
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమైన కపిల్ దేవ్, డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరగబోయే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేటీఆర్‌తో కపిల్ దేవ్ చర్చలు జరిపారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment