
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ స్కూల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో పి. ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ 26–22తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) పై విజయం సాధించింది. ఓబుల్ రెడ్డి జట్టులో మోహన 10 పాయింట్లతో ఆకట్టుకుంది. సాత్విక (6), కస్తూరి (6) రాణించారు. డీపీఎస్ తరఫున హర్షిక, శ్రీహిత చెరో 8 పాయింట్లు స్కోర్ చేశారు. రెండో మ్యాచ్‌లో గీతాంజలి దేవ్‌శాల 14–12తో ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్‌పై గెలుపొందింది. గీతాంజలి ప్లేయర్ రుచి 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
ఇతర మ్యాచ్‌ల్లో సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ (వైష్ణవి 8, అమూల్య 6) 20– 18తో సెయింట్ ఆంథోనీస్ బాలికల హైస్కూల్ (జ్యోతిక 8, సుక్తారా 8)పై, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి (పూజ 12, శ్రేయ 12, ప్రియాంక 6) 33– 25తో డాన్‌బాస్కో (అమ్రీన్ 16, సారా 9)పై, ఫ్యూచర్ కిడ్స్ (అదితి 10, భావన 6, మధుర 4) 34– 17తో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి (పూజ 9, ఖుష్బూ 4)పై, సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ (నిధి 6) 24–9తో సెయింట్ ఆంథోని (వైష్ణవి 5, యుక్త 4)పై, గీతాంజలి దేవ్‌శాల (రుచి 14, జోషిక 10) 24– 5తో సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి (ముస్కాన్ 4)పై, చిరెక్ పబ్లిక్ స్కూల్ (ఆర్య 16, మేధ 8, అన్య 8) 38–14తో విల్లామేరీ జూనియర్ కాలేజిపై, శ్రీనిధి ఇంటర్నేషనల్ (నిత్య 14, జి. మేఘన 8, ఆర్. మేఘన 8) 34–12తో సెయింట్ జోసెఫ్ కింగ్‌కోఠి (ముస్కాన్ 8)పై, చిరెక్ పబ్లిక్ స్కూల్ (ఆర్య 16) 22– 12తో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (ఓజస్వి 6)పై విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment