28 పేజీలతో ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. 2022 ఏడాది క్యాలెండర్లో మొత్తంగా 1212 మ్యాచ్‌లపై వివిధ కోణాల్లో అనుమానాలున్నాయని పేర్కొంది. ఇందులో 92 దేశాలకు చెందిన 12 ఆటలు ఉన్నాయి. అత్యధికంగా ఫుట్‌బాల్ నుంచి 775 మ్యాచ్‌లు అవినీతి లేదా ఫిక్సింగ్ రూపంలో ఉన్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో బాస్కెట్‌బాల్ గేమ్ ఉంది. ఈ బాస్కెట్‌బాల్ నుంచి 220 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత 75 అనుమానాస్పద మ్యాచ్‌లతో టెన్నిస్ మూడో స్థానంలో ఉంది. ఇక క్రికెట్లో 13 మ్యాచ్‌లపై అనుమానాలు ఉన్నట్లు తెలిపిన స్పోర్ట్‌రాడార్ ఆరోస్థానం కేటాయించింది. క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్ లేదా అవినీతి జరగడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఇదే విషయమై పీటీఐ స్పోర్ట్ రాడార్‌ను ఒక ప్రశ్న వేసింది. ఈ ఫిక్సింగ్ జరిగింది అంతర్జాతీయ క్రికెట్ లేక టి20 లీగ్‌ల్లోనా అని పీటీఐ ప్రశ్నించింది. దీనికి స్పోర్ట్‌రాడార్ స్పందిస్తూ ఫిక్సింగ్‌గా అనుమానిస్తున్న 13 మ్యాచ్‌లు టీమిండియాకు కానీ.. ఐపీఎల్‌కు కానీ సంబంధం లేదని తెలిపింది. ఇదే స్పోర్ట్ రాడార్ సంస్థ 2020లో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్లో పనిచేసింది. బెట్టింగ్‌లో జరుగుతున్న అక్రమాలపై తమ పరిశోధన చేసి బీసీసీకి నివేధిక అందించింది. Sportradar Integrity Services finds number of suspicious matches in 2022 increased 34%, as further application of AI enhances bet monitoring capabilities. Read our Annual 2022 Integrity Report ➡️ https://t.co/4SflpVlGUI pic.twitter.com/kRSDW93K3p — Sportradar (@Sportradar) March 23, 2023 చదవండి: ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ -
బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీ గ్రైనర్‌ను విడుదల చేసిన రష్యా
వాషింగ్టన్: అమెరికా, రష్యాలు ఖైదీల పరస్పర విడుదల ఒప్పందం కింద అమెరికా బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీ గ్రైనర్‌ను రష్యా విడుదల చేసింది. బదులుగా ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్‌ను అమెరికా– రష్యాకు అప్పగించింది. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన గ్రినర్ను రష్యా పర్యటనలో ఉండగా మాదకద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు. శిక్షను ఖరారు చేసి జైలుకు పంపారు. ఆమెకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా బైడెన్ సర్కా రు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఖైదీల పరస్పర విడుదలకు రష్యాతో బేరసారాలు కొనసాగించింది. ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అబుదాబిలో గ్రినర్ ను అప్పగించి, విక్టర్ బౌట్‌ను స్వదేశానికి తీసుకువచ్చినట్లు రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇక అమెరికా బాస్కెట్ బాల్ సంచలనం.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన 31 ఏళ్ల బ్రిట్నీ గ్రైనర్ (Brittney Griner).. రష్యా ప్రీమియర్ లీగ్ కోసం గత ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లింది. అయితే లగేజీలో హషిష్ నూనె (hashish oil) దొరకడంతో రష్యా కస్టమ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై డ్రగ్స్ ఆరోపణలకుగానూ ఆమెకు తొమ్మిదేళ్ల శిక్ష విధించారు. చదవండి: FIFA WC 2022: భర్త వెళ్లిపోయినా.. భార్య మాత్రం ఖతర్‌లోనే Обнародованы видеокадры обмена россиянина Виктора Бута на американку Бриттни Грайнер:https://t.co/hs1cFtHbOs Видео: ТАСС pic.twitter.com/UZ209BYPRX — ТАСС (@tass_agency) December 8, 2022 -
తెలంగాణ ‘డబుల్’ ధమాకా
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతోపాటు ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 3–0తో కేరళను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 21–15, 14–21, 21–14తో ట్రెసా జాలీ–ఎం.ఆర్.అర్జున్ ద్వయంపై గెలిచి తెలంగాణకు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 18–21, 21–16, 22–20 తో ప్రణయ్‌ను ఓడించి తెలంగాణ ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సామియా ఇమాద్ ఫారూఖి 21–5, 21–12తో గౌరీకృష్ణపై గెలవడంతో తెలంగాణ విజయం ఖరారైంది. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. మహిళల బాస్కెట్‌బాల్ 3గీ3 ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ జట్టు 17–13తో కేరళను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్ రజత పతకం దక్కించుకుంది. ఆమె 9ని:23.91 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల రోయింగ్ కాక్స్డ్–8లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజ్, చరణ్ సింగ్ కెతావత్, మహేశ్వర్ రెడ్డి, గజేంద్ర యాదవ్, నవదీప్, హర్దీప్ సింగ్, వెల్ది శ్రీకాంత్‌లతో కూడిన తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. -
విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి
ఎన్బీఏ(బాస్కెట్‌బాల్) మాజీ ప్లేయర్ కాలేబ్ స్వానిగన్ 25 ఏళ్ల వయసులో మృత్యు ఒడిలోకి చేరాడు. అతని మరణ విషయాన్ని 'పర్డ్యూ మెన్స్ బాస్కెట్‌బాల్' టీం తన ట్విటర్లో ప్రకటించింది. ''కాలేబ్ స్వానిగన్ అకాల మరణం పట్ల చింతిస్తున్నాం. ఆడింది కొద్దిరోజులే అయినా గొప్ప ఎన్బీఏ ప్లేయర్‌గా ఎదిగాడు. కాలేబ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అతని కుటుంబసభ్యులకు, మిత్రులకు మా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాం.'' అంటూ ట్వీట్ చేసింది. అయితే కాలెబ్ మరణ వార్తని మాత్రమే వెల్లడించిన 'పర్డ్యూ మెన్స్' మృతి వెనుక కారణాలను మాత్రం రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. అయితే అలెన్ కౌంటీ కార్నర్స్ అందించిన రిపోర్ట్స్ ప్రకారం కాలేబ్ స్వానిగన్ది సహజ మరణమే అని తెలిసింది. ఇక ఎన్బీఏ(నేషనల్ బాస్కెట్‌బాల్ అసొసియేషన్) అనేది నార్త్ అమెరికాకు చెందిన బాస్కెట్‌బాల్ లీగ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 💔 Devastated. Our thoughts and prayers to Caleb Swanigan’s family and friends. The world lost a gentle soul last night. Love you Biggie. pic.twitter.com/spU2hQtJdi — Purdue Mens Basketball (@BoilerBall) June 21, 2022 2017 నుంచి మూడేళ్ల పాటు ఎన్బీఏలో కొనసాగిన కాలేబ్ స్వానిగన్ పోర్ట్లాండ్ ట్రయల్బేజర్స్, సాక్రామెంటో జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2019-20 సీజన్ నుంచి మాత్రం కాలేబ్ ఎన్బీఏలో యాక్టివ్‌గా లేడు. అంతకముందు ఫ్లొరిడాలో నిర్వహించిన కోవిడ్-19 బయోబబూల్ క్యాంప్‌కు వెళ్లేందుకు కాలేబ్ నిరాకరించడంతో అతనిపై వేటు పడింది. ఆ తర్వాత కాలేబ్ స్వానిగన్ కారులో గంజాయితో పట్టుబడి అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అప్పటినుంచి మానసికంగా బాగాలేడనే వార్తలు వచ్చాయి. తాజాగా చిన్న వయసులోనే మరణించడం వెనుక డ్రగ్స్ కారణమని.. బరువు తగ్గేందుకే కాలేబ్ మాదకద్రవ్యాలను వినియోగించడంటూ ట్విటర్లో కొందరు పేర్కొన్నారు. ఇక కాలేబ్ స్వానిగన్ స్కూల్ వయసులోనే బాస్కెట్‌బాల్‌లో సంచలనాలు నమోదు చేశాడు. 2015లో తన స్కూల్‌కు బాస్కెట్‌బాల్‌లో మెయిడెన్ స్టేట్ చాంపియన్‌షిప్‌గా నిలవడంతో కాలేబ్ది కీలకపాత్ర. ఈ ప్రదర్శనతో ఇండియానాలో ఫేమస్ అవార్డుగా చెప్పుకునే మిస్టర్ బాస్కెట్‌బాల్ గౌరవాన్ని కాలేబ్ అందుకున్నాడు. ఇక పర్డ్యూ మెన్స్ బాస్కెట్‌బాల్ టీం తరపున ఎన్బీఏలో లెక్కలేనన్ని రికార్డులు అందుకున్నాడు. చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే -
Tokyo Olympics: బాస్కెట్‌బాల్ కోర్టులో ఔరా అనిపిస్తోన్న రోబోట్..!
టోక్యో: ఈ ఏడాది జూలై 23న టోక్యో వేదికగా ప్రారంభమైన విశ్వ క్రీడలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఒకవైపు తమ ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఆయా దేశాలు ఆనందంలో పరవశించిపోతుంటే, మరొకవైపు రోబోటిక్స్ విన్యాసాలు కూడా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఒలింపిక్స్ బాస్కెట్‌బాల్ ఈవెంట్లో భాగంగా కోర్టులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాస్కెట్ బాల్ కోర్టులో 95వ జెర్సీ నంబర్ ధరించిన ఓ ప్లేయర్ పద్దతిగా..ఒక లైన్ గీసిన్నట్లుగా..100శాతం కచ్చితత్వంతో కోర్టులో ఆయా ప్లేస్‌ల నుంచి బాల్ వేస్తే ఏకధాటిగా గోల్ పోస్ట్ల్లోకి వెళుతూనే ఉన్నాయి. ఇది అక్కడ ఆశ్చర్యానికి గుర్యయేలా చేసింది. ఇంతకు 95 నంబర్ జెర్సీ ధరించిన ప్లేయర్ ఎవరనీ అనుకుంటున్నారా..! వరుసగా గోల్స్ చేస్తూన్న 95 నంబర్ ప్లేయర్ ఎవరంటే.ఒక రోబోట్..! అవును మీరు విన్నది నిజమే..! ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తయారుచేసిన ఈ రోబోట్ బాస్కెట్‌బాల్ కోర్టులో వరుసపెట్టి గోల్స్ సాధిస్తూనే ఉంది. ఈ అద్భుత సన్నివేశం యూఎస్ఏ వర్సెస్ ఫ్రాన్స్‌కు మధ్య జరిగే బాస్కెట్‌బాల్‌లో పోటీలో కనిపించాయి . కాగా ఈ ఏఐ రోబోట్‌ను టయోటా సంస్థ రూపొందించింది. గత సంవత్సరం ఏఐ రోబోట్ జపాన్‌లో నిర్వహించిన షూటౌట్లో ఏకధాటిగా 11 గోల్స్‌ను సాధించింది. ప్రస్తుతం టయోటా ఇంజనీర్లు రూపొందించిన ఈ ఏఐ రోబోట్‌ను ముద్దుగా ‘క్యూ’ అని పిలుస్తున్నారు. క్యూ రోబోట్ బాస్కెట్‌బాల్ ఆడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లు క్యూ రోబోట్‌ను బాస్కెట్‌బాల్ ఆటలో ప్రఖ్యాతిగాంచిన ఫిలడెల్ఫియా గార్డ్ బెన్ సిమన్స్‌తో పోల్చారు. అంతేకాకుండా టోక్యోఒలింపిక్స్‌లో క్రీడాకారులే కాదు..! రోబోట్లు కూడా మెడల్స్ సాధిస్తాయని ట్విటర్లో పేర్కొంటున్నారు. క్యూ ఎలా పనిచేస్తుందంటే..! క్యూ రోబోట్‌ను టయోటా ఇంజనీర్లు ప్రత్యేక సెన్సార్లను ఏర్పాటుచేశారు. ఈ సెన్సార్ల సహాయంతో గోల్ పోస్ట్‌కు, క్యూ రోబోట్‌కు మధ్య ఉన్న దూరాన్ని అనలైజ్ చేసి గోల్స్‌ను సాధిస్తుంది. క్యూ మరింత సులువుగా కోర్టులో తిరగడం కోసం దాని పాదాలకు చక్రాలను అమర్చారు. టయోటా శాస్త్రవేత్తలు క్యూ రోబోట్ తొలి వెర్షన్‌ను 2017లో తయారుచేశారు. -
వారికి ఇల్లే ఆట స్థలం: ఒలింపిక్స్ బరిలో 24 క్రీడా కుటుంబాలు
తమ కుటుంబం నుంచి ఎవరైనా ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తే... పతకాలు సాధిస్తే ఆ ఫ్యామిలీ ఆనందం అంతా ఇంతా కాదు. నాలుగేళ్లకోసారి జరిగే విశ్వ క్రీడల్లో తోబుట్టువులు దేశం తరఫున బరిలోకి దిగడం, పతకాలు నెగ్గడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ పలు క్రీడాంశాల్లో అక్కా చెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు, కవలలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో మొదలయ్యే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 24 కుటుంబాల సభ్యులు ఆయా క్రీడాంశాల్లో సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. –సాక్షి క్రీడా విభాగం గోల్డ్‌పై గోల్ఫ్ ‘సిస్టర్స్’ గురి... అమెరికాకు చెందిన నెల్లీ, జెస్సికా కోర్డా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల గోల్ఫ్ విభాగంలో పోటీ పడనున్నారు. నెల్లీ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉండగా... జెస్సికా 13వ ర్యాంక్‌లో ఉంది. వీరికి గొప్ప క్రీడా నేపథ్యమే ఉంది. నెల్లీ, జెస్సికా తల్లిదండ్రులు పీటర్ కోర్డా, రెజీనా రజ్రతోవా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్లు. పీటర్ కోర్డా 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 1996 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ సాధించాడు. రెజీనా 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించింది. నాలుగుగ్రాండ్స్లామ్ టోర్నీలలోనూ పాల్గొంది. నెల్లీ, జెస్సికా సోదరుడు సెబాస్టియన్ కోర్డా కూడా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. అయితే అతను టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయాడు. కొన్నేళ్లుగా ప్రొఫెషనల్ గోల్ఫ్‌లో పలు టైటిల్స్ సాధించిన నెల్లీ, జెస్సికా పాల్గొంటున్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకాలతో తిరిగి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. గోల్ఫ్లోనే కాకుండా అమెరికా నుంచి ‘సిస్టర్స్’ మెకంజీ–అరియా (వాటర్ పోలో), క్రిస్టీ–సామ్ మెవిస్ (మహిళల ఫుట్‌బాల్), కెల్లీ–కోట్నీ హర్లీ (ఫెన్సింగ్)... ‘బ్రదర్స్’ కవిక–ఎరిక్ షోజీ (వాలీబాల్), హెన్రీ–జాక్సన్ లెవెరెట్ (షూటింగ్) టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో కెల్లీ–కోట్నీ, కవిక–ఎరిక్ జోడీలు గతంలో ఒలింపిక్స్‌లో పతకాలు కూడా సాధించాయి. హర్డిల్స్‌లో అక్కాచెల్లెళ్లు... బ్రిటన్‌కు చెందిన అథ్లెటిక్స్ ‘సిస్టర్స్’ టిఫానీ పోర్టర్–సిండీ సెంబర్ వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సెంబర్ నాలుగో స్థానంలో, టిఫానీ ఏడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది టిఫానీ 12.51 సెకన్ల అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయగా... సిండీ 12.53 సెకన్లతో సోదరికి సమీపంలో ఉంది. ఇక బ్రిటన్ నుంచే ‘సిస్టర్స్’ జెన్నిఫర్–జెస్సికా (జిమ్నాస్టిక్స్), జోడీ–హానా విలియమ్స్ (అథ్లెటిక్స్), మథిల్డా–చార్లోటి హాడ్జ్కిన్స్ (రోయింగ్), ‘బ్రదర్స్’ మాక్స్–జో లిచ్‌ఫీల్డ్ (స్విమ్మింగ్–బ్రిటన్), ‘ట్విన్ బ్రదర్స్’ ఆడమ్–సిమోన్ యేట్స్ (సైక్లింగ్), ప్యాట్–ల్యూక్ మెకార్మక్ (బాక్సింగ్–బ్రిటన్), అన్నా, చెల్లెలు హ్యారీ–హనా మార్టిన్ (హాకీ), ఎమిలీ–టామ్ ఫోర్డ్ (రోయింగ్) బరిలో ఉన్నారు. బాస్కెట్‌బాల్ బ్రదర్స్... అమెరికా, బ్రిటన్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా క్రీడా కుటుంబాలు టోక్యోకు వస్తున్నాయి. పురుషుల బాస్కెట్‌బాల్‌లో స్పెయిన్‌కు చెందిన సోదర ద్వయం పావ్, మార్క్ గసోల్ నాలుగోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది. పావ్, మార్క్ సభ్యులుగా ఉన్న స్పెయిన్ జట్టు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాలు సాధించగా... 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ‘స్విమ్మింగ్ సిస్టర్స్’ కేట్ క్యాంప్‌బెల్, బోంటి క్యాంప్‌బెల్ మరోసారి స్వర్ణమే లక్ష్యంగా పోటీపడనున్నారు. కేట్కిది నాలుగో ఒలింపిక్స్‌కాగా... ఆమె సోదరి బోంటికి రెండో ఒలింపిక్స్. 2016 రియో ఒలింపిక్స్‌లో కేట్, బోంటిలతో కూడిన ఆస్ట్రేలియా జట్టు 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. వీరే కాకుండా ఆఫ్రికాలోని కేప్ఫ వెర్డె దేశం నుంచి స్విమ్మింగ్‌లో అన్నా, చెల్లెళ్లు లాట్రోయ, ట్రాయ్, జేలా పినా... స్విమ్మింగ్‌లో ‘సిస్టర్స్’ బోంటి, కేట్ క్యాంప్‌బెల్ (ఆస్ట్రేలియా), సింక్రనైజ్డ్ స్విమ్మింగ్‌లో అన్నా మరియా, ఎరిని అలెగ్జాండ్రి (ఆస్ట్రియా)... లౌరా–చార్లోటి ట్రెంబల్ (ఫ్రాన్స్)... సెయిలింగ్‌లో ‘బ్రదర్స్’ సిమ్–మిహోవిల్ ఫెంటెలా (క్రొయేషియా)... ఎటెస్–డెనిజ్ సినార్ (టర్కీ), జిమ్నాస్టిక్స్‌లో ‘ట్విన్ సిస్టర్స్’ సేన్–లీకీ వెవెర్స్ (నెదర్లాండ్స్), ట్రయాథ్లాన్లో అన్నా, చెల్లెలు ట్రెంట్ థోర్ప్, ఐన్స్లే (న్యూజిలాండ్) కూడా బరిలోనిలిచారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాస్కెట్ బాల్ ఆడి ఆశ్చర్యపరిచిన ప్రగ్యా సింగ్ ఠాకూర్
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ బాస్కెట్ బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సాధారణంగా ఎక్కడ కు వెళ్లినా వీల్ చైర్లో కూర్చుని ఉంటారు. గురువారం భోపాల్‌లోని సాకేత్ నగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఠాకూర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడకి దగ్గరలో కొంతమంది ఆటగాళ్ళు బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లను చూసి ఆమె అక్కడికి వెళ్లి వాళ్లతో ఆడాలని నిశ్చయించుకుంది. దీంతో బాస్కెట్ బాల్ తీసుకుని కొంతసేపు డ్రిబ్లింగ్ చేసి విజయవంతంగా నెట్లోకి విసిరారు. ప్రగ్యా సింగ్ బాస్కెట్‌బాల్ ఆడుతున్న వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పంచుకుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా మాట్లాడుతూ.. ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ ను వీల్‌చైర్‌లోనే నేను ఇప్పటివరకు చూశాను, కానీ ఈ రోజు స్టేడియంలో బాస్కెట్‌బాల్ ఆడుతూ చూడటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై ప్రగ్యా సింగ్ సోదరి స్పందిస్తూ ఆమె శారీరక విద్య (సిపిఇడి), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బిపిఇడి) లో సర్టిఫికేట్ కోర్సు చేశారని..జైలుకు వెళ్లేముందు ఆమె ఆరోగ్యంగా చక్కగా ఉందని, అక్కడ ఆమెను హింసించారని ఆమె ఆవేదన చెందింది. ప్రగ్యా సింగ్ ఠాకూర్ 2008 మాలెగావ్ పేలుడు కేసులో నిందితరాలు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జనవరి లో ఆమెకు ఎన్ఐఏ కోర్టు కేసు నుంచి మినహాయింపు ఇచ్చింది. -
పట్టువదలని చిన్నది..
న్యూఢిల్లీ: ఒక చిన్నారి తన తండ్రి ప్రోత్సహించడంతో బరువులు ఎత్తే వీడియో ట్వీటర్లో వైరల్ అయ్యింది. నెటిజన్లకు ఇంటర్నెట్ అనేది ఎప్పుడూ చిరునవ్వును నింపే హృదయపూర్వక వీడియోల నిధి. అలాంటి ఒక క్లిప్.. తండ్రి, కుమార్తె మధ్య జరిగిన సన్నివేశాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. వైరల్ క్లిప్ ఏమిటి? ఈ వైరల్ వీడియోను అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విటర్లో షేర్ చేశాడు. "ఈ నాన్న, అతడి కుమార్తె ఈ రోజు నాకు అవసరమైన స్ఫూర్తిని ఇచ్చారన్న’’ సందేశంతో అనే శీర్షికతో రెక్స్ క్లిప్‌ను షేర్ చేశాడు. క్లిప్‌లో ఒక చిన్న అమ్మాయి జిమ్‌లో బరువులు ఎత్తడానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడు చిన్నారి తండ్రి అక్కడి వచ్చి తన కుమార్తెను ప్రోత్సహించడం, ఆమెకు సూచనలు ఇవ్వడం కూడా వినవచ్చు. కొన్ని సెకన్ల తరువాత, అమ్మాయి బరువులు కొద్దిగా ఎత్తడానికి ప్రయత్నిస్తుంది, కానీ పూర్తిగా కాదు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ చిన్నారి చివరకు పెద్ద జంప్ తీసుకొని బార్‌ను పైకి ఎత్తుతుంది. తర్వాత ఉత్సాహంగా తన తండ్రిని ఆలింగనం చేసుకుని ముద్దు పెడుతుంది. ఈ క్లిప్ 2.6 మిలియన్లకు పైగా నెటిజన్లు చూసి ఆనందించారు. -
వైరల్ : ఒబామా అదరగొట్టాడు!
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుతం దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా ఉన్నారు. వీలైనంత ఎక్కువ సమయం డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తరుపున ప్రచారంలో గడుపుతున్నారు. శనివారం నాటి ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లోని ఓ స్కూల్‌కు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా బాస్కెట్ బాల్ ఆటలో తన ప్రతిభను బయటపెట్టారు. అక్కడి జిమ్‌లోని బాస్కెట్ బాల్ కోర్టులోకి అడుగుపెట్టి బాల్‌ను నెట్లో పడేలా వేశారు. ( కొంపముంచిన ట్రంప్.. 700 మంది మృతి ) ఆ వెంటనే ‘నాకు ఇంతే వచ్చు!’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ సంపాదించింది. దీనిపై స్పందిస్తున్న ప్రముఖులు, సామాన్యులు ఒబామా ప్రతిభను మెచ్చుకున్నారు. -
లేకర్స్ అదరహో...
ఫ్లోరిడా: విఖ్యాత ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ లీగ్ ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) టైటిల్‌ను లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టు దక్కించుకుంది. ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో లేకర్స్ జట్టు 4–2తో మయామి హీట్ జట్టును ఓడించింది. తద్వారా ఈ టైటిల్‌ను 17వసారి సాధించింది. బోస్టన్ సెల్టిక్స్ పేరిట ఉన్న అత్యధిక ఎన్బీఏ టైటిల్స్ (17) రికార్డును సమం చేసింది. ఆరో ఫైనల్లో లేకర్స్ 106–93 పాయింట్ల తేడాతో మయామి హీట్ జట్టును ఓడించింది. మరో ఫైనల్ మిగిలి ఉండగానే టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. లేకర్స్ స్టార్ ప్లేయర్ లేబ్రాన్ జేమ్స్ 28 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దివంగత కోబీ బ్రయాంట్ సభ్యుడిగా 2010లో చివరిసారిగా ఎన్బీఏ విజేతగా నిలిచిన లేకర్స్... పదేళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా నిలిచింది. -
ఈ బాస్కెట్‌బాల్ రన్నింగ్ చూసి తీరాల్సిందే
బాస్కెట్‌బాల్‌తో ఆడడం అందరికి రాదు. మంచి శారీరక శ్రమతో కూడుకున్న ఈ గేమ్‌ను అత్యంత నైపుణ్యంతో ఆడితేనే బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించగలము. అలాంటిది దుబాయ్‌కు చెందిన అజ్మత్ ఖాన్ అనే అథ్లెట్ బాస్కెట్‌బాల్‌ను డ్రిబ్లింగ్ చేస్తూ రోడ్డుపై వేగంగా పరిగెత్తాడు. కేవలం 6 నిమిషాల 1 సెకన్లపాటు ఆడి ఈ ఘనత సాధించాడు. పరిగెత్తుతూ బంతిని డ్రిబ్లింగ్ చేయడం అంత సులభం కాదు. దీనికి ఎంతో ట్రైనింగ్ అవసరం. అలాంటిది రోడ్డు మీద పరిగెడుతూ ఆడటం అనేది గొప్ప విషయం. అందుకే అజ్మత్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. (చదవండి : లవర్ కోసం తనను తాను అమ్మకానికి) ఖాన్ ఇలాంటి ఘనత సాధించడం మొదటిసారి కాదు. 2019 మార్చిలో 44 నిమిషాల 19 సెకండ్ల సమయంతో 10 కి.మీ. పరుగును వేగంగా పూర్తి చేసి రికార్డును సొంతం చేసుకున్నారు. రికార్డు లిస్టింగ్ యుఎఇ పేజీ అథ్లెట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా అజ్మత్ఖాన్తోపాటు ఒక టైమ్ కీపర్ కూడా పరిగెత్తాడు. .ఈ రికార్డులను సాధించడానికి తాను ఎంతగానో కృషి చేస్తానని ఖాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram * تعرفوا على عزمت خان من الباكستان الذي نجح بكسر الرقم القياسي لأسرع وقت لقطع ميل أثناء تنطيط كرة السلة خلال 6 دقائق وثانية. تمت المحاولة الناجحة في إمارة دبي في الإمارات العربية المتحدة خلال شهر يونيو من هذا العام. ليس من الجديد على عزمت كسر الأرقام القياسية فهو أيضاً يحمل الرقم القياسي لأسرع وقت لقطع 10 كم أثناء تنطيط كرة السلة حيث قام بإكمال المسافة خلال 44 دقيقة خلال 16 ثانية في شهر مارس من العام الماضي في إمارة دبي أيضاً. 🌟 @azmat_athlete Meet Azmat Khan from Pakistan who recently broke the record for the fastest mile dribbling a basketball in 6 minutes and one second in Dubai, UAE. Azmat is not new to record breaking achievements. He managed last year to break the record for the fastest 10 km dribbling a basketball in 44 minutes and 19 seconds. _______________________ #GUINNESSWORLDRECORDS #GWR #OFFICIALLYAMAZING #run #running #runner #fitness #runners #instarunners #training #sport #motivation #workout #fit #غينيس_للأرقام_القياسية #أرقام_قياسية #رياضة #تمارين A post shared by Guinness World Records Arabia (@gwrarabia) on Sep 28, 2020 at 4:57am PDT -
వేలంలో ఆ బూట్లకు రూ.4.6 కోట్లు
న్యూయార్క్: బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న బూట్లు వేలంలో రికార్డు ధర పలికాయి. 1985లో ఇటలీ వేదికగా జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో జోర్డాన్ వేసుకున్న ‘ఎయిర్ జోర్డాన్ వన్ హైస్ స్నీకర్స్’ షూస్‌కు 6 లక్షల 15 వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 4.60 కోట్లు) లభించాయి. దాంతో గత మేలో ఇవే రకానికి చెందిన జోర్డాన్ బూట్లకు పలికిన 5 లక్షల 60 వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 4.20 కోట్లు) ఆల్టై మ్ రికార్డును బద్దలు కొట్టినట్లు వేలం నిర్వహించిన క్రిస్టీ సంస్థ వెల్లడించింది. అయితే ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించడానికి ఇష్టపడలేదు. నేషనల్ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) టోర్నీలో మకుటం లేని మహారాజుగా నిలిచిన మైకేల్ జోర్డాన్... తనకే సాధ్యమైన ప్రత్యేక ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చికాగో బుల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన జోర్డాన్... తన జట్టు జెర్సీ కలర్ అయిన నలుపు, ఎరుపు రంగులతో కూడిన బూట్లను వాడేవాడు. -
‘అద్భుతం.. ఇంతవరకు చూడలేదు’
సాక్షి, న్యూఢిల్లీ: అద్బుతమైన దృశ్యం.. ఇటువంటి అరుదైన ప్రతిభ ముందెన్నడు చూసి ఉండరు. సాధారణంగా చేతితో వేసే పెయింటిగ్స్, స్కెచ్ బొమ్మలు, శాండ్ ఆర్ట్‌లను, రోడ్డపై కలర్స్‌తో వేసే బొమ్మలను చూస్తూనే ఉంటాం. కానీ ఎండలో నీటీతో వేసిన ఆర్ట్‌లను చూశారా.. అయితే అది అసాధ్యమే అయినప్పటికీ ఈ అరుదైన అద్భుతాన్ని ఇద్దరూ యువకులు సుసాధ్యం చేసి చూపించారు. రోడ్డుపై నీటీతో వేసిన.. బాస్కెట్ బాల్ కోర్టులో వ్యక్తి ఆడుతున్నట్లుగా చూపించిన వినూత్నమైన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఇది చూసిన నెటిజన్లు సదరు యువకులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 22 సెకన్ల నిడివి గల ఈ వీడియోను మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాంప్మాన్ షేర్ చేశాడు. Dopest video I’ve ever seen. Ever. Basketball rocks... pic.twitter.com/spoYDXnfwS — Rex Chapman🏇🏼 (@RexChapman) August 12, 2020 దీనికి ‘ఇంతవరకు నేను ఇలాంటి వీడియోను చూడలేదు. నిజంగా ఇది అసాధారణమైన అద్భుతం. బాస్కెట్ బాల్ రాక్స్’ అంటూ రాక్స్ ట్వీట్ చేశాడు. ఈ అరుదైన ఈ వీడియోకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ‘ఇది చాలా అద్బుతంగా ఉంది’, ‘‘నిజంగా ఇలాంటి వీడియో ఇంతకు ముందెన్నడు చూడలేదు... మనుషుల్లో కూడా నమ్మలేని రితీలో ప్రతిభ ఉంటుందని ఇది చూస్తే అర్థం అవుతోంది’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్లో ఒక యువకుడు రోడ్డుపై పుడుకుని ఉండగా మరో వ్యక్తి అతడి చూట్టూ వాటర్ స్ప్రేతో లేఅవుట్ గీశాడు. అలా నీటీ తేమతో బాస్కెట్ బాల్ కోర్టులో వ్యక్తి బాస్కెట్ బాల్ ఆడుతూ.. బాల్‌ను గోల్ చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే ఇది చేయడానికి ఆ యువకులు 5 రోజుల సమయం పట్టిందని, దీని 95 డిగ్రీ వాతావరణంలో చేసినట్లు వీడియోలో పేర్కొన్నారు. -
ఈ వీడియో చూస్తే ఏడుపొస్తుంది!
బాస్కెట్ బాల్ ఆడే ప్రతి ఒక్కరికి తెలుసు బాస్కెట్లో బాల్ వేయాలంటే ఎంత కష్టమో. టీవీలో చూస్తున్నప్పుడు బాస్కెట్లో బాల్ వేయడమే కదా ఎంత తేలికో వేసేయొచ్చు దాంట్లో ఏముంది అనుకుంటాం. కానీ గ్రౌండ్లోకి దిగి బాల్ పట్టుకుంటేనే అర్థం అవుతుంది బాల్ వేయడం ఎంత కష్టమో! అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవాళ్లే అలా ఫీల్ అవుతుంటే కంటిచూపు లేని ఓ వ్యక్తి బాల్ వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అది కూడా మొదటి ప్రయత్నంలోనే! (వైరల్: కుక్కపిల్లను కొత్త పెళ్లికూతురిలా..) ఫాదర్స్ డే సందర్భంగా ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కళ్లు కనబడని ఓ వ్యక్తి తొలిప్రయత్నంలోనే బాస్కట్‌లో బాల్ వేశాడు. అప్పుడు తన కుటుంబం రియాక్షన్ ఇంకా ఈ వీడియోని అద్భుతంగా మారే లా చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి వీడియోని చూస్తే నాకు ఏడుపొస్తుంది అని ఒకరు కామెంట్ చేయగా, ఇది పోస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తోంది అని మరో నెటిజన్ ప్రశంసించారు. (హృదయ విదారకం : స్నేహితుడికి గుర్తుగా) This family’s reaction to their blind Uncle hitting a free throw on his first try — is the Twitter content I’m here for. Happy Father’s Day.🌎❤️🏀pic.twitter.com/QSYC60YYXG — Rex Chapman🏇🏼 (@RexChapman) June 21, 2020 -
ఈ కర్కశంపై మాట్లాడరేంటి?
చార్లొట్ (అమెరికా): అమెరికాలో ఓ నల్లజాతీయుడిని శ్వేతజాతి పోలీస్ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ గళం విప్పాడు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిపై పడగవిప్పిన జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ నల్లజాతి రేసర్ అయిన హామిల్టన్ స్పందిస్తూ ఈ దురాగతంపై స్పందించరా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఈ కర్కశ హత్యపై నా క్రీడ నుంచి ఎవరు మాట్లాడరేంటి. బహుశా శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడ కాబట్టే పెదవి విప్పడం లేదనుకుంటా’ అని సోషల్ మీడియాలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ఫార్ములావన్ క్రీడాలోకం స్పందించడం మొదలుపెట్టింది. వర్ణ వివక్ష హత్యపై నిరసించింది. రేసర్లతో పాటు మిగతా క్రీడలకు చెందిన స్టార్లు కూడా జరిగిన ఘోరంపై స్పందించారు. జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాల్సిందేనని సోషల్ మీడియా వేదికపై నినదించారు. బాధగా ఉంది... కోపమొస్తోంది: జోర్డాన్ ఆఫ్రికన్–అమెరికన్‌ను శ్వేతజాతి పోలీసు కర్కశంగా చంపడం తనను చాలా బాధించిందని అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ అన్నాడు. ‘ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నా... చాలా బాధగా ఉంది. అలాగే కోపంగా కూడా ఉంది. జాతి వివక్ష హత్యపై అందరూ కదం తొక్కుతున్నారు. తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా జాత్యహంకారం తొలగిపోవాలి. హింస సద్దుమణగాలి’ అని ఎన్బీఏ సూపర్‌స్టార్ జోర్డాన్ అన్నాడు. -
సోదరి కళ్లల్లో సంతోషం చూసేందుకు..
-
వేలంలో ‘బ్లాక్ మాంబా’ టవల్‌కు భారీ ధర
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది జనవరిలో అమెరికా బాస్కెట్‌బాల్ చాంపియన్ ప్లేయర్ కోబీ బ్రయాంట్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ ప్రమాదంలో ఈ అమెరికన్ సూపర్‌స్టార్ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బ్రయాంట్‌తో పాటు అతని కూతురు 13 ఏళ్ల కుమార్తె జియానా కూడా మరణించింది. అయితే బ్లాక్ మాంబాగా పిలుచుకునే బ్రయాంట్ తరచు తన భుజాలపై వేసుకుని టవల్‌ను వేలంలో పెట్టగా దానికి భారీ ధర పలికింది. బ్రయాంట్ మ్యాచ్ గెలిచిన సందర్భాల్లో ఎక్కువగా భుజాలపై వేసుకుని టవల్‌ను తాజాగా ఆన్లైన్ వేలంలో పెట్టారు. (క్షమాపణ చెప్పిన బీబీసీ) ఇది చివరకు ఒక అభిమాని చేతుల్లోకి వెళ్లింది. ఆ టవల్‌ను 33 వేల డాలర్లు(రూ. సుమారు రూ. 24 లక్షలు) వెచ్చించి వూల్ఫ్ అనే ఒక అభిమాని కొనుగోలు చేశాడు. కాగా, 2016 ఏప్రిల్ 13వ తేదీన లేకర్స్ గేమ్‌కు ఉపయోగించిన రెండు టికెట్లను కూడా బ్రయాంట్ టవల్‌ను కొనుగోలు చేసిన అభిమాని అందుకున్నాడు. ఆనాటి మ్యాచ్‌లో బ్రయాంట్ 60 పాయింట్లు సాధించాడు. ఉతాహ్ జాజ్‌తో జరిగిన మ్యాచ్‌లో లేకర్స్ 101 పాయింట్లు సాధించింది. అందులో బ్రయాంట్ ఒక్కడే 60 పాయింట్లను నమోదు చేయడం విశేషం. అయితే తన వద్ద లేకర్స్ జట్టుకు చెందిన చాలా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నట్లు తెలిపాడు. వీటి కోసం దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అందులో పెడతానన్నాడు. అదే తన చిరకాల కోరిక అని వూల్ఫ్ తెలిపాడు. (కోబీ మరణం నన్ను మార్చివేసింది: కోహ్లి) -
తెలంగాణ నుంచి ముగ్గురు బాస్కెట్ బాల్ ప్లేయర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ముగ్గురు యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారులకు మంచి అవకాశం లభించింది. రాష్ట్రానికి చెందిన కె. గౌతమ్, కార్తీక్ చద్దా, జి. ప్రతీక్ జాతీయ బాస్కెట్‌బాల్ కోచింగ్ క్యాంపునకు ఎంపికయ్యారు. బెంగళూరులోని జయప్రకాశ్ నారాయణ్ జాతీయ యూత్ సెంటర్ బాస్కెట్‌బాల్ అకాడమీలో ఈనెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు జాతీయ బాస్కెట్‌బాల్ క్యాంపు జరుగుతుంది. ఏప్రిల్ 5 నుంచి 12 వరకు జరుగనున్న ‘ఫిబా’ అండర్–16 ఆసియా పురుషుల చాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా ఈ జాతీయ క్యాంపును నిర్వహిస్తున్నారు. -
కనుమరుగైన ‘బ్లాక్ మాంబా’
మాటలింకా పూర్తిగా రాకుండానే, ఇంకా బుడి బుడి అడుగులతో తడబడుతుండగానే తనకు తోచినవిధంగా బాస్కెట్ బాల్ ఆటాడుతూ అందరినీ అలరించిన ఒక బుడతడు ఇకపై నిరంతరం ఆ బాస్కెట్ బాల్ క్రీడనే శ్వాసిస్తాడని, భవిష్యత్తులోఆ రంగాన్నే శాసిస్తాడని, దిగ్గజంగా వెలుగు లీనుతాడని ఎవరూ ఊహించలేరు. తన ఆటతో మైదానంలోని ప్రేక్షకులను మాత్రమే కాదు... సకల రంగ దిగ్గజాలను సైతం అబ్బురపరిచిన కోబీ బ్రయంట్ నాలుగు పదుల వయసులోనే సోమవారం ఒక హెలికాప్టర్ ప్రమాదంలో తనువు చాలించిన తీరు అందరినీ విషాదంలో ముంచింది. తనెంతో ఇష్టపడే తన కుమార్తె పదమూడేళ్ల జియానాకూ, ఆమె సహచర క్రీడాకారులకూ బాస్కెట్ బాల్లో శిక్షణనిచ్చి, వారి ఆటను స్వయంగా చూడటానికి ఆ టీంతో కలిసి హెలికాప్టర్లో వెడుతూ వారంద రితోపాటు కోబీ దుర్మరణం పాలయ్యాడు. కోబీ లాంటి క్రీడాకారులు అరుదుగా ఉద్భవిస్తారు. ఏ రంగంపైన అయినా ఇష్టం పెంచుకోవడం అందులో ప్రవేశించడానికి ఏదోమేరకు తోడ్పడవచ్చు. కానీ ఆ రంగంలో కొనసాగాలన్నా, దూసుకుపోవాలన్నా, శిఖరాగ్ర స్థాయిలో నిలవాలన్నా నిరంత రమైన కఠోర సాధన అవసరం. అన్నిటికీ మించి క్రమశిక్షణ ముఖ్యం. నాన్న జెల్లీ బీన్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కావడంతో కోబీని ఆ రంగం చిరుప్రాయంనాడే ఆకర్షించింది. ఆయన దగ్గర నేర్చు కున్న మెలకువలు పాఠశాల జట్టులో ప్రవేశించడానికి ఎంతోకొంత ఉపయోగపడివుండొచ్చు. కానీ హైస్కూల్ జట్టు నుంచి పదిహేడేళ్ల చిరుప్రాయంలో నేరుగా ప్రతిష్టాత్మకమైన జాతీయ బాస్కెట్ బాల్ అసోసియేషన్(ఎన్బీఏ)కు 1996లో ఎంపిక కావడం మాత్రం పూర్తిగా కోబీ ప్రదర్శించిన ప్రతిభా పాటవాల పర్యవసానమే. బాస్కెట్ బాల్ రంగంలోకి తుపానులా వచ్చిపడిననాడే ఆ ఆటలో అంతక్రితం మైకేల్ జోర్డాన్, విల్ట్ చాంబర్లిన్లు నెలకొల్పిన అద్భుతమైన రికార్డుల్ని అధిగమించాలని... కరీం అబ్దుల్ జబ్బార్ కన్నా ఎక్కువ పాయింట్లు సాధించాలని... బిల్ రసెల్‌కి మించిన టైటిళ్లు సొంతం చేసుకోవాలని కోబీ నిర్ణయించుకున్నాడు. కానీ ఒంటినిండా అయిన గాయాల కారణంగా మైకేల్ జోర్డాన్ సాధిం చిన ఆరు టైటిళ్ల స్థాయికి ఈవలే ఉండిపోక తప్పలేదు. ఆ సంగతలావుంచి కోబీ బ్రయాంట్ ఆ ఆటనొక తపస్సుగా భావించి, రోజుకు ఏకబిగిన ఎనిమిది గంటలు అందులోనే మునిగితేలాడు. మెలకువలన్నీ నేర్చుకున్నాడు. వాటికి తన సునిశిత నైపుణ్యాన్ని జోడించాడు. కనుకనే ఒకసారి బంతి చేతికి చిక్కిందంటే దాన్ని ప్రత్యర్థి పక్షంలో ఎవరికీ అందనీయకుండా, మెరుపు వేగంతో ముందుకు దూసుకుపోవడం, బాస్కెట్లో అలవోకగా దాన్ని జారవిడవడం కోబీకి మాత్రమే సాధ్యమయ్యేది. చూసేవారందరినీ మంత్రముగ్ధుల్ని చేసేది. చుట్టుముట్టినవారెవరికీ అందకుండా పాదరసంలా జారి పోయే కోబీ బ్రయాంట్ తీరు ఎవరికీ అంతుచిక్కేది కాదు. రెండు దశాబ్దాలపాటు తన క్రీడా పాటవంతో అందరినీ అలరించాక, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాక 2016లో అతను రిటైరైన ప్పుడు కోబీ ఖాతాలో అయిదు ఎన్బీఏ టైటిళ్లు, రెండు ఒలింపిక్ స్వర్ణాలు, 33,643 పాయింట్లు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో 81 పాయింట్లు సాధించి టాప్ ఫైవ్‌లో ఒకడిగా నిలిచాడు. తన కెరీర్లో అయిదుసార్లు 60 పాయింట్లకంటే ఎక్కువ సాధించిన చరిత్ర కూడా కోబీదే. 2016లో ఆడిన ఆఖరా టలో సైతం ఆ లక్ష్యాన్ని అందుకోవడం అతని విశిష్టత. కోబీ ఆట అందరినీ కట్టిపడేయడానికి, విస్మ యపరచడానికి ప్రత్యేక కారణముంది. ఆటలోకి దిగాక కేవలం పాయింట్లు సాధించడానికి మాత్రమే కోబీ పరిమితం కాడు. ఆట ఆరంభంలోనే దాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకుంటాడు. ఆద్యం తమూ అది తనచుట్టూ తిరిగేలా చేసుకుంటాడు. అతనిలోని ఈ లక్షణమే ప్రపంచవ్యాప్తంగా లక్షలా దిమందిని ఆకర్షించింది. వ్యక్తిగా కూడా కోబీ కొన్ని విలువలకు కట్టుబడినవాడు. అందుకే హైస్కూల్ నుంచి వచ్చినప్పుడు తనకు అవకాశమిచ్చిన లేకర్స్ జట్టుతోనే రిటైరయ్యేవరకూ నిలిచి, ఆడిన ప్రతిసారీ తన సర్వశక్తులూ దానిపైనే కేంద్రీకరించాడు. వేరే సంస్థలు లేకర్స్‌ను మించి ఇస్తామని ఆశపెట్టినా లొంగలేదు. కనుకనే కోబీతోపాటే ఆయన వాడిన 8, 24 నంబర్ల జెర్సీలకు లేకర్స్ రిటైర్మెంట్ ఇచ్చేసింది. తన ప్రతిభను దాచుకోవడం, దాన్ని సొమ్ము చేసుకోవాలని చూడటం కోబీకి పొసగనివి. అందుకే సహచర పురుష, మహిళ క్రీడాకారుల ఆటను గమనించడం, అందులోని లోటు పాట్లేమిటో వారికి తెలియజేసి, వారు ఎదగడానికి దోహదపడటం ఆయన ప్రత్యేకత. అందుకే కోబీ సీనియర్లు, సహచర క్రీడాకారులు, అతని అనంతరకాలంలో ఆ రంగంలోకొచ్చినవారు అతన్ని ప్రేమగా స్మరించుకున్నారు. ఇది కోబీ వ్యక్తిత్వాన్ని పట్టిచూపే అంశం. కోబీ జీవితంలో ఎత్తుపల్లాలు లేవని కాదు. ఆటాడే క్రమంలో అయిన గాయాలు ఆయన్ను ఇబ్బందిపెట్టాయి. ఎన్నోసార్లు మోకాళ్ల వద్ద, చీలమండ దగ్గర గాయాలై ఆట విడుపు తప్పలేదు. తన ప్రాణసమానమైన ఆటకు వీడ్కోలు పలికే వేళ దాన్నుద్దేశించి ‘డియర్ బాస్కెట్ బాల్’ అంటూ కోబీ రాసిన కవిత అతనిలోని క్రీడాకారుడు పుట్టి పెరిగి దిగ్గజంగా రూపొందిన వైనాన్ని వివరిస్తుంది. దాని ఆధారంగా మరో ఇద్దరితో కలిసి తాను నిర్మించిన యానిమేషన్ చిత్రానికి 2018లో ఆస్కార్ అవార్డు లభించింది. ఈ స్వల్ప నిడివి చిత్రం కోబీలోని భిన్న కోణాన్ని ఆవిష్కరించింది. అమెరికా బాస్కెట్‌బాల్‌లో ఈమధ్య మెరుగైన ఆటగాళ్ల జాడ కనబడటం లేదని చాలామందిలో బెంగ పట్టు కుంది. ఒకప్పుడు న్యూయార్క్, లాస్ఏంజెలెస్, షికాగో, ఫిలడెల్ఫియా తదితరచోట్ల వీక్షకుల్ని ఉర్రూ తలూగించి కట్టిపడేసిన క్రీడాకారులు ఇప్పుడు ఎక్కడా కానరావడం లేదన్న చింత అందరిలోవుంది. ఇలాంటి తరుణంలో బాస్కెట్‌బాల్‌ను తన జీవితంలో భాగంగా కాదు... దాన్నే జీవితంగా భావించి చివరివరకూ తన సర్వస్వాన్నీ అందుకోసమే ధారపోసిన ‘బ్లాక్ మాంబా’ కోబీ వంటి దిగ్గజం కను మరుగు కావడం విచారకరం. ఆ లోటును పూడ్చడం ఎవరికీ సాధ్యం కాదు. -
దిగ్గజం విషాదాంతం
చాంపియన్ ప్లేయర్... ఒలింపిక్స్ గోల్డెన్ స్టార్... ఆస్కార్ అవార్డ్ విన్నర్... బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్ జీవన ప్రయాణం విషాదాంతమైంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఈ అమెరికన్ సూపర్‌స్టార్ దుర్మరణం పాలయ్యాడు. అతనితో పాటు 13 ఏళ్ల కుమార్తె జియానా కూడా మరణించడం అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. క్రీడాలోకాన్ని కన్నీట ముంచిన ఈ పిడుగులాంటి వార్తపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్ఏంజిల్స్: అమెరికాను... ఎన్బీఏనే కాదు... యావత్ క్రీడా ప్రపంచాన్నే దుఃఖ సాగరంలో ముంచేసే వార్త ఇది. 41 ఏళ్ల బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. పైలట్, బ్రయాంట్ సహా 9 మందితో లాస్ ఏంజిల్స్ నుంచి బయలుదేరిన సికోర్‌స్కై ఎస్–76 హెలికాప్టర్ కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ కొండను ఢీకొట్టింది. వెంటనే అది పేలడంతో ప్రయాణిస్తున్న వారంతా దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో బ్రయాంట్ టీనేజ్ కుమార్తె 13 ఏళ్ల జియానా కూడా ఉంది. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో తన కూతురు జియానా బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి కోబీ హెలికాప్టర్లో బయలుదేరాడు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మారుమూల కొండప్రాంతంలో పెను ప్రమాదానికి గురైంది. ఈ విషాదవార్త అమెరికాను శోకసంద్రంలో ముంచేసింది. అక్కడి ఆకాశహర్మ్యాలు బ్రయాంట్ జెర్సీ రంగు లైట్లతో సంతాపసూచకంగా వెలిగాయి. కోబీ బ్రయాంట్ మ్యాచ్‌లు ఆడే సమయంలో 8 లేదంటే 24 నంబర్లతో కూడిన పర్పుల్, గోల్డ్, వైట్ కలర్ జెర్సీలను ధరించేవాడు. ఎత్తయిన టవర్స్ ఈ రంగు లైట్లతో నివాళి ప్రకటించగా... చాలా మంది అమెరికన్లు, బాస్కెట్‌బాల్ అభిమానులు వీధుల్లో గుమిగూడి పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. ఓ దిగ్గజం విషాదాంతంపై అందరూ శోకతప్త హృదయంతో స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) దాకా... క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అందరూ బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రయాంట్ మరణాన్ని జీర్ణించుకోలేక బరువెక్కిన గుండెలతో సంతాపం ప్రకటించారు. ఎవరీ బ్రయాంట్... ఏమిటీ ఫాలోయింగ్ క్రికెట్ కిక్‌లోనే ఉండే మనకు బ్రయాంట్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఎన్బీఏ వైపు ఏ కాస్తో కూస్తో కన్నేసిన వారందరికీ బ్రయాంట్ సుపరిచితుడు. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) పోటీలను అమెరికాలో ఇష్టపడని వారుండరు. అందరూ మనసు పడే ఆ ఆటలో రెండు దశాబ్దాల పాటు (1996–2016) తన మెరుపు విన్యాసంతో ఆకట్టుకున్నాడు బ్రయాంట్. కోర్టులో అతని పాదరసంలాంటి కదలికలు గమనించినా... బాస్కెట్లో అలవోకగా బంతిని పడేయడం చూసినా... ఎవరికైనా అనిపించేదొక్కటే... ఈ ఆజానుబాహుడు బాస్కెట్‌బాల్ కోసమే పుట్టాడా అని! నిజమే ప్రతిష్టాత్మక ఎన్బీఏలో ఆ దిగ్గజ స్టార్ ప్రదర్శన అలా ఉంటుంది మరి! అన్నట్లు అతనేమీ పైచదువులు చదవనేలేదు. పాఠశాల విద్యతోనే పుస్తకాలతో కుస్తీ ముగిసింది. కానీ బాస్కెట్‌బాల్‌తో దోస్తీ మొదలయ్యాక పైపైకి... ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. స్కూల్ చదువు ముగిసిన వెంటనే 1996లో ఎన్బీఏలో చేరాడు. కూతురు జియానాతో... 8, 24 జెర్సీల విలాపం అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో 1978, ఆగస్టు 23న జన్మించిన బ్రయాంట్ హైస్కూల్ చదువు ముగియగానే 18 ఏళ్ల వయసులో నేరుగా ఎన్బీఏలో చేరాడు. అలా 1996లో ‘లాస్ఏంజిల్స్ లేకర్స్’ జట్టుకు ఆడటం మొదలుపెట్టిన ఈ ‘బ్లాక్ మాంబా’ (కోబీ ముద్దుపేరు) ఆఖరిదాకా ఆ ఫ్రాంచైజీని వీడలేదు. ఎవరెన్ని మిలియన్ డాలర్లతో ఆఫర్లు ఇచ్చినా... లేకర్స్ తరఫునే తన కెరీర్ ఆసాంతం ఆడటం విశేషం. కోబీ ‘షూటింగ్ గార్డ్’ స్థానంలో 8 లేదంటే 24వ జెర్సీ నంబర్లతో బరిలోకి దిగేవాడు. తన విజయవంతమైన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘన తలు, రికార్డులు సాధించాక 2016లో గుడ్‌బై చెప్పాడు. ►సుదీర్ఘ కెరీర్లో కోబీ 33,643 పాయింట్లు చేయడం విశేషం. ఎన్బీఏలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లలో టాప్–5 (నాలుగో)లో నిలిచాడు. ఒక్క మ్యాచ్‌లోనే 81 పాయింట్లు సాధించిన రికార్డు బ్రయాంట్ది. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తుండే ఈ ఆజానుబాహుడు కోర్టులో బంతినందుకుంటే మాత్రం స్కోర్ చేయకుండా ఉండడు. ఎన్బీఏలో తన లేకర్స్ జట్టును ఐదుసార్లు (2000, 2001, 2002, 2009, 2010) చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. 2008లో ‘అత్యంత విలువైన ఆటగాడు’గా అవార్డు అందుకున్న బ్రయాంట్ 18 సార్లు ఎన్బీఏ ఆల్‌స్టార్స్ జట్టు సభ్యుడిగా ఎంపికయ్యాడు. 2000 నుంచి 2016 వరకు వరుసగా 17 సార్లు ఈ ఘనతకెక్కాడు. ►తన దేశం ‘టీమ్ అమెరికా’కు 2007 నుంచి 2012 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలోనే బీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్ల్లో అమెరికా జట్టు బంగారు పతకం గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంతటి ఘనచరిత్రను లిఖించుకున్న బ్రయాంట్‌కు గౌరవసూచకంగా లాస్ఏంజిల్స్ లేకర్స్ జట్టు 8, 24 నంబర్ జెర్సీలకు 2017లో రిటైర్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ రెండు జెర్సీలకు ప్రాణముంటే గనక తమ ప్రియమైన ఆటగాడి మరణాన్ని జీర్ణించుకోలేక విలపించేవేమో! ►కోబీ బ్రయాంట్ది ప్రేమ వివాహం. 2001లో డ్యాన్సర్ వానెస్సా లైన్‌ను కోబీ వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు ఆడ పిల్లలు. నటాలియా (17 ఏళ్లు), జియానా (13 ఏళ్లు), బియాంకా (3 ఏళ్లు), క్యాప్రి (7 నెలలు). హెలికాప్టర్ ప్రమాదంలో రెండో అమ్మాయి జియానా మృతి చెందింది. ►2016లో బాస్కెట్‌బాల్‌కు వీడ్కోలు పలికాక కోబీ బ్రయాంట్ పలు వ్యాపారాలు మొదలుపెట్టాడు. 2018లో ‘డియర్ బాస్కెట్‌బాల్’ పేరుతో కోబీ బ్రయాంట్ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు కూడా లభించడం విశేషం. కోబీ గ్రేటెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్. అతనితో పాటు టీనేజ్ కుమార్తె మృతి చెందారనే భయంకరమైన వార్త నన్ను విషాదంలో ముంచింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, తన కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ప్రార్థిస్తున్నా. –అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాస్కెట్‌బాల్ కోర్టులో బ్రయాంట్ ఓ లెజెండ్. ప్రమాదంలో అతని కూతురు కూడా మరణించడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. –అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా బ్రయాంట్ నాకు సోదరుడితో సమానం. అలాంటివాడు ఇలా ఆకస్మికంగా మృతిచెందాడనే వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. –బాస్కెట్‌బాల్ లెజెండ్ జోర్డాన్ నేను లేకర్స్‌కు వీరాభిమానిని. బ్రయాంట్ వల్లే ఎన్బీఏలో లేకర్స్ చారిత్రక విజయాలెన్నో సాధించింది. శారీరకంగా, మానసికంగా ఎంతో బలమైన ఆటగాడు కోబీ. అలాంటి ప్లేయర్ ఇలా మనకు ఆకస్మికంగా దూరమవడం బాధాకరం. –విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్ కోబీ, అతని కుమార్తె జియానా మరణించారనే విషాద వార్త నన్ను తీవ్రంగా బాధించింది. అతని కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. –సచిన్ నేను ఉదయాన్నే లేచి ఎన్నోసార్లు కోబీ బ్రయాంట్ మ్యాచ్‌లను చూశాను. అతని మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఆ ప్రమాదంలో అతని కుమార్తె కూడా మృతి చెందడంతో నా గుండె పగిలింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. దేవుడు వారి కుటుంబానికి ధైర్యమివ్వాలి. –విరాట్ కోహ్లి బ్రయాంట్ నా ఫేవరెట్. కుమార్తెతో సహా అతను మరణించాడనే వార్తతో నేను షాక్‌కు గురయ్యాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. –తెలంగాణ మంత్రి కేటీఆర్ -
బ్రియాంట్ చివరి ట్వీట్ ఇదే..
కాలిఫోర్నియా: అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్ చరిత్రలో టాప్ స్కోరర్లలో ఒకడిగా ఉన్న కోబ్ బ్రియాంట్ హెలికాప్టర్ ప్రమాదంలో అకాలమరణం చెందడం ప్రతీ ఒక్కర్నీ తీవ్రంగా కలచివేసింది. 2008, 2012 ఒలింపిక్స్ల్లో అమెరికాకు స్వర్ణ పతకాలు సాధించడంలో బ్రియాంట్‌ది కీలకపాత్ర. 2016లో బాస్కెట్‌బాల్ నుంచి వీడ్కోలు తీసుకున్న బ్రియాంట్.. అమెరికా నేషనల్ బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) ప్రొఫెషనల్ లీగ్‌లో తన కెరీర్ మొత్తం లాస్ ఏంజెల్స్ లేకర్స్ కే ఆడాడు. (ఇక్కడ చదవండి: ఆ వార్త వినడం దురదృష్టకరం: కోహ్లి) ఈ లీగ్‌లో అత్యధిక స్కోర్ చేసిన జాబితాలో బ్రియాంట్ మూడో స్థానంలో ఉండగా అతన్ని తాజాగా లీబ్రాన్ జేమ్స్ అధిగమించాడు. దీనిపై జేమ్స్‌కు బ్రియాంట్ అభినందలు తెలియజేస్తూ.. ‘నన్ను అధిగమించిన నా బ్రదర్‌కు ఇవే నా విషెస్. గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళతావని ఆశిస్తున్నా కింగ్ జేమ్స్’ అని ట్వీట్ చేశాడు. ఇదే అతని చివరి ట్వీట్ అయ్యింది. మృతిచెందడానికి కొన్ని గంటల ముందు జేమ్స్‌ను కొనియాడుతూ బ్రియాంట్ చేసిన ట్వీట్ ఇది. (ఇక్కడ చదవండి: బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ దుర్మరణం) Continuing to move the game forward @KingJames. Much respect my brother 💪🏾 #33644 — Kobe Bryant (@kobebryant) January 26, 2020 -
బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రియాంట్ మృతి
-
చలనమే..సంచలనమై!
అడుగులు కదపలేని స్థితి నుంచి ఆయన గురించి గర్వంగా అడిగి తెలుసుకునే స్థాయికి ఎదిగారాయన. కాళ్లలో చలనం లేని స్థితి నుంచి సంచలనం సృష్టించేంత ఎత్తులో నిలబడ్డారాయన. చంద్రబోస్ ఒక పాటలో చెప్పినట్టు పిడికిలి బిగించి చేతిరాత మార్చుకున్నారు. చెమట్లు చిందించి నుదుటి గీత రాసుకున్నారు. అంతులేని పట్టుదలతో ఆదర్శప్రాయంగా మారారు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదనే వాక్యానికి రుజువుగా నిలిచారు. ఇచ్ఛాపురంలో పుట్టి తెలంగాణకు ఆటలో ప్రాతినిథ్యం వహించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన తులసయ్య గురించి సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ : ఇచ్ఛాపురం మండలం కుగ్రామం తులసిగాం గ్రామానికి చెందిన పండూరు జోగయ్య, దాలమ్మ దంపతులకు నాల్గో సంతానంగా జన్మించిన తులసయ్య 18 నెలల వరకు అందరి పిల్లల్లానే ఉండేవాడు. తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. విధి వక్రీకరించింది. జ్వరం బారిన పడిన తులసయ్యకు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అసలే బీద కుటుంబం, ఆపై కొడుక్కి పెద్ద కష్టం రావడంతో వేలాది రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదు. తులసయ్య ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్వగ్రామంలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ధర్మపురం ఉన్నత పాఠశాలలో చదివాడు. పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి తొలి విజయాన్ని అందుకున్నారు. తోటి స్నేహితులు, అన్నదమ్ముల సాయంతో ఇచ్ఛాపురం జ్ఙానభారతిలో ఇంటర్, శ్రీకాకుళంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత విద్య చదవాలన్న కోరిక ఉన్నప్పటికీ తనవారి గురించి ఆలోచించి హైదరాబాద్‌లో ఓ చానెల్లో వెబ్ రిపోర్టర్‌గా చేరాడు. అనుకోని అవకాశం.. పాఠశాలలో తోటి స్నేహితులతో క్రీడలపై ఆసక్తిని కనబర్చే తులసయ్యకు అనుకోని అవకాశం ముంగిట చేరింది. ఓ రోజు తులసయ్య ఆఫీసుకు వెళ్తుండగా అదే దారిలో చంద్రశేఖర్ అనే దివ్యాంగుడు పరిచయమయ్యాడు. తాను వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఆటగాడినని, ఆసక్తి ఉంటే తనతో రమ్మంటూ ఆహ్వానం పలికాడు. ఆటలపై మక్కువ ఉన్న తులసయ్య తన సత్తాను నిరూపించుకునేందుకు ఇదే మంచి అవకాశంగా భావించాడు. తెలంగాణా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పద్మతో పాటు కోచ్ సొహయిల్ ఖాన్లు తులసయ్యలో ఉన్న ప్రతిభను గుర్తించారు. సుమారు నెలన్నర రోజుల పాటు శిక్షణ పొందిన తులసయ్య అనతి కాలంలోనే వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు చెన్నై ఈరోడ్‌లో జరిగిన 5వ జాతీయ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జూన్ 24 నుండి 29 వరకు చంఢీఘర్ రాష్ట్రం మొహాలీలో జరిగిన 6వ జాతీయ వీల్ చైర్ బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్లో పాల్గొని మళ్లీ నాల్గో స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తులసయ్య ఉత్తమ క్రీడాకారునిగా ఎంపికై బహుమతులు కైవసం చేసుకున్నాడు. మొక్కవోని దీక్షతో కష్టబడితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నాడు తులసయ్య. ప్రభుత్వం ప్రోత్సహిస్తే... నాకు ఆటలంటే చాలా ఇష్టం. క్రికెట్, అథ్లెటిక్స్ కూడా ఆడుతాను. కానీ నాకు అంత ఖరీదైన వీల్‌చైర్ లేదు. ఈ ఏడాది డిసెంబర్లో దివ్యాంగులకు రంజీ క్రికెట్ పోటీలు ఉన్నాయి. అందులో ఆడి సత్తా నిరూపించుకోవాలని ఉంది. ప్రభుత్వం నన్ను ప్రోత్సహిస్తే మరిన్ని క్రీడల్లో రాణించాలని ఉంది. ప్రస్తుతం నేను తెలంగాణ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాను. అవకాశం వస్తే శ్రీకాకుళం జిల్లాలో నా పేరును చిరస్థాయిగా నిలుపుకోవాలని ఉంది. – పి.తులసయ్య, వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు -
ఫ్యూచర్ కిడ్స్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: జీఎం సంపత్ కుమార్ స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టు డబుల్ ధమాకా మోగించింది. బాలబాలికల విభాగాల్లో టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. సికింద్రాబాద్ వైఎంసీఏలో ముగిసిన ఈ టోర్నమెంట్లో బాలుర ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 69–66తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. ఫ్యూచర్ కిడ్స్ తరఫున అఖిల్ (15 పాయింట్లు), సుభాష్ (14 పాయింట్లు), అద్యన్ (14 పాయింట్లు) రాణించారు. చిరెక్ జట్టు తరఫున కొఠారి (24 పాయింట్లు), ధ్రువ్ (12 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బాలికల విభాగం ఫైనల్లో ఫ్యూచర్స్ కిడ్స్ జట్టు 54–51తో శ్రీనిధి స్కూల్ జట్టును ఓడించింది. ప్యూచర్ కిడ్స్ తరపున శ్రేయ (18 పాయింట్లు), అదితి (20 పాయింట్లు), బృంద (8 పాయింట్లు) మెరిపించారు. శ్రీనిధి జట్టు తరఫున మేఘన (16 పాయింట్లు), సి. మేఘన (12 పాయింట్లు) ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన బాలుర సెమీఫైనల్స్‌లో ఫ్యూచర్ కిడ్స్ 78–56తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై, చిరెక్ స్కూల్ 78–69తో లిటిల్ ఫ్లవర్ (ఉప్పల్) జట్టుపై గెలిచాయి. బాలికల సెమీఫైనల్స్‌లో ప్యూచర్ కిడ్స్ 42–28తో రెక్వాల్‌ఫోర్డ్ స్కూల్‌పై, శ్రీనిధి 38–34తో ఫ్యూచర్ కిడ్స్ ‘బి’ జట్టుపై విజయం సాధించాయి. విజేత జట్లకు జాతీయ మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ రామచంద్ర ట్రోఫీలను అందజేశారు. -
తెలంగాణ జట్లకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లకు నిరాశ ఎదురైంది. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలబాలికల విభాగంలో తెలంగాణ జట్లకు తొలి ఓటమి ఎదురైంది. దీంతో లెవల్–1 స్థాయిలో తెలంగాణ పోరాటం ముగిసింది. ఇక తెలంగాణ జట్లు లెవల్–2 స్థాయిలో వర్గీకరణ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. శనివారం మొదట జరిగిన బాలుర మ్యాచ్‌లో తెలంగాణ 60–106తో చండీగఢ్ జట్టు చేతిలో చిత్తుగా ఓటమి పాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన చండీగఢ్ జట్టు తొలి 3 నిమిషాల్లోనే వరుసగా 10 పాయింట్లు సాధించి తెలంగాణ జట్టుపై ఒత్తిడి పెంచింది. శౌర్య, గౌతమ్ రాణించడంతో తెలంగాణ ఆధిక్యాన్ని 6–10కి తగ్గించింది. ఈ స్థాయిలో మాత్రమే తెలంగాణ పోటీతత్వాన్ని కనబరిచింది. తర్వాత వారి జోరు ముందు మనవాళ్లు తేలిపోయారు. తొలి రెండు క్వార్టర్స్‌లో వారి హవానే కొనసాగింది. దీంతో తొలి అర్ధభాగం 48–30తో ముగిసింది. మూడో క్వార్టర్లో చండీగఢ్ ప్లేయర్లు హర్మన్దీప్ (27 పాయింట్లు), అభిషేక్ (18 పాయింట్లు) మరింత చెలరేగి ఆడారు. ఇదే జోరు చివరి వరకు కొనసాగించారు. ప్రత్యర్థి జట్టులో హర్మన్, అభిషేక్‌తో పాటు సన్నీ (20), అక్షయ్ (12) ఆకట్టుకున్నారు. తెలంగాణ జట్టులో కార్తీక్ (15), గౌతమ్ (10), ఆంథోని (9), సౌరవ్ (9) రాణించారు. మరోవైపు బాలికల కేటగిరీలో చండీగఢ్ 68–66తో తెలంగాణను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆధిక్యం ఇరువురి చేతులు మారుతూ వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా తలపడటంతో తొలి అర్ధబాగంలో చండీగఢ్ 29–27తో స్పల్ప ఆధిక్యంలో నిలిచింది. అనంతరం తెలంగాణ ప్లేయర్లు గట్టి పోటీనిచ్చినా... చివర్లో ఒత్తిడికి తేలిపోయి ఓటమి పాలయ్యారు. తెలంగాణ జట్టులో సిద్ధిక (26) పట్టుదలగా ఆడింది. హర్షిత (13), ఓజస్వి (7), రియా (7), యశస్విని (5), శ్రేయ (5) రాణించారు. చండీగఢ్ జట్టులో నిహారిక (35) విజృంభించింది. రియా 13 పాయింట్లతో ఆకట్టుకుంది. -
తెలంగాణ జట్లకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు జోరు కనబరుస్తున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో జరుగుతోన్న ఈ అండర్–16 టోర్నమెంట్లో వరుసగా రెండో విజయాన్ని సాధించాయి. శుక్రవారం జరిగిన బాలుర మ్యాచ్‌లో తెలంగాణ 74–53తో పశ్చిమబెంగాల్‌పై గెలుపొందింది. ఆట ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన తెలంగాణ జట్టు సమష్టిగా రాణించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి 40–23తో పటిష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. చివరివరకు అదే ఆధిపత్యాన్ని కొనసాగించి గెలుపును అందుకుంది. విజేత జట్టు తరఫున కార్తీక్ 15 పాయింట్లతో చెలరేగగా... గౌతమ్ (13 పాయింట్లు), సౌరవ్ (12 పాయింట్లు), ఆంథోని (11 పాయింట్లు), సూర్య (10 పాయింట్లు) అతనికి చక్కని సహకారం అందించారు. పశ్చిమ బెంగాల్ తరఫున మొహమ్మద్ ఇబ్రహీం 27 పాయింట్లతో పట్టుదలగా ఆడాడు. మరోవైపు బాలికల పోరులో తెలంగాణ 56–42తో అస్సాం జట్టును ఓడించింది. హోరాహోరీగా మ్యాచ్ సాగడంతో తొలి క్వార్టర్స్ 15–14 స్కోరుతో ముగిసింది. రెండో క్వార్టర్లో దూకుడు పెంచిన తెలంగాణ 30–21తో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తదుపరి రెండు క్వార్టర్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి హర్షిత చెలరేగడంతో జట్టు విజయాన్ని అందుకుంది. హర్షిత 23 పాయింట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. సిద్ధిక (6), ఓజస్వి (6), యశస్విని (6) రాణించారు. అస్సాం తరఫున షింజిని (12), ధరిత్రి (12), ఎస్.కర్మాకర్ (10) పోరాడారు. -
బాస్కెట్ బాల్లో భేష్
పశ్చిమగోదావరి , పెనుమంట్ర: క్రీడా కర్మాగారంగా పేరుగాంచిన పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం నుంచి మరో యువ క్రీడాకారిణి జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. గతంలో ఎందరో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన మార్టేరు ప్రఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తూ పతకాలు పంట పండిస్తోంది అక్కాబత్తుల సూర్య కమల కుమారి. బాస్కెట్‌బాల్ ఆటలో సత్తా చాటుతోంది. హైస్కూల్ విద్య నుంచి ప్రారంభమైన ఆ యువతి ప్రతిభా ప్రస్థానం జాతీయ స్థాయికేగింది. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తూ.. జిల్లా, రాష్ట్ర స్థాయి పలు పోటీల్లో విశేష ప్రతిభ చూపిన కమల కొనేళ్లుగా జాతీయ స్థాయిలోనూ దూసుకుపోతోంది. 2013లో పంజాబ్ గ్వాలియర్‌లో జరిగిన అండర్ 14 విభాగం, 2014లో హైదరాబాద్‌లో నిర్వహించిన మినీ నేషనల్స్, 2016లో హైదరాబాద్ (గచ్చిబౌలీ)లో జరిగిన యూత్ నేషనల్స్, 2017లో జరిగిన ఢిల్లీలో జరిగిన అండర్ 17 విభాగంలో జరిగిన పోటీల్లో రాష్ట్ర జట్టులో కమల పాల్గొంది. ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్ (చిత్తూరు)లో జరుగుతోన్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడల్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె చిత్తురులో ఉంది. ఎస్సై అవుతా.. మార్టేరు వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేసిన కమల ప్రస్తుతం పెనుగొండలోని ప్రఖ్యాత ఎస్వీకేపీ అండ్ పితాని వెంకన్న జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఇంటర్, ఆపై డిగ్రీ పూర్తి చేసి ఎస్సై కావాలన్నదే లక్ష్యమని కమల తన మనోభావాన్ని తెలియజేసింది. వ్యవసాయ కుటుంబం మార్టేరుకు చెందిన వ్యవసాయ కుటుంబీకులు అక్కాబత్తుల నాగేశ్వరరావు, విజయకుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. నాలుగో సంతానం కమల. వైబీఏ సహకారం మరువలేనిది.. మార్టేరులోని క్రీడాభిమానులు, ప్రోత్సాహకులు సంఘటితమై ఏర్పాటు చేసిన యూత్ బాస్కెట్‌బాల్ అసోషియేషన్ (వైబీఏ) మా లాంటి పేద క్రీడాకారులకు ఎంతో అండగా నిలుస్తోంది. నాకు తొలి నుంచి అన్నివిధాల తోడ్పాటు ఇవ్వడంతో పోటీల్లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చాను. నిత్యం గ్రౌండ్లో పీఈటీ కృష్ణారెడ్డి, నగేష్ సార్లు నేర్పిస్తున్న క్రీడా మెళకువలు నాకెరీర్‌కు ఎంతో తోడ్పాటునిస్తున్నాయి.– అక్కాబత్తుల సూర్యకమల కుమారి, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి, మార్టేరు -
క్వార్టర్స్‌లో చిరెక్ స్కూల్ జట్లు
సాక్షి, హైదరాబాద్: రెవరెండ్ ఫ్రాన్సిస్ దేవసియా బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో చిరెక్ బాలబాలికల జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెయింట్ ఫ్యాట్రిక్స్ స్కూల్ వేదికగా శుక్రవారం జరిగిన బాలుర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 39–19తో డాన్బాస్కోపై గెలుపొందింది. చిరెక్ తరఫున అర్జున్ 17 పాయింట్లతో సత్తా చాటాడు. శౌర్య (12) ఆకట్టుకున్నాడు. డాన్‌బాస్కో జట్టులో యేసు 12 పాయింట్లు సాధించాడు. బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 28–14తో సెయింట్ ఆంథోనీస్ బాలికల హైస్కూల్‌ను చిత్తుగా ఓడించింది. విజేత జట్టులో శ్రీయ (8), అనుష్క (4) రాణించారు. ఇతర బాలుర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఆతిథ్య సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ (రేహాన్ 12, జేమ్స్8) 28–12తో సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ (లోహిత్ 8)పై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (రోహన్ 13, రాఘవ్ 6) 30–29తో సెయింట్ పాల్స్ హైస్కూల్ (ఆంథోని 17)పై, ఫ్యూచర్‌కిడ్స్ (ఆద్యన్ 12, అనిశ్ 12) 39–18తో ఆల్‌సెయింట్స్ (వర్మ 8)పై, ఓక్రిడ్జ్ (రిషి 13, ఫరీద్ 7) 40–33తో ఎంజీఎం హైస్కూల్ (శ్రవణ్ 13, ఖాదిర్ 8)పై, సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ (బనియెల్ 23, శశాంక్ 6) 37–16తో జాన్సన్ గ్రామర్ స్కూల్ (హర్షిత్ 8, కపిల్ 6)పై, జాన్సన్ గ్రామర్ ఐసీఎస్ఈ (విష్ణు 8, సూర్య 8) 29–20తో గంగాస్వ్యాలీ (రితీష్ 11, కౌన్షిక్ 7)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు ఓక్రిడ్జ్ న్యూటన్ (మేఘన 22) 24–20తో డాన్‌బాస్కో (సారా 17)పై, సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ (యశస్విని 4, రాగమయి 4) 19–6తో ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌పై, ఓక్రిడ్జ్ (స్వాతి 12) 20–9తో భారతీయ విద్యాభవన్ (స్నిగ్ధ 7)పై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (హర్షిత 17, కీర్తన 6) 35–13తో సెయింట్పాయ్స్ హైస్కూల్ (శ్రావ్య 4, తేజశ్రీ 4)పై, గీతాంజలి దేవ్‌శాల (తన్విత 8, జోషిక 6) 16–11తో గంగాస్ వ్యాలీ (సిధిక 7)పై గెలుపొందాయి. -
ఓవరాల్ చాంప్ సెయింట్ జోసెఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్‌కోఠి జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన ఈ టోర్నీలో సీనియర్స్ బాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. సీనియర్ బాలికల కేటగిరీలో మొత్తం 9 స్కూల్స్ పాల్గొనగా 38 పాయింట్లతో సెయింట్ జోసెఫ్ అగ్రస్థానంలో నిలిచింది. నాసర్ బాలికల స్కూల్ 25 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. సోమవారం జరిగిన సీనియర్ బాలికల 4–100మీ. రిలేలో సెయింట్ జోసెఫ్ జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. నాసర్ జట్టు రజతాన్ని గెలుచుకోగా, అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ కాంస్యాన్ని సాధించింది. మరోవైపు జూనియర్ బాలికల కేటగిరీలో విశాఖపట్నంకు చెందిన సెయింట్ జాన్స్ పరీశ్ స్కూల్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఇండియన్ బ్లోసమ్స్ స్కూల్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ రీజియన్ సంయుక్త కార్యదర్శి యు. సుందరి, కార్యదర్శి మారుతి ప్రసాద్ విజేతలకు బహుమతులు అందజేశారు. బాస్కెట్‌బాల్‌లోనూ టైటిల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లోనూ సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి జట్టు విజేతగా నిలిచింది. హబ్సిగూడ డివిజన్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి జట్టు 45–34తో ఫ్యూచర్కిడ్స్పై గెలుపొందింది. -
సెయింట్ జోసెఫ్ జట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా నిర్వహిస్తోన్న బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ జట్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వేదికగా శుక్రవారం ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సెయింట్ జోసెఫ్ జట్లు విజయం సాధించాయి. జూనియర్ బాలుర కేటగిరీ తొలి మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) 18–6తో సుజాత పబ్లిక్ స్కూల్‌పై గెలిచింది. రెండో మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట్) 24–12తో ఇండియన్ బ్లోసమ్స్పై, తర్వాతి మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట్) 27–14తో గీతాంజలి (బేగంపేట్) జట్లపైన విజయం సాధించాయి. సీనియర్ బాలుర విభాగంలో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) 29–3తో హెరిటేజ్ వ్యాలీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో హెచ్‌పీఎస్ (బేగంపేట్) 18–11తో సెయింట్ జార్జిస్ గ్రామర్ స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ 41–26తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై విజయం సాధించాయి. ఇతర జూనియర్ బాలుర మ్యాచ్‌ల్లో జాన్సన్ స్కూల్ 67–13తో ఫ్యూచర్ కిడ్స్ (రాజమండ్రి)పై, లయోలా పబ్లిక్ స్కూల్ (గుంటూరు) 19–4తో నాసర్ స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ 16–13తో ఇంటర్నేషనల్ స్కూల్ (షేక్‌పేట్)పై, లిటిల్ ఫ్లవర్ (గుంటూరు) 16–10తో ఎస్డీ నూజివీడుపై గెలుపొందాయి. -
క్వార్టర్స్‌లో ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ స్కూల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో పి. ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ 26–22తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) పై విజయం సాధించింది. ఓబుల్ రెడ్డి జట్టులో మోహన 10 పాయింట్లతో ఆకట్టుకుంది. సాత్విక (6), కస్తూరి (6) రాణించారు. డీపీఎస్ తరఫున హర్షిక, శ్రీహిత చెరో 8 పాయింట్లు స్కోర్ చేశారు. రెండో మ్యాచ్‌లో గీతాంజలి దేవ్‌శాల 14–12తో ఎన్ఏఎస్ఆర్ స్కూల్‌పై గెలుపొందింది. గీతాంజలి ప్లేయర్ రుచి 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇతర మ్యాచ్‌ల్లో సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ (వైష్ణవి 8, అమూల్య 6) 20– 18తో సెయింట్ ఆంథోనీస్ బాలికల హైస్కూల్ (జ్యోతిక 8, సుక్తారా 8)పై, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి (పూజ 12, శ్రేయ 12, ప్రియాంక 6) 33– 25తో డాన్‌బాస్కో (అమ్రీన్ 16, సారా 9)పై, ఫ్యూచర్ కిడ్స్ (అదితి 10, భావన 6, మధుర 4) 34– 17తో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి (పూజ 9, ఖుష్బూ 4)పై, సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ (నిధి 6) 24–9తో సెయింట్ ఆంథోని (వైష్ణవి 5, యుక్త 4)పై, గీతాంజలి దేవ్‌శాల (రుచి 14, జోషిక 10) 24– 5తో సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి (ముస్కాన్ 4)పై, చిరెక్ పబ్లిక్ స్కూల్ (ఆర్య 16, మేధ 8, అన్య 8) 38–14తో విల్లామేరీ జూనియర్ కాలేజిపై, శ్రీనిధి ఇంటర్నేషనల్ (నిత్య 14, జి. మేఘన 8, ఆర్. మేఘన 8) 34–12తో సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి (ముస్కాన్ 8)పై, చిరెక్ పబ్లిక్ స్కూల్ (ఆర్య 16) 22– 12తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (ఓజస్వి 6)పై విజయం సాధించాయి. -
సెయింట్ ఫ్రాన్సిస్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ వైఎంసీఏ ఓపెన్ 3–3 మహిళల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో సెయింట్ ఫ్రాన్సిస్ 18–14తో కేబీసీ జట్టుపై విజయం సాధించింది. విజేత జట్టు తరఫున అమిత డేనియల్ 12 పాయింట్లతో చెలరేగింది. కేబీసీ తరఫున రచన (8), మానస (6) ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో కేబీసీ 12–6తో ఫిబాపై, సెయింట్ ఫ్రాన్సిస్ 16–15తో సెయింట్ పాయ్స్పై గెలుపొందాయి. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సెయింట్ ఫ్రాన్సిస్ 17–14తో సెయింట్ ప్యాట్రిక్స్‌పై, ఫిబా 13–7తో రాకెట్స్‌పై, సెయింట్ పాయ్స్ 15–8తో లయోలా అకాడమీపై, కేబీఎస్ 17–14తో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్‌పై విజయం సాధించాయి. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం సంయుక్త కార్యదర్శి ఎస్. హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను, నగదు బహుమతిని అందజేశారు. విజేతగా నిలిచిన సెయింట్ ఫ్రాన్సిస్ జట్టుకు రూ. 3000, రన్నరప్ కేబీసీ జట్టుకు రూ. 2000 ప్రైజ్‌మనీగా లభించాయి. -
హాక్స్పై బుల్స్ గెలిచింది
సాక్షి, హైదరాబాద్: ఆల్‌స్టార్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బుల్స్ జట్టు సత్తా చాటింది. వైఎంసీఏ గ్రౌండ్లో బుధవారం జూనియర్ బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌లో 66–61 పాయింట్ల తేడాతో హాక్స్పై విజయం సాధించింది. బుల్స్ తరఫున విఘ్నేశ్ 33 పాయింట్లు, నితీశ్ 14 పాయింట్లు సాధించగా.. హాక్స్ జట్టు తరఫున రిత్విక్ 16 పాయింట్లు, అభినవ్ 10 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో లయన్స్‌పై 41–34 తేడాతో వోల్వ్స్ గెలుపొందింది. వోల్వ్స్ తరఫున అమన్ 17, సౌరవ్ 12 పాయింట్లు సాధించగా... లయన్స్ జట్టులో ఆయూష్ 10, మాజిద్ 8 పాయింట్లు చేశారు. -
బాస్కెట్‌బాల్ చాంప్ ఇన్కమ్ ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: మెరుగు జనార్దన్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ జట్టు చాంపియన్‌షిప్ సాధించింది. నిజామ్ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) ఆధ్వర్యంలో నిజామ్ కాలేజి గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన ఫైనల్లో ఇన్కమ్ ట్యాక్స్ 87–74 స్కోరుతో ఏఓసీ జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికే ఇన్కమ్ ట్యాక్స్ జట్టు 54–37 స్కోరుతో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఏఓసీ 81–72 స్కోరుతో కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్‌పై గెలుపొందగా, ఇన్కమ్ ట్యాక్స్ 72–66 స్కోరుతో ఆర్టిలరీ జట్టుపై నెగ్గింది. అనంతరం జరిగిన కాంస్య పతకపోరులో కస్టమ్స్ జట్టు 66–63తో ఆర్టిలరీ జట్టుపై విజయం సాధించింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఇందులో ఎన్బీఏ కార్యదర్శి మహ్మద్ యూనుస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్ కుమార్, గన్‌ఫౌండ్రీ, ఖైరతాబాద్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ టోర్నీ లో తెలంగాణ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలుర విభాగంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 59–10తో పుదుచ్చేరిని చిత్తుగా ఓడించింది. తెలంగాణ తరఫున వినయ్ కొఠారి, విఘ్నేశ్వర్ చెరో 11 పాయింట్లతో చెలరేగగా... సుమంత్ మరిన్ని 10 పాయింట్లు స్కోర్ చేశాడు. మరోవైపు బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు 35–14తో అస్సాంపై గెలుపొందింది. ఏపీ జట్టులో సత్యసాయి 21 పాయింట్లు సాధించి ఆకట్టుకుంది. బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు 73–16తో గోవాపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ జట్టులో వీఎన్ దుర్గా ప్రసాద్ (22), మణికంఠ (17), పవన్ కుమార్ (10) సత్తాచాటారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు బాలికలు: కేరళ 69–48తో ఉత్తరప్రదేశ్‌పై, హరియాణా 36–15తో గోవాపై, పశ్చిమ బెంగాల్ 61–50తో చండీగఢ్‌పై, ఉత్తరాఖండ్ 22–8తో జమ్మూ, కశ్మీర్‌పై, ఢిల్లీ 43–2తో బిహార్‌పై, ఒడిశా 39–21తో పుదుచ్చేరిపై గెలుపొందాయి. బాలురు: మహారాష్ట్ర 69–67తో తమిళనాడుపై, గుజరాత్ 62–37తో ఉత్తరాఖండ్‌పై, బిహార్ 57–34తో జార్ఖండ్‌పై విజయం సాధించాయి. -
డాన్‌బాస్కో జట్టుకు టైటిల్
అండర్–17 బాస్కెట్‌బాల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: షార్ప్ షూటర్స్ అండర్–17 వన్డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో డాన్‌బాస్కో జట్టు సత్తా చాటింది. సోమవారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో 27–22తో గ్లెండెల్ అకాడమీ ‘ఎ’ జట్టుపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేత జట్టు తరఫున ఆకాశ్ 11 పాయింట్లతో చెలరేగగా, నిఖిల్ 8 పాయింట్లతో అండగా నిలిచాడు. గ్లెండెల్ జట్టు తరఫున మోనిష్ 10 పాయింట్లతో ఆకట్టుకోగా, ఉమేర్ 8 పాయింట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో డాన్‌బాస్కో జట్టు 25–18తో ఫ్యూచర్స్ సనత్‌నగర్ జట్టుపై గెలుపొందగా, గ్లెండెల్ అకాడమీ ‘ఎ’ జట్టు 27–24తో షార్ప్ షూటర్స్ జట్టును ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీనియర్ ఎన్ఐఎస్ కోచ్ షంషుద్దీన్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఓబీ సీనియర్ ఆటగాడు హబీబ్ తదితరులు పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ బాలికల విజేత గుంటూరు
బాలుర విభాగంలో తూర్పు గోదావరి విజయం మూడో స్థానమూ దక్కించుకోలేకపోయిన ఆతిథ్య జట్లు అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి మూడవ జూనియర్స్ బాలికల బాస్కెట్‌బాల్ విజేతగా గుంటూరు జట్టు నిలిచింది. అనంతపురం ఇండోర్ స్టేడియంలో సోమవారం గుంటూరు, తూర్పు గోదావరి జట్లు ఫైనల్స్ ఆడాయి. మ్యాచ్ హోరాహోరీగా సాగింది. రెండవ సెషన్లో గుంటూరు జట్టు దూకుడుగా ఆడి విజేతగా నిలిచింది. గుంటూరు జట్టు స్కోరు 52 కాగా, తూర్పుగోదావరి జట్టు 38. గుంటూరు జట్టులో ఉమ 24, ఎస్తేరు 15 బాస్కెట్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మూడవ స్థానం కోసం అనంతపురం, కృష్ణ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆతిథ్య జట్టు గెలుస్తుందని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు భావించినప్పటికీ, చివర్లో కృష్ణ జట్టు క్రీడాకారులు దూకుడు ప్రదర్శించి 4 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. అనంత జట్టు స్కోరు 32కాగా, కృష్ణ జట్టు 36 పాయింట్లు సాధించింది. సెమీస్‌లో అనంతపురం, గుంటూరు జట్లు తలపడగా గుంటూరు జట్టు అనంతను ఓడించి ఫైనల్ చేరింది. మరో సెమీస్‌లో కృష్ణ, తూర్పుగోదావరి జట్లు తలపడగా కృష్ణ జట్టును ఓడించి తూర్పుగోదావరి జట్టు ఫైనల్‌కు చేరింది. - బాలుర విజేతగా తూర్పుగోదావరి జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి, విశాఖపట్టణం జట్లు తలపడ్డాయి. తూర్పుగోదావరి జట్టు 48 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. జట్టులో అహమ్మద్ 20 బాస్కెట్లు వేసి విజయంలో కీలకంగా మారాడు. విశాఖపట్టణం జట్టు 34 పాయింట్లతో రెండవ స్థానాన్ని నిలుపుకొంది. మూడవ స్థానం కోసం అనంతపురం, గుంటూరు జట్లు తలపడగా అనంత జట్టు గుంటూరు చేతిలో ఓటమిని చవిచూసింది. ముందుగా సెమీస్‌లో అనంతపురం, విశాఖపట్టణం జట్లు తలపడగా విశాఖ జట్టు అనంతను ఓడించి ఫైనల్‌కు చేరింది. మరో సెమీస్‌లో తూర్పుగోదావరి, గుంటూరు జట్లు తలపడగా తూర్పుగోదావరి జట్టు గుంటూరును ఓడించి ఫైనల్‌కు చేరింది. క్రీడలతో ఆరోగ్యం : డీఎస్పీ క్రీడలతో ఆరోగ్యం బాగుంటుందని డీఎస్పీ మల్లికార్జున వర్మ అన్నారు. సోమవారం రాత్రి రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన, లేడీస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అరుంధతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని వర్గాలవారు ఏదో క్రీడలో ప్రాతినిథ్యం వహించడం చాలా అవసరమన్నారు. మంచి క్రీడాకారులంతా మంచి స్థానాల్లో స్థిరపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు శ్రీకాంత్‌రెడ్డి, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నరేంద్ర చౌదరి, కోచ్‌లు జగన్నాథరెడ్డి, వెంకటేష్, నరేంద్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ స్కై గెలుపు
యూబీఏ బాస్కెట్‌బాల్ లీగ్ చెన్నై: యూబీఏ బాస్కెట్‌బాల్ లీగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్కై జట్టు గెలుపొందింది. చెన్నై స్లామ్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 83–79 తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టెవిన్ కెల్లీ 37 పాయింట్లు సాధించి హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించాడు. మహేశ్ పద్మనాభన్ 17 పాయింట్లు, జోగిందర్ సింగ్ 11 పాయింట్లతో రాణించారు. చెన్నై స్లామ్ జట్టులో రికిన్ 27 పాయింట్లతో పోరాడగా... రామ్ కుమార్ 21 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టెవిన్ కెల్లీకి ‘ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కగా... జోగిందర్ సింగ్‌కు ‘ నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. -
మాధవన్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో రాష్ట్రానికి చెందిన మాధవన్ సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మాధవన్ స్వర్ణ పతకంతో మెరిశాడు. జిమ్నాస్టిక్స్ అండర్–14 టేబుల్‌వాల్ట్ ఈవెంట్లో మాధవన్ 13.34 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఢిల్లీకి చెందిన వీర్ 13.20 పాయింట్లతో రెండోస్థానం దక్కించుకోగా... పంజాబ్‌కు చెందిన కృష్ణ (12.57 పాయింట్లు) మూడో స్థానాన్ని సాధించాడు. బాస్కెట్‌బాల్‌లో నిరాశ ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా జరుగుతోన్న బాస్కెట్‌బాల్ ఈవెంట్లో రాష్ట్ర జట్లకు నిరాశ ఎదురైంది. మూడో స్థానం కోసం బుధవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాష్ట్ర జట్లు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అండర్–14 బాలికల మ్యాచ్‌లో కర్ణాటక 47–38తో తెలంగాణను ఓడించగా... బాలుర విభాగంలో మధ్య ప్రదేశ్ 52– 38తో తెలంగాణపై గెలిచి కాంస్య పతకాలు సాధించాయి. టెన్నిస్‌లో 7 పతకాలు జాతీయస్థాయి టెన్నిస్ టోర్నమెంట్లో రాష్ట్ర క్రీడాకారులు ఆకట్టుకున్నారు. వ్యక్తిగత, డబుల్స్, టీమ్ విభాగాల్లో కలిసి మొత్తం 7 పతకాలను దక్కించుకున్నారు. అండర్–14 విభాగంలో బాలికల సింగిల్స్‌లో సాయిధన్వి రజతాన్ని, జనని కాంస్య పతకాన్ని సాధించగా... డబుల్స్ విభాగంలో ఎస్. సంజన– ఆశ్రిత జోడి స్వర్ణంతో మెరిసింది. టీమ్ విభాగంలో తెలంగాణ బాలికల జట్టు రజతాన్ని, బాలుర జట్టు కాంస్య పతకాలు గెలుచుకున్నాయి. అండర్–17 విభాగంలో బాలికల డబుల్స్ కేటగిరీలో ఎ. సంజన– ఆర్. సంజన ద్వయం కాంస్యాన్ని సాధించింది. బాలుర టీమ్ విభాగంలో తెలంగాణ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. -
ముగిసిన బాస్కెట్‌బాల్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లు
నేడే సెమీఫైనల్స్, ఫైనల్స్ రామచంద్రపురం : పట్టణంలో నిర్వహిస్తున్న ఐదో జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో లీగ్మ్యాచ్లు మంగళవారం ముగిశాయి. ఈ పోటీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న విషయం తెలిసిందే. పురుషుల ప్రిలిమినరీ పోటీల్లో గుడివాడపై మార్టేరు జట్టు, ఏపీ పోలీస్ జట్టుపై రామచంద్రపురం ఎ, ఆర్బీఐ రాజమండ్రిపై రాయుడు వారియర్స్ ఒడిశా, అట్లరీ బాయిస్ హైదరాబాద్‌పై ఈస్ట్‌కోస్టు విశాఖ, ఎన్టీఆర్ గుంటూరుపై సాయిరాజ నందిని ఛత్తీస్‌గఢ్, రామచంద్రపురం బి జట్టుపై అనంతపురం, అమలాపురంపై తెలంగాణ పోలీస్, జి మామిడాడ జట్టుపై ఏఓసీ హైదరాబాద్ జట్లు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. కాగా క్వార్టర్ ఫైనల్స్‌లో మార్టేరు జట్టు రామచంద్రపురం ఎ జట్టుతోను, రాయుడు వారియర్స్ ఒడిశా జట్టు ఈస్ట్‌కోస్టు విశాఖ, అనంతపురం జట్టు సాయిరాజ నందిని చత్తీస్‌గఢ్ జట్టుతోను, ఏఓసీ హైదరాబాద్ జట్టు తెలంగాణ పోలీస్ జట్టుతోను తలపడనున్నాయి. మహిళల విభాగంలో.. మహిళల విభాగంలో సీపీఏ రాజమండ్రిపై మార్టేరు ఎన్టీఆర్ గుంటూరు జట్టు, ఆర్బీఐ రాజమండ్రిపై మార్టేరు జట్లు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మొత్తం పురుషుల విభాగంలో 36 జట్లు, మహిళల విభాగంలో 10 జట్లు పాల్గొన్న ఈ పోటీలలో ఇప్పటి వరకూ 46 లీగ్ మ్యాచ్‌లను నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి క్వార్టర్ ఫైనల్స్‌తో పాటుగా సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లకు కూడా నిర్వహిస్తారు. బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు సి స్టాలిన్, గన్నమని చక్రవర్తి పాల్గొన్నారు. -
హోరాహోరీగా బాస్కెట్‌బాల్ టోర్నీ
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్–19 బాలుర, బాలికల 62వ బాస్కెట్‌బాల్ పోటీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజైన గురువారం నాటికి పోటీలు క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి. పూల్–ఏలో కృష్ణా, కడప, పూల్–బీలో గుంటూరు, పశ్చిమ గోదావరి, పూల్–సీలో చిత్తూరు, అనంతపురం, పూల్–డీలో తూర్పుగోదావరి, కర్నూల్ జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. కర్నూల్‌పై గుంటూరు, చిత్తూరుపై కడప, అనంతపురంపై కృష్ణా, తూర్పుగోదావరిపై పశ్చిమ గోదావరి జట్లు తలపడనున్నాయి. బాలికల విభాగంలో వైజాగ్‌పై చిత్తూరు 33–15, నెల్లూరుపై అనంతపురం 36–02, కృష్ణాపై తూర్పుగోదావరి 22–11, పశ్చిమగోదావరిపై కర్నూల్ 20–10, నెల్లూరుపై కర్నూల్ 17–8 పాయింట్లతో గెలుపొందాయి. తూర్పుగోదావరి–చిత్తూరు, విశాఖ–కృష్ణా, అనంతపురం–పశ్చిమ గోదావరి జట్లు తలపడనున్నాయి. ఎస్జీఎస్ ప్రతినిధి పి.సీతాపతి, ఎస్జీఎస్ అండర్–19 జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి పోటీలను పర్యవేక్షించారు. పీడీలు జంపన రఘురాం, గెడా శ్రీనివాస్ బాస్కెట్‌బాల్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్లకే టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్సగా బరిలోకి దిగిన హైదరాబాద్ మహిళల, పురుషుల జట్లు ఆ హోదాకు తగ్గట్లుగా రాణించాయి. ఈసారి కూడా విజేతలుగా నిలిచి టైటిల్స్‌ను కై వసం చేసుకున్నాయి. ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 85-63తో కరీంనగర్ జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున ఇర్ఫాన్ (25), శివ కుమార్ (16), సచిన్ (16) ఆకట్టుకున్నారు. కరీంనగర్ జట్టులో అరుణ్ తేజ (25), సాయి కుమార్ (20) పోరాడారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో రంగారెడ్డి జట్టు 70-53తో వరంగల్ జట్టుపై నెగ్గింది. మహిళల ఫైనల్లో హైదరాబాద్ జట్టు 32-18తో రంగారెడ్డి జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టులో స్నేహ (8), రమ్య (7) రాణించారు. రంగారెడ్డి జట్టు తరఫున తేజశ్రీ (8), రచన (6) ఆకట్టుకున్నారు. మెదక్ జట్టు 27-13తో కరీంనగర్ జట్టుపై గెలుపొంది మూడో స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక
రామచంద్రపురం : ఏపీ బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహించే అంతర జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి గన్నమని చక్రవర్తి తెలిపారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు క్రీడా మైదానంలో ఆదివారం క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. అసోసియేష¯ŒS రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ సి.స్టాలి¯ŒS ముఖ్యతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పట్టణ అసోసియేష¯ŒS కార్యవర్గ సభ్యులు పిల్లా వీరవెంకట సత్యనారాయణ, కనకాల వెంకటేశ్వరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పురుషుల జట్టు : జి.జగపతి, జి.జగదీష్, జి.గణేష్, వి.నవీ¯ŒS సాగర్, పి.దుర్గాప్రసాద్, డి.డేవిడ్‌రాజ్, ఎం.శివదుర్గాప్రసాద్ (రామచంద్రపురం), పి.సాయిబాబరాజు, ఎస్.కృష్ణారెడ్డి (అనపర్తి), ఎ¯ŒS.వీరన్న (పిఠాపురం), సంపత్(రాజమండ్రి), సతీష్ (కాకినాడ). మహిళల జట్టు : బి.రమాదేవి, బి.సాయిజ్యోతి, షేక్లహరున్నీశా(రామచంద్రపురం), సుస్మిత, సూర్యకళ, లావణ్య (కాకినాడ), శ్వేత, అనిత, స్రవంతి (పిఠాపురం), తేజశ్వని, నాగదుర్గ (అమలాపురం), పద్మ (రాజమండ్రి). 15 నుంచి పోటీలు పిఠాపురం టౌ¯ŒS : ఈ నెల 15 నుంచి 18 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరులో అంతర జిల్లాల సీనియర్స్ బాస్కెట్ బాల్ పోటీలు నిర్వ హించనున్నారని బాస్కెట్‌బాల్ సంఘం నేత డాక్టర్ సి.స్టాలిన్, కార్యనిర్వాహక కార్యదర్శి ఐ. భీమేష్ ఆదివారం తెలిపారు. పురుషుల, మహిళల జట్ల క్రీడాకారులను రామచంద్రపురంలో ఆదివారం ఎంపిక చేసినట్టు వారు చెప్పారు. -
అంతర్‌వర్సిటీ బాస్కెట్‌బాల్ విజేత ఏసీ కళాశాల
ఏఎన్‌యూ: యూనివర్సిటీ క్రీడా మైదానంలో రెండు రోజులపాటు జరిగిన అంతర్ కళాశాలల బాస్కెట్‌బాల్ పురుషుల పోటీలు గురువారంతో ముగిశాయి. ఫైనల్లో తలపడిన ఏసీ కళాశాల, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానాన్ని జేకేసీ కళాశాల జట్టు కైవసం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్ ము అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఏఎన్‌యూకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్, ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఇ.శ్రీనివాసరెడ్డి, యోగా కోర్సు కో-ఆర్డినేటర్ డి. సూర్యనారాయణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్సన్, తదితరులు పాల్గొన్నారు. సౌత్‌జోన్ పోటీలకు ఏఎన్‌యూ జట్టు ఎంపిక సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే ఏఎన్‌యూ జట్టును ఎంపిక చేశారు. ఎ.కిషోర్, ఎం.రత్నకుమార్, ఎ.ఆనందకుమార్, ఎస్.కె.మసూద్ (ఏసీ కళాశాల), వి.ఉదయ్, డి.సత్యనారాయణ, పి.శివప్రసాద్ (ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల), ఎల్.బ్రహ్మారెడ్డి, ఎ.పవన్‌కుమార్ (జేకేసీ కళాశాల), ఎం.తేజశ్వి (ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల), ఎ.ఫ్రాంక్లిన్ (ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల), బి.అవినాష్ (ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల) జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. -
తెలంగాణ, ఏపీ రీజియన్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ క్రీడల్లో వివిధ వయోవిభాగాలకు చెందిన తెలంగాణ, ఏపీ రీజియన్ బాస్కెట్‌బాల్ జట్లు ముందంజ వేశాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచారుు. జూనియర్ బాలికల విభాగంలో తెలంగాణ, ఏపీ రీజియన్ జట్టు 38-26తో ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ రీజియన్‌పై గెలుపొందగా... సీనియర్ బాలికల విభాగంలో 22-15తో గుజరాత్ రీజియన్ జట్టును ఓడించింది. సీనియర్ బాలుర విభాగంలో తెలంగాణ, ఏపీ రీజియన్ జట్టు 45-15తో నార్త్ పంజాబ్ జట్టుపై గెలుపొంది... జూనియర్ బాలుర విభాగంలో 17-28తో ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ రీజియన్ చేతిలో పరాజయం పాలైంది. ఫుట్‌బాల్‌లో నిరాశ ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ అథ్లెటిక్ మీట్లో భాగంగా గచ్చిబౌలిలోని ఎన్ఏఎస్ఆర్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తెలుగు జట్టుకు నిరాశ ఎదురైంది. జూనియర్ బాలుర విభాగంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తెలంగాణ, ఏపీ రీజియన్ జట్టు 1-2 గోల్స్ తేడాతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రీజియన్ జట్టు చేతిలో ఓడిపోయింది. -
‘బాస్కెట్ బాల్’ విజేత జేకేసీ జట్టు
గుంటూరు స్పోర్ట్స్: జాగర్లమూడి నరేంద్రనాథ్ మెమోరియల్ బాస్కెట్‌బాల్ జిల్లా స్థాయి టోర్నమెంట్ సోమవారం ముగిసింది. స్కూల్ స్థాయి బాలికల విభాగంలో జేకేసీ జట్టు విజేతగా నిలువగా, కేకేఆర్ గౌతమ్ స్కూల్ జట్టు రన్నరప్ టైటిల్ సాధించింది. బాలుర విభాగంలో లయోలా స్కూల్ జట్టు విజేతగా నిలువగా, లయోలా–బి జట్టు రన్నరప్‌గా నిలిచింది. కళాళాల స్థాయి పురుషుల విభాగంలో నలందా ఇంజినీరింగ్ కాలేజీ టైటిల్ సాధించగా, ఏసీ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. అనంతరం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్వీఆర్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. -
రాష్ర ్టస్థాయి బాస్కెట్‌బాల్‌కు కృత్తివెంటి విద్యార్థులు
రామచంద్రపురం : రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు స్థానిక కృత్తివెంటి పేర్‌ారజు పంతులు జాతీయోన్నత పాఠశాల క్రీడాకారులు నలుగురు ఎంపికైనట్టు పాఠశాల పీడీ గెడా శ్రీనివాసు, పీఈటీ సయ్యిద్ మస్తానీ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అండర్ 14 బాలుర విభాగం పోటీల్లో పవ¯ŒSకుమార్ స్వర్ణపతకం సాధించి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడన్నారు. అదే విధంగా అండర్ 17 బాలుర విభాగంలో షేక్ సలీం, ఎ. ప్రవీణ్, అండర్ 17 బాలికల విభాగంలో పి. పాప, కౌసల్య జిల్లా జట్టుకు ఎ ంపికయ్యారన్నారు. చిత్తూరులో జరిగే రాష్ర ్టస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. వీరిని పాఠశాల హెచ్ఎం జి. రాంప్రసాద్, రీజినల్ ఇ¯ŒSస్పెక్టర్ ఆఫ్ పిజికల్ ఎడ్యుకేష¯ŒS అధికారి ప్రమీలాకుమారి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సూర్యమోహన్, బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. స్టాలిన్, రాష్ట్ర అసోసియేష¯ŒS కోశాధికారి గన్నమని చక్రవర్తి, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ ఎం. సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
ఉత్కంఠగా బాస్కెట్ బాల్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: జాగర్లమూడి నరేంద్రనాథ్ మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ శనివారం జేకేసీ కళాశాలలో ప్రారంభమైంది. బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో బాలికల, పురుషుల విభాగంలో పోటీలు నిర్వహించారు. టోర్నమెంట్లో 12 బాలబాలికల స్కూల్ జట్లు, 15 పురుషుల కాలేజి జట్లు పాల్గొన్నాయి. జేకేసీ కళాశాల కార్యదర్శి జాగర్లమూడి మురళిమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, జేకేసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేశ్వరరావు, లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ అంతోనీ, ఏ.పీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి పి.రాఘవయ్య, పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఫలితాలు... కళాశాల పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఏసీ కళాశాల జట్టు 40–20 స్కోర్‌తో ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై విజయం సాధించింది. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు 36–17 స్కోర్‌తో నర్సరావుపేట ఎన్ఈసీ ఇంజినీరింగ్ జట్టుపై, వీవీఐటీ జట్టు 46–23 స్కోర్‌తో ఆర్విఆర్ కళాశాల జట్లపై విజయం సాధించాయి. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుందని టోర్నమెంట్ నిర్వాహకుడు హరగోపాల్ వెల్లడించారు. -
క్రీడలతో పోటీతత్వం
ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు స్పోర్ట్స్: క్రీడలతో పోటీతత్వం అలవడుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన 3వ దొండపాటి శ్రీనివాసరావు మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేత జట్లకు ట్రోఫీలు అందించారు. మహిళ విభాగంలో ఆచార్య నాగార్జున జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు స్పోర్ట్స్ క్లబ్ జట్టు ద్వితీయస్థానం, నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. -
సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్
క్వార్టర్స్‌లో ఓడిన తెలంగాణ జాతీయ సబ్ జూ. బాస్కెట్‌బాల్ సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆతిథ్య తెలంగాణ జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓడింది. ‘శాట్స్’ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలుర క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 63-58తో చత్తీస్‌గఢ్‌పై విజయం సాధించింది. ఏపీ జట్టులో షేక్ అహ్మద్ (27) రాణించాడు. భార్గవ్ 11, శ్రీతమ్ త్రిపాఠి 10 పారుుంట్లు చేశారు. తెలంగాణ జట్టు 42-63తో మధ్యప్రదేశ్ చేతిలో పరాజయం చవిచూసింది. తెలంగాణ తరఫున రోహిత్ 10, షేక్ ఖాజావలి 9 పాయింట్లు చేశారు. మధ్యప్రదేశ్ జట్టులో విరాట్ కక్కర్ (33) చెలరేగాడు. మిగతా మ్యాచ్‌ల్లో హరియాణా 76-54తో ఉత్తరప్రదేశ్‌పై, రాజస్తాన్ 82-60తో పంజాబ్‌పై గెలుపొందాయి. బాలికల క్వార్టర్ ఫైనల్లో కేరళ 50-41తో రాజస్తాన్‌పై, తమిళనాడు 67-41తో కర్ణాటకపై, మహారాష్ట్ర 48-30తో మధ్యప్రదేశ్‌పై, చత్తీస్‌గఢ్ 49-35తో ఉత్తరప్రదేశ్‌పై విజయం సాధించాయి. -
తెలంగాణ జట్టుకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలుర జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 61-45తో ఢిల్లీని ఓడించింది. తెలంగాణ తరఫున అశ్వని 15 పాయింట్లు, సౌరభ్ 11 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 62-21తో కేరళను చిత్తుగా ఓడించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున కేవీవీ రమణ 17 పాయింట్లు, షేక్ అహ్మద్ అలీషా 12 పాయింట్లు, శ్రీతమ్ త్రిపాఠి 10 పారుుంట్లు సాధించారు. బాలికల విభాగంలో తెలంగాణ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. తమిళనాడుతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 16-62తో ఓడిపోయింది. తెలంగాణ జట్టులో సంధ్య 10 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. బాలుర గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 42-21తో బిహార్‌ను ఓడించగా... బాలికల గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 29-46తో ఉత్తర్ ప్రదేశ్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లు శుభారంభం చేశాయి. ఇక్కడి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం మొదలైన ఈ టోర్నమెంట్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. బాలికల గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 41-16తో చండీగఢ్‌ను ఓడించింది. ఆంధ్రప్రదేశ్ తరపున వెంకటలక్ష్మి (17 పాయింట్లు), జాస్మిన్ (10), అంజలి (8) రాణించారు. బాలుర విభాగం గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 58-56తో ఉత్తర్ప్రదేశ్పై గెలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఉపాధ్యక్షులు అజయ్ సూద్, షఫీఖ్ షేక్, తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నార్మన్ ఐజాక్, హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు ఆర్.శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
చిరుమామిళ్ళ (నాదెండ్ల): బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు చిరుమామిళ్ళలోని నడికట్టు రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగాయి. జిల్లాలోని 50 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి, విద్యాదాత నడికట్టు రామిరెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎం.గణేష్ హాజరయ్యారు. ఎంపికైన జట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి. ఎంపికైన జట్ల వివరాలు ఇవీ.. అండర్ 14 బాలుర విభాగంలో.. ఎ.సంజయ్‌బాబు, ఎల్.కృష్ణ, ఎం.ఆంజనేయులు, కె.ఆదిశేషు, ఎం.ప్రేమ్‌కుమార్, జి.భరత్, సీహెచ్ బాలాజీ(చిలకలూరిపేట) కె.హరినాథ్(చింతలపాలెం), జి.రాకేశ్(వినుకొండ), బి.కృష్ణబాబు, ఎస్.కౌస్తుబ్, ఎ. శరత్సత్య ప్రణీత్(గుంటూరు), స్టాండ్‌బైగా జి.ప్రవీణ్‌కుమార్, బి.వేణు(చిలకలూరిపేట) కె.కుశల్(గుంటూరు), ఎం.శరత్(గుంటూరు) కె. కౌషిక్(గుంటూరు). బాలికల విభాగంలో.. టి.త్రివేణి, అమూల్య, మౌనిక, ఎస్కే సల్మా, పి.కీర్తిశివ, సీహెచ్.అనూష, టి.సంపూర్ణ, వి.ఆశ్రిత(నరసరావుపేట), బి. త్రివేణి, కె.రూప, వి.నందిని(చిలకలూరిపేట), డి.ప్రియాంక(గుంటూరు), కె.స్వాతి(చింతలపాలెం). అండర్ 17 బాలుర విభాగంలో... ఎస్కే అమీర్, ఎ.బాలసైదులు, దుర్గారావు, పివి.ముసలయ్య, దుర్గాచౌదరి(చిలకలూరిపేట), టి.శ్రీవెంకటశ్రీరాం, జశ్వంత్, జి.వెంకటశశికుమార్, జి. అనిల్, వి.నరేంద్ర, సీహెచ్ వెంకటచంద్రశేఖర్, పి.భాస్కర్, ఎం.సంపత్, ఉపేంద్ర, ఎ.మనోజ్‌కుమార్, శ్యామ్‌కుమార్(గుంటూరు), కెఆర్ బాలశివదుర్గాప్రసాద్(పివిపాలెం), పి.శ్రీనాథ్కుమార్(చింతలపాలెం). బాలికల విభాగంలో.... షేక్ షహీరా, ఎం.ఎస్తేరురాణి, ఎం.నసీమా, ఐ.తిరుపతమ్మ, ఎం.మంజుల, సీహెచ్ ధరణి, అంజలి(నరసరావుపేట), సీహెచ్ వైష్ణవి, వి.వెంకటసుజాత, ఎం.రాజేశ్వరి, జి.శేషునాగలక్ష్మి, కె.గాయత్రి(గుంటూరు), పి.మానస(చింతలపాలెం) జె.జశీల, ఆర్ హారిక, కె.విజయలక్ష్మి (చిలకలూరిపేట). -
జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీ రేపటి నుంచి
సాక్షి, హైదరాబాద్: అరైస్ స్టీల్ జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ శనివారం ప్రారంభం కానుంది. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 1 నుంచి 7 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో అండర్-13 బాలబాలికల విభాగంలో పోటీలు నిర్వహిస్తారు. శనివారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి, శాట్స్ ఎండీ దినకర్‌బాబు పాల్గొననున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. 13 ఏళ్ల తర్వాత జాతీయ స్థారుు బాస్కెట్‌బాల్ టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. మధ్య ప్రదేశ్ బాలుర జట్టు, ఛత్తీస్‌గఢ్ బాలికల జట్టు డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
అరట్లకట్ట (పాలకొల్లు అర్బన్): ఈ ఏడాది నవంబర్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జరిగే రాష్ట్రస్థాయి సాప్్టబాల్ పోటీలకు ఇరువురు అరట్లకట్ట విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం కె శ్రీనివాస్ సోమవారం విలేకరులకు తెలిపారు. పెదవేగిలో నిర్వహించిన అండర్–17, అండర్–14 సాప్్టబాల్ పోటీల్లో పరసా రాజేష్, మల్లుల తేజేంద్రకుమార్ ఎంపికయ్యారన్నారు. వీరు జిల్లా తరపున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీఈటీ పాలా దుర్గారావును, విద్యార్థులను సర్పంచ్ చింతపల్లి లక్ష్మీకుమారి, ఎంపీటీసీ గుత్తుల స్వాతి, విద్యాకమిటీ చైర్మన్ చింతపల్లి వరప్రసాద్, హెచ్ఎం కె శ్రీనివాస్, ఉపాధ్యాయులు మూర్తి, వేణు, చలపతిరావు, వరప్రసాద్, విద్య, గ్రామపెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. -
7 నుంచి బ్యాడ్మింటన్ సెలెక్షన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కోసం ఈనెల 7 నుంచి సెలెక్షన్ టోర్నమెంట్ జరుగనుంది. ఖమ్మం జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో 10వ తేదీ వరకు ఈ ఎంపిక పోటీలు జరుగుతారుు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలబాలికలు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థారుు టోర్నమెంట్‌కు ఎంపికవుతారు. ఆసక్తి గల అభ్యర్థులు ఖమ్మం జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సెక్రటరీ ఆనంద్ (9848145441)ను సంప్రదించవచ్చు. రంగారెడ్డి జిల్లా సెలక్షన్స్ రేపు రంగారెడ్డి జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అండర్-14 బాస్కెట్‌బాల్ సెలెక్షన్స జరుగనున్నాయి. శివరాంపల్లిలోని బాస్కెట్‌బాల్ గ్రౌండ్సలో బాలబాలికలకు వేరువేరుగా ఈ ఎంపిక పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు అంతర్ జిల్లా సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌కు ఎంపికవుతారు. మరిన్ని వివరాల కోసం నయీముద్దీన్ (9848396922)ను సంప్రదించవచ్చు. -
చాంప్స్ ఫ్యూచర్ కిడ్స్ జట్లు
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో ఫ్యూచర్‌కిడ్స్ స్కూల్ బాస్కెట్‌బాల్ జట్లు సత్తాచాటాయి. జూనియర్, సీనియర్ బాలికల విభాగంలో టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాయి. బుధవారం హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ మైదానంలో జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్లో జూనియర్ బాలికల విభాగంలో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 23- 18 తేడాతో లయోలా స్కూల్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్యూచర్‌కిడ్స్ జట్టు తరఫున భావన 12పాయింట్లు, ధాత్రి 10 పాయింట్లు సాధించారు. లయోలా స్కూల్ జట్టులో శల్య 10 పాయింట్లతో ఆకట్టుకుంది. ఉత్కంఠ రేకెత్తించిన సీనియర్ బాలికల ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 34-33తో అభ్యాస స్కూల్ జట్టును ఓడించింది. ఫ్యూచర్ కిడ్స్ జట్టులో ధావని (16), ఆస్థా (10)... అభ్యాస స్కూల్ తరఫున నిహారిక (10), నూరిన్ (6) రాణించారు. -
విక్టరీ ప్లేగ్రౌండ్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో విక్టరీ ప్లేగ్రౌండ్ విజయం సాధించింది. సికింద్రాబాద్ క్లబ్లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విక్టరీ ప్లేగ్రౌండ్ 72-55తో సికింద్రాబాద్ క్లబ్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విక్టరీ ప్లేగ్రౌండ్ తరఫున ప్రసాద్ 18 పాయింట్లు, యశ్వంత్ 15 పాయింట్లు, సల్మాన్ 16 పాయింట్లు, నవీన్ 11 పాయింట్లు సాధించగా... సికింద్రాబాద్ క్లబ్ జట్టులో అమన్ 17 పాయింట్లు, రోహన్ 15 పాయింట్లు, విదుర 11 పాయింట్లు రాబట్టారు. -
సెమీస్‌లో అభయ స్కూల్
హైదరాబాద్: రామేందర్ రెడ్డి మెమోరియల్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో అభయ స్కూల్, సుచిత్ర అకాడమీ, నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్, సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌ల్లో అభయ స్కూల్ 40-30తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది. అభయ స్కూల్ తరఫున అమయ్ (22), రిత్విక్ (7)... ఓక్రిడ్జ్ జట్టులో మోహిత్ (11), ఆకాశ్ (7) సత్తాచాటారు. సుచిత్ర అకాడమీ 31-14తో నీరజ్ పబ్లిక్ స్కూల్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో సుచిత్ర జట్టులో సర్వేశ్ (16), వాగేశ్ (8)... నీరజ్ స్కూల్ తరఫున వెంకట్ (5), హయేశ్ (4) రాణించారు. నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 34-13తో జాన్సన్ గ్రామర్‌పై గెలుపొందింది. నీరజ్ స్కూల్ తరఫున షహబ్ (7), కునాల్ (16)... జాన్సన్ గ్రామర్ జట్టులో రవికిరణ్ (6), మనీష్(4) ఆకట్టుకున్నారు. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ 30-15తో సన్‌ఫ్లవర్ స్కూల్‌పై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో జాన్సన్ గ్రామర్ తరఫున నీరజ్ (8), ప్రణవ్ (6)... సన్‌ఫ్లవర్ జట్టులో రోహన్ (6) రాణించారు. తొలి రౌండ్ ఫలితాలు సుచిత్ర అకాడమీ 29-11తో సాధు వశ్వాని ఇంటర్నేషనల్ స్కూల్‌పై, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 42-9 తో సన్‌ఫ్లవర్ వేదిక్ స్కూల్‌పై, నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 31-8తో శాంతినికేతన్ విద్యాలయపై విజయం సాధించాయి. -
సెయింట్ మార్టిన్స్ గెలుపు
హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో సెయింట్ మార్టిన్స్, కేవీబీఆర్ స్టేడియం జట్లు గెలుపొందాయి. సికింద్రాబాద్ వైఎంసీఏ కోర్టులో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మార్టిన్స్ క్లబ్ 57-48తో భవాన్స్ జూనియర్ కళాశాలపై గెలిచింది. మార్టిన్స్ జట్టులో బెన్న 20, మనోజ్ 9 పాయింట్లు చేశారు. భవాన్స్ తరఫున నిఖిల్ 21, రాహుల్ 9 పాయింట్లు సాధించారు. రెండో మ్యాచ్‌లో కేవీబీఆర్ 60-57తో వైఎంజీపై నెగ్గింది. దినేశ్ (20), మిథిల్ (19), వినయ్ (15) కేవీబీఆర్కు పాయింట్లు తెచ్చిపెట్టారు. వైఎంజీ జట్టులో శామ్యూల్ (31) ఒంటరి పోరాటం చేశాడు. సైనిక్‌పురి 35-27తో ఎన్ఎన్పీజీపై విజయం సాధించింది. సైనిక్‌పురి జట్టులో విజయ్ (14), పాల్ (7) రాణించగా, ఎన్‌ఎన్‌పీజీ తరఫున వరుణ్ 8, శశి 5 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ ‘ఎ’ జట్టు 49-39తో హాస్టలర్స్పై గెలిచింది. బీహెచ్ఈఎల్ జట్టులో తులసి 14, పాల్ 10 పాయింట్లు చేయగా, హాస్టలర్స్లో సాహిల్ (18) ఆకట్టుకున్నాడు. బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ 74-60తో సీఆర్పీఎఫ్ను ఓడించింది. బాయ్స్ జట్టులో అమన్ (26), అశోక్ (21) అదరగొట్టారు. సీఆర్పీఎఫ్కు కిరణ్, జాషువా చెరో 18 పాయింట్లు చేసిపెట్టారు. -
ఒమెగా క్లబ్ గెలుపు
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీ హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో ఒమెగా బాస్కెట్‌బాల్ క్లబ్ 66-57తో కేవీబీఆర్ స్టేడియం క్లబ్‌పై విజయం సాధించింది. సికింద్రాబాద్ వైఎంసీఏ కోర్టులో బుధవారం జరిగిన ఈ లీగ్ పోరులో ఒమెగా జట్టులో సాయి (35) అదరగొట్టాడు. క్రమం తప్పకుండా పాయింట్లు చేయడంలో సఫలమయ్యాడు. మింటు 11 పాయింట్లు చేశాడు. కేవీబీఆర్ జట్టులో మిథిల్ 30, దినేశ్ 21 పాయింట్లు సాధించారు. మిగతా మ్యాచ్‌ల్లో ఎఫ్‌ఐబీఏ 54-34తో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్ ‘ఎ’ జట్టుపై గెలిచింది. ఎఫ్‌ఐబీఏ తరఫున రేవంత్ 17, శుభాంకర్ 8 పాయింట్లు చేశారు. స్టూడెంట్స్ జట్టులో సంజయ్ కుమార్ (18), ఆకాశ్ (6) రాణించారు. మూడో మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ ‘బి’ జట్టు 47-17తో రహీంపురా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై నెగ్గింది. బీహెచ్ఈఎల్ జట్టులో ప్రణీత్ (15), హరీశ్ (9) ఆకట్టుకున్నారు. రహీంపురా తరఫున శ్రీనాథ్ 8, రవీందర్నాథ్ 6 పాయింట్లు చేశారు. చివరి మ్యాచ్‌లో కేపీహెచ్‌బీ 55-40తో హైదరాబాద్ లీడర్స్‌పై గెలుపొందింది. కేపీహెచ్‌బీ జట్టులో లెండిల్ 15, సాయి 13 పాయింట్లు చేశారు. లీడర్స్ తరఫున నగేశ్ (9), శివ (10) ఆకట్టుకున్నారు. 14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ టోర్నీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎంసీఏ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ డే బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. మహిళలు, పురుషుల విభాగాల్లో రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. వివరాలకు రాజారెడ్డి(9666600091)ని సంప్రదించవచ్చు. -
వైఎంసీఏకు రెండో విజయం
► క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ సాక్షి, హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో వైఎంసీఏ సికింద్రాబాద్, హూప్‌స్టర్స్ క్లబ్ జట్లు రెండో విజయాన్ని సాధించాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో వైఎంసీఏ జట్టు 32-14 స్కోరుతో గావిన్స్ బాస్కెట్‌బాల్ అకాడమీపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వినోద్ కుమార్ (12 పాయింట్లు) , శరవణకుమార్(8) రాణించారు. మరో మ్యాచ్ లో హూప్‌స్టర్స్ క్లబ్ జట్టు 53-37తో వీజేఐటీ జట్టును ఓడించింది. హూప్‌స్టర్స్ తరఫునవెంకటేశ్ 20 పాయింట్లు, వెంకటేశ్వర్రావు 10 పా యింట్లు సాధించారు. మూడో మ్యాచ్‌లో సైనిక్‌పురి బాస్కెట్ బాల్ అకాడమీ 32-18తో స్టూ డెంట్స్ స్పోర్ట్స్ క్లబ్‌పై విజయం సాధించింది. సైనిక్‌పురి ఆటగాళ్లు దీపక్ (12), అరుణ్ (10) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. -
బాస్కెట్‌బాల్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: బ్రదర్ జగన్-బ్రదర్ రవి స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ గురువారం ప్రారంభమైంది. సెయింట్ పాల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో బాలికల విభాగంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్... మెరిడియన్ స్కూల్‌పై గెలుపొందింది. బాలుర విభాగంలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్... ఎంజీఎంపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఆతిథ్య సెయింట్ పాల్ హైస్కూల్... సెయింట్ మార్టిన్స్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాంట్‌ఫోర్ట్ బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గాబ్రియెల్ (హైదరాబాద్ ప్రావిన్స్) కార్యదర్శి రెవరెండ్ బ్రదర్ లౌర్డ్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ఆరంభించారు. -
వైఎంసీఏ ఘన విజయం
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: డేవిడ్ (18 పాయింట్లు), హర్ష (18), ముస్తఫా (17) అద్భుతంగా రాణించడంతో క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో వైఎంసీఏ జట్టు ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వైఎంసీఏ జట్ట 53- 28 స్కోరు తేడాతో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్‌ను ఓడించింది. స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున చరణ్ (10), సాయి కిరణ్ (10), జీవన్ (8) రాణించారు. ఇతర మ్యాచ్‌ల్లో జోసెఫియన్ జట్టు 29-22తో ఆర్బీవీఆర్ రెడ్డి హాస్టల్‌పై గెలుపొందగా... ఎన్బీఏ జట్టు 50-30తో ఈసీఐఎల్ జట్టును చిత్తుగా ఓడించింది -
ముగిసిన బాస్కెట్‌బాల్ శిక్షణ
ధర్మవరం అర్బన్ : బాస్కెట్‌బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామని కాకతీయ విద్యానికేతన్ ఉన్నతపాఠశాల వ్యవస్థాపకుడు మేడాపురం రామిరెడ్డి, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు శెట్టిపి జయచంద్రారెడ్డి, హిదయ్‌తుల్లాలు పేర్కొన్నారు. ధర్మవరంలోని కాకతీయ విద్యానికేతన్‌లో ఐదురోజులుగా స్పెయిన్‌కు చెందిన బాస్కెట్‌బాల్ కోచ్‌లు విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు స్పెయిన్ కోచ్‌లో బాస్కెట్‌బాల్ క్రీడలో మంచి శిక్షణ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కాకతీయ విద్యానికేతన్ కరస్పాండెంట్ నిర్మలా జయచంద్రారెడ్డి, డైరెక్టర్లు సూర్యప్రకాష్‌రెడ్డి, పద్మ, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
క్రీడా పాటవంతో ఖండాంతరయానం
బాస్కెట్‌బాల్‌లో రాణిస్తున్న పేదబాలికలు అమెరికా పర్యటనకు ఎంపిక చేసిన ‘మ్యాజిక్ బస్సు’ 15 రోజులు ఆ దేశంలో ఉన్న శ్రావణి, అశ్వినిప్రియ అక్కడి పోటీల్లోనూ విజయాలు నమోదు రాజమహేంద్రవరం సిటీ / తాడితోట : విమానం ఎక్కడమే కలలోని మాటగా భావించే కుటుంబాలకు చెందిన ఆ ఇద్దరు బాలికలూ ఖండాంతరయానం చేసి వచ్చారు. భూగోళానికి ఆవలివైపున అమెరికాలో 15 రోజులు పర్యటించారు. క్రీడామైదానంలో మెరుపుల్లా కదిలే ఆ బాలలిద్దరూ గోదారి బిడ్డలే. రాజమమహేంద్రవరానికి చెందిన లంకా సాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్వినిప్రియ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బాస్కెట్‌బాల్ శిక్షణ, పోటీల్లో పాల్గొని సోమవారం నగరానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటన తమకెంతో ఆనందాన్నిచ్చిందని వారు చెప్పారు. స్థానిక దానవాయి పేట మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న శ్రావణి, అశ్వినిప్రియ బాస్కెట్ బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వీరిని ‘మ్యాజిక్ బస్సు’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ గుర్తించింది. ఈ సంస్థ మురికివాడలలోని బాల,బాలికల్లో వివిధ క్రీడలలో ఆసక్తిగల వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చి అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రావణి, అశ్వినిప్రియలను అమెరికా ప్రయాణానికి ఎంపిక చేసింది. ఈ నెల 9న రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన వీరు అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, న్యూజెర్సీలలో 15 రోజుల పాటు బాస్కెట్ బాల్ క్రీడలో శిక్షణ పొందారు. అక్కడ వివిధ జట్ల మధ్య జరిగిన పోటీలలో పాల్గొని విజయం సాధించారు. న్యూయార్క్‌లో ఆరు రోజులు శిక్షణ పొందిన తాము న్యూజెర్సీలో ఆరు రోజులు పోటీలలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 12 మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారని, రాజమహేంద్రవరం నుంచి తామిద్దరం ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మరో 20 మందిని తీర్చిదిద్దుతాం.. అమెరికా వచ్చిన క్రీడాకారులందర్నీ కలిపి 30∙టీమ్‌లుగా కేటాయించారని, తాము జర్మనీ పేరుతో గల టీమ్‌లో ఆడి విజేతగా నిలిచామని శ్రావణి,అశ్వినిప్రియ చెప్పారు. విజేతగా నిలిచిన తమకు సర్టిఫికెట్లు అందజేశారని తెలిపారు. తమకు లభించిన అవకాశం ద్వారా క్రీడలతో పాటు అనేక అంశాలు నేర్చుకున్నామన్నారు. దానిలో భాగంగానే చదువు మానేసిన వారిని గుర్తించి వారు తిరిగి పాఠశాలకు వెళ్ళేలా, క్రీడలలో ఆరితేరేలా తీర్చిదిద్దే ప్రాజెక్టును తమ్కు అప్పగించారని, దానిని సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తమకు మరలా మ్యాజిక్ బస్సు ద్వారా అమెరికా వెళ్ళే అవకాశం వస్తే తమ స్థానంలో మరో ఇద్దరు క్రీడాకారులను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సిమెటరీపేటలో వెల్లివిరిసిన ఆనందం నిరుపేద కుటుంబాలలో పుట్టిన శ్రావణి, అశ్వినిప్రియ రాజమహేంద్రవరంలో సిమెటరీ పేటలో నివసిస్తుంటారు. వీరి తండ్రులు ప్రైవేటు ఎలక్రీ్టషియన్‌లుగా జీవనం సాగిస్తున్నారు. తల్లులు గృహిణులు. వీరు అమెరికా వెళ్ళి తిరిగి రావడంతో సోమవారం రాత్రి సిమెటరీపేటలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానికులు, స్నేహితులు, బంధువులు వీరిని అభినందనలతో ముంచెత్తారు. పుష్పగుచ్ఛాలు అందించి వెన్నుతట్టారు. -
సీసీఓబీకి రెండో విజయం
క్లబ్ లీగ్ బాస్కెట్ బాల్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ), జోసెఫిన్ శాం తినగర్ జట్లు గెలుపొందాయి. వైఎంసీఏ సికింద్రాబాద్ క్లబ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీసీఓబీ జట్టు 73-23తో రహీంపురా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఈలో ఉన్న సీసీఓబీకి ఇది రెండో విజయం. సీసీఓబీ తరఫున నాగరాజు (14 పాయింట్లు), మొయిన్ (12 పా.) రాణించగా రిహీంపురా జ ట్టు ఆటగాడు సిద్ధార్థ్(14 పా.)ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో జోసెఫిన్ శాంతినగర్ జట్టు 52-14తో ఈసీఐఎల్ జట్టును చిత్తుగా ఓడిం చింది. శాంతినగర్ జట్టులో అరుణ్ 10 పాయిం ట్లు, అనుకేశ్ 8 పాయింట్లు సాధించారు. -
బాస్కెట్‌బాల్‌లో జాతి వివక్ష
సిక్కు ఆటగాళ్ల తలపాగా తొలగింపు నాగ్‌పూర్: ఇటీవల చైనాలో ముగిసిన ‘ఫిబా’ ఆసియా కప్‌లో భారత్ ఆటగాళ్లు ఇద్దరు జాతి వివక్షకు గురయ్యారు. మ్యాచ్‌లు ఆడాలంటే తలపాగా (టర్బన్స్) తొలగించాల్సిందేనని జట్టులోని సిక్కు ఆటగాళ్లు అమ్రిత్‌పాల్ సింగ్, అమ్‌జ్యోత్ సింగ్‌లకు నిర్వాహకులు అల్టీమేటం జారీ చేయడంతో చేసేదేమీలేక తలపాగా తీసేసి బరిలోకి దిగారు. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (ఎఫ్‌ఐబీఏ) నిబంధలన (ఆర్టికల్ 4.4.2) ప్రకారం తలకు హెల్మెట్‌గానీ, పిన్నులుగానీ, విలువైన వస్తువులుగానీ ధరించి మ్యాచ్‌లు ఆడకూడదు. వీటివల్ల ప్రత్యర్థి ఆటగాళ్లకు గాయాలు అవుతాయనే ఉద్దేశంతో ఈ నిబంధనను విధించారు. అయితే సిక్కులు ధరించే టర్బన్స్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా దీన్ని సాకుగా చూపి నిర్వాహకులు జాతి వివక్షకు గురి చేశారు. లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు... భారత్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకునేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో టర్బన్స్‌ను తీసేసి ఆడారు. ఈ మ్యాచ్‌లో అమ్రిత్‌పాల్ 15 పాయింట్లు చేశాడు. భారత్ జట్టు అమెరికన్ కోచ్ స్కాట్ ఫ్లెమింగ్ ఈ నిబంధనపై ఓ రోజంతా నిర్వాహకులకు నచ్చజెప్పినా మొదట ఒప్పుకొని మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు మళ్లీ షాకిచ్చారు. గతంలో ఏ టోర్నీలోనూ ఇలా టర్బన్స్‌ను తీసేయమని చెప్పకపోవడంతో ఈ ఇద్దరు ప్లేయర్లు స్వేచ్ఛగా మ్యాచ్‌లు ఆడారు. కానీ ఇప్పుడు... భారత్‌లో తప్ప బయటి దేశాల్లో మ్యాచ్‌లు ఆడబోమని చెబుతున్నారు. అయితే ఇంత జరిగినా... ఈ విషయం గురించి భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్ఐ)కు ఇప్పటి వరకు తెలియకపోవడం కొసమెరుపు! -
ఇంటర్నెట్ లిటిల్ సెన్సేషన్
-
సత్తాచాటిన ఓక్రిడ్జ్ జట్లు
రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల క్రీడల్లో ఓక్రిడ్జ్ స్కూల్ జట్లు సత్తా చాటాయి. టెన్నిస్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ పోటీల్లో ఈ స్కూల్ విద్యార్థులు ఘన విజయాలు నమోదు చేశారు. అండర్-12, 14 టెన్నిస్ విభాగాల్లో ఓక్రిడ్జ్ జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం జరిగిన సెమీఫైనల్ పోటీల్లో ఓక్రిడ్జ్ జట్టు 2-0తో డీపీఎస్ స్కూల్‌పై, అండర్-14 విభాగంలో ఓక్రిడ్జ్ స్కూల్ 2-0తో డీఆర్ఎస్ స్కూల్‌పై విజయం సాధించాయి. ఇతర సెమీస్ పోటీల్లో జేహెచ్‌పీఎస్ 2-1తో గ్లెన్డెల్ స్కూల్‌పై, శ్రీనిధి స్కూల్ 2-0తో ఓక్రిడ్జ్ స్కూల్ (బాచుపల్లి)పై గెలుపొందాయి. బాస్కెట్‌బాల్ ఈవెంట్లో చిరెక్, ఓక్రిడ్జ్ బాల, బాలికల జట్లు తుదిపోరుకు అర్హత సంపాదించాయి. బాలికల సెమీఫైనల్లో చిరెక్ స్కూల్ 34-27తో డీపీఎస్ను, ఓక్రిడ్జ్ స్కూల్ 31-10తో సీఆర్పీఎఫ్ను కంగుతినిపించాయి. బాలుర ఈవెంట్లో ఓక్రిడ్జ్ జట్టు 71-42తో సీఆర్పీఎఫ్పై గెలుపొందగా, చిరెక్ జట్టు 45-25తో సెయింట్ ఆండ్రూస్‌పై నెగ్గింది. స్విమ్మింగ్ అండర్-14 బాలుర విభాగం 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో ఓక్రిడ్జ్‌కు చెందిన పి.శుభ మ్, ఆర్.గోవింద్ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వినీత్‌రెడ్డి (మెరిడియన్ స్కూల్) తృతీయ స్థానం పొందాడు. బాలికల విభాగంలో ఓక్రిడ్జ్ అమ్మాయిలు ఆర్తి, శ్రీనిధి, శృతి క్లీన్‌స్వీప్ చేశారు. అండర్-10 బాలుర విభాగం 25 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో ఆగస్త్య (డీపీఎస్), అఖిల్ (ఇండస్ స్కూల్), ఇమ్రాన్ (ఓక్రిడ్జ్) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో జాహ్నవి (డీపీఎస్) విజేతగా నిలువగా, రక్ష (ఓక్రిడ్జ్), ప్రేరణ (డీపీఎస్) రెండు, మూడు స్థానాలు పొందారు.