
సాక్షి, హైదరాబాద్: ‘క్యాన్సర్ క్రూసేడర్స్ ఆఫ్ క్యూర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో గోల్ఫ్ టోర్నమెంట్ జరుగనుంది. ‘క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్’ పేరిట నిధుల సేకరణ, అవగాహన కల్పించేందుకు 3, 4 తేదీల్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోర్నీ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్ పాల్గొని టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
గొప్ప ఉద్దేశంతో నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని కాజల్ అన్నారు. ఫిబ్రవరి 4న సాయంత్రం 7 గంటలకు నోవాటెల్‌లో ‘సెలెబ్రిటీ గోల్ఫ్ ప్లే ఆప్’ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఎంపీ కవిత, ఐఏఎస్ ఆమ్రపాలి, సీఐఎస్‌ఎఫ్ డీఐజీ శిఖా గోయెల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, సినీతారలు, కేథరిన్, హెబ్బా పటేల్, దక్ష, తేజస్వి, మోడల్ షాలిని పాల్గొంటారని చెప్పారు. ఈ టోర్నీలో దాదాపు 150 మంది గోల్ఫర్లు హాజరవుతారని అన్నారు. విలేకరుల సమావేశంలో కాజల్‌తో పాటు క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ ఆనంద్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ సంఘం అధ్యక్షులు జె. విక్రమదేవ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment