Kapil Dev
-
నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. సాయం కావాలి: వినోద్ కాంబ్లీ
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మద్యం సేవించడం, పొగ తాగే అలవాట్ల కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందన్నాడు. అయితే, ఆరు నెలల క్రితమే ఈ చెడు వ్యసనాలను వదిలేశానని.. తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా.. భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బృందం తనకు ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు కాంబ్లీ పేర్కొన్నాడు.పాతాళానికి పడిపోయాడుముంబై తరఫున టీమిండియాలో అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీ.. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండుల్కర్‌కు బాల్య మిత్రుడు. సచిన్ అంతటి స్థాయికి ఎదిగే నైపుణ్యాలున్నా.. వ్యక్తిగత క్రమశిక్షణ లోపించిన కారణంగా కాంబ్లీ పాతాళానికి పడిపోయాడని క్రికెట్ ప్రేమికులు భావిస్తుంటారు. ఇటీవల తమ ‘గురు’, ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ 92 జయంతి సందర్భంగా సచిన్ టెండుల్కర్తో కలిసి వినోద్ కాంబ్లీ వేదికను పంచుకున్నాడు.సాయం చేస్తాం.. కానీ ఓ షరతుఆ సమయంలో కాంబ్లీ ఆరోగ్య, మానసిక పరిస్థితిని చూసిన అభిమానులు చలించిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం కారణంగా కుంగిపోయిన అతడి దుస్థితికి చింతించారు. ఈ నేపథ్యంలో 1983 ప్రపంచకప్ విజేత, కపిల్ దేవ్ సారథ్యంలోని భారత ఆటగాళ్లు కాంబ్లీకి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.అయితే, కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకునేందుకు సిద్ధంగా ఉంటేనే.. సాయం చేస్తామనే షరతు విధించారు. ఈ నేపథ్యంలో విక్కీ లల్వానీ యూట్యూబ్ చానెల్‌తో ముచ్చటించిన వినోద్ కాంబ్లీ.. కపిల్ దేవ్ కండిషన్‌కు తాను ఒప్పుకొంటున్నట్లు తెలిపాడు.నా కుటుంబం నాతో ఉంది‘‘రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం నాతో ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు. తొలుత సునిల్ గావస్కర్ నాతో మాట్లాడారు. ఇక అజయ్ జడేజా కూడా నాకు మంచి స్నేహితుడు.అతడు నా దగ్గరికి వచ్చాడు. నీకోసం మేమంతా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. బీసీసీఐ నాకు సహాయం చేస్తుందని తెలుసు. మాజీ పేసర్ అభయ్ కురువిల్లా నాతో పాటు నా భార్యతోనూ టచ్‌లో ఉన్నాడు.నిజానికి నా పరిస్థితి అస్సలు బాగా లేదు. అయినప్పటికీ నా భార్య అన్నింటినీ చక్కగా హ్యాండిల్ చేస్తోంది. ఆమెకు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నాకిప్పుడు ఎలాంటి భేషజాలు లేవు. ధైర్యంగా రిహాబ్ సెంటర్‌కు వెళ్లి.. ఆరోగ్యంగా తిరిగి వస్తాను.ఇప్పుడు అన్నీ వదిలేశానుఆరు నెలల క్రితమే మద్యం, పొగ తాగటం మానేశాను. నా పిల్లల బాగుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. గతంలో నాకు చెడు అలవాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను’’ అని వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో భార్య ఆండ్రియా కాంబ్లీపై గృహహింస కేసు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం వాళ్లు సఖ్యతగా ఉంటున్నట్లు కాంబ్లీ మాటలను బట్టి తెలుస్తోంది.తొమ్మిదేళ్ల కెరీర్లోఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన వినోద్ కాంబ్లీ.. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) అంతర్జాతీయ కెరీర్ కొనసాగించాడు. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు అందుకున్న భారత క్రికెటర్‌గా ఇప్పటికీ కాంబ్లీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు.చదవండి: D Gukesh Prize Money: గుకేశ్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే? -
రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి: కపిల్ దేవ్
టెస్టు క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంత కాలంగా తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు.ఆసీస్‌తో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం బరిలోకి దిగాడు. ఈ డే అండ్ నైట్ టెస్టులో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.అదేవిధంగా కెప్టెన్సీ పరంగా రోహిత్ ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఫామ్, కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం రోహిత్‌కు మద్దతుగా నిలిచారు. రోహిత్ సామర్థ్యంపై ఎవరికీ సందేహాలు అక్కర్లేదని కపిల్ అన్నారు.‘రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి. ఏళ్ల తరబడి భారత క్రికెట్లో చిరస్మరణీయ విజయాలకు అవసరమైన పరుగులెన్నో చేశాడు. అలాంటి క్రికెటర్ సామర్థ్యంపై ఎవరికీ ఏ సందేహం అక్కర్లేదు. నాకైతే అస్సలే డౌటు లేదు.త్వరలోనే తన ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడు. ఒకట్రెండు ప్రదర్శనలతోనే ఒక కెప్టెన్ ప్రతిభను అంచనా వేయడం తగదు. ఆ నాయకుడే ఆరు నెలల క్రితం భారత్ టి20 ప్రపంచకప్ అందించాడన్న సంగతి మరిచిపోవద్దు. రోహిత్ మరింత బలంగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాను" అని కపిల్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.చదవండి: PKL 2024: తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి.. -
కాంబ్లీ తన ఆరోగ్యంపై బాధ్యతతో ఉండాలి: కపిల్ దేవ్
భారత మాజీ కెప్టెన్, ఆల్‌రౌండ్ దిగ్గజం కపిల్ దేవ్ సాయానికి ఎందరు ముందుకొచ్చినా... వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం పట్ల తనే శ్రద్ధ చూపెట్టాలని సూచించాడు. 52 ఏళ్ల కాంబ్లీ గతితప్పిన జీవనశైలితో పాటు మద్యానికి బానిసై తీవ్ర ఆనారోగ్యం పాలయ్యాడు.కోచింగ్ లెజెండ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారకార్థం ఇటీవల ముంబైలో జరిగిన కార్యక్రమంలో కాంబ్లీ ఓ పేషంట్లా కనిపించడంతో విచారం వ్యక్తం చేసిన భారత మాజీలు, దిగ్గజాలు అతని పరిస్థితి మెరుగయ్యేందుకు తమవంతు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు.ఆ కార్యక్రమంలో సచిన్ కూడా పాల్గొని కాంబ్లీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ (1983లో) అందించిన కపిల్ దేవ్ కూడా తాజాగా కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై విచారం వెలిబుచ్చారు. ‘మేమంతా అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికంటే ముఖ్యం తను కూడా తన ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లుగా నడుచుకోవాలి. తిరిగి ఆరోగ్యవంతుడయ్యేందుకు స్వీయ నియంత్రణ పాటించాలి. ఒక విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి తనను తాను చూసుకోలేకపోతే మనం మాత్రం చేయగలిగేదేమీ ఉండదు’ అని అన్నారు.కాంబ్లీ సహచరులే కాదు... అతని సీనియర్లు, పలువురు దిగ్గజ క్రికెటర్లు అతని దీన పరిస్థితి చూసి బాధపడుతున్నారని, అతని సన్నిహితులెవరైనా బాధ్యత తీసుకొని అతను మెరుగయ్యేందుకు చొరవ చూపించాలని, రిహాబిలిటేషన్‌కు పంపి యోగక్షేమాలు చూసుకోవాలని కపిల్ సూచించారు.సచిన్ బాల్యమిత్రుడు, క్రికెట్లో సమకాలికుడు అయిన కాంబ్లీ ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అన్న సంగతి మరిచి క్రమశిక్షణ లేని జీవితంతో క్రీడా భవిష్యత్తునే కాదు... తాజాగా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు.తన కెరీర్లో 104 వన్డేలాడి 2477 పరుగులు, 17 టెస్టుల్లో 1084 పరుగులు చేశాడు. కెరీర్ ముగిశాక గాడితప్పిన జీవితం వల్ల 39 ఏళ్ల వయసులోనే అతని గుండెకు 2012లోనే శస్త్రచికిత్స జరిగింది. అయినాసరే కాంబ్లీ ఏమాత్రం మారకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.చదవండి: సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత -
కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!
ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపళ్లాలు సహజం. వెలుగు వెంటే చీకటి.. సుఖం వెంటే దుఃఖం.. ఇలా ఒకదాని వెనుక మరొకటి రావడం సహజం. కానీ కొందరి జీవితంలో అంతా బాగుందనుకునేలోపే.. మొత్తం తలకిందులైపోతుంది. దర్జాగా కాలుమీద కాలు వేసుకుని బతికినవాళ్లు సైతం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకుంటారు. టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుత స్థితి ఇందుకు నిదర్శనం.ముంబై నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వచ్చిన మేటి ఆటగాళ్లలో కాంబ్లీ ఒకడు. భారత క్రికెట్ దిగ్గజం అంటూ నీరజనాలు అందుకుంటున్న సచిన్ టెండుల్కర్‌కు బాల్య స్నేహితుడు. రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకున్న వీళ్లిద్దరిలో ఒకరు ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే.. మరొకరు అగాథంలో కూరుకుపోయారు. ఇందుకు కారణాలు అనేకం.ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా!కాంబ్లీ కెరీర్ ఊపుమీద ఉన్నపుడు అతడి పరిస్థితి బాగానే ఉండేది. అప్పట్లో అతడి నికర ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల వరకు ఉండేదని జాతీయ మీడియా వర్గాల అంచనా. అయితే, ఇప్పుడు మాత్రం కాంబ్లీ దీనస్థితిలో కూరుకుపోయాడు. 2022 నుంచి పరిస్థితి మరీ దిగజారింది. ఇందుకు కాంబ్లీ క్రమశిక్షణా రాహిత్యమే కారణమనే విమర్శలు ఉన్నాయి.ఏదేమైనా.. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయిన వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే నెలవారీ పెన్షన్ రూ. 30 వేలతో కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల రమాకాంత్ ఆచ్రేకర్ 92వ జయంతి సందర్భంగా సచిన్‌తో కలిసి కాంబ్లీ ఒకే వేదికపై కనిపించిన తర్వాత.. మరోసారి అతడి గురించి చర్చ మొదలైంది.ముఖ్యంగా కాంబ్లీ ఆరోగ్య స్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడికి సాయం అందించాలంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసన్ బల్విందర్ సంధు చేసిన వ్యాఖ్యలు వారికి ఊరటనిచ్చాయి.కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. కానీ ఓ కండిషన్!వినోద్ కాంబ్లీకి సాయం చేసేందుకు 83 బ్యాచ్ సిద్ధంగా ఉందని బల్విందర్ తెలిపాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కాంబ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లాలని భావిస్తే తప్పకుండా సాయం చేద్దామని కపిల్ దేవ్(1983 వరల్డ్‌కప్ విజేత జట్టు కెప్టెన్) నాతో చెప్పాడు. ఆర్థికంగానూ సాయం అందిద్దామన్నాడు.అయితే, అతడు రిహాబ్ సెంటర్‌కు వెళ్లినపుడు మాత్రమే అక్కడి బిల్లులు చెల్లిస్తామని.. చికిత్స పూర్తయ్యేంత వరకు ఖర్చులన్నీ భరిస్తామని చెప్పాడు. ఒకవేళ కాంబ్లీ అందుకు సిద్ధంగా లేకపోతే మేమేమీ చేయలేము’’ అని బల్విందర్ సంధు పేర్కొన్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
నిప్పులు చెరిగిన బుమ్రా.. అరుదైన రికార్డుతో దిగ్గజ కెప్టెన్ల సరసన!
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. అదే విధంగా.. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మల రికార్డును సమం చేశాడు. అసలు విషయం ఏమిటంటే!..బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. అయితే, భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరం కాగా.. పేస్ దళ నాయకుడు బుమ్రా పగ్గాలు చేపట్టాడు. ఇక పెర్త్ వేదికగా మొదటి టెస్టులో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.టీమిండియా 150 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ అయి తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. శుక్రవారం బుమ్రా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు.రెండో రోజు ఆరంభంలోనే బుమ్రా ఇలాఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కాసేపటికే వికెట్ కోల్పోయింది. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(21)ని అవుట్ చేసి బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. అంతేకాదు.. పెర్త్ టెస్టులో తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. ఓవరాల్‌గా బుమ్రాకు ఇది టెస్టుల్లో పదకొండో ఫైవ్ వికెట్ హాల్ కాగా.. సారథిగా మొదటిది.ఈ క్రమంలో టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ల సరసన బుమ్రా చేరాడు. అతడి కంటే ముందు.. వినోద్ మన్కడ్, బిషన్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను బుమ్రా వెనక్కినెట్టడం మరో విశేషం.టెస్టుల్లో టీమిండియా తరఫున ఐదు వికెట్ల ప్రదర్శన(ఒకే ఇన్నింగ్స్) నమోదు చేసిన టీమిండియా కెప్టెన్లు1. వినోద్ మన్కడ్(1)2. బిషన్ బేడి(8)3. కపిల్ దేవ్(4)4. అనిల్ కుంబ్లే(2)5. జస్ప్రీత్ బుమ్రా(1)టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్లు1. రవిచంద్రన్ అశ్విన్ - 37 (105 మ్యాచ్‌లు) 2. అనిల్ కుంబ్లే - 35 (132 మ్యాచ్‌లు) 3. హర్భజన్ సింగ్ - 25 (103 మ్యాచ్‌లు) 4. కపిల్ దేవ్ - 23 (131 మ్యాచ్‌లు) 5. బీఎస్ చంద్రశేఖర్ - 16 (58 మ్యాచ్‌లు) 6. రవీంద్ర జడేజా - 15 (77 మ్యాచ్‌లు) 7. బిషన్ సింగ్ బేడీ - 14 (67 మ్యాచ్‌లు) 8. సుభాశ్ చంద్ర పండరీనాథ్ గుప్తే - 12 (36 మ్యాచ్‌లు) 9. జస్ప్రీత్ బుమ్రా - 11 (41 మ్యాచ్‌లు) 10. జహీర్ ఖాన్ - 11 (92 మ్యాచ్‌లు) 11. ఇషాంత్ శర్మ - 11 (105 మ్యాచ్‌లు)ఇదిలా ఉంటే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత పేసర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Make that FIVE! There's the first five-wicket haul of the series #MilestoneMoment #AUSvIND @nrmainsurance pic.twitter.com/t4KIdyMTLI— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
BGT: కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా భారత దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మరో 20 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ ఆసీస్ గడ్డపై 11 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీశాడు. కంగారూల గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఆసీస్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రాకు ముందు కపిల్ దేవ్ (51), అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39), బిషన్ సింగ్ బేడీ (35) ఉన్నారు. బీజీటీలో మొత్తం ఐదు టెస్ట్‌లు జరుగనున్న నేపథ్యంలో కపిల్ రికార్డును బద్దలు కొట్టడం బుమ్రాకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. అందులోనూ ఆసీస్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి బుమ్రాకు కపిల్ రికార్డును అధిగమించడం మరింత సలభమవుతుంది.కాగా, బీజీటీలో భాగంగా ఆసీస్‌తో జరుగబోయే తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రోహిత్ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతను భారత్‌లోనే ఉండిపోయాడు. దీంతో తొలి టెస్ట్‌లో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా టెస్ట్‌లో టీమిండియాకు సారధిగా వ్యవహరించడం ఇది రెండోసారి. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బుమ్రా తొలి సారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. మరి బుమ్రా కెప్టెన్‌గా తన రెండో టెస్ట్‌లోనైనా టీమిండియాను గెలిపిస్తాడో లేదో వేచి చూడాలి. -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. కపిల్ దేవ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెరలేవనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆసీస్-భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే 4-0 తేడాతో ఆతిథ్య ఆసీస్‌ను ఓడించాలి.కపిల్ రికార్డుపై కన్నేసిన బుమ్రా.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు.బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడి 32 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆసీస్ గడ్డపై కపిల్ దేవ్ 11 టెస్టులు ఆడి 51 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బుమ్రా మరో 20 వికెట్లను తీస్తే కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భాత బౌలర్లు వీరేకపిల్ దేవ్ - 51అనిల్ కుంబ్లే - 49రవిచంద్రన్ అశ్విన్ - 39బిషన్ సింగ్ బేడీ - 35జస్ప్రీత్ బుమ్రా - 32ఎరపల్లి ప్రసన్న – 31మహ్మద్ షమీ - 31ఉమేష్ యాదవ్ - 31ఇషాంత్ శర్మ - 31చదవండి: WI Vs ENG 4th T20: విండీస్ ఓపెనర్ల ఊచకోత.. భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి -
'రూమ్‌లో కూర్చుంటే కుదరదు'. భారత ప్లేయర్లపై కపిల్‌దేవ్ ఫైర్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో టీమిండియా వైట్‌వాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. కివీస్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు సైతం కివీస్ బౌలర్ల ముందు తేలిపోయారు.ఫలితంగా స్వదేశంలో తొలిసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యి ఘోర ఆప్రతిష్టతను భారత జట్టు మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు మెరుగుపడడానికి నిరంతరం ప్రాక్టీస్ చేయడం ఒక్కటే మార్గమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.రూమ్‌లో కూర్చుంటే కుదరదు.."క్రికెట్ బేసిక్స్‌కి తిరిగి వెళ్లండి. ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టండి. అంతే తప్ప రూమ్‌లో కూర్చుని మెరుగవుతామంటే కుదరదు. ప్రస్తుతం మీకు గడ్డుకాలం నడుస్తోంది. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచిది" అని క్రికెట్ నెక్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు.కాగా కివీస్ టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమవుతోంది. వచ్చే వారం ఆస్ట్రేలియాకు రోహిత్ సేన పయనం కానుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
నటితో ప్రేమ.. బ్రేకప్ చెప్పేసి రోమితో పెళ్లి! కపిల్ దేవ్ సీక్రెట్ లవ్‌స్టోరీ! (ఫొటోలు)
-
మిడిలార్డర్లో కపిల్ దేవ్.. గంభీర్, దాదాకు దక్కని చోటు
భారత క్రికెట్లో పాతతరం నుంచి నేటివరకు తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా.. చెప్పుకొంటూ పోతే జాబితా పెరుగుతూనే ఉంటుంది.పీయూశ్ చావ్లా ఏమన్నాడంటేఇంతమంది ఆటగాళ్లలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలంటే కష్టమే మరి! అయితే, భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా మాత్రం తనకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2006 నుంచి 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్. కెరీర్లో మొత్తంగా 6 టెస్టుల్లో 7, 25 వన్డేల్లో 32, ఏడు టీ20లలో 4 వికెట్లు పడగొట్టాడు.స్వల్ప కాలమే టీమిండియాకు ఆడినా పీయూశ్ చావ్లా ఖాతాలో రెండు ప్రపంచకప్ ట్రోఫీలు ఉండటం విశేషం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో పీయూశ్ సభ్యుడు. గత పన్నెండేళ్లుగా ఐపీఎల్‌కే పరిమితమైన ఈ వెటరన్ స్పిన్నర్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ధోని.. నాలుగోస్థానంలో కోహ్లిఈ క్రమంలో శుభాంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీయూశ్ తన ఆల్‌టైమ్ ఇండియా వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు. తన జట్టుకు ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న పీయూశ్.. సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వీరేంద్ర సెహ్వాగ్‌కు మూడు, విరాట్ కోహ్లికి నాలుగో స్థానం ఇచ్చాడు. మిడిలార్డర్లో ఆల్‌రౌండర్లు యువరాజ్ సింగ్, కపిల్ దేవ్లను ఎంపిక చేసుకున్న పీయూశ్.. ఆ తర్వాత ధోనిని నిలిపాడు. స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లకు చోటిచ్చిన అతడు.. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేసుకున్నాడు.దాదా, గంభీర్‌కు చోటు లేదుఅయితే, వరల్డ్‌కప్(2007, 2011) హీరో గౌతం గంభీర్, స్టార్ కెప్టెన్ సౌరవ్ గంగూలీలకు పీయూశ్ తన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. నంబర్ 3లో హిట్టయిన కోహ్లిని నాలుగో స్థానానికి ఎంచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల పీయూశ్ చావ్లా ఐపీఎల్ రికార్డు మాత్రం ఘనంగా ఉంది. ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడి 192 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.పీయూశ్ చావ్లా ఆల్‌టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
మా నాన్నకు ఆ సమస్య ఉంది: యువీ కామెంట్స్ వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిలపై మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కపిల్ వల్ల తన కెరీర్ సజావుగా సాగలేదన్న యోగ్రాజ్.. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోని నాశనం చేశాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో యువీ గతంలో తన తండ్రి యోగ్రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.‘‘మా నాన్నకు మానసిక సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అదే ఆయనకున్న అతి పెద్ద సమస్య. ఇది ఆయనకు తెలిసినా మారేందుకు సిద్ధంగా లేరు’’ అంటూ యువరాజ్ సింగ్ గతేడాది నవంబరులో రణ్వీర్ అల్హాబ్దియా పాడ్‌కాస్ట్‌లో యోగ్రాజ్ గురించి చెప్పుకొచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. ధోని అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ధోని వంటి టాప్ క్రికెటర్‌ను టార్గెట్ చేయడం ద్వారా యోగ్రాజ్ వార్తల్లో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నాడని.. అయితే, ఇప్పుడు ఇలాంటి చవకబారు మాటలను ఎవరూ పట్టించుకోరని కామెంట్లు చేస్తున్నారు. యువీ తన తండ్రి గురించి చెప్పింది వందకు వంద శాతం నిజమని పేర్కొంటున్నారు. యోగ్రాజ్ ఇలాగే మాట్లాడితే యువరాజ్‌కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని.. ఇకనైనా ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.కాగా టీమిండియా తరఫున 1980-81 మధ్య కాలంలో ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు యోగ్రాజ్. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ వల్లే తనకు అవకాశాలు కరువయ్యాయని గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్న అతడు.. తన కుమారుడిని విజయవంతమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని భావించాడు. తండ్రి ఆశయాలకు తగ్గట్లుగానే మేటి ఆల్‌రౌండర్‌గా ఎదిగిన యువీ.. క్యాన్సర్‌ను జయించి మరీ ఆటను కొనసాగించాడు.అయితే, 2015 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువీకి ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే నాడు ధోని కెప్టెన్‌గా ఉండటం గమనార్హం. అంతేకాదు.. యువీ-ధోని అండర్-19 క్రికెట్లోనూ సమకాలీకులే. ఇద్దరు ప్రతిభావంతులే అయినా ధోని తన అసాధారణ నైపుణ్యాలతో కెప్టెన్‌గా ఎదిగాడు.ఈ నేపథ్యంలో ధోని గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘నేను ధోనిని ఎన్నటికీ క్షమించను. ఒకసారి అతడు అద్దంలో తన ముఖం చూసుకోవాలి. అతడొక పెద్ద క్రికెటరే కావొచ్చు. కానీ నా కుమారుడి విషయంలో అతడేం చేశాడు? నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు. అతడు కనీసం మరో నాలుగేళ్లపాటు ఆడేవాడు.కానీ ధోని వల్లే ఇదంతా జరిగింది. యువరాజ్ వంటి కొడుకును ప్రతి ఒక్కరు కనాలి’’ అని యోగ్రాజ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా కపిల్ దేవ్ గురించి ప్రస్తావిస్తూ.. కపిల్ కంటే తన కొడుకు యువీనే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని చెప్పుకొచ్చాడు. అయితే, యువీ ఇంత వరకు తన తండ్రి వ్యాఖ్యలపై స్పందించలేదు. My Father has mental issues : Yuvraj #MSDhoni pic.twitter.com/KpSSd4vDzA— Chakri Dhoni (@ChakriDhonii) September 2, 2024 -
కపిల్ డెవిల్ ఇన్నింగ్స్.. క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం
వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప అనుకునే రోజులవి. అలాంటిది ఓ భారత బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ స్కోర్ చేసింది ఏదో ఆషామాషి మ్యాచ్‌లో కాదు. ప్రపంచకప్‌లో. అది కూడా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో. తదుపరి దశకు చేరాలంటే ఆ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.వివరాల్లోకి వెళితే.. అది జూన్ 18, 1983. ప్రుడెన్షియిల్ వరల్డ్‌కప్‌లో భారత్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న రోజు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 17 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగాడు నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరినా కపిల్ ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోజర్ బిన్నీ సహకారంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 22 పరుగులు చేసిన అనంతరం రోజర్ బిన్నీ ఔట్ కావడంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈలోపు రవిశాస్త్రి (1) కూడా ఔటయ్యాడు. ఓ పక్క ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతున్నా కపిల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరి వరుస బ్యాటర్లు మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేశాక కపిల్ మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా వాయించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటే ఆ రోజు కపిల్ డబుల్ సెంచరీ చేసుండేవాడు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్ 60 ఓవర్ల పాటు సాగేది. నిర్ణీత 60 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పటికి వన్డేల్లో అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. చాలా రోజుల పాటు ఈ రికార్డు కపిల్ పేరిటే కొనసాగింది.అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మదన్ లాల్ 3, రోజర్ బిన్నీ 2, కపిల్, మొహిందర్ అమర్నాథ్, బల్విందర్ సంధు తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెవిన్ కర్రన్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో వారం రోజుల తర్వాత భారత్ తమ తొలి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ కవరేజ్ అప్పట్లో జరగలేదు కానీ, జరిగి ఉండింటే తరతరాలకు గుర్తుండిపోయేది. -
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..!
వన్డే చరిత్రలో పది అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను స్పోర్ట్స్ టుడే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్తాన్పై చేసిన అజేయ డబుల్ సెంచరీకి (201) టాప్ ప్లేస్ లభించింది. 1983 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్‌కు రెండో స్థానం దక్కింది. 1998లో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ ఆడిన 143 పరుగుల ఇన్నింగ్స్ మూడో స్థానం.. 1984లో ఇంగ్లండ్‌పై వివ్ రిచర్డ్స్ ఆడిన 189 పరుగుల ఇన్నింగ్స్‌కు నాలుగో స్థానం.. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌పై రికీ పాంటింగ్ ఆడిన 140 పరుగుల ఇన్నింగ్స్‌కు ఐదో స్థానం.. 1997లో భారత్‌పై సయీద్ అన్వర్ ఆడిన 194 పరుగుల ఇన్నింగ్స్‌కు ఆరో స్థానం.. 2023 వరల్డ్‌కప్‌లో భారత్‌పై ట్రవిస్ హెడ్ ఆడిన 137 పరుగుల ఇన్నింగ్స్‌కు ఏడో స్థానం.. 2012లో శ్రీలంకపై విరాట్ కోహ్లి ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్‌కు ఎనిమిదో స్థానం.. 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గౌతమ్ గంభీర్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్‌కు తొమ్మిదో స్థానం.. 2014లో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల ఇన్నింగ్స్‌కు పదో స్థానం దక్కాయి. -
1983 World Cup: భారత క్రికెట్ చరిత్రను మార్చేసిన ఆ మ్యాచ్..
"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ఆరు గంటల తర్వాత మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఆటలో గెలుపు ఓటములు సహజం. కానీ గెలిచేందుకు మనం తీవ్రంగా శ్రమించాలి. ఇది మనకు చావో రేవో. ప్రత్యర్ధి ఎవరన్నది మనకు అనవసరం.మనం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. గెలిచిన ఓడినా ఒకేలా ఉండాలి. అంతే తప్ప తర్వాత అనవసర చర్చలు పెట్టుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ”.. ఇవీ 1983 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లకు కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పిన మాటలు.25 జూన్ 1983.. భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర అవిష్కతృమైంది. అప్పటివరకు పసికూనలుగా ముద్రపడిన భారత జట్టు.. ఆ రోజు ప్రపంచానికి తమ సత్తా ఏమిటో చూపించింది. 1983 వన్డే వరల్డ్‌కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ఓటమంటూ ఎరుగని వెస్టిండీస్‌ను ఓడించి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను కపిల్ డేవిల్స్ ముద్దాడింది. తొలి వరల్డ్‌కప్‌ను గెలిచి లార్డ్స్ మైదానంలో భారత జెండాను కపిల్ సేన రెపలాపడించింది. ఈ విజయంతో యావత్తు భారత్ గర్వంతో ఉప్పొంగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ వరల్డ్‌కప్‌తో పాటు భారత క్రికెట్ చరిత్రను మార్చేసింది.నిప్పులు చేరిగిన విండీస్ బౌలర్లు..అప్పట్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లకు పెట్టింది పేరు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఊపిరి పీల్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ స్కోర్ ఉంచి.. లక్ష్యచేధనలో ఒత్తిడి పెంచాలని కపిల్ భావించాడు.కానీ అక్కడ ఉంది కరేబియన్లు. ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ సునీల్ గవాస్కర్‌ను ఔట్ చేసి విండీస్ బౌలర్లు భారత్‌ను దెబ్బ కొట్టారు. ఆ తర్వాత మరో ఓపెనర్ శ్రీకాంత్, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన మోహిందర్ అమర్నాథ్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.శ్రీకాంత్, అమర్నాథ్ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ భారత స్కోర్ 90 పరుగుల వద్ద వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. దీంతో టీమిండియా పతనం మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. 54.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. శ్రీకాంత్(38), అమర్నాథ్(26) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు.ఆరంభం ఆదుర్స్..ఇక 184 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ ఊదిపడేస్తుందని అంతా భావించారు. భారత ఓటమితో ఇంటిముఖం పట్టకతప్పదని అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు. భారత పేసర్ బల్వీందర్ సంధు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విండీస్ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్‌ను ఔట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత మదన్‌లాల్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. అయితే ఈ సమయంలో దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ మాత్రం భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.మదన్ లాల్ మ్యాజిక్..మ్యాచ్‌పై భారత పట్టు బిగిస్తున్న సమయంలో రిచర్డ్స్ ఎటాక్ చేయడంతో కెప్టెన్ కపిల్‌దేవ్ ముఖంలో కాస్త టెన్షన్ కన్పించింది. రెండు వికెట్ల పడగొట్టిన మదన్‌లాల్‌ను సైతం రిచర్డ్స్ టార్గెట్ చేశాడు. మదన్‌లాల్ వేసిన ఓ ఓవర్లో రిచర్డ్స్ మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను తమవైపు తిప్పే ప్రయత్నం రిచర్డ్స్ చేశాడు. ఈ క్రమంలో రోజర్ బిన్నీని కపిల్ దేవ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చి రిచర్డ్స్ దూకుడును కట్టడి చేయాలని భావించాడు. బిన్నీ పరుగులు రాకుండా ఆపినప్పటికి.. అతడి వికెట్ మాత్రం సాధించలేకపోయాడు. అయితే మళ్లీ మదన్‌లాల్.. కపిల్ దగ్గరకు వచ్చి నేను బౌలింగ్ చేస్తా అని చెప్పాడు.కానీ అంతకుముందు ఓవరే మూడు ఫోర్లు ఇవ్వడంతో కపిల్ దేవ్ మదన్‌లాల్‌ను పక్కన పెట్టాలని అనుకున్నాడు. అయినా సరే మదన్ మాత్రం తనకు ఒక్క ఓవర్ వేసే అవకాశాన్ని ఇవ్వమన్నాడు. అందుకు సరే అని కపిల్ అతడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ ఓవర్లో మదన్ లాల్ మ్యాజిక్ చేశాడు.కపిల్ సూపర్ క్యాచ్..ఈసారి మాత్రం కెప్టెన్ నమ్మకాన్ని మదన్‌లాల్ వమ్ముచేయలేదు. ఆ ఓవర్లో మదన్ లాల్ అద్భుతం చేశాడు. వీవీ రిచర్డ్స్‌ను ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అయితే ఈ వికెట్ క్రెడిట్ మదన్ లాల్ కంటే కెప్టెన్ కపిల్ దేవ్కే ఇవ్వాలి. సంచలన క్యాచ్‌తో వీవియన్ను కపిల్ దేవ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ ఓవర్లో మూడో బంతిని మదన్ లాల్ రిచర్డ్స్కు షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. అతడు ఆ డెలివరీని హుక్ షాట్ ఆడాలని ప్రయత్నించాడు. కానీ బంతి సరిగ్గా షాట్ కనక్ట్‌కాకపోవడంతో బంతి డీప్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ సమయంలో మిడ్-ఆన్‌లో ఉన్న కపిల్ దేవ్.. డీప్ మిడ్-వికెట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు.ఆ క్యాచ్‌తో విండీస్ ఖేల్ ఖతమైంది. వరుసగా వికెట్లు కోల్పోయి 140 పరుగులకే కరేబియన్ జట్టు కుప్పకూలింంది. దీంతో 43 పరుగులతో భారత్ చారిత్రత్మక విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో అమర్ నాథ్, మదన్ లాల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సంధు రెండు, బిన్నీ ఒక్క వికెట్ సాధించారు. -
‘ఆ ఇద్దరూ లెజెండ్స్.. వారి స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరు'
టీ20 వరల్డ్‌కప్-2024 విజయనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిలు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ టీ20లకు విడ్కోలు పలికినప్పటకి.. పొట్టి ఫార్మాట్లో తమకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరచుకున్నారు.టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరూ టాప్-2లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 'రోకో' ద్వయంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20ల్లో విరాట్, రోహిత్ స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల స్ధానాలను ఎవరూ భర్తీ చేయలేరు. టీ20ల్లో మాత్రం కాదే ఇతర ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ లాంటి ఆటగాళ్లు మరి రారు. భారత క్రికెట్‌కు చాలా ఏళ్ల నుంచి వారు తమ సేవలను అందిస్తున్నారు. నిజంగా ఇది వారికి ఘనమైన విడ్కోలు. కానీ టీ20ల్లో వారిద్దరి లేని కచ్చితంగా భారత జట్టులో కన్పిస్తోంది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిల మాదిరిగానే వీరిద్దరి పేర్లు కూడా భారత క్రికెట్ చిరస్మణీయంగా నిలిచిపోతాయని ఇండో-ఆసియన్ న్యూస్ సర్వీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత విరాట్, రోహిత్ ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీలంక పర్యటనకు వీరిద్దరి అందుబాటుపై ఇంకా సందిగ్థం నెలకొంది. శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశముంది. -
కపిల్ దేవ్ పక్కనున్న దిగ్గజ క్రికెటర్‌ను గుర్తుపట్టారా?
క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన ఇద్దరు దిగ్గజ కెప్టెన్లను ఒకే ఫ్రేములో చూడటం అభిమానులకు కన్నులపండుగే! అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇందులో.. భారత్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌ను ఈజీగానే గుర్తుపట్టారు నెటిజన్లు. అయితే, ఫొటోలో ఉన్న మరొక వ్యక్తి గురించి మాత్రం నమ్మలేకపోతున్నాం అంటున్నారు.దిగ్గజ బ్యాటర్ఆయన పూర్వ రూపానికి.. ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. కపిల్ దేవ్‌తో పాటు ఉన్న క్రికెటర్ మరెవరో కాదు అర్జున్ రణతుంగ. శ్రీలంకను 1996లో వరల్డ్‌కప్ విజేతగా నిలిపిన దిగ్గజ బ్యాటర్.శ్రీలంక తరఫున 1982 నుంచి 2000 సంవత్సరం వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన అర్జున్ రణతుంగ ఆయా ఫార్మాట్లలో 5105, 7456 పరుగులు సాధించాడు.పార్ట్‌టైమ్ బౌలర్ అయిన ఈ రైటార్మ్ మీడియం పేసర్ ఖాతాలో టెస్టుల్లో 16, వన్డేల్లో 79 వికెట్లు కూడా ఉన్నాయి. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అర్జున్ రణతుంగ రాజకీయాల్లో ప్రవేశించాడు.శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగానూశ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో భాగమయ్యాడు. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దిగ్గజ కెప్టెన్లు అర్జున్ రణతుంగ- కపిల్ దేవ్ ఫొటో తెరమీదకు రావడం విశేషం.ఇందులో అర్జున్ రణతుంగను చూసిన నెటిజన్లు.. ‘‘90వ దశకంలో ఆయన మ్యాచ్‌లు చూశాం. అసలు ఆయనా ఈయనా ఒక్కరేనా? అస్సలు నమ్మలేకపోతున్నాం. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల జూలై 27న తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టూర్‌తో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. చదవండి: ‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’Two World Cup winning captains. pic.twitter.com/zJane9Oq0u— Rex Clementine (@RexClementine) July 16, 2024 -
బ్లడ్ క్యాన్సర్.. బాధగా ఉంది: బీసీసీఐకి కపిల్ దేవ్ విజ్ఞప్తి
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశాడు. పాతతరం ఆటగాళ్ల పట్ల కూడా కాస్త ఉదారంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికాడు. మాజీ క్రికెటర్ల బాగోగులు చూసేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.అన్షుమన్ గైక్వాడ్‌కు బ్లడ్ క్యాన్సర్కాగా భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గతేడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. అన్షుమన్ చికిత్స కోసం మొహిందర్ అమర్నాథ్, సునిల్ గావస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ తదితరులు తమ వంతు సహాయంగా నిధులు సమకూరుస్తున్నారని తెలిపాడు.బీసీసీఐ సాయం చేయాలిబీసీసీఐ కూడా చొరవ తీసుకుని అన్షుమన్ గైక్వాడ్‌కు ఆర్థికంగా సహాయం అందించాలని కపిల్ దేవ్ విజ్ఞప్తి చేశాడు. ‘‘ఇది చాలా విచాకరం. నా మనసంతా బాధతో నిండిపోయింది.అన్షుతో కలిసి క్రికెట్ ఆడిన నేను.. అతడి ప్రస్తుత పరిస్థితిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అతడిని ఆ స్థితిలో చూడలేకపోతున్నాను. ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు.బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకుంటుందని భావిస్తున్నా. మైదానంలో భయంకరమైన బంతులు విసిరే ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవడానికి అన్షు ఎంతో పట్టుదలగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు మనమంతా అతడికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. క్రికెట్ ప్రేమికులు అతడి కోసం ప్రార్థించండి’’ అని కపిల్ స్పోర్ట్స్‌స్టార్ ద్వారా విజ్ఞప్తి చేశాడు.అదే విధంగా.. క్రికెటర్లకు ఆపత్కాలంలో సహాయం అందించేందుకు బీసీసీఐ ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కపిల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇలాంటి సమయంలో క్రికెటర్లను ఆదుకునేందుకు దురదృష్టవశాత్తూ మనకంటూ ఒక స్థిరమైన వ్యవస్థ లేదు.ట్రస్టు ఏర్పాటు చేయాలిమా తరంలో ఆటగాకు అంతగా డబ్బు వచ్చేది కాదు. అప్పుడు బోర్డు దగ్గర కూడా అంతగా ధనం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి ఒక్క ఆటగాడు కావాల్సినంత సంపాదించుకోగలుగుతున్నాడు.సహాయక సిబ్బందికి కూడా వేతనాలు బాగానే ఉన్నాయి. మరి మా సంగతేంటి? సీనియర్ల కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలి. బీసీసీఐ తలచుకుంటే అదేమీ అంత పెద్ద విషయం కాదు. కావాలంటే మేమంతా మా పెన్షన్ల నుంచి కొంత విరాళంగా ట్రస్టుకు ఇస్తాం కూడా’’ అని కపిల్ దేవ్ అన్నాడు. మరి బీసీసీఐ కపిల్ విజ్ఞప్తిపై స్పందిస్తుందో లేదో చూడాలి!టీమిండియా హెడ్ కోచ్‌గానూ కాగా మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ 1975- 1987 మధ్య టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. రెండుసార్లు టీమిండియా హెడ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టుల్లో 1985, వన్డేల్లో 269 పరుగులు సాధించాడు.చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
ఇదేం టెస్టు మ్యాచ్ కాదు: రోహిత్‌పై మండిపడ్డ కపిల్ దేవ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్మెంట్ తీరుపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మండిపడ్డాడు. టీ20 మ్యాచ్‌లలో టెస్టు మ్యాచ్ మాదిరి వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించాడు. వరల్డ్‌క్లాస్ బౌలర్, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను ఎలా వాడుకోవాలో తెలియదా అంటూ కపిల్ దేవ్ ఫైర్ అయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేసింది.రెండు మ్యాచ్‌లలో తొలుత అతడి చేతికే బంతిగ్రూప్-ఏలో భాగమైన రోహిత్ సేన తొలుత ఐర్లాండ్, ఆ తర్వాత పాకిస్తాన్‌పై గెలుపొంది టాపర్‌గా కొనసాగుతోంది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లలో టీమిండియా బౌలింగ్ అటాక్‌ను యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆరంభించాడు.రెండో ఓవర్లో మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆరో ఓవర్లో బుమ్రాను బరిలోకి దింపిన హిట్‌మ్యాన్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మూడో ఓవర్ సందర్భంగా బాల్ అతడికి ఇచ్చాడు.అద్భుత స్పెల్‌తో దుమ్ములేపిన బుమ్రాఈ రెండు లో స్కోరింగ్ మ్యాచ్‌లలోనూ జస్ప్రీత్ బుమ్రా అద్భుత స్పెల్‌తో ఆకట్టుకుని భారత్‌కు విజయాలు అందించాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్ల కోటాలో కేవలం ఆరు పరుగులిచ్చి.. రెండు వికెట్లు తీశాడు బుమ్రా.ఇక పాక్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, పేస్ దళ నాయకుడైన బుమ్రాను కాదని.. యంగ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్‌తో బౌలింగ్ అటాక్ ఆరంభించడం ఏమిటని ఇప్పటికే మాజీ సారథి సునిల్ గావస్కర్ ప్రశ్నించగా.. తాజాగా మరో దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఇవేమీ టెస్టు మ్యాచ్‌లు కాదు‘‘అతడు వికెట్లు తీయగల సత్తా ఉన్నవాడు. అందుకే మొదటి ఓవర్లోనే బంతిని అతడికి ఇవ్వాలి. ఇవేమీ టెస్టు మ్యాచ్‌లు కాదు కదా! టీ20 ఫార్మాట్ ఇది.ఎంత త్వరగా వికెట్లు తీస్తే.. అంత త్వరగా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేయవచ్చు. ఒకవేళ బుమ్రా గనుక బౌలింగ్ అటాక్ ఆరంభించి.. ఆదిలోనే రెండు వికెట్లు తీసినట్లయితే.. మిగతా బౌలర్లు కూడా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు’’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.తప్పని నిరూపించాడుఅదే విధంగా.. ‘‘అతడి శరీరం.. ముఖ్యంగా భుజాలపై ఎక్కువగా ఒత్తిడి పెడతాడు కాబట్టి బుమ్రా ఎక్కువ రోజులు క్రికెట్లో కొనసాగలేడని మనమంతా భావించాం.అయితే, అందరి ఆలోచనలు తప్పని అతడు అనతికాలంలోనే నిరూపించాడు’’ అంటూ బుమ్రాను కొనియాడాడు కపిల్ దేవ్. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా బుధవారం నాటి మ్యాచ్‌లో న్యూయార్క్ వేదికగా అమెరికాతో తలపడనుంది.చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ? View this post on Instagram A post shared by ICC (@icc) -
ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్ కెప్టెన్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్‌ను ఔట్ చేసిన కమిన్స్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదో కెప్టెన్‌గా కమ్మిన్స్ నిలిచాడు. సారథిగా వందకు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 71 ఇన్నింగ్స్‌లలో 187 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(111) సైతం ఉన్నారు. ఈ ఘనత సాధించిన కెప్టెన్లు వీరే ఇమ్రాన్ ఖాన్ (పాక్): 187 వికెట్లు రిచీ బెనాడ్ (ఆసీస్): 138 వికెట్లు గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్): 117 వికెట్లు డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్): 116 వికెట్లు కపిల్ దేవ్ (భారత్): 111 వికెట్లు వసీం అక్రమ్ (పాక్): 107 వికెట్లు బిషన్ సింగ్ బేడీ (భారత్): 106 వికెట్లు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా): 103 వికెట్లు జాసన్ హోల్డర్ (వెస్టిండీస్): 100 వికెట్లు పాట్ కమిన్స్ (ఆసీస్): 100 వికెట్లు A century of wickets for Pat Cummins as Australia captain 👏#NZvAUS pic.twitter.com/r7Trg0o6JV — ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024 -
ఏడేళ్ల తర్వాత తెలుగులో...
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకురాలు. శనివారం (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారనే వార్త ఎప్పట్నుంచో ఉంది. శనివారం (జనవరి 6) రెహమాన్ బర్త్ డే సందర్భంగా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) తర్వాత ఏడేళ్లకు రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే. -
సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు
Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్‌స్టర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. న్యూలాండ్స్ పిచ్ మీద 63/3 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో వికెట్ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్)నే డేవిడ్ బెడింగ్‌హామ్‌ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేశవ్ మహరాజ్ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్ జమైంది. ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే.. 1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ 2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్. 3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్. 4. న్యూలాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్(ఏకైక భారత బౌలర్). బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు 1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు 45 - అనిల్ కుంబ్లే 43 - జవగళ్ శ్రీనాథ్ 38* - జస్ప్రీత్ బుమ్రా 35 - మహ్మద్ షమీ 30 - జహీర్ ఖాన్. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు 7 - కపిల్ దేవ్ 6 - భగవత్ చంద్రశేఖర్ 6 - జహీర్ ఖాన్ 6 - జస్ప్రీత్ బుమ్రా. 3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ తీసిన భారత బౌలర్లు 3 - జవగళ్ శ్రీనాథ్ 3 - జస్ప్రీత్ బుమ్రా 2 - వెంకటేష్ ప్రసాద్ 2 - ఎస్ శ్రీశాంత్ 2 - మహ్మద్ షమీ. 4. న్యూలాండ్స్ పిచ్(కేప్‌టౌన్) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు 25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) 18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్ పిచ్ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్) 17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) 15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్) బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. -
రజనీకాంత్ 'లాల్ సలామ్'లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చిత్రం 'లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. రజనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రత్యేక పాత్రలో కపిల్ దేవ్: క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించాడు. ఇందులో కపిల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా కపిల్ దేవ్ తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. లాల్ సలామ్‌లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే డబ్బింగ్ స్టూడియోలో ఉన్న కపిల్ ఫొటోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది.. లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్ మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌తో పాటు జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. ఇందులో రజనీకాంత్ సోదరిగా ఆమె కనిపించనున్నారు. నిరోషా, తంబి రామయ్య, సెంథిల్, తంగదురై సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పలు భాషల్లో జనవరి 2024లో విడుదల కానుంది. రజనీకాంత్ కూడా గతంలో కపిల్ గురించి ఇలా చెప్పారు. 'భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ కెప్టెన్ (విజేత) కపిల్ దేవ్ ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషం. క్రికెట్ లెజెండ్‌తో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన క్షణం. కపిల్ దేవ్ అతని చారిత్రాత్మక విజయాలను ఎప్పటికీ మరిచిపోలేం.' అని రజనీ అన్నారు. దీంతో కపిల్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్‌తో కలిసి దిగిన ఫొటోను కపిల్ కూడా పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చివరిగా జైలర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'లాల్ సలామ్' టీజర్ విడుదలై అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మొయిదీన్ భాయ్ పాత్రలో ప్రముఖ నటుడు కనిపించారు. -
రోహిత్ శర్మను ఉద్దేశించి కపిల్ దేవ్ వ్యాఖ్యలు.. నీ కోసం..
భారత్‌లో క్రికెట్ రూపురేఖలను మార్చి వేసిన ఘనత కపిల్ డెవిల్స్‌కే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. వన్డే వరల్డ్‌కప్-1983లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్‌దేవ్ సేన.. అనూహ్య రీతిలో చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద.. అప్పటికే రెండుసార్లు విజేత అయిన వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలా టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ క్రమంలో 2011లో సొంతగడ్డ మీద ధోని సేన మరోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి.. ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసింది. పుష్కరకాలం తర్వాత రోహిత్ బృందం కూడా అదే పునరావృతం చేస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. వన్డే వరల్డ్‌కప్-2023లో అజేయ రికార్డుతో ఫైనల్‌తో దూసుకెళ్లిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానుల హృదయాలు కూడా ముక్కలయ్యాయి. ఆస్ట్రేలియా ఆరోసారి జగజ్జేతగా నిలిచిన సంబరంలో మునిగిపోతే.. టీమిండియా కన్నీటితో మైదానాన్ని వీడింది. ఈ నేపథ్యంలో అభిమానులంతా రోహిత్ సేనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్.. ఇప్పటికే నువ్వు చేసే పనిలో మాస్టర్‌వి అయిపోయావు. నీకోసం ఇంకెన్నో విజయాలు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివి మనసుకు బాధ కలిగిస్తాయని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు’’ అంటూ రోహిత్ కళ్లలో నీళ్లు నిండిన ఫొటోను కపిల్ షేర్ చేశాడు. ఇక జట్టును ఉద్దేశిస్తూ.. ‘‘ఇండియా మొత్తం నీతో ఉంది. మీరంతా చాంపియన్సే బాయ్స్. తలెత్తుకోండి. ట్రోఫీ గెలవాలన్నది మీ అంతిమ లక్ష్యం. కానీ దానితో పనిలేకుండానే మీరు ఇప్పటికే విజేతలుగా నిలిచారు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది’’ అని కపిల్ దేవ్ బాసటగా నిలిచాడు. -
అప్పుడు కపిల్ దేవ్, ధోని.. ఇప్పుడు! అది గతం.. హిట్‌మ్యాన్ భావోద్వేగం
వన్డే వరల్డ్‌కప్-2011.. జట్టులో చోటే కరువు.. 2023లో ఏకంగా కెప్టెన్‌గా బరిలోకి.. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిపించిన నాయకుడిగా సరికొత్త గుర్తింపు.. అజేయంగా నిలిచి ఫైనల్ వరకు ప్రయాణం.. ఆ ఒక్క అడ్డంకి దాటేస్తే.. ప్రపంచకప్ గెలిచిన మూడో కెప్టెన్‌గా చరిత్ర పుటల్లో నిలిచే సువర్ణావకాశం.. అవును.. రో‘హిట్’ శర్మ గురించే ఇదంతా!! ఒకప్పుడు ప్రపంచకప్ జట్టులో చోటే లేని ఆటగాడు ఇప్పుడు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తూ టైటిల్ గెలిచేందుకు సంసిద్ధమయ్యాడు. 1983లో కపిల్ దేవ్, 2011లో మహేంద్ర సింగ్ ధోని చేసిన అద్భుతాలను పునరావృతం చేసేందుకు సన్నద్ధమయ్యాడు. భావోద్వేగాలపరంగా యావత్ భారతానికి ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో.. నాయకుడిగా రోహిత్‌కు, జట్టుకు అంతే ముఖ్యం. హిట్‌మ్యాన్ కూడా ఇదే మాట అంటున్నాడు. మ్యాచ్ గెలిస్తే మంచిదే ‘‘భావోద్వేగాలపరంగా చూస్తే ఇది చాలా పెద్ద క్షణం అనడంలో సందేహం లేదు. ఫైనల్ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో నాకు బాగా తెలుసు. కఠోర శ్రమ తర్వాత ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఈరోజు ఎంతో ప్రత్యేకమనే ఆలోచనను పక్కన పెట్టి నాతో పాటు మిగతా సహచరులంతా ఆటపై మాత్రమే దృష్టి పెట్టడం అవసరం. మ్యాచ్ గెలిస్తే మంచిదే కానీ అనవసరంగా ఒత్తిడి పెంచుకోను. అది ఇప్పుడు అనవసరం ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించా. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి బాగా ఆడటం ముఖ్యం. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాం. మ్యాచ్ రోజున పిచ్‌ను చూసిన తర్వాతే ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. 2011లో నాకు ఏం జరిగిందనేది ఇప్పుడు అనవసరం. కానీ ఈ వయసులో ఫైనల్ మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. ఇది సాధ్యమవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. 1983లో కపిల్ డెవిల్స్ భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఏడాది.. అప్పటివరకు అడపా దడపా క్రికెట్ మ్యాచ్‌లు చూసిన సందర్భాలే తప్ప ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడైతే కపిల్ డెవిల్స్ జగజ్జేతగా నిలిచిందో అప్పటి నుంచి టీమిండియా భవిష్యత్తు మారిపోయింది. భారత్ క్రికెట్లో నూతన శకం మొదలైంది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన జట్టు ఏకంగా ట్రోఫీని ముద్దాడటం అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్నీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇంగ్లండ్ వేదికగా ఈ ప్రపంచకప్ టోర్నీ ప్రయాణం భారత్‌కు నల్లేరు మీద నడకలా సాగలేదు. అనూహ్యరీతిలో విండీస్‌ను చిత్తు చేసి లీగ్ దశలో అనూహ్య రీతిలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను 34 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. తర్వాత జింబాబ్వేతో మ్యాచ్‌లో 135 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 162 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది కపిల్ బృందం. అయితే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి మరోసారి విండీస్‌కు షాకిచ్చి 66 పరుగుల తేడాతో గెలిచింది మళ్లీ విజయాల బాట పట్టింది. ఆ తర్వాత జింబాబ్వేను 31 రన్స్‌తో ఓడించిన టీమిండియా ఆస్ట్రేలియాపై కూడా ప్రతీకారం తీర్చుకుంది. 118 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించి జయకేతనం ఎగురవేసి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి సెమీ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించి సత్తా చాటి ఫైనల్‌కు చేరింది. అయినప్పటికీ టీమిండియాను తక్కువ చేసి మాట్లాడిన వారే ఎక్కువ. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచి వెస్టిండీస్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరడంతో కపిల్ సేనను మట్టికరిపించడం ఖాయమని భావించారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది టీమిండియా. కపిల్ దేవ్ దూకుడైన విధానం, చావో రేవో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించే తీరు భారత్‌కు తొలి టైటిల్ అందించింది. మిస్టర్ కూల్ ధోని సేన సొంతగడ్డపై ఇక 2011లో ఏం జరిగిందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగ్లాదేశ్‌పై (87 పరగుల తేడాతో) గెలుపుతో ఆరంభించిన ధోని సేన.. తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ను టై చేసుకుంది. ఆ తర్వాత.. పసికూనలు ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. అనంతరం సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో గెలిచింది. అటు పిమ్మట వెస్టిండీస్‌ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి సెమీస్ చేరింది. ఇక మొహాలీలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో శ్రీలంకను చిత్తు చేసి మిస్టర్ కూల్ ధోని జట్టు ట్రోఫీని ముద్దాడిన దృశ్యాలను అభిమానులెవరు మర్చిపోగలరు!! View this post on Instagram A post shared by ICC (@icc) -
వారి అత్యుత్సాహం.. నాడు అలా టీమిండియాకు భంగపాటు!
రెండు అడుగులు.. రెండే రెండు అడుగులు దాటితే చాలు.. వరల్డ్ కప్ టైటిల్ మరోసారి టీమిండియా సొంతమవుతుంది. పుష్కరకాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడే అవకాశం భారత జట్టుకు లభిస్తుంది. సొంత గడ్డ మీద 2011లో ధోని సేన చేసిన అద్భుతం పునరావృతం అవుతుంది. వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీఫైనల్ వరకు రోహిత్ సేన కొనసాగించిన జైత్రయాత్ర పరిపూర్ణం అవుతుంది. ఇప్పటివరకు 12 వన్డే వరల్డ్ కప్ టోర్నీలలో టీమిండియా ఏడుసార్లు సెమీఫైనల్ చేరుకుంది. 1983, 1987, 2003, 2011, 2015, 2019 ఎడిషన్లలో ఆడింది. ఇందులో మూడుసార్లు గెలిచి.. నాలుగుసార్లు ఓటమిపాలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా 1983 వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన భారత జట్టు సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ ను ఆరు వికెట్ల తేడాతోచిత్తు చేసింది. ఆ తర్వాత ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ కు ఊహించని షాక్ ఇచ్చి జగజ్జేతగా అవతరించింది. అలా తొలిసారి సెమీస్ గండాన్ని దాటేసి ట్రోఫీని ముద్దాడింది కపిల్ డెవిల్స్. అయితే.. 1987 ఎడిషన్ లో మాత్రం సొంత గడ్డపై సెమీఫైనల్ లో ఓటమిపాలైంది. వాంకడే వేదికగా ఇంగ్లాండ్ చేతిలో ఓడి సెమిస్లోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ 35 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ లోను మరోసారి ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలై చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. నాడు టీమిండియాని ముందుండి నడిపించింది మహమ్మద్ అజారుద్దీన్. ఇక 1996 సెమీఫైనల్ లో చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో భారత జట్టుకు శ్రీలంక చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం వల్ల మ్యాచ్ కు కలిగిన అంతరాయం టీమిండియా కొంపముంచింది. నాడు లంక నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా.. 34 ఓవర్ల వద్ద 120/8 స్కోరుతో కొనసాగుతున్న సమయంలో.. స్టేడియంలోని ఫ్యాన్స్ హంగామా చేశారు. దీంతో ఆట ముందుకు సాగలేదు. ఈ క్రమంలో అప్పటికి భారత్ పై పై చేయి సాధించిన శ్రీలంకను అంపైర్లు విజేతగా ప్రకటించారు. అలా అజారుద్దీన్ సారథ్యంలోని టీమిండియా పై నెగ్గిన శ్రీలంక ఫైనల్ లోను విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీ 2003 లో భారత జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. స్టార్ ఆటగాళ్లంతా నిలకడైన ఫామ్ తో జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. బ్యాటర్లు బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును సెమీస్‌కు చేర్చారు. నాడు ఊహించని రీతిలో సెమీస్‌కు వచ్చిన కెన్యాపై ఘన విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది టీమిండియా. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెంది రన్నరప్‌తో పెట్టుకుంది. ఇక 2011 వరల్డ్ కప్ గురించి టీమిండియా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని జట్టు భారత్ ను రెండోసారి జగజ్జేతగా నిలిపింది. సెమీఫైనల్ లో పాకిస్తాన్ ను మట్టి కరిపించి ఫైనల్‌కు అర్హత సాధించిన ధోని సేన.. ఆఖరిమెట్టుపై శ్రీలంకను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఐసీసీ ట్రోఫీని బహుమతిగా అందించింది. వన్డే వరల్డ్ కప్ 2015 సెమీఫైనల్ లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో దారుణ వైఫల్యంతో ఇంటి బాట పట్టింది. అదేవిధంగా 2019 లోను భంగపాటుకు గురైంది. వర్షం కారణంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. నాటి మ్యాచ్‌లో ఫినిషర్ ధోని రన్ అవుట్ రనౌట్ కావడం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. చివరి వరకు పోరాడినా 18 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.