అమెరికన్ సెంచరీ ఛాంపియన్‌షిప్ సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నీలో సంచలనం నమోదైంది. గోల్డెన్ స్టేట్ వారియర్స్ స్టార్, అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ Hole-in-one (ఒకే షాట్‌కు రంధ్రంలోకి బంతి పడటం) ఫీట్‌ను నమోదు చేశాడు. తాహో సరస్సు తీరాన ఇటీవల జరిగిన పోటీలో కర్రీ ఈ ఘనత సాధించాడు.
Shooters Shoot!!! Hole In One vibes out here in Lake Tahoe. That’s✌🏽@acchampionship @callawaygolf pic.twitter.com/8Nzlznf9EL
— Stephen Curry (@StephenCurry30) July 16, 2023
152 గజాల పార్-3 ఏడవ రంధ్రంలోకి కర్రీ నేరుగా షాట్ కొట్టాడు. బంతి గమ్యానికి చేరగానే కర్రీ ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. టోపీని గాల్లోకి ఎగరేసి, స్ప్రింటర్‌లా తాను సాధించిన లక్ష్యంవైపు పరుగులు పెట్టాడు. విజయదరహాసంతో ఊగిపోతూ.. గాల్లోకి పంచ్‌లు విసురుతూ ఘనంగా తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇది కదా షాట్ అంటే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏం షాట్ కొట్టావు గురూ.. అంటూ కర్రీని అభిమానులు అభినందిస్తున్నారు.
కాగా, గోల్ఫ్ క్రీడలో Hole-in-one ఫీట్ అనేది చాలా అరుదుగా నమోదవుతుంది. ఈ ఫీట్‌తో కర్రీ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుని, తన ప్రత్యర్ధులపై పైచేయి సాధించాడు. ఇంటితో ఆగని కర్రీ అమెరికన్ సెంచరీ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. సెలబ్రిటీ టోర్నమెంట్‌లో కర్రీకి ఇది తొలి టైటిల్. ఈ టోర్నీలో కర్రీ (75 పాయింట్లు) తన సమీప ప్రత్యర్ధి మార్డీ ఫిష్‌పై (మాజీ ప్రో టెన్నిస్ ప్లేయర్) 2 పాయింట్ల తేడాతో నెగ్గాడు.
Comments
Please login to add a commentAdd a comment