golf tournament
-
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ క్వార్టర్స్‌లో ఆర్య వారియర్స్
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ ఆర్య వారియర్స్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. కల్వకుంట్ల నర్సింగ్‌రావు ఓనర్‌గా ఉన్న ఈ టీమ్‌లో వికాస్ రెడ్డి, వీరన్బాబు, ఫహీమ్, నాగిరెడ్డి యర్రం, రమేశ్ బాబు డిసైడింగ్ రౌండ్ లో అదరగొట్టారు. అద్భుత ఆటతీరుతో కీలక పాయింట్లు సాధించారు. 18.5 పాయింట్లు సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ఓవరాల్ గా ఆ జట్టు 48 పాయింట్లు సాధించింది. మిగిలిన ప్లేయర్స్‌లో దీపక్ సింగ్ ఠాకూర్, చక్రధర్ కూడా రెండేసి పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. టోర్నీ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తున్న ఆర్య వారియర్స్ ప్రదర్శనపై ఆ జట్టు ఓవర్ కల్వకుంట్ల నర్సింగ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ గోల్ఫర్లకు తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ చక్కని వేదికగా నిలుస్తోందన్నారు. టాలెంట్ ఉన్న గోల్ఫ్ ప్లేయర్స్ ను ఇలాంటి లీగ్ ద్వారా ప్రోత్సహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కాగా తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు ఈ నెల 29 నుంచి మొదలు కానున్నాయి. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. చిన్న చిన్న తప్పులు సహజం! అతడొక మాస్టర్ క్లాస్: రోహిత్ శర్మ -
గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ విజేత మను గండాస్
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2022 గోల్ఫ్ టోర్నీలో న్యూఢిల్లీకి చెందిన మను గండాస్ విజేతగా నిలిచాడు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో 126 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. విజేతకు రూ.6 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. హైదరాబాద్‌కు చెందిన మిలింద్ సోనికి ‘బెస్ట్ అమెచ్యూర్’ అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు. చారిత్రక గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని, భవిష్యత్తులో గోల్ఫ్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. -
అమెరికా గోల్ఫ్‌లో తెలుగు కెరటం
నపా (అమెరికా): అమెరికాకు చెందిన తెలుగు గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఫార్టీనెట్ వరల్డ్ ర్యాంకింగ్ గోల్ఫ్ టోర్నమెంట్లో మెరిశాడు. 73 మంది పాల్గొన్న ఈ టోర్నీలో అతను 11 పాయింట్ల స్కోరుతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. టాప్–10లో నిలిచిన సాహిత్‌కు 2 లక్షల 70 వేల డాలర్లు (రూ.2 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రికీ ఫాలెర్, నిక్ టేలర్లు కూడా 11 స్కోరు చేయడంతో ముగ్గురు ఆరో స్థానాన్ని పంచుకున్నారు. 24 ఏళ్ల ఈ తెలుగు గోల్ఫర్ తాజా ప్రదర్శనతో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకున్నాడు. ఎవరీ తీగల సాహిత్? సాహిత్ రెడ్డి జన్మతః అమెరికన్ అయినప్పటికీ భారతీయుడు. హైదరాబాద్‌కు చెందిన తీగల మురళీధర్ రెడ్డి ఉన్నత విద్యాభ్యాసం కోసం 1987లో అమెరికాకు వెళ్లారు. ఉన్నత విద్య పూర్తయ్యాక తెలుగమ్మాయి కరుణను వివాహమాడి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. వీరికి సాహిత్‌తో పాటు మరో కుమారుడు సహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికీ అతని కుటుంబం ప్రతీ రెండేళ్లకోసారి హైదరాబాద్‌కు వచ్చి వెళుతుంది. 2001లో సాహిత్ తల్లి థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడటంతో ఇద్దరి పిల్లల బాగోగులు అమ్మమ్మ విజయలక్ష్మి చూసుకునేది. చిన్నప్పటి నుంచి సాహిత్‌కు గోల్ఫ్ అంటే సరదా. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆటను ఆపలేదు. దీని ఫలితం ఇప్పుడు ప్రొఫెషనల్ అయ్యేందుకు దోహదపడింది. 2020లో ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారిన సాహిత్ ఈ రెండున్నరేళ్లతోనే సంచలన ప్రదర్శనతో అది కూడా అసాధారణ పోటీ ఉండే అమెరికాలో ఈ స్థాయికి దూసుకురావడం గొప్ప ఘనత. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న సాహిత్ 2021–22 సీజన్లో జోరు పెంచాడు. మొత్తం నాలుగు టోర్నీల్లో టాప్–10లో నిలిచాడు. దీంతో ఈ సీజన్లోనే సాహిత్ 17 లక్షల డాలర్లు (రూ.13 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీ రూపేణా సంపాదించడం గమనార్హం. ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ టోర్నీల్లో భారత ఆటగాళ్లు చాలా మందే ఆడుతున్నారు కానీ ఓ హైదరాబాదీ ఈ స్థాయిలో రాణిస్తుండటం విశేషం. -
కన్నీటి పర్యంతమైన టైగర్‌వుడ్స్
గోల్ఫ్ ఆటలో లెజెండరీ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అమెరికాకు చెందిన టైగర్‌వుడ్స్. వ్యక్తిగత జీవితంలో మాయని మచ్చలు చాలానే ఉన్నా.. ఆటలో మాత్రం పేరు, సంపదలు బాగానే చూశాడు. తాజాగా బ్రిటిష్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న టైగర్‌వుడ్స్ దాదాపు 18 హోల్స్ పూర్తి చేశాడు. ఆట ముగిసిన అనంతరం టైగర్‌వుడ్స్ కన్నీటి పర్యంతమయ్యాడు. టైగర్‌వుడ్స్ వెళ్లిపోతున్న సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంతో పాటు కరతాళధ్వనులు చేశారు. బహుశా వయసు రిత్యా మళ్లీ బ్రిటిష్ ఓపెన్ ఆడేందుకు చాన్స్ లేదనే కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడని భావిస్తున్నారు. ''గోల్ఫ్‌లో ఇన్నేళ్లుగా ఉన్న నాపై ఇంకా అభిమానం తగ్గనందుకు చాలా సంతోషంగా ఉందని.. 18 హోల్స్‌కు నాకిచ్చిన స్టాండింగ్ ఒవేషన్‌కు కృతజ్ఞత తెలుపుకుంటున్న.'' అంటూ పేర్కొన్నాడు. ఇక గోల్ప్‌లో 15 సార్లు మేజర్ టైటిల్స్ కొల్లగొట్టిన టైగర్‌వుడ్స్ నిజంగానే రారాజు అని అభివర్ణించొచ్చు. అయితే 46 ఏళ్ల టైగర్‌వుడ్స్ జీవితంలో గతేడాది జరిగిన కారు ప్రమాదం మాత్రం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. మానసికంగా చాలా కుంగిపోయిన టైగర్‌వుడ్స్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మానసిక, ఆరోగ్య సమస్యలతో దాదాపు 17 నెలలు ఆటకు దూరమయ్యాడు. కాగా 2022 ఏప్రిల్‌లో ఆగస్టా నేషనల్ గోల్ఫ్ ద్వారా మళ్లీ అడుగుపెట్టాడు. రీఎంట్రీ ఘనంగా లేకున్నప్పటికి తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. మానసికంగా ఎంతో వేదన అనుభవించిన తర్వాత కూడా గోల్ఫ్‌లోకి తిరిగి రావాలన్న అతని సంకల్పాన్ని అందరూ మెచ్చుకున్నారు. "The warmth and ovation on 18 -- it got to me." An emotional moment for @TigerWoods at #TheOpen pic.twitter.com/K2eqFeKrk2 — PGA TOUR (@PGATOUR) July 15, 2022 చదవండి: Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్.. కెరీర్‌కు గుడ్‌బై -
తొలి గోల్ఫ్ టోర్నమెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆటా
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలి గోల్ఫ్ టోర్నమెంట్‌ను ఆగస్టు 28 ఆదివారం రోజున నిర్వహించింది. గోల్ఫ్ టోర్నమెంట్‌ను ఫ్లోరిడాలోని గైనెస్విల్లేలోని స్టోన్ వాల్ గోల్ఫ్ క్లబ్లో ఏర్పాటుచేసింది. ఈ టోర్నమెంట్లో ప్లేయర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోల్ఫ్ టోర్నమెంట్ కోసం నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా రుచికరమైన వంటకాలను అందించారు. షార్ట్‌గన్ ఫార్మాట్లో సుమారు 28 జట్లు పాల్గొన్నాయి. కిషోర్ చెన్పుపాటి, దినకర్ కుడుం, రిషి సుందరేశన్, సుండు వెంకటరమణి బృందం 58 టై బ్రేక్ స్కోర్‌తో ఫ్లెట్ 1 లో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చంద్ర ద్యామంగౌదర్, అనుప్ గుప్తా, సమీష్ చావ్లా, ప్రకాశ్ కృష్ణమూర్తి బృందం నిలిచింది. ఫ్లైట్ 2 లో కరణ్ చిలుకూరి, శశి రంగనాథన్, దురై నటరాజన్, వికాస్ కాలే బృందం 68 టై బ్రేక్ స్కోరుతో మొదటిస్థానంలో నిలిచారు. క్రిష్ రామయ్య కృష్ణమూర్తి, గోవింద్ జగన్నాథన్ ,సుందర్‌తో కూడిన బాలపెరుంబాల బృందానికి రెండవ స్థానం లభించింది. క్లోజెస్ట్ టూ ది పిన్ కెటగిరీలో హోల్-4లో సుందు వెంకటరమణి, హోల్-12లో సకీత్ వెంనూరి విజేతలుగా నిలిచారు. లాంగెస్ట్ డ్రైవ్స్ విభాగంలో విక్రం కల్లెపు(హోల్-6), చంద్ర ద్యామన్ గౌడ్ (హోల్-18 ) విజేతలుగా నిలిచారు. సురేందర్ యెదుల్లా, ప్రసాద్ తుములూరి, రాజా శ్రీనివాసన్, విక్రమ్ కల్లెపు పర్యవేక్షణలో గోల్ఫ్ టోర్నమెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ భువనేష్ బూజాలా మాట్లాడుతూ.. టోర్నమెంట్లో పాల్గోన్న బృందాలను అభినందించారు. 2022 జూలై 1,2,3 తేదిల్లో వాషింగ్టన్ డీసీలో వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ డీసీ సమావేశానికి ప్రతి ఒకరిని ఆహ్వానించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ డీసీ కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కో-ఆర్డినేటర్ రవి చల్లా వాలంటీర్లను స్పాన్సర్లైన సోమిరెడ్డి లా సంస్థ, సురేష్ సరిబాల, సురేందర్ యెదుల్లా, విజయ్ ఖేతర్పాల్ , లూర్డ్స్ మెక్‌మైఖేల్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినందుకు అభినందించారు. -
మంత్రి కేటీఆర్‌తో కపిల్ దేవ్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమైన కపిల్ దేవ్, డిసెంబర్లో హైదరాబాద్‌లో జరగబోయే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేటీఆర్‌తో కపిల్ దేవ్ చర్చలు జరిపారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 3, 4 తేదీల్లో గోల్ఫ్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ‘క్యాన్సర్ క్రూసేడర్స్ ఆఫ్ క్యూర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో గోల్ఫ్ టోర్నమెంట్ జరుగనుంది. ‘క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ కప్’ పేరిట నిధుల సేకరణ, అవగాహన కల్పించేందుకు 3, 4 తేదీల్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోర్నీ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్ పాల్గొని టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గొప్ప ఉద్దేశంతో నిర్వహించే ఈ టోర్నమెంట్లో భాగమైనందుకు సంతోషంగా ఉందని కాజల్ అన్నారు. ఫిబ్రవరి 4న సాయంత్రం 7 గంటలకు నోవాటెల్‌లో ‘సెలెబ్రిటీ గోల్ఫ్ ప్లే ఆప్’ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ఎంపీ కవిత, ఐఏఎస్ ఆమ్రపాలి, సీఐఎస్ఎఫ్ డీఐజీ శిఖా గోయెల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, సినీతారలు, కేథరిన్, హెబ్బా పటేల్, దక్ష, తేజస్వి, మోడల్ షాలిని పాల్గొంటారని చెప్పారు. ఈ టోర్నీలో దాదాపు 150 మంది గోల్ఫర్లు హాజరవుతారని అన్నారు. విలేకరుల సమావేశంలో కాజల్‌తో పాటు క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ ఆనంద్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ సంఘం అధ్యక్షులు జె. విక్రమదేవ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్ల అర్జున్... గోల్ఫ్ సూపర్‌స్టార్
ప్రతిభా కిరణం అర్జున్ 2007 జనవరి 26న పుణేలో జన్మించాడు. చదువుకు ఇబ్బంది కలగకుండా తల్లిదండ్రులు గనక పిల్లలను ఇతర రంగాలలో ప్రోత్సహిస్తే, వారు సాధించే విజయాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలియజేసేందుకు ప్రత్యక్ష నిదర్శనం - అర్జున్. అర్జున్‌లో ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. గోల్ఫ్ పట్ల అతనికున్న ఇష్టం, పట్టుదలతో ఐదు సంవత్సరాల వయస్సులోనే తొలి గోల్ఫ్ టోర్నమెంట్ ఆడి బహుమతి గెల్చుకున్నాడు. అర్జున్ ఎన్నో గోల్ఫ్ టోర్నమెంటుల్లో పాల్గొన్నాడు. ఛాంపియన్ జూనియర్ గోల్ఫ్ టూర్, పంజాబ్ ఛాలెంజ్ వంటి అనేక టోర్నమెంట్లు గెల్చుకున్నాడు. లాస్‌ఏంజెలస్‌లో జరిగిన గోల్ఫ్ జూనియర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతి చిన్న వయసు భారతీయ క్రీడాకారుడు అర్జున్. అర్జున్‌కి తండ్రి ఋషి మార్గదర్శకుడు. అర్జున్ విజయం సాధించడం వెనుక ఋషి ప్రోత్సాహం ఎంతో ఉంది. అర్జున్‌కు రెండేళ్ళ వయసున్నప్పటి నుండి తండ్రి అతనికి గోల్ఫ్ ఆటలో మెలకువలు నేర్పిస్తున్నారు. అర్జున్ తన ఐదేళ్ల వయసులో అంటే మార్చి 2012లో ఢిల్లీలో జరిగిన ఛాంపియన్ టూర్లో పాల్గొన్నాడు. అది అతనికి మొదటి టోర్నమెంటు. తరువాత ఢిల్లీ, ముంబయ్, కలకత్తా, పుణే, చండీగఢ్‌లలో జరిగిన అనేక టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. ఇటీవల అర్జున్ గోల్ఫ్ జూనియర్ ఒలింపిక్స్‌గా పరిగణించబడే ‘అంతర్జాతీయ వెరిటాస్ ప్రపంచ జూనియర్ టోర్నమెంట్’లో కాంస్యపతకం గెలుచుకున్నాడు. లాస్ ఏంజెలస్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలు పాల్గొన్నారు. ఆరు సంవత్సరాల పిల్లల కేటగిరీలో భారతదేశం నుండి పాల్గొన్న అర్జున్ మాత్రమే అర్హత పొందాడు. పిన్నవయసులోనే ఇన్ని సాధించిన అర్జున్ ఎంతోమందికి స్ఫూర్తి.