golf
-
దక్షిణాన గోల్ఫ్ సిటీ 10 వేల మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమె రికా (పీజీఏ), స్థానిక భాగ స్వామి స్టోన్ క్రాఫ్ట్ తో కలిసి సిటీ దక్షిణాన విస్తారమైన గోల్ఫ్ సిటీని నిర్మించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ ప్రభు త్వం సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పీజీఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు. పీజీఏ ప్రస్తుతం ముంబైలో షాపూర్జీ పల్లోంజి సంస్థతో కలిసి గోల్ఫ్ సిటీ నిర్మాణం చేపడుతోందని, ఇక్కడ స్టోన్ క్రాఫ్ట్ భాగస్వామ్యంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని వివరించారు.గోల్ఫ్ సిటీ నిర్మాణం పూర్తయితే వచ్చే పదేళ్లలో పదివేల మందికి ఉపాధి దొరుకు తుందని శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మానస పుత్రిక ఫోర్త్ సిటీలో ఎటువంటి కాలుష్యం వెలువడని నెట్– జీరో సిటీని నిర్మిస్తుందని పేర్కొన్నారు. అమెరికా టెక్సస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో ప్రధాన కేంద్రంగా ఉన్న పీజీఏ ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో మంత్రితో భేటీ అయింది.నిర్మాణాలకు మూడింతలు ప్రకృతి వనాలను పెంచడం ద్వారా ఆహ్లాదకర నివాస ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సంస్థలు తమ ప్రెజెంటేషన్‌లో వెల్లడించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు. పీజీఏ కన్సార్టియం 200 ఎకరాల్లో ‘18 హోల్’ ప్రామాణిక గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేస్తుంది. మియావాకి పద్ధతిలో అడవిని పెంచడం ద్వారా సహజ సిద్ధమైన డెక్కన్ శిలలకు, స్థానిక నీటి వనరులకు ఒక అలంకారప్రాయమ వుతుందన్నారు. భేటీలో స్టోన్ క్రాఫ్ట్ సీఈ వో కీర్తి చిలుకూరి, అలోక్ తివారి, పీజీఏ ప్రతినిధులు టిమ్ లాబ్, అలెక్స్ హే, డేవిడ్ బ్లమ్ పాల్గొన్నారు. -
గోల్ఫర్ సాహిత్ రెడ్డికి నిరాశ
కాలిఫోర్నియా: ప్రొకోర్ చాంపియన్‌షిప్ గోల్ఫ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, భారత సంతతి అమెరికా గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఈసారి టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో సాహిత్ 12 అండర్ 276 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. ప్యాటన్ కిజైర్ (అమెరికా) 20 అండర్ 268 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. డేవిడ్ లిప్స్కీ (అమెరికా) రెండో స్థానంలో, ప్యాట్రిక్ ఫిష్‌బర్న్ (అమెరికా) మూడో స్థానంలో నిలిచారు.విజేతగా నిలిచిన ప్యాటర్ కిజైర్కు 10,80,000 డాలర్లు (రూ. 9 కోట్ల 5 లక్షలు), రన్నరప్ లిప్‌స్కీకి 6,54,000 డాలర్లు (రూ. 5 కోట్ల 48 లక్షలు), సెకండ్ రన్నరప్ ఫిష్బర్న్కు 4,14,000 డాలర్లు (రూ. 3 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచిన తీగల సాహిత్ 1,76,100 డాలర్ల (రూ. 1 కోటి 47 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు.హైదరాబాద్‌కు చెందిన తీగల సాహిత్ తల్లిదండ్రులు 1980 దశకంలో అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్ అమెరికాలోనే పుట్టి పెరిగి గోల్ఫర్గా రాణిస్తున్నాడు. -
గోల్ఫర్ సాహిత్‌కు రూ. 62 కోట్ల ప్రైజ్‌మనీ
అట్లాంటా (అమెరికా): ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ) సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నీ టూర్ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి అమెరికన్ గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఆకట్టుకున్నాడు. –24 అండర్ స్కోరుతో సాహిత్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనకుగాను సాహిత్‌కు 75 లక్షల డాలర్లు (రూ. 62 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. విజేతకు రూ. 209 కోట్లుసాహిత్ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ 1980 దశకంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. సాహిత్ కాలిఫోర్నియాలో జన్మించి అక్కడే పెరిగాడు. అమెరికాకే చెందిన స్కాటీ షెఫ్లర్ –30 అండర్ స్కోరుతో విజేతగా నిలిచి 2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 209 కోట్లు) ప్రైజ్‌మనీని దక్కించుకోగా... కొలిన్ మొరికావా –26 అండర్ స్కోరుతో రన్నరప్‌గా నిలిచి 1 కోటీ 25 లక్షల డాలర్ల (రూ. 104 కోట్లు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాడు. -
గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? స్పెయిన్‌లో ఏం జరుగుతోంది?
స్పెయిన్‌లోని పర్యావరణ కార్యకర్తలు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఐరోపా దేశాలు తీవ్రమైన కరువుతో తల్లడిల్లుతున్న నేపధ్యంలో స్పెయిన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్తలు నీటిని పొదుపు చేయడానికి నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మాడ్రిడ్, వాలెన్సియా, ఇబిజా, నవర్రాతో సహా ఆరు రాష్ట్రాలలో గోల్ఫ్ కోర్సుల రంధ్రాలను మూసివేశారు. గోల్ఫ్ కోర్స్ చుట్టూ ఉన్న పచ్చటి ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ 22,000 గ్యాలన్లకు పైగా నీరు అవసరమని వారు చెబుతున్నారు. కరువు కారణంగా స్పెయిన్ రైతులు తమ పంటలకు తగినంత నీరు అందకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దేశంలో గోల్ఫ్ కోర్సుల కంటే పంట పొలాలకు నీటి అవసరం అధికమని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం పర్యావరణ కార్యకర్తలు ప్రస్తుతం 10 గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేశారు. మైదానంలో కొన్ని గుంతలలో మొక్కలు నాటడమే కాకుండా కొన్నింటిని సిమెంటుతో మూసివేశారు. ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ (ఎక్స్ఆర్) సంస్థ సభ్యులు పర్యావరణ కార్యకర్తలతో కలిసి ఈ పనులు చేపట్టారు. కరువు సంక్షోభం మధ్య నీటి వృథాను అరికట్టేందుకు గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేయడం తప్పనిసరి అని ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ గ్రూప్ పేర్కొంది. దేశమంతా కరువుతో తల్లడిల్లిపోతున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఉన్నతవర్గం వారు గోల్ఫ్ కోర్సుల పేరుతో నీటిని వృథా చేయడం తగదన్నారు. సంపన్నుల అనవసర కార్యకలాపాల వల్ల వనరులు వృథా అవుతున్నాయని వారు ఆరోపించారు. కొన్ని నెలలుగా స్పెయిన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులలోని నీటిశాతం నిరంతరం తగ్గతూవస్తోంది. ఈ నేపధ్యంలోనే శాన్ రోమన్ డి కా సౌ రిజర్వాయర్ నీటి మట్టం 1990 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో రిజర్వాయర్‌లో మునిగిపోయిన పాత చర్చి పూర్తిగా కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్‌లో కరువు పరిస్థితులు మరింతగా పెరగనున్నాయి. ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? -
Hyd: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్ 3 నిర్వహణకు సర్వం సిద్ధం
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) మూడో ఎడిషన్ నిర్వహణకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో పోటీలో ఉన్న 16 జట్లు.. పూల్‌లోని 215 మంది ఆటగాళ్ల సేవలను వినియోగించుకునే క్రమంలో వేలంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. కాగా ఐదు వారాల ఈ మెగా ఫెస్టివల్లో నాలుగు జట్లతో కూడిన నాలుగు గ్రూపులు లీగ్ ఫార్మాట్లో ఆడతాయి. అనంతరం క్వార్టర్‌ఫైనల్ నుంచి ప్రతి గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. ఔత్సాహిక గోల్ఫ్ క్రీడాకారులని ప్రోత్సహించే క్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న వార్షిక వేడుక ఇది. లీగ్ మద్దతుదారులు, స్పాన్సర్ల బృందం తోడ్పాటుతో ప్రతి సీజన్లో అభివృద్ధి చెందుతోంది. గతేడాది ఫైనల్లో.. శ్రీనిధియన్ థండర్‌బోల్ట్స్ విల్లాజియో హైలాండర్స్‌ను 4 -2 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక గోల్ఫ్ క్లబ్ నవ శకానికి నాంది పలికేందుకు ఇటీవల నిర్మించిన న్యూ క్లబ్‌హౌస్‌లో విజయవంతమైన వేలంతో మూడో సీజన్ ఆరంభానికి వేదిక సిద్ధమైంది. ఈవెంట్‌ను నిర్వహించే నలుగురు సభ్యుల పాలక మండలి ద్వారా TPGL విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కౌన్సిల్లో చైర్మన్ జయంత్ ఠాగూర్ TPGL నిర్వాహక బృందానికి నాయకత్వం వహిస్తుండగా.. ఆయనకు మద్దతుగా వైస్ చైర్మన్ టి.అజయ్ రెడ్డి (వైస్ చైర్మన్), సభ్యులు డి.వందిత్ రెడ్డి, ఉత్తమ్ సింఘాల్ తమ సేవలు అందిస్తున్నారు. ఈ సీజన్ వేలం ద్వారా నిర్వహించబడుతున్న క్రమంలో.. కౌన్సిల్‌కు చెందిన పదహారు మంది ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో జయంత్ ఠాగూర్ (ప్రెసిడెంట్, HGA) మాట్లాడుతూ.. గోల్ఫింగ్ కమ్యూనిటీ కోసం మరో లీగ్‌ని నిర్వహించడం పట్ల తమకు సంతోషంగా ఉందన్నారు. ఇక.. నగర గోల్ఫ్ క్రీడాకారులు ఈ మార్క్యూ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఇక్కడ గోల్ఫ్ కోర్స్ పట్ల ఉత్సాహం తారాస్థాయిలో ఉందని వందిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
Asian Games 2023: పదిహేను పతకాలతో పండుగ
ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.... ఏకంగా 15 పతకాలతో పండుగ చేసుకున్నారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా తొమ్మిది పతకాలు రాగా... షూటింగ్లో మూడు పతకాలు... బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రీడాకారులు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రజతం, తెలంగాణ అథ్లెట్ అగసార నందిని కాంస్యం... తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యం... తెలంగాణ షూటర్ కైనన్ చెనాయ్ స్వర్ణం, కాంస్యంతో మెరిపించారు. రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ సభ్యులుగా ఉన్నారు. ఎనిమిదో రోజు పోటీలు ముగిశాక భారత్ 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలను అందుకున్నారు. అటు సీనియర్లు, ఇటు జూనియర్లు కూడా సత్తా చాటడంతో భారత్ ఖాతాలో ఆదివారం ఒక్క అథ్లెటిక్స్‌లోనే 9 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రేసు విషయంలో కాస్త వివాదం రేగినా... చివరకు రజతంతో కథ సుఖాంతమైంది. తెలంగాణకు చెందిన అగసార నందిని కూడా ఏషియాడ్ పతకాల జాబితాలో తన పేరును లిఖించుకుంది. సత్తా చాటిన సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల విభాగంలో గతంలో ఏ భారత అథ్లెట్‌కూ సాధ్యంకాని రీతిలో స్వర్ణ పతకంతో మెరిసాడు. 8 నిమిషాల 19.50 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసిన సాబ్లే మొదటి స్థానంలో నిలిచాడు. 29 ఏళ్ల సాబ్లే ఈ క్రమంలో కొత్త ఆసియా క్రీడల రికార్డును నమోదు చేశాడు. 2018 జకార్తా క్రీడల్లో హొస్సీన్ కేహని (ఇరాన్: 8 నిమిషాల 22.79 సెకన్లు) పేరిట ఉన్న ఘనతను అతను సవరించాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ మహిళల విభాగంలో మాత్రం భారత్ నుంచి 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో సుధా సింగ్ స్వర్ణం గెలుచుకుంది. తజీందర్ తడాఖా పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్‌పాల్ సింగ్ తూర్ సత్తా చాటడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 2018 జకార్తా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న అతను ఈసారి తన మెడల్‌ను నిలబెట్టుకున్నాడు. ఇనుప గుండును 20.36 మీటర్ల దూరం విసిరిన తజీందర్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అతను ఫౌల్ చేసినా మూడో ప్రయత్నంలో 19.51 మీటర్ల దూరం గుండు వెళ్లింది. తర్వాతి ప్రయత్నంలో దానిని 20.06 మీటర్లతో అతను మెరుగుపర్చుకున్నాడు. ఐదో ప్రయత్నం కూడా ఫౌల్ అయినా... ఆఖరి ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో పసిడిని ఖాయం చేసుకున్నాడు. పర్దుమన్ సింగ్, జోగీందర్ సింగ్, బహదూర్ సింగ్ చౌహాన్ తర్వాత వరుసగా రెండు ఆసియా క్రీడల్లో షాట్‌పుట్ ఈవెంట్లో స్వర్ణం సా ధించిన నాలుగో భారత అథ్లెట్‌గా తజీందర్ నిలిచాడు. సిల్వర్ జంప్ పురుషుల లాంగ్‌జంప్‌లో భారత ఆటగాడు మురళీ శ్రీశంకర్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన మురళీ ఇక్కడ ఆసియా క్రీడల్లోనూ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 8.19 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచాడు. జియాన్ వాంగ్ (చైనా–8.22 మీ.), యుహావో షి (చైనా–8.10 మీ.) స్వర్ణ, కాంస్యాలు సాధించారు. వహ్వా హర్మిలన్ 1998 జనవరి... పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి అయిన మాధురి సింగ్ మూడు నెలల గర్భిణి. అయితే క్రీడాకారుల కోటాలో ఉద్యోగం పొందిన ఆమె సంస్థ నిబంధనలు, ఆదేశాల ప్రకారం తన ప్రధాన ఈవెంట్ 800 మీటర్ల నుంచి 1500 మీటర్లకు మారి పరుగెత్తాల్సి వచ్చింది. 1500 మీటర్ల ట్రయల్‌లో పాల్గొని ఉద్యోగం కాపాడుకున్న మాధురికి ఆరు నెలల తర్వాత పాప పుట్టింది. ఆ అమ్మాయే హర్మిలన్ బైన్స్. నాలుగేళ్ల తర్వాత 2002 ఆసియా క్రీడల్లో మాధురి 800 మీటర్ల పరుగులోనే పాల్గొని రజత పతకం సాధించింది. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత ఆమె కూతురు ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసింది... అదీ 1500 మీటర్ల ఈవెంట్లో కావడం యాదృచ్చికం! ఆదివారం జరిగిన 1500 మీటర్ల పరుగును హర్మిలన్ 4 నిమిషాల 12.74 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. అజయ్‌కు రజతం, జాన్సన్‌కు కాంస్యం పురుషుల 1500 మీటర్ల పరుగులో కూడా భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ సరోజ్, కేరళ అథ్లెట్ జిన్సన్ జాన్సన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 3 నిమిషాల 38.94 సెకన్లలో అజయ్ రేసు పూర్తి చేయగా, 3 నిమిషాల 39.74 సెకన్లలో లక్ష్యం చేరాడు. ఈ ఈవెంట్లో ఖతర్‌కు చెందిన మొహమ్మద్ అల్‌గర్ని (3 నిమిషాల 38.38 సెకన్లు)కు స్వర్ణం దక్కింది. సీనియర్ సీమ జోరు మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిసింది. 2014లో స్వర్ణం, 2018లో కాంస్యం గెలిచిన సీమ ఈసారి కూడా కాంస్య పతకాన్ని తన మెడలో వేసుకుంది. 40 ఏళ్ల సీమ డిస్కస్‌ను 58.62 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో కామన్వెల్త్ క్రీడల్లోనూ 3 రజతాలు, 1 కాంస్యం నెగ్గిన సీమ ఇవి తనకు ఆఖరి ఆసియా క్రీడలని ప్రకటించింది. ర్యాంకింగ్ ద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది. -
చరిత్ర సృష్టించిన అదితి అశోక్.. గోల్ఫ్‌లో తొలి పతకం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో భారత గోల్ఫర్ అదితి అశోక్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన మహిళల గోల్ఫ్ పోటీలో అదితి అశోక్ రజత పతకం కైవసం చేసుకుంది. తద్వారా ఆసియా క్రీడల్లో గోల్ఫ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అదితి రికార్డులకెక్కింది. అండర్-17 స్కోర్‌తో నాలుగు రౌండ్ల పోటీని ముగించిన అదితి రెండో స్ధానంలో నిలిచింది. ఇక అండర్-19 స్కోర్‌తో అగ్రస్ధానంలో నిలిచిన థాయ్‌లాండ్ గోల్ఫర్ అర్పిచాయ యుబోల్ బంగారు పతకం సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాది ఆసియాక్రీడల్లో భారత్ మొత్తం 41 పతకాలు సాధించింది. అందులో 11 బంగారు పతకాలు, 16 సిల్వర్, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: కొంచెం బాధగా ఉంది.. నాకు అలవాటు అయిపోయింది: చాహల్ -
నేటి నుంచి వైజాగ్ ఓపెన్ గోల్ఫ్
విశాఖ స్పోర్ట్స్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఇండియా(పీజీటీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ‘వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ 2023’ ప్రారంభం కానుంది. ప్రొఫెషనల్ గోల్ఫ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో పీజీటీఐ టోర్నీలు నిర్వహిస్తుండగా, విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. తొలి రోజు ప్రాక్టీస్ రౌండ్స్ రెండో రోజు ప్రోటోర్నీ జరగనున్నాయి. 20 నుంచి 23వ తేదీ వరకు నాలుగు రౌండ్ల పాటు స్ట్రోక్ ప్లే ప్రధాన టోర్నీ జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రోటోర్నీని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ప్రారంభించనుండగా.. విజేతలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి బహుమతులు అందించనున్నారన్నారు. భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన మేటి గోల్ఫర్స్ 126 మంది ఈ టోర్నీలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ టోర్నీలో సత్తాచాటిన వారు ప్రైజ్‌మనీ పొందటంతో పాటు తమ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు, అంతర్జాతీయ టోర్నీలో అర్హత సాధించేందుకు దోహదపడుతుందని వివరించారు. యూరోస్పోర్ట్స్, సోషల్ మీడియా, దూరదర్శన్ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుందన్నారు. 1984లో నిరి్మంచిన ఈపీజీసీ ఉత్తమ పునఃనిర్మాణ గోల్ఫ్‌కోర్స్‌గానూ గతేడాది అవార్డు అందుకుందని చెప్పారు. -
ఇది కదా షాట్ అంటే.. కొడితే నేరుగా..!
అమెరికన్ సెంచరీ ఛాంపియన్షిప్ సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నీలో సంచలనం నమోదైంది. గోల్డెన్ స్టేట్ వారియర్స్ స్టార్, అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ Hole-in-one (ఒకే షాట్‌కు రంధ్రంలోకి బంతి పడటం) ఫీట్‌ను నమోదు చేశాడు. తాహో సరస్సు తీరాన ఇటీవల జరిగిన పోటీలో కర్రీ ఈ ఘనత సాధించాడు. Shooters Shoot!!! Hole In One vibes out here in Lake Tahoe. That’s✌🏽@acchampionship @callawaygolf pic.twitter.com/8Nzlznf9EL — Stephen Curry (@StephenCurry30) July 16, 2023 152 గజాల పార్-3 ఏడవ రంధ్రంలోకి కర్రీ నేరుగా షాట్ కొట్టాడు. బంతి గమ్యానికి చేరగానే కర్రీ ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. టోపీని గాల్లోకి ఎగరేసి, స్ప్రింటర్‌లా తాను సాధించిన లక్ష్యంవైపు పరుగులు పెట్టాడు. విజయదరహాసంతో ఊగిపోతూ.. గాల్లోకి పంచ్‌లు విసురుతూ ఘనంగా తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇది కదా షాట్ అంటే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏం షాట్ కొట్టావు గురూ.. అంటూ కర్రీని అభిమానులు అభినందిస్తున్నారు. కాగా, గోల్ఫ్ క్రీడలో Hole-in-one ఫీట్ అనేది చాలా అరుదుగా నమోదవుతుంది. ఈ ఫీట్‌తో కర్రీ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుని, తన ప్రత్యర్ధులపై పైచేయి సాధించాడు. ఇంటితో ఆగని కర్రీ అమెరికన్ సెంచరీ ఛాంపియన్షిప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. సెలబ్రిటీ టోర్నమెంట్లో కర్రీకి ఇది తొలి టైటిల్. ఈ టోర్నీలో కర్రీ (75 పాయింట్లు) తన సమీప ప్రత్యర్ధి మార్డీ ఫిష్‌పై (మాజీ ప్రో టెన్నిస్ ప్లేయర్) 2 పాయింట్ల తేడాతో నెగ్గాడు. -
T9 గోల్ఫ్ ఛాలెంజ్ సంయుక్త విజేతలుగా సిమెట్రిక్స్ , బౌల్డర్ హిల్స్ టైగర్స్
T9 గోల్ఫ్ ఛాలెంజ్ రెండో సీజన్లో సిమెట్రిక్స్ , బౌల్డర్ హిల్స్ టైగర్స్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ 4-4 స్కోర్‌తో టై అయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ బౌల్డర్ హిల్స్ టైగర్స్ ఆరంభంలో ఆధిక్యంలో నిలిచినా...తర్వాత సిమెట్రిక్స్ టీమ్ అద్భుతంగా పుంజుకుంది. స్కోర్ సమం కావడంతో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇరు జట్ల కెప్టెన్లకు ట్రోఫీతో పాటు 5 లక్షల రూపాయల ప్రైజమనీ చెక్ ను అందజేశారు. అంతకు ముందు మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో జాగృతి జాగ్వర్స్ 3-1 స్కోర్ తో ఎకోలాస్టిక్ ఈగల్స్ పై విజయం సాధించింది. కాగా గోల్ఫ్ ను మరింత ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో ఈ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నామని టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్ఆర్ ఎన్ రెడ్డి చెప్పారు. -
టైగర్‌వుడ్స్‌పై మాజీ గర్ల్‌ఫ్రెండ్ పరువునష్టం దావా
గోల్ఫ్ రారాజు టైగర్‌వుడ్స్‌పై పరువు నష్టం దావా దాఖలైంది. అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎరికా హెర్మన్ దాదాపు 30 మిలియన్ డాలర్ల కింద పరువునష్టం దాఖలు చేసినట్లు ఆమె తరపు లాయర్ వెల్లడించాడు. 2017లో టైగర్‌వుడ్స్, ఎరికా హెర్మన్ల మధ్య మొదలైన రిలేషిన్షిప్ 2022 వరకు కొనసాగింది. అయితే రిలేషన్షిప్ ప్రారంభంలో ఎరికా హెర్మన్, టైగర్‌వుడ్స్ మధ్య నాన్డిస్క్లోజర్ ఒప్పందం జరిగింది. తాజాగా ఈ ఒప్పందం నుండి తనను విడుదల చేయాలని కోరుతూ దావా వేసింది. ఈ మేరకు కోర్టు బుధవారం ఫైలింగ్స్ చూపించింది. ఫ్లోరిడాలోని మార్టిన్ కౌంటీలోని 19వ జ్యుడీషియల్ సర్క్యూట్ యొక్క సర్క్యూట్ కోర్టులో అభ్యర్థనను దాఖలు చేసింది. ఏఎఫ్‌పీ చూసిన కోర్టు రికార్డుల ప్రకారం, స్పీక్ అవుట్ యాక్ట్ అని పిలువబడే యూఎస్ ఫెడరల్ చట్టం ప్రకారం ఆమె సంతకం చేయాల్సిన ఎన్డీఏ "చెల్లదు మరియు అమలు చేయలేనిది" అని హర్మన్ తరపు న్యాయవాదులు వాదించారు. 2022 చివరి వరకు తన ఫ్లోరిడా మాన్షన్‌లో 15 సార్లు విజేత అయిన టైగర్ వుడ్స్‌తో ఎరికా హెర్మన్ కలిసి ఉంది. చదవండి: 'గతంలో వచ్చిన రెండుసార్లు డ్రింక్స్ మోశాను.. సెంచరీ విలువైనది' మాజీ క్రికెటర్ ఇంట్లో దొంగతనం.. 2 కోట్ల విలువైన సొత్తు చోరీ -
Golf League: అదరగొట్టిన ఈగల్ హంటర్స్, సామా ఏంజెల్స్
Hyderabad Premier Golf League: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మరింత రసవత్తరంగా మారింది. గ్రూప్ స్టేజ్‌లో ఆధిక్యం కోసం జట్లన్నీ పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా మూడో సీజన్ సెకండ్ లెగ్ పోటీల్లో అండర్ డాగ్స్ సెంట్రో ఈగల్ హంటర్స్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 113 పాయింట్లతో అత్యుత్తమంగా రాణించింది. ఈగల్ హంటర్స్ తరపున కేవీఎస్ ఎన్ రెడ్డి, సురేష్ రాణించారు. అదే విధంగా.. తొలిసారి మహిళలు ఓనర్లుగా ఉన్న ఏకైక గోల్ఫ్ టీమ్ ‘సమా ఏంజెల్స్’ టీమ్.. మూడో సీజన్లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. సరోజా వివేక్, మాధవి ఉప్పలపాటి ఓనర్లుగా వ్యవహరిస్తున్న సమా టీమ్ వికారాబాద్‌లోని వూటీ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన మూడో రౌండ్లో సత్తా చాటింది. సరోజా వివేక్, మాధవి సహా టీమ్ గోల్ఫర్లు ఆకట్టుకున్నారు. ఈ రౌండ్లో సామా ఏంజెల్స్ 109 పాయింట్లు సాధించింది. సిటీలో జరుగుతున్న అది పెద్ద లీగ్ అయిన హెచ్పీజీఎల్లో నాలుగు గ్రూప్స్‌లో 16 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఒక్కో టీమ్‌లో 10 మంది గోల్ఫర్లు ఉన్నారు. ఇక గ్రూప్ దశలో తొలి రెండు రౌండ్లు హెచ్‌సీఏ, బౌల్డర్ హిల్స్‌లో నిర్వహించారు. వచ్చే బుధ, శనివారాల్లో గ్రూప్ దశలో చివరి రౌండ్లు జరుగనున్నాయి. అనంతరం నాకౌట్ రౌండ్ ఆరంభమవుతుంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు టీమ్స్ క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. వచ్చే నెల 24న థాయ్‌లాండ్‌లో ఫైనల్స్‌ను జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్.. షాక్‌కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా.. Gongadi Trisha: శెభాష్ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు -
హోరాహోరీగా హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్
Hyderabad Premier Golf League: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్ పోటాపోటీగా జరుగతోంది. ఈ సీజన్లో రెండో రౌండ్‌కు బౌల్డర్స్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ ఆతిథ్యమిస్తోంది. నాకౌట్ మ్యాచ్‌లు పట్టణంలోనే జరుగనుండగా.. ఫైనల్స్‌కు థాయ్‌లాండ్ ఆతిథ్యమివ్వనుంది. కాగా ఈసారి లీగ్‌లో మొత్తం 16 జట్లు తలపడుతున్నాయి. 2020లో 12 జట్లతో మొదలైన హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్‌కు దేశవాప్తంగా యువ గోల్ఫర్స్ నుంచి స్పందన కనిపిస్తోందని లీగ్ కమీషనర్ డీఎస్ సుమంత్ హర్షం వ్యక్తం చేశారు. గోల్ఫ్ క్రీడకు మరింత ఆదరణ పెంచడంతో పాటు.. యువ గోల్ఫర్స్‌ను ప్రోత్సహించేందుకు లీగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. రెండో రౌండ్ పోటీల్లో మహిళా గోల్ఫర్ కవిత మంత ప్లేయర్ ఆఫ్ దే డేగా నిలిచింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 37 పాయింట్లు సాధించింది. కాగా ఇప్పటివరకూ గ్రూప్ ఏలో మీనాక్షి మావెరిక్స్ , సామా ఏంజేల్స్ , గ్రూప్ బిలో అగిల్స్ డర్టీ డజెన్, అక్షర యోధాస్ , గ్రూప్ సీలో ఈహెచ్ ఏఏం , టీమ్ ఆల్ఫా , గ్రూప్ డీలో మైసా ,ఆరిజిన్స్ జట్టు ఆధిక్యంలో ఉన్నాయి. చదవండి: దంచికొట్టిన ఆయుశ్.. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ ఓటమి -
ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్
ఎంఎస్ ధోని.. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. తనదైన ఫినిషింగ్‌తో అభిమానుల మనసును ఎన్నోసార్లు గెలుచుకున్నాడు. తాను క్రికెటర్ కాకపోయుంటే ఫుట్‌బాలర్ అయ్యేవాడినని ధోని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ధోని స్కూలింగ్ సమయంలో ఫుట్‌బాల్ విపరీతంగా ఆడేవాడు. అందునా గోల్ కీపింగ్ అంటే ప్రాణం. అయితే ఫుట్‌బాల్‌లో ఉంటే ఆదరణ పొందలేమన్న ఒకే ఒక్క కారణం ధోనిని క్రికెట్ర్ను చేసింది. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవలే ధోని ప్రెస్మీట్లో పాల్గొన్నాడు. ప్రెస్‌మీట్‌కు ముందు క్రికెట్‌కు శాశ్వతంగా గుడ్‌బై చెప్పడానికే ప్రెస్‌మీట్ అని అంతా భావించారు. కానీ ధోని అందరి అంచనాలను తలకిందులు చేస్తే ఓరియో బిస్కెట్ బ్రాండ్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ధోని క్రికెటర్ నుంచి కొత్త అవతారంలోకి మారాడు. ఇన్నాళ్లు క్రికెటర్‌గా రాణించిన ధోని ఇప్పుడు గోల్ఫ్‌తో కొత్త కెరీర్‌ను ప్రారంభించాడు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా(PGTI) తమ సోషల్ మీడియాలో ధోని గోల్ఫ్ ఆడిన వీడియోనూ షేర్ చేసింది. కెప్టెన్ కూల్ ఇన్ ది గోల్ఫ్ హౌస్ అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ధోనితో పాటు టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కూడా గోల్ఫ్ ఆటలో భాగమయ్యాడు. ఇక ధోని గోల్ఫ్ ఆడుతుంటే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్లా అనిపించాడు. అతను కొట్టిన షాట్స్ క్రికెట్లో హెలికాప్టర్ షాట్లను తలపించాయి. ఇక ధోని గోల్ప్ ఆడడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. ధోని ఫ్రెండ్ రాజీవ్ శర్మ ధోనికి గోల్ఫ్‌ను పరిచయం చేశాడు. ఇంతకముందు 2019లో అమెరికాకు చెందిన మెతుచెన్ గోల్ఫ్ కంట్రీ క్లబ్ తరపున తొలిసారి గోల్ఫ్ ఆడాడు. తెలియని విషయమేంటంటే అప్పటి టోర్నమెంట్లో ధోని ఐదు మ్యాచ్‌లకు గానూ నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫ్లైట్ కేటగిరిలో రెండో స్థానంలో నిలవడం విశేషం. Captain cool in the house!!!@KDGT_golf#pgtikdgt22 #pgtigram #indiangolf #golfshot #golfclub #golfpro #golfinIndia #KapilDev #KDGTgolf #GOBeyondForGolf #dlfgolfandcountryclub #gtbharat @TataSteelLtd @AmexIndia @AmrutanjanH pic.twitter.com/aEmGOav6rs — PGTI (@pgtofindia) September 30, 2022 The elegance and class of these two modern giants of our sport is all to evident when they take to a day of golf at @KDGT_golf Pic: @karanbindragolf #MSDhoni𓃵 #KapilDev pic.twitter.com/MAQiWjIo1X — Anand Datla (@SportASmile) September 30, 2022 చదవండి: ఓటమి తట్టుకోలేకపోయాడు.. గొడవ పడిన టెన్నిస్ స్టార్లు ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. -
గోల్ఫ్ బంతులను మింగిన పాము: ఫోటోలు వైరల్
పాములు, మొసళ్లు, బల్లులు వంటి కొన్ని సరీసృపాలకు మానవుడి తప్పిదాలు వాటికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. బీచ్‌ల వద్ద, నదుల వద్ద పెద్ద ఎత్తున్న ప్లాస్టిక్ వంటి చెత్తచెదారాలను వేసేస్తాం. పాపం ఈ జంతువులు ఏదో ఆహారంగా బావించి తినడం వంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. ఇక్కడొక పాము కూడా అలానే చేసింది. ఏకంగా గోల్ఫ్ బంతులను కోడి గుడ్డుగా బావించి మింగి నరకయాతన అనుభవించింది. వివరాల్లోకెళ్తే....ఇక్కడొక పాము గోల్ఫ్ బంతులను కోడి గుడ్లనుకుని మింగేసేందుకు ప్రయత్నించింది. ఐతే అవి ఆ పాము శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. దీంతో పాము నరకయాతన అనుభవించింది. ఈ ఘటన నార్త్ కొలరాడో వైల్డ్ లైఫ్ సెంటర్లో చోటు చేసుకుంది. దీంతో ఆ వైల్డ్‌లైఫ్ సెంటర్ అధికారులు స్నేక్ రెస్క్యూ బృందాని పిలిపించారు. ఆ బృందం అసలు విషయం తెలుసుకుని ఆ స్నేక్‌కి సాయం చేశారు. ఆ పాముకి శస్త్ర చికిత్స చేయకుండానే ఆ బంతులను తీసేశారు. సుమారు 30 నిమిషాలు శ్రమించి ఆ పాము శరీరం నుంచి ఆ బంతులను వేరు చేశారు. ప్రస్తుతం ఆ పాము చిన్నపాటి గాయాలతో సురక్షితంగానే ఉంది. ఐతే ఈ పాము చాలా ఆకలిగా ఉండటంతో ఆ గోల్ఫ్ బంతులను చూసి కోడి గుడ్లుగా భ్రమపడి మింగేసిందని వైద్యులు చెబుతన్నారు. (చదవండి: ఆ వైద్యుడు ప్రసంగం ప్రారంభంకాగానే... లేచి వెళ్లిపోయిన విద్యార్థులు: వీడియో వైరల్) -
చరిత్ర సృష్టించిన దీక్ష డాగర్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
బ్రెజిల్లో జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత మహిళా గోల్ఫర్ దీక్ష డాగర్ స్వర్ణ పతకంతో మెరిసింది. గురువారం అమెరికాకు చెందిన యాష్లిన్ గ్రేస్ జాన్సన్‌తో జరిగిన ఫైనల్లో 5-4తో ఓడించి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా డెఫిలింపిక్స్‌లో దీక్ష డాగర్‌కు ఇది రెండో పతకం. ఇంతకముందు 2017 ఆమె రజతం గెలిచింది. ఓవరాల్‌గా డెఫిలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత గోల్ఫర్గా దీక్ష డాగర్ చరిత్ర సృష్టించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చివరి నిమిషంలో అర్హత సాధించిన దీక్ష డాగర్.. ఒలిపింక్స్‌తో పాటు డెఫిలింపిక్స్ ఆడిన తొలి గోల్ఫ్ ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించింది. అంతకముందు బుధవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల దీక్ష... అండ్రియా హోవ్‌స్టెయిన్ (నార్వే)పై విజయం సాధించింది. ఇక బధిరుల ఒలింపిక్స్‌లో భారత్ తాజా దానితో కలిపి ఇప్పటివరకు 10 పతకాలు గెలుచుకుంది. ఇందులో ఏడు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: Asia Cup: ఆర్చరీలో భారత్ అదుర్స్ Golfer🏌️♀️Diksha Dagar won GOLD🥇at Brazil #Deaflympics2021! 😍 Congratulations on this amazing victory! 👏#JeetKaJazba https://t.co/jZigPgNSma — Dept of Sports MYAS (@IndiaSports) May 12, 2022 -
గోల్కొండలో ర‘కూల్’ గోల్ఫ్ (ఫోటోలు)
-
మనసులు గెలిచిన అదితి.. పార్, బర్డీ, ఈగల్ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: ‘‘ఏం అర్థం కావడం లేదు. కానీ చూడటానికి మాత్రం బాగుంది’’.. టోక్యో ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణించిన భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ ఆడుతున్న సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ ఇది. నిజమే.. గోల్ఫ్ అంటే ఏంటో తెలియని వాళ్లను కూడా టీవీని అతుక్కుపోయేలా చేసింది మన అమ్మాయి. తొలిసారి ఫైనల్‌కు చేరిన అతిదిని ఉద్దేశించి అభిమానులంతా.. ‘‘కమాన్ అదితి.. నీకోసం మేమంతా ప్రార్థిస్తున్నాం’’ అని ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు. ఫలితం ఎలా ఉన్నా అదితి పోరాటం స్ఫూర్తిదాయకం. మూడు రౌండ్ల వరకు ఆమె సాగించిన ప్రయాణం నవతరానికి మార్గదర్శనం. పతకం చేజారినా అదితి అద్భుత ప్రదర్శన భారతీయులను గర్వపడేలా చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై కురుస్తున్న ప్రశంసల వర్షమే ఇందుకు నిదర్శనం. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే.. రిచ్చెస్ట్ గేమ్‌గా పేరొందిన గోల్ఫ్ గురించి మనలో చాలా మందికి బేసిక్ రూల్స్, పదాల గురించి కూడా అవగాహన ఉండదు కదా! అయితేనేం, అదితి ఆడుతున్నంత సేపు అందరూ ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా పార్స్, బర్డీస్, ఈగల్స్, బొగేస్ అన్న పదాల గురించి సోషల్ మీడయాలో చర్చ జరిగింది. అసలు వీటికి అర్థాలేంటి? గోల్ఫ్ వ్యక్తిగత విభాగంలో విజేతను ఎలా తేలుస్తారన్న అంశాల గురించి సంక్షిప్త సమాచారం మీకోసం.. ►సాధారణంగా పచ్చికతో లేదా ఇసుకతో నిండి ఉన్న విశాలమైన ప్రదేశంలో స్టిక్‌తో ప్రత్యేక బంతిని గమ్యస్థానమైన నిర్ణీత రంధ్రంలోకి ముందుకు తీసుకెళ్లడమే గోల్ఫ్ లక్ష్యం. గోల్ఫ్ కోర్సులో 9 లేదా 18 రంధ్రాలు ఉంటాయి. ఒక్కొక్కటి పరస్పర విరుద్ధ రూపాలు, లక్షణాలు కలిగి ఉంటాయి. బంతిని హోల్లోకి కొట్టేందుకు కనీసమైన స్ట్రోకులు(షాట్లు) చేయాల్సి ఉంటుంది. పార్: ప్రొఫెషనల్ గోల్ఫర్.. గోల్ఫ్ కోర్సులోని ఒక నిర్ణీత హోల్లోకి ఎన్ని స్ట్రోక్‌లలో బంతిని చేర్చారన్న స్కోరును తెలిపేదే పార్. సింపుల్‌గా చెప్పాలంటే.. స్ట్రోకుల సంఖ్యను ‘పార్’ సూచిస్తుంది. ►హోల్స్ పొడవు, లక్షణాల ఆధారంగా పార్-3(హోల్లో బంతిని చేర్చేందుకు మూడు స్ట్రోకులు), పార్-4, పార్-5.. అరుదుగా పార్-6.. గోల్ఫ్ కోర్సు స్వరూపం, రేటింగ్‌ను నిర్ణయిస్తారు. ►ఇక నిర్ణీత స్ట్రోకుల కంటే తక్కువ షాట్స్‌లోనే లక్ష్యాన్ని చేరితే.. సదరు గోల్ఫర్ స్కోరును అండర్ పార్తో సూచిస్తారు. అంతకంటే ఎక్కువ స్ట్రోకులు తీసుకుంటే ఓవర్ పార్ అంటారు. ►బర్డీ, ఈగల్స్, బొగేస్ అనేవి ఒక గోల్ఫర్ ప్రదర్శనకు కొలమానంగా నిలిచే అంశాలు. ►బర్డీ- ఒక హోల్లో బంతిని చేర్చేందుకు అవసరమైన నిర్ణీత స్ట్రోకుల కంటే కచ్చితంగా ఒక స్ట్రోకు తక్కువగా ఉంటే దానిని (1- అండర్ పార్) బర్డీగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు.. పార్-5 హోల్‌ను పూర్తి చేసేందుకు కేవలం నాలుగు స్ట్రోకులు మాత్రమే అవసరమైతే దానిని బర్డీ అంటారు. ►బొగే- అదే విధంగా నిర్ణీత స్ట్రోకుల కంటే ఒకటి ఎక్కువ తీసుకుంటే.. 1-ఓవర్ పార్ ఆన్ హోల్‌ను బొగేగా వ్యవహరిస్తారు. 2- ఓవర్ పార్ అయితే డబుల్ బొగే, 3- ఓవర్ పార్ అయితే ట్రిపుల్ బొగే అంటారు. ►ఈగల్- 2-అండర్ పార్ ఆన్ హోల్‌ను ఈగల్ అంటారు. అత్యంత అరుదుగా నమోదయ్యే 3- అండర్ పార్ను డబుల్ ఈగల్ అంటారు. పార్-3, పార్-, పార్-5 హోల్స్.. గోల్ఫ్ స్కోరింగ్ ఇలా పార్-5 హోల్: ►డబుల్ ఈగల్: పార్- 5 స్కోరింగ్ అంటే.. రెండు స్ట్రోకుల్లోనే లక్ష్యం పూర్తిచేసినట్లు అర్థం. అదే విధంగా... ఈగల్- 3 స్ట్రోకులు, బర్డీ- 4 స్ట్రోకులు, పార్- 5 స్ట్రోకులు, బొగే- 6 స్ట్రోకులు, డబుల్ బొగే- 7 స్ట్రోకులు, ట్రిపుల్ బొగే- 8 స్ట్రోకులలో టార్గెట్ ముగించినట్లన్న మాట. పార్- 4 హోల్.. లక్ష్యం పూర్తి చేసే విధానం, స్కోరు. ►డబుల్ ఈగల్- పార్-4: ఒకే ఒక్క స్ట్రోకులో లక్ష్యాన్ని చేరడం(దాదాపు అసాధ్యం) ఈగల్- 2 స్ట్రోక్స్‌లో.. బర్డీ: 3 స్ట్రోక్స్‌లో.. పార్- 4 స్ట్రోక్స్‌లో.. బొగే- 5 స్ట్రోక్స్‌లో.. డబుల్ బొగే- 6 స్ట్రోక్స్‌లో.. ట్రిపుల్ బొగే- 7 స్ట్రోక్స్‌లో పార్-3 హోల్: ►డబుల్ ఈగల్- పార్-3 హోల్లో డబుల్ ఈగల్ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్క షాట్ కూడా ఆడకుండా లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం. ►ఈగల్- ఒకే ఒక స్ట్రోక్‌తో లక్ష్యాన్ని చేరుకోవడం ►బర్డీ- 2 స్ట్రోకుల్లో ►పార్- 3 స్ట్రోకుల్లో ►బొగే- 4 స్ట్రోకుల్లో ►డబుల్ బొగే- 5 స్ట్రోకుల్లో ►ట్రిపుల్ బొగే- 6 స్ట్రోకుల్లో అంటే, తక్కువ షాట్స్‌లో బంతిని హోల్లో చేర్చిన వారినే విజేతగా నిర్ణయిస్తారన్న మాట. శుక్రవారం నాటి టోక్యో ఒలింపిక్స్ ఫైనల్లో అమెరికాకు చెందిన కోర్డా నెల్లే స్వర్ణ పతక విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇనామీ మోనె(జపాన్), కో లిడియా(న్యూజిలాండ్) రజత, కాంస్య పతకాలు గెల్చుకున్నారు. అదితి నాలుగో స్థానానికే పరిమితమైంది. -
అదితి ఓ సెన్సేషన్.. ఈ పోరు చరిత్రలో నిలవాల్సిందే!
క్రీడాభిమానుల గుండె వేగం పెంచే ఆట క్రికెట్ ఒక్కటేనా?.. ఛా.. ఛా.. ఈసారి ఒలింపిక్స్‌లో అలాంటి క్షణాలు చాలానే కనిపించాయి. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్.. అంటూ హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్.. ఆఖరికి రూల్స్‌పై కూడా సరిగా అవగాహనా- ఆటపై అంతగా ఆసక్తి సైతం లేని గోల్ఫ్‌ను సైతం కోట్ల భారతావనిని ఆసక్తిగా తిలకించేలా చేశారు మన ఆటగాళ్లు. అలాంటి ఉత్కంఠంతో చివరిదాకా మ్యాచ్‌ను కొనసాగించి.. ఓడినా చరిత్ర సృష్టించింది భారత యువగోల్ఫర్ అదితి అశోక్ . సాక్షి, వెబ్‌డెస్క్: ఆటల్లో రిచ్చెస్ట్ గేమ్‌గా గోల్ఫ్‌కు ఓ పేరుంది. అలాంటి ఆటలో.. అదీ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌దాకా చేరుకుని భారత్‌కు పతాక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు.. ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్‌లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం.. మహిళా గోల్ఫ్ ర్యాకింగ్స్లో ఆమెది 200వ ర్యాంక్. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం ప్రత్యేకమనే చెప్పాలి. బెంగళూరుకు చెందిన అదితి అశోక్.. టోక్యో ఒలింపిక్స్‌లో నిన్నటి పొజిషన్లో(మూడో రౌండ్) రెండో స్థానంలో నిలవగా.. అదృష్టం బావుండి ఇవాళ్టి వాతావరణం బాగోలేకపోతే దాదాపు పతాకం ఖాయమయ్యేదే. అయితే శనివారం ఉదయం సైటమాలోని కాసుమిగాసెకి కౌంట్రీ క్లబ్లో జరిగిన ఫైనల్ గేమ్ రసవత్తరంగా నడిచింది. అయినా అతిది అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. టాప్ పొజిషన్లో నిలిచి ఒకానొక టైంలో అభిమానుల్లో స్వర్ణం ఆశలు రేకెత్తించి ఉత్కంఠ పెంచిన అదితి.. ఆపై రెండు, మూడు.. చివరికి స్వీయ తప్పిదం-ప్రత్యర్థులకు కలిసి రావడంతో నాలుగో స్థానానికి సెటిల్ అయ్యింది. పతకం దక్కించుకోకపోతేనేం.. గోల్ఫ్ ఆటలోనూ అసలైన మజాను కోట్ల మంది భారతీయులకు రుచి చూపించింది అదితి. ఇక రియో ఒలింపిక్స్‌లో 41 వ స్థానంలో టైతో నిష్క్రమించిన అదితి అశోక్.. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా ఫైనల్ దాకా దూసుకెళ్లడం విశేషం. క్యాడీగా(గోల్ఫ్ బ్యాగులు మోస్తూ సాయం చేసే వ్యక్తి) తల్లి వెంటరాగా.. 200వ ర్యాంక్‌తో బరిలోకి దిగిన ఈ యువ కెరటం ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ నెల్లీ కోర్డా, మాజీ ఛాంపియన్ లైడియా కో(11), ఎమిటీ క్రిస్టియన్(72), మోన్ ఇనామీ(28)మధ్య గట్టి పోటీ ఇస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఒకానొక దశలో ప్రపంచ నెంబర్ వన్, మాజీ నెంబర్ వన్లకు ముచ్చెమటలు పోయించింది ఈ భారత గోల్ఫ్ ప్లేయర్. చదవండి: భారత హాకీ: పతాకం నుంచి పతనం.. ఆపై పతకం గోల్ఫ్ ఆట తీరు అర్థంకాకపోయినా.. అదితి ఆడుతున్నంతసేపూ ఉత్కంఠను తట్టుకోలేకపోయారు యావత్ భారత క్రీడాభిమానులు. గోల్ఫ్ అంటే ఆసక్తి లేనోళ్లను.. సైతం శనివారం పొద్దుపొద్దున్నే టీవీలకు, సెల్‌పోన్లకు అతుక్కుపోయేలా చేసింది అదితి అశోక్. అంతేకాదు కొందరిని ఆటలోని పదాలను, ఆట తీరును అర్థం చేసుకునేలా చేసింది. ఇక ఒలింపిక్ జాబితాలో పీటీ ఉష, దీపా కర్మాకర్, ఈ ఒలింపిక్స్‌లో ఉమెన్స్ హాకీ టీం.. ఇప్పుడు అదితి అశోక్.. ఇలా ఫోర్త్ సెటిల్ సెంటిమెంట్(తృటిలో పతకం చేజార్చుకున్న ఆటగాళ్ల) ప్రస్తావనను మరోసారి తెర మీదకు తెచ్చింది. -
టోక్యో ఒలింపిక్స్ అప్డేట్స్: నీరజ్ చోప్రాకు స్వర్ణం
►నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సూపర్ షో కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జావెలిన్‌ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. అథ్లెటిక్స్‌లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు. తాజాగా నీరజ్ చోప్రా పతకంతో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. ఓవరాల్‌గా చూసుకుంటే భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో 47వ స్థానంలో నిలిచి ఘనంగా టోక్యో ఒలింపిక్స్‌ను ముగించింది. అంతేగాక 2012 లండన్ ఒలింపిక్స్(ఆరు పతకాలు) తర్వాత ఏడు పతకాలతో భారత్ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. తొలి ప్రయత్నంలో అతను 87.03 మీటర్ల దూరం విసిరి టాప్‌లో నిలిచాడు. ఇక రెండో అటెంప్ట్‌లో అతను మరింత పదునుగా త్రో చేశాడు. సెకండ్ అటెంప్ట్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. నిజానికి క్వాలిఫయింగ్ రౌండ్లో ఫస్ట్ త్రోతోనే అందరికీ షాకిచ్చాడు నీరజ్. అతని పర్సనల్ బెస్ట్ 88.07 మీటర్లు. దానికి తగినట్లే నీరజ్ టోక్యోలో తన ట్యాలెంట్ చూపించాడు. ముందు నుంచి ఫెవరేట్‌గా ఉన్న నీరజ్.. అనుకున్నట్లే ఇండియాకు ఓ స్వర్ణాన్ని అందించాడు. ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. నాలుగ, ఐదు రౌండ్లలో త్రో వేయడంలో విఫలమైనప్పటికీ ఓవరాల్‌గా ఇప్పటికీ నీరజ్ చోప్రా టాప్‌లోనే కొనసాగుతున్నాడు. మూడో రౌండ్లో 76.79 మీటర్లు విసిరినప్పటికి ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. మొత్తంగా ఆరు రౌండ్ల తర్వాత తుది ఫలితం రానుంది. ► టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి రౌండ్లో 87.03 మీటర్ల దూరం విసిరి టాప్ 1లో నిలిచాడు. తొలి రౌండ్లో 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా... సెకండ్ రౌండ్లోనూ అదే జోరును 87.58 మీటర్ల దూరం విసిరి ఇప్పటికీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ►టోక్యో ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకున్నాడు. కాంస్య పతకం కోసం సాగిన మ్యాచ్‌లో భజరంగ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 8-0 తేడాతో మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో కజకస్తాన్కు చెందిన దౌలత్ నియాజ్బెకోవ్తో ఇండియన్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థిని ఓ పట్టు పట్టి కాంస్యాన్ని సాధించాడు. Golf: Women's Tournament Final: టోక్యో ఒలింపిక్స్ 2020 గోల్ప్ మహిళా విభాగం తుది మ్యాచ్ రసవత్తరంగా ముగిసింది. అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలిచింది. అయితే భారత ఖాతాలో పతకం పడకపోయినా.. ఫైనల్లో గట్టి పోటీ ఇచ్చి ఆకట్టుకుంది అదితి అశోక్. నెల్లీ కోర్డా స్వర్ణం కన్ఫర్మ్ చేసుకోగా, జపాన్ ఇనామీ, న్యూజిలాండ్ లడియా కో రెండో ప్లేసులో సంయుక్తంగా నిలిచి.. రజత, కాంస్యాలు అందుకున్నారు. చివర్లో పతకంకు అవకాశాలకు కేవలం రెండు హోల్స్ ఉన్న సమయంలో.. వర్షంతో మ్యాచ్ నిలిపి వేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాసేపటికి తిరిగి ఆట మొదలైంది. వర్షం తర్వాత మొదటి ప్లేస్‌లో నెల్లీ కోర్డా, ఇనామీ లు లీడ్‌లో నిలవడం విశేషం. తర్వాతి ప్లేస్‌లో లిడియా(ఎల్) కో నిలిచింది. వర్షం తెరిపి ఇచ్చాక మొదలైన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో తర్వాతి హోల్లో నాలుగో పొజిషన్‌కి పడిపోయింది అదితి. ఆపై ఒక్క షాట్ తేడాతో కాంస్యం తృటిలో చేజార్చుకుంది అతిధి. ఏది ఏమైనా 200 వ ర్యాంకర్ అయిన ఈ భారత్ యువ గోల్ఫర్ ఓవరాల్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. World no.200 is competing against world no.1, What an achievement #AditiAshok 🦾 Go for gold🏅🏅 #Golf #golfindia #TokyoOlympics2020 pic.twitter.com/jQFTTk6Qtn — Rahul🇮🇳🇮🇳 (@iamrk287) August 7, 2021 Tokyo Olympics 2020 Live Updates: ►పోరాడిన ఓడిన భారత యువ గోల్ఫర్ అదితి అశోక్ ► నెల్లీ కోర్డాకు స్వర్ణం ► లిడియాకు రజతం అవకాశం ► లిడియా కో-అతిది మధ్య కాంస్యం కోసం ఫైనల్ హోల్ షాట్ ► హోల్‌కి దగ్గర్లో పడిన అతిది షాట్ ► ఇనామీ మెడల్ గ్యారెంటీ ► ఆరో స్థానంలో పెడెర్సన్ క్లోజ్ ► ఆట మొదలు.. నాలుగో స్థానానికి పడిపోయిన అదితి.. మిగిలింది ఒకే హోల్ ► ఆట రద్దా? కొనసాగింపా? మిగిలినవి రెండే హోల్స్. పతకంపై గందరగోళం.. ఒలింపిక్ కమిటీ నుంచి రావాల్సిన స్పష్టత ► వాతావరణం కారణంగా ఒకవేళ మ్యాచ్ ఇవాళ కొనసాగే అవకాశం. లేకుంటే.. రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రేపు కూడా ప్రతికూల పరిస్థితులే ఉంటే శుక్రవారం నాటి ఫలితం ఆధారంగా మెడల్స్ ఇస్తారా? అనేది ఒలింపిక్ కమిటీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ► ప్రారంభమైన వర్షం.. మ్యాచ్ నిలిపివేత ► వాతావరణంలో మార్పులు.. మ్యాచ్ నిలిపివేత? ► చివర్లో మారుతున్న సమీకరణాలు.. మళ్లీ మూడో పొజిషన్‌కు అతిది! ► పుంజుకుంటున్న ప్రత్యర్థులు ► అదితి అశోక్.. మరో మూడు హోల్స్ మాత్రమే ► ఛాన్స్ చేజార్చుకున్న అదితి.. నాలుగో స్థానానికి ► గోల్డ్ ఆశలు సజీవం?! ► ప్రత్యర్థి నెగెటివ్ పాయింట్ల మీదే ఆధారపడ్డ Aditi Ashok పతకం ► మరో నాలుగు బంతులు.. రెండు పాయింట్ల తేడా మాత్రమే! ► ఆఖరికి చేరుకున్న ఫైనల్.. మరింత పెరిగిన ఉత్కంఠ. ► అనూహ్యంగా రెండో స్థానానికి అదితి ► ఆఖరుకు చేరుకున్న ఆట.. మూడో స్థానంలో అదితి! ► ఒలింపిక్స్ చరిత్రలో మహిళా గోల్ఫ్ ఫైనల్లో రెండో స్థానంలో నలుగురి పోటీ-అందులో అతిది ఒకరు. ► అదితిపై పెరుగుతున్న ఒత్తిడి.. మూడో స్థానం ► ఎమిలీ, లైడాతో రెండో స్థానంలో టైలో నిలిచింది అతిది. ► నాలుగో రౌండ్ ఉత్కంఠభరింతంగా కొనసాగుతోంది. ►ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 23 ఏళ్ల అదితి.. ఒకానొక దశలో అగ్ర స్థానంలోకి దూసుకొచ్చింది. ► అదితి అశోక్, నీరజ్ చోప్రా, బజరంగ్ పూనియా మీదే భారత్ ఆశలు క్లిక్ చేయండి: త్వరపడండి.. క్యాష్ ప్రైజ్ గెల్వండి ఇవాళ్టి షెడ్యూల్ టోక్యో ఒలింపిక్స్‌లో నేడు భారత్‌కు కీలక మ్యాచ్‌లు రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో కాంస్యం కోసం పోరు కాంస్యం కోసం తలపడనున్న బజ్రంగ్ పునియా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో బరిలోకి నీరజ్ చోప్రా తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్న నీరజ్ చోప్రా ఫైనల్లో నీరజ్ చోప్రా గెలిస్తే అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం -
వారికి ఇల్లే ఆట స్థలం: ఒలింపిక్స్ బరిలో 24 క్రీడా కుటుంబాలు
తమ కుటుంబం నుంచి ఎవరైనా ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తే... పతకాలు సాధిస్తే ఆ ఫ్యామిలీ ఆనందం అంతా ఇంతా కాదు. నాలుగేళ్లకోసారి జరిగే విశ్వ క్రీడల్లో తోబుట్టువులు దేశం తరఫున బరిలోకి దిగడం, పతకాలు నెగ్గడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ పలు క్రీడాంశాల్లో అక్కా చెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు, కవలలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో మొదలయ్యే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 24 కుటుంబాల సభ్యులు ఆయా క్రీడాంశాల్లో సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. –సాక్షి క్రీడా విభాగం గోల్డ్‌పై గోల్ఫ్ ‘సిస్టర్స్’ గురి... అమెరికాకు చెందిన నెల్లీ, జెస్సికా కోర్డా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల గోల్ఫ్ విభాగంలో పోటీ పడనున్నారు. నెల్లీ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉండగా... జెస్సికా 13వ ర్యాంక్‌లో ఉంది. వీరికి గొప్ప క్రీడా నేపథ్యమే ఉంది. నెల్లీ, జెస్సికా తల్లిదండ్రులు పీటర్ కోర్డా, రెజీనా రజ్రతోవా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్లు. పీటర్ కోర్డా 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 1996 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ సాధించాడు. రెజీనా 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించింది. నాలుగుగ్రాండ్స్లామ్ టోర్నీలలోనూ పాల్గొంది. నెల్లీ, జెస్సికా సోదరుడు సెబాస్టియన్ కోర్డా కూడా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. అయితే అతను టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయాడు. కొన్నేళ్లుగా ప్రొఫెషనల్ గోల్ఫ్‌లో పలు టైటిల్స్ సాధించిన నెల్లీ, జెస్సికా పాల్గొంటున్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకాలతో తిరిగి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. గోల్ఫ్లోనే కాకుండా అమెరికా నుంచి ‘సిస్టర్స్’ మెకంజీ–అరియా (వాటర్ పోలో), క్రిస్టీ–సామ్ మెవిస్ (మహిళల ఫుట్‌బాల్), కెల్లీ–కోట్నీ హర్లీ (ఫెన్సింగ్)... ‘బ్రదర్స్’ కవిక–ఎరిక్ షోజీ (వాలీబాల్), హెన్రీ–జాక్సన్ లెవెరెట్ (షూటింగ్) టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో కెల్లీ–కోట్నీ, కవిక–ఎరిక్ జోడీలు గతంలో ఒలింపిక్స్‌లో పతకాలు కూడా సాధించాయి. హర్డిల్స్‌లో అక్కాచెల్లెళ్లు... బ్రిటన్‌కు చెందిన అథ్లెటిక్స్ ‘సిస్టర్స్’ టిఫానీ పోర్టర్–సిండీ సెంబర్ వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సెంబర్ నాలుగో స్థానంలో, టిఫానీ ఏడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది టిఫానీ 12.51 సెకన్ల అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయగా... సిండీ 12.53 సెకన్లతో సోదరికి సమీపంలో ఉంది. ఇక బ్రిటన్ నుంచే ‘సిస్టర్స్’ జెన్నిఫర్–జెస్సికా (జిమ్నాస్టిక్స్), జోడీ–హానా విలియమ్స్ (అథ్లెటిక్స్), మథిల్డా–చార్లోటి హాడ్జ్కిన్స్ (రోయింగ్), ‘బ్రదర్స్’ మాక్స్–జో లిచ్‌ఫీల్డ్ (స్విమ్మింగ్–బ్రిటన్), ‘ట్విన్ బ్రదర్స్’ ఆడమ్–సిమోన్ యేట్స్ (సైక్లింగ్), ప్యాట్–ల్యూక్ మెకార్మక్ (బాక్సింగ్–బ్రిటన్), అన్నా, చెల్లెలు హ్యారీ–హనా మార్టిన్ (హాకీ), ఎమిలీ–టామ్ ఫోర్డ్ (రోయింగ్) బరిలో ఉన్నారు. బాస్కెట్‌బాల్ బ్రదర్స్... అమెరికా, బ్రిటన్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా క్రీడా కుటుంబాలు టోక్యోకు వస్తున్నాయి. పురుషుల బాస్కెట్‌బాల్‌లో స్పెయిన్‌కు చెందిన సోదర ద్వయం పావ్, మార్క్ గసోల్ నాలుగోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది. పావ్, మార్క్ సభ్యులుగా ఉన్న స్పెయిన్ జట్టు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాలు సాధించగా... 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ‘స్విమ్మింగ్ సిస్టర్స్’ కేట్ క్యాంప్‌బెల్, బోంటి క్యాంప్‌బెల్ మరోసారి స్వర్ణమే లక్ష్యంగా పోటీపడనున్నారు. కేట్కిది నాలుగో ఒలింపిక్స్‌కాగా... ఆమె సోదరి బోంటికి రెండో ఒలింపిక్స్. 2016 రియో ఒలింపిక్స్‌లో కేట్, బోంటిలతో కూడిన ఆస్ట్రేలియా జట్టు 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. వీరే కాకుండా ఆఫ్రికాలోని కేప్ఫ వెర్డె దేశం నుంచి స్విమ్మింగ్‌లో అన్నా, చెల్లెళ్లు లాట్రోయ, ట్రాయ్, జేలా పినా... స్విమ్మింగ్‌లో ‘సిస్టర్స్’ బోంటి, కేట్ క్యాంప్‌బెల్ (ఆస్ట్రేలియా), సింక్రనైజ్డ్ స్విమ్మింగ్‌లో అన్నా మరియా, ఎరిని అలెగ్జాండ్రి (ఆస్ట్రియా)... లౌరా–చార్లోటి ట్రెంబల్ (ఫ్రాన్స్)... సెయిలింగ్‌లో ‘బ్రదర్స్’ సిమ్–మిహోవిల్ ఫెంటెలా (క్రొయేషియా)... ఎటెస్–డెనిజ్ సినార్ (టర్కీ), జిమ్నాస్టిక్స్‌లో ‘ట్విన్ సిస్టర్స్’ సేన్–లీకీ వెవెర్స్ (నెదర్లాండ్స్), ట్రయాథ్లాన్లో అన్నా, చెల్లెలు ట్రెంట్ థోర్ప్, ఐన్స్లే (న్యూజిలాండ్) కూడా బరిలోనిలిచారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చిక్కరంగప్ప జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో బెంగళూరు ప్లేయర్ చిక్కరంగప్ప మరోసారి మెరిశాడు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్‌జీసీ) వేదికగా జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్ కేటగిరీలో చాంపియన్‌గా నిలిచిన చిక్కరంగప్ప... టీమ్ విభాగంలోనూ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రో–ఆమ్ ఈవెంట్లో అమెచ్యూర్ గోల్ఫర్లు అనిల్ యామాని, ఆదిత్య జంవాల్, కె. పృథ్వీరెడ్డిలతో జతకట్టిన ప్రొఫెషనల్ గోల్ఫర్ చిక్కరంగప్ప బృందం 52.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. నోయిడాకు చెందిన ప్రొఫెషనల్ ప్లేయర్ అమర్దీప్ మలిక్ బృందం రన్నరప్‌గా నిలిచింది. అమెచ్యూర్ క్రీడాకారులు చక్రవర్తి, ఓంప్రకాశ్ మోదీ, భీమరాజులతో కూడిన అమర్దీప్ జట్టు 52.8 పాయింట్లు స్కోర్ చేసి రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఈవెంట్లో 300 యార్డ్స్ దూరం నుంచి 14వ హోల్‌ను పూర్తి చేసిన విరాట్ రెడ్డి షాట్ ‘లాంగెస్ట్ డ్రైవ్’గా ఎంపికైంది. అబ్రహం సంధించిన షాట్ ‘క్లోజెస్ట్ పిన్’గా నమోదైంది. పోటీల్లో భాగంగా అతను కొట్టిన షాట్ నిర్దేశించిన పిన్‌కు అతి సమీపంగా (1 అడుగు 3 ఇంచుల దూరంలో) పడింది. కె. శశిధర్ రెడ్డి కొట్టిన షాట్ ‘స్ట్రెయిటెస్ట్ డ్రైవ్’గా ఎంపికైంది. -
అగ్రస్థానంలో ధర్మ
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) సీజన్ ఆరంభ టోర్నీ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్లో బెంగళూరు ప్లేయర్ ఎం. ధర్మ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్‌జీసీ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ధర్మ అగ్రస్థానంలో నిలిచాడు. శుక్రవారం మూడో రౌండ్ పోటీల్లో ధర్మ 2 అండర్ 69 పాయింట్లు స్కోర్ సాధించి ఓవరాల్ పాయింట్లలో 16 అండర్ 197తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది ఈ టోర్నీలో ఐదో స్థానంలో నిలిచిన ధర్మ... మూడో రౌండ్ ఆరంభంలో తడబడ్డాడు. ఐదో హోల్‌ను నిర్ణీత షాట్లకు మించి అదనంగా మరో షాట్ (బోగే)ను ఉపయోగించి పూర్తి చేశాడు. దీన్నుంచి వెంటనే తేరుకున్న 32 ఏళ్ల బెంగళూరు ప్లేయర్ వెంటవెంటనే 3 బిర్డీస్ నమోదు చేసి గాడిలో పడ్డాడు. తర్వాత 15వ హోల్ వద్ద తృటిలో ఈగల్‌ను చేజార్చుకుని బిర్డీతో సరిపెట్టుకున్నాడు. చివర్లోనూ మరో బోగే సహాయంతో 69 షాట్లలో రౌండ్‌ను పూర్తిచేశాడు. మూడోరౌండ్ ముగిసేసరికి ఓవరాల్‌గా 14 అండర్ 199 పాయింట్లతో చిక్కరంగప్ప (బెంగళూరు), రషీద్ ఖాన్ (ఢిల్లీ), కరణ్‌దీప్ కొచ్చర్ (చండీగఢ్), ప్రియాన్షు సింగ్ (గురుగ్రామ్) సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. కెరీర్లో రెండో ప్రొఫెషనల్ ఈవెంట్లో పాల్గొంటున్న 22 ఏళ్ల ప్రియాన్షు అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. ఈ ఏడాది పీజీటీఐ క్వాలిఫయింగ్ స్కూల్ చాంపియన్ అయిన ప్రియాన్షు... తొలి ఏడు హోల్స్‌లో 3 బోగేలతో వెనుకబడినప్పటికీ... తర్వాత 6 బిర్డీస్‌తో అదరగొట్టాడు. ఫలితంగా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఓవరాల్‌గా రెండోస్థానంలో నిలిచాడు. మూడోరోజు పోటీల్లో ప్రియాన్షుతో పాటు చిక్కరంగప్ప 70 పాయింట్లు, రషీద్ ఖాన్ 68 పాయింట్లు, కరణ్‌దీప్ కొచ్చర్ 66 పాయింట్లు సాధించి ఓవరాల్ స్కోరులో సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నారు. డిఫెండింగ్ చాంపియన్ ఉదయన్ మానె (67, అహ్మదాబాద్) ఏడో స్థానంలో, ఖాలిన్ జోషి (68, బెంగళూరు) ఆరో స్థానంలో నిలిచారు. గురువారం ఆధిపత్యం ప్రదర్శించిన అమన్‌రాజ్ పేలవ ప్రదర్శనతో ఎనిమిదోస్థానానికి పడిపోయాడు. అతను నిర్దేశించిన 71 షాట్లకు బదులుగా 74 షాట్లలో రౌండ్‌ను పూర్తిచేశాడు. కొత్త కోర్స్ రికార్డుతో అందరి దృష్టిని ఆకర్షించిన గౌరవ్ ప్రతాప్ సింగ్ (71 పాయింట్లు) నాలుగు స్థానాలు కోల్పోయి అమన్ రాజ్, హనీ బైసోయాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఓవరాల్ ప్రదర్శనలో వెనుకబడినప్పటికీ మూడోరోజు పోటీల్లో గురుగ్రామ్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పోటీల్లో భాగంగా అతను 11వ హోల్‌ను కేవలం ఒక షాట్‌లోనే పూర్తిచేసి ఔరా అనిపించాడు. దీంతో అతను ఓవరాల్ ర్యాంకింగ్‌లో 4 అండర్ 209 పాయింట్లతో 26వ స్థానంలో ఉన్నాడు. -
తొలి రౌండ్లో అమర్దీప్ ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) సీజన్ ఆరంభ టోర్నమెంట్ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో నోయిడా ప్లేయర్ అమర్దీప్ మలిక్ శుభారంభం చేశాడు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ (హెచ్‌జీసీ) వేదికగా బుధవారం జరిగిన తొలిరౌండ్లో అమర్దీప్ అగ్రస్థానంలో నిలిచాడు. నిర్ణీత 71 పాయింట్లకు గానూ అతను 12 బిర్డీస్ సహాయంతో 9 అండర్ 62 పాయింట్లు స్కోర్ చేశాడు. ఈ క్రమంలో అతను రెండుసార్లు గోల్కొండ మాస్టర్స్ టోర్నీ చాంపియన్ అజితేశ్ సంధు కోర్స్ రికార్డును సమం చేశాడు. 2016లో అజితేశ్ ఈ రికార్డును నెలకొల్పాడు. తొలిరోజు ఆటను శాసించినప్పటికీ అమర్దీప్ ఆరంభంలో తడబడ్డాడు. అతను తొలి హోల్‌ను ‘డబుల్ బోగే’ సహాయంతో పూర్తి చేశాడు. నిర్దేశించిన 4 స్ట్రోక్స్ కంటే అదనంగా రెండు స్ట్రోక్స్‌ను సంధించి తొలి హోల్‌ను పూర్తి చేశాడు. తర్వాత వరుసగా మూడు బిర్డీస్‌ను నమోదు చేసిన ఈ 33 ఏళ్ల గోల్ఫర్... ఐదో హోల్‌ను కూడా ‘బోగే’ సహాయంతో ముగించాడు. అనంతరం మరో తప్పిదానికి తావు ఇవ్వకుండా తొలిరౌండ్‌ను పూర్తి చేశాడు. ఇటీవలే ఆసియా టూర్ టోర్నీకి అర్హత సాధించిన పట్నా గోల్ఫర్ అమన్ రాజ్, బెంగళూరుకు చెందిన ఎం.ధర్మ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరూ 7 అండర్ 64 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచారు. అమన్ రాజ్ 9 బిర్డీస్, 2 బోగేలు నమోదు చేయగా... ధర్మ 8 బిర్డీలు నమోదు చేశాడు. బెంగళూరుకు చెందిన చిక్కరంగప్ప 6 అండర్ 65 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలవగా... మాజీ చాంపియన్స్ అజితేశ్ సంధు (చండీగఢ్) 4 అండర్ 67 తో ఏడో స్థానంలో, హరేంద్ర గుప్తా (చండీగఢ్) ఈక్వల్ పర్‌తో 49వ స్థానంలో నిలిచారు. డిఫెండింగ్ చాంపియన్ ఉదయన్ మానే (అహ్మదాబాద్) 68 పాయింట్లు స్కోర్ చేసి 19వ స్థానానికి పరిమితమయ్యాడు. -
ఉత్తమ గోల్ఫ్ ప్లేయర్‌గా రవి
తార్నాక: టెట్రాసాఫ్ట్ టెక్నాలజీ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో తార్నాక రైల్వే గోల్ఫ్ క్లబ్ వేదికగా జరిగిన ప్రిన్స్ వింటర్ గోల్ఫ్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నెట్, గ్రాస్, స్టేబుల్ ఫోర్ట్ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. పోటీల్లో భాగంగా అన్ని కేటగిరీలలో లాంగెస్ట్ డ్రైవ్, నియరెస్ట్ పిన్ విధానాన్ని పాటించారు. మహిళల విభాగంలో ప్రత్యేకం గా పోటీలు జరిగాయి. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రవి బెస్ట్ గోల్ఫ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టెట్రాసాఫ్ట్ టెక్నాలజీ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధి జయపాల్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అర్జున్ ముండియా అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. -
అండర్సన్ గూబ గుయ్యిమంది
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సరదాగా గోల్ఫ్ ఆడబోతే గూబ గుయ్యిమంది. సహచరుడు స్టువర్ట్ బ్రాడ్ అందుకు సంబంధించిన ‘హిల్లేరియస్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. పలువురు సరదా కామెంట్లు చేస్తున్నారు. విషయం ఏంటంటే... భారత్‌తో తొలి టెస్ట్ విజయం తర్వాత ఈ ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బకింగ్‌హమ్‌షైర్‌లోని ఓ గోల్ఫ్ కోర్సుకు వెళ్లారు. అక్కడ అండర్సన్ గోల్ఫ్ ఆడుతుండగా.. బ్రాడ్ వెనకాల నుంచి వీడియో తీశాడు. గోల్ఫ్ స్టిక్‌తో బంతిని బలంగా కొట్టగా.. కింద ఉన్న ఓ చెక్క ముక్క తగిలి బంతి తిరిగి అండర్సన్ ముఖానికి బలంగా తాకింది. దెబ్బ బలంగానే తాకటంతో ఆ బాధతో అండర్సన్ విలవిలలాడుతూ పక్కకు జరిగిపోయాడు. ఈ తతంగాన్ని బ్రాడ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతోంది. ఇంతకీ దాదాపు ప్రతీ ఒక్కరూ అడిగే ఒకేఒక్క ప్రశ్న. ‘అండర్సన్ పళ్లు ఊడలేదు కదా?’ అనే... అయితే జిమ్మీ(అండర్సన్)కు చిన్న గాయం కూడా కాలేదని, ఫర్ఫెక్ట్లీ ఫైన్ అంటూ తర్వాత బ్రాడ్ స్పష్టం చేసేశాడు. A) @jimmy9 is perfectly fine. B) 😂😂😂😂😂😂😂😂😂 pic.twitter.com/oaf0Px3Wab — Stuart Broad (@StuartBroad8) 5 August 2018 -
జేమ్స్ అండర్సన్‌కు చేదు అనుభవం
-
విజేత గిరిధర్ – షాన్ రెడ్డి జంట
సాక్షి, హైదరాబాద్: ‘ఆడి’ క్వాట్రో కప్ ఇండియా ఫైనల్స్ టోర్నీలో ‘ఆడి హైదరాబాద్’ శాఖ గోల్ఫర్లు గిరిధర్ తోట – షాన్ రెడ్డి విజేతలుగా నిలిచారు. థాయ్‌లాండ్‌లోని బన్యన్ గోల్ఫ్ క్లబ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో వీరిద్దరూ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ‘గ్రీన్సమ్ స్టేబుల్‌ఫోర్డ్’ ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో 800 మంది గోల్ఫర్లు తలపడగా... హైదరాబాద్‌కు చెందిన ఈ జంట 45 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ‘ఆడి కోల్‌కతా’కు ప్రాతినిధ్యం వహించిన అతుల్ అల్మాల్ – రోహన్ ష్రాఫ్ ద్వయం 38 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. 37 పాయింట్లు సాధించిన ‘ఆడి గుర్గావ్’ జోడీ వివేక్ భరద్వాజ్ – సిద్ధాంత్ ఖోస్లా మూడో స్థానాన్ని దక్కించుకుంది. సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు ఆస్ట్రియా వేదికగా ‘ఆడి క్వాట్రో కప్ వరల్డ్ ఫైనల్స్’ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో 47 దేశాలకు చెందిన గోల్ఫర్లు తలపడతారు. -
చాంపియన్ ఉదయన్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్ అవతరించాడు. అహ్మదాబాద్‌కు చెందిన గోల్ఫర్ ఉదయన్ మానే విజేతగా నిలిచి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ), తెలంగాణ పర్యాటక శాఖ సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించింది. హైదరాబాద్ గోల్ఫ్ కోర్టులో ఆదివారం జరిగిన చివరిదైన నాలుగోరౌండ్లో ఉదయన్ 3 అండర్ 68 పాయింట్లను స్కోర్ చేశాడు. దీంతో ఓవరాల్‌గా 284 పాయింట్లకు గానూ అత్యుత్తమంగా 14 అండర్ 270 స్కోరుతో టోర్నీలో విజేతగా అవతరించాడు. అంతకుముందు తొలి మూడు రౌండ్లలో వరుసగా 67, 66, 69 ప్రయత్నాల్లో పోటీని ముగించాడు. ఈ ఏడాది పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 39వ స్థానంలో ఉన్న ఉదయన్ ఈ విజయంతో మూడో స్థానానికి ఎగబాకాడు. చాంపియన్‌గా నిలిచిన ఉదయన్‌కు రూ. 4,50,000 ప్రైజ్‌మనీగా లభించాయి. నాలుగో రౌండ్‌ను ఉదయన్ కన్నా మెరుగ్గా 67 ప్రయత్నాల్లోనే ముగించినప్పటికీ షమీమ్ ఖాన్, అభిజిత్ సింగ్‌లకు తొలి స్థానం దక్కలేదు. నిర్ణయాత్మక ప్లేఆఫ్ రౌండ్లో వీరిద్దరూ వెనకబడి ఎన్. తంగరాజతో కలిసి సంయుక్తంగా రన్నరప్‌లుగా నిలిచారు. ఈ ముగ్గురికి రూ. 2,09,960 నగదు బహుమానం లభించింది. తంగరాజ నాలుగోరౌండ్ పోటీని 68 ప్రయత్నాల్లో ముగించాడు. మూడో రౌండ్లో విజేతగా నిలిచిన ముకేశ్ కుమార్ తుదిపోరులో నిర్దేశిత 71 షాట్లకు బదులుగా 74 ప్రయత్నాల్లో పోటీని ముగించి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 30 లక్షలు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ సంఘం అధ్యక్షుడు జె. విక్రమ్‌దేవ్ రావు, కెప్టెన్ దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టైటిల్ రేసులో ముకేశ్ కుమార్
గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ రసవత్తరంగా జరుగుతోంది. తెలంగాణ పర్యాటక శాఖ, పీజీటీఐ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో రోజురోజుకీ ఆధిక్యం చేతులు మారుతోంది. శనివారం హైదరాబాద్ గోల్ఫ్ కోర్ట్‌లో జరిగిన మూడో రౌండ్లో వెటరన్ ప్లేయర్ ముకేశ్ కుమార్ విజేతగా నిలిచాడు. 71 ప్రయత్నాలకు గానూ ముకేశ్ 3 అండర్ 68 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఓవరాల్‌గా 12 పాయింట్లతో టైటిల్ బరిలో అందరి కన్నా ముందున్నాడు. తన కెరీర్లో 120 టైటిళ్ళు సాధించిన ముకేశ్ కుమార్ (52) గోల్కొండ మాస్టర్ టోర్నీలో పోటీపడుతున్న వారిలో అత్యధిక వయస్సు గలవాడు. గతేడాది ఇదే టోర్నీలో ముకేశ్ టాప్–3లో నిలిచాడు. నేడు జరిగే చివరి రౌండ్‌తో చాంపియన్ ఎవరనేది తెలుస్తుంది. మరోవైపు రెండో రౌండ్లో సూపర్ షోతో విజేతగా నిలిచిన అంగద్ చీమా మూడోరౌండ్లో తడబడ్డాడు. అతను నిర్ణీత 71 షాట్లకు బదులుగా 74 ప్రయత్నాల్లో పోటీని పూర్తి చేసి ఓవరాల్ పాయింట్లలో వెనుకబడ్డాడు. ప్రస్తుతం 10 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగోస్థానంలో ఉన్నాడు. తంగరాజ(శ్రీలంక), అహ్మదాబాద్ గోల్ఫర్ ఉదయన్ మానే మూడో రౌండ్‌ను వరుసగా 68, 69ప్రయత్నాల్లో ముగించి ఓవరాల్‌గా 11 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్ విజేత ధర్మ 8 పాయింట్లతో ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు. -
అంగద్ సూపర్ షో
గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్లో పంచకుల గోల్ఫర్ అంగద్ చీమా ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ గోల్ఫ్ కోర్సులో శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో విజేతగా నిలిచి టోర్నీలో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాడు. తెలంగాణ పర్యాటక శాఖ, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో అంగద్ అత్యుత్తమంగా 64 ప్రయత్నాల్లోనే రెండో రౌండ్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో రౌండ్లో పోటీపడే ఆటగాళ్లు 18 హోల్స్‌లోకి బంతుల్ని 71 ప్రయత్నాల్లో పంపించాలి. అయితే 28 ఏళ్ల అంగద్ రెండో రౌండ్లో 64 షాట్లలోనే లక్ష్యాన్ని చేరుకొని 7 పాయింట్లు ఆర్జించాడు. తొలి రౌండ్లో 6 పాయింట్లను కలుపుకొని ఓవరాల్‌గా 13 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. గతేడాది ఈ టోర్నీ రన్నరప్‌గా నిలిచిన బెంగళూరుకు చెందిన ఖాలిన్ జోషి కూడా ఈ రౌండ్లో 7 పాయింట్లు సాధించాడు. అయితే తొలి రౌండ్లో కేవలం 2 పాయింట్లు మాత్రమే పొందిన ఖాలిన్ ఓవరాల్‌గా 9 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. శుక్రవారం పోటీల్లో వీర్ ఆహ్లావట్ (66), ముకేశ్ కుమార్ (66), ఉదయన్ (66) తలా 5 పాయింట్లు స్కోర్ చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్లో విజేతగా నిలిచిన ఎం. ధర్మ (బెంగళూరు) 72 ప్రయత్నాల్లో పోటీని ముగించి పదో స్థానానికి పడిపోయాడు. -
గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ షురూ
గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభమైంది. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ), హైదరాబాద్ గోల్ఫ్ సంఘం (హెచ్జీఏ) సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీ నాలుగు రోజుల పాటు జరుగనుంది. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హెచ్జీఏ అధ్యక్షులు జె. విక్రమ్ దేవ్ రావు, కెప్టెన్ సి. దయాకర్ రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్ రావు, పీజీటీఐ సీఈఓ ఉత్తమ్ సింగ్, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఐఏఎస్ రష్మీ వర్మతోపాటు 123 మంది గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 30 లక్షలు. ఇందులో భారత్‌కు చెందిన ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులు ఖాలిన్ జోషి, చిక్కరంగప్ప, రాహిల్ గాంగ్జి, విరాజ్ మాడప్ప, హిమ్మత్ రాయ్, షమీమ్ ఖాన్, మాజీ చాంపియన్ హరేంద్ర గుప్తా, సయ్యద్ సకీబ్ అహ్మద్, ఉదయన్ మానే, హనీ బైసోయా సందడి చేయనున్నారు. వీరితో పాటు శ్రీలంకకు చెందిన అనురా రోహన, మిథున్ పెరీరా, ఎన్. తంగరాజ, కె. ప్రభాకరన్, దక్షిణాఫ్రికా నుంచి అల్బీ హనేకోమ్, బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్ జమాల్ హొస్సేన్, ఆస్ట్రేలియా నుంచి కునాల్ భాసిన్ ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సందర్భంగా హెచ్జీఏ అధ్యక్షుడు జె. విక్రమ్‌దేవ్ రావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక పీజీటీఐ టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం గర్వంగా ఉందన్నారు. -
ఫిబ్రవరి 3, 4 తేదీల్లో గోల్ఫ్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ‘క్యాన్సర్ క్రూసేడర్స్ ఆఫ్ క్యూర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో గోల్ఫ్ టోర్నమెంట్ జరుగనుంది. ‘క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్’ పేరిట నిధుల సేకరణ, అవగాహన కల్పించేందుకు 3, 4 తేదీల్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోర్నీ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్ పాల్గొని టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గొప్ప ఉద్దేశంతో నిర్వహించే ఈ టోర్నమెంట్లో భాగమైనందుకు సంతోషంగా ఉందని కాజల్ అన్నారు. ఫిబ్రవరి 4న సాయంత్రం 7 గంటలకు నోవాటెల్‌లో ‘సెలెబ్రిటీ గోల్ఫ్ ప్లే ఆప్’ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఎంపీ కవిత, ఐఏఎస్ ఆమ్రపాలి, సీఐఎస్ఎఫ్ డీఐజీ శిఖా గోయెల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, సినీతారలు, కేథరిన్, హెబ్బా పటేల్, దక్ష, తేజస్వి, మోడల్ షాలిని పాల్గొంటారని చెప్పారు. ఈ టోర్నీలో దాదాపు 150 మంది గోల్ఫర్లు హాజరవుతారని అన్నారు. విలేకరుల సమావేశంలో కాజల్‌తో పాటు క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ ఆనంద్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ సంఘం అధ్యక్షులు జె. విక్రమదేవ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
గోల్ఫ్ దిగ్గజం పామర్ కన్నుమూత
వాషింగ్టన్: గోల్ఫ్ దిగ్గజం ఆర్నాల్డ్ పామర్ (87) ఆదివారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ‘ఆర్నాల్డ్ గోల్ఫ్ క్రీడకు అత్యుత్తమ అంబాసిడర్. తన ఆటతీరుతో ఎంతోమందిని ఈ గేమ్ వైపు ఆకర్షితులను చేశారు. నిజానికి ఆర్నాల్డ్ వల్లే గోల్ఫ్ అభివృద్ధి చెందిందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని యూఎస్ గోల్ఫ్ సంఘం ఘనంగా నివాళి అర్పించింది. 1954లో ప్రొఫెషనల్‌గా మారిన ఆయన 2006లో రిటైర్ అయ్యారు. పామర్ను అభిమానులు ముద్దుగా ‘కింగ్’ అని పిలుస్తారు. -
గోల్ఫ్ దిగ్గజ ఆటగాడు మృతి
వాషింగ్టన్: గోల్ఫ్ లెజెండ్ ఆటగాడు ఆర్నాల్డ్ పామర్(87) ఆదివారం కన్నుమూశారు. పామర్ మృతిపట్ల సంతాపం తెలుపుతూ యూఎస్ గోల్ఫ్ అసోసియేషన్ ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేసింది. పామర్ తన కెరీర్లో ఏడు మేజర్ టోర్నమెంట్లను గెలుపొందారు. మాస్టర్స్ టోర్నీని నాలుగు సార్లు గెలిచిన ఆయన బ్రిటిష్ ఓపెన్‌ను రెండుసార్లు, యూఎస్ ఓపెన్‌ను ఒకసారి గెలుపొందారు. గోల్ఫ్ క్రీడకు ఆదరణను పెరగడంలో ఆర్నాల్డ్ పామర్ పాత్ర కీలకమైంది. గోల్ఫ్ తొలితరం టెలివిజన్ సూపర్ స్టార్లలో పామర్ ఒకరు. -
'భారత గోల్ఫ్‌పై ప్రభావం చూపే అవకాశం'
ట్రూన్: దాదాపు శతాబ్దం తరువాత ఒలింపిక్స్‌లో గోల్ఫ్ ను ప్రవేశపెట్టడంతో పలువురు దిగ్గజ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఇద్దరు గోల్ఫ్ కు ప్రాతినిథ్యం వహిస్తుండగా, మహిళల ఈవెంట్ నుంచి ఒక అథ్లెట్ మాత్రమే బరిలోకి దిగుతుంది. అయితే దీనిపై భారత ప్రధాన గోల్ఫర్ అనిర్బాన్ లహిరి హర్షం వ్యక్తం చేశాడు. రియో ఒలింపిక్స్ లో భారత తరపున పతకం సాధిస్తే అది కచ్చితంగా దేశంలో ఉన్న గోల్ఫ్ క్రీడపై ప్రభావం చూపుతుందన్నాడు. 'నేను పతకంతో తిరిగి భారత్ కు రావాలనుకుంటున్నా. పతకం కోసం తీవ్రంగా పోరాడతాం. పురుషుల విభాగంలో నాతో పాటు చవ్రారాసియా కూడా బాగానే రాణిస్తున్నాడు. ఒకవేళ మేము మెరుగ్గా రాణించి ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే మాత్రం అది భారత్‌లోని గోల్ఫ్‌పై ప్రభావం చూపుతుంది 'అని అనిర్బానీ అభిప్రాయపడ్డాడు. 1904లో ఒలింపిక్స్‌లో గోల్ఫ్‌ను చివరిసారి ప్రవేపెట్టారు. ఆ తరువాత ఒలింపిక్స్‌లో గోల్ఫ్ క్రీడ అనేది లేకుండా పోయింది. అయితే 112 సంవత్సరాల తరువాత గోల్ఫ్‌ను ఒలింపిక్స్‌లో పెట్టారు. ఆసియా నుంచి 16 మంది గోల్ఫర్లు ఒలింపిక్స్ కు సిద్ధమవుతుండగా, భారత్ నుంచి ముగ్గురికి అవకాశం దక్కడం విశేషం. భారత నుంచి మహిళల విభాగంలో అదితి అశోక్ పాల్గొంటుంది. అయితే జికా వైరస్ కారణంగా వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ జాసన్ డే, వరల్డ్ నంబర్ టూ గోల్ఫర్ జోర్డాన్ స్పెత్లు రియో ఒలింపిక్స్ నుంచి వైదొలిగారు. -
ఒలింపిక్స్ కు తొలి బంగ్లాదేశీ అర్హత
ఢాకా: బంగ్లాదేశ్ కు చెందిన క్రీడాకారుడు తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. రియో అర్హత ర్యాంకింగ్స్ లో భాగంగా బంగ్లాదేశ్ కు చెందిన గోల్ఫర్ సిద్దికూర్ రెహ్మాన్ 56వ స్థానంలో నిలిచి ఒలింపిక్స్ కు బెర్తును దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి బంగ్లాదేశీగా ఘనత సాధించాడు. ఈ మేరకు అంతర్జాతీయ గోల్ఫ్ ఫెడరేషన్ విడుదల చేసిన రియో ఒలింపిక్స్ ర్యాంకింగ్స్ లో రెహ్మాన్ చోటు దక్కించుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, బంగ్లాదేశ్ నుంచి స్మిమ్మర్లు మహిజుర్ రెహ్మాన్, సోనియా అక్తర్ తింపా, ఆర్చరీ విభాగంలో షైమోలీ రాయ్, అబ్దుల్లాహెల్ బాకీలు రియోలో పాల్గొంటున్నారు. అయితే వీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాత్రమే రియోకు అర్హత సాధించగా, గోల్ఫర్ సిద్ధికూర్ మాత్రం ర్యాంకింగ్ ఆధారంగా ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి బంగ్లాదేశీగా నిలవడం విశేషం. ఇదిలా ఉంగా, దాదాపు శతాబ్దం తరువాత గోల్ప్ క్రీడను ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టడం మరో విశేషం. ఒలింపిక్స్ లో గోల్ప్ ను ప్రవేశపెట్టడం ఇప్పటికి మూడు సార్లు మాత్రమే జరిగింది. తొలిసారి 1900వ సంవత్సరంలో ఈ ఆటను ప్రవేశపెట్టగా, ఆ తరువాత 1904 ఒలింపిక్స్ లో ఆ క్రీడను చివరిసారి కొనసాగించారు. -
గోల్ఫ్ కోర్స్‌లో 'మిల్కీ బ్యూటీ'
-
వరల్డ్ క్లాస్ గోల్ఫర్గా అనిర్బాన్ లాహిరి
-
గోల్కొండ గోల్ఫ్ చాంపియన్‌షిప్ ప్రారంభించిన కేసీఆర్
-
ఆశాజనకమైన కెరీర్‌కు.. గోల్ఫ్ కోచ్!
గోల్ఫ్.. ప్రాచీన క్రీడల్లో ఒకటి. ఇది 15వ శతాబ్దంలో స్కాట్లాండ్లో పుట్టినట్లు ఆధారాలున్నాయి. ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఈ క్రీడ గత కొన్నేళ్లుగా భారత్‌లోనూ ఆదరణ పొందుతోంది. సంపన్నుల ఆటగా పేరొందిన గోల్ఫ్ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలకు కూడా క్రమంగా అందుబాటులోకి వస్తోంది. జనం దీనిపై ఆసక్తి చూపుతుండడంతో కొత్తకొత్త గోల్ఫ్ క్లబ్‌లు ఏర్పాటవుతున్నాయి. దీంతో గోల్ఫింగ్ శిక్షకులకు డిమాండ్ పెరుగుతోంది. కోచ్‌గా మారి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంతోపాటు స్వయంగా పోటీల్లో పాల్గొంటే మంచి ఆదాయం, పేరు ప్రఖ్యాతలు లభిస్తున్నాయి. 2016 ఒలింపిక్ క్రీడల్లో గోల్ఫ్ పోటీలను కూడా చేరుస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. కాబట్టి గోల్ఫ్ కోచ్ కెరీర్‌ను ఎంచుకుంటే భవిష్యత్తులో అవకాశా లు ఆశాజనకంగా ఉంటాయని కచ్చితంగా చెప్పొచ్చు. అవకాశాలు, ఆదాయం.. ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారులకు ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఈ రంగంలో క్రీడాకారుడిగా, కోచ్‌గా.. రెండు విధాలుగా పనిచేసుకోవచ్చు. ఆటలో ప్రతిభ చూపితే క్లబ్, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుంది. నగరాల్లోనూ గోల్ఫ్ క్లబ్‌లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో కోచ్‌గా ఉద్యోగం, ఉపాధి పొందొచ్చు. కార్పొరేట్ పాఠశాలల్లో ఈ క్రీడకు చోటు కల్పిస్తున్నారు. మంచి వేతనం ఆఫర్ చేస్తూ కోచ్‌లను నియమిస్తున్నారు. అంతేకాకుండా వనరులను సమీకరించుకొని, సొంతంగా గోల్ఫ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆదాయానికి లోటు ఉండదు. రిసార్ట్‌ల లోనూ గోల్ఫ్ కోచ్‌లకు అవకాశాలున్నాయి. గోల్ఫ్ ట్రైనర్లు తమ వీలును బట్టి పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ పనిచేయొచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: గోల్ఫ్.. శరీరం, మనసును సమన్వయం చేసుకుంటూ ఆడాల్సిన ఆట. కఠోరమైన సాధనతోనే ఎవరైనా ఉత్తమ ట్రైనర్‌గా గుర్తింపు పొందగలుగుతారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం నాలుగైదు గంటలు గోల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఇందులో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. ఏకాగ్రత, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. ఆటపై అంకితభావం అవసరం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు సాన పెట్టుకుంటూ ముందుకు సాగాలి. క్రీడలో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే స్పోర్టివ్‌నెస్ అవసరం. కోచ్‌గా కెరీర్లో రాణించాలంటే ఓపిక, సహనం ఉండాల్సిందే. అర్హతలు: గోల్ఫ్ శిక్షకులకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. ఆటపై వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారెవరైనా ఇందులో రాణించొచ్చు. అయితే, కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. పూర్తిస్థాయి కోచ్‌గా కెరీర్ లో స్థిరపడాలనుకునేవారు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గోల్ఫ్‌పై దృష్టి పెడితే మంచిది. ఆటపై పట్టు సాధించి, కొన్ని పోటీల్లో పాల్గొన్న తర్వాత కోచ్‌గా మారొచ్చు. వేతనాలు: నిపుణులైన కోచ్‌లకు ఆదాయం అధికంగా ఉంటుంది. కేవలం అరగంట శిక్షణకు రూ.150 నుంచి రూ.850 వరకు రుసుం వసూలు చేసే కోచ్‌లు ఉన్నారు. గోల్ఫ్ ప్రొఫెషనల్స్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం అందుతుంది. అనుభవం పెంచుకుంటే నెలకు రూ.25 వేల నుంచి రూ.45 వేలు పొందొచ్చు. సీనియర్లు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగానే సంపాదించుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్. వెబ్సైట్: www.thehyderabadgolfclub.com/ నేషనల్ గోల్ఫ్ అకాడమీ ఆఫ్ ఇండియా. వెబ్సైట్: www.ngai.org.in/ డీఎల్ ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ వెబ్సైట్: http://dlfgolfclub.golfgaga.com/ ఢిల్లీ గోల్ఫ్ క్లబ్. వెబ్సైట్: www.delhigolfclub.org/ నోయిడా గోల్ఫ్ క్లబ్. వెబ్సైట్: www.noidagolfcourse.com/ ఇది కార్పొరేట్ కెరీర్ ‘‘గోల్ఫ్ గతంలో కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన క్రీడ. కార్పొరేట్ కల్చర్‌లో ఇది స్టేటస్ సింబల్‌గా మారింది. వ్యాయామంగా ఉపకరించే ఆటగా సాధారణ ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్స్ వరకూ గోల్ఫ్‌పై ఉత్సాహం చూపుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో దీనికి క్రేజ్ పెరిగింది. దానికి తగినట్లుగానే శిక్షకులకూ మంచి కెరీర్‌గా మారింది. నేషనల్ గోల్ఫ్ అకాడమీ ఆఫ్ ఇండియా తోపాటు పలు చోట్ల శిక్షణ లభిస్తోంది. కేవలం ఉద్యోగంగా భావించకుండా మైదానం పట్ల అంకితభావం ఉంటే ఎవరైనా ఈ రంగంలో రాణించవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఏకాగ్రత, పట్టుదల.. కావాల్సిన లక్షణాలు. సర్టిఫికేషన్ కోర్సుల్లో పలు విభాగాలుంటాయి. అర్హత సాధించాక దేశ, విదేశాల్లో శిక్షకులుగా చేరొచ్చు. టోర్నమెంట్ల నిర్వహణలో పాల్గొనవచ్చు. ఫుల్‌టైమ్ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. పార్ట్‌టైంగా వ్యాపకంగా కోచ్‌గా మారవచ్చు. కెరీర్ మొదట్లో రూ.20 వేలకు తగ్గకుండా వేతనం లభిస్తుంది. సీనియార్టీ, అనుభవం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది. ఉన్నత హోదా లభిస్తుంది’’. -ప్రకాశ్ ఎం. పక్కీ, ట్రైనర్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స ‘రైట్స్’లో జూనియర్ మేనేజర్లు రైట్స్ లిమిటెడ్... జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్). పోస్టుల సంఖ్య: 2 అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐదేళ్ల అనుభవం అవసరం. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 12. వెబ్సైట్: http://rites.com/ సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీజనల్ సెంటర్ భువనేశ్వర్.. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్ పోస్టుల సంఖ్య: 4 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 14 వెబ్సైట్: http://www.ctcri.org/ నిట్-తిరుచిరాపల్లి తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్స ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా చివరి తేది: అక్టోబర్ 8. వెబ్సైట్: www.nitt.edu సీడీఆర్ఐలో పీహెచ్డీ సీఎస్ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీడీఆర్ఐ).. వివిధ విభాగాల్లో కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. కోర్సు: పీహెచ్డీ ప్రోగ్రామ్. అర్హతలు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ను చూడొచ్చు. దరఖాస్తు: ఆన్లైన్లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి, పోస్టు ద్వారా పంపాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్ 30 దరఖాస్తులను పంపడానికి చివరి తేది: అక్టోబర్ 10 వెబ్సైట్: www.cdriindia.org -
పవన్‌కళ్యాణ్‌తో నటించాలనుంది: రకుల్ ప్రీత్ సింగ్
సినిమాల్లో బిజీ వల్ల గోల్ఫ్ ఆడటమే మరిచిపోయానని గారాలు పోతోంది ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేం రకుల్ ప్రీత్ సింగ్. శుక్రవారం సాయంత్రం ఓ హోటల్ జరిగిన ‘టాక్సిఫర్ ష్యూర్’ కార్యక్రమంలో రుకుల్ సందడి చేసింది. బాలీవుడ్ కంటే నాకు తెలుగు పరిశ్రమే ఇష్టమంటున్న రకుల్ ‘సిటిప్లస్’కు పలు ముచ్చట్లు చెప్పింది. తాను జాతీయ స్థాయిలో గోల్ఫ్ ఆడానని, ఇప్పుడు సినిమాలతో ఆటకు దూరమయ్యానంది. తెలుగు సినిమా ప్రతి ఒక్కటి చూస్తానంటూ టాలీవుడ్‌పై తన అభిమానాన్ని ఒలకబోసింది. పవన్‌కళ్యాణ్, బన్ని అంటే తనకు చాలా ఇష్టమని వారితో కలిసి నటించాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నానని, తెలుగులో మాట్లాడటం కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పింది. బాలీవుడ్, టాలీవుడ్‌కు మధ్య కేవలం భాష మాత్రమే తేడా అని.. పరిశ్రమ ఏదైనా శ్రమ ఒక్కటేనని అభిప్రాయపడింది. రాత్రివేళల్లో టాక్సీలో ప్రయాణించేటప్పుడు మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని రకుల్ జాగ్రత్తలు చెప్పింది. తాను చాలా సార్లు టాక్సీలో ప్రయాణించినా ఎలాంటి అవాంఛిత సంఘటన ఎదురుకాలేదని చెప్పింది. - సుమన్ -
ముందు విశ్రాంతి.. తర్వాతే ఏదైనా
సచిన్ అత్త అనాబెల్ వ్యాఖ్య న్యూఢిల్లీ: అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కచ్చితంగా ఆటకు టచ్‌లోనే ఉంటాడని అతని అత్త అనాబెల్ మెహతా వెల్లడించారు. అయితే తొందరపడి ఏదో ఓ నిర్ణయాన్ని తీసుకునే ముందు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శారీరక ఫిట్నెస్ కోసం మాస్టర్... టెన్నిస్ లేదా గోల్ఫ్‌ను ఎంచుకునే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. సచిన్‌కు హౌజ్ ఆఫ్ కామన్స్ అభినందనలు లండన్: క్రికెట్లో అద్భుత కెరీర్‌ను కొనసాగించిన సచిన్ టెండూల్కర్‌ను ఇంగ్లండ్‌కు చెందిన హౌజ్ ఆఫ్ కామన్స్ సభ అభినందించింది. భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్ ఈ మేరకు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచాడని, ఇంగ్లండ్‌లోనూ అతడికి భారీగా అభిమానులున్నారని వాజ్ అన్నారు. మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ‘సచిన్’ ముంబై: సచిన్ టెండూల్కర్ జీవితం ఇకపై స్కూల్ పుస్తకాల్లోనూ కనిపించనుంది. చిన్నారులలో స్ఫూర్తి నింపేందుకు సచిన్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.