హైదరాబాద్: రామేందర్ రెడ్డి మెమోరియల్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో అభయ స్కూల్, సుచిత్ర అకాడమీ, నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్, సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌ల్లో అభయ స్కూల్ 40-30తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది. అభయ స్కూల్ తరఫున అమయ్ (22), రిత్విక్ (7)... ఓక్రిడ్జ్ జట్టులో మోహిత్ (11), ఆకాశ్ (7) సత్తాచాటారు. సుచిత్ర అకాడమీ 31-14తో నీరజ్ పబ్లిక్ స్కూల్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో సుచిత్ర జట్టులో సర్వేశ్ (16), వాగేశ్ (8)... నీరజ్ స్కూల్ తరఫున వెంకట్ (5), హయేశ్ (4) రాణించారు. నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 34-13తో జాన్సన్ గ్రామర్‌పై గెలుపొందింది. నీరజ్ స్కూల్ తరఫున షహబ్ (7), కునాల్ (16)... జాన్సన్ గ్రామర్ జట్టులో రవికిరణ్ (6), మనీష్(4) ఆకట్టుకున్నారు. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ 30-15తో సన్‌ఫ్లవర్ స్కూల్‌పై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో జాన్సన్ గ్రామర్ తరఫున నీరజ్ (8), ప్రణవ్ (6)... సన్‌ఫ్లవర్ జట్టులో రోహన్ (6) రాణించారు.
తొలి రౌండ్ ఫలితాలు
సుచిత్ర అకాడమీ 29-11తో సాధు వశ్వాని ఇంటర్నేషనల్ స్కూల్‌పై, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 42-9 తో సన్‌ఫ్లవర్ వేదిక్ స్కూల్‌పై, నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 31-8తో శాంతినికేతన్ విద్యాలయపై విజయం సాధించాయి.